Bandi Sanjay
-
ఢిల్లీలో సెంటిమెంట్.. కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి : బండి సంజయ్
-
ఒక్కరు కాదు.. తెలంగాణకు ఇద్దరు సీఎంలు: బండి సంజయ్
సాక్షి,సంగారెడ్డి:లగచర్ల ఫార్మాసిటీకి తాము వ్యతిరేకం కాదని, అయితే రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కోరారు. సంగారెడ్డిలో ఆదివారం(నవంబర్17) బండి సంజయ్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.‘రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి. రైతుల గురించి ఆలోచించకుండా దౌర్జన్యం చేయడానికి ఇది రాచరిక పాలనా? గతంలో బీఆర్ఎస్ కూడా ఇలానే చేసింది. కలెక్టర్‌పై దాడి అనేది దారుణం. రైతులు కలెక్టర్‌పై దాడి చేయలేదు. ఈ దాడి వెనుక కేటీఆర్,బీఆర్ఎస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ చెప్పింది. అయినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఇది ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనం.కేటీఆర్ నక్క వినయం ప్రదర్శించి అన్ని ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేసీఆర్ కొడుకు నటసార్వభౌముడు. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిశారు. గతంలో కాళేశ్వరం,ఫోన్ ట్యాపింగ్ కేసును ఇలానే నీరు గార్చారు. ఫోన్‌ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. కేటీఆర్‌కు తెలియకుండా ఇది జరుగుతుందా. అప్పుడు,ఇప్పుడు సీఎం కేటీఆరే.దీపావళి బాంబులు ఎక్కడికి పోయాయి. ఫార్ములా-ఈ కేసు,ధరణి కేసు,జన్వాడ ఫామ్ హౌస్ కేసు,డ్రగ్స్ కేసు ఇవన్నీ ఎక్కడికి పోయాయి.జనాలని,మీడియాని కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లను పిచోళ్ళు చేస్తున్నారు. తెలంగాణకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరు కేటీఆర్, ఇంకొకరు రేవంత్‌రెడ్డి’అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
-
కల్లు తియ్యగున్నదన్న బండి సంజయ్..
-
ఆరు గ్యారంటీలు.. రేవంత్‌కు బండి సంజయ్ సవాల్
సాక్షి, కరీంనగర్: మహారాష్ట్రలో రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలేనంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీల అమలుపై తెలంగాణలో పాదయాత్ర చేసే దమ్ముందా?. నక్సలైట్ల భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్ లో చోటు కల్పిస్తారా?’’ అంటూ విమర్శలు గుప్పించారు.కరీంనగర్లో కార్యకర్తలతో కలిసి ‘జితేందర్ రెడ్డి’ సినిమాను వీక్షించిన కేంద్ర మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసోళ్లను కూడా నక్సలైట్లు దారుణంగా చంపిన విషయం మర్చిపోయారా?. సభ్య సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నట్లు?. తక్షణమే విద్యా కమిషన్‌ను రద్దు చేయాలి. ప్రజాస్వామ్యవాదులారా.. కమిషన్ రద్దు కోసం రోడ్డెక్కండి. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఎఫ్పుడో మర్చిపోయారు?. జనం కష్టాల్లో ఉన్నా ఫాంహౌజ్‌కే పరిమితమైనోడిని లీడర్‌గా గుర్తిస్తారా?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి.. కేటీఆర్ రియాక్షన్ -
కేటీఆర్‌కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ ఒక్కటేనని కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై బండి సంజయ్ శుక్రవారం(నవంబర్ 8) హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు.‘బీఆర్ఎస్కు వ్యతిరేకంగా రేవంత్,నేను కొట్లాడాం. అందుకే మేమిద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నాం. డైవర్షన్,కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసే అలవాటు కేటీఆర్‌కే ఉంది. జన్వాడా ఫార్మ్ హౌస్ కేసు,ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసుల్లో హంగామా చేసి చివరకు కాంగ్రెస్,బీఆర్ఎస్ కాంప్రమైజ్ అయ్యాయి. కేటీఆర్ ట్విటర్లో తప్ప ఎక్కడా కనిపించడు. కేటీఆర్ కళ్లు నెత్తికెక్కాయి. బీఆర్ఎస్లో క్రెడిబిలిటీ ఉన్న లీడర్ హరీశ్‌రావు మాత్రమే’అని బండి సంజయ్ అన్నారు. ఎక్కడో భువనగిరిలో కాకుండా మూసీ పక్కన ఇల్లు కూలగొట్టే దగ్గర సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి పాద యాత్ర చేయాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: హ్యాపీ బర్త్‌డే రేవంత్: కేటీఆర్ -
అప్పుడే రాహుల్ రాష్ట్రంలో అడుగు పెట్టాలి: బండి సంజయ్ సవాల్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాకే తెలంగాణలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఎన్నో హామీలు ఇచ్చారన్న సంజయ్.. వాటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉందన్నారు. మంగళవారం సిరిసిల్లా జిల్లా రుద్రంగిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంట్రల్ లైబ్రరీకి, యూనివర్సిటీకి వెళ్లి మరీ యువతకు రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల వారికీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారన్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండానే మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణాలో అన్నీ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోందని మండిపడ్డారు. ఏ గ్యారంటీలు అమలు చేశారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర డబ్బంతా తీసుకెళ్లి మహారాష్ట్రలో యాడ్స్ ఇస్తోందని ఆరోపించారు బండి సంజయ్. గతంలో కేసీఆర్ కూడా ఇక్కడి రైతులను ఎండబెట్టి పంజాబ్ రైతులకు ఇక్కడి డబ్బులిచ్చాడని విమర్శలు గుప్పించారు. ‘స్వయానా వ్యవసాయశాాఖ మంత్రే ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు. ఆ విషయాన్ని అక్కడి యాడ్స్ లో ఎందుకు పేర్కొనలేదు..? ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలు ఏవి అమలు చేశారో చెప్పాకే రాహూల్ గాంధీ రాష్ట్రంలో అడుగు పెట్టాలి.దమ్ముంటే ఇప్పుడు రాహూల్ గాంధీ తెలంగాణాలో పాదయాత్ర చేయాలి. లక్షా యాభై వేల కోట్ల మూసీ ప్రాజెక్ట్ ఓ పెద్ద స్కామ్. కాంగ్రెస్ అధినేత్రి అల్లుడికి కట్టబెట్టేందుకు జరుగుతున్న ఓ పెద్ద స్కీమ్. దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. సర్పంచుల సమస్యలకు కారణమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్లీ బీఆర్ఎస్సే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామనడం హాస్యాస్పదం. సర్పంచులను మోసం చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ దొందూ దొందే’ అని మండిపడ్డారు. -
కేంద్రానికి రాష్ట్రం సహకారం
మల్యాల (చొప్పదండి): రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, ఎన్నికల తర్వా త అందరూ అభివృద్ధే ల క్ష్యంగా పనిచేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. కేంద్రానికి సహక రిస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం క్రాస్‌రోడ్డు నుంచి వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలం కాచారం వరకు డబుల్ రోడ్డు విస్తరణ పనులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.రోడ్డు విస్తరణ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లగానే రూ.25 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సత్యం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు మంజూరు చేయించాలని కోరారు. గత ప్రభుత్వం పగ, ప్రతీకారాలతో ప్రొటోకాల్ పాటించలేదని, అభివృద్ధికి సహకరించలేదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.మీ విధ్వంసంతో చీకట్లోకి రాష్ట్రంసీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఉదయిస్తున్న సూర్యుడిలా పురోగమిస్తోందంటూ సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను పునరి్నరి్మంచే బదులు రేవంత్‌రెడ్డి విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని చీకట్లలోకి నెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉదయించట్లేదని.. కాంగ్రెస్ శుష్క వాగ్దానాలనే నీడల మాటున నిలిచిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచి్చన అంతులేని నకిలీ హామీల చిట్టా ఈ జన్మకు నెరవేరదని ఎద్దేవా చేశారు.ఒకవేళ ఆరు గ్యారంటీలను నిజంగా అమలు చేశామని రేవంత్ నమ్మితే పాదయాత్ర చేపట్టి ప్రజల నుంచి నిజాలు తెలుసుకోవాలని మరోసారి సూచించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ఖాతాలో సీఎం రేవంత్‌ను ఉద్దేశించి బండి సంజయ్ సుదీర్ఘ పోస్ట్ చేశారు. ‘రేవంత్‌రెడ్డి గారు... మీరు యావత్ తెలంగాణను మోసగించారు. మీరిచ్చిన గ్యారంటీ కార్డు మాటున షరతులు వర్తిస్తాయనే విషయాన్ని అమాయకులైన తెలంగాణ ప్రజలు గుర్తించలేకపోయారు.6 గ్యారంటీలను నెరవేర్చడానికి 100 రోజులు, 1,000 రోజులు కాదు కదా.. 10 వేల రోజులైనా సరిపోవు’అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హామీల అమలును కాంగ్రెస్ బోగస్‌గా మార్చిందని దుయ్యబట్టారు. ‘6 గ్యారంటీల అమలుకు నిధుల్లేని మీవద్ద మూసీ ప్రాజెక్టు కోసం రూ. 1.50 లక్షల కోట్లు మాత్రం ఉన్నాయి. మూసీ ప్రాజెక్టును మరో కాళేశ్వరం తరహా ఏటీఎంగా మారుస్తున్నారు’అని బండి సంజయ్ ‘ఎక్స్’లో ఆరోపించారు. ఒవైసీపై ధ్వజం: టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేయాలంటున్న ప్రధాని మోదీ సర్కార్ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడం ఏమిటంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ వ్యాపారం చేస్తున్న ఒవైసీ అసలు రంగు బయటపడిందని మండిపడ్డారు. -
రాహుల్.. ప్రధాని కావడం కలే: బండి సంజయ్
సాక్షి, బెజ్జంకి: రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేడు.. అది ఆయన కల మాత్రమే అని ఆసక్తికర కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఇదే సమయంలో బీఆర్ఎస్పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తాను అనడం హాస్యాస్పదం అంటూ సెటైర్లు వేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్ నేడు బెజ్జంకిలో పర్యటించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుపుతున్నాయి. మూసీ ప్రక్షాళన పేరిట లక్షా యాభై వేల కోట్లను ఖర్చు పెట్టే కంటే కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేస్తే బాగుండేది. రేవంత్ రెడ్డి ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్తాడు?.ప్రజాసమస్యలు పట్టించుకోకుండా రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి మోదీపై యుద్ధం చేస్తాడట రేవంత్. రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేడు. అది కేవలం కల మాత్రమే. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం లేదు. జీవో 29ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే హిందూ ఆలయాలు, హిందువులుపైనే దాడులు జరుగుతాయి. కేటీఆర్ పాదయాత్ర చేస్తాను అనడం హాస్యాస్పదం. బీఆర్ఎస్ ఇప్పుడు నాయకుడు లేని నావలా నడుస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
లీగల్ నోటీసులపై బండి సంజయ్ డిమాండ్
-
కేటీఆర్ లీగల్ నోటీసులకు బండి సంజయ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంగళవారం(అక్టోబర్ 29) రిప్లై ఇచ్చారు. లీగల్ నోటీసుకుగాను కేటీఆర్‌కు కౌంటర్ నోటీసు పంపించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా తప్పులేదని బండిసంజయ్ తన రిప్లైలో స్పష్టం చేశారు.రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. లీగల్ నోటీసు అంటూ బెదిరిస్తే భయపడేది లేదన్నారు. తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని కేటీఆర్‌ను కోరారు. కేటీఆర్ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.కాగా, ఇటీవల బండి సంజయ్ గ్రూప్ వన్ అభ్యర్థులతో కలిసి ఆందోళనల్లో పాల్గొని అరెస్టయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి బండి సంజయ్‌ని చర్చలకు పిలిచారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ చదువులేని బండిసంజయ్ని గ్రూప్‌వన్‌పై చర్చలకు పిలిస్తే ఏం లాభం అని విమర్శించారు. రేవంత్, బండి సంజయ్ కలిసి డ్రామా చేస్తున్నారని ఆరోపించారు.దీనికి ఆగ్రహించిన బండి సంజయ్ కేటీఆర్‌పై వ్యక్తిగతంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకుగాను బండిసంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.ఇదీ చదవండి: కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రో కో -
జన్వాడపై బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజీ: కేంద్ర మంత్రి బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజీపడుతున్నట్లు జన్వాడ రేవ్ పార్టీ విషయంలో మరోసారి రుజువైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆదివా రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడు తూ ట్విట్టర్ టిల్లు బామ్మర్ది ఫామ్ హౌజ్‌లో రేవ్‌పార్టీ కేసు నీరుగార్చే కుట్ర మొదలైందని, ఆ పార్టీలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని పోలీసులతో చెప్పించేలా కాంగ్రెస్ నుంచి ఒత్తిడి కొనసాగుతోందని, లిక్కర్ పార్టీయే తప్ప రేవ్‌పార్టీ కాదని బుకా యించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌజ్ రేవ్ పార్టీపై సుద్దపూస ఏమంటాడో వేచి చూస్తున్నట్లు తెలిపారు.రేవ్‌పార్టీ పంచనామాలోనే డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా కుట్ర చేశారని, విదేశీ మద్యం బాటిళ్ల పేర్లను మాత్రమే ప్రస్తావించినట్లు తెలిసిందని అన్నారు. ట్విట్టర్ టిల్లు, ఆయన కుటుంబ సభ్యులను తప్పించి, ఈ కేసులో అనామకుల పేర్లను చేర్చుతున్నారని, తద్వారా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం దీపావళి బహుమతి ఇస్తోందని పేర్కొన్నారు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజీధోరణి ప్రదర్శిస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. సీసీ ఫుటేజీ సహా ఇతర ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని, బడా నేతలతోసహా రేవ్‌పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జన్వాడ పార్టీ వివరాలు బయటపెట్టాలిగజ్వేల్: జన్వాడ ఫామ్ హౌజ్ రేవ్‌పార్టీ వివరాలన్నీ బయట పెట్టాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. -
సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సహాయమంత్రి: ఎమ్మెల్యే వివేకానంద
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ సహాయమంత్రిలా తయారయ్యాడని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత వివేకానంద ఎద్దేవా చేశారు. తాజాగా రేవంత్, బండిసంజయ్ బంధం మరోసారి బయటపడిందన్నారు. అనుమతి లేకుండా పోలీసులు కేటీఆర్ బావమరిదికి చెందిన జన్వాడ ఫాంహౌజ్‌లో సోదా చేయడంపై వివేకానంద ఆదివారం(అక్టోబర్ 27) స్పందించారు.‘రాజ్ పాకాల పార్టీలో కేటీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. రాజ్‌పాకాల ఇంట్లో గెట్ టు గెదర్ పార్టీ చేసుకున్నారు. పోలీసులు సెర్చ్ వారంట్ లేకుండా ఇంట్లోకి వెళ్లారు. అక్కడ జరిగింది ప్రైవేట్ పార్టీ. లిక్కర్ ఎవరి ఇంట్లో ఉండదు. సీఎం, మంత్రుల ఇళ్లలో ఉండదా? తెలంగాణలో సంప్రదాయం ప్రతి ఇంట్లో లిక్కర్ ఉంటుంది. రేవంత్ చేతిలో అధికారులు కీలు బొమ్మలయ్యారు. ఇప్పుడు ఓవర్‌యాక్షన్ చేస్తున్న అధికారులు రిటైర్ అయినా సరే మేం అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టం’అని వివేకానంద హెచ్చరించారు. ఇదీ చదవండి: కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌజ్‌లో రేవ్‌పార్టీ భగ్నం -
జన్వాడలో రేవ్ పార్టీపై స్పందించిన బండి సంజయ్
-
జన్వాడ రేవ్ పార్టీ.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: జన్వాడలో రేవ్ పార్టీపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేపు పార్టీ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ సీసీ టీవీ పుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని కోరారు.జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో. బావ మరది ఫామ్ హౌస్‌లోనే రేవ్ పార్టీలా?. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో. ‘సుద్దపూస’ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయి.సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్‌పై రాజీ ధోరణి ఎందుకు?. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటు. చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలి. సీసీ పుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాల్సిందే. బడా నేతలతో సహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలి. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలు ఉండాలని’ డిమాండ్ చేశారు. -
మోడీ రూట్ లోనే కేటీఆర్..
-
Bandi Sanjay: మస్కా బన్ తిని.. చాయ్ తాగి!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా హిమాయత్ నగర్‌లోని నీలోఫర్ కేఫ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ బీజేపీ ఆధ్వర్యంలో మూసీ బాధితుల పక్షాన ఇందిరాపార్క్ వద్ద ధర్నా అనంతరం ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు యాదవ్‌తో కలిసి నీలోఫర్ కేఫ్‌కు వచ్చారు. సాదాసీదాగా కేఫ్‌లోకి వెళ్లి కూర్చుని ‘మస్కాబన్’ తిన్నారు. ఛాయ్ తాగారు. బండి సంజయ్ వచ్చారని తెలుసుకున్న నీలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు అక్కడికి వచ్చి పరిచయం చేసుకున్నారు. తాము ఈ మధ్య చిట్టిముత్యాలతో తయారు చేసిన సాంబార్ రైస్‌ను బాబూరావు అభ్యర్థన మేరకు సంజయ్ రుచిచూసి బాగుందని పేర్కొన్నారు. కేఫ్‌కు నీలోఫర్ పెట్టడానికి కారణమేంటని ప్రశ్నించడంతో.. ‘తాను చాలా పేదరికం నుండి వచ్చానని, 1976లో నీలోఫర్ ఆస్పత్రి వద్ద రూ.2 రూపాయలకు చిన్న ఉద్యోగం చేసి.. అక్కడే టీ, బిస్కట్లు అమ్మానని, వాటికి గిరాకీ ఉండటంతో కేఫ్ స్థాపించానని తెలిపారు. అందుకే నీలోఫర్‌కు వచ్చే రోగులకు తనవంతు సహకారం అందిస్తున్నాని తెలపడంతో బండి సంజయ్ బాబూరావును ప్రత్యేకంగా అభినందించారు. -
కిలోమీటర్‌కు రెండు వేల కోట్లా.. మూసీపై క్లారిటీ ఉందా?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. మూసీపై సీఎం రేవంత్‌కే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీల హామీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ ఈ డ్రామాలు అంటూ ఆరోపించారు.ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నాలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మొన్నటి వరకు హైడ్రా జరిగింది. ఆ బాధితుల్లో జేసీబీ, బుల్డోజర్లు అనే భయం కనిపించాయి. ఇప్పుడు మూసీ బాధితులను చూస్తుంటే వారిలో బీజేపీ ఉందనే భరోసా కనిపిస్తోంది. కాంగ్రెస్ విధానాలపై ప్రజలకు అండగా ఉండి బరా బర్ కొట్లాడుతాం. మూసీ ఒకప్పుడు మంచినీళ్లు అందించింది.. ఇప్పుడు విషం కక్కుతోంది. నేను పాదయాత్ర చేసినప్పుడు కళ్లారా చూశా. మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్. పరిశ్రమలకు అడ్డగోలుగా పెట్టుకోవాలని చెప్పి అనుమతి ఇచ్చింది వారు కాదా?.మొన్న రేవంత్ లండన్ పోయి ఒక నది చూశాడు.. అది చూసే లక్షన్నర కోట్లు అన్నాడు. నిన్న సియోల్‌కు నేతలను పంపాడు.. వాళ్ళు ఎంత చెప్తారో మరి. రేవంత్.. ముందు మంత్రులను మూసీ పరివాహక ప్రాంతాల్లో తిరగమని చెప్పు. అలా వెళ్తే ప్రజలు వాళ్లను గంప కింద కమ్ముతారనే భయం ఉంది. రేవంత్ మూసీ సుందరీకరణ అని ఒకసారి అంటాడు.. పునరుజ్జీవనం అని మరోసారి అంటాడు.. ఏంటో ఆయనకే క్లారిటీ లేదు. లక్షన్నర కోట్ల ఖర్చు అన్నాడు.. మళ్ళీ నేను అనలేదు అంటున్నాడు. మూసీ ప్రక్షాళన పేదల కోసం కాదు.. ఇదంతా కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా అల్లుడి కోసమే.బీఆర్ఎస్ నేతలకు దీనిపై మాట్లాడే హక్కు లేదు. ఆరు గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ ఈ డ్రామాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఒక డ్రామా కంపెనీ. ఆ పార్టీలో ఎవరికీ వారు సీఎంలు. సబర్మతి ఖర్చు రూ.7వేల కోట్లు. నమామి గంగ ఖర్చు రూ.40వేల కోట్లు అయితే మూసీకి లక్షన్నర కోట్లా?. ఒక్క కిలోమీటర్‌కు 2వేల కోట్లా?. ఇంతకంటే ఖరీదైన ప్రాజెక్టు.. స్కామ్ ప్రపంచంలో లేదు. దోషులు ప్రజలు కాదు.. అక్రమంగా కూల్చుతున్న ప్రభుత్వమే దోషి. మాకు కేసులు, లాఠీలు కొత్త కాదు. ఎన్ని జైళ్లు కట్టుకుంటావో కట్టుకో రేవంత్.. మేము కొట్లాడేందుకు సిద్ధం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రోడ్లపై తిరగకుండా చేస్తాం. సోనియా అల్లుడికి పైసలు కావాలంటే కాంగ్రెస్ నేతలు దోచుకున్న వాటిలో నుంచి ఇవ్వండి.. పేదల వద్ద నుంచి లాక్కుంటామంటే ఊరుకోం’ అంటూ హెచ్చరించారు. -
ఇందిరా పార్క్ ధర్నా చౌక్.. నేడు బీజేపీ నేతల ధర్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ ప్రాంత ప్రజలకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద నేడు బీజేపీ నేతలు ధర్నా చేపట్టనున్నారు.తెలంగాణ బీజేపీ నేతలు రెండు రోజుల పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం, వారికి మద్దతుగా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సిద్ధమయ్యారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు బీజేపీ నేతలు ధర్నా చేయనున్నారు. బీజేపీ ధర్నాకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు కానున్నారు. -
మూసీ పేరిట కాంగ్రెస్ భారీ దోపిడీ ప్లాన్: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి ప్లాన్ చేసిందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్. సంక్షేమ పథకాలను అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇండ్ల కూల్చివేతకు బీజేపీ వ్యతిరేకం అని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన రేపు(శుక్రవారం) ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మూసీ బాధితులు, ప్రజలు పెద్దఎత్తున మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు...మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీసింది. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పార్టీ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి ఏటీఎంలా వాడుకుంది. రూ.లక్షన్నర కోట్లు అప్పు చేసి మూసీని కాంగ్రెస్‌కు ఏటీఎంలాగా మార్చాలనుకుంటున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. గత పాలకులు చేసిన దాదాపు రూ.6 లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు 10 నెలల్లోనే రూ.60 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలివ్వడం గగనమైందిసంక్షేమ పథకాలను అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైకా, జపాన్ నిధులు కూడా ఖర్చు చేసినా ఒరిగిందేమీ లేదు. పాలకులు చేస్తున్న అప్పుల భారమంతా వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతోంది. తెలంగాణలో 92 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉంది. మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు చేసి ప్రజలపై మోయలేని భారం మోపడం దుర్మార్గం. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం’ అని పేర్కొన్నారు. -
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కేటీఆర్ నోటీసులు
-
కేటీఆర్ లీగల్ నోటీసుకు బండి సంజయ్ కౌంటర్
-
మోదీ బాటలోనే నడుస్తా: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: కేటీఆర్ నోటీసులకు భయపడేది లేదన్న కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ తనకు లీగల్ నోటీసులు ఇస్తే, తాను మళ్లీ మళ్లీ లీగల్ నోటీసులు పంపిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ బుధవారం(అక్టోబర్ 23) మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి ప్రధాని మోదీ లీగల్ నోటీసులు ఇవ్వలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. లీగల్ నోటీసుల విషయంలో మోదీ బాటలోనే నడుస్తానని కేటీఆర్ చెప్పారు. కాగా, తనపై ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని అందులో పేర్కొన్నారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ ఇలాంటి తాటాకు చప్పుల్లకు భయపడేది లేదన్నారు. ఇదీ చదవండి: కేటీఆర్ లీగల్ నోటీసులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు -
కేటీఆర్ లీగల్ నోటీసులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరు అంటూ కేటీఆర్‌కు కౌంటరిచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు అంటూ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్..‘కేటీఆర్ నాకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశాను. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోంది. తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు. నాపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే. అందుకు బదులుగానే నేను మాట్లాడాను. ఆయన మంచి వాడు అనుకుంటన్నాడు. ఆయన భాగోతం ప్రజలకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చాను. లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం. చట్టం, న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళ్తాం’ అంటూ కామెంట్స్ చేశారు.అలాగే, కేటీఆర్ నోటీసులపై తెలంగాణ బీజేపీ నేతలు కూడా స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాను. లీగల్ నోటీసులతో కేటీఆర్ రాజకీయ జీవితానికి చరమ గీతం పడటం ఖాయం. దద్దమ్మ, సన్యాసి అంటూ కేసీఆర్, కేటీఆర్ కొన్ని వందల సార్లు మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు పారిపోయే రోజులు వచ్చాయి. లీగల్ నోటీసులతో ఆట మీరు మొదలుపెట్టారు. రోజు లీగల్ నోటీసులు అందుకోవడానికి కేటీఆర్ సిద్ధంగా ఉండాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.కుమార్ మాట్లాడుతూ..‘లీగల్ నోటీసులకు బండి సంజయ్ భయపడరు. బండి సంజయ్‌ను ఎన్నో సార్లు కేసీఆర్, కేటీఆర్ అవమానించారు. భాషను మార్చుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. -
రేవంత్,బండి సంజయ్ రహస్య మిత్రులు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్,బండి సంజయ్‌లు రహస్య మిత్రులని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సోమవారం(అక్టోబర్ 21)మీడియాతో మాట్లాడారు. రేవంత్ కుర్చీ పోతుంటే బండి సంజయ్‌కి బాధ ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్,బీజేపీ రహస్య ఒప్పందాలు ఖచ్చితంగా బయటకు వస్తాయన్నారు.‘రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వార్షికోత్సవం జరుపుకోవాలి. ముత్యాలమ్మ గుడిపై దాడిని నేను ఖండిస్తే తప్పేంటి? నేను ట్వీట్ చేసినందుకు నాకు సైబర్ క్రైమ్ వాళ్ళు నాకు లేఖ పంపారు. రేవంత్ లాంటి దగుల్బాజీ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడు.ఉద్యోగాల కల్పనపై సీఎం రేవంత్ అబద్దాలు చెప్తున్నాడు.మూసీ విషయంలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ ప్రశ్నించాల్సింది జర్నలిస్టులు. లక్షన్నర కోట్లు మూసీలో పోద్దామంటే చూస్తూ ఊరుకుందామా? లక్షన్నర కోట్లు జేబులో వేసుకుంటామంటే ఊరుకుంటామా? జర్నలిస్టులపై బీఆర్ఎస్కు ఎనలేని గౌరవం ఉంది. ఎన్నడూ నేను అవమానించలేదు.ఉద్యమంలో మాకంటే ఎక్కువ జర్నలిస్టుల పాత్ర ఉంది’అని కేటీఆర్ పేర్కొన్నారు.గ్రూప్ వన్‌పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..‘గ్రూప్ వన్‌పై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఫలితాలు వెల్లడించవద్దన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.రిట్ పిటిషన్‌పై వేగంగా వాదనలు విని నిర్ణయం తీసుకోమని సుప్రీం హైకోర్టుకు చెప్పింది.జీవో 29కు వ్యతిరేకంగా హైకోర్టులో అభ్యర్థుల తరుపున కొట్లాడుతాం.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిందే నిరుద్యోగులు.స్థానికుల కోసం కేసీఆర్ 95శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు.తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రమాణికం కాదనటనం అన్యాయం. జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుంది. గ్రూప్ - 1 అభ్యర్థుల తరుపున సుప్రీంకోర్టులో కేసు వేసిందే బీఆర్ఎస్.కపిల్ సిబల్ లాంటి ప్రముఖ న్యాయవాదిని నియమించాం’అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి: కేటీఆర్ ఇంటివద్ద భారీగా పోలీసులు