సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన కామెంట్స్ చేశారు. అహంకారంలో కేసీఆర్‌ను మించిన వాళ్లు ఎవరున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అది ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, సీఎం కేసీఆర్ నిన్న(శుక్రవారం) తెలంగాణ భవన్‌లో జూపల్లి గురించి మాట్లడుతూ ఎన్నికల సమయంలో అహంకారంగా వ్యవహరించారని అన్నారు. అలాగే, కార్యకర్తలను, ప్రజలను కలవడంలో జూపల్లి అలసత్వం చూపించారని.. అందుకే ఎన్నికల్లో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై జూపల్లి స్పందించారు. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
తాజాగా జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘నన్ను వేలు పెట్టి చూపించే హక్కు నీకు లేదు. అహంకారంలో కేసీఆర్‌ను మించిన వాళ్లు ఎవరున్నారు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. కమ్యూనిస్టులను తోక పార్టీలు అన్నది అహంకారంతో కాదా?. ఎమ్మెల్యే, మంత్రులను కలవకుండా అహంకారంతో ఉంది నువ్వే కేసీఆర్. ఎన్నికలు రాగానే వేషాలు మారుస్తున్నావు. ఎన్నికల్లో నువ్వెందుకు ఓడిపోయావ్.. వినోద్ ఎందుకు ఓడిపోయాడు. చేసే ప్రతీ పనిలోనూ వాటాలు. కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు. కేసీఆర్ మీద ప్రజలకు నమ్మకం పోయింది. ధర్నాచౌక్ ఎత్తేసిన వ్యక్తి కేసీఆర్’ అంటూ మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: నేడు బీజేపీ కీలక భేటీ.. అభ్యర్థుల్లో టెన్షన్!
Comments
Please login to add a commentAdd a comment