సాక్షి,ఖమ్మం: వరద బాధితులకు తక్షణసాయం కింద రూ. 10 వేలు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం వరదల ప్రాంతాల్లో సీఎం రెండో రోజు పర్యటన సందర్భంగా మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు. అనంతరం మహబూబాబాద్‌లో పర్యటించి వరద బాధితులను ఉద్దేశించి మాట్లాడారు.
‘ఖమ్మంలో కూడా వరదలు ఆక్రమణల వల్లే వచ్చాయి. మున్నేరు రిటెయినింగ్ వాల్ ఎత్తు పెంచడంపై ఇంజనీర్లతో మాట్లాడి చూస్తాం. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి అవసరం అనుకుంటే ఆక్రమణలు తొలగిస్తాం. మిషన్ కాకతీయ అనేదే కమీషన్ కాకతీయ అని దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలో చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పటిష్టం చేశాం అన్నారు.
మరి గతంలో తెగని చెరువులు ,ఇప్పుడు ఎందుకు తెగుతున్నాయి.75 సంవత్సరాలలో ఇంత వర్షం ఎప్పుడూ పడలేదు. అంత విపత్తు జరిగినా ప్రాణ నష్టాన్ని తగ్గించామంటే అది ప్రభుత్వ ముందు చూపే. వరదలపై హరీశ్‌రావు మాట్లాడుతున్నారు. ముందు మీ పార్టీ నాయకుడు పువ్వాడ అజయ్ ఆక్రమించిన హాస్పిటల్‌లో కాలువల విషయంలో హరీశ్‌రావు నిలబడి తొలగించి ఆదర్శంగా ఉండాలి. కేంద్రం ప్రభుత్వానికి లేఖ రాశాం. వారి నుంచి స్పందన రావాలి.
రాష్ట్ర ప్రభుత్వం తరపున మాత్రం మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నాం. వరదల సహాయంతో మా మంత్రులు ప్రజలతో ఉంటున్నారు. మా ప్రజలు మమ్ముల్ని అడుగుతారు.. నిలదీస్తారు.. వారు మా వారే.. మాకు ఓటు వేసి గెలిపించారు. ఫాంహౌస్‌లో పడుకున్న వారిని అడుగుతారా?
ఇటువంటి విపత్తుల సమయంలో గతంలో ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చారు. అమలు చేయలేదు. మాది చేతల ప్రభుత్వం. గత ప్రభుత్వ హామీలు కూడా మేమే అమలు చేస్తాం. రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా విపత్తు నిర్వహణ సంస్థ సిద్ధం చేస్తున్నాం’అని సీఎం తెలిపారు.
మహబూబాబాద్‌లో సీఎం కామెంట్స్..
యువ సైంటిస్టు అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు
అశ్విని సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం
ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి మూడు తండాలు మునుగుతున్నాయి.
వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment