ఐదు నెలల చిన్నారిని తల్లే చిదిమేసింది.. | Mother Ends Five-month-old Baby Life Due To Fights Between Wife And Husband In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఐదు నెలల చిన్నారిని తల్లే చిదిమేసింది..

Published Tue, Mar 18 2025 8:10 AM | Last Updated on Tue, Mar 18 2025 10:58 AM

five-month-old baby ends life in visakhapatnam

దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి హత్య

ఆరిలోవ(విశాఖ): భార్యాభర్తల మధ్య గొడవలు, ఒకరిపై మరొకరి అనుమా­నాలకు ఓ చిన్నారి బలైపోయింది. భర్త అనుమానం వేధింపులను తట్టుకో­లేని ఆ తల్లి బిడ్డ ప్రాణం తీసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆరిలోవ సీఐ కథనం ప్రకారం జీవీఎంసీ 12వ వార్డు పరి«ధి పెదగదిలి దరి సింహగిరి కాలనీకి చెందిన గొర్లె వెంకట­రమణకు శిరీషతో 2013లో వివా­హమైంది. వెంకటరమణ ఏయూలో సీనియర్‌ అసిస్టెంట్‌. 

శిరీష హౌస్‌­వైఫ్‌. సుమారు 11 ఏళ్లు తర్వాత వారికి పాప పుట్టింది. ఆ తర్వాత వారి మధ్య గొడవలు మొదల­య్యా­యి. వెంకటరమణ భార్యపై అను­మానంతో బెడ్‌ రూమ్‌లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. ఈ నేప­థ్యంలో శిరీష  తన ఐదు నెలల కుమా­ర్తెతో ఈనెల 13న జోడుగు­ళ్లుపాలెం బీచ్‌కు వెళ్లింది. అక్కడ తెన్నే­టి పార్కు దిగువున బంగ్లాదేశ్‌ నౌక చాటుకు వెళ్లి కుమార్తెను సము­ద్రం నీటిలో ముంచేసింది. కొంతసేపటి తర్వాత భర్తకు ఫోన్‌ చేసి కుమార్తె నీటిలో మునిగిపోయి చని­పో­యిందని.. తాను కూడా చనిపో­తా­నంది.  

వెంటనే భర్త బీచ్‌కు చేరు­కుని పాపను ప్రైవేట్‌ ఆస్ప­త్రికి తర­లించారు. అప్పటికే మృతి చెంది­నట్టు వైద్యులు నిర్ధారించారు. శిరీషనే బిడ్డను  హత్య చేసి ఉంటుందన్న అను­మానంతో ఆరిలోవ పోలీ సుల­కు భర్త ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసి తమదైన శైలిలో విచా­రించారు. దీంతో పాపను తానే చంపి­నట్టు శిరీషా ఒప్పుకొంది. ఇంటి వద్దే తలదిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసి.. జోడుగుళ్లుపాలెం బీచ్‌లో నీటిలో ముంచేసింది. అనంతరం తా­ను కూడా సముద్రంలో దూకి ఆత్మ­హత్య చేసుకోవాలని భావించింది. ఇంతలో అక్కడ సందర్శకులు కొందరు చూడటంతో ఆత్మహత్య వీలుప­డలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement