
జూపల్లి కృష్ణారావు
తాను టీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: తాను టీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి వర్గం విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ అభ్యర్థుల గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లే తమ నాయకులని స్పష్టం చేశారు. మిగతా విషయాలు అధిష్టానంతో మాట్లాడతానని చెప్పారు. కాగా, టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫోన్ చేయడంతో జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌కు వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఆయనకు, పార్టీకి మధ్య దూరం పెరిగినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అలాంటిదేమి లేదని తాజాగా జూపల్లి ప్రకటించారు.
చదవండి: ఫలించిన హరీష్ రావు వ్యూహాలు..