
హైదరాబాద్: డూప్లికేట్ గాంధీ కుటుంబానికి భారతీయ చట్టాలు వర్తించవా?, రాజ్యాంగానికి అతీతులని అనుకుంటున్నారా?, నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాజేసేందుకు డూప్లికేట్ గాంధీ కుటుంబం చేసిన కుట్ర’ అంటూ కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. యూపీఏ హయాంలోనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకున్న నిందితులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ. ఇందులో బీజేపీ, మోదీ పాత్ర ఏముంది?, కాంగ్రెస్ కార్యకర్తలారా....నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్లో మీ వాటా ఉంది. మీరు ధర్నా చేయాల్సింది.... టెన్ జన్ పథ్ సోనియా ఇంటి ముందు. తప్పు చేస్తే సోనియా సహా అందరూ జైలుకు వెళ్లక తప్పదు.
రాహుల్ స్పూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ పేరుతో ఫోర్త్ సిటీకి చెందిన 50 వేల కోట్ల ఆస్తులను కాజేసే కుట్ర. సుబ్రమణ్యస్వామి కేసులతో బీజేపీకి ఏం సంబంధం?, బూతులు మాట్లాడితే చప్పట్లు కొడుతుంటే నివారించాల్సింది పోయి సమర్ధిస్తారా?, దావోస్ పెట్టుబడులు ఎటు పోయాయ్?...జపాన్ పర్యటన కూడా అంతే. కాంగ్రెస్, బీఆర్ఎస్ జాన్ జబ్బలు.... బీఆర్ఎస్ అవినీతి కేసులన్నీ నీరుగార్చడమే నిదర్శనం.విద్యుత్ కొనుగోళ్ల స్కాంపై నివేదిక ఇచ్చినా కేసీఆర్ కు కనీసం నోటీసు ఎందుకు ఇవ్వలేదు?, బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణలో వచ్చే ప్రమాదముంది. దీనికి ముమ్మాటికీ కారణం రేవంత్ రెడ్డి కాబోతున్నరు. రేవంత్ ఆర్ధిక సహకారంతోనే వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మజ్లిస్ ఆందోళన చేస్తోంది. దీనిని అడ్డుకోకపోతే జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి సర్కారే బాధ్యత వహించక తప్పదు’ అని బండి సంజయ్ ధ్వజమెత్తారు.