ముద్దుల వ్యవహారం.. వందమందిపై కేసులు! | Cases against at least 100 persons registered | Sakshi
Sakshi News home page

ముద్దుల వ్యవహారం.. వందమందిపై కేసులు!

Published Tue, Nov 4 2014 6:56 PM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

ముద్దుల వ్యవహారం.. వందమందిపై కేసులు!

ముద్దుల వ్యవహారం.. వందమందిపై కేసులు!

బీజేవైఎం నేతల మోరల్ పోలీసింగ్ను వ్యతిరేస్తూ.. 'కిస్ ఆఫ్ లవ్' పేరిట ముద్దుల కార్యక్రమం నిర్వహించిన వంద మంది మీద కొచ్చిలో పోలీసు కేసులు నమోదయ్యాయి. కేరళలోని కొచ్చి మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఆదివారం నాడు వందలాది మందితో భారీ కార్యక్రమం నిర్వహించారు. అయితే అది చట్ట విరుద్ధం అంటూ పోలీసులు ఇప్పుడు కేసులు పెట్టారు.

వాస్తవానికి ఆరోజు ముద్దుల కార్యక్రమంలో పాల్గొన్నవాళ్ల కంటే.. దాన్ని చూసేందుకు వచ్చినవాళ్లు, శివసేన లాంటి ఇతర సంస్థల సభ్యులే ఎక్కువగా కనిపించారు. అలా చూసేందుకు వచ్చినవాళ్ల మీద ఎలాంటి కేసులు పెట్టలేదు గానీ.. నిర్వాహకులు, అందులో వాస్తవంగా పాల్గొన్నవాళ్ల మీద మాత్రం కేసులు నమోదు చేశారు. చిట్ట చివరి నిమిషంలో వాళ్లు ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించడంతో పోలీసులు వాళ్లను అప్పుడే అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement