'పాలమూరుకు తొలి శత్రువు ఆయనే'
హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరుకు తొలి శత్రువు మంత్రి జూపల్లి అని అన్నారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. డిండి ప్రాజెక్ట్‌కు నీళ్లు తీసుకుపోవడానికి మేము వ్యతిరేకం కాదు.. పాలమూరు, రంగారెడ్డికి అనుసంధానం కాకుండా డిండికి నీళ్లు తీసుకుపోవాలి.. జీఓను మార్చలేదని చెప్పిన జూపల్లి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. నా తప్పు ఉంటే ముక్కు నేలకు రాస్తా.. లేకపోతే జూపల్లి పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేశారు.