![Newlywed Woman Ends Life In Visakhapatnam](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/Marriage3.jpg.webp?itok=8kja4s0M)
సాక్షి, విశాఖ జిల్లా: గోపాలపట్నంలో నవ వధువు అనుమానాస్పదంగా మృతిచెందింది. అశ్లీల వీడియోలకు బానిసగా మారిన భర్త నాగేంద్ర.. వికృత ప్రవర్తనకు భార్య బలైంది. భర్త చేష్టలు భరించలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. నాగేంద్ర సైకోలాగా మారి లైంగికంగా వేధించాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు.
మితిమీరిన కోరికలు, శృతిమించిన అసహజ శృంగార వాంఛలతో నాగేంద్ర వేధించేవాడు. నాగేంద్రలో కామం వికృత రూపం దాల్చడంతో టార్చర్‌ను భార్య భరించలేకపోయింది. భర్తను మార్చే ప్రయత్నం చేసినా కానీ మార్పు రాలేదు. భర్త వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రుల వద్ద కూడా బాధితురాలు వాపోయింది. నిత్యం భర్త పెట్టే వేధింపులు భరించలేక చివరికి ఆ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది.
తన భర్త నాగేంద్రబాబు అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్ చేస్తున్నాడని కొన్ని రోజులుగా తమకు చెబుతోందన్నారు కుటుంబ సభ్యులు అన్నారు. గత రాత్రి కూడా ఫోన్ చేసిందని.. రేపు వచ్చి మాట్లాడతామని చెప్పామని.. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని.. హత్య అంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: ఒకే దెబ్బతో చంపడం ఎలా?.. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి..
Comments
Please login to add a commentAdd a comment