Jupally Krishna Rao
-
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. నలుగురిని గుర్తించాం: మంత్రి జూపల్లి
సాక్షి, మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని.. జీపీఆర్ ద్వారా నలుగురు కార్మికులను మార్క్ చేసినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రేపు(ఆదివారం) రాత్రిలోపు వారి ఆచూకీ దొరికే అవకాశముందని.. మిగిలిన వారి జాడ తెలుసుకునేందుకు మరింత సమయం పడుతుందన్నారు. మొత్తం 8 మంది కార్మికులలో నలుగురిని గుర్తించామని, మిగతా నలుగురు టీబీఎం మిషన్ అవతలి వైపున ఉన్నట్లు చెప్పారు. గ్యాస్ కట్టర్ల ద్వారా టీబీఎం మిషన్ మొత్తం కట్ చేశామని వెల్లడించారు. టన్నెల్ బోరు మిషన్ కట్ చేసి రెస్క్యూ చేస్తున్నారన్నారు. సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని.. ఘటనపై ప్రతిపక్షాలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. మరో వైపు, టన్నెల్ వద్దకు ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు సిబ్బంది, మరో ఇద్దరు పీజీ వైద్యులు, నాగర్ కర్నూల్ డీఎంహెచ్‌వో ప్రమాద స్థలంలో ఉన్నారు. ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 8.30గం. ప్రాంతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఎనిమిది మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగిన స్థలంలో మృతదేహాల అవశేషాలను గుర్తించిన సంగతి తెలిసిందే.ప్రమాదం జరిగిన స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జేపీ కంపెనీ ఏర్పాటు చేసిన లోకో ట్రైన్‌ను 13.5 కిలోమీటర్ వరకు తీసుకొచ్చి.. మృతదేహాలను బయటకు తెస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, రైల్వే రెస్క్యూ టీంలు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచి టన్నెల్ నుంచి.. పైపుల ద్వారా భారీగా నీటిని, బురదను డబ్బాల్లో బయటకు పంపుతూనే ఉన్నారు. -
నేను ఐదు సంవత్సరాలు కేసీఆర్ క్యాబినెట్ మంత్రినే..
హైదరాబాద్: తాను కేసీఆర్(KCR) క్యాబినెట్ లో ఐదేళ్లు మంత్రిగా చేశానని, మంత్రులకు ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేదని, అందుకు తానే సాక్ష్యమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మంగళవారం సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన జూపల్లి.. ‘ కేసీఆర్ మీటింగుల్లో కేసీఆర్ వచ్చేదాకా ఎవరూ మాట్లాడడానికి అవకాశం ఉండకపోయేది. కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణం ఎవరో అందరికీ తెలుసు. తెలంగాణలో ఆరిపోయింది కాకుండా ఢిల్లీలో అరిపోయారు. సెక్రటేరియట్ కట్టడం తప్పు పట్టడం లేదు కానీ, సెక్రటేరియట్ రాకపోవడం తప్పని ఆనాడే అన్నాను. అమరవీరుల చిహ్నం, అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి పదేండ్లు పట్టిందా?, బీఆర్ఎస్(BRS) ఓడిపోవడానికి వాళ్ళ స్వయంకృపరాదమే కారణం. కేసీఆర్ పాలన రావాలని తెలంగాణ ప్రజలు తపిస్తున్నట్టు నిన్న ఆయన అనుచరులు ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది. ఎంతో మంది ప్రాణత్యాగం, ఎంతోమంది పోరాటం, రాజకీయ సంఘర్షణలు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగాయి. పది సంవత్సరాల తర్వాత కూడా కేసీఆర్ పాలన కావాలని ఎందుకు కోరుకుంటారు. గడిచిన 65 సంవత్సరాల్లో 18 మంది ముఖ్యమంత్రులు 65 వేల కోట్ల అప్పు చేశారు.కేసీఆర్ పదేండ్ల అప్పుల పాలన గొప్ప పాలన ఎలా అవుతుంది?, ఆంధ్రవాళ్ళు అంద్రవాళ్ళు అన్న కేటీఆర్(KTR) ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టాడు. పది సంవత్సరాల్లో కేసీఆర్ ఒక్కసారైనా అంబేద్కర్ కి దండ వేశాడా?, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న కేసీఆర్ ఆనాడు ప్రతిపక్షాలకు సమయం ఇచ్చాడా?, రాష్ట్ర అప్పు 2 లక్షల కొట్లే అని అసెంబ్లీలో కేసీఆర్ అన్నారు. అదే నిజమని అనుకున్నాం. కేసీఆర్ శాసనసభకే రాలేదు. ఆయన పాలన కావాలని కోరుకుంటారు ఏంటి?, కేసీఆర్ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశాడు. కేటీఆర్ మాట్లాడితే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదుసర్పంచులకి బిల్లులు ఇవ్వడం లేదని అనడానికి కేటీఆర్ కి సిగ్గు ఉందా?, కేసీఆర్ చేసిన పనికి....అప్పు కట్టడానికి అప్పు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కి వాత పెట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు కేసీఆర్ కి వాత పెడతారు. కేసీఆర్ ని విమర్శించే అర్హత ఎవరికీ లేదు’ అని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. -
తెలంగాణకు మణిహారంగా ఎక్స్పీరియం ఎకోపార్కు
శంకర్పల్లి: ‘ఎక్స్పీరియం ఎకోపార్కు’రాష్ట్రానికి మణిహారంగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో 85 దేశాల నుంచి తెచ్చిన 25 వేల మొక్కలతో ఏర్పాటు చేసిన ‘ఎక్స్పీరియం’ఎకో పార్కును ప్రముఖ సినీనటుడు చిరంజీవి, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పార్కు యజమాని రాందేవ్రావుతో కలిసి ఎలక్ట్రిక్ వాహనంలో తిరుగుతూ పార్కును పరిశీలించారు.మొక్కల విశేషాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా వనజీవి రామయ్య దంపతులు, ఇటీవల గవర్నర్ పురస్కారానికి ఎంపికైన దుశ్చర్ల సత్యనారాయణను సీఎం రేవంత్‌రెడ్డి, చిరంజీవి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎక్స్పీరియం ఎకోపార్కు లోగో, కాఫీ టేబుల్‌బుక్‌ను ఆవిష్కరించారు. అయితే కార్యక్రమ ప్రారంబోత్సవంలో వేదికపైకి వనజీవి రామయ్యను పిలవకపోవడాన్ని గమనించిన సీఎం..వారిని వేదికపైకి పిలిచి గౌరవించారు. టూరిజంతోనే గుర్తింపు, ఆదాయం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇప్పటికే ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో రాణించిందని, టూరిజంను అభివృద్ధి చేసేందుకు వనరులున్నా, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. టూరిజం ద్వారానే రాష్ట్రానికి గుర్తింపు, ఆదాయం లభిస్తుందని తెలిపారు. త్వరలోనే నూతన టూరి జం (టెంపుల్, ఎకో, హెల్త్) పాలసీని తీసుకొచ్చేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. వికారాబాద్ ప్రాంతంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉంటుందని, ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం స్పాట్‌గా మారుస్తామని, ఇందుకోసం పెద్ద పెద్ద పరిశ్రమలు ముందుకు వస్తున్నాయని స్పష్టం చేశారు. 25ఏళ్ల కలను సాకారం చేసుకున్న ఎక్స్పీరియం పార్కు యజమాని రాందేవ్‌రావును సీఎం ప్రత్యేకంగా అభినందించారు.ఈ పార్కు తెలంగాణ పర్యాటక రంగానికి ఎంతో దగ్గరగా ఉందని, ప్రస్తుతం 30 శాతం మాత్రమే పూర్తయిందని, ఏడాదిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీనికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని స్పష్టం చేశారు. వనజీవి రామయ్య జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీఎం రమేశ్, అనిల్‌కుమార్, శాసనమండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం నా సంపాదన అంతంతే: చిరంజీవి ‘రాందేవ్ నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. దేశ, విదేశాల్లోని మొక్కలను తీసుకొచ్చి చూపిస్తూ తీసుకోండి సార్ అనేవారు. అప్పుడు రూ.వేలల్లో ఉన్న మొక్కలు ధరలు, ఇప్పుడు కోట్లలో ఉన్నాయి. ప్రస్తుతం నా సంపాదన అంతంత మాత్రమే ఉంది. తర్వాత కొనుగోలు చేస్తానంటూ’మెగాస్టార్ చిరంజీవి చమత్కరించారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.ప్రొద్దుటూరులో రాందేవ్రావు నిర్మించిన ఎక్స్పీరియం పార్కును చూడాలంటే కళా హృదయం ఉండాలని చిరంజీవి అన్నారు. తనకు ఈ ప్రాంతంతో 25 ఏళ్ల క్రితం నుంచి అనుబంధం ఉందన్నారు. 2000లో జీవం ఉన్న మొక్కలను అందించి రాందేవ్ తననే ఆశ్చర్యపరిచారని, ఆ మొక్కలు నేటికి తన గార్డెన్లో ఉన్నాయని తెలిపారు. షూటింగ్‌లకు అనుమతి ఇస్తారా అంటే తనకే ఫస్ట్ ఇస్తానని రాందేవ్ చెప్పారని, రానున్న రోజుల్లో ఇక్కడ షూటింగ్ చేసేందుకు తాను సుముఖంగా ఉన్నానని తెలిపారు. -
కేఎఫ్ బీర్లు బంద్
సాక్షి, హైదరాబాద్: ఎ క్సైజ్ శాఖకు యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ ఝలక్ ఇచ్చింది. తాము తయారు చేసే బీర్లను ఇక నుంచి తెలంగాణలో సరఫరా చేయబోమని ఆ కంపెనీ ప్రకటించింది. బేసిక్ ధరలు పెంచలేదని, బిల్లులు పెండింగ్‌లో ఉన్నందున బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు కంపెనీ నిబంధనల ప్రకారం...ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్), బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్చేంజ్)లకు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగైదు బ్రాండ్ల బీర్లకు మంచి మార్కెట్ ఉంది. అందులో యూబీ తయారు చేసే కింగ్‌ఫిషర్ బీర్లదే సింహభాగం. మొత్తం తెలంగాణ మార్కెట్లో 72 శాతం వరకు ఈ బ్రాండ్‌దే ఉంటుందని అంచనా. ఈ బీర్లు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)కు సరఫరా చేసినందుకుగాను కేస్‌కు రూ.289 చొప్పున తయారీదారులకు చెల్లిస్తారు. ఈ బేసిక్ ధర పెంచాలన్న డిమాండ్ ఎక్సైజ్ శాఖలో చాలా కాలంగా వినిపిస్తున్నా, అమల్లోకి రాకపోవడంతో తాజా సమస్య ఏర్పడింది. తక్షణమే నిలిపివేస్తున్నాం...యూబీ కంపెనీ సెక్రటరీ నిఖిల్ మల్పానీ పేరుతో బుధవారం స్టాక్ ఎక్సే్చంజ్‌లకు ఇచ్చిన సమాచారాన్ని జాతీయ మీడియా బహిర్గతం చేసింది. ఈ లేఖలో పేర్కొన్న ప్రకారం యూబీ తయారు చేసే బీర్ల సరఫరాను తెలంగాణలో తక్షణమే నిలిపివేయనుంది. 2019–20 నుంచి కంపెనీకి చెల్లించే బేసిక్ ధరలను తెలంగాణ ప్రభుత్వం సవరించలేదని, దీని కారణంగా భారీ నష్టాలు వస్తున్నాయని ఆ లేఖలో వెల్లడించారు. టీజీబీసీఎల్ చెల్లించాల్సిన పెద్ద మొత్తం పెండింగ్‌లో ఉందని, ఈ కారణంగానే తాము బీర్లు సరఫరా చేయడం లేదని స్పష్టం చేసింది.పలుమార్లు విజ్ఞప్తులుఐదేళ్లుగా బీర్, లిక్కర్ తయారీదారులకు బేసిక్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం సవరించలేదు. ముఖ్యంగా బీర్ తయారీదారులకు ఎప్పటి నుంచో కేస్‌కు రూ.289 మాత్రమే చెల్లిస్తున్నారు. బీర్ల తయారీకి ఉపయోగించేముడి పదార్థాల ధరలు పెరిగినందున బేసిక్ ధరలు పెంచాలని యూబీతోపాటు అనేక కంపెనీలు కూడా ప్రభుత్వాన్ని కోరాయి. కొద్ది రోజుల క్రితం ఆలిండియా బీర్ అసోసియేషన్ ప్రతినిధులతో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీధర్ చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. సీఎంతోపాటు ఎక్సైజ్ మంత్రి వద్ద జరిగిన అంతర్గత చర్చల్లోనూ లిక్కర్ కంపెనీల బేసిక్ ధరలు పెంచేది లేదని కరాఖండిగా తేల్చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే యూబీ కంపెనీ తమ ఉత్పత్తులను రాష్ట్రంలో సరఫరా చేయరాదని నిర్ణయించింది. వారం రోజులు ఓకే..బీర్ల సరఫరా తక్షణమే నిలిపివేసినా, మార్కెట్లో బీర్ల కొరత ఇప్పటికిప్పుడే రాదని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే యూబీ కంపెనీ నుంచి టీజీబీసీఎల్‌కు అందిన బీర్లు మరో ఆరేడురోజుల పాటు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతేనే ఫలానా బ్రాండ్ బీర్ల కొరత ఏర్పడుతుందని చెబుతున్నాయి. అయితే వైన్‌షాపుల యజమానులు అప్రమత్తమయ్యారు. వీలున్నంత ఎక్కువగా కింగ్‌ఫిషర్ బీర్లకు ఇండెంట్ పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిపోల వద్ద రేషన్ విధించే యోచనలో ఎక్సైజ్ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. చర్చలకు సిద్ధంగా ఉన్నాం : టీజీబీసీఎల్ ఎండీకి యూబీ కంపెనీ లేఖధరల పెంపు, బకాయిల విషయంలో నిర్ణయం తీసుకోనందునే తాము బీర్ల సరఫరాను బుధవారం నుంచి నిలిపివేసినట్టు, ఈ ప్రతిష్టంభనను తొలగించకుకోవడానికి టీజీపీసీఎల్తో చర్చలకు సిద్ధమని యూబీ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు టీజీ బీసీఎల్ ఎండీ, ఎక్సైజ్ డైరెక్టర్ చెవ్వూరి హరికృష్ణకు యూబీ కంపెనీ చీఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ ఆఫీసర్ గరీమాసింగ్ లేఖ రాశారు. ఏప్రిల్ 1, 2024 నాటికి తమకు రూ.702 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, గత ఏడాది అక్టోబర్ నుంచి ఎలాంటి చెల్లింపులు జరగలేదని ఆ లేఖలో తెలిపారు. బేసిక్ ధర పెంపు నిర్ణయం జరిగిన వెంటనే బీర్ల సరఫరాను యథాతథంగా కొనసాగిస్తామని వెల్లడించారు. తమ బకాయిలు సెప్టెంబర్ 2025 లోపు దశలవారీగా చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీజీ బీసీఎల్‌కు రాసిన లేఖలో గరీమాసింగ్ స్పష్టం చేశారు.ధరలు పెంచడమే న్యాయం ముడిసరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో బీర్ తయారీ కంపెనీలకు బేసిక్ ధర పెంచడమే న్యాయం. ఈ క్రమంలో స్థానిక అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపి పెంచితే మంచిది. ప్రభుత్వం రమ్మంటే వెళ్లి చర్చిస్తాం. యూబీ కంపెనీ ప్రతినిధులతో కూడా మాట్లాడతాం. కానీ, న్యాయమైన ధర మాత్రం ఇవ్వాల్సిందే. – ఎం.కామేశ్వరరావు, అసోసియేషన్ ఆఫ్ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్» స్టాక్ ఎక్స్చేంజ్లకు ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ వర్గాల్లో అలజడి» మార్కెట్లో 72 శాతానికి పైగా వాటా ఉన్న కింగ్‌ఫిషర్ బ్రాండ్ తయారు చేసేది యూబీనేధరల పెంపుపై ఒత్తిడి తేవడం పద్ధతి కాదు: జూపల్లిబీర్ల ధరల పెంపు అంశంపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకోకముందే యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌పై ఒత్తిడి తేవడం పద్ధతి కాదని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గుత్తాధిపత్యంతో బీర్ల ధరలు పెంచాలని యూబీ కంపెనీ చూస్తోందని విమర్శించారు. ఒత్తిళ్లకు తమ ప్రభుత్వం తలొగ్గే ప్రశ్నే లేదన్నారు. బుధవారం సచివాలయ మీడియా పాయింట్లో మంత్రి మాట్లాడారు. ఒక్కో బీరుపై దాదాపు 33.1 శాతం పెంచాలని కంపెనీ అడుగుతోందని, అలా చేస్తే బీరు ధర రూ.150 నుంచి రూ.250 వరకు పెరుగుతుందన్నారు. బీర్ల ధరల పెంపుపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో గతంలోనే కమిటీ వేశామని, కమిటీ నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. యూబీ కంపెనీ మార్కెట్ షేర్ 72 శాతం ఉంది కదాని.. ప్రజలు డిమాండ్ చేస్తారు కదాని ఇష్టానుసారంగా ధరలు పెంచాలని కోరడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,130 కోట్లు చెల్లించామని, ఇంకా రూ. 658 కోట్లు చెల్లించాల్సి ఉందని, కానీ కంపెనీ రూ.702 కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలోని బకాయిలే రూ.407 కోట్లు ఉన్నాయన్నారు. పక్క రాష్ట్రాల కంటే తెలంగాణలో తక్కువ రేట్లు ఉన్న విషయం వాస్తవమేనని, కర్ణాటకలో రూ.190, ఏపీలో రూ.180 ఒక్కో బీరు ధర ఉంటే, తెలంగాణలో రూ.150 ఉందన్నారు. 14 లక్షల కేసుల స్టాక్ ప్రస్తుతం ఉందని, సంక్రాంతి పండుగకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పైసా కూడా ట్యాక్స్ పెంచలేదని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. -
హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్ ప్రారంభం (ఫొటోలు)
-
సీఎం అక్కర్లేదు.. మీ అవినీతిని నేను నిరూపిస్తా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తరువాత ఎవరి ఆదాయం ఎంతో.. ఎవరెంత దోచుకున్నారో ఎల్బీ స్టేడియం వేదికగా మీడియా సమక్షంలో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం ఇంటికి రానవసరం లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్, అధికార ప్రతినిధి భవానిరెడ్డి తదితరులతో కలిసి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పేందుకు సీఎం రావలసిన అవసరం లేదని, తానే వస్తానని అన్నారు.కేసీఆర్ కుటుంబం పదేళ్లు సాగించిన అక్రమాలపై తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, అవినీతి, అక్రమాలు, దోపిడీని మొత్తం రుజువు చేస్తానని అన్నారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి కప్పం కడుతున్నాడని అంటున్న వాళ్లు.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్లాలకు ఇచ్చిన డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.మూసీ రివర్ ఫ్రంట్ లో రూ.లక్షా యాభై వేల కోట్ల దోపిడీ జరిగిందని ప్రజలను కేటీఆర్, హరీశ్‌రావు తప్పుదోవ పట్టిస్తు న్నారని అన్నారు. తెలంగాణను మొత్తం దోచుకు న్నదే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అని, వాళ్లే ఇప్పుడు తాము నీతిమంతులమని మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో మూసీ ఒడ్డు నుంచి 50 మీటర్లు బఫర్ జోన్ అని జీవో నెంబర్ 7 ఇచ్చిందని, 50 మీటర్ల బఫర్ జోన్లో నా ఇల్లు కూడా పోతుందని జూపల్లి వెల్లడించారు. -
మెట్లబావుల పునరుద్ధరణకు భారత్ బయోటెక్ సాయం!
తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలైన మెట్లబావులను పునరద్ధరించేందుకు ప్రముఖ వ్యాక్సీన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ముందుకొచ్చింది. నీటి వనరుల సంరక్షణతోపాటు జీవనోపాధులను పెంచేందుకు, ఎకో టూరిజానికి ఊతమిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా ‘ద సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండవర్’ క్లుప్తంగా సాహె అమ్మపల్లి, సాలార్ జంగ్ సంగ్రహాలయాల్లో చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమాలకు తమవంతు సాయం అందించనుంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి ఎ.వాణీ ప్రసాద్‌ల సమక్షంలో భారత్ బయోటెక్, సాహేల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా తాము మెట్లబావుల పునరుద్ధరణకు సాయం అందించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా తెలిపారు. మెట్లబావుల పునరుద్ధరణతోపాటు వీటి ప్రాశస్త్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తామని అమ్మపల్లి, సాలార్ జంగ్ సంగ్రహాలయాల్లోని మెట్లబావులు అటు పల్లెల్లో ఇటు నగరాల్లోనూ కీలకమైన నీటి వనరులగా సేవలందించాయని చెప్పారు. అమ్మపల్లిలోని మెట్లబావి 13వ శతాబ్దానికి చెందినదైతే.. సాలార్ జంగ్ సంగ్రహాలయంలోనిది కుతుబ్ షాహీల కాలం నాటిదని గుర్తు చేశారు. ఢిల్లీలోని అగ్రసేన్ కి బౌలీ, అహ్మదాబాద్‌లోని రాణీ కి వావ్‌లు యునెస్కో గుర్తింపు పొందాయని, చిన్న బావుల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పారు. ఆధునిక కాలంలో వీటి అవసరం లేక పోవడంతో కొన్ని చోట్ల చెత్తకుప్పలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో భూగర్భ జల వనరుల వాడకం అత్యధికంగా ఉందని యునెస్కో సైతం హెచ్చరించిన నేపథ్యంలో.. మెట్లబావుల వంటి నీటి వనరులను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
HYD : నిధంలో అట్టహాసంగా పర్యాటక దినోత్సవం (ఫొటోలు)
-
తెలంగాణను మొదటిస్థానంలో నిలుపుతాం..
-
మంత్రి జూపల్లి కాన్వాయ్ పై రాళ్ల దాడి..
-
పర్యాటక రంగ అభివృద్ధే లక్ష్యం: మంత్రి జూపల్లి
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందుకే క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.టూరిజం స్టడీ టూర్లో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని సరళ సాగర్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను, కురుమూర్తి ఆలయాన్ని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేల బృందంతో కలిసి మంత్రి సందర్శించారు. అనేక అవకాశాలు, వనరులు ఉన్నప్పటికీ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. ఆసియాలోనే రెండో ఆటోమేటిక్ సైఫాన్ వ్యవస్థ కలిగిన సరళాసాగర్తో పాటు కోయిల్ సాగర్, కురుమూర్తిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు మూడు కోట్లు ఇస్తామని మంత్రి తెలిపారు. -
ఎక్సైజ్ ఆదాయంపై తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ
-
శిల్పకళావేదికలో మాదక ద్రవ్యా ల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం (ఫొటోలు)
-
బేవరేజెస్ కార్పొరేషన్ సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాలతో ప్రభుత్వానికి, ఎక్సైజ్‌శాఖకు చెడ్డపేరు వస్తోందని, కీలక పదవుల్లోని వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎౖMð్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలే తప్ప.. సొంత నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేశారు. మంగళవారం నాంపల్లిలోని ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో ఆయన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.మద్యం కంపెనీల అనుమతుల వ్యవహారం ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాకుండా బేవరేజెస్ కార్పొరేషన్ సొంతంగా విధివిధానాలు ఎలా ఖరారు చేస్తుందని మంత్రి అధికారులపై మండిపడ్డారు. తనశాఖలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలతో శాఖ ప్రతిష్ట దెబ్బతినడమేకాక, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని వ్యాఖ్యానించారు. అనుమతుల అంశంపై సంజాయిషీ ఇవ్వాలని, విచారణ జరిపి సమగ్ర నివేదిక సమరి్పంచాలని ఎక్సైజ్‌శాఖ కమిషనర్, ఎండీ శ్రీధర్, బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహంను మంత్రి జూపల్లి ఆదేశించారు. నివేదిక ఆధారంగా కఠినచర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, కల్తీ కల్లు, గుడుంబా, గంజాయి సరఫరా, అమ్మకాలపై నిరంతర నిఘాపెట్టాలని, ఉక్కుపాదంతో డ్రగ్స్ మాఫియాను అణవేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవారి వెన్నులో వణుకు పుట్టించేలా చర్యలు ఉండాలని ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. తయారీ, సరఫరా, విక్రేతలు, సప్లయ్ నెట్వర్క్ వారి డేటాబేస్ తయారు చేయాలని, తరచూ ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో, పోలీసు శాఖ సమన్వయంతో ఎక్సైజ్‌శాఖ అధికారులు పని చేయాలని తెలిపారు.మాదక ద్రవ్యాలను అరికట్టడమేకాక.. వాటితో కలిగే నష్టాలపై సమాజంలో అవగాహన కలి్పంచేందుకు మీడియా, సోషల్ మీడియా, థియేటర్లలో ఆడియో, వీడియో రూపంలో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులతో సమావేశాలు నిర్వహించి, వారిలో చైతన్యం తీసుకురావాలన్నా రు. ఈ సమావేశంలో ఎక్సైజ్‌శాఖ కమిషనర్, ఎండీ ఇ.శ్రీధర్, అడిషనల్ కమిషనర్ అజయ్‌రావు, బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహం, ఉమ్మడి జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు. -
కొల్లాపూర్ ఘటనపై జూపల్లి రియాక్షన్
-
శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కేటీఆర్
సాక్షి, వనపర్తి: కాంగ్రెస్ పార్టీ పేరుకే ప్రజాపాలన.. చేస్తుంది ప్రతీకార పాలన అంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. జూపల్లి కృష్ణారావు ప్రమేయంతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి జూపల్లిని వెంటనే బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వరుస హత్యలపై జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ ప్రాంతాన్ని కల్లోల ప్రాంతంగా ప్రకటించాలన్నారు.వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి అంతిమయాత్రలో కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి హత్యలు ఎప్పుడు జరగలేదని తెలిపారు. తాము అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండేదా అని ప్రశ్నించారు.రాజకీయ హత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఈ హత్యలు జూపల్లి కృష్ణారావు సహకారం లేకుండ జరగవని అన్నారు. తెలంగాణలో ఎక్కడలేని ఫ్యాక్షని సంస్కృతి కొల్లాపూర్‌లో నెలకొందని, శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హత్యలను ఇలాగే కొనసాగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కేటీఆర్. మా వాళ్ళని ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసని, ఎంతటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హత్యల సంస్కృతి తెలంగాణకి మంచిది కాదని, శ్రీధర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. -
కేసీఆర్‌లో భయం మొదలైంది: మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: తప్పు చేసిన వాడు ఎప్పుడూ బయపడుతాడు.. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్‌లో భయం మొదలైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పరువు కోసం తాపత్రయ పడుతున్నారని మండిపడ్డారు. బుధవారం జూపల్లి మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర నీటి వాటను బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టింది. కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తలొగ్గింది. దొంగే దొంగ అన్నట్లు ఉంది బీఆర్ఎస్ పరిస్థితి. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ చేసిన ఘనకార్యాలను సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ప్రసక్తి లేదు’ అని తెలిపారు జూపల్లి. నీటి వాటా సాధించలేదు.. తెలంగాణ రాష్ట్రం నీటి వాటాను కేసీఆర్ సాదించలేకపోయారని ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ అన్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు హాజరుకాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కృష్ణా నది కింద ఒక్క ఎకరాకు కొత్తగా నీరు ఇవ్వలేదని అన్నారు. -
Jupally Krishna Rao: కేటీఆర్‌కు మంత్రి జూపల్లి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్ అయ్యారు. సంక్రాంతి రోజున కేటీఆర్ కారణంగా ప్రెస్‌మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఇదే సమయంలో కేటీఆర్‌కు జూపల్లి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలి అని కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి జూపల్లి సోమవారం సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడుతూ గతేడాది డిసెంబర్లో కొల్లాపూర్‌లో మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి తన బంధువుల చేతిలో హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కారణాల వలన, భూ తగాదాలతో హత్య జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు అయ్యాక ఇప్పుడు తెర మీదికి ఆ హత్యను ఎందుకు తీసుకు వచ్చారు?. హంతకులను శిక్షిస్తామని మేము ముందే చెప్పాము. ఈ కేసుకు సంబంధించి కొందరు పోలీసుల అదుపులో ఉన్నారు. రాజకీయాలు వద్దు.. మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి బీజేపీ సానుభూతి పరుడు. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎన్నికల కోసం కేటీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. గతంలో కాంగ్రెస్ సర్పంచ్.. బీఆర్ఎస్ పార్టీలో చేరడం లేదని ఆయనను హత్య చేశారని గుర్తు చేశారు. తన నియోజకవర్గంలో జెట్పీటీసీ హనుమంత్ నాయక్, సర్పంచ్‌లపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేవారు. తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో చాలా మందిని హత్యలు చేశారని గుర్తుచేశారు. చేయని వాటికి చేశానని తనపై బురద చల్లుతున్నారు. నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. 1999 నుండి ఇప్పటి వరకు ఎన్నికల్లో నా మెజార్టీ పెరుగుతూ వస్తుందని, తన విలువలుతో కూడిన రాజకీయాలు చేస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. కొండగట్టు మరణాల సంగతేంటీ? ఇదే సమయంలో మా నియోజక వర్గంలో జరిగిన ప్రతి హత్యపై సాక్ష్యదారాలతో సహా గతంలో డీజీపీకి ఫిర్యాదు చేసిన అప్పుడు ఎవరు పట్టించుకోలేదన్నారు. అప్పుడు జరిగిన హత్యల గురించి ఆనాడు ప్రగతి భవన్లో ఉన్న పెద్దలకు చెప్పినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు మీరు జనాలను పట్టించుకోలేదు కాబట్టి మిమ్మల్ని జనాలు ఓడగొట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. కొండగట్టు ప్రమాదంలో 60 మంది చనిపోతే మీరు వెళ్ళలేదు కానీ వ్యక్తిగత కారణాలు, భూ వివాదాల వలన చనిపోయిన వ్యక్తి చావుతో శవ రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
-
కొల్లాపూర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను: జూపల్లి కృష్ణా రావు
-
మంత్రిగా జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం
-
కొల్లాపూర్‌లో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు
సాక్షి, నాగర్‌కర్నూలు: కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో వచ్చి కొల్లాపూర్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో, ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గురువారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, సమాచారం ఇచ్చిన వారిని కొల్లాపూర్ ఎస్సై అతి దారుణంగా కొట్టారని వారు ఆరోపించారు. కొల్లాపూర్ మాజీ జెడ్పీటీసీ హనుమంతు నాయక్, ముక్కిడి గుండం మాజీ సర్పంచ్ లోకేష్ యాదన్‌ను ఎస్సై అతి దారుణంగా కొట్టారని జూపల్లి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డైరెక్షన్లోనే పోలీసులు పనిచేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు. పోలీసులు అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు బూటు కాళ్లతో తన్నారని బెల్టులతో కొట్టారని జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దీని కోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది అంటూ ప్రశ్నించారు. -
ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్: కేసీఆర్‌కు జూపల్లి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన కామెంట్స్ చేశారు. అహంకారంలో కేసీఆర్‌ను మించిన వాళ్లు ఎవరున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అది ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సీఎం కేసీఆర్ నిన్న(శుక్రవారం) తెలంగాణ భవన్లో జూపల్లి గురించి మాట్లడుతూ ఎన్నికల సమయంలో అహంకారంగా వ్యవహరించారని అన్నారు. అలాగే, కార్యకర్తలను, ప్రజలను కలవడంలో జూపల్లి అలసత్వం చూపించారని.. అందుకే ఎన్నికల్లో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై జూపల్లి స్పందించారు. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘నన్ను వేలు పెట్టి చూపించే హక్కు నీకు లేదు. అహంకారంలో కేసీఆర్‌ను మించిన వాళ్లు ఎవరున్నారు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. కమ్యూనిస్టులను తోక పార్టీలు అన్నది అహంకారంతో కాదా?. ఎమ్మెల్యే, మంత్రులను కలవకుండా అహంకారంతో ఉంది నువ్వే కేసీఆర్. ఎన్నికలు రాగానే వేషాలు మారుస్తున్నావు. ఎన్నికల్లో నువ్వెందుకు ఓడిపోయావ్.. వినోద్ ఎందుకు ఓడిపోయాడు. చేసే ప్రతీ పనిలోనూ వాటాలు. కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు. కేసీఆర్ మీద ప్రజలకు నమ్మకం పోయింది. ధర్నాచౌక్ ఎత్తేసిన వ్యక్తి కేసీఆర్’ అంటూ మండిపడ్డారు. ఇది కూడా చదవండి: నేడు బీజేపీ కీలక భేటీ.. అభ్యర్థుల్లో టెన్షన్! -
‘కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి కానీ చేతులు గడప దాటవు’
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి కానీ చేతులు గడపదాటవని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు.ఈ మేరకు మంగళవారం గాంధీ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్‌తో కలిసి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. వేలకోట్ల అవినీతి డబ్బుతో నాయకులను, ప్రజలను కొనాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎం అయ్యాక 88 వేల మంది రైతులు చనిపోయారని అన్నారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ దోచుకుంటున్నారని, హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. -
కొల్లాపూర్‌లో ఎవరికి వారే యమునా తీరే!
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ పార్టీ నుంచి ఎవరికి సీటు ఇచ్చినా ఆపార్టీల్లోని ఇంకోవర్గం వ్యతిరేకంగా పనిచేసే పరిస్ధితి నెలకొంది. అధిష్టానాలు కూడా గ్రూపు రాజకీయాలను చక్కదిద్దటంలో విఫలమవుతున్నాయి. దీంతో ఆ సెగ్మెంట్లో ఎవరికివారు యమునా తీరే అనే రీతిలో వ్యవహారం నడుస్తోంది. నేతల మధ్య వార్.. పార్టీ వీడిన జూపల్లి కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు 5 సార్లు గెలిచి అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్లో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో జూపల్లి కాంగ్రెస్ అభ్యర్ది హర్షవర్దన్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. తర్వాత రాజకీయ పరిణామాలతో హర్షవర్దన్ రెడ్డి కాంగ్రెస్‌కు బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య వార్ నడుస్తూనే ఉంది. పార్టీలో హర్షవర్దన్‌రెడ్డి బలపడటం... రోజురోజుకు జూపల్లికి ప్రాధాన్యత తగ్గటం మొదలయ్యింది. దీంతో తన ఉనికిని చాటుకునేందుకు స్దానిక సంస్ధల ఎన్నికల్లో జూపల్లి తన అనుచరులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బరిలో దింపి సత్తా చాటారు. ఇద్దరి మధ్య వివాదం రోజురోజుకు పెరిగింది తప్పా ఎక్కడ సమసిపోలేదు. అధిష్టానం కూడా ఇద్దరిని సమన్వయం చేసేందుకు పెద్దగా దృష్టి కూడా పెట్టలేదు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పార్టీపై ఘాటైన విమర్శలు చేయటంతో జూపల్లిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకుని ఢిల్లీలో బుధవారం మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు లైను క్లియర్ అయ్యింది. హర్షవర్ధన్‌రెడ్డి మాత్రం తాను నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నానని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సోమశిల-సిద్దేశ్వరం వంతెన, రెవెన్యూ డివిజన్ సాధించానని దీంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిన నెరవేరటంతో పాటు ఈప్రాంతం అభివృద్ది చెందేందుకు దోహదపడుతుందని అంటున్నారు. అయితే జీఓ 98 ప్రకారం శ్రీశైలం ముంపు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్న హామీ నెరవేర్చటంలో ఎమ్మెల్యే వైఫల్యం చెందాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేపై ఆ వర్గాల అసంతృప్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరగకపోవటం, మాదాసి కురువలను ఎస్సీలుగా, వాల్మీకిబోయలను ఎస్టీలుగా గుర్తించేందుకు కృషి చేస్తానంటూ ఇచ్చిన హమీలు నెరవేరకపోవటంతో ఆయా వర్గాలు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే అనుచరులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అనుచరులకే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారనే ఆరోణలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎమ్మెల్యేకు మైనస్‌గా మారనుంది. ఇప్పటికే డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి మారాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేకు ఫాంహౌజ్ ఎపిసోడ్ సంకటంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరటంతో గతంలో కొల్లాపూర్‌లో మూడు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసిన, సీఆర్ జగదీశ్వర్‌రావు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగంలో పనిచేసిన రంగినేని అభిలాష్‌రావు కూడా కాంగ్రెస్‌లో చేరాఉ. ఈయన కూడ సీటు ఆశిస్తున్నారు. వీరిద్దరి మధ్య కూడ అంతర్గత విభేదాలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలను వీరిద్దరు వేరువేరుగా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. సొంతగూటికి జూపల్లి.. మొదలైన వర్గపోరు ఇంతలోనే జూపల్లి సొంతగూడికి చేరటంతో వచ్చే ఎన్నికల్లో ఆపార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ది ఎంపిక పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే సీటు గ్యారెంటీతోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. జూపల్లి పార్టీలోకి రావటాన్ని స్వాగతిస్తున్నట్టు చెబుతున్న జగదీశ్వర్‌రావు మాత్రం సీటు తనకే కేటాయించాలని కోరుతున్నారు. దీంతో అప్పుడే వర్గపోరు మొదలైనట్టు కనిపిస్తోంది. ఎలాగైనా తాను ఈసారి బరిలో ఉండాలనుకుంటున్న జగదీశ్వర్‌రావుకు సీటు రాకుంటే ఇండిపెండెంటుగానైనా పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ సీటు విషయంలో గందరగోళం రేగితే బీఆర్ఎస్కు మేలు జరిగే అవకాశం ఉంది. బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లెని సుధాకర్‌రావు నియోజకవర్గ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. ఆయన గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. కేంద్రప్రభుత్వం కృష్ణానదిపై సోమశిల-సిద్దేశ్వరం బ్రిడ్జి మంజూరు చేసిందని తాను దీనికోసం ప్రయత్నించానని గతంలో హర్షవర్దన్‌రెడ్డి జూపల్లిలకు అవకాశం ఇచ్చారు. ఈసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తానని అంటున్నారు. ఆయన నియోజవర్గంలో పాదయాత్ర నిర్వహించి పార్టీ క్యాడర్లో జోష్ నింపారు. అయితే నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేకపోవటం పెద్ద మైనస్‌గా ఉంది. అయితే సుధాకర్‌రావు మాత్రం పార్టీ కార్యక్రమాలు విధిగా నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు కొల్లాపూర్ సంస్ధానాల పాలన సాగిన ప్రాంతం,ఇక్కడ బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గం.మామిడి తోటలకు ప్రసిద్ది చెందిన ప్రాంతం.ఇక్కడి నుంచి మామిడిపడ్లను అంతర్జాతీయంగా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తారు. కాగితం పరిశ్రమలు నెలకొల్పేందుకు వీలుగా నల్లమలలో పుష్కలంగా వెదురు లభ్యమవుతుంది. నదులు: కృష్ణానది,దీని ఆదారంగా భగీరధ నీటిని పాలమూరు,రంగారెడ్డి జిల్లాలకు సరఫరా అవుతుంది అడవులు: నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.ఈ నియోజవర్గంలోని చిన్నంబావి,వీపనగండ్ల,పాన్గల్లు మండలాలు వనపర్తి జిల్లా పరిధిలో ఉన్నాయి.మిగిలినవి నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్నాయి. ఆలయాలు: ఈ నియోజవర్గంలో ప్రసిద్దిన అనేక ఆలయాలు ఉన్నాయి సింగోటం శ్రీలక్ష్మి నర్సింహ స్వామి ఆలయం ,కొల్లాపూర్ మాదవస్వామి ఆలయం ,జెటప్రోలు. వేణుగోపాలస్వామి ఆలయాలు,సోమశిలలో సోమేశ్వరాలయం,ద్వాదశలింగల ధామంగా పసిద్ది చెందింది. పర్యాటకం: సోమశిల కృష్ణానది, కే ఎల్ ఐ ప్రాజెక్ట్.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సైతం ఇక్కడి నుంచే నీటిని తరలిస్తారు. -
ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి, కూచుకుల్ల తనయుడు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు పార్టీలో చేరగా తాజాగా మరికొంతమంది హస్తం గూటికి చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, ఎంపీపి మేఘా రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. చేరికల కార్యక్రమానికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే హాజరయ్యారు. (బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం! తెలంగాణ ముఖ్య నేతలంతా అసెంబ్లీకే! ఎంపీలు కూడా) వాయిదాలతో డౌట్! కొంతకాలంగా జూపల్లి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. కొల్లాపూర్ ఎమ్మెల్యే టికెట్‌తో పాటు ఆయన మరికొన్ని టికెట్లు ఆశిస్తున్నట్టు, దాన్నినాగం జనార్దన్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు తీవ్రంగా వ్యతిరేకించినట్టు వార్తలొచ్చాయి. పార్టీలో జూపల్లి చేరిక కూడా వాయిదాలు పడుతూ వచ్చింది. ఈక్రమంలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరతారా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు ఆ ప్రచారాలకు ఫుల్స్టాప్ పెడుతూ ఆయన చేతిలో చెయ్యేసి నడిచేందుకు అడుగేశారు. (చదవండి: కాంగ్రెస్‌లోకి వస్తూనే టికెట్ల పంచాయితీ పెట్టిన జూపల్లి! నాగం ఆగమాగం.. చేరికపై ట్విస్టయితే ఉండదుగా!) -
వస్తూనే పంచాయితీ పెట్టిన జూపల్లి! టికెట్ ఇవ్వకపోతే అంతే మరి?
ఎన్నికల సీజన్లో నాయకుల గోడ దూకుళ్ళు సహజమే. ఏ పార్టీకి మొగ్గు కనిపిస్తుంటే ఆ పార్టీలో దూకడానికి సిద్ధంగా ఉంటారు. అయితే అప్పటికే అక్కడున్న నేతలు కొత్తవారు వస్తే తమకు ప్రమాదమని ఆందోళన చెందడం కూడా సహజమే. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జూపల్లి కృష్ణారావు తదితరులు త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడే అక్కడ సీట్ల లొల్లి మొదలైంది. కర్నాటక ఫలితాలతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతల సంఖ్య పెరుగుతుండటంతో పాలమూరు జిల్లాలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేష్‌రెడ్డి, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత తదితర అనేక మంది నేతలు కాంగ్రెస్ తీర్థం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ముహూర్తం ఫిక్స్.. ఈ నెల 30న సభ వాయిదాలు పడుతూ వస్తున్నకొల్లాపూర్ కాంగ్రెస్ సభకు ఈనెల 30న ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలిసిందే. ప్రియాంకగాంధీ సమక్షంలో ఈ భారీ బహిరంగసభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు నేతలు. సభ కోసం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాక.. 20వ తేదీనాటి కొల్లాపూర్ సభ వాయిదా పడింది. మరోవైపు కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న జగదీశ్వర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి తమ స్వరం పెంచారు. సీనియర్ నాయకుడు మల్లురవి ఆధ్వర్యంలో కొల్లాపూర్‌లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నాగం జనార్దన్‌రెడ్డి, జగదీశ్వర్‌రావులు హాజరైన ఈ సమావేశం వాడీవేడిగా జరిగింది. కొల్లాపూర్ సీటు ఆయనకే.. కాదంటే సమావేశానికి ముందు జగదీశ్వర్‌రావు భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు. గెలిచిన నాయకులు పార్టీని వదిలి పెట్టిన కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన జగదీశ్వర్‌రావుకు కొల్లాపూర్ సీటు తప్పకుండా ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పార్టీకి ఊపు వచ్చిన తర్వాత సీట్లకోసం పార్టీలో చేరితే సహకరించేంది లేదనే సంకేతాలు ఇచ్చారు. ఇదే విషయాన్ని నాగం జనార్దన్‌రెడ్డి కూడ స్పష్టం చేశారు. సీట్లు కేటాయింపు అనేది సర్వేల ఆధారంగానే జరుగుతుందని మల్లు రవి చెప్పినా కార్యకర్తలు వ్యతిరేకించారు. కొల్లాపూర్‌తో పాటు నాలుగు అసెంబ్లీ స్దానాలు తనవారికి కేటాయించాలని కొత్తగా వస్తున్న నేత డిమాండ్ చేసినట్టు తెలుస్తోందంటూ.. జూపల్లిని ఉద్దేశించి నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించటం హాట్‌టాపిక్‌గా మారింది. ఇదేమాత్రం కరెక్ట్ కాదని నాగం స్పష్టం చేశారు. అసలు జూపల్లి ఎందుకు చేరడం.. కొల్లాపూర్‌లో జగదీశ్వర్‌రావు గెలుపుకోసం పనిచేయాలని నాగం జనార్థనరెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. జూపల్లి కృష్ణారావు తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నాగం హెచ్చరించటంతో కలకలం రేగింది. సర్వేల పేరు చెబుతున్నా జూపల్లి కృష్ణారావుకు సీటు గ్యారెంటీ లేకుండా పార్టీలో ఎందుకు చేరతాడనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొల్లాపూర్ సీటు జూపల్లికి కేటాయిస్తే జగదీశ్వర్‌రావు సహకరించటం కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది పార్టీలో అంతర్గత పోరుకు తెరలేపుతుందని కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రియాంకగాంధీ సభ వాయిదా పడి పరేషాన్లో ఉన్న జూపల్లికి సీట్లలొల్లి తలనొప్పిగా మారిందట. కూచుకుళ్లకు ముందే హామీ.. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేష్‌రెడ్డికి నాగర్‌కర్నూల్ సీటు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు ప్రచారం సాగుతోంది. నాగం జనార్దన్‌రెడ్డి మాత్రం ఈసారి తనకే అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. మరో నాలుగేళ్ళ పదవీకాలం ఉన్నా ఎమ్మెల్సీ సీటు వదులుకుని కూచకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. ఆయన తనయుడికి సీటు భరోసా ఇచ్చాకే పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే చేరికలకు ముందే పార్టీలో కొత్త, పాత నేతల మధ్య జరుగుతున్న పోరు పార్టీకి నష్టం కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ పాలమూరు సీట్ల లొల్లిని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. లేదంటే జూపల్లి చేరికపై ఏమైనా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయా అనేది తేలాల్సి ఉంది. -సాక్షి, పొలిటికల్ డెస్క్ -
కాంగ్రెస్‌లో జూపల్లి చేరికపై ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్/మహబూబ్ నగర్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరికలపై పార్టీ నేతలు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఇటీవలే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. ఇక, మరో కీలక నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికపై సస్పెన్స్ నెలకొంది. అయితే, జూపల్లి కాంగ్రెస్‌లో చేరిక వాయిదా పడినట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణ కాంగ్రెస్ కొల్లాపూర్ సభ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో సభ వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. సభ వాయిదాపై కాంగ్రెస్ అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇక, ఈనెల 20వ తేదీన జూపల్లి చేరిక సందర్భంగా సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. కాంగ్రెస్‌లోకి బీజేపీ సీనియర్ నేత.. ఇదిలా ఉండగా.. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ రాష్ట్రనేత ఒకరు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. దేవరకద్ర నియోజకవర్గంలోనూ గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్ననేత చేరికపైనా చర్చ నడుస్తోంది. ఇక, జడ్చర్ల నియోజకవర్గంలో ఓ కీలక నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జడ్చర్ల నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లోకి.. మరోవైపు.. జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్న సరిత.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్నారు. వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీఆర్ఎస్కి రాజీనామా చేసిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి సహా పలు మండలాల బీఆర్ఎస్ కీలక నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కొడంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి చేరిక కూడా ఇప్పటికే ఖరారైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచర వర్గం అటు కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: ధరణి పోర్టల్‌పై భట్టి సంచలన కామెంట్స్ -
మన టైం వచ్చింది.. కేసీఆర్‌ను గద్దె దింపేద్దాం!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే సమయం వచ్చిందని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేద్దామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, పార్టీలో చేరబోతున్న సీనియర్లకు ఏఐసీసీ పెద్దలు పిలుపునిచ్చారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ ఓటర్లలో కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరిగిందని.. దీనిని అనుకూలంగా మల్చుకుని సమష్టి కృషితో కాంగ్రెస్‌ను గెలిపించుకుందామని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పరస్పర అవగాహన ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీఆర్ఎస్ సర్కారుపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకునేలా వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథ్రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి సహా 35 మంది నేతలతో ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, పొడెం వీరయ్య, సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర రాజనర్సింహా, మహేశ్‌కుమార్‌గౌడ్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో పొంగులేటి, జూపల్లిలను రాహుల్, ఖర్గేలకు రేవంత్‌రెడ్డి పరిచయం చేశారు. తర్వాత వారు మిగతా నేతలను పరిచయం చేశారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో.. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. తెలంగాణలో ‘ఘర్ వాపసీ’ మొదలైందని, పార్టీని వీడిన నేతలంతా తిరిగి చేరేలా చూడాలని రాష్ట్ర నేతలకు సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ, నియంత పాలనపై ప్రజలకు విసుగొచ్చిందని, ఈ సర్కారును సాగనంపాలని అంతా నిర్ణయంచుకున్నారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ కలసిపోయాయని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని, ఇది కాంగ్రెస్‌కు అనుకూలిస్తుందని వివరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ సమయం వచ్చిందని, దీన్ని అనుకూలంగా మల్చుకుని ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుత అవకాశాన్ని చేజారనీయొద్దని స్పష్టం చేశారు. పార్టీలోకి వచ్చే నేతలకు సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. సమన్వయంతో ముందుకు వెళ్లాలి ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకపోవడం వెనుక డీల్ ఉందని, బీజేపీ–బీఆర్ఎస్ల అవగాహనలో భాగంగానే అరెస్ట్ ఆగిపోయిందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని రాష్ట్ర నేతలను ఆదేశించారు. పాత, కొత్త నేతల మధ్య సమన్వయం, సమష్టి బాధ్యతతో పార్టీని అధికారంలోకి తేవాలని సూచించారు. ఖమ్మం సభకు రాహుల్.. ఏఐసీసీ పెద్దలతో భేటీలో జూపల్లి, పొంగులేటి కూడా మాట్లాడారు. తెలంగాణలో మార్పు మొదలైందని, బీఆర్ఎస్ను ఓడించడం కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని వివరించారు. ఈసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి సోనియాగాంధీకి బహుమతిగా ఇస్తామన్నారు. జూలై 2న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు రావాలంటూ రాహుల్‌గాందీని వారు ఆహ్వానించగా.. ఆయన సుముఖత తెలిపారు. ఆ సభలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. భేటీ అనంతరం జూపల్లి, పొంగులేటి, వారి అనుచరులతో రాహుల్ గ్రూప్ ఫోటోలు దిగారు. పాలమూరు సభకు ప్రియాంక గాందీ.. రాహుల్, ఖర్గేలతో భేటీ అనంతరం జూపల్లి, పొంగులేటి తదితరులు సోనియాగాంధీ నివాసానికి వెళ్లి ప్రియాంకగాంధీతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. జూలై 14 లేక 16న మహబూబ్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభకు రావాలని ప్రియాంక గాందీని జూపల్లి ఆహ్వానించారు. దీనికి ప్రియాంక సమ్మతించారని అనంతరం జూపల్లి తెలిపారు. కష్టపడి పనిచేయాలని, దానికి అనుగుణంగా పదవులు అవే లభిస్తాయని ఆమె పేర్కొన్నట్టు సమాచారం. ఎన్నికల వ్యూహాలపై నేడు భేటీ తెలంగాణ ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు అధిష్టానం పెద్దలు మంగళవారం మరోమారు రాష్ట్ర నేతలతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు, అగ్రనేత రాహుల్‌గాందీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొననున్నారు. రాష్ట్ర నేతల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు, ఐక్యతా యత్నాలు, ఎన్నికల వ్యూహాలు, సంస్థాగతంగా బలోపేతం తదితర అంశాలపై అందులో చర్చించనున్నారు. బీఆర్ఎస్ సర్కారు అవినీతిని ప్రధాన అస్త్రంగా చేసుకుని పోరాడేలా వ్యూహాన్ని ఖరారు చేయనున్నారని.. పార్టీ ప్రకటిస్తున్న హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యక్రమాలు, సభలపై చర్చించనున్నారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. -
రాహుల్ సమక్షంలో జూలై 2న కాంగ్రెస్‌లోకి: పొంగులేటి
న్యూఢిల్లీ: వచ్చే ఆదివారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. జులై 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభ వేదికగా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతోపాటు తెలంగాణకు చెందిన 35 మంది నేతలు భేటీ అయ్యారు. ఏఐసీసీ కార్యాలయంలో అరగంటకు పైగా సమావేశం సాగింది. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే మంచి జరుగుతుందని సోనియా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినా అనుకున్నది జరగలేదని, నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారని ఆవదేన వ్యక్తం చేశారు. అందరితో చర్చించే నిర్ణయం: పొంగులేటి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక జూపల్లిలో కలిసి అనేక సభలు సమావేశాలు నిర్వహించి, ప్రజలు ఏం కోరకున్నారనే విషయాలు తెలుసుకున్నామని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీ పెట్టేకంటే కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలనే ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. సర్వేల్లో ప్రజలకు బీఆర్ఎకు వ్యతిరేకంగా ఉన్నారని తేలిందన్నారు. అందరితో చర్చించి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తనకు పదవులివ్వలేదని పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. ‘కల్వకుంట్ల కుటుంబం అనితీతితో ప్రజలకు దక్కాల్సినవి దక్కడం లేదు. అనేక మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారు. మాయల గారఢీ చేయడంలో కేసీఆర్ సిద్ధహస్తులు. జూపల్లి. నేను గత మూడు నెలలుగా సర్వేలు చేయించుకున్నాం. 80 శాతానికి పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది. ప్రజల నాడి గురించి ఆలోచించి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాం. బీజేపీ, కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా మమ్మల్ని ఆహ్వానించాయి. కొత్తగా పార్టీ పెట్టే ఆలోచనపై ప్రజల అభిప్రాయాలు సేకరించాం. కొత్త పార్టీ పెట్టినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. మేధావులు, స్థానిక నేతలతో చర్చించాం. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ గాఫ్ బాగా పెరిగింది’ అని పొంగులేటి పేర్కొన్నారు. పాతాళానికి కేసీఆర్ పాలన: జూపల్లి ప్రత్యేక తెలంగాణ లక్షలాది మంది యువకుల కల అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగినట్లే పాలన ఉందనుకున్నామని, కానీ కేసీఆర్ పాలన పాతాళానికి పోయిందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌వి అన్నీ మభ్యపెట్టే మాటలేనని దుయ్యబట్టారు. ఏ స్కీం పెట్టాలి, ఎలా గెలవాలన్నది కేసీఆర్ వ్యూమేనని.. స్కీంల వెనక ఎంతపెద్ద అవినీతి ఉందో తవ్వేకొద్ది తెలుస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పదవులు వదిలేసి పోరాడం. కానీ బీఆర్ఎస్లో మాకు కనీస గౌరవం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ మనుషులుగా కూడా గౌరవించలేదు. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలే ఉంది కాబట్టి అంబేద్కర్ పేరు జపిస్తున్నారు. మూడోసారి రాష్ట్ర ప్రజలను పాలించే హక్కు కేసీఆర్ కోల్పోయారు. మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకూడదు. తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలి’ అని పేర్కొన్నారు. ప్రెస్‌మీట్ తర్వాత పొంగులేటి, జూపల్లి నేరుగా ప్రియాంక గాంధీ ఇంటికి బయల్దేరారు. -
జూపల్లి, పొంగులేటి విషయంలో క్లారిటీ ఇచ్చిన రేవంత్, వెంకట్ రెడ్డి
-
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాల్సిన అవసరం ఉంది: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం ఉందని గ్రహించి నాలుగేళ్ల క్రితమే ఎదురు తిరిగామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉందని, బీఆర్ఎస్ను రాష్ట్రంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణను పాలించే హక్కు కేసీఆర్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చిన్నారెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని జూపల్లి కృష్ణారావు నివాసానికి లంచ్ మీటింగ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి జూపల్లిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అటు నుంచి పొంగులేటి నివాసానికి రేవంత్, కోమటిరెడ్డి బయల్దేరారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చవద్దని తెలిపారు. తెలంగాణ అమరవీరులు కోరుకున్నది ఇలాంటి సమాజం కాదని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు, అవినీతిమయం చేశారని, బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి తొక్కేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో అవినీతి బాగా పెరిగిపోయిందని, బంగారు తెలంగాణ కొందరికే పరిమితమైందని విమర్శించారు. ప్రాణ త్యాగాలపై ఏర్పడిన తెలంగాణను ద్రోహులు ఏలుతున్నారని, తెలంగాణలో దుర్మార్గపు పాలన సాగుతోందని అన్నారు. తెలంగాణను వ్యతిరేకించేవారిని పక్కన పెట్టుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దించేందుకు అన్ని శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తనను కాంగ్రెస్‌లో రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారని, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. చదవండి: అన్నదమ్ముల్లా కలిసి పని చేస్తాం: రేవంత్, కోమటిరెడ్డి -
రాహుల్‌తో జూమ్ మీటింగ్.. పొంగులేటి చేరికకు డేట్ ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అతిత్వరలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 22వ తేదీన ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఆయన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్‌లో మాట్లాడినట్లు సమాచారం. రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్‌లోనే పొంగులేటి చేరిక తేదీ ఫిక్స్ అయ్యింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక అదేతేదీన పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరనున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ నెల 21వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు. అదే తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక జూపల్లి, పొంగులేటి చేరిక తర్వాత ఖమ్మం, పాలమూరుల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉంది. ఇదీ చదవండి: బీఆర్ఎస్లో కూచుకుళ్ల అసంతృప్తికి కారణం అదే -
హాట్ టాపిక్ గా మారిన టీ-కాంగ్ వరుస భేటీలు
-
త్వరలో కాంగ్రెస్ గూటికి జూపల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి
-
వనపర్తిలో జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ
-
పొంగులేటి, జూపల్లి ఆ పార్టీలోకేనా?.. అప్పటి వరకు సస్పెన్స్ తప్పదు!
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? చేయి పట్టుకుంటారా? కాషాయ సేనలో చేరుతారా? ఆర్థిక బలం, అంగబలం ఉన్న పొంగులేటి కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గులాబీ గూటి నుంచి బయటపడ్డ ఆ ఇద్దరు నేతలు ఏ పార్టీలో చేరతారో ఈ నెలాఖరులోగా స్పష్టత వస్తుందని టాక్. అంతవరకు సస్పెన్స్ తప్పదంటున్నారు. ఆత్మ గౌరవం కోసం పొలికేక పెడతానంటున్న పొంగులేటి పాలిటిక్స్.. జూన్ రెండో తేదీ తెలంగాణ అవతరణ దినోత్సవం. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు జూన్ రెండున తెలంగాణ ఆత్మగౌరవ పొలికేక పేరుతో భారీ సభ నిర్వహించబోతున్నారు. ఆ సభలోనే వారిద్దరూ ఏదో ఒక పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఏ పార్టీలో చేరేది ఈ నెలాఖరుకు తేలిపోనుంది. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం అంటున్న ఇద్దరు నేతలు..కచ్చితంగా జూన్ రెండో తేదీన తాము పార్టీ మారడం ఖాయమని చెబుతున్నారు. కచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీలోనే చేరాలని భావిస్తున్న ఈ నేతలు..ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కలిసివచ్చే నేతలే కాకుండా.. ఇంకా అనేక జిల్లాల్లో బీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్న నాయకులందరితో మాట్లాడి.. ఒకేసారి భారీ బహిరంగసభ ద్వారా పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. సభ వేదికగా ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటారు. ఈ నెలాఖరులోగా అన్ని జిల్లాల్లోని గులాబీ పార్టీ అసంతృప్త నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తారు. చదవండి: TS: 15మంది సర్పంచ్‌లకు మావోయిస్టుల హెచ్చరిక ఖమ్మం జిల్లాలో ఖమ్మం మినహా మిగిలిన 9 నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ భేటీలు ముగిసాయి. ఈ నెల 14న ఖమ్మం నగరంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయబోతున్నారు. ఖమ్మం సభకు జూపల్లితో పాటుగా..నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నుంచి కూడా బీఆర్ఎస్ అసమ్మతి నేతలు హాజరుకానున్నట్లు చెబుతున్నారు. ఖమ్మం ఆత్మీయ భేటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తమ సత్తా ఏంటో చూపించేందుకు పొంగులేటి వర్గం సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వారిద్దరి అనుచరులను చేర్చుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ నేతలతో ఇప్పటికే చర్చలు జరిగాయి. గురువారం నాడు బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో పొంగులేటి నివాసంలో దాదాపు ఐదు గంటల పాటు చర్చలు జరిగాయి. అయితే బీజేపీలో చేరతామని వారిద్దరూ ఈటల టీమ్‌కు ఎటువంటి హామీని ఇవ్వలేదు. బీజేపీ నేతలు మాత్రం తమ పార్టీలోనే పొంగులేటి, జూపల్లి వర్గాలు చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదో ఒక పార్టీలో చేరే తేదీని జూన్ రెండుగా ఖరారు చేసుకున్ననందున..ఆలోగా తమ అనుచరవర్గం ఉన్న జిల్లాల్లోని నాయకులతో ఆత్మీయ భేటీలు నిర్వహించడానికి ప్లాన్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ కనీసం ఐదు సెగ్మెంట్లలో భేటీలుంటాయని సమాచారం. అంతిమంగా జూన్ రెండున పొలికేక పేరుతో భారీ బహిరంగసభలో పొంగులేటి వర్గం పార్టీ మార్పిడి కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. ఇద్దరినీ గులాబీ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. ఇక ఏ పార్టీలో చేరాలనే విషయంపై పొంగులేటి, జూపల్లి నిర్ణయించుకోవాలి. ఏ పార్టీ అనేదానిపై ఈ నెలాఖరు వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. కొత్త పార్టీలో చేరిక కోసం జూన్ రెండోతేదీని ముహూర్తం ఫిక్స్ చేశారు. కాని పార్టీని మాత్రం ప్రకటించలేదు. పొంగులేటి, జూపల్లి సస్పెన్స్‌కు తెర దించేవరకు వేచి చూడక తప్పదు. ఏదేమైనా వచ్చే నెలలో తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. చదవండి: చంద్రబాబును భయపెడుతోంది ఇదే..! -
బీఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి, జూపల్లితో జాతీయ పార్టీల చర్చలు
-
బీజేపీలోకి జూపల్లి!.. డీకే అరుణ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, మహబూబ్ నగర్: తెలంగాణలో పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. పలువురు సీనియర్ నేతలు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కావాడంతో వారు ఏ పార్టీలో చేరుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, డీకే అరుణ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అసంతృప్తులు మాతో టచ్‌లో ఉన్నారు. జూపల్లి కృష్ణారావును బీజేపీలోకి ఆహ్వానించాను. ఈ క్రమంలో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మా మధ్య వ్యక్తిగత వైరం లేదు.. పార్టీ పరంగా విభేదాలు మాత్రమే ఉన్నాయి. బీఆర్ఎస్ను ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు అని అన్నారు. ఇదే సమయంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై కూడా డీకే అరుణ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, డీకే అరుణ మాట్లాడుతూ.. నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేస్తోంది. పేపర్ లీకేజీతో 30 లక్షల మందికి నిరుత్సాహమే మిగిలింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో రూ.కోట్లు చేతులు మారాయి. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పాత్ర ఉందని అనుమానం. పరీక్ష రాసిన ప్రతీ అభ్యర్థికి రూ. లక్ష పరిహారం ఇవ్వాలి. ఈ వ్యవహారంపై బాధ్యత తీసుకోవాల్సిన మంత్రులు ఇష్యూను డైవర్ట్ చేస్తూ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు. అరెస్ట్‌లు చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్బంగా డీకే అరుణ కీలక ప్రకటన చేశారు. ఈనెల 15వ తేదీన వరంగల్‌లో మొదటి నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే, రెండో నిరుద్యోగ మార్చ్‌ను మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తామని వెల్లడించారు. ఇదే సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాడి ముగ్గురు మృతిచెందడం బాధకరమని అన్నారు. -
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా జూపల్లి, పొంగులేటి
-
పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఆనందంగా ఉంది : జూపల్లి
-
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్: జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. పంజరం నుంచి బయటకు వచ్చినట్లు ఉందని తెలిపారు. దొరలగడీ నుంచి బయటపడ్డానని, ఇంత అరాచకం ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. కాగా జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నరనే నేపథ్యంలో జూపల్లిని సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధిష్టానం సోమవారం వెల్లడించింది. ఈ క్రమంలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాట్లాడేందుకు జూపల్లి ప్రయత్నించగా.. ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ప్రెస్‌మీట్ పెట్టేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. దీంతో పోలీసులతో మాజీ మంత్రి వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ మాట్లాడతానంటూ జూపల్లి మైక్‌ల ముందుకొచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. బీర్ఎస్ పార్టీ రెండు, మూడేళ్లుగా సభ్యత్వం నమోదు చేసే బుక్స్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తాను బీఆర్ఎస్లో ఉన్నట్లా? లేదా అనే అనుమానం ఉండేదన్నారు. బీఆర్ఎస్ బండారం బయటపడుతుందని భయపడి తనను సస్పెండ్ చేశారని ఆయన దుయ్యబట్టారు. ‘తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశాను. వెయ్యి కోట్లు ఇచ్చినా నన్ను కొనలేరని చెప్పాను. ఎందుకు సస్పెండ్ చేశారో కేసీఆర్ చెప్పాలి. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేస్తే బాగుండేది. సీఎం అంటే ధర్మకర్తగా పారదర్శక పాలన అందించాల్సిన బాధ్యత ఉంది. నాకు నచ్చిన్నట్లు పాలన చేస్తా అడగటానికి మీరెవరు అన్నట్లు కేసీఆర్ ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. చదవండి: ఖమ్మంవైపు తెలంగాణ రాజకీయాలు.. త్వరలో కొత్త పార్టీ? -
జూపల్లి, పొంగులేటిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్
-
బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. పొంగులేటి, జూపల్లిపై వేటు
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ముఖ్యమంత్రి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యాలయం వెల్లడించింది.ఆత్మీయ సమ్మేళనాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఈ చర్యలు చేపట్టింది. కాగా పొంగులేటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో సుమారు 300 మంది శ్రీనివాసరెడ్డి వర్గీయులు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సొసైటీ డైరెక్టర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. ఇదిలా ఉండగా గతకొద్ది రోజులుగా జూపల్లి, పొంగులేటి.. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖమ్మంలో తనవర్గం నేతలతో పొంగు లేటి భేటి అవుతున్నారు. కొత్తగూడెంలో ఆదివారం నిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశంలోనూ జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొన్నారు. ఇద్దరు కలిసి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సింగరేణిని అప్పుల కుప్పగా మార్చారని, కార్మికులను అవమానించారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం, దాన్ని నడిపిస్తున్న సీఎం ఎనిమిదిన్నరేళ్ల కాలంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదన్నారు. చదవండి: బండి సంజయ్ ఫోన్ ఎక్కడ? దానితోనే ఏ–2 ప్రశాంత్‌తో సంభాషణ!.. అసలు ఆ రోజు ఏం జరిగింది? -
బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరు : జూపల్లి కృష్ణారావు
-
జూపల్లి కృష్ణారావు అడుగులెటు.. ‘కారు’ దిగడం ఖాయమా?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సీనియర్ రాజకీయ నాయకుడు.. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఓ వెలుగు వెలిగారు. కానీ ఒక్క ఓటమితో పరిస్థితులు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడం.. ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకోవడం.. తదితర పరిణామాల క్రమంలో స్వపక్షంలోనే విపక్షంగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. జూపల్లి రాజకీయ భవిష్యత్‌పై పలు రకాల ప్రచారాలు జోరుగా సాగుతున్నా.. ఆయన ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కమలమా, కాంగ్రెస్సా, స్వతంత్రంగా పోటీలో ఉంటారా.. అనే ప్రశ్నలకు అతడి మౌనమే సమాధానమైంది. కానీ నిత్యం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఈ క్రమంలో కృష్ణారావు క్రియాశీలక అడుగులు వేశారు. నియోజకవర్గాల వారీగా మరో ప్రస్థానం పేరిట ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన మౌనం వీడినట్లేనని.. ‘కారు’ దిగడం ఖాయమని తేలినట్లు విశ్లేషిస్తున్నారు. ముందస్తు ఖాయమనే అంచనాకు వచ్చిన ఆయన వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటడమే లక్ష్యంగా పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. పూడ్చలేనంత పెరిగిన గ్యాప్.. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీరం టీఆర్ఎస్లో చేరడంతో సీన్ మారిపోయింది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో జూపల్లికి ప్రాధాన్యం దక్కడం లేదని అనుచరులు వాదులాటకు దిగడం నుంచి మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి తన వర్గీయులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బరిలో దింపి సత్తాచాటడం వంటి అంశాలు ఇరువురి మధ్య మనస్పర్థలకు దారితీశాయి. ఆ తర్వాత కేటీఆర్ తన ఇంటికి స్వయంగా రావడంతో కొన్ని నెలలు స్తబ్దుగా ఉన్నా.. అనంతరం అభివృద్ధి తదితర అంశాల్లో జూపల్లి, బీరం మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకోవడంతో ఇరువురి మధ్య దూరం గ్యాప్ పూడ్చలేనంతగాపెరిగింది. ఏకం చేసే దిశగా.. మునుగోడులో బీజేపీ గెలిస్తే కమలం గూటికి వెళ్లాలనే యోచనలో ఉన్న జూపల్లి ఫలితం తారుమారు కావడంతో కొంత సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ఫాంహౌస్ ఎపిసోడ్‌ను తమకు అనుకూలంగా మలుచుకుని స్వతంత్రంగా బరిలో దిగితే గెలిచే అవకాశం ఉందనే ఆలోచనలో జూపల్లి, ఆయన వర్గీయులు ఉన్నట్లు సమాచారం. తప్పుడు నిర్ణయం తీసుకుంటే తనతో పాటు తనను నమ్ముకున్న కార్యకర్తలు, అనుచరులకు నష్టం కలుగుతుందనే అభిప్రాయంతో ఉన్న జూపల్లి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొల్లాపూర్‌తో పాటు తనకు పట్టు ఉన్న నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనానికి పూనుకున్నారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్లో నమ్మకస్తులైన నేతలతో ఇది వరకే రహస్యంగా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ మేరకు అచ్చంపేట నుంచి ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టిన ఆయన పూర్వాశ్రమమైన కాంగ్రెస్‌లోని ముఖ్య అనుచరులు, నాయకులతో పాటు మలి దశ తెలంగాణ ఉద్యమకారులకు ఆహ్వానం పలికారు. ప్రధానంగా టీఆర్ఎస్లోని అసంతృప్త నాయకులను ఒకే వేదికపైకి తెచ్చి ఏకం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. అచ్చంపేటను అందుకే ఎంచుకున్నరా.. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ త్వరలో అచ్చంపేటలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ సభకు, గతంలో వనపర్తిలో జరిగిన సీఎం పర్యటనకు గైర్హాజరైన జూపల్లి.. తొలి ఆత్మీయ సమ్మేళనానికి కేసీఆర్ నోటి వెంట వచ్చిన అచ్చంపేటను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఫాంహౌస్ ఘటనలో కొల్లాపూర్‌తో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫాంహౌస్ ఘటనను ఫోకస్ చేయాలని భావిస్తున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి జూపల్లి టీఆర్ఎస్ను వీడడం ఖాయంగా కనిపిస్తుండగా.. మాజీ మంత్రి తీరు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. జూపల్లి ఆత్మీయ సమ్మేళనం.. ఆయన వేస్తున్న అడుగులను టీఆర్ఎస్ అధిష్టానం ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సిట్టింగ్‌లకే సీటు అనడంతో.. ఇటీవల మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీరం హర్షవర్ధన్‌రెడ్డి కూడా ఉండడంతో కొల్లాపూర్‌లో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే నెలరోజులుగా కనిపించడంం లేదని పోస్టర్లు వెలియడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి అంశాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఫాంహౌస్ ఎపిసోడ్ తర్వాత నియోజకవర్గానికి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్యే తాను ఏది చేసినా నియోజకవర్గ అభివృద్ధికేనని ప్రకటించారు. స్పందించిన జూపల్లి.. చేసిన అభివృద్ధి ఏందో చూపించాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఫాంహౌస్ కేసులో మన ఎమ్మెల్యేలే దొంగలను పట్టించారని.. సిట్టింగ్‌లకే మళ్లీ సీట్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటన బీరం వర్గీయుల్లో ఉత్సాహాన్ని నింపితే.. జూపల్లి వర్గీయులను ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికైనా తుది నిర్ణయం తీసుకోవాలని అనుచరులు జూపల్లిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. (క్లిక్ చేయండి: మహబూబ్‌నగర్‌లో హద్దులు దాటని కేసీఆర్.. ఆ వ్యాఖ్యలకు అర్థమేంటి?) -
ఉద్యమకారులపై కేసులా?
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో ఉద్యమకారులపై కుట్రలతో కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, అయితే రాష్ట్రంలో ఉద్యమకారులకు గౌరవం దక్కడం లేదని విమర్శించారు. తిండి లేకున్నా ఉంటాం కానీ, ఆత్మగౌరవం లేకుండా ఉండలేమని వ్యాఖ్యానించారు. తాను రెండు దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ‘జూపల్లి మరో ప్రస్థానం’పేరుతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. -
కారు ‘ఓవర్‌లోడు’ సౌండ్.. సుమారు 45 నియోజకవర్గాల్లో నువ్వా నేనా?
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీని బహుళ నాయకత్వ సమస్య వెంటాడుతోంది. సొంత పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్, టీడీపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలతో కారు ఓవర్ లోడ్ కావడం కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుమారు 45 స్థానాల్లో టీఆర్ఎస్ బలమైన బహుళ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. మరో 20 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితా లను కొంతమేర ప్రభావం చూపగలిగే నేతలు ఉన్నారు. మొత్తంగా కనీసం 30 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. సొంత పార్టీలోని బలమైన నేతలతో తలపడాల్సిన పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ తమనే వరిస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కొన్ని సెగ్మెంట్లలో సిట్టింగ్‌లకు మళ్లీ అవకాశం దొరకక పోవచ్చనే వార్తలు ఆశావహుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరోవైపు తమకు టికెట్ కష్టమని భావి స్తున్నవారు.. విపక్ష పార్టీలు చేరికల కోసం చేస్తున్న ప్రయత్నాలను అవకాశంగా తీసుకుని ఒకరి వెంట మరొకరు అన్నట్టుగా సొంతదారి చూసుకుంటున్నారు. మరికొందరు అసంతృప్త నేతలు మాత్రం పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే నేతల అంతర్గత విభేదాలపై ఆరా తీసిన అధినేత ఇప్పటికే దిద్దుబాటు చర్యలకు దిగినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. చదవండి👉🏼సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు పీకే నివేదికల నేపథ్యంలో.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బృందం ఈ ఏడాది మార్చిలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు అందజేసింది. ఈ నివేదికలను లోతుగా పరిశీలించి, ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాల్లో ఉండే రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో సిట్టింగులు, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సొంత రాజకీయ అస్తిత్వం కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన తప్పనిసరి స్థితిలో కొందరు నేతలు ఇప్పటినుంచే సొంతదారిని వెతుక్కునే పనిలో పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం దక్కదని భావించిన అసంతృప్త నేతలు నల్లాల ఓదెలు (చెన్నూరు), బూడిద భిక్షమయ్య (ఆలేరు), విజయారెడ్డి (ఖైరతాబాద్), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట) తదితరులు ఇప్పటికే సొంతదారి చూసుకున్నారు. చదవండి👉🏼కేటీఆర్ సెటైర్, దేశ ప్రజలకు మోదీ అందించిన బహుమతి ఇదే! ప్రత్యర్థితో బహిరంగ యుద్ధం రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న కొద్దీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు పలువురు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఓ వైపు పార్టీపై, అధినేతపై విశ్వాసం ప్రకటిస్తూనే మరోవైపు స్థానికంగా ఉన్న తమ రాజకీయ ప్రత్యర్థితో బహిరంగ యుద్ధానికి దిగుతున్నారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు..ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, తాండూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఉప్పల్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి..మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నడుమ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బొంతు జన్మదినం పురస్కరించుకుని మంగళవారం భారీయెత్తున దర్శనమిచ్చిన ఫ్లెక్సీలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా మహేశ్వరం నియోజకవర్గం కూడా ఈ జాబితాలో చేరింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. హుస్నాబాద్, నకిరేకల్ తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల నడుమ ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తోంది. రేగ కాంతారావు, పాయం వెంకటేశ్వర్లు (పినపాక), భానోత్ హరిప్రియ, కోరం కనకయ్య (ఇల్లందు), వనమా వెంకటేశ్వర్రావు, జలగం వెంకటరావు (కొత్తగూడెం), కందాల ఉపేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు (పాలేరు) ఈ జాబితాలో ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరినవారు కావడం గమనార్హం. ఆధిపత్య పోరు కొనసాగుతున్న మరికొన్ని నియోజకవర్గాలు, నేతలు -
ఇంటికే వస్తా అంటే రమ్మంటిని, కానీ, ఎక్కడా?: జూపల్లి
సాక్షి,నాగర్ కర్నూల్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం విష్ణువర్ధన్ రెడ్డి పరస్పర సవాళ్లతో కొల్లాపూర్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో అవాంఛిత ఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ ఎత్తున మోహరించారు. అయితే, చర్చలో పాల్గొనేందుకు జూపల్లి ఇంటికి బీరం ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే బీరం నిరాధార ఆరోపణలను జూపల్లి మీడియా ఎదుట ఎండగట్టారు. చదవండి👉🏼 విరాట పర్వం.. 30 ఏళ్ల కిందట పేలిన తూటా శంకరన్న చేతిలో సరళ బలి రాత్రి నుంచి చూస్తున్నా.. ఎక్కడా? ‘నేను అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడదామన్న. కాని చర్చకు ఇంటికే వస్తా అంటే స్వాగతం పలుకుతానని చెప్పా. నీ మాట ప్రకారమే రాత్రి నుంచి ఎదురుచూస్తున్నా. కానీ, ఎమ్మెల్యే రాలేదు. మూడున్నరేళ్లు ఎమ్మెల్యే ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అరెస్టు చేయించుకుని తప్పించుకుని పోయినవ్.. ముఖం చాటేసుకున్నవ్. ఎమ్మెల్యే మాట మార్చాడు. నేను మాట మార్చలేదు. హుస్సేన్ సాగర్ కారు ప్రమాదం, ఫ్రుడెన్షియల్ బ్యాంకు వ్యవహారాలపై ఎమ్మెల్యే అవాస్తవాలు మాట్లాడుతున్నాడు. అప్పు తీసుకుని వ్యాపారం చేసాం, ఇది తప్పు అన్నట్లుగా మాట్లాడితే ఎట్లా!. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయొద్దని సహచర మంత్రులే సూచించినా నేను వెనక్కి తగ్గలేదు. మిగతా మంత్రులపై ఒత్తిడి వస్తుంది వద్దన్నారు. వెయ్యి కోట్లిచ్చినా అమ్ముడు పోయే వ్యక్తిని కాను. నాది మచ్చలేని చరిత్ర. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కోర్టులో కేసు వేసిందెవరు? నా పై నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బీరంపై పరువు నష్టం దావా వేస్తా’అని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. చదవండి👉🏼కొల్లాపూర్‌లో హై టెన్షన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్ -
జూపల్లి, బీరం చర్చావేదిక భగ్నం
సాక్షి, నాగర్‌కర్నూల్: కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య బహిరంగ చర్చ సాగక ముందే రచ్చరచ్చ అయింది. కొల్లాపూర్ పట్టణంలో ఆదివారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గత కొద్దిరోజులుగా వారి మధ్య జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్లతో స్థానికంగా రాజకీయం వేడెక్కింది. ఇరువురు నేతల మధ్య చర్చావేదిక నిర్వహించేందుకు ఉదయం చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. పది గంటలకు జూపల్లి ఇంటిని చర్చావేదికగా వారు ఖరారు చేసుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం నుంచే కొల్లాపూర్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. జూపల్లి నివాసం వద్ద సైతం భారీ బందోబస్తు నిర్వహించారు. హర్షవర్ధన్‌రెడ్డి సుమారు రెండు వేలమంది కార్యకర్తలతో కలసి జూపల్లి ఇంటి వైపు ర్యాలీగా బయలుదేరారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ముందుకు రాగానే పోలీసులు నిలువరించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అనుచరులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. దమ్ముంటే నిరూపించాలి: జూపల్లి తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డికి దమ్ముంటే సాక్ష్యాలతో నిరూపించాలని జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. ఆరోపణలపై చర్చించేందుకు ఎక్కడికైనా వస్తానని, నిరూపించకపోతే పరువునష్టం దావా వేస్తానని అన్నారు. తనను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఎమ్మెల్యే పారిపోయారని వ్యాఖ్యానించారు. ఆదివారం కొల్లాపూర్ పట్టణంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బ్యాంకుల్లో తీసుకున్న రూ.ఆరు కోట్ల అప్పును 2007లోనే వడ్డీతో సహా రూ.14 కోట్లు చెల్లించానని పేర్కొన్నారు. ‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు చేపడితే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందని ఎన్జీటీలో కేసు వేసింది ఎవరు? తర్వాత ఎందుకు విత్‌డ్రా అయ్యారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి’అని జూపల్లి ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకోను: బీరం కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఆటంకం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా పెబ్బేరు సింగిల్‌విండో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజల ఆస్తులను, బ్యాంకులను మోసం చేసిన ఘనత నీదే కాబట్టి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఈ రోజు బహిరంగ చర్చకు పిలిచి మొహం చాటేసుకున్నావు. ఇక నుంచి నీ ఆటలు, మాటలు సాగనివ్వబోం’అని జూపల్లిని ఉద్దేశించి హెచ్చరించారు. ఇది కూడా చదవండి: జూపల్లి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు -
జూపల్లి కృష్ణారావు ఇంటికి కేటీఆర్
-
జూపల్లి ఇంటికి కేటీఆర్.. బుజ్జగింపులు?
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ఇవాళ(శనివారం) నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వెళ్లిన ఆయన.. మాజీమంత్రి జూపల్లి ఇంటికి వెళ్లడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. జూపల్లి ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. కొల్లాపూర్‌లో పార్టీ పరిస్థితి, గ్రూప్ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు జూపల్లి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారతారనే వార్త జోరుగా షి‘కారు’ చేస్తోంది. అయితే శనివారం నాటి కేటీఆర్ పర్యటనకు సైతం జూపల్లి దూరంగా ఉండడంతో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్, జూపల్లి ఇంటికి వెళ్లారనే చర్చ నడుస్తోంది. మాజీ మంత్రి జూపల్లితో కలిసి తేనేటి విందులో మంత్రి కేటీఆర్, మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు పాల్గొన్నారు. జూపల్లికి, స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి మధ్య విభేధాలు నడుస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే పార్టీ మారకుండా నిలువరించడంతో పాటు టీఆర్ఎస్లో వర్గపోరుకు చెక్ పెట్టేందుకే కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు చర్చ నడుస్తోంది. -
పంట కాల్వ మూసివేత సరికాదు
కొల్లాపూర్/కొల్లాపూర్ రూరల్: పాలమూరు ప్రాజెక్టు ప్రధానకాల్వ అనుసంధానం కోసం కేఎల్ఐ డీ–5 పంటకాల్వను మూసివేయడం సరికాదని, వెంటనే దానిని పునరుద్ధరించాలని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. కొల్లాపూర్ మండలం సున్నపుతండా సమీపంలోని కేఎల్ఐ డీ–5 పంటకాల్వను పూడ్చివేశారని తెలియడంతో గురువారం భారీ అనుచరగణంతో ఆయన కొల్లాపూర్ నుంచి పంటకాల్వ వరకు పాదయాత్ర నిర్వహించారు. అధి కారులపై ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఒత్తిడి తెచ్చి దొంగచాటుగా అర్ధరాత్రి కాల్వ మూసివేయించారని, గతంలోనూ కోర్టులో కేసు వేసి ప్రాజెక్టు ఆపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ప్రత్యామ్నాయ కాల్వను ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో అదే కాల్వను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అక్కడే కాసేపు బైఠాయించారు. అనంతరం కొల్లాపూర్‌లో జూపల్లి మాట్లాడుతూ ఈ కాల్వ కింద 2,900 ఎకరాల భూములు ఉన్నాయని, గతేడాది కృష్ణానదిలో నీళ్లున్నా రైతులకు అందించలేకపోయారని, ఈ ఏడాది నీళ్లు అందే అవకాశం ఉన్నా పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. -
సీఎం పర్యటనకు జూపల్లి డుమ్మా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ఖమ్మం: సీఎం కేసీఆర్ పర్యటనకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కేసీఆర్ వెంట ఉన్న ఆయన ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతర క్రమంలో బీరం టీఆర్ఎస్లో చేరడం.. ఆ తర్వాత కేసీఆర్‌కు జూపల్లి దూరం పెరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం వనపర్తిలో కేసీఆర్ పర్యటనకు ఆయన డుమ్మా కొట్టడంపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తుమ్మల, పొంగులేటితో భేటీ సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉండగా జూపల్లి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలవడం హాట్ టాపిక్‌గా మారింది. తుమ్మల గత ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. పొంగులేటి ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. అయితే, వీరిద్దరూ టీఆర్ఎస్లో పనిచేస్తున్నా పెద్దగా హడావుడి లేదు. తుమ్మల పూర్తిస్థాయిలో సొంత పనులు చూసుకుంటూ పాలేరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. పొంగులేటి సైతం పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయనే ఊహాగానాల నేపథ్యంలో వీరికి పదవులు దక్కుతాయా.. లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సత్తుపల్లి సమీపంలోని వ్యవసాయక్షేత్రంలో తుమ్మలను జూపల్లి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూపల్లికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లభించడంలేదనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆయన తుమ్మలను కలవడం చర్చనీయాంశమైంది. వీరు రాజకీయ భవిష్యత్‌పై మాట్లాడుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత జూపల్లి ఖమ్మం చేరుకుని పొంగులేటితో సమావేశమయ్యా రు. ఈ భేటీలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, పార్టీ నేత తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. -
టీటీడీకి రూ.కోటి విలువైన వంట దినుసులు విరాళం
తిరుమల: తిరుమల శ్రీవారికి గో వ్యవసాయ ఆధారిత వంట దినుసులతో సంపూర్ణ నైవేద్యం సమర్పించేందుకు వీలుగా రూ.కోటి విలువైన వంట దినుసులు బుధవారం విరాళంగా అందాయి. టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, మై హోమ్ గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వరరావు ఈ మేరకు హైదరాబాద్‌లోని త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమం నుంచి ఈ వంట దినుసులను పంపారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శివకుమార్ ఈ వస్తువులను తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఆలయాధికారులకు అందజేశారు. వీటిలో 6,200 కిలోల బియ్యం..1,500 కిలోల దేశీ ఆవు నెయ్యి, 600 కిలోల బెల్లం, 17 కిలోల బాదం, 315 కిలోల జీడిపప్పు, 21 కిలోల కిస్మిస్, 85 కిలోల ఆవాలు, 18 కిలోల మెంతులు, 20 కిలోల పసుపు, 25 కిలోల ఇంగువ, 380 కిలోల పెసరపప్పు, 200 కిలోల శనగ పప్పు, 265 కిలోల మినుములు, 350 కిలోల చింతపండు, 50 కిలోల రాక్ సాల్ట్, 375 కిలోల నువ్వుల నూనె, 7 కిలోల నువ్వులు, 10 కిలోల శొంఠి ఉన్నాయి. చదవండి: డెయిరీ విభజనపై ఇరు రాష్ట్రాలకు నోటీసులు -
జూపల్లి.. ఇదే సరైన సమయం.. నిర్ణయం తీస్కో!
సాక్షి, కరీంనగర్: ‘తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న జూపల్లి కృష్ణారావు పట్ల టీఆర్ఎస్ కార్యాలయంలో ఎదురైన అవమానం తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి తమతో కలిసి తెలంగాణ కోసం జూపల్లి ఉద్యమించారని, మంత్రి పదవికి రాజీనామా చేసి.. ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్లో చేరారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడు తన నియోజకవర్గంలో తానేంటో నిరూపించుకొని.. గెలిచివస్తే.. టీఆర్ఎస్ నేతలు ఆయనను అవమానించడం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు. జూపల్లి తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకునే సమయమిదేనని, ఇప్పటికైనా టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి ఆయన తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. -
టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా..
సాక్షి, హైదరాబాద్: తాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి వర్గం విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ అభ్యర్థుల గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లే తమ నాయకులని స్పష్టం చేశారు. మిగతా విషయాలు అధిష్టానంతో మాట్లాడతానని చెప్పారు. కాగా, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫోన్ చేయడంతో జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌కు వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఆయనకు, పార్టీకి మధ్య దూరం పెరిగినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అలాంటిదేమి లేదని తాజాగా జూపల్లి ప్రకటించారు. చదవండి: ఫలించిన హరీష్ రావు వ్యూహాలు.. -
కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ వర్గపోరు..
సాక్షి, కొల్లాపూర్: కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ వర్గ పోరాటం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య ఆధిపత్య పోరుతో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును సముదాయించేందుకు పార్టీ అధిష్టానం చేసిన ప్రయత్నం విఫలమైంది. అధిష్టానం ఆదేశాలను పట్టించుకోకుండా జూపల్లి వర్గీయులు ఎన్నికల బరిలోకి దిగారు. మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో జూపల్లి వర్గీయులు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. జూపల్లి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, ప్రచార రథాలను ఏర్పాటు చేశారు. దీంతో కొల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్లోని ఇరువర్గాల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. కొల్లాపూర్ పట్టణంపై ఆధిపత్యం సాధించేందుకు ఎమ్మెల్యే, మాజీమంత్రి ఇరువురు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారపర్వం కొనసాగిస్తున్నారు. ఈ అంశాన్ని అధిష్టానం ఎలా పరిగణిస్తుందో వేచి చూడాల్సిందే మరి. ఆ రెండు పార్టీలూ.. టీఆర్ఎస్లో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదరడంతో అవకాశం కోసం కాంగ్రెస్, బీజేపీలు ఎదురుచూస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 20, కాంగ్రెస్ 19వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. అభ్యర్థుల ఎంపికలో రెండు పార్టీల నాయకులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని వార్డుల్లో రెండు పార్టీలు తమ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే కొందరు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక సీపీఐ, సీపీఎంలు ఒక్కో వార్డులో పోటీలోకి దిగాయి. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఐదు నుంచి ఎనిమిది వరకు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ వార్డుల్లో స్వతంత్రులు, రెబెల్స్ గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తానికి ఎమ్మెల్యే, మాజీమంత్రి మధ్య నెలకొన్న వర్గపోరు కొల్లాపూర్‌లో తొలిసారిగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను రసవత్తరంగా మార్చాయనే చెప్పవచ్చు. ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారాలు వర్గపోరుతో సతమతమవుతున్న ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి తనకున్న బలగంతోనే ఎన్నికల బరిలోకి దిగారు. టీఆర్ఎస్ బీ ఫారాల కోసం భారీగా పోటీ ఉన్నప్పటికీ ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎలాగైనా సరే మున్సిపాలిటీని కైవసం చేసుకుని కొల్లాపూర్‌పై తనకున్న పట్టును నిరూపించుకోవాలనే యోచనలో ఎమ్మెల్యే ఉన్నారు. నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులను ప్రచారంలోకి దించారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన భార్య, తల్లి కూడా ప్రచారపర్వంలో నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, చింతలపల్లి జగదీశ్వర్రావులకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించారు. అధిష్టానం ఆదేశానుసారం వారికి వార్డుల వారీగా బాధ్యతలు ఇస్తున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి నేతలతో సభ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఓటర్లను కలుస్తున్న జూపల్లి టీఆర్ఎస్ పార్టీకి పోటీగా అభ్యర్థులను నిలబెట్టవద్దని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని అధిష్టానం చేసిన సూచనను జూపల్లి వర్గం పెద్దగా పట్టించుకోలేదు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో జూపల్లి వర్గీయులు ఎన్నికల బరిలో నిలిచారు. ముందస్తుగానే అంగబలం, అర్ధబలం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, జూపల్లి మద్దతుదారులు ప్రచార పర్వంలోకి దిగారు. వారంతా వార్డుల వారీగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలను నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన ప్రజాప్రతినిధి చూస్తున్నారు. ప్రజాప్రతినిధులు మినహాయించి మిగతా వారంతా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కండువాలు, ఎన్నికల గుర్తులతో ప్రచారాలు చేస్తున్నారు. పోటీలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రహస్యంగా ప్రచారం సాగిస్తున్నారు. బహిరంగంగా కాకుండా ఓటర్ల ఇళ్లకు వెళ్లి మాట్లాడి వస్తున్నారు. ఆయన ప్రచార కార్యక్రమాలకు మీడియాను కూడా దూరంగా ఉంచుతున్నారు. ఆయన వినియోగించే వాహనాల నంబర్ ప్లేట్లను మూడు రోజులపాటు తొలగించారు. మళ్లీ మంగళవారం వాహనాలకు నంబర్ ప్లేట్లను అమర్చారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే అపవాదు రాకుండా తనదైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆరా.. కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి ఎన్నికల ప్రక్రియపై చర్చించినట్లు సమాచారం. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు తనవర్గం నాయకులను ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీలో దించడంపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ అంశంపై ఎమ్మెల్యే స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కొల్లాపూర్‌లో రాజకీయ పరిస్థితుల గురించి మంత్రి కేటీఆర్‌కు వివరించామని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, మిగతా వ్యవహారాలు పార్టీ చూసుకుంటుందని కేటీఆర్ సూచించినట్లు పేర్కొన్నారు. -
‘కొల్లాపూర్ రాజా బండారం బయటపెడతా’
సాక్షి, కొల్లాపూర్: తనపై తప్పుడు ఆరోపణలు చేసిన సురభి రాజా ఆదిత్య బాలాజీ లక్ష్మణ్ రావుపై రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేస్తున్నట్లు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం కొల్లాపూర్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పుడు పని చేయలేదన్నారు. రాజకీయంగా చిన్న మచ్చ కూడా లేదని చెప్పారు. రేపు కొల్లాపూర్‌లో ఎన్టీఆర్ చౌరస్తాలో బహిరంగ సభను ఏర్పాటు చేసి కొల్లాపూర్ రాజా బాగోతం బయట పెడతానన్నారు. స్వార్థ రాజకీయాలు తెలియవని, ప్రజా సంక్షేమం, అభివృద్ధికే నిత్యం పాటు పడుతున్నానని జూపల్లి పేర్కొన్నారు. -
మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై..
సాక్షి, నాగర్ కర్నూల్/నిజామాబాద్/భూపాలపల్లి : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్ పార్టీలో కొద్దిపాటి కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమకు కేబినెట్ బెర్త్ దక్కకపోవడంపై పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. తనకు మంత్రి పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ మాట తప్పారంటూ మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలోనే పలువురు టీఆర్ఎస్ సీనియర్ నేతలు పార్టీని వీడతారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. దీంతో కొందరు నేతలు మీడియాకు ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ టీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. తాను టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని తెలిపారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని గుర్తుచేశారు. తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ మారతానంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. అలాంటి ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉంది.. తనకు సీఎం కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవి రానందకు అసంతృప్తి లేదని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. తాను ఎవరిని నమ్ముతానో వారితోనే చివరి వరకు ఉంటానని తెలిపారు. టీఆర్ఎస్లో పదవుల కోసం చేరలేదు : గండ్ర మంత్రివర్గ ఏర్పాటుపై తాను అసంతృప్తితో ఉన్నట్టు వచ్చిన వార్తల్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి పదవుల కోసం రాలేదని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై పట్ల నమ్మకంతోనే టీఆర్ఎస్లో చేరానని తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నట్టు చెప్పారు. పదవుల కన్నా పార్టీని బలోపేతం చేయడంపై తన దృష్టి ఉందని పేర్కొన్నారు. సీఎం ఆశీస్సుల వల్లే తన కుటుంబానికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కిందని అన్నారు. తను అనని మాటలు అన్నట్లుగా ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
గులాబీ ప్రభంజనంలో కీలక మంత్రులకు షాక్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ అంతటా గులాబీ ప్రభంజనం వీస్తున్నప్పటికీ.. పలువురు ఆపద్ధర్మ మంత్రులకు మాత్రం ఎదురుగాలి వీస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో సీనియర్ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వర్రావు ఓటమిపాలయ్యారు. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఆయన ఓటమిపాలవ్వడం గమనార్హం. కొల్లాపూర్‌లో మరో సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. ములుగులో అజ్మీరా చందూలాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. తాండూరులో పట్నం మహేందర్‌రెడ్డికి ఓటమి తప్పలేదు. తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి కూడా చేదు అనుభవం ఎదురయ్యే అవకాశముంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం భుపాలపల్లిలో మధుసూదనాచారిపై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్‌రెడ్డి హోరాహోరీ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ రౌండ్.. రౌండ్‌కు ఆధిక్యం చేతులు మారుతోంది. ఇక, ఇతర కీలక మంత్రులు భారీ విజయాల దిశగా సాగుతున్నారు. ఎప్పటిలాగే సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈసారి ఆయన మెజారిటీ లక్షదాటడం కొత్త రికార్డులు సృష్టించింది. మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో 70వేలకుపైగా మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఇద్దరు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు మంచి ఊపుతో ఉన్నారు. సనత్‌నగర్‌లో తలసాని శ్రీనివాస్ 30వేలకుపైగా మెజారిటీతో గెలుపొందగా.. పద్మారావు మంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. -
అప్పు చేస్తే తప్పు కాదు: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: అప్పు చేస్తే తప్పు కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఇక్కడ ఆయన ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. అవినీతి, లంచాల రూపంలో సంపాదిస్తే తప్పని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వ్యాపారం చేస్తే తప్పు కాదని అన్నారు. తను స్వయంకృషితో క్లర్క్ స్థాయి నుంచి ఈస్థాయికి వచ్చానన్నారు. ‘డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టిందే నేను. నేను అవినీతి పరుడినంటూ అరుణ సిగ్గు శరం లేకుండా మాట్లాడుతోంది’అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దొంగ తెలివి తేటలు అరుణ కుటుంబానికే ఉన్నాయని, తాను నిబంధనల ప్రకారం బ్యాంకు నుంచి తీసుకున్న అప్పును కట్టేశానన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు 3 గంటల్లో రాజీనామా చేస్తే అరుణ లాంటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు మూడేళ్లయినా రాజీనామా చేయలేదని ఎద్దేవా చేశారు. గద్వాలలో ఏ చెట్టు, పుట్టనడిగినా అరుణ కుటుంబం అక్రమ దందాల గురించి చెబుతుందన్నారు. -
క్లర్క్ నుంచి ఈ స్థాయికి ఎదిగా
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణపై టీఆర్ఎస్ మంత్రి జూపల్లి కృష్ణా రావు మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో జూపల్లి శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ నాకు రాజకీయ భిక్ష పెట్టలేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు రోజులు పర్యటించిన కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేశారు. తెలంగాణ ఇచ్చామని చెప్పి కూడా 2014లో కాంగ్రెస్ నేతలు మహబూబ్‌నగర్ జిల్లాలో ఎందుకు ఓడిపోయారు. నేను ఎక్కడ ఉన్నా గెలిచాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేస్తున్న ద్రోహంతోనే అప్పట్లో పార్టీ వీడి టీఆర్ఎస్లో చేరాను. మహబూబ్‌నగర్ అభివృద్ధి తెలంగాణ ఉద్యమ గొప్పతనమే. డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టిందే నేను. నేను అవినీతి పరుడినని అరుణ సిగ్గూ శరం లేకుండా మాట్లాడుతున్నార’ ని వ్యాక్యానించారు. ఇంకా మాట్లాడుతూ..‘ నాలుగు జన్మలెత్తినా నాపై అరుణ వేలెత్తి చూపలేరు. అరుణ భర్త భరసింహారెడ్డిపై కేసులు లేవా?. దొంగ తెలివి తేటలు అరుణ కుటుంబానికే ఉన్నాయి. నేను బ్యాంకు నుంచి నిబంధనల ప్రకారం అప్పు తీసుకున్నా..మళ్లీ కట్టేశా. నేను పులిని కాదు పిల్లి అన్నారు..అవును డీకే అరుణ కుటుంబం లాగా రక్త మాంసాల రుచి చూసే పులిని మాత్రం కాదు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు 3 గంటల్లో రాజీనామా చేస్తే డీకే అరుణ లాంటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు మూడేళ్లయినా రాజీనామా చేయలేదు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ నేతలు మాయమాటలు చెబుతున్నారు. యువత మీద కాంగ్రెస్ నేతలకు ఎక్కడ లేని ప్రేమ వస్తోంది. ఎవరూ కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు. డీకే అరుణది ఆత్మవంచన..సిగ్గు తప్పిన బతుకు’ అని ఘాటు విమర్శలు చేశారు. ‘ స్వయం కృషితో క్లర్క్ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగా..ఈ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి గెలుస్తా. గద్వాలలో ఏ చెట్టూ, పుట్టనడిగినా డీకే అరుణ కుటుంబం అక్రమ దందాల గురించి చెబుతాయి. కేసీఆర్‌ను దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. మహబూబ్ నగర్ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుతో పొత్తును జిల్లా నేతలు వ్యతిరేకించకుండా సమర్ధించడం సిగ్గు చేటు. ఈ కాంగ్రెస్‌కు 20 కాదు కదా రెండు సీట్లు కూడా గెలవదు. కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు గోరీ కట్టారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన ఫలితాలే ఈ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతాయి. కాంగ్రెస్‌కు బలం ఉంటే టీడీపీతో పొత్తు ఎందుక’ని సూటిగా ప్రశ్నించారు. -
మహిళా సంఘాలకు రూ.902 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మహిళా సంఘాలకు రూ.902 కోట్ల వడ్డీ లేని రుణాల బకాయిలు విడుదల చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.339 కోట్ల కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ.. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 1.74 లక్షల మహిళా సంఘాలకు బ్యాంకులు, స్త్రీ నిధి ద్వారా రూ.7,900 కోట్ల రుణాలు అందించామన్నారు. 2018–19లో 3.23 లక్షల మహిళా సంఘాలకు రూ.8,800 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించామని.. ఇప్పటికే దాదాపు రూ.2,000 కోట్లు అందజేసినట్లు వెల్లడించారు. పారిశుధ్య కార్మికులకు రూ.8,500 గతంలో లేని విధంగా దాదాపు రూ.1,200 కోట్లను బడ్జెట్లో పంచాయతీలకు కేటాయించామని మంత్రి జూపల్లి చెప్పారు. పంచాయతీల్లో తక్కువ వేతనాలతో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల కనీస వేతనాన్ని రూ.8,500 చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు వెల్లడించారు. వేతనాన్ని నేరుగా కార్మికుని బ్యాంకు ఖాతాలోనే పంచాయతీలు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జోనల్ విధానంపై కేంద్రం నుంచి స్పష్టత రాగానే గ్రామ కార్యదర్శుల నియామకం పూర్తి చేస్తామన్నారు. 112, 212 జీవోల మేరకు 1994 కన్నా ముందు నుంచి పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులను 90 శాతం క్రమబద్ధీకరించామని, ఎవరైనా మిగిలితే వారినీ క్రమబద్ధీకరిస్తామని జూపల్లి చెప్పారు. కేరళ వరద బాధితులకు నెల వేతనం ఇస్తున్నట్లు ప్రకటించారు. -
లే ఔట్లు, భవనాలపై సమగ్ర నివేదికివ్వండి
సాక్షి, హైదరాబాద్: నూతన పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రాక ముందు గ్రామాల పంచాయతీలు ఇచ్చిన లే ఔట్లు, భవన నిర్మాణ అనుమతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. నూతన పంచాయతీరాజ్ చట్టంలో పొందుపర్చిన పలు అంశాలపై శుక్రవారం సచివాలయంలోని చాంబర్లో జూపల్లి సమీక్షించారు. హెచ్ఎండీఏ, పంచాయతీరాజ్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. పంచాయతీ వ్యవహారాలన్నీ ఆన్లైన్లో పొందుపర్చే దిశగా తీసుకున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించారు. ఇప్పటికే లే ఔట్లు, భవన నిర్మాణ అనుమతులు, వ్యాపార, వాణిజ్య అనుమతులు వంటి వాటిని ఆన్లైన్లో పొందుపర్చడానికి సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసినట్టుగా అధికారులు వివరించారు. గ్రామ పంచాయతీ ఆదాయానికి సంబంధించి దాదాపు 70 శాతం వరకు ఆన్లైన్లో పొందుపర్చేలా సాఫ్ట్వేర్ సిద్ధమైందని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయడంలో జరుగుతున్న జాప్యంపై జూపల్లి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 300 చదరపు అడుగులకన్నా ఎక్కువ స్థలంలో లేదా జీ ప్లస్ 2 కన్నా అదనంగా భవన నిర్మాణ అనుమతులన్నీ హెచ్ఎండీఏ లేదా డీటీసీఏ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, అధికారులతో జూపల్లి చర్చించారు. -
పంచాయతీల పాలనకు ప్రత్యేకాధికారులు
-
పంచాయతీల పాలనకు ప్రత్యేకాధికారులు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు పదవీకాలం ముగిసిన వెంటనే గ్రామాలకు ప్రత్యేకాధికారులను నియమించనున్నట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఆగస్టు 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన రానున్న నేపథ్యంలో సోమ వారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఈవో పీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు, బాధ్యతలు చేపట్టనున్న ప్రత్యేకాధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసినా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రతీ గ్రామానికి ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తున్నట్టు ప్రకటించారు. స్వాతంత్య్రానంతరం దేశంలో ఒకేసారి 4 వేలకుపైగా గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణకే దక్కుతుందన్నారు. 4,383 నూతన పంచాయతీలను ఆగస్టు 2న పండగ వాతావరణంలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పట్టణాలకు దీటుగా గ్రామాలకు నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన పంచా యతీ నిధులను, కొత్త పంచాయతీలకు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. మౌలిక సదుపాయాలతోపాటు కొత్త పంచాయతీలకు బోర్డులు ఏర్పాటు చేయడంలాంటి వాటికి నిధులు కేటాయించినట్టు చెప్పారు. కొత్తగా 9,355 మంది పంచాయతీ కార్యదర్శుల నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జాయింట్ అకౌంట్లు తెరవాలి పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారులంతా నూతన పంచాయతీల్లో తక్షణమే పంచాయతీల తరఫున బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్లు తెరవాలని మంత్రి ఆదేశించారు. ప్రతీ గ్రామంలోనూ నర్సరీల ఏర్పాటుతోపాటు ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త పంచాయతీల ఏర్పాటు నేపథ్యంలో న్యాయ నిపుణులు, అధికారులతో చర్చించిన తర్వాతే సర్పంచ్‌లను కొనసాగించలేని పరిస్థితులున్నాయని వివరించారు. ఎన్నికలు జరగకుండా కోర్టుకు ఎవరెళ్లారో అందరికీ తెలుసని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. బీసీ గణనతోపాటు, ఎన్నికలను వీలైనంత వేగంగా నిర్వహించడానికి న్యాయపరంగానూ పోరాడుతామని అన్నారు. సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, ఎమ్మెల్యే ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోడు రైతుల జోలికి వెళ్లొద్దు
కొల్లాపూర్: పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులను ఇబ్బంది పెట్టొద్దని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆ శాఖ అధికారులకు సూచించారు. పోడు భూముల్లో పంటలు వేసుకున్న రైతుల జోలికి వెళ్లొద్దని స్పష్టం చేశారు. శనివారం ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో పర్యటించారు. ఈ నియోజకవర్గంలో అటవీ సరిహద్దుల పేరిట అధికారులు తవ్వుతున్న కందకాలను అడ్డుకుంటున్న రామాపురం, ముక్కిడిగుండం, నార్లాపూర్, కల్వకోల్, వరిదేల గ్రామాల రైతులతో మంత్రులు సమావేశమయ్యారు. పోడు భూముల సాగుకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాకున్నా.. అడవులను నరుక్కుంటూ పోతే జీవరాశి ఎలా బతుకుతుందని ప్రశ్నించారు. ఇప్పటివరకూ అటవీ భూములు సాగుచేసుకుంటున్న రైతుల జోలికి అధికారులు రారని, పంటలకు నష్టం చేయరని తెలిపారు. కందకాల తవ్వకాల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. అయితే, పంటలు సాగుచేయని భూముల్లో మాత్రం చెట్లు నాటుతామని స్పష్టం చేశారు. 1960లో చాలామంది రైతులకు అటవీ భూముల్లో రెవెన్యూ పట్టాలు ఇచ్చారని చెప్పిన ఆయన, రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులు గుర్తించేందుకు సర్వేఆఫ్ ఇండియాకు సీఎం కేసీఆర్ లేఖ రాశారని తెలిపారు. అక్కడి అధికారులు సర్వే చేశాక భూముల హద్దులు తేలుతాయన్నారు. ఆ విషయాలను తాము చూసుకుంటామని, అప్పటివరకు రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు మంత్రి జోగు రామన్న సూచించారు. -
గ్రామైక్య సంఘాలను బలోపేతం చేయండి
సాక్షి, హైదరాబాద్: గ్రామైక్య సంఘాలను బలోపేతం చేయడంలోనూ, మహిళా చైతన్యంలోనూ వీఓఏ (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్)లు కీలకంగా వ్యవహరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అటవీశాఖ మంత్రి జోగు రామన్న సూచించారు. హైదరాబాద్ శివార్లలో శుక్రవారం వీఓఏల రెండో రాష్ట్ర మహాసభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. హరితహారం, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాల్లో వీఓఏలు పూర్తిస్థాయిలో భాగస్వా మ్యం కావాలన్నారు. గ్రామాభివృద్ధిలోనూ, మహిళలను సంఘటితం చేయడంలోనూ వీఓఏలదే కీలక పాత్ర అన్నారు. వీఓఏలకు రూ.3 వేల వేతనం ఇచ్చి గౌరవించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నా రు. గ్రామైక్య సంఘాల ద్వారా కూడా మరో రూ.2 వేల వేతనాన్ని పొందే అవకాశం ఉంటుందన్నారు. హరితహారం సక్సెస్ చేయాలి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారాన్ని విజయవంతం చేయడానికి వీఓఏలు కృషి చేయాలని జూపల్లి చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్థానికంగా కుటీర పరిశ్రమల ఏర్పాటు, ఆన్లైన్ మార్కెటింగ్‌ను వినియోగించుకోవడం లాంటి కార్యక్రమాలను మహిళా సంఘాల ద్వారా చేపట్టేలా వీఓఏలు చైతన్యం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను, పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని, నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. వీఓఏల భార్య లేదా భర్త ప్రభుత్వ ఉద్యోగి అయినా, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని జూపల్లి హామీనిచ్చారు. అడవులు లేకపోవడం వల్లే వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని మంత్రి జోగు రామన్న అన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి వ్యక్తి కనీసం ఆరు మొక్కలు పెంచేలా చైతన్యపరచాలని చెప్పారు. ఆరోగ్య బీమా కల్పించాలి: వీఓఏల సంఘం వేతనాల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని వీఓఏల సంఘం ప్రధాన కార్యదర్శి మాధవి ప్రభుత్వాన్ని కోరారు. అలాగే జీవిత, ఆరోగ్య బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, వీఓఏల సంఘం గౌరవాధ్యక్షుడు రూప్సింగ్, వీఓఏల సంఘం అధ్యక్షుడు కోటేశ్వర్రావు, టీఆర్ఎస్ కార్మిక విభాగం నేతలు రాంబాబు యాదవ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జూపల్లి ఓఎస్డీ వ్యవహారంలో సీఐపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని భూవివాదంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు, ఓఎస్డీతో వివాదాస్పదంగా మాట్లాడిన సీఐ వ్యవహారంపై పోలీస్ శాఖ స్పందించింది. ఈ వివాదంతో సంబంధమున్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డిని వీఆర్‌కు పంపిస్తూ గురువారం కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్ ఆదేశాలిచ్చారు. ఓ అదనపు ఎస్పీ స్థాయి అధికారికి విచారణ బాధ్యతలను అప్పగించి అంతర్గత విచారణ నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. -
సెటిల్మెంట్లకు అడ్డాగా మంత్రుల పేషీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రుల, ఎమ్మెల్యేల పేషీలు భూముల పంచాయితీలకు, సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి సోమ వారం ఆరోపించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యవహారం కొత్తగా తెరపైకి రావడం టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధుల వ్యవహారశైలికి నిదర్శనమన్నారు. గతంలో ప్రజలకు రౌడీలు, గూం డాల నుంచి బెదిరింపులుండేవని, టీఆర్ఎ స్ అధికారంలోకి వచ్చాక మంత్రుల నుంచే నేరుగా బెదిరింపులు వస్తున్నాయన్నారు. మంత్రులు పద్మారావు, జూపల్లి, ఎమ్మెల్యే లు గువ్వల బాలరాజు, దుర్గం చిన్నయ్య వంటివారి బెదిరింపులు వెలుగులోకి వచ్చాయన్నా రు. నిజామాబాద్ జిల్లాలో దళితుల భూమి కబ్జా చేశారని ఆరోపణలు వస్తే సీఎం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం చూసీచూడనట్టుగా వ్యవహరించడం వల్లే అధికారపార్టీ నేతలు బరితెగించారని ఆరోపించారు. -
గంటలో ఐజీ ఫోన్ చేస్తడు
సాక్షి, పెద్దపల్లి/హైదరాబాద్: ‘‘నేను.. జూపల్లి కృష్ణారావు మినిస్టర్‌ను మాట్లాడుతున్నా.. ఏం మాట్లాడుతున్నవ్...తమాషా చేస్తున్నవా...గంటలో ఐజీ ఫోన్ చేస్తడు.. ప్రభుత్వమంటే ఏంటో చూపిస్తా..’’అంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓ సీఐని బెదిరించిన ఫోన్ సంభాషణ వైరల్ అవుతోంది. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని భూవివాదం విషయంలో మంచిర్యాల జిల్లా తాండూరు సీఐ జనార్దన్‌రెడ్డిని బెదిరించిన ఈ ఆడియో కలకలం రేపుతోంది. ‘‘ఏయ్ నీ పేరేంటి.. నీది ఏ స్టేషన్... చెప్పేది విను... ఈ నంబర్‌ను డీజీకి ఫార్వర్డ్ చేస్తా.. ఏం ఆధారాలున్నాయో చెప్పు..’’అని ఆ ఆడియోలో మంత్రి అన్నా రు. శనివారం మంత్రి ఓఎస్డీ వీరారెడ్డికి సీఐ ఫోన్ చేసిన సందర్భంగా ఇది చోటుచేసుకొంది. ముందు వీరారెడ్డి మాట్లాడినా.. సంభాషణ మధ్యలో అకస్మాత్తుగా మంత్రి వచ్చారు. భూ వివాదంలో జోక్యం చేసుకొని స్టే ఇప్పించారని, అవతలి వ్యక్తులకు మద్ద తు పలుకుతున్నారంటూ వీరారెడ్డితో సీఐ వాగ్వాదానికి దిగారు. ‘‘ఆ భూమి మాది కాదని ఆర్డర్ అయినా ఇప్పించండి.. ఇదేం ధ ర్మం... న్యాయం’’అని సీఐ వాదనకు దిగారు. ఈ సమయంలో మంత్రి ఫోన్ తీసుకొన్నారు. ఈ విషయం తెలియక.. సీఐ కూడా కాస్త గట్టిగానే మాట్లాడారు. దీనిపై తీవ్రంగా ఆగ్రహించిన జూపల్లి తాను మంత్రి జూపల్లి కృష్ణారావును మాట్లాడుతున్నానంటూ మండిపడ్డారు. సూసైడ్ చేసుకుంటాం.. ధర్మారంలోని తన సోదరి కొత్త లక్ష్మికి చెందిన స్థల వివాదంలో అవతలి పార్టీ వారికి వీరారెడ్డి మద్దతు పలుకుతున్నారని, రోజుల తిరబడి తిప్పుకుంటున్నారంటూ సీఐ ఫోన్లో ఆవేదన వ్యక్తంచేశారు. మీ డీజీకి నంబర్ ఫార్వర్డ్ చేస్తానని జూపల్లి చెప్పడంతో.. ‘‘నేను కూడా డీజీకి వివరిస్తా. ఏదైతే అదే అవుతుంది. సూసైడ్ చేసుకొని చస్తం.. ఏం చేస్తాం’’అని సీఐ పేర్కొన్నారు. సీఐపై మంత్రి ఓఎస్డీ ఫిర్యాదు మంత్రి ఓఎస్డీ వీరారెడ్డి సీఐ జనార్దన్‌రెడ్డిపై ఆదివా రం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనార్దన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు, భూమి వ్యవహారానికి సంబంధించిన విషయాలను వివరించారు. తనను సీఐ భయబ్రాంతులకు గురిచేశాడని, వివిధ చానళ్ల లో వస్తున్న కథనాలు అవాస్తవమని, వాటిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. జనార్దన్‌రెడ్డి గత నెల 30 నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఇదీ వివాదం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 262 నెంబర్లో నూనె నర్సయ్య అనే వ్యక్తికి 13 గుంటల పట్టా భూమి ఉంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇందులోంచి కోమటిరెడ్డి హన్మంతరెడ్డి అనే వ్యక్తికి ఆరు గుంటల పావు స్థలం విక్రయించాడు. రెండు సంవత్సరాల క్రితం నర్సయ్య మరణించగా ఆయన కుమారుడు నూనె శ్రీనివాస్ పేరిట మిగతా భూమిని మార్పిడి చేశారు. తర్వాత హన్మంతరెడ్డి కూడా ఆరున్నర గుంటల భూమిని తన కూతురు కొత్త లక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇటీవలే మరణించాడు. కాగా 2016లో శ్రీనివాస్ ధర్మారం మండలం ఎర్రగుంటపల్లికి చెందిన బద్దం మల్లారెడ్డికి ఇందులో నుంచి రెండు గుంటల భూమిని విక్రయించగా.. ఆ భూమికి హద్దులుగా సిమెంట్ పిల్లర్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో తన సోదరుడు తాండూరు సీఐ జనార్దన్‌రెడ్డి సహాయంతో లక్ష్మి తన బందువులతో కలిసి వెళ్లి సరిహద్దు రాళ్లను ధ్వంసం చేశారు. ఈ వివాదంలో ఇరువర్గాలపై ధర్మారం పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. లక్ష్మి ఆ భూమిలో ఇంటి నిర్మాణం చేసింది. దీంతో శ్రీనివాస్ మంత్రి జూపల్లిని ఆశ్రయించాడు. ఈ క్రమంలో మంత్రి పేషీ నుంచి పలుమార్లు ఇరువర్గాలను పిలిపించి విచారణ చేశారు. దీనిపైనే వివాదం నెలకొంది. -
పండుగలా కొత్త పంచాయతీలు
సాక్షి, హైదరాబాద్: గ్రామాల పాలన మరోసారి అధికారుల చేతుల్లోకి వెళ్తోంది. గడువులోగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఆగస్టు 1తో ముగుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలు ఆగస్టు 2 నుంచి మనుగడలోకి వస్తాయి. అదే రోజు నుంచి అన్ని గ్రామ పంచాయతీలలో అధికారులకు పాలన వ్యవహారాలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లతో మాట్లాడారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా సర్పంచ్‌లకు ప్రత్యామ్నాయంగా అధికారులు పాలన అందించేలా కలెక్టర్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీల పునర్విభజన జరిగింది. కొత్తగా 4,383 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 8,684 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటి పాలకవర్గాల పదవీకాలం ముగిసే రోజు నుంచే కొత్త గ్రామ పంచాయతీలు మనుగడలోకి వస్తాయి. కొత్త పంచాయతీల ఏర్పాటు, కొత్త పంచాయతీలకు అవసరమైన భవనాలు, ఇతర సామగ్రి, ప్రత్యేక అధికారుల పాలన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించింది. గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో... దీని కోసం చేసే ఏర్పాట్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు. ఈ మేరకు వికాస్‌రాజ్.. పంచాయతీరాజ్ కమిషనర్‌కు, అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ♦ ప్రస్తుత పంచాయతీల పదవీకాలం ఆగస్టు 1న ముగుస్తుంది. కొత్త పంచాయతీలు ఆగస్టు 2 నుంచి మనుగడలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 2 నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదవుతుంది. కొత్త, పాత పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించే ఏర్పాట్లను ముందుగానే చేయాలి. ♦ గ్రామ పంచా యతీలను కలిపి ఏర్పాటు చేసిన క్లస్టర్లను పునర్విభజన చేయాలి. కొత్త పంచాయతీల ఏర్పాటుతో వీటి పరిధి మారుతుంది. గ్రామ పంచాయతీల సంఖ్యకు అనుగుణంగా క్లస్టర్లను పునర్విభజన జరపాలి. ♦ కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయాలకు అవసరమైన భవనాలను గుర్తించి సిద్ధం చేయాలి. గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని కొత్త వాటికి అనుగుణంగా విభజించాలి. స్వీపర్లు, వాచ్మెన్, ఎలక్ట్రీషియన్స్, బిల్ కలెక్టర్లు వంటి సిబ్బంది విభజన పూర్తి చేయాలి. ♦ ప్రస్తుత గ్రామ పంచాయతీల పరిధిలో కొత్తగా ఏర్పాటయ్యే వాటి పరిధి, జనాభాకు అనుగుణంగా ఆస్తుల పంపిణీ పూర్తి చేయాలి. డిమాండ్, రెవెన్యూ రిజిస్టర్లను పంపిణీ చేయాలి. అన్ని రకాల అధికార వ్యవహారాల పత్రాలను వేర్వేరు చేసి పంపిణీ జరపాలి. ♦ కొత్త పంచాయతీల ఏర్పాటును పండుగలా నిర్వహించాలి. విస్తృత ప్రచారం జరపాలి. డప్పు చాటింపు చేయాలి. కొత్త గ్రామ పంచాయతీల్లోని ప్రజలకు అభినందనలు తెలిపేలా బ్యానర్లు కట్టాలి. ♦ కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేయాలి. ‘గ్రామ పంచాయతీ కార్యాలయం’అని తెలుగులో బోర్డు పెట్టాలి. కొత్త గ్రామ పంచాయతీ పేరుతో అధికారిక స్టాంప్, సీల్, సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేయాలి. పాత, కొత్త గ్రామ పంచాయతీల పరిధిని తెలిపేలా భౌగోళిక చిత్రాలను సూచించేలా బోర్డులను రూపొందించాలి. ♦ గ్రామ పంచాయతీలకు నియమించిన ప్రత్యేక అధికారి, గ్రామ కార్యదర్శి నిర్దేశించిన రోజున కచ్చితంగా బాధ్యతలు తీసుకోవాలి. కొత్త గ్రామపంచాయతీ పేరుతో ప్రత్యేక అధికారులు కొత్తగా బ్యాంకు అకౌంట్ ప్రారంభించాలి. గ్రామపంచాయతీలో అవసరమైన అన్ని రకాల మౌలిక సేవల ప్రక్రియను పర్యవేక్షించాలి. రోజువారీ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, సామాజిక పింఛన్ల పంపిణీ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను, స్థానిక అవసరాలను తీర్చేలా ప్రత్యేక అధికారులు పని చేయాలి. -
హైకోర్టు ఆదేశాలపై సుప్రీంలో పిటిషన్
-
‘స్థానికం’లో బీసీ కోటా తగ్గదు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో 34 శాతానికి తగ్గకుండా చూడాలని మంత్రివర్గ ఉపసంఘం తీర్మానించింది. రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేయాలని నిర్ణయించింది. బీసీ జనాభా గణన, నెలాఖరులో పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత పరిపాలన పరంగా చేసే ఏర్పాట్లపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ‘స్థానిక’రిజర్వేషన్లపై హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశమైంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు, కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న ప్రత్యేకంగా హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావులతో పలు అంశాలపై ఉపసంఘం చర్చించింది. హైకోర్టు తీర్పు, బీసీ గణన, పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. జూపల్లి మాట్లాడుతూ.. ‘సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. రిజర్వేషన్లపై, బీసీ గణన అంశాలపై కొందరు కోర్టును ఆశ్రయించారు’అని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉపసంఘానికి వివరించారు. కొందరు కోర్టుకెళ్లడంతో చిక్కులు: మంత్రులు సమావేశం అనంతరం మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జోగు రామన్న మీడియాతో మాట్లాడారు. ‘2013 ఎన్నికల సందర్భంగా 61 శాతం రిజర్వేషన్లు కల్పించుకునే వెసులుబాటు సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ రిజర్వేషన్లు 50 శాతం మించొద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించాం. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలను సకాలంలో నిర్వహించడం, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యం. కానీ ఎన్నికలపై కొందరు కోర్టుల్లో కేసులు వేయడంతో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జూలై 31తో పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ముగుస్తోంది. ఆ తర్వాత ప్రత్యేక అధికారులకు అప్పగించాలా? పాలక వర్గాలకు అప్పగించాలా? కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. బీసీ జనాభా గణనపై హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలన్నదీ ఆ భేటీలోనే నిర్ణయిస్తాం. రిజర్వేషన్ అంశంపై రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. దీనిపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది’అని తెలిపారు. \ -
కూలి చెల్లింపులో జాప్యం వద్దు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని, వీటి చెల్లింపునకే బ్యాంకులు, పోస్టాఫీసులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యంపై బ్యాంకర్లు, తపాలా, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో జూపల్లి గురువారం సమీక్ష నిర్వహించారు. నిరుపేద కూలీలకోసం ఉపాధి హామీ పథకం చేపడుతున్నామని, కూలి చెల్లింపులో జాప్యం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల ద్వారా చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు లేవని, నగదు కొరత కారణంగా పోస్టల్ చెల్లింపుల్లో తీవ్రజాప్యం జరుగుతోందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మంత్రికి తెలిపారు. బ్యాంకుల్లో ఖాతా తీసుకునేందుకు ఆధార్ కార్డుతోపాటు పాన్ కార్డు అడగడం వల్ల ఉపాధి కూలీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అలాగే మూడు నెలలపాటు ఆపరేట్ చేయకుండా ఉన్న కూలీల అకౌంట్లను తొలగించడం, జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ప్రారంభించేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరించడం లాంటి కారణాలతో దాదాపు 60 శాతం చెల్లింపులను పోస్టల్ ద్వారా చేయాల్సి వస్తుందని వివరించారు. ఉపాధి కూలీలకు చెల్లింపులకోసం ఏప్రిల్, మే నెలల్లో బ్యాంకులకు రూ.360 కోట్లను, పోస్టాఫీసులకు రూ.412 కోట్లను విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు బ్యాంకులు రూ.350 కోట్ల వరకు చెల్లింపులు జరిపాయని, తపాలా శాఖ కేవలం రూ.79 కోట్లు మాత్రమే చెల్లించిందని అధికారులు వివరించారు. తపాలా శాఖ తీరుపై జూపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటినుంచి ఎలాంటి జాప్యం లేకుండా చెల్లింపులు జరపాలని పోస్ట్ మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డిని ఆదేశించారు. ఆర్బీఐ నుంచి నగదు విడుదల చేయకపోవడం, వారం రోజులుగా పోస్టల్ సిబ్బంది సమ్మెలో ఉండటం వల్ల చెల్లింపుల్లో జాప్యం జరిగిందని పీవీఎస్ రెడ్డి వివరించారు. నగదు కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఉపాధి నిధుల చెల్లింపు కోసమే ప్రత్యేకంగా రూ.150 కోట్లను బుధవారం విడుదల చేశామని ఆర్బీఐ డిప్యూటీ జనరల్ నాగేశ్వర్రావు తెలిపారు. -
ఊరూరా నర్సరీ ఏర్పాటు చేయాలి: జూపల్లి
సాక్షి, హైదరాబాద్ : పంచాయతీరాజ్ కొత్త చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణా రావు అధికారులకు వివరించారు. నర్సరీల ఏర్పాటు దిశగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. హరితహారం, ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటుపై జూపల్లి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహిం చారు. జూన్ 10లోగా నర్సరీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని, జూలై 15 నాటికి నర్సరీల ఏర్పాటు పూర్తి కావాలని అన్నారు. దాదాపు మూడు వేలకు పైగా గ్రామాల్లో నర్సరీలున్నాయని, మిగిలిన గ్రామాల్లోనూ వెంటనే భూములను సేకరించి నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నర్సరీల నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలకే అప్పగించాలని జూపల్లి అధికారులకు సూచించారు. -
కాంగ్రెస్‌కు మంత్రి జూపల్లి సవాల్
సాక్షి, హైదరాబాద్ : బ్యాంకు రుణం విషయంలో సీబీఐ నోటీసులు ఇచ్చినట్టుగా తమ కుటుంబంపై అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక సీబీఐ ఇచ్చినట్టుగా నకిలీ నోటీసులు సృష్టించి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఎమ్మెల్యేలు ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, అంజ య్య, ఎమ్మెల్సీ కె.నారాయణరెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. నకిలీ నోటీసులతో తనపై, తన కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేసి పరువు తీసినవారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని జూపల్లి హెచ్చరించారు. వ్యాపారాల్లో ఉన్నవారు బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం సహజమని.. రాజకీయాల్లోకి రాకముందే ఎల్ఐసీ, ఫ్రుడెన్షియల్ బ్యాంకుల్లో అప్పులు తీసుకుని, పూర్తిగా చెల్లించేశామని వివరించారు. తన కుమారుడు అరుణ్ కూ డా వ్యాపారం కోసం అప్పులు తీసుకున్నాడని, అందులో రూ.31 కోట్లకు పైగా తిరిగి చెల్లించేశాడని చెప్పారు. ఇలా చెల్లించిన మొత్తం గురించి ఎవరూ పేర్కొనకపోవడం వెనుక కుట్ర ఏమిటని ప్రశ్నించారు. తప్పులు చేయడం లేదు: తాము అప్పులు చేయడం తప్ప.. తప్పులేమీ చేయడం లేదని జూపల్లి పేర్కొన్నారు. వ్యాపారాల ద్వారా సొం తకాళ్లపై నిలబడటం తప్పుకాదని, పదవులను అడ్డం పెట్టు కుని పైరవీలు చేయడం తప్పు అని వ్యాఖ్యానించారు. ఆస్తులను తనఖా పెట్టుకునే బ్యాంకులు అప్పులు ఇచ్చాయని, వాటి ని వడ్డీతో సహా వసూలు చేసుకుంటాయని స్ప ష్టం చేశారు. అరుణ్‌ను నీరవ్ మోదీతో పోలుస్తారా, అరుణ్ ఎక్కడికైనా పారిపోయారా అంటూ జూపల్లి భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయంగా ఎదుర్కోలేక.. సీబీఐ నోటీసులిచ్చినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, నకిలీ నోటీసులు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జూపల్లి పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక, నైతికంగా దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని.. తన ప్రతిష్టను దెబ్బతీసి కొందరు రాజకీయ లబ్ధి పొందే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాము ఏ తప్పు చేసినా పదవుల నుంచి వెంటనే తప్పుకుంటానన్నారు. తెలంగాణ కోసం మూడున్నరేళ్ల మంత్రి పదవిని వదులుకున్న చరిత్ర తనదని.. ఇసుక అంశంలో తప్పుచేసిన వారిని గుర్తించి, పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు. సమాజంలో ఎంతో మందిని ముంచినోళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని.. వారు నీతులు చెప్పడం మానుకోవాలని జూపల్లి సూచించారు. సీబీఐ పేరిట తప్పుడు నోటీసులను తయారు చేసినవారిపై పరువునష్టం దావా, క్రిమినల్ కేసులు వేస్తానని ప్రకటించారు. కాగా.. మంత్రిగా జూపల్లి అభివృద్ధిని, పార్టీ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య విమర్శించారు. పథకాలు, కార్యక్రమాల్లో తప్పులు పట్టుకోలేక ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. -
గ్రామాల్లో చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని సెర్ప్ సీఈవో పౌసమిబసును ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిరుధాన్యాల ప్రాసెసింగ్ కేంద్రాన్ని, చెంగిచెర్లలోని జాతీయ మాంసం పరిశోధన సంస్థను మంత్రి సందర్శించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. దేశంలోనే ఏకైక మాంసం పరిశోధన కేంద్రం హైదరాబాద్‌లో ఉందని...దీని సహకారంతో స్థానికంగా మాంసం ప్రాసెసింగ్‌కు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సెర్ప్ అధికారులకు మంత్రి జూపల్లి సూచించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా గొర్రెలు ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వినియోగదారులకు నాణ్యమైన మాంసాన్ని అందించేందుకు కొల్లాపూర్ నియోజకవర్గంలోని వెన్నచర్లలో కబేళాను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టింది. -
సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
నిజామాబాద్ నాగారం (నిజామాబాద్‌అర్బన్): సర్పంచ్‌లు ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, ప్రభుత్వ సం క్షేమ పథకాలను అర్హులకు అందిస్తూ గ్రామా భివృద్ధికి కృషి చేయాలని పంచాయతీరాజ్‌శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఎల్ఎన్ గార్డెన్లో జరిగిన 13 జిల్లాల సర్పంచ్ల ప్రాంతీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. గ్రామ పంచాయతీలకు ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.40 వేల కోట్ల ఖర్చుతో మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించే పథకం చేపట్టిందని చెప్పారు. ప్రతి గ్రామంలో 100 గజాలలో డంపింగ్‌యార్డు ఏర్పర్చుకోవాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేసి ఆ గ్రామానికి అవసరమైన మొక్కలు పెంచుతామన్నారు. త్వరలోనే సర్పంచ్‌లకు ఐ పాడ్, మొబైల్ఫోన్లు అందించనున్నట్లు తెలిపారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు ప్రభు త్వం రూ.13 లక్షలు ఇచ్చేదని, ఇప్పుడు దానిని రూ.16 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్ పాల్గొన్నారు. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్ , మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల నుంచి సర్పంచ్‌లు హాజరయ్యారు. -
సమ్మె విరమించనున్న సెర్ప్ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: సెర్ప్ ఉద్యోగుల సమ్మె విరమణకు సర్కారు చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా శనివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంట్లో మంత్రితోపాటు ఎంపీ కవితతో సెర్ప్ ఉద్యోగ సంఘం ప్రతినిధులు సమావేశమై చర్చలు జరిపారు. ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో ఉన్నాయని, సరైన సమయంలో ఆయన నిర్ణయం తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు. సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలను కోరడంతో వారు సానుకూలంగా స్పందించి విరమిస్తామని చెప్పినట్లు సమాచారం. -
ఉపాధి హామీకి వెయ్యి కోట్లివ్వండి
కేంద్రానికి మంత్రి జూపల్లి లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి రావాల్సిన ఉపాధి హామీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. శనివారం ఈ మేరకు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. రూ.500 కోట్ల వేతన, రూ.500కోట్ల మెటీరియట్ కాంపోనెంట్ నిధులను విడుదల చేయాలని కోరారు. రాష్ట్రం లో 438 మండలాలు, 8,517 గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుం తలు, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు, అంతర్గత రోడ్ల నిర్మాణం భారీ స్థాయిలో చేపడుతున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.250 కోట్ల వేతన, రూ.135 కోట్ల మెటీరియల్ కాంపో నెంట్ నిధులను కేంద్రం విడుదల చేయాల్సి ఉందని లేఖలో జూపల్లి వివరించారు. కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యం వల్ల ఉపాధి పనుల పురోగతికి ఆటంకం ఏర్పడు తోందన్నారు. -
చర్చకు భయపడిన మంత్రి పెద్దోడా?
కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: పాలమూరు ప్రజలకు ద్రోహం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు రావాలంటే భయపడుతున్నాడని, అలాంటి నాయకుడు పెద్దోడెలా అవుతాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ఆయకట్టును తగ్గిస్తూ జీఓ వచ్చిందని, జీఓ మార్పును నిరూపించలేకపోతే ముక్కు నేలకు రాయడానికి సిద్దంగా ఉన్నానని సవాల్ చేశారు. బహిరంగచర్చకు వచ్చే దమ్ములేని టీఆర్ఎస్ నేతలు, పచ్చి అబద్దాలు, అసత్య ఆరోపణలు చేసి తప్పించుకుంటున్నారని విమర్శించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి జరిగిన నష్టం గురించి ప్రశ్నిస్తున్నానని, పదవులకోసం ప్రజలకు నష్టం చేసే మంత్రి జూపల్లిని చెంచా అని, తొత్తు అని అనకుండా ఇంకా ఏమంటారో చెప్పాలని వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జూపల్లి వంటివారు సంస్కారం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరుకు జరిగిన నష్టంపై చర్చించకుండా చిల్లర రాజకీయాలకు టీఆర్ఎస్ నేతలు పాల్పడుతున్నారని విమర్శించారు. ఉద్యమకారులపై దాడులు చేసి, తెలంగాణపై విషం చిమ్మినవాళ్లే టీఆర్ఎస్ మంత్రివర్గంలో ఉన్నారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్‌పై అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుకంజ వేశారని, అసెంబ్లీలోనే అవకాశం ఇస్తే టీఆర్ఎస్ అసలు రంగు బయటపడేదన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న ద్రోహాన్ని, మోసాన్ని వదిలిపెట్టేది లేదని.. అసెంబ్లీలోనే నిలదీస్తానని వంశీచంద్‌రెడ్డి హెచ్చరించారు. -
చర్చంటే జూపల్లికి భయమెందుకు: వంశీచంద్
సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఆయకట్టు తగ్గింపు, జీఓలో మార్పులపై బహిరంగచర్చకు రావడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ పాలమూరుకు అన్యాయం చేసేవిధంగా జీఓలను మార్చారని ఆరోపించారు. ఆయకట్టును 62 వేల నుంచి 37 వేలకు తగ్గించారని చెప్పారు. ఈ మార్పులు తెలుసుకోలేని అజ్ఞానంలో జూపల్లి ఉండటం జిల్లా ప్రజల దురదృష్టమన్నారు. ఆయనకు మంత్రిగా కొనసాగే హక్కులేదని, వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. డిండికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకుపోవద్దని సీఎంకు గతంలో లేఖ రాసిన జూపల్లి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కోట్లు దండుకోవడానికి ఆయన కల్వకుర్తి కాలువలు, టన్నెల్ సైజులు తగ్గించారని ఆరోపించారు. -
'ఇంతటి అజ్ఞాని మంత్రిగా ఉండటం దురదృష్టం'
హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలకు అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీ ప్రాంగణంలో బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు చేస్తే మంత్రి తోక ముడిచారని, సవాలు స్వీకరించలేక తన అనుచరులతో మాట్లాడించారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 62 వేల ఎకరాల నుంచి 37 వేల ఎకరాలకు కుదించారని, ఈ ప్రాజెక్టు విస్తీర్ణం తగ్గించారని తాను అంటుంటే తగ్గించలేదని జూపల్లి అంటున్నారని, జీవోలో మార్పులు చేసి చేయలేదని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఇంతటి అజ్ఞాని మంత్రిగా ఉండటం జిల్లా చేసుకున్న దురదృష్టమన్నారు. ఆయనకు మంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. డిండికి నీళ్లు తీసుకుపోవడానికి తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. డిండికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకుపోవద్దని సీఎంకు లేఖ రాసింది జూపల్లి కాదా.. డిండికి నీళ్లు తీసుకుపోతున్నా ఎందుకు సైలెంటుగా ఉంటున్నారని ప్రశ్నించారు. కల్వకుర్తి కాలువలు, టన్నెల్ సైజులు తగ్గించడంలో జూపల్లి పాత్ర ఉందని, ఈ వ్యవహారంలో కోట్లు దండుకున్నది జూపల్లి కాదా అని నిలదీశారు. తాను అడిగిన ప్రశ్నలకు మంత్రి జూపల్లి సమాధానం చెప్పకపోతే మంత్రి పదవికి రాజీనామా చేసి పాలమూరు జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వంశీచంద్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
'పాలమూరుకు తొలి శత్రువు ఆయనే'
హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరుకు తొలి శత్రువు మంత్రి జూపల్లి అని అన్నారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. డిండి ప్రాజెక్ట్‌కు నీళ్లు తీసుకుపోవడానికి మేము వ్యతిరేకం కాదు.. పాలమూరు, రంగారెడ్డికి అనుసంధానం కాకుండా డిండికి నీళ్లు తీసుకుపోవాలి.. జీఓను మార్చలేదని చెప్పిన జూపల్లి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. నా తప్పు ఉంటే ముక్కు నేలకు రాస్తా.. లేకపోతే జూపల్లి పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేశారు. -
పాలమూరు ప్రాజెక్టులపై రాద్ధాదంతం
విపక్షాలపై మంత్రి జూపల్లి ధ్వజం సాక్షి, హైదరాబాద్: పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, అంజయ్య యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. రౌండ్ టేబుల్ సమావేశాలతో ప్రజలను విపక్షాలు తప్పు దోవపట్టిస్తున్నాయని, కోర్టు కేసులతో కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలం గాణ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రాంతానికో వైఖరి ప్రదర్శించినట్లే ఇప్పుడు జిల్లాకో తీరుగా మాట్లాడుతోందని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు జిల్లాల మధ్య చిచ్చు పెడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. -
కొత్త పంచాయతీల ఏర్పాటు తర్వాతే ఎన్నికలు
మంత్రి జూపల్లి సాక్షి, కొత్తగూడెం: రాష్ట్రంలో కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన తర్వా తే అన్ని గ్రామ పంచా యతీలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దట్టమైన అడవితో నిండిన కొత్తగూడెం, గుండాల మండలాల సరిహద్దు ప్రాంతా లైన బంగారుచెలక, తిప్పగుట్ట, మైలారం, రేగళ్ల గ్రామాల పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా దాటిన తండాలతో పాటు, ప్రస్తుత గ్రామ పంచా యతీల్లో దూరంగా ఉన్న హాబిటేషన్లను గుర్తించి వాటి మధ్య దూరం, జనాభా తదితర అంశాల ప్రకారం మరికొన్ని గ్రామ పంచాయతీలను ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీంతో మారుమూల గిరిజన ప్రాంతాలకు మేలు జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం అమలు విషయంలో జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి సమీక్ష చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరారు. -
జూరాల నీటి విడుదలకు చర్యలు: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, పాలమూరు రైతాంగ అవసరాలకు అనుగుణంగా జూరాల నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. గురువారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, గద్వాల నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి కృష్ణమోహన్‌రెడ్డి, ఈఎన్సీ మురళీధర్‌రావు, జూరాల ఎస్ఈ రఘునాథ్‌లతో కలసి మంత్రి సమీక్షించారు. నారాయణపూర్, ఆల్మట్టి నుంచి వస్తున్న వరద నీటిపై చర్చించారు. జూరాల నుంచి భీమా ఫేజ్ 1, ఫేజ్ 2తోపాటు కోయిల్ సాగర్, నెట్టెంపాడులకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. ఎగువన ఉన్న కర్ణాటక నుంచి నీటి విడుదలకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు. -
సేంద్రియ సాగును ప్రోత్సహించండి
మంత్రి జూపల్లితో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధుల భేటీ సాక్షి, హైదరాబాద్: సేంద్రియ వ్యవసాయా న్ని ప్రోత్సహించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ సంస్థ ప్రతినిధులు పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. ఆదివారం సచివాలయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న శ్రీశ్రీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ ట్రస్ట్ ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జి ఉమా మహేశ్వరి.. జూపల్లితో భేటీ అయ్యారు. సేంద్రియ వ్యవసాయం, ఎరువుల తయారీ వంటి అంశాల్లో తమ సంస్థ చేపడుతున్న కార్యకలాపాలను ఆమె వివరించారు. దేశ వ్యాప్తంగా ఏపీ సహా 18 రాష్ట్రాల ప్రభుత్వా లతో తమ సంస్థ ఒప్పందం చేసుకుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 1,500 మంది రైతులకు సేంద్రియ సా గుపై శిక్షణ ఇచ్చి వారి ద్వారా కార్యక్రమాలను, సెమినార్లను నిర్వహిస్తు న్నామన్నారు. వెదురు బొంగులతో తక్కువ వ్యయంతో పాలీ హౌస్‌లను నిర్మించుకునేం దుకు సహకారం అందిస్తున్నామన్నారు. సెర్ప్ ద్వారా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సహకా రంతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశాలున్నా యో పరిశీలించాలని సీఈఓ పౌసమి బసుకు మంత్రి సూచించారు. పథకాలన్నీ పక్కాగా అమలు కావాలి ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రులు జూపల్లి, మహేందర్‌రెడ్డి అన్నా రు. సచివాలయంలో కొడంగల్ నియోజక వర్గంలోని ఐదు మండలాలకు చెందిన ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, ఆర్అండ్బీ, ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. -
12న హరితహారానికి శ్రీకారం
కరీంనగర్లో సీఎం చేతుల మీదుగా ప్రారంభం: జూపల్లి సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12న హరితహారానికి శ్రీకారం చుడుతున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కరీంనగర్లో దీనిని ప్రారంభిస్తామని పంచాయతీ రాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించి 2,925 నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. శుక్రవారం ఉపాధిహామీ, హరితహారంపై సచివాలయం నుంచి ఆయన కలెక్టర్లు, డీఆర్డీఓలు, డీపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మూడేళ్లలో 230 కోట్ల మొక్కలను హరితహారంలో భాగంగా నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను, ప్రతి నియోజక వర్గంలో 40 లక్షల మొక్కలను మూడేళ్లలో నాటే దిశగా ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. ఈ ఏడాది మొత్తం 42 కోట్ల మొక్కలను నాటే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించామన్నారు. రాష్ట్రంలో 24 శాతమున్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. -
2018 నాటికి ఓడీఎఫ్ రాష్ట్రంగా తెలంగాణ
భోపాల్‌లో పంచాయతీరాజ్ మంత్రుల భేటీలో మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 100శాతం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్) రాష్ట్రంగా చేసేందుకు ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే 620 పంచాయతీలు, 3 నియోజకవర్గాలను ఓడీఎఫ్ ప్రాంతాలుగా ప్రకటించామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం భోపాల్‌లో జరిగిన అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల సదస్సుకు ఆయన హాజరయ్యా రు. ఈ భేటీలో కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌లు పాల్గొన్నారు. సదస్సులో జూపల్లి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెడుతోందని.. సీఎం కేసీఆర్ నాయకత్వం లో అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని.. దాదాపు 40 లక్షల మందికి ఆసరా పథకం ద్వారా ప్రభుత్వం అండగా ఉందన్నారు. ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే... పేదరికాన్ని రూపుమాపే లక్ష్యంతో 2014 ఆగస్టులో ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించామన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సమగ్ర సమాచా రాన్ని సేకరించగలిగామని జూపల్లి చెప్పారు. దీని ఆధారంగా పింఛన్ల పంపిణీలో మార్పులు చేశామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి లక్ష మందికి పైగా ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. 5,765 పంచాయతీలను కంప్యూటరీకరించామని.. త్వరలో అన్ని పంచాయతీల్లోనూ ఆన్లైన్ సేవలను అందిస్తామన్నారు. తెలంగాణలో అవినీతి రహిత పాలనకు కృషి చేస్తున్నామని.. దీనిలో భాగంగా స్థానిక ప్రతినిధుల వేతనాలను భారీగా పెంచామని తెలిపారు. -
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, అందులో భాగంగా పలు అంశాల్లో జాతీయ స్థాయి అవార్డులు దక్కాయని గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు సాధిం చిన ఉపాధిహామీ, ఈజీఎంఎం, సెర్ప్ అధికారులను అభినందించారు. శనివారం గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ ఆర్థిక సంవత్సరం 3 నెలల్లో రూ.1,080 కోట్ల విలువైన ఉపాధి పనులు చేపట్టిందని చెప్పారు. సెర్ప్ ద్వారా మహిళా సాధికారత, ఉపాధి అవకాశాల కల్పనలోనూ జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. అవార్డు పొందిన నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్ సర్పంచ్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్ పదవిని బాధ్యతగా చేపట్టి గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి చేశానన్నారు. కమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీఈఓ పౌసమిబసు పాల్గొన్నారు. -
పల్లె ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. శుక్రవారం సెర్ప్ కార్యాలయంలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.620కోట్ల వ్యయంతో 150 మండలాల్లో కార్యక్రమం జరుగు తుందని జూపల్లి వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో గ్రామ గ్రామాన వ్యవసాయ అనుబంధ, మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మండలాల విభజన నేపథ్యంలో 182 మండలాల్లో పల్లె ప్రగతి అమలు కానుందని, ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సెర్ప్ సీఈవో పౌసమీబసు వివరించారు. -
ప్రతిపక్షాలకు ఒక్క సీటూ రాదు: జూపల్లి
ఆమనగల్లు: వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు ఒక్కసీటు కూడా వచ్చేది కష్టమే అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగ ల్లులో ఆదివారం ఒంటరి మహిళల కు పింఛన్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పా రు. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజల సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పని తీరు, పార్టీపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి సర్వే నిర్వహిం చారని.. సర్వేలో కేసీఆర్ 111 సీట్లు వస్తాయని చెప్పారని ఆయన వివరించారు. కానీ ఎన్నికలు జరిగే నాటికి అన్ని సీట్లనూ టీఆర్ఎస్ గెలుచుకుంటుందనీ, ప్రతిపక్ష పార్టీలకు ఒక్కసీటు కూడా రాదన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ఒకటి, రెండు సీట్లు వస్తే రావచ్చని చెప్పారు. ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ విమర్శలు చేయడం సమం జసం కాదని ఈ సందర్భంగా జూపల్లి అన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ద్యాప విజితారెడ్డి, నాయకులు అశోక్‌రెడ్డి, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి
► మొత్తం 1,08,302 మంది లబ్ధిదారులకు పథకం వర్తింపు ► ఆమనగల్లులో ప్రారంభించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి’పథకం ఆదివారం(నేడు) నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించ నున్నారు. ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 1 లక్షా 46 వేల దరఖాస్తులు రాగా, ఇందులో 1,08,302 మంది మహిళలను అర్హులుగా తేల్చారు. ఎంపిౖకైన లబ్ధిదారులకు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లోనూ నేడు ఆర్థిక భృతి మంజూరు పత్రాలను స్థానిక ఎమ్మెల్యేలు అందజేయనున్నారు. జూన్ 6 నుంచి లబ్ధిదారుల బ్యాంక్ లేదా పోస్టాఫీసు ఖాతాలకు ఆర్థిక భృతి మొత్తాన్ని జమ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధి కారులు తెలిపారు. వాస్తవానికి ఒంటరి మహిళ లకు ఆర్థిక భృతిని ఏప్రిల్ 1 నుంచి వర్తింపజే యాలని ప్రభుత్వం భావించినందున జూన్ 6 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో ఏప్రిల్, మేలకు సంబంధించిన మొత్తాన్ని(రూ.2వేలు) జమచే యనున్నారు. ఈ పథకం అమలు నిమిత్తం ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.10.08 కోట్ల భారం పడనుందని అధికారులు పేర్కొన్నారు. -
రెండేళ్లలో ‘డిండి’ నుంచి సాగునీరు
►ఇబ్రహీంపట్నం ప్రాంతాన్నిసస్యశ్యామలం చేస్తాం ►అధికారుల అలసత్వంతోనే సంక్షేమ పథకాల్లో జాప్యం ►ప్రతి గ్రామంలో శ్మశానవాటిక,డంపింగ్ వార్డులకు వారం రోజుల్లో స్థలాలు కేటాయించాలి ►రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు యాచారం(ఇబ్రహీంపట్నం): డిండి ప్రాజెక్టు నుంచి రానున్న రెండేళ్లలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని, ఈ ప్రాతానికి సాగునీరు ఇచ్చే విషయంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం అమలుపై కూలీలతో, గ్రామజ్యోతి పథకం అమలుపై గునుగల్ గ్రామంలో గ్రామస్తులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ... అత్యంత కరువు ప్రాంతమైన ఇబ్రహీంపట్నంకు రెండేళ్ల కాలంలో డిండి ప్రాజెక్టు నుంచి శివన్నగూడ ద్వారా సాగునీరు అందిస్తామని అన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో వంద రోజులు పనిదినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలకు మరిన్ని పనిదినాలు పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని అన్నారు. ఉపాధి పథకం కింద మంజూరయ్యే నిధుల ద్వారా గ్రామాలను సమగ్రాభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్నారు. అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వల్లే సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. సంక్షేమ పథకాల అమలుపై క్షేత్రస్థాయి పర్యటనలు చేసి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల నిర్మాణం కోసం రూ.లక్షల నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా సక్రమంగా అమలు కావడం లేదని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని 415 గ్రామాల్లో వారం రోజుల్లోపే డంపింగ్‌యార్డులు, శశ్మానవాటికల కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. వారం రోజుల్లో స్థలాలను గుర్తించి తనకు నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని రూ.లక్షల నిధులు అడిగే బదులు ఈజీఎస్ పథకం కింద మంజూరైన పనులను పూర్తి చేసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి మాట్లాడుతూ... సంపూర్ణ అక్షరాస్యత కోసం కృషి చేయాలని సూచించారు. తాగునీటిని వృథా చేయకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతుప్రసాద్ మాట్లాడుతూ... ప్రతి ఇంటికీ మరుగుడొడ్డి నిర్మించే విషయంలో నిధుల కొరత లేదని అన్నారు. గ్రామాల్లో అవసరం ఉన్న కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రూ.300 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని.. అధికారులను సూచించారు. కృష్ణాజలాలు లేకుంటే గ్రామాలే ఖాళీ అయ్యేవి: ఎమ్మెల్యే మంచిరెడ్డి మూడేళ్లుగా ఈ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాల్లేవు. భూగర్భజలాలు అడుగంటాయి. కృష్ణాజలాలు లేకపోతే ఈ ప్రాంతంలో నీటి ఇబ్బందుల వల్ల ప్రజలు గ్రామాలనే ఖాళీ చేయాల్సి వచ్చేదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గునుగల్, కొత్తపల్లి గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ... సాగునీరే అందజేయడమే ఈ ప్రాంత ప్రజలకు శరణ్యమని అన్నారు. నియోజకవర్గంలో ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయని అన్నారు. మరో రూ100 కోట్లు మంజూరు చేసే విధంగా పంచాయతీ రాజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు, కమిషనర్ నీతుప్రసాద్ కృషి చేయాలని కోరారు. డిసెంబర్‌లోపు ఈ ప్రాంత గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. సాగునీరు, తాగునీరు అందించడంతోనే ఈ ప్రాంత సమస్యలు తీరుతాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతినాయక్, జెడ్పీటీసీ రమేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, వైస్ ఎంపీపీ రామకృష్ణ, గునుగల్, కొత్తపల్లి సర్పంచ్‌లు అచ్చెన మల్లికార్జున్, లతానారాయణరెడ్డి, డీపీఓ పద్మజారాణి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, తహసీల్దార్ పద్మనాభరావు, ఎంపీడీఓ ఉష, ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్, ఈజీఎస్ ఏపీడీ తిరుపతయ్య, ఏపీఓ నాగభూషణం, ఆయా గ్రామాల ఎంపీటీసీలు గడల మాధవి, సంధాని, సర్పంచ్‌లు సత్యపాల్, పాశ్ఛ భాషా, నర్రె మల్లేష్, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
కొల్లాపూర్ మామిడికి ‘ధరా’ఘాతం
► సగానికి పడిపోయిన ధరలు ► మంత్రి చొరవ చూపినా ఎగుమతికి లభించని అనుమతి ► చేతులెత్తేసిన ఏపీఈడీఏ.. లబోదిబోమంటున్న రైతులు సాక్షి, నాగర్‌కర్నూల్: కొల్లాపూర్ మామిడికి సరైన గిట్టుబాటు ధర లభించపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. ఈ ఏడాది మామిడి రైతును గాలివాన బీభత్సం తీవ్రంగా నష్టపరిచింది. మిగిలిన కొద్దిపాటి పంటకు ధర లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ సంస్థానాల నాటి నుంచి మామిడి తోటలకు ప్రసిద్ధిగాంచింది. జిల్లాలో సుమారు 70 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. మూడు లక్షలకు పైగా మామిడి చెట్లనే ఆధారం చేసుకుని రైతులు వేలాది రూపాయల పెట్టుబడి పెట్టారు. గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కొన్నేళ్లుగా రైతులు పట్టుబడుతున్నారు. దీంతో గత ప్రభుత్వం ఏపీఈడీఏ ద్వారా ఇక్కడి మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. రైతుల నుంచి నాణ్యమైన పండ్లను కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తామని ఈ సంస్థ నమ్మబలికి కిలో రూ.50 చొప్పున కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మామిడి వ్యాపారులతో పలు సందర్భాల్లో చర్చలు జరిపారు. అయినప్పటికీ బడా వ్యాపారులు ఎవరి మాటలూ పట్టించుకోవడంలేదు. మామిడి కొనుగోళ్ల సమయంలో ముఖం చాటేశారు. దీంతో ఇక్కడి రైతాంగం నేరుగా హైదరాబాద్‌లోని కొత్తపేట పండ్ల మార్కెట్‌కు పెద్ద మొత్తంలో మామిడిని అమ్మకానికి తరలిస్తున్నారు. అక్కడి వ్యాపారులు వీరికి కిలో రూ.12 నుంచి రూ.25 వరకు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. ఇలా సగానికి పడిపోవడంతో మామిడి రైతు లబోదిబోమంటున్నారు. మంత్రి ఆదేశించినా.. ఇటీవల జిల్లాకు చెందిన మామిడి రైతులు తమను ఆదుకోవాలంటూ హైదరాబాద్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన పండ్ల మార్కెట్‌కు వెళ్లి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. కనీసం రూ.30 ప్రకారం అయినా మామిడిని కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆయన ఒత్తిడికి తట్టుకోలేక వ్యాపారులు ఒకరోజు మొత్తం మార్కెట్‌నే బంద్ పెట్టడంతో గత్యంతరం లేక రైతులంతా వెనుదిరగాల్సి వచ్చింది. -
ఉద్యమంలా ‘ఉపాధి హామీ’
► 18న ప్రతి మండలంలో ఉపాధి పనులపై సమావేశం ► మంత్రి జూపల్లి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధి హామీ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసు కెళ్లాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించా రు. ఉపాధిహామీ పనుల పురోగతిని జిల్లా, మండల స్థాయి అధికారులతో శనివారం ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించా రు. రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, సెర్ప్ ఉద్యోగులు, వీవోఏల సేవలను కూడా ఉపాధి హామీ పథ కం అమలులో వినియోగించుకోవాలని అధి కారులకు మంత్రి సూచించారు. ఈ నెల 18న ప్రతి మండల కేంద్రంలో ఉపాధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్నారు. వచ్చే వారంలో ఉపాధి పనులపై చర్చించేందుకు పంచాయతీ, మండల, జిల్లాపరిషత్ సర్వ సభ్య సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఖాళీ గా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసు కోవాలని కమిషనర్ నీతూకుమారి ప్రసాద్‌ను ఆదేశించారు. జూన్ నెలాఖరులోగా సుమారు 75 రోజులు పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టాలని జూపల్లి అధికారులకు సూచించా రు. జాబ్ కార్డులున్నవారిలో కనీసం 60 శాతం మంది కూలీలకు 100 రోజుల ఉపాధి కల్పించే లక్ష్యంతో పనిచేయాలన్నారు. చెరువు పూడికతీతపనులను ప్రారంభించని అధికారు లపై చర్యలు తీసుకుంటామన్నారు. అలంపూర్‌కు వరం తుమ్మిళ్ల ప్రాజెక్ట్ తుమ్మిళ్ల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు కేబినెట్ ఆమో దం తెలపడంతో గద్వాల జిల్లా అలంపూర్ రైతాంగానికి మంచి రోజులు వచ్చాయని జూపల్లి అన్నారు. సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్)కు చుక్కనీరు కూడా రాకపోవడంతో ఆ ప్రాంత రైతాంగం కుదేలైందన్నారు. ఈ నేపథ్యంలో తుమ్మిళ్ల ఎత్తిపోతలకు మొదటి విడతగా రూ.397 కోట్లు, రెండో విడతలో రూ.386కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, 2018 చివరి నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. వేసవిలోగా వంతెనల నిర్మాణం పీఎంజీఎస్‌వై, నాబార్డ్ నిధులతో చేపట్టిన వంతెనలు, రహదారుల నిర్మాణ పనులను వేసవిలోగా పూర్తి చేయాలని జూపల్లి అధికారులను ఆదేశించారు. రహ దారి, వంతెనల నిర్మాణ పనుల పురోగతిపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో శనివారం మంత్రి సమీక్షిం చారు. నిర్మాణ పనులు నత్తనడకన సాగ డంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిపాలనా అనుమతులు వచ్చిన వారం రోజుల్లోపే అంచనాలు, డిజైనింగ్ పూర్తి చేయాలని, నెల రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని, టెండర్ ప్రక్రియ ముగిసిన 15 రోజుల్లో కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్ ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ నేతలవే కాపీ బతుకులు: జూపల్లి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న ఉచిత ఎరువుల పంపిణీ నిర్ణయం విప్లవాత్మ కమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రధాని, సీఎం తీసుకోని ఇలాంటి నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతించాల్సిందిపోయి మతిభ్రమించే లా మాట్లాడుతున్నాయన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డితో కలసి శనివారం ఆయన టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. ఉచిత ఎరువుల పంపిణీ ఎన్ని కల కోసం తీసుకున్న నిర్ణయం కాదని, ఎన్నికల కోసమే పథకాలు తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ వాళ్లను కాపీ కొట్టాల్సిన ఖర్మ తమకు పట్టలేదని, అసలైన కాపీ బతుకులు కాంగ్రెస్ నేతలవే నన్నారు. విపక్ష నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని గువ్వల హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మాయమవడం ఖాయ మని నారాయణరెడ్డి అన్నారు. -
నాణ్యతా లోపాలను సహించం: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి గ్రామీణ సడక్యోజన (పీఎంజీఎస్‌వై) పథకం కింద చేపట్టిన రహదారుల నిర్మాణంలో నాణ్యతాలోపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. పాత కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరం గల్ జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారు లు, వర్క్ ఏజెన్సీలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. నాబార్డ్, పీఎంజీ ఎస్‌వై నిధులతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించి అడ్డగోలుగా అంచనాలను పెంచినా, పనులు చేయడంలో జాప్యం జరిగినా కఠిన చర్యలు తీసు కుంటామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వర్క్ ఏజెన్సీలకు ఎప్పటికప్పుడు మెమోలు జారీచేయడంతో పాటు, ఆ ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని సూచిం చారు. అనుమతిచ్చిన వారంలోపే పనులు ప్రారంభించాలని, 15 రోజుల్లోగా శంకు స్థాపన జరగాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రహదారులు, వంతెనల పనులన్నీ మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. -
ఢిల్లీ వెళ్లిన కేటీఆర్, జూపల్లి
హైదరాబాద్ : రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మధ్యాహ్నం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో జూపల్లి కృష్ణారావు సమావేశమై ఉపాధి హామీ, ఆసరా పింఛన్లు సహా పలు అంశాలపై చర్చించనున్నారు. -
31 లోగా సిమెంట్ రోడ్లు పూర్తి చేయాలి
అధికారులతో జూపల్లి సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో మంజూరైన సిమెంట్ రహదారుల నిర్మాణ పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని అధికా రులను పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఉపాధి హామీ కింద జరుగు తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనుల పురోగ తిపై మంగళవారం ఆయన సమీక్షించారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని వృథా కాకుండా సద్వినియోగం చేయాలని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం లోనూ పెద్దెత్తున ఉపాధి పనులు చేపట్టేం దుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అధికారులు సమాయత్తం కావాలన్నారు. ప్రపంచవ్యా ప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మంత్రి జూపల్లి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో నడవాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిం చారు. పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
పల్లెల ప్రగతికే గ్రామజ్యోతి: మంత్రి జూపల్లి
హైదరాబాద్ : పల్లె సీమలు స్వయం అభివృద్ధి సాధించాలనన్న ఉద్దేశ్యంతోనే గ్రామజ్యోతి పథకాన్ని ఏర్పాటు చేశామని తెలంగాణ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం ఉదయం శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 2015-16, 2016-17లో రూ. 875 కోట్లు గ్రామజ్యోతి పథకం కింద గ్రామాల అభివృద్ధి పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బీటీ రహదార్లు వేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 4800 కోట్లతో రహదారులు నిర్మించామని తెలిపారు. 8,222 గ్రామాలకు బీటీ రోడ్లు వేశామన్నారు. మిగిలిన 3027 గ్రామాలకు రహదార్లు వేస్తామని ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి డబుల్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. -
అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని అందులో భాగంగానే వీఓఏల వేతనాలను పెంచినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లికృష్ణారావు అన్నారు. బుధవారం స్థానిక రాయల్ ఫంక్షన్హాల్లో ప్రభుత్వం వీఓఏల వేతనాలను పెంచడంపై వీఓఏలు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గా ల అబివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుం దన్నారు. గతంలో వీఓఏలను పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పారు. చాలీ చాలని వేతనాలతో ఇబ్పందులు పడుతు న్న వారికి రూ. 5వేల వేతనం పెంచినట్లు తెలిపారు. ఇందులో రూ.3వేలు నేరుగా ప్రభుత్వ ఖాతా నుంచి రాగా, మిగతా రూ.2 వేలు ఆ స్థానిక మహిళ సంఘాల నుంచి చెల్లించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18వేల మందికి వేతనాలను పెంచినట్లు తెలిపారు. వీఓఏలు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణం గా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తు న్న ప్రతి సంక్షేమ పథకంపై గ్రామాల్లో మహిళలకు అవగాహన కల్పించాలని కోరారు. మహిళలకు పొదు పు మంత్రం నేర్పడంతోపాటు వారి అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన చర్యల గురిం చి కూడా అవగాహన కల్పించాలని కోరా రు. మహిళల్లో అక్షర జ్ఞానాన్ని పెంచేం దుకు కృషిచేయాలని కోరారు. గ్రామాల్లో ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో వచ్చే 5నెలల్లో సంపూర్ణ పారిశుధ్యం సాధించాలని ఇందు కోసం 100శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రొత్సహకాలు ఇస్తోందన్నారు. స్త్రీనిధి నుంచి అడ్వాన్సులను ఇప్పించే ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో మహిళలు చైతన్యం కావాలని ఆ దిశగా వీఓఏలు కృషిచేయాలని అన్నారు. గ్రామాలు స్వయం సంవృద్ధి చెందాలన్నారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేసి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి: ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత వీఓఏలపై ఉందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరిస్తుందని, కొంత ఆలస్యం అవుతుందేమోకాని పరిష్కారం మాత్రం పక్కా అని చెప్పారు. ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. గ్రామీణ వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. అందుకోసం ప్రణాళికలను సిద్ధంచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సమాజం అభివృద్ధి చెందాలనే తపనతో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. అడిగిన ప్రతిఒక్కరికి పని కల్పించేందుకు సీఎం కేసీఆర్పని చేస్తున్నారని ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ కోట్లకిషోర్ అన్నారు. గతంలో నిర్లక్ష్యం చేసిన రంగాలను అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్, డీపీఓ నాగమల్లిక, వీఓఏ సంఘం నాయకులు సత్యనారాయణగౌడ్, నర్సిములు, గోపాల్, శ్రీనివాస్, రాఘవేందర్‌గౌడ్, రాంచంద్రయ్య, కృష్ణ, నర్సిములు తదితరులు పాల్గొన్నారు. -
పుట్టగతులు ఉండవనే విమర్శలు: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్, టీడీపీలకు పుట్టగతులు ఉండవనే భయంతో అడ్డుపడుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ పాలమూరు, రంగారెడ్డి డిజైన్ మార్పుపై కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శలను ఖండించారు. ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉండి ఏమీ చేయని పార్టీల నేతలకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేదన్నారు. -
సోమశిలకు సొబగులు!
టూరిజం అధికారులతో మంత్రి కృష్ణారావు భేటీ సాక్షి, హైదరాబాద్: కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఇప్పటికే బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయగా.. తాజాగా స్వదేశ్ దర్శన్ పథకం క్రింద సోమశిల సర్క్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై టూరిజం కార్పొరేషన్ ఎండీ క్రిస్టీనా జడ్ ఛోంగ్తూ, జీఎం మనోహర్‌లతో మంత్రి చర్చించారు. సోమశిలలో గెస్ట్‌హౌస్‌తో పాటు సింగోటం చెరువులో రెండు డీలక్స్ బోట్ల ఏర్పాటుపై కూడా చర్చించారు. అనంతరం లుంబినీ పార్కుకు చేరుకుని హుస్సేన్‌సాగర్‌లో ఉన్న డీలక్స్ అమెరికన్ బోట్‌ను స్వయంగా జూపల్లి కృష్ణారావు నడిపి పరిశీలించారు. 4 నెలలల్లో రెండు బోట్లను అమెరికా నుంచి తెప్పించి సింగోటంలో ఏర్పాటు చేసేందుకు టూరిజం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌టీడీసీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధిహామీ నిధులతో స్వచ్ఛభారత్ పనులు
మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వచ్ఛభారత్ మిషన్ కింద చేపట్టిన పనులకు ఉపాధిహామీ నిధులను వినియోగించుకోవాలని పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. ము ఖ్యంగా 2018 అక్టోబర్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవలంభించాల్సిన కార్యాచరణపై సోమవా రం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. మరుగుదొడ్ల నిర్మా ణంపై గ్రామీణులను చైతన్యం చేయడంతో పాటు, వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రెం డేళ్లలో అన్ని గ్రామాల్లో వంద శాతం మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టేం దుకు కార్యాచరణ రూ పొందించాలని అధికారులను ఆదేశించారు. ఎంప్లారుుమెంట్ జనరేషన్ అండ్ మార్కె టింగ్ మిషన్ ద్వారా పెద్దఎత్తున యువతకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం పైనా ఆ విభాగం అధికారులతో మంత్రి సమీక్షిం చారు. ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచిం చారు. ఆదేశించారు. -
గ్రామ పంచాయతీల్లో కేరళ తరహా పాలన
► స్థానిక సంస్థలకు విశేషాధికారాలను కల్పించాలని సర్కారు యోచన ► విధివిధానాలపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలను కేరళ తరహాలో స్థానిక ప్రభుత్వాలుగా మలచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పంచాయతీల అభివృద్ధికి కేరళ అవలంభిస్తున్న విధానాలు, చేపట్టిన కార్యక్రమాలను ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఈ మేరకు కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, డెరైక్టర్ నీతూప్రసాద్ అక్కడి పలు గ్రామ, బ్లాక్, జిల్లా పంచాయతీలను సందర్శించిన సంగతి తెలిసిందే. కేరళ తరహాలోనే గ్రామ పంచాయతీలకు పలు విశేషాధికారాలను కల్పించడంతో పాటు, అభివృద్ధికి సూచికలుగా కనిపిస్తున్న కొన్ని కార్యక్రమాలను తెలంగాణలోనూ అమలు చేయాలని జూపల్లి భావిస్తున్నారు. ముఖ్యంగా అక్కడి గ్రామాల్లో ఎక్కడా ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, విద్య, వైద్యం, ఆరోగ్య అంశాల్లో అనుసరిస్తున్న విధానాలపై కసరత్తు చేయాలని రాష్ట్ర అధికారులను ఆయన ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు విధివిధానాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. వాస్తవానికి కేరళలో పంచాయతీల నైసర్గిక స్వరూపం, జనాభా తదితర అంశాల్లో రాష్ట్రంలోని పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉన్నా, సారూప్యత కలిగిన కొన్ని అంశాల్లోనైనా మార్పు తీసుకురావాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తొలుత కొన్ని గ్రామాను పెలైట్‌గా ఎంపిక చేసి, ఫలితాలను సమీక్షించాక రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. కేరళ తరహా పాలన అంటే... కేరళలో ప్రభుత్వమంటే పంచాయతీలే. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన స్థానిక పంచాయతీ వార్డుల్లో జరిగే సభల ద్వారానే కావడం విశేషం. ఇక్కడ గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లు ఉండగా... ఆ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీ, జిల్లా పంచాయతీలున్నాయి. అయితే.. ఆయా పంచాయతీలనే స్థానిక ప్రభుత్వాలుగా అక్కడి ప్రజలు భావిస్తారు. పంచాయతీల పరిధిలో చేపట్టే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ స్థానికేతరుల జోక్యం ఉండ దు. పంచాయతీల పరిధిలో పనిచేసే వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా స్థానిక పంచాయతీ ప్రెసిడెంట్ల నియంత్రణలోనే ఉంటారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు, నిధుల వినియోగానికి జవాబుదారీగా ఉంటారు. రాష్ట్రస్థాయిలో విధానాల రూపకల్ప న మినహా క్షేత్రస్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యం ఉండకపోవడం గమనార్హం. గ్రామ పంచాయతీ లకు ఆదాయ వనరుల విషయానికి వస్తే.. ప్రధానంగా బిల్డింగ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ రూపేణా సొంత వనరులు కలిగి ఉంటాయి. జనాభా ప్రాతిపదికన గ్రామీణాభివృద్ధికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 40 శాతం నిధులను నేరుగా కేటాయిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా గ్రామ పంచాయతీ ఖాతాలకే జమవుతాయి -
రెండేళ్లలో ఇంటింటికీ ఇంకుడుగుంత
⇒ ఉపాధి హామీ పనుల పురోగతిపై సమీక్ష ⇒ మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి జూపల్లి ఆదేశం సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికీ మరుగుదొడ్డితోపాటు ఇంకుడు గుంతను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పనుల పురోగతిపై మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స ద్వారా కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. హరితహారం, ఉపాధి హామీ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనులను జిల్లాల్లో వేగంగా ముందుకు తీసుకెళ్లే దిశగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. 2018 అక్టోబర్ 2 నాటికి మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం వంద శాతం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇటీవల కేరళలోని కొన్ని గ్రామ పంచాయతీలను తాను సందర్శించానని, అక్కడ అంతగా డ్రైనేజీ వ్యవస్థ కనిపించలేదని.. ప్రతి ఇంటిలో ఇంకుడుగుంత, కంపోస్ట్ తయారీ, బయో గ్యాస్, వాన నీటిని బావిలోకి పంపే ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య లోపమే కనిపించలేదని పేర్కొన్నారు. జిల్లాల విభజనతో సులువైన పాలన జిల్లాల విభజన తర్వాత కలెక్టర్లకు పర్యవేక్షణ సులువుగా మారిందని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చేందుకు కలసికట్టుగా పనిచే యాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ, హరితహారం పనులు కొన్ని జిల్లాల్లో లక్ష్యం మేరకు జరగడం లేదన్నారు. కలెక్టర్లు చొరవ చూపి పనుల్లో వేగం పెంచాలన్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంర క్షించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఉ పాధి కూలి కుటుంబానికి 400 మొక్కల పరిర క్షణ బాధ్యతను అప్పగించాలని సూచించారు. నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కలను వీలైనంత త్వరగా నాటేలా చర్యలు తీసుకోవాలని, వచ్చే ఏడాది హరితహారానికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రజలు కోరుకున్న మొక్కలు అక్కడక్కడ అందుబాటులో ఉంచలేకపోయామన్నారు. వచ్చే ఏడాది ఈ పరిస్థితి రాకుండా చూసు కోవడంతోపాటు ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటేందుకు ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. మహిళా సంఘాలను చైతన్యపరిచి, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో వారి భాగస్వామ్యం ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సమా వేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, జాయింట్ కమిషనర్లు బి.సైదులు, ఎస్‌జె ఆషా, జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఏర్పాటుపై కేరళీయుల ఆసక్తి
రాష్ట్ర ప్రభుత్వ పాలనను వివరించిన మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన అంశాలపై కేరళ పంచాయతీరాజ్ అధికారులు అమితాసక్తిని కనబరిచారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు వెళ్లిన మంత్రి జూపల్లి తన రెండ్రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం త్రిశూర్ జిల్లా వెంకిటంగు గ్రామపంచాయతీని సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ సాగించిన ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తదితర అంశాలతో పాటు కొత్త రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారికి మంత్రి వివరించారు. కేరళ స్థానిక పరిపాలన శాఖ మంత్రి కేటీ జలీల్‌తోనూ జూపల్లి బృందం సమావేశమయింది. పర్యటనలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూకుమారి, జాయింట్ కమిషనర్ వెస్లీ ఉన్నారు. -
‘కిలా’కు చేరుకున్న మంత్రి జూపల్లి బృందం
నేడు, రేపు కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం కేరళకు బయల్దేరి వెళ్లిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు త్రిశూర్ జిల్లాలోని కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్(కిలా)కు చేరుకున్నారు. అంతకు ముందు కొచ్చి విమానాశ్రయంలో మంత్రికి శ్రీమూల నగర పంచాయతీ పాలకవర్గం ఘనంగా స్వాగతం పలికింది. ఎయిర్ పోర్టు పరిధిలోని తమ గ్రామాన్ని సందర్శించాలని పంచాయతీ ప్రెసిడెంట్ ఆల్ఫోన్సా వర్గీస్, వైస్ ప్రెసిడెంట్ కేసీ మార్టిన్, సభ్యులు వీవీ సెబాస్టియన్, మంజు తదితరులు మంత్రి జూపల్లి కృష్ణారావును ఆహ్వానించారు. కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరుపై ఎరుుర్ పోర్టు లాంజ్‌లోనే కొంతసేపు గ్రామ పంచాయతీ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. తమ గ్రామంలో దాదాపు 25 వేల జనాభా ఉంటుందని, ప్రతి ఇంటికి ఓపెన్ వెల్స్ ద్వారానే మంచినీటిని సరఫరా చేస్తున్నామని వారు వివరించారు. ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించినట్లు మంత్రికి తెలిపారు. ఎయిర్ పోర్టులో మంత్రి జూపల్లి నేతృత్వంలో వచ్చిన తెలంగాణ అధికారుల బృందానికి ‘కిలా’ప్రొఫెసర్ రామకృష్ణ సాదర స్వాగతం పలికారు. రాత్రికి త్రిసూర్‌లోని కేరళ ఇనిస్టిట్యూట్లోనే బసచేసిన అధికారుల బృందం.. శుక్రవారం ఉదయం కిలా డెరైక్టర్, ఇతర ప్రతినిధులతో భేటి కానుంది. అనంతరం వెంకిటంగు గ్రామ పంచాయతీని జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెస్లీ, శేషాద్రి సందర్శించనున్నారు. శనివారం ఎర్నాకులం జిల్లా పంచాయతీ, ఒట్టపాలం బ్లాక్ పంచాయతీలను బృందం పరిశీలించనుంది. -
గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం
ఎన్ఐఆర్డీలో అంతర్జాతీయ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన జూపల్లి సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాం తాలు అభివృద్ధి చెందడం పైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్ఐఆర్డీ)లో ‘ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్’ అంశంపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ శిక్షణా శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా గ్రామాల్లో పేదరికం ఇంకా పూర్తిగా పోలేదని అన్నారు. ఉపాధిహామీ, పీఎంజీఎస్‌వై, రూరల్ హెల్త్ మిషన్, స్వచ్ఛభారత్ తదితర కార్యక్రమాలను కేంద్రం అమలు చేస్తోందన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింద న్నారు. గ్రామీణాభివృద్ధికి తెలం గాణ రాష్ట్రాన్ని రోల్‌మోడల్‌గా చూపేలా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గ్రామస్థాయిలో వివిధ శాఖలను సమన్వయం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి అన్నారు. నవంబర్ 27వరకు కొనసాగనున్న అంతర్జాతీయ శిక్షణా శిబిరానికి టాంజానియా, నైజీరియా, శ్రీలంక, సూడాన్, జింబాబ్వే, ఫిజి, ఈజిప్ట్, కజికిస్తాన్, మలేషియా, మాల్దీవులు తదితర 20 దేశాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎన్ఐఆర్ డీ డెరైక్టర్ జనరల్ రాంపుల్లారెడ్డి, ఎన్ఐఆర్డీ ప్రతినిధులు శంకర్ ఛటర్జీ, చిన్నాదురై, ఆరుణ జయమణి తదితరులు పాల్గొన్నారు. -
మరింత వేగంగా ‘పల్లె ప్రగతి’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంక్ నిధులతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ పల్లెలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేలా నిర్దిష్టమైన కార్యచరణతో ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతిపై చర్చించేందుకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రపంచ బ్యాంక్ నుంచి తగినన్ని నిధులు సకాలంలో అందించాలని కోరారు. పల్లె ప్రగతితో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇతర గ్రామీణాభివృద్ధి పథకాల అమలు పట్ల ప్రపంచ బ్యాంక్ సౌత్ ఇండియా హెడ్ శోభా శెట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్, డెరైక్టర్ నీతూకుమారి ప్రసాద్, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సీతారామచంద్ర, వినయ్ కుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి
మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం తమ శాఖ కార్యక్రమాలపై అన్ని జిల్లాల డీపీవో, డీఆర్డీవోలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయని అన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పంచాయతీల నిధులు సక్రమంగా వినియోగమయ్యేలా చర్యలు చేపట్టాలని డీపీవోలను ఆదేశించామన్నారు. ఏ గ్రామంలోనైనా అక్రమాలు, అవకతవకలు జరిగాయని తేలితే క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు పర్యవేక్షణాధికారులూ బాధ్యత వహించాల్సిందేనన్నారు. గ్రామాల్లో కొనసాగుతున్న పనులపై జిల్లాల వారీగా 15 రోజుల్లో నివేదికలు సమర్పించాలని డీపీవోలను ఆదేశించామన్నారు. ఒక్కో జిల్లా అధికారి నెలలో 20 రోజుల పాటు కనీసం 20 గ్రామాలను సందర్శించాలని నిర్ధేశించినట్లు మంత్రి జూపల్లి పేర్కొన్నారు. స్త్రీనిధి బ్యాంక్ ద్వారా రూ.600 కోట్ల మేర రుణాలందించి మహిళలకు చేయూతనిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 8,600 గ్రామాలుండగా, ఇప్పటికే 3,000 గ్రామాల్లో కంపూటర్లు అందుబాట్లో ఉన్నాయని, మిగిలిన గ్రామ పంచాయతీల్లో రికార్డులను కూడా కంప్యూటరీకరించి ప్రజలు తెలుసుకునే విధంగా ఆన్లైన్లో ఉంచుతామన్నారు. ఉపాధిహామీ పథకం కింద జాబ్‌కార్డ్ కలిగిన ప్రతి కుటుంబానికి కనీసం 60 రోజుల పని కల్పించాల్సిన బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లదేనని, డిమాండ్ కంటే రెండు రెట్లు పనిని మంజూరు చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు. బిల్లుల భారం పంచాయతీలదే.. మంచినీటి పథకాల నిర్వహణ కోసం వాడుకున్న విద్యుత్ బిల్లులను ఆయా గ్రామ పంచాయతీలే చెల్లించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. త్వరలోనే 14వ ఆర్థిక సంఘం నిధులు అందనున్న నేపథ్యంలో గ్రామ అవసరాలకు తగినట్లుగా వాటిని వినియోగించుకోవాలన్నారు. కాగా, ప్రభుత్వం తలపెట్టిన మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అన్ని వర్గాలకు సంక్షేమ వసతి గృహాలు త దితర పథకాలు పూర్తయితే భ విష్యత్తులో ప్రతిపక్ష పార్టీల చిరునామాలే గల్లంతవుతాయన్నారు. సీపీఎం మహాజన పాదయాత్రను ఉద్దేశించి మంత్రి జూపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, డెరైక్టర్ నీతూ కుమారి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ రామారావు, గ్రామీణాభివృద్ధి జాయింట్ కమిషనర్లు సైదులు, జాన్ వెస్లీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డెరైక్టర్లు బాలయ్య, రాజేశ్వర్‌రెడ్డి, వెంగళరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అరుణ డ్రామాలు ఆడుతున్నారు: జూపల్లి
హైదరాబాద్: రాజీనామా పేరుతో గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ డ్రామాలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే అరుణ తన రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్‌కు అందజేయాలని డిమాండ్ చేశారు. వ్యక్తుల కోసం జిల్లాల విభజన జరగడం లేదన్న విషయాన్ని అరుణ గుర్తించాలని మంత్రి జూపల్లి అన్నారు. ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల విభజన జరుగుతోందని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి గద్వాలలో డీకే అరుణ ఫ్యామిలీ పెత్తనం చేసిందని ఈ సందర్భంగా జూపల్లి ఆరోపించారు. కాగా, గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ నేతల దీక్ష వెనుక రాజకీయ కుట్ర
కొత్త జిల్లాలు ప్రజల సౌకర్యం కోసమే..: మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు చేస్తున్న దీక్ష వెనుక రాజకీయ కుట్ర దాగుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రజల సౌకర్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని.. నాయకులు, పార్టీల కోసం కాదని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా ఉందని కాంగ్రెస్ నేతలు వారి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. గద్వాల, జనగామలను జిల్లాలుగా చేయాలనే డిమాండ్‌తో డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య ఇందిరాపార్కు వద్ద దొంగ దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో జూపల్లి శనివారం ఎమ్మెల్యేలు ఆలె వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాల ఏర్పాటులో టీఆర్ఎస్కు రాజకీయ కోణం ఉంటే సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా అయ్యేదని, అక్కడా ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తి జిల్లా అవుతోందని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ మాత్రం ఆ జాబితాలో లేదన్నారు. ఈ ఉదాహరణలు చాలవా, జిల్లాల ఏర్పాటులో రాజకీయ ప్రయోజనాలు లేవని అర్థం చేసుకోవడానికి అని ప్రశ్నించారు. -
డీకే అరుణ దీక్ష.. ఓ డ్రామా
-
డీకే అరుణ దీక్ష.. ఓ డ్రామా
జిల్లాల కోసం డీకే అరుణ చేపట్టిన దీక్ష ఓ డ్రామా అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తెలంగాణ కోసం ఆమె ఎలాంటి ఉద్యమాలు చేయలేదని అన్నారు. గద్వాలను జిల్లా చేయాలని ప్రజలు కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని జూపల్లి చెప్పారు. రాజకీయాల కోసం ఇప్పుడు జిల్లాల విభజన జరగడం లేదని, కేవలం పరిపాలన పరమైన సౌలభ్యం కోసం మాత్రమే జిల్లాలను విభజిస్తున్నామని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. -
'వాస్తవాలు మరిచి మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి వాస్తవాలు మరిచి మాట్లాడుతున్నారని తెలంగాణ గ్రామాణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో జూపల్లి విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని నేతలందరూ ఇప్పుడు పనిగట్టుకోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలపై తాను బహిరంగ లేఖ రాస్తామన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని జూపల్లి తెలిపారు. -
అటవీ భూముల అన్యాక్రాంతంపై జూపల్లి ఫైర్
హైదరాబాద్: అటవీ భూముల అన్యాక్రాంతంపై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సొంత పార్టీ జెడ్పీటీసీని సస్పెండ్ చేయాలని ఆయన బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు కాసింపై వేటుకు వరంగల్ కలెక్టర్ సిఫారసు చేశారు. తక్షణమే జెడ్పీటీసీని సస్పెండ్ చేయాలని జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. -
నాగం, రేవంత్ తోడు దొంగలు: జూపల్లి
హైదరాబాద్: బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలు ఇద్దరు తోడు దొంగలని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు ఇద్దరు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. బాబును ప్రశ్నించే దమ్ములేని రేవంత్ దీక్షచేయడం హాస్యాస్పదమని జూపల్లి ధ్వజమెత్తారు. ప్రజల కోసం ఏ రోజు కూడా నాగం, రేవంత్‌లు చిత్తశుద్ధితో పని చేయలేదన్నారు. పగటి వేషగాళ్లుగా మారిన వీరిద్దరూ రాజకీయ దురుద్దేశంతోనే కుట్రలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదు. ప్రాజెక్టులు ఆనాడే కట్టి ఉంటే ఈనాడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది కాదన్నారు. వంద శాతం ప్రాజెక్టులు కట్టి తీరుతామని జూపల్లి స్పష్టం చేశారు. -
ఏఈలకు నియామక పత్రాలు అందజేసిన జూపల్లి
హైదరాబాద్ : భవనాలు లేని పంచాయతీలకు భవనాలు నిర్మిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో పంచాయతీరాజ్‌లో ఎంపికైన 392 మందికి మంత్రి జూపల్లి కృష్ణారావు నియామక పత్రాలు అందజేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రహదార్లు వేయిస్తామని జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. -
కరువు రహిత జిల్లాగా పాలమూరు
ఆత్మకూర్ : సీమాంధ్ర పాలకుల పాలనలో కరువు కాటకాలతో అల్లాడిన పాలమూరు కరువు రహిత జిల్లాగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఉదయం ఆత్మకూర్ పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ హెడ్‌రెగ్యులేటర్, ప్రధాన ఎడమకాల్వ మీదుగా వెళ్లి రామన్‌పాడు రిజర్వాయర్‌కు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు మూడు రోజులపాటు ప్రాజెక్టుల బాటలో భాగంగా ప్రాజెక్టులను సందర్శించి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ళ్లనున్నట్లు తెలిపారు. ఈ ఖరీఫ్‌లో 4.5 లక్షల ఎకరాలకు, వచ్చే ఖరీఫ్ నాటికి జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషిచేస్తున్నామన్నారు. రామన్‌పాడు రిజర్వాయర్ షెట్టర్ల లీకేజీలను సరిచేయాలని అధికారులకు సూచించారు. అలాగే పుష్కరఘాట్ల నిర్మాణాలు పరిశీలించి ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ భాస్కర్, ప్రాజెక్టుల సీఈ ఖగేందర్, ఎంపీపీ శ్రీధర్‌గౌడ్ పాల్గొన్నారు. సౌకర్యాలు కల్పించాలి.. మండలంలోని శ్రీరంగాపూర్ రంగసముద్రం రిజర్వాయర్‌లో ముంపునకు గురవతున్న నాగరాల, పాక్షికంగా మునుగుతున్న శ్రీరంగాపూర్ రాజులగుట్ట ప్రాంతాన్ని మంత్రి జూపల్లి, జెడ్పీచైర్మన్ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినా పునరావాస కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. వెంటనే అన్ని సౌకర్యాలు కల్పించి ముంపు గ్రామాలను ఖాళీ చేయించాలని అధికారులను మం త్రి ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీరంగాపూర్ గ్రామస్తులు తమ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని, కంచిరావుపల్లి నుంచి శ్రీరంగాపూర్ వరకు డబుల్‌లైన్ రోడ్డు మంజూరు చేయాలని మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామచందర్, సర్పంచ్‌లు వెంకటస్వామి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి జూపల్లిని అడ్డుకున్న విద్యార్థి జేఏసీ
ప్రొఫెసర్ కోదండరాంపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్‌నగర్‌లో గురువారం మంత్రి కాన్వాయ్‌ని విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. కోదండరామ్‌పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని కోదండరాం ప్రభుత్వంపై సందిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. -
వేతనాలపై వేటు!
– ఉపాధి సిబ్బందికి జీతాలు నిలిపేసిన యంత్రాంగం – లక్ష్యసాధనలో వెనుకబాటుకు ఫలితం – దాదాపు 200 మంది ఉద్యోగులకు నిలిచిన చెల్లింపులు – ఇకపై నెలవారీ లక్ష్యాల ఆధారంగానే జీతభత్యాలు మంత్రి సూచనలు, ఆదేశాలను జిల్లా యంత్రాంగం ఆచరణలో పెట్టింది. నెలవారీ లక్ష్యాలు సాధించని ఉద్యోగులపై కొరడా ఝళిపిస్తోంది. ఇందులో భాగంగా తొలుత వేతనాలు నిలిపివేసింది. క్రమంగా వారి పరితీరును విశ్లేషిస్తూ చర్యలు తీవ్రతరం చేసేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ అడుగులు వేస్తోంది. ఉపాధి హామీ పథకంలో పనితీరు ఆధారంగానే ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. వారికి నిర్దేశించిన లక్ష్యాలు.. సాధించిన పురోగతినే పరిగణనలోకి తీసుకుంటాం. నెలవారీ లక్ష్యాలు సాధించకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయి. అలాంటి ఉద్యోగులను ఉపేక్షించేది లేదు. - గత నెలలో జరిగిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, రంగారెడ్డి జిల్లా: కరువు నేపథ్యంలో ప్రతి కూలీకి పని కల్పించేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఉద్యోగులకు లక్ష్యాలను నిర్దేశించింది. కూలీలకు అవగాహన కల్పించడంతో పాటు వారికి సకాలంలో పని కల్పించాలని ఆదేశించిన ఆ శాఖ.. లక్ష్యసాధనలో వెనుకబడిన వారికి తాజాగా షాక్ ఇచ్చింది. మే నెలకు సంబంధించి వేతనాలు నిలిపివేసింది. సాధారణంగా ఒకటో తేదీన ఉద్యోగుల ఖాతాల్లో వేతన డబ్బులు జమ కావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఏడో తేదీ కావస్తున్నా వారి ఖాతాల్లో నిధులు జమకాకపోవడం గమనార్హం. పని కల్పించడంలో అలసత్వం.. కూలీలకు వందరోజుల పని కల్పించేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. కరువు నేపథ్యంలో ఇందుకు అదనంగా మరో 50రోజుల పనిదినాలు కల్పించేందుకు కేంద్రం సైతం నిబంధనలు సడలించింది. వానాకాలంలోపు లక్ష్యాలు అధిగమించాలని నిర్దేశించినప్పటికీ జిల్లాలోని పలు మండలాల్లో సాధన వెనకబడింది. అదేవిధంగా హరితహారం పథకం కింద మొక్కల పెంపకానికి సంబంధించి నిర్వహణ చెల్లింపుల్లో సిబ్బంది అలసత్వం తోడైంది. దీంతో ఆయా మండలాల్లోని సాంకేతిక సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, ప్లాంటింగ్ సూపర్వైజర్ల వేతనాలకు బ్రేక్ పడింది. మే నెలలో నిర్దేశించిన పని దినాలను వందశాతం పూర్తి చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 57.19లక్షల పని దినాలకు కూలీలకు కల్పించాల్సి ఉండగా.. నెలాఖరు నాటికి కేవలం 49.32లక్షల పనిదినాలు మాత్రమే కల్పించారు. నిర్దేశించిన లక్ష్యంలో 86.25శాతం పురోగతి నమోదైంది. కొన్ని మండలాల్లో వందకంటే ఎక్కువ స్థాయిలో పనిదినాలు కల్పించడంతో పురోగతి మెరుగ్గా ఉంది. కానీ వందశాతం పురోగతి లేని మండలాల్లోని సిబ్బంది వేతనాలపై వేటుపడింది. చేవెళ్ల, దోమ, గండీడ్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కుల్కచర్ల, మహేశ్వరం, పూడూరు, షాబాద్, శంకర్పల్లి, తాండూరు, యాచారం మండలాల్లో పురోగతి 60శాతం కంటే తక్కువగా ఉంది. అనుసంధానం కాలేదని... జాబ్‌కార్డు పొందిన ప్రతి కూలీ ఆధార్ వివరాలను ఈజీఎస్ సాఫ్ట్‌వేర్‌లో అనుసంధానం చేయాల్సి ఉంది. దాదాపు రెండు నెలలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నప్పటికీ జిల్లాలో ఆశించినస్థాయిలో పురోగతి లేదు. జిల్లావ్యాప్తంగా జాబ్‌కార్డ్ పొందిన వారు 4,07,623 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 52,809 మంది ఆధార్ వివరాలు మాత్రమే ఆన్లైన్లో అనుసంధానం చేశారు. నిర్దేశిత లక్ష్యంలో కేవలం 12.96శాతం మాత్రమే సాధ న కనిపిస్తుంది. జిల్లా సగటు కంటే తక్కువగా ధారూర్, కందుకూరు, కుల్చచర్ల, పూడూరు, వికారాబాద్, యాలాల మండలాల్లో ఆధార్ నమోదు జరిగింది. ఈ మండలాల్లో పదిశాతం కంటే తక్కువగా సీడింగ్ జరగడంతో ఈ మండలాల్లోని సహాయ ప్రాజెక్టు అధికారులకు వేతనాలు నిలిపివేశారు. అయితే వేతనాలు నిలిపివేసిన ఉద్యోగులకు మరో అవకాశం కల్పించాలని యంత్రాంగం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రెండు రోజుల్లో వారికి వేతనాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
ప్రజావసరాలను తీర్చేలా పంచాయతీలు
గ్రామీణాభివృద్ధిపై వర్క్‌షాప్‌లో మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లోని ప్రజల అసరాలను తీర్చగలిగేలా పంచాయతీలు స్వయంసమృద్ధి సాధించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. గ్రామ సభల్లో స్థానిక ప్రజలను భాగస్వాములను చేసి వారు కోరుకుంటున్న విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శనివారం తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (టిసిపార్డ్)లో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం.. తదితర అంశాలు ప్రధాన సమస్యలుగా కనిపిస్తున్నాయని, ఆయా సమస్యలను పరిష్కరించేందుకు గ్రామసభలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు సర్పంచు లు, కార్యదర్శులు శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిని గ్రామాల్లో అర్హులైన వారికి అందేలా చూడాల్సిన బాధ్యత సర్పంచులదేనన్నారు. 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు, పంచాయతీల సొంత వనరులు, ఉపాధి హామీ నుంచి అందే నిధులతో గ్రామాభివృద్ధికి ప్రణాళికలు సిధ్ధం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి, శిక్షణ పూర్తిచేసుకున్న వారికి తగిన సంస్థలలో ఉపాధి అవకాశాలను కల్పించాలని గ్రామీణాభివృద్ధి విభాగం అధికారులను మంత్రి ఆదేశించారు. పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ మాట్లాడుతూ.. తాగు నీరు, పారిశుధ్యం సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులను విడుదల చేసిందని, వాటిని వీలైనంత త్వరగా ఖర్చు చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గ్రామ పంచాయతీలను పటిష్ట పరిచేందుకు ఉపాధిహామీ పథకం నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని డెరైక్టర్ అనితారాంచంద్రన్ సూచించారు. -
ఉపాధి పనులపై ‘జూపల్లి’ ఆరా!
► శనిగరంలో కూలీలతో భేటీ ► కోహెడ ఎంపీడీవో, టెక్నికల్ అసిస్టెంట్‌పై బదిలీ వేటు ► ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్ ► మాదాపూర్‌లో ఇంకుడుగుంతల పరిశీలన కోహెడ/బెజ్జంకి : జిల్లాలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరా తీశారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయన ముందుగా కోహెడ మండలం శనిగరంలోని కోసగుట్ట వద్ద ఉపాధి పథకం కింద చేపట్టిన ఊటకుంటను ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం గ్రామంలో చేపట్టిన పనులు, కూలీల సమస్యలపై సమీక్షించారు. పనికి తగ్గ కూలి రావడంలేదని, డబ్బులు సకాలంలో అందడం లేదని కూలీలు కొమురవ్వ, రాజు తదితరులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రోజుకు ఆరు గంటలు పనిచేస్తున్నా.. కూలి రూ.65 నుంచి రూ.70కి మించి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కాస్తా డబ్బులైనా నెలరోజులు గడవందే చెల్లించడంలేదని పేర్కొన్నారు. గతేడాది ఏడుగురు కూలీలకు మాత్రమే వంద రోజుల పని కల్పించారని, మిగిలిన వారెవరికీ పనులు చూపలేదని వివరించారు. గ్రామంలో 1300 కుటుంబాలు ఉం డడం.. 672 మందికి మాత్రమే జాబ్‌కార్డులు మంజూరుచేయడంపై డ్వామా పీడీ వైవీ.గణేశ్ ను మందలించారు. మండలంలో కరువు ఉ న్నా.. కూలీలకు పనులు ఎందుకు కల్పించలేద ని ప్రశ్నించారు. కూలీలకు వేతనాల చెల్లింపులో నిర్లక్ష్యం, పనులు గుర్తించడంలో క్షేత్రస్థారుులో అలసత్వం ప్రదర్శించినట్లు గుర్తించి ఎంపీడీవో చెట్టి శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ భాస్కర్‌ను బదిలీ చేయూలని పీడీని ఆదేశించారు. అలాగే కూలీలకు పని కల్పించని కారణంగా ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేశంను సస్పెండ్‌కు ఆదేశించారు. మాదాపూర్‌లో మొక్కల పరిశీలన బెజ్జంకి మండలం మాదాపూర్‌కు వెళ్లిన మంత్రి జూపల్లి.. అక్కడ ఉపాధి పథకం కింద పెంచుతున్న మామిడిమొక్కలను పరిశీలించారు. ఇం కుడుగుంతల ప్రగతిపై ఆరా తీశారు. నీటి సౌకర్యం లేక మొక్కలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. మామిడితోటకు నీరు పెట్టేందుకు బోరు మం జూరు చేరుుంచాలని అదే గ్రామానికి చెందిన రైతులు కుమ్మరి సుగుణ, నర్సయ్య కోరారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే పథకాలతోనే కడుపు నిండదని, రైతులకు పంట పండితేనే అందరి కడుపులూ నిండుతాయని పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో ఒడిదుడుకులు ఉన్నాయని, ప్రత్యామ్నా య మార్గాలు అన్వేషించి..వాటిని అధిగమిం చాలని సూచిం చారు. కరువును ఎదుర్కొనేందుకు సీఎం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని, ఇందులోభాగంగానే జిల్లాలో విరివిగా ప్రాజెకు ్టలు నిర్మిం చేందుకు సిద్ధపడుతున్నారని పేర్కొన్నారు. మాదాపూర్‌కు నిధులు మాదాపూర్‌లో సాధించిన ప్రగతిని సర్పంచ్ రవీందర్‌రెడ్డి మంత్రికి వివరించారు. గ్రామం లో 100 శాతం ఇంకుడుగుంతలు, మరుగుదొ డ్లు, ఇంటిపన్ను వసూలు, అక్షరాస్యత సాధించామని, మరిన్ని నిధులు మంజూరు చేస్తే మరింత ముందుకెళ్తామని వివరించారు. స్పందించిన మంత్రులు సీసీ రోడ్ల నిర్మాణాల కు రూ.30లక్షలు, వీవో భవన నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేశారు. గ్రామంలో రూ.40 లక్షల పనులు చేస్తే అదనంగా మరో రూ.16 లక్షల పనులకు మంజూరు ఇస్తామన్నా రు. కార్యక్రమాల్లో రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మ న్ రసమయి బాలకిషన్, హుస్నాబాద్ ఎమ్మె ల్యే వొడితెల సతీశ్‌కుమార్, జెడ్పీచైర్‌పర్సన్ తుల, జెడ్పీ వైస్ చైర్మన్ రారుురెడ్డి రాజిరెడ్డి, జెడ్పీటీసీలు పొన్నాల లక్ష్మణ్, తన్నీరు శరత్‌రావు, ఎంపీపీ ఒగ్గు దామోదర్, ఉప్పుల స్వా మి, తహసీల్దార్లు ఎస్కె.ఆరిఫా, ఈశ్వరయ్య, సర్పంచులు గాజే శ్రీధర్, మాడుగుల రవీందర్‌రెడ్డి, కోహెడ పీఏసీఎస్ చైర్మన్ కర్ర శ్రీహరి, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
మంత్రి జూపల్లితో నమ్రత శిరోద్కర్ భేటీ
హైదరాబాద్ : హీరో మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోమవారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామ అభివృద్ధిపై ఆమె ఈ సందర్భంగా మంత్రిలో భేటీ అయ్యారు. మహేశ్ బాబు సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి కూడా పాల్గొన్నారు. సిద్దాపూర్ అభివృద్ధికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. కలెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ ఆరోగ్యం, పరిశుభ్రత, స్కూల్ అభివృద్ధిపై నమత్ర ఆసక్తి చూపినట్లు చెప్పారు. మరోవైపు మంత్రితో భేటీ అనంతరం నమ్రత మాట్లాడుతూ సిద్దాపూర్ను స్మార్ట్ విలేజ్‌గా మార్చుతామని తెలిపారు. సిద్దాపూర్ గ్రామ అభివృద్ద్ధికి సమగ్ర ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు వివరించారు. కాగా కొద్దిరోజుల క్రితం ఆమె సిద్దాపూర్ గ్రామాన్ని సందర్శించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామం ఎదుర్కొంటున్న సమస్యలను సర్పంచ్ నర్సమ్మ నమత్ర శిరోద్కర్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలపై నమ్రతకు ఓ వినతిపత్రం సమర్పించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ మహేష్ బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. మహేష్ తండ్రి కృష్ణ సొంతూరు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని, అక్కడ ఇటీవలే ప్రిన్స్ పర్యటించాడు. సొంత ఊరుకు ఏదైనా చేయకపోతే లావైపోతాం అన్న సందేశాన్ని చాటిన 'శ్రీమంతుడు' సినిమాకు ముందే మహేష్‌బాబు బుర్రిపాలెంను దత్తత తీసుకున్నాడు. -
నగర పంచాయతీలకు ఉపాధి హామీ
♦ కేంద్రానికి లేఖ రాయాలని ♦ అధికారులకు జూపల్లి ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీల్లోనూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ఉపాధి పనులను కల్పించాలని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలకు సం బంధించిన కార్యక్రమాలపై శనివారం ఆయన సమీక్షించారు. గత నెలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 నగర పంచాయతీల్లో ఉపాధి హామీ పనులను నిలిపివేయడంతో కూలీలు ఇబ్బందు లు పడుతున్నారని జూపల్లి చెప్పారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులున్న కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఈ పథకం కింద 50 అదనపు పనిదినాలను కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ అంశాలను ఇటీవల నగరానికి వచ్చిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. దీనికి అధికారికంగా అనుమతి కోసం కేంద్రానికి వెంటనే లేఖ రాయాలని అధికారులను జూపల్లి ఆదేశించారు. లక్ష్యాలను చేరకుంటే ఇంటికే... కూలీలకు ఉపాధి పనులు కల్పించడంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు లక్ష్యాలను నిర్దేశించాలని, ప్రతి గ్రామంలోనూ 200 శాతం పనులను సిద్ధంగా ఉంచాలని జూపల్లి సూచించారు. ప్రతి గ్రామంలోనూ జాబ్‌కార్డులు కలిగిన వారిలో కనీసం 50 శాతం మందికి పనులు కల్పించడాన్ని టార్గెట్‌గా నిర్దేశించాలని, లక్ష్యాలను చేరడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీసింగ్, డెరైక్టర్ అనితా రాంచంద్రన్, ఈఎన్సీ సత్యనారాయణరెడ్డి, డిప్యూ టీ కలెక్టర్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. వేతనాలు వెంటనే చెల్లిస్తాం... స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అర్నెల్ల వేతన బకాయిలను వెంటనే చెల్లించే ఏర్పాటు చేస్తానని శనివారం తనను కలసిన ఎంపీటీసీల ఫోరం ప్రతినిధులకు జూపల్లి హామీ ఇచ్చారు. మంత్రిని కలసిన వారిలో తెలంగాణ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్, ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు తులా బాలయ్య, సునీత సంజీవ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం
గ్రావు పంచాయుతీల్లో పన్నుల వసూళ్లు 100 శాతం పారదర్శకంగా జరగాలి. మేడ్చల్ రూరల్ : ‘పన్నుల విధింపు, ఆస్తి విలువ లెక్కింపు తదితర అంశాలపై అవగాహన లేకుంటే ఎలా..? సాధారణ అంశాలపై కనీస అవగాహన లేకుంటే ఎలా.. గ్రామాధికారులుగా మీరేం చేస్తున్నా రు..’ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బిల్‌కలెక్టర్, గ్రామకార్యదర్శిలకు చురకలంటించారు. శని వారం ఆయన మండలంలోని ఎల్లంపే ట్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయుతీ కార్యాల యుంలో రికార్డులు పరిశీలించారు. గ్రా వుంలో ఎన్ని కుటుంబాలు ఉన్నారుు? వంద శాతం వురుగుదొడ్లు ఉన్నాయూ? లేవా? పన్నులు వసూలు ఏవిధంగా ఉంది? తదితర అంశాలపై బిల్‌కలెక్టర్ తిరుపతిరెడ్డి, కార్యదర్శి నరసింహులను మంత్రి ప్రశ్నించారు. ఇందుకు వారు సమాధానమిస్తూ 90 కుటుంబాలు మ రుగుదొడ్లు లేవని చెప్పడంతో.. ‘గ్రామ అధికారులుగా ఉన్న మీరు ఏం చేస్తున్నారు..? వంద శాతం పూర్తి చేసే బాధ్యత మీదే’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రి కార్డులను పరిశీలిస్తుండగా.. గ్రావు పరిధిలోని ఆర్కే డిస్టిలర్స్ కంపెనీ పన్ను బకారుు ఉన్నట్లు తేలడంతో ఇంత వ రకు ఎందుకు వారి నుంచి పన్ను వసూ లు చేయలేదని ప్రశ్నించారు. ఇం దుకు వారి నుంచి సమాధానం రాకపోవడం తో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసిన పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. అనంతరం శానిటేషన్‌పై సమీక్షించారు. అనంతరం గ్రామం లో ఏవైనా సమస్యలున్నాయా.. అంటూ సర్పంచ్ చిన్నలింగం, ఎంపీటీసీ సభ్యురాలు రేణుకలను ప్రశ్నించారు. కాగా.. గ్రావుంలో నీటి సవుస్య తీవ్రంగా ఉం దని తెలుపగా సవుస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కార్యదర్శి న ర్సింహ, బిల్‌కలెక్టర్ తిరుపతిరెడ్డి, వార్డు సభ్యులు కువూర్లు పాల్గొన్నారు. -
పల్లెల అభివృద్ధికి కృషిచేస్తా: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేశానని, ఇకపై పల్లెలను అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొత్త బాధ్యతలు అప్పగించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపా రు. శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు మంగళవారం సచివాలయంలో జూపల్లిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలను, ప్రజాప్రతినిధులను కలుపుకుపోతానని, పరిపాలనలో కొత్త ఒరవడితో ముందుకు వెళతానని జూపల్లి చెప్పారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంలో భాగంగా మహిళలు చదువు నేర్చుకునేలా కృషి చేస్తానన్నారు. గ్రామీణ పేదలకు వందశాతం ఉపాధి పనులు అందేలా చూస్తానన్నారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో పంచాయతీరాజ్ విభాగం డెరైక్టర్ అనితారాం చంద్రన్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి, ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు భూమన్న తదితరులున్నారు. -
ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి
విద్యార్థులకు ఢిల్లీ ఐఐటీ డెరైక్టర్ రాంగోపాల్‌రావు పిలుపు జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి: మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల కోసం వెంపర్లాడకూడదని.. ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని ఢిల్లీ ఐఐటీ డెరైక్టర్ వి.రాంగోపాల్ రావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆ దిశగా ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలన్నారు. ప్రస్తుతం క్యాంపస్ ప్లేస్మెంట్లే లక్ష్యంగానే విద్యార్థులు కళాశాలల్లో అడుగు పెడుతున్నారని పేర్కొన్నారు. కోర్సుల ఎంపికల నుంచే ఆ ధోరణి మొదలవుతోందన్నారు. చివరకు ఐఐటీల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని ఆవేదన చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన రాంగోపాల్‌రావు ఇటీవల ఐఐటీ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ పూర్వ విద్యార్థుల సంఘం (కోసా) ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాంగోపాల్ రావు భారత జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మారుమూల ప్రాంతమైన కొల్లాపూర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి భావితరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. రాంగోపాల్ రావు చేసిన పరిశోధనలు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోపడుతున్నాయన్నారు. బంగారు తెలంగాణ కోసం, నిరుద్యోగ యువత, రైతుల కోసం ఆయన సేవలను సద్వినియోగం చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో చుక్కా రామయ్య, గాయకుడు దేశపతి శ్రీనివాస్, కోసా ఫౌండర్ ఖాజా మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
జూపల్లి... జూలో పిల్లి: డీకే అరుణ
హైదరాబాద్: జూలో పిల్లి లాంటి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే డి.కె.అరుణ వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారే జూపల్లికి తన ను విమర్శించే స్థాయి లేదన్నారు. స్థాయి, వ్యక్తిత్వం లేని ఆయన మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడితే స్పందిస్తానని అరుణ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, రీడిజైన్లు, అంచనాలు వంటి వాటిలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. అక్ర మాలు అడ్డుకోవడానికి కాపలా కుక్కల్లా పనిచేస్తామని ఆమె అన్నారు. -
బంగారు తెలంగాణకు బాటలెయ్యండి
♦ స్థానికులకు ఉపాధి కల్పించాలని పరిశ్రమలకు మంత్రి జూపల్లి పిలుపు ♦ ఆరో విడతలో 18 పరిశ్రమలకు అనుమతి పత్రాలు అందజేత ♦ రూ.2,167 కోట్ల పెట్టుబడులు, 13,817 మందికి ఉపాధి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు స్థానికులకు ఉపాధి కల్పించడం ద్వారా బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం(టీఎస్ఐపాస్)లో భాగంగా ఆరో విడతలో నూతనంగా ఏర్పాటయ్యే 18 పరిశ్రమల ప్రతినిధులకు అనుమతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని డీ బ్లాక్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల పరిధిలో రూ.2,167.47 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమల ద్వారా 13,817 మందికిఉపాధి దక్కుతుందని జూపల్లి వెల్లడించారు. ఈ పరిశ్రమల్లో కాగ్నిజెంట్ టెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.655 కోట్ల పెట్టుబడులకు ముందుకు రాగా 8,500 మందికి ఉపాధి ఇవ్వనుందని వివరించారు. వీటితో పాటు ఒప్పందాలు చేసుకున్న ప్రముఖ పరిశ్రమల్లో ఐటీసీ, విన్సోల్, కెమో ఇండియా, సురానా, ఎర్త్ సోలార్ మొదలైనవి ఉన్నాయన్నారు. ఆరు విడతల్లో జరిగిన ఒప్పందాలతో కలిపి మొత్తంగా రూ.33,101 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటిద్వారా 1,20,169 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల్లో పరిశ్రమల అనుమతులకు కనీసం 45 రోజులు పడుతుండగా, టీఎస్ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామన్నారు. అనుమతుల్లో జాప్యం మూలంగా పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే ఏ ఒక్క పారిశ్రామికవేత్త ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎలాంటి ఆటంకాలు, అవినీతి లేని పారిశ్రామిక విధానానికి దేశ, విదేశాల్లో ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక రాయబారులుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రం బంగారు తెలంగాణగా ఆవిర్భవించడం ఖాయమని జూపల్లి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి వీలైనంత త్వరగా ప్రోత్సాహకాలు అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా అనుమతులు అందుకున్న పారిశ్రామిక వేత్తలు టీఎస్ఐపాస్పై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. గతంలో కంటే భిన్నంగా అధికారులే ముందుకు వచ్చి అనుమతులు ఇస్తున్నారని, తక్కువ సమయంలోనే ఆదేశాలు జారీ చేసి పరిశ్రమల స్థాపనకు మెరుగైన వాతావరణం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్ఐపాస్ ఎండీ వెంకట నరసింహారెడ్డి, జాయింట్ సెక్రటరీ సైదా, అడిషనల్ డెరైక్టర్ దేవానంద్ పాల్గొన్నారు. -
అభివృద్ధికే మొదటి ప్రాధాన్యం
మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ : అభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పంచాయతీరాజ్ నిధుల ద్వారా *4.14 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారుల విస్తరణపై ప్రజల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మంత్రి ఆదివారం ఉదయం కొల్లాపూర్ పట్టణంలో పలు కాలనీల్లో పర్యటించారు. రాజవీధిలోని జమ్మిచెట్టు వద్ద, అంబేద్కర్ కాలనీల్లో చేపట్టే సీసీ రోడ్లకు భూమిపూజ చేశారు. అనంతరం కేఎల్ఐ అతిథిగృహంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. అంబేద్కర్ కాలనీ నుంచి రంగదాసు వీధి వరకు 30 ఫీట్ల మేరకు సీసీ రోడ్డు నిర్మిస్తామని, మిగతాప్రాంతాల్లో 40 ఫీట్ల వెడల్పుతో పనులు చేయిస్తామన్నారు. రోడ్ల విస్తరణలో రాజీ పడేది లేదని, నిర్ణీత వెడల్పు రోడ్ల నిర్మాణానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. త్వరలో బైపాస్ పనులు కొల్లాపూర్ నుంచి సోమశిల వరకు *10 కోట్లతో డబుల్‌లేన్ రహదారి నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కొల్లాపూర్ నుంచి వెల్గొండ పెబ్బేర్, కేతేపల్లి - వనపర్తి, కోడేరు -నాగర్‌కర్నూల్, నాగులపల్లి -గోపాల్పేట్ మీదుగా వనపర్తి వరకు 106 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ రహదారి పనులు కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పారు. కొల్లాపూర్ పట్టణ సమీపంలో బైపాస్ రహదారి నిర్మించేందుకు భూసేకరణ పనులు జరుగుతున్నాయని, పుష్కరాల్లోగా రూ.19 కోట్లతో ఈ పనులు పూర్తి చేయిస్తామన్నారు. -
లాలాజలంతో మధుమేహంగుర్తింపు
పరిశ్రమను ప్రారంభించిన మంత్రి జూపల్లి తూప్రాన్: లాలాజలంతో మధుమేహ వ్యాధిని గుర్తించే సాంకేతిక సామర్థ్యంతో ప్రపంచంలోనే ప్రప్రథమంగా మెదక్ జిల్లా తూప్రాన్‌లో పరిశ్రమను నెలకొల్పడం చరిత్రాత్మకమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులోని ఇండ్రస్ట్రియల్ పార్కులో నూతనంగా నెలకొల్పిన డయాబెట్ ఓమిక్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు.అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలో అనేకమంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని, వ్యాధి నిర్ధారణకే వేల రూపాయలు వెచ్చిస్తున్నారన్నారు. ఈ వ్యాధిని తక్కువ ఖర్చుతో గుర్తించేందుకు డయాబెట్ ఓమిక్స్ పరిశ్రమ నిర్వాహకులు ఒక చిన్న స్టిక్‌ను కనిపెట్టినట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులు ఇంట్లోనే ఉండి ఈ స్టిక్ సాయంతో షుగర్ వ్యాధిని గుర్తించుకోవచ్చన్నారు. ఈ పరిశ్రమ వచ్చే 14 నెలల్లో ఉత్పత్తిని ప్రారంభిస్తుందన్నారు. పరిశ్రమ నిర్వాహకులు, శాంతాబయోటిక్ ఎండీ వరప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జపాన్, సింగపూర్ తరహాలో రాణించాలి
ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2016ను ప్రారంభించిన మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: జపాన్, సింగపూర్, ఇజ్రాయిల్ వంటి దేశాలకు పరిమిత వనరులున్నా వాటి ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో మన్ననలు పొందాయని, అదే తరహాలో రాష్ట్రానికి చెందిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈలు) విజయం సాధించాలని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నగరంలో రెండు రోజుల పాటు జరిగే జాతీయ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎంఎస్ఎఈ ఎక్స్పో- 2016)ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఎగుమతులు, దిగుమతుల సమాచారాన్ని క్రోడీకరించి రాష్ట్రం నుంచి ఎగుమతులకు ఉన్న అవకాశాలను గురిస్తామన్నారు. నాణ్యత, మన్నికకు పెద్దపీట వేస్తూ స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను ప్రోత్సహించాల్సి ఉందన్నారు. ఎక్స్పో -2016 తరహాలో జిల్లాస్థాయిలోనూ ప్రదర్శనలు, కార్యక్రమాలు నిర్వహించాలని జూపల్లి సూచించారు. పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని, టీఎస్ఐపాస్ పారిశ్రామిక విధానం ద్వారా ఎంతో పారదర్శకతతో 356 పరిశ్రమలకు అనుమతి ఇచ్చి రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో 90 వేల మందికి ఉదోగ్య అవకాశాలు కల్పించామని చెప్పారు. తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, కాన్ఫడరేషన్ ఆఫ్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గిరిజారెడ్డి, బీహెచ్ఈఎల్ జీఎం ఆర్.పార్థసారథి, ఎంఎస్ఎంఈ బాలానగర్ డెరైక్టర్ డి.చంద్రశేఖర్, డిప్యూటీ డెరైక్టర్ బి.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'ఆ రెండింటిలోనూ మాదే గెలుపు'
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే కాదు నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికలోనూ గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో జూపల్లి విలేకర్లతో మాట్లాడుతూ... ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనైతిక పొత్తులు పెట్టుకుందని ఆరోపించారు. చివరకు కాంగ్రెస్ పార్టీ టీడీపీ, బీజేపీతో కూడా కుమ్మక్కైందని విమర్శించారు. భవిష్యత్‌లో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ అడ్రస్ గల్లంతు అవుతాయని జూపల్లి కృష్ణారావు తెలిపారు. -
రాష్ట్రంలో మెరుగైన వైద్య సౌకర్యాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలను అందిస్తున్నాయని అమెరికా వైద్య సౌకర్యాల పరిశోధనా సంస్థ గిలీడ్ సెన్సైస్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులు.. ప్రైవేటురంగంలోని స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గిలీడ్ సెన్సైస్ ప్రతినిధులు శనివారం సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. వారితో కలసి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రస్తుతం మండల కేంద్రాల్లోనూ ప్రైవేటు ఆసుపత్రులు ఏర్పాటవుతున్నాయని... కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు విదేశాల్లోని వైద్య నిపుణులను టెలిమెడిసిన్ ద్వారా సంప్రదిస్తూ వైద్యం అందిస్తున్నాయని వివరించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మెరుగైన వైద్యం కోసం రోగులు హైదరాబాద్‌కు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య సౌకర్యాల రంగంలో తమ గిలీడ్ సెన్సైస్ సంస్థ ప్రత్యేకతలను ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌కు వివరించింది. ప్రపంచంలోనే అతి పెద్ద బయో ఫార్మాస్యూటికల్ కంపెనీగా పేరొందిన తమ సంస్థ... 16 దేశాలతోపాటు తెలంగాణలోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వైద్య, ఆరోగ్య కార్యక్రమాల్లో తమ సంస్థ పాల్గొంటుందని సంసిద్ధత వ్యక్తం చేశారు. హైదరాబాద్ సమీపంలో ఏర్పాటవుతున్న ఫార్మాసిటీలో తమ యూనిట్ నెలకొల్పుతామని చెప్పారు. పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం.. అమెరికా ఐటీ పరిశ్రమతో రాష్ట్రానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించిన సీఎం కేసీఆర్.. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల కార్యాలయాలు సైతం హైదరాబాద్‌లో ఉన్నాయని గిలీడ్ సెన్సైస్ ప్రతినిధులకు చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా వారికి వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుసరిస్తున్న విధానాన్ని వివరించడంతో పాటు టీఎస్ఐపాస్ మార్గదర్శకాల ప్రతిని అందజేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం డిజైన్ చూపిస్తూ.. రాష్ట్రంలో పది లక్షల గృహాలు నిర్మిస్తామన్నారు. రక్షిత నీటి సరఫరాకు చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా అంటు వ్యాధులను తగ్గిస్తామని చెప్పారు. వివిధ రాష్ట్రాల అభివృద్ధిపైనే దేశ పురోగతి ఆధారపడి ఉందని పేర్కొన్నారు. సీఎంతో జరిగిన భేటీలో గిలీడ్ సెన్సైస్ డెరైక్టర్లు అరోన్ బ్రింక్వర్త్, క్లాడియో లిలియెన్ ఫీల్డ్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు డీజీపీ అనురాగ్ శర్మ, హెటిరో గ్రూప్ చైర్మన్ పార్థసారథిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విపక్షాల బంద్ సంపూర్ణ విఫలం
మంత్రులు పోచారం, జూపల్లి ఎద్దేవా సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలు శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వలేదని రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శనివారం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ విపక్షాల వైఖరిని ఎండగట్టారు. రైతుల మద్దతు లేకపోవడంతో విపక్షాల బంద్ సంపూర్ణంగా విఫలమైందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఓ వైపు ప్రశంసలు లభిస్తుండగా, మరోవైపు విపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పోచారం అన్నారు. రాష్ట్రంలో రూ.15వేల కోట్ల పంట రుణాలకు గాను ఇప్పటికే రూ.8,836 కోట్లు చెల్లించామని, మిగతా మొత్తాన్ని కూడా వడ్డీతో సహా వీలైనంత త్వరగా సర్దుబాటు చేసి బ్యాంకర్లకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.24వేల కోట్ల పంట రుణాలకు గాను కేవలం రూ.3,400 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. ఏపీలో రుణమాఫీపై కాంగ్రెస్, టీడీపీ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. ఉనికిని కాపాడుకునేందుకే..: జూపల్లి రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గతంలో పాలించిన పార్టీలు ప్రాజెక్టులు నిర్మించి వుంటే ప్రస్తుత పరిస్థితి ఎదురయ్యేదే కాదన్నారు. విపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. వారికి సిద్ధాంతముందా: తలసాని సాక్షి, హైదరాబాద్: ‘విపక్షాలన్నీ గంపగుత్తగా చేపట్టిన రాష్ట్ర బంద్ అట్టర్ ప్లాపయ్యింది. సెలవు రోజున ప్రతిపక్ష పార్టీలన్నీ ఆందోళనకు పిలుపు ఇచ్చినా వాళ్లకు పెద్దగా ప్రయోజనమేమీ రాలేదు’ అని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎద్దేవా చేశారు. శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పొద్దునలేస్తే ఒకరినొకరు దూషించుకునే పార్టీలన్నీ ఒకటై ఆందోళన చేశాయంటే, ఆ పార్టీలకు ఒక సిద్ధాంతమంటూ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అక్కడక్కడా కొంతమంది ఆందోళనలకు దిగినట్లు తెలిసిందని, కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు బంద్ ఎందుకంటూ ఆందోళనకారులపై తిరగబడ్డారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు ప్రజల నుంచిగానీ, రైతుల నుంచిగానీ ఎటువంటి స్పందనా రాలేదన్నారు. రేస్కోర్స్పై సర్కారు అజమాయిషీ! మలక్‌పేట్ రేస్కోర్స్పై తమ శాఖ అధికారులు దాడి చే సి అక్రమాలను వెలుగులోకి తెచ్చారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్న ఈ కేంద్రం గ్యాంబ్లింగ్ సెంటర్‌గా మారిందన్నారు. రేస్‌కోర్స్ సెంటర్‌ను టేకోవర్ చేసి ప్రభుత్వ అధీనంలో నిర్వహించే ఆలోచన చేస్తున్నామన్నారు. అలాగే, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని, రేస్‌కోర్స్‌ను వేరొక ప్రాంతానికి తరలించే ఆలోచన కూడా సర్కారుకు ఉందన్నారు. రేస్‌కోర్స్ సెంటర్లో జరుగుతున్న అక్రమాలపై ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తామని, మనీల్యాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా లేకనే బంద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కర్నె, బోడకుంటి సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాల్లో సుమారు 35 వేల మంది రైతుల ఆత్మహత్యకు కారణమైన కాంగ్రెస్, టీడీపీ రైతులకు అండగా ఉంటామని ప్రకటించడం హాస్యాస్పదమని ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, బోడకుంటి వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు. వీరు శనివారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ రైతులపై కపట ప్రేమ నటిస్తూ బంద్‌కు పిలుపునిచ్చాయని కర్నె విమర్శించారు. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓట్లు వేయకపోతే రాష్ట్రాన్ని ఆంధ్రలో కలిపేస్తామంటూ కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ చేసిన వ్యాఖ్యల వెనుక చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్ కుట్ర ఉందని బోడకుంటి ఆరోపించారు. -
విపక్షాల బంద్ అట్టర్‌ఫ్లాప్
హైదరాబాద్: రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేయాలంటూ పిలుపు ఇచ్చిన విపక్షాల బంద్ అట్టర్‌ఫ్లాప్ అయిందని మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. శనివారం వారు హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. రైతులెవరూ ఈ బంద్‌లో పాల్గొనలేదని తెలిపారు. రైతులకిచ్చిన మాటను నిలబెట్టుకుంటామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైతుల ఆత్మహ్యతలు జరుగుతున్నాయని పోచారం, జూపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎందుకు ఆందోళన చేయడం లేదని ప్రశ్నించారు. ఓ వేళ అధికార టీడీపీలో ఏపీ కాంగ్రెస్ పార్టీ విలీనమైయిందా అని వారు సందేహం వ్యక్తం చేశారు. త్వరలోనే రైతులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ చేస్తామని పోచారం,జూపల్లి తెలిపారు. -
పెట్టుబడులకు విదేశీ కంపెనీల ఆసక్తి
♦ మంత్రి జూపల్లితో ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం భేటీ ♦ నీళ్ల బాటిళ్ల తయారీ పరిశ్రమపై మలేసియా సంస్థ ఆసక్తి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వివిధ రంగా ల్లో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తితో ఉన్నట్లు ఆస్ట్రేలియా దక్షిణ భారత కాన్సుల్ జనరల్ సీన్ కెల్లీ చెప్పారు. కెల్లీ నేతృత్వంలోని ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో బుధవారం సచివాలయంలో భేటీ అయింది. రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ప్రశంసించిన ఆ బృందం తెలంగాణలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఎన్ఎస్ఎల్ మైనింగ్ కంపెనీ ఆసక్తితో ఉన్నట్లు తెలిపింది. తక్కువ నాణ్యతున్న ముడి ఖనిజం నాణ్యత మరింత పెంచే సాంకేతికత ఎన్ఎస్ఎల్కి ఉందన్నారు. వృత్తివిద్య, మైనింగ్, పర్యావరణం, మౌలిక సౌకర్యాలు, రోడ్డు భద్రత, రవాణా, సాంకేతికత, బయో టెక్నాలజీ తదిత ర రంగాల్లో ఇప్పటికే పలు ఆస్ట్రేలియన్ కంపెనీలు హైదరాబాద్ సంస్థలతో కలిసి పనిచేస్తు న్న విషయాన్ని కెల్లీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రా లు ప్రారంభించేందుకు ఆ దేశ రిటైల్ కాలేజీ ఆసక్తితో ఉందన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీ అభివృద్ధికి సహకరిస్తామన్నారు. చక్కెర పరిశ్రమ లో ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉన్న తమ దేశం స్థానికంగా మెరుగైన ఉత్పత్తి సాధ నకు, సాంకేతికత పంచుకునేందుకు సిద్ధంగా ఉందనీ కెల్లీ చెప్పారు. కొత్త పారిశ్రామిక విధా నాన్ని ఆస్ట్రేలియన్ బృందానికి మంత్రి జూపల్లి వివరించారు. స్థానికంగా పెట్టుబడులకు అనువైన వాతావరణం, నైపుణ్యము న్న మానవ వనరులు ఉన్నాయన్నారు. వైస్ కాన్సుల్ నటాషా మోరిస్, దక్షిణాసియా ప్రాం తీయ డైరక్టర్ పీటర్ బాల్డ్విన్, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ ఈడీ రే నికో బృందంలో ఉన్నారు. మలేసియా కంపెనీ ఆసక్తి: బాటిల్డ్ వాటర్ తయారీలో ప్రసిద్ధ మలేసియన్ కంపెనీ స్ప్రిజర్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి కనబరి చింది. సంస్థ ప్రతినిధులు కెన్నీ లిమ్ సెంగ్సీ, జోఆన్చాంగ్ నేతృత్వంలోని బృందం బుధవారం జూపల్లిని కలిసింది. తెలంగాణలో తమ కంపెనీ ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాన్ని గుర్తించాల్సి ఉందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. -
'ఆ ఇద్దరి ఎమ్మెల్యేల వివాదం వ్యక్తిగతం'
హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం వ్యక్తిగతమైందని పరిశ్రమలు, చక్కెర, చేనేత, జౌళి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ తన సోదరుడు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డిని రక్షించుకునేందుకు యత్నిస్తోందని జూపల్లి విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టకుండా రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ వివాదంలో ఇద్దరు నేతలదీ తప్పు ఉందని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి తెలిపారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజుల మధ్య వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే. -
నన్ను డిక్టేట్ చేసే అధికారం మంత్రికి లేదు
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని రసాభాసగా మారింది. శుక్రవారం జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం ప్రారంభమైంది. సభలో టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డి మాట్లాడుతుండగా టీఆర్ఎస్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయకుండా పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టించిన ఆటంకాలపై మాట్లాడాలని రాజేంద్ర రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు నిలదీశారు. దాంతో ఆగ్రహించిన రాజేంద్రరెడ్డి ... నేను ఏం మాట్లాడాలో మంత్రి ఎలా డిక్టేట్ చేస్తారంటూ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. దాంతో ఇటు టీడీపీ... అటు టీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ క్రమంలో టీఆర్ఎస్ సభ్యుల తీరును వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు జడ్పీ ఛైర్మన్ పోడియం వైపు దూసుకువెళ్లారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి... టీడీపీ సభ్యులను శాంతింప చేశారు. టీడీపీ సభ్యులు వారి సీట్లలో కూర్చున్నారు. అనంతరం రాజేంద్రరెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
మంత్రి, ఎంపీకి చేదు అనుభవం
బెంగళూరు: తెలంగాణ - కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డికి మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సదరు ప్రజా ప్రతినిధులతోపాటు పలువురు నాయకులు బృందంగా మంగళవారం ఆ ప్రాజెక్టులను పరిశీలించేందుకు బయలుదేరింది. ఆ విషయం తెలిసిన కర్ణాటక పోలీసులు సరిహద్దుల్లో వారిని అడ్డుకున్నారు. మీ పర్యటనకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ అక్కడి పోలీసులు జూపల్లి, జితేందర్‌రెడ్డికి తేల్చి చెప్పారు. ఆ క్రమంలో వారు కర్ణాటక పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. ప్రాజెక్టులు పరిశీలించేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ వారు కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి.. అక్కడే భీష్మించుకుని కుర్చున్నారు. -
జిల్లాల్లోనే చేనేత శిక్షణ కేంద్రాలు
అక్టోబర్ 2 నుంచి ప్రారంభించేలా ఏర్పాట్లు: జూపల్లి సాక్షి, హైదరాబాద్: నేత కార్మికులు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా జిల్లాల్లోనే చేనేత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. నాంపల్లిలోని చేనేత భవన్లో గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించిన అనంతరం చేనేత శిక్షణ కేంద్రాన్ని జూపల్లి సందర్శించారు. శిక్షణ పొందుతున్న కార్మికులతో మాట్లాడారు. నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తక్షణమే శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గాంధీ జయంతి అక్టోబర్ 2నుంచి వాటిని ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ నిఫ్ట్ సహకారంతో నూతన డిజైన్ల తయారీలో మెళకువలను నేర్చుకోవాలన్నారు. తద్వారా బహిరంగ మార్కెట్లో చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగే అవకాశం వుంటుందన్నారు. చేనేత ఉత్పత్తుల ద్వారా తాము రోజుకు కనీసం రూ.60 నుంచి రూ.75కు మించి పొందలేకపోతున్నామని కార్మికులు మంత్రికి విన్నవించారు. -
పాలమూరు ఎత్తిపోతలపై అనుమానాలు అక్కర్లేదు
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ భవన్లో మాట్లాడుతూ... ఉనికిని కోల్పోతామన్న భయంతోనే కాంగ్రెస్ విమర్శులు చేస్తుందని ఆరోపించారు. వచ్చే ఆగస్టునాటికి పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఆలస్యానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై అనుమానాలు అక్కర్లేదన్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. -
'టీటీడీపీ నేతలు తోక ముడిచారు'
హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుపై చర్చకు రాకుండ టీడీపీ నేతలు తోక ముడిచారని తెలంగాణ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీపీ నేతల రాకకోసం జూపల్లి కృష్ణారావు బుధవారం దాదాపు గంటపాటు నిరీక్షించారు. అయినా టీటీడీపీ నేతలు రాకపోవడంతో జూపల్లి కృష్ణారావు స్పందించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిన మాట వాస్తమని ఆయన స్పష్టం చేశారు. పాలమూరులోని నాలుగు ప్రాజెక్టులకు చంద్రబాబు హయాంలో రూ. 10 కోట్లకు మించి ఖర్చు చేయలేదన్నారు. టీడీపీ నేతలు బహిరంగ చర్చకు వస్తే ఈ అంశాలు నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాలులో లేదా హైదరాబాద్‌లోని ఏ ఫంక్షన్ హాల్లోనైనా మీడియా సమక్షంలో టీటీడీపీ నేతలతో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కలసి రాని టీడీపీ నేతలు ఇప్పుడు రాష్ట్రాభివృద్ధిలో అడ్డుపడుతున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వేళ టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రాకపోతే పాలమూరు ఎత్తిపోతల పథకానికి అభ్యంతరం లేదని చంద్రబాబుతో లేఖ రాయించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఖరీఫ్ నాటికి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. -
అసెంబ్లీ కమిటీ హాల్లోనే ఉంటా ... నేతలెవరొచ్చినా...
హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుపై తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నానని తెలంగాణ భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఉదయం 11.00 గంటల నుంచి అసెంబ్లీ కమిటీ హాల్లో ఉంటానన్నారు. టీడీపీ నేతలెవరొచ్చినా తాను చర్చకు సిద్ధమని జూపల్లి వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చకు రావాలని తెలంగాణ టీడీపీ నేతలు విసిరిన సవాలుకు తాను కట్టుబడి ఉంటానని గతంలో తాను పేర్కొన్న విషయాన్ని జూపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిధులు వెచ్చించినట్లు చెప్పుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలను ఎండగట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జూపల్లి కృష్ణారావు ఆదివారం బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ కమిటీ హాలులో జులై 13, 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సిద్ధంగా ఉంటానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ తేదీలు, ఈ సమయం ఓ వేళ మీకు అసౌకర్యంగా ఉంటే మీరు నిర్ణయించే సమయానికి ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉంటామని జూపల్లి తెలిపారు. కాగా పాలమూరు ప్రాజెక్టుల విషయంలో మంత్రి జూపల్లి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. -
టీడీపీ నేతల కోసం జూపల్లి ఎదురుచూపు