నవ దంపతుల నేత్రదానం | - | Sakshi
Sakshi News home page

నవ దంపతుల నేత్రదానం

Published Sat, Mar 9 2024 9:05 AM | Last Updated on Sat, Mar 9 2024 9:31 AM

నేత్రదాతలు కొప్పల ప్రశాంత్‌ – పుష్పల పెళ్లి ఫొటో (ఫైల్‌)  - Sakshi

నేత్రదాతలు కొప్పల ప్రశాంత్‌ – పుష్పల పెళ్లి ఫొటో (ఫైల్‌)

నెల్లూరు(అర్బన్‌): రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నవ దంపతుల నేత్రాలను వారి కుటుంబ సభ్యులు దానం చేశారు. నెల్లూరు నగరానికి చెందిన కొప్పల ప్రశాంత్‌ – పుష్పలకు వివాహమై కేవలం నెల రోజులు కావస్తోంది. గురువారం జాతీయ రహదారిపై చెముడుగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ దంపతులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ తమ బిడ్డల నేత్రాలను దానం చేసింది.

ఏసీఎస్‌ఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రి ఐ బ్యాంక్‌ సిబ్బంది వారి నేత్రాలను సేకరించి కుటుంబ సభ్యులకు నేత్రదాన సర్టిఫికెట్‌ అందించారు. శుక్రవారం నేత్ర సేకరణ టెక్నీషియన్‌ లాలేష్‌, నేత్రదాన మోటివేటర్‌ బాలాజీసింగ్‌ మాట్లాడుతూ ఇరువురి నేత్రదానం ద్వారా మరో నలుగురు అంధులకు చూపు లభిస్తుందన్నారు. నేత్రదానం చేయదలచిన వారు 99481 64781, 93471 11033 ఫోన్‌నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

సీతాలక్ష్మి సైతం
నెల్లూరులోని బారకాసు ప్రాంతానికి చెందిన సీతాలక్ష్మి(54) గురువారం రాత్రి గుండెపోటుతో మృతిచెందగా కుటుంబసభ్యుల అనుమతితో నెల్లూరు ప్రగతి లయన్స్‌ క్లబ్‌ సహకారంతో సిబ్బంది ఆమె నేత్రాలను సేకరించారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులకు నేత్ర దాన సర్టిఫికెట్‌ అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement