Kochi
-
ఒకే ఇంట్లో ముగ్గురి మృతి.. డైరీలో ఆమె ఫోన్ నంబర్!
వారిద్దరూ విద్యావంతులు. దానికి తోడు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదుగానీ తల్లితో కలిసి విగతజీవులుగా మారిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మరణాలు కేరళలో (Kerala) కలకలం రేపాయి. వారు ముగ్గురు ఎలా చనిపోయారు, ఎందుకు అకాల మరణం చెందారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయితేనే అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.అసలేం జరిగింది?కొచ్చిలోని ఎకాముఖ్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ క్వార్టర్స్‌లోని ఓ ఇంటిలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురి మృతదేహాలను పోలీసులు శుక్రవారం కనుగొన్నారు. మృతులు శాలిని విజయ్, మనీశ్ విజయ్, శకుంతలగా గుర్తించారు. శాలిని.. జార్ఖండ్ (Jharkhand) సాంఘిక సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, ఆమె సోదరుడు మనీశ్.. ఐఆర్ఎస్ అధికారి. కొచ్చిలోని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగంలో అడిషనల్ కమిషనర్ ఉద్యోగం చేస్తున్నాడు. లివింగ్ రూములో సీలింగ్ హుక్కు ఉరివేసుకుని మనీశ్ చనిపోయాడు. మరో గదిలో శాలిని నిర్జీవంగా కనిపించారు. వీరి తల్లి శకుంతల మృతదేహం తెల్లని వస్త్రంలో చుట్టివుందని, పూలు చల్లిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.మనీశ్ డైరీలో చెల్లెలి ఫోన్ నంబర్మనీశ్, శాలిని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శకుంతల మరణానికి గల కారణాలు అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే వెల్లడవుతాయని చెప్పారు. ‘శకుంతల మరణం సహజమా, మరేదైనా కారణాలు ఉన్నాయనేది అటాప్సీ నివేదిక వచ్చిన తర్వాతే తెలిసే అవకాశం ఉంద’ని త్రిక్కకరా ఏసీపీ పీవీ బేబీ తెలిపారు. మనీశ్ డైరీలో ఫిబ్రవరి 15న రాసిన నోట్‌ను పోలీసులు గుర్తించారు. తమకు సంబంధించిన కొన్ని పత్రాలను దుబాయ్‌లో (Dubai) ఉంటున్న తన చెల్లెలికి అప్పగించాలని కోరుతూ, ఆమె ఫోన్ నంబరు కూడా అందులో రాశారు.టాపర్‌గా నిలిచి.. కేసులో ఇరుక్కుని.. శాలిని.. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) 2003లో నిర్వహించిన మొదటి సివిల్ సర్వీసెస్ కంబైన్డ్ పోటీ పరీక్షలో టాపర్‌గా నిలిచారు. ఈ పరీక్ష ద్వారా 64 మంది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో 2022, జూలైలో జార్ఖండ్ హైకోర్టు విచారణను సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ.. శాలినితో పాటు మిగతా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27న జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో శాలిని మరణించడం చర్చనీయాంశంగా మారింది.ప్రొఫెసర్ శకుంతల శకుంతల బొకారో (Bokaro) ప్రాంతానికి చెందిన వారని, వీరి కుటుంబం రాంచీలో 2013 వరకు అద్దె ఇంటిలో ఉందని తెలిసింది. శకుంతల కుటుంబ సభ్యులు భక్తిభావంతో మెలిగేవారని, తమతో స్నేహంగా ఉండేవారని పొరుగింటివారు వెల్లడించారు. బొకారోలో శకుంతల ప్రొఫెసర్‌గా పనిచేసేవారని తెలిపారు. ఆమె మరో కుమార్తె పెళ్లిచేసుకుని రాజస్థాన్‌లో స్థిరపడిందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం రాంచీ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసులో కలిసినప్పుడు మనీశ్ అప్యాయంగా పలకరించాడని.. అతడితో పాటు శాలిని, శకుంతల మరణించారన్న వార్త తెలిసి చాలా బాధపడ్డామన్నారు. కాగా వీరి ముగ్గురి మరణానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.చదవండి: వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయంఅన్నికోణాల్లోనూ దర్యాప్తుశాలినిపై సీబీఐ కేసు కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శకుంతల సహజంగా చనిపోయివుంటే ఆమె మరణాన్ని తట్టుకోలేక కూతురు, కొడుకు ప్రాణాలు తీసుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వీరి మానసిక పరిస్థితి గురించి కూడా ఆరా తీస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
జీఎస్టీ అధికారి ఇంట్లో మిస్టరీ మరణాలు..!
కొచ్చి:కేరళలోని కొచ్చిలో ఓ జీఎస్టీ అధికారి ఇంట్లో అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయి. జార్ఖండ్‌కు చెందిన 42 ఏళ్ల జీఎస్టీ అధికారితో పాటు అతడి 80 ఏళ్ల తల్లి,35ఏళ్ల సోదరి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. వీరు చనిపోయి నాలుగు రోజులవుతోందని,మృతదేహాలు కుళ్లిపోవడం స్టార్టైందని కొచ్చి త్రిక్కాకర పోలీసులు తెలిపారు.జీఎస్టీ అధికారి ఇంటిలో నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి తలుపు తెరవగా మరణాల విషయం బయటపడింది.అధికారి తల్లి మృతదేహం ఒక షీట్‌తో కప్పిఉండడం అనుమానాలకు తావిస్తోంది. జీఎస్టీ అధికారి సోదరి జార్ఖండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(జేఏఎస్) అధికారిగా పనిచేస్తున్నారు.ఆమె పబ్లిక్ సర్వీస్ పరీక్షలో తొలి ర్యాంక్ సాధించారు. అయితే పరీక్షల అవకతవకలకు సంబంధించి ఆమెపై ప్రస్తుతం సీబీఐ కేసు విచారణలో ఉంది. ఆమె మరణం ఆశ్చర్యానికి గురిచేసిందని తోటి జేఏఎస్ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాథమికంగా వీరివి ఆత్మహత్యలనే పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం వివరాలొచ్చిన తర్వాత అసలు విషయం బయటపడుతుందని పోలీసులు చెబుతున్నారు. -
ఎల్లో చీరలో ’క్రష్మిక’ లుక్, ఆ స్టయిలే వేరు సామి (ఫోటోలు)
-
కొచ్చిలో అల్లు అర్జున్ ‘పుష్ప-2 ది రూల్’ ప్రమోషన్ (ఫొటోలు)
-
పుష్ప-2లో ఆయన పాత్ర వేరే లెవల్.. అల్లు అర్జున్ ప్రశంసలు
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరో వారం రోజుల్లో థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల చెన్నైలో కిస్సిక్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా ఇవాళ కేరళలోని కొచ్చిలో భారీ ఈవెంట్ నిర్వహించారు. నగరంలోని లివా మాల్ గ్రాండ్ హయత్‌లో ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌పై ప్రశంసలు కురిపించారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ..'ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దాదాపు 20 ఏళ్లుగా మీరు నన్ను అభిమానిస్తున్నారు. మల్లు అర్జున్‌గా మీ ప్రేమకు రుణపడి ఉంటా. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ అద్భుతంగా చేశారు. ప్రతి కేరళియన్ గర్వపడేలా ఉంటుంది. ఫాఫా మీ అందరిని అలరిస్తారు. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. పుష్ప విడుదలై మూడేళ్లవుతోంది. ఇకపై ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించను. ఇప్పటి నుంచి సినిమాలు త్వరగా చేస్తాను. శ్రీవల్లితో మూడేళ్లుగా నా ప్రయాణం ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ సినిమాలో తన సపోర్ట్‌కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రష్మిక' అని అన్నారు.సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. నేషనల్ క్రష్ రష్మిక మరోసారి శ్రీవల్లిగా అలరించనుంది. పుష్పలో భన్వర్‌లాల్ షెకావత్‌గా అలరించిన మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరోసారి కీ రోల్ ప్లే చేస్తున్నారు. A Special surprise coming your way 💥💥💥Get ready for the Mass Blast🎧🔥Watch #PushpaRulesKeralam Event Live now... For the Blasting Surprise ❤️🔥❤️🔥- https://t.co/QdHDdVrAj9#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th— Pushpa (@PushpaMovie) November 27, 2024 -
కొచ్చిలో పుష్ప-2 ఫీవర్.. అల్లు అర్జున్ కొత్త పేరేంటో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరో వారం రోజుల్లో థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల చెన్నైలో కిస్సిక్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఐకాన్ స్టార్‌కు తెలుగులో మాత్రమే కాదు.. మలయాళంలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి మలయాళంలో భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా ఇవాళ కేరళలోని కొచ్చిలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. లివా మాల్లోని గ్రాండ్ హయత్‌లో ఈవెంట్ జరగనుంది.ఈ భారీ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ఐకాన్ స్టార్ కేరళకు వస్తున్న సందర్భంగా కొచ్చి అంతటా భారీ హోర్డింగ్స్ మెరిశాయి. పుష్ప-2 పోస్టర్లతో నగరమంతా నింపేశారు. అంతేకాదు ఎయిర్పోర్ట్ వద్ద ఐకాన్ స్టార్ కోసం ఫ్యాన్స్ ఎంతోమంది పోస్టర్లతో దర్శనమిచ్చారు. అయితే పచ్చని పొలాల్లో ఏర్పాటు చేసిన పుష్ప-2 వెల్కమ్ పోస్టర్ మాత్రం బన్నీ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ పేరును ముద్దుగా మల్లు అర్జున్ అంటూ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.కాగా.. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న పుష్ప-2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. పుష్పలో మెప్పించిన శ్రీవల్లిగా మరోసారి రష్మిక ఫ్యాన్స్‌ను అలరించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, కిస్సిక్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నారు. ఓవర్సీస్లో టికెట్ బుకింగ్ ఓపెన్ కాగా.. రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడయ్యాయి. Kerala Allu Arjun fans waiting at kochi airport since afternoon 💥Expecting @alluarjun arrival in 15mins #PushpaRulesKeralam KOCHI WELCOMES ALLUARJUN pic.twitter.com/eNwfBwQ3k5— Allu Arjun Devotees 🐉 (@SSAADevotees) November 27, 2024 KERALA WELCOMES MALLU ARJUN 🔥🔥#PushpaRulesKeralam ❤️🔥❤️🔥#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/NPj9CqPQBz— Pushpa (@PushpaMovie) November 27, 2024 -
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
కొచ్చి:బెంగళూరు నుంచి మాల్దీవుల రాజధాని మాలేకు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని కేరళలోని కొచ్చికి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం సురక్షితంగా దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 140మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ అంశంపై ఇండిగో స్పందించింది. సాంకేతిక సమస్య తలెత్తిన విమానానికి అవసరమైన మరమ్మతులు చేసిన తర్వాత తిరిగి వినియోగంలోకి తెస్తామని ఇండిగో తెలిపింది.ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.సాంకేతిక లోపంతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది.విమానంలో ప్రయాణిస్తున్నవారిలో 91మంది భారతీయ పౌరులు కాగా 49మంది విదేశీయులు ఉన్నారని అధికారులు తెలిపారు. -
జల రథ సారథులు
మన హైదరాబాద్‌లో మెట్రో రైల్ ఉంది. కొచ్చిలో కొత్తగా మెట్రో ఫెర్రీ మొదలైంది. కొచ్చిలో ట్రాఫిక్‌ను, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం ‘మెట్రో వాటర్ ఫెర్రీ’ వ్యవస్థను దక్షిణాసియాలోనే మొదటిసారిగా మొదలెట్టింది. 100 మంది పాసింజర్లను మోసుకెళ్లే ఫెర్రీలను నడిపేందుకు ముగ్గురు మహిళా పైలట్లు సెలెక్ట్ అయ్యారు. దేశంలోనే వీరు ప్రథములు. జల రవాణాలో ఇది మహిళా శకం.మొన్నటి సాయంత్రం కొచ్చిలోని హైకోర్టు నుంచి ఫోర్ట్ కొచ్చికి ఫెర్రీ బయలు దేరింది. బ్యాక్‌వాటర్స్‌లో రాత్రి పార్టీలకు కొన్ని హౌస్ బోట్లు బయలుదేరాయి. బెస్త పడవలు వెనుకకు మరలుతున్నాయి. వాటి మధ్య హుందాగా మృదువుగా కదిలింది నీలి రంగు ఫెర్రి. తండ్రి చేయి పట్టుకుని ఫెర్రీ ఎక్కిన ఒక పదేళ్ల అమ్మాయి ఫెర్రీ పైలెట్‌కు సహాయంగా నిలబడి ఉన్న మహిళా పైలెట్‌ను చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత తండ్రితో అంది ‘నాన్నా... నేను కూడా ఇలా అవుతా’. తండ్రి చిరునవ్వు నవ్వి ఆ మహిళా పైలెట్‌తో ‘ఇలా మా అమ్మాయి కావాలంటే ఏం చదవాలమ్మా’ అని అడిగాడు. ఆ ప్రశ్న ప్రస్తుతం కొచ్చిలో ఫెర్రీలలో ప్రయాణిస్తున్న చాలామంది తల్లిదండ్రులతో. అంతగా స్ఫూర్తినిస్తున్నారు కొత్తగా నియమితులైన ముగ్గురు మహిళా పైలట్లు.అరుణిమ, లక్ష్మి, స్నేహఈ ముగ్గురు యువ సారథులు ‘కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్’లో ట్రెయినీలుగా నియమితులయ్యారు. ఫెర్రీలలో అసిస్టెంట్లుగా సేవలు అందిస్తున్న వీరు సంవత్సరం తర్వాత పూర్తిస్థాయి పైలట్లుగా విధులు నిర్వర్తిస్తారు. జనరల్ పర్పస్ రేటింగ్ (జిపిఆర్) కన్వర్షన్ కోర్సు పూర్తి చేసిన వారికే ఈ ఉద్యోగం దొరుకుతుంది. కేరళలో ఈ కోర్సు లభ్యమవుతోంది. కొల్ల్లంకు చెందిన అరుణిమ, తిరువనంతపురంకు చెందిన లక్ష్మి, అలెప్పికి చెందిన స్నేహ వివిధ ఇంజినీరింగ్ డిప్లమాలు చేశాక ఫెర్రీ పైలెట్ ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపారు. అయితే జేపీఎస్ కోర్సు పూర్తి చేశాకనే వారికి ట్రెయినీలుగా అవకాశం వస్తుంది. ఆ కోర్సును కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ట్రెయినీ పైలట్లు నియమితులయ్యారు.75 ఫెర్రీలు 33 వేల పాసింజర్లుకొచ్చి చుట్టూ లంక గ్రామాలు ఉన్నాయి. కొచ్చిలో కూడా ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లడానికి మైట్రో రైలు ఉన్నా ట్రాఫిక్ సమస్య తీరడం లేదు. దీంతో ఫ్రభుత్వం దాదాపు లక్షా పదమూడు వేల కోట్ల ఖర్చుతో వాటర్ మెట్రో సర్వీసును మొదలెట్టింది. ఇందులో భాగంగా 75 హైబ్రీడ్ ఫెర్రీలు అందుబాటులోకి రానున్నాయి. వీటి రాకపోకల కోసం 38 జెట్టీలు నిర్మించారు, 15 రూట్లు ఖరారు చేశారు. దీంతో 33 వేల మంది పాసింజర్లకు మేలు జరుగుతుంది. టికెట్ 20 రూపాయల నుంచి 40 రూపాయలు ఉంటుంది. 100 మంది పాసింజర్లున్న ఫెర్రీ గరిష్టంగా 23 కిలోమీటర్లు గంటలో ప్రయాణిస్తుంది.పురుష ప్రపంచంలో మహిళా సారథులుకేరళలో టూరిజం కోసం ఉపయోగించే హౌస్బోట్లు, ఇతర ఫెర్రీలలోగాని పురుషులే డ్రైవర్లుగా ఉంటారు. మెట్రో ఫెర్రీలలో కూడా పురుష పైలట్లే ఉన్నారు. కాని స్త్రీలు ఈ ఉపాధిలో తప్పక ఉండాలని ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. ‘మేము విధులు నిర్వర్తిస్తుంటే అందరూ మా యూనిఫామ్‌లు చూసి మెచ్చుకోలుగా మాట్లాడుతున్నారు’ అంటుంది అరుణిమ. ‘ఉద్యోగంలోకి బెరుగ్గా అడుగుపెట్టాను. కాని మెట్రో ఉద్యోగులు నా బెరుకును కొద్ది రోజుల్లోనే పోగొట్టారు. మేము కలిసి పని చేసే ఒక వాతావరణం ఇక్కడ ఉంది’ అంది లక్ష్మి. ‘ఫెర్రీ పైలట్ అంటే ఫెర్రీని నడపడమే కాదు... క్రౌడ్‌ను కూడా మేనేజ్ చేయాలి. ఫెర్రీ కదులుతుంటే కొంతమంది అంచుల్లో నిలబడతారు. వారిని హెచ్చరించాలి’ అంటుంది స్నేహ. ‘మొదటిసారి మేము ఫెర్రీ లోపలికి వచ్చి చూస్తే ఇదో షిప్పేమో అనిపించేంత ఆధునికంగా ఉంది. అన్ని సాంకేతిక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో వైఫై కనెక్టివిటీ ఉంటుంది. సీటింగ్ ఏరియా అంతా ఏసి ఉంటుంది’ అని తెలిపింది అరుణిమ.విమానాలు, మెట్రో రైళ్లు, మైట్రో ఫెర్రీలు.... దూసుకుపోతున్న మహిళలకు అభినందనలు. -
‘బ్యాగులో బాంబుందా’?: ప్రశ్నించిన ప్రయాణికుడి అరెస్టు
కొచ్చి: కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం(ఆగస్టు11) ఉదయం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మనోజ్‌కుమార్(42) అనే ప్రయాణికుడు సెక్యూరిటీ చెక్ వద్ద తన బ్యాగ్ తీసుకుంటూ అందులో బాంబేమైనా ఉందా అని ప్రశ్నించాడు. దీంతో ఎయిర్‌పోర్టు ఎక్స్‌రే బ్యాగేజ్ స్కాన్ పాయింట్ వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది బాంబు స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేశారు. మనోజ్‌కుమార్ క్యాబిన్ బ్యాగులతో పాటు చెకిన్ బ్యాగేజీని బాంబు డిటెక్షన్ మెషిన్‌తో జల్లెడ పట్టారు. తనిఖీల తర్వాత మనోజ్‌కుమార్‌ను పోలీసులకు అప్పగించారు. మనోజ్‌కుమార్ ఎయిర్ఇండియా విమానంలో కొచ్చి నుంచి ముంబై వెళ్లాల్సిఉంది. -
Kuwait Fire Incident: భారత్‌కు చేరుకున్న‘కువైట్’ బాధితుల మృతదేహాలు
కొచ్చి: మూడు రోజుల క్రితం ఎడారి దేశం కువైట్‌లో వలసకార్మికులు ఉంటున్న భవంతిలో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 31 మంది భారతీ యుల మృతదేహాలు స్వదేశానికి చేరుకు న్నాయి. వీరిలో అత్యధికంగా 23 మంది కేరళీయులు ఉన్నారు. మృతుల్లో కర్ణాటక సంబంధించి ఒకరు, తమిళనాడుకు చెందిన ఏడుగురి మృతదేహాలనూ తీసుకొచ్చారు. మృతదేహాలను తొలుత శుక్రవారం ఉదయం కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానా శ్రయానికి తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వారికి నివాళులర్పించారు. ‘‘ జీవనోపాధి కోసం విదేశం వెళ్లి విగతజీవులైన బడుగుజీవుల కష్టాలను కేంద్రప్రభుత్వం పట్టించుకోవాలి. మృతుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థికసాయం సరిపోదు’ అని సీఎం అన్నారు. కువైట్ నుంచి మృతదేహాల తరలింపు ప్రక్రియను దగ్గరుంచి చూసుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్‌తోపాటు తమిళనాడు మైనారిటీ సంక్షేమ మంత్రి కేఎస్ మస్తాన్లు సైతం పార్థివదేహాల వద్ద నివాళులర్పించారు.మృతుల్లో ముగ్గురు తెలుగువారుఅగ్నిప్రమాదంలో ముగ్గురు తెలుగువ్యక్తులు సైతం చనిపోయారని ఆంధ్రప్రదేశ్ నాన్– రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి. లోకనాథం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎం.సత్యనారాయణ, ఎం.ఈశ్వరుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని ఏపీఎన్ఆర్టీఎస్ పేర్కొంది. ‘‘ సొంత పనిమీద స్వదేశానికి వచ్చిన లోకనాథం తిరిగి కువైట్ బయల్దేరారు. స్వస్థలం నుంచి తొలుత జూన్ 5న హైదరాబాద్‌కు వచ్చి నాలుగు రోజులు ఉండి తర్వాత జూన్ 11న కువైట్ చేరుకున్నారు. ఆయన భవంతికి వచ్చి బసచేసిన అదే రోజున అగ్నిప్రమాదం జరిగి తుదిశ్వాస విడిచారు’’ అని లోకనాథం బంధువు శాంతారావు చెప్పారు. -
Hyd: కిడ్నీ రాకెట్.. 20 కాదు 40 లక్షలు!!
హైదరాబాద్, సాక్షి: కేరళలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ ఉదంతం వెనుక నగర మూలాలు ఉండడం కలకలం రేపుతోంది. కీలక సూత్రధారులు ఇక్కడివాళ్లే అని.. ఓ ప్రముఖ డాక్టర్ సూత్రధారిగా కేరళ పోలీసులు నిర్ధారించుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వయా కొచ్చి టూ ఇరాన్ కేంద్రంగా నడిచిన ఈ కిడ్నీ రాకెట్ వివరాల్లోకి వెళ్తే.. కేరళ కొచ్చిలో తాజాగా ఓ యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే కిడ్నీ దానం పేరిట మోసం జరిగిందని, ఒక ముఠా తమ కొడుకును బలిగొందని అతని కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన కొచ్చి పోలీసులు సబీత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సబీత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కిడ్నీ రాకెట్ ముఠా గుట్టును చేధించారు. పేద యువకులను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుని ఈ కిడ్నీ రాకెట్ నడిపిస్తోంది. ఒక్కో కిడ్నీకి రూ.20 లక్షలు ఇస్తామని ఆశజూపి.. ఇరాన్‌కు తీసుకెళ్తోంది. అక్కడ కిడ్నీలు తీసుకుని.. తిరిగి ఇండియాకు తీసుకొస్తోంది. తీరా ఇక్కడికి వచ్చాక కేవలం రూ. 6 లక్షలే ఇవ్వడంతో బాధితులు కంగుతింటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే కిడ్నీ ఇచ్చిన ఓ యువకుడు చనిపోవడంతో ఈ ముఠా అరాచకాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ నుంచే.. ఈ కిడ్నీ రాకెట్ కీలక సూత్రధారులు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులుగా కేరళ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 40 మందికిపైగా యువకుల నుంచి కిడ్నీలు ఈ ముఠా సేకరించినట్లు నిర్ధారించుకున్నారు. అంతేకాదు నగరానికి చెందిన ఓ ప్రముఖ డాక్టర్ ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారిగా గుర్తించిన కేరళ పోలీసులు.. ఆ వైద్యుడితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తుల కోసం వెతుకుతున్నారు.20 కాదు 40 లక్షలు!కొచ్చి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ.. విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి యువకుల్ని కొచ్చి తరలించి.. అక్కడి నుంచి ఇరాన్‌కు తీసుకెళ్లి కిడ్నీలు సేకరిస్తున్నట్లు ధృవీకరణ అయ్యింది. ఆపరేషన్ తర్వాత 20 రోజులకు దాతలకు ఇండియాకు తిరిగి తీసుకొచ్చారు. ఇక ఈ వ్యవహారంలో సబీత్ గ్యాంగ్.. కొచ్చి గ్యాంగ్‌తో ఒక్కో కిడ్నీకి మొత్తం రూ.40 లక్షలకు డీల్ కుదుర్చుకుంటోంది. అందులో సబీత్ గ్యాంగ్ రూ.20 లక్షలు, కొచ్చి గ్యాంగ్ రూ.10 లక్షలు.. డోనర్‌కు రూ.10 లక్షలుగా పంచుకుంటున్నారు. అయితే.. దాతలకు ఇవ్వాల్సిన డబ్బు విషయంలోనూ సబీత్ గ్యాంగ్ మోసం చేస్తూ వచ్చినట్లు తేలింది. ఇక.. హైదరాబాద్‌లోనే మకాం వేసిన కేరళ పోలీసులు.. ఇరాన్ వెళ్లిన బాధితులు ఎవరన్నదానిపై దృష్టిసారించారు. -
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
కొచ్చి: ఇరాన్లో చేపలుపట్టే పని చేసేందుకు వెళ్లిన భారతీయులను యజమాని వేధించాడు. సరైన జీవన సౌకర్యాలు కల్పించలేదు. దీంతో యజమాని సయ్యద్ అన్సారీ నుంచి తప్పించుకోవాలని ఆరుగురు కన్యాకుమారికి చెందిన మత్స్యకారులు డిసైడయ్యారు.ఇంకేముంది చేపలు పట్టేందుకు యజమాని ఇచ్చిన బోట్లోనే ఇరాన్ నుంచి పారిపోయి సముద్రంలో ప్రయాణించి భారత్‌లోని కొచ్చి తీరాని వచ్చారు. కొచ్చి తీరానికి వీరి బోట్ చేరుకున్న వెంటనే తీరంలోకి కోస్ట్‌గార్డ్ గుర్తించి అడ్డుకున్నారు. ఆరా తీస్తే ఇరాన్ యజమాని తమను మోసం చేశాడని,అందుకే పారిపోయి వచ్చామని మత్స్యకారులు చెప్పారు. -
గ్రాండ్‌గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
ప్రముఖ మలయాళ నటుడు జయరాం కుమార్తె మాళవిక ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టింది. జయరాం-పార్వతి ముద్దులక కూతురైన మాళివిక నవనీత్‌ను పెళ్లాడింది. వీరి వివాహం బంధువులు, సన్నిహితుల సమక్షంలో త్రిసూర్‌లోని గురువాయూర్ ఆలయంలో చాలా సింపుల్‌గా జరిగింది. అయితే తాజాగా వీరి వివాహా రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు.కొచ్చిలోని ప్రముఖ హోటల్లో మాళవిక-నవనీత్ రిసెప్షన్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మలయాళ సినీ తారలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈవేడుకలో మమ్ముట్టి, దిలీప్, జాకీ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి, శోభన, ఖుష్బు సుందర్ లాంటి ప్రముఖల తారలందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. .@mammukka #yusufAli @PrithviOfficial #Supriya @ #Jayaram’s daughter Malavika’s wedding reception in Kochi pic.twitter.com/ff1VoT9mVk— sridevi sreedhar (@sridevisreedhar) May 5, 2024 -
అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
అనంతపురం, సాక్షి: జిల్లాలో భారీగా డబ్బుతో కంటెయినర్లు వెళ్తుండడం ఒక్కసారిగా కలకలం రేపింది. హైదరాబాద్ - బెంగళూరు హైవేపై నాలుగు కంటెయినర్లలో వెళ్తున్న భారీ డబ్బును పోలీసులు గుర్తించారు. అయితే ఆ నగదు సస్పెన్స్ కాసేపటికే వీడింది.పామిడి మండలం గజరాంపల్లి దగ్గర హైవేపై నాలుగు కంటెయినర్లను పోలీసులు తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నారు. ఆ కంటెయినర్లలో ఒక్కోదాంట్లో రూ.500 కోట్ల చొప్పున రూ.2 వేల కోట్ల దాకా నగదు కనిపించింది. ఎన్నికల కోడ్ అమల దృష్ట్యా కలెక్టర్, సంబంధిత అధికారులతో పాటు ఐటీ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు.చివరకు పత్రాల పరిశీలన తర్వాత కొచ్చి(కేరళ) నుంచి హైదరాబాద్‌కు ఆ కంటెయినర్లు వెళ్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ ఆర్బీఐ బ్రాంచ్‌లో ఆ నగదును డిపాజిట్ చేసేందుకు ఆ కంటెయినర్లు అధికారికంగానే వెళ్తున్నాయని, క్షుణ్ణంగా పరిశీలించాక ఆ కంటెయినర్లను ముందుకు వెళ్లేందుకు అనుమతించినట్లు పామిడి సీఐ రాజశేఖర్‌రెడ్డి మీడియాకు వివరించారు. -
ఎయిర్‌పోర్ట్‌లో శివమణి హల్చల్ : గుర్తుపట్టని ప్రయాణీకులు, వైరల్ వీడియో
విమానాశ్రయంలో ప్రయాణీకులంతా లగేజీ కోసం వెయిట్ చేస్తుండగా సడెన్‌గా అద్భుతమైన డ్రమ్ము వాయిద్యం వినిపించింది. దీంతో అందరూ అటువైపు డైవర్ట్ అయిపోయారు. అటు ప్రయాణ అలసట, ఇటు వెయిటింగ్ చిరాకు నుంచి బయటపడి 'హమ్మా-హమ్మ' అంటూ సైలెంట్‌గా గొంతు కలిపారు. కానీ అక్కడున్నది పాపులర్ డ్రమ్మర్ శివమణి చాలా మంది గుర్తించలేకపోయారు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్(ట్విటర్)లో తెగ వైరల్ అవుతోంది. కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. లగేజీకోసం వెయిట్ చేయడం మొదలు పెట్టి దాదాపు 40 నిమిషాలై పోయింది. దీంతో ప్యాసింజర్లంతా విసుగ్గా , అసహనంగా అటూ ఇటు కదులున్నారు. దీంతో అక్కడున్న శివమణి ఏమనుకున్నాడో ఏమో గానీ, రంగంలోకి దిగిపోయాడు. కన్వేయర్ బెల్ట్ రైలింగ్‌పై తన డ్రమ్‌స్టిక్‌లను ఉపయోగించి A.R రెహమాన్ స్వరపరిచిన 'హమ్మా-హమ్మ’ పాటను వాయించడం మొదలు పెట్టాడు. తనదైన సిగ్నేచర్ దుస్తులు, స్టయిల్‌తో హమ్మా! అంటూ ముగించాడు. అంతే ఒక్కసారి చప్పట్లు మారుమోగిపోయాయి. ప్రశంసలే ప్రశంసలు. కానీ అక్కడున్నది డ్రమ్మర్ శివమణి అని చాలామంది గుర్తించలేదు. దీనికి సంబంధించిన వీడియోను ఒక ప్యాసింజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఫెలో ప్యాసింజర్ మమ్మల్ని ఇలా ఎంటర్టైన్ చేశారు అంటూ ట్వీట్ చేశారు. దీంతో అది శివమణి అని గుర్తించిన ట్వీపుల్.. అయ్యో. అది గ్రేట్ శివమణి, మీరంతా లక్కీ అంటూ కమెంట్లు పెట్టారు. జనవరి 17న షేర్ అయిన ఈ వీడియో ఏడు లక్షలకుపైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. మరికెందుకు ఆలస్యం మీరు కూడా ఎంజాయ్ చేయండి! -
ఆ రెండు పార్టీల చరిత్ర అవినీతికి మారు పేరు: ప్రధాని మోదీ
కొచ్చి: కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా కొచ్చిలో బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ‘శక్తి కేంద్ర ఇన్చార్జ్ సమ్మేళనం’లో పాల్గొని ప్రసంగించారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పార్టీలు చరిత్ర అవినీతికి మారు పేరు అని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఈ విషయాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయటంలో బీజేపీకి మాత్రమే ఘనమైన రికార్డు ఉందని అన్నారు. దేశ భవిష్యత్తు పట్ల స్పష్టమైన దూరదృష్టి ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. గడిచిన బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో దేశవ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ గత ఐదు దశాబ్దాలుగా కేవలం ‘గరీబీ హఠావో’ నినాదం వరకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కేరళలోని బీజేపీ కార్యకర్తలు ఎంత శక్తివంతులో త్రిస్సూర్‌లో ఏర్పాటు చేసిన ‘నారి శక్తి సమ్మేళనం’ కాన్ఫరెన్స్ ద్వారా అర్థమైందని మోదీ అన్నారు. అటువంటి వారే బీజేపీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారని తెలిపారు. దేశంలోనే తక్కువ కాలంలో రికార్డు స్థాయితో అభివృద్ధి చెందుతూ... దేశ భవిష్యత్తు పట్ల సంపూర్ణమైన దార్శనికత ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని మోదీ అభిప్రాయపడ్డారు. చదవండి: అయోధ్యలో మోదీ.. ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? -
కేరళ కొచ్చిన్ యూనివర్సిటీలో తొక్కిసలాట
-
అమ్మంటే..అమ్మే: పోలీసమ్మ వైరల్ వీడియో
అమ్మ ఎక్కడున్నా అమ్మే. పసిబిడ్డ గుక్క పట్టి ఏడిస్తే ఏ తల్లి మనసైనా తల్లడిల్లి పోదూ! అమ్మ ప్రేమ, మమకారం అలాంటిది మరి. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. కేరళ కొచ్చిలోని ఈ ఘటన చోటు చేసుకుంది నాలుగు నెలల శిశువు ఏడుపు చూసి చలించిపోయారు కేరళ పోలీసు అధికారి ఎంఏ ఆర్య. క్షణం ఆలోచించకుండా ఆకలితో ఉన్న పాపాయికి తన స్థన్యం ఇచ్చి బిడ్డను అక్కున చేర్చుకున్నారు. నెటిజనుల హృదయాలను గెలుచుకున్నారు. పాట్నాకు చెందిన బిడ్డ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. కొచ్చిలోని ఎర్నాకులం జనరల్ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతోంది. బిడ్డ తండ్రి వలస కార్మికుడు ఇక్కడ జైలులో ఉన్నాడు. ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు.అయితే అనారోగ్య సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరిన తల్లికి నలుగురు పిల్లలు ఉన్నారని కంట్రోల్ రూమ్ పోలీసుల సమాచారం అందించారు సిబ్బంది. వారిని చూసుకునే వారు ఎవరూ లేకపోవడంతో, సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపింది. వెంటనే స్పందించిన పోలీసులు వారిని గురువారం కొచ్చి సిటీ మహిళా స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇంతలో తల్లి దూరమైన ఆ చిన్నారి ఆకలితో ఏడుస్తోంది. అది చూసి ఫీడింగ్ మదర్ కూడా అయిన పోలీసమ్మ తన తల్లి మనసు చాటుకున్నారు. ఆ చిన్నారికి పాలివ్వడానికి సిద్ధంగా ఉన్నానని అధికారిని ఒప్పించి శిశువు కడుపు నింపి నిద్రపుచ్చారు. తనకూ తొమ్మిది నెలల పసి బిడ్డ ఉందని బిడ్డ ఆకలి తనకు తెలుసునని చెప్పింది. ఆర్య చేసిన పనిని నగర పోలీసులు ప్రశంసించారు. అలాగే అనారోగ్యంతో ఉన్న మహిళ పిల్లలను చైల్డ్ కేర్ హోమ్‌కు తరలించామని పోలిసులు తెలిపారు. എറണാകുളം ജനറൽ ആശുപത്രിയിൽ ഐസിയുവിൽ അഡ്മിറ്റായ പാട്ന സ്വദേശിയുടെ 4 കുട്ടികളെയാണ് നോക്കാൻ ആരും ഇല്ലാത്തതിനാൽ രാവിലെ കൊച്ചി സിറ്റി വനിതാ സ്റ്റേഷനിൽ എത്തിച്ചത്. അതിൽ 4 മാസം പ്രായമായ കുഞ്ഞിന് ഫീഡിങ് മദർ ആയ ആര്യ മുലപ്പാൽ ഇറ്റിച്ച് വിശപ്പകറ്റി ❤️❤️ കുട്ടികളെ ശിശു ഭവനിലേക്ക് മാറ്റി.. pic.twitter.com/kzcrzq0hh6 — Remya Rudrabhairav (@RMahatej) November 23, 2023 -
మనసైన మరో ప్రపంచంలోకి... ప్రకృతి అనేది మనిషికి అతి పెద్ద పాఠశాల.
జలపాతాల నుంచి పంటచేల వరకు ప్రతిదీ ఏదో ఒక పాఠం చెబుతూనే ఉంటుంది. అందుకే ప్రకృతి పిల్లలకు నచ్చిన ప్రపంచం. ‘చిల్ట్రన్–ఫ్రెండ్లీ వరల్డ్’ అంశంపై రిజు వేసిన పెయింటింగ్... పిల్లలకూ ప్రకృతి ప్రపంచానికి మధ్య ఉండే అనుబంధానికి అద్దం పడుతుంది. ఈ పెయింటింగ్ చిల్డ్రన్స్ డే స్పెషల్ స్టాంప్ కోసం ఎంపికైంది... కేరళ స్టేట్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక స్టాంప్‌ను విడుదల చేస్తుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అయిదు నుంచి పదకొండవ తరగతి విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటారు. ఈ స్టాంపుల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని పిల్లల సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తుంటారు. ఈ సంవత్సరం రిజు వేసిన పెయింటింగ్ చిల్డ్రన్స్ డే స్టాంప్ కోసం ఎంపికైంది. ‘చిల్డ్రన్–ఫ్రెండ్లీ వరల్డ్ థీమ్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ప్రకృతి కూడా గురువులాంటిదే అనే ఐడియాతో ఈ బొమ్మ వేశాను. ప్రకృతి, విద్యాప్రపంచం రెండూ కలిసిపోయి కనిపించేలా బొమ్మ వేశాను’ అంటుంది కోచిలోని సెయింట్ థామస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న రిజు. ‘రిజు పెయింటింగ్ అద్భుతమైన ఊహతో భావగర్భితంగా ఉంది’ అని జ్యూరీ ప్రశంసించింది. ‘నిజంగా చెప్పాలంటే బహుమతి వస్తుంది అనుకోలేదు. నేనే కాదు నా తల్లిదండ్రులు, టీచర్లు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ పోటీలో పాల్గొనడంలో భాగంగా రకరకాల స్కెచ్‌లు వేశాను. అయితే అవేమీ నాకు నచ్చలేదు. ఆలోచిస్తున్న కొద్దీ కొత్త కొత్త ఆలోచనలు వచ్చేవి. ఆలోచిస్తున్న క్రమంలో ప్రకృతి ప్రపంచాన్ని పుస్తకంగా అనుకున్నాను. ఆ పుస్తకం తెరుచుకున్నప్పుడు ఆ దారుల్లో పిల్లలు ఉత్సాహంగా పరుగులు తీస్తుంటారు. ఈ ఊహతో పెయింటింగ్ వేసినప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది. నేను వేసిన పెయింటింగ్ స్టాంప్‌గా ఎంపిక కావడం, స్టాంప్‌లు నాన్న వృత్తిలో భాగం కావడం ఆనందంగా ఉంది ’ అంటుంది రిజు. రిజు తండ్రి రాజేష్ పరక్కాడవు పోస్ట్ ఆఫీసులో పోస్ట్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. ‘రోజూ తప్పకుండా ఏదో ఒక పెయింటింగ్ వేస్తుంటుంది రిజు. చిత్రకళకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటుంది. తన పెయింటింగ్ స్టాంప్‌గా ఎంపిక కావడం రిజూకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. భవిష్యత్తు్తలో ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’ అంటున్నారు రిజు తండ్రి రాజేష్. బాలల దినోత్సవం సందర్భంగా తిరువనంతపురంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమక్షంలో ‘చిల్డ్రన్–ఫ్రెండ్లీ వరల్డ్’ స్టాంప్‌ను అధికారికంగా విడుదల చేస్తారు. -
కొచ్చి నేవీ కేంద్రంలో హెలికాప్టర్ ప్రమాదం
కొచ్చి/న్యూఢిల్లీ: కొచ్చి నావికా కేంద్రంలో శనివారం జరిగిన ప్రమాదంలో నేవీకి చెందిన ఒక నావికుడు ప్రాణాలు కోల్పోయారు. ఐఎన్ఎస్ గరుడపై ట్యాక్సీ చెకింగ్ సమయంలో చేతక్ హెలికాప్టర్ అనుకోకుండా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో లీడింగ్ ఎయిర్ మ్యాన్ యోగేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయారని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ఘటనపై బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు వెల్లడించింది. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ యోగేంద్ర సింగ్ మృతికి సంతాపం ప్రకటించారని వివరించింది. యోగేంద్ర సింగ్ స్వరాష్ట్రం మధ్యప్రదేశ్ అని తెలిపింది. -
కుప్పకూలిన నేవీ హెలికాప్టర్: ఒకరు మృతి
కొచ్చి: భారత నావికా దళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేవల్ బేస్‌లోని నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ గరుడ వద్ద శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. కేరళలోని నేవల్ ఎయిర్ స్టేషన్లో ట్రయల్ రన్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం పైలట్‌తో సహా ఇద్దరు గాయ పడగా, చాపర్ రోటర్ బ్లేడ్లు తగలడంతో రన్‌వేపై ఉన్న నౌకాదళ అధికారి మృతి చెందినట్లు తెలుస్తోంది. INS చేతక్ హెలికాప్టర్ నౌకాదళంలో అత్యంత పురాతనమైన హెలికాప్టర్. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
విమానంలో తల్లికి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. వీడియో వైరల్
అమ్మను స్కూటర్లో కూచోబెట్టి తిప్పేవాళ్లున్నారు. కార్లలో తిప్పేవాళ్లున్నారు. కాని విమానంలో తిప్పేవాళ్లు... అదీ విమానం నడుపుతూ తిప్పేవాళ్లు కొంచెం అరుదు. ఈ తల్లికి తన కుమారుడే తను ప్రయాణిస్తున్న ఫ్లయిట్‌కి పైలెట్ అని తెలియదు. కాని తెలిసి గొప్పగా ఆనందించింది. మురిసిపోయింది. నెటిజన్లు కూడా భలే ముచ్చటపడ్డారు. అది ఇండిగో విమానం. కొచ్చి నుంచి బయలుదేరబోతోంది. ఒకామె అదే ఫ్లయిట్లో చాలా క్యాజువల్‌గా ఎక్కింది. ఇంతలో ‘అమ్మా’ అనే పిలుపు. తిరిగి చూస్తే కాక్‌పిట్ నుంచి బయటికొచ్చి నిలబడిన పైలెట్. ‘హార్ని.. నువ్వేనా’ అని ఆమె సంబరంగా నోరు తెరిచేసింది. ఎందుకంటే ఆ పైలెట్ ఆమె కొడుకే. అతని పేరు విమల్ శశిధరన్. తను ప్రయాణించే ఫ్లయిట్‌కి కొడుకే పైలెట్ అని తెలిసిన తల్లి సంతోషంగా కొడుకును హగ్ చేసుకుంది. ఆ స్వీట్ సర్ప్రయిజ్కి మురిసిపోయింది. కొచ్చికి చెందిన విమల్ శశిధరన్ ఇదంతా వీడియో తీయించి ఇన్‌స్టాలో ΄ోస్ట్ చేశాడు. ‘ఇలాంటి క్షణాలే జీవితాన్ని అత్యధ్భుతం చేస్తాయి’ అని కామెంట్ చేశాడు. ఆ వీడియోలో కన్నకొడుకు ఉన్నతి చూసి గర్వపడే తల్లిని, తల్లిని ఆనందపరిచే కొడుకును చూసి నెట్లోకం పులకించింది. కామెంట్లు, లైక్‌లు మామూలే. ‘మీ అమ్మ వయసులో చిన్నదిగా కనిపిస్తోంది. పిల్లలు బాగా చూసుకుంటే తల్లిదండ్రుల వయసు తగ్గుతుంది’ అని ఒకరు రాస్తే ‘ఆ అమ్మ నవ్వు ఎంత బాగుంది’ అని మరొకరు రాశారు. ఏమైనా అమ్మను విమానంలో కూచోబెట్టి తానే నడిపి తిప్పే అదృష్టం ఎంతమందికొస్తుంది చెప్పండి. View this post on Instagram A post shared by Vimal Sasidharan (@iflya320) View this post on Instagram A post shared by People of India (@officialpeopleofindia) -
కొచ్చి–బెంగళూరు విమానానికి బాంబు బెదిరింపు
కొచ్చి: ఇండిగో విమానయాన సంస్థకు చెందిన కొచ్చి–బెంగళూరు విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు కాల్‌తో అధికారులు హైరానా పడ్డారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టారు. ఎటువంటి బాంబు లేదని తేల్చారు. అనంతరం మధ్యాహ్నం 2.24 గంటలకు బెంగళూరుకు బయలుదేరింది. 6ఈ6482 విమానం మొత్తం 139 మంది ప్రయాణికులతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. అంతలోనే, ఆ విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి ఇంటర్నెట్ ద్వారా అధికారులకు ఫోన్ కాల్ చేశాడు. దీంతో, అధికారులు వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రయాణికులందరినీ కిందికి దించివేశారు. వారికి చెందిన లగేజీని కూడా క్షుణ్నంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువేదీ లేదని ధ్రువీకరించుకున్నారు. అనంతరం 2.24 గంటల సమయంలో ఆ విమానం తిరిగి బెంగళూరుకు టేకాఫ్ అయ్యింది. బాంబు బెదిరింపుపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మహిళా పోలీసాఫీసర్‌కు 300 కాల్స్!
క్రైమ్: ఆమె ఒక మహిళా పోలీస్ అధికారి. ‘అయితే ఏంటి..’ అనుకుని వెంటపడ్డాడు. అంతేకాదు పోలీస్ స్టేషన్లో ఉండగానే ఫోన్ కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. ఓ అడుగు ముందుకు వేసి తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. చివరకు.. ఖాకీ పవర్ ధాటికి ఆ ఆకతాయి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. కేరళ కొచ్చికి చెందిన ఓ వ్యక్తి.. వనితా పోలీస్ స్టేషన్లో పని చేసే ఓ అధికారిణిని చాలా కాలం నుంచి వెంబడిస్తున్నాడట. ఈ క్రమంలో ఏకంగా 300 ఫోన్ కాల్స్ చేసి.. ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించాడు. దీంతో అతనిపై సీరియస్‌గా దృష్టి సారించిన ఆమె.. రూట్ మార్చింది. తేనె పలుకులు పలికి ట్రాప్ చేసి మరీ అరెస్ట్ చేసింది. నిందితుడ్ని మంగళవారం ఎర్నాకులం కోర్టులో ప్రవేశపెట్టారు. అతనిపై మోపబడిన అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించింది. పదే పదే ఫోన్లు చేసి ఆమెతో పాటు స్టేషన్ సిబ్బందిని కూడా వేధించాడతను. తద్వారా వాళ్ల విధులకు విఘాతం కలిగించాడు. ఓ అధికారిణి వెంటపడడం, లైంగికంగా వేధించడం లాంటి నేరాల కింద ఐపీసీ శిక్షా స్మృతులతో పాటు కేరళ పోలీస్ యాక్ట్ ప్రకారం అతనికి శిక్ష విధిస్తున్నట్లు ఎర్నాకులం కోర్టు తీర్పు వెల్లడించింది. ఆ ఆకతాయికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15వేల జరిమానా విధించింది న్యాయస్థానం. ఇదీ చదవండి: బట్టలు చింపేస్తుంటే.. వీడియోలు తీశారు! -
అనుమానాస్పదస్థితిలో డైరెక్టర్ మృతి!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ చిత్ర దర్శకుడు బైజు పరవూర్ జూన్ కేరళలోని కొచ్చిలో కన్నుమూశారు. అయితే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికి మీడియా కథనాల ప్రకారం ఫుడ్ పాయిజనింగ్తో మృతి చెందినట్లు భావిస్తున్నారు. (ఇది చదవండి: ఆ సూపర్ హిట్ సినిమాకు పార్ట్-2 ఉంది: వెట్రిమారన్) అసలేం జరిగిందంటే.. జూన్ 24న కోజికోడ్‌లోని ఒక హోటల్లో బైజు పరవూర్ భోజనం చేశారు. అయితే ఇంటికి వచ్చిన వెంటనే ఏదో అసౌకర్యంగా అనిపించడంతో కేరళలోని కున్నంకులంలో ఉన్న తన భార్య ఇంటికి వెళ్లాడు. అక్కడే స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న బైజు పరవూరులోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో కొచ్చిలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అయితే ఫుడ్ పాయిజన్ వల్లే బైజు చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా.. బైజు దాదాపు 45 సినిమాల్లో ప్రొడక్షన్ కంట్రోలర్‌గా పనిచేశారు. త్వరలోనే తాను తెరకెక్కించిన సినిమా సీక్రెట్ రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. (ఇది చదవండి: అర్జున్ కూతురు పెళ్లి ఎప్పుడంటే.. వారి పరిచయం మొదలైంది అక్కడే) -
సెలవిక.. శత్రుంజయ! ‘ఐఎన్ఎస్ మగర్’ యుద్ధ నౌక నిష్క్రమణ
సాక్షి, విశాఖపట్నం: నీటిలోనే కాదు.. నేలపైనా దాడిచేసే స్వభావం ఉన్న మొసలి (మగర్) లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న ఆ యుద్ధ నౌక వస్తుందంటే శత్రువుల వెన్నులో వణుకు పుట్టేది. ఆయుధ సంపత్తిని మోసుకొస్తున్న ఆ నౌక కనిపిస్తే చాలు.. శత్రు సైన్యంతో పోరాడుతున్న బలగాలకు కొండంత ధైర్యం పోగవుతుంది. ఆపదలో ఉన్నవారికి ఆత్మీయత పంచుతూ.. విపత్తులో ఉన్నవారిని ఒడ్డుకు చేర్చుతూ.. 36 ఏళ్లపాటు భారత నౌకాదళానికి సుదీర్ఘ సేవలందించిన ఐఎన్ఎస్ మగర్ ఆదివారంతో విధులకు స్వస్తి పలకనుంది. వార్ఫేర్ వెసెల్‌గా అంతర్జాతీయ విన్యాసాల్లో సత్తా చాటిన మగర్‌కు భారత నౌకాదళం ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతోంది. ఒడ్డుకు వచ్చి మరీ.. భారత నౌకాదళ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఉభయచర యుద్ధ నౌకల్లో కీలకమైనదిగా ఐఎన్ఎస్ మగర్ ఖ్యాతి ఆర్జించింది. విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డు సహకారంతో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ)లో మగర్ని యాంఫిబియాస్ షిప్‌గా తీర్చిదిద్దారు. అంటే.. సాధారణంగా షిప్‌లు ఒడ్డు వరకూ రాలేవు. కానీ.. మగర్ మాత్రం ఒడ్డు వరకూ వచ్చి.. సైన్యానికి అవసరమైన ఆయుధ సంపత్తిని అందించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. అందుకే.. దీనికి మగర్ (తెలుగులో మొసలి అని అర్థం) అనే పేరుపెట్టారు. 1987 జూలై 15న భారత నౌకాదళంలో ఈ షిప్ ప్రవేశించింది. విశాఖ నుంచి సుదీర్ఘ సేవలు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నానికి ఐఎన్ఎస్ మగర్ని కేటాయించారు. ల్యాండింగ్ షిప్ ట్యాంక్(ఎల్ఎస్టీ) హోదాలో యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు తీసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. నలుగురు ల్యాండింగ్ క్రాఫ్ట్ వెహికల్ సిబ్బంది, అత్యవసర సమయంలో దళాల్ని మోహరించేందుకు మగర్ యుద్ధ నౌకను వినియోగించేవారు. శ్రీలంకలో ఎల్టీటీఈని నిరోధించే సమయంలో నిర్వహించిన ఆపరేషన్ పవన్‌లో మగర్ కీలక పాత్ర పోషించింది. నిరంతర పోరాటం చేసిన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్(ఐపీసీకే)కు అవసరమైన సామగ్రిని అందించింది. వివిధ దేశాల్లో జరిగిన ద్వైపాక్షిక విన్యాసాల్లో మగర్ సత్తా చాటింది. 2006 ఫిబ్రవరి 22న విశాఖ తీరానికి 70 కి.మీ. దూరంలో మగర్ యుద్ధ నౌకలో ఘోర ప్రమాదం సంభవించింది. షిప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు నావికులు మృతి చెందారు. మరో 19 మంది గాయాల పాలయ్యారు. 2018వ సంవత్సరం వరకూ విశాఖ కేంద్రంగా సేవలందించిన మగర్‌ను 2018 ఏప్రిల్‌లో కొచ్చికి తరలించి.. మార్పులు చేర్పుల అనంతరం మొదటి స్క్వాడ్రన్ శిక్షణ నౌకగా సేవలు అందించింది. సునామీలో విశిష్ట సేవలు మగర్ అందించిన సేవల్లో ముఖ్యంగా 2004లో వచ్చిన సునామీ సమయమనే చెప్పుకోవాలి. ఎప్పుడు మళ్లీ సముద్రం ఉప్పొంగి.. విలయం వస్తుందో తెలీని సమయంలో ధైర్యంగా సాగర జలాల్లో ప్రయాణించిన మగర్.. అండమాన్ నికోబార్ దీవుల్లో చిక్కుకున్న 1,300 మందిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చింది. అంతేకాకుండా.. అక్కడి నుంచి వివిధ విపత్తు ప్రాంతాలకు తరలివెళ్లి నిరాశ్రయులుగా మిగిలిన వారికి సహాయక సామగ్రి అందజేయడంలోనూ కీలకంగా వ్యవహరించిన మగర్‌కు భారత రక్షణ దళం నుంచి అద్భుత ప్రశంసలందాయి. కోవిడ్ సమయంలో నిర్వహించిన ఆపరేషన్ సముద్ర సేతులోనూ మగర్ విశిష్ట పాత్ర పోషించింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడం, స్నేహపూర్వక దేశాలకు వైద్యసామగ్రి అందించడం మగర్ ద్వారానే సాధ్యమైంది. నౌకాదళంలో సేవలు ప్రారంభం:15 జూలై, 1987 పొడవు: 390 అడుగులు వెడల్పు: 57 అడుగులు డ్రాఫ్ట్: 13 అడుగులు వేగం: గంటకు 28 కి.మీ. ప్రయాణ సామర్థ్యం: ఏకధాటిగా 3 వేల మైళ్ల ప్రయాణం ఆయుధ సామర్థ్యం: బీఈఎల్–1245 రాడార్ నావిగేటర్, నాలుగు బోఫోర్స్ 40 ఎంఎం గన్స్, 2 మల్టిపుల్ బ్యారెల్ రాకెట్ లాంచర్స్, ఒక సీ కింగ్ హెలికాప్టర్ వార్ ఫేర్ యూనిట్: 15 యుద్ధ ట్యాంకులు, 13 బీఎంపీ పదాతిదళ పోరాట వాహనాలు, 10 ట్రక్కులు, 8 భారీ మోటార్ వెహికల్స్‌తోపాటు 500 మంది సైనికుల్ని ఒకేసారి తీసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. నేడు కొచ్చిలో నిష్క్రమణం నౌకాదళానికి 36 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలందించిన మగర్ యుద్ధ నౌకకు కొచ్చి పోర్టులో భారత నౌకాదళం ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించే డీకమిషన్ కార్యక్రమంలో ఐఎన్ఎస్ మగర్‌లో సేవలందించిన కెప్టెన్లు, అధికారులకు ఆత్మీయ సత్కారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘అవర్ బోల్డ్ అండ్ బ్రేవ్ మగర్’ పేరుతో షార్ట్ ఫిల్మ్‌ని ప్రదర్శించి యుద్ధ నౌకకు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. (చదవండి: మరింత వేగంగా వీసీఐసీ అభివృద్ధి) -
నీటిపై వెళ్లే మెట్రో.. టికెట్ ఛార్జి చాలా తక్కువే
-
దేశ పర్యాటకానికి కేరళ ఎంతో కీలకం: మోదీ
-
యువశక్తే చోదక శక్తి: ప్రధాని నరేంద్ర మోదీ
కొచ్చి: దేశ అభివృద్ధి ప్రయాణానికి యువ శక్తే చోదక శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా భారత్ మారడం వెనుక యువత భాగస్వామ్యం ఉందని ప్రశంసించారు. భారత్ ఒకప్పుడు అభివృద్ధిలో వెనుకబడి ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, బలమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా యువత కృషి వల్ల సాధ్యమవుతోందని పేర్కొన్నారు. వారిపై తనకు ఎంతో విశ్వాసం ఉందన్నారు. కేరళలోని కొచ్చిలో సోమవారం ‘యువం–2023’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. 21వ శతాబ్దం భారతదేశ శతాబ్దమని ప్రపంచమంతటా అందరూ చెబుతున్నారని, యువ శక్తి మన దేశానికి ఒక పెన్నిధి అని వివరించారు. తాము సంస్కరణలు తీసుకొస్తున్నామని, యువత వాటి ఫలితాలను తీసుకొస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అవినీతిగా మారుపేరుగా ఉండేవని, బీజేపీ ప్రభుత్వం యువత కోసం నూతన అవకాశాలను సృష్టిస్తోందని నరేంద్ర మోదీ చెప్పారు. స్వయం సమృద్ధ సమాజాన్ని సృష్టించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. యువత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నామని తెలిపారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 13 ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహించాలని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. భారత్ ఎప్పటికీ మారబోదని గతంలో ప్రజలు భావించేవారని, ఇప్పుడు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి భారత్‌కు ఉందని మోదీ వ్యాఖ్యానించారు. నేటి ఆత్మనిర్భర్ భారత్ డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుతోందని అన్నారు. మోదీకి ఘన స్వాగతం మోదీకి సోమవారం సాయంత్రం కేరళలోని కొచ్చిలో ఘన స్వాగతం లభించింది. ఐఎన్ఎస్ గరుడ నావల్ ఎయిర్ స్టేషన్ నుంచి యువం సదస్సు వేదిక దాకా రెండు కిలోమీటర్ల మేర రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేరళ సంప్రదాయ దుస్తులను ధరించారు. కాసేపు నడిచి, తర్వాత వాహనం నుంచి అభివాదం చేశారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలపై సవతి తల్లి ప్రేమ రేవా: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పల్లెలపై సవతి తల్లి ప్రేమ చూపాయని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చివేసిందని, గ్రామ సీమల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిందని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సోమవారం మధ్యప్రదేశ్‌లోని రేవాలో బహిరంగ సభలో ఆయన అన్నారు. పంచాయతీరాజ్ సంస్థలకు నిధుల్లో కోత పెట్టి, ఎన్నికలను వాయిదా వేస్తోంది బీజేపీ ప్రభుత్వమేనంటూ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. -
కొచ్చిలో జైలర్
కొచ్చికి మకాం మార్చారు ‘జైలర్’. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జైలర్’. శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా కీలక పాత్రధారులుగా, ఓ అతిథి పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారు. ‘జైలర్’ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల కొచ్చిలో ప్రారంభమైంది. రజనీకాంత్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో పది రోజులు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని సమాచారం. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. -
అమిత్ షా విమానంలో సాంకేతిక సమస్య.. హైదరాబాద్‌లోనే కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎస్‌ఏలోనే ఉన్నారు. ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో కొచ్చి వెళ్లకుండా ఆగిపోయారు.. దీంతో అమిత్ షా ప్రయాణం వాయిదా పడింది. మరో విమానం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి బయల్దేరనున్నారు. కాగా హకీంపేటలోని ఆదివారం జరిగిన సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. 53 ఏళ్లుగా దేశసేవలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు, సీఐఎస్ఎఫ్కి కావాల్సిన అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చడంలో అన్ని రకాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. -
పంట నేల కాస్త విషం కక్కుతుంటే..
కరోనా కాదు.. అయినా జనాలు బయట అడుగుపెట్టాలంటే వణికిపోతున్నారు. తలుపులు, కిటికీలు గట్టిగా బిగించేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. పోలీసులు సైతం జనాలు అనవసరంగా బయట తిరగడంపై నిఘా పెట్టారు. ఒకవేళ.. అత్యవసరానికి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్‌లు ధరిస్తున్నారు. గత వారంగా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది అక్కడ. లాక్డౌన్ లాంటి పరిస్థితులకు కారణం ఒక పే... ద్ద చెత్తకుప్ప!. కొన్నేళ్ల కిందటి వరకు అది సారవంతమైన నేల.. వ్యవసాయ భూమి. కానీ, కాలక్రమంలో అదొక చెత్త కుప్పగా మారింది. ఆ చెత్త కుప్పనే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌గా మార్చేయాలని ప్రభుత్వం భావించి ప్రయత్నాలు మొదలుపెట్టింది. చుట్టుపక్కల జిల్లాల నుంచి ఈ ప్లాంట్‌కు చెత్త వచ్చి చేరుతుంటుంది. కానీ, ఆ చెత్తే ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. నిర్వాహణ లోపం, నిర్లక్ష్యం కారణంగా టన్నులకు పైగా చెత్తకు నిప్పంటుకోవడంతో.. ఆ పరిసరాలు విషవాయువులతో నిండిపోయింది. కేరళ కొచ్చి సిటీలోని బ్రహ్మపురం ప్రాంతంలోని డంప్ యార్డ్.. జనాలకు ప్రాణాంతకంగా మారింది. చెత్త కుప్ప భారీ ఎత్తున్న తగలబడి.. అందులో ప్లాస్టిక్, మెటల్, ఇతరత్ర వస్తువులు కాలిపోయి విషపూరితమైన వాయువులు వెలువడుతున్నాయి. మంటలు వెలువడిన రెండోరోజునే ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. 30 బృందాలు నిరంతరం ఆ కుప్ప దగ్గరే ఉండి.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. అయినప్పటికీ దట్టమైన పొగ వెలువడుతూనే ఉంది. విష వాయువులతో ఆ ప్రాంతమంతా కలుషితమైపోయింది. మరోవైపు బయటకు రావొద్దని స్థానికులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ బయటకు వెళ్లినా.. ఎన్95 మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు. గ్యాస్ ఛాంబర్ అంటూ.. బ్రహ్మపురం డంప్ యార్డ్ అగ్నిప్రమాదంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నగరం గ్యాస్ ఛాంబర్‌గా మారుతుంటే ఏం చేస్తున్నారని కొచ్చి మున్సిపల్ విభాగంపై మండిపడింది. అగ్ని ప్రమాదానికి కారణాలతో పాటు యాక్షన్ ప్లాన్‌ను వివరించాలని ఆదేశించింది కూడా. ఇబ్బందులతో ఆస్పత్రులకు.. వేస్ట్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులు నరకం అనుభవిస్తున్నారు. విషపు వాయువుల పొగ కారణంగా.. రకరకాల ఇబ్బందులో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అక్కడా వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస కోశ సమస్యలు, ఇతర అనారోగ్యాలు ఉన్నవాళ్లను అసలు బయటికే రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. డంప్ యార్డ్‌లో 70 శాతం పొగ తగలబడిపోయిందని, మిగతా చెత్తకు మంటలు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు. మార్చి 2వ తేదీన బ్రహ్మపురం సాలిడ్‌వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో మంటలు అంటుకున్నాయి. ప్రమాదానికి కారణాలపై స్పష్టత లేకున్నా.. అధిక ఉష్ణోగ్రతతోనే మంటలు చెలరేగి ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు ఆ అంశం ఆధారంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వేస్ట్ మేనేజ్మెంట్లో విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడుతోంది. అయితే.. చెత్త నుంచి ప్లాస్టిక్, ఇతర కారకాలను తొలగిస్తూనే ఉన్నామని, అయినా పొరపొరలుగా పేరుకుపోయిన వ్యర్థాల వల్లే తీవ్ర కాలుష్యం చోటు చేసుకుందని ప్రభుత్వం అంటోంది. ప్లాంట్ కథాకమామీషు కొచ్చికి వ్యర్థాల తొలగింపు ఎప్పుడూ పెద్ద సమస్యగా ఉంది. 1998లో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలోని బ్రహ్మపురం వద్ద కొచ్చి కార్పొరేషన్ 37 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. అక్కడ వ్యర్థాల శుద్ధి కర్మాగారాన్ని నిర్మించేందుకు 2005లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టుపై నిర్వాసితుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ► చివరికి.. 2007లో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చిత్తడి నేలను పునరుద్ధరించి ఆ ప్రాంతంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌ను నిర్మించారు. రోజుకు 250 టన్నుల సామర్థ్యంతో 2008లో వేస్ట్ ప్లాంట్‌ను ప్రారంభించారు. కానీ, ఏడాదిన్నర వ్యవధిలోనే ప్లాంట్ దెబ్బతింది. నిర్మాణ లోపాల వల్లే ఇది జరిగిందని గుర్తించిన అధికారులు.. పరిశోధనలు ప్రారంభించారు. కానీ, ఫలితం తేలలేదు. ► ఆపై డిమాండ్ మేరకు కొచ్చి కార్పొరేషన్ మరింత ఎక్కువ భూమిని సేకరించవలసి వచ్చింది. ఇవాళ.. బ్రహ్మపురం వ్యర్థాల కర్మాగారం అనేది కొచ్చి నగరంలోని ప్రధాన ఐటీ పార్కుల సమీపంలో 110 ఎకరాల స్థలంలో విస్తరించింది. ► కొచ్చి కార్పొరేషన్‌తో పాటు కళమస్సెరీ, ఆళువా, అంగమళి, త్రిక్కకారా, త్రిపునితారా మున్సిపాలిటీలతో పాటు చెరానల్లూరు, వడవుకోడ్ పుథాన్కురిష్ పంచాయితీల చెత్త కూడా ఈ ప్లాంట్‌కే వచ్చి చేరుతోంది. ► ప్రతిరోజూ సుమారు 400 టన్నుల చెత్త ఈ ప్లాంట్‌కు వస్తుంది. అందులో నలభై శాతం ప్లాస్టిక్, నాన్బయోడీగ్రేడబుల్ చెత్త ఉంటోంది. ► 2012లో భారత్ ట్రేడర్స్ అనే కంపెనీతో కొచ్చి కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం.. బ్రహ్మపురం ప్లాంట్ నుంచి చెత్త సేకరణలో భాగంగా ప్లాస్టిక్ కేజీకి రూపాయిన్నర చెల్లిస్తుంది. అయితే.. అది రీసైక్లింగ్ ప్లాస్టిక్‌కు మాత్రమే. దీంతో మిగతా వేస్ట్ అంతా అక్కడే ఉండిపోతోంది. ► ఇక ఇక్కడే చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తికి ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరిగింది. 2011లో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో ప్లాంట్‌కు శంకుస్థాపన చేయాలనుకున్నారు. 2015లో ఒప్పందం జరిగి.. మూడేళ్ల తర్వాత ప్లాంట్‌కు శంకుస్థాపన రాయి కూడా పడింది. కానీ, నిధులు లేక 2020లో ఆ ఒప్పందం రద్దు అయ్యింది. ► బ్రహ్మపురం వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు సైతం జోక్యం చేసుకున్నాయి. అయినప్పటికీ.. కొచ్చి కార్పొరేషన్ దాని పని తీరును మెరుగుపర్చలేదు. ఇంకో విషయం ఏంటే.. తాజా ఘటన నేపథ్యంలో కొచ్చి కార్పొరేషన్‌కు కేరళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాదాపు రూ.15 కోట్ల జరిమానా విధించింది. అయితే.. కార్పొరేషన్ ఈ ఆదేశాలపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. నాటకీయ పరిణామాల నడుమ.. బ్రహ్మపురం డంప్ యార్డ్ అగ్నిప్రమాదం నేపథ్యంలో.. గత వారం రోజులుగా అందులోని ఇతర ప్రాంతాల నుంచి చెత్తను అనుమతించడం లేదు. అలాగే.. ప్లాంట్ బయట ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు కూడా బైఠాయించారు. ఈ క్రమంలో.. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 40 లారీల్లో చెత్త కుప్ప ప్లాంట్‌కు చేరింది. ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యులు అడ్డగించే యత్నం చేయగా.. పోలీసులు వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. ఆపై లారీలను లోపలికి అనుమతించారు. విశేషం ఏంటంటే.. అగ్నిప్రమాద ఘటన తర్వాత ప్లాస్టిక డంపింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. అందుకు విరుద్ధంగా కొచ్చి కార్పొరేషన్ చెత్తను లోపలికి అనుమతించడం. -
Prime Volleyball League 2023: వాలీబాల్ లీగ్‌కు వేళాయె...
బెంగళూరు: గత ఏడాది వాలీబాల్ ప్రియుల్ని అలరించిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఇప్పుడు రెండో సీజన్‌తో మరింత ప్రేక్షకాదరణ పొందాలని ఆశిస్తోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే సీజన్–2 పోటీల్లో ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు కోల్‌కతా థండర్‌బోల్ట్స్, హైదరాబాద్ బ్లాక్‌హాక్స్, కొచ్చి బ్లూ స్పైకర్స్, కాలికట్ హీరోస్, అహ్మదాబాద్ డిఫెండర్స్, బెంగళూరు టొర్పెడోస్, చెన్నై బ్లిట్జ్, ముంబై మిటియోర్స్ ‘ఢీ’కి రెడీ అయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్స్ కోల్‌కతా థండర్‌బోల్ట్స్ తమ జోరు ఈ సీజన్లోనూ కొనసాగించేందుకు ఉత్సాహంగా ఉంది. ముందుగా శనివారం నుంచి లీగ్ దశలో 28 మ్యాచ్‌లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మార్చి 3, 4 తేదీల్లో సెమీఫైనల్స్ పోటీలు నిర్వహిస్తారు. 5న విజేతను తేల్చే ఫైనల్ పోరుతో టోర్నీ ముగుస్తుంది. బెంగళూరులో నేడు కోల్‌కతా థండర్‌బోల్ట్స్, బెంగళూరు టొర్పెడోస్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరుగుతుంది. ఈ నెల 12 నుంచి 21 వరకు హైదరాబాద్ వేదికగా 11 మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం మిగిలిన లీగ్ దశ సహా సెమీస్, ఫైనల్ దాకా కొచ్చిలోనే మ్యాచ్‌ల్ని నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు క్లబ్ వాలీబాల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈసారి, వచ్చే ఏడాది క్లబ్ వాలీబాల్ ప్రపంచ చాంపియన్‌షిప్ భారత్‌లోనే జరుగనుండటంతో మరో విశేషం. -
శుక్రవారం కోచ్చి వేదికగా ఐపీఎల్ మినీ వేలం
-
తొలి బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ (ఫొటోలు)
-
మరదు ఫ్లాట్స్ కూల్చివేత
-
కోచి రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
-
హైదరాబాద్ ఓటమి
కొచ్చి: ప్రొ వాలీబాల్ లీగ్‌లో బ్లాక్ హాక్స్ హైదరాబాద్ జట్టుకు వరుసగా రెండో పరా జయం ఎదురైంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బ్లాక్ హాక్స్ హైదరాబాద్ 15–12, 11–15, 12–15, 10–15, 15–14తో కొచ్చి బ్లూ స్పైకర్స్ చేతిలో పోరాడి ఓడిపోయింది. హైదరాబాద్ స్పైక్ షాట్ల ద్వారా 43 పాయింట్లు రాబట్టగా... ఐదుసార్లు మాత్రమే ప్రత్యర్థి స్పైక్‌లను ‘బ్లాకింగ్’ చేయగలిగింది. హైదరాబాద్ ప్లేయర్ అశ్వల్ రాయ్ 15 పాయింట్లు సాధించి మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలువడం విశేషం. నేడు జరిగే మ్యాచ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో కాలికట్ హీరోస్ తలపడుతుంది. -
కొచ్చి బ్లూ స్పైకర్స్ రెండో విజయం
కొచ్చి: ప్రొ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో కొచ్చి బ్లూ స్పైకర్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కొచ్చి 10–15, 15–11, 11–15, 15–12, 15–12తో అహ్మదాబాద్ డిఫెండర్స్‌పై గెలుపొందింది. కొచ్చి తరఫున డేవిడ్ లీ 10, ప్రభాకరన్ 9, మను జోసెఫ్ 7 పాయింట్లతో రాణించగా, అహ్మదాబాద్ జట్టులో విక్టర్ సిసొవ్ (13), గురిందర్ సింగ్ (12) అదరగొట్టారు. నేడు జరిగే పోరులో చెన్నై స్పార్టన్స్‌తో బ్లాక్‌హాక్స్ హైదరాబాద్ తలపడుతుంది. -
బ్లాక్ హాక్స్ హైదరాబాద్ శుభారంభం
కొచ్చి: ప్రొ వాలీబాల్ లీగ్‌లో బ్లాక్‌హాక్స్ హైదరాబాద్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 15–11, 13–15, 15–11, 14–15, 15–9తో అహ్మదాబాద్ డిఫెండర్స్‌పై విజయం సాధించింది. బ్లాక్ హాక్స్ కెప్టెన్ కార్సన్ క్లార్క్ (15 పాయింట్లు) జట్టు గెలుపులో కీలకభూమిక పోషించాడు. అతను 12 స్పైక్ పాయింట్లు సహా 2 సర్వీస్, 1 బ్లాక్ పాయింట్ సాధించాడు. ఇతనితో పాటు అశ్వల్ రాయ్ (14 పాయింట్లు) రాణించాడు. ప్రత్యర్థి అహ్మదాబాద్ జట్టులో విక్టర్ సిసోవ్ (12 పాయింట్లు), గగన్‌దీప్ సింగ్ (8 పాయింట్లు) ఆకట్టుకున్నప్పటికీ జట్టును పరాజయం నుంచి కాపాడలేకపోయారు. ఓవరాల్‌గా అహ్మదాబాద్ స్పైక్‌లో 33 పాయింట్లు సాధిస్తే... హైదరాబాద్ 39 చేసింది. సర్వీస్‌లో బ్లాక్‌హాక్స్ 8, డిఫెండర్స్ 4 పాయింట్లు చేయగా, ప్రత్యర్థి తప్పిదాలతో అహ్మదాబాద్‌కు 16 పాయింట్లు వస్తే, హైదరాబాద్‌కు 19 పాయింట్లు లభించాయి. -
అసభ్యంగా తాకుతూ హోంగార్డు వెకిలి చేష్టలు..
కొచ్చి : రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసే మహిళలు, బాలికల పట్ల వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. కొచ్చిలోని తివారాలో చర్చి ముందు విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శివకుమార్ అటుగా వెళుతున్న మహిళలు, బాలికలను అసభ్యంగా తాకుతూ వేధించాడు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. ఎలమక్కరాకు చెందిన 58 ఏళ్ల శివకుమార్ యూనిఫాంలో ఉండి కూడా కావాలని మహిళలను, స్కూలు విద్యార్థులను అసభ్యంగా తాకారు. దీంతో తాత్కాలిక ఉద్యోగి అయిన అతన్ని ఫైర్ డిపార్డ్మెంట్కు బదిలీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెలిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో సీటి పోలీస్ కమిషనర్ సీరియస్ అయ్యారు. శివకుమార్‌ను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరో వైపు శివకుమార్‌పై ఐపీసీ 354, పోక్సో చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
మహిళలు, బాలికల పట్ల హోంగార్డు వెకిలి చేష్టలు..
-
ప్రముఖ నటుడు కెప్టెన్ రాజు మృతి
-
సీనియర్ నటుడు కన్నుమూత
ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు రాజు డానియెల్ అలియాస్ ‘కెప్టెన్ రాజు’(68) కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ వంటి పలు భాషల్లో 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన స్వయంగా రెండు మలయాళ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. తొలుత ఆర్మీ అధికారిగా పనిచేసిన కెప్టెన్ రాజు అనంతరం ఆ ఉద్యోగాన్ని వదిలి నాటక రంగంలోకి ప్రవేశించారు. 1980ల్లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన రాజు ప్రతినాయకుడి పాత్రలకు ప్రసిద్ధి పొందారు. తెలుగులో ‘బలిదానం’, ‘శత్రువు’, ‘రౌడి అల్లుడు’, ‘కొండపల్లి రాజా’, ‘జైలర్ గారి అబ్బాయి’, ‘గాండీవం’, ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’, ‘మాతో పెట్టుకోకు’ వంటి చిత్రాల్లో నటించారు. మలయాళంలో 1997లో తొలిసారి ‘ఒరు స్నేహగథా’తో దర్శకుడిగా మారారు. అనంతరం 2012లో ‘పవనాయి 99. 99’ చిత్రానికి దర్శకత్వ వహించడమే కాక ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. -
ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి?
కొచ్చి : అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌పై చర్యలు తీసుకోవడం లేదంటూ సన్యాసినులు కొచ్చిలో నిరసనకు దిగారు. ఉత్తర భారతదేశానికి చెందిన డియోసెస్ కేథలిక్ మత గురువు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కేరళకు చెందిన సన్యాసిని రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 నుంచి 2016 వరకు తనను 13 సార్లు వేధించాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై మత పెద్దలకు ఫిర్యాదు చేసిన తనకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తాను కేసు వాపసు తీసుకుంటే భూమి, బంగళా సహా అన్నీ సదుపాయాలు సమకూరుస్తానని బిషప్ తనను ఫోన్లో సంప్రదిస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపును కూడా బహిర్గతం చేశారు. ఇదంతా జరిగి 70 రోజులు పూర్తి కావస్తున్నా సదరు సన్యాసినికి న్యాయం జరగకపోవడంతో తోటి సన్యాసినులంతా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఫ్రాంకోపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్లకార్డులు, బ్యానర్లు చేతబట్టుకుని హైకోర్టు జంక్షన్లో ధర్నాకు దిగారు. పలువురు సామాజిక కార్యకర్తలు వీరికి మద్దతుగా నిలిచారు. ఫిర్యాదులోని లొసుగులు అడ్డుపెట్టుకుని.. గత కొన్ని సంవత్సరాలుగా తమ తోటి సన్యాసిని మానసిక వేదన అనుభవిస్తున్నారని సన్యాసినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదులోని లొసుగులు అడ్డుపెట్టుకుని బిషప్ తప్పించుకోవడానికి చూస్తున్నాడని, అందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారన్నారు. కొట్టాయంలో ఆదివారం పత్రికా సమావేశం నిర్వహించి తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. -
3రోజులు ఆలస్యంగా కొచ్చి ఎయిర్పోర్ట్ సేవలు
సాక్షి, కొచ్చి: భారీ వర్షాలు, వరదలతో నీటమునిగిన కొచ్చి విమాశ్రయం మూడు రోజులు ఆలస్యంగా తన సేవలను ప్రారంభించనుంది. ముందు ప్రకటించినట్టుగా ఆగస్టు 26నుంచి కాకుండా 29వ తేదీ నుంచి పూర్తి స్ధాయిలో సేవలు అందించేందుకు సిద్ధమైంది. విమానాశ్రయంలో జరిగిన సమీక్షా సమావేశంలో విమానాల నియంత్రణ వ్యవస్ధకు జరిగిన నష్టంపై చర్చించారు. కేరళలోవరద పరిస్థితి మెరుగవుతున్నప్పటికీ విమాన సేవలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తాజా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొచ్చి విమానాశ్రయం సోలార్ పవర్ మీద నడుస్తుంది. అధికారులు విమానాశ్రయం నుంచి వరద నీటిని తొలగించినప్పటికీ, విమానాశ్రయం లోపల భారీ వరదలకారణంగా సౌర ఫలకాలు బాగా దెబ్బతిన్నాయి. సుమారు 800 రన్‌వే లైట్లు మరమ్మతు చేయాలి, 2,600 మీటర్ల పొడవు గోడల పునర్నిర్మించటం అవసరం. దాదాపు 90శాతం మంది విమానాశ్రయ ఉద్యోగులే వరద బాధితులు, వారందరూ వాళ్ల ఇళ్లలో చిక్కుకుపోయారు. మధ్య కేరళ ఇంకా వరద ప్రభావం నుంచి కోలుకోవాల్సి ఉన్నందున.. ఉద్యోగులకు సమాచారం అందించలేకపోతున్నామని అధికారులు వెల్లడించారు. ఆగస్టు 29 మధ్యాహ్నం 2 గంటలనుంచి తిరిగి తమ సేవలను పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే ఇతర సదుపాయాలు, కేటరింగ్ అంశాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు అని విమానాశ్రయ అధికారులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన కొచ్చి ఎయిర్ పోర్టు కేరళ వరదలతో రూ.220 కోట్లు నష్టపోయినట్టుగా అధికారులు అంచనా వేశారు. కొచ్చి విమానాశ్రయం ప్రపంచంలోనే మొట్టమొదటి సౌరశక్తి విద్యుత్ వ్యవస్థకు కలిగిన ఎయిర్ పోర్టు. వరదలతో దీనికి కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. పెరియార్ నదికి వరదల కారణంగా రన్‌వే, టాక్సీ బే, కస్టమ్స్ పన్నుల్లేని వస్తువులు, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ టెర్మినల్స్ నీట మునిగాయి. రన్‌వేపై లైట్లు కూడా పూర్తిగా పాడయ్యాయి. 2.26 కిలోమీటర్ల మేర విమానశ్రయం గోడలు నాశనమయ్యాయి. -
29న కొచ్చి ఎయిర్‌పోర్టు సిద్ధం
కొచ్చి: భారీ వరదల కారణంగా వారం రోజులుగా విమానసేవలు రద్దయిన కొచ్చి విమానాశ్రయం ఆగస్టు 29 నుంచి పూర్తిస్థాయి సేవలను అందించేందుకు సిద్ధమైంది. విమానాశ్రయంలో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో విమానాల నియంత్రణ వ్యవస్థకు జరిగిన నష్టంపై అధికారులు చర్చించారు. 90 శాతం మంది విమానాశ్రయ ఉద్యోగులు వరదబాధితులే. వారంతా ఇంకా వాళ్ల సొంతూళ్లలో చిక్కుకుపోయారు. ఎయిర్‌పోర్టు సమీపంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు తెరుచుకోలేదు. ‘మధ్య కేరళ ఇంకా వరద ప్రభావం నుంచి కోలుకోవాల్సి ఉన్నందున.. ఉద్యోగులకు సమాచారం ఇవ్వలేకపోతున్నాం. ఇతర సదుపాయాలు, కేటరింగ్ అంశాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. ఆగస్టు 29 మధ్యాహ్నం 2 గంటలనుంచి తిరిగి సేవలు మొదలవుతాయి’ అని విమానాశ్రయ అధికార ప్రతినిధి వెల్లడించారు. దేశంలో రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన కొచ్చి ఎయిర్‌పోర్టు.. తాజా వరదలు, విమాన సేవల నిలిపివేత కారణంగా రూ.220 కోట్లను నష్టపోయింది. పెరియార్ నదికి వరదల కారణంగా రన్‌వే, టాక్సీ బే, కస్టమ్స్ పన్నుల్లేని వస్తువులు, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ టర్నినల్స్ నీట మునిగాయి. రన్‌వేపై లైట్లు కూడా పూర్తిగా పాడయ్యాయి. పలు ఎలక్ట్రికల్ పరికరాలు కూడా ధ్వంసమయ్యాయి. 2.26 కిలోమీటర్ల మేర విమానశ్రయం గోడలు పాడయ్యాయి. ప్రపంచంలోనే తొలి సౌరశక్తి ఆధారిత విమానాశ్రయమైన కొచ్చిలో ఈ సోలార్ విద్యుత్ వ్యవస్థకు కూడా తీవ్రంగా నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. కాగా, కొచ్చిలోని నేవల్ ఎయిర్‌బేస్, ఐఎన్ఎస్ గరుడలపై తాత్కాలిక విమానసేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. -
కొచ్చిలో తెలుగువారి గోడు
కొచ్చి నుంచి సాక్షి ప్రతినిధి: కేరళలో సంభవించిన ప్రకృతి విలయానికి అక్కడున్న తెలుగు వారు నానా ఇక్కట్లు పడుతున్నారు. కొచ్చిలోని ఏలూరు కాలనీలో 400 నుంచి 450 తెలుగు కుటుంబాలు ఉంటున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి ఇక్కడికి వలస వచ్చారు. వెయ్యి, పదిహేను వందల మంది ఇక్కడున్న ఫ్యాక్ట్ కంపెనీలో, షిప్‌యార్డుల్లో పని చేస్తున్నారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు వారి జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి.తెలుగువారికి చెందిన 20,25 ఇళ్లలో పదహారు ఇళ్లు వర్షాలకు పూర్తిగా మునిగిపోయాయి. ఆఇళ్లలో సామాన్లు ఏవీ పనికిరాకుండా పోయాయి.కట్టుబట్టలతో మిగిలారు. 3 రోజుల పాటు సహాయ శిబిరాల్లో ఉన్న వీరు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు.అయితే, ఇళ్లలో రెండడుగుల మేర బురద పేరుకుపోవడంతో ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు.వర్షాల కారణంగా పది రోజులుగా పనులు లేకపోవడంతో రోజు గడపడమే కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. కొచ్చి తెలుగు అసోసియేషన్ వీరిని ఆదుకోవడానికి విరాళాల సేకరణ వంటి చర్యలు చేపడుతోంది.ఇక్కడి తెలుగు వారిలో చాలా మంది వలస కూలీలు కావడంతో వారికి స్థానికంగా ఎలాంటి అధికార గుర్తింపు కార్డులు లేవు. అందువల్ల ప్రభుత్వం చేస్తున్న సహాయం, పరిహారం వీరికి అందే పరిస్థితి లేదు. దాంతో తెలుగు సంఘమే వీరిని ఆదుకోవడానికి నడుం కట్టింది. వర్షాల వల్ల ఒక్కో తెలుగు కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని కొచ్చి తెలుగు సంఘం నేత హనుమంతు నాయక్ చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన నాయక్ ఇక్కడి ఫ్యాక్ట్ కంపెనీకి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారు.సొంత రాష్ట్రానికి దూరంగా ఉండటం, స్థానిక ప్రభుత్వం సహాయం అందే పరిస్థితి లేకపోవడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
కేరళ వరదలు : డాబాపై అతిపెద్ద ‘థ్యాంక్స్’
కొచ్చి : ప్రకృతి ప్రకోపానికి కేరళ చివురుటాకులా వణికిపోతుంది. కేరళను ముంచెత్తిన వర్షాలతో ఎక్కడ చూసినా హృదయవిదారకర సంఘటనలే కనిపిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి నేవి, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, కోస్ట్ గార్డ్స్ అందిస్తున్న సహాయం అంతా ఇంతా కాదు. రేయింబవళ్లు శ్రమిస్తూ.. వరదల్లో బిక్కుబిక్కుమంటున్నవారిని పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు. సరైన సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఇతర ప్రభుత్వ బృందాలు రావడంతోనే తాము ప్రాణాలతో బయటపడగలిగామని బాధితులు కృతజ్ఞత భావంతో కన్నీంటిపర్యంతమవుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, నేవి ఇతర బలగాలు అందిస్తున్న సహాయ చర్యల వీడియోలు, ఫోటోలు ఎప్పడికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ అవుతూనే ఉన్నాయి. బలగాలు అందిస్తున్న సహాయ చర్యలకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతల మెసేజ్‌లు పంపిస్తూ అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే కొచ్చిలోని ఓ ఇంటి నుంచి నేవి రెస్క్యూ ఆపరేషన్స్‌కు అతిపెద్ద కృతజ్ఞత అందింది. అదేమిటంటే.. కొచ్చిలో ఓ ఇంటి డాబాపై అతిపెద్దగా ‘థ్యాంక్స్’ చెబుతూ పేయింట్ చేశారు. నేవి రెస్క్యూ ఆపరేషన్స్‌కు సెల్యూట్ చెబుతూ ఈ ‘థ్యాంక్స్’ మెసేజ్ పేయింట్ చేశారు. గత మూడు రోజుల క్రితమే ఆ ఇంటి నుంచి ఇద్దరు మహిళలను నావల్ ఏఎల్‌హెచ్ పైలెట్ సీడీఆర్ విజయ్ వర్మ కాపాడారు. ఈ ‘థ్యాంక్స్’ మెసేజ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యూలేట్ అవుతుంది. ఇది కేవలం ప్రజల మన్ననలు పొందడమే కాకుండా.. కేరళలో రెస్క్యూ ఆపరేషన్స్ అందిస్తున్న వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉందని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు. ఈ థ్యాంక్స్ మెసేజ్‌కు.. ‘ఇది మా ఇండియా’ అని ఒక యూజర్ ట్వీట్ చేశాడు. మరో యూజర్ వావ్.. ఇది నేవి, మిలటరీ, ఎయిర్ ఫోర్స్, వాలంటీర్స్, ఇతరులకు మంచి బూస్ట్‌ను అందిస్తుందని చెప్పాడు. ఇటీవల నొప్పులతో సతమతమవుతున్న ఓ గర్భవతిని నేవి సిబ్బంది కాపాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా.. కేరళలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుణుడి ప్రకోపానికి బలైన కేరళకు యావత్ దేశం తమ వంతు సహాయం అందిస్తోంది. భారీ ఎత్తున విరాళాలు, ఆహారం, దుస్తులు పంపుతున్నారు. వరదల తాకిడికి తట్టుకోలేక ఇప్పటికే అక్కడ 370 మంది ప్రాణాలు విడిచారు. 19వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. శనివారం ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ, కేరళకు తక్షణ సాయం కింద రూ.500 కోట్లను ప్రకటించారు. #Kerala: A 'Thanks' note painted on the roof of a house in Kochi from where the Naval ALH piloted by Cdr Vijay Varma had rescued two women on August 17. pic.twitter.com/lwxHkQwzXc Wow.. I hope this would be the biggest boost to the rescuers Navy, military,air force, volunteers and others etc..... — R.Praveen (@Real_Praveen003) August 20, 2018 — ANI (@ANI) August 20, 2018 -
నేటి నుంచి నేవీ ఎయిర్‌బేస్
కొచ్చి: కొచ్చి విమానాశ్రయం నీట మునిగి రాకపోకలు నిలిచిపోవడంతో విమానాల్ని సోమవా రం నుంచి కొచ్చిలోని నౌకాదళ విమానాశ్రయానికి మళ్లించనున్నారు. పౌర విమానాలు నడి పేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెప్పారు. ఈనెల 26 వరకు కొచ్చి విమానాశ్రయాన్ని మూసే ఉంచాలని నిర్ణయించడం తెలిసిందే. అలయన్స్ ఎయిర్ విమానయాన సంస్థ ముందుగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. -
26 వరకు కొచ్చికి విమానాలు డౌటే!
సాక్షి, హైదరాబాద్: కేరళలో వర్షాలు, వరదలు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రన్ వేపై ఇంకా నీళ్లు నిలిచి ఉండటంతో ఆదివారం కూడా కొచ్చి వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. శనివారం మధ్యాహ్నానికి రన్‌వేపై నీటిని తోడేయగలమని విమానాశ్రయ అధికారులు భావించినా, ప్రతికూల వాతావరణం కారణంగా సాధ్యపడలేదు. ఈ నెల 26 వరకు రన్‌వే అందు బాటులోకి వచ్చే అవకాశం లేదని తెలిసింది. -
మూతపడిన కోచి ఎయిర్పోర్ట్
-
మానవ తప్పిదం వల్లే కేరళలో విపత్తు
-
కొచ్చి విమానాశ్రయం మూసివేత
తిరువనంతపురం/కొచ్చి: కేరళపై వరుణ ప్రతాపం కొనసాగుతూనే ఉంది. తాజాగా పెరియార్ నదిపై ఉన్న ఆనకట్ట గేట్లు తెరవడంతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలోకి నీరు చేరింది. దీంతో శనివారం మధ్యాహ్నం వరకు ఎయిర్‌పోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, చిన్న విమానాలను కొచ్చిలోని నౌకాదళ విమానాశ్రయంలో దింపేందుకు అనుమతివ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. కొచ్చికి రావాల్సిన, కొచ్చి నుంచి బయలుదేరే విమానాల్లో సీట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకునేందుకు, ప్రయాణ తేదీల్లో మార్పులు చేసుకునేందుకు ఎలాంటి చార్జీలూ విధించబోమని విమానయాన సంస్థలు ప్రకటించాయి. రాష్ట్రంలో తాజా పరిస్థితిపై విజయన్ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌లతో చర్చించారు. అన్ని రకాలుగా సాయం చేస్తామని ప్రధాని హామీనిచ్చినట్లు విజయన్ చెప్పారు. విద్యుత్తు సరఫరా, సమాచార వ్యవస్థలు, తాగునీటి సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ మొత్తం 14 జిల్లాలకూ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఒక్కరోజులోనే వివిధ జిల్లాల్లో కలిపి 25 మంది మరణించారు. వీరిలో 11 మంది మలప్పురం జిల్లాకు చెందిన వారే. కేరళలో వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడటం కారణంగా ఆగస్టు 8 నుంచి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 67కు పెరిగింది. నిరాశ్రయులుగా మారిన ఒకటిన్నర లక్షల మందిని శరణార్థి శిబిరాలకు తరలించారు. అన్ని నదుల్లోనూ వరదే పెరియార్, చాలక్కిడిపుజ, పంపా సహా కేరళ వ్యాప్తంగా నదులన్నీ వరద నీటితో ఉప్పొంగుతున్నాయి. ముళ్లపెరియార్ డ్యాం సహా రాష్ట్రంలోని 35 ఆనకట్టల గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. మరోవైపు తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, పాదనం దిట్ట, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూ ర్, కొజికోడ్ జిల్లాల్లో గంటలకు 60 కి.మీ. వేగంతో వీచే గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. బుధవారం ఉదయం మలప్పురం జిల్లాలో ఓ ఇంటిపై కొండ చరియలు విరిగిపడి ఆ ఇంట్లోని దంపతులు, వారి ఆరేళ్ల కుమారుడు మరణించారు. ఇడుక్కి జిల్లాలోనూ ఇళ్లపై కొండ చరియలు పడి ఇద్దరు మహిళలు మరణించారు. త్రిస్సూర్‌లో ఓ మత్స్యకారుడు విద్యుదాఘాతంతో చనిపోయాడు. మంగళవారం రాత్రి మున్నార్‌లో ఓ హోటల్‌పై కొండ చరియలు పడటంతో అక్కడ పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన కార్మికుడు మరణించారు. రాజధాని సహా పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. -
కేరళ అతలాకుతలం.. ముళ్లపెరియార్ ముప్పు!
కొచ్చి: భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో ఇప్పటికే 45మంది మృతిచెందారు. రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో తాజాగా 12 జిల్లాల్లో వాతావరణ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరద నీటితో దాదాపు 30 డ్యాములు నిండిపోయి.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేశారు. మరోవైపు పురాతన ముళ్లపెరియార్ డ్యామ్‌కు వరదనీరు భారీగా వచ్చిచేరడంతో పూర్తిగా నిండిపోయి.. ప్రమాదస్థాయికి చేరుకుంది. ముళ్లపెరియార్ డ్యామ్ ఎత్తు 142 అడుగులు కాగా.. బుధవారం మధ్యాహ్నానికి 142 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముళ్లపెరియార్ డ్యామ్‌లో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో వరదను కిందకు వదులుతున్నారు. వివాదాస్పద ముళ్లపెరియార్ డ్యామ్ నిర్వహణ తమిళనాడు ప్రభుత్వం చేతిలో ఉంది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ డ్యామ్ భద్రతపై తమిళనాడు, కేరళ మధ్య వివాదం నడుస్తోంది. ప్రస్తుతం భారీగా వరద వస్తుండటంతో డ్యామ్ సామర్థ్యాన్ని మించి నీటిమట్టం పెరిగితే.. ఇది ప్రమాదానికి దారితీసే అవకాశముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సాధ్యమైనంతగా స్లిప్‌వేస్ నుంచి నీటిని కిందకు వదులుతున్నారు. నాలుగు రోజులు ఎయిర్‌పోర్టు మూసివేత కొచ్చి విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో నాలుగు రోజులపాటు విమానాశ్రయాన్ని నిలిపివేశారు. మొదటగా బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకూ దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేశారు. వరద నీరు మరింగా నిలిచిపోవడంతో వరద నీటిని తరలించేందుకు ఇదమలయార్, చెరుతోని డ్యామ్ గేట్లను ఎత్తివేసిన అనంతరం పెరియార్ నదీ తీరంలో ఉన్న ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను నిలిపివేశారు. -
పడవ ప్రమాదం.. ముగ్గురి మృతి
తిరువనంతపురం : కొచ్చి తీరంలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మత్స్యకారులు మృతి చెందగా మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వివరాలు... మంగళవారం తెల్లవారుజామున చెత్తువా తీరంలో చేపలు పట్టేందుకు మూనంబం నుంచి 15 మంది మత్స్యకారులు పడవలో బయల్దేరారు. వీరంతా ప్రయాణిస్తున్న పడవను భారీ నౌక ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు చర్యలు చేపట్టాం : కేరళ ఫిషరీస్ మంత్రి ఈ ఘటనపై స్పందించిన కేరళ ఫిషరీస్ మంత్రి జే మెర్సికుట్టి అమ్మ మాట్లాడుతూ... హెలికాప్టర్, డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ‘ప్రమాద బాధితులను రక్షించడమే మా తక్షణ కర్తవ్యం. మత్స్యకారుల పడవ నిబంధనలు అతిక్రమించి నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించిందా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నాం. అయినా ఆ విషయం ఇప్పుడు మాట్లాడదలచుకోలేదు. ప్రమాదానికి కారణమైన పడవను కనుగొనటానికి ప్రయత్నిస్తున్నామని’ తెలిపారు. కాగా రెండు నెలల క్రితం కూడా కొచ్చి తీరంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. విదేశీ నౌక ఢీకొనడంతో ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు. -
మలయాళంలో ఒక పెప్పి థీమ్ సాంగ్
-
‘క్రికెటే కాదు.. ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తాం’
కొచ్చి, కేరళ : ‘ఇండియా అంటే క్రికెట్.. క్రికెట్ అంటే ఇండియా’. ఇన్నాళ్లు ఇవే పరిస్థితులు కనిపించేవి మన దేశంలో. కానీ ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతున్న పేరు ‘సాకర్’.. ఫుట్‌బాల్ ప్రపంచ కప్. ఈ విశ్వ క్రీడకు ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా ఆదరణ పెరుగుతుంది. ఇందుకు నిదర్శనంగా కేరళ కొచ్చికి చెందిన ఒక ఆరుగురు యువకులు ఫుట్‌బాల్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకునేందుకు మలయాళంలో ఒక పెప్పి థీమ్ సాంగ్‌ను కంపోస్ చేశారు. ఇంటర్నెట్లో విడుదల చేసిన ఈ పాట ఇప్పుడు ఫుట్‌బాల్ అభిమానులను ఊపేస్తుంది. ఈ విషయం గురించి సరత్ మోహన్(పాటకు సంగీత దర్శకుడు)... ‘ఫుట్‌బాల్ అంటే మాకు చాలా ఇఫ్టం. ఫుట్‌బాల్ పట్ల మాకున్న ప్రేమను చాటుకోవడనికి నేను నా స్నేహితులు కలిసి ఈ పాటను రూపొందించాం. ఈ పాటను కేరళ ఫుట్‌బాల్ అభిమానులకు అంకితం ఇస్తున్నాం’ అని తెలిపారు. అంతేకాక తాము అర్జెంటినా అభిమానులమని, ఈ ఏడాది ఆ టీమే కప్పు కొడుతుందని భావిస్తున్నామన్నారు. సరత్ మోహన్, దేవకృష్ణ, సుజాత పాడిన ఈ పాటను ‘షీ మీడియాస్’ బ్యానర్లో విడుదల చేశారు. కేరళను ఊపేస్తున్న వీడియో ఇదే.. -
స్కూల్ వ్యాన్ బోల్తా.. ఇద్దరు విద్యార్థులు మృతి
కొచ్చి : పాఠశాల నుంచి పిల్లలను ఇంటికి తీసుకువెళ్తున్న స్కూల్ వ్యాన్ నీటి గుంటలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులతో పాటు, పాఠశాలలో కేర్ టేకర్‌గా పని చేస్తున్న మహిళ కూడా మృతి చెందింది. కొచ్చిలోని మార్దాలో సోమవారం సాయత్రం 4.30 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అక్కడి స్థానికులు తెలిపారు. ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్‌కు, ఇతర విద్యార్థులకు తీవ్ర గాయలైయ్యాయి. ఘనట స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో వ్యాన్‌లో చిక్కుకున్న విద్యార్థులను రక్షించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మరణించిన విద్యార్థులను విద్య లక్ష్మి, ఆదిత్యాన్, కేర్ టేకర్ లతా ఉన్నిగా గుర్తించారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. -
గో ఎయిర్‌లైన్స్ విమానం 5 గంటలు ఆలస్యం
హైదరాబాద్ : కొచ్చిన్ వెళ్లాల్సిన గో ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఐదు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఉదయం 11.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన విమానం సాయంత్రం 4.56 గంటలకు బయలుదేరింది. ఇందులో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఐదు గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. -
‘సెవ్‌కొచ్చి’ యాష్ ట్యాగ్‌కు తలొగ్గిన బీసీసీఐ
సాక్షి, స్పోర్ట్స్ : ‘సెవ్‌కొచ్చి’ యాష్ ట్యాగ్‌తో సోషల్‌మీడియా వేదికగా అభిమానులు చేసిన ఉద్యమానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) దిగొచ్చింది. ఈ మేరకు నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్ వేదికను మారుస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్‌ను కొచ్చి నగరానికి కేటాయించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఫుట్‌బాల్‌కు గుర్తింపు పొందిన నెహ్రూ స్టేడియాన్ని క్రికెట్ కోసం పాడుచేయడం ఏమిటని పలువురు ఫుట్‌బాలర్లు, అభిమానులు కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ గతేడాది అండర్–17 ప్రపంచకప్ మ్యాచ్‌లు కూడా జరిగాయి. దీని కోసం స్టేడియంను ‘ఫిఫా’ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలంటే మైదానంలో తవ్వకాలు, పెనుమార్పులు తప్పవని కొచ్చి వాసులు ‘సేవ్‌కొచ్చి’ యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియా వేదికగా ఉద్యమం చేశారు. ఈ ఉద్యమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ చెత్రీలు సైతం మద్దతు పలికారు. ‘ఫిఫా గుర్తింపు పొందిన కొచ్చి స్టేడియానికి జరగబోయే నష్టం గురించి ఆందోళనగా ఉంది. అటు క్రికెట్, ఇటు ఫుట్‌బాల్ రెండింటికీ సమస్య రాకుండా వ్యవహరించాలని కేరళ క్రికెట్ సంఘాన్ని కోరుతున్నా. రెండు ఆటల అభిమానులు నిరాశ పడరాదు. దీనిపై వినోద్‌రాయ్‌తో కూడా మాట్లాడాను. ఆయన ఈ విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు’ అని సచిన్ ట్వీట్ చేశాడు. దీంతో బీసీసీఐ తమ నిర్ణయాన్నిమార్చుకుంది. -
లాడ్జీలో వ్యభిచారం.. 14 మంది అరెస్టు
కేరళ పోలీసులు మరో సెక్స్‌రాకెట్ గుట్టురట్టు చేశారు. కొచ్చి కేంద్రంగా జరుగుతున్న ఆన్లైన్ వ్యభిచార ముఠాకు చెక్‌పెట్టారు. ఈకేసులో 14 మందిని కొచ్చి పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఐదుగురు మహిళలు, నలుగురు హిజ్రాలు, ముగ్గురు విటులతో పాటు లాడ్జి మేనేజర్, వ్యభిచార గృహం నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఈ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా ఆన్లైన్ ద్వారా విటులకు గాలం వేస్తుంది. ఫోటోలను ఆన్లైన్లో పంపి రేటు కదుర్చుకుంటారు. అనంతరం రూమ్‌తో పాటు ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. అయితే లాడ్జీలో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లాడ్జి రిసెప్సెన్లో అనుమతి లేకుండా అమ్ముతున్న మద్యం, తుపాకీలను స్వాధీన పరుచుకున్నారు. ఈసందర్భంగా ఎర్నాకులం ఏసీపీ లాల్జీ మాట్లాడుతూ అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. నిందితులను కోర్టులో హజరు పరుస్తామని తెలిపారు. -
సన్నీ కోసం ఇసుకేస్తే రాలనంత జనం
-
సన్నీ కోసం ఇసుకేస్తే రాలనంత జనం
కొచ్చి: బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్‌కి యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా సన్నీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరోసారి బయటపడింది. కేరళలో ఓ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సన్నీ హాజరయ్యారు. దీంతో సన్నీ చూసేందుకు ఆమె ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎంతమందో తెలుసా?. ఒక్కసారి సన్నీ షేర్ చేసిన వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇసుకేస్తే రాలనంత మంది అనీ..!. దీంతో ఆ షోరూం రూట్లో ట్రాఫిక్‌కి అంతరాయం కూడా కలిగింది. తన కోసం అంతమంది ఫ్యాన్స్ రావడంపై సన్నీ ట్విటర్ ద్వారా స్పందించారు. కొచ్చి ప్రజలకు ధన్యవాదాలు చెప్పడానికి మాటలు సరిపోవన్నారు. కేరళను ఎప్పటికీ మర్చిపోనని ఆనందం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో జనాలు ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘నా కారు నిజంగా కొచ్చిలోని ప్రేమ అనే సముద్రంలో ఉంది. కృతజ్ఞతలు’ అని మరో ట్వీట్లో ఆమె పేర్కొన్నారు. సన్నీ ప్రస్తుతం ‘బాద్షాహో’, ‘భూమి’ చిత్రాల్లోని ప్రత్యేక గీతాల్లో నటిస్తున్నారు. Drone shots from yesterday :) lol pic.twitter.com/HJpVnqthZ7 — Sunny Leone (@SunnyLeone) 18 August 2017 My car in literally a sea of love in Kochi Kerala!! Thanks #fone4 pic.twitter.com/lLHTo8GyrC — Sunny Leone (@SunnyLeone) 17 August 2017 -
అక్కడ పరుగు.. ఇక్కడ పడక!
► మూడేళ్లుగా ప్రారంభంపై సర్కారు మీనమేషాలు ∙పలు మెట్రో నగరాల్లో 45–55 నెలల్లోనే పట్టాలెక్కిన రైళ్లు అంతకంతకూ పెరుగుతున్న వాహనాలు... రద్దీగా మారుతున్న రోడ్లు... మెట్రో రైలు పరుగులతోనైనా ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం వస్తుందని ఆశిస్తున్న నగరవాసుల ఎదురుచూపులు ఎంతకీ ఫలించడం లేదు. బెంగళూరు, కోచి వంటి ఇతర నగరాల్లో తక్కువ సమయంలోనే మెట్రో రైళ్లు పట్టాలెక్కి కూత పెడుతుంటే... పనులు ప్రారంభించి 64 నెలలు గడిచినా రాజధానిలో మాత్రం అదిగో... ఇదిగో... అంటూ కాలయాపన తప్ప నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఎప్పుడో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అసలు ఎప్పుడు పూర్తవుతుందో అంతుపట్టక గ్రేటర్‌వాసులు సమాచార హక్కు చట్టం కింద అధికారులను నిలదీస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్: నగరంలో మొత్తం మూడు మెట్రో కారిడార్లకు గాను నాగోలు–మెట్టుగూడా (8 కి.మీ.), మియాపూర్–ఎస్ఆర్నగర్ (12 కి.మీ.) మార్గాల్లో 20 కి.మీ. మార్గం సిద్ధమైంది. అయినా పాలకులు మాత్రం ప్రారంభానికి పచ్చజెండా ఊపడం లేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న అయినా రైళ్లు పరుగులు పెడతాయని ఆశించిన సిటిజనులకు నిరాశే మిగిలింది. తాజాగా కేరళలోని కొచ్చిలో కేవలం 45 నెలల్లోనే మెట్రో ప్రాజెక్టు పూర్తయి పట్టాలెక్కింది. ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లోనూ పనులు ప్రారంభించిన 45–55 నెలల్లోనే ప్రాజెక్టులు పూర్తయ్యాయి. గ్రేటర్లో ఐదేళ్లు పూర్తయినా పనులు ఇంకా సాగుతూనే ఉండంపై హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ అధికారులను పలువురు సిటిజన్లు స.హ.చట్టం కింద ప్రశ్నిస్తున్నారు. మెట్రో తొలిదశను ప్రారంభించే అంశం ప్రభుత్వ పరిధిలోనిదని.. తమ పరిధిలో లేదని అధికారులు బదులివ్వడం గమనార్హం. అదిగో... ఇదిగో..! మెట్రో ప్రారంభంపై 2014 నుంచి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. గత మూడేళ్లుగా ఇదిగో.. అదిగో అంటూ ప్రారంభంపై ప్రకటనలు... ఊహాగానాలతో కాలక్షేపం చేస్తోంది. తొలుత నాగోల్ –మెట్టుగూడా మార్గంలో రైళ్లు నడిపితే వాణిజ్య, ప్రయాణికుల పరం గా ఉపయుక్తంగా ఉండదని.. ఈమార్గం సికింద్రాబాద్ స్టేషన్ వరకు పూర్తయితేనే మెట్రో రైళ్లు నడపాలని గతంలో నిర్ణయించింది. అయితే ఈ రూట్లో రైలు ఓవర్‌బ్రిడ్జీల నిర్మాణం ఆలస్యమౌతుండడంతో ప్రాజెక్టు జాప్యమవుతోంది. ఇక మియాపూర్–ఎస్ఆర్నగర్ రూట్ సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రారంభంపై ప్రభుత్వం ఊగిసలాడుతుం డటంతో నగరవాసులకు ట్రాఫిక్ చుక్కలు చూపుతోంది. ♦ ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గం మినహా ఇతరప్రాంతాల్లో పనులు తుది దశకు చేరుకున్నాయి. మహానగరాల్లో మెట్రో రైలు పనులు పూర్తయిన తీరిది నగరం పట్టిన సమయం (నెలల్లో) కోచి 45 2012లో మొదలు ..2017లో ప్రారంభం) ఢిల్లీ 50 (1998లో మొదలు...2002లో ప్రారంభం) బెంగళూరు 54 (2007లోమొదలు..2011లోప్రారంభం) హైదరాబాద్ 64 (2012లో మొదలు..ఇంకా ప్రారంభంకాలేదు) -
సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీకి అస్వస్థత
కొచ్చి: ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ,కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు రామ్ జెఠ్మలానీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. కేరళలోని క్రిమినల్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఎన్ ఈ వీనింగ్ విత్ లెజెండ్’ పేరుతో న్యాయవాద వృత్తిలో 75 సం.రాల పాటు ఆయన చేసిన సేవలకు గాను ఓ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కొచ్చీ వెళ్లారు. ఈ సందర్భంగా తనకు అన్ ఈజీగా ఉందని చెప్పడంతో వెంటనే న్యాయవాదులు ఆయనను ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగాఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కానీ 24 గంటల పరిశీలన కోసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచినట్టు చెప్పారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోందని తెలిపారు. -
నటిపై అత్యాచారం: ఆ రాత్రి ఏం జరిగిందంటే..!
పల్సర్ సునీకి ఫోన్ చేయడంపై నిర్మాత వివరణ కొచ్చి: మలయాళ కథానాయిక కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నిర్మాత అంటో జోసెఫ్ పేరు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి పల్సర్ సునీకి చివరిసారిగా ఫోన్ చేసింది జోసెఫ్‌నేనని తేలడంతో ఆయన ప్రమేయంపై అనేక కథనాలు వస్తున్నాయి. వ్యక్తిగత కక్షతోనే నటిపై ఈ దుర్మార్గాన్ని చేయించాడా? అని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కథనాల నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. గత శుక్రవారం నటి కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురయిన అనంతరం ఏం జరిగిందో వివరించారు. ఆయన ఏమన్నారంటే.. 'ఘటన జరిగిన తర్వాత మొదట దర్శకుడు లాల్ నాకు ఫోన్ చేశారు. నా ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉండటంతో నేను ఎత్తలేదు. ఆ తర్వాత రెంజీ పనిక్కర్ నాకు ఫోన్ చేసి.. జరిగిన ఘటన గురించి చెప్పారు. సాధ్యమైనంత త్వరగా లాల్ ఇంటికి రమన్నారు. దీంతో నేను ఎమ్మెల్యే పీటీ థామస్‌తోపాటు లాల్ ఇంటికి చేరుకున్నాను. పోలీసులు, (నటి డ్రైవర్) మార్టిన్ అప్పటికే అక్కడ ఉన్నారు. పీటీ థామస్ మార్టిన్‌ను ప్రశ్నించాడు. అతని దగ్గరి నుంచి పల్సర్ సుని నంబర్ తీసుకున్నాను. నా నంబర్ నుంచి మార్టిన్ సునికి ఫోన్ చేశాడు. మొదట అతను లిఫ్ట్ చేయలేదు. కానీ ఆ తర్వాత కాల్‌బ్యాక్ చేసి నువ్వు ఎవరు అని అడిగాడు. నా గురించి చెప్పడంతో వెంటనే పెట్టేశాడు. అంతే తప్ప అతనికితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా తెలిపాను. అది దారుణమైన ఘటన. ఇలాంటి ఘటన ఏ అమ్మాయికి కూడా జరగకూడదు' అని అంటో జోసెఫ్ పేర్కొన్నారు. కారులో దుండగులు తనను లైంగికంగా వేధింపులకు గురిచేసిన అనంతరం నటి దర్శకుడు లాల్ దగ్గరికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే తాను పల్సర్ సునికి ఫోన్ చేశానని జోసెఫ్ చెప్తున్నారు. -
సర్ప్రైజ్.. ఆ హీరోహీరోయిన్ల పెళ్లైపోయింది!
-
సర్ప్రైజ్.. ఆ హీరోహీరోయిన్ల పెళ్లైపోయింది!
అంతులేని ప్రేమకథకు ఎట్టకేలకు శుభంకార్డు పడింది. లివింగ్ ‘లైలా- మజ్నూ’లుగా ఇటీవలి కాలంలో పలుమార్లు వార్తల్లో నిలిచిన హీరోహీరోయిన్లు కావ్యా మాధవన్- దిలిప్‌లు ఒక్కఇంటివాళ్లయ్యారు. మలయాళంలో నంబర్ వన్ హీరోయిన్గా వెలుగొందుతున్న కావ్యా.. అదే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతోన్న దిలిప్‌లు శుక్రవారం వివాహబంధంలోకి ప్రవేశించారు. అతికొద్దిమంది ఆంతరంగికుల సమక్షంలో శుక్రవారం కొచిలోని ఓ హోటల్లో ఈ ఇద్దరూ మనువాడారు. కాగా, కావ్యా, దిలిప్‌లు ఇద్దరిరీ ఇది రెండో పెళ్లేకావడం గమనార్హం. మలయాళ నటి మంజూ వారియర్‌ను 1998లో పెళ్లాడిన దిలిప్.. కొన్నేళ్ల కిందటే ఆమెకు విడాకులిచ్చాడు. ఇటు కావ్య.. కెరీర్ జోరుమీదున్న సమయంలోనే(2009లో) కువైట్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడి.. సంవత్సరం తిరిగేలోపే విడాకులిచ్చింది. గడిచిన కొద్దికాలంగా కావ్యా, దిలిప్‌ల ప్రణయగాథపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. వీటిని ఏ దశలోనూ ఖండించని ఆ ఇద్దరూ.. అందరికి సర్ప్రైజ్ ఇస్తూ పెళ్లిపీటలెక్కారు. కావ్యతో పెళ్లికి దిలీప్ కుమార్తె మీనాక్షి కూడా అభ్యంతరపెట్టలేదని, ఆ ఇద్దరూ(కావ్యా, దిలీప్‌లు) కలిసి ఉండటం కంటే సంతోషకరమైన విషయం ఏదీ లేదని నటి మనేకా(నిర్మాత సురేశ్ భార్య) మీడియాతో అన్నారు. కావ్యా దిలిప్‌లు కలిసి ఇప్పటిదాకా 21 సినిమాల్లో జతకట్టారు. వాటిలో మీసమాధవన్, కాసిపట్టణం, పిన్నెయుమ్ తదితర సినిమాలు సూపర్హిట్లుగా నిలిచాయి. -
18 ఏళ్ల అమ్మాయికి గర్భం..12 ఏళ్ల బాలుడు అరెస్ట్
కొచి: కేరళలోని ఎర్నాకుళం జిల్లా కొచ్చి నగరంలో 18 ఏళ్ల అమ్మాయి తల్లి అయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కొచ్చి శివారు మున్సిపాలిటీ కలమసెరికి చెందిన ఆ అమ్మాయిని తల్లిని చేశాడన్న ఆరోపణలపై 12 ఏళ్ల బాలుడితోపాటు ప్రసవం చేసిన ఆసుపత్రిపైనా పోలీసులు కేసు నమోదుచేశారు. వివరాల్లోకి వెళితే.. పురుటినొప్పులతో బాధపడుతూ ఓ అమ్మాయి కలమసెరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చింది. చూడటానికి మైనర్ లా ఉన్న ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయాలా వద్దా అనే మీమాంసలో వైద్యులు.. పిల్లల సంరక్షణా(చైల్డ్ లైన్) కేంద్రానికి ఫోన్ చేశారు. దీంతో చైల్డ్ లైన్ ప్రతినిధులు ఆసుపత్రికి వచ్చి వివరాలు చెప్పడంతో ఆపరేషన్ చేసి పాపాయిని బయటికి తీశారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండటంతో నవంబర్ 4న వారిని డిశ్చార్జి చేశారు. చైల్డ్ లైన్ ప్రతినిధులు, ఆసుపత్రి వర్గాల కథనం ప్రకారం 12 ఏళ్ల బాలుడి కారణంగా అమ్మాయి గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బాలనేరస్తుల చట్టాన్ని అనుసరించి 12 ఏళ్ల నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంత సున్నితమైన కేసు గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, రహస్యంగా ఆపరేషన్ నిర్వహించినందుకుగానూ సదరు ఆసుపత్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. అయితే పిల్లల సంరక్షణా కేంద్రం, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు మాత్రం పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. అమ్మాయి రెండు నెలల కిందటే మేజర్ అయినందున ప్రసవం గురించిన సమాచారం పోలీసులకు చెప్పాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. మరికొందరు మాత్రం అసలు 12 ఏళ్ల బాలుడు ఆ పని ఎలా చెయ్యగలడా? అని వాపోతున్నారు. దర్యాప్తులో నిజానిజాలు వెలికితీస్తామని, ప్రస్తుతానికి తల్లీబిడ్డల్ని ప్రభుత్వ సంరక్షణా కేంద్రానికి తరలించామని కలమసెరి సీఐ జయకృష్ణన్ సోమవారం మీడియాకు చెప్పారు. -
40 నిమిషాలు గుండె, మెదడును ఆపేసి..
కొచ్చి: గుండె, మెదడును ఆపేసి మరి ఓ బాలుడికి విజయవంతంగా కేరళ వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. అతడి గుండెలోపల నుంచి వెలుపల వరకు పెరిగిన కణితిని తొలగించారు. ఇందుకోసం ఆ బాలుడి శరీర ఉష్ణోగ్రతను 15 డిగ్రీలు తగ్గించారు. డీప్ హైపోథెర్మిక్ సర్క్యూలేటరీ అరెస్ట్(డీహెచ్‌సీఏ) అనే పద్ధతి ద్వారా రెండేళ్ల బాలుడికి దాదాపు తొమ్మిది గంటలపాటు శ్రమించి ఈ వైద్యం చేసినట్లు వైద్యులు తెలిపారు. ఆది తోపిల్ ఫబీర్ అనే రెండేళ్ల బాలుడి హృదయంలోపల క్యాన్సర్ వ్రణం పెరిగింది. సాధారణంగా లోపలో బయటో పెరిగే ఈ కణితి కాస్త ఈ బాలుడికి గుండె లోపలి నుంచి బయటవరకు పెరిగింది. 200 గ్రాముల సైజులో అది పెద్దదైంది. దీంతో అత్యంత అరుదైన పద్ధతిలో ఆ బాలుడికి శస్త్ర చికిత్స నిర్వహించారు. మొత్తం 30 మంది వైద్యులు ఈ ఆపరేషన్ లో పాలుపంచుకున్నారు. ఇందుకోసం 40 నిమిషాలపాటు అతడి గుండెను, మెదడును ఆపేయడంతోపాటు సాధారణంగా ఒక వ్యక్తిలో ఉండాల్సిన ఉష్ణోగ్రత 37 డిగ్రీలుకాగా దానిని 22 డిగ్రీలకు తగ్గించారు. అంటే 15 డిగ్రీలు కొంత సమయంపాటు తగ్గించారన్నమాట. వైద్య పరిభాషలో ఇది క్లినికల్ డెత్ లాంటిది. ఇది ప్రపంచంలో విజయవంతమైన ఐదో శస్త్రచికిత్స అని ఎంకే మోస్సా కుని అనే వైద్యుడు తెలిపారు. మిగితా నాలుగు కేసుల్లో మాత్రం గుండె లోపల కణితిని తొలగించారని, తాము చేసింది అరుదైన శస్త్ర చికిత్స అని అన్నారు. ఈద్ రోజున శస్త్ర చికిత్స నిర్వహించామని ప్రస్తుతం ఆ బాలుడు క్షేమంగా ఉన్నాడని వివరించారు. -
27లోపు హాజరుకాకుంటే అరెస్టు చేస్తాం!
- సరితా నాయర్ కు విచారణ కమిషన్ హెచ్చరిక కొచ్చి: కేరళను రాజకీయంగా కుదిపేసిన సోలార్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు సరితా నాయర్ కు వ్యతిరేకంగా దర్యాప్తు కమిషన్ గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. ఎన్నిసార్లు పిలిచినా తమ ముందు విచారణకు హాజరుకాకపోవడంతో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27న ఆమె కమిషన్ ముందు హాజరుకావాలని, లేకపోతే ఆమెను అరెస్టు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమిషన్ తేల్చిచెప్పింది. సరితా నాయర్ గతంలో నాలుగుసార్లు కమిషన్ ముందు విచారణకు హాజరుకాలేదు. కమిషన్ ముందుకు రాకపోవడానికి ఆమె గుర్తుతెలియని కారణాలను చెప్తున్నారు. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటుచేస్తామని అనేకమంది నుంచి డబ్బులు వసూలుచేసి.. ఆ తర్వాత మోసం చేసిన కేసులో 2013లో సరితా నాయర్‌ను, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. సోలార్ కుంభకోణంలో భాగంగా తాను అప్పటి కేరళ సీఎం ఊమెన్ చాందీ, ఆయన కేబినెట్ మంత్రి అరయాదన్ మహమ్మద్ కు రూ. 1.9 కోట్లు లంచం ఇచ్చినట్టు సరితా నాయర్ ఆరోపించడం సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు జస్టిస్ శివరాజన్ కమిషన్ ఏర్పాటైంది. కాగా, తనపై ఆరోపణలు చేసినందుకుగాను సరితా నాయర్ పై మాజీ సీఎం చాందీ పరువు నష్టం దావా వేశారు. -
ఆమెది చల్లని మనసు..
అక్షయ ఫ్రిడ్జ్ మినూ పాలిన్ది చల్లని మనసు. కోచిలో రెస్టారెంట్ నిర్వహించే ఆమెకు ఆహారం విలువే కాదు, అన్నార్తుల ఆకలి బాధ కూడా తెలుసు. మూడేళ్ల కిందట ఆమె ‘పాప్పడవడ’ పేరిట రెస్టారెంట్ ప్రారంభించింది. ఒక్కొక్కసారి రెస్టారెంట్లో వండిన ఆహారం వృథా అవుతుండటాన్ని గమనించి, దీనిని ఎలాగైనా అరికట్టాలని అనుకుంది. ఆహారాన్ని వృథాగా పారేసే బదులు కొంతమంది ఆకలి తీర్చగలిగినా బాగుంటుందని ఆలోచించింది. అన్నార్తుల ఆకలిని చల్లార్చేందుకు తన వంతుగా ఏదైనా చేయాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా తన రెస్టారెంట్ బయట అన్నార్తుల కోసం ఒక ఫ్రిజ్ ఏర్పాటు చేసింది. ఎవరైనా ఇందులో మిగిలిపోయిన ఆహారాన్ని ఉంచవచ్చు. ఆకలితో ఉన్న ఎవరైనా ఇందులో అందుబాటులో ఉండే ఆహారాన్ని తీసుకోవచ్చునని ప్రకటించింది. కోచి వాసుల నుంచి ఈ పనికి మంచి స్పందన లభిస్తోంది. ఎవరికి వారే స్వచ్ఛందంగా ఆహారాన్ని తీసుకొచ్చి ఈ ఫ్రిజ్‌లో ఉంచుతున్నారు. ఒకవేళ ఫ్రిజ్‌లోకి తగినంత ఆహారం చేరకపోయినా, ఇందులో నిరంతరం ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేలా మినూ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఫ్రిజ్ ఖాళీ అవుతున్నట్లనిపిస్తే రెస్టారెంట్లో వండిన ఆహారాన్ని అందులో ఉంచుతోంది. అన్నార్తులు ఇందులోని ఆహారాన్ని తీసుకుంటూ తృప్తిగా భోంచేస్తున్నారు. ఫ్రిజ్ ఏర్పాటు చేసిన మినూను వారు తమ పాలిట అన్నపూర్ణగా అభివర్ణిస్తూ ఆమెను మనసారా దీవిస్తున్నారు. -
ఇళ్ల ధరలు పెరిగాయ్
• ఆర్బీఐ హౌసింగ్ సూచీ వెల్లడి న్యూఢిల్లీ: ఇళ్ల ధరలు జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 14 శాతం వరకూ పెరిగాయని ఆర్బీఐ ఇళ్ల ధరల సూచిక(హౌస్ ప్రైస్ ఇండెక్స్-హెచ్పీఐ) వెల్లడించింది. అయితే వార్షిక వృద్ధి రేటు మాత్రం మందగించిందని పేర్కొం ది. అత్యధిక ంగా ఢిల్లీలో ఇళ్ల స్థలాలు ధరలు 22 శాతం పెరిగాయని వివరించింది. కోచి మినహా మిగిలిన నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని పేర్కొంది. రియల్టీ రంగంలో డిమాండ్ మందగించినప్పటికీ, ఇళ్ల ధరలు పెరిగాయని పేర్కొంది. ఢిల్లీ తర్వాత అధికంగా ఇళ్ల ధరలు పెరిగిన నగరంగా బెంగళూరు నిలిచిందని తెలిపింది. బెంగళూరులో 19శాతం ఇళ్ల ధరలు పెరిగాయని పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై(12 శాతం), లక్నో(11శాతం), ముంబై(11 శాతం), కాన్పూర్ (8 శాతం,) అహ్మదాబాద్(7 శాతం), కోల్‌కత(7 శాతం), జైపూర్(3 శాతం)లు నిలిచాయని వివరించింది. -
నడి సముద్రంలో నరేంద్ర మోదీ
-
నడి సముద్రంలో నరేంద్ర మోదీ
- అరేబియా సముద్ర జలాల్లోని విక్రమాదిత్య యుద్ధనౌకను సందర్శించిన ప్రధానమంత్రి - అక్కడే త్రివిధ దళాధిపతులతో భేటీ కొచి: రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా అరేబియా సముద్ర జలాల్లో వినూత్న రీతిలో కీలక సమావేశం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. కొచి తీరానికి 40 నాటికన్ మైళ్ల దూరంలో నిలిచి ఉన్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకలో.. ప్రధాన మంత్రి అధ్యక్షతన త్రివిధ దళాధిపతుల సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఈ సమావేశం కొనసాగుతుంది. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. కొచి తీరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విక్రమాదిత్య వద్దకు చేరుకున్న ప్రధానికి సిబ్బంది ఘనస్వాగతం పలికారు. భారత నౌకాదళం అమ్ములపొదిలోని అతి భారీ యుద్ధనౌక అయిన విక్రమాదిత్యను మోదీ సందర్శించడం ఇది రెండోసారి. గత జూన్ లో ప్రధాని మోదీయే విక్రమాదిత్యను జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తర్వాత మోదీ కొల్లాం బయలుదేరతారు. అక్కడ కేరళ మాజీ ఆర్ శంకరన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం ఢిల్లీకి తిరుగుపయనమయ్యేలోగా కేరళ కేబినెట్ తోనూ భేటీ అవుతారని సమాచారం. -
చాయ్ అమ్ముతూ.. 17 దేశాలు చుట్టేశాడు!
రైల్వే స్టేషన్లో చాయ్ అమ్మకున్న దామోదర్ దాస్.. ఇప్పుడు దేశ ప్రధాని. బహుశా చాయ్‌వాలాగా ఉన్నప్పుడు.. ఈ స్థాయికి చేరుకుంటానని ఆయన ఊహించి ఉండరేమో! దాదాపు మోదీ సమకాలీకుడే అయిన విజయన్ మాత్రం బోలెడు కలలు కన్నాడు. వాటిలో చాలా వాటిని నెరవేర్చుకున్నాడు కూడా! చాయ్ వాలాగా జీవితం ప్రారంభించిన విజయన్ ఒకప్పుడు.. చిన్న టీస్టాల్ ఓనర్. తన భార్యతో కలిసి.. భారత్ లోని అన్ని పర్యాటక ప్రాంతాలతో పాటు 17 విదేశాలూ చుట్టొచ్చాడు. విజయన్ 65 ఏళ్ల అనుభవం, 40 ఏళ్ల దాంపత్య జీవితం, 17 దేశాల పర్యటన అన్నింటినీ కలిపి 'ఇన్విజిబుల్ వింగ్స్' పేరుతో రూపొందించిన 9 నిమిషాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 'ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. కలలు నెరవేర్చుకోండి' అంటూ ఉత్సాహం రేకెత్తిస్తోంది. కొచ్చి నగరం, గాంధీనగర్‌లోని సలీమ్ రాజన్ రోడ్డు.. ఎర్రటి గోడపై తెల్లటి అక్షరాలు.. 'శ్రీబాలాజీ కాఫీ హౌస్'. అలుపు లేకుండా వచ్చే కస్టమర్లకు అలసిపోకుండా కాఫీ, టీలు అందిస్తుంటాడు.. 65 ఏళ్ల విజయన్. పక్కనే చేదోడుగా ఆయన భార్య మోహన. పరిచయస్తులు, చుట్టుపక్కలవారి దృష్టిలో వాళ్లిద్దరూ 'కొద్దిగా తేడా మనుషులు'. ఈ ఆరోపణపై విజయన్ వివరణ ఇస్తాడిలా.. 'మమ్మల్ని ఒక్కమాటైనా అనని వాళ్లు ఒక్కరూ లేరంటే అబద్ధం కాదు. టీస్టాల్ నడుపుకొనే మాకు.. విదేశీయానాలు అవసరమా? అనేది వారి ఆరోపణ. నా వరకైతే ప్రతి యాత్రా ఒక మలుపు. ఒక విజయం. ఎందుకంటే అది నా కల కాబట్టి' అని. భారతదేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చిన విజయన్, మోహనలు 17 విభిన్నదేశాల అందాలనూ ఆస్వాదించారు. అమెరికా వెళ్లేందుకు మాత్రం వారికింకా అనుమతి లభించలేదు. కారణం.. ఆర్థిక స్థితి. యూఎస్ వీసా కోసం ఆస్తులు చూపించడం తప్పనిసరి. మరి విజయన్ ఆస్తి.. ఒక్క టీస్టాలే! అయినాసరే, ఎప్పటికైనా అక్కడకు కూడా వెళతాననే ధీమాతో ఉన్నాడు విజయన్. ఎలా? అటే.. 'అదీ నా కలే కాబట్టి తప్పక నెరవేర్చుకుంటా' అంటాడు. విదేశీయానాల కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం, ఆనందం అనుభవించిన తర్వాత మూడు నాలుగు నెలలు రెట్టింపు కష్టంతో పనిచేసి అప్పు తీర్చడం ఈ వృద్ధ జంటకు అలవాటైన పని. -
కోచీలో భారీగా బంగారం పట్టివేత
-
కోర్టులో మానసిక రోగి హల్చల్
కొచ్చి: కేరళలోని కొచ్చి కోర్టు కాంప్లెక్సులో ఓ మానసిక రోగి నాలుగు గంటల పాటు హల్చల్ చేశాడు. కోర్టు భవనం మీదికి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని కిందికి దించడానికి నానా తంటాలు పడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతన్ని కిందకు రమ్మని ఎంత విజ్ఞప్తి చేసినా వినలేదు. పైగా మరింత గందరగోళం సృష్టించాడు. చుట్టుపక్కల ఉన్న భవనాలపైకి దూకుతూ, భవనంపై ఉన్న పెంకులను పోలీసుల మీదికి, జనాల మీదికి విసిరాడు. ఈ సందర్భంగా 4 గంటల పాటు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పెద్దఎత్తున జనం గుమిగూడారు. 4 గంటల తరువాత ఎట్టకేలకు పోలీసులు అతడిని కిందికి దించడంలో సఫలమయ్యారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో కొద్ది సేపు విధులకు ఆటంకం కలిగింది. హిందీ మాట్లాడుతున్న అతగాడిని అదుపులోకి తీసుకున్నామని కొ చ్చి సెంట్రల్ పోలీసు అధికారి తెలిపారు. అతని కోర్టు ముందు హాజరు పర్చిన అనంతరం మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అతడి వివరాలను చెప్పడానికి మాత్రం నిరాకరించారు. -
తొలి సెమీస్‌లో కేరళ విజయం
3-0తో చెన్నైయిన్ చిత్తు కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తొలి సెమీఫైనల్లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ అదరగొట్టింది. టోర్నీలో టాప్ జట్టుగా కొనసాగుతున్న చెన్నైయిన్ ఎఫ్‌సీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో కేరళ 3-0తో నెగ్గింది. ఇష్ఫాఖ్ అహ్మద్, హ్యుమే, సుశాంత్ గోల్స్ సాధించారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రికార్డు స్థాయిలో 61 వేల మంది హాజరయ్యారు. లీగ్ మ్యాచ్‌ల్లో దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థి జట్లను వణికించిన చెన్నైయిన్ జోరును కేరళ ప్రారంభం నుంచే పథకం ప్రకారం అడ్డుకోగలిగింది. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ సాధించి ప్రత్యర్థిని వణికించింది. 27వ నిమిషంలో విక్టర్ నుంచి అందుకున్న పాస్‌ను మిడ్‌ఫీల్డర్ ఇష్ఫాఖ్ అహ్మద్ కుడి కాలుతో నేర్పుగా గోల్‌పోస్టులోకి పంపాడు. ఆ తర్వాత 29వ నిమిషంలోనే ఇయాన్ హ్యుమే రెండో గోల్ అందించడంతో జట్టు తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ద్వితీయార్ధంలో చెన్నైయిన్ గోల్ అవకాశాలను కేరళ గోల్‌కీపర్ సందీప్ నంది సమర్థవంతంగా అడ్డుకున్నాడు. మ్యాచ్ చివర్లో (90వ నిమిషంలో) ఇయాన్ హ్యుమే పాస్‌ను సబ్‌స్టిట్యూట్ సుశాంత్ ఇద్దరు డిఫెండర్లను దాటుకుంటూ సూపర్ గోల్ సాధించగా జట్టు విజయం ఖాయమైంది. కోల్‌కతాలో ఆదివారం జరిగే మరో సెమీఫైనల్లో గోవాతో కోల్‌కతా తలపడుతుంది. -
వి.ఆర్. కృష్ణయ్యర్ అంత్యక్రియలు పూర్తి
కొచ్చి: ప్రఖ్యాత న్యాయశాస్త్ర కోవిదుడు, కమ్యూనిస్టు యోధుడు వి.ఆర్. కృష్ణయ్యర్ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. కేరళ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆయన ఇద్దరు కుమారులు కర్మకాండ నిర్వహించారు. తర్వాత శవదహనశాలలో ఆయన భౌతికకాయాన్ని దహనం చేశారు. కేరళ మంత్రి కే బాబు ప్రభుత్వ ప్రతినిధిగా అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకుముందు కృష్ణయ్యర్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఒమన్ చాంది, మంత్రులు కేఎం మణి, కే బాబు, కేపీ మోహనన్, ప్రతిపక్ష నేత అచ్యుతానందన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పి. రవీంద్రన్, క్రైస్తవ మత పెద్దలు శ్రద్ధాంజలి ఘటించారు. -
వీఆర్ కృష్ణయ్యర్ ఇక లేరు
తీవ్ర అస్వస్థత వల్ల అవయవ వైఫల్యంతో కన్నుమూత నేడు కొచ్చిలో జరగనున్న అంత్యక్రియలు కొచ్చి: ప్రఖ్యాత న్యాయశాస్త్ర కోవిదుడు, కమ్యూనిస్టు యోధుడు వి.ఆర్. కృష్ణయ్యర్(100) గురువారం కన్నుమూశారు. నవంబర్ 13వ తేదీన ఆయన 100వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న విషయం విదితమే. తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణయ్యర్‌ను కుటుంబ సభ్యులు నవంబర్ 24న స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆయన డిసెంబర్ 2న తీవ్ర గుండెపోటుతో పక్షవాతానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించటం ప్రారంభమైంది. కీలక అవయవాల వైఫల్యంతో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు కన్నుమూశారని వైద్యులు తెలిపారు. అరుదైన వ్యక్తి కృష్ణయ్యర్..: కేరళలోని పాలక్కడ్ సమీపంలోని వైద్యనాథపురంలోని తమిళ బ్రాహ్మణుల ఇంట 1914 నవంబర్ 15న జన్మించిన వైద్యనాథపుర రామకృష్ణయ్యర్..యువకుడిగా ఉన్నప్పుడే కమ్యూనిస్టు భావాలను ఒంటబట్టించుకున్నారు. 1937 నుంచి క్రిమినల్ లాయర్‌గా పేరున్న తండ్రి వి.వి. రామయ్యర్ శిష్యరికంలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అనంతరం అప్పటి మద్రాస్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రపంచంలోనే మొదటిసారిగా కేరళలో ఎన్నికైన ఈఎంఎస్ నంబూద్రిపాద్ కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1965 ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం న్యాయవాద వృత్తిపై దృష్టి పెట్టారు. 1968లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా రెండు రంగాల్లో అవిరళ కృషి చేసిన అరుదైన వ్యక్తి అయ్యర్. కాగా, 1957లో ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే కేరళలో భూ సంస్కరణలు అమలయ్యాయి. అలాగే, 1973 నుంచి 1980 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఆయన హయాంలోనే బెయిల్ నిబంధనలు సరళమయ్యాయి. విచారణ సందర్భంగా నిందితులకు బేడీలు వేయటాన్ని కూడా అయ్యర్ వ్యతిరేకించారు. భారత న్యాయవ్యవస్థకు అయ్యర్ భీష్మ పితామహుడు వంటి వారని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్ కొనియాడారు. 1975లో ఇందిరాగాంధీని ఎంపీ పదవికి అనర్హురాలిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన షరతులతో కూడిన స్టే ఇచ్చారు. తదనంతర పరిణామాలు దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించేందుకు దారితీశాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో 400 వరకు తీర్పులు వెలువరించి, అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆయన న్యాయశాస్త్రానికి సంబంధించి 70కి పైగా పుస్తకాలు రాశారు. ‘వాండరింగ్ ఇన్ మెనీ వరల్డ్స్’ పేరుతో ఆత్మకథ రాసుకున్నారు. లా కమిషన్ సభ్యునిగా 1971-73 కాలంలో పనిచేశారు. 1987 రాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్.వెంకట్రామన్ ప్రత్యర్థి వీఆర్ కృష్ణయ్యర్. గుజరాత్ అల్లర్లపై విచారణకు ఏర్పాటైన పౌర సంఘంలో అయ్యర్ కూడా సభ్యునిగా ఉన్నారు. 1999లో ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. 2002 గుజరాత్ అల్లర్లకు నరేంద్రమోదీయే కారణమని అప్పట్లో అయ్యర్ తీవ్ర విమర్శలు చేశారు. కానీ గత ఏడాది బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీని ప్రకటించగా కృష్ణయ్యర్ హర్షం వ్యక్తం చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నేడు అంత్యక్రియలు: కృష్ణయ్యర్ భౌతిక కాయాన్ని కొచ్చిలోని స్వగృహం ‘సత్గమయ’కు తరలించి అక్కడి నుంచి.. ప్రజల సందర్శనార్థం దగ్గరలోనే ఉన్న రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియానికి తరలించనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు జరుపుతారు. ఆయనకు ఇద్దరు కుమారులు. గొప్ప మానవతావాది: ప్రధాని మోదీ ఆయన మృతిపై రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ మోదీ విచారం వెలిబుచ్చారు. ఆయన గొప్ప మానవతావాది అని మోదీ ట్వీటర్లో శ్లాఘించారు. కృష్ణయ్యర్ ప్రజల మనిషి అని ఆయన సేవలను ఎన్నటికీ మరువబోమని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు. కృష్ణయ్యర్ మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. బలహీన వర్గాలకు అండ: వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: జస్టిస్ కృష్ణయ్యర్ మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. దేశ న్యాయవ్యవస్థలో తనదైన ముద్ర వేసిన కృష్ణయ్యర్... బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు కొండంత అండగా నిలిచారని జగన్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలకు చేరువ చేయడంలో కృష్ణయ్యర్ కృషి గుర్తుండిపోతుందన్నారు. పలు అసాధారణమైన తీర్పులిచ్చిన కృష్ణయ్యర్ న్యాయవ్యవస్థలో ఓ ఆదర్శమూర్తిలా నిలిచారని జగన్ తన సంతాపం సందేశంలో నివాళులర్పించారు. -
'లిక్కర్ షాపులను హైవేల నుంచి తొలగించండి'
కొచ్చి:జాతీయ రహదారులపై ఉన్న మద్యం షాపులను వేరే చోటుకి తరలించాలని కేరళ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మద్యం షాపులు హైవేలపై ఉండటం వల్ల ప్రమాదాలు అధికమవుతున్నాయనే ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్)ను స్వీకరించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైవే మార్గంలో మద్యం షాపులు ఉండటం వల్ల వాహన డ్రైవర్లు సులువుగా మద్యాన్ని సేవించి ప్రమాదాలు కారణమతున్నారని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 169 లిక్కర్ షాపులను వేరే చోటకి తరలించాలని ప్రభుత్వానికి సూచించింది. దీనిపై ప్రభుత్వం రెండు వారాల్లో నివేదిక అందజేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ ప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ముద్దుల వ్యవహారం.. వందమందిపై కేసులు!
బీజేవైఎం నేతల మోరల్ పోలీసింగ్‌ను వ్యతిరేస్తూ.. 'కిస్ ఆఫ్ లవ్' పేరిట ముద్దుల కార్యక్రమం నిర్వహించిన వంద మంది మీద కొచ్చిలో పోలీసు కేసులు నమోదయ్యాయి. కేరళలోని కొచ్చి మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఆదివారం నాడు వందలాది మందితో భారీ కార్యక్రమం నిర్వహించారు. అయితే అది చట్ట విరుద్ధం అంటూ పోలీసులు ఇప్పుడు కేసులు పెట్టారు. వాస్తవానికి ఆరోజు ముద్దుల కార్యక్రమంలో పాల్గొన్నవాళ్ల కంటే.. దాన్ని చూసేందుకు వచ్చినవాళ్లు, శివసేన లాంటి ఇతర సంస్థల సభ్యులే ఎక్కువగా కనిపించారు. అలా చూసేందుకు వచ్చినవాళ్ల మీద ఎలాంటి కేసులు పెట్టలేదు గానీ.. నిర్వాహకులు, అందులో వాస్తవంగా పాల్గొన్నవాళ్ల మీద మాత్రం కేసులు నమోదు చేశారు. చిట్ట చివరి నిమిషంలో వాళ్లు ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించడంతో పోలీసులు వాళ్లను అప్పుడే అదుపులోకి తీసుకున్నారు. -
'కిస్ ఆఫ్ లవ్' ఫేస్ బుక్ ఖాతా హ్యాక్!
కొచ్చి:'నైతిక పో్లీసింగ్'కు నిరసనగా కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమానికి తెరలేపిన పేస్ బుక్ బృందం సభ్యులకు మరో ఆటంకం ఎదురయ్యింది. ఆ ఖాతాలో ఉన్న మరో ఐదుగురు సభ్యుల వివరాలు హ్యాకింగ్ గురయినట్లు ఆర్గనైజేషన్ ప్రధాన సభ్యుడు రాహుల్ పసుపాలన్ మీడియాకు తెలిపాడు. దీని వెనుక ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నట్లు బృంద సభ్యుడు రాహుల్ పసుపాలన్ చెప్పారు. హ్యాకింగ్‌కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాలకు ఫిర్యాదు చేశామని చెప్పారు. అలాగే, తమపై దాడి చేసే ఉద్దేశంతో ఆదివారం కార్యక్రమం జరిగే వేదిక వద్దకు కొందరు మారణాయుధాలతో వచ్చారని ఆరోపించారు. కోచిలోని సాగర తీరంలో కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం ఆదివారం నిర్వహించాలని ఈ గ్రూప్ భావించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే కిస్ ఆఫ్ లవ్ కు తొంభై వేల వరకూ లైక్ లు వచ్చినట్లు రాహుల్ పసుపాలన్ స్పష్టం చేశాడు. -
ఆగిన ‘ముద్దు’ కార్యక్రమం!
కొచ్చి: కేరళలోని కొచ్చి సాగర తీరంలో ఆదివారం జరగాల్సిన ‘ముద్దు (కిస్ ఆఫ్ లవ్)’ అనే కార్యక్రమం పోలీసుల నిర్బంధం కారణంగా ఆగిపోయింది. నిర్వాహకులను పోలీసులు ముందుగానే అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ‘నైతిక పోలీస్’ విధానాన్ని వ్యతిరేకిస్తూ ‘ఫ్రీ థింకర్స్’ అనే ఫేస్బుక్ గ్రూపు కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించతలపెట్టింది. యువతీ యువకులు సాగర తీరానికి వచ్చి ఒకర్ని ఒకరు కౌగిలించుకుని, ముద్దాడుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఆదివారం ప్లకార్డులతో లా కాలేజీ నుంచి సాగర తీరంలోని వేదిక వద్దకు నిర్వాహకులు మద్దతు దారులతో వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు సుమారు 30 మందిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. మీడియా కవరేజీతో వేదిక వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు చేరడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు లాఠీలకు పని చెప్పారు. ఈ సందర్బంగా అభిమానులు ముద్దుల పండుగ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం పలువురిని ఆశ్చర్యపరిచింది. -
'కిస్ ఆఫ్ లవ్' మద్దతుదారుల అరెస్ట్
కొచ్చి: 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమ నిర్వాహకులు, సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్నాకులం లా కాలేజీ నుంచి కార్యక్రమానికి వేదికైన మెరైన్ డ్రైవ్ గ్రౌండ్స్ కు ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించడంతో వీరిని అరెస్ట్ చేశారు. దాదాపు 50 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. 'కిస్ ఆఫ్ లవ్' మద్దతుదారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ 'నైతిక పోలీసింగ్'కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెరైన్ డ్రైవ్ గ్రౌండ్స్ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించడంతో పోలీసులను భారీగా మొహరించారు. వెయ్యి మంది కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు ప్రకటించారు. 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమానికి మీడియాలో ఎక్కువగా ప్రచారం రావడంతో ఏం జరుగుతుందో చూద్దామని పెద్ద ఎత్తున జనం వచ్చారు. దీంతో నిర్వాహకులు చివరి నిమిషంలో వ్యూహం మార్చుకున్నారు. ఎర్నాకులం లా కాలేజీ నుంచి ర్యాలీ నిర్వహించేందుకు సిద్దమవడంతో పోలీసులు వీరిని అడ్డుకున్నారు. 'చుంబన పండుగ'ను వ్యతిరేకిస్తూ శివసేన, ముస్లిం సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. -
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
కోచి: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నెల 25న ముంబై నుంచి వచ్చే ఒక విమానాన్ని పేల్చేయడం లేదా వీలైతే ఆత్మాహుతి దాడి చేస్తారని కోచి విమానాశ్రయ అధికారులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు విమానాశ్రయం డైరెక్టర్ ఏకేసీ నాయర్ చెప్పారు. శనివారం ముంబై నుంచి కోచి వచ్చే విమానం లేదా శుక్రవారం రాత్రి అహ్మదాబాద్-ముంబై సెక్టార్ విమానంపై దాడి చేయనున్నట్టు హెచ్చరికలు వచ్చాయి. గురువారం రాత్రి ఓ ఆగంతకుడు కోల్‌కతా విమానాశ్రయ అధికారికి ఫోన్ చేసి ఈ మేరకు బెదిరించాడు. ఆయన వెంటనే కోచి విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. సీఐఎస్ఎఫ్ డీఐజీ ఆనంద్ మోహన్ చెన్నై నుంచి కోచి చేరుకుని అత్యున్నత స్థాయి భద్రత సమావేశం నిర్వహించారు. కోచి విమానాశ్రయంలో భద్రత బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
కొచ్చీ: భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న అయిదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎన్నుకుంది. కొచ్చిలో బుధవారం మధ్యాహ్నం తొలి వన్డే జరుగుతోంది. మరోవైపు పారితోషికం పెంచాలన్న ఆటగాళ్ల డిమాండ్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సానుకూలంగా స్పందించింది. దాంతో విండీస్ ఆటగాళ్లు మ్యాచ్ ఆడేందుకు సిద్ధం అయ్యారు. పారితోషికం పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రాక్టీస్ సెషన్‌కు వెస్టిండీస్ ఆటగాళ్లు మాత్రం డుమ్మా కొట్టారు. దీంతోపాటు మ్యాచ్ ముందు రోజు జరిగే మీడియా సమావేశానికి కూడా విండీస్ తరుపున ఎవరూ హాజరు కాని విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్‌పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే విండీస్ ఆటగాళ్లతో బోర్డు జరిపిన చర్చల ఫలవంతం కావటంతో మ్యాచ్‌పై సందిగ్ధత వీడింది. -
సందిగ్ధంలో భారత్-వెస్టిండీస్ సిరీస్
-
సందిగ్ధంలో భారత్-వెస్టిండీస్ సిరీస్
కొచ్చి : భారత్-వెస్టిండీస్ సిరీస్ సందిగ్ధంలో పడింది. పారితోషికం పెంచాలని వెస్టిండీస్ క్రికెటర్లు డిమాండ్ నేపథ్యంలో తొలి వన్డేపై అనుమానాలు నెలకొన్నాయి. వెస్టిండీస్ బోర్డ్ ఇటీవల ఆటగాళ్ల పారితోషికంలో 75 శాతం కోత విధించిన విషయం తెలిసిందే.దాంతో నిన్నటి ప్రాక్టీస్ మ్యాచ్‌తో పాటు విలేకర్ల సమావేశానికి ఆటగాళ్లు గైర్హాజరు అయ్యారు. కాగా నేటి నుంచి (బుధవారం) వెస్టిండీస్ తో ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కొచ్చిలో తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక భారత క్రికెటర్లు బుధవారం ప్రాక్టీస్ సెషన్లో నిమగ్నమైతే మరోవైపు వెస్టిండీస్ ఆటగాళ్లు మాత్రం డుమ్మా కొట్టారు. దీంతోపాటు మ్యాచ్ ముందు రోజు జరిగే మీడియా సమావేశానికి కూడా విండీస్ తరుపున ఎవరూ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సిరీస్‌పై సందిగ్ధం కొనసాగుతోంది. -
ఇన్ఫోసిస్ శిబులాల్ భూరి విరాళం
కొచ్చి: సేవా కార్యక్రమాలకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్ డీ శిబులాల్ భూరి విరాళం ప్రకటించారు. దాతృత్వ కార్యక్రమాల కోసం తమ ఫౌండేషన్లకు రూ.36 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు శిబురాల్, ఆయన సతీమణి కుమారి శిబురాల్ తెలిపారు. ఈ మొత్తాన్ని అనాధ పిల్లలకు సేవలందిస్తున్న సరోజిని దామోదరన్ ఫౌండేషన్(ఎస్ డీఎఫ్), అద్వైత ఫౌండేషన్ లకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. తమ ఫౌండేషన్ల ద్వారా గత 15 ఏళ్లుగా శిబులాల్ దంపతులు దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. అనాధ పిల్లలకు విద్యనందించేందుకు 1995లో ఎస్ డీఎ స్థాపించారు. దీనిద్వారా ఇప్పటివరకు 3,306 విద్యార్థులకు చేయూతనందించారు. -
భారీ నగదు, బంగారంతో పట్టుబడ్డ ప్రయాణికులు
కొచ్చి:విదేశాల నుంచి అక్రమ బంగారాన్ని తరలిస్తున్న ఘటనలు దేశంలో రోజూ ఏదో మూలన చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కొంతమంది ప్రయాణికులు రూ.21లక్షల విలువ గల బంగారాన్ని, రూ. 22 లక్షల విదేశీ నగదును తీసుకొస్తుండగా కస్టమ్స్ అధికారులకు చిక్కిన ఘటన కొచ్చి అంతర్జాతీయ విమానశ్రయంలో చోటు చేసుకుంది. సోమవారం షార్జా నుంచి దిగిన ప్రయాణికులు 482 గ్రాములు బంగారాన్ని కడ్డీల రూపంలో తీసుకొస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇందులో ఒక ప్రయాణికుడు నుంచి స్వాధీనం చేసుకున్న 260 గ్రాముల గోల్డ్ చైన్ విలువ దాదాపు రూ.7.42 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.మరో ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ.22 లక్షల విలువగల విదేశీ నగదును కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. -
అమ్మో! మళ్లీ వెళ్లం!
కొచ్చి/హైదరాబాద్: ఇరాక్‌లో గత నెల రోజులుగా తీవ్ర భయాందోళనల మధ్య, క్షణమొక యుగంగా మత్యుభయంతో గడిపిన 183 మంది భారతీయులు శనివారం క్షేమంగా తిరిగి వచ్చారు. మరో 200 మంది ప్రత్యేక విమానంలో వస్తున్నారు. కొచ్చి వచ్చిన వారిలో 46 మంది భారతీయ నర్సులతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని వివిధ ప్రాంతాలకు చెందిన 78 మంది నిర్మాణ కార్మికులు ఉన్నారు. భారత ప్రభుత్వం, ఇరాక్‌లోని భారతీయ దౌత్యాధికారులు చేసిన కృషి ఫలించి సున్ని మిలిటెంట్ల చెర నుంచి విడుదలై ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక విమానంలో వారు కొచ్చి చేరుకున్నారు. అదే విమానంలో కిర్కుక్లో చిక్కుకుపోయిన ఇతర భారతీయులు, ముగ్గురు భారత ప్రభుత్వ అధికారులు కూడా ఇండియా వచ్చారు. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికారు. తమ రాష్ట్రానికి చెందిన నర్సులను క్షేమంగా తీసుకొచ్చేందుకు కృషి చేసిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ఇరాక్‌లోని భారతీయ ఎంబసీ అధికారులకు చాందీ కృతజ్ఞతలు తెలిపారు. నర్సులంతా క్షేమంగా చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. చెమర్చిన కళ్లతో తమవారిని హత్తుకుని భావోద్వేగభరితులయ్యారు. ఏడాది వయసున్న కూతురిని వదిలేసి ఇరాక్ వెళ్లిన మరీనా అనే నర్సు రెండేళ్ల కూతురుని చూసుకుని కన్నీటిపర్యంతమైంది. దాదాపు నెల రోజుల క్రితం ఇరాక్‌లో ప్రారంభమైన సున్నీల తిరుగుబాటు కారణంగా తిక్రిత్‌లోని ఒక ఆసుపత్రిలో చిక్కుకుపోయిన నర్సులను మిలిటెంట్లు మొదట మొసుల్‌కు తీసుకెళ్లి, అనంతరం నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం క్షేమంగా విడిచిపెట్టిన విషయం తెలిసిందే. అమ్మో! మళ్లీ వెళ్లం! ఇరాక్‌కు మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని ఆ దేశం నుంచి తిరిగొచ్చిన నర్సులు స్పష్టం చేశారు. మరోసారి తమ ప్రాణాలను పణంగా పెట్టబోమన్నారు. బాంబు పేలుళ్ల శబ్దాలు తమ చెవులలో ఇంకా గింగురుమంటూనే ఉన్నాయన్నారు. కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలతో వణికిపోతూ నిద్రలేని రాత్రులు గడిపామని కవలలైన సోనా, వీణలు వివరించారు. స్వదేశానికి తిరిగిరావడం పునర్జన్మలా ఉందన్నారు. తిక్రుత్ నుంచి బస్సుల్లో బయల్దేరిన తరువాత పలుమార్లు మిలిటెంట్లు గమ్యాన్ని మార్చారని, వారివద్ద ఉన్న ఆయుధాలు చూసి ప్రాణాలపై ఆశలు వదులుకున్నామన్నారు. ‘మీరంతా మా చెల్లెళ్లలాంటి వారు. మీకెలాంటి హాని చేయం అని మిలిటెంట్లు మాతో చెప్పారు. అయినా వారి మాటలను మేం నమ్మలేదు’ అని కొట్టాయంకు చెందిన నర్సు సాండ్రా సెబాస్టియన్ తెలిపారు. అయితే, మిలిటెంట్లు తమతో మర్యాదగానే ప్రవర్తించారని చెప్పారు. తాము తిక్రిత్‌లోని ప్రభుత్వాసుపత్రిలో పనిచేశామని, గత నాలుగు నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదన్నారు. ‘వారిని టెర్రటిస్టులనలేమని, వారంతా స్థానిక ప్రభుత్వంలో భాగమే’నని మరో నర్సు సుని మోల్ చాకొ చెప్పారు. క్షేమంగా తిరిగొచ్చినందుకు సంతోషంగానే ఉన్నా భవిష్యత్తును తలచుకుంటే భయంగా ఉందని పలువురు నర్సులు వాపోయారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని ఇరాక్ వెళ్లామని, ఇప్పుడు వాటిని తీర్చడమెలాగా అనే బెంగ పట్టుకుందన్నారు. కాగా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన భారతీయ పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టీ ఇరాక్ నుంచి తిరిగొచ్చిన నర్సులందరికీ ఉద్యోగం కల్పిస్తానని కేరళ వార్తపత్రికల్లో ఒక ప్రకటన ఇచ్చారు. ఆయనకు యూఏఈ, ఇండియా, నేపాల్, భూటాన్‌ల్లో ఆసుపత్రులున్నాయి. ఇదిలా ఉండగా, మరో 200 మంది భారతీయులు ఈ రాత్రికి ఇరాక్ ఎయిర్వేస్కు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సైయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. మరో 48 గంటలలో 400 మంది భారతీయులు కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ చేరుకుంటారని చెప్పారు. సోమవారం నాటికి దాదాపు 1200 మంది భారతీయులు ప్రభుత్వ ఖర్చులపై భారత్ చేరుకుంటున్నట్లు ఆయన వివరించారు. -
సిపిఎంపై విరుచుకుపడిన సోనియా
కొచ్చి: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సిపిఎంపై విరుచుకుపడ్డారు. కేరళ రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సదస్సులో ఆమె ప్రసంగించారు. అసంబద్ధ భావజాలంతో తమ లక్ష్యాలను సాధించుకోవడానికి సిపిఎం హింసావాదాన్ని అనుసరిస్తోందని మండిపడ్డారు. ఫలితాలివ్వని వాగ్దానాలు చేస్తున్న కాషాయం పార్టీ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అంతర్గత కుమ్ములాటలను పక్కనబెట్టి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పాటుపడాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. దేశంలో ఐక్యత కోసం కాంగ్రెస్ నిలబడుతున్న సమయంలో, ప్రధాన ప్రతిపక్షం మాత్రం ద్వేషభావాన్ని పెంపొందించి ప్రజల మధ్య విభజన తీసుకురావాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం లేకపోవడంతో పార్లమెంట్లో ఆమోదం పొందడంలేదంటూ విచారం వ్యక్తం చేశారు. -
మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు
కొచ్చి: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ స్టార్ పి.వి. సింధు టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. మహిళల డబుల్స్‌లో రాష్ట్రానికి చెందిన సిక్కి రెడ్డి జోడి కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సింధు 19-21, 21-19, 21-9తో ఆరో సీడ్ సయాలీ గోఖలేపై విజయం సాధించింది. మరో సెమీస్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన 8వ సీడ్ రుత్విక శివాని 19-21, 19-21తో మూడో సీడ్ పి.సి.తులసి (కేరళ) చేతిలో ఓడింది. ఆదివారం జరిగే ఫైనల్లో తులసీతో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. మహిళల డబుల్స్ ఈవెంట్లో మూడో సీడ్ సిక్కిరెడ్డి (ఏపీ) -అపర్ణా బాలన్ జంట 21-12, 21-14తో రెండో సీడ్ మనీషా (ఏపీ)-సంయోగిత గోర్పడే జోడికి షాకిచ్చింది. మరో సెమీస్‌లో మేఘన-రీతుపర్ణా దాస్ (ఆంధ్రప్రదేశ్) జోడి 12-21, 21-18, 15-21తో టాప్ సీడ్ ప్రజక్తా సావంత్- ఆరతి సారా జంట చేతిలో పరాజయం చవిచూసింది. ఫైనల్లో సిక్కిరెడ్డి జోడి... ప్రజక్తా జంటతో తలపడుతుంది. పురుషుల డబుల్స్‌లో హేమ నాగేంద్రబాబు-నందగోపాల్ (ఏపీ) 15-21, 14-21తో అల్విన్ ఫ్రాన్సిస్- అరుణ్ విష్ణు జంట చేతిలో, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-నందగోపాల్ (ఏపీ) జోడి 18-21, 19-21తో ప్రజక్తా- సనావే థామస్ జంట చేతిలో పరాజయం చవిచూశారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ ప్రణయ్ 21-18, 13-21, 16-21తో ఏపీ యువ సంచలనం, టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్‌కు షాకిచ్చాడు. -
క్వార్టర్స్‌లో సింధు, రుత్విక
కొచ్చి: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి.వి.సింధు, రుత్విక శివాని క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సింధు 21-7, 21-6తో మొహితా సచ్‌దేవ్‌పై, రుత్విక శివాని 21-13, 21-12తో రసిక రాజే (మహారాష్ట్ర)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన శ్రీ కృష్ణప్రియ 18-21, 19-21తో శైలి రాణే (ఎయిరిండియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ (ఆంధ్రప్రదేశ్) క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టగా... సిరిల్ వర్మ, రోహిత్ యాదవ్ నిష్ర్కమించారు. రెండో రౌండ్లో శ్రీకాంత్ 21-17, 21-11తో ప్రకాశ్ (కర్ణాటక)పై నెగ్గగా... సిరిల్ వర్మ 13-21, 16-21తో సౌరభ్ వర్మ (మధ్యప్రదేశ్) చేతిలో; రోహిత్ యాదవ్ 18-21, 14-21తో అనూప్ శ్రీధర్ (కర్ణాటక) చేతిలో ఓటమి పాలయ్యారు. -
సబ్సిడీ సిలిండర్లు పెంచే ప్రతిపాదనలేదు
కొచ్చి: సబ్సిడీపై ఇస్తున్న వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్య పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. కేరళలోని పుతేవ్యపె వద్ద నెలకొల్పిన పెట్రోనెట్ ఎల్ఎన్జీ టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం ఇక్కడికి వచ్చిన మొయిలీ ఈ విషయం చెప్పారు. దేశంలో 90 శాతం మంది సబ్సిడీ సిలిండర్లను వినియోగించుకుంటున్నారని, కేవలం పది శాతం మందికి మాత్రమే ఆ పథకం వర్తించడం లేదన్నారు. కాగా, గురువారం ఆర్థిక మంత్రి చిదంబరం ఢిల్లీలో మాట్లాడుతూ.. ప్రస్తుతం సబ్సిడీపై ఏడాదికి ఇస్తున్న 9 సిలిండర్లను 12 పెంచాలని వస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. -
ఇసుక మాఫియాపై మహిళ ఒంటరి పోరాటం
కోచి: కేరళలో ఇసుక మాఫియాపై ఓ మహిళ సడలని పట్టుదలతో ఒంటరిగా పోరాడుతోంది.అక్రమ వ్యాపారులు తమ రాజకీయ పలుకుబడితో ఆమె నోరు మూయించేందుకు ప్రయత్నించినా తల వంచలేదు. ఆమె సాహసాన్ని అభినందించిన కేరళ పారిశ్రామికవేత్త రూ.5 లక్షల పారితోషికం ప్రకటించారు. కన్నూర్‌లోని పుథియువన్గాడికి చెందిన జజీరా(31) తమ ఊరిలో ఇసుక దందాపై ఎలుగెత్తింది. కన్నూరు, తిరువనంతపురంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించి ఫిర్యాదు చేసింది. కేరళ సచివాలయం ఎదుట ఉద్యమించింది. అయితే అక్రమ వ్యాపారులు తమ పలుకుబడితో దీన్ని అణచివేసేందుకు ప్రయత్నించటంతో వేదికను దేశ రాజధానికి మార్చింది. ముగ్గురు చిన్న పిల్లలున్నా ధైర్యంగా ఢిల్లీ నుంచే పోరాడింది. వణికించే చలి సైతం ఆమె పట్టుదల ముందు తలవంచింది. తన ఊరిలో ఇసుక దందాను అరికడతామని ప్రభుత్వం ప్రకటించేవరకూ కేరళ హౌస్ ఎదుట పోరాటం కొనసాగిస్తానని ప్రకటించింది. జజీరాకు కేరళ పారిశ్రామికవేత్త, వీ-గార్డ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్, ఎండీ కోచుసెఫ్ చిట్టిలాపిళై ్ల రూ.5 లక్షల పారితోషికం ప్రకటించారు. -
ద్వయం ‘దంచేసింది’
భారత క్రికెట్‌కు భవిష్యత్ ఆశాకిరణాలుగా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మరోసారి అదరగొట్టారు. చేజింగ్‌లో తనకు తిరుగులేదని కోహ్లి నిరూపించుకోగా అటు రోహిత్ తన భీకర ఫామ్‌ను కొనసాగించాడు. టెస్టుల్లోని పేలవ ప్రదర్శననే కొనసాగించిన వెస్టిండీస్ తొలి వన్డేలో ఘోరంగా ఓడిపోయింది. కొచ్చి: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. టెస్టుల్లో వరుస సెంచరీలతో ఫామ్ చాటుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ (81 బంతుల్లో 72; 8 ఫోర్లు; 1 సిక్స్) మరోసారి మెరవగా... వన్‌డౌన్ ఆటగాడు విరాట్ కోహ్లి (84 బంతుల్లో 86; 9 ఫోర్లు; 2 సిక్స్) స్ఫూర్తిదాయకమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఫలితంగా స్థానిక నెహ్రూ స్టేడియంలో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను స్పిన్నర్లు రవీంద్ర జడేజా (3/37), సురేశ్ రైనా (3/34) కట్టడి చేశారు. దీంతో బ్రేవోసేన 48.5 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్ అయ్యింది. డారెన్ బ్రేవో (77 బంతుల్లో 59; 4 ఫోర్లు; 2 సిక్స్‌లు), ఓపెనర్ చార్లెస్ (34 బంతుల్లో 42; 2 ఫోర్లు; 1 సిక్స్) మాత్రమే రాణించారు. అశ్విన్‌కు రెండు, షమీకి ఓ వికెట్ దక్కింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 35.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 212 పరుగులు చేసి నెగ్గింది. హోల్డర్ రెండు వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం విరాట్ కోహ్లికి దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే 24న విశాఖపట్నంలో జరుగుతుంది. విండీస్ తడబాటు తొలి ఓవర్లోనే పర్యాటక జట్టుకు గట్టి ‘దెబ్బ’ తగిలింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో రెండో బంతికి లేని పరుగు కోసం ప్రయత్నించిన గేల్ నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌కు చేరుకునేందుకు డైవ్ చేయడంతో గాయపడ్డాడు. అంతలోపే బంతిని అందుకున్న భువనేశ్వర్ వికెట్లను పడగొట్టాడు. అయితే మరో ఓపెనర్ చార్లెస్.. శామ్యూల్స్ (35 బంతుల్లో 24; 2 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. బాధ్యతాయుతంగా ఆడుతూ చెత్త బంతులను బాదుతూ పరుగులు సాధించారు. ఆరంభంలో వీరు కుదురుకునేందుకు ప్రాధాన్యమిచ్చినా అనంతరం ఎదురు దాడికి దిగారు. ముఖ్యంగా ఉనాద్కట్ రెండో ఓవర్లో ఇద్దరూ భారీ సిక్స్‌లు కొట్టారు. అలాగే భువనేశ్వర్ బౌలింగ్‌లో చార్లెస్ వరుసగా మూడు ఫోర్లు బాదడంతో స్కోరులో వేగం పెరిగింది. జడేజా రాకతో చార్లెస్ జోరుకు బ్రేక్ పడింది. ఎడమ వైపు డైవ్ చేస్తూ చార్లెస్ కొట్టిన బంతిని పట్టుకోవడంతో రెండో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం సిమ్మన్స్ (40 బంతుల్లో 29; 1 ఫోర్; 1 సిక్స్)తో కలిసి డారెన్ బ్రేవో పోరాడాడు. ఎక్కువగా సింగిల్స్‌కు ప్రాధాన్యమిస్తూ స్కోరును ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. ఈ జోడి మధ్య నాలుగో వికెట్‌కు 65 పరుగులు జత చేరాయి. అశ్విన్, జడేజాల స్పిన్ మ్యాజిక్కు వెస్టిండీస్ చివరి ఆరు వికెట్లు 59 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. కోహ్లి, రోహిత్ జోరు స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన భారత్ నాలుగో ఓవర్లో ఓపెనర్ శిఖర్ ధావన్ (6 బంతుల్లో 5; 1 ఫోర్) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జోడి విండీస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంది. పూర్తిగా బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ఆరంభంలో రోహిత్ నిదానంగా ఆడినా కోహ్లి మాత్రం బౌండరీలతో దూసుకెళ్లాడు. అయితే స్యామీ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాది ఆ వెంటనే నరైన్ బౌలింగ్‌లో సిక్స్‌తో రోహిత్ కూడా టచ్‌లోకి వచ్చాడు. ఈ ఇద్దరూ ఆడుతూ పాడుతూ స్కోరును పెంచారు. 53 బంతుల్లో రోహిత్ అర్ధ సెంచరీ పూర్తి చేయగా అటు కోహ్లి 58 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. అయితే వన్డేల్లో ఐదో శతకం కోసం దూసుకెళుతున్న రోహిత్ డీప్ మిడ్ వికెట్లో సిమ్మన్స్‌కు తేలికైన క్యాచ్ ఇచ్చాడు. దీంతో రెండో వికెట్‌కు 133 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. కోహ్లి వన్డేల్లో వేగంగా 5 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రికార్డు అందుకున్న వెంటనే... తర్వాతి బంతికే హోల్డర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివర్లో ధోని (7 బంతుల్లో 13 నాటౌట్; 3 ఫోర్లు), యువరాజ్ (29 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) మ్యాచ్‌ను ముగించారు. 1 వన్డేల్లో అత్యంత వేగంగా (114 ఇన్నింగ్స్) 5 వేల పరుగులను పూర్తి చేసిన రిచర్డ్స్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లి. స్కోరు వివరాలు: వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (రనౌట్) 0; చార్లెస్ (సి అండ్ బి) జడేజా 42; శామ్యూల్స్ (బి) రైనా 24; డారెన్ బ్రేవో (బి) షమీ 59; సిమ్మన్స్ ఎల్బీడబ్ల్యు (బి) రైనా 29; దేవ్‌నారాయణ్ (బి) రైనా 4; డ్వ్రేన్ బ్రేవో (స్టంప్డ్) ధోని (బి) జడేజా 24; స్యామీ (సి) భువనేశ్వర్ (బి) జడేజా 5; హోల్డర్ నాటౌట్ 16; నరైన్ (సి అండ్ బి) అశ్విన్ 0; రాంపాల్ (సి) ధావన్ (బి) అశ్విన్ 1; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 1, వైడ్లు 6) 7; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 211. వికెట్ల పతనం: 1-0; 2-65; 3-77; 4-142; 5-152; 6-183; 7-187; 8-204; 9-206; 10-211. బౌలింగ్: భువనేశ్వర్ 5-0-26-0; ఉనాద్కట్ 6-0-39-0; షమీ 6-0-28-1; జడేజా 10-0-37-3; రైనా 10-1-34-3; అశ్విన్ 9.5-0-42-2; రోహిత్ 2-0-4-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సిమ్మన్స్ (బి) రాంపాల్ 72; ధావన్ (సి) చార్లెస్ (బి) హోల్డర్ 5; కోహ్లి (సి) నరైన్ (బి) హోల్డర్ 86; యువరాజ్ నాటౌట్ 16; రైనా (సి) హోల్డర్ (బి) నరైన్ 0; ధోని నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు (బైస్ 5, వైడ్లు 15) 20; మొత్తం (35.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1-17; 2-150; 3-192; 4-194. బౌలింగ్: రాంపాల్ 8-0-39-1; హోల్డర్ 8-0-48-2; స్యామీ 2-0-14-0; నరైన్ 10-1-57-1; దేవ్ నారాయణ్ 2-0-15-0; సిమ్మన్స్ 3-0-14-0; డ్వేన్ బ్రేవో 2.2-0-20-0. సిరీస్‌కు గేల్ దూరం వెస్టిండీస్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి వన్డేలో గాయపడిన గేల్ సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు తొలి ఓవర్ సింగిల్ కోసం ప్రయత్నిస్తూ డైవ్ చేస్తూ కిందపడడంతో గేల్ ఎడమ కాలి తొడ కండరాల్లో చీలిక ఏర్పడింది. దీంతో అతడిని స్ట్రెచర్‌పై మైదానం బయటకు తీసుకెళ్లారు. ఎంఆర్ఐ స్కాన్ ద్వారా గాయాన్ని పరీక్షించిన డాక్టర్లు రెండు నుంచి నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ‘రిచర్డ్స్రికార్డును సమం చేసినందుకు సంతోషంగా ఉంది. అయితే నేనెప్పుడూ రికార్డుల కోసం ఆడను. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. కొత్త నిబంధనలు బౌలర్లకు ఇబ్బందిగా ఉన్నా.. ఈ మ్యాచ్‌లో మావాళ్లు రాణించారు.’ - కోహ్లి -
ఇదీ ఏకపక్షమే (నా)!
మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం బ్యాట్స్‌మెన్ సూపర్ ఫామ్‌తో విండీస్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టిపెట్టింది. ఫార్మాట్‌కు అనుగుణంగా తన ఆటతీరును మార్చుకుంటున్న ధోనిసేన మ్యాచ్‌లను ఏకపక్షంగా మార్చేస్తోంది. దీంతో బలమైన ప్రత్యర్థి జట్లు కూడా విజయం ముంగిట బోల్తా కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు విండీస్‌తో ప్రారంభ మయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనైనా పోటీ ఉంటుందో.. మళ్లీ ఏకపక్షమో చూడాలి! కొచ్చి: భారత బ్యాటింగ్ బలానికి... కరీబియన్ ఆల్‌రౌండర్ల జోరుకు ఇప్పుడు వన్డే సిరీస్ వేదిక కానుంది. సచిన్ టెండూల్కర్ ‘ఫేర్వెల్ టెస్టు సిరీస్’ను క్లీన్‌స్వీప్ చేసిన ధోనిసేన వన్డేల్లోనూ అదే అధిపత్యాన్ని కనబర్చాలని భావిస్తుండగా... పోయిన పరువును కొంతైనా కాపాడుకోవాలని బ్రేవోసేన ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య తొలి వన్డే నేడు కొచ్చిలో జరగనుంది. ఓ భావోద్వేగ సిరీస్‌ను ఘనంగా ముగించిన భారత్... ఇప్పుడు క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. టెస్టుల్లో రాణించిన చాలా మంది ఆటగాళ్లు వన్డే జట్టులోనూ ఉండటం వల్ల ఈ సిరీస్‌లోనూ భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఆసీస్‌పై విశేషంగా రాణించిన ఓపెనింగ్ జోడి రోహిత్, ధావన్‌లు కుదురుకుంటే భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదు చేసిన రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం... వన్‌డౌన్‌లో వచ్చే కోహ్లి చివరి వరకు ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలవడం భారత్‌కు కలిసొచ్చే అంశాలు. మిడిలార్డర్లో ధోని మంచి ఫామ్‌లో ఉన్నా... రైనా, యువరాజ్ భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం ఉంది. టెస్టు సిరీస్‌కు దూరమైన ఆల్‌రౌండర్ జడేజా మళ్లీ జట్టులోకి రావడంతో మంచి సమతుల్యం కనబడుతోంది. ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్, షమీలకు తోడుగా ఉనాద్కట్ లేదా మోహిత్ శర్మలలో ఒక్కరికి అవకాశం దక్కొచ్చు. అశ్విన్‌కు తోడుగా పార్ట్‌టైమ్ స్పిన్నర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంతో మిశ్రాకు అవకాశం రాకపోవచ్చు. టెస్టు సిరీస్‌లో ఘోరంగా ఓడిన విండీస్... వన్డేల్లోనైనా ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చాలని ప్రణాళికలు రచిస్తోంది. స్యామీ స్థానంలో ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్ క్రిస్‌గేల్ క్రీజులో నిలబడితే భారత్‌కు కష్టాలు తప్పవు. భారీ హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉన్న చార్లెస్, దేవ్‌నారాయణ్, డారెన్ బ్రేవో, శామ్యూల్స్, రామ్దిన్లపైనే బ్యాటింగ్ బలం ఆధారపడి ఉంది. అయితే వీరిలో నిలకడ లేకపోవడం కాస్త ఆందోళన కలిగించే అంశం. పొలార్డ్ జట్టుకు అందుబాటులో లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. భారత వికెట్లపై పేస్ త్రయం సిమ్మన్స్, స్యామీ, రాంపాల్ ప్రభావం చూపినా... నరైన్ స్పిన్ మ్యాజిక్‌పైనే జట్టు విజయం ఆధారపడి ఉంది. కాబట్టి భారత బ్యాటింగ్ బలానికి, విండీస్ ఆల్‌రౌండర్ల నైపుణ్యానికి ఈ మ్యాచ్ పరీక్షగా నిలవనుంది. జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఉనాద్కట్ / మోహిత్ శర్మ. వెస్టిండీస్: డ్వేన్ బ్రేవో (కెప్టెన్), గేల్, చార్లెస్, డారెన్ బ్రేవో, శామ్యూల్స్, దేవ్‌నారాయణ్, సిమ్మన్స్, స్యామీ, నరైన్, రాంపాల్, హోల్డర్. సచిన్ పెవిలియన్ ఆవిష్కరణ వెస్టిండీస్‌తో తొలి వన్డేకు వేదికైన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన సచిన్ టెండూల్కర్ పెవిలియన్‌ను కెప్టెన్ ధోని బుధవారం ఆవిష్కరించాడు. సచిన్ ఫొటోలు, సంతకంతో కూడిన జెర్సీ, ముంబై ఇండియన్స్ సహచరుల సంతకాలతో కూడిన బ్యాట్, మాస్టర్ 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో మర్చిపోలేని ఇన్నింగ్స్‌కు సంబంధించిన ఫొటోలు ఈ పెవిలియన్‌లో ఏర్పాటు చేశారు. మాస్టర్ భార్య అంజలి, కూతురు సారా, కుమారుడు అర్జున్‌ల ఫొటోలను కూడా ఉంచారు. సచిన్ సంతకం చేసిన బ్యాట్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) వెల్లడించింది. కెరీర్లో సచిన్ చేసిన 100 సెంచరీలకు గుర్తుగా వంద బంతులను ప్రదర్శనకు ఉంచారు. ప్రతి బంతిపై మ్యాచ్ జరిగిన తేదీని రాశారు. పరుగుల వర్షం ? కొచ్చిలో మ్యాచ్‌కు వరుణుడి నుంచి ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ పిచ్‌ను గమనిస్తే పరుగుల వర్షం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్‌లో వన్డేల్లో భారీ స్కోర్లు వస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో బౌలర్ల పరిస్థితి ఎలా ఉండబోతుందో..? -
కొచ్చి చేరుకున్న ఇండియా, వెస్టండీస్ టీమ్‌లు
-
వన్డేల్లోనైనా నిలబడతారా..!
ఒక వైపు భీకర ఫామ్‌లో భారత జట్టు...350కు పైగా పరుగుల విజయలక్ష్యాన్ని కూడా సునాయాసంగా అందుకుంటూ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. మరో వైపు చేవ లేకుండా చేతులెత్తేస్తున్న వెస్టిండీస్ జట్టు...ఒక్క టెస్టు ఇన్నింగ్స్‌లోనూ కనీసం వంద ఓవర్లు ఆడలేని బ్యాట్స్‌మెన్, పేలవ బౌలింగ్‌తో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇలాంటి అంతరాల మధ్య ఇరు జట్లు వన్డే సిరీస్‌లో పోటీ పడనున్నాయి. టెస్టు జట్టుతో పోలిస్తే వన్డే టీమ్‌లో జరిగిన మార్పులు విండీస్‌కు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి. కొచ్చి: యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో భారత జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను ముగించింది. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్లో పడి అభిమానులంతా కొన్నాళ్లు మన కుర్రాళ్ల ప్రతాపాన్ని మరచిపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ వన్డే సిరీస్ పోరుకు ధోని సేన సిద్ధమైంది. బలహీనమైన వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి తమ నంబర్‌వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. కనీసం వన్డేల్లోనైనా చెప్పుకోదగ్గ ఆటతీరుతో పరువు నిలబెట్టుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. గేల్ ఇప్పుడైనా... టెస్టు సిరీస్ ఆడిన వెస్టిండీస్ జట్టులో పలు మార్పులతో వన్డే టీమ్‌ను ఎంపిక చేశారు. టెస్టులతో పోలిస్తే పరిమిత ఓవర్లలో తమను తాము నిరూపించుకున్న కొంత మంది ఆటగాళ్లు జట్టులో ఉండటం విండీస్ బలం. ముఖ్యంగా కెప్టెన్ డ్వేన్ బ్రేవో వన్డేల్లో కీలకమైన ఆల్‌రౌండర్ పాత్ర పోషించనున్నాడు. ధాటిగా ఆడే ఓపెనర్ జాన్సన్ చార్లెస్‌కు కూడా చోటు దక్కింది. ఐపీఎల్ స్టార్లు సునీల్ నరైన్, జాసన్ హోల్డర్లు టీమ్‌లో ఉన్నారు. సీనియర్లలో శామ్యూల్స్, స్యామీ, రామ్‌దిన్ వన్డే టీమ్‌లోనూ స్థానాలు నిలబెట్టుకోగలిగారు. అయితే వెస్టిండీస్ విజయావకాశాలు మరో సారి స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్‌పైనే ఆధార పడి ఉన్నాయి. టి20 లీగ్‌ల్లో విధ్వంసం సృష్టించే గేల్ సొంత జట్టుకు ఎప్పుడూ ఉపయోగపడలేదనే అపవాదు ఉంది. ఈ సారి టెస్టు సిరీస్‌తో అది మరో సారి నిరూపితం అయింది. మరి వన్డేల్లో ఏం చేస్తాడో చూడాలి. అందరూ స్టార్లే... చాలా కాలంగా వన్డేల్లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న నంబర్‌వన్ భారత్ కోణంలో చూస్తే ఈ సిరీస్ కూడా జట్టు ఖాతాలోకి పడేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ ధోని స్ఫూర్తిదాయక నాయకత్వంలో యువ ఆటగాళ్లందరూ ఇప్పటికే తమ సత్తా చాటుకున్నారు. రోహిత్ శర్మ, ధావన్, కోహ్లి, రైనాలతో జట్టు బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. టెస్టుల్లో లేని జడేజా వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆసీస్‌తో ఘోరంగా విఫలమైన యువరాజ్‌కు మాత్రం ఇది పరీక్షా సమయం. విండీస్ కనీస ప్రతిఘటన ఇస్తుందా...లేక భారత్‌కు కొత్త రికార్డులు అప్పజెపుతుందా అన్నది ఆసక్తికరం. ‘తాగి ఉన్నారేమో’ మరో వైపు టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ ఆటతీరుపై ఆ దేశ దిగ్గజం, మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ తీవ్ర విమర్శలు చేశారు. టి20 మత్తులో జట్టు ఉందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ...‘ఇంకా దానిని మత్తు అనుకుందామా...నాకు తెలిసి వారు టి20లను తాగి అందులోనే మునిగిపోయారేమో’ అని లాయిడ్ అన్నారు. సచిన్ పెవిలియన్... కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని పెవిలియన్‌కు సచిన్ టెండూల్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. తొలి వన్డే సందర్భంగా బుధవారం ఈ స్టాండ్‌ను భారత కెప్టెన్ ధోని ఆవిష్కరిస్తాడు. మరో వైపు మ్యాచ్‌లో ఆడేందుకు వెస్టిండీస్ టీమ్ మంగళవారం ఇక్కడికి చేరుకుంది. కేరళ సాంప్రదాయ మోహినీ అట్టం, కథాకళి నృత్యాలతో వారికి ఆహ్వానం లభించింది. వన్డే సిరీస్ షెడ్యూల్ తొలి వన్డే నవంబర్ 21 కొచ్చి రెండో వన్డే నవంబర్ 24 విశాఖపట్నం మూడో వన్డే నవంబర్ 27 కాన్పూర్ రెండేళ్ల క్రితం ఇరు జట్ల మధ్య భారత్‌లో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 4-1తో విండీస్‌ను చిత్తు చేసింది. -
ఏడాదిన్నర మనవరాలిని చితకబాదిన తాత
కొచ్చి: పిల్లలు దైవంతో సమానం అనేది నానుడి. పసి ప్రాయంలో వారు చేసే ఏ అల్లరైనా అందంగానే ఉంటుంది. అలాగే ఒక్కొసారి పిల్లలు చేసే అల్లరి అద్దూ అదుపూ లేకుండా ఉంటుంది. ఇంకా ఎక్కువైతే మురిపెంగా బుజ్జగిస్తాం. అలాకాకుండా పిల్లలను చితకబాది విచక్షణ కోల్పోతే చేసేదేముంది. ఇటువంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. తల్లి విదేశాల్లో, తండ్రి కొచ్చిలోని కొట్టరకారాలో ఉద్యోగాలు చేయాల్సి రావడంతో ఆ పాపను తాత దగ్గరు వదిలి పెట్టారు. ఇలా కొన్ని రోజులు బాగానే గడిచాయి. ఈ క్రమంలో పాప ఏదో సందర్భంలో మారాం చేయడంతో ఆ తాతకు కోపం చిర్రెత్తుకొచ్చింది..ఇంకేముంది..తన దగ్గర ఉన్న కొట్టడం అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. పాపను చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆ పాపను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పాప ఐసీయూలో చికిత్స పొందుతోంది. విచక్షణ కోల్పోయిన ఆ తాతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఐఎన్ఎస్ సునయన యుద్ధనౌక జలప్రవేశం
భారత నౌకాదళంలోని రెండో నేవెల్ ఆఫ్ షోర్ నిఘా నౌక ఐఎన్ఎస్ సునయన మంగళవారం జలప్రవేశం చేసింది. సదరన్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సతీష్ సోని దీన్ని జలప్రవేశం చేయించారు. సదరన్ నావల్ కమాండ్ నియంత్రణలో ఉండే ఈ నౌకను గోవా షిప్‌యార్డు లిమిటెడ్‌లో రూపొందించారు. సమద్రంలో నిఘా అవసరాలను ఇది సమర్థంగా తీరుస్తుంది. తద్వారా భారత నౌకాదళ అవసరాలు చాలావరకు నెరవేరుతాయి. ప్రధానంగా తీరప్రాంతంలో నిఘా అవసరాలు, సముద్రంలో భద్రతాపరమైన చర్యలకు ఉపయోగపడేలా ఈ యుద్ధనౌకను తీర్చిదిద్దారు. ఒక యుద్ధనౌకను తయారుచేయాలంటే దాని డిజైనింగ్ దగ్గరనుంచి వివిధరకాల పరికరాలను సమగ్రంగా అందులో అమర్చడం, ఆ తర్వాత సముద్ర వాతావరణానికి అనుగుణంగా ఉండేలా నౌకను తీర్చిదిద్దడం.. ఇవన్నీ చాలా క్లిష్టమైన చర్యలని వైస్ అడ్మిరల్ సోని చెప్పారు. ఐఎన్ఎస్ సునయనలో ప్రధానాంశాలు.. 1) ఈ యుద్ధనౌకలో రెండు డీజిల్ ఇంజన్లున్నాయి. 2) ఇది గంటకు 25 నాటికల్ మైళ్లకంటే అధిక వేగంతో వెళ్తుంది. 3) దీనికి ఆటోమేటిక్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. 4) అత్యాధునిక నేవిగేషన్ సిస్టమ్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ సపోర్ట్ సిస్టమ్ ఉన్నాయి. 5) ఇది హెలికాప్టర్‌ను కూడా తీసుకెళ్లగలదు. 6) ఇందులో 8 మంది ఆఫీసర్లు, 108 మంది సెయిలర్లు ఉంటారు. -
అత్యాచారం కేసులో డాక్టరే దోషి
చికిత్స చేయించుకోడానికి వచ్చిన ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన సంఘటనలో మను మైంబిల్లీ గోపాల్ అనే భారత సంతతి వైద్యుడిని ఆస్ట్రేలియా కోర్టు దోషీగా నిర్ధారించింది. తానెలాంటి తప్పూ చేయలేదని తప్పించుకోవాలని చూసినా కోర్టు ఆయన వాదనల్ని నమ్మలేదు. గోపాల్‌ను రిమాండ్‌కు పంపి, తీర్పును ఈ నెల 26కు వాయిదా వేసింది. కేరళలోని కొచ్చికి చెందిన గోపాల్ ఆస్ట్రేలియాలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో సన్బరీ క్లినిక్‌కు కడుపునొప్పితో వచ్చిన ఇద్దరు మహిళలపై ఆయన అత్యాచారం చేశారని కేసు నమోదైంది. మార్చి ఒకటో తేదీన భారత్ వెళ్లే విమానం ఎక్కేందుకు మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేచి చూస్తుండగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కేవలం తన లైంగిక వాంఛలు తీర్చుకోడానికే గోపాల్ ఆ ఇద్దరు మహిళలకు వైద్య పరీక్షలు చేయాలనుకున్నట్లు ప్రాసిక్యూటర్ లెస్లీ టేలర్ కోర్టులో వాదించారు. నలుగురు బిడ్డల తల్లి అయిన రెండో బాధితురాలిని పరీక్ష చేసే సమయంలో డాక్టర్ గోపాల్ చాలా అసభ్యంగా మాట్లాడారని, అది సరికాదని టేలర్ చెప్పారు. కాగా గోపాల్ భార్యా బిడ్డలు భారతదేశంలో ఉంటున్నారు. -
నేనే తప్పు చేయలేదు: శ్రీశాంత్
కొచ్చి: బోర్డు తనపై జీవితకాల నిషేధం విధించడం తనను తీవ్రంగా కలచివేసిందని వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్ తెలిపాడు. తన జీవితంలో ఇదే పెద్ద కుదుపు అని అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో తానేతప్పు చేయలేదని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని పేర్కొన్నాడు. తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఏనాడు, ఏ ఒక్కరూ తనకు మద్దతుగా నిలువలేదన్నాడు. కనీసం ఇలాంటి గడ్డు స్థితిలో తనకు అండగా నిలుస్తారని ఆశించినా... అలాంటి సాంత్వనేదీ దక్కలేదని శ్రీ వాపోయాడు. ‘భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం నన్ను బాధించింది. ఈ మొత్తం ఉదంతంలో నన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో తెలీదు. ఏదేమైనా నిర్దోషిగా బయటపడతాననే నమ్మకముంది. తప్పకుండా తిరిగి జట్టులోకి వస్తాను’ అని అన్నాడు. తాను జైల్లో లేనని, బయటే ఉన్నానని... ఇదొక్కటే తనకు ఊరటనిచ్చే విషయమన్నాడు.