Mahendra Nath Pandey
-
ఎలక్ట్రిక్ టూ–వీలర్ సంస్థలకు భారీ నష్టం
న్యూఢిల్లీ: పేరుకుపోయిన బాకీలు, గతేడాది సబ్సిడీల నిలిపివేత వల్ల మార్కెట్ వాటాను కోల్పోవడం తదితర కారణాలతో విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు (ఓఈఎం) నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కారణంగా ఏడు సంస్థలు ఏకంగా రూ. 9,000 కోట్ల మేర నష్టపోయాయి. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ (ఎంహెచ్ఐ) మంత్రి మహేంద్ర నాథ్ పాండేకి రాసిన లేఖలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల సమాఖ్య (ఎస్ఎంఈవీ) చీఫ్ ఎవాంజెలిస్ట్ సంజయ్ కౌల్ ఈ విషయాలు తెలిపారు. అసలే కష్టకాలంలో ఉంటే.. ఆయా సంస్థలు పొందిన సబ్సిడీ మొత్తాలను వాపసు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడం మరో సమస్యగా మారిందని పేర్కొన్నారు. 2022లో సదరు సంస్థలకు భారీ పరిశ్రమల శాఖ (ఎంహెచ్ఐ) సబ్సిడీలను నిలిపివేసినప్పటి నుంచి పేరుకుపోయిన బకాయిలు, వడ్డీ, రుణం, మార్కెట్ వాటాపరమైన నష్టం, ప్రతిష్టకు భంగం కలగడం, పెట్టుబడి వ్యయాలపరంగా కంపెనీలకు రూ. 9,075 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని ఎస్ఎంఈవీ ఆడిట్లో తేలినట్లు కౌల్ తెలిపారు. ఫలితంగా కొన్ని కంపెనీలు ఎప్పటికీ కోలుకోకపోవచ్చని, కొన్ని మూతబడవచ్చని పేర్కొన్నారు. దేశీ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో 1 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్టర్లతో పరిశ్రమ చర్చలు జరుపుతున్న తరుణంలో దాదాపు దానికి సరిసమానమైన స్థాయిలో నష్టాలు నమోదవడం చిత్రమైన పరిస్థితి అని కౌల్ వ్యాఖ్యానించారు. రోజూ పెరిగిపోతున్న నష్టాల కారణంగా తయారీ సంస్థలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయండి.. ఓఈఎంలకు గత 18–22 నెలల సబ్సిడీ బాకీలు రావాల్సి ఉందని కౌల్ తెలిపారు. పైపెచ్చు పాత సబ్సిడీలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించడం, కొత్త మోడల్స్‌ను ఎన్ఏబీ పోర్టల్‌లో అప్లోడ్ చేయడానికి అనుమతించకపోవడం వంటివి ఆయా సంస్థల వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల ప్రధాన ఉద్దేశం సదరు సంస్థలను శిక్షించడం మాత్రమే అయితే, ఇలా సమస్య పరిష్కారం కాకుండా జాప్యం జరుగుతూ ఉండటం వల్ల అవి పూర్తిగా మూతబడే పరిస్థితి వస్తోందని కౌల్ తెలిపారు. ఇలాంటి శిక్ష సరికాదని పేర్కొన్నారు. మూసివేత అంచుల్లో ఉన్న ఓఈఎంలకు ఊపిరి పోసేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరారు. తక్కువ వడ్డీపై రుణాలు, గ్రాంట్లు లేదా ఆ తరహా సహాయాన్ని అందించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. నిర్దిష్ట స్కీము నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీలు పొందాయంటూ హీరో ఎలక్ట్రిక్ సహా ఒకినావా ఆటోటెక్, యాంపియర్ ఈవీ, రివోల్ట్ మోటర్స్, బెన్లింగ్ ఇండియా, ఎమో మొబిలిటీ, లోహియా ఆటోపై ప్రభుత్వం విచారణ జరుపుతోన్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు మేడిన్ ఇండియా పరికరాలను ఉపయోగించాలి. అయితే, ఈ ఏడు సంస్థలు దిగుమతి చేసుకున్న పరికరాలను వినియోగించడం ద్వారా నిబంధనలను ఉల్లంగించాయని ఆరోపణలు ఉన్నాయి. -
కేంద్ర నిధుల దుర్వినియోగం
సూర్యాపేట: రాష్ట్రాలు, గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తున్నా.. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగక సర్పంచులు రాజీనామా చేస్తున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. నల్లగొండ బీజేపీ పార్లమెంటరీ కోర్ కమిటీ సమావేశంలో భాగంగా సూర్యాపేటకు వచ్చిన ఆయన బుధవారం జిల్లా కేంద్రంలో అసెంబ్లీ నియోజకవర్గ శక్తి కేంద్ర ఇన్చార్జుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ.. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభు త్వం నిధులు కేటాయిస్తుంటే కేసీఆర్, మమ తా బెనర్జీలు తమ తెలివితేటలతో వాటిని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమవిగా ప్రచారం చేసుకొంటూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతిని ప్రజల్లోకి తీసు కెళ్లడానికే నియోజకవర్గాలలో పర్యటిసు ్తన్నట్టు వెల్లడించారు. కేంద్ర విచారణ సంస్థలతో రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారన్న విమ ర్శలపై ఆయన స్పందిస్తూ .. ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ విచారణ సంస్థలు వాటి పని చేసుకుంటూ పోతాయని స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. -
పతనం అంచున కేసీఆర్ సర్కార్
కందనూలు/కొల్లాపూర్: ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచే స్తున్న కేసీఆర్ సర్కార్ పతనం అంచున ఉందని కేంద్ర భారీ పరిశ్ర మల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. లోక్‌సభ ప్రవాస్ యోజనలో భాగంగా శుక్రవారం ఆయన నాగర్‌కర్నూల్, కల్వ కుర్తి, కొల్లాపూర్‌లో పర్యటించి కార్యకర్త లతో మాట్లాడారు. కేసీఆర్‌కు పాలన కంటే రాజకీ యాలే ముఖ్యమని, ఎంపీ అని కూడా చూడకుండా అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకులు దాడులు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కొల్లాపూర్ మామిడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మార్కెట్ ఏర్పాటు చేయకుంటే తా మే అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్ల డించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. -
నిజాం షుగర్స్‌ను తెరిపించాలి: మహేంద్రనాథ్
పెర్కిట్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే పేర్కొన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నిర్వహించిన సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిస్తే చెరుకు రైతుల జీవితాలు బాగుపడతాయని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ అర్వింద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
మిథనాల్ ప్లాంట్ జాతికి అంకితం
సాక్షి, హైదరాబాద్/రామచంద్రాపురం (పటాన్చెరు): బొగ్గు నుంచి మిథనాల్‌ను ఉత్పత్తి చేసేందుకు దేశంలో తొలిసారిగా అభివృద్ధి చేసిన కోల్ టు మిథనాల్ (సీటీఎం) ప్లాంట్‌ను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే శనివారం జాతికి అంకితం చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రోజుకు 0.25 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను బీహెచ్ఈఎల్ అభివృద్ధి చేసింది. ఎక్కువ బూడిద ఉండే భారతీయ బొగ్గు నుంచి 99 శాతం స్వచ్ఛతతో మిథనాల్‌ను ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా ఎక్కువ బూడిద కలిగి ఉండే భారతీయ బొగ్గును మిథనాల్‌గా మార్చే పరిజ్ఞానం అందుబాటులోకి రావడం దేశంలో ఇదే తొలిసారి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ బీహెచ్ఈఎల్లో ఆత్మనిర్భర్ భారత్ కింద అభివృద్ధి చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. స్వదేశీ ఉత్పాదక రంగాన్ని నిర్మించడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా తయారీ రంగం ప్రాముఖ్యతను ప్రభుత్వం ప్రజలందరికీ తెలియజేసిందన్నారు. పరిశోధన, అభివృద్ధికి బీహెచ్ఈఎల్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని సంస్థ సీఎండీ నలిన్ సింఘాల్ పేర్కొన్నారు. -
కేంద్రమంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కరోనా
లక్నో: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విటర్లో వెల్లడించారు. ‘గత రెండు రోజులుగా ఆరోగ్యంగా సరిగా లేకపోవడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నాను. కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. ఇటీవల నాతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను’ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. ఆయన సోమవారం కౌశాంబిలోని యశోద ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ల పర్యవేక్షణలో కోవిడ్ చికిత్స తీసుకుంటున్నానని ప్రస్తుతం తన ఆరోగ్యంగా స్థిరంగా ఉందని మహేంద్ర నాథ్ పాండే వెల్లడించారు. -
'ఫోర్డ్' పంచాయితీలో సాయం చేయండి: ఎఫ్ఏడీఏ
న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డీలర్లకు తగు పరిహారం అందేలా సహాయం చేయాలని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ, కేంద్ర ప్రభుత్వానికి కోరుతోంది. డీలర్ల కోసం ఫోర్డ్ ఇండియా తయారు చేస్తున్న పరిహార ప్రణాళికను పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే కు ఓ లేఖ రాశారు. డీలర్లకు పరిహార స్వరూపాన్ని నిర్ణయించే విషయంలో ఎఫ్ఏడీఏ ప్రతిపాదించే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే విధంగా ఫోర్డ్ ఇండియాను ఆదేశించాలని గులాటీ ఆ లేఖలో కేంద్రాన్ని కోరారు. పరిహార ప్యాకేజీలాంటిదేమీ ప్రకటించకుండానే నాన్–డిస్క్లోజర్ అగ్రిమెంట్ (ఎన్డీఏ) మీద సంతకాలు చేయాలంటూ డీలర్లను ఫోర్డ్ ఇండియా బలవంత పెడుతోందని గులాటీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీలర్లు, కస్టమర్లతో పాటు ఆయా డీలర్‌షిప్‌లలో పనిచేస్తున్న సిబ్బంది ప్రయోజనాలను కూడా పరిరక్షించేందుకు చొరవ చూపాలని కేంద్రాన్ని గులాటీ కోరారు. గడిచిన పదేళ్లలో భారత మార్కెట్లో దాదాపు 2 బిలియన్ డాలర్ల నిర్వహణ నష్టాలు నమోదు చేసిన ఫోర్డ్.. ఇక్కడి తమ తయారీ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేస్తున్నామని, ఇకపై దిగుమతి చేసుకున్నవే విక్రయిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: Ford: ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు! -
దేశీయంగా తయారీకి ప్రాధాన్యమివ్వండి
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీకి ప్రాధాన్యమివ్వాలని ఆటో విడిభాగాల పరిశ్రమకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే సూచించారు. క్షేత్రస్థాయిలో స్థానికీకరణపై దృష్టి పెట్టాలని.. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలని పేర్కొన్నారు. అలాగే సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిప్పించడంపైనా ఇన్వెస్ట్ చేయాలని తెలిపారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల అసోసియేషన్ ఏసీఎంఏ 61వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు పేర్కొన్నారు. ‘‘స్థానికంగా తయారీకి ప్రాధాన్యం లభించాలన్నది ప్రధాని మోదీ ఉద్దేశ్యం. పరిశ్రమ కూడా స్థానికీకరణ ప్రక్రియపై కసరత్తు చేస్తోందని నాకు తెలుసు. సియామ్ (వాహనాల తయారీ సంస్థల సమాఖ్య), ఏసీఎంఏ స్థానికీకరణ మార్గదర్శ ప్రణాళికను కూడా రూపొందించాయి. దాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని పరిశ్రమను కోరుతున్నాను’’ అని ఆయన తెలిపారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఆర్అండ్డీ కార్యకలాపాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలని పేర్కొన్నారు. ఆటో విడిభాగాల పరిశ్రమకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.3 శాతం వాటా ఉందని, 50 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 60 శాతం ఆటో విడిభాగాల ఎగుమతులు ఉత్తర అమెరికా, యూరప్ దేశాలకు వెడుతున్నాయని తెలిపారు. వచ్చే అయిదేళ్లలో 2025–26 నాటికి ఎగుమతులను 30 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో దేశీ పరిశ్రమ వాటా 3 శాతానికి చేరగలదని వివరించారు. అలాగే 2025 నాటికి ఆటో విడిభాగాల రంగంలో ఉద్యోగాల సంఖ్య 70 లక్షలకు చేరగలదన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఆటోమోటివ్ ఎగుమతులు 13 బిలియన్ డాలర్లుగా ఉండగా, 1.3 లక్షల కోట్ల డాలర్ల అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌కు 1.2 శాతం వాటా ఉంది. ఏసీఎంఏలో 800 పైచిలుకు తయారీ సంస్థలు ఉన్నాయి. వీటికి సంఘటిత ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరులో 85 శాతం పైగా వాటా ఉంది. ఎలాంటి టెక్నాలజీలనైనా స్థానికంగా వినియోగంలోకి తెచ్చేందుకు తగినంత సమయం లభించేలా దీర్ఘకాలికమైన, స్థిరమైన మార్గదర్శ ప్రణాళిక అవసరమని ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ అభిప్రాయపడ్డారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి: కాంత్ దేశీ ఆటోమొబైల్, విడిభాగాల రంగాలు చైనా నుంచి దిగుమతులపై ఆధారపడటం నుంచి పూర్తిగా బైటికి రావాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సూచించారు. ఆటో విడిభాగాలు మొదలైన వాటన్నింటినీ దేశీయంగా తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఫేమ్ 2 పథకం కింద ఎంపికైన తొమ్మిది నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత నాలుగు చక్రాల వాహనాలకు (కార్లు మొదలైన వాటికి) కూడా స్కీమును వర్తింపచేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. 2030 నాటికి కార్లన్నీ ఎలక్ట్రిక్: నిస్సాన్ వాహన తయారీ రంగంలో భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహన విభాగం కారణంగా పరిశ్రమలో సమూల మార్పులు వస్తాయని కంపెనీ సీవోవో అశ్వని గుప్తా అన్నారు. 2030 నాటికి కంపెనీ కార్లన్నీ ఎలక్ట్రిక్ ఆప్షన్స్‌తో ఉంటాయని వెల్లడించారు. ‘భారత వాహన పరిశ్రమ ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. అయిదారేళ్లలో మూడవ స్థానానికి చేరడం ఖాయం. దేశంలో 1,000 మంది జనాభాకు 20 కార్లు మాత్రమే ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఎలా చేజిక్కించుకోవాలన్నదే పెద్ద సవాల్’ అని అన్నారు. -
ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతుగా నిలవాలి
న్యూఢిల్లీ: స్వావలంబన భారత్ లక్ష్య సాధనలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషించగలదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే చెప్పారు. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రూపంలో పరిశ్రమ ముందు చక్కని అవకాశం ఉందని, దీనికి మద్దతుగా నిలవాలని ఆయన సూచించారు. ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య (ఎఫ్ఏడీఏ) నిర్వహించిన 3వ ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్వావలంబన లక్ష్యాల విషయంలో ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. దేశీయంగా ఉత్పత్తి భారీగా పెరగాలని, ప్రపంచవ్యాప్తంగా మన ఉత్పత్తులు ఎగుమతవ్వాలన్నది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విభాగం వృద్ధి చెందడంలో డీలర్లు, విడిభాగాల తయారీ సంస్థలు, వాహనాల తయారీ సంస్థల పాత్ర కీలకంగా ఉంటుందని పాండే పేర్కొన్నారు. మరోవైపు, ఆటో రిటైల్ రంగం 45 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని, ప్రత్యక్ష–పరోక్ష పన్నులు మొదలైన వాటి రూపంలో ప్రభుత్వానికి రూ. 95,000 కోట్లు కడుతోందని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ తెలిపారు. ఈ నేపథ్యంలో దీనికి పరిశ్రమ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భారీగా పెట్టుబడులు అవసరమైన ఈ రంగంలోని సంస్థలు నిధులు సమీకరించుకునేందుకు దీనితో మరిన్ని అవకాశాలు లభించగలవని ఆయన పేర్కొన్నారు. అటు, విదేశీ ఆటోమొబైల్ సంస్థలు అర్ధాంతరంగా నిష్క్రమించడం వల్ల డీలర్లు నష్టపోకుండా తగు రక్షణాత్మక చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలని గులాటీ విజ్ఞప్తి చేశారు. తుక్కు సర్టిఫికేషన్ కేంద్రాలుగా డీలర్ వర్క్‌షాప్‌లు.. వాహనాల తుక్కు (స్క్రాపేజీ) విధానానికి సంబంధించి డీలర్ల వర్క్‌షాపులే తనిఖీ, సర్టిఫికేషన్ కేంద్రాలుగా వ్యవహరించేందుకు ప్రభుత్వం అనుమతించాలని ప్రభుత్వానికి ’సియామ్’ విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా తనిఖీ కేంద్రాలను ప్రారంభించాలంటే చాలా సమయం పట్టేయవచ్చని, ఇవి అంత లాభసాటిగా కూడా ఉండకపోవచ్చని పేర్కొంది. ఎఫ్ఏడీఏ సదస్సులో పాల్గొన్న సందర్భంగా దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకావా ఈ విషయాలు తెలిపారు. ‘వాహనాలను పరీక్షించేందుకు అవసరమైన పరికరాలు, పెట్టుబడులు, నైపుణ్యాలు డీలర్ల దగ్గర ఎలాగూ ఉంటాయి కాబట్టి ప్రతిపాదిత విధానం ఉపయోగకరంగా ఉంటుంది. పైగా ఈ డీలర్‌షిప్‌లు చాలా మటుకు కస్టమర్లకు దగ్గర్లోనే ఉండటమనేది మరో సానుకూలాంశం‘ అని ఆయన వివరించారు. అటు, వాహనాల ఫిట్నెస్ పరీక్షలకు నిర్దేశించిన 15–20 ఏళ్ల వ్యవధి చాలా సుదీర్ఘమైనదని, అంతకన్నా ముందుగానే టెస్ట్ నిర్వహించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. చదవండి: ఫేస్బుక్లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్ -
కొత్త పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ కోసం అవసరమైన ప్రణాళిక, చర్యలు చేపట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) కార్యాలయంలో గురువారం పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో అనుసరించాల్సిన ప్రణాళికపై అధికారులకు పలు సూచనలు చేశారు. కాలుష్య నియంత్రణ మండలితో సమన్వయం చేసుకుంటూ పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య సమస్య లేకుండా చూడాలన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు తరలించేందుకు జరుగుతున్న పనులను వేగవంతం చేసేందుకు పరిశ్రమల శాఖ డైరెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించండి హుజూర్నగర్ నియోజకవర్గంలోని పరిశ్రమల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే పారిశ్రామిక విధానం కింద ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలతో కేటీఆర్ హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. సిమెంటు పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక యువతకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్‌ను పునరుద్ధరించండి ► కేంద్ర పరిశ్రమల మంత్రికి కేటీఆర్ లేఖ ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంట్‌ను పునరుద్ధరించాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈమేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకు కేటీఆర్ లేఖ రాశారు. ఈ అంశాన్ని గతంలోనూ కేం ద్రం దృష్టికి తెచ్చినా సానుకూల నిర్ణయం రాలేదనే విషయాన్ని గుర్తు చేశారు. 1984లో మర ఠ్వాడ, విదర్భ, ఉత్తర తెలంగాణ ప్రాంత సిమెం టు అవసరాలు తీర్చేందుకు రూ.47 కోట్ల వ్య యంతో ఆదిలాబాద్‌లో 772 ఎకరాల్లో ప్లాంటు, 170 ఎకరాల్లో టౌన్షిప్ నిర్మించారన్నారు. నిధుల లేమితో 1996లో కార్యకలాపాలు నిలిచిపోగా, 2008లో మూసివేశారన్నారు. -
నేను టోల్ ఫీజు కట్టను.. అంతే...
-
సైగలతో జాతీయ గీతాలాపన
న్యూఢిల్లీ: సైగలతో జాతీయ గీతం ఆలాపిస్తున్న వీడియోను కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి మహేంద్ర నాథ్ పాండే గురువారం విడుదల చేశారు. దివ్యాంగులు, ఇతరుల మధ్య తేడా చూపకూడదనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు . ‘జాతీయ గీతాన్ని సైగల భాషలో రూపొందించినందుకు మనమంతా గర్వించాలి. మన దేశంలో సైగలను చాలా పురాతన కాలం నుంచే వాడుతున్నాం’ అని మంత్రి అన్నారు. గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన 3.35 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఎర్రకోట ముందు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొందరు దివ్యాంగులతో కలసి జాతీయగీతాన్ని సైగలతో ఆలపిస్తున్నట్లు కనిపిస్తోంది. -
2018 నుంచి డిటెన్షన్ అమలుచేస్తాం: కేంద్రం
అగర్తలా: పాఠశాలలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులను అదే తరగతిలో ఉంచే డిటెన్షన్ విధానాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని కేంద్ర మానవవనరుల సహాయ మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. డిటెన్షన్ లేకపోవడంతో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని రాష్ట్రాలు చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం విద్యాహక్కు చట్టం–2009ను సవరించడానికి రాష్ట్రాలన్నీ అంగీకరించాయని పాండే తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు ఉత్తీర్ణులు కాకపోయినా పైతరగతులకు పంపాల్సి ఉంటుంది. దేశంలోని 20 విశ్వవిద్యాలయాలను ప్రపంచస్థాయి విద్యా సంస్థలుగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ సంకల్పించినట్లు పాండే వెల్లడించారు.