కొచ్చి: 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమ నిర్వాహకులు, సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్నాకులం లా కాలేజీ నుంచి కార్యక్రమానికి వేదికైన మెరైన్ డ్రైవ్ గ్రౌండ్స్ కు ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించడంతో వీరిని అరెస్ట్ చేశారు. దాదాపు 50 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
'కిస్ ఆఫ్ లవ్' మద్దతుదారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ 'నైతిక పోలీసింగ్'కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెరైన్ డ్రైవ్ గ్రౌండ్స్ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించడంతో పోలీసులను భారీగా మొహరించారు. వెయ్యి మంది కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు ప్రకటించారు.
'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమానికి మీడియాలో ఎక్కువగా ప్రచారం రావడంతో ఏం జరుగుతుందో చూద్దామని పెద్ద ఎత్తున జనం వచ్చారు. దీంతో నిర్వాహకులు చివరి నిమిషంలో వ్యూహం మార్చుకున్నారు. ఎర్నాకులం లా కాలేజీ నుంచి ర్యాలీ నిర్వహించేందుకు సిద్దమవడంతో పోలీసులు వీరిని అడ్డుకున్నారు. 'చుంబన పండుగ'ను వ్యతిరేకిస్తూ శివసేన, ముస్లిం సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి.
'కిస్ ఆఫ్ లవ్' మద్దతుదారుల అరెస్ట్
Published Sun, Nov 2 2014 6:49 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM
Advertisement
Advertisement