
సాక్షి, హైదరాబాద్: తప్పు చేసిన వాడు ఎప్పుడూ బయపడుతాడు.. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్‌లో భయం మొదలైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పరువు కోసం తాపత్రయ పడుతున్నారని మండిపడ్డారు. బుధవారం జూపల్లి మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్ర నీటి వాటను బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టింది. కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తలొగ్గింది. దొంగే దొంగ అన్నట్లు ఉంది బీఆర్ఎస్ పరిస్థితి. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ చేసిన ఘనకార్యాలను సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ప్రసక్తి లేదు’ అని తెలిపారు జూపల్లి.
నీటి వాటా సాధించలేదు..
తెలంగాణ రాష్ట్రం నీటి వాటాను కేసీఆర్ సాదించలేకపోయారని ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ అన్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు హాజరుకాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కృష్ణా నది కింద ఒక్క ఎకరాకు కొత్తగా నీరు ఇవ్వలేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment