అగర్తలా: పాఠశాలలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులను అదే తరగతిలో ఉంచే డిటెన్షన్ విధానాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని కేంద్ర మానవవనరుల సహాయ మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. డిటెన్షన్ లేకపోవడంతో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని రాష్ట్రాలు చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం విద్యాహక్కు చట్టం–2009ను సవరించడానికి రాష్ట్రాలన్నీ అంగీకరించాయని పాండే తెలిపారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు ఉత్తీర్ణులు కాకపోయినా పైతరగతులకు పంపాల్సి ఉంటుంది. దేశంలోని 20 విశ్వవిద్యాలయాలను ప్రపంచస్థాయి విద్యా సంస్థలుగా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ సంకల్పించినట్లు పాండే వెల్లడించారు.
2018 నుంచి డిటెన్షన్ అమలుచేస్తాం: కేంద్రం
Published Fri, Jul 7 2017 6:52 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM
Advertisement
Advertisement