Khammam
-
బీమా జ్యువెలరీ షోరూం ప్రారంభించిన రీతూ వర్మ
-
చెరువులోకి దూకిన వృద్ధ దంపతులు
-
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో విజయ్ మృతి
-
ఖమ్మం మార్కెట్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి,ఖమ్మంజిల్లా: ఖమ్మం వ్యవసాయ పత్తి మార్కెట్లో బుధవారం(జనవరి15) అగ్ని ప్రమాదం జరిగింది. మార్కెట్ యార్డ్ షెడ్డులో పత్తిబస్తాలు తగలబడ్డాయి. ఓ లాట్ పత్తి బస్తాలు దగ్ధమయ్యాయి. మంటలు ఎగిసిపడుతుండడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఖరీదు చేసిన పత్తి మంటల్లో కాలి పోవడంతో వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కాగా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో పత్తి దగ్ధంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. మంటలను తక్షణమే అదుపులోకి తేవాలని అధికారులకు తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమిషనర్,మార్కెట్ అధికారులతో మాట్లాడి తుమ్మల వివరాలు తెలుసుకున్నారు. -
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే, రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు.ఖమ్మంలోని కూసుమంచిలో మంత్రి పొంగులేటి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ..‘పేదవారి కల పది సంవత్సరాల్లో అలాగే నిలిచిపోయింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు. అనేక హామీలు ఇచ్చాము. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పెద్దలు కొల్లగొట్టారు. ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం చిత్త శుద్దితో ఉంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం ఇస్తుంది. డిసెంబర్ 13న మోడల్ హౌస్‌కి శంకుస్థాపన చేసుకుని సంక్రాంతి రోజున ప్రారంభించుకుంటున్నాం.అర్హులైన ప్రతీ పేదవారికి నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అనేక మంది అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళు పూర్తి చేసింది లక్ష లోపు ఇళ్లు మాత్రమే. పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. దళారుల పాత్ర ఉండదు.. ఇందిరమ్మ కమిటీ సమక్షంలోనే ఎంపిక జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం పేదవారికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.రైతులకు రైతు భరోసా నిబంధనలు లేకుండా 12వేలు ఇస్తాం. పది సంవత్సరాల్లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం. నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. మీ దీవెనలతో మళ్లీ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
వ్యవసాయ కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి
-
ఖమ్మం నగరంలో దొంగల హల్ చల్
-
అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?.. బీఆర్ఎస్కు డిప్యూటీ సీఎం సవాల్
సాక్షి, ఖమ్మం జిల్లా: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ, మంచి పోషక విలువలు కలిగిన ఆహారం పిల్లలకు అందిస్తున్నామని తెలిపారు. నూతనంగా పెంచిన డైట్ ఛార్జీల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం పడుతుందన్నారు.‘‘రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు 2014 నాటికి 72450 కోట్ల రూపాయలు.. ప్రభుత్వంతో పాటు కొన్ని కార్పొరేట్ బ్యాంక్‌ల ద్వారా అప్పులు చేసింది. 5893 కోట్లు రాష్ట్ర విభజన జరిగే నాటికి అప్పు ఉంటే అవి 95 వేల కోట్లకు పెరిగింది. పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల 23 వేల కోట్లు చేసింది. అది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. మేము కూడ అప్పులు చేశామని అంటున్నారు. మీరు చేసింది తినేందుకు, మేము చేసేది అప్పు కట్టేందుకు’’ అంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.మా ప్రభుత్వం ఏర్పడ్డాక 50 వేల కోట్లు.. మేము అప్పు వడ్డీ కలిపి 66 వేల 722 కోట్లు చెల్లించాం. 2014 రాష్ట్ర విభజన జరిగే నాటికి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు 6 వేల 400 కోట్లు ఉండేది. ఇంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి, తగుదునమ్మా అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మీద అరుస్తా ఉన్నారు. 10 ఏళ్లు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టి అన్నంలో పురుగులు వంటివి వచ్చాయి. మళ్ళీ తిరిగి రెసిడెన్షియల్ స్కూల్లో టాయిలెట్స్ సరిగా లేవని మాట్లాడుతున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నది మీరే కదా?’’ అంటూ భట్టి ప్రశ్నించారు.‘‘మేము కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి కాకముందే 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 66 వేల కోట్ల రూపాయలు అప్పు కడుతూ రైతుల అప్పు కడుతున్నాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని వేల కోట్లు రైతుల అప్పు కట్టలేదు. రైతు భరోసా 7 వేల 625 కోట్లు కల్పించాం. రైతు బీమా కట్టాం. 1500 రూపాయలు రైతు బీమా ప్రభుత్వం కట్టింది. ఆయిల్ ఫోం కి 40 కోట్లు విడుదల చేశాం. 30 వేల కోట్ల రూపాయలు రైతులకు మేము బోనస్ కాకుండా రైతుల కోసం మేము డిసెంబర్ నుండి వాటికి నేరుగా ఖర్చు పెట్టాం’’ అని భట్టి విక్రమార్క వివరించారు.పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ పంట నష్టపోయిన రైతులను పట్టించుకోలేదు. రైతుల పట్ల ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పని చేస్తుంది. భూమిలేని నిరుపేదల గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. డిసెంబర్ 28వ తేదీన మొదటి ఇన్స్టాల్మెంట్ ఇస్తుంది. రైతుల పక్షాన, వ్యవసాయ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. సీఎం పైన, ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు ప్రచురిస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. 56 వేల మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందించాం. ఇంకా 22 వేల కోట్ల బడ్జెట్‌తో 3500 ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ప్రతిపక్ష పార్టీ వాస్తవాలను అవాస్తవాలుగా చూపించే ప్రయత్నం చేస్తుంది’’ అని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. -
అమెరికాలో కాల్పులు.. ఖమ్మం విద్యార్థి మృతి
-
అమెరికాలో కాల్పులు.. ఖమ్మం యువకుడి మృతి
సాక్షి,ఖమ్మంజిల్లా: తెలంగాణకు చెందిన యువకుడిపై అమెరికాలో దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు సాయితేజ అక్కడికక్కడే మృతిచెందాడు.సాయితేజ అమెరికాకు ఎమ్మెస్ చేయడానికి వెళ్లాడు. సాయితేజ మృతితో రామన్నపేటలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని ఖమ్మం తీసుకురావడానికి అధికారులు కృషి చేస్తున్నారు. -
తప్పులు చేసి నీతులు చెబుతారా?: బీఆర్ఎస్పై రేణుకా చౌదరి ఫైర్
సాక్షి, ఖమ్మం జిల్లా: బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మండిపడ్డారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొండలు.. గుట్టలు మింగిన వాళ్లు ఈ రోజు నీతులు చెబుతున్నారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఓ మాట మాట్లాడుతున్నారని.. సీఎంని, మంత్రులను కావాలనే విమర్శిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.ఈ రోజు హరీశ్‌రావు 8 గంటలకే మార్కెట్‌కి వెళ్లి పర్యటన చేయడం హాస్యాస్పదం. వ్యవసాయం గురించి తెలిసివాళ్లకు రైతులు ఏ సమయానికి మార్కెట్‌కు వస్తారో తెలుస్తుంది. మీకు ప్రాజెక్టులు, వాటి మీద వచ్చే కమిషన్ల గురించి మాత్రమే తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్రాహారాలు మాని పని చేస్తున్నారు. రైతులకు బేడీలు వేసిన వాళ్లు రైతుల గురించి మాట్లాడుతున్నారు.’’ అంటూ రేణుకా చౌదరి ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. ఆ అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకొస్తుంది. ఉద్యోగులకు మొదటి తేదీ నాడే జీతాలు చెల్లిస్తోంది. సుజాతనగర్లో నకిలీ విత్తనాలు రైతులను నష్ట పరిచిన కంపెనీ యాజమాన్యంతో వారందరికీ పరిహారం చెల్లించేలా చేశాం. కొత్తగూడెం విమానాశ్రయం ప్రాసెస్ నడుస్తుంది. త్వరలోనే ఎయిర్పోర్ట్ రాబోతుంది’’ అని రేణుకా చౌదరి తెలిపారు. -
ఖమ్మం పత్తి మార్కెట్ లో పత్తి రైతులతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ
-
బోనస్‌ను బోగస్ చేసిన కాంగ్రెస్ సర్కార్: హరీష్ రావు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు సాయం చేయలేని ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒక్కటేనని ఘాటు విమర్శలు చేశారు. అలాగే, ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు గురువారం ఉదయం ఖమ్మంలోని పత్తి మార్కెట్‌ను సందర్శించారు. ఈ క్రమంలో రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, హరీష్ మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్లో ఒకటి ఖమ్మం పత్తి మార్కెట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఆ బోనస్‌ను బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం మద్దతు ధర వచ్చే పరిస్థితి కూడా లేదు.మార్కెట్ సెక్రటరీ ఇచ్చిన లెక్కల ప్రకారం రూ.6,500 మద్దతు ధర దాటడం లేదు. అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కనీసం మద్దతు ధరకు కూడా పండించలేని పరిస్థితి ఉంది. రూ.500 బోనస్ దేవుడే ఎరుగు, కానీ మద్దతు ధరకు వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నారు. రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది?. రైతులను ఆదుకోలేదు, వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, ఏ ఒక్క వర్గాన్నీ ఆదుకోలేదు. పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పత్తి మద్దతు ధర రూ.7,500 ఉండాల్సి ఉండగా, కేవలం రూ.6,500 మాత్రమే రైతులకు అందిస్తున్నారు. ఇవి మార్కెట్ యార్డ్ సెక్రటరీ ఇచ్చిన లెక్కలే. ఖమ్మం పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి.శంకర్ రమాదేవి అనే రైతులు ఎనిమిది ఎకరాల్లో పత్తి పండిస్తే, కనీసం ఐదు క్వింటాళ్ల పంట కూడా రాలేదని, వచ్చిన దానికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021లో రూ.11,000కు పత్తి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు సగానికి సగం పత్తి ధర పడిపోయింది? ఇది దళారుల దోపిడీ వల్లే. రూ.7,520 మద్దతు ధరను పత్తి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు కనీసం రూ.500 బోనస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దళారులు రూ.6,500కు పత్తి కొనుగోలు చేసి, సీసీఐ కేంద్రాలకు రూ.7,500కు అమ్ముతున్నారు.మిర్చి రైతులను కూడా ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసింది. గత సంవత్సరం రూ.23,000 మద్దతు ధర వస్తే, ఈసారి రూ.13,000 కూడా రావడం లేదు. మాయమాటలు చెప్పి రైతులను నట్టేట ముంచడం మంచిది కాదు. రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు. రూ.15,000 రైతు భరోసాను ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. రూ.15,000 కౌలు రైతులకు ఇస్తామని ఇవ్వలేదు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.ఒకరిపై ఒకరు పైచేయి కోసం పాకులాటమే తప్ప, ప్రజా సమస్యల కోసం పనిచేయడం లేదు. నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు ఖమ్మం జిల్లాలో పండితే, ఇప్పటివరకు 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఒక రైతుకైనా వడ్లకు బోనస్ వచ్చిందా?. సకాలంలో మిల్లులు అనుసంధానం చేయకపోవడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం దళారుల పాలైంది. సీసీఐ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం పెట్టామని చెబుతున్నా, వాస్తవానికి సీసీఐ కేంద్రాలు కనబడటం లేదు.ముఖ్యమంత్రి పత్తి కొనుగోలుపై సమీక్ష చేయడం లేదు. మద్యం అమ్మకాలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.. కానీ పత్తి, వరి కొనుగోళ్లపై సమీక్ష ఎందుకు చేయడం లేదు. మద్దతు ధరకు ధాన్యం కొనకపోతే, ఎవరికీ మెమోలు జారీ చేయడం లేదు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారేమో?. ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అన్ని రకాల పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
ఆమె.. ఆయనలో సగభాగం.. భర్తకు పునర్జన్మనిచ్చిన భార్య
సాక్షి, ఖమ్మం జిల్లా: వివాహం జన్మజన్మల అనుబంధమని, చెరోసగంగా భార్యాభర్తలు జీవనం సాగించడం అన్యోన్య దాంపత్యమని పెద్దలు చెబుతారు. ఈ తరహాలోనే ఓ మహిళ తన భర్తను బతికించుకునేందుకు కాలేయదానం చేసి ఆయనలో సగభాగంగా మారడమే కాదు.. కలకాలం కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని పెళ్లి రోజున చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి నిలిచినట్లయింది.రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను ఖమ్మంలోని ఏపీజీవీబీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బీ చివరి సంవత్సరం చదువుతుండగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కామెర్లు సోకగా కాలేయం సమస్య ఎదురైందని వైద్యులు గుర్తించారు.ఆపై హైదరాబాద్‌లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. అంతేకాక వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీనును బతికిస్తుందని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో కాలేయదానం చేసే వారి కోసం ఆరా తీస్తుండగా లావణ్యే ముందుకొచి్చంది. తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంలో పరీక్షలు చేసిన వైద్యులు సరిపోతుందని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్య లివర్ నుంచి 65శాతం మేర తీసిన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఈనెల 16న శస్త్రచికిత్స ద్వారా శ్రీనుకు అమర్చారు. ప్రస్తుతం దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉండగా కోలుకుంటున్నారని కుటుంబీకులు తెలిపారు.భర్తకు లివర్ దానం చేసి బతికించుకున్న భార్యఖమ్మం - పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను లివర్ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా లివర్ మార్చాల్సిందేనని వైద్యులు చెప్పారు. కానీ, ఎంత వెతికినా డోనర్ దొరక్కపోవడంతో అతని భార్య లావణ్య ముందుకొచ్చింది. ఆమె… pic.twitter.com/Jh0mA4IyaM— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024 -
తల్లి చెంతకు చేరేలోపే.. గుండెపోటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి
భారత్‌లో గుండె పోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఈ మాయదారి గుండెపోటు బలితీసుకుంటుంది. తాజాగా అభం శుభం తెలియని ఓ చిన్నారి సైతం గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. సాక్షి, ఖమ్మం: అప్పటివరకు తల్లిదండ్రులతో ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారి గుండెపోటుతో మృతిచెందింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెంకు చెందిన కుర్రా వినోద్, లావణ్య దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ప్రహర్షిక ఉంది. సోమవారం తల్లి లావణ్య గ్రూప్-3 పరీక్ష రాసేందుకు వెళ్లగా.. చిన్నారి నానమ్మ, తాతయ్యల వద్ద ఆడుకుంటూ ఉంది. సాయంత్రం ఇంటి తిరిగి వస్తున్న తల్లిని చూసి ప్రహర్షిక ఒక్కసారిగా ఆమె వైపు పరుగెత్తుకు వెళ్లింది. తల్లి కూడా రా..రా.. అంటూ కూతుర్ని చూస్తూ చేతులు చాచింది. కానీ అమ్మను చేరక ముందే ఆ పాప ఒక్కసారిగా కిందపడిపోయింది. తల్లి ఏమైందని ప్రశ్నించగా ఛాతీ వద్ద నొప్పి వస్తోందని చెప్పి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబసభ్యులు చిన్నారికి స్థానిక ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ల ముందే మృతి చెందడంలో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు .చిన్నారి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని వైద్యులు తెలిపారు. -
ఖమ్మం: అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం.. విద్యార్థికి గుండు కొట్టించి...
సాక్షి, ఖమ్మం: ఖమ్మం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మెడికల్ విద్యార్థి హెయిర్ స్టయిల్‌పై వివాదం తలెత్తింది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాలలో ఓ విద్యార్థి భిన్నంగా హెయిర్ కట్ చేయించుకున్నాడని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. దీనిపై విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు.సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ కావడం గమనార్హం. ఖమ్మం మెడికల్ కళాశాలలో ఈ ఏడాది చేరిన ములుగుకు చెందిన విద్యార్థి ఒకరు చైనా దేశస్తుల మాదిరి కటింగ్ చేయించుకున్నాడు. దీన్ని గమనించిన సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తూ ఇలా వ్యవహరించొద్దని సూచిచడంతో ఆ విద్యార్థి సెలూన్‌కి వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు.కాగా, ఈ విషయం బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్‌గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జన్)కు తెలియడంతో ఆగ్రహించిన ఆయన విద్యార్థిని సెలూను తీసుకెళ్లి ఏకంగా గుండు గీయించాడు. దీంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హాస్టల్ విధుల నుంచి తప్పించారు. కాగా, ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ఘటనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లడమే కాక విచారణకు ఫోర్‌మెన్ కమిటీని నియమించామని తెలిపారు. -
విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్
ఖమ్మం వైద్యవిభాగం/ నల్లగొండ టౌన్: ఖమ్మం మెడికల్ కళాశాలలో ఓ విద్యార్థి భిన్నంగా హెయిర్ కట్ చేయించుకున్నాడని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. దీనిపై విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. ఇక నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనలో విద్యార్థులతో పాటు జూనియర్ డాక్టర్‌ను సైతం సస్పెండ్ చేశారు. వివరాలు.. ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థికి ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ కావడం గమనార్హం. ఖమ్మం మెడికల్ కళాశాలలో ఈ ఏడాది చేరిన ములుగుకు చెందిన విద్యార్థి ఒకరు చైనా దేశస్తుల మాదిరి కటింగ్ చేయించుకున్నాడు. దీన్ని గమనించిన సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తూ ఇలా వ్యవహరించొద్దని సూచించడంతో ఆ విద్యార్థి సెలూన్‌కు వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు. కాగా, ఈ విషయం బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్‌గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జన్)కు తెలియడంతో ఆగ్రహించిన ఆయన విద్యార్థిని సెలూన్‌కు తీసుకెళ్లి ఏకంగా గుండు గీయించాడు. దీంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హాస్టల్ విధుల నుంచి తప్పించారు. కాగా, ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ఘటనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లడమే కాక విచారణకు ఫోర్‌మెన్ కమిటీని నియమించామని తెలిపారు. నల్లగొండ కాలేజీలో ర్యాగింగ్ కలకలం!నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ విద్యార్థినులను ర్యాగింగ్ చేశారనే ఆరోపణలతో ముగ్గురు సీనియర్ విద్యార్థులను, ఒక జూనియర్ డాక్టర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. సీనియర్ మెడికోలతో పాటు జూనియర్ డాక్టర్ కూడా విద్యార్థినులను ర్యాగింగ్ పేరుతో ఇబ్బందులకు గురిచేశారన్న ఫిర్యాదుతో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం విద్యార్థిని నెల రోజులు, ఇద్దరు నాలుగో సంవత్సరం విద్యార్థులను ఆరు నెలలు, ఒక జూనియర్ డాక్టర్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేసినట్లు కాలేజీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే మొదటిసారి ర్యాగింగ్ విషయం బహిర్గతం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ర్యాగింగ్ విషయంపై కళాశాల ప్రిన్సిపల్‌ను వివరణ కోరడానికి ‘సాక్షి’ప్రయత్నించగా స్పందించలేదు. -
సర్కారు దవాఖానలో మందులు లేక ప్రజల ఇక్కట్లు
-
అందరి బంధువయా...‘వల్లభి’ రామయ్య!
ముదిగొండ: సామాజిక కట్టుబాట్లు కఠినంగా ఉన్న రోజుల్లో దళితులకు ఆలయ ప్రవేశం ఉండేది కాదు. కుల వివక్షత అడుగడుగునా తాండవించేది. అలాంటి రోజుల్లో దళితులు దేవుడిని తమ గుండెల్లో పెట్టుకుని రామాలయం నిర్మాణం చేపట్టారు. ఆ ఆలయానికి 90 ఏళ్ల నుంచి వారసత్వంగా ఇప్పటికీ దళితుడే పూజారిగా కొనసాగుతుండటం విశేషం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ రామచంద్రస్వామికి నిత్య పూజలు జరుగుతుండగా.. కులమతాలకతీకంగా అంతా దర్శించుకుని తరిస్తున్నారు.ఆ అవమాన భారంతోనే.. ఏళ్ల క్రితం గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఉత్సవాలు జరుగుతుండగా కొందరు దళితులు గోడ పైనుంచి చూస్తుండగా అగ్రకుల పెద్దలు అవమానించారు. దీన్ని ఆత్మగౌరవ సమస్యగా భావించిన దళితులు రామాలయం నిర్మాణానికి ప్రతిన బూనారు. స్థల సేకరణ, ఆపై దేవాలయ నిర్మాణం చకచకా జరగగా.. దళితవాడలో సద్గురు బోధనానంద బోధనల ప్రభావంతో ఆధ్యాత్మిక చింతన అలవర్చుకున్న వంగూరి రామస్వామి తొలినాళ్లలో పూజారిగా బాధ్యతలు స్వీకరించారు. మొదట రాములవారి చిత్ర పటంతో నిత్యం పూజలు చేసేవారు. చిన్నగా నిర్మించిన ఆలయంలో పూజలు చేస్తున్న దళితులను అగ్రకులాల వారు హేళన చేసేవారు.దీంతో అగ్రకులాలు – దళితుల నడుమ వివాదం రాజుకుంది. అప్పటికే రామాలయ నిర్మాణం పేరుతో ఆత్మగౌరవ జెండాను ఎగురవేసిన దళితులు అగ్రకులాలపై సై అంటే సై అన్నారు. దీన్ని తట్టుకోలేక అగ్రకులాల వారు దాడులకు పాల్పడటంతో పలువురు గ్రామాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది.ఈ విషయం తెలిసిన గాంధేయవాది బన్సాలీ వల్లభి గ్రామానికి చేరుకుని దళితులు నిర్మించిన రామాలయంలోనే దీక్షకు పూనుకున్నారు. ఈ వార్త బాహ్య ప్రపంచానికి తెలియడంతో ఆనాటి ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోగా ఇరువర్గాల మధ్య రాజీ అనంతరం బన్సాలీ దీక్ష విరమించారు. భారమైనా బాధ్యతగా.. దళితులు రెక్కలు ముక్కలు చేసుకుని పొద్దస్తమానం కష్టపడితే కుటుంబాలను పోషించుకోవడమే కష్టం. అయినప్పటికీ కుటుంబ బాగోగుల కంటే మిన్నగా రాముడి కోసం, రాముడే శ్వాసగా వంగూరి రామస్వామి కుటుంబం జీవిస్తోంది. ఎంత కష్టమైనా.. తాము తిన్నా తినకపోయినా రామయ్యకు నిత్యపూజలు చేయడం, నైవేద్యం సమర్పించడాన్ని ఆనవాయితీగా మార్చుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కుటుంబ పోషణ మాటేమో కానీ.. వీరే కుటుంబానికి భారంగా మారినా రాముడి సేవలోనే జీవిస్తున్నారని చెప్పాలి.వైఎస్సార్ హయాంలో ధూపదీప నైవేద్యంఆలయంలో ఏటా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. వంగూరి రామస్వామి నిత్యం ధూప, దీప నైవేద్యాలు సమర్పిస్తూనే పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేవారు. వంగూరి రామస్వామి మరణానంతరం 1988లో ఆయన కుమారుడు చిన ముత్తయ్య పూజారిగా బాధ్యతలు స్వీకరించారు. 2021 వరకు ఆయన కొనసాగగా అనారోగ్య కారణాలతో చిన ముత్తయ్య మరణించాక ఆయన మనవడు అనంతరాములు పూజారిగా బాధ్యతలు స్వీకరించి ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈ క్రమాన అనంతరాములు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యాన అర్చకత్వం, పౌరోహిత్యంలో శిక్షణ పొందడం విశేషం. కాగా, ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో పలు ఆలయాల నిర్వహణ, అర్చకుల భృతి కోసం ధూప, దీప నైవేద్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో వల్లభి ఆలయానికి కూడా చోటు దక్కగా నెలనెలా నిధులు అందుతున్నాయి.రూ.40 లక్షలతో పునర్నిర్మాణంతొలినాళ్లలో నిర్మించిన ఆలయం పాతబడటంతో రూ.40 లక్షలతో నూతన ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయంలో 2023 మార్చి 17న ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్టాపనతో పాటు రాజగోపురం, కల్యాణమండపం, శిఖర ప్రతిష్టాపన భవనేస్వరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి చేతుల మీదుగా జరిగింది.దళిత పూజారి ద్వారా దగ్గరైన దేవుడు నా వయస్సు 80 ఏళ్లు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆలయం ఉంది. అప్పట్లో గానుగ సున్నంతో నిర్మించగా రాములవారి పటంతో శ్రీరామనవమి వేడుకలు వంగూరి చిన ముత్తయ్య జరిపించేవారు. ఇప్పుడు కులమత భేదం లేకుండా అంతా ఆలయానికి వస్తున్నారు. నూతన గుడి నిర్మించాక అభివృద్ధి చెందింది. దళిత పూజారి ద్వారా శ్రీరాముడు మాకు దగ్గరయ్యాడు. – సామల వీరన్న, వల్లభి గ్రామవాసి వారసత్వంగా పూజలు... తాతముత్తాతల నుంచి ఆనవాయితీగా వస్తుండటంతో పాటు టీటీడీలో వేదమంత్రాలు, పూజల్లో శిక్షణ తీసుకున్నాను. ఆలయంలో పూజలు చేస్తూనే సత్యనారాయణస్వామి వ్రతాలు, గృహప్రవేశాలు నిర్వహిస్తుంటా. సీఎంగా వైఎస్సార్ ఉన్నప్పుడు ప్రకటించిన ధూపదీప నైవేద్యం పథకం ద్వారా వచ్చే నిధులతో పాటు గ్రామస్తులు ఇచ్చే విరాళాలు ఆలయ అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. – వంగూరి అనంతరాములు, ప్రస్తుత పూజారి -
నడిపించేది నాన్న
కల నిజం అయ్యేది కష్టంతోనే. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆఫ్రీన్ కుటుంబానికి కలలు కనేంత వెసులుబాటు లేకపొవచ్చు. అయినా సరే.... ఆ తండ్రి కల కన్నాడు. ఆయన కూతురు కల కన్నది. ఆ కల సాకారం అయింది. ఖమ్మంకు చెందిన షేక్ ఆఫ్రీన్ జాతీయ స్థాయిలో అథ్లెట్‌గా రాణిస్తోంది....‘ఇది వేరే ప్రపంచం’ అనుకున్నారు అక్కాచెల్లెళ్లు సమ్రీన్, ఆఫ్రీన్. ఆ ప్రపంచం పేరు....స్టేడియం. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కొందరు రన్నింగ్ చేస్తున్నారు. కొందరు జంపింగ్ చేస్తున్నారు. ఒకవైపు క్రికెట్ ఆడుతున్నారు. కొందరు వాలీబాల్ ఆడుతున్నారు. వారి ఒంటికి పట్టిన చెమటల మాట ఎలా ఉన్నా...అందరి కళ్లల్లోనూ అంతులేని ఉత్సాహం పొంగిపొర్లుతుంది.ఆ ఉత్సాహమే పద్నాలుగు సంవత్సరాల ఆఫ్రీన్‌ను ఆ స్టేడియంకు దగ్గర చేసింది. ‘పప్పా... మేము నీతో పాటు రోజూ స్టేడియంకు వస్తాం’ అని అడిగారు. ఆఫ్రీన్ తండ్రి రహీమ్ హోంగార్డ్. స్పోర్స్›్టపర్సన్ కూడా. రోజూ తప్పకుండా స్టేడియంకు వచ్చి ఎక్సర్సైజ్లు చేయడం ఆయన దినచర్యలో భాగం. కుమార్తె విన్నపాన్ని విన్న రహీమ్... ‘అలాగే’ అన్నాడు. దీనికి ముందు ‘ఇక్కడికి వచ్చి ఏంచేస్తారు?’ అన్నాడు నవ్వుతూ. ‘మీలాగే ఎక్సర్సైజ్లు చేస్తాం’ అన్నారు సీరియస్‌గా.‘వీరిది ఒకటి రెండు రోజుల ఉత్సాహం. ఆ తరువాత అంతా మామూలే!’ అనుకున్నాడు రహీమ్. కానీ, అతడి అంచనా తప్పయింది. రకరకాల ఎక్సర్సైజ్లు చేయడం నుంచి ఆటల వరకు ఆఫ్రీన్‌కు స్టేడియం ప్రాణం అయింది. స్టేడియంకు రాని రోజూ అంటూ ఉండేది కాదు. ‘ఎప్పుడూ స్టేడియంలోనే కనిపిస్తావు. ఎప్పుడు చదువుకుంటావు!’ అని అడిగే వాళ్లు కొందరు.‘స్టేడియంలో కూడా చదువుకుంటూనే ఉన్నాను’ అని ఆఫ్రీన్ అన్నదో లేదు తెలియదుగానీ స్టేడియంలో తాను ఆటల ప్రపంచాన్ని చదువుతోంది. కట్ చేస్తే... షేక్ అఫ్రీన్ ప్రస్తుతం ఖమ్మంలోని ‘కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్’లో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు అథ్లెటిక్స్‌లోనూ రాణిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పొటీల్లో ఎన్నో పతకాలు సాధించింది. ఎంతో మంది పేదింటి అమ్మాయిలకు రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. మొదట్లో కుమార్తెల ఉత్సాహానికి సంతోషపడిపొయిన రహీం ఆ ఇద్దరికి పరుగు పందెం నిర్వహించాడు. రన్నింగ్‌లో వారి ప్రతిభను చూసి ‘ఈ వజ్రాలకు సానబెట్టాల్సిందే’ అనుకున్నాడు. అదే సమయంలో కోచ్ గౌస్.... ‘ఆఫ్రీన్‌కు శిక్షణ ఇస్తే మంచి అథ్లెట్ అవుతుంది’ అన్నాడు. అతడి నోటి వాక్కు ఫలించింది. ఆఫ్రీన్ తో పాటు సమ్రీన్ కూడా అథ్లెటిక్స్‌లో రాణించింది. జాతీయ, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో పాల్గొంది. ఆఫ్రీన్ ట్రాక్ రికార్డ్2016లో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 600 మీటర్ల పరుగులో మూడో స్థానం, 2017లో హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో 800 మీటర్ల పరుగులో మొదటిస్థానం, 400 మీటర్లలో రెండోస్థానంలో నిలిచింది. (నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!)2022లో జరిగిన తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 300 మీటర్ల పరుగులో ద్వితీయస్థానం, లాంగ్‌జంప్‌లో ద్వితీయస్థానం సాధించింది. 2023లో వరంగల్‌లో నిర్వహించిన సౌత్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో ట్రిపుల్‌జంప్‌లో 5వ స్థానంలో నిలిచింది. 2023లో కరీంనగర్లో జరిగిన తెలంగాణ సౌత్‌జోన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో ట్రిపుల్ జంప్‌లో ద్వితీయస్థానంలో నిలిచింది. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి 19 వరకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించినసౌత్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో మిడిల్రిలేలో 3వ స్థానం సాధించింది.ఇంకా ఎన్నో సాధించాలి...సాధిస్తానుపొటీల్లో పాల్గొనేటప్పుడు ఆటపైనే ధ్యాస ఉంటుంది. ఫలితం గురించి ఆలోచించను. మా నాన్న కూడా అదే చెబుతారు. నీ వంతుగా శ్రమిస్తే ఓడిపొయినా ఫర్వాలేదని ధైర్యం చెబుతారు. నేను పొటీల్లో రాణించడానికి నాన్న, అమ్మ కష్టపడుతున్నారు. అమ్మ జమీలా అసలు చదువుకోలేదు. నేను అథ్లెటిక్స్‌లో పాల్గొన్న వీడియోలు చూస్తూ నన్ను అభినందిస్తోంది. దేశం తరుపున పొటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించాలనేదే లక్ష్యం. – షేక్ ఆఫ్రీన్– బొల్లం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మంఫొటోలు: రాధారపు రాజు -
ప్రైవేట్‌కు దీటుగా ‘సింగరేణి’ విద్య
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఉన్నత విద్యాప్రమాణాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం సంస్థ పరిధిలో ఉన్న 9 పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యనందించేందుకు కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం (2025–26) నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలుకు సన్నాహాలు చేస్తోంది. తొలుత రామగుండం–2 ఏరియాలోని సెక్టార్–2 పాఠశాలను పైలట్ ప్రాజెక్టుగా గుర్తించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిబంధనల ప్రకారం తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ, మైదానం, కంప్యూటర్ ల్యాబ్ తదితర ఏర్పాట్లపై ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు (డైరెక్టర్) పర్యవేక్షించి అనుమతుల కోసం సన్నాహాలు మొదలుపెట్టారు.‘కారుణ్య’ ఉద్యోగుల పిల్లలపై నజర్గత ఏడేళ్లలో సింగరేణిలో కారుణ్య నియామకాల ద్వారా సుమారు 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. వీరిలో కొందరికి వివాహం జరగగా, పలువురు అవివాహితులు కూడా ఉన్నారు. అయితే వివాహమైన వారు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించకుండా.. వారికి మెరుగైన భవిష్యత్ ఇచ్చేందుకు కేంద్రీయ విద్యాలయాలు, ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా సింగరేణి విద్యావ్యవస్థను బలోపేతం చేయనున్నారు. సింగరేణిలో పాఠశాలల ఏర్పాటు సమయం (1975)లో అడ్మిషన్ కావాలంటే ఉన్నతాధికారి సిఫారసు కావాల్సి వచ్చేది. కానీ నేడు సింగరేణి వ్యాప్తంగా ఉన్న తొమ్మిది పాఠశాలలో కేవలం వెయ్యి మంది మాత్రమే చదువుతున్నట్లు అంచనా. ఈ తరుణంలో సింగరేణి పాఠశాలలను మళ్లీ అగ్రస్థానంలో నిలిపేలా సీఎండీ ఎన్.బలరామ్ ప్రత్యేక దృష్టి సారించారు.తరగతులపై అనునిత్యం పర్యవేక్షణగతంలో సింగరేణి పాఠశాలలో 10వ తరగతి ఫలితాలపైనే దృష్టి ఉండేది. కానీ ప్రస్తుతం అనునిత్యం అన్ని తరగతుల నిర్వహణ, పరీక్షలకు ప్రశ్నపత్రాల తయారీ, ఫలితాలపై అధ్యయనం చేస్తున్నారు. అంతేకాక డైరెక్టర్ స్థాయి అధికారులు వారంలో ఒక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచి ఉన్నత స్థానాలకు చేరుకునేలా సన్నద్ధం చేసేందుకు ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నారు.అన్ని రంగాల్లో రాణించేలా కృషిసింగరేణిలో విద్యావ్యవస్థ ప్రక్షాళనతో పాటు నూతన కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తాం. ప్రతి ఆరు నెలలకోసారి జాబ్‌మేళాలు నిర్వహిస్తాం. సింగరేణి విద్యాసంస్థలో చేరితే కళాశాల చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలనేది మా భావన. అలాగే, ఇంగ్లిష్ ల్యాబ్‌లు కూడా ఏర్పాటుచేస్తున్నాం. – గుండా శ్రీనివాస్, ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీకార్మికుల పిల్లల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంసింగరేణి కార్మికుల పిల్లలను రూ.లక్షలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. అలాకాకుండా వారికి మంచి భవిష్యత్‌ను అందించేలా సింగరేణి పాఠశాలల్లోనే బోధన అందుబాటులోకి తీసుకొస్తున్నాం. పాఠశాల విద్యతో పాటు పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టి నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా ఉజ్వల భవిష్యత్ అందిస్తాం.– ఎన్.బలరామ్, సింగరేణి సీఎండీప్రతివారంలో ఒక పరిశ్రమకు..విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాల కోసం ఆసక్తి పెంచేలా వారంలో ఒకరోజు పరిశ్రమకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆయా పరిశ్రమల్లో ఏం తయారుచేస్తారు, ముడిసరుకు లభ్యత, తయారైన ఉత్పత్తుల మార్కెటింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించి వారిలో ఆలోచనాశక్తిని పెంపొందించాలనేది ఈ కార్యక్రమ లక్ష్యం. అంతేకాకుండా ఆటపాటలు, మార్షల్ ఆర్ట్స్‌పై నిత్యం రోజూ ఒక గంటపాటు తరగతులు నిర్వహిస్తున్నారు. -
ఉపాధ్యాయులూ మేల్కొనండి!
వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గడువు దగ్గర పడుతున్నా.. ఓటు నమోదుపై ఉపాధ్యాయులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లుండగా.. ప్రస్తుతం మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 10,089 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.నవంబర్ 6 వరకు గడువు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 30న ఓటరు నమోదు షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 6వ తేదీ ఆఖరు తేదీగా ప్రకటించింది. గత ఎన్నికల ఓటరు జాబితా రద్దు చేశామని.. గతంలో ఓటు ఉన్న వారు కూడా తిరిగి నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు చెప్పారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ఓటర్ నమోదుకు అవకాశం కల్పించారు. ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు దాటింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 12 కొత్త జిల్లాలున్నాయి. అందులో ఇప్పటి వరకు 10,089 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. పెరిగిన ఉపాధ్యాయుల సంఖ్యఓటరు నమోదుకు ఆఖరి తేదీ నవంబరు 6. ఇంకా 10 రోజులు మాత్రమే గడువుంది. గత ఎన్నికల్లో 20,880 మంది ఓటర్లు ఉన్నందువల్ల ఈసారి ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరిగింది. ఓటర్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. ప్రధానంగా హైస్కూల్ ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, బీఈడీ కళాశాలల అధ్యాపకులతోపా టు ప్రభుత్వ రికగ్నైజ్డ్ హైస్కూళ్లు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఓటర్ నమోదుపై స్పందించాల్సి ఉంది. నివాసమే ప్రామాణికం..ఓటర్లుగా ఉపాధ్యాయులు, అధ్యాపకుల నమోదు గడువు నవంబర్ 1 అని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ తేదీ కంటే ముందు కనీసం 3 ఏళ్లు కచ్చితంగా బోధించి ఉండాలి. ఎన్నిచోట్ల పని చేసినప్పటికీ 3 ఏళ్లు బోధించినట్లు సర్వీస్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత విద్యాశాఖాధికారి సంతకం తప్పనిసరిగా ఉంటేనే ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతాన్నే ఎన్నికల సంఘం ఓటర్ నమోదుకు ప్రామాణికంగా నిర్ణయించింది. ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ చిరునామా ఆధారంగా ఓటు నమోదు చేసుకోవాలి. బోధన ఎక్కడ చేసినప్పటికీ అది ప్రామాణికం కాదు. ఉదాహరణకు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నల్లగొండలో నివసిస్తున్న వ్యక్తి వరంగల్ జిల్లాలో పనిచేస్తే.. ఆ వ్యక్తి నల్లగొండ చిరునామాతోనే ఓటు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ మూడు జిల్లాల్లో ఎక్కడైనా ఉపాధ్యాయుడు పని చేస్తూ.. కరీంనగర్ జిల్లాలో నివసిస్తుంటే ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉండదు. ఓటు నమోదుకు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా వారి చిరునామాకు వెళ్లి.. దరఖాస్తుదారు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడా? లేడా? అనేది సిబ్బంది పరిశీలించాలి. ఒకవేళ అక్కడ నివాసం లేకుంటే ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు. ఉపాధ్యాయులు ఎక్కడ నివాసం ఉంటే.. అక్కడ ఓటు నమోదు చేసుకుంటేనే ఆ దరఖాస్తు చెల్లుబాటవుతుంది. నివాసం ప్రామాణికంగానే దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారి కోరుతున్నారు. -
‘ఇంటిగ్రేటెడ్’లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య
ఖమ్మం రూరల్: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ సమీపంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న పాఠశాల నిర్మాణ పనులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలసి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో 28 పాఠశాలలకు శంకుస్థాపన చేయగా.. పాలేరు నియోజకవర్గానికి స్థానం దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సుమారు 3 వేల మంది పిల్లలకు విద్యతో పాటు క్రీడల్లో శిక్షణ ఉంటుందన్నారు. పది వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణమే.. విద్యారంగంపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమని పొంగులేటి తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పెండింగ్‌లో పెట్టిన 22 వేల మంది ఉపాధ్యాయుల పదోన్నతులు, 34 వేల మంది బదిలీలను వివాదాలకు తావు లేకుండా పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజుమ్మిల్ ఖాన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు మంత్రులున్న ఖమ్మానికి ఏంటీ కర్మ
-
Harika Dronavalli: ఖమ్మం కోడలు బంగారం!
ఖమ్మం స్పోర్ట్స్: చదరంగంలో తిరుగులేని క్రీడాకారిణిగా ఎదిగిన ద్రోణవల్లి హారికకు జిల్లా క్రీడాకారులు, ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషులు, మహిళల జట్లు పసిడి పతకాలు సొంతం చేసుకున్నాయి. అయితే, జట్ల విజయంలో కీలకంగా వ్యవహరించిన ద్రోణవల్లి హారిక ఖమ్మం కోడలే కావడంతో సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తున్నారు. హారిక స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా కాగా, ఖమ్మంకు చెందిన చంద్ర వెంకటేశ్వర్లు కుమారుడు చంద్ర కార్తీక్‌తో 2018లో వివాహం జరిగింది. తొలినాళ్ల నుంచి అంతర్జాతీయ టోర్నీలపై దృష్టి సారించిన ఆమెకు 2022లో కుమార్తె జన్మించింది. అయినప్పటికీ భర్త, పాపతో కలిసి అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంటూ నైపుణ్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే అర్జున, పద్మశ్రీ అవార్డులు అందుకున్న హారిక ఇప్పుడు చెస్ ఒలింపియాడ్‌లో సత్తా చాటడం విశేషం.