ప్రతీ ఎకరాకు పది వేల సాయం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Khammam Tour Live Updates | Sakshi
Sakshi News home page

ఇళ్లు నష్టపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు: సీఎం రేవంత్‌

Published Mon, Sep 2 2024 2:32 PM | Last Updated on Mon, Sep 2 2024 7:39 PM

CM Revanth Reddy Khammam Tour Live Updates

CM Revanth Khammam Tour Updates..

👉వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌ పర్యటన.

  • ఖమ్మం జిల్లాకు వెళ్తూ సూర్యాపేట జిల్లాలో వరదలపై సీఎం రేవంత్ సమీక్ష.
  • మోతే మండలం రాఘవపురం వద్ద రైతులు, అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష
  • సమీక్షకు హాజరైన మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, పొంగులేటి, మందుల సామెల్, పద్మావతి, వేం నరేందర్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

  • సూర్యాపేట జిల్లాలో 30 సెంటిమీటర్ల అతి భారీ వర్షం పడింది
  • పంట, ఆస్తి నష్టం పైన అధికారులు ప్రాథమిక నివేదికను అధికారులు ఇచ్చారు.
  • ప్రభుత్వం నిరంతరంగా మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం.
  • ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
  • ఖమ్మం, నల్లగొండ పరిస్థితిపై ప్రధాని మోదీ,  అమిత్ షా, రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరాను
  • వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం
  • పశువులు చనిపోతే 50 వేల సాయం
  • పంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి పదివేల సాయం
  • ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు
  • సూర్యాపేట కలెక్టర్‌కు తక్షణ సాయంగా ఐదు కోట్లు
  • పాఠశాల సెలవులపైన జిల్లా కలెక్టర్లకు నిర్ణయాధికారం
  • వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు
  • అమెరికాలో ఉండి ఒకాయన ట్విట్టర్‌ పోస్టులు పెడుతున్నాడు
  • ఒకాయన ఫాంహౌస్‌లో ఉన్నాడు
  • వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు.
  • బెయిల్ కోసం 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళతారు కానీ వరద బాధితులను పరామర్శించరు.
  • మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
  • మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా నేను సమీక్ష చేస్తున్న.
  • వరదల సమయంలో కేంద్రం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను ప్రారంభించుకుంటున్నాం.
  • జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాన మోదీని ఆహ్వానించాం
  • రాష్ట్రంలో ఐదు వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వస్తున్నాయి.
  • తక్షణమే కేంద్రం రెండు వేల కోట్లు కేటాయించాలని కోరుతున్న.
  • కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు పని చేయాలి.
  • రాజకీయాలకు ఇది సమయం కాదు.

 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..

  • నాకు ఊహ తెలిసింత వరకు ఇంతలా మున్నేరు వాగు ఉధృతిని చూడలేదు.
  • వరద ఒక ప్రళయంగా విరుచుకుపడింది.
  • జనం చిగురు టాకులా వణికిపోయారు.
  • అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నాం.
  • ఆస్తి నష్టం మాత్రం పెద్ద ఎత్తున జరిగింది.
  • ఇది ప్రకృతి వైపరీత్యం.
  • ప్రతిపక్ష పార్టీలు వరదలను కూడా రాజకీయం చేస్తున్నాయి.
  • సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చూస్తుంది.
  • ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.
  • జనం ఎవరు ఆందోళన చెందవద్దు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం..
  • బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది.
  • జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా చూడటానికి సీఎం ఖమ్మం రావడాన్ని ఖమ్మం ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం.
  • తాత్కాలిక ఉపశమనం కోసం వరద బాధితులకు 10వేలు ఇస్తున్నాం.
  • నష్టం తీవ్రత ఎంత అన్నది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత దాని ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటాం.
     

మంత్రి ఉత్తమ్ కామెంట్స్..

  • రెండు రోజులుగా భారీ వర్షాలతో ప్రజల ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
  • ప్రకృతి వైపరీత్యాలతో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉండేందుకు రాష్ట్ర యంత్రాంగం సమాయత్తం అయింది
  • దురదృష్టవశాత్తు కోదాడలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు
  • కొన్ని ఇండ్లకు నష్టం జరిగాయి
  • జిల్లా యంత్రాంగం అద్భుతంగా స్పందించింది
  • జిల్లా అధికారులకు అభినందనలు
  • చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి.
  • వ్యవసాయ పొలాల్లో నీరు వచ్చి నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను.


మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్‌..

  • అనుకోని వర్షాలతో ప్రజా ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం.
  • మరో మూడు రోజులు వర్షాలు నేపధ్యంలో దెబ్బతిన్న ఆర్‌ అండ్‌ బీ  రోడ్లను మరమ్మతులు చేపిస్తాం.  
  • దెబ్బ తిన్న నేషనల్ హైవే వారం తరువాత పునరిద్దరిస్తాం.
  • నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలి.
  • అధికారులు లీవ్‌లు పెట్టకుండా 24గంటలు అందుబాటులో ఉండాలి

 

మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్..

  • మున్నేరు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో వారి ఇళ్లలో ఉన్న పరిస్థితిని చూస్తే కన్నీళ్లు వచ్చాయి.
  • సీఎం గారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
  • మున్నేరు ఉధృతికి సంబంధించి టీవీల్లో వార్తలను చూసి తాను కూడా ఖమ్మం రావాలనుకున్నాను.
  • అంతలా ఖమ్మంలో వర్ష బీభత్సం కొనసాగింది.
  • మున్నేరు ఉధృతిని చూస్తే ఊహించని ప్రళయమే అన్నట్లు అనిపించింది.
  • వరదల నేపథ్యంలో చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది.
  • ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం కలిసికట్టుగా పని చేసి ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.
  • ప్రతిపక్ష పార్టీల విమర్శలను మీడియా వాళ్ళు పట్టించుకోవద్దు.

 

👉తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు, వరద సాయంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అలాగే, ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాం‍తాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించనున్నారు. 

👉ఇక, సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌.. భారీ వర్ష సూచన ఉన్న చోట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సహాయక బృందాలు చేపడుతున్న చర్యలపై అధికారులతో సీఎం చర్చించారు. పంటనష్టం వాటిల్లిన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

👉అనంతరం, సీఎం రేవంత్‌ ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరారు. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌ ఖమ్మం జిల్లాలోనే బస చేయనున్నారు. ఇక, రేపు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మార్గం మధ్యలో కోదాడలోనూ పర్యటించనున్నారు. నేడు ఖమ్మం జిల్లాలో పర్యటనకు వెళ్లూ సూర్యాపేట, పలు వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్‌ పరిశీలించనున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement