
సత్తుపల్లిటౌన్/రూరల్: ఇంకా పచ్చని పందిరి తీయలేదు.. భాజాభజంత్రీల శబ్దం చెవులను వీడలేదు.. ఇంతలోనే నూతన వధూవరులతో కలిసి దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో వధువు తల్లి మృతి చెందగా.. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తుపల్లి మండలం బేతుపల్లి వద్ద శుక్రవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లికి చెందిన వ్యాపారి అడపా రాజేంద్రప్రసాద్ – పుష్పావతి ఏకైక కుమార్తె హర్షిణి వివాహం ఈనెల 16న జరిగింది.
నూతన వధూవరులతో కలిసి అందరూ అశ్వారావుపేట సమీపాన శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామి కల్యాణానికి వెళ్లారు. ఆతర్వాత నూతన దంపతులను జంగారెడ్డిగూడెంలోని అత్తగారి ఇంటికి సాగనంపి.. హర్షిణి తల్లిదండ్రులు పుష్పావతి(55), రాజేంద్రప్రసాద్ కారులో సత్తుపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమాన బేతుపల్లి సమీపంలో వీరి కారు – ఎదురుగా వచ్చిన పాలవ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో పుష్పావతి, రాజేంద్రప్రసాద్‌కు గాయాలు కాగా 108 వాహనంలో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చేసరికి పుష్పావతి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ విషయం తెలియడంతో జంగారెడ్డిగూడెం నుంచి వచ్చిన హర్షిణి తల్లి మృతదేహంపై పడి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కాగా, పలువురు వ్యాపారులు, స్థానికులు సైతం పుష్పావతి మృతదేహం వద్ద నివాలులరి్పంచారు. ఈమేరకు సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment