
సూర్యాపేట: రాష్ట్రాలు, గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తున్నా.. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగక సర్పంచులు రాజీనామా చేస్తున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. నల్లగొండ బీజేపీ పార్లమెంటరీ కోర్ కమిటీ సమావేశంలో భాగంగా సూర్యాపేటకు వచ్చిన ఆయన బుధవారం జిల్లా కేంద్రంలో అసెంబ్లీ నియోజకవర్గ శక్తి కేంద్ర ఇన్‌చార్జుల సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ.. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభు త్వం నిధులు కేటాయిస్తుంటే కేసీఆర్, మమ తా బెనర్జీలు తమ తెలివితేటలతో వాటిని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమవిగా ప్రచారం చేసుకొంటూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతిని ప్రజల్లోకి తీసు కెళ్లడానికే నియోజకవర్గాలలో పర్యటిసు ్తన్నట్టు వెల్లడించారు. కేంద్ర విచారణ సంస్థలతో రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారన్న విమ ర్శలపై ఆయన స్పందిస్తూ .. ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ విచారణ సంస్థలు వాటి పని చేసుకుంటూ పోతాయని స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment