Kollapur
-
కొల్లాపూర్ ఘటనపై జూపల్లి రియాక్షన్
-
పెళ్లి తేదీతో పాటు కాబోయే భర్త ఎవరో చెప్పిన 'బర్రెలక్క'
బర్రెలక్క.. అసలు పేరు కర్నె శిరీష. తెలంగాణలోని పెద్దకొత్తపల్లి మండలం, మరికల్ గ్రామానికి చెందిన బర్రెలక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్గా అందరికీ పరిచయమే. ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో పాటు యువతను ఆలోచించే విధంగా పలు వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించింది. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియా ఖాతాలో తన భర్త వివరాల గురించి నెటిజన్లు ఆరా తీశారు. దీంతో ఆమె తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేసింది. తన పెళ్లి ప్రకటన గురించి అధికారికంగా ప్రకటించిన శిరీష తన నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. తాజాగా తనకు కాబోయే భర్త ఫోటోలను కూడా ఆమె రివీల్ చేసింది. వారిద్దరూ కలిసి ఓక ఫోటో షూట్ కూడా చేశారు. ఆ వీడియోను కూడా శిరీష్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మార్చి 28న వెంకటేశ్ అనే అబ్బాయితో శిరీష వివాహం జరగబోతుంది. అతను ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తిచేశాడని తెలుస్తోంది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. మరికల్ గ్రామానికి చెందిన శిరీష ఆమె తల్లి రోజు కూలీ, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లీకి సాయంగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చదవుతున్నట్లు ఆమె గతంలో పంచుకుంది. తెలంగాణ ఎన్నికల సమయంలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి.. 5,754 ఓట్లతో అక్కడ నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆమె ఎంపీగా కూడా పోటీ చేస్తానని చెప్పింది. తాను ఓడిపోయిన పర్వాలేదు అంటూనే తన పోటీ యువతను మేలుకొల్పేందుకే అని చెప్పింది. View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) -
పెళ్లి వార్తను ప్రకటించిన 'బర్రెలక్క'
తెలంగాణ ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన పేరు బర్రెలక్క.. అసలు పేరు కర్నె శిరీష. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించింది. అందుకు సంబంధించిన పలు వీడియోల ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి.. 5,754 ఓట్లతో అక్కడ నాలుగో స్థానంలో నిలిచింది. 2022 డిసెంబరులో ఈ యువతి బర్రెలను కాస్తూ సామాజిక మాధ్యమంలో ఓ వీడియోను పోస్టు చేసింది. ఉద్యోగాలు రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె పేరు వైరల్ అయింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ రెండూ తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందింది. గతంలో ఆమె పెళ్లి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో రావడం అందుకు ఆమె రియాక్ట్ కావడం జరిగింది. అవన్నీ కొట్టిపారేస్తూ.. తన పెళ్లి ప్రకటన గురించి అధికారికంగా ఆమె ప్రకటించింది. తనకు నిశ్చితార్థం జరిగినట్లు బర్రెలక్క తాజాగా తెలిపింది. తన ఎంగేజ్మెంట్ కార్యక్రమం సడెన్‌గా సెట్ కావడంతో ఎవరినీ పిలువలేకపోయానని ఆమె చెప్పింది. పెళ్లి కోసం షాపింగ్ చేసిన వీడియోలను కూడా ఆమె పంచుకుంది. కాబోయే భర్త ఎవరో మాత్రం రివీల్ చేయలేదు. ఇటీవల బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ అవన్నీ అవాస్తవాలనీ ప్రశాంత్ తనకు అన్నయ్య లాంటి వ్యక్తి అని బర్రెలక్క కొట్టిపారేసింది. View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) -
బర్రెలక్క.. తగ్గేదేలే!
బర్రెలక్క(శిరీష).. ఆమె ఓ సోషల్ మీడియాలో సంచలనం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రధాన పార్టీ అభ్యర్థులకు సైతం ఆమె ముచ్చెమటలు పట్టించారు. శిరీషకు వచ్చిన ప్రచారాన్ని చూసి ఆమె గెలుస్తుందని కూడా చాలా మంది భావించారు. ఒకవైపు ప్రశంసలు.. మరొకవైపు విమర్శల నడమ ఆమె పోటీకి సై అన్నారు. వెనక్కి తగ్గమని బెదిరింపులు.. బుజ్జగింపుల పర్వం కొనసాగినా చివరి వరకూ పోటీలోనే ఉంటానని చెప్పి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు శిరీష. అయితే ఇక్కడ బర్రెలక్క అనబడే శిరీష ఓడింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నాలుకల్లో ఉండిపోయేంత ఆదరణను చూరగొంది. అదే ఇప్పుడు ఆమెకు కొండంత బలంలా పని చేస్తోంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి రెడీ అంటోంది. నాల్గో స్థానమే.. కానీ ప్రతీ నోట బర్రెలక్క మాటే..! ఆమె పోటీ చేసిన కొల్లపూర్ నియోజకవర్గంలో నాలుగో స్థానంలో నిలిచారు బర్రెలక్క. నిరుద్యోగుల తరఫున స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన శిరీషకు మొత్తం 5,598 ఓట్లు వచ్చాయి. కానీ కౌంటింగ్ జరుగుతున్నంతసేపు బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వచ్చాయి? కొల్లపూర్లో పరిస్థితి ఏంటి అనేది చర్చ కూడా నడిచింది. ప్రధానంగా బర్రెలక్క ఎవరి గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉందనే విషయం కూడా జనం నోళ్లల్లో ఎక్కవగా నానింది. చివరకు పరాజయం చవిచూసినా ఒక సామాన్యురాలు.. ఆ మాత్రం ముందుకు వెళ్లడమే చాలా గొప్ప విషయమంటూ పొగిడిన నోళ్లు ఎన్నో.. నాకు ప్రచారానికి టైమ్ సరిపోలేదు.. ఫలితాల అనంతరం ఆమె మీడియాలో మాట్లాడుతూ.. తాను ప్రచారం ఎక్కువ రోజులు చేయలేకపోయానని, వారం రోజులు మాత్రమే తాను పూర్తి స్థాయిలో ప్రచారం చేసినట్లు చెప్పారు. తాను ఎక్కువ రోజులు ప్రచారం చేసి ఉంటే మరింత ప్రభావం చూపేదానినని ఆమె పేర్కొంది. ప్రజలు ఎవరినీ తొందరగా నమ్మరని, తనది చిన్న వయసు కావున.. ఎలా పాలిస్తుందని అనుకున్నారని తెలిపారు. నిరుద్యోగ సమస్యలపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. తాను ఓడిపోలేదని ప్రజల మనసు గెలిచానని తెలిపారు. కొందరు తనకు ఓటు వేయకూడదని ఓటర్లను బెదిరించారని చెప్పారు. తాను ఓట్ల కోసం డబ్బులు పంచలేదని.. తనకు వచ్చిన ఓట్లు స్వచ్ఛమైనవని, ఈ రకంగా తాను గెలిచినట్లేని చెప్పారు. తాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కూడా పోటీ చేస్తానని తెలిపారు. తనకు ఓటు వేసిన ఓటర్లకు, మద్దతుగా నిలిచిన మేధావులకు, సోషల్ మీడియా మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరిలో ఆసక్తి ఓట్లు విషయంలో ఆమె అందరిలో ఆసక్తి రేపిన విషయం తెలిసిందే. గెలవకపోయినా కొల్లాపూర్ నియోజకవర్గంలో తన మార్క్ చూపుతుందని ఆమె మద్దతుదారులు ఆశించారు. ఆమె ప్రచారం కోసం పలు సంఘాల నేతలు, సోషల్ మీడియా ఫాలోవర్లు, న్యాయవాదులు, టీచర్లు, ముఖ్యంగా ఇతర జిల్లాలకు చెందిన నిరుద్యోగులు ఎంతో శ్రమించారు.. ఆమె సైతం ఎవరికీ భయపడకుండా.. ఒక వైపు తన సోదరుడి మీద దాడి జరిగినా ప్రచారంలో ముందుకు వెళ్లింది. ఈ ఎన్నికల్లో ఆమెకు వచ్చిన ఓట్లను పక్కన పెట్టి.. అసలు పోటీ చేయడమే గొప్ప విషయమని, నిరుద్యోగుల పక్షాన పోరాటం అపొద్దని నెటిజన్లు కోరుతున్నారు. పోటీలో గెలవకపోయినా శిరీష తొలి అడుగును, ప్రచారంలో ఆమె చూపిన ధైర్యాన్ని అన్ని వర్గాలు వారు అభినందిస్తున్నారు. బర్రెలక్క బరిలో ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. -
కొల్లాపూర్ లో బర్రెలక్క ముందంజ
-
బర్రెలక్క(శిరీష)కు అన్ని ఓట్లా..?
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మెజార్టీ సర్వేలు తమ ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టం చేయగా, ఒకటి రెండు సర్వేలు మాత్రం బీఆర్ఎస్కు గెలిచే అవకాశాలున్నాయి పేర్కొన్నాయి. ఆరా మస్తాన్ సర్వే(ప్రీపోల్ సర్వే) కాంగ్రెస్ 58 నుంచి 67 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక బీఆర్ఎస్ 41-49 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని, అదే సమయంలో బీజేపీ 5 నుంచి 7, ఎంఐఎం, ఇతరులు కలుపుకుని 7 నుంచి 9 స్థానాల్లో విజయం సాధిస్తారని ఆరా మస్తాన్ తన ప్రీపోల్ సర్వేను బయటపెట్టింది. ఇక ఆరా మస్తాన్ సర్వేలోని కొన్ని హైలెట్స్‌ను చూస్తే తెలంగాణలో ఐదుగురు మంత్రులు తీవ్రమైన పోటీ ఎదుర్కోబోతున్నట్లు పేర్కొంది. ఇక రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ట్రెండింగ్‌లో నిలిచిన బర్రెలక్క(అలియాస్ శిరీష) కూడా తన ఖాతాలో భారీ ఓట్లను వేసుకోబోతున్నట్లు సదరు సర్వే తెలిపింది. కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క 10 వేలకు పైగా ఓట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఆరా మస్తాన్ సర్వే హైలెట్స్ ఇలా.. 5 గురు మంత్రులు తీవ్రమైన పోటీ ఎదుర్కుంటున్నారు నిర్మల్‌లో మంత్రి అవుట్ అయ్యి ఛాన్స్ ముధోల్, కామారెడ్డిలలో బీజేపీ గెలిచే ఛాన్స్ బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి గెలిచే అవకాశం కరీంనగర్ లో మంత్రి గంగుల గెలిచే ఛాన్స్ సిరిసిల్లలో కేటీఆర్ మంచి మెజారిటీతో గెలిచే ఛాన్స్ సిద్దిపేటలో అత్యధిక మెజారిటీతో(70 వేలు) హరీష్ గెలిచే ఛాన్స్ దామోదర రాజ నర్సింహ గెలిచే ఛాన్స్ తక్కువ మెజారిటీ తో కేసీఆర్ గెలిచే ఛాన్స్ మహేశ్వరంలో స్వల్ప ఆధిక్యంతో సబిత గెలిచే ఛాన్స్ అంబర్ పేటలో కారుకే ఛాన్స్ తలసాని మంచి మెజారిటీతో గెలుస్తారు వనపర్తిలో మంత్రి నిరంజన్ ఓడిపోయే ఛాన్స్ కొడంగల్ లో రేవంత్ గెలిచే ఛాన్స్ బర్రెలక్క కి 10 వేల ఓట్లు ఉత్తమ్, పద్మావతి గెలుస్తారు కోమటి రెడ్డి బ్రదర్స్ గెలుస్తారు హుజూరాబాద్ లో 50 50 ఛాన్స్ మంత్రి దయాకర్ రావు ఓడిపోయే ఛాన్స్ ఖమ్మలో పువ్వాడ ఓడిపోయే ఛాన్స్ పాలేరు, మధిర కాంగ్రెస్ గెలుస్తుంది కొత్తగూడెంలో సీపీఐ గెలుస్తుంది -
ఎన్నికల్లో గెలిపించాలని కొల్లాపూర్ ప్రజలను కోరుతున్న బర్రెలక్క
-
శిరీష(బర్రెలక్క)కు భద్రత కల్పించండి: తెలంగాణ హైకోర్టు
సాక్షి, కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి కార్నె శిరీష(బర్రెలక్క)కు భద్రత కల్పించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని శుక్రవారం ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యేదాకా ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని, ఆమె హాజరు అయ్యే పబ్లిక్ మీటింగ్‌లకు సెక్యూరిటీ ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. గుర్తింపు ఉన్న పార్టీల అభ్యర్థులకు మాత్రమే భద్రత ఇస్తే సరిపోదు. తమకు ముప్పు ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు కూడా భద్రత కల్పించాలి. అభ్యర్థుల బాధ్యత ఎన్నికల కమిషన్‌దే. పోలీసులు కేవలం కార్లు చెక్ చేస్తాం అంటే కుదరదు అని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. తనపై రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినందున 2ప్లస్2 గన్మెన్లతో భద్రత కల్పించాలని కోరుతూ కర్నె శిరీష (బర్రెలక్క) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కొల్లాపూర్ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు బర్రెలక్కతో పాటు ఆమె తమ్ముడిపై దాడి చేశారు. ఆమె తమ్ముడు తీవ్రంగా గాయపరిచారు. వెనక్కి తగ్గను.. ‘నేను ఓట్లు చీల్చుతాననే భయంతో కొందరు నాపై దాడులకు ప్రయత్నిస్తున్నారు. నా తమ్ముడిపై దాడికి పాల్పడింది ఎవరో.. వారు ఏ పార్టీ వారో కూడా తెలుసు. కానీ, నేను వారి పార్టీ పేరు వెల్లడించను. ప్రాణం పోయినా.. ఈ పోరాటంలో వెనకడుగు వేయను’అని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క అన్నారు. ‘నాలుగైదు సార్లు గెలిచిన వాళ్లు, అధికార పార్టీ వాళ్లు నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే రౌడీమూకలతో నాపై దాడులకు ప్రయత్నిస్తున్నారు. నాకు మద్దతుగా ప్రచారం చేస్తున్న మధు అనే అన్నను సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి తొలగించారు. అండగా నిలుస్తున్న వారిని బెదిరిస్తున్నారు. అయినా నేను దేనికీ భయపడను. నేను ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేసినా.. భవిష్యత్‌లో వెయ్యి అడుగులు వెనక్కి వేసినదాన్ని అవుతా. యువతకు ఇది తప్పుడు సంకేతం ఇస్తుంది.’అని పేర్కొన్నారు. -
పార్టీకి రాజీనామా చేసిన టీపీసీసీ సభ్యులు సీఆర్ జగదీశ్వర్ రావు
-
కాంగ్రెస్‌లో గందరగోళం.. ముందు ప్రకటన, తరువాత వాయిదా, చివరికి రద్దు.
► ఉద్యమాల పురిటిగడ్డ సూర్యాపేటలో బీసీ గర్జన సభ పెడతాం. సిద్ధరామయ్యను పిలుస్తాం. అక్కడే బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం: సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన. ► నల్లగొండలో త్వరలోనే భారీ బహిరంగ సభ.. ప్రియాంక లేదా రాహుల్ వస్తారు. ఆ తర్వాతే ఖమ్మంలో భారీ సభ ఉంటుంది: భట్టి యాత్ర సమయంలోనే ఇంకో ప్రకటన. ► రాహుల్ ఖమ్మం వచ్చారు.. కొల్లాపూర్‌కు ప్రియాంక వస్తారు.. జూలై 20న ఖాయంగా వస్తారు.. కాదు కాదు 30న రావచ్చు... లేదు లేదు ఆగస్టు మొదటి వారంలో తప్పకుండా వస్తారు: మాజీ మంత్రి జూపల్లి పార్టీలో చేరిక కోసం కాంగ్రెస్ నేతలు పలు సందర్భాల్లో చేసిన ప్రకటనలు. ► ఎన్నికలలోపు ఆరు భారీ సభలు నిర్వహిస్తాం. ఒకటి లేదా రెండు సభలకు రాహుల్ వస్తారు. ఒక సభకు ప్రియాంక, మరో సభకు ఖర్గే, ఇంకో సభకు సిద్ధరామయ్య వస్తారు: పీఏసీ సమావేశం అనంతరం చేసిన భారీ ప్రకటన. ► ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే 18వ తేదీన వస్తారు. అక్కడ పేదలకు మేలు చేసే డిక్లరేషన్ చేస్తాం: మాజీ మంత్రి చంద్రశేఖర్‌ను కలిసిన సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ ► చేవెళ్ల సభకు ముఖ్య అతిథిగా ఖర్గే వస్తారు. సమయం లేదు కాబట్టి 18న సభ వాయిదా వేశాం. త్వరలోనే తేదీ ప్రకటిస్తాం: మంగళవారం గాంధీభవన్ నుంచి మీడియాకు అందిన అధికారిక సమాచారం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ అగ్రనేతల సభలు, సమావేశాల గురించి దాదాపు రెండు నెలల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారికంగా, అనధికారికంగా వెలువడిన ప్రకటనలు, మీడియాకు ఇచ్చిన లీకుల పర్వం ఇది. ఎంతో ఆర్భాటంగా ప్రకటనలైతే వెలువడుతున్నాయి కానీ..ప్రకటించిన విధంగా అగ్రనేతలతో బహిరంగ సభలు నిర్వహణలో మాత్రం పార్టీ విఫలమవుతోంది. బహిరంగ సభలను ప్రకటించడం, ఆ తర్వాత తేలిగ్గా వాయిదా వేసేయడం రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి రివాజుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సభల వాయిదాల పర్వంపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకీ వాయిదాలు సూర్యాపేటలో మొదలై నల్లగొండ వరకు వచ్చి ఆ తర్వాత కొల్లాపూర్ మీదుగా జహీరాబాద్ వెళ్లి అక్కడి నుంచి చేవెళ్లకు వచి్చన కాంగ్రెస్ బహిరంగ సభల ‘వాయిదా రైలు’ఎక్కడ ఆగుతుంది? అసలు ఏ స్టేషన్లోనూ ఈ రైలు ఎందుకు ఆగడం లేదన్నది ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అయితే అధిష్టానానికి, హాజరు కావాల్సిన అగ్ర నేతలకు సమాచారం ఇవ్వకుండా, వారి అంగీకారం తీసుకోకుండానే ఎడాపెడా ప్రకటనలు చేసేయడం, ఆ తర్వాత ఫలానా తేదీన తమకు సమయం ఇవ్వాలంటూ పీసీసీ, సీఎల్పీల నుంచి పార్టీ హైకమాండ్‌కు లేఖలు రాయడం, అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో ఢిల్లీ వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయడం, అయినా వీలుకాక పోవడంతో చివరకు వాయిదా వేయడం జరుగుతోందని పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. చదవండి: వారసులు రెడీ.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా సుమారు 30 మంది పార్టీ రాష్ట్ర నాయకుల టేకిటీజీ వ్యవహారశైలితో పాటు పార్టీ అధిష్టానం తాము ఏం చెప్పినా వింటుందనే అతి భరోసాతోనే ఇదంతా జరుగుతోందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ‘ఎక్కడ సభ ఏర్పాటు చేయాలన్నా ముందస్తు ప్రణాళిక ఉండాలి. ఫలానా చోట సభ పెట్టాలనుకున్నప్పుడు అక్కడి నాయకత్వంతో చర్చలు జరపాలి. సదరు ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలకు సమాచారమిచ్చి వారితో మాట్లాడి వారి సమ్మతి తీసుకోవాలి. తర్వాత అధిష్టానానికి సమాచారం పంపి వారి అంగీకారం తీసుకుని ప్రకటన చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సభ నిర్వహణ అంటే మామూలు విషయం కాదు కదా? అన్ని రకాలుగా పార్టీ నేతలను, కేడర్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం పారీ్టలో ఆ ధోరణి ఇసుమంతైనా కనిపించడం లేదు..’అని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం పార్టీలో కొనసాగుతున్న గందరగోళానికి అద్దం పడుతోంది. చేవెళ్లలోనైనా జరుగుతుందా? ఈ నెల 18వ తేదీన జహీరాబాద్‌లో ఖర్గే సభను రద్దు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వేదికను చేవెళ్లకు మార్చింది. చేవెళ్లలో సభ నిర్వహణ కోసం ఆ నియోజకవర్గ నేతలతో రాష్ట్ర ఇన్చార్జి ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలు మంగళవారం సమావేశమయ్యారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ సభకు ముఖ్యఅతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వస్తారని, 24న సభ జరిగే అవకాశం ఉందని, త్వరలోనే తేదీని ప్రకటిస్తామని తెలిపాయి. మరి చేవెళ్లలో అయినా కాంగ్రెస్ సభ వాయిదా పడకుండా జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే. -
వస్తూనే పంచాయితీ పెట్టిన జూపల్లి! టికెట్ ఇవ్వకపోతే అంతే మరి?
ఎన్నికల సీజన్లో నాయకుల గోడ దూకుళ్ళు సహజమే. ఏ పార్టీకి మొగ్గు కనిపిస్తుంటే ఆ పార్టీలో దూకడానికి సిద్ధంగా ఉంటారు. అయితే అప్పటికే అక్కడున్న నేతలు కొత్తవారు వస్తే తమకు ప్రమాదమని ఆందోళన చెందడం కూడా సహజమే. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జూపల్లి కృష్ణారావు తదితరులు త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడే అక్కడ సీట్ల లొల్లి మొదలైంది. కర్నాటక ఫలితాలతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతల సంఖ్య పెరుగుతుండటంతో పాలమూరు జిల్లాలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేష్‌రెడ్డి, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత తదితర అనేక మంది నేతలు కాంగ్రెస్ తీర్థం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ముహూర్తం ఫిక్స్.. ఈ నెల 30న సభ వాయిదాలు పడుతూ వస్తున్నకొల్లాపూర్ కాంగ్రెస్ సభకు ఈనెల 30న ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలిసిందే. ప్రియాంకగాంధీ సమక్షంలో ఈ భారీ బహిరంగసభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు నేతలు. సభ కోసం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాక.. 20వ తేదీనాటి కొల్లాపూర్ సభ వాయిదా పడింది. మరోవైపు కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న జగదీశ్వర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి తమ స్వరం పెంచారు. సీనియర్ నాయకుడు మల్లురవి ఆధ్వర్యంలో కొల్లాపూర్‌లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నాగం జనార్దన్‌రెడ్డి, జగదీశ్వర్‌రావులు హాజరైన ఈ సమావేశం వాడీవేడిగా జరిగింది. కొల్లాపూర్ సీటు ఆయనకే.. కాదంటే సమావేశానికి ముందు జగదీశ్వర్‌రావు భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు. గెలిచిన నాయకులు పార్టీని వదిలి పెట్టిన కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన జగదీశ్వర్‌రావుకు కొల్లాపూర్ సీటు తప్పకుండా ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పార్టీకి ఊపు వచ్చిన తర్వాత సీట్లకోసం పార్టీలో చేరితే సహకరించేంది లేదనే సంకేతాలు ఇచ్చారు. ఇదే విషయాన్ని నాగం జనార్దన్‌రెడ్డి కూడ స్పష్టం చేశారు. సీట్లు కేటాయింపు అనేది సర్వేల ఆధారంగానే జరుగుతుందని మల్లు రవి చెప్పినా కార్యకర్తలు వ్యతిరేకించారు. కొల్లాపూర్‌తో పాటు నాలుగు అసెంబ్లీ స్దానాలు తనవారికి కేటాయించాలని కొత్తగా వస్తున్న నేత డిమాండ్ చేసినట్టు తెలుస్తోందంటూ.. జూపల్లిని ఉద్దేశించి నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించటం హాట్‌టాపిక్‌గా మారింది. ఇదేమాత్రం కరెక్ట్ కాదని నాగం స్పష్టం చేశారు. అసలు జూపల్లి ఎందుకు చేరడం.. కొల్లాపూర్‌లో జగదీశ్వర్‌రావు గెలుపుకోసం పనిచేయాలని నాగం జనార్థనరెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. జూపల్లి కృష్ణారావు తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నాగం హెచ్చరించటంతో కలకలం రేగింది. సర్వేల పేరు చెబుతున్నా జూపల్లి కృష్ణారావుకు సీటు గ్యారెంటీ లేకుండా పార్టీలో ఎందుకు చేరతాడనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొల్లాపూర్ సీటు జూపల్లికి కేటాయిస్తే జగదీశ్వర్‌రావు సహకరించటం కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది పార్టీలో అంతర్గత పోరుకు తెరలేపుతుందని కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రియాంకగాంధీ సభ వాయిదా పడి పరేషాన్లో ఉన్న జూపల్లికి సీట్లలొల్లి తలనొప్పిగా మారిందట. కూచుకుళ్లకు ముందే హామీ.. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేష్‌రెడ్డికి నాగర్‌కర్నూల్ సీటు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు ప్రచారం సాగుతోంది. నాగం జనార్దన్‌రెడ్డి మాత్రం ఈసారి తనకే అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. మరో నాలుగేళ్ళ పదవీకాలం ఉన్నా ఎమ్మెల్సీ సీటు వదులుకుని కూచకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. ఆయన తనయుడికి సీటు భరోసా ఇచ్చాకే పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే చేరికలకు ముందే పార్టీలో కొత్త, పాత నేతల మధ్య జరుగుతున్న పోరు పార్టీకి నష్టం కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ పాలమూరు సీట్ల లొల్లిని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. లేదంటే జూపల్లి చేరికపై ఏమైనా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయా అనేది తేలాల్సి ఉంది. -సాక్షి, పొలిటికల్ డెస్క్ -
కొల్లాపూర్‌లో ప్రియాంక సభ వాయిదా.. కారణం చెప్పిన రేవంత్
సాక్షి, హైదరాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఈ నెల 20న జరగాల్సిన కాంగ్రెస్‌సభ వాయిదా పడింది. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీలో చేరేందుకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకాగాంధీ సమక్షంలో నిర్వహించాలనుకున్న ఈ సభను వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అయితే, సభకు ప్రియాంకాగాంధీ హాజరవుతారని తొలుత చెప్పినప్పటికీ, ఆమె వచ్చే అవకాశం లేనందున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వస్తారనే చర్చ జరిగింది. కానీ, ఖమ్మం సభకు అగ్రనేత రాహుల్‌గాంధీ వచ్చిన నేపథ్యంలో కొల్లాపూర్ సభకు ప్రియాంకాగాంధీ రావడమే సరైందని భావించిన టీపీసీసీ నేతలు ఆ మేరకు కొల్లాపూర్‌సభను వాయిదా వేయాలని నిర్ణయించారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ నెల 20వ తేదీ తర్వాత ప్రియాంక సమయం కోరగా, 23, 25, 28 తేదీల్లో ఏదో ఒకరోజు సభ ఏర్పాటు చేసుకోవచ్చని, తేదీ ఖరారయిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం వచ్చినట్టు తెలిసింది. టీపీసీసీ ఆస్తుల పరిరక్షణకు కమిటీ సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ఆస్తుల పరిరక్షణ కోసం మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి చైర్మన్‌గా, సౌదారాం గంగారం కన్వీనర్‌గా ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఆమోదం తెలపడంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్‌కుమార్ గౌడ్ ఉత్తర్వులిచ్చారు. ఈ కమిటీలో పార్టీ నేతలు జి. నిరంజన్, కె.దయాసాగర్‌రావు, పొన్నం అశోక్‌గౌడ్, ఎం. రాంచంద్రారెడ్డి, టి.బెల్లయ్య నాయక్, ఎం.ఎ. ఫహీమ్‌లను సభ్యులుగా ఉన్నారు. -
పతనం అంచున కేసీఆర్ సర్కార్
కందనూలు/కొల్లాపూర్: ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచే స్తున్న కేసీఆర్ సర్కార్ పతనం అంచున ఉందని కేంద్ర భారీ పరిశ్ర మల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. లోక్‌సభ ప్రవాస్ యోజనలో భాగంగా శుక్రవారం ఆయన నాగర్‌కర్నూల్, కల్వ కుర్తి, కొల్లాపూర్‌లో పర్యటించి కార్యకర్త లతో మాట్లాడారు. కేసీఆర్‌కు పాలన కంటే రాజకీ యాలే ముఖ్యమని, ఎంపీ అని కూడా చూడకుండా అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకులు దాడులు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కొల్లాపూర్ మామిడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మార్కెట్ ఏర్పాటు చేయకుంటే తా మే అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్ల డించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. -
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో భారీ వర్షాలు
-
భర్త వేధింపులతో ఒకరు.. పెళ్లికి యువకుడు నిరాకరించాడని మరొకరు
సాక్షి, మహబూబ్‌నగర్: మండలంలోని తాళ్లనర్సింహాపురం గ్రామానికి చెందిన దుబ్బల సుజాత(30) భర్త వేధింపులు భరించలేక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ బాలవెంకటరమణ కథనం ప్రకారం.. ఈ నెల 13న రాత్రి భర్త క్రాంతికుమార్ సుజాతను కొట్టడంతో ఆమె తన తల్లి అలివేలమ్మకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆమె వచ్చి అల్లుడికి నచ్చజెప్పి వెళ్లింది. మళ్లీ 16న రాత్రి భర్త మరోసారి కొట్టడంతో మనస్తాపానికి గురై నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే తల్లి, బంధువులు నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. సుజాత కొల్లాపూర్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తుండగా.. క్రాంతికుమార్ పెంట్లవెల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ ఘటనపై సుజాత అన్న సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: భర్త ఆగడాలు తట్టుకోలేక.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య వెల్దండ: ప్రేమ విఫలమైందని పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్ఐ నర్సింహులు కతనం ప్రకారం.. వెల్దండలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నాగరత్నమ్మ(24) ఆమనగల్ మండలానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ నెల 20న పురుగు మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌కు తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై నాగరత్నమ్మ అన్న నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
టన్నెల్ పనుల్లో ప్రమాదం
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ శివారులోని రేగుమాన్గడ్డ వద్ద జరుగుతున్న టన్నెల్ పనుల్లో ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. టన్నెల్‌లోని పంప్‌హౌస్ వద్ద క్రేన్ వైర్ తెగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. పంప్‌హౌస్‌లో అడుగున జరుగుతున్న పనుల కోసం క్రేన్ సహాయంతో కాంక్రీట్ బకెట్‌ను కిందకు దింపుతుండగా క్రేన్‌వైర్ తెగడంతో అది టన్నెల్లో ఉన్న కార్మికులపై పడినట్లు తెలిసింది. ఆ సమయంలో అక్కడ ఆరుగురు కార్మికులు ఉండగా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలం వద్ద ఇరుక్కుపోయిన మృతదేహాలను ఎయిర్‌ప్రెషర్ సహాయంతో బయటకు తీశారు. ఇందుకోసం సుమారు 3 గంటల సమయం పట్టినట్లు అక్కడివారు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదుగురి మృతదేహాలను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలుకు చెందిన దయ్యాల శ్రీను (42), జార్ఖండ్‌కు చెందిన బోలేనాథ్ (45), ప్రవీనేజ్ (38), కమ్లేశ్ (36), బిహార్‌కు చెందిన సోను కుమార్(36) ఉన్నట్లు గుర్తించామని ఆసుపత్రివద్ద పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన లాల్ బల్విందర్ సింగ్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని కుడిచేతికి తీవ్రగాయం అయినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే నేపథ్యంలో ప్రాజెక్టు పనులు ప్రస్తుతం నిలిచిపోయాయని, నిర్వహణ పనుల్లో భాగంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాజెక్టు ఈఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని వెల్లడించారు. భవన, నిర్మాణరంగ కార్మికుల కేంద్ర బోర్డు చైర్మన్ శ్రీనివాసులు నాయుడు ఘటనాస్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సొంతూళ్లకు తరలించారు. -
ఇంటికే వస్తా అంటే రమ్మంటిని, కానీ, ఎక్కడా?: జూపల్లి
సాక్షి,నాగర్ కర్నూల్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం విష్ణువర్ధన్ రెడ్డి పరస్పర సవాళ్లతో కొల్లాపూర్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో అవాంఛిత ఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ ఎత్తున మోహరించారు. అయితే, చర్చలో పాల్గొనేందుకు జూపల్లి ఇంటికి బీరం ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే బీరం నిరాధార ఆరోపణలను జూపల్లి మీడియా ఎదుట ఎండగట్టారు. చదవండి👉🏼 విరాట పర్వం.. 30 ఏళ్ల కిందట పేలిన తూటా శంకరన్న చేతిలో సరళ బలి రాత్రి నుంచి చూస్తున్నా.. ఎక్కడా? ‘నేను అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడదామన్న. కాని చర్చకు ఇంటికే వస్తా అంటే స్వాగతం పలుకుతానని చెప్పా. నీ మాట ప్రకారమే రాత్రి నుంచి ఎదురుచూస్తున్నా. కానీ, ఎమ్మెల్యే రాలేదు. మూడున్నరేళ్లు ఎమ్మెల్యే ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అరెస్టు చేయించుకుని తప్పించుకుని పోయినవ్.. ముఖం చాటేసుకున్నవ్. ఎమ్మెల్యే మాట మార్చాడు. నేను మాట మార్చలేదు. హుస్సేన్ సాగర్ కారు ప్రమాదం, ఫ్రుడెన్షియల్ బ్యాంకు వ్యవహారాలపై ఎమ్మెల్యే అవాస్తవాలు మాట్లాడుతున్నాడు. అప్పు తీసుకుని వ్యాపారం చేసాం, ఇది తప్పు అన్నట్లుగా మాట్లాడితే ఎట్లా!. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయొద్దని సహచర మంత్రులే సూచించినా నేను వెనక్కి తగ్గలేదు. మిగతా మంత్రులపై ఒత్తిడి వస్తుంది వద్దన్నారు. వెయ్యి కోట్లిచ్చినా అమ్ముడు పోయే వ్యక్తిని కాను. నాది మచ్చలేని చరిత్ర. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కోర్టులో కేసు వేసిందెవరు? నా పై నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బీరంపై పరువు నష్టం దావా వేస్తా’అని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. చదవండి👉🏼కొల్లాపూర్‌లో హై టెన్షన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్ -
పంట కాల్వ మూసివేత సరికాదు
కొల్లాపూర్/కొల్లాపూర్ రూరల్: పాలమూరు ప్రాజెక్టు ప్రధానకాల్వ అనుసంధానం కోసం కేఎల్ఐ డీ–5 పంటకాల్వను మూసివేయడం సరికాదని, వెంటనే దానిని పునరుద్ధరించాలని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. కొల్లాపూర్ మండలం సున్నపుతండా సమీపంలోని కేఎల్ఐ డీ–5 పంటకాల్వను పూడ్చివేశారని తెలియడంతో గురువారం భారీ అనుచరగణంతో ఆయన కొల్లాపూర్ నుంచి పంటకాల్వ వరకు పాదయాత్ర నిర్వహించారు. అధి కారులపై ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఒత్తిడి తెచ్చి దొంగచాటుగా అర్ధరాత్రి కాల్వ మూసివేయించారని, గతంలోనూ కోర్టులో కేసు వేసి ప్రాజెక్టు ఆపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ప్రత్యామ్నాయ కాల్వను ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో అదే కాల్వను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అక్కడే కాసేపు బైఠాయించారు. అనంతరం కొల్లాపూర్‌లో జూపల్లి మాట్లాడుతూ ఈ కాల్వ కింద 2,900 ఎకరాల భూములు ఉన్నాయని, గతేడాది కృష్ణానదిలో నీళ్లున్నా రైతులకు అందించలేకపోయారని, ఈ ఏడాది నీళ్లు అందే అవకాశం ఉన్నా పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. -
కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు
-
టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా..
సాక్షి, హైదరాబాద్: తాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి వర్గం విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ అభ్యర్థుల గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లే తమ నాయకులని స్పష్టం చేశారు. మిగతా విషయాలు అధిష్టానంతో మాట్లాడతానని చెప్పారు. కాగా, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫోన్ చేయడంతో జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌కు వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఆయనకు, పార్టీకి మధ్య దూరం పెరిగినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అలాంటిదేమి లేదని తాజాగా జూపల్లి ప్రకటించారు. చదవండి: ఫలించిన హరీష్ రావు వ్యూహాలు.. -
‘కొల్లాపూర్‌లో ఫ్యాక్షన్ నేర్పుతున్నారు’
సాక్షి, కొల్లాపూర్: జిల్లాలో స్ట్రాంగ్రూంపై జరిగిన దాడిని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గురువారం ఆయన కొల్లాపూర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బుధవారం నాడు ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన కొంతమంది వ్యక్తులు స్ట్రాంగ్రూంపై దాడి చేశారని పేర్కొన్నారు. వారు ఇంక్ బాటిల్స్ తీసుకొని రావడం, కట్టెలతో సిబ్బంది, పోలీసులపై దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. కొల్లాపూర్‌లో ఫ్యాక్షన్ సంస్కృతిని నేర్పుతున్నారని హర్షవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాల్సిన వ్యక్తులు, ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులే దాన్ని కించపరచడం శోచనీయన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూ.. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. తప్పులు చేస్తే అది నేనైనా, ఎవరైనా సరే చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. పోలీసులపై, అమాయకులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. కొల్లాపూర్‌లో ఉద్రిక్తత.. కొల్లాపూర్ పట్టణంలో నిన్న రాత్రి 10 గంటలకు ఆకస్మాత్తుగా కరెంట్ పోయింది. చెన్నపురావుపల్లి ఫీడర్లో జంపర్స్ కట్ అయ్యాయనే కారణంతో కరెంట్ నిలిచిపోయినట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే కరెంట్ లేని సమయంలో బ్యాలెట్ బాక్సులు మారుస్తున్నారంటూ పుకార్లు రావటంతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో కలిసి స్ట్రాంగ్‌రూం వద్దకు చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సులు మార్చేందుకు కరెంట్ సరఫరా నిలిపివేశారంటూ ఆందోళనకు దిగారు. స్ట్రాంగ్‌రూం వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. పోలీసులు కొందరు నాయకులను స్ట్రాంగ్ రూం వద్దకు తీసుకెళ్లి సీల్‌ను చూపించారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఎస్ఐలు రాజు, రమేష్‌లకు గాయాలవగా, పోలీసుల వాహనాల అద్దాలు పగిలాయి. దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అంబేద్కర్ చౌరస్తా, స్కాలర్స్ స్కూల్‌కు వెళ్లేదారి, పాత పోస్టాఫీస్ ఏరియాలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు అక్కడికి చేరుకుని.. పోలీస్ బలగాలను రప్పించారు. రోడ్ల వెంట గస్తీ ఏర్పాటు చేసి గుమిగూడిన నాయకులను చెదరగొట్టారు. ఆందోళన విషయాన్ని కలెక్టర్, ఎస్పీలకు చేరవేయడంతో వారు రాత్రి 12 గంటలకు కొల్లాపూర్‌కు వచ్చి స్ట్రాంగ్‌రూంను పరిశీలించారు. అర్ధరాత్రి వరకు కొల్లాపూర్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక బ్యాలెట్ బాక్సులు భద్రపర్చిన రూములకు వేసిన సీల్లు యథాతథంగా ఉన్నాయని, తప్పుడు వదంతులను నమ్మవద్దని కలెక్టర్ శ్రీధర్ అన్నారు. చదవండి: కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ వర్గపోరు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భద్రత పెంపు -
టీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన జూపల్లి కృష్ణారావు!
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రతిష్టాత్మకంగా మారిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్కు సొంత నేతల నుంచే అసమ్మతి సెగ తప్పడం లేదు. పలుచోట్ల రెబెల్ అభ్యర్థులు గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతుండగా.. కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఏకంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రెబెల్స్ తరఫున ప్రచారానికి దిగుతుండటంతో కారులో కలకలం రేపుతోంది. కొల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయులు బీ ఫామ్‌తో పోటీ చేస్తుండగా.. తన వర్గీయులకు ప్రాధాన్యం దక్కకపోవడంతో నేరుగా మాజీ మంత్రి కృష్ణారావు రంగంలోకి దిగారు. దాదాపు 20 వార్డుల్లో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి తన అనుచరులను బరిలో నిలిపారు. దీంతో హర్షవర్ధన్‌రెడ్డి, జూపల్లి వర్గీయుల మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. మొత్తానికి ఇక్కడ ఇంటిపోరు రచ్చకెక్కడంతో కొల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా మారింది. సీనియర్ నేత జూపల్లి ఏకంగా రెబల్స్‌కు అండగా నిలిచి.. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటంతో గులాబీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశాన్ని ఆరా తీసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొల్లాపూర్‌లో అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు త్వరలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అక్కడికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కొల్లాపూర్‌లోని పరిస్థితులను టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకొని.. ఇక్కడ పార్టీ గెలుపు కోసం ప్రతిష్టాత్మకంగా పనిచేయాలని పార్టీ నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. -
కళాపిపాసి..విభిన్న రంగాల్లో రాణిస్తున్న వెంకటేష్
సాక్షి, కొల్లాపూర్: రంగస్థల నటనలో అభినయం, పాటలు పాడటంలో ప్రతిభ, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కొల్లాపూర్‌కు చెందిన వెంకటేష్. వృత్తిరీత్యా స్థానిక ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో ఫార్మాసిస్టుగా పనిచేస్తూనే కళలపై తనకున్న మక్కువను ప్రదర్శిస్తున్నాడు. ఆయన ప్రతిభకు పలు అవార్డులు, ప్రశంసలు దక్కాయి. కొల్లాపూర్‌లో సాంస్కృతిక ప్రదర్శనల నిర్వహణలో తప్పనిసరిగా వెంకటేష్ పాత్ర ఉంటుంది. 20 ఏళ్లుగా కళాకారుడిగా.. నటన పట్ల తనకున్న మక్కువతో వెంకటేష్ రంగస్థల నాటకాలు వేయడంలో శిక్షణ పొందాడు. వెంకటేష్ నాటకరంగంలోకి ప్రవేశించాక తన సహచరులతో కలిసి శృతిలయ కల్చరల్ అకాడమీని స్థాపించారు. అకాడమీ ద్వారా ఎంతోమందికి నాటకాలపై శిక్షణ ఇచ్చారు. చిన్నారులకు కూచిపూడి, భరతనాట్యం నేర్పించారు. పాటలు పాడటంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నియోజకవర్గంలో చాలామంది నాటకరంగ కళాకారులు శృతిలయ అకాడమీ ద్వారానే సమాజానికి పరిచయమయ్యారు. అకాడమీ ఏర్పాటు చేసి, నాటకరంగ శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలకు శృతిలయ అకాడమీనే శ్రీకారం చుట్టింది. శృతిలయ కల్చరల్ అకాడమీ పేరుతో వందలాది నాటక ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు శృతిలయ అకాడమీ ద్వారా 20 సంవత్సరాలుగా నియోజకవర్గంలో నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించే సంబరాలు, కృష్ణానది పుష్కరాలు, పర్వదినాలు, జాతరల్లో నాటకాలు ప్రదర్శించారు. వెంకటేష్ ప్రతిభను గుర్తించి మహారాష్ట్రలోని కొల్హాపూర్ నాటకరంగం, వారణాసి, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నాటకరంగం వారు ఏకపాత్రాభినయ ప్రదర్శనలకు ఆహా్వనించారు. వీటితోపాటు రవీంద్రభారతి, త్యాగరాయగానసభ, సుందరయ్య విజ్ఞానకేంద్రం, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రదర్శనలు ఇచ్చారు. బాలనాగమ్మ, సత్యహరిశ్చంద్ర, విప్రనారాయణ, శ్రీరామాంజనేయ యుద్ధం, భక్త చింతామణి, వేంకటేశ్వర మహాత్యం, మహాభారత సన్నివేశాలు ఇలా ఎన్నో రకాల నాటకాలను వెంకటేష్ నేతృత్వంలోని బృందం ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. నాటకం వేసే సమయంలో ఆయన హావాభావాలు, పద్యవచనాలు ఆహుతులను ఆకట్టుకుంటాయి. సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకంలో హరిశ్చంద్ర పాత్రను వందసార్లు, భక్త చింతామణి నాటకంలో భవానీ శంకర్ పాత్రను 60 సార్లు, శ్రీకృష్ణ రాయభారం నాటకంలో శ్రీకృష్ణుని పాత్రను 35 సార్లకుపైగా పోషించాడు. అవార్డులు.. ప్రశంసలు కళారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను అక్టోబర్‌లో వెంకటేష్ చెన్నైలోని గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. నవంబర్‌లో అదే యూనివర్సిటీ నుంచి భారత కళారత్న అవార్డు వరించింది. వీటితోపాటు నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నుంచి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, రిటైర్డ్ హైకోర్టు జడ్జిలచే అవార్డులు స్వీకరించారు. తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్‌చే రాష్ట్రస్థాయి అవార్డు, డాక్టర్ సి.నారాయణరెడ్డి, గుమ్మడి గోపాలకృష్ణ వంటి వారితోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులచే అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. ముందు తరాలకు అందిస్తా.. ప్రస్తుత సమాజంలో సంప్రదాయ కళలకు సరైన ప్రాధాన్యం లేదు. పాశ్చాత్య పోకడల వైపు యువత వెళ్తున్నారు. సంప్రదాయ కళలైన శాస్త్రీయ సంగీతం, లలిత కళలు, నాటకరంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని ముందు తరాలకు అందించాలనే సంకల్పంతోనే శృతిలయ కల్చరల్ అకాడమీ స్థాపించి శిక్షణ ఇస్తున్నా. సంప్రదాయ కళాకారులకు ప్రభుత్వంతోపాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ తగిన సహకారం ఇవ్వాలి. – వెంకటేష్, కళాకారుడు -
ప్రియాంక రెడ్డి : అవే చివరి విధులు..!
నవాబుపేట (జడ్చర్ల), కోడేరు (కొల్లాపూర్): షాద్‌నగర్ వద్ద హత్యకు గురైన పశు వైద్యాధికారిణి ప్రియాంక.. మండలంలోని కొల్లూర్‌లో బుధవారం విధులు నిర్వహించి మధ్యాహ్నం 2.30 నిమిషాలకు వెళ్లిపోయారు.. కాగా అవే ఆమె చివరి విధులుగా మిగిలిపోయాయి. నవాబుపేట మండలం కొల్లూర్‌లో గత మూడేళ్లుగా పశువైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న ప్రియాంక సొంత గ్రామం కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం నర్సాయిపల్లి. హత్య విషయం తెలియడంతో కొల్లూర్తోపాటు నర్సాయిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె అందించిన ఉత్తమ సేవలను గుర్తుచేసుకుంటూ రైతులు తీవ్రమనోవేదనకు గురయ్యారు. చదవండి: నమ్మించి చంపేశారు! పదేళ్ల ఇక్కట్లు తీర్చింది.. మండలంలోని కొల్లూర్ క్లస్టర్లో దాదాపు పదేళ్లుగా పశువైద్యాధికారి లేక పశువులకు వైద్యం అందించేందుకు తాము తీవ్ర ఇక్కట్లు పడ్డామని, ఆ తర్వాత పశువైద్యాధికారిగా ప్రియాంక బాధ్యతలు చేపట్టి మెరుగైన సేవలు అందించడంతో ఇక్కట్లు తప్పాయని గుర్తు చేసుకుంటున్నారు. ఈమేరకు జనవరి 31, 2017లో కొల్లూర్‌లోనే ఆమెకు మొదటి పోస్టింగ్ వచ్చింది. చాలా కాలంగా పరిసర గ్రామాల ప్రజలు, రైతులు పశువైద్యాధికారి లేక ఇబ్బందులు పడ్డ తరుణంలో ఆమె ఇక్కడ విధులు చేపట్టి అందరికీ అందుబాటులో ఉందని రైతులు అభిప్రాయపడ్డారు. విధి నిర్వహణలో ముక్కుసూటి అధికారిగా పేరు పొందిన ఆమె పశువులకు సంబందించి ఆనారోగ్యానికి గురైతే సమాచారం రాగానే సిబ్బందిని అప్రమత్తం చేసి అవసరమైతే తాను వచ్చి మందులు, చిక్సిలు చేసేదని వారు గుర్తు చేసుకున్నారు. అలాగే, ప్రభుత్వ పథకాల అమలుకు రాత్రింబవళ్లు కష్టపడేదని సిబ్బంది పేర్కొంటున్నారు. బుధవారం చివరిసారి విధులో.. షాద్‌నగర్‌లో నివాసం ఉండే పశువైద్యాధికారిణి ప్రియాంక నిత్యం ఇంటి నుంచి స్కూటీలో బస్టాండ్‌కు వచ్చి అక్కడే స్కూటీ ఉంచి బస్సులో కొల్లూర్‌కు వచ్చేది. ఒక్కోసారి బస్సులు దొరకని సమయంలో ఆటోలో వచ్చి మధ్యలో సిబ్బందికి ఫోన్ చేసి వారి ద్విచక్ర వాహనాలపై కొల్లూర్‌కు వచ్చేది. బుధవారం సైతం ఆమె కొల్లూర్‌లో విధులు నిర్వహించి మధ్యాహ్నం 2.30 నిమిషాలకు బయలు దేరినట్లు గ్రామస్తులు తెలిపారు. నర్సాయిపల్లిలో విషాదఛాయలు కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలంలోని నర్సాయిపల్లికి చెందిన ప్రియాంకరెడ్డి దారుణహత్యకు గురి కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సాయిపల్లికి చెందిన శ్రీధర్‌రెడ్డి, విజయమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉండగా.. అందులో ప్రియాంకరెడ్డి పెద్దకూతురు. వీరు 1వ తరగత నుంచి 4వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఉన్నత చదువుల కోసం శంషాబాద్‌కు మకాం మారారు. అనంతరం అక్కడే వారి మిగతా విద్యాభ్యాసం కొనసాగింది. పెద్ద కూతురు ప్రియాంకరెడ్డి నవాబ్‌పేట మండలం కొల్లూర్‌లో వెటర్నరీ డాక్టర్‌గా విధులు చేపట్టింది. బుధవారం విధులకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన ప్రియాంక.. తిరిగి ఇంటికి రాకపోవడం, తన సోదరికి ఫోన్ చేసి స్కూటీ పంక్చర్ అయ్యిందని, తనకు భయంగా ఉందని చెప్పిన కొద్ది సేపట్లోనే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలించగా.. గురువారం తెల్లవారుజామున షాద్‌నగర్ సమీపంలో శవమై తేలడంతో వారు బోరుమన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కాళేశ్వరానికి జాతీయ హోదా ఎలా ఇస్తారు?
సాక్షి, కొల్లాపూర్: డీపీఆర్ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని, దానికి జాతీయ హోదా ఎలా ఇస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో గాంధీ సంకల్పయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. సోమశిల–సిద్దేశ్వరం వంతెనతో పాటు జాతీయ రహదారి నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. -
పదవుల కోసం పాకులాడను
సాక్షి, కొల్లాపూర్: పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని, తెలంగాణ సాధన కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన నిఖార్సైన టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తాను పార్టీ వీడి ఇతర పార్టీలో చేరుతున్నట్లు ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, పోస్టింగ్‌లు పెట్టిన నాగరాజు ముచ్చర్లతో పాటు, మూలె కేశవులు అనే వ్యక్తిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు వారిపై రూ.కోటి పరువు నష్టం దావా వేస్తానన్నారు. మితిమీరి ప్రవర్తించే వారికి తగిన బుద్ది చెబుతామన్నారు. తాను కారు గుర్తు ఉన్న టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని వెల్లడించారు. ఉద్యమ సమయంలో, అభివృద్ధి అంశాల్లో ఎప్పుడూ ప్రజల పక్షానే ఉన్నానని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగానే తప్పా అధికారం కోసం పార్టీ మారలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం, కేసీఆర్‌కు చేదోడుగా ఉండాలనే సంకల్పంతో టీఆర్ఎస్లో చేరానని, పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానన్నారు. సమావేశంలో ఎంపీపీ కమలేశ్వర్‌రావు, నాయకులు మేకల నాగరాజు, పసుపుల నర్సింహ్మ, నరసింహ్మారావు, ఎక్బాల్ తదితరులున్నారు. -
ఒక కోడి.. 150 గుడ్లు
ఓ నాటుకోడి 6 నెలల్లో 150 గుడ్లు పెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నాగర్‌కర్నూల్ జిల్లా దేవల్తిర్మలాపూర్కి చెందిన రామకృష్ణమాచారి రెండేళ్ల కోడిపెట్ట గత 6 నెలలుగా 150 గుడ్లు పెట్టింది. నేటికీ పెడుతూనే ఉంది. ఈ విషయాన్ని రామకృష్ణమాచారి గ్రామస్తులకు తెలియజేయడంతో ఆసక్తిగా వచ్చి ఆ కోడిపెట్టను చూశారు. కొందరు గుడ్లను తీసుకెళ్లి తమ కోళ్లకు పొదుగేసుకున్నారు. ఈ విషయమై పశువైద్యాధికారిని అడగగా.. జన్యులోపం వల్ల లక్షల్లో ఒక కోడి ఇలా గుడ్లు పెడుతుందని తెలిపారు. – పెద్దకొత్తపల్లి (కొల్లాపూర్) -
మా భూములు మీకివ్వం
సాక్షి, కొల్లాపూర్: మండలంలోని కుడికిళ్ల భూముల్లో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబందించిన సర్వే చేయడానికి వచ్చిన తహసిల్దార్ వీరభద్రప్ప బృందాన్ని రైతులు అడ్డుకున్నారు. గురువారం పోలీస్ బందోబస్తుతో రైతుల పొలాలను సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులతోపాటు ఇరిగేషన్ అధికారులు వచ్చారు. కుడికిళ్ల రైతులు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదని నాలుగేళ్లుగా అడ్డుకుంటున్నారు. తాజాగా గురువారం వచ్చిన అధికారులను పంపించేశారు. కుడికిళ్ల గ్రామానికి చెందిన రైతుల పొలాలు 242 ఎకరాలు పాలమూరు ప్రాజెక్టు కింద పోతున్నాయి. గతంలో కల్వకుర్తి ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టులలో భూములు కోల్పోయారు. ప్రస్తుతం పాలమూరు ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదని సంవత్సరాల కొద్దీ పోరాటాలు చేస్తున్నారు. భూమికి భూమి ఇవ్వాలి.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇస్తే తప్పా భూములు ఇవ్వమని తెగేసి చెప్పారు. ఒకటి, రెండు ఎకరాల చొప్పున భూములు మిగిలాయని అవి కూడా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో పోతే బతికేదెట్లా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసేదేమి లేక ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వెనుదిరిగారు. కార్యక్రమంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న మహిళారైతులు గ్రామస్తులు పాల్గొన్నారు. పోలీసు బందోబస్తుతో.. కుడికిళ్ల రైతులపై ఒత్తిడి పెంచేందుకు అధికారులు భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చారు. సర్వేకు వచ్చిన అధికారులను దాదాపుగా 200మంది రైతులు అడ్డుకున్నారు. భూములలోకి అడుగు పెట్టనివ్వబోమని తేల్చి చెప్పారు. భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చారు. అధికారులతో దాదాపుగా 2గంటల వాగ్వివాదం చోటుచేసుకుంది. మహిళా రైతులు పెట్రోలు బాటిళ్లు పట్టుకుకుని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే చేస్తే పెట్రోలు పోసుకుని అంటించుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్, ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే మాతో చర్చలు జరపాలని అధికారులతో చెప్పారు. -
ఆయనకు జొన్నరొట్టె, నాటుకోడి పులుసు ఇష్టం..
సాక్షి, కొల్లాపూర్: సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయడమే ఇష్టం. నా వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ సాయం చేశాను. శత్రువు వచ్చి కోరినా వెనకాడలేదు. మా ఊరు కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామం. నా చిన్నతనం నుంచి నాన్న రాజకీయాల్లో ఉన్నారు. ఆయన చేసే సేవలు గమనించేవాడిని. రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు సేవచేసే అవకాశం ఉంటుంది. విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. చదువు పూర్తయిన తర్వాత లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చాను. అందుకు మా నాన్న, అమ్మ, నా భార్య ప్రోత్సాహం, సహకారం చాలా ఉంది. నన్ను అర్థం చేసుకుని కుటుంబ సభ్యులంతా సహకారం అందించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాపరంగా తోడ్పాటు అందించాను. మా ఇంటి దేవుడు లక్ష్మీనర్సింహస్వామి ఆశీస్సులతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యేగా ప్రజా జీవితంలో రాణించగలుగుతున్నాను..’’ అని అన్నారు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి. శనివారం ఆయన ‘సాక్షి’ పర్సనల్ టైమ్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా నాన్న లక్ష్మారెడ్డి, అమ్మ బుచ్చమ్మ, భార్య విజయ. మా నాన్న సింగోటం సర్పంచ్‌గా, డీసీసీబీ డైరెక్టర్ గా, అప్పట్లో టీడీపీ నాయకుడిగా పనిచేశారు. ఎన్టీఆర్ హయాంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చినా కుటుంబం కోసం వదులుకున్నారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు మా ఇంటికి వచ్చేవారు. ఎవరికి ఏ ఆపద, ఏ సమస్య ఉన్నా చేతనైనంతవరకు సాయం చేశాం. నాన్న సేవాభావం చూసే రాజకీయాల్లోకి రావాలనే కోరిక నాలో మొదలైంది. నాటి నుంచి నేటి వరకు ఆ మార్గంలోనే నడుస్తున్నాను. నాకు ఇద్దరు అక్కలు ఉమాదేవి, సువర్చల.. పాఠశాల చదువు అంతా పదోతరగతి వరకు కొల్లాపూర్‌లోనే కొనసాగింది. ఇంటర్, డిగ్రీ, లా హైదరాబాద్‌లో పూర్తి చేశాను. 2001లో హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించాను. పదేళ్ల వరకు పూర్తిగా ఈ వృత్తిలోనే కొనసాగాను. చిన్నప్పటి నుంచే సామాజిక సేవ చేయడంపై ఇష్టం ఉండేది. 2010–11నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చాను. శత్రువుకైనా సాయం చేశా.. ఎవరైనా సరే నా వద్దకు వచ్చినవారందరికీ సాయం చేశాను. శత్రువు వచ్చి సాయం అడిగితే కూడా చేశా. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆర్థిక తోడ్పాటు అందించా. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ రోడ్ల పరిస్థితి బాగా లేదు. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగునీరు అందని దుస్థితి. దీనిని పూర్తిగా మార్చివేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యం. దేశంలోనే ప్రత్యేకత ఉన్న కొల్లాపూర్ మామిడికి మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు కల్పించాలి. పూర్తి స్థాయిలో సామాన్యుడికి అందుబాటులో ఉండి వారి కష్టాలను తీర్చాలన్నది నా లక్ష్యం. ఫ్యామిలీకి సమయం కేటాయించేందుకు యత్నిస్తా.. రాజకీయాల్లో బిజీగానే ఉంటా. అయినప్పటికీ ఫ్యామిలీకి సమయం కేటాయించేందుకు యత్నిస్తాను. నా భార్య విజయనే అన్నీ చూసుకుంటుంది. 70 ఏళ్ల వయసులోనూ అమ్మా, నాన్న నాకు ఎంతో తోడ్పాటు, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. నిత్యం సలహాలు ఇస్తున్నారు. కుటుంబానికి ఎక్కువగా సమయం ఇవ్వలేదు. ఎప్పుడైనా తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. సింగోటంలోని లక్ష్మీనర్సింహస్వామిని ప్రతిరోజూ దర్శించుకుంటాం. 2010లో ఒకసారి యూరప్ వెళ్లాం. పూర్తిగా నేను రాజకీయాల్లో ముందుకు వెళ్లడానికి నా భార్య సహకారం మరువలేనిది. బిజీలో ఒకవేళ నేను టిఫిన్ చేయకుండా బయటికి వెళ్తే కారులో పెడుతుంది. ప్రతి చిన్న విషయాన్ని ఆమెనే దగ్గరుండి చూసుకుంటుంది. ఫ్యామిలీనే నా బలం. వారి వల్లనే స్వేచ్ఛగా రాజకీయాలు చేయగలుగుతున్నాను. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టి, యోగక్షేమాలు అడిగి పంపించడం అమ్మానాన్నలతోపాటు నా భార్యకు అలవాటు. జొన్నరొట్టె, నాటుకోడి పులుసు ఇష్టం ప్రజలు ఎంతో నమ్మకంతో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారు. మేము సహకరిస్తేనే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా సేవ చేయగలుగుతారు. ఇంట్లో విషయాల కన్నా ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. ఆయనకు సహకరించడం నా బాధ్యత. సేమియా పాయసం, అంబలి, జొన్నరొట్టె, నాటుకోడి పులుసు ఆయనకు చాలా ఇష్టం. అందరినీ ఈజీగా నమ్మడమే ఆయన బలం, బలహీనత. వాళ్ల అమ్మ సలహాలు ఎక్కువగా తీసుకుంటారు. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి సమస్యలు తెలుసు. కుటుంబం అందరం కలిసి భోజనం చేస్తాం. అత్తయ్య, మామయ్య సలహాలు, ప్రోత్సాహం, ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉన్నాయి. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. 2007 నవంబర్ 25న జరిగింది. అప్పుడప్పుడూ సినిమాలు చూస్తాం. పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. పండుగలు, శుభకార్యాలకు ఫ్యామిలీ అందరం కలిసి పాల్గొంటాం. ప్రజలు స్వేచ్ఛగా, సంతోషంగా ఉండాలి రాజకీయ నాయకుడిగా ఏ స్థాయిలో ఉన్నా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే నా కోరిక. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నాకు కుటుంబసభ్యులు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. రాత్రి 11 గంటల వరకు అమ్మానాన్న, అక్కలు, భార్య ప్రచారంలో పాల్గొన్నారు. 2018లో మరోసారి పోటీ చేసి ప్రజల దీవెనలతో గెలుపొందాను. వృత్తిపరంగా వచ్చిన సంపాదనను రాజకీయాల్లో ఖర్చు చేశాను. రాజకీయాల్లో సంపాదించాలనే కోరిక లేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రంగంలోకి వచ్చాను. ఇన్నేళ్లుగా ప్రజల్లో మంచి పేరు, ఆశీర్వాదం సంపాదించగలిగాను. నిత్యం ప్రజల మధ్య ఉండటమే ఇష్టం. నాకు కుటుంబం పూర్తిగా సహకరించింది. బయటికి వెళ్లిన సందర్భం తక్కువనే. గెలిచినా, ఓడినా ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. కొల్లాపూర్ ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతోషంగా ఉండాలని కోరిక. ప్రజాస్వామ్యంలో ప్రజల నమ్మకాన్ని పెంచుతా. ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ సేవకుడిగా ఉంటాను. -
బీమా.. రైతుకు వరం
సాక్షి, కొల్లాపూర్ : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతుల పాలిట వరం లాంటిదని, సన్న, చిన్నకారు రైతులు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నారు. గతేడాది ఒక గుంట పట్టా ఉన్న ప్రతి రైతుకు ప్రమాదవశాత్తూ గానీ, సహజంగా మరణించిన రైతులకు బీమా కల్పిస్తూ రైతు కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమని రైతులు అంటున్నారు. డిసెంబర్ నుంచి నేటి వరకు ఎంతోమంది రైతులు సహజంగా మరణించారు.వారికి రూ.5లక్షల బీమాను అందజేశారు. షరతులు లేకుండానే ఖాతాలో జమ కొల్లాపూర్ మండల పరిధిలోని చింతలపల్లి, రామాపురం, ముకిడిగుండం, కల్వకోల్, నర్సింగాపురం, నర్సింగరావుపల్లి, ఎన్మన్‌బెట్ల, సింగోటం, చుక్కాయిపల్లి, చెంచుగూడెం, ఎల్లూరు, మొలచింతలపల్లి తదితర గ్రామాలలో మృతిచెందిన రైతు కుటుంబాలకు ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.5లక్షల బీమా బాధిత కుటుంబాల ఖాతాలో జమ చేశారు. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి షరతులు లేకుండా బీమాను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. 16 కుటుంబాలకు అందిన బీమా బీమా ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 16మంది రైతులు చనిపోయారు. వారందరికీ బీమా డబ్బులు వారి కుటుంబాలకు అందాయి. ఇప్పటి వరకు మృతి చెందిన రైతులు చింతలపల్లిలో చంద్రశేఖర్‌రావు, కుర్మయ్య, రామాపురంలో నాగపురం శ్రీనివాస్, ముకిడిగుండంలో బీమిని బిచ్చన్న, పాత్లావత్ పేట్లానాయక్, లౌడ్యా తిరుపతి, మొలచింతలపల్లిలో శ్రీవాణి బాలమ్మ, చెంచుగూడెంలో మండ్ల ఈశ్వరమ్మ, ఎల్లూరులో బండారి పార్వతమ్మ, సింగోటంలో వాకిటి నర్సింహ, ఎన్మన్‌బెట్లలో మండ్ల చిట్టెమ్మ, నర్సింగరావుపల్లిలో పుల్లాసి శాంతయ్య, నలుపోతుల నాగేంద్రం, చుక్కాయిపల్లిలో చవ్వ రాముడు, చెంచుగూడెంలో మండ్ల ఈశ్వరమ్మ, కల్వకోల్‌లో పెబ్బేటి కుర్మయ్య అనే రైతులు చనిపోయారు. వారి వారి కుటుంబాలకు రైతు బీమా పథకం పూర్తిగా వర్తించి వారికి ప్రభుత్వం అందజేస్తున్న బీమా డబ్బులు అందాయి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్లయిమ్ రైతులందరూ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడలేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఈవిధంగానే రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తే శాశ్వతంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందని అంటున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో మృతి చెందిన రైతుకు సంబంధించిన ఎల్ఐసీ బాండ్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నఖలు ఇస్తే ఇచ్చిన నెల రోజుల్లోనే తమ కుటుంబీకుల ఖాతాలో రూ.5లక్షలు జమ అయ్యాయన్నారు. నెలలోపే ఖాతాలో డబ్బు జమ చెంచు గూడెంకు చెందిన రైతు ఈశ్వరమ్మ మృతి చెందింది. నెలరోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకంలో భాగంగా రూ.5లక్షలను జమ చేసింది. రైతు బీమా మాకు అందడం ఎంతో ఆసరా అయ్యాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పుడూ మరువం. – హన్మంతు, చెంచుగూడెం రైతు -
టీఆర్ఎస్లోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్ : అధికార టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కారెక్కుతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బుధవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన త్వరలో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటన చేశారు. అవసరం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. -
ఇంకెన్నాళ్లు...ఎదురుచూపులు!
సాక్షి, పెంట్లవెల్లి(నాగర్‌కర్నూలు) : శ్రీశైలం ప్రాజెక్టు కట్టడంతో ఏటి ఒడ్డున ఉన్న ఎన్నో గ్రామాలు 38ఏళ్ల క్రితం ముంపునకు గురయ్యాయి. అందులో ఎన్నో గ్రామాల్లో ఇళ్లు, పొలాలు, కల్లందొడ్లు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నష్టపోయిన వారికి ప్రత్యేక జీఓ ఏర్పాటు చేస్తున్నామని 98 జీఓను గతంలో ఏర్పాటు చేశారు. కానీ అప్పటి నుంచి సవరించిన జీఓను అమలు పర్చలేకపోయారు. కొంతమందికి మాత్రమే అందులో ఉద్యోగాలు వచ్చాయి. మిగిలిన ఎంతోమందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు. ఇటు ఉద్యోగాలు రాక.. సరైన నష్టపరిహారం రాక ముంపు బాధితులు జీవనోపాధి కోసం గోడు వెల్లబోసుకుంటున్నారు. మంత్రి, కలెక్టర్ల చర్యలు నిష్ఫలం వనపర్తి, కొల్లాపూర్, చిన్నంబావి ఏరియాల్లో 2500 వరకు ఉద్యోగాలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఏటా ఎన్నికల ముందు వారికి ఉద్యోగాలు ఇస్తామని చెబుతూ హామీలిస్తున్నారు. కానీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో ఉద్యోగాలిస్తామని మాటలు చెప్పారు.. కానీ ఇంతవరకు శ్రద్ధ చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హత లేని వారికి రూ.10లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశామని, ఏ ఒక్కరూ దీనిపై చర్చలు జరపలేదని వాపోతున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, గత కలెక్టర్లు చర్చలు చేసినా.. ఏమీ తేల్చలేకపోయారు. పాదయాత్ర చేపట్టినా ఫలితం శూన్యం జటప్రోల్, మాధవస్వామినగర్, మంచాలకట్ట, మల్లేశ్వరం, ఎంగంపల్లిలో దాదాపుగా 250 మంది 98 జీఓ నిర్వాసితులు ఉన్నారు. వారికి ఉద్యోగాలు లేక, అటు నష్టపరిహారం లేక భూములు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు, లేనివారికి రూ.10లక్షలు ఇవ్వాలని గతంలో అలంపూర్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టినా.. ఫలితం లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే హామీ ఫలించేనా? ఈసారి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్నికల ముందు ఖచ్చితంగా 98 జీఓ నిర్వాసితులకు ఉద్యోగాలిప్పిస్తానని హామీ ఇచ్చారని, ఈసారైనా తమ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నామని పేర్కొంటున్నారు. భూములు నష్టపోయిన వారికి పరిహారం అందించాలని కోరుతున్నారు. లేదంటే ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని ఆయా గ్రామాల 98 జీఓ నిర్వాసితులు పేర్కొంటున్నారు. ఏటి ఒడ్డున ఉన్న ప్రాంతాల వారందరూ జీవనోపాధి కోసం ఎదురుచూస్తున్నారని.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారైనా ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు. ఈసారైనా ఉద్యోగాలివ్వండి 38ఏళ్ల నుంచి ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నా ఇంతవరకు మా కల నెరవేరడంలేదు. సర్వం కోల్పోయిన మాకు ఉద్యోగాలే దిక్కని అనుకున్నాం. ఇప్పటికైనా అవకాశం కల్పించాలి. – ఖాజామైనోద్దీన్, 98 జీఓ జిల్లా అధ్యక్షుడు -
మహిళలకే ప్రాధాన్యం
సాక్షి, కొల్లాపూర్: దాదాపు అన్ని మండలాలకు ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గ మండలాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. నాలుగు మండలాల్లో ఒక్క ఎంపీపీ పదవి మినహా మిగతా ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలన్నీ మహిళలకే రిజర్వ్ అయ్యాయి. జనాభా పరంగా ఎస్సీలు, ఎస్టీలు పెద్దసంఖ్యలో ఉన్నారు. అయితే వీరికి ఎక్కడా రిజర్వేషన్లు కల్పించలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగిందని రాజకీయ పార్టీల నాయకులు భావిస్తున్నారు. మండలాల వారీగా ఇలా.. నియోజకవర్గ పరిధిలో కొల్లాపూర్, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాలు ఉన్నారు. వీటిలో ఎంపీపీ పదవులకు సంబంధించి కొల్లాపూర్ మండలం జనరల్ మహిళ, కోడేరు మండలం జనరల్ మహిళ, పెంట్లవెల్లి మండలం బీసీ మహిళ, పెద్దకొత్తపల్లి మండలం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. జెడ్పీటీసీ పదవులకు సంభందించి కొల్లాపూర్ మండలం జనరల్ మహిళ, పెంట్లవెల్లి మండలం బీసీ మహిళ, కోడేరు మండలం జనరల్ మహిళ, పెద్దకొత్లపల్లి మండలం బీసీ జనరల్ అయ్యాయి. గతంలో ఇలా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గంలో కేవలం ఐదు మండలాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. వీటిలో చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్ మండలాలు వనపర్తి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఉండే మండలాలకు సంభందించి గతంలో కొల్లాపూర్ మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు జనరల్ స్థానాలకు, పెద్దకొత్తపల్లి మండంలలో ఎంపీపీ స్థానం జనరల్‌కు, జడ్పీటీసీ స్థానం బీసీ జనరల్‌కు, కోడేరు మండలంలో ఎంపీపీ, స్థానం జనరల్‌కు, జెడ్పీటీసీ స్థానం ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఈసారి వీటికి పూర్తి భిన్నంగా ఒక్క స్థానం మినహాయిస్తే మిగతా అన్ని స్థానాలు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. ఆశావహుల లెక్కలు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా స్థానాల్లో పోటీలో నిలవాలని భావిస్తున్న ఆశావహులు రాజకీయంగా లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు. కొల్లాపూర్, కోడేరు, పెంట్లవెల్లిలో ఎంపీపీ, జెడ్పీటీసీలన్నీ మహిళలకే రిజర్వ్ కావడంతో నాయకులు పోటీలో ఉండాలా లేదా అనే ఆలోచనలో పడ్డారు. అయినా సరే ప్ర త్యర్థి పార్టీ అభ్యర్థి బలాబలాను బేరీజు వేసుకుని బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నారు. -
పట్టా అడిగితే ఫారెస్ట్ అధికారుల దాడులు..
సాక్షి, కొల్లాపూర్‌రూరల్: మండలంలోని నార్లాపూర్ సమీపంలో, మల్లబస్వాపురం శివారులో కుడికిళ్ల గ్రామానికి చెందిన దళిత రైతులు 120 ఎకరాల పోడు భూమిని 1961 సంవత్సరం నుంచి సాగు చేసుకుంటున్నారు. నేటికీ ఆ భూములకు చట్టబద్దత లేదు. గతంలోని పాలకులందరికీ దళిత రైతులు విన్నపాలు చేశారు. కానీ నేటి వరకు ఎలాంటి పట్టాలకు నోచుకోలేదు. సర్వేనంబర్ 36/1, 36/2లో 120 ఎకరాల ఫారెస్ట్ పోడు భూములను 60 కుటుంబాలకు చెందిన కుడికిళ్ల దళిత రైతులు తాతల కాలం నుంచి సాగు చేస్తున్నారు. బెదిరింపులకు గురిచేస్తున్నారు.. సాగుచేసుకుంటున్న భూములను తమ పేరుపై పట్టా చేయాలని కోరుతున్నా రైతులను ఫారెస్ట్ అధికారులు దాడి చేస్తున్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో భూమిలేని నిరుపేద రైతులు శిస్తు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చేముందు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఫారెస్ట్ భూములకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. దళితులు సాగు చేస్తున్న భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు కావస్తున్నా నేటివరకు ఎలాంటి స్పందన లేదు. ఎన్నో ఏళ్లుగా ఫారెస్ట్ భూములు సాగు చేసుకుని అనుభవిస్తున్న కుడికిళ్ల దళిత రైతులకు పట్టాలివ్వాలని కోరుతున్నారు. ప్రతిఏటా ఫారెస్ట్ అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. పాలకులు, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు తక్షణం స్పందించి శిస్తు చేసుకుని అనుభవిస్తున్న పోడు భూములపై సర్వే నిర్వహించి పట్టాలకు ప్రపో జల్స్ పంపాలని రైతులు కోరుతున్నారు. హక్కు కల్పించాలి మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామ సమీపంలో మల్లబస్వాపూర్ శివారులో శిస్తు చేసుకుని అనుభవిస్తున్న ఫారెస్ట్ భూములకు పట్టాలివ్వాలి. రెండు, మూడు తరాల నుంచి పోడు భూములను శిస్తు చేసుకుని అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టాలు ఇవ్వాలి. – శ్రీనివాసులు, కుడికిళ్ల కేసు పెట్టినా వెనక్కి తగ్గం మల్లబస్వాపూర్ శివారులో 36 సర్వేనంబర్‌లో 120 ఎకరాల భూములను 60 కుటుంబాలకు చెందిన మా తాతలు, తండ్రులు శిస్తు చేసుకుని అనుభవిస్తున్నారు. ఆ సమయంలో ఫారెస్ట్ అధికారులు దాడులు చేసి కేసులు పెట్టారు. అయినా కూడా నేటి వరకు శిస్తు చేసుకుని అనుభవిస్తున్నాం. ముఖ్యమంత్రి హామీ ప్రకారం పోడు భూములకు పట్టాలిస్తారనే ఆశ ఉంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి పట్టాలివ్వాలి. – బిచ్చయ్య, కుడికిళ్ల -
ప్రజాతీర్పును గౌరవిస్తున్నాను : జూపల్లి
సాక్షి, హైదరాబాద్ : కొల్లాపూర్ ప్రజల తీర్పుని గౌరవిస్తున్నానని జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన ఐదు సార్లు తనను ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి కారణంగానే రాష్ట్రంలో టీఆర్ఎస్ మళ్లీ గెలిచిందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ, పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి తన జీవితాన్ని అంకితం చేసినట్లు తెలిపారు. కొల్లాపూర్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు అండదండగా ఉంటానన్నారు. ఎన్నికల కోడ్ వల్ల కొన్ని పనులు ఆగిపోయాయని, కొన్ని ప్రారంభించలేకపోయానని తెలిపారు. 18 కోట్ల ముక్కిడి గుండం కెనాల్, నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం, 29 కోట్లు మంజూరైన 100 పడకల ఆస్పత్రి పనులు, కళ్యాణ మండపం, పాత్‌వేల పనులను ఇప్పుడు కొనసాగిస్తానని చెప్పారు. నగర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానని, టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అన్ని పథకాలు అమలు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దన్నారు. ప్రజా సమస్యల పట్ల అంకితభావంతో ఉండాలని పిలుపునిచ్చారు. కొల్లాపూర్‌లో గడిచిన 19 ఏళ్లపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనివ్వలేదని, అదే కొనసాగేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. యువకులకు ఉపాధి అవకాశాలు పెరిగేలా కృషి చేస్తానన్నారు. కొల్లాపూర్‌ను కోహినూర్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. -
‘తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర శూన్యం’
నాగర్ కర్నూలు: తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర శూన్యమని కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మహాగర్జన సభలో బుధవారం ఆజాద్ మాట్లాడారు. మీ కోసం ఒక శుభవార్త.. కేసీఆర్ ఈ సారి చిత్తుగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డిపై జరిగిన కుట్ర బాధాకరమన్నారు. రేవంత్‌ని బంధించి సభ నిర్వహించే దుస్థితికి కేసీఆర్ దిగిపోయారని విమర్శించారు. తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. యువకులు, వృద్ధులు, రైతులందరినీ మోసం చేశారని ధ్వజమెత్తారు. యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు..మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అని అబద్ధపు వాగ్దానం చేసి వాళ్లని మోసం చేశారని దుయ్యబట్టారు. జిల్లాలు, ప్రముఖ మండల కేంద్రాల్లో నిర్మిస్తానన్న వంద పడకల ఆసుపత్రులు కనపడటం లేదని ఎద్దేవా చేశారు. దేశంల మొత్తంలో ఫాంహౌస్‌లో కూర్చుని రాష్ట్రాన్ని నడుపుతున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీలైతే..నేను తెచ్చానంటూ బూటకపు మాటలతో కేసీఆర్ పాలిస్తున్నారని మండిపడ్డారు. బిడ్డకు జన్మనిచ్చిన వాళ్లే ఆ బిడ్డ బాగోగులను బాగో చూసుకోగలరని, అలాగే తెలంగాణా మావల్లే ఏర్పడిందని, తామే బాగు చేస్తామని అన్నారు. మహాకూటమిని గెలిపించాలని ప్రజానీకానికి విన్నవించుకుంటున్నామని తెలిపారు. హర్షవర్దన్‌ను గెలిపించండి..ఈ ప్రాంతాన్ని మేం అభివృద్ధి చేసి చూపుతామని అన్నారు. -
ఎన్నికల సిత్రాలు..!
తమ్ముడిది టెలిఫోన్ గుర్తు హలో అన్నా! తమ్ముడిది టెలిఫోన్ గుర్తు మరువకుండా ఓటు వెయ్యి.. అంటూ ఏకంగా టెలిఫోన్‌ను పట్టుకుని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు జడ్చర్చ స్వతంత్ర అ«భ్యర్థి మార్పడ రమేష్‌రెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డి. గుండ్లపొట్లపల్లి గ్రామంలో ఆదివారం టెలిఫోన్‌తో ప్రచారం చేస్తున్న దృశ్యమే ఇది. – రాజాపూర్ తాంబులం ఇచ్చారు.. ఓటు కూడా వేయండి తాంబులం ఇచ్చారు.. అదే రీతిలో ఓటు కూడా వేసి గెలిపించండి అంటూ దేవరకద్ర మహాకూటమి అభ్యర్థి డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి సతీమణి డోకూర్ రజిని కోరారు. దేవరకద్ర మండలం బల్సుపల్లిలో ఆదివారం ఆమె ఇంటింటి ప్రచారంలో పాల్గొనగా.. ఓ మహిళ తాంబులం ఇచ్చి గౌరవించారు. దీంతో ఓటు కూడా వేయాలని రజిని కోరారు. – దేవరకద్ర మీకు చేయూతనిస్తా... పోలింగ్ సమీపిస్తుండడంతో కొల్లాపూర్‌లో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఈ మేరకు ఆదివారం సంత కావడంతో అభ్యర్థులు విస్తృతంగా పర్యటించి చిరువ్యాపారులు, ప్రజలను కలిసి తమనే గెలిపించాలని కోరారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి సతీమణి విజయ ఓ హోటల్లో ఇలా దోసెలు వేసి కొద్దిసేపు సాయం అందించారు. – కొల్లాపూర్ తలకెక్కిన అభిమానం కొల్లాపూర్ బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావుకు మద్దతుగా నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం బహిరంగ సభ ఏర్పాటుచేశారు. ఈ సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యఅతిథిగా మాట్లాడగా ప్రజలు, బీజేపీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్‌రావుపై అభిమానంతో ఓ కార్యకర్త ‘ఏఎస్ఆర్’ అక్షరాల రూపంలో క్రాఫ్ చేయించుకుని రావడం ఆకట్టుకుంది. – కొల్లాపూర్ ఉండక్కా.. బొట్టు పెడ్తా! అడ్డాకుల మండలం శాఖాపూర్‌లో దేవరకద్ర టీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సతీమణి మంజుల ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓ ఇంటికి వెళ్లగా అక్కడి మహిళ.. మంజులను ఆడపడుచుకుగా భావించి బొట్టు పెట్టి ఆప్యాయంగా మాట్లాడారు. – అడ్డాకుల -
సోమశిల వంతెన బాధ్యత మాది : నితిన్‌గడ్కరీ
సాక్షి, కొల్లాపూర్: కొల్లాపూర్‌లో బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావును గెలిపిస్తే, సోమశిల – సిద్దేశ్వరం వంతెన నిర్మిస్తామని, దీనికి జాతీయ రహదారి హోదా కల్పించి ఏపీ, తెలంగాణ రహదారులను అనుసంధానిస్తాం’ అని కేంద్ర జల, రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ అన్నారు. బీజేపీ కొల్లాపూర్ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావు అధ్యక్షతన నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఉన్నత చదువులు చదివిన వ్యక్తి, ఇంజనీరింగ్ నిపుణుడు, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని వచ్చిన సుధాకర్‌రావును ఈ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. కొల్లాపూర్‌లో ఆస్పత్రులు లేవు. ఉంటే వైద్యులు ఉండరు. స్కూళ్లలో టీచర్లు లేరని తెలిసింది. 20ఏళ్లుగా ఇక్కడి ప్రజలు సంతోషంగా లేరని చెబుతున్నారు. అందుకే అభివృద్ధిని పట్టించుకోని నాయకులను ఇంటికి పంపండి. పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సుధాకర్‌రావును ఎమ్మెల్యేగా గెలిపిస్తే జాతి, కుల, మతాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం’ అని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, గోదావరి నీళ్లను కృష్ణానదికి సంధానం చేస్తామని తెలిపారు. బీజేపీ గెలిస్తే రైతుల పొలాలకు నీళ్లొస్తాయని, యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. దద్దమ్మ కేసీఆర్ పదిహేను నిమిషాలు సమయమిస్తే హిందువుల సంగతి చూస్తానన్న అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు పెట్టని దద్దమ్మ ప్రభుత్వం కేసీఆర్‌ది అని బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కొల్లాపూర్‌లో గుంతలులేని రోడ్డు ఒక్కటైనా చూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇల్లు ఒక్కటి కూడా ఇవ్వని టీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలో ప్రజలే ఆలోచించాలని కోరారు. బీజేపీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్ అభివృద్ధి బీజేపీకి మాత్రమే సాధ్యమన్నారు. కేవైఎఫ్ అధ్యక్షుడు రాంచందర్‌యాదవ్ మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా జూపల్లి కృష్ణారావు పాలనలో కొల్లాపూర్ మరింత వెనకబడి పోయిందన్నారు. ఈసారి ఆయనను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ సభలో సభలో నాయకులు జలాల్ శివుడు, సందు రమేష్, శేఖర్‌గౌడ్, రామకృష్ణగౌడ్, కేతూరి బుడ్డన్న, నారాయణ, తిరుపతి బాలన్న, జాం పెద్దయ్య, శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్కు ఓటేస్తే అరిఘోసే...
సాక్షి, కోడేరు: మండల కేంద్రంలో శుక్రవారం బీరం హర్షవర్ధన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు షిర్డిసాయిబాబ ఆలయంలో ఆయన గెలుపు కోసం 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగినేని జగదీశ్వర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఆదికొమ్ము దానయ్య మహారాజ్, చామంతిరాజు మాట్లాడారు. రామకృష్ణ, శ్రీశైలం, జానకిరాములు, రాజవర్ధన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, రాము, సంతోష్, పర్వత్‌రెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. కొల్లాపూర్ రూరల్: తెలంగాణలో ప్రజా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోనిఅంకిరావుపల్లిలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రత్నప్రభాకర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జంబులయ్య, లాలయ్య, రాజు ఉన్నారు. పెద్దకొత్తపల్లి: మండలలోని గంట్రావుపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ మండలాధ్యక్షుడు గణేష్‌రావు శుక్రవారం ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హన్మంతురెడ్డి, కాశన్న, రమేష్‌రెడ్డి, సీతారాంనాయక్, లింగారెడ్డి, కాంగ్రెస్ యువనేత పరమేష్ తదితరులు పాల్గొన్నారు. పెంట్లవెల్లి: మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అధిక మొత్తంలో బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కండువాలు కప్పుకుని కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ కోసం తాము పనిచేస్తామని, హర్షవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో ఆయన గెలుపు కోసం కృషిచేస్తామని పలువురు కార్యకర్తలు అన్నారు. హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని తెలిసి ఎంతోమంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని, రాబోయే కాలంలో కొల్లాపూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. మండలాధ్యక్షుడు మతీన్, సురేందర్, రఫియోద్దీన్, ఎంపీటీసీ సభ్యుడు నాగరాజు, నర్సింహ, ఎల్లయ్య, కురుమూర్తి పాల్గొన్నారు. -
కోల్లాపూర్లొ బీజేపీ అభ్యర్థి సుధాకర్‌రావు ప్రచారం
-
ఆశీర్వదించండి.. సేవకుడిలా పనిచేస్తా..
సాక్షి, పాన్‌గల్: కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థిని ఒక్కసారి ఆశీర్వదించండి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకుడిగా పనిచేస్తానని కొల్లాపూర్ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గోప్లాపూర్, కిష్టాపూర్‌తండా, మాధరావుపల్లి, కదిరెపాడు, శాగాపూర్‌తండా, చిక్కేపల్లి, కేతేపల్లి గ్రామాల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసులు, సీపీఐ జిల్లా నాయకులు కళావతమ్మతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టోను రూ పొందించిందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీఆర్ఎస్కు ఓటు ద్వారా తగిన గుణపా ఠం చెప్పాలన్నారు. గోప్లాపూర్‌లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు సిద్ధయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరగా.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు రామ్మూర్తినాయుడు, రవికుమార్, వెంకటయ్యనాయుడు, శ్రీరాం, అశోక్‌రెడ్డి, రఘుపతినాయుడు, సాయికుమార్‌రెడ్డి, నర్సింహ, రాజారెడ్డి, హన్మంతురెడ్డి, రమేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. వీపనగండ్ల: గ్రామాల్లో మహిళలు, యువకులు, విద్యార్థులు టీఆర్ఎస్ పార్టీని ఓడించాలన్న దృఢసంకల్పంతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో మహాకూటమి తరపున పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి గెలుపు కోసం గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను, రుణమాఫీ పేరుతో రైతులను, డబుల్ బెడ్రూం పేరుతో నిరుపేదలను మోసం చేసిందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావును ఓడించేందుకు అన్ని గ్రామాల్లో ప్రజలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బీరయ్య, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, బాలచందర్, కృష్ణయ్య, వెంకట్‌రెడ్డి, బాలస్వామి, రాఘవేందర్‌రెడ్డి, సాయిబాబ పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో సీనియర్ల మధ్య టికెట్ పంచాయతీ
-
టీ కాంగ్రెస్ సీనియర్ల మధ్య టికెట్ పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్ : కొల్లాపూర్ టికెట్ కోసం టీ కాంగ్రెస్ సీనియర్ల మధ్య పంచాయితీ నడుస్తోంది. తాము చెప్పిన వారికే టికెట్ ఇవ్వాలని పాలమూరు కాంగ్రెస్ సీనియర్లు పట్టుబడుతున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్వర్ రావుకే ఇవ్వాలని జైపాల్ రెడ్డి.. జెన్కోలో ఏడీఈగా రాజీనామా చేసిన సుధాకర్ రావుకే టికెట్ ఇవ్వాలని చిన్నారెడ్డి హైకమాండ్‌ను కోరారు. కాగా 2014లో కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన హర్షవర్ధన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని లేదంటే ఊరుకునేది లేదని డీకే అరుణ పట్టుబట్టారు. కొద్దిరోజుల క్రితమే చిన్నారెడ్డి! సుధాకర్ రావుకు కాంగ్రెస్ కండువా కప్పేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. డీకే అరుణ డిమాండ్‌తో సుధాకర్ రావు జాయినింగ్ కాస్తా నిలిచిపోయింది. మొత్తానికి కొల్లాపూర్ టికెట్ ఎవరికి కేటాయిస్తారా అని కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
దొరల ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : భట్టి
సాక్షి, నాగర్ కర్నూల్ : తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ఇక్కడి ప్రజలంతా అమ్మలా చూస్తారని.. అటువంటి నాయకురాలిని, అమ్మనా బొమ్మానా అన్న దౌర్భాగ్యులకు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్‌పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు బుద్ది చెప్పేందుకు ప్రజలంతా ఇక్కడకు తరలి వచ్చారని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బహిరంగ సభలో భట్టి అన్నారు. కొల్లాపూర్ గడ్డ పోరాటాల గడ్డ.. భూమి, భుక్తి, ఆత్మ గౌరవం కోసం ఇక్కడి ప్రజలు ఉద్యమాలు చేశారన్నారు. తనకు చిన్నతనం నుంచే ఈ ప్రాంతం బాగా తెలుసని భట్టి అన్నారు. మల్లు ఆనంతరాములు ఎంపీగా పోటీ చేస్తున్న సమయంలో ఇక్కడి గోడలపై హస్తం గుర్తును ముద్రించిన జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయని విక్రమార్క చెప్పారు. ఆపద్ధర్మ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీకి వెన్ను పోటు పొడిచారన్నారు. కొల్లాపూర్ ప్రజలు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం చూపించారని తెలిపారు. జూపల్లిని శాసనసభ్యుడిగా, మంత్రిగా చేసి ఒక మనిషిగా కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దతే.. ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి టీఆర్ఎస్లో చేరారని విక్రమార్క మండిపడ్డారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని భట్టి విక్రమార్క చెప్పారు. అప్పట్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వృధా అని చెప్పి ప్రాజెక్ట్ ను నిలిపివేసే ప్రయత్నం చేసేంది జూపల్లి కృష్ణారావేనని విక్రమార్క చెప్పారు. అభివృద్ధి విషయంలో ఆగ్రహంగా ఉన్న కొల్లాపూర్ ప్రజలు కన్నెర్ర చేస్తే.. అందరూ మాడి పోవాల్సిందేనని అన్నారు. తెలంగాణ కోసం పోరాట చేసింది.. ఉద్యమాలు చేసింది.. ఆత్మ బలిదానాలు చేసింది.. నీళ్లు, నిధులు, నియామకాలు.. సామాజిక తెలంగాణ కోసమేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన అన్నారు. ఖమ్మంలో మద్దతు ధర అడిగితే చేతులకు బేడీలు వేసి నడి బజారులో నడిపించారని.. సిరిసిల్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్న పాపానికి అత్యంత పాశవికంగా పోలీసులుకు హింసించారు అని అన్నారు. -
పెట్టుబడికి ఢోకాలేదు
పెంట్లవెల్లి (కొల్లాపూర్) : ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.4వేల చొప్పున అందించడం చరిత్రాత్మక నిర్ణయం.. ఇక నుంచి చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడికి ఢోకా లేదు. విత్తనాలు, పనిముట్లు, ఉచిత విద్యుత్, మద్దతు ధర అందించి అన్ని రకాలా ఆదుకుంటామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండలంలోని గోప్లాపూర్ గ్రామంలో మంత్రి రైతు బంధు పథకం కింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రతి ఏడాది ఎరువుల కోసం ఎవరినీ అప్పు అడగకుండా ఎకరాకు రూ.4వేల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రోహిణి కార్తె కంటే ముందే చెక్కులను అందజేస్తున్నామని, రైతులు పొలాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎంతో ఉపయోగ పడేలా ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, యాసంగి పంటలో కూడా రైతులకు పరిహారం ఇస్తామన్నారు. బంగారు తెలంగాణకు అడుగులు రైతులతోనే బంగారు తెలంగాణకు బాటలు పడ్డాయని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుని కొత్త ప్రాజెక్టులు కట్టి జిల్లాను సస్యశ్యామం చేస్తామని మంత్రి అన్నారు. 60 ఏళ్ల చరిత్రలో ఏ ప్రభుత్వం చేపట్టలేని పనిని తెలంగాణ ప్రభుత్వం చేసి చూపిందరన్నారు. ఒకప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు వస్తే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయని, ఇప్పుడు 24గంటలూ కరెంట్ ఉంటుందన్నారు. ఇంతకు ముందు రైతులు ఎరువుల కోసం క్యూలో నిల్చునే వారని, ఇప్పుడు గోదాంలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అందజేస్తున్నామని తెలిపారు. ఆసరా పింఛన్లను 200 నుంచి వెయ్యికి పెంచామని, పేదలు ఇబ్బంది పడరాదని రూ.లక్షా 116 కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేస్తున్నామని గుర్తుచేశారు. గర్భిణులకు రూ.14వేలు, కేసీఆర్ కిట్ అందిస్తున్నామని, త్వరలో ఇంటింటికి ఫిల్టర్ వాటర్ అందిస్తామని, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇస్తామని, గతంలో ఎన్నడూ లేనట్లుగా ప్రతి వీధిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేయించడం జరిగిందన్నారు. పిల్లల చదువుల కోసం గురుకుల, నవోదయ, మాడల్ పాఠశాలలను ప్రారంభించామని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ లోకారెడ్డి, సర్పంచ్ శైలజ, మాజీ ఎంపీపీ గోవింద్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజేష్, సింగిల్‌విండో చైర్మన్ ఖాజామైనొద్దీన్, ఎంపీటీసీ సుజాత, తహసీల్దార్ వెంకటరమణ, వ్యవసాయాధికారి కె.నరేష్, సింగిల్‌విండో చైర్మన్ ఖాజామైనొద్దీన్, ప్రభాకర్‌రెడ్డి, జ్యోతి, వెంకటమ్మ, వెంకట నర్సింహారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
హిందూ ఆలయాలపైనే పెత్తనమెందుకు ?
సాక్షి, కొల్లాపూర్: పాలకులు కేవలం హిందూ ఆలయాలపైనే తమ పెత్తనం ప్రదర్శిస్తున్నారని, మజీదులు, చర్చిల జోలికి వారు ఎందుకు పోవడం లేదని శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ప్రభుత్వాలను ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌జిల్లా కొల్లాపూర్‌లో కేవైఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం యువతనుద్దేశించి మాట్లాడారు. హిందువుల గుడులు రాజకీయాలకు వేదికలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చర్చిలు, మజీదులపై లేని పెత్తనం హిందూ దేవాలయాలపైనే ఎందుకన్నారు. ఆలయాల సొమ్మును దోచేస్తున్నారని, పాలకవర్గాల వైఖరి కారణంగా విజయవాడ కనకదుర్గమ్మ గుడిని, అమ్మవారిని రోడ్డుకీడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మా దేవుళ్లను దర్శించుకోవాలంటే ఎమ్మెల్యే, ఎంపీల రికమెండేషన్ లెటర్లు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. బంగారు తెలంగాణ సాధించాలంటే 80 ఏళ్లు దాటిన వారికి సాధ్యం కాదని, యువతే దానికి కారకులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ మాది అని భావించి స్వార్థం లేకుండా ముందుకు సాగితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొందరు కుహానా మేధావులు భారతీయ సంస్కతిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారినుంచి మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. టీఎస్ రెడ్కో ఎండీ.సుధాకర్‌రావు, సురభి రాజు బాలాదిత్య లక్ష్మారావులు కూడా ప్రసంగించారు. -
బాల్యవివాహాల నిలిపివేత
► తల్లిదండ్రులను కౌన్సెలింగ్ కొల్లాపూర్ రూరల్/బల్మూర్: నాగర్‌కర్నూలు జిల్లాలో జరిగే బాల్యవిహాలను అధికారులు నిలిపివేయించారు. మండల పరిధిలోని బోయలపల్లిలో బాల్యవివాహం చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ సుందర్రాజు, ఎస్ఐ సత్యనారాయణ, సీడీపీఓ వెంకటరమణ, ఆర్ఐ నసీరోద్దీన్ బుధవారం గ్రామానికి చేరుకుని అడ్డుకున్నారు. పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బాల్యవివాహాలతో కలిగే అనర్థాలను వివరించారు. కాదని పెళ్లి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బల్మూర్‌లో.. మండల కేంద్రంలో అధికారులు బాల్య వివాహన్ని అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన మైనర్‌ను అచ్చంపేట మండలం లింగోటం గ్రామానికి చెందిన యువకుడితో ఈనెల 29న వివాహం జరిపించాడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మి, తహసీల్దార్ అంజిరెడ్డి, ఎస్ఐ వెంకన్న బుధవారం బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. మేజర్అయ్యేంత వరకు పెళ్లి చేయొద్దని సూచించారు. వారించడంతో ఒప్పంద పత్రం రాయించుకుని బాలికను చైల్డ్‌కేర్‌కు తరలించారు. -
‘ఫాస్ట్‌ట్రాక్ కోర్టుతో విచారణ జరిపించాలి’
కొల్లాపూర్: వర్షిణి మృతిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టుచే విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కోళ్లశివ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో రాస్తారోకో నిర్వహించారు. మండల పరిధిలోని కుడికిళ్ల గ్రామంలో ఇటీవల అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆకుతోట వర్షిణి మృతిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు, సీఐడీచే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ. 50లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దుండగులను నిర్భయ చట్టం ద్వారా శిక్షించాలని అన్నారు. ఈ కేసులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనకు సిద్ధమవుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో దండోరా తాలూకా ఇన్చార్జి లక్ష్మయ్య, జిల్లా నాయకులు వడ్డెమాన్ రాముడు, సన్నయ్య, కుర్మయ్య, ఎంఎస్ఎఫ్ తాలూకా ఇన్చార్జ్ తోలు రాముడు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా : ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు
కొల్లాపూర్ : ఆటో బోల్తా పడటంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ముక్కిడిగుండానికి చెందిన నందు, రుషి కొల్లాపూర్ పట్టణంలోని రెయిన్బో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం ఆటో పాఠశాలకు వెళుతుండగా గ్రామ శివారులోకి చేరుకోగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వారిద్దరికీ తీవ్ర గాయాలు కాగా చుట్టుపక్కలవారు గమనించి వెంటనే అంబులెన్స్‌లో కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
సినీ ఫక్కీలో దారి దోపిడీ
మహబూబ్‌నగర్: కొల్లాపూర్ సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు రామాపురానికి వెళ్లే ప్రధాన రహదారిపై కాపు కాసి దారి దోపిడీ చేసిన సంఘటన గురువారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే గురువారం అర్థరాత్రి 1:30గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కొల్లాపూర్ నుంచి రామాపురం వెళ్లే దారిలో ఊరాటిగుట్ట వద్ద ప్రధాన రహదారిపై చెట్టు కొమ్మలను అడ్డంగా పడవేశారు. అదే సమయంలో కొల్లాపూర్ నుంచి పెబ్బేరుకు డీసీఎంవ్యాన్ బయలుదేరింది. రోడ్డుపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు డీసీఎం డ్రైవర్ ఫయూం, క్లీనర్ రఘులు ప్రయత్నించగా పొదల మాటున కాపు కాసిన ఇద్దరు దుండగులు గొడ్డళ్లు, కత్తులతో వారిని చంపుతామంటూ బెదిరించారు. వారి జేబులో నగదు లేకపోవడంతో సెల్ఫోన్లు లాక్కున్నారు. కొద్దిసేపటికి పెంట్లవెల్లికి చెందిన సుదర్శన్‌చారి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా రోడ్డుపై డీసీఎం వాహనం నిలిపి ఉండటం, రోడ్డుకు అడ్డంగా చెట్టు కొమ్మలు పడి ఉండటాన్ని గమనించి ఆయన అక్కడే ఆగిపోయాడు. దుండగులు ముళ్ల పొదల నుంచి అక్కడికి వచ్చి అతని జేబులోని రూ.2వేల నగదు, సెల్‌ఫోన్‌ను లాక్కొని డీసీఎంలోనే కూర్చోబెట్టారు. 45 నిమిషాల తర్వాత తిరుపతి నుంచి వస్తున్న తుఫాన్ వాహనాన్ని దుండగులు అడ్డగించారు. అందులో ప్రయాణిస్తున్న మేనుగొండ హమాలీ వెంకటస్వామి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు నగలను, రూ.3వేల నగదు, ప్రయాణికుల సెల్ఫోన్లను లాక్కొని వారిని పంపించారు. కొద్దిసేపటి తర్వాత డీసీఎంలో ఉన్న సుదర్శనాచారికి తమ వద్ద ఉన్న సెల్ఫోన్లన్నీ అప్పగించి సోమశిల గట్లవైపు దుండగులు వెళ్లిపోయారు. సుదర్శనాచారి వెంటనే కొల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని దారి దోపిడీ పై ఫిర్యాదు చేశారు. అప్పటికే మేనుగొండ వెంకటస్వామి కూడా అక్కడకు చేరుకొని పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించారు. సీఐ రాఘవరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని దుండగుల కోసం గాలించారు. దుండగుల ఆచూకీ వారికి లభించలేదు. రోడ్డుపై ఉన్నచెట్టు కొమ్మలను తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.