suryapet
-
సూర్యాపేటలో రెండు బస్సులు ఢీ.. ఇద్దరు మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. నలుగురు మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో 17 మంది గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అలాగే, 17 మంది కూలీలు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కూలీలు పనుల కోసం ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ప్రైవేట్ బస్సులో గంజాయి చాక్లెట్ల కలకలం
-
చాలా బాగున్నావ్.. నిన్ను వదిలిపెట్టను.. మహిళా అధికారిపై వేధింపులు..
-
‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను’
సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో ఓ మహిళా అధికారిపై లైంగిక వేధింపుల అంశం సంచలనంగా మారింది. సదరు మహిళా అధికారికి ఫోన్ చేసిన వ్యక్తి.. ఆమెను అందంగా ఉన్నావంటూ వేధింపులకు గురిచేస్తూ.. పదేళ్లు అయినా తనను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించాడు. తాను ఇప్పటికే మూడేళ్లు జైలులో ఉండి వచ్చానని తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరించడం గమనార్హం.వివరాల ప్రకారం.. కోదాడకు చెందిన మహిళా అధికారిపై ఓ వ్యక్తి ఫోన్లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళా అధికారికి వాయిస్ మెసేజ్‌లు చేస్తూ వేధింపులకు గురిచేశాడు. దీంతో, ఆ వ్యక్తికి కాల్ చేసి మెసేజ్‌ల విషయమై ఆమె ప్రశ్నించారు. ఈ సందర్బంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ.. నువ్వు(మహిళా అధికారి) చాలా అందంగా ఉన్నావు. నీ నంబర్ సేవ్ చేసుకున్నాను. నీ డీపీ ఫొటోను నేను రోజు చూస్తున్నాను. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను. పదేళ్లు అయినా నిన్ను విడిచిపెట్టేది లేదు. నీ కోసం ఎంత దూరమైనా వస్తాను. నాకు పొలిటికల్ సపోర్టు ఉంది. మూడు నెలల క్రితమే నేను చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాను. మూడు సంవత్సరాలు చర్లపల్లి జైలులో ఉన్నాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. పోలీసులు కూడా నన్ను ఏమీ చేయలేరు. నా లోకేషన్ నీకు పంపిస్తాను. చేతనైతే ఏం చేసుకుంటావో చేసుకో.. అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే, సదరు మహిళా అధికారిని వేధింపులకు గురిచేసిన వ్యక్తి తెలంగాణకు చెందిన ఓ మంత్రి వద్ద పనిచేస్తున్నట్టు సమాచారం. -
దసరా వేడుకల్లో వీరకుమార్ అనే ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం...
-
రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం.. తహసీల్దార్ అరెస్ట్
సూర్యాపేట, సాక్షి: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. లేని భూమిని ఉన్నట్లు చూపించి పాస్ పుస్తకాలు ఎమ్మార్వో జయశ్రీ సృష్టించారు. ఈ కుంభకోణానికి ధరణి ఆపరేటర్ జగదీష్ సహకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. తహసీల్దారు జయశ్రీ, ధరణీ ఆపరేటర్ జగదీష్‌ను అరెస్ట్ చేశారు. గోప్యంగా 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. కనీసం అరెస్ట్ వివరాలు కూడా బయటకు తెలియకుండా జాగ్రత్త పడిన వైనం. గతంలో హుజూర్నగర్ తహసీల్దార్‌గా పనిచేస్తూ కుంభకోణానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. హుజూర్ నగర్, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసు పుస్తకాలు సృష్టించి రైతుబంధు నిధులును స్వాహా చేశారు. రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు తహసీల్దార్, ధరణి ఆపరేటర్ పక్కదారి పట్టించారు. ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసుబుక్కులు తహసీల్దార్ జయశ్రీ జారీ చేశారు. తహసీల్దార్, ధరణి ఆపరేటర్ జగదీష్ చెరిసగం చొప్పున రైతుబంధు నదులు పంచుకున్నారు. తహసీల్దార్ పై 420, 406, 409, 120(b), 468, 467 IPC సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేవారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తహసీల్దార్‌గా జయశ్రీ పనిచేస్తున్నారు. గోప్యంగా రిమాండ్‌కు తరలించడమేంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
ప్రతీ ఎకరాకు పది వేల సాయం: సీఎం రేవంత్
CM Revanth Khammam Tour Updates..👉వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.ఖమ్మం జిల్లాకు వెళ్తూ సూర్యాపేట జిల్లాలో వరదలపై సీఎం రేవంత్ సమీక్ష.మోతే మండలం రాఘవపురం వద్ద రైతులు, అధికారులతో సీఎం రేవంత్ సమీక్షసమీక్షకు హాజరైన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, మందుల సామెల్, పద్మావతి, వేం నరేందర్ రెడ్డిసీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్సూర్యాపేట జిల్లాలో 30 సెంటిమీటర్ల అతి భారీ వర్షం పడిందిపంట, ఆస్తి నష్టం పైన అధికారులు ప్రాథమిక నివేదికను అధికారులు ఇచ్చారు.ప్రభుత్వం నిరంతరంగా మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం.ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.ఖమ్మం, నల్లగొండ పరిస్థితిపై ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరానువర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారంపశువులు చనిపోతే 50 వేల సాయంపంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి పదివేల సాయంఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లుసూర్యాపేట కలెక్టర్‌కు తక్షణ సాయంగా ఐదు కోట్లుపాఠశాల సెలవులపైన జిల్లా కలెక్టర్లకు నిర్ణయాధికారంవరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలుఅమెరికాలో ఉండి ఒకాయన ట్విట్టర్ పోస్టులు పెడుతున్నాడుఒకాయన ఫాంహౌస్‌లో ఉన్నాడువరద సమయంలో బురద రాజకీయాలు వద్దు.బెయిల్ కోసం 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళతారు కానీ వరద బాధితులను పరామర్శించరు.మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా నేను సమీక్ష చేస్తున్న.వరదల సమయంలో కేంద్రం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ను ప్రారంభించుకుంటున్నాం.జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాన మోదీని ఆహ్వానించాంరాష్ట్రంలో ఐదు వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వస్తున్నాయి.తక్షణమే కేంద్రం రెండు వేల కోట్లు కేటాయించాలని కోరుతున్న.కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు పని చేయాలి.రాజకీయాలకు ఇది సమయం కాదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..నాకు ఊహ తెలిసింత వరకు ఇంతలా మున్నేరు వాగు ఉధృతిని చూడలేదు.వరద ఒక ప్రళయంగా విరుచుకుపడింది.జనం చిగురు టాకులా వణికిపోయారు.అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నాం.ఆస్తి నష్టం మాత్రం పెద్ద ఎత్తున జరిగింది.ఇది ప్రకృతి వైపరీత్యం.ప్రతిపక్ష పార్టీలు వరదలను కూడా రాజకీయం చేస్తున్నాయి.సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చూస్తుంది.ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.జనం ఎవరు ఆందోళన చెందవద్దు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం..బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది.జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా చూడటానికి సీఎం ఖమ్మం రావడాన్ని ఖమ్మం ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం.తాత్కాలిక ఉపశమనం కోసం వరద బాధితులకు 10వేలు ఇస్తున్నాం.నష్టం తీవ్రత ఎంత అన్నది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత దాని ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. మంత్రి ఉత్తమ్ కామెంట్స్..రెండు రోజులుగా భారీ వర్షాలతో ప్రజల ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనప్రకృతి వైపరీత్యాలతో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉండేందుకు రాష్ట్ర యంత్రాంగం సమాయత్తం అయిందిదురదృష్టవశాత్తు కోదాడలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారుకొన్ని ఇండ్లకు నష్టం జరిగాయిజిల్లా యంత్రాంగం అద్భుతంగా స్పందించిందిజిల్లా అధికారులకు అభినందనలుచనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి.వ్యవసాయ పొలాల్లో నీరు వచ్చి నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను.మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్..అనుకోని వర్షాలతో ప్రజా ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం.మరో మూడు రోజులు వర్షాలు నేపధ్యంలో దెబ్బతిన్న ఆర్ అండ్ బీ రోడ్లను మరమ్మతులు చేపిస్తాం. దెబ్బ తిన్న నేషనల్ హైవే వారం తరువాత పునరిద్దరిస్తాం.నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలి.అధికారులు లీవ్‌లు పెట్టకుండా 24గంటలు అందుబాటులో ఉండాలి మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్..మున్నేరు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో వారి ఇళ్లలో ఉన్న పరిస్థితిని చూస్తే కన్నీళ్లు వచ్చాయి.సీఎం గారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.మున్నేరు ఉధృతికి సంబంధించి టీవీల్లో వార్తలను చూసి తాను కూడా ఖమ్మం రావాలనుకున్నాను.అంతలా ఖమ్మంలో వర్ష బీభత్సం కొనసాగింది.మున్నేరు ఉధృతిని చూస్తే ఊహించని ప్రళయమే అన్నట్లు అనిపించింది.వరదల నేపథ్యంలో చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం కలిసికట్టుగా పని చేసి ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.ప్రతిపక్ష పార్టీల విమర్శలను మీడియా వాళ్ళు పట్టించుకోవద్దు. 👉తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు, వరద సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అలాగే, ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించనున్నారు. 👉ఇక, సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్.. భారీ వర్ష సూచన ఉన్న చోట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సహాయక బృందాలు చేపడుతున్న చర్యలపై అధికారులతో సీఎం చర్చించారు. పంటనష్టం వాటిల్లిన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.👉అనంతరం, సీఎం రేవంత్ ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరారు. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ ఖమ్మం జిల్లాలోనే బస చేయనున్నారు. ఇక, రేపు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మార్గం మధ్యలో కోదాడలోనూ పర్యటించనున్నారు. నేడు ఖమ్మం జిల్లాలో పర్యటనకు వెళ్లూ సూర్యాపేట, పలు వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ పరిశీలించనున్నారు. -
సీతాగనరంలో తాగుబోతు తీరుతో 108 సిబ్బందికి ఇబ్బందులు
-
విషాదం.. క్వారీ గుంతలో పడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ సహా ముగ్గురి మృతి
సాక్షి, సూర్యాపేట: క్వారీ గుంతలోపడి ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఆత్మకూరు (ఎస్) మండలం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి హాజరై క్వారీ చూసేందుకు వెళ్లి.. ప్రమాదవాశాత్తు అక్కడి గుంతలో పడి ప్రాణాలు విడిచారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీపాల్ రెడ్డి, రాజు స్నేహితులు. వీరిద్దరూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. శ్రీపాల్ రెడ్డి బిల్డర్‌గా, రాజు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.మంగళవారం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి వారు తమ కుటుంబాలతో సహా హాజరయ్యారు. బుధవారం ఉదయం శ్రీపాల్ రెడ్డి, రాజు, ఆయన కుమార్తె (12) క్వారీ చూడటానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాజు కుమార్తె క్వారీ గుంతలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు రాజు, శ్రీపాల్ రెడ్డి లు ఇద్దరూ ఆ గుంతలో దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
గురుకుల బీసీ హాస్టల్లో చిన్నారి మృతి..
-
సింగపూర్‌లో సూర్యాపేట జిల్లా యువకుడి మృతి
కోదాడ రూరల్: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన యువకుడు సింగపూర్‌లో బీచ్‌కు వెళ్లి నీటి అలలకు కొట్టుకు పోయి మృతిచెందాడు. కోదాడ పట్టణంలోని ఎర్నేని టవర్‌లో నివాసం ఉంటున్న చౌడవరపు శ్రీనివాసరావు, చంద్రకళ దంపతుల రెండో కుమారుడు పవన్ (28) హైదరాబాద్‌లో ఆరేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు. గతేడాది ఫిబ్రవరి నుంచి సింగపూర్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, పవన్ తన స్నేహితులో కలిసి శుక్రవారం సింగపూర్‌లోని సెన్సోటియా బీచ్‌కు వెళ్లాడు. నీటిలోకి దిగిన పవన్ అక్కడ అలల ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందినట్లు తమకు సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యులు తెలి పారు. శ్రీనివాసరావు పట్టణంలో ఆయిల్ మిల్లు నడుపుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా.. పవన్ రెండో కుమారుడు. పెద్ద కుమారుడు లండన్ లో ఉద్యోగం చేస్తుండగా మూడో కుమారుడు స్థానికంగా ఉంటూ తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. పవన్ కొద్ది రోజుల్లోనే సింగపూర్ నుంచి అమెరికాకు వెళ్లాల్సి ఉందని బంధువులు తెలిపారు. -
కరువు పనిని ఖతర్నాక్ చేసిన IRS ఆఫీసర్
-
Suryapet: ఉపాధి హామీ కూలీగా ఐఆర్ఎస్ అధికారి.. ఎందుకో తెలుసా?
సాక్షి, సూర్యాపేట: కూలీల స్థితిగతులను అంచనా వేయడం కోసం ఐఆర్ఎస్ అధికారి ఉపాధి కూలీగా మారారు. ఈ ఆసక్తికర ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. కూలీగా మారిన అధికారి పేరు సందీప్ బాగా.వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సందీప్, బెంగళూరు సౌత్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనరేట్‌లో జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన సోమవారం నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి చెరువు పూడికతీత పనుల్లో పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూలీలతో కలిసి పనిచేశారు.ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం చేపట్టిన స్వయం ఉపాధి కార్యక్రమాలను వారికి వివరించడంతోపాటుగా వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు గురించి వివరించారు. వాటిపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఆయన కూలీలతో కలిసి భోజనం చేయడంతో పాటుగా బతుకమ్మ పాటకు డ్యాన్స్ కూడా చేశారు. తనతో పాటు పనిలో పాల్గొన్న 152 మంది కూలీలకు తన జీతం నుంచి రూ.200 చొప్పున అందజేశారు. ఇక, ఉన్నాతాధికారి అయిన సందీప్ వారితో కలిసి ఉండటం, భోజనం చేయడంతో కూలీలు ఆనందం వ్యక్తం చేశారు. -
మహిళా డాక్టర్ పై ఫుడ్ సేఫ్టీ అధికారి వేధింపులు
-
దొంగ డాక్టర్ గుట్టు రట్టు
-
దొడ్డురకం వడ్లకూ బోనస్ ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట): అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్నరకం, దొడ్డురకం వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డు గేటు ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని రేవంత్‌రెడ్డి తన మేనిఫెస్టోలో పేర్కొన్నారని, కానీ ఇటీవల కేబినేట్ సమావేశంలో మాత్రం కేవలం సన్నరకం వడ్లకు మాత్రమే ఇవ్వా లని నిర్ణయించడం సరైంది కాదని రైతులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకే కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి మోసం చేసిందని ధ్వజమెత్తుతూ కొందరు రైతులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతుబంధు నిధులను కూడా సకాలంలో అందించాలని, సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం మొండివైఖరిని విడనాడాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు భిక్షం, లక్ష్మయ్య, సుధాకర్ తదితరులు హెచ్చరించారు. -
కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..
సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో దారుణం జరిగింది. డబ్బులు కోసం కన్నతల్లి అంత్యక్రియలు జరగకుండా కొడుకు, కూతుళ్లు వదిలేసిన ఉదంతం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. కందువారిగూడెంకు చెందిన లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్నకుమారుడు కొన్నాళ్లు క్రితమే చనిపోయాడు.కాగా, ఇటీవల లక్ష్మమ్మ ఇటీవల బాత్రూంలో జారిపడి ఆసుప్రతిలో చేరింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె వద్ద ఉన్న రూ.20 లక్షలు ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. అయినా అంత్యక్రియల విషయంలో పేచీ పెట్టారు. అంత్యక్రియలు జరపకుండా మృతదేహాన్ని ఇంటివద్దే ఉంచారు. తండ్రితో పాటు తమ్ముడి అంత్యక్రియలు తానే చేశానని పెద్దకొడుకు చెబుతున్నాడు.తన తల్లి లక్ష్మమ్మ డబ్బు, బంగారం కూతుళ్లకే ఇచ్చిందని ఆరోపిస్తున్నాడు. తాను ఇప్పటికే కూలినాలి చేసుకుని బతుకుతున్నానని.. ఖర్చు తాను భరిస్తే తన పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. అయితే. తల్లి అంత్యక్రియల విషయంలో కుమారుడు, కూతుళ్లు గొడవపడటం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కని పెంచి ప్రయోజకుల్ని చేసిన తర్వాత ఇలా తల్లి శవాన్ని ఇంటి ముందు పెట్టుకుని ఘర్షణ పడటం తగదని సూచిస్తున్నారు. -
ప్రాణాలు తీసిన అతివేగం
సూర్యాపేట: అతివేగం ఇద్దరి యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. మితిమీరిన వేగంతో చెట్టును ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకుల్లో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యువకులకి స్వల్ప గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన ఆరుగురు యువకులు ఎర్టిగా కారును అద్దెకు తీసుకుని సూర్యాపేటలోని వీరి స్నేహితుడు ఉదయ్‌ను కలిసేందుకు గురువారం వచ్చారు. వీరంతా బాల్యస్నేహితులు. అతడితో కలిసి కాసేపు సరదాగా పట్టణంలో తిరిగి ఉదయ్‌ను కూడా కారులో ఎక్కించుకుని కేతేపల్లికి బయలుదేరారు. సూర్యాపేట మండలంలోని రాయినిగూడెం శివారులో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో జటంగి సాయి (17), అంతటి నవీన్ (20) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మారగోని మహేష్, కావడి శివ, అబ్బురి గణేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మిగిలిన మరో ఇద్దరు యువకులు చింత మళ్ల ధనుష్ అలియాస్ బన్ని, ఉదయ్ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. ధనుష్ కారును 170 స్పీడ్‌తో నడపడంతోనే అదుపు తప్పినట్టు తెలుస్తోంది. మితిమీరిన వేగంతో కారు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. చెట్టు విరిగిపోవడమే కాకుండా కారు నుజ్జునుజ్జయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. -
హైదరాబాద్- విజయవాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- విజయవాడ 65వ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టింది. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన ఎర్టీగా కారు ఆటోను ఢీకొట్టింది. ఆటో సూర్యాపేట నుంచి అర్వపల్లి వెళ్తుండగా అంజనాపురి కాలనీ క్రాసింగ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వాహనాల మధ్య ఆటో చిక్కుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
రేపు పంటల పరిశీలనకు కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్: ఎండుతున్న పంటలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆదివారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో సాగునీరు లేక, భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల స్థితిగతులు తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండిపోతున్న వరిపంటలపై ఇటీవల కేసీఆర్‌కు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనకు వస్తున్నారు. -
ఉత్సవాలకు ముస్తాబు అవుతున్న యాదాద్రి
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని వచ్చే నెల 5వ తేదీ నుంచి కొండపైనే అనుబంధ ఆలయమైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి (శివాలయం) ఉత్సవాలను నిర్వహించనున్నారు. 11వ తేదీ నుంచి యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. కొండపైన గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మార్చి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మహా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. పాంచాహ్నిక దీక్షతో నిర్వహించే ఈ ఉత్సవాలను ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. 7వ తేదీన రాత్రి 7గంటలకు శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 8వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని అభిషేకములు, రాత్రి లింగోద్భోవ కాలములో మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం జరిపిస్తారు. 10వ తేదీన మధ్యాహ్నం పూర్ణాహుతి, రాత్రి డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. 11 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు పంచనారసింహుడిగా కొలువబడుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. స్వస్తీ వాచనంతో ఉత్సవాలకు ఆచార్యులు శ్రీకారం చుడతారు. 12వ తేదీన ధ్వజారోహణము, దేవతాహ్వానం, వేద పారాయణం, హవన జరిపిస్తారు. అదే రోజు అలంకార సేవలు, ధార్మిక సభా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం 17వ తేదీన, తిరు కల్యాణ మహోత్సవం 18వ తేదీన, రథోత్సవం 19న, చక్రతీర్థ స్నానం 20న నిర్వహిస్తారు. 21వ తేదీన శతఘటాభిషేకం ఉత్సవంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ముగింపు చేస్తారు. 8న అఖండ జ్యోతి యాత్ర యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బర్కత్‌పురలోని యాదగిరి భవన్ నుంచి మహా శివరాత్రి రోజు 8వ తేదీన ఉదయం 9.30గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 30వ అఖండ జ్యోతి యాత్ర ప్రారంభం అవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే యాత్ర నిర్వాహకులు అఖండ జ్యోతి యాత్రను దివ్య పుష్ప రథంపై ఊరేగింపుగా యాదాద్రికి తీసుకురానున్నారు. 8వ తేదీన బర్కత్‌పురలో ప్రారంభమయ్యే అఖండ జ్యోతి యాత్ర 11వ తేదీన యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల తొలిరోజు యాదగిరిగుట్టకు చేరుకుంటుంది. -
టెన్త్ విద్యార్థిని ఇరుగు అస్మిత ఆత్మహత్య
-
సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకులంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య