Newlyweds
-
వేట కొడవళ్లతో నరుక్కున్న నవ దంపతులు!
కేజీఎఫ్/కోలారు: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ పెళ్లయిన రోజే ఏకాంతంగా ఉన్న సమయంలో ఇద్దరూ ఒకరిని ఒకరు వేట కొడవళ్లతో నరుక్కుని ప్రాణాలు తీసుకున్నారు. కర్ణాటకలోని కోలారు జిల్లా కేజీఎఫ్ పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కేజీఎఫ్ తాలూకా బైనేహళ్లికి చెందిన శ్రీనివాసులు, లక్ష్మి దంపతుల కుమార్తె లిఖితశ్రీ(19), చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని సంతూరు నివాసి మునియప్ప కుమారుడు నవీన్‌కుమార్(27)లు ప్రేమించుకున్నారు.పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. లిఖితశ్రీ ఇంటర్ పూర్తి చేయగా, నవీన్ దుస్తుల షాపు నిర్వహిస్తున్నాడు. కాగా, బుధవారం ఉదయం కర్ణాటక చండరసనహళ్లిలోని నవీన్‌కుమార్ సోదరి ఇంట్లో వారిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు సంతోషంగా పాల్గొన్నారు. సాయంత్రం అదే గ్రామంలో ఉన్న నవీన్‌కుమార్ పెదనాన్న ఇంటికి కొత్త జంట వెళ్లింది. ఒక గదిలో విశ్రాంతి తీసుకునే సమయంలో నవ దంపతులు గొడవ పడ్డారు, గట్టిగా కేకలు వేయడంతో బంధువులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు.ఇద్దరూ ఆ గదిలో ఉన్న వేట కొడవళ్లతో దాడి చేసుకున్నారని అనుమానాలున్నాయి. వధువు లిఖితశ్రీ ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే మరణించింది. తీవ్ర గాయాలతో ఉన్న నవీన్ కుమార్‌ను అంబులెన్స్‌లో కోలారు ఆస్పత్రికి, అనంతరం బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించగా.. గురువారం ఉదయం ప్రాణాలు విడిచాడు. ఇలా కొత్త జంట కొన్ని గంటలకే ఈ లోకాన్ని వీడింది. జిల్లా ఎస్పీ శాంతరాజు, డీఎస్పీ పాండురంగ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నవదంపతులు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టమని ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు తెలిపారు. -
నవ దంపతుల నేత్రదానం
నెల్లూరు(అర్బన్): రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నవ దంపతుల నేత్రాలను వారి కుటుంబ సభ్యులు దానం చేశారు. నెల్లూరు నగరానికి చెందిన కొప్పల ప్రశాంత్ – పుష్పలకు వివాహమై కేవలం నెల రోజులు కావస్తోంది. గురువారం జాతీయ రహదారిపై చెముడుగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ దంపతులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ తమ బిడ్డల నేత్రాలను దానం చేసింది. ఏసీఎస్ఆర్ ప్రభుత్వ ఆస్పత్రి ఐ బ్యాంక్ సిబ్బంది వారి నేత్రాలను సేకరించి కుటుంబ సభ్యులకు నేత్రదాన సర్టిఫికెట్ అందించారు. శుక్రవారం నేత్ర సేకరణ టెక్నీషియన్ లాలేష్, నేత్రదాన మోటివేటర్ బాలాజీసింగ్ మాట్లాడుతూ ఇరువురి నేత్రదానం ద్వారా మరో నలుగురు అంధులకు చూపు లభిస్తుందన్నారు. నేత్రదానం చేయదలచిన వారు 99481 64781, 93471 11033 ఫోన్‌నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. సీతాలక్ష్మి సైతం నెల్లూరులోని బారకాసు ప్రాంతానికి చెందిన సీతాలక్ష్మి(54) గురువారం రాత్రి గుండెపోటుతో మృతిచెందగా కుటుంబసభ్యుల అనుమతితో నెల్లూరు ప్రగతి లయన్స్ క్లబ్ సహకారంతో సిబ్బంది ఆమె నేత్రాలను సేకరించారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులకు నేత్ర దాన సర్టిఫికెట్ అందించారు. -
వధూవరులను ఆశీర్వదించిన గవర్నర్ నజీర్
మంగళగిరి(గుంటూరు జిల్లా): జస్టిస్ కుంభజడల మన్మథరావు కుమారుడు కౌషిక్ వివాహ రిసెప్షన్‌కు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. గుంటూరు జిల్లా చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో కౌషిక్ వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి జరిగింది. వధువు ఉదయ, వరుడు కౌషిక్లను గవర్నర్ ఆశీర్వదించారు. కాగా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: రెట్టించిన వృద్ధి -
బైక్ ను ఢికొన్న ట్రాక్టర్.. పెళ్లి అయిన నాలుగు రోజులకే నవ దంపతులు మృతి
-
నూతన వధువరుల వినూత్న ఆలోచన.. కుటుంబాలను ఒప్పించి..
నిడదవోలు(తూర్పుగోదావరి): పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. తన పెళ్లి సందర్భంగా అవయవ దానంపై అందరి దృష్టి పడేలా చేసి అవగాహన కల్పించాలనుకున్నాడు. కాబోయే భార్యతో ఈ విషయం పంచుకున్నాడు. ఆమె సరే అంది. ఇంకేముంది తమతోపాటు ఓ సామాజిక బాధ్యతకూ పెళ్లిరోజున పెద్దపీట వేసేందుకు ముహూర్తం పెట్టుకున్నాడు. ఇరువురూ పెద్దలు ముందుకు రావడంతో 60 మంది అవయవదాన హామీ పత్రాలను ఇచ్చే ఘట్టానికి నిడదవోలులో వివాహ వేడుక వేదిక కానుంది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన సతీశ్‌కుమార్ చిన్నప్పటి నుంచి పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాడు. దొమ్మేరు గ్రామానికి చెందిన యువతి సజీవ రాణితో ఇటీవల ఇతనికి పెళ్లి కుదిరింది. వివాహం రోజున సతీశ్ కుమార్ తనతో పాటు బంధువులు, స్నేహితులు కలసి ఇచ్చే అవయవ దాన హమీ పత్రాలే తన వివాహానికి పెద్ద బహుమానమని చెప్పాడు. వారంతా ఇందుకు అంగీకరించారు. కాబోయే జీవిత భాగస్వామి కూడా సతీష్ ఆలోచనను మెచ్చుకుంది. తాను కూడా అవయవదాన హామీ పత్రం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. నిడదవోలులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్యాణ మండపంలో గురువారం ఈ నవ దంపతుల వివాహ వేడుక జరుగుతుంది. 60 మంది అవయవదాన హామీ పత్రాలు ఇవ్వడానికి ముందుకు రావడంపై సావిత్రీబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ గూడూరు సీతామహలక్ష్మి (విశాఖపట్నం) సంతోషం వ్యక్తం చేశారు. ఆమె స్వయంగా పెళ్లికి హాజరై అవయవదాన హామీ పత్రాలు స్వీకరించనున్నారు. పెళ్లి పత్రికలో అవయవదానం చేయండి–ప్రాణదాతలు కండి అని ముద్రించడం అందరినీ ఆలోచింపజేసింది. అవయవదాన ఆవశ్యకతను విస్త్రతంగా ప్రచారం చేస్తున్న కొత్త దంపతులను పలువురు అభినందిస్తున్నారు. చదవండి: కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం యనమల.. ఆ లీకుల వెనుక అసలు వ్యూహం ఇదే.. ఓ బాలుడి మరణం కదిలించింది వేలివెన్నులో పదేళ్ల బాలుడు కిడ్నీ పనిచేయక చనిపోయాడు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స దశలో బాధిత బాలుడికి కిడ్ని దానం చేయడానకి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ బాలుడు చనిపోయాడు. ఈ విషయం తెలిసి చాలా బాధ పడ్డాను. అప్పటి నుంచి అవయవదానం అవసరాన్ని గ్రహించాను. చేతనైన మేర దీనిపై ప్రచారం చేస్తున్నాను. నాపెళ్లి శుభలేఖలో కూడా ఇదే అంశాన్ని నినాదంగా ప్రచురించాను. కాబోయే భార్య సజీవరాణికి చెప్పగానే పెద్ద మనసుతో అంగీకరించింది. ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు నా స్నేహితులు 60 మంది అవయవదాన హామీపత్రాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. – సతీశ్‌కుమార్, వేలివెన్ను, ఉండ్రాజవరం మండలం ఆయన ఆలోచన నచ్చింది నిశ్చితార్థానికి ముందు సతీశ్‌కుమార్ అవయవదానం గురించి చెప్పారు. ఇంత మంచి సేవా కార్యక్రమానికి వివాహం వేదిక కావడం సంతోషం అనిపించింది. అవయవదానంపై మా కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించారు. వారంతా అవయవదానానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో అవయవదానంపై ఇద్దరం కలిసి ప్రచారం చేస్తాం. – సజీవరాణి, దొమ్మేరు, కొవ్వూరు మండలం -
విషాదం మిగిల్చిన ఫోటోషూట్.. పెళ్లైన రెండు వారాలకే..
కేరళలో విషాదం చోటుచేసుకుంది. పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోజీకోడ్ జిల్లా కోజీకోడ్ ప్రాంతంలో రెజిన్‌లాల్ అనే యువకుడికి కనికా అనే యువతితో మార్చి 14న వివాహం జరిగింది. అయితే పెళ్లి బిజీ షెడ్యూల్ కారణంగా ఏప్రిల్ 4న పోస్ట్ వెడ్డింగ్ షూట్ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇందుకు కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక కుట్టియాడి నది వద్దకు వెళ్లారు. బంధువులు నది ఒడ్డున ఉండగా.. నవదంపతులిద్దరూ నదిలో దిగి ఫోటో షూట్ చేస్తున్నారు. ఇంతలో నదీప్రవాహం పెరగడంతో ఇద్దరు కొట్టుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరిని ఒడ్డుకి చేర్చగా.. అప్పటికే రెజిన్‌లాల్ మృతి చెందాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వధువుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కనికా కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. ఇక ఈఘటనపై కోజికోడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పెళ్ళైన రెండు వారాలకే వరుడు చనిపోవడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. -
పెళ్లయ్యాక మూడు రాత్రులు బ్రహ్మచర్యం పాటించాలి
వివాహమైన పిదప, వధూవరులు మూడు రాత్రులు బ్రహ్మచర్యం పాటించాలి. ఆ తర్వాత, పెద్దలను ఆహ్వానించి, అక్కడ గణపతి పూజ, అష్టదిక్పాలక పూజ, ఇంటి ఇలవేల్పుల పూజలు చేసి, సభలోని పెద్దలను కూడా పూజించి, వారి ఆశీర్వాదం తీసుకోవాలి. దీనినే సదస్యం అంటారు. ఆ తర్వాత, అగ్ని, ప్రజాపతి మొదలగు దేవతలకు శేష హోమం చెయ్యాలి. తర్వాత, నాకబలి ఆచరించాలి. ఈ నాకబలే లోకవాడుకలో నాగవల్లి అయింది. ఇందులో సకలదేవతలకు బలులు అర్పిస్తారు. తర్వాత శేష హోమం చేయగా మిగిలిన ఆజ్యాన్ని వధూవరుల శిరస్సుపై కొద్దిగా ఉంచి ఆశీర్వదించాలి. తదుపరి, కొద్దిగా ఆజ్యాన్ని వరుడు తన చేతితో తీసుకుని, వధూవరుల హృదయాలను స్పృశించాలి. దీనినే హృదయ సంసర్గం అంటారు. ఇందులో వధూవరుల హృదయాలు రెండూ ఒక అనుబంధంగా పెనవేసుకుని ఒకరికొకరుగా జీవించాలని దేవతలను ఈ విధంగా కోరుకుంటారు. ‘విశ్వేదేవతలు మన హృదయాలను స్నేహంతో పెనవేయుదురుగాక, జలం, వాయువు, ధాత మన హృదయాలను కలిపి ఉంచుదురుగాక. సరస్వతి మనకు అనుకూల సంభాషణ చేయించునుగాక. పుత్ర, సంతాన కారకుడగు త్వష్ట ప్రజాపతి నా శరీరమునందు ప్రవేశించి, మనం బహు పుత్రవంతులమగునట్లు మమ్ములను సంతానవంతులను చేయునుగాక. అర్యముడు మమ్ములను స్నేహితులుగానే వుండునట్లు చేయును గాక. ఓ వధూ..! నీవు సౌభాగ్యవతివై, నా గృహమందు నివసించు. మా రెండు పాదాలు గల, నాలుగు పాదాలుగల జంతువులు సుఖంగా వుండునుగాక’. తర్వాత, వివాహమైన నాల్గవరోజు రాత్రి వధూవరుల కంకణాలను విప్పుతారు. తదుపరి, అక్కడవున్నవారిలో పెద్ద దంపతులకు, నూతన వధూవరులు తాంబూలమిచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత కన్యాదాత, తన కుమార్తెను, మెట్టినింటివారి వావి వరుసలతో వారిని తనకు పరిచయం చేస్తూ, వధువు చేతిని పాలలో ముంచి ఆ చేతిని వరుని చేతిలో పెట్టి మెట్టినింటివారికి అప్పగిస్తాడు. దీనినే అప్పగింతలు అంటారు. ఇంతటితో వివాహ క్రతువు ముగిసి, వరుడు సర్వధర్మాలకు ఆలంబనమైన గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. – ఆచార్య తియ్యబిండి కామేశ్వర రావు చదవండి: షూట్ చేస్తే..రంగు పడుద్ది! కాస్త శ్రద్ధ పెడితే కేంద్ర కొలువు మీ సొంతం! -
పెళ్లికూతురి నిర్వాకం, పెళ్లైన 18 రోజులకే..
భోపాల్ : మనసులు కలిశాయో, లేదో చూడకుండానే ఇద్దరికీ పెళ్లి చేశారు. అమ్మాయిని అత్తారింటికి సాగనంపారు. కానీ ఆమె మనసు కట్టుకున్న భర్త మీదకు పోలేదు, అంతకు ముందు తన చేయి పట్టుకుని ఊసులాడిన ప్రియుడి దగ్గరే ఆగిపోయింది. గుండెల్లో ప్రియుడి జ్ఞాపకాలను మోస్తూ మరొకరితో ఉండలేననుకుంది. అలా అనుకుందో, లేదో.. పెళ్లైన 18 రోజులకే చెప్పా పెట్టకుండా ప్రియుడితో పారిపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్లో జరిగిన ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూర్తి రైక్వార్ అనే 20 ఏళ్ల యువతికి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాహుల్ అనే వ్యక్తితో డిసెంబర్ 6న వివాహమైంది. కానీ అప్పటికే ఆమె భజ్జు యాదవ్ అనే అబ్బాయితో పీకల్లోతు ప్రేమలో ఉంది. పెళ్లయినా కూడా అతడి తలపుల్లో నుంచి బయటకు రాలేకపోయింది. మరోవైపు పెళ్లి తర్వాత జరిగే తంతు కోసం నూతన వధువు పుట్టింటికి పంపించారు. (చదవండి: ఆ కోరికే విద్యార్థులను లేచిపోయేలా చేసింది...) అక్కడ అన్ని కార్యక్రమాలు ముగించుకున్న ఆమె డిసెంబర్ 24న మెట్టినింటికి తిరుగు పయనమైంది. ఇక దొరికిందే ఛాన్సని భావించిన సదరు యువతి తన మెడలో మూడు ముళ్లు పడ్డాయన్న విషయాన్ని మర్చిపోయి ప్రియుడితో పరారైంది. లక్షలు ఖరీదు చేసే బంగారు నగలు, డబ్బును కూడా వెంటపెట్టుకుని ఉడాయించింది. దీనిపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తన భార్య దారిలోనే ఎవరితోనే జంప్ అయిందని తెలుసుకున్న భర్త అమ్మాయి ఇంటికి వెళ్లి నానా రభస చేశాడట. ఈ విషయం గురించి వధువు తండ్రి రామ్‌పాల్ మాట్లాడుతూ.. కూతురు కోసం అల్లుడు గాలిస్తున్నాడని తెలిపాడు. ఆమె రూ.5 లక్షలు విలువ చేసే నగలతో పాటు, రూ.20 వేలు పట్టుకెళ్లిందని పేర్కొన్నాడు. (చదవండి: చికెన్ లేదన్నాడని ఎంత పని చేశారు..) -
హైకోర్టును ఆశ్రయిస్తే రూ.10 వేల ఫైన్!
చండీగఢ్: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట రక్షణ కల్పించాలని పంజాబ్, హరియాణ హైకోర్టును మంగళవారం ఆశ్రయించగా.. వారికి అనూహ్యంగా రూ.10 వేల జరిమానా పడింది. పెళ్లి ఫొటోల్లో నూతన వధూవరులు, వివాహానికి హాజరైన బంధువులు ముఖానికి మాస్క్‌లు ధరించక పోవడాన్ని కోర్టు గమనించింది. కోవిడ్ నిబంధనల్ని పాటించనందుకు వారికి పెనాల్టీ విధిస్తున్నట్టు న్యాయమూర్తి హరిపాల్ వర్మ తెలిపారు. 15 రోజుల్లో జరిమానా మొత్తాన్ని హోషియాపూర్ డీసీకి అందజేయాలని ఆదేశించారు. ఆ మొత్తాన్ని హోషియాపూర్‌లో మాస్కుల పంపిణీకి వెచ్చించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దాంతోపాటు.. నూతన వధూవరుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని గురదాస్‌పూర్ ఎస్ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, అనూహ్యంగా తమకు జరిమానా పండటంతో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తొలుత ఆందోళన చెందారు. అయితే, కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎస్ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు. (చదవండి: చిన్న అబద్ధం, పెద్ద శిక్ష పడే అవకాశం!) -
కొత్త జంటకు కరోనా; గ్రామానికి సీల్
లక్నో: పెళ్లి చేసుకున్న జంటకు కరోనా షాకిచ్చింది. తాజా పరీక్షల్లో వధూవరులిద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలడంతో కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. ఆ కొత్త జంటను రాజస్థాన్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వివాహానికి వేదికగా నిలిచిన అజంఘడ్‌లోని చత్తర్‌పూర్ గ్రామానికి అధికారులు సీల్ వేశారు. వివరాలు.. రాజస్థాన్‌కు చెందిన యువకుడు ఉత్తర ప్రదేశ్‌లోని చత్తర్‌పూర్ యువతిని మార్చి 23న వివాహమాడాడు. దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల వారు అదే గ్రామంలో చిక్కుకుపోగా ఏప్రిల్ 14న అక్కడ నుంచి రాజస్థాన్‌కు పయనమయ్యారు. (లాక్డౌన్ నుంచి నిష్క్రమణ ఎలా?) నాలుగు రోజులు ప్రయాణించిన అనంతరం వారు రాజస్థాన్ సరిహద్దుకు చేరుకున్నారు. అయితే సరిహద్దు సిబ్బంది వారిని అక్కడే ఆపేసి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పెళ్లి జరిగిన చత్తర్‌పూర్ గ్రామాన్ని మూసివేశారు. వారి కుటుంబీకులను క్వారంటైన్‌కు తరలించారు. గ్రామస్థులకు స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు ఆ ప్రాంతాన్నంతటినీ శానిటైజింగ్ చేయనున్నారు. (విమానం ఎక్కాలంటే మాస్క్‌లు ఉండాల్సిందే) -
కీచక భర్త: నవవధువుపై సామూహిక అత్యాచారం
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకాల కారణంగా ఓ నవవధువు సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన కురుక్షేత్రలోని బాబైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. రెండు వారాల క్రితం ( సెప్టెంబర్ 12) మఖేష్, అమేధి (పేర్లు మార్చాం)లకు వివాహమైంది. అయితే, శోభనం రాత్రి గదిలోకి వెళ్లిన అమేధి(22)కి ఆమె భర్త పాలలో మత్తు మందు కలిపి తాగించాడు. అమేధి స్పృహ కోల్పోయిన తర్వాత ముఖేష్, అతని సోదరుడు, బావ, మరో నలుగురు తాంత్రికులు యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. రెండు రోజుల నరకయాతన అనంతరం యువతి అక్కడి నుంచి బయటపడిందని పోలీసులు వెల్లడించారు. బాధితురాలు తన తండ్రితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి కురుక్షేత్ర మహిళా పోలీస్‌స్టేషన్‌కు కేసు బదిలీ అయిందనీ, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని స్టేషన్ ఆఫీసర్ శీలవతి తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆస్పత్రికి తరలించామని అన్నారు. కాగా, ఈ ఘటనలో పోలీసులు ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం గమనార్హం. కాగా, అత్తమామలు, ఆడపడుచు, తాంత్రిక పూజల కోసం వచ్చిన నలుగురు దుండగులు యవతిపై అఘాయిత్యం జరగడానికి ముఖ్య కారణంగా పోలీసులు భావిస్తున్నారు. -
నేను కెవిన్లా చనిపోవాలనుకోవడం లేదు..
-
‘మమ్మల్ని చంపితే మీకేం వస్తుంది..?’
తిరువనంతపురం : ‘మమ్మల్ని చంపితే మీకేం వస్తుందం’టూ ఓ నవ వధువు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. వివరాలు.. కేరళకు చెందిన హ్యారిసన్ (క్రిస్టియన్), షహానా (ముస్లిం)లు రెండు రోజుల క్రితం పెద్దలకు చెప్పకుండా వివాహం చేసుకున్నారు. వివాహానంతరం భార్యతో కలిసి దిగిన ఫొటోను హ్యారిసన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. కాసేపటి తర్వాత.. మతాంతర వివాహం చేసుకున్న కారణంగా తమను చంపుతామంటూ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ హ్యారిసన్ వీడియోను పోస్ట్ చేశాడు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను కెవిన్లా చనిపోవాలనుకోవడం లేదు.. పరువు హత్యల గురించి మాట్లాడుతూ... ‘మేము రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాం. అప్పటి నుంచి మాకు బెదిరింపులు మొదలయ్యాయి. ఓ తీవ్రవాద భావాలు గల సంస్థ(ఎస్డీపీఐ) చంపేస్తామని బెదరిస్తోంది. నాతో పాటు మా అమ్మానాన్నల్ని కూడా చంపేస్తారట. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలన్నా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏదేమైనా కెవిన్(ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా కొన్ని రోజుల క్రితం హత్యకు గురైన వ్యక్తి)లా జీవితాన్ని కోల్పోలేనంటూ’ హ్యారిసన్ పేర్కొన్నాడు. కుల, మతాలకు అతీతంగా.. షహానా మాట్లాడుతూ.. ‘ప్రేమ, పెళ్లి అనేది మనసుకు సంబంధించినవి. మేము మా కులం, మతం గురించి ఆలోచించలేదు. కానీ నా కుటుంబ సభ్యులే ఇప్పుడు నన్ను, నా భర్త కుటుంబాన్ని చంపేస్తామంటున్నారు. కానీ జీవితాంతం అతడితో కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. మమ్మల్ని చంపితే మీకేం వస్తుందంటూ’ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఈ వీడియో గురించి గానీ, ఆ జంట గురించి తమకు ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు. -
బిడ్డ చివరి క్షణాలు సేవకోసం..!
జీవించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి.. జీవితకాలంలో ఎదురయ్యే ప్రతి విషయాన్నీ తేలిగ్గా తీసుకోడానికి మనోనిబ్బరం కలిగి ఉండాలి. అదే విషయాన్ని నమ్మారు ఆ నూతన దంపతులు. తమకు పుట్టిన బిడ్డ కొన్ని గంటల్లోనే మరణిస్తాడని తెలిసినా కృశించిపోలేదు. తమ ఆవేదన మరెవ్వరికీ కలగకుండా ఉండాలంటే తాము నిరాశ చెందకూడదని నిర్ణయించుకున్నారు. వెంటనే తమ బిడ్డతో చివరి క్షణాల్లో గడిపిన ప్రతి అనుభవాన్ని రికార్డు చేశారు. ఆస్పత్రిలోని ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో సేవలు పెంచేందుకు కావలసిన విరాళాల సేకరణ కోసం ఆ వీడియోను వినియోగించారు. సిడ్నీకి చెందిన దంపతులు నాన్సీ, ఛార్లీ మెక్లీన్ తమకు బిడ్డ పుట్టగానే ఎంతో సంతోషించారు. కానీ.. ఆ తర్వాత అతడు అత్యంత అరుదైన నాన్ కెటోటిక్ హైపర్ గ్లైసినేమియాతో జన్మించాడని తెలిసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శరీరం అమెనో యాసిడ్లను తయారుచేయడాన్ని నిరోధించే ఈ పరిస్థితి దాపురించడంతో ఎడిసన్ ఊపిరి తీసుకునేందుకు కూడా వెంటిలేటర్ పైనే ఆధారపడాల్సిన స్థితికి చేరుకున్నాడు. అయితే ఎవ్వరూ తమ బిడ్డ చనిపోవాలని కోరుకోరు. కానీ అతడి స్థితిని తెలుసుకున్న తల్లిదండ్రులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వెంటిలేటర్ తీస్తే బిడ్డ చనిపోతాడని తెలిసినా ఎడిసన్ పుట్టిన ఐదు రోజుల తర్వాత తల్లిదండ్రులు చార్లీ, మెక్లీన్ వెంటిలేటర్ పై ఊపిరి అందించడాన్ని నిలిపివేశారు. ఏం చేసినా చనిపోతాడని తెలిసిన తర్వాత.. సొంత ఊపిరితో ఎంతకాలం బతుకుతాడో అంతే బతకనిచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ తమ బిడ్డ జన్మ మరెందరికో సహాయపడాలని నిర్థారించుకున్న ఆజంట.. గత సంవత్సరంలో తమ పెళ్లిఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ జేమ్స్ ను పిలిపించారు. ఎడిసన్ చివరి క్షణాల్లో తమతో గడిపిన క్షణాలను కెమెరాలో బంధించారు. అవే చిత్రాలను స్థానిక మిడ్‌వైవ్స్ అండ్ నియోనాటల్ ఇన్సెంటివ్ కేర్ సర్వీస్ లో మరిన్ని సేవలను పెంచేందుకు విరాళాల కోసం వినియోగించారు. క్రౌడ్ ఫండింగ్ పేరున ఓ పేజీని ఎడిసన్ జ్ఞాపకార్థం ప్రారంభించిన ఛార్లీ, మెక్లీన్.. తమ బిడ్డ తమకు మంచి పాఠం నేర్పించాడంటూ పేజీలో రాసుకున్నారు. ''మీరు ప్రేమించేవారిని ఆనందంగా ఉంచేందుకు ప్రతిక్షణం వినియోగించండి, ప్రతిక్షణాన్ని చివరి క్షణంగా భావించి ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించండి... మనకోసం ఏ క్షణం ఆగదు, ఉన్న సమయాన్ని వృధా చేయకుండా మీరు ఆనందంగా ఉండేందుకు, ఇతరులను సంతోషంగా ఉంచేందుకు వినియోగించండి'' అంటూ సూచించారు. తమ బిడ్డతో సంబంధం ఏడు రోజులే అయినా ఏడుజన్మల బంధంగా భావించామని, ఆ సమయాన్ని ప్రేమ కోసమే వినియోగించామని అన్నారు. తమ ముద్దుల బిడ్డ జ్ఞాపకార్థం 20 వేల డాలర్ల వరకూ ఫండ్స్ సేకరించి రాయల్ ఉమెన్స్ హాస్పిటల్ మిడ్ వైవ్స్, నియోనాటల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ కు అందించాలన్న ఆశయంతోనే ఈ ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 6700 డాలర్ల వరకూ సేకరించినట్లు వివరించారు.