
కొల్లాపూర్‌లో కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న మామిడి రైతులు
కందనూలు/కొల్లాపూర్: ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచే స్తున్న కేసీఆర్ సర్కార్ పతనం అంచున ఉందని కేంద్ర భారీ పరిశ్ర మల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. లోక్‌సభ ప్రవాస్ యోజనలో భాగంగా శుక్రవారం ఆయన నాగర్‌కర్నూల్, కల్వ కుర్తి, కొల్లాపూర్‌లో పర్యటించి కార్యకర్త లతో మాట్లాడారు. కేసీఆర్‌కు పాలన కంటే రాజకీ యాలే ముఖ్యమని, ఎంపీ అని కూడా చూడకుండా అర్వింద్ ఇంటిపై టీఆర్‌ఎస్ నాయకులు దాడులు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
కొల్లాపూర్ మామిడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మార్కెట్ ఏర్పాటు చేయకుంటే తా మే అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్ల డించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment