కోర్టులో మానసిక రోగి హల్చల్ | Mentally ill man climbs atop court complex; brought down | Sakshi
Sakshi News home page

కోర్టులో మానసిక రోగి హల్చల్

Published Sat, Jun 20 2015 3:16 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

కొచ్చిలోని కోర్టు కాంప్లెక్సులో ఓ మానసిక రోగి నాలుగు గంటల పాటు హల్చల్ చేశాడు. కోర్టు భవనం మీదికి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

కొచ్చి: కేరళలోని కొచ్చి కోర్టు కాంప్లెక్సులో ఓ మానసిక రోగి నాలుగు గంటల పాటు హల్చల్ చేశాడు. కోర్టు భవనం మీదికి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని కిందికి దించడానికి నానా తంటాలు పడ్డారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతన్ని కిందకు రమ్మని ఎంత విజ్ఞప్తి చేసినా వినలేదు. పైగా మరింత గందరగోళం సృష్టించాడు.   చుట్టుపక్కల ఉన్న భవనాలపైకి దూకుతూ, భవనంపై ఉన్న పెంకులను పోలీసుల మీదికి, జనాల మీదికి విసిరాడు. ఈ  సందర్భంగా 4 గంటల పాటు ఉద్రిక్త వాతావరణం  చోటుచేసుకుంది. దీంతో పెద్దఎత్తున జనం గుమిగూడారు.  4 గంటల తరువాత ఎట్టకేలకు పోలీసులు అతడిని కిందికి దించడంలో సఫలమయ్యారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో కొద్ది సేపు విధులకు ఆటంకం కలిగింది.


హిందీ మాట్లాడుతున్న అతగాడిని అదుపులోకి తీసుకున్నామని కొ చ్చి సెంట్రల్ పోలీసు అధికారి తెలిపారు. అతని కోర్టు ముందు హాజరు పర్చిన అనంతరం మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అతడి వివరాలను చెప్పడానికి  మాత్రం నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement