సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్(bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ(AICC) ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దోపిడీ దారులు, విధ్వంసకారులు, అబద్ధాల పార్టీగా మారిందని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్(Congress Party) వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా సంజయ్ ట్విట్టర్‌లో..‘ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయింది. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదు. మహిళలకు సాధికారత కల్పించడానికి బదులుగా వారిని చితకబాదారు. అంతేకాకుండా ఇళ్లను పడగొట్టడం, కూరగాయల వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం గర్భిణీలను వీధుల్లోకి నెట్టారు. ఇది పాలన కాదు. ఇది మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వం.
తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది వినాశకరమైన పాలనలో అత్యాచార కేసులు 28.94%, మహిళల హత్యలు 13%పెరిగాయి. కిడ్నాప్‌లు, అపహరణలు 26% పెరిగాయి. కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉంది?. మహిళల ప్రాథమిక గౌరవం కూడా దాడికి గురవుతోంది. కాంగ్రెస్ హయాంలో 10,000 మంది మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురయ్యారు. కాంగ్రెస్ దోపిడి దారుల, విధ్వంసకారుల, అబద్ధాల పార్టీగా మారింది అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
AICC is filled with fake news peddlers
Telangana women didn’t get even ₹1 from Congress govt.
Instead of empowering women, they are crushing them - demolishing homes, targeting vegetable vendors, and forcing pregnant women onto the streets.
This isn’t governance - it’s… https://t.co/mfkOGU1rF7— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 8, 2025
Comments
Please login to add a commentAdd a comment