AICC
-
డీసీసీలు ఇక పవర్ఫుల్!
సాక్షి, హైదరాబాద్: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లు ఇకపై బలోపేతం కానున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షులకు అధిక ప్రాధాన్యత లభించనుంది. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మొదలు స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్‌సభ టికెట్ల కేటాయింపులోనూ డీసీసీ అధ్యక్షులను భాగస్వాములను చేయాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె చేసిన ప్రతిపాదనకు ఏఐసీసీ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. లోక్‌సభ టికెట్ల కేటాయింపు కోసం ఏఐసీసీ ఏర్పాటు చేసే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) తరహాలోనే రాష్ట్ర స్థాయిలో టికెట్ల కేటాయింపు కోసం ఏర్పాటు చేసే కమిటీల్లో డీసీసీ అధ్యక్షులను నియమించాలని ఆమె ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. సిఫారసులు, లాబీయింగ్‌కు చెల్లుచీటీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రధాన నాయకుల సిఫారసు, లాబీయింగ్ ప్రాతిపదికన జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల నియామక ప్రక్రియ ఇకపై పూర్తిగా మారిపోనుంది. మీనాక్షి నటరాజన్ మార్కు డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో కనిపించనుందనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. పార్టీలో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవులు కీలకమైనందున పీసీసీ అధ్యక్షుడి పర్యవేక్షణలో ఈ మూడు స్థాయిల్లోని పదవులను పకడ్బందీగా భర్తీ చేయాలని ఆమె యోచిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షుల నియామకంలో సిఫారసులకు కాకుండా స్థానిక నాయకత్వం అభిప్రాయాలకు ప్రాధాన్యతనివ్వాలని పార్టీ ఇన్చార్జి భావిస్తున్నారు. అందులో భాగంగా డీసీసీ అధ్యక్ష పదవుల కోసం జిల్లాకు మూడు పేర్లతో ప్యానెల్ తయారు చేయాలని, ఆ మూడు పేర్లపై స్థానిక నాయకుల నుంచి అభిప్రాయసేకరణ జరిపి, ఎవరికి ఎక్కువ మొగ్గు కనిపిస్తే వారిని డీసీసీ అధ్యక్షులుగా నియమించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుత కసరత్తు నేపథ్యంలో జిల్లా అధ్యక్షుల నియామకానికి కొంత సమయం పడుతుందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. త్వరలో టీపీసీసీ కార్యవర్గం! ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీపీసీసీ కార్యవర్గం కూడా త్వరలోనే వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి పీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 20 మంది వరకు ఉపాధ్యక్షులను నియమిస్తారని, ప్రధాన కార్యదర్శులతో పాటు కార్యదర్శులు, అధికార ప్రతినిధులు తదితర పదవులు ఆ తర్వాత ప్రకటిస్తారని సమాచారం. వాస్తవానికి దీపాదాస్ మున్షీ ఇన్చార్జిగా ఉన్నప్పుడే పీసీసీ కార్యవర్గంపై కసరత్తు జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లు మున్షీతో భేటీ అయి టీపీసీసీ కార్యవర్గం కోసం కొంత కసరత్తు చేశారు. అయితే మీనాక్షి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ జాబితాను పూర్తిగా పక్కన పెట్టారని, పార్టీలో సీనియార్టీ, గతంలో నిర్వహించిన పదవుల ప్రాతిపదికన ఆమె జిల్లాల వారీగా జాబితాను తయారు చేస్తున్నట్టు సమాచారం. నెలాఖరుకు కొత్త కార్యవర్గాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకూ మోక్షం? రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణ అంశాన్ని కూడా పరిష్కరించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఇందుకోసం పలుమార్లు రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపిన ఢిల్లీ పెద్దలు ఓ అభిప్రాయానికి వచ్చారని, సామాజిక కోణంలో ఐదు లేదా ఆరు బెర్తులు భర్తీ చేసే విధంగా త్వరలోనే గ్రీన్‌సిగ్నల్ వస్తుందని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. అంతా సవ్యంగా జరిగితే నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల జాబితాకు కూడా క్లియరెన్స్ ఇప్పించేందుకు మీనాక్షి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. -
టీ కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. మీనాక్షి సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పదవులపై కసరత్తు ప్రారంభించిన మీనాక్షి.. పార్టీలో నేతలను మూడు కేటగిరీలుగా విభజించారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్న వాళ్లు ఒక గ్రూపు, ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండో గ్రూపు, అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వారని మూడో గ్రూప్‌గా విభజించారు.పార్టీ పదవులు.. నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. పదేళ్లు పార్టీలో ఉన్నవారి లిస్ట్ కోరిన ఇన్చార్జ్ మీనాక్షి. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది.కాగా, రాష్ట్ర కాంగ్రెస్ కాంగ్రెస్ పనితీరుపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నిన్న(మంగళవారం) మెదక్, మల్కాజ్గిరి స్థానాల పరిధిలోని పార్టీ నేతలతో ఆమె విడివిడిగా సమావేశమయ్యారు. ఇవాళ ఆదిలాబాద్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ‘‘ఎవరి పనితీరు ఎంటో నాకు తెలుసు. ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసు. పార్టీ కోసం సమయం కేటాయించాలి. అంతర్గత విషయాలు బయట చర్చించొద్దు’’ అంటూ మీనాక్షి నటరాజన్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. -
ఎవరు నటిస్తున్నారో తెలుసు.. మీనాక్షి మరో వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఎవరి పనితీరు ఎంటో నాకు తెలుసు. ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసు. పార్టీ కోసం సమయం కేటాయించాలి. అంతర్గత విషయాలు బయట చర్చించొద్దు’’ అంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మరోసారి హెచ్చరించారు. పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్‌లో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్, మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలకు మీనాక్షి దిశానిర్దేశం చేశారు.లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షల్లో భాగంగా మంగళవారం గాందీభవన్‌లో మెదక్, మల్కాజ్గిరి స్థానాల పరిధిలోని పార్టీ నేతలతో ఆమె విడివిడిగా సమావేశయిన సంగతి తెలిసిందే. పార్టీ లైన్ ప్రకారమే ఎవరైనా వెళ్లాల్సి ఉంటుందని, గీత దాటితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బహిరంగ వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.పార్టీలో అందరికీ అవకాశాలు కల్పిస్తామని, పదేళ్లుగా పార్టీ జెండాను భుజాన మోసిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. ఫ్లెక్సీల్లో ఫొటోలు కనిపిస్తే సరిపోదని, ప్రజల మధ్యలో ఉండాలని దిశానిర్దేశం చేశారు. పార్టీలో సామాజిక న్యాయం అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. -
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనపై మీనాక్షి నటరాజన్ ఫోకస్
-
తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్
సాక్షి, ఢిల్లీ: తొమ్మిది రాష్ట్రాలకు ఇంఛార్జ్‌లను ఏఐసీసీ ప్రకటించింది. దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. 2009లో మధ్యప్రదేశ్ మాండసోర్ నుంచి ఎంపీగా మీనాక్షి నటరాజన్ పనిచేశారు.హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లను ఏఐసీసీ నియమించింది. పంజాబ్, జమ్మూకశ్మీర్‌లకు కొత్త జనరల్ సెకట్రరీలను కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. -
కీలక పదవులు ఎవరికో?!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే పార్టీ అధిష్టానంతో పలుమార్లు జరిగిన చర్చల అనంతరం బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీలు అన్ని కోణాల్లో కస రత్తు చేసి తుది జాబితాను సిద్ధం చేశారు. తాజాగా ఏఐసీసీ ఆమోదం కోసం ఈ జాబితాను ఢిల్లీకి పంపారు. అధిష్టానం ఆమోదం లభించిన వెంటనే అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో టీపీసీసీ కార్యవర్గాన్ని జాగ్రత్తగా కసరత్తు చేసి ఎంపిక చేశా రనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. దీంతో కీలక పదవులు ఎవర్ని వరిస్తాయనే దానిపై ఆశావహులు, పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఐదుగురు కాదు.. నలుగురేపార్టీ అధ్యక్ష పదవి తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న పదవి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ హోదా కోసం పార్టీలోని చాలామంది సీనియర్లు పోటీ పడుతున్నారు. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ (ఆర్గనైజేషన్)గా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్‌కు పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం వచ్చిన నేపథ్యంలో ఈ పదవికి డిమాండ్ ఏర్పడింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయ కులు, గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్న వారితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చాలా మంది ఈ పదవిని కోరుకుంటు న్నారు. గత కార్యవర్గంలో మొత్తం ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌తో పాటు జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్‌లు ప్రస్తుతం ఈ హోదాలో ఉన్నారు. ఈసారి ఆ 4 కేటగిరీల వారికి.. గతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉండడంతో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. ఎమ్మెల్యే కోటాలో జగ్గారెడ్డికి అవకాశం కల్పించారు. అయితే ఈసారి బీసీ వర్గాలకు చెందిన నాయకుడు అధ్యక్షుడిగా ఉండడంతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన నలుగురు నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ రేసులో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ (ఎస్టీ) పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. మరోవైపు ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, నాగరిగారి ప్రీతం, అద్దంకి దయాకర్, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, మైనార్టీ కోటాలో ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, నాంపల్లి నియోజకవర్గ నేత ఫిరోజ్‌ఖాన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్‌లలో ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇస్తే మరొకరికి అధికారిక పదవి వస్తుందని తెలుస్తోంది. ఇదే సామాజిక వర్గానికి చెందిన నేత షబ్బీర్ అలీని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి ఆయన్ను కేబినెట్లోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఈ కోణంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు సామాజికవర్గాల వారీగా రెండేసి చొప్పున పేర్లు ఢిల్లీకి పంపినట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు ఒకటి లేదా రెండు వైస్లువర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు పీసీసీ ఉపాధ్యక్ష పదవులకు కూడా డిమాండ్ కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో పీసీసీలో ముఖ్య హోదా అయిన వైస్ ప్రెసిడెంట్ పదవి వచ్చినా బాగానే ఉంటుందనే ఆలోచనలో చాలామంది కాంగ్రెస్ నేతలున్నారు. ఈ పదవులను పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇవ్వాలని తొలుత భావించినా సామాజిక, ప్రాంతీయ సమీకరణలు కుదరకపోవడంతో ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కొన్ని జిల్లాల్లో సమీకరణలను బట్టి రెండు పదవులను కూడా ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ప్రధాన కార్యదర్శి పదవులకు కూడా ఇదే సూత్రాన్ని వర్తింపజేయనున్నారు. ప్రస్తుతమున్న 33 జిల్లాలకు జిల్లాకో ప్రధాన కార్యదర్శిని నియమించాలని అనుకున్నా ఉపా«ధ్యక్షుల తరహాలోనే ఉమ్మడి జిల్లాకు ఒకటి లేదా అవసరాన్ని బట్టి రెండు పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. సీనియర్ వైస్ లేనట్లే..గతంలో ఉన్న సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదా ఈసారి ఉండదని, ఆ హోదాలో ఉన్న ఎంఆర్జీ వినోద్‌రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులను ముఖ్యమైన కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమిస్తారని తెలుస్తోంది. అధికార ప్రతినిధుల విషయానికి వస్తే గతంలో కాకుండా 10 మంది వరకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ జాబితాలో ఈసారి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉండే అవకాశముందని అంటున్నారు. కాగా పీసీసీ కార్యవర్గాన్ని ఏఐసీసీ త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రచార కమిటీ చైర్మన్ నియామకం ఇప్పుడా.. తర్వాతా?పీసీసీ అధ్యక్షుడిగా బీసీ ఉన్నందున ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి టీపీసీసీలో కీలకమైన ప్రచార కమిటీ చైర్మన్ పోస్టు ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో రేవంత్‌రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీసీ వర్గాలకు చెందిన మధుయాష్కీ గౌడ్‌ను ఈ పదవిలో నియమించారు. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన మహేశ్‌గౌడ్ పీసీసీ అ«ధ్యక్షుడిగా ఉన్నందున యాష్కీకి సముచిత పదవి ఇచ్చి ప్రచార కమిటీ చైర్మన్ స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి అప్పగిస్తారని అంటున్నారు. ఈ పోస్టు రేసులో మొదటి నుంచి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి పేరు మాత్రమే వినిపిస్తుండడం గమనార్హం. అయితే ఈ పదవిని ఇప్పుడే భర్తీ చేయాలా? లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతా అన్న విషయంలో అధిష్టానం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. -
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవు: సంపత్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు రేపుతోంది. పార్టీలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే చర్యలు తప్పవంటూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తేల్చి చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వినోద్ లాంటి వారు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిసిందన్న సంపత్.. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరించారు.‘‘ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రధాన చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్కు మాదిగల గురించి మాట్లాడే హక్కు లేదు. 10 ఏళ్లు మాదిగల గురించి ఆలోచించని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఏదో చేస్తామని చెప్తున్నారు. వర్గీకరణ అమలు జరిగిందంటే.. అది కాంగ్రెస్ వల్లనే జరుగుతుంది. మాదిగలు గుండె మీద చెయ్యి వేసుకుని పడుకోండి. చంద్రబాబు హయాంలో వర్గీకరణకు ఎదురైనా సాంకేతిక లోపాలు తెలిసిన వాడిగా సీఎం క్యాబినెట్ కమిటీ వేశారు. ఏక సభ్య కమిటీ వేశారు కమిటీ నివేదిక వచ్చాక ఎస్సీ వర్గీకరణ జరగబోతుంది.వర్గీకరణ పకడ్బందీగా అమలు చేయాలనే దృఢమైన సంకల్పంతో సీఎం ముందుకెళ్తున్నారు. తరతరాలుగా అవమానాలు, అసమానతలు ఎదురొడ్డినా మాదిగలు ధైర్యంగా ఉండండి. అధికారిక సమావేశంలోనే కాంగ్రెస్‌ని డిమాండ్ చేశాను’’ అని సంపత్ పేర్కొన్నారు. -
టీపీసీసీ సెర్చ్ ఆపరేషన్!
సాక్షి, హైదరాబాద్: పార్టీ, ప్రభుత్వ పదవుల భర్తీ ప్రక్రియ టీపీసీసీకి కత్తిమీద సాములా మారింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు, కమిషన్ల సభ్యులు, ఏఐసీసీ కార్యదర్శులు, ఎమ్మెల్సీ పదవులకు సమర్థుల కోసం ఏఐసీసీ, పీసీసీ అన్వేషిస్తున్నాయి. పార్టీ కార్యవర్గంతో పాటు నామినేటెడ్ పోస్టులను ఈ నెలాఖరు నాటికి భర్తీ చేయాలన్న ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ కసరత్తు ముమ్మరం చేసింది. జంబో కార్యవర్గం.. ఈసారి టీపీసీసీ కార్యవర్గాన్ని ఆచితూచి ఎంపిక చేయాలని ఏఐసీసీ, టీపీసీసీ భావిస్తున్నాయి. పీసీ సీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తా రని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేత ఉన్నందున, రెడ్డి సామాజిక వర్గానికి వర్కింగ్ ప్రెసిడెంట్ (ఆర్గనైజేషన్) ఇస్తారని, మరో మూడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నేతలకు ఇస్తారనే చర్చ జరుగుతోంది. వీటి తో పాటు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి, ప్రతి జిల్లాకు ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని నిర్ణయించారు. పార్టీ అధికార ప్రతినిధులుగా మరో 10 మంది, పీసీసీ కార్యదర్శులుగా 50 మందిని నియమించే అవకాశాలున్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు 200 వరకు పెరిగి పీసీసీ జంబో కార్యవర్గం ఉండవచ్చని అంచనా. ఈ పదవుల భర్తీపై ఇప్పటికే రెండు సార్లు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీలు భేటీ అయ్యారు. దాదాపు 10 జిల్లాలకు ఎమ్మెల్యేలే పార్టీ అధ్యక్షులుగా ఉన్నా రు. వీరిలో కొందరిని తప్పించి, సమర్థులైన మరికొందరు ఎమ్మెల్యేలను డీసీసీ అధ్యక్షులుగా నియమించాలని భావిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులపై ఆచితూచి.. నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా గత ఎనిమిది నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు 33 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. మరో 40 వరకు కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. వీటితో పాటు పలు కమిషన్లలో మరో 30 మంది వరకు అవకాశం కల్పించవచ్చు.అంటే 70 వరకు పదవులు ఇవ్వొ చ్చని ప్రచారం జరుగుతోంది. వీటికి ఆయా కార్పొరేషన్ల డైరెక్టర్ల పోస్టులను కలిపితే వందల సంఖ్యలో ఉంటాయి. ఈ పోస్టుల భర్తీపై సామాజిక, ప్రాంతీయ సమీకరణల కసరత్తు ఎటూ తేలకపోవడంతో ఇప్పటికే పలుమార్లు ఈ ప్రక్రియ వాయిదా పడింది. ఎమ్మెల్సీ హడావుడికాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్సీ హడావుడి కనిపిస్తోంది. మార్చి నాటికి 8 ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేస్తారు. వీటిలో మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్–మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీకి ఆల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి, ముస్కు రమణారెడ్డి, ముదనం గంగాధర్, హరికృష్ణ, వెల్చాల రాజేందర్ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. రెండు టీచర్ ఎమ్మెల్సీల విషయంలో మిత్రపక్ష ఉపాధ్యాయ సంఘాలకు మద్దతిచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల్లో మూడు పదవులు నికరంగా కాంగ్రెస్‌కు రానున్నాయి. ఈ కోటాలో ప్రస్తుత ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డికి మళ్లీ అవకాశం వస్తుందని చెబుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన అనంతరం ఇతర పోస్టులపై స్పష్టత వస్తుందని, నెలాఖరు కల్లా అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. -
మార్చిలోగా పూర్తి చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ‘మార్చిలోగా జీహెచ్ఎంసీ సహా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి. ఆ ఎన్నికల్లో సత్తా చాటేలా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతలను అప్రమత్తం చేయాలి. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలను తొలుత నిర్వహించాలి. తర్వాత మిగతా ఎన్నికలను నిర్వహించేలా కార్యాచరణ తీసుకోవాలి. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న దృష్ట్యా కనీసం 80 శాతం విజయాలు నమోదు చేయాలి. రాష్ట్ర మంత్రులు ఎంతమాత్రం ఉదాసీనంగా ఉండొద్దు. జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలి. ముఖ్య నేతలు కూడా స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..’ అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల్లో ఫలితాల ఆధారంగానే రాబోయే రోజుల్లో నేతలకు పదవుల పంపకాలు ఉంటాయని స్పష్టం చేసింది. ‘స్థానిక’ సంసిద్ధతపై ఆరా రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరితోనే ముగిసింది. మండల, జిల్లా పరిషత్‌ల పదవీకాలం గత జూలైతో పూర్తయ్యింది. ఇక ఈ నెల 26వ తేదీకి ఒకటీ రెండు మినహా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీ కాలం కూడా ముగియనున్న నేపథ్యంలో ఏఐసీసీ వాటి ఎన్నికలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీ సంసిద్ధతపై ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో కేసీ పలు అంశాలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఆ సమావేశానికి కొనసాగింపుగా ఢిల్లీ వేదికగా ఈ కీలక భేటీని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కొండ సురేఖ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, పార్టీ పనితీరు, స్థానిక ఎన్నికలు, సంస్థాగత నిర్మాణం, రాహుల్‌గాంధీ సభ తదితర అంశాలపై సుమారు రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. బీసీ కుల గణనపై కూడా చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలు వివరించిన నేతలు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను కేసీ వేణుగోపాల్‌కు రాష్ట్ర నేతలు వివరించారు. రైతు కూలీలకు కూడా ఏడాదికి రూ.12 వేలు ఆర్థికసాయం అందజేయనుండటం, కొత్త రేషన్ కార్డుల జారీ, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తదితరాలపై తాజా వివరాలు అందజేశారు. ఈ నేపథ్యంలో కేసీ మాట్లాడారు. కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాలన్న కేసీ మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు అందుతున్నాయని, ఇన్చార్జి మంత్రులు తమ తమ జిల్లాల కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపేలా బాధ్యత తీసుకోవాలని కేసీ వేణుగోపాల్ సూచించారు. జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్థత, ఆయా ఎన్నికల్లో విజయడంకా మోగించడంపై దిశానిర్దేశం చేశారు. పీసీసీకి సంబంధించి సంస్థాగత పునర్నిర్మాణంతో పాటు జిల్లాల్లో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మిగిలిపోయిన నామినేటెట్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకం తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. త్వరలో రాష్ట్రంలో నిర్వహించనున్న రాహుల్‌గాంధీ సభ విజయవంతం చేసేలా రూపొందించిన ప్రణాళికలపై చర్చించారు. కష్టపడి పనిచేస్తున్న వారికే పదవులు: మహేశ్‌గౌడ్ ఈ నెలాఖరుకల్లా నామినేటెడ్ పదవులు, పెండింగ్ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్న వారికే పదవులు దక్కుతాయని చెప్పారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు, పీసీసీ కూర్పు ఇతర అంశాలపై చర్చించామని తెలిపారు. ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్‌గాంధీ సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం, పార్టీ పనితీరు భేషుగ్గా ఉందని కేసీ వేణుగోపాల్ ప్రశంసించారన్నారు. కేబినెట్ విస్తరణపై సీఎం, అధిష్టానం పెద్దలు కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. -
మరో 20 ఏళ్లు పవర్లో ఉండాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ ఐదేళ్ళే కాకుండా మరో 20 ఏళ్ల పాటు అధికారంలో ఉండేలా పనిచేయాలని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. సీఎంతో సహా రాష్ట్ర కేబినెట్, టీపీసీసీ అధ్యక్షుడు, అన్ని స్థాయిల్లోని పార్టీ నేతలు కలసికట్టుగా పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. బుధవారం సాయంత్రం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ అధ్యక్షతన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలు, కార్యకలాపాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అభినందించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ప్రశంసించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంతమేర వెనుకబడ్డామని చెప్పారు. ప్రజలను విస్తృతంగా కలవడం ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లవచ్చునని సూచించారు. రాష్ట్ర మంత్రులు విధిగా నెలకోసారి జిల్లాలకు వెళ్లి ప్రజాదర్బార్ నిర్వహించి, పార్టీ కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడాలని, వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వ పనితీరును, కార్యక్రమాలను వివరించాలని సూచించారు, పారీ్టకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండాలని అన్నారు. కార్యకర్తలను, క్షేత్రస్థాయి నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను పీఏసీ సభ్యులందరూ తీసుకోవాలని కోరారు. గ్రామ, మండల, బ్లాక్, జిల్లా,రాష్ట్ర పార్టీ కమిటీలను మూడు వారాల్లోగా ఏర్పాటు చేయాలని సూచించారు. వీలున్నంత త్వరగా ప్రభుత్వ పదవులను కూడా భర్తీ చేయాలని చెప్పారు. అంబేడ్కర్‌ను అవమానించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలి దేశ రాజకీయ చరిత్రలో అంబేడ్కర్‌ను అవమానించిన నాయకులు లేరని, మొదటిసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానకరంగా మాట్లాడిన విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పాదయాత్రలు నిర్వహించాలని కోరారు. మంచి అభిప్రాయం ఉండేలా చూసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆశించిన మేర కృషి జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన వేణుగోపాల్..ముఖ్యమంత్రిపై మంత్రులకు, మంత్రులపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలపై ప్రజలకు మంచి అభిప్రాయం ఉండేలా చూసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలను వివరించిన సీఎం గత ఏడాది కాలంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రూ.21 వేల కోట్లతో రైతు రుణమాఫీ అమలు చేశామని, సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామని, జనవరి 26 నుంచి రైతు భరోసా అమలు చేయబోతున్నామని తెలిపారు. ఒక్కో వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు అందించబోతున్నామని, కొత్త రేషన్‌కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని చెప్పారు. మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. అంబేడ్కర్‌ను అవమానించిన ఉదంతంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి నిరసనలు తెలియజేశామని వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీఏసీ సభ్యులు వి.హన్మంతరావు, జానారెడ్డి, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచందర్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, బలరాం నాయక్, గీతారెడ్డి, అజారుద్దీన్, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి తదితరులు హాజరయ్యారు. పీఏసీ సభ్యురాలు రేణుకాచౌదరి వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి గైర్హాజరయ్యారు. కాగా గురువారం పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ సమావేశం జరిగే ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్లోనే వేణుగోపాల్ బుధవారం రాత్రి బస చేశారు. అక్కడే ఆయనతో కలిసి రేవంత్, తదితరులు డిన్నర్ చేశారు. 25–28 తేదీల మధ్య సంవిధాన్ బచావో ర్యాలీ పీఏసీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు పలువురు నేతలతో కలిసి వాటిని విలేకరులకు వెల్లడించారు. అంబేడ్కర్‌ను అవమానిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 25 నుంచి 28వ తేదీ మధ్యలో తెలంగాణలో సంవిధాన్ బచావో ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ర్యాలీకి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరు కావాలని కోరుతూ పీఏసీ తీర్మానించినట్లు తెలిపారు. సంవిధాన్ బచావో పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు పాదయాత్రలు నిర్వహించాలని, ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ నేతల అభిప్రాయాలను కేవలం పీఏసీ సమావేశంలో మాత్రమే వివరించాలని, ఎవరూ బయట మాట్లాడకూడదని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్ర మంత్రులు ప్రతినెలా జిల్లాల్లో ప్రజా దర్బార్ నిర్వహించాలని కూడా నిర్ణయించామన్నారు. మహాత్మాగాంధీ శత జయంతి ఉత్సవాలను ఏడాది కాలం పాటు రాష్ట్రమంతటా నిర్వహించేలా కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. కొత్త గిగ్ వర్కర్స్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు. -
‘కాంగ్రెస్ వినాశకర పాలన.. ఏడాది మొత్తం దారుణాలే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్(bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ(AICC) ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దోపిడీ దారులు, విధ్వంసకారులు, అబద్ధాల పార్టీగా మారిందని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్(Congress Party) వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు.కేంద్రమంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా సంజయ్ ట్విట్టర్లో..‘ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయింది. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదు. మహిళలకు సాధికారత కల్పించడానికి బదులుగా వారిని చితకబాదారు. అంతేకాకుండా ఇళ్లను పడగొట్టడం, కూరగాయల వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం గర్భిణీలను వీధుల్లోకి నెట్టారు. ఇది పాలన కాదు. ఇది మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వం.తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది వినాశకరమైన పాలనలో అత్యాచార కేసులు 28.94%, మహిళల హత్యలు 13%పెరిగాయి. కిడ్నాప్‌లు, అపహరణలు 26% పెరిగాయి. కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉంది?. మహిళల ప్రాథమిక గౌరవం కూడా దాడికి గురవుతోంది. కాంగ్రెస్ హయాంలో 10,000 మంది మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురయ్యారు. కాంగ్రెస్ దోపిడి దారుల, విధ్వంసకారుల, అబద్ధాల పార్టీగా మారింది అంటూ సంచలన కామెంట్స్ చేశారు. AICC is filled with fake news peddlersTelangana women didn’t get even ₹1 from Congress govt. Instead of empowering women, they are crushing them - demolishing homes, targeting vegetable vendors, and forcing pregnant women onto the streets.This isn’t governance - it’s… https://t.co/mfkOGU1rF7— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 8, 2025 -
కాంగ్రెస్‌ను చంపేస్తారా?.. ఏఐసీసీ కార్యదర్శిపై జగ్గారెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇన్ఛార్జ్లు పార్టీని చంపేయాలని చూస్తున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి ఓ ఫంక్షన్లో ఏఐసీసీ కార్యదర్శిపై ఆయన మాటల దాడి చేశారు. ఇంతకీ మీరు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా..? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా..? అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.మెదక్ జిల్లా కూడా నేనే చూస్తున్నానంటూ విష్ణు చెప్పగా, పార్టీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీ కూడా ఉన్నారా.. వేరే రాష్ట్రం పోయారా..?. అధికార పార్టీ అంటే ఎలా ఉండాలి? మీరేం చేస్తున్నారో అర్థం అవుతుందా? అంటూ జగ్గారెడ్డి నిలదీశారు. కొత్త వాళ్లకు పదవులు సిఫార్సు చేస్తున్నారు. వారు ఫైనల్ అయ్యే వరకు కూడా మాకు తెలియడం లేదంటూ కార్యదర్శికి జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: లగచర్ల రైతుకు సంకెళ్లు.. సీఎం రేవంత్ సీరియస్ -
AICC: ఈవీఎంలపై ఇక దేశవ్యాప్త ఆందోళనలు
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, డీకే శివకుమార్, సుఖ్ విందర్ సింగ్ సుఖు, దీపా దాస్ మున్షి సహా సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భట్టి విక్రమార్క, గిడుగు రుద్ర రాజు, పళ్లం రాజు, రఘువీరారెడ్డి, సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు. . వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన ప్రియాంక గాంధీ, నాందేడ్ ఎంపీ రవీంద్ర వసంతరావు చౌహన్‌కు సీడబ్ల్యుసీ అభినందనలు తెలిపింది. సమావేశంలో నేతలకు ఖర్గే దిశా నిర్దేశం చేస్తూ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినప్పటికీ ఆ తర్వాత జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు...నాలుగు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఇది పార్టీకి ఒక సవాల్. ఎన్నికల ఫలితాల నుంచి తక్షణమే గుణపాఠాలు నేర్చుకోవాలి. పార్టీ బలహీనతలు, లోపాలను సరిదిద్దుకోవాలి. నేతల మధ్య పరస్పర ఐక్యత లేకపోవడం, వ్యతిరేక ప్రకటనలు పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి. పార్టీలో కఠినమైన క్రమశిక్షణ పాటించడం ముఖ్యం. ఎన్నికల్లో ఐక్యంగా ఉంటేనే పార్టీ విజయం సాధిస్తుంది. పార్టీ బలంగా ఉంటేనే వ్యక్తులు బలంగా ఉంటారు. సంస్థాగతంగా కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి...ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు సమస్యలు గానే, కుల గణన కూడా ఒక ముఖ్యమైన అంశం. జాతీయ సమస్యలే కాకుండా రాష్ట్ర స్థాయి సమస్యలను ఎజెండాగా పోరాటం చేయాలి. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సన్నాహాలు చేసుకోవాలి. విజయాలకు నూతన పద్ధతులను అవలంబించాలి. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల తీరు అనుమానాస్పదంగా ఉంది. మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు వచ్చినప్పటికీ అసెంబ్లీ ఫలితాల్లో ప్రతికూలంగా రావడం రాజకీయ పండితులకు సైతం అర్థం కావడం లేదు. రాజ్యాంగాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది, సామాన్య ప్రజలకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే’’ అని ఖర్గే పేర్కొన్నారు.ఈవీఎంలపై దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ కార్యచరణ రూపొందించనున్నారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్.. బ్యాలెట్ ద్వారానే ఇకపై ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేసిన తెలిసిందే. పలు రాష్ట్రాల్లో సంస్థాగతంగా ఉన్న సమస్యలపై కూడా ఈ సమావేశంలో సమీక్షించారు.ఇటీవల ముగిసిన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రదర్శనతోపాటు రాబోయే ఢిల్లీ ఎన్నికల సన్నద్ధత, పొత్తుల అవకాశాలపై పార్టీ కీలక నేతలంతా చర్చించారు. కాగా వచ్చే ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలపైనా చర్చించినట్లు సమాచారం. అదే విధంగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపైన సమీక్షించారు. అదానీ వ్యవహారంపై ప్రశ్నలు లెవనేత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వంటి అశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.ఈసీకి లేఖ.. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ అలాగే కౌంటింగ్‌కు సంబంధించిన డేటాలో ‘తీవ్రమైన వ్యత్యాసాలు’ ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ.. శుక్రవారం భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి లేఖ రాసింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు వ్యక్తిగతంగా విచారణ జరపాలని పార్టీ అభ్యర్థించింది.మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చూస్తూ.. అధికార మహాయుతి కూటమి అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది.కాంగ్రెస్ తన లేఖలోఓటర్లను ఏకపక్షంగా తొలగించిన ఈసీ.. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో 10,000 మందికి పైగా ఓటర్లను తుది ఓటర్ల జాబితాలో చేర్చినట్లు ఆరోపించింది. మహారాష్ట్ర ఓటర్ల జాబితాకు సంబంధించి మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేవనెత్తిన ఆందోళనలను కూడా పార్టీ లేవనెత్తింది.నవంబరు 20న సాయంత్రం ఐదు గంటలకు 58.22 శాతం పోలింగ్ శాతం నమోదైందని ఈసీ వెల్లడించిందని, అయితే రాత్రి 11:30 గంటలకు మరో 7.83 శాతం పోలింగ్ అదనంగా నమోదైనట్లు తెలిపిందని, ఇంత భారీ వ్యత్యాసానికి కారణాలేమిటేది ఈసీ తెలుపాలని కోరింది. -
ముగిసిన ఏఐసీసీ మీటింగ్.. సెబీ, అదానీలే టార్గెట్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఏఐసీసీ సమావేశంలో ముఖ్యంగా సెబీ, అదానీల అంశంపై ముఖ్యంగా చర్చ జరిగినట్టు సమాచారం. ఈ సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ..‘రానున్న ఎన్నికల కోసం సన్నద్ధత, పార్టీ సంస్థాగత అంశాలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై చర్చ జరిగింది. సెబీ, అదానీల మధ్య అనుబంధంపై సమగ్ర దర్యాప్తు అవసరం ఉంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తక్షణమే సెబీ చైర్పర్సన్ రాజీనామాను కోరాలి. అదానీ వ్యవహారంపై జేపీసీని ఏర్పాటు చేయాలి. దేశంలో హద్దులేని నిరుద్యోగం, అనియంత్రిత ద్రవ్యోల్బణం, పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం ద్రోహం చేస్తోంది.ఇక, దేశంలో రాజ్యాంగంపై దాడి నిరాటంకంగా కొనసాగుతోంది. కుల గణన అనేది ప్రజల డిమాండ్. రైతులకు ఎంఎస్పీ చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలి. రైళ్లు పట్టాలు తప్పడం, రైలు ప్రమాదాలు ఆనవాయితీగా మారాయి. మౌలిక వసతులు మెరుగుపరచాలి. పలు సమస్యలపై జాతీయ స్థాయిలో ప్రచారానికి రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్తాం అని చెప్పుకొచ్చారు.We convened a meeting of AICC General Secretaries, In-charges and Pradesh Congress Committee Presidents to discuss Organisational matters and various issues of national importance for election preparedness. 1⃣The shocking revelations of nexus between SEBI and Adani needs to a… pic.twitter.com/jNOmGRI22V— Mallikarjun Kharge (@kharge) August 13, 2024 -
ముగిసిన కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ బలోపేతంపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం(ఆగస్టు13) ఉదయం అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులతో పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారు. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీచీఫ్ మల్లికార్జున ఖర్గే , ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొని పీసీసీ చీఫ్‌లకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికలకు కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జరుగుతున్న సమావేశం ఇదే. -
గాంధీ భవన్ కు చేరుకున్న కురియన్ కమిటీ
-
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త చీఫ్.. భారీ పోటీ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు అవుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సైతం 8 సీట్లను గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ మెరుగైన ప్రదర్శన ఇచ్చిది. అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త చీఫ్‌ను నియమించాల్సిన సమయం వచ్చింది. కొత్త చీఫ్‌తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ల మార్పుపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఈ నెలాఖరులోగా కొత్త చీఫ్‌పై ఏఐసీసీ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్ ఎంపికపై కాంగెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పీసీసీ చీఫ్‌తో పాటు, వర్కింగ్ ప్రెసిండెంట్స్కు సీనియర్, కీలక నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. పీసీసీ చీఫ్ పోటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, మహేష్‌కుమార్ గౌడ్, మధుయాష్కిలు ఉన్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, సంపత్ కుమార్ తదితరులు పీసీసీ చీఫ్ ఆశావహుల్లో ఉన్నారు. మరోవైపు.. పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పదవులను కోసం సైతం పలువురి మధ్య పోటీ నెలకొంది. వాటిని కాంగ్రెస్ నేతలు రవళి రెడ్డి, కమల్ ఆశిస్తున్నట్లు సమాచారం. -
రేవంత్ రెడ్డికి చెక్ ?.. తెలంగాణలో కర్ణాటక ఫార్ములా
-
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త పీసీసీ చీఫ్
-
ప్రతిపక్ష నేతగా రాహుల్!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పుంజుకోవడంలో.. అటు కూటమి పక్షాల విజయంలో తనవంతు పాత్ర పోషించిన ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల్లో ఆయన పనితీరుపై అన్ని పక్షాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టి, పార్లమెంటులో ముందుండి పార్టీని నడిపించాలనే డిమాండ్లు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇండియా కూటమిలోని చిన్నాచితకా పార్టీల నేతలు ఆయన ఎంపికను సమరి్ధస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి 2014లో కాంగ్రెస్ 48, 2019 ఎన్నికల్లో 52 స్థానాలు గెలుచుకున్న సమయంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ సమయంలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్‌గాంధీని కొనసాగించాలనే డిమాండ్లు వచి్చనా ఆయన నిరాకరించారు. అయితే ప్రస్తుతం పారీ్టకి సొంతంగా 99 సీట్లు వచ్చాయి. లోక్‌సభలో 10 శాతం సీట్లు అంటే కనీసంగా 55 సీట్లు వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రస్తుతం ఆ స్థానాలు గెలిచినందున ఆ హోదాలో రాహుల్‌గాంధీ ఉండాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఆయన ప్రస్తుత ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి భారీ మెజారీ్టలతో గెలవడంతో పాటు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడులో కూటమి పక్షాలకు మెజార్టీ స్థానాలు దక్కడంలో కీలకపాత్ర పోషించారు. ఈ దృష్ట్యానే పార్టీ నేతలు ఆయన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాణిక్యం ఠాగూర్ ‘ఎక్స్’లో స్పందిస్తూ ‘నేను మా నాయకుడు రాహుల్ గాంధీ పేరు మీద ఓట్లు అడిగాను. ఆయన లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడిగా ఉండాలని భావిస్తున్నాను. ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు కూడా అలాగే ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను’ అని పోస్ట్ చేశారు. మరో సీనియర్ నేత డీకే శివకుమార్ సైతం రాహుల్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటారని జోస్యం చెప్పారు. ఒకవేళ రాహుల్ కాదన్న పక్షంలో సీనియర్ నేతలైన శశిథరూర్, గౌరవ్ గొగోయ్, మనీశ్ తివారీ, కేసీ వేణుగోపాల్‌లలో ఒకరిని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేస్తారని చెబుతున్నారు. దీనిపై 8న జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత నిర్ణయం చేస్తారని అంటున్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సీడబ్యూసీ భేటీ జరగనుంది. ఇక రాహుల్ గెలిచిన రెండు స్థానాల్లో దేనిలో కొనసాగుతారు, దేనిని వదులుకుంటారన్న దానిపై ఇదే భేటీలో కొంత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. -
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్ఠాత్మక లోక్‌సభ నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీ, కిశోరీ లాల్ శర్మ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పరిశీలకులుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రులను నియమించింది.రాయ్‌బరేలీ, అమేథీ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏఐసీసీ సీనియర్ పరిశీలకులుగా భూపేశ్ బాఘెల్, అశోక్ గెహ్లాట్లను నియమించే ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపినట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.ప్రియాంక గాంధీ ఇప్పటికే ప్రచారానికి నాయకత్వం వహించారు. సోమవారం నుంచి ఎన్నికలు ముగిసే వరకు రాయ్‌బరేలీ, అమేథీలలో క్యాంపెయిన్ చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రచారంలో భాగంగా ప్రియాంక ఇంటింటికీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందిని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, గాంధీ కుటుంబంతో దశాబ్దాలుగా కుటుంబ సంబంధాలు ఉన్న వారితో ఇప్పటికే ఔట్ రీచ్ ప్రారంభమైందని ఆ వర్గాలు తెలిపాయి. రెండు నియోజకవర్గాల్లో డిజిటల్, సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తారని సమాచారం.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వంటి అగ్రనేతల ప్రచార ప్రణాళికలను, షెడ్యూల్‌ను కూడా ప్రియాంక గాంధీ చూసుకుంటారు. ఈమె ఎన్నికల ప్రచారంలో భాగంగా 200 నుంచి 300 గ్రామాలను కవర్ చేస్తూ.. రెండు నియోజక వర్గాలకు సమయాన్ని కేటాయిస్తుందని సమాచారం.ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీలో వేసిన బలమైన పునాదుల కారణంగా అయన భార్య, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1967, 1971, 1980లలో గెలుపొందారు. తరువాత గాంధీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. అమేథీలో ప్రస్తుత బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ చేతిలో ఉంది. దీన్ని మళ్ళీ హస్తం హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.#LokSabhaElections2024 | Congress appoints Bhupesh Baghel as AICC Senior Observer to Raebareli and Ashok Gehlot to Amethi. pic.twitter.com/GSJ0EQvwBv— ANI (@ANI) May 6, 2024 -
మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
నిర్మల్/ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రతి ఇంట్లో నుంచి ఓ మహిళను ఎన్నుకుని, ఆమె ఖాతాలో నెలకు రూ.8,500 చొప్పున జమ చేస్తామని తెలిపారు. తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా మరో రూ.30 వేలు అందుతాయని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేస్తోందని.. కేంద్రంలోనూ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే గ్యారంటీలను దేశమంతా అమలు చేస్తామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో, జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన జన జాతర సభల్లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి చూపించాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో హామీలను అమలు చేస్తాం. ప్రస్తుతం మహిళలు, పురుషులు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. పురుషులు ఎనిమిది గంటలపాటు ఉద్యోగం చేస్తారు. మహిళలు ఇంట్లో అదనంగా మరో ఎనిమిది గంటలు పనిచేస్తారు. ఆ అదనపు పనికి ఎలాంటి చెల్లింపు ఉండదు. అందుకే వారికోసం విప్లవాత్మక పథకాన్ని తీసుకొస్తాం. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఆర్థిక సర్వే చేపడతాం. ప్రతి పేద కుటుంబం నుంచి ఓ మహిళను ఎన్నుకుని.. ఆమె ఖాతాలో ప్రతీనెలా రూ.8,500 చొప్పున ఏడాదికి రూ.లక్ష జమ చేస్తాం. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ మేరకు నెలకు రూ.2,500 చొప్పున ఏడాదికి రూ.30 వేలు అదనంగా జమ అవుతాయి. అంటే రాష్ట్ర మహిళలు ఏడాదికి రూ.1.30 లక్షలు అందుకుంటారు. యువతకు పక్కాగా ఉద్యోగాలు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగువేల కిలోమీటర్లు నడిచా. ఆ సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. తమ భవిష్యత్‌ను మోదీ నాశనం చేశారని నిరుద్యోగ యువత నా దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిగ్రీ, పీజీ చదివిన నిరుద్యోగ యువత కోసం.. ‘పహలే నౌకరీ పక్కీ (మొదట ఉద్యోగం గ్యారంటీ)’స్కీమ్ తీసుకువస్తాం. నిరుద్యోగ యువతకు ఒక ఏడాది ఇంటర్న్‌షిప్‌తోపాటు నెలకు రూ.8,500 చొప్పున రూ.లక్ష అందజేస్తాం. స్కిల్ ఉన్నవారికి ప్రైవేటు రంగంలో రెగ్యులర్ ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం. దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం. కులగణనతో.. దేశ ముఖచిత్రం మారుతుంది దేశంలో 50శాతం కంటే ఎక్కువగా వెనుకబడిన కులాలవారు, 15 శాతం దళితులు, 7–8 శాతం గిరిజనులు, 15 శాతం మైనారిటీలు, 5–6 శాతం అగ్రకుల పేదలు ఉన్నారు. వారి గురించి ఎక్కడా, ఏ ప్రభుత్వం కూడా ఆలోచించదు. అన్ని రంగాల్లో అగ్రకులాలదే ఆధిపత్యం. మేం అధికారంలోకి రాగానే దేశంలో కులగణన చేపడతాం. దానితో ఎవరు ఎంత శాతం ఉన్నారో బయటికి వస్తుంది. దేశ ముఖచిత్రమే మారిపోతుంది..’’అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాము తెలంగాణలో ‘నఫ్రత్ కే బజార్ మే.. మొహబ్బత్ కీ దుకాణ్ (విద్వేషంతో కూడిన మార్కెట్లో.. ప్రేమ దుకాణం)’తెరిచామని.. రేపు ఢిల్లీలో కూడా తెరుస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర ‘‘ఈసారి ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య సాగుతున్నాయి. కాంగెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుంటే.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాయి. దేశంలో పేదలు, దళితులు, ఎస్టీలకు ఏవైనా ఫలాలు అందాయంటే.. అవి ఈ రాజ్యాంగం వల్లనే. గాం«దీజీ, అంబేడ్కర్ లేకుంటే ఈ రాజ్యాంగం వచ్చేది కాదు. అంబేడ్కర్, గాందీజీ దేశానికి చేసిన సేవలు, పనులను బీజేపీ తుడిచిపెట్టాలని చూస్తోంది. రాజ్యాంగాన్ని చించివేయాలని చూస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ నేతలు నేరుగానే చెప్తున్నారు. రాజ్యాంగాన్ని మారిస్తే.. రిజర్వేషన్లు కూడా రద్దు అవుతాయి. పేదలు, దళితులు, గిరిజనుల హక్కులను లాక్కోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఎక్కడా ఆయన ప్రసంగాలలో రిజర్వేషన్ పెంచుతామని చెప్పలేదు. రిజర్వేషన్లను తొలగించడానికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారు. దేశంలో రిజర్వేషన్లను 50 శాతంకన్నా ఎక్కువకు పెంచాల్సిన అవసరం ఉంది. మేం అధికారంలోకి రాగానే రిజర్వేషన్లను పెంచుతాం..’’అని రాహుల్ గాంధీ తెలిపారు. పక్కాగా రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి నిర్మల్, గద్వాల సభల్లో రాహుల్ గాంధీతోపాటు టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పక్కాగా రుణమాఫీ చేస్తామని, రైతులందరికీ రైతు భరోసా సొమ్ము అందజేస్తామని స్పష్టం చేశారు. ‘‘రైతు భరోసా పడటం లేదని కేసీఆర్ అంటున్నారు. ఈనెల 9 తేదీలోపు రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా నిధులు వేసే బాధ్యత మాది. రుణమాఫీ గురించి హరీశ్‌రావు మాట్లాడుతున్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి చూపిస్తాం. ఆరు గ్యారంటీల అమలెక్కడా? అని కేటీఆర్ అడుగుతున్నరు. దీనిపై కేటీఆర్‌కు ఓ సూచన చేస్తున్నా.. మంచిగా చీర కట్టుకుని, ఆడపిల్లలా తయారై ఆర్టీసీ బస్సు ఎక్కు. ఇంద్రవెల్లి, నాగోబా జాతర, భద్రాచలం, యాదగిరిగుట్ట ఎక్కడికి వెళ్లు.. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే ఆరు గ్యారంటీలు అమలు చేయనట్లే’’అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. 70ఏళ్ల చరిత్రలో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారిగా గోండు ఆడబిడ్డ ఆత్రం సుగుణకు పోటీ అవకాశం వచ్చిందని.. కొమురం భీం, రాంజీ గోండు స్ఫూర్తిగా ఆమెను గెలిపించుకోవాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ను తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ పోరాటం చేసిందని.. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తోందని చెప్పారు. రుణమాఫీ.. పంటలకు మద్దతు ధర.. బీజేపీ కేవలం 2, 3 శాతమున్న ధనిక వర్గాల కోసమే పనిచేస్తోంది. గత పదేళ్లలో మోదీ 2–3 కుటుంబాల కోసమే పనిచేశారు. అదానీ, అంబానీ వంటి వ్యక్తులకు సంబంధించి రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. దేశంలో విమానాశ్రయాలు, రక్షణ, ఓడలు, మౌలిక వసతుల కల్పన పరిశ్రమలను అమ్మి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతులకు మాత్రం ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు. రుణాలు మాఫీ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేస్తాం. రైతుల పంటలకు చట్టబద్ధతతో కనీస మద్దతు ధర అందేలా చూస్తాం. -
అంతిమ విజయం మాదే..: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బీటీంగా ఉన్న బీఆర్ఎస్ను ఓడించామని.. లోక్‌సభ ఎన్నికల్లో ఏ టీం బీజేపీని ఓడిస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మోదీ దగ్గర ఈడీ, సీబీఐ, సంపద ఉన్నాయని.. తమ దగ్గర నిజాయతీ, ప్రజల ప్రేమ ఉన్నాయని చెప్పారు. అంతిమ విజయం నిజాయతీది, ప్రజల ప్రేమదేనన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించామని.. న్యాయపత్రం పేరిట విడుదల చేసిన ఈ మేనిఫెస్టోకు ఐదు గ్యారంటీలు ఆత్మలాంటివని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, ఇప్పటివరకు 20వేల ఉద్యోగాలిచ్చామని, త్వరలోనే మరో 50వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ప్రకటించారు. తెలంగాణ దేశానికి మోడల్ కావాలని ఆకాంక్షించారు. శనివారం రాత్రి హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులందరికీ ఏడాదికి రూ.లక్ష వేతనంతో అప్రెంటిస్‌షిప్ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. నారీ న్యాయ్ పేరుతో ఏటా రూ.లక్షను ప్రతి కుటుంబంలోని ఒక మహిళకు ఇస్తాం. ఇది విప్లవాత్మక మార్పు. దీనిద్వారా దేశ ముఖచిత్రం మారబోతోంది. కిసాన్ న్యాయ్ పథకం ద్వారా రుణమాఫీ చేస్తాం. పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించబోతున్నాం. స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తాం. శ్రామిక్ న్యాయ్ పథకం ద్వారా కార్మికులు, కూలీలకు కనీస వేతనాలు అమలు చేస్తాం. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారితో పాటు ఇతర రంగాల్లోని కారి్మకులకు రోజుకు రూ.400 కనీస వేతనం ఇస్తాం. ఎవరెంతో.. వారికంత.. మేం మరో చరిత్రాత్మకమైన గ్యారంటీ ఇస్తున్నాం. దేశంలో 50శాతం మంది ప్రజలు బలహీనవర్గాలకు చెందినవారే. 15శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, ఆదివాసీలు, 15 శాతం మంది మైనార్టీలు, 5 శాతం మంది పేద అగ్రవర్ణాల ప్రజలున్నారు. 90శాతం వీరే ఉన్నారు. కానీ దేశంలోని ప్రభుత్వ సంస్థలు, పెద్ద కంపెనీల్లో వీరు కనిపించరు. దేశంలోని పెద్ద 200 కంపెనీల యజమానులను చూస్తే ఈ వర్గాలకు చెందిన వారుండరు. దేశాన్ని పాలించే ముఖ్యమైన 90 మంది ఏఐఎస్ అధికారుల్లో ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారు. జనాభా 50శాతం అయితే పాలనలో భాగస్వామ్యం ఐదుగురిదే. ఒక గిరిజనుడు, ముగ్గురు దళితులు ఉన్నారు. ఇక బడ్జెట్ ఖర్చులో వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలకు 6 శాతమే వస్తోంది. మా ప్రభుత్వం వస్తే.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్నట్టుగానే.. జనాభా కులగణన చేస్తాం. దేశాన్ని ఎక్స్‌రే చేసి పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేటతెల్లం చేస్తాం. ఆయా వర్గాల ఆర్థిక, వ్యవస్థీకృత సర్వే కూడా చేయించి.. ఎవరి హక్కులు వారికి కల్పిస్తాం. మావి గ్యారంటీలు కాదు.. ప్రజల గొంతుక.. జాతీయ స్థాయి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ఇప్పుడు ఆవిష్కరించుకున్నాం. మేమిచ్చింది ఐదు గ్యారంటీలు కాదు. అది ప్రజల గొంతుక. తెలంగాణలో అమల్లోకి తెచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి గ్యారంటీలన్నీ ప్రజల గొంతుకలే. తెలంగాణలో హామీలను నిలబెట్టుకున్నాం. దేశంలో భారీగా నిరుద్యోగం ఉన్న సమయంలో తెలంగాణలోని 20వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. 50వేల మందికి త్వరలోనే ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ఇక్కడ మాట నిలబెట్టుకున్నట్టుగానే.. జాతీయ స్థాయి మేనిఫెస్టోను అమలు చేస్తాం. కేసీఆర్, మోదీలవి బలవంతపు వసూళ్లు గతంలో తెలంగాణ సీఎం ప్రభుత్వాన్ని ఎలా నడిపించారో తెలుసు. వేల మంది ఫోన్లు ట్యాప్ చేశారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, పోలీసు వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. ప్రభుత్వం మారగానే డేటా మొత్తం ధ్వంసం చేసి నదిలో పడేశారు. భయపెట్టి, బలవంతం చేసి మీ సంపద దోచుకున్నారు. తెలంగాణలో అదంతా వెలికితీసే పని ప్రారంభమైంది. ఇక్కడ కేసీఆర్ చేసినట్టుగానే ఢిల్లీలోని మోదీ ప్రభుత్వం చేస్తోంది. ఆ పార్టీ పక్షాన ఓ బలవంతపు వసూళ్ల విభాగం (ఎక్స్టార్షన్ డైరెక్టరేట్) పనిచేస్తోంది. దేశంలోని అత్యంత అవినీతిపరులంతా మోదీ వెనుక నిలబడ్డారు. ఎన్నికల కమిషన్‌లో కూడా మోదీ తన మనుషులను పెట్టుకున్నారు. ఎలక్టోరల్ బాండ్లు ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం. ఆ బాండ్లను పరిశీలిస్తే వాస్తవాలేంటో తెలుస్తాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం బ్యాంకు ఖాతాలను నిలిపివేశారు. కానీ మేం భయపడేది లేదు. తెలంగాణలో బీజేపీకి బీటీంను ఓడించాం. ఇప్పుడు దేశంలో ఏ టీంను ఓడించబోతున్నాం. మనది కుటుంబ బంధం తెలంగాణ ప్రజలతో నాకున్నది రాజకీయ బంధం కాదు. కుటుంబ బంధం. సోనియాగాంధీ ఎలాగూ మీ వైపే ఉంటారు. ఢిల్లీలో నేను కూడా మీ సిపాయినే. తెలంగాణ ప్రజలు, యువకులు ఎప్పుడు పిలిచినా వస్తాను. చిన్న పిల్లాడు పిలిచినా మీ ముందుంటా. మీ కోసం వస్తా. దేశంలో తెలంగాణ కొత్త రాష్ట్రం. ఈ రాష్ట్రం దేశానికి మార్గం చూపించాలి. మేడిన్ తెలంగాణ.. మేడిన్ చైనాతో తలపడేలా చేద్దాం. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటోంది దేశంలోని పౌరులందరికీ రక్షణ కల్పించే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ భావిస్తోంది. కానీ మేం ఆ పని చేయనీయం. బీజేపీ హింసను ప్రోత్సహిస్తోంది. మత విద్వేషాలు రేపుతోంది. అదే మా పోరాటం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే. మా విప్లవాత్మక మేనిఫెస్టో దేశ ముఖచిత్రాన్ని మార్చబోతోంది. అది దేశ ఆత్మ. పేదలు, రైతులు, మహిళలు, యువకుల జీవితాలను మార్చగలదు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుంది. జైహింద్... జై తెలంగాణ’’ అంటూ రాహల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించారు. -
కాంగ్రెస్ రెండో జాబితా రెడీ!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి రెండో విడత జాబితా ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. నేతల జనాదరణను పరిగణనలోకి తీసుకుని పేర్లు ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి ప్రకటనా వెలువడక పోవడంతో.. ఎన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు, ఎవరెవరికి టికెట్లు లభించాయన్న దానిపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎనిమిది చోట్ల అభ్యర్థులు ఫైనల్ అయ్యారని ఏఐసీసీ వర్గాలు చెబుతుండగా, ఆరు స్థానాలు పరిశీలించినా, ఐదుగురు అభ్యర్థుల ఎంపిక మాత్రమే పూర్తయిందనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సీఈసీ ఆమోద ముద్ర: ఢిల్లీలో మంగళవారం సాయంత్రం సీఈసీ సమావేశం జరిగింది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు సంబంధించి పలువురు అభ్యర్థులకు ఆమోదముద్ర వేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియాగాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మంత్రి ఉత్తమ్ సహా కమిటీ ఇతర సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించి చర్చ జరిగినప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఆదివారం ముంబైలో జరిగిన రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఖరారు చేసిన జాబితాపై చర్చించారు. 13 మందిని ప్రకటించాలనుకున్నా.. తొలి జాబితాలో జహీరాబాద్, మహబూబాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై పార్టీ పెద్ద ఎత్తున కసరత్తు జరిపింది. ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం..13 మంది అభ్యర్థుల పేర్లను సీఈసీలో చర్చించి ఒకేసారి ప్రకటించాలని భావించారు. అయితే ఐదు లోక్‌సభ స్థానాలకు ఎక్కువమంది ఆశావహులు ఉండడంతో వాటిపై పీటముడి పడింది. దీంతో అవి మినహా మిగిలిన 8 స్థానాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి డాక్టర్ సుమలత, కరీంనగర్ నుంచి ప్రవీణ్‌రెడ్డి, వరంగల్ నుంచి పసునూరి దయాకర్‌ల పేర్లు పరిగణనలోకి తీసుకుని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఖమ్మం, సికింద్రాబాద్, భువనగిరి, హైదరాబాద్, మెదక్ స్థానాలపై ఈ నెల 21న మరోసారి జరుగనున్న సీఈసీ భేటీలో చర్చించే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు చెపుతున్నాయి. ఆరు స్థానాలపైనే చర్చ: గాం«దీభవన్ వర్గాలు గాందీభవన్ వర్గాల సమాచారం ప్రకారం.. సీఈసీ భేటీలో ఆరు స్థానాలపైనే చర్చ జరిగింది. అయితే ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేశారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, ఆదిలాబాద్ నుంచి డా.సుమలతల అభ్యర్థిత్వాలకు సీఈసీ ఆమోదం తెలిపింది. భువనగిరిపై కూడా చర్చ జరిగినా.. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిల్లో ఒకరిని ఖరారు చేయాలా? ఇంకెవరికైనా అవకాశం కల్పించాలా? అన్న దానిపై మరోమారు చర్చించాలనే నిర్ణయానికి వచ్చారు. మొత్తం మీద బుధవారం అధికారికంగా జాబితా ప్రకటించే అవకాశం ఉందని, కానిపక్షంలో మరుసటి రోజు విడుదల చేస్తారని చెబుతున్నారు. అయితే 8 స్థానాలకు ప్రకటిస్తారా లేక ఐదుకే పరిమితమవుతారా? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. -
39 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన తొలి జాబితాను విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో 39 మంది పేర్లతో కూడిన జాబితాను ప్రకటించారు. ఈ 39 మందిలో రాహుల్ గాంధీ, శశిథరూర్‌లాంటి కీలక నేతలు ఉన్నారు. తొలి జాబితాలో ఉన్న 39మందిలో 15మంది జనరల్.. 24 మంది ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ కేటగిరీకి చెందినవారు ఉన్నట్లు వేణుగోపాల్ తెలిపారు. 12 మంది అభ్యర్థులు 50 ఏళ్లు లోపువారేనన్నారు. ఆ పార్టీ కీలక నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే పోటీ చేయబోతున్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌ను.. రాజ్‌నంద్‌గావ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించబోతోంది కాంగ్రెస్. అలాగే కన్నడ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతకు శివమొగ్గ టికెట్‌ను కేటాయించింది ఏఐసీసీ. కిందటి ఏడాదే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఈ నెల 11వ తేదీన మరోసారి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. మిగిలిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ నేత సోనియాగాంధీ, కేసీ వేణుగోపాల్‌ల నేతృత్వంలో పార్టీ ‘కేంద్ర ఎన్నికల కమిటీ’ సమావేశమై తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హర్యానా, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారుచేసే అంశంపై కసరత్తు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌మున్షీతోపాటు పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేశ్, అధీర్‌రంజన్ చౌధరి, అంబికాసోని, ముకుల్‌వాస్నిక్, టీఎం సింగ్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వర్చువల్‌గా హాజరయ్యారు. తెలంగాణకు నాలుగు.. ఇక తెలంగాణలో నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి నల్లగొండ నుంచి కందూరు రఘువీర్‌రెడ్డి, జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కార్, మహబూబ్‌నగర్ నుంచి చల్లా వంశీ చంద్ రెడ్డి, మహబూబాబాద్ బలరామ్ నాయక్ పేర్లు ఉన్నాయి. అంతకు ముందు కాంగ్రెస్ సీఈసీ నుంచి వచ్చిన జాబితాలో చేవెళ్ల అభ్యర్థిగా సునీతా మహేందర్‌రెడ్డి ఉన్నప్పటికీ.. తుది జాబితాలో ఆ స్థానం అభ్యర్థి పేరును ప్రకటించకపోవడం గమనార్హం. 39 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా -
Congress List: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్, తెలంగాణ అభ్యర్థులు వీళ్లే..
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగగ్రెస్ తొలి జాబితాకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో శుక్రవారం సాయంత్రం 36 మందితో కూడిన తొలి జాబితాను అధికారికంగా రిలీజ్ చేయనుంది. ఇందులో తెలంగాణలో నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లిస్ట్‌లో .. జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కార్, నల్లగొండ కందూరు రఘువీర్‌రెడ్డి, చేవెళ్ల సునీతా మహేందర్‌రెడ్డి, మహాబూబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ తొలి జాబితాలో హోల్డ్‌లో ఉంచిన స్థానాల్లో మహబూబ్ నగర్ పార్లమెంటరీ స్థానం కూడా ఉంది. మహబూబ్ నగర్ నుంచి అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి పేరును టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ వంశీ పేరును ఏఐసీసీ హోల్డ్‌లో ఉంచడం గమనార్హం. మరోవైపు ఆ పార్టీ కీలక నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే పోటీ చేయబోతున్నారు. అలాగే కన్నడ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతకు శివమొగ్గ టికెట్‌ను కేటాయించింది ఏఐసీసీ. కిందటి ఏడాదే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌ను.. రాజ్‌నంద్‌గావ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించబోతోంది కాంగ్రెస్. కేసీ వేణుగోపాల్ మరికాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించి తొలి జాబితాను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. -
10 మందితో కాంగ్రెస్ తొలి జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ:వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై తొలి విడత కసరత్తును ఏఐసీసీ అగ్ర నాయకత్వం పూర్తి చేసింది. తెలంగాణలోని సుమారు పది స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది. ప్రాంతీయ, కుల సమీకరణలు, రాజకీయ నేపథ్యం, సర్వేల్లో విజయావకాశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. అభ్యర్థుల ప్రకటన ఏక్షణమైనా వెలు వడవచ్చని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. పెద్దపల్లిలో గడ్డం వంశీ, మహబూబ్‌నగర్‌లో వంశీచంద్‌రెడ్డి, నిజా మాబాద్‌లో టి.జీవన్‌రెడ్డి, మహబూబాబాద్‌లో బల రాంనాయక్, చేవెళ్లలో సునీత మహేందర్‌రెడ్డి, నల్ల గొండలో రఘువీర్‌రెడ్డి, కరీంనగర్లో ప్రవీణ్‌రెడ్డిల పో టీకి ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేక పోవ డంతో వారి అభ్యర్థిత్వాలకు సీఈసీ ఆమోదం తెలిపి నట్లు తెలిసింది. జహీరాబాద్ స్థానానికి సురేశ్ షెట్కా ర్, ఉజ్వల్‌రెడ్డిల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు గురువారం సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఏఐసీసీ కార్యాలయంలో భేటీ అయ్యింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అంబికా సోని, తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తదిత రులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియో జ కవర్గాల నుంచి పరిశీలనలోకి వచ్చిన అభ్యర్థుల వివరాలు, స్క్రూటినీ అనంతరం మిగిలిన అభ్యర్థుల వివరాలను సీఈసీ ముందుంచారు. రెండున్నర గంటల పాటు జరిగిన భేటీలో సునీల్ కనుగోలు సహా ఏఐసీసీ స్థాయిలో చేసిన సర్వేల నివే దికలు ముందుపెట్టుకొని నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. మొదటగా సింగిల్ పేర్లతో కూడిన స్థానాలను కమిటీ పరిశీలించింది. మొత్తంగా 8–10 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు జాబితాను ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరిన్ని స్థానాలపై చర్చ మిగతా స్థానాలపై కూడా చర్చించినా, మరోమారు సమావేశమై సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సికింద్రాబాద్‌లో ఇటీవలే పార్టీలో చేరిన బొంతు రామ్మో హన్ దంపతులు, నాగర్‌కర్నూల్‌లో మల్లురవి, సంపత్ కుమార్, వరంగల్‌లో దారా సాంబయ్య సహా మరో పేరు, మల్కాజిగిరిలో చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు, మెదక్‌లో మైనంపల్లి హన్మంతరావు, నీలం మధు, ఆదిలాబాద్‌లో ఆదివాసీలైన ఇద్దరి పేర్లపై చర్చి జరిగినట్లు తెలిసింది. ఆయా స్థానాలపై వచ్చే వారంలో తుది నిర్ణయం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. -
తెలంగాణ: ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ
ఢిల్లీ: తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించింది. రేణుక చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్‌కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. దీంతో పెద్దల సభలోకి యువకుడు అనిల్ కుమార్ యాదవ్ అడుగుబెట్టనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనిల్ కుమార్ యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్‌కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక.. అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, చంద్రశేఖర్‌లను రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి ఎంపిక చేసింది. మధ్య ప్రదేశ్ నుంచి అశోక్‌సింగ్‌ను ఏఐసీసీ ఎంపిక చేసింది. వీరంతా రేపు(గురువారం) నామినేషన్ వేయనున్నారు. రేణుకా చౌదరీ ఎవరి కోటా.? తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపిక చేసిన రేణుకా చౌదరీ పేరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. విశాఖలో పుట్టిపెరిగిన రేణుకా చౌదరీ.. బెంగళూరులో చదువుకున్నారు. 1984లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1986 నుంచి 1998 వరకు తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్‌గా పని చేశారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 1998లో టిడిపిని వీడి కాంగ్రెస్‌లో చేరిన రేణుకా ఖమ్మం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. వివాదస్పద ప్రకటనలు చేసి తరచుగా వార్తల్లోకెక్కే రేణుకా చౌదరీ మరోసారి రాజ్యసభకు వెళ్లనున్నారు. అనిల్ కుమార్ యాదవ్ పేరు ఆశ్చర్యమే.! తెలంగాణ నుంచి తనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానికి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటన వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "నాలాంటి యువకుడికి అధిష్ఠానం రాజ్యసభ అవకాశం ఇవ్వడం అనందంగా ఉంది. కష్టపడే వారికి కాంగ్రెస్‌లో పదవులు దక్కుతాయి అనడానికి ఇదే ఉదాహరణ. నాకు పదవి ఇవ్వడం అంటే యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషి గుర్తించినట్టు.!. బీసీల తరపున కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు. కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి తేవడమే రాహుల్ గాంధీ లక్ష్యం. బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ, నాకు రాజ్యసభ ఇవ్వడంతో కాంగ్రెస్ యువతకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. రాజ్యసభ అవకాశం ఇస్తారని.. నా జీవితంలో ఊహించలేదు" అని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. -
రాజ్యసభ అభ్యర్థిగా సుప్రియా శ్రీనేత్?
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఏఐసీసీ సోషల్ మీడియా చైర్మన్ సుప్రియా శ్రీనేత్‌కు అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కే చాన్స్ ఉన్న నేపథ్యంలో ఒకటి ఏఐసీసీ నుంచి మరోటి తెలంగాణ నుంచి భర్తీ చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ జర్నలిస్టు సుప్రియా శ్రీనేత్ పేరును పరిశీలిస్తున్నారని గాందీభవన్ వర్గాలంటున్నాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ లేదంటే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాందీలను తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేయించాలని, లేదంటే రాజ్యసభకు పంపాలని కోరుతూ టీపీసీసీ తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి అభ్యర్థిత్వాలు కాని పక్షంలో శ్రీనేత్తో పాటు కేంద్ర మాజీ మంత్రులుగా పనిచేసిన ఇద్దరి నేతల పేర్లు కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక రాష్ట్రానికి చెందిన ఒకరిని ఈమారు రాజ్యసభకు పంపనున్నారు. చాలాకాలం తర్వాత రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశం లభిస్తుండటంతో పలువురు నేతలు రేసులో ఉన్నారు. అయితే, ఈసారి తెలంగాణ నుంచి బీసీ నేతను రాజ్యసభకు పంపుతారనే చర్చ జరుగుతోంది. ఈ జాబితాలో మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, విజయశాంతి పేర్లు వినిపిస్తున్నాయి. ఇతర సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి వస్తే జానారెడ్డి, రేణుకా చౌదరిల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈనెల 15వ తేదీతో రాజ్యసభ అభ్యర్థిత్వాల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో బుధవారం రాజ్యసభ అభ్యర్థులెవరన్న దానిపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. -
ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్‌గా మారిందా?
కాంగ్రెస్ కేంద్ర రాజకీయాలకు హైదరాబాద్ మహానగరం కేంద్ర బిందువుగా మారిందా? ఇతర రాష్ట్రాల్లో సంక్షోభాలను చక్కదిద్దడానికి తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకుంటోందా? తెలంగాణలో అధికారం సాధించిన కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లోని తన పార్టీ, మిత్ర పక్షాల ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇక్కడ క్యాంప్‌లు నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో క్యాంప్‌లు నిర్వహించారు. తర్వాత ఏ రాష్ట్రం అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణకు ఏఐసీసీ ఎందుకింత ప్రాధాన్యం ఇస్తోంది? కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కీలకంగా మారాయి. తమ పార్టీ జాతీయ స్థాయిలో టీ.కాంగ్రెస్‌కు బాధ్యత పెరిగింది. ఇటీవల కాలంలో 5 రాష్ట్రాలలో ఎన్నికల్లో జరిగితే ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకే కీలక విషయాల్లో జాతీయ నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్‌ను విశ్వాసంలోకి తీసుకుంటోందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో కూడా టీపీసీసీ కీలకంగా వ్యవహరిస్తోంది. రాహుల్ గాంధీ వాడుతున్న అత్యాధునిక వోల్వో బస్సును కూడా తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన నేతలు సమకూర్చారు. జాతీయ స్థాయిలో పార్టీ ప్రయోజనాలను కాపాడటంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ముందుంటోంది. ఇటీవల జార్ఖండ్‌లో ఇండియా కూటమి ప్రభుత్వానికి ఆపద వస్తే..అక్కడి ఎమ్మెల్యేలను కాపాడటంలో టీపీసీసీ అత్యంత చాకచక్యంగా వ్యహరించింది. జార్ఖండ్ నుంచి వచ్చిన 39 మంది ఎమ్మెల్యేలకు మూడు రోజుల పాటు శామిర్ పేటలోని ఓ రిసార్ట్‌లో వసతి కల్పించింది. జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో తోడ్పాటును అందించింది. ఇప్పుడు బీహార్ టాస్క్‌ను సైతం టీపీసీసీకే ఏఐసీసీ అప్పగించింది. బీహార్‌లో ఇండియా కూటమి నుంచి జేడీయూనేత నితీష్‌కుమార్ బయటకు వచ్చి.. ఎన్డీఏలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈనెల 12న అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకోవాలని ఏఐసీసీ భావించింది. అందుకే వెంటనే వారిని కాపాడే టాస్క్‌ను టీపీసీసీకి అప్పగించింది. దీంతో బీహార్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇబ్రహీంపట్నం లోని ఓ రిసార్ట్‌లో వసతి కల్పించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఎటువంటి పొత్తు లేకుండా అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం మూడు మాత్రమే. అందులో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఇందులో లో హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం. అందువల్ల ఎదైనా సంక్షోభం వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి ఈ రాష్ట్ర నాయకత్వానికి ఉండదు. ఇక మిగిలిన రెండు రాష్ట్రాలలో కర్ణాటకలో బీజేపీ చాలా బలమైన పార్టీ.. కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలంటే కర్ణాటక కంటే బీజేపీ బలం తక్కువగా ఉన్న తెలంగాణ బెటర్ అని ఏఐసీసీ భావిస్తోంది. అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో పార్టీ క్రైసిస్ లో ఉన్నా దాన్ని తెలంగాణకు షిఫ్ట్ చేస్తుంది ఏఐసీసీ. దీనికి తోడు నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం ఉండడంతో హైదరాబాద్ ను క్యాంపు కేంద్రంగా ఏఐసీసీ భావిస్తోందని పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తం మీద ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్‌గా మారింది. అయితే ఇదే సమయంలో తెలంగాణ సొమ్మును ఏఐసీసీకి దోచి పెడుతున్నారనే విమర్శలు కూడా వినిస్తున్నాయి. ఏది ఏమైనా దేశ రాజకీయాల్లో టీ కాంగ్రెస్ ప్రాధాన్యత అయితే పెరిగిందనేది నిజం. ఇక్కడ పార్టీ అధికారంలోకి రావడమే అందుకు కారణమని వేరే చెప్పక్కర్లేదు. -
ఖర్గేపై రాజ్యసభ చైర్మన్ ఆగ్రహం !
న్యూఢిల్లీ: భారతరత్న మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ మనవడు, రాష్ట్రీయ లోక్‌దళ్ చీఫ్ జయంత్ చౌదరి రాజ్యసభలో మాట్లాడుతుండగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చరణ్‌సింగ్‌కు తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించింది. తన తాతకు అత్యున్నత పురస్కారం ఇవ్వడంపై మనవడు జయంత్ చౌదరి కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. జయంత్ మాట్లాడుతుండగా మధ్యలో ఖర్గే అడ్డుకున్నారు. ‘భారతరత్న పొందిన నాయకులపై సభలో ప్రస్తుతం చర్చ జరగడం లేదు. ఇప్పుడు జయంత్ ఏ నియమం ప్రకారం అనుమతి పొందారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ అనుమతిని మాకూ ఇవ్వండి. మేమూ వినియోగించుకుంటాం. రూల్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండాలి’అని ఖర్గే అభ్యంతరం వ్యక్తంచేశారు. ఖర్గే వ్యాఖ్యలపై జగదీప్ ఆగ్రహానికి గురయ్యారు. చరణ్‌సింగ్‌ను అవమానించి ప్రతి రైతును బాధపెట్టారన్నారు. ఈ చర్యతో అందరూ సిగ్గుతో తల దించుకోవాలన్నారు. అనంతరం ఖర్గే మాట్లాడుతూ భారతరత్న పొందిన పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్, స్వామినాథన్ ముగ్గురికి సెల్యూట్ చేస్తున్నామన్నారు. ఇదీ చదవండి.. ప్రజల్లో విశ్వాసం పెరిగింది -
మోదీ ఓటమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: పదేళ్లుగా దేశ ప్రజలను మోసం చేస్తూ, ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందే ప్రధాని మోదీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుంటే, మోదీ ఎన్నికల ముందు తన గ్యారంటీ పేరిట ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. మోదీ ప్రధాని అయ్యాక దేశంలో ప్రజాస్వామ్యం సర్వనాశనం అయిందని, పార్లమెంటులో ప్రశ్నించిన 140 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ బూత్ స్థాయి నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఖర్గే ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశంలోని ప్రతి ఇంట్లో దేవుడు ఉన్నాడు ‘దేశంలో యువశక్తి నిరుద్యోగంతో సతమతమవుతోంది. రైతులు కనీస మద్దతు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్మీకులు, మహిళలు, అణగారిన వర్గాల ప్రజలు తీవ్ర కష్టాలను అనుభవిస్తోంటే.. మోదీ భగవంతుని పేరిట పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. యువతకు పని దొరికితే, ఉద్యోగాలు ఉంటే ఉపయోగం తప్ప భగవంతుని ఫొటోతో కడుపు నిండుతుందా? దేశంలోని ప్రతి ఇంట్లో దేవుడు ఉన్నాడు. కానీ మోదీ దేవుడు తమ దగ్గరే ఉన్నట్టు ప్రచారం చేసుకుంటారు. ఆకలి అయినవాడికి అన్నం పెట్టాలి.. ఉపాధి లేని వారికి ఉద్యోగం ఇవ్వాలి..కానీ మోదీ ఎన్నికల రాజకీయాలు, ప్రచారంతోనే కాలం గడుపుతున్నారు. ప్రజల సొమ్ముతో ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. మొన్న అయోధ్యలో మోదీ ఒక్కరే గర్భ గుడిలో పూజలు చేశారు. చివరకు అద్వానీ, మనోహర్ జోషిలను కూడా రానివ్వలేదు. ఎన్నికలకు ముందు ఏదైనా సమస్యను సృష్టించి ఆ అంశాన్ని వాడుకొని లబ్ధి పొందడం మోదీకి అలవాటే. పాకిస్తాన్, చైనా, భగవంతుడు..ఇలా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తారు..’అని ఖర్గే విమర్శించారు. మనకు మోదీతోనే యుద్ధం: రేవంత్‌రెడ్డి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో 14 గెలిచి, రాహుల్‌గాం«దీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. మనకు మోదీతోనే యుద్ధం అని, గల్లీలో ఉన్న బిల్లా, రంగాలతో కాదని ఎద్దేవా చేశారు. జనాలు బీఆర్ఎస్ను ఊరికే ఓడగొట్టలేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టే ఇంటికి పంపారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల లోపు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేసిన తాము ఫిబ్రవరిలో మరో రెండు గ్యారంటీలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతుభరోసా ద్వారా నగదు బదిలీ జరుగుతుందని చెప్పారు. ‘నన్ను మేస్త్రీ అని ట్రోల్ చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి నిజంగానే మేస్త్రీనే.. మీరు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని సరిచేసే మేస్త్రీని నేను. మీకు 100 మీటర్ల లోతులో ఘోరీ కట్టే మేస్త్రీని..’అని అన్నారు. పులిని రమ్మనండి..బోను రెడీగా ఉంది ఈ నెలాఖరులో ఇంద్రవెల్లి నుంచి తన లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారు. వారంలో మూడు రోజులు కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి బిల్లా, రంగాలను తెలంగాణ సరిహద్దులను దాటిస్తాం. వాళ్లు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు. చార్లెస్ శోభరాజ్ ఇంట్లో దుప్పటి పట్టుకుని పడుకున్నాడు. పులి బయటికి వస్తుంది అంటున్నారు కదా.. రమ్మని చెప్పండి. బోను పట్టుకుని రెడీగా ఉన్నాం’అని వ్యాఖ్యానించారు. మోదీ, కేడీ రెండూ ఒక్కటేనని, నాణేనికి మోదీ ఒకవైపు, కేసీఆర్ మరోవైపు అని ధ్వజమెత్తారు. ఇక్కడ గెలిచిన ఒకటో రెండో సీట్లు కూడా కేసీఆర్ మోదీకి తాకట్టు పెడతారని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలి: దీపాదాస్ మున్షీ రాహుల్‌గాం«దీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా బూత్ లెవల్ నాయకులు పని చేయాలని పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటైన విధంగా ఢిల్లీలో కూడా కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ స్థాయిలో అధిక ఓట్లు తీసుకొచ్చిన ఏజెంట్లకు ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలు అందజేశారు. చేతగానితనంగా భావిస్తే తడాఖా చూపిస్తాం: భట్టి రాష్ట్రంలో ప్రతిపక్ష పారీ్టలను ప్రజాస్వామ్యయుతంగా గౌరవించాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్లడాన్ని చేతగానితనంగా భావిస్తే తడాఖా చూపిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రజాతీర్పును జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు నోటికి వచ్చినట్టు అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. బట్టలు ఊడదీసి కొడతామంటే ఎవరూ చేతులు ముడుచుకొని లేరని, కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ మిగలదని అన్నారు. బట్టలు విప్పి చూపించేందుకు సిద్ధం: మంత్రి పొన్నం కరీంనగర్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎమ్మెల్యేలుగా గెలిస్తే ఓర్వలేకనే మాజీ మంత్రి కేటీఆర్ బట్టలు ఊడదీస్తానని అంటున్నాడని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బట్టలు విప్పడం ఎందుకు, ఆయనకు చూడాలనిపిస్తే తనతో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం బట్టలు ఇప్పి చూపించేందుకు సిద్ధమని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం దోచుకొని, దాచుకున్న సొమ్ము కక్కాల్సిందేనని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. అధికారుల దగ్గరే అన్ని కోట్ల రూపాయలు దొరికితే, వారిపై పెత్తనం చేసిన కల్వకుంట్ల ఫ్యామిలీ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తే మరెన్ని వేల కోట్లు బయటపడతాయో అని వ్యాఖ్యానించారు. మోదీ, అమిత్ షాలతో అప్రమత్తంగా ఉండాలి ‘ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడి ప్రభుత్వాలను మోదీ, అమిత్ షాలు పడగొడతారు. కానీ తెలంగాణ లో గతంలో ఉన్న కాంగ్రెస్ లేదు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో చాలా పటిష్ట మైన కాంగ్రెస్ ఉంది. ఎన్నికల్లో బీజే పీ, బీఆర్ఎస్ రెండింటినీ కాంగ్రెస్ ఓడించింది. దీన్నిబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవాలి. తెలంగాణలో వచ్చిన ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లోనూ రావాలి. తెలంగాణలో ప్రభుత్వ, రేవంత్‌రెడ్డి పనితీరు ఆదర్శంగా ఉంది. అయితే బీజేపీ భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ బీజేపీకి తెలంగాణలో ఎవరూ భయపడరు. మోదీ, షాలు ఈడీ, సీబీఐ, ఐటీలను ప్రయోగించే ప్రమాదం ఉంది. రేవంత్‌తో పాటు కాంగ్రెస్ నేతలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి..’అని ఖర్గే అన్నారు. -
బీసీల ఓట్లకు ‘కులగణన’ అస్త్రం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ‘కులగణన’అస్త్రాన్ని ప్రయోగించనుంది. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంలో కులగణన కీలకపాత్ర పోషిస్తుంది. ఈ వర్గాల ఓటర్లను ఆకర్షించడమే ధ్యేయంగా మేనిఫెస్టో రూపకల్పనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. కులగణనకు అనుకూలంగా ఇప్పటికే రాహుల్‌గాంధీ పలు సందర్భాల్లో ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ గణన ఇప్పటికే ప్రారంభించడం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ హామీని మేనిఫెస్టోలో చేర్చిన విషయం విదితమే. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రధానంగా చేర్చనున్నారన్న చర్చ జరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పడం ద్వారా బీసీవర్గాల ఓట్లు రాబట్టుకునే అంశంపై మంగళవారం టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో కూడా చర్చ జరగడం గమనార్హం. అన్ని రాష్ట్రాల్లోనూ అధ్యయనం లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా అన్ని రాష్ట్రాలకు ఏఐసీసీ ప్రతినిధులు వెళుతున్నా రు. అందులో భాగంగానే జాతీయ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్, మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి మంగళవారం తెలంగాణకు వచ్చారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో తయారీకి టీపీసీసీ నియమించిన కమిటీతో ఆయన గాందీభవన్‌లో భేటీ అయ్యారు. టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్మున్షీ, కమిటీ సభ్యులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, తాహెర్‌బిన్ హందాన్, లింగంయాదవ్, రవళిరెడ్డి, కోట నీలిమ, పోట్ల నాగేశ్వరరావు, సామా రామ్మోహన్‌రెడ్డి, గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి, రియాజ్, కత్తి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో రాష్ట్ర నేతల ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉందని, క్షేత్ర స్థాయిలోని అంశాలనూ టచ్ చేశారని అభినందించారు. ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాజకీయ పారీ్టలు విస్మరించే వర్గాలను కూడా మేనిఫెస్టోలో చేర్చామని చెప్పారు. ట్రాన్స్జెండర్లు, ఇళ్లలో పనిచేసే వారి గురించి అధ్యయనం చేసి, వారి సమస్యలను కూడా ప్రస్తావించామని వివరించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల ముందు ఒక మేనిఫెస్టో ఉంచగలిగామని చెప్పారు. ప్రజలు తమపై విశ్వాసంతో అధికారం అప్పగించారని, ఈ హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఒకట్రెండు ఆలోచనలు ప్రధాన మేనిఫెస్టోకు వెళతాయి – ప్రవీణ్ చక్రవర్తి సమావేశ అనంతరం దీపాదాస్ మున్షీ, ఇతర తెలంగాణ నేతలతో కలిసి ప్రవీణ్‌చక్రవర్తి గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజల ఆలోచనలను తెలుసుకునేందుకు అన్ని రాష్ట్రాలకు వెళ్లి ప్రజలు, నిపుణులు, పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో ముఖ్య సాధనమని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందని చెప్పారు.తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో పాటు పౌర సంఘాలు, కొందరు ప్రజలతో సమావేశమయ్యామన్నారు. ఈ చర్చల్లో వచి్చన ఫీడ్‌బ్యాక్ నుంచి ఒకట్రెండు ఆలోచనలు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించే ప్రధాన మేనిఫెస్టోకు వెళతాయని ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. -
రేపు హైదరాబాద్‌కు ఖర్గే
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. పార్టీకి చెందిన పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే సమావేశంలో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పోలింగ్ బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, ఈ సమావేశం ఏర్పాట్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సమీక్షించారు. తన నివాసంలో మహేశ్‌తో సమావేశమైన రేవంత్ కార్యక్రమ ఏర్పాట్లు జరుగుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్స్ అందరూ సమావేశానికి హాజరు కావాలని ఈ సందర్భంగా రేవంత్ పిలుపునిచ్చారు. సీఎంను కలిసిన సలహాదారులు, ఎమ్మెల్సీలు కాగా, కొత్తగా నియమితులైన సలహాదారులు, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, ఇద్దరు ఎమ్మెల్సీలు మంగళవారం సీఎం రేవంత్‌ను కలిశారు. సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, హర్కర వేణుగోపాల్‌రావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవితో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్లు జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని సీఎం రేవంత్ అభినందించారు. అదే విధంగా దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం పట్ల సలహాదారులు, ఎమ్మెల్సీలు సీఎం రేవంత్‌కు అభినందనలు తెలిపారు. -
రాష్ట్రం నుంచి పెద్దల సభకు సోనియా!
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లనున్నట్టు టీపీసీసీలో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చిలో రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్న నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ స్థానాలతోపాటు రాష్ట్ర శాసన మండలిలో పలు సీట్లు ఖాళీ అవుతుండటంతో.. ఎమ్మెల్సీ సీట్ల కోసం కూడా రాష్ట్ర కాంగ్రెస్‌లో పోటీ పెరిగింది. మార్చి నాటికి రెండు రాజ్యసభ స్థానాలతోపాటు గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు, ఒక గ్రాడ్యుయేట్, మరో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీకానున్నాయి. సొంత పార్టీ నేతలతోపాటు టీజేఎస్, సీపీఐ నేతలు కూడా ఎమ్మెల్సీ సీట్లు, ఇతర పదవులను ఆశిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుంటే.. సోనియా గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని.. లేదంటే తెలంగాణ నుంచే ఆమెను రాజ్యసభకు ఎంపిక చేయాలని కోరుతూ ఇటీవల టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) తీర్మానం చేసి అధిష్టానానికి పంపింది. సోనియా ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధంగా ఉంటే ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో పోటీచేసే అవకాశం ఉందని.. అక్కడ ప్రియాంకా గాంధీని పోటీకి పెడితే, సోనియా తెలంగాణకు మారవచ్చని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈసారి సోనియా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చనే చర్చ ఉందని.. ఈ క్రమంలో ఆమెను తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని టీపీసీసీ ప్రతిపాదించినట్టు తెలిసింది. దీనితో రాష్ట్ర కాంగ్రెస్‌కు రానున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి రిజర్వ్ అయినట్టేనని.. మరో సీటు కోసం ఏఐసీసీలో కీలక భూమిక పోషిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా యువనేత చల్లా వంశీచంద్‌రెడ్డికి ఇవ్వవచ్చని చర్చ జరుగుతోంది. మరోవైపు రాజ్యసభ పో టీలో తెలంగాణ జనసమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం పేరు కూడా వినిపిస్తోంది. ఆయనకు రాష్ట్రస్థాయిలో పదవి ఇవ్వాలని, కుదరకపోతే రాజ్యసభకు ఎంపిక చేసే అంశాన్ని పరిశీలించాలని టీపీసీసీ పెద్దలు భా విస్తున్నట్టు సమాచారం. ఆయనకు ఏ చాన్స్ దక్కుతుందన్నదానిపై చర్చ జరుగుతోంది. 20 మందికిపైగా ఆశావహులు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం కూడా పోటీ నెలకొంది. ప్రజా గాయకుడు అందెశ్రీతోపాటు పార్టీలోని పలువురు నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు టీజేఎస్, సీపీఐ నేతలకు ఇప్పుడే ఎమ్మెల్సీ సీట్లు ఇస్తారా, లేక భవిష్యత్తులో ఖాళీ అయ్యే స్థానాలను ఇస్తారా అన్నదానిపై స్పష్టత రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతల విషయానికి వస్తే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకుండా సీట్లు త్యాగం చేసినవారు, పోటీ చేసి ఓడినవారు, వివిధ కోటాల కింద తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నవారు చాలా మంది ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారు. ఈ జాబితాలో షబ్బీర్‌అలీ, ఫిరోజ్‌ఖాన్, అజారుద్దీన్, అలీ మస్కతి, మహేశ్‌కుమార్‌గౌడ్, జగ్గారెడ్డి, మధుయాష్కీ, సంపత్‌కుమార్, చరణ్ కౌశిక్ యాదవ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. తుంగతుర్తి అసెంబ్లీ సీటును త్యాగం చేసిన అద్దంకి దయాకర్‌ను మంత్రి చేయాలనుకుంటే.. ఈసారి ఎమ్మెల్సీ కోటాలోనే ఆయనకు అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. లేదంటే వరంగల్ లోక్‌సభ నుంచి పోటీ చేయించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మహేశ్‌గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకుంటే ఎమ్మెల్సీ ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇక సాహిత్య రంగం నుంచి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అందెశ్రీ పేరు దాదాపు ఖరారైనట్టేనని తెలుస్తోంది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యరి్థగా చిన్నారెడ్డి పేరు ఖరారు కావచ్చని సమాచారం. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరన్న దానిపై కాంగ్రెస్‌లో స్పష్టత రావడం లేదు. ఈ క్రమంలో ఎవరెవరికి పదవీ యోగం కలుగుతుందనేది ఉత్కంఠగా మారింది. -
ఏపీలో ఎలా ముందుకెళ్దాం?
ఢిల్లీ, సాక్షి: అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా.. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఈ క్రమంలో నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, పలువురు ఏఐసీసీ నేతలు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఏపీ పీసీపీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఈ సమావేశానికి హాజరై.. హైకమాండ్‌కు పార్టీ పరిస్థితిని నివేదిక రూపంలో సమర్పించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ సమూలంగా తుడిచిపెట్టుకుని పోయింది. గత ఎన్నికల సమయంలో అయితే ఏకంగా ఓటు బ్యాంక్ లేని పార్టీగా మిగిలింది. ప్రస్తుతం హస్తానికి చెప్పుకోదగ్గ నాయకుల్లేరు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేరు. అలా.. ఉనికి కోల్పోయిన పార్టీకి తిరిగి గుర్తింపు తెచ్చే ప్రయత్నాలే ఇప్పుడు జరుగుతున్నాయి. ఎలా వెళ్దాం.. దక్షిణ రాష్ట్రాల్లో.. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అందుకు అక్కడి ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన కారణం అనే సంగతి తెలిసిందే. కానీ, ఏపీలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో.. కనీసం నామ మాత్రపు ఓటు బ్యాంకుతో అయినా ఉనికిని కాపాడుకోవాలన్నదే కాంగ్రెస్ యత్నంగా కనిపిస్తోంది. చర్చల్లో ప్రధానంగా.. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో.. పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పార్టీకి ఒక రిపోర్ట్ ఇవ్వనున్నారు. దానిని క్షుణ్ణంగా పరిశీలించాకే హైకమాండ్ .. మేనిఫెస్టో రూపకల్ప, పార్టీలతో పొత్తులపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి, ఇంకా చర్చలు జరగాల్సిన అవసరం ఉంటుంది. అయితే.. పార్టీలో చేరికలు, పొత్తులపై ఇవాళ్టి భేటీలో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రత్యక్ష మద్ధతు ప్రకటించింది వైఎస్సార్ తెలంగాణ పార్టీ. ఆ పార్టీని విలీనం చేసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ప్రచారాన్ని ఏపీ పీసీసీ చీఫ్ ఖండించపోవడంతో ఆసక్తి నెలకొనగా.. నేటి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరగొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. పొత్తులపైనా మరో వారం, పదిరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
తెలంగాణ 'సీఎం రేవంత్'
వన్ మ్యాన్ షో ఉండదు తెలంగాణ సీఎల్పీ సమావేశంలో చేసిన మూడు తీర్మానాలను పరిశీలకులు పార్టీ అధ్యక్షుడికి అందించారు. తెలంగాణలో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానం మొదటిది. అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలకు ధన్యవాదాలు తెలిపేది రెండో తీర్మానం. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికే అప్పగిస్తూ మూడో తీర్మానం చేశారు. పార్టీ పరిశీలకులు ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం సీనియర్లతో చర్చించాం. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వంలో వన్‌మ్యాన్ షో ఉండదు. అందరినీ కలుపుకొంటూ కలసి టీమ్‌గా ముందుకు వెళ్తాం. సీనియర్లు అందరికీ సముచిత గౌరవం ఉంటుంది. – కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్, కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం ఉదయం 10.28 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రులుగా ఎవరెవరు ఉంటారన్న దానిపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక రెండు రోజుల పాటు అనేక తర్జనభర్జనలు, సంప్రదింపులు జరిపి, నేతల అభిప్రాయాలు తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పి) నేతగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించారు. ఖర్గే తెలంగాణ సీఎల్పీ భేటీ చేసిన తీర్మానాన్ని పరిశీలించిన తర్వాత రేవంత్‌రెడ్డిని సీఎంగా నియమించాలని నిర్ణయించారని చెప్పారు. గురువారం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. డిప్యూటీ సీఎం సహా ఇతర మంత్రి పదవుల అంశంపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్టు వివరించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సుపరిపాలన అందించబోతోందని.. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామని చెప్పారు. తీర్మానాలను అధిష్టానానికి అందజేసి.. రాష్ట్ర ఎన్నికల్లో జయకేతనం అనంతరం సోమవారం కొత్త ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధిష్టానం దూతలు, ఏఐసీసీ పరిశీలకులు సమావేశం నిర్వహించి అభిప్రాయాలను సేకరించిన విషయం తెలిసిందే. సీఎం ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఆ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మానం, ఎమ్మెల్యే అభిప్రాయాల నివేదికలతో ఢిల్లీకి వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర నేతలు మంగళవారం రోజంతా బిజీబిజీగా గడిపారు. సీఎంతోపాటు ఇతర కీలక పదవులపై రాష్ట్ర, జాతీయ నేతలతో విస్తృతంగా చర్చలు జరిపారు. మరోవైపు సాయంత్రానికల్లా సీఎంను ఖరారు చేస్తామని ఖర్గే ప్రకటించారు. వరుసగా భేటీలు.. విస్తృతంగా సంప్రదింపులు.. మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు కొద్దిసేపు పదవుల అంశంపై చర్చించుకున్నారు. 10.45 గంటలకు ఉత్తమ్ డీకే శివకుమార్‌తో భేటీ అయి.. సీఎం, డిప్యూటీ సీఎం పదవులు, పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, కీలక శాఖలకు మంత్రులు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తనకు సీఎం పదవికి అర్హత ఉందని నొక్కి చెప్పినట్టు తెలుస్తోంది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశానని.. తనకు మెజార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ల మద్దతు ఉందని వివరించినట్టు సమాచారం. అయితే ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.. అధిష్టానం సీఎంగా ఎవరిని ఎంపిక చేసినా తనకు ఆమోదమేనని ప్రకటించారు. డీకేతో ఉత్తమ్ భేటీ జరుగుతున్న సమయంలోనే.. భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. సీఎం పదవి కోసం తన అర్హతను పరిశీలించాలని కోరారు. ఈ భేటీలు సాగుతున్న సమయంలోనే ఖర్గే నివాసంలో మరో కీలక భేటీ జరిగింది. రేవంత్‌రెడ్డి వైపే మొగ్గు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఖర్గే నివాసానికి పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాం«దీ, కేసీ వేణుగోపాల్ తదితరులు చేరుకుని.. సీఎల్పీ నేత ఎంపికపై చర్చించారు. పదవికి పోటీ పడుతున్న రేవంత్, ఉత్తమ్, భట్టి పేర్లను పరిశీలించారు. పారీ్టకి పనిచేసిన అనుభవంతోపాటు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రానున్న పార్లమెంట్ ఎన్నికలు, మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు, ప్రజల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రేవంత్‌రెడ్డి వైపే అంతా మొగ్గుచూపినట్టు తెలిసింది. ఈ భేటీ మొదలైన అరగంటకు డీకే శివకుమార్, ఠాక్రే కూడా ఖర్గే నివాసానికి చేరుకుని.. ఎమ్మెల్యేల తీర్మానం కాపీ, వారి అభిప్రాయాల నివేదికను అగ్రనేతలకు అందించారు. ఈ సందర్భంగా అంతా కలసి.. పార్టీ సీనియర్ నేతల నుంచి వస్తున్న డిమాండ్లు, కీలక శాఖల అప్పగింత, పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించారు. రేవంత్ ఎంపికను ఖరారు చేసి, ఈ విషయాన్ని అగ్రనేత సోనియాగాం«దీకి తెలిపి ఆమోదం తీసుకున్నారు. భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో ఉత్తమ్, దామోదర, శ్రీధర్‌బాబు, సీతక్కలకు కీలక శాఖలు ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం, మంత్రులకు శాఖలపై నేడు స్పష్టత సీఎం ఎంపిక కసరత్తు కొలిక్కి వచ్చిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో కేసీ వేణుగోపాల్‌తో డీకే, ఠాక్రే, భట్టి, ఉత్తమ్ భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పదవులతోపాటు మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపులపై వారు సుమారు గంట పాటు చర్చించారు. అనంతరం డీకే, ఠాక్రే, ఉత్తమ్, భట్టిలను వెంట పెట్టుకొని ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన కేసీ వేణుగోపాల్.. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసినట్టు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రులు ఎందరు ఉండాలి, మంత్రి పదవులు ఎవరికి అన్న దానిపై బుధవారం రేవంత్‌రెడ్డితో కలసి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. సోనియాతో జి.వినోద్ భేటీ మరోవైపు మాజీ మంత్రి జి.వినోద్ ఢిల్లీలో సోనియాగాంధీతో విడిగా భేటీ అయ్యారు. తాను గతంలో మంత్రిగా పనిచేశానని, ఈసారి తనకు మంత్రి పదవి ఇవ్వాలని సోనియాను కోరానని భేటీ అనంతరం వినోద్ తెలిపారు. తన విజ్ఞప్తిపై ఆమె సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: ఉత్తమ్ సీఎల్పీ నేత ప్రకటనకు ముందు ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి కోసం తనకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఈ విషయాన్ని పరిశీలించాలని హైకమాండ్‌ను కోరానని చెప్పారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే సీఎం ఎంపిక జరుగుతోందని, మిగతా పార్టీ అంతర్గత విషయాలను బయటికి వెల్లడించలేనని చెప్పారు. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లోనే గడిపారు. ఓవైపు ఢిల్లీలో సీఎల్పీ నాయకుడి ఎంపికపై చర్చలు, సంప్రదింపులు జరుగుతుండగా.. అదే సమయంలో రేవంత్‌రెడ్డి హోటల్లో కొత్త ఎమ్మెల్యేలతో ఉండి చర్చలు జరుపుతూ గడిపారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రొఫెసర్ నాగేశ్వర్, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు అసెంబ్లీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, ఇతర అంశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో రేవంత్ మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఆయన ప్రయాణంలో ఉండగానే ఢిల్లీలో కేసీ వేణుగోపాల్, ఇతర నేతలు ప్రెస్‌మీట్ పెట్టి రేవంత్‌ను సీఎంగా ఎంపిక చేసినట్టు ప్రకటించారు. రేవంత్ వెళ్లాక ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిగా హోటల్ నుంచి వెళ్లిపోయారు. వారంతా బుధవారం మళ్లీ ఎల్లా హోటల్లో సమావేశం కానున్నారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. సీఎంగా రేవంత్ ఎంపిక ప్రకటన వెలువడగానే.. ఎల్లా హోటల్ వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. బాణసంచా కాలుస్తూ, జై రేవంత్, జై కాంగ్రెస్ నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నాయి. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం – వేగంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆమె మంగళవారం రాత్రి సచివాలయంలో సమీక్షించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. పారిశుధ్యం, త్రాగునీరు, ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం వద్దకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని.. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు రిజ్వీ, శైలజా రామయ్యర్, గవర్నర్ సెక్రెటరీ సురేంద్ర మోహన్, జీఏడీ సెక్రెటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీకి రేవంత్‌రెడ్డి.. కాసేపట్లో సీఎం పేరుపై అధికారిక ప్రకటన?
సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో జరుగుతున్న హస్తిన చర్చలు మరింత హీటెక్కిస్తున్నాయి. అధిష్టానం పిలుపుతో మంగళవారం సాయంత్రం హుటాహుటిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. కాసేపట్లో ఏఐసీసీ కార్యాలయంలో కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. సోమవారం హైదరాబాద్‌లో సీఎల్పీ జరిగిన సీఎల్పీ భేటీలో సీఎల్పీ నేత ఎవరనే దానిపై కసరత్తులు జరగ్గా.. మంగళవారం ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్ ఇవాళంతా చర్చలు జరిపారు. ఆపై సాయంత్రం ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ ఇంట్లో కీలక భేటీ జరిగింది. డీకేఎస్, తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేలతో పాటు తెలంగాణ సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆ వెంటనే హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు ఉన్న ఎల్లా హోటల్ నుంచి రేవంత్ ఢిల్లీకి బయల్దేరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. . -
ఇది ఫిక్స్...! సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు?
-
కాంగ్రెస్ ఓటమికి వారే కారణం.. అక్కడ స్వేచ్ఛ ఇవ్వలేదు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ విజయంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కీలకంగా వ్యవహరించారు. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పని చేసి.. కాంగ్రెస్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. ఆదివారం విడుదలైన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ... కేవలం తెలంగాణలోనే విజయం సాధించి మిగిలిన మూడు రాష్ట్రాల్లో పరాజయం పాలైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కూడా ఎన్నికల వ్యూహకర్తగా సేవలందించిన సునీల్ అక్కడ కాంగ్రెస్‌ను విజయతీరాలకు తీసుకెళ్లడంలో విఫలమాయ్యారు. అయితే దానికి రాజస్తాన్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలే కారణంగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో వ్యూహకర్త పనిచేసినా.. ఆయా రాష్ట్రాల అగ్రనేతలైన అశోక్ గహ్లోత్, కమల్నాథన్లు సహకరించనట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాజస్థాన్‌లో పలు చోట్ల సర్వేలు చేసి కొంత మంది అభ్యుర్థుల మార్పును సూచించినా అశోక్ గహ్లోత్ అంగీకరించలేదంట. అదీకాక నరేష్ అరోరా ఎన్నికల వ్యూహాలను అమలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు సహరించినట్లుగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో వ్యూహాల అమలు, అంతర్గత సర్వేల వంటి విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏఐసీసీ ఎన్నికల వ్యూహ కమిటీ ఛైర్మన్‌గా కూడా నియమితులైన ఆయన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో కూడా తన మార్క్ వ్యూహాలతో కాంగ్రెస్ గెలుపును సునాయాసం చేశారు. గతంలో బీజేపీకి కూడా సునీల్ పలు ఎన్నికల్లో వ్యూహకర్తగా వ్యవహరించారు. 2014లో నరేంద్రమోదీకి ఎన్నికల ప్రచారంలో సేవలందించారు. ఉత్తరప్రదేశ్, గుజరాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా పని చేశారు. అదే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు ఆయాన వ్యూహకర్తగా సేవలందించారు. కర్ణాటకకు చెందిన సునీల్ కనుగోలు దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తల్లో ఒకరిగా పేరుపొందారు. అయితే.. ఆయన గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో కీలకసభ్యుడిగా పనిచేశారు. కర్ణాటక ఎన్నికల అనంతరం సునీల్‌కు.. సీఎం సిద్ధరామయ్య కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్.. ‘మిషన్ తెలంగాణ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ తన ఆపరేషన్‌ను ప్రారంభించింది. ‘మిషన్ తెలంగాణ’పేరుతో నేటి కౌంటింగ్ ప్రక్రియ మొదలై ముగిసే దాకా అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెట్టింది. ఈ బాధ్యతను కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ‘ట్రబుల్ షూటర్’ డి.కె. శివకుమార్‌కు అప్పగించింది. ఆయనకు తోడుగా పలువురు కర్ణాటక మంత్రులు, కొందరు ఏఐసీసీ కీలక నేతలు ఆపరేషన్‌లో పాలుపంచుకోనున్నారు. కర్ణాటక మంత్రులు జార్జి, బోసురాజు శనివారం మధ్యాహ్నానికే హైదరాబాద్ చేరుకోగా డి.కె.శివకుమార్ రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఆపరేషన్ కోసం రెండు ప్లాన్లను ఏఐసీసీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కీలక నేతలతో రాహుల్ మీటింగ్ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో టీపీసీసీ ముఖ్య నేతలు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కర్ణాటక మంత్రులు జార్జి, బోసురాజు, పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పరిశీలకులు పాల్గొన్నారు. ఫలితాలు వచ్చాక అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీ అభ్యర్థులను ముందే హైదరాబాద్‌కు పిలిపించాలన్న కొందరి సూచనలను రాహుల్ తిరస్కరించినట్లు తెలిసింది. కౌంటింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు లేకుంటే నష్టం జరుగుతుందని, ప్రజల్లోకి కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయ ని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులను అక్కడే ఉంచాలని, ఫలితాలను బట్టి అభ్యర్థుల తరలింపుపై నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఏఐసీసీ పంపుతున్న కీలక నేతలు రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులను పర్యవేక్షించాలని, ఏఐసీసీ పరిశీలకులతోపాటు జిల్లాల్లోని ముఖ్య నాయకులు అక్కడి పరిస్థితులను సమన్వయం చేసుకోవాలని... జిల్లాలవారీగా బాధ్యులను నియమించుకొని కౌంటింగ్ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయాలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ద్విముఖ వ్యూహంతో ముందుకు.. ఈసారి అధికారం దక్కించుకునేందుకు రెండు వ్యూహాలను కాంగ్రెస్ సిద్ధం చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ వస్తే ప్లాన్–ఏ, కొన్ని స్థానాలు తక్కువ పడే సందర్భంలో ప్లాన్–బీని అమలు చేయాలని నిర్ణయించింది. సంపూర్ణ మెజారిటీ సాధిస్తే అభ్యర్థులందరినీ హైదరాబాద్ పిలిపించి డి.కె.శివకుమార్ సమక్షంలో తొలుత సమావేశం ఏర్పాటు చేయనుంది. అనంతరం ఆయనతోపాటు టీపీసీసీ ముఖ్యులంతా కలసి ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌తో సీఎల్పీ సమావేశం తేదీని నిర్ణయించాలని, ఆ తర్వాత సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగించాలని పార్టీ యోచిస్తోంది. ఒకవేళ హంగ్ పరిస్థితులు ఏర్పడి మెజారిటీకి కొన్ని స్థానాలు తక్కువగా వస్తే ప్లాన్–బీని అమలు చేయాలని, అప్పుడు వీలైనంత త్వరగా అభ్యర్థులందరినీ హైదరాబాద్‌కు పిలిపించి టీపీసీసీ ముఖ్య నేతలతో సహా అందరినీ బెంగళూరుకు తరలించాలని భావిస్తోంది. హంగ్ వస్తే ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంప్రదింపులు జరిపేందుకు గెలిచిన ఎమ్మెల్యేలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాలనేది ఏఐసీసీ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లోనే గెలుపు ధ్రువీకరణ పత్రాలను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ల ద్వారా తీసుకొనే ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తోంది. ఈ విషయమై టీపీసీసీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ క్యాంపు రాజకీయాలకు వెళ్లాల్సిన అవసరం తమకు ఈసారి ఉండదనే ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ ముగిశాక అనుసరించాల్సిన వ్యూహాలను సమన్వయం చేసేందుకే ముఖ్య నాయకులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని, అది ఏఐసీసీ వ్యూహంలో భాగమేనని చెప్పారు. ఎంఐఎం అవసరం ఏర్పడితే? ఫలితాల్లో తమకు మ్యాజిక్ ఫిగర్ వస్తుందని ధీమాతో ఉన్న కాంగ్రెస్.. ప్రత్యామ్నాయ అవసరాలపైనా సమాలోచనలు చేస్తోంది. ఒకవేళ అతిపెద్ద పారీ్టగా అవతరించి ఎంఐఎంతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వస్తే ఏం చేయాలన్న దానిపైనా పార్టీలో చర్చ జరుగుతోంది. ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని ప్రజలకు చెప్పిన నేపథ్యంలో ఎంఐఎం మద్దతు తీసుకోవాలా వద్దా అనే దానిపైనా ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎంఐఎం మద్దతిచ్చేందుకు ముందుకొస్తే బయటి నుంచి ఆ పార్టీ మద్దతు తీసుకోవడంలో అభ్యంతరం ఏమీ ఉండబోదని, తెలంగాణలో రాజకీయ సుస్థిరత కోసం ఈ నిర్ణయం తీసుకున్నా ప్రజలు అర్థం చేసుకుంటారనే చర్చ కాంగ్రెస్ నేతల్లో జరిగినట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్ వస్తే ప్రజా ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, యాదాద్రి: ‘తెలంగాణ వస్తే తమ ఆకాంక్షలు నెరవేరుతాయని ప్రజలు ఆకాంక్షించారు. కొట్లాడి, చెమట, రక్తం చుక్కలు చిందించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. వేలాది మంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేసింది? కేసీఆర్ ప్రభుత్వంలో కలలు సాకారం కాలేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడూ ఈ ప్రభుత్వం సహకారం అందించడానికి ముందుకు రాలేదు. ఈ ఎన్నికల సమయంలో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి పాలన చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే ప్రజా ప్రభుత్వం వస్తుంది. ప్రజాభవన్ నుంచి పాలన చేస్తాం. కేంద్రంలోని నరేంద్రమోదీ దేశసంపదను అదానీ, అంబానీకి ధారాదత్తం చేస్తోంటే.. తెలంగాణలో ఉన్న కేసీఆర్ రాష్ట్ర సంపదను తన కుటుంబానికి దోచి పెడుతున్నారు..’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ధ్వజమెత్తారు. సోమవారం ఉమ్మడి పాలమూరులోని గద్వాల, కోస్గిల్లో ప్రజాభేరి బహిరంగ సభల్లో, భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. సోనియా ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటారు ‘నా తల్లి సోనియాగాంధీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నా తల్లి నెరవేర్చారు. ఈ దేశం కోసం నాయనమ్మ ఇందిరాగాంధీ, నాన్న రాజీవ్‌గాంధీ ప్రాణాలర్పించారు. ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాల పరిస్థితి నాకు తెలుసు. తెలంగాణలో ప్రాణత్యాగం చేసిన వారి ఉద్యమ స్ఫూర్తి వృధా పోకూడదు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రజలకు ఏమైనా చేస్తారని అనుకున్నాం. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా చేసిందేమీ లేదు. ప్రజల సంక్షేమంపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. తెలంగాణలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. ఏ ఒక్క ప్రాజెక్టూ సంపూర్ణంగా పూర్తి కాలేదు..’ అని ప్రియాంక విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే ‘బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. ఎంఐఎం పార్టీ కూడా బీజేపీ, బీఆర్ఎస్లకు మద్దతు ఇస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే. పదేళ్లుగా బీజేపీ కేంద్రంలో, బీఆర్ఎస్ రాష్ట్రంలో అన్నదమ్ముల పాలన సాగిస్తూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఎంఐఎం పార్టీ వాటికి చిన్న తమ్ముడిలా ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటుంది. రాహుల్‌గాంధీ మీద ఒవైసీ అనవసర ఆరోపణలు చేస్తుంటారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఒక శక్తిగా ఎదిగారు. దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు రాహుల్‌ను ఎవరూ ఏమీ చేయలేరు. బీఆర్ఎస్తో పాటు బీజేపీ ప్రభుత్వం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకే వత్తాసు పలుకుతోంది. ప్రధాని మోదీ ఈ దేశ ఆస్తులను పెద్ద కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేశారు. అదానీ ఒక్క రోజులో రూ.1,600 కోట్లు సంపాదిస్తుంటే.. రైతు కేవలం రూ.27 సంపాదిస్తున్నాడు..’ అని మండిపడ్డారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ‘కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేశాం. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణితో లాక్కున్న భూములను తిరిగి మీకు ఇప్పిస్తాం. ఇళ్లు కట్టుకునే వారికి స్థలంతో పాటు రూ.5 లక్షల సాయం చేస్తాం. రాజస్తాన్‌లో 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఛత్తీస్‌గఢ్‌లో నిరుద్యోగాన్ని తగ్గించాం. బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ మాత్రం నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజస్తాన్‌లో మాదిరి 2 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అవినీతిని పారదోలతాం. తెలంగాణ అమరుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతాం. ఆదివాసీలకు భూ పట్టాలిస్తాం..’ అని ప్రియాంక హామీ ఇచ్చారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ‘ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలి. ఓటు వేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణలో గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందో మీకు తెలుసు. కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాలు పాలించడానికి ఎవరిని ఎన్నుకోవాలి.. మీ జీవితాలు ఎలా బాగుచేసుకోవాలి అనే విషయాన్ని మీరే ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా? మోసం చేసే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా? ఆలోచించుకోండి..’ అని ప్రియాంక అన్నారు. ‘మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే భూ మాఫియా, లిక్కర్ మాఫియా వస్తుంది. మీకు ఉద్యోగాలు రావు. ప్రశ్నపత్రాలు లీక్ ఆవుతాయి. అవినీతి ఆకాశన్నంటుతుంది. అప్పు పదింతలవుతుంది..’ అని హెచ్చరించారు. టీపీసీసీ చీఫ్, కొడంగల్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..‘మీరు నన్ను ఆశీర్వదించండి, మీరు అండగా ఉన్నంత వరకు ఇటు రాష్ట్రంలో కేసీఆర్, అటు దేశంలో మోదీ మెడలు వంచే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటా..’ అని అన్నారు. ఈ సభల్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, అభ్యర్థులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (భువనగిరి), సరిత (గద్వాల) తదితరులు పాల్గొన్నారు. -
ఆ మూడు పార్టీలూ ఒక్కటే
ఆమనగల్లు, బన్సీలాల్‌పేట్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే ఆ మూడు పార్టీలను ప్రజలు తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆమనగల్లు పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో శనివారం కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి మద్దతుగా నిర్వహించిన విజయభేరి సభకు పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి, కర్ణాటక విద్యాశాఖ మంత్రి సుధాకర్‌రెడ్డితో కలిసి ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షల మేరకు పదేళ్ల కితమే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినా.. ఇంకా వారి ఆశలు నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే వారి ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ అబద్ధాల కోరులేనని, తోడుదొంగలని ధ్వజమెత్తారు. వారిద్దరి మధ్య అనేక విషయాల్లో చీకటి ఒప్పందం సాగుతోందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో పేదల జీవనం దుర్భరంగా మారితే, కేంద్రంలో మోదీ హయాంలో నిత్యావసరాలతో పాటు పెట్రోలు, డీజీల్ ధరలు భారీగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ కేవలం అదానీ లాంటి బడా వ్యాపారస్తులకు మాత్రమే మేలుచేస్తూ పేదలను పట్టించుకోలేదని మండిపడ్డారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పాటైన తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరిపై రూ.1.40 లక్షల అప్పు ఉందని వివరించారు. కేసీఆర్ దిష్టిబొమ్మల దహనానికి రేవంత్ పిలుపు దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు ఇవ్వని సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైతుబంధు నిధులు వేయడానికి ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్న కేసీఆర్, దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు నిధులు ఇవ్వడానికి ఎందుకు అనుమతి తీసుకోలేదని ప్రశ్నించారు. సభలో ఏఐసీసీ కార్యదర్శి నాజిర్ హుస్సేన్, సందీప్, పరిశీలకుడు మోహన్‌జీ, బీహార్ సీఎల్పీ నాయకుడు షకీల్ ఆహ్మద్ ఖాన్, మాజీ ఎంపీ మల్లురవి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు. కవితను ఎందుకు అరెస్టు చేయలేదు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ ప్రధాని, హోంమంత్రి కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడతారని, అయితే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనేక మందిని అరెస్టు చేసిన మోదీ ప్రభుత్వం కవితను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. బన్సీలాల్‌పేట్ డివిజన్ చాచానెహ్రునగర్‌లో శనివారం జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చారు. సనత్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ, టీపీసీసీ పరిశీలకులు మాణిక్‌రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. -
మీ తీర్పు మీ ప్రతిష్ట పెంచుతుంది
సాక్షి ప్రతినిధులు, మహబూబ్‌నగర్/నల్లగొండ: ‘తెలంగాణలో మీరు అనుకున్న అభివృద్ధి జరగలేదు. ఇక్కడి సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలను కలవని ఆయనకు ఓట్లు వేయకూడదు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు స్నేహితులు. మూడూ ఒక్కటే. ఏ టీమ్, బీ టీమ్, సీ టీమ్‌గా ఉన్నాయి. కేసీఆర్ ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్ నాగపూర్‌కు వెళ్లినప్పుడు మోదీ తన మిత్రుడని చెబుతుంటాడు. అదే ఒవైసీ కేసీఆర్ తనకు మంచి స్నేహితుడని చెబుతాడు. ఈ ముగ్గురు కలిసి తెలంగాణలో కాంగ్రెస్ గెలవకూడదని కుట్రలు చేస్తున్నారు. దళిత, మైనార్టీ, నిరుపేదలంతా కాంగ్రెస్ వైపే ఉండడంతో ఆ మూడు పార్టీలకు కళ్లు మండుతున్నాయి. కేసీఆర్ పాలనలో అంతులేని అవినీతి జరిగింది. ల్యాండ్, సాండ్, మైన్, వైన్ కుంభకోణాల మయంగా మారింది. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు భాగస్వాములే. ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. పేదల భూములు లాక్కున్న వారికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో పోరాడుతున్నాం. తెలంగాణలో అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలి. మీ తీర్పు మీ కీర్తి ప్రతిష్టను పెంచుతుంది. దేశంలో మీకు గౌరవం లభిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో కూడా గెలుస్తుంది..’అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. బుధవారం నల్లగొండ, ఉమ్మడి పాలమూరులోని అలంపూర్ నియోజకవర్గ పరిధి అయిజల్లో నిర్వహించిన ప్రజాగర్జన సభల్లో ఆయన మాట్లాడారు. మేం భయపడతామనుకోవడం వాళ్ల భ్రమ ‘కాంగ్రెస్‌కు సంబంధించిన నేషనల్ హెరాల్డ్‌తో పాటు మూడు హిందూ పత్రికలకు సంబంధించి రూ.780 కోట్ల ఆస్తిని మోదీ జప్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమ గొంతుక, ప్రజల్లో చైతన్యం కోసం నెహ్రూ ఈ పేపర్లను తీసుకొచ్చారు. వీటి ఆస్తులను జప్తు చేస్తే.. తెలంగాణ ప్రజలు భయపడి బీజేపీ, కేసీఆర్‌కు ఓట్లు వేస్తారని భావించి రాజకీయ కుట్రకు తెరలేపారు. మా ఆస్తి జప్తు చేస్తే కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని కేసీఆర్, బీజేపీ అనుకుంటే అది భ్రమనే. కాంగ్రెస్‌కు పోరాటం కొత్త కాదు. బ్రిటిష్ పాలకులకే భయపడలేదు. బీజేపీకి భయపడతామా? మోదీని ప్రజలు క్షమించరు..తరిమికొడతారు..’అని ఖర్గే అన్నారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారు.. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ ఇక్కడ అభివృద్ధి జరగలేదు. కేసీఆర్ తన పాలనలో ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల పాలు చేసి.. ఒక్కొక్కరిపై రూ.1.40 లక్షల అప్పు పెట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఉంది. 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేదు. 20 లక్షల మంది నిరుద్యోగుల్లో ఏ ఒక్కరికీ ఇప్పటివరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మోదీ 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు విదేశాల్లోని నల్లధనాన్ని తెప్పిస్తాం.. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి మరిచిపోయారు. ప్రతి ఏడాదీ రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, ఎరువులు అందజేస్తానని ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే అని రుజువయ్యింది. కేసీఆర్, మోదీలు పేదల పక్షాన లేరు. ఢిల్లీలో ఉండే మోదీ, హైదరాబాద్ ఫాంహౌస్‌లో ఉండే కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే. వీరు నిరుపేదలు కష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదు. అబద్ధాలతో మోసం చేస్తున్నారు..’అని ఆయన ఆరోపించారు. ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తాం.. ‘రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తేవాల్సిన అవసరం ఉంది. ఇందిర దేశాన్ని ధాన్యాగారంగా మార్చారు. నల్లగొండలో నాగార్జునసాగర్ ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్ పార్టీయే.. ఆ నీటిని మొదట ఇందిరాగాం«దీయే విడుదల చేశారు. పేదరిక నిర్మూలన కోసం 20 సూత్రాల పథకం, అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అలాంటి ఇందిరాగాందీని, గాంధీ కుటుంబాన్ని కేసీఆర్ విమర్శించడం ఎంతవరకు సమంజసం? సోనియా, రాహుల్, ప్రియాంక ప్రధాని పదవి కావాలని ఎప్పుడూ ఆశించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ తరహాలో సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. ఆరు గ్యారంటీ పథకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతాం. మహిళకు నెలకు రూ.2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం. రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు ప్రతి ఏడాది ఎకరానికి రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు అందజేస్తాం. పంటలకు మద్దతు ధర, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షలు అందజేస్తాం. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి 250 గజాల స్థలం ఇవ్వడంతో పాటు రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణం చేస్తాం. వృద్ధులకు పింఛన్లను రూ.4 వేలకు పెంచుతాం. విద్యార్థుల కోసం విద్యాభరోసా కార్డు అందజేస్తాం. వాల్మీకుల సమస్యలను పరిష్కరిస్తాం. రైతులకు సాగునీరు అందిస్తాం. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. బీఆర్ఎస్, బీజేపీకి ఎవరూ భయపడొద్దు. కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉంటుంది..’అని ఖర్గే హామీ ఇచ్చారు. మీకే 20 సీట్లు..చాలెంజ్: కోమటిరెడ్డి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని భువనగిరి ఎంపీ, నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రజలను కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. ‘కాంగ్రెస్‌కు 20 సీట్లు రావని సీఎం కేసీఆర్ అంటున్నారు.. చాలెంజ్ చేస్తున్నా.. మీకు ఈసారి 20 సీట్లు వస్తున్నాయి.. మాకు 90 సీట్లు వస్తున్నాయి..’అని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలపై దండయాత్ర: విజయశాంతి పదేళ్ల కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, తెలంగాణ ప్రజలపై దండయాత్ర జరిగిందని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ గద్దె దిగాల్సిందేనన్నారు. ఈ సభల్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడగొట్టాలి
నిర్మల్/సాక్షి, ఆసిఫాబాద్: ‘‘రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అదే కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు (పదవులు) ఉన్నాయి. యువతకు ఉద్యోగాలు రావాలంటే.. కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడగొట్టాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి..’’అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పిలుపునిచ్చారు. ప్రజలు ఇప్పటికే రెండుసార్లు బీఆర్ఎస్కు ఓటేసి పదేళ్లు దగాపడ్డారని, మళ్లీ బీఆర్ఎస్కు వేస్తే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని, రెండులక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు పటేల్‌ను, ఆసిఫాబాద్‌లో అజ్మీరా శ్యాంనాయక్‌ను గెలిపించాలని కోరారు. రెండు సభల్లో ప్రియాంకాగాంధీ ప్రసంగం ఆమె మాటల్లోనే.. ‘‘ఇందిరాగాంధీ ఆదివాసీలు, గిరిజనుల గురించి ఆలోచించేవారు. వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకొచ్చారు. అందుకే ఆమె మరణించి 40 ఏళ్లు గడిచినా గిరిజనులు ఆరాధిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలిసే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. కానీ కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలను దగా చేశారు. ప్రజల ఆకాంక్షలు ఒక్కటీ నెరవేర్చలేదు. యువతకు ఉపాధి కల్పించలేదు. కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి ఉద్యోగాలు రాకపోయినా కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వచ్చాయి. పరీక్షలు నిర్వహించినా పేపర్ లీక్‌లు జరిగాయి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి 2 లక్షల మందికి ఉద్యోగాలిస్తాం. ప్రత్యేక రాష్ట్రంలో తమ జీవితాలు మారుతాయని ఉద్యమకారులు కలలు కన్నారు. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యమకారుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగమిస్తాం. ఈ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్‌లకు ఉద్యోగాలు ఇవ్వొద్దు. లక్షల కోట్ల దోపిడీ.. రాష్ట్రంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరిట రూ.లక్షల కోట్ల దోపిడీ జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకు రుణమాఫీ చేసింది. రైతులకు మాత్రం రుణమాఫీ చేయడం లేదు. ప్రధాని మోదీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిపై చర్యలు చేపట్టరు. కానీ కాంగ్రెస్ నేతలపై మాత్రం సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టి అలా చేస్తున్నారు. వారికి ఒక తమ్ముడు ఎంఐఎం అధినేత. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఆయన సహకరిస్తున్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ఇతర రాష్ట్రాల్లో 40, 50 స్థానాల్లో పోటీ చేస్తారు. తెలంగాణలో మాత్రం 9 స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు. కేసీఆర్ కర్ణాటక సర్కారుపై విమర్శలు చేస్తున్నారేగానీ.. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదేమిటనేది ప్రజలకు చెప్పారు. తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై కాంగ్రెస్‌కు ఒక విజన్ ఉంది. ఈసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలి. ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఖాతాలో వేస్తాం. బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తాం. వరి పంటకు బోనస్‌గా రూ.500 అందజేస్తాం. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని వారికి ఇంటి స్థలంతోపాటు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం..’’అని ప్రియాంకగాంధీ ప్రకటించారు. జీతేగా ఇండియా.. అంటూ.. క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో ఇండియా టీమ్ గెలవాలని కోరుకుందామని, జీతేగా ఇండియా అంటూ ఖానాపూర్ సభలో ప్రియాంకగాంధీ ప్రసంగాన్ని ప్రారంభించారు. సభికులతోనూ ‘జీతేగా ఇండియా..’అంటూ నినాదాలు చేయించారు. ఈ సభల కోసం ఢిల్లీ నుంచి విమానంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు వచ్చిన ప్రియాంక.. అక్కడి నుంచి మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌రావు చవాన్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేలతో కలసి హెలికాప్టర్లో ఖానాపూర్‌కు వచ్చారు. తర్వాత హెలికాప్టర్లోనే ఆసిఫాబాద్‌కు చేరుకున్నారు. -
17న రాష్ట్రానికి రాహుల్
సాక్షి, హైదరాబాద్: ఈనెల 17న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 17న రాష్ట్రానికి రానున్న ఆయన వారంపాటు ఇక్కడే బస చేసే అవకాశముంది. ఈ మేరకు రాహుల్‌గాంధీ షెడ్యూల్‌ను టీపీసీసీ రూపొందిస్తుండగా, ఈనెల 17న ఆయన వరంగల్, పాలకుర్తి, భువనగిరిల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఈనెల 16 తర్వాత ఎన్నికల ప్రచారాన్ని హోరె త్తించాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ రాహుల్‌తో పాటు ప్రియాంకాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేలను కూడా రంగంలోకి దించనుంది. రాహుల్ తెలంగాణలో ఉన్నప్పుడే ఏదో ఒక రోజు ఆ ఇద్దరూ కూడా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రెబెల్స్‌కు బుజ్జగింపులు రెబెల్స్‌గా బరిలోకి దిగిన పార్టీ నేతలతో కాంగ్రెస్ మంతనాలు జరుపుతోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్ సోమవారం పలువురు రెబెల్స్‌తో సంప్రదింపులు జరిపారు. రాష్ట్రంలో 15 చోట్ల రెబెల్స్ బరిలో ఉన్నట్లు నాయకత్వం గుర్తించిందని, వారితో సంప్రదింపులు మంగళవారం పూర్త వుతాయని సమాచారం. రెబెల్స్ పోటీలో లేకుండా చూస్తామని పార్టీ వర్గాలంటున్నాయి. -
ఏఐసీసీ ‘అసెంబ్లీ’ పరిశీలకుల నియామకం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 10 మంది క్లస్టర్ ఇన్‌చార్జ్‌లను, 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏఐసీసీ పరిశీలకులను అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. -
Telangana Elections: కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తన రెండో జాబితాను శుక్రవారం విడుదల చేసింది. 45 మందితో కూడా జాబితాను కాంగ్రెస్ ఎట్టకేలకు రిలీజ్ చేసింది. కాంగ్రెస్ రెండో జాబితా ఇదే.. ఆసిఫాబాద్- అజ్మీరా శ్యామ్ ఖానాపూర్- వేడ్మ బోజ్జు ఆదిలాబాద్- కండి శ్రీనివాస్ రెడ్డి బోథ్- వెన్నెల అశోక్ ముథోల్- బోస్లే నారాయణ్‌రావు పాటిల్ ఎల్బీనగర్- మధుయాష్కీ గౌడ్ దుబ్బాక- చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కూకట్పల్లి-బండి రమేష్ ఇబ్రహీంపట్నం- మల్రెడ్డి రంగారెడ్డి ఖైరతాబాద్- విజయారెడ్డి వరంగల్ ఈస్ట్-కొండా సురేఖ చొప్పదండి-మేడిపల్లి సత్యం హుజురాబాద్- ఒడితల ప్రణవ్ యెల్లారెడ్డి- మదన్మోహన్రావు నిజామాబాద్ రూరల్-రెకులపల్లి భూపతిరెడ్డి కోరట్ల- జువ్వాడి నర్సింగరావు చొప్పదండి-మేడిపల్లి సత్యం హుస్నాబాద్- పొన్నం ప్రభాకర్ సిద్ధిపేట- పూజల హరికృష్ణ నర్సాపూర్-ఆవుల రాజి రెడ్డి దేవరకంద్ర-జి మధుసూదన్‌రెడ్డి వనపర్తి-జి. చిన్నారెడ్డి జనగాం- కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మహబూబాబాద్-మురళీనాయక్ వర్థన్నపేట-కేఆర్ నాగరాజు పినపాక- పాయం వెంకటేశ్వర్లు ఖమ్మం-తుమ్మల నాగేశ్వరరావు పాలేరు-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వరంగల్ వెస్ట్-నాయిని రాజేందర్ రెడ్డి పాలకుర్తి-యశశ్వని మామిడాల భువనగిరి-కుంభం అనిల్ కుమార్‌రెడ్డి మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దేవరకొండ-నేనావత్ బాలు నాయక్ అంబర్‌పేట- రోహిన్ రెడ్డి జూబ్లీహిల్స్- మహ్మద్ అజహరుద్దీన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్-డా. జీ.వీ వెన్నెల తాండూర్- బుయ్యాని మనోహర్‌రెడ్డి సిర్పూర్- రావి శ్రీనివాస్ ►సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్ టికెట్ల జాబితా.. ఇప్పటి వరకు 100 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ప్రకటన జరిగింది. రెడ్డిలకు 38 స్థానాలు బీసీలకు 20 స్థానాలు. వెలమలకు 9 స్థానాలు. కమ్మలకు 3 స్థానాలు. బ్రాహ్మణులకు 3 స్థానాలు. మైనారిటీలకు 4 స్థానాలు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాలు: 31 -
కాంగ్రెస్ కీలక నేతలు రెండేసి స్థానాల్లో పోటీ?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అభ్యర్థుల మలి జాబితా ప్రకటన ఏమోగానీ.. పూటకో ప్రచారంతో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం ఉదయం అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో గంటన్నరపాటు సాగిన కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో 45 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తొలుత ప్రచారం జరిగినప్పటికీ.. ఈ సాయంత్రమే అన్ని స్థానాలకు ప్రకటన ఉంటుందని స్పష్టత ఇచ్చింది కాంగ్రెస్. ఈ తరుణంలో మరో ప్రచారం వినవస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు రెండేసి స్థానాల్లో పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించిందట. కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి, గజ్వేల్.. హరీష్‌రావు సిద్దిపేట.. కేటీఆర్ సిరిసిల్లలోనే ఈ పోటీ ఉండనుందని తెలుస్తోంది. బరిలోకి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు సీఎల్పీ భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు 45 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ సీఈసీ.. అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో 14 స్థానాల్ని మాత్రం పెండింగ్‌లో ఉంచింది. పెండింగ్ జాబితాలో ఖమ్మంలో ఇల్లందు.. పాలేరు, నల్లగొండ జిల్లాలో దేవరకొండ.. తుంగతుర్తి.. సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో మక్తల్.. జడ్చర్ల నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం. మలివిడత జాబితా ఎప్పుడనేదానిపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ స్పష్టత ఇచ్చారు. ‘‘ఈరోజు సాయంత్రం 45 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తాం. మిగతా స్థానాలపై నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షులకు వదిలేశాం. కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. చెరో రెండు సీట్లు ఇచ్చే విషయంలో అంగీకారం కుదిరింది. ఏ స్థానాలు ఇవ్వాలి అనేదానిపై ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తుంది’’ అని తెలిపారాయన. -
నేడు కాంగ్రెస్ మలి జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మలి జాబితాపై కసరత్తు దాదాపు పూర్తయింది. నేతల చేరికలు, మార్పుచేర్పుల నేపథ్యంలో విడుదల జాప్యమవుతోందని, శుక్రవారం రాత్రికల్లా మలి జాబితాను ఏఐసీసీ విడుదల చేయనుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో 34 మంది కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు కమ్యూనిస్టులకు కేటాయించే నాలుగు స్థానాల పేర్లు ఉండనున్నాయని తెలిపాయి. ఇందులో కచ్చితంగా గెలవగలిగే అభ్యర్థులకే సీట్లు కేటాయించేలా స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తి చేసిందని పేర్కొన్నాయి. అసంతృప్తిని చల్లార్చేందుకు..: కొన్నిరోజులుగా ఢిల్లీ వేదికగా మురళీధరన్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. తొలి జాబితాలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాక కొన్నిచోట్ల అసంతృప్తి బయటపడిన నేపథ్యంలో.. మలి జాబితా తర్వాత అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఇద్ద రు, ముగ్గురికిపైగా టికెట్లు ఆశిస్తున్న సుమారు 17 నియోజకవర్గాలకు సంబంధించి.. నేతలను ఢిల్లీకి పిలిపించుకొని చర్చలు జరుపుతున్నారు. అవసరమైన వారిని పోటీ నుంచి తప్పుకొనేలా బుజ్జగిస్తు న్నారు. ఈ క్రమంలో మలి జాబితాపై ఆశావహు లు, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కా గా.. శుక్రవారం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశం జరగనుంది. ఈ భేటీలో అభ్యర్థుల ఎంపికను సీఈసీ ఖరారు చేయనుంది. కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం రాత్రి రాజగోపాల్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్ కుమార్‌లకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అంతకుముందు రాజగోపాల్‌రెడ్డి, మిగతా ఇద్దరు నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర పెద్దలను కలసి చర్చలు జరిపారు. రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీ చేరాలని వారు భావించారు. కానీ శుక్రవారం ఉదయం కాంగ్రెస్ సీఈసీ భేటీ ఉన్న నేపథ్యంలో.. అంతకన్నా ముందే పార్టీలో చేరితే అభ్యర్ధిత్వాలను పరిశీలించడం సాధ్యమవుతుందని పెద్దలు స్పష్టం చేశారు. దీంతో ఈ ముగ్గురి చేరికల తతంగాన్ని గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ముగ్గురు నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలవనున్నారు. -
మళ్లీ రాష్ట్రానికి రాహుల్
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్రానికి రానున్నారు. రెండో విడత బస్సు యాత్రను ఆయన వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభిస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే రాహుల్‌గాంధీ ఎక్కడ పాల్గొంటారనేది ఖరారు కావాల్సి ఉందన్నాయి. మొదటి విడత బస్సు యాత్రలో భాగంగా మూడు రోజులపాటు ఉత్తర తెలంగాణలోని 8 నియోజకవర్గాల్లో పర్యటించిన రాహుల్ ఈసారి దక్షిణ తెలంగాణలో పర్యటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రియాంకాగాంధీ ఈనెల 31న కొల్లాపూర్‌లో జరిగే పాలమూరు ప్రజాభేరి సభకు హాజరు కానున్నారు. ఆ రోజున సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న ఆమె అక్కడి నుంచి నేరుగా వెళ్లి కొల్లాపూర్ సభలో పాల్గొంటారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర నేతలు మొదటి విడత బస్సు యాత్రను ఈనెల 26, 27 తేదీల్లో కొనసాగించేలా పార్టీ షెడ్యూల్ రూపొందించింది. ఈ రెండు రోజుల్లో మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వీహెచ్‌తోపాటు మొత్తం 10 మంది నాయకులు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున 40 నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్ తయారు చేస్తున్నారు. ఈ రెండు రోజులపాటు ఆయా నియోజకవర్గాల్లో గడప గడపకూ వెళ్లి ఆరు గ్యారంటీ పథకాల కార్డులను పంపిణీ చేయడంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసే సభల్లో కూడా నేతలు పాల్గొననున్నారు. సీఈసీ నిర్ణయమే ఫైనల్: మహేశ్‌కుమార్‌గౌడ్ పార్టీ అభ్యర్థుల ఖరారు కోసం బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశమవుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని, సీఈసీ నిర్ణయమే ఫైనల్ అని ఆయన గాందీభవన్‌లో మంగళవారం విలేకరులకు చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానాలను మైనార్టీ నేతలు అడుగుతున్నారని, పార్టీ కూడా మైనార్టీలకు న్యాయం చేస్తుందని చెప్పారు. తాను ఆశిస్తున్న నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని ఎవరికి కేటాయించాలన్న దానిపై స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బుధవారం జరగనున్న సీఈసీ సమావేశానికి అందుబాటులో ఉండాలని పార్టీ నుంచి పిలుపు రావడంతో ఆయన ఢిల్లీ వెళ్లారని, రాష్ట్ర నాయకత్వం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సానుకూలంగానే ఉన్నా ఆయనకు మైనార్టీ సెగ తప్పదని తెలుస్తోంది. మరోవైపు ఇదే స్థానం తనకు కేటాయించాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ కూడా గట్టిగా పట్టుపడుతుండటం, అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. -
రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రానుంది: రాహుల్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ కాటారం: తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని, ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజల స్వప్నాన్ని నెరవేరుస్తుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఆరు గ్యారంటీల పథకాల అమలుపై సంతకాలు చేస్తామని చెప్పారు. సింగరేణి కార్మీకుల ప్రయోజనాలు కాపాడతామని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ సీఎంలా కాకుండా రాజులా పాలిస్తున్నారని, కీలక శాఖలన్నీ తన కుటుంబసభ్యుల గుప్పిట్లో పెట్టుకుని రూ.లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనన్నారు. బీజేపీ, ఎంఐఎంలకు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లేనని చెప్పారు. తెలంగాణతో తనది రాజకీయ బంధం కాదని ఆప్యాయతతో కూడిన కుటుంబ బంధమని పేర్కొన్నారు. తనకంటే ముందు నెహ్రూ, ఇందిర, రాజీవ్‌లతో తెలంగాణకు బంధం ఉందని చెప్పారు. ఇవే మాటలు చెప్పి తన చెల్లి ప్రియాంకా గాందీని రాష్ట్ర పర్యటనకు తీసుకొచ్చానని తెలిపారు. విజయభేరి యాత్రలో భాగంగా గురువారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా మంథని రోడ్‌షోలో, పెద్దపల్లి బహిరంగ సభలో, కరీంనగర్ రాజీవ్‌చౌక్ కార్నర్ మీటింగ్‌లో రాహుల్ ప్రసంగించారు. దేశంలోనే నంబర్ 1 అవినీతి సీఎం ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని 2004లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ 2014లో మాట నిలబెట్టుకుంది. తెలంగాణ ఇస్తే రాజకీయంగా నష్టపోతామని తెలిసినా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సోనియా తెలంగాణ ఇచ్చారు. కానీ రాష్ట్రానికి సీఎం అయిన కేసీఆర్ ఈ పదేళ్లలో ప్రజా ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారు. కాళేశ్వరంలో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగింది. అయినా ఎకరం కూడా తడపలేకపోయారు. ఈ ప్రాజెక్టు వల్ల కేవలం కేసీఆర్ మిత్రులైన బడా కాంట్రాక్టర్లు లాభపడ్డారు. భూ రికార్డుల ప్రక్షాళన పేరిట తెచ్చిన ధరణితో పేదల లక్షల ఎకరాలు మాయమయ్యాయి. దేశంలోనే నంబర్ వన్ అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో దొరల పాలనకు స్వస్తి పలకాలి. ఓ రాజు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలు..’ అని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ చేసి చూపిస్తుంది ‘డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల పంపిణీ అటకెక్కాయి. రైతు రుణమాఫీ, రైతుబంధు వల్ల ఎందరికి ప్రయోజనం కలిగింది? దేశంలో బొగ్గు ధరల విషయంలో అదాని కంపెనీలకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉంటున్నాయి. మోదీ రూ.15 లక్షలు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ చెప్పినవన్నీ చేసి చూపిస్తుంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో పథకాలు అమలు చేస్తున్నాం. కాంగ్రెస్‌ను ఓడించడానికి బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మిలాఖత్ అయ్యాయి. బీఆర్ఎస్ను అడ్డుపెట్టుకొని మోదీ తెలంగాణను అధోగతి పాలు చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం రాబోతోంది. ఢిల్లీలో బీజేపీని, ఇక్కడ బీఆర్ఎస్ను ఓడించాలి..’ అని రాహుల్ పిలుపునిచ్చారు. కులగణన దేశానికి ఎక్స్‌రే లాంటిది ‘దేశంలో, రాష్ట్రంలో సామాజిక న్యాయం కరువైంది. నిత్యం ఓబీసీ ప్రయోజనాలపై మాట్లాడే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు ఏనాడూ కులగణన ప్రస్తావన తీసుకురారు. దేశాన్ని ఎంపీలు కాకుండా 90 మంది కార్యదర్శులు నడిపిస్తుంటారు. బడ్జెట్ కేటాయింపులు రూపొందించేది వారే. ఈ కేటాయింపులు జరిపే కార్యదర్శుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీకి చెందిన వారున్నారు. దేశంలో మెజారిటీ వాటా ఉన్న ఓబీసీలకు రూ.44 లక్షల కోట్ల బడ్జెట్లో దక్కుతున్నది కేవలం 5% మాత్రమే. అందుకే ఓబీసీ కులగణన జరగాలి. అది దేశానికి ఎక్స్‌రే లాంటిది. అది చేపడితే ప్రజలు అప్రమత్తమవుతారన్న భయంతోనే వారు కులగణనపై వెనకడుగు వేస్తున్నారు. ప్రజల పక్షాన బీజేపీపై నేనొక్కడిని ఒంటరి పోరాటం చేస్తున్నా. నా పోరాటాన్ని అడ్డుకోవడానికి బీజేపీ నాపై అక్రమంగా 24 కేసులు పెట్టింది. లోక్‌సభ సభ్యత్వం రద్దు చేసి ఇల్లు కూడా లాగేసుకుంది. ఎన్ని అవరోధాలు కల్పించినా భయపడేది లేదు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తా..’ అని రాహుల్ స్పష్టం చేశారు. తెలంగాణ ఇవ్వకపోతే అడుక్కుతినేవారు: రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా లేదా బిర్లా గుడి దగ్గర అడుక్కుతినే వారని విమర్శించారు. కేటీఆర్ అమెరికాలో బాత్రూములు కడుక్కునే వారన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొండా సురేఖకు గాయాలు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ కాన్వాయ్‌లోనే ఉండి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ బైక్ ర్యాలీలో మాజీ మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. ఆమె స్కూటీపై వెళ్తుండగా స్కిడ్ కావడంతో కిందపడిపోయారు. దీంతో ముఖంపై స్వల్ప గాయాలయ్యాయి. స్పృహ తప్పిన సురేఖను వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మీ బతుకుల్లో వెలుగులు నింపుతాం – ఆదాయ పన్ను రద్దు చేస్తాం – సింగరేణి కార్మీకుడి ఇంట్లో రాహుల్ ఆకస్మిక భేటీ సాక్షి, పెద్దపల్లి: కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరేణి కార్మీకుల సమస్యలు పరిష్కరిస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రకృతికి విరుద్ధంగా, కృత్రిమ పరిస్థితుల మధ్య ప్రాణాలకు తెగించి పని చేస్తూ దేశానికి వెలుగులు నింపే సింగరేణి కార్మీకుల బతుకుల్లో వెలుగులు నింపుతామని వారికి భరోసా కల్పించారు. కార్మీకులకు ఆదాయ పన్ను రద్దు చేస్తామన్నారు. ప్రైవేటీకరణ కాకుండా సింగరేణిని కాపాడతామని చెప్పారు. విజయభేరి యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీలో సింగరేణి కార్మీకులతో రాహుల్ సమావేశమవుతారంటూ కాంగ్రెస్ ప్రచార షెడ్యూల్ విడుదల చేసింది. దానికి తగినట్లుగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే రాహుల్ రామగిరి మండలం లద్నాపూర్‌లో ఆకస్మికంగా ఆగారు. అక్కడ సింగరేణి కార్మీకుడు పోచయ్య ఇంటికి వెళ్లారు. సాదాసీదాగా ఇంట్లోకి వచ్చిన రాహుల్‌గాందీని చూసి పోచయ్య కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అక్కడే సుమారు 50 మంది సింగరేణి కార్మీకులతో వారి వస్త్రధారణ, నెత్తిపై టోపీతో రాహుల్ భేటీ అయ్యారు. వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఆదాయ పన్ను రద్దు చేయాలి లేదా స్లాబ్ పెంచాలని, ప్రైవేటీకరణను ఆపివేయాలని, కొత్తగా ఏర్పాటు చేయబోయే మైన్స్ ప్రైవైట్కి కాకుండా సింగరేణికి కేటాయించాలని వారు కోరారు. రాహుల్ వారికి స్పష్టమైన హామీలు ఇచ్చి భరోసా కల్పించారు. కార్మికులతో కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌రెడ్డి భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1వ గనిలో ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. సింగరేణి కార్మీకుల పోరాటం, త్యాగాలు మరువలేనివని అన్నారు. భరోసా కల్పించేలా హామీలిచ్చారు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్న వైనాన్ని వివరించాం. గతంలో 1.10 లక్షల మంది పర్మీనెంట్ కార్మికులు ఉంటే నేడు 45 వేల మందే ఉన్నారని చెప్పాం. మా సమస్యలన్నీ విని, మాకు భరోసా కల్పించేలా రాహుల్ హామీలిచ్చారు. – ఎ.శ్రీనివాస్, జనరల్ మజ్దూర్ రాహుల్‌గాంధీ వచ్చారంటే నమ్మలేకపోతున్నా.. మా ఇంటికి రాహుల్‌గాంధీ వస్తాడని ఊహించలేదు. ఆయన రావడం, మాఇంట్లో సమావేశం నిర్వహించడం నమ్మలేకపోతున్నా. సుమారు 40 నిమిషాల పాటు మా ఇంట్లో ఉన్నారు. మా మనవరాలికి చాక్లెట్ ఇచ్చారు. – ఓదెమ్మ, సింగరేణి కార్మీకుడి భార్య -
కాంగ్రెస్‌లో ‘సర్వే’ల పీటముడి!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఖరారు ప్రక్రియలో ‘సర్వే’ల అంశంతో పీటముడి పడుతోంది. సర్వేల ప్రాతిపదికగానే టికెట్లు కేటాయిస్తామని ఏఐసీసీ, టీపీసీసీ నేతలు ముందునుంచీ చెప్తూనే ఉన్నా.. అలా చేస్తే ఇబ్బందికరమేనన్న వాదన పార్టీ నేతల్లో వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో 60 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చిందని, ఆయా స్థానాల్లో ఒక్కో పేరునే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపాలని నేతలు నిర్ణ యించారు. మరో 30–35 సీట్లపై ఏకాభిప్రాయం రాలేదు. ఈ స్థానాల్లో సర్వేల్లో వెల్లడైన బలాబలాల ప్రకారమే అభ్యర్థులను ఖరారు చేయాలని కొందరు నేతలు ప్రతిపాదించగా.. ఈ ప్రతిపాదన సరికాదని మరికొందరు నేతలు పేర్కొంటున్నట్టు తెలిసింది. కొత్తగా వచ్చిన నాయకులను సర్వేల ఆధారంగా కొన్నిచోట్ల మాత్రమే ఖరారు చేయవచ్చని, మిగతా చోట్ల సర్వేలతోపాటు పార్టీకి విధేయత, ఇతర కోణాలనూ సరిచూసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సర్వేలను పునఃపరిశీలించడంతోపాటు ఆశావహు లతో మాట్లాడి, టికెట్లు ఇవ్వలేని నేతలను బుజ్జగించేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ఈనెల 25న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఆ భేటీ ముగిశాక ఈ నెల 28న లేదా 29న స్క్రీనింగ్ కమిటీ మరోమారు భేటీ అవుతుందని, అది ఢిల్లీలోనే జరిగే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ భేటీ తర్వాత మెజార్టీ స్థానాలపై ఏకాభిప్రాయం తీసుకుని, సీఈసీ ఆమోదంతో ఒకేసారి జంబో జాబితా విడుదల చేస్తామని అంటున్నాయి. కొంత ఆలస్యమైనా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడమే మేలనే అభిప్రాయంతో ఏఐసీసీ పెద్దలు ఉన్నారని వివరిస్తున్నాయి. ఈ క్రమంలో జాబితాల విడుదల వాయిదా పడే అవకాశమూ ఉందని పేర్కొంటున్నాయి. ఇక కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న నేతలు ఢిల్లీలో నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్యారాచూట్లకు టికెట్లా? స్క్రీనింగ్ కమిటీలో జరిగిన చర్చ ప్రకారం ప్యారాచూట్లకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలోనే టికెట్లు వచ్చే అవకాశం ఉందన్న దానిపై కాంగ్రెస్‌లోని సీనియర్ ఆశావహులు రగిలిపోతున్నారు. ప్యారాచూట్లకు టికెట్లు ఇవ్వబోమని, పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యమిస్తామని అగ్రనేత రాహుల్‌గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఆ ప్రకారం దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఉప్పల్, గద్వాల, దుబ్బాక, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్ సహా పలుచోట్ల ప్యారాచూట్లకు ఇచ్చిన ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి సర్వేలు ఎలా అనుకూలంగా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. పార్టీ బలంగా ఉండటంతోనే సర్వేలు అనుకూలంగా చూపుతున్నాయని.. అందువల్ల పార్టీలో ముందునుంచీ ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరేశం చేరిక వాయిదా! నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరే కార్యక్రమం వాయిదా పడింది. ఆయన శనివారమే రాహుల్ లేదా ఖర్గే సమక్షంలో పార్టీలో చేరుతారని భావించారు. కానీ ఆ ఇద్దరు నేతలు అందుబాటులో లేనందున వీరేశంతోపాటు వెళ్లిన ఆయన ప్రధాన అనుచరులు మాత్రం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఈనెల 29న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో వీరేశంతోపాటు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. అవకాశాన్ని బట్టి అగ్రనేతలు అందుబాటులో ఉంటే ఢిల్లీలోనే చేరికల కార్యక్రమం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. కాగా వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ సంపత్ కుమార్, వ్యాపారవేత్త పి.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు శనివారం ఢిల్లీలో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. -
మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే!
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసీఆర్ బయటకు వేర్వేరుగా ఉన్నట్లు కనిపించినా, అంతర్గతంగా ఇద్దరూ ఒక్కటే అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ–టీమ్ అని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం కేసీఆర్, మోదీ ఎన్నో అబద్ధాలు చెబుతారని, రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తెలివిగా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ నాయకులంతా కృషి చేస్తున్నారని, కార్యకర్తలు సైతం శ్రమటోడ్చి పనిచేయాలని పిలుపునిచ్చారు. తుక్కుగూడలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన విజయభేరి బహిరంగ సభలో ఖర్గే మాట్లాడారు. తెలంగాణకు స్వాతంత్య్రం ఇచ్చింది... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. మేం మాట ఇస్తే చేసి చూపుతాం కాంగ్రెస్ వాగ్దానం ఇస్తే.. దాన్ని తప్పక నెర వేరుస్తుందని, ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత చట్టం ఇలా ఎన్నింటినో పార్టీ తెచ్చిందని ఖర్గే చెప్పారు. ‘కొందరు ఏమీ చేయకుండానే వాళ్లే దేశానికి స్వాతంత్య్రం తెచ్చినట్టు ఎంతో ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ, ఈ దేశంలో పేదలు, ఆదివాసీలు, ఎస్సీలు, పేద రైతుల కోసం కాంగ్రెస్ ఎన్నో పనులు చేసింది. సోనియా వాగ్దానం మేరకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ఇచ్చారు. ఓట్ల కోసం ప్రత్యేక తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను, బాధను అర్థం చేసుకుని సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కానీ, ఈ రోజు మా కష్టం పదేళ్లు వృథాగా పోయింది. ఈ పదేళ్లలో మేం అనుకున్న రీతిలో ఇక్కడ అభివృద్ధి జరగలేదు’ అని అన్నారు. సోనియాగాంధీ చెప్పింది చేస్తారని, కేసీఆర్ చెప్పింది చేయరని పేర్కొన్నారు. కేసీఆర్ అప్పులపాలు చేశారు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఈ పదేళ్లలో దివాలా తీసే స్థితికి తెచ్చారని ఖర్గే మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు భూమి ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్... బడ్జెట్ లేదంటూ చేతులెత్తేశారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ఓవైపు మోదీ అమ్ముతూ తన స్నేహితులను ధనవంతులను చేస్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు కేసీఆర్ తెలంగాణలోని ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల్లోకి నెట్టి వాటిని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం అబద్ధాలతో మోసగించే మోదీ, కేసీఆర్ విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుందన్న విశ్వాసం కలుగుతోందని ఖర్గే చెప్పారు. రైతు భరోసా ప్రకటించిన ఖర్గే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా పథకం కింద ఏటా రైతులకు, కౌలు రైతులకు ఒక్కో ఎకరాకు రూ.15 వేలు ఆర్థికసాయం ఇస్తామని ఖర్గే ప్రకటించారు. భూమిలేని రైతు కూలీలకు ప్రతి సంవత్సరం రూ.12,000 ఇచ్చి భరోసా ఇస్తామన్నారు. అదేవిధంగా వరికి కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ కూడా ఇస్తామని హామీ చెప్పారు. -
T Congress: అంతా హైకమాండ్ కంట్రోల్లోకి..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నింటినీ ఏఐసీసీ హ్యాండోవర్ చేసుకుందా? ఈసారి తెలంగాణలో గెలుపు అవకాశాలున్నాయనే అంచనాల నేపథ్యంలో టీపీసీసీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే జరుగుతున్నాయా? రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను గౌరవిస్తున్నామన్న భావన కల్పిస్తూనే చేయాల్సిందంతా అధిష్టానమే చేస్తోందా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని తాజా పరిణామాలను గమనిస్తే.. అవుననే సమాధానమే వస్తోంది. పార్టీ కమిటీల ఏర్పాటు నుంచి టికెట్ల కేటాయింపు వరకు అంతా ఢిల్లీ కనుసన్నల్లోనే జరిగేలా ప్రణాళిక అమలవుతోందని, ఇటీవలి అన్ని పరిణామాలు టీపీసీసీకి పూర్తిస్థాయిలో సమాచారం లేకుండానే జరిగాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ పార్టీలో ఉన్న కుమ్ములాటలు పుట్టి ముంచుతాయనే అభిప్రాయానికి వచ్చిన టెన్ జన్‌పథ్ వర్గాలు పూర్తిస్థాయిలో తెలంగాణ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నాయని, అప్పుడప్పుడూ బెంగళూరు నుంచి అందే సంకేతాలు కూడా ఏఐసీసీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండానే.. రాష్ట్రాల్లోని ఇతర పార్టీల విషయంలో అవలంబించాల్సిన వైఖరిపై జాతీయ పార్టీలు సాధారణంగా ఆయా రాష్ట్రాల్లోని పార్టీ నేతల అభిప్రా యాలు తీసుకుంటాయి. కాంగ్రెస్ పార్టీ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కానీ వైఎస్సార్టీపీ నేత షర్మిలతో చర్చలు, వచ్చే ఎన్ని కల్లో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుల గురించి ఢిల్లీలో నిర్ణయం తీసుకున్న తర్వాతే రాష్ట్ర పార్టీ నేతలకు తెలియడం గమనార్హం. షర్మిల బెంగళూరులో డి.కె.శివకుమార్‌ను కలిసినప్పటి నుంచే ఆమె కాంగ్రెస్‌లో చేరతారన్న దానిపై ఊహాగానాలు సాగినప్పటికీ, దీనిపై నామమాత్రంగా కూడా రాష్ట్ర పార్టీ నేతలతో ఢిల్లీ పెద్దలు చర్చించకపోవడం గమనార్హం. మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వాములైన సీపీఐ, సీపీఎం పార్టీలతో వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి కూడా రాష్ట్ర పార్టీ అభిప్రాయంతో పనిలేకుండా ఏఐసీసీయే రంగంలోకి దిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రే కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరిపిన తర్వాతే విషయం రాష్ట్ర నాయకత్వానికి తెలిసింది. ఇటీవల జరిగిన సంస్థాగత కమిటీల ఏర్పాటు విషయంలో కూడా తెలంగాణ నాయకత్వానికి తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోవడం గమనార్హం. పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం వస్తుందన్న దానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఫలానా నేతను టీపీసీసీ సిఫారసు చేసిందనే సమాచారం కూడా బయటకు వచ్చింది. కానీ ఎన్నడూ చర్చ జరగని ఇద్దరు నేతలకు అనూహ్యంగా సీడబ్ల్యూసీలో చోటు దొరికింది. తమ పేర్లు ఎందుకు రాలేదా అని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు ఆరా తీస్తున్న సమయంలోనే వారికి మరో షాక్ తగిలింది. కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)ని ప్రకటించిన అధిష్టానం రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండానే తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం కల్పించింది. అంతకంటే ముందు ఏర్పాటు చేసిన పార్టీ స్క్రీనింగ్ కమిటీలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతతో పాటు మరో నేతను నియమించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘సీడబ్ల్యూసీ’పై పీఈసీలో తీర్మానం! గతంలో ఎన్నడూ లేని విధంగా సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. అయితే వీటి నిర్వహణ విషయంలోనూ అధిష్టానమే నిర్ణయం తీసుకుని టీపీసీసీకి సమాచారం ఇచ్చిందని అంటున్నారు. ఆ సమాచారం మేరకే సీడబ్ల్యూసీ సమావేశాలతో ఎలాంటి సంబంధం లేని ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశంలో.. సీడబ్ల్యూసీ సమావేశాలు రాష్ట్రంలో నిర్వహించాలనే తీర్మానం చేశారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ తీర్మానం తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఒకసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సమావేశాల నిర్వహణపై ఆరా తీశారు. ఆ తర్వాత ఉన్నట్టుండి సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్‌ను ఏఐసీసీ ప్రకటించింది. అలాగే ఈనెల 18న సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్న విషయాన్ని కూడా నేరుగా అధిష్టానమే ప్రకటించింది. కేవలం సోనియాగాంధీ పాల్గొనే సభ, ఆ సభలో ప్రకటించాల్సిన ఐదు గ్యారంటీ కార్డు స్కీంల గురించి మాత్రమే టీపీసీసీకి ముందస్తు సమాచారం ఉందని, మిగిలిన అంశాల్లో ఏఐసీసీ నిర్ణయం తీసుకుని టీపీసీసీకి చేరవేసిందనే చర్చ జరుగుతోంది. ఎందుకిలా? తెలంగాణ వ్యవహారాలను పూర్తిగా అధిష్టానం టేకోవర్ చేయడంపై గా>ంధీభవన్ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ నేతల మధ్య పాతుకుపోయిన అనైక్యత ఇప్పట్లో సర్దుకునే అవకాశం లేదనే భావనతోనే ఏఐసీసీ రంగంలోకి దిగిందనే చర్చ జరుగుతోంది. ప్రతి చిన్న పరిణామంపైనా తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అన్ని విషయాలపై హస్తినలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే టీపీసీసీకి సమాచారం ఇస్తున్నారని కొందరు నేతలు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు గొడవలు, భిన్నాభిప్రాయాలు సహజమే అయినా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవి తారస్థాయికి చేరాయని, ఎన్నికల్లో గెలుపు అంచనాలున్న పరిస్థితుల్లో తాము రంగంలోకి దిగడమే మంచిదనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర పార్టీలో జరుగుతున్న ప్రతి చిన్న పరిణామంపైనా ఢిల్లీకి నివేదికలు వెళుతున్నాయని, ఈ నివేదికల నేపథ్యం కూడా ఏఐసీసీ ఆజమాయిషీకి కారణమని తెలుస్తోంది. -
పొత్తు సరే.. సీట్ల మాటేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీల పొత్తుకు మార్గం దాదాపుగా సుగమమైంది. మునుగోడులో వామపక్షాలతో జతగట్టినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకే బీఆర్ఎస్ మొగ్గుచూపింది. బీఆర్ఎస్తో బ్రేకప్ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలు ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేశాయి. కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలతో జరిపిన సంప్రదింపులు దాదాపు సక్సెస్ అయినట్లేననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఏఐసీసీ నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏర్పడిన ఇండియా కూటమిలో వామపక్షాలు సైతం భాగస్వాములుగా ఉండడంతో రాష్ట్రంలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తుపై సానుకూలతకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. అయితే తమకు కేటాయించే సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చిన తర్వాతే ఈ విషయంలో మరింత ముందుకెళ్లాలనే ఆలోచనలో లెఫ్ట్ పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌ను సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొత్తు, సీట్లు చర్చకు వచ్చినట్లు సమాచారం. చెరో ఐదు సీట్లు ఇవ్వండి పొత్తుకు కాంగ్రెస్ ప్రాథమికంగా సమ్మతించినప్పటికీ సీట్ల విషయాన్ని తేల్చలేదు. అయితే సీపీఐ, సీపీఎంలు చెరో ఐదు సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ వద్ద ప్రతిపాదనలు ఉంచినట్లు సమాచారం. సీపీఐ నేత నారాయణ తాము ఐదు స్థానాల్లో పోటీ చేస్తామని, కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి, మునుగోడు స్థానాల్లో తమ పార్టీ బలంగా ఉందని పేర్కొన్నట్లు సమాచారం. అయితే తాము అత్యంత బలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు సీట్లను కేటాయించడాన్ని కాంగ్రెస్ కొంత ఇబ్బందికరంగా భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. సీపీఎం సైతం ఐదు సీట్లలో పోటీ చేస్తామంటోంది. భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, మధిర, ఇబ్రహీంపట్నం స్థానాలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు, ఈ మేరకు ఠాక్రేతో ఫోన్లో సీపీఎం నేతలు మాట్లాడినట్లు తెలిసింది. కాగా సీట్ల విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే చర్చలు కొనసాగించాలని వామపక్ష పార్టీలు నిర్ణయానికి వచ్చాయని సమాచారం. కాంగ్రెస్ తర్జనభర్జన! వామపక్ష పార్టీల ప్రతిపాదనల నేపథ్యంలో.. వారికి ఎక్కడెక్కడ సీట్లు కేటాయించాలనే అంశంపై కాంగ్రెస్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పార్టీ అధిష్టానం మాత్రం క్షేత్రస్థాయిలో నాయకత్వం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లాల వారీగా కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
అలిగిన కోమటిరెడ్డి!.. రంగంలోకి ఏఐసీసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇవాళ జరిగిన స్క్రీనింగ్ కమిటీ కీలక భేటీకి సైతం ఆయన డుమ్మా కొట్టారు. ఇంతకాలం పార్టీనే తన తొలి ప్రాధాన్యతగా చెబుతూ వస్తున్న ఆయన.. ఇప్పుడు ఆత్మగౌరవం ముఖ్యమంటూ స్వరం మార్చడం గమనార్హం. ఆయన అలక వెనుక సరైన కారణం తెలియనప్పటికీ.. కీలక పదవులు దక్కకపోవడంపై ఆయన తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుజ్జగింపులకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. ఏఐసీసీ ఆదేశాలనుసారం.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎంపీ కోమటిరెడ్డికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. సమస్యల్ని అంతర్గతంగానే.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో.. వచ్చి తనను కలవాలని సూచించినట్లు సమాచారం. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్తారని, అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి ని బుజ్జగిస్తారని తెలుస్తోంది. కోమటిరెడ్డి ఇంటికి వెళ్తున్న.. ఆయనతో భేటీ అవుతా అంటూ స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిసిన అనంతరం ఠాక్రే సైతం ప్రకటన చేశారు. అయితే కోమటిరెడ్డి స్ట్రాంగ్ లీడర్ అని, ఆయన అలగరు అని సీనియర్ నేత భట్టి చెబుతుండడం గమనార్హం. రేవంత్‌రెడ్డి పీసీసీ నాయకత్వాన్ని విబేధిస్తూ.. పార్టీ కార్యక్రమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు కోమటిరెడ్డి. అయితే కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత కలిసి పని చేయాలనే అధిష్టానం ఆదేశాలతో కలుపుగోలుగా పని చేయాలని భావించారు. ఈ తరుణంలో.. పార్టీలో చేరికలు, సీట్ల కేటాయింపు అంశం మళ్లీ కోమటిరెడ్డిని అసహనానికి లోను చేశాయి. ఈలోపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ రెండింటిలో జాబితా వెలువడడం.. ఆ రెండింటిలో తనకు పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనైనట్లు స్పష్టమవుతోంది. -
టార్గెట్.. తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: సోనియా గాందీ, మల్లికార్జున ఖర్గే సహా కాంగ్రెస్ అతిరథ మహారథులు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన వర్కింగ్ కమిటీ సభ్యులు.. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, శాసనసభాపక్ష నాయకులు.. ఒక్కమాటలో చెప్పాలంటే దేశంలోని కీలక కాంగ్రెస్ నేతలంతా తెలంగాణకు రానున్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. దీని వెనుక కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారం దక్కించుకునే ప్రణాళికలో భాగంగానే.. హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని సర్వేలు అంచనా వేసిన నేపథ్యంలో.. రాష్ట్ర పార్టీ వ్యూహాలకు తోడుగా నిలిచి, చేయూత అందించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైందని అంటున్నాయి. ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల ప్రభావం కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు అనుకూలంగా మారేలా, ప్రజల్లో భరోసా కల్పించేలా.. సోనియా సహా పార్టీ కీలక నేతలు ఎన్నికల హామీలను ప్రకటించనున్నారని చెప్తున్నాయి. నియోజకవర్గానికో నేత పర్యటన.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించనున్న ఐదు గ్యారెంటీ కార్డు స్కీమ్‌లతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిïÙట్ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నేతలు కార్యాచరణ సిద్ధంచేశారు. ఈ నెల 17న పరేడ్‌గ్రౌండ్స్ సభ ముగిశాక.. 18వ తేదీన సీడబ్ల్యూసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక్కో కీలక నేత వెళ్లి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆ రాష్ట్రాల తరహాలో ఇక్కడ కూడా.. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు స్కీమ్‌ల పేరుతో ఐదు ప్రధాన హామీలు ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లోనూ విజయం సాధించిన కాంగ్రెస్ తమ హామీలను నిలబెట్టుకునే దిశగా ముందుకెళుతోంది. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ 5 గ్యారెంటీ స్కీమ్‌లను అమలుచేస్తామని హామీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ, పింఛన్లు రూ.4 వేలకు పెంపు, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, అసైన్డ్ భూములపై సర్వహక్కులు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీలు ఈ గ్యారెంటీ కార్డు స్కీమ్‌లలో ఉంటాయని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి.అధికారంలోకి రాగానే వీటిని అమలు చేస్తామని.. ఐదేళ్లలో ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని ప్రజలకు వివరించనున్నట్టు పేర్కొంటున్నాయి. ఈ ఐదు హామీలను కూడా తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17న, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాగాందీతో ఇప్పించేందుకు సిద్ధమవుతున్నట్టు వివరిస్తున్నాయి. మిగతా డిక్లరేషన్ల ప్రకటన కూడా.. వాస్తవానికి సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని టీపీసీసీ భావించింది. అయితే మేనిఫెస్టో రూపకల్పన పూర్తికాకపోవడంతో.. ఆ రోజున గ్యారెంటీ కార్డు స్కీమ్‌ల ప్రకటనకే పరిమితం కానున్నట్టు తెలిసింది. ఇప్పటికే రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించిన నేపథ్యంలో.. బీసీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్లను పరేడ్ గ్రౌండ్స్ సభలో ప్రకటించనున్నారు. డిక్లరేషన్లు, ఇతర అంశాలను ఈ సభలోనే ప్రకటించాలని యోచిస్తున్నట్టు రేవంత్‌రెడ్డి కూడా వెల్లడించారు. సమావేశాలు తాజ్‌కృష్ణాలో.. సభ పరేడ్ గ్రౌండ్స్‌లో.. సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణ కోసం హైదరాబాద్ శివార్లలోని రిసార్టులను ఎంచుకోవాలని తొలుత భావించిన టీపీసీసీ.. చివరికి తాజ్‌కృష్ణా హోటల్లో నిర్వహించాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. గ్యారెంటీ కార్డు స్కీంల ప్రకటన కోసం పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభ నిర్వహించనుండటంతో.. పార్టీ పెద్దలు శివార్ల నుంచి సభకు రావడానికి సమయం పడుతుందనే ఉద్దేశంతో తాజ్ కృష్ణాలో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తాజ్ కృష్ణా హోటల్‌తోపాటు పరేడ్ గ్రౌండ్స్‌ను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ నెల ఆరో తేదీన సాయంత్రం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు రానున్నారు. సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణ, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. తెలంగాణ ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజాం సంస్థానం పరిధిలోని కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తి. అంటే ఆయనది తెలంగాణనే. ఆయన ఏఐసీసీ అధ్యక్షుడైన తర్వాత తొలి సీడబ్ల్యూసీ సమావేశాలను తన సొంత రాష్ట్రంలో నిర్వహిస్తున్నట్టే. దీన్నిబట్టి తెలంగాణకు ఏఐసీసీ ఎంతటి ప్రాధాన్యతనిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమావేశాల వేదికగానే జాతీయ స్థాయి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తుంది. – టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి -
తెలంగాణలో ఎన్నికల ఎఫెక్ట్.. AICC కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో భారీ విజయంతో కాంగ్రెస్ పార్టీ జోరుపెంచింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో హస్తం పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో తొలిసారి సీడబ్ల్యూసీ భేటీ కానుంది. వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 16వ తేదీన హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలని ఏఐసీసీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీడబ్ల్యూసీ సభ్యులు రానున్నారు. ఇక, సెప్టెంబర్ 18న ఎన్నికల శంఖారావంగా కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అలాగే, తెలంగాణ ఎన్నికల టార్గెట్‌గా కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నారు. మరోవైపు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కారణంగా తేదీలు మారే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. సీడబ్ల్యూసీ కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత తొలి భేటీ హైదరాబాద్‌లో జరగనుంది. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనుండటంతో ఈ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణ ఎన్నికలే టార్గెట్‌గా పలు కార్యక్రమాలను రూపొంచాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ ముందుకు సాగుతున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లోకి క్యూ కట్టిన నేతలు.. పొంగులేటి పోటీ ఎక్కడ? -
సీడబ్ల్యూసీలోకి దామోదర
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన వర్కింగ్ కమిటీలో తెలంగాణ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ చోటు దక్కించుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన నూతన కమిటీకి సంబంధించిన ఉత్తర్వులను ఆదివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. మొత్తం 84 మందితో ఏర్పాటు చేసిన నూతన సీడబ్ల్యూసీలో 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. రాష్ట్రం నుంచి సీనియర్ నేత దామోదర రాజనర్సింహకు శాశ్వత ఆహ్వానితుడిగా, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుడిగా సీడబ్ల్యూసీలో అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి సీడబ్ల్యూసీ సభ్యుడిగా, సీనియర్ నేతలు సుబ్బిరామిరెడ్డి, కొప్పుల రాజులను శాశ్వత ఆహ్వానితులుగా, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు కల్పించారు. సీడబ్ల్యూసీ సభ్యులు వీరే..: మల్లికార్జున ఖర్గే, సోనియా గాందీ, మన్మోహన్సింగ్, రాహుల్ గాంధీ, అ«దీర్రంజన్ చౌదరి, ఏకే ఆంటోని, అంబికా సోని, మీరా కుమార్, దిగ్విజయ్‌సింగ్, చిదంబరం, తారీఖ్ అన్వర్, లాల్ తన్హావాలా, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అశోక్ చవాన్, అజ య్ మాకెన్, చరణ్‌జీత్ సింగ్ చన్నీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కుమారి సెల్జా, గైఖంగం, ఎన్.రఘు వీరారెడ్డి, శశిథరూర్, తామ్రధ్వజ్ సాహు, అభిషేక్ మను సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్, జైరాం రమేశ్, జి తేంద్ర సింగ్, రణదీప్‌సింగ్ సూర్జేవాలా, సచిన్ పైలె ట్, దీపక్ బాబరియా, జగదీశ్ ఠాకూర్, జి.ఎ.మీర్, అవినాశ్ పాండే, దీపాదాస్ మున్షీ, మహేంద్రజిత్ సింగ్ మాల్వియా, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, కమలేశ్ పటేల్, కేసీ వేణుగోపాల్. శాశ్వత ఆహ్వానితులు..: వీరప్ప మొయిలీ, హరీశ్ రావత్, పవన్ కుమార్ బన్సల్, మోహన్ ప్రకాశ్, రమేశ్ చెన్నితల, బీకే హరిప్రసాద్, ప్రతిభాసింగ్, మనీశ్ తివారీ, తారిఖ్ హమీద్ కర్రా, దీపేంద్ర సింగ్ హుడ్డా, గిరిశ్ రాయ చోదంకర్, టి.సుబ్బిరామిరెడ్డి, కె.రాజు, చంద్రకాంత్ హందోరే, మీనాక్షి నటరాజన్, పూలోదేవి నేతం, దామోదర రాజనర్సింహ, సుదీప్ రాయ్ బర్మన్, డా.ఎ.చెల్లకుమార్, భక్త చరణ్ దాస్, అజోయ్ కుమార్, హరీశ్ చౌదరి, రాజీవ్ శుక్లా, మాణిక్కం ఠాగూర్, సుఖ్విందర్ రంధావా, మాణిక్‌రావ్ ఠాక్రే, రజినీ పటేల్, కన్హయ్య కుమార్, గురుదీప్ సప్పల్, సచిన్ రావ్, దేవేందర్ యాదవ్, మనీశ్ ఛాత్రత్ ప్రత్యేక ఆహ్వానితులు..: పళ్లంరాజు, పవన్ ఖేరా, గణేశ్ గొడియాల్, కొడిక్కునిల్ సురేశ్, యశోమతి ఠాకూర్, సుప్రియా శ్రీనాథే, పరిణీతి షిండే, అల్కా లాంబ, చల్లా వంశీచంద్‌రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యులు..: బీవీ శ్రీనివాస్, నీరజ్ కుందన్, నెట్టా డి.డిసౌజా, లాల్జీ దేశాయ్ -
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలంగాణకు మొండిచేయి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని ఈరోజు విడుదల చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే. ఈ కమిటీలో ఆయనతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా పలువురు సీనియర్ నేతలకు అవకాశం దక్కింది. వీరితో పాటు గత కొంత కాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై ముభావంగా ఉంటోన్న ఆనంద్ శర్మ, శశిథరూర్, సచిన్ పైలట్ సహా పలువురు జీ-23 నేతలకు కూడా వర్కింగ్ కమిటీలో చోటు దక్కడం విశేషం. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే 39 మంది సభ్యులతో కూడిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించారు. వీరిలో 32 మందిని శాశ్వత సభ్యులుగా ప్రకటించగా 13 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించారు. ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఏపీ నుంచి రఘువీరా రెడ్డికి చోటు కల్పించగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మొండిచేయి చూపించింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బిరామి రెడ్డిని శాశ్వత ఆహ్వానితుడిగా ఖర్గే ప్రకటించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లం రాజు , చల్లా వంశీచందర్ రెడ్డి పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ , ఉత్తం వర్గాలను నిరాశపరిచింది. ఇది కూడా చదవండి: నాన్నా.. మీ బాటలోనే నేను: రాహుల్ గాంధీ -
‘లోకల్ టచ్’ స్క్రీనింగ్?.. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ నయా స్ట్రాటజీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ గతానికి భిన్నంగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ ఈసారి క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ జరపనున్నట్టు సమాచారం. టికెట్ ఆశిస్తున్న నేతలతో ఆయా జిల్లాల్లోనే సమావేశం కావడంతో పాటు నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకోనుందనే చర్చ జరుగుతోంది. తనను ఇటీవల కలిసిన టీపీసీసీ నాయకుడు ఒకరితో, ఏఐసీసీ నియమించిన రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ఈ మేరకు వెల్లడించడం గమనార్హం. గతంలో గాందీభవన్‌లో.. టికెట్ల కేటాయింపునకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ఓ సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. తమకు టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరి పేర్లను టీపీసీసీ గాందీభవన్‌లో షార్ట్‌లిస్ట్ (వడపోత) చేసి ఢిల్లీకి పంపడం, వారితో ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమై మాట్లాడిన తర్వాత మళ్లీ షార్ట్‌లిస్ట్ చేయడం, ఆ తర్వాత ఏఐసీసీ ఎన్నికల కమిటీ తుదిగా అభ్యర్థులను ఖరారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2018 ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్‌కు వచ్చింది. పీసీసీ షార్ట్‌లిస్ట్ చేసిన ఆశావహులతో గాంధీభవన్‌లో భేటీ అయి వారికి టికెట్ ఎందుకు ఇవ్వాలన్న దానిపై ఇంటర్వ్యూలు చేసింది. కానీ ఈసారి స్క్రీనింగ్ కమిటీ క్షేత్రస్థాయికి వెళ్లనున్నట్టు, జిల్లా, నియోజకవర్గ భేటీలు జరపనున్నట్టు మురళీధరన్ వెల్లడించిన దాని ప్రకారం స్పష్టమవుతోంది. మురళీధరన్‌తో పాటు ఈ కమిటీలో ఏఐసీసీ నుంచి బాబా సిద్ధిఖీ, జిగ్నేశ్ మేవానీలు సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌లు కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరూ క్షేత్రస్థాయికి వెళ్లి ఆశావహులతో సమావేశమవుతారా? రాష్ట్ర నేతలు లేకుండా ఢిల్లీ పెద్దలే జిల్లాలకు వెళ్లి అభిప్రాయ సేకరణ జరుపుతారా? అన్న దానిపై త్వరలో స్పష్టత రానుంది. లోక్‌సభ ఎన్నికల కసరత్తు కూడా షురూ! ఏఐసీసీ స్థాయిలో జరుగుతున్న సమావేశాల ప్రకారం చూస్తే.. వచ్చే ఏడాది మార్చి తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ వడివడిగా సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే దేశంలోని 17 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కసరత్తుతో పాటు లోక్‌సభ ఎన్నికల తర్వాత వెంటనే ఎన్నికలు జరిగే రాష్ట్రాల అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమయిందని ఢిల్లీలోనే మకాం వేసిన టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ప్రస్తుతానికి రాష్ట్రంలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపైనే ఏఐసీసీ దృష్టి ఉందని, ఈ ప్రక్రియలో ఒక అడుగు ముందుకు పడిన తర్వాత లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు కోసం ఏ క్షణమైనా తెలంగాణ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందని ఆయన వెల్లడించడం గమనార్హం. -
సహపంక్తి భోజనం.. రాత్రి బస
సాక్షి, హైదరాబాద్: గిరిజన ఆదివాసీలను ఆకట్టుకునే దిశలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపు మేరకు బుధవారం పార్టీ రాష్ట్ర నాయకత్వం తండాలు, గూడేల్లో బస చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోని రెండు లేదా మూడు తండాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. ‘గిరిజన ఆదివాసీ సంరక్షణ హస్తం’పేరుతో చేపట్టనున్న ఈ కార్య క్రమం ద్వారా రాష్ట్రంలోని ఆదివాసీలు, గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరించడంతో పాటు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే మేలు, చేపట్టబోయే ఇతర కార్యక్రమాల గురించి నేతలు వివరించనున్నారు. నివాళి.. నృత్య ప్రదర్శనలు.. నిద్ర బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, కొమురం భీం, సేవాలాల్ మహరాజ్, ఇందిరాగాంధీ చిత్రపటాలకు నేతలు పూలమాలలు సమర్పించి నివాళులర్పిస్తారు. తర్వాత గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు, కళాకారులతో నృత్యాలు, పాటలు పాడించడం లాంటివి నిర్వహించనున్నారు. తండాలు, గూడేల్లోని స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులను సన్మానించడంతో పాటు అక్కడి గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు. భోజనాల అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేదా తండా నాయకుడి ఇంట్లో నిద్రించనున్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులు, ఆదివాసీల వెన్నంటే ఉంటుందని చెప్పడమే ఈ కార్యక్రమ లక్ష్యమని, తండాలు, గూడేలను అక్కున చేర్చుకోవడం ద్వారా అక్కడి గిరిజనులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు వెల్లడించారు. 13న గాంధీభవన్‌లో సభ: మల్లురవి యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) వల్ల ఆదివాసీ గిరిజనులకు తీరని నష్టం జరుగుతుందని, ఆదివాసీలను నిర్మూలించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి చెప్పారు. ఈ నెల 13న ఆదివాసీలు, గిరిజనులతో వారి సమస్యలపై గాందీభవన్‌లో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు టి.బెల్లయ్య నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని, వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని అన్నారు. -
ఎన్నికల్లో కలసికట్టుగా పోరాటం : సచిన్ పైలెట్
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, అసంతృప్త నేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు రూపుమాప డానికి అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కలసికట్టుగా పోరాటం చేస్తామని సచిన్ పైలెట్ చెప్పారు. రాజస్థాన్‌లో ఎన్నికల సన్నద్ధతపై గురువారం న్యూఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్‌గాంధీ, ఖర్గే, సచిన్ పైలెట్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాలికి ఫ్రాక్చర్ కావడంతో సీఎం అశోక్ గెహ్లోత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు. -
మేము ఇచ్చిన ఆ 5 హామీల వల్లే గెలిచాం..
-
రిపోర్టులో ఏముంది?.. టీకాంగ్రెస్ నేతల్లో కొత్త టెన్షన్!
అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి తెలంగాణ కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. టీకాంగ్రెస్ అడ్వైజర్ సునీల్ కనుగోలు ఏఐసీసీకి ఓ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్‌లో ఏముందనే విషయంపై గాంధీభవన్‌లో మల్లగుల్లాలు పడుతున్నారు. 150 డేస్ యాక్షన్ ప్లాన్‌లో ఏముంది? తెలంగాణలో అధికారం సాధించడానికి కాంగ్రెస్ వేస్తున్న ప్లాన్ ఏంటి?.. కర్నాటకలో సాధించిన విజయం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఎలాగైనా ఈసారి గెలిచి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12న ఢిల్లీలో రాష్ట్ర పార్టీ నేతలతో అగ్రనేతలు రాహుల్, ప్రియాంక సమావేశం కాబోతున్నారు. అంతకంటే ముందుగా రాష్ట్రంలో పార్టీకి వ్యూహకర్తగా ఉన్న సునీల్ కనుగోలు ఏఐసీసీకి ఒక నివేదిక అందించారు. తెలంగాణలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి, ఇంకా బలం పెంచుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి సునీల్ తన నివేదికలో పలు సూచనలు చేసినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల వారిగా పార్టీ బలాలు, బలహీనతలతో స్పష్టమైన నివేదికను కనుగోలు టీం ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జాబితా, బీజేపీలో నాయకత్వం మీద అసంతృప్తితో ఉన్న నేతల జాబితా కూడా సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలోని వారిలో కాంగ్రెస్‌లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నవారి పేర్లు, ఎవరిని తీసుకుంటే పార్టీకి ప్రయోజనం కలుగుతుందో అనే వివరాలు కూడా పొందుపరిచినట్లు సమాచారం. టిక్కెట్ హామీ ఇస్తే కాంగ్రెస్ గూటికి చేరే ముఖ్యుల జాబితా కూడా ప్రత్యేకంగా తయారు చేశారట. పార్టీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్న నాయకులు మాత్రమే కాదు.. ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా మరింత మందిని ఆకర్షించాలని సూచించినట్లు చెబుతున్నారు. 150 రోజుల యాక్షన్ ప్లాన్.. పార్టీ మైలేజ్ పెంచడం కోసం పార్టీ పెద్దలకు 150 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందట కనుగోలు టీమ్. 150 రోజుల్లో ఏ కార్యక్రమం చేస్తే ఏ మేరకు లాభం కలుగుతుంది అనేదానిపై వివరణాత్మక రిపోర్ట్ ఇచ్చారట. నేతలంతా ఐక్యంగా ఉన్నారనే ఇమేజ్ పార్టీకి ఇప్పుడు అవసరం అని అందుకోసం పీసీసీ, సీఎల్పీ, సీనియర్లతో బస్సు యాత్ర చేయించాలనే ప్రతిపాదనను సునీల్ టీం ఏఐసీసీ ముందు ఉంచిందట. ఇక దీనికి తోడు కేసీఆర్‌ను ముగ్గులోకి దింపడంలో కాంగ్రెస్ కొంతమేర సఫలీకృతం అయిందని, మరింతగా ఫోకస్ పెట్టాలని సూచించిందని టాక్. ధరణి వెబ్సైట్ విసయంలో సీఎం కేసీఆర్‌ను బయటకు లాగగలిగామని.. సీఎం నోటి నుంచే ధరణి సమస్యలను చెప్పించగలుగుతున్నామనే అంచనాలతో కనుగోలు టీం ఉందట. తెలంగాణ సెంటిమెంట్‌తోనే కాకుండా.. ప్రజా సమస్యల చుట్టూ ప్రచారం జరిగితే కాంగ్రెస్‌కే లాభం అని డిక్లరేషన్ల ద్వారా బీఆర్ఎస్ను మరింత ఇరకాటంలో పెట్టేందుకు గ్రామ స్థాయి నుండి కార్యాచరణ చేపట్టాలని సునీల్ టీం సూచించిందట. దీంతో పాటు అనుబంధ విభాగాలతో ఆయా రంగ సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్ళేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని, ఇలా ఎవరికి వారు కార్యక్షేత్రంలో ఉంటేనే కాంగ్రెస్ అధికారంలోకి రాగలదనే రిపోర్ట్ సునీల్ ఇచ్చారట. ఈ రిపోర్ట్‌లోని అంశాల ఆధారంగానే తెలంగాణ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ మీటింగ్ ఉండనుందని, ఇక ఇదే ఎన్నికల శంఖారావంగా భావించొచ్చని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. సునీల్ టీమ్ ఇచ్చిన నివేదిక బాగానే ఉందని టీకాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. కాని ఆ రిపోర్ట్‌ను అమలు చేయడం సాధ్యం అవుతుందా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉందనే టాక్ నడుస్తోంది. ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఎలాంటి అసంతృప్తి లేదు: జితేందర్ రెడ్డి -
రాజస్థాన్ ముసలం: కాంగ్రెస్ హైకమాండ్ కీలక ప్రకటన
ఢిల్లీ: రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదర్చడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు సోమవారం సాయంత్రం జరిగిన నాలుగు గంటల సమావేశం తర్వాత కీలక ప్రకటన చేసింది. ‘‘ఇక మీద నుంచి ఇద్దరూ కలిసికట్టుగా పని చేస్తార’’ని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మీడియా ముందు ప్రకటించారు. ‘‘ఇద్దరు నేతలూ ఏకగ్రీవంగా పని చేసేందుకు అంగీకరించారు. అలాగే కీలక నిర్ణయాన్ని హైకమాండ్‌కు వదిలేశారు’’ అని ప్రకటించారు కేసీ వేణుగోపాల్. అయితే.. జరిగిన చర్చల పూర్తి సారాంశం ఏమిటి? ఇద్దరి మధ్య కుదిరిన సయోధ్య ఒప్పందం.. లేదంటే బాధ్యతల అప్పగింత ఏంటన్నదాని గురించి మాత్రం ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. అశోక్ గెహ్లాట్-సచిన్ పైలట్ల నడుమ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో.. తాజాగా సొంత ప్రభుత్వంపైనే పైలట్ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ ఏడాదిలోనే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో ఈ ఇద్దరి మధ్య ‘డెడ్‌లైన్’ల శపథాలతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. పరిస్థితి చేజారకూడదనే ఉద్దేశంతో.. ఇద్దరినీ హస్తినకు పిలిపించుకున్న అధిష్టానం సోమవారంనాడు సమాలోచనలు జరిపింది. ఈ సందర్భంగా.. కర్ణాటక రిఫరెన్స్ ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కలిసి కట్టుగా పోరాడితేనే ఫలితం దక్కుతుందనే విషయాన్ని ప్రధానంగా హైలెట్ చేసినట్లు సమాచారం. సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ సైతం పాల్గొన్నారు. ఇదీ చదవండి: కేంద్రం విషయంలో.. ఆప్‌కు షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్ -
ఇతర రాష్ట్రాల్లోనూ ‘కర్ణాటక’ ఫలితం!
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ కర్ణాటక తరహా ఫలితం వెలువడేలా చేయా లని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎన్నికలను ఎదుర్కొనే వ్యూహానికి పదును పెట్టే క్రమంలో తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల నేతలతో చర్చించేందుకు సమాయత్తమైంది. దీనిలో భాగంగా 26న ఢిల్లీకి రావాల్సిందిగా టీపీసీసీ ముఖ్య నేతలకు ఆహ్వానం పంపినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. నివేదికల ఆధారంగా కీలక సూచనలు! ఐదు రాష్ట్రాల నేతలతో జరిగే భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాందీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొననున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో నేతల మధ్య భేదాభిప్రాయాలు, ఐక్యతా యత్నాలు, ఎన్నికల వ్యూహాలు, సంస్థాగతంగా బలోపేతంపై చర్చించనున్నారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలకు సంబంధించి నేతల ఐక్యతకే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ముఖ్య నేతలకు విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. పీసీసీ కమిటీలు మొదలు, కొన్ని నియోజకవర్గాల్లో సొంతంగా అభ్యర్థుల ప్రకటన వంటి అంశాల్లో రేవంత్ తీరుపై కొందరు గుర్రుగా ఉన్నారు. పీసీసీ నిర్వహించే కార్యక్రమాలకు ఓ వర్గం నేతలు దూరంగా ఉంటుంటే, సీఎల్పీ నేత నిర్వహిస్తున్న బహిరంగ సభలకు మరోవర్గం నేతలు దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం నిత్యకృత్యంగా మారింది. వీటన్నింటిపై ఏఐసీసీ ఇప్పటికే రాష్ట్ర ఇన్చార్జిల నుంచి నివేదికలు తెప్పించుకుంది. ఎన్నికల సమయంలో నేతల మధ్య ఐక్యత ముఖ్యమని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఆయా నివేదికల ఆధారంగా నేతలకు కీలక సూచనలు చేసే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్పై పోరాటానికి పక్కా వ్యూహం: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు దోహదపడిన ‘కమీషన్ల ప్రభుత్వం’నినాదాన్ని తెలంగాణలోనూ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించింది. ఇక 111 జీవో రద్దు, రింగ్‌రోడ్డు, సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని ప్రధానాస్త్రంగా చేసుకొని బీఆర్ఎస్పై పోరాడేలా పక్కా వ్యూహాన్ని హైకమాండ్ సిద్ధం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ అవినీతిపై కేంద్ర ఏజెన్సీలను సంప్రదించడం, కోర్టుల్లో దావాలు వేయడం సహా ప్రజా పోరాటాలు నిర్మించే అంశంపై మార్గదర్శనం చేయనుంది. దీంతో పాటే పార్టీ ఇప్పటికే ప్రకటిస్తున్న హామీల అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రియాంకాగాంధీ పర్యటనల అంశాలను 26న జరిగే భేటీలో చర్చిస్తారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. జడ్చర్ల సభ ముగించుకుని.. ఏఐసీసీ పిలుపు నేపథ్యంలో ఈనెల 25న జడ్చర్లలో భారీ సభ మరుసటి రోజే టీపీసీసీ ముఖ్య నేతలంతా ఢిల్లీ పయనమవుతున్నారు. 11 మంది కీలక నాయకులతో ఖర్గే, రాహుల్‌గాంధీలు సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి (ముగ్గురు ఎంపీలు), మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, సీతక్క (ఐదుగురు ఎమ్మెల్యేలు), జీవన్‌రెడ్డి (ఎమ్మెల్సీ), మధుయాష్కీ గౌడ్ (టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్), దామోదర రాజనర్సింహ (టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్)లకు ఆహా్వనం అందింది. కాగా ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరగనుంది. -
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎం: కేసీ వేణుగోపాల్
Updates: ►కర్ణాటక విజయంతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ పరిశీలకులు హైకమాండ్‌కు అందజేశారని పేర్కొన్నారు.. సీఎంపై ఏకాభిప్రాయం కోసం రెండు, మూడు రోజులుగా చర్చలు జరిపినట్లు తెలిపారు. కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలిపారు. పీసీసీ చీఫ్‌గా కూడా డీకే కొనసాగుతారని చెప్పారు. ఎల్లుండి(శనివారం) ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ►డిప్యూటీసీఎం పదవికి డీకే శివకుమార్ అంగీకరించడం వెనక సోనియా గాంధీ ప్రముఖపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సీఎ పదవిని కాదని రెండో స్థానాన్ని ఓకే చేసేలా ఆయన్ను సోనియా బుజ్జగించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ ప్రయోజనాలు, గాంధీ కుటుంబం కోసం శివకుమార్ ‘త్యాగం’ చేశారని, డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయియి. ► ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసానికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో చర్చల అనంతరం వీరు రాహుల్‌గాంధీని కలవనున్నారు. ► కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక వ్యహహారం కొలిక్కివచ్చింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ప్రకటించడం లాంఛనమే! పార్టీ అధిష్టానంతో సుదీర్ఘ చర్చల అనంతరం కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ► ‘నేను పూర్తి సంతోషంగా లేను. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా, పార్టీ ప్రయోజననాల కోసం.. మా నాయకత్వం చెప్పిన ఫార్ములాకి అంగీకరిస్తున్నా’అని డీకేశీ పేర్కొన్నారు. న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ వీడినట్లే తెలుస్తోంది. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఊహించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్య మరోసారి కర్ణాటక సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఇక రేసులో నిలిచిన డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ నేడు అధికారిక ప్రకటన వెలువరించనుంది. అర్దరాత్రి వరకు సాగిన చర్చలు బుధవారం పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత చెరొక రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉంటారని, తరువాత సిద్ధరామయ్యే పూర్తి కాలం సీఎంగా ఉంటారని ప్రచారాలు సాగాయి. అయితే ఏఐసీసీ కర్ణాటక ఇంచార్జి రణ్‌దీప్ సుర్జేవాలాతోపాటు డీకే శివకుమార్ వీటిని ఖండించారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఢిల్లీలో గురువారం తెల్లవారు జామున వరకు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర మంతనాలు జరిపింది. ముందు నుంచి ఢిల్లీలోనే ఉంటూ లాబియింగ్ చేసిన సిద్ధరామయ్య.. ఖర్గే, అనంతరం సోనియా గాంధీతో చర్చించారు. చదవండి: కర్ణాటక సీఎం పంచాయితీ...ఎందుకిలా..? ఢిల్లీకి వెళ్లడంతోనే ఈ చిక్కులు మెట్టుదిగిన డీకే! మరోవైపు డీకే శివకుమార్ కూడాఖర్గే, సోనియా, రాహుల్‌ను కలిశారు. అయితే అర్థరాత్రి జరిగిన చర్చలతో డీకే మెట్టు దిగినట్లు, రాజీ ఫార్ములాకు శివకుమార్ అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు నేడు రాత్రి 7 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అనంతరం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గవర్నర్‌ను కలవనున్నారు. శనివారం ప్రమాణ స్వీకారం ఇక ఈనెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో కాంగ్రెస్ అధిష్టానం సమక్షంలో ఈ ప్రమాణస్వీకారం జరగనుంది. పలు రాష్ట్రాల సీఎంలు సైతం హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి అగ్రనేతలను ఆహ్వానించడం ద్వారా ప్రతిపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ యోచిస్తోంది. చదవండి: ‘చేతి’కి అధికారం ఇచ్చాక? సీఎం సీటు షేరింగ్.. ఓ ఫ్లాప్ ఫార్ములా..! -
డీకే శివకుమార్‌కు రెండు ఆఫర్లు ఇచ్చిన హైకమాండ్!
ఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఫలితాలు వెలువడి నాలుగురోజులు గడుస్తున్నా.. అన్నీ తెలిసి కూడా ఇప్పుడు మల్లగుల్లాలు పడడం కాంగ్రెస్ హైకమాండ్ వంతు అవుతోంది. కాబోయే సీఎం సిద్ధరామయ్యేనంటూ ఈ ఉదయం విస్తృతంగా ప్రచారం జరగ్గా.. ఇంకా నిర్ణయమే జరగలేదంటూ చల్లగా కబురు చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా. అయితే చర్చోపచర్చల్లో.. సీఎం కుర్చీకి బదులుగా డీకే శివకుమార్ ముందు పార్టీ రెండు ఆఫర్లను ఉంచిందని తెలుస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి పోస్ట్‌కు బదులుగా తను పడిన కష్టానికి డీకే శివకుమార్‌కు.. రెండు ఆఫర్లు ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో జరిగిన రెండు గంటల భేటీలో వీటి మీదే చర్చ జరిగినట్లు పార్గీ వర్గాలు చెబుతున్నాయి. అందులో.. మొదటిది.. మరెవరికీ డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకుండా కేవలం డీకే శివకుమార్ ఒక్కడికి మాత్రమే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం. దాంతో పాటు ఇప్పుడున్న పీసీసీ చీఫ్ కొనసాగించడం. అదనంగా.. ఆరు పోర్ట్‌పోలియోలు(అదీ కోరుకున్న శాఖలు) కట్టబెట్టాలని ఒక ప్రతిపాదన డీకేఎస్ ముందు ఉంచాయి. ఒకే పదవి నిబంధనను పక్కనపెట్టి మరీ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు రాహుల్ గాంధీ ఈ ప్రతిపాదన తెచ్చినట్లు తెలుస్తోంది. కానీ, డీకే శివకుమార్ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట. ఇక రెండోది.. శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య పవర్ షేరింగ్. దీనిప్రకారం.. సిద్ధరామయ్య తొలుత సీఎం అవుతారు. రెండేళ్లపాటు పదవి చేపడతారు. ఆపై మిగిలిన మూడేళ్ల కాలానికి సీఎంగా డీకే శివకుమార్ కొనసాగుతారు. అయితే ఈ ప్రతిపాదనను శివకుమార్ మాత్రమే కాదు.. సిద్ధరామయ్య కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా తన పనితీరును ప్రామాణికంగా తీసుకోవాలని డీకే శివకుమార్.. ఖర్గే, రాహుల్ వద్ద ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడి ప్రభుత్వాన్ని కూలదోసినా.. పార్టీని తాను పునర్మించానని, అలాగే పార్టీకి భారీ విజయం కట్టబెట్టానని ఆయన వారివురు వద్ద పేర్కొన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవి తప్ప మరొకటి తాను ఆశించడం లేదని, ఒకవేళ ఆ పదవి ఇవ్వకున్నా సాధారణ ఎమ్మెల్యేగా తాను ఉండిపోతానని ఆయన వాళ్లతో చెప్పినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో సీఎం ఎంపిక కాంగ్రెస్‌కు ఇప్పుడు పెద్ద పరీక్షగా మారింది. ఎందుకంటే.. ఏమాత్రం తేడా జరిగినా మరో రాజస్థాన్‌లా(అశోక్ గెహ్లట్ వర్సెస్ సచిన్ పైలట్) మారే ప్రమాదం ఉంది. అది మరీ దిగజారితే మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలినట్లు కుప్పకూలే ప్రమాదమూ లేకపోలేదు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు సీఎం ఎంపికలో తీసుకోబోయే నిర్ణయం.. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం కచ్చితంగా చూపెడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: బీజేపీకి కొత్త టెన్షన్.. వచ్చే వారంలో ఏం జరుగనుంది? -
Karnataka: సిద్ధరామయ్యకే సీఎంగా అవకాశం!
ఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఒక అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అధికారిక ప్రకటన లాంఛనమని సమాచారం. ఆదివారం జరిగిన సీఎల్పీ భేటీలో 135 మందిలో 90 మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకే మద్దతు ఇచ్చారని, ఈ విషయాన్ని పార్టీ పరిశీలకులు హైకమాండ్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారని తెలుస్తోంది. ఇంకోవైపు సోమవారం ఢిల్లీకి వెళ్లిన సిద్ధరామయ్య.. కీలక నేతలతో వరుసగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు అవకాశాలు సన్నగిల్లుతుండడంతో సీఎం రేసులో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్.. ఒకింత అసహనం, అసంతృప్తితో కూడిన స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు. డీకేకు వైద్య పరీక్షలు డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు ఆయన అనుచర గణం చెబుతోంది. తనకు ఆరోగ్యం బాగోలేదని ఆయన కేడర్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయనకు వైద్య పరీక్షలు జరిగాయి. ఆరోగ్యం కుదుటపడితే రేపు(మంగళవారం) ఆయన ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. ఇదీ చదవండి: అవసరమైతే నిరసన తెలుపుతా-డీకే శివకుమార్ -
సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్: డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం విషయంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్(61) పార్టీ హైకమాండ్‌కు మరోసారి గట్టి సంకేతాలు పంపించారు. ఒంటరిగానే 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించానని చెబుతున్న ఆయన.. అవసరమైతే నిరసన తెలుపుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ అంటూ ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు. తన నివాసంలో ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన.. కాసేపటికే మరోసారి మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లో నాకంటూ ఓ వర్గం లేదు. ఎమ్మెల్యేలంతా నా వాళ్లే. ఒంటరిగా కాంగ్రెస్‌కు 135 సీట్లు తెచ్చిపెట్టా. పైగా కాంగ్రెస్ చీఫ్(మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి..) నావైపే ఉన్నారు. నా బలాన్ని ఎవరూ లాక్కోలేరు. అలాగే.. వేరే వాళ్ల బలంపై నేను మాట్లాడను. అవసరమైతే నిరసన తెలుపుతా అంటూ పేర్కొన్నారాయన. ఇక ఢిల్లీకి తాను వెళ్లబోవట్లేదని తేల్చి చెప్పిన శివకుమార్.. పనిలో పనిగా చివరిలో సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు.. తిరుగుబాటు చేస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నేనేం తిరుగుబాటు చేయను. అలాగే బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడను. నేనేం బచ్చాగాడ్ని కాదు. నాకంటూ ఓ విజన్ నాకుంది. అలాగే పార్టీ పట్ల విధేయత కూడా ఉంది. ముందు పార్టీ అధిష్టానాన్ని నిర్ణయం తీసుకోనివ్వండి అని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఇదిలా ఉంటే.. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందంటూ హస్తిన పర్యటనకు వెళ్లిన సిద్ధరామయ్య(75), ఇవాళ రాత్రి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అవుతారనే ప్రచారం నడుస్తోంది. ఇదీ చదవండి: డీకే శివకుమార్‌తో నాకు మంచి దోస్తీ ఉంది! -
కర్ణాటక సీఎం ఎవరు?.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక సీఎం ఎవర్నరది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానానికి నిర్ణయాన్ని వదిలేశానని తెలిపారు. తాను చేయాల్సినదంతా చేశానని పేర్కొన్నారు. ఈరోజు(మే 15) తన పుట్టినరోజు అని, అనేక కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందన్నారు. నేడు ఢిల్లీ పర్యటన విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఢిల్లీ వెళ్తానో లేదో తెలీదని చెప్పారు. సోనియా గాంధీ తనకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తుందో లేదో తెలియదని శివకుమార్ పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ విధేయుడనని తెలిపారు. తనపై బీజేపీ అక్రమ కేసులు పెట్టి ఇరికించినప్పుడు సోనియా నాతో ఉన్నారని గుర్తు చేసుకున్నారు. తన మీద నమ్మకంతో సోనియా గాంధీ పీసీసీ చీఫ్ చేశారని అన్నారు. జనం తనను నమ్మి 130 సీట్లు ఇచ్చారని, ఇంతకంటే బర్త్‌డే గిఫ్ట్ ఏముంటుంది? అని పేర్కొన్నారు. చదవండి: కర్ణాటక ఫలితం.. తెలంగాణలో ఇప్పుడెలా?.. బీజేపీ బేజార్, 'కారు'కు ఫియర్.. కాగా 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి విడివిడిగా అభిప్రాయాలు సేకరించారు ఏఐసీసీ పరిశీలకులు. బెంగుళూరు నుంచి ఢిల్లీ బయల్దేరారు. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకొని ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ అధ్యక్షుడికి సుశీల్ కుమార్ షిండే బృందం తెలియజేయనుంది. రాహుల్, సోనియా గాంధీలను సంప్రదించిన తర్వాత హై కమాండ్ నిర్ణయం తీసుకోనుంది. అయితే మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు హై కమాండ్ సీఎం సీటు షేరింగ్ ఫార్ములా సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ 135 స్థానాలను గెలుచుకొని ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. గురువారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా సీఎం విషయంపై సస్పెన్స్నెలకొంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎవరూ సీఎం అవుతారనే విషయం కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. చదవండి: 16 ఓట్లతో గెలుపు తారుమారు.. కన్నీటి పర్యంతమైన సౌమ్యారెడ్డి -
కట్టుబడి ఉంటాం.. హామీలు నెరవేర్చకుంటే దించేయండి: ప్రియాంక ఫైర్
మీరంతా నన్ను నయా ఇందిరమ్మ అంటున్నారు. ఆమెతో పోలుస్తుంటే నాపై బాధ్యత పెరుగుతోంది. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన నేను మోసపూరిత వాగ్దానాలు ఇవ్వలేను. అబద్ధాలు చెప్పను. దేశంలో రాజకీయాలను చూస్తుంటే బాధ కలుగుతోంది. మతం, జాతి పేరుతో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. అధికారం కోసం ఏం చేసేందుకైనా వెనుకాడడం లేదు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజాస్వామిక పాలన లేదని, నియంతృత్వం కొనసాగుతోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు ఈ రాష్ట్రం తమ జాగీర్ అనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల పోరాటాలను అర్థం చేసుకుని తెలంగాణ ఇచ్చారని.. కానీ ప్రజల కలలను, ఆకాంక్షలను బీఆర్ఎస్ ఛిద్రం చేసిందని ఆరోపించారు. దేశంలో మతం, జాతి పేరిట రెచ్చగొట్టి అధికారం దక్కించుకునే రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ఈ అనైతిక రాజకీయాల నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన ప్రజలపై ఉందన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన ‘యువ సంఘర్షణ సభ’లో ప్రియాంకా గాంధీ మాట్లాడారు. ప్రసంగం ఆమె మాటల్లోనే.. ‘‘తెలంగాణ ఒక లక్ష్యం కోసం ఏర్పాటైంది. ఈ గడ్డపై ఉన్న ప్రేమతో తెలంగాణను తల్లితో సమానంగా చూస్తారు. రాష్ట్రం ఏర్పాటు కోసం శ్రీకాంతాచారి సహా ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణ ఏర్పాటైతే ఉద్యోగాలు వస్తాయని, నీళ్లు వస్తాయని, పంటలకు మద్దతు ధర లభిస్తుందని, కడుపు నిండా అన్నం తింటామని అంతా ఆశించారు. ఈ ఉద్యమాన్ని ఎవరూ ముందుండి నడిపించలేదు. అన్నివర్గాల ప్రజల పోరాటమే తెలంగాణను తెచ్చింది. బలిదానాల విలువ మాకు తెలుసు అమరవీరులు ఒక మహోన్నత ఆశయంతో ప్రాణాలను త్యాగం చేస్తారు. వారి బలిదానం విలువ ఏమిటో మా కుటుంబానికి, నాకు తెలుసు. నా నానమ్మ ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అందుకే అమరవీరుల త్యాగం వృధా కావొద్దని మా కుటుంబం కోరుకుంటుంది. ఇక్కడి యువత మనసును అర్థం చేసుకుని సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున అధికారం కోసమో, రాజకీయం కోసమే ఆలోచిస్తే.. ఈ నిర్ణయం తీసుకునేవారు కాదు. అధికారంలో ఉన్న వారికే అన్నీ.. అమరుల ఆశయాలు, సోనియాగాంధీ ఆలోచనల మేరకు రాష్ట్రంలో పాలన జరగడం లేదు. నిధులు, ఉద్యోగాలు అన్నీ అధికారంలో ఉన్న వారికి, వారి తాబేదార్లకే అందుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ పాలన చేస్తోంది. ఈ రాష్ట్రం వాళ్ల జాగీర్ అని, వారు నయా జాగీర్దార్లని అనుకుంటున్నారు. తెలంగాణ యువత బలిదానాలు చేసింది ఇందుకోసం కాదు. వారి హక్కుల సాధన కోసం చేశారు. ఒక్క హామీని నెరవేర్చలేదు.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ ఎన్నో కల్లిబొల్లి మాటలు చెప్పింది. రైతులకు రుణమాఫీ చేస్తామన్నది. కానీ ఇప్పుడు ఒక్కో రైతు నెత్తిపై రెండున్నర లక్షల రుణం ఉంది. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కుటుంబానికో ఉద్యోగం అన్నారు. ఇవ్వలేదు. నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తామన్నారు. ఇవ్వలేదు. ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యూనివర్సిటీల్లో ఉద్యోగ నియామకాల్లేవు. నిర్ణయం తీసుకునే బాధ్యత మీదే.. కొన్నినెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎవరు వస్తే ఏం చేస్తారో ఆలోచించుకోవాలి. మేం ‘హైదరాబాద్ డిక్లరేషన్’కు కట్టుబడి ఉంటాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చకపోతే మమ్మల్ని దింపేయండి. ఈ దేశాన్ని అనైతిక రాజకీయాల నుంచి కాపాడుకోవాలంటే మీరు చైతన్యవంతులు కావాల్సిందే. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తా. మీతో మాట్లాడుతా. తెలంగాణ నంబర్ వన్ కావాలన్నదే నా ఆకాంక్ష..’’ అంటూ ప్రియాంక తన ప్రసంగాన్ని ముగించారు. -
ఏఐసీసీ కొత్త విధానం... ఇంటర్వ్యూ తర్వాతే ఎంపిక
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల ఎంపికకు కొత్త పద్ధతి రానుంది. ఇంటర్వ్యూల ద్వారా వీరిని ఎంపిక చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. రాష్ట్రానికి సంబంధించి టీపీసీసీ ప్రతిపాదించిన అధికార ప్రతినిధులకు ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్‌ఖేరా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. గతంలో లాగా టీపీసీసీ ప్రతిపాదించిన అందరినీ అధికార ప్రతినిధులుగా నియమించే అవకాశం లేదని, ఇంటర్వ్యూల అనంతరం ఐదుగురు సీనియర్ అధికార ప్రతినిధులు, ఏడుగురు అధికార ప్రతినిధుల పేర్లను ఏఐసీసీనే అధికారికంగా ప్రకటిస్తుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం నుంచి అధికార ప్రతినిధుల జాబితాను ఏఐసీసీకి పంపగా, త్వరలోనే తాము వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం అధికారికంగా ప్రకటిస్తామని ఏఐసీసీ నుంచి సమాచారం వచి్చంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈనెల 14న మంచిర్యాలకు వచ్చి వెళ్లిన తర్వాత ఈ నియామక ప్రక్రియ జరుగుతుందని సమాచారం. అధికార ప్రతినిధులతో పాటు ముగ్గురి నుంచి ఐదుగురు ఉపాధ్యక్షులు, 12 మంది ప్రధాన కార్యదర్శులను కూడా ప్రకటించనున్నారు. అప్పుడే సూర్యాపేట, రంగారెడ్డి, భూపాలపల్లి, జనగామ, హనుమకొండ, ఆసిఫాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. కోఆప్షన్ శాతాన్ని 25కు పెంచడంతో ఏఐసీసీ సభ్యులుగా ఈసారి రాష్ట్రం నుంచి ఐదుగురికి అదనంగా అవకాశం లభించనుంది. చదవండి: అడ్డగోలుగా కేసీ అండ్ సీఎస్‌కు నిర్మాణ అనుమతులు -
ముగిసిన కాంగ్రెస్ సమావేశం, న్యాయపోరాటంతో పాటుగా..
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటలపాటు ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ పార్టీ విస్తృత సమావేశంలో రాహుల్ గాంధీ అనర్హత వేటు, భవిష్యత్ కార్యాచరణ ప్రధానాంశంగా ఈ చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ఈ కీలక భేటీలో.. మూడు విధాలుగా పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవైపు న్యాయపోరాటంతో పాటు మరోవైపు దేశవ్యాప్తంగా వీధుల్లోనూ పోరాడాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పోరాటంలో విపక్షాలను కలుపుకుని ముందుకు సాగాలని నిర్ణయించింది. అదే సమయంలో రాహుల్‌కు సంఘీభావంగా పలు రాష్ట్రాల్లో పీసీసీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలకు ప్రణాళిక రచిస్తోంది. ఇక.. కార్యాచరణపై రేపు(శనివారం) స్పష్టమైన ప్రకటన చేయనుంది ఏఐసీసీ. ఈ భేటీకి ఖర్గే, సోనియాగాంధీతో పాటు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, రాజీవ్ శుక్లా, తారీఖ్ అన్వర్, సీనియర్లు ఆనంద్ శర్మ, అంబికా సోనీ, ముకుల్ వాన్షిక్, సల్మాన్ ఖుర్షీద్, పవన్ కుమార్ బన్సాల్ తదితరులు హాజరయ్యారు. పరువునష్టం దావాకు సంబంధించి రాహుల్‌గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించి.. ఆ వెంటనే బెయిల్, నెలలోపు అప్పీల్ చేసుకునేందుకు వీలు ఇచ్చింది. దీంతో రాహుల్ గాంధీ ఇవాళ(శుక్రవారం) కూడా కాంగ్రెస్ ఎంపీల సమావేశం కోసం పార్లమెంట్‌కు వెళ్లారు. అయితే ఈలోపే లోక్‌సభ ఎంపీగా రాహుల్‌గాంధీపై అనర్హత వేటేస్తూ లోక్‌సభ సెక్రెటరీ నిర్ణయం తీసుకోవడంపై రాజకీయవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. -
భట్టి పాదయాత్ర @ 1,365 కిలోమీటర్లు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క భారీ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఏఐసీసీ సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రల్లో భాగంగా రాష్ట్రంలోని 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,365 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 16 నుంచి జూన్ 15 వరకు 91 రోజులపాటు జరగనున్న ఈ యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభమై ఖమ్మం నగరంలో నిర్వహించే భారీ బహిరంగసభతో ముగియనుంది. ఇందుకు సంబంధించి రూట్‌మ్యాప్ కూడా ఖరారయింది. ఓ వైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్న యాత్రకు తోడుగా భట్టి మరోవైపు నుంచి యాత్రకు ఉపక్రమించడం గమనార్హం. భట్టి యాత్రకు సంబంధించి గాందీభవన్ వర్గాలు శనివారం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న సాయంత్రం నాలుగు గంటలకు ఆదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బజార్ హత్నూర మండలం పిప్రి గ్రామంలో యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి , చెన్నూరు, మంచిర్యాల వరకు జరుగుతుంది. మంచిర్యాల నియోజకవర్గంలో యాత్ర ముగింపు సందర్భంగా లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ యాత్రకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్ హాజరవుతారని సమాచారం. ఈ సభ తర్వాత ధర్మపురి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ (వెస్ట్), స్టేషన్ ఘన్పూర్, జనగామ, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, షాద్‌నగర్‌ల వరకు యాత్ర షెడ్యూల్‌ను రూపొందించారు. షాద్‌నగర్ వెళ్లే లోపు హైదరాబాద్ పరిసరాల్లో మరో బహిరంగసభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత జడ్చర్ల, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందుల మీదుగా ఖమ్మం వరకు యాత్ర సాగనుంది. ఈ క్రమంలో యాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. యాత్రల్లో భాగంగా నిర్వహించనున్న మూడు బహిరంగ సభలకు ఏఐసీసీ నాయకత్వం హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రజల ఆశలు, అవసరాలే నా యాత్ర ఎజెండా యాత్ర షెడ్యూల్‌ను విడుదల చేసిన అనంతరం శనివారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కార్యక్రమాల అమ లు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, టీపీసీసీ నేతలు ఆమేర్ జావెద్, భరత్‌తో కలిసి భట్టి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పా టు లక్ష్యాలు నెరవేరక ప్రజ లు నిరాశా నిస్పృహల్లో ఉ న్నారని, వారికి ధైర్యం చెప్పి అండగా నిలబడేందుకు యాత్ర చేపట్టామని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వా త రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడంతోపాటు ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా నిలబెడతామని చెప్పారు. ‘మీలో ఒకడిగా మీ మధ్య పాదయాత్ర చేసేందుకు వస్తున్నా. నాతో పాటు నాలుగు అడుగులు వేసి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఇవ్వాలని కోరుతున్నా’అని భట్టి అన్నారు. కాగా, తెలంగాణ పోరు యా త్ర పేరుతో తాను బాస ర నుంచి నిర్వహిస్తు న్న పాదయాత్రను కూడా భట్టి యాత్రలో విలీనం చేస్తున్నట్టు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. తనతోపాటు ఉత్తమ్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, రాజనర్సింహ భట్టి యాత్రలో భాగస్వాములం అవుతామని చెప్పారు. -
దేశంలో కాంగ్రెస్ పరిస్థితికి సోనియా గాంధీదే బాధ్యత!
అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ అధ్యక్షపదవి నుంచి దిగిపోయిన కారణంగా ఇన్నింగ్స్ ముగిసిందని ప్రకటించినా, లేక ఇతర కారణాలతో రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించినా, ఎలాగైనా దేశ రాజకీయాలలో ఒక పెద్ద పరిణామంగానే పరిగణించాలి. ఒకప్పుడు దేశంలోనే తిరుగులేని సామ్రాజ్ఞిగా చక్రం తిప్పిన ఆమె ప్రస్తుతం రాజకీయంగా బాగా దెబ్బతిన్నారనే చెప్పాలి. అయినా ఒక జాతీయ పార్టీకి నాయకత్వం వహించగలగడం , ఇంకా ఆ పార్టీ వారి గౌరవం పొందగలగడం విశేషమే . కాంగ్రెస్ గత పాతికేళ్లలో ఉత్ధాన,పతనాలకు ఆమెనే బాద్యత వహించాలి. ఒకప్పుడు కాంగ్రెస్ ,ఇతర పార్టీలతో కలిసి ఐక్య ప్రగతిశీల కూటమి పేరుతో ఒక ప్రంట్ ను ఏర్పాటు చేసి, అధికారం రావడానికి దోహదపడిన ఆమె , తదనంతర కాలంలో తనకు ఎదురు లేదన్న భావనతో తప్పుల పరంపర సాగించి కాంగ్రెస్ ను పాతాళానికి తీసుకువెళ్లారనే చెప్పాలి. పాతికేళ్ల రాజకీయ చరిత్రలో పార్టీలో చేరిన రెండు నెలలకే ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు. రికార్డు స్థాయిలో సుమారు 22 ఏళ్ళు ఆమె ఆ పదవిలో ఉన్నారు. సుమారు రెండున్నరేళ్లు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అద్యక్షుడుగా ఉన్నారు. గతంలో ఆమె దేశ ప్రధాని పదవికి ప్రయత్నించకపోలేదు. కానీ ఆమె విదేశీయురాలు అన్న కారణంగా ఆయా పార్టీల నేతలు వ్యతిరేకించారు. అప్పట్లో కాంగ్రెస్‌లోనే ఉన్న శరద్ పవార్ వంటివారు కూడా ఆమెను ప్రధాని అభ్యర్ధిగా ఒప్పుకోవడానికి నిరాకరించారు. 1999లో ఒక్క ఓటుతేడాతో వాజ్ పేయి ప్రభుత్వాన్ని పడవేయడం, అందుకు అప్పటి ఒడిషా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గమాంగో ఓటే కారణం అవడం సంచలనం అయింది. దాని వల్ల కాంగ్రెస్ కు నష్టం జరిగింది. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలలో బీజేపీ ఆద్వర్యంలోని ఎన్.డి.ఎ.కూటమి విజయం సాధించింది. కానీ 2004 నాటికి ఇతర ప్రాంతీయ, వామపక్ష పార్టీ లతో కలిసి కూటమి కట్టి అధికారంలోకి రావడానికి సోనియాగాంధీ నాయకత్వం కొంత ఉపయోగపడింది. అప్పటికి బీజేపీ ఇప్పుడున్న శక్తిమంతంగా లేకపోవడమే కారణం. పదేళ్లపాటు సోనియాగాందీ మకుటం లేని మహారాణిలా దేశాన్ని ఏలిందనే చెప్పాలి. పేరుకు మన్మోహన్ సింగ్ ప్రదాని అయినా, ఆయన గౌరవ ప్రపత్తులు ఉన్న వ్యక్తే అయినా, మొత్తం పవర్ అంతా ఈమె చేతిలోనే ఉందన్న అభిప్రాయం ఉండేది. జాతీయ సలహామండలిని ఏర్పాటు చేసి , దానికి చైర్ పర్సన్‌గా సోనియాగాంధీ వ్యవహరించారు. పలు కీలకమైన నిర్ణయాలను ఆ మండలిలో తీసుకునేవారు. గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు సోనియాగాంధీతో విబేధాలు వచ్చాయి. చివరికి పీవీ మరణించాక ఆయన పార్దీవదేహాన్ని ఏఐసీసీ ఆఫీస్ లోపల పెట్టనివ్వలేదంటే అవి ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. మన్మోహన్ తో ఇబ్బంది లేకుండా సాగిపోయింది. ఇదంతా ఒక కధ అయితే, 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్‌కు 30 సీట్లు రావడం దేశంలో అధికారం రావడానికి ఎంతో ఉపయోగపడింది. అప్పుడు నాయకత్వం వహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి బలమైన నేతగా అవతరించారు. అది గిట్టని కొందరు ఆయనకు వ్యతిరేకంగా సోనియాగాంధీ చెవినిల్లు కట్టుకుని ఫిర్యాదులు చేసేవారు. అయినా 2009లో వైఎస్ తిరిగి అధికారం సాదించడమే కాకుండా మళ్లీ ముప్పైకి పైగా లోక్ సభ స్థానాలను సాధించిపెట్టారు.ఈ ఎన్నికలలో కూడా ఏపీ నుంచి అన్ని సీట్లు రాకపోతే కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడం కష్టం అయ్యేది. ఈ విషయాన్ని స్వయంగా మన్మోహన్ సింగే చెప్పేవారు. ఎపిలో అన్నీ సీట్లు రావడం వైఎస్ వల్ల కాదని, అదంతా సోనియాగాంధీ ప్రభావం అని వైఎస్ వ్యతిరేకులు ప్రచారం చేసేవారు. దీనిని ఆమె కూడా నమ్మినట్లే అనిపిస్తుంది. వైఎస్‌ను ఎదగనిస్తే రాజకీయంగా ప్రమాదమని కోటరి భావించిందని అంటారు. వైఎస్ మాత్రం ఇందిరాగాంధీ కుటుంబీకులైన సోనియా, రాహుల్ గాంధీల పట్ల విధేయతను వీడలేదనే చెప్పాలి. అయినా వైఎస్ కుటుంబానికి సోనియాగాంధీ తీరని అన్యాయం చేశారు. అనూహ్యంగా వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన కుమారుడు జగన్‌తో రాజకీయంగా డీల్ చేసిన పద్దతి ఆమెలోని నియంతృత్వ దోరణి స్పష్టంగా కనిపించింది. పదేళ్ల అధికార సమయంలో కూడా అనేకసార్లు ఆమె తన అధికార దర్పాన్ని ప్రదర్శించినా, ఏపీ రాజకీయ పరిణామాలలో ఆమె ప్రవర్తించిన తీరు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని నష్టం చేసింది. జగన్ ఓదార్పు యాత్ర విషయంలోకానీ, ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుంటే కేసులు పెట్టించి పదహారు నెలలు జైలులో ఉంచడంలోగాని ఆమె కీలకభూమిక పోషించారని అంతా నమ్ముతారు. పైగా కాంగ్రెస్ కు ప్రత్యర్ధి అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో ఈ విషయంలో చేతులు కలపడం కూడా కాంగ్రెస్‌కు తీరని నష్టం చేసింది. అధికారం బాగా తలకెక్కితే ఇలాగే చేస్తారేమో అన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. సోనియాగాంధీ తండ్రి ఇటలీలో ఒకప్పుడు నేషనల్ ఫాసిస్ట్ పార్టీకి మద్దతు ఇచ్చేవారట. ఆయన హిట్లర్ నాజీలకు అనుకూలంగా యుద్దంలో కూడా పాల్గొన్నారట. బహుశా ఆయనలోని ఆ లక్షణాలు కొన్ని ఆమెకు వచ్చి ఉండాలి. ఆమె భర్త రాజీవ్ గాంధీ బతికి ఉన్నప్పుడు ఆమె రాజకీయాలలోకి రాకుండా, పరోక్షంగానే జోక్యం చేసుకునేవారని అంటారు. తదుపరి 1997లో ఏర్పడిన పరిణామాలలో కాంగ్రెస్‌లో చేరి అధ్యక్ష స్థానం కైవసం చేసుకున్నారు. ఆయా రాష్ట్రాలలో నాయకత్వాన్ని ఎదగనివ్వకుండా చేసి, కాంగ్రెస్‌ను ఇప్పుడు ఈ క్షీణ దశకు తేవడంలో కూడా ఆమె పాత్ర ఉందనే చెప్పాలి. చివరికి లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్‌కు రాకుండాపోయింది. శరద్ పవార్, మమత బెనర్జీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అజిత్ జోగి ఇలా పలువురు నేతలు సొంతంగా తమ రాష్ట్రాలలో పార్టీలు పెట్టుకున్నారు. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం జోడో యాత్ర పేరుతో దేశం అంతటా పాదయాత్ర చేసినా, ఆశించినంత ఫలితం వచ్చినట్లు అనిపించడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ చేసిన కొన్ని పిచ్చి చేష్టలు కూడా కాంగ్రెస్ కు చేటు చేశాయి. ప్రధాని పదవికి అవకాశం వస్తే వదలుకోవడం, మన్మోహన్ సింగ్ జారీ చేసిన ఆర్డినెన్స్ కాపీలను బహిరంగంగా చించివేయడం , నెలల తరబడి విదేశాలలో ఉండి రావడం వంటి చర్యలతో ప్రజలలో ఆయన నమ్మకం కోల్పోయారు. నరేంద్ర మోదీని ఎదుర్కోవడం ఈయన వల్ల కాదన్న అభిప్రాయం బలపడింది. ఉమ్మడి ఏపీని విభజించిన తీరుతో కాంగ్రెస్ పూర్తిగా తుడుచుకుపోయింది. జగన్‌కు అధికార పగ్గాలు దక్కకూడదన్న తలంపుతో విభజనను హడావుడిగా చేసిన ఫలితంగా రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ దెబ్బతినిపోయింది. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ తెలంగాణ ఇస్తే తన పార్టీ టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి ముందుకు వచ్చినా, ఆమె తెలివిగా వ్యవహరించలేకపోయారు. దాంతో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కాంగ్రెస్‌కు పూర్తి గడ్డు పరిస్థితులు ఏర్పడడం జరిగిపోయింది. సోనియాగాంధీకి ప్రధాన సలహాదారులుగా ఉన్న దిగ్విజయ్ సింగ్, గులాం నబీ అజాద్ వంటివారి వ్యవహార శైలి కూడా నష్టం చేసిందని పలువురు నమ్ముతారు. విభజిత ఏపీలో అయితే కాంగ్రెస్ జీరోకి వెళ్లిపోగా, తెలంగాణలో కునారిల్లిపోయి, మళ్లీ లేవడానికి నానా తంటాలు పడవలసి వస్తోంది. బెంగాల్,పంజాబ్, ఒడిషా, మహారాష్ట్ర, హర్యానా, యూపీ, తమిళనాడు ,బీహారు వంటి ముఖ్యమైన రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉనికిని నిలబెట్టుకోవడమే సమస్యగా ఉంది. పార్టీలో పాతికేళ్లపాటు, అధికారంలో పదేళ్లపాటు తన హవా సాగించిన సోనియాగాంధీ ప్రపంచలోనే శక్తిమంతమైన అతి కొద్దిమంది నేతలలో ఒకరిగా అప్పట్లో గుర్తింపు పొందారు. అలాగే ఆయా యూనివర్శిటీలు డాక్టరేట్లు ఇచ్చాయి. ఒక విదేశీ వనిత ఈ రకంగా భారత్ లో ఒక ప్రముఖ స్థానంలోకి వెళ్లడం గొప్ప విషయమే అయినా, దానిని ఆమె నిలబెట్టుకోలేకపోవడం కూడా చారిత్రక విషాదమే. ఆమె 76 ఏళ్ల వయసులో ఇన్నింగ్స్ ముగిస్తుంటే, ఎనభైఏళ్ల ఖర్గే ఎఐసీసీ అధ్యక్షుడుగా ఉన్నారు. దీనిని బట్టే కొత్త శక్తులు, యువతను కాంగ్రెస్‌లోకి తీసుకు రావడంలో ఆమె విఫలం అయ్యారు. అందివచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు. మొత్తం తానే అని భ్రమించి కాంగ్రెస్‌ను ఈ స్థితికి తెచ్చారు. ఈ దశలో ఆమె రిటైరైనా,రిటైర్ కాకపోయినా, ఏదైనా కొత్త శక్తి వచ్చి కాంగ్రెస్ ను కాపాడితే తప్ప మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పలేం. -హితైషి -
సీడబ్ల్యూసీకి ఎవరో?.. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏఐసీసీ పదవులపై చర్చ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరికి ప్రాతినిధ్యం లభిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ ప్లీనరీ అనంతరం ఏర్పాటు చేయనున్న సీడబ్ల్యూసీలో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్న టి.సుబ్బిరామిరెడ్డి (ఆంధ్రప్రదేశ్)తోపాటు తెలంగాణ నుంచి నలుగురైదుగురు నేతలు ఈ రేసులో ఉన్నారు. అయితే, సుబ్బిరామిరెడ్డికి మళ్లీ రెన్యువల్ అవుతుందని, మిగిలిన నేతలకు సీడబ్ల్యూసీలో చోటు దక్కే అవకాశం లేదని 10 జన్‌పథ్ వర్గాలు చెబుతున్నాయి. కోమటిరెడ్డితో పాటు పలువురు సీడబ్ల్యూసీ సభ్యత్వం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దగా డిమాండ్ కనిపించకపోయినా తెలంగాణ నుంచి నలుగురైదుగురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. వీరిలో స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. తనకు సీడబ్ల్యూసీ అవకాశం తప్పకుండా వస్తుందని, సీడబ్ల్యూసీ సభ్యుని హోదాలోనే పాదయాత్రను ప్రారంభిస్తాననే ధీమాతో ఉన్నారు. సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య కూడా సీడబ్ల్యూసీలో స్థానాన్ని ఆశిస్తున్నారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి పేరు నాలుగైదు నెలలుగా వినిపిస్తోంది. సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిగితే తాను పోటీచేసి, తెలంగాణ, ఏపీ, కర్ణాటక సభ్యుల ఓట్లతో గెలుపొందాలని ఆయన భావించారు. కానీ సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నిక ద్వారా కాకుండా ఏఐసీసీ చీఫ్ ఎంపిక చేయాలని ప్లీనరీలో నిర్ణయించడంతో ఇప్పుడు తనను ఎంపిక చేస్తారనే నమ్మకంతో ఆయన ఉన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులుగా ఏపీ నుంచి రఘువీరారెడ్డి పేరు వినిపిస్తోంది. ఆయనతోపాటు తెలంగాణలోని ఏఐసీసీ కార్యదర్శుల్లో ఒకరికి ప్రమోషన్ ఇస్తారని తెలుస్తోంది. అయితే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఇతర రాష్ట్రాలకు పార్టీ ఇన్చార్జిగా న్యాయం చేయలేమని, రాష్ట్రంలోనే ఉండాల్సి వస్తుందని కొందరు సీనియర్ నేతలు నిరాసక్తత వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
సోనియాకు అడ్డుపడి చిన్నమ్మ శపథం! ఆనాడు అలా జరగకపోయి ఉంటే..
దేశంలో కుటుంబ, వారసత్వ రాజకీయాలు వేళ్లానుకునిపోయిన సమయం అది. ఆ సమయంలో.. భర్త చనిపోవడంతో ఆమెనే ప్రధాని అవుతుందని అంతా భావించారు. కానీ, పీఎం పదవితో పాటు పార్టీ పగ్గాలనూ వద్దనుకుని పార్టీ క్యాడర్‌ను, యావత్ దేశాన్ని నివ్వెరపోయేలా చేశారామె. దాదాపు అర్ధదశాబ్దంపాటు రాజకీయం ఊసే ఎత్తలేదు. అయితే.. పార్టీ అంతర్గత సంక్షోభం, ఎన్నికల్లో దారుణ ఓటమి సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. దశాబ్దంపాటు పవర్ఫుల్ ఉమెన్‌గా ప్రపంచాన్ని ఆకట్టుకోలిగారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా.. సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ తన మార్క్ చూపిస్తూ పరిస్థితులను కొంతైనా చక్కబెడుతూ వచ్చారు. సోనియా గాంధీ.. అప్పటిదాకా రాజీవ్ గాంధీ సతీమణి. భర్త మరణాంతరం దాదాపు అర్థదశాబ్దంపాటు రాజకీయాల్లోకి రావడానికి అనాసక్తిని కనబరిచారు. అయితే.. 1996 ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ ఛిన్నాభిన్నం అయ్యింది. మూకుమ్మడిగా సీతారాం కేసరి నాయకత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు. పార్టీలోని చాలామంది సొంత కుంపట్లను ఏర్పాటు చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో.. కాంగ్రెస్‌కు గడ్డుపరిస్థితులు ఎదురయ్యాయి. నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ఒత్తిళ్లు పెరిగాయి. ఆ పరిణామాల నడుమ రాజకీయాల్లోకి అన్యమనస్కంగానే అడుగుపెట్టారామె. 1997 కలకత్తా(కోల్‌కతా)లో జరిగిన ప్లీనరీ సెషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం పుచ్చుకున్నారామె. ఆపై 62 రోజులకే ఆమెకు పార్టీ బాధ్యతలు ఆఫర్ చేయగా.. అందుకు ఆమె అంగీకారం కూడా తెలిపారు . అయితే.. ప్రధాని అభ్యర్థిత్వానికి ఆమె పేరు తెర మీదకు రావడంతో.. 1999 మే నెలలో పార్టీలో సీనియర్లు ముగ్గురు వ్యతిరేక గళం వినిపించారు. విదేశీ మూలాలు ఉన్న ఆమె.. భారత్‌కు ఎలా ప్రధాని అవుతారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. పార్టీకి రాజీనామా చేసేసి బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారామె. కానీ, ఆమెను నిలువరించిన పార్టీ.. ఆ ముగ్గురు రెబల్స్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ ముగ్గురే శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్.. వాళ్లు స్థాపించుకున్న పార్టీనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. వీళ్లే కాదు.. పార్టీ నుంచి బయటకు వచ్చిన మరికొందరు సొంత పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు కూడా. ఇది ఆమె ప్రధాని పదవికి అడ్డు తగిలిన మొదటి సందర్భం. 1999 సార్వత్రిక ఎన్నికల్లో సోనియా గాంధీ.. కర్ణాటక బళ్లారి నుంచి, ఉత్తర ప్రదేశ్ అమేథీ నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారామె. ఈ రెండింటిలో ఆమె అమేథీనే ఎంచుకున్నారు. ఇక బళ్లారిలో ఆమె ఓడించింది ఎవరినో తెలుసా?.. చిన్నమ్మగా పేరొందిన సుష్మా స్వరాజ్‌ను. సోనియాగాంధీ బంపర్‌మెజార్టీతో నెగ్గినప్పటికీ.. వాజ్‌పేయి పేరు, ఛర్మిష్మా, ఇతరత్రా కారణాలతో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టింది. ఆ సమయంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగారామె. 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరగ్గా.. అవతలి అభ్యర్థి జితేంద్ర ప్రసాదను 97 శాతం మార్జిన్‌తో ఓడించారామె. అప్పటి నుంచి ఓటింగ్ లేకుండానే ఆమె ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. అంతేకాదు.. 2003లో ఏకంగా వాజ్‌పేయి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారామె. అధికారంలోకి యూపీఏ కూటమి 2004 సార్వత్రిక ఎన్నికల్లో.. సోనియా గాంధీ ఆమ్ ఆద్మీ(ఆర్డీనరీ మ్యాన్) పేరుతో దేశవ్యాప్త ప్రచారం నిర్వహించారు. అప్పటికే బీజేపీ ఇండియా షైనింగ్ పేరుతో ప్రచారంలో ఉంది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఊహించని పరాభవం ఎదురైంది. ఆ ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి.. 2 లక్షలకు పైచిలుకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు సోనియా గాంధీ. దాదాపు 15 పార్టీల కూటమి యూపీఏ పేరుతో కేంద్రంలో అధికారం చేపట్టేందుకు సిద్ధం అయ్యింది. ఈ ఎన్నికల విజయంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన సోనియా గాంధీనే దేశానికి ప్రధాని కాబోతున్నారంటూ చర్చ మొదలైంది. కానీ.. ► ప్రతిపక్ష కూటమి సోనియా ప్రధాని కాకుండా మోకాలడ్డింది. సుష్మా సర్వాజ్ అయితే ఏకంగా హెచ్చరికలకే దిగారు. సోనియా గనుక దేశానికి ప్రధానిని చేస్తే.. తాను గుండు చేయించుకుంటానని, కటిక నేలపై నిద్రిస్తానని శపథం చేసి.. రాజకీయ దుమారం రేపారు. మరోవైపు ఎన్డీయేలోని పక్షాలు న్యాయపరమైన కారణాలు చూపించి అభ్యంతరాలు లేవనెత్తారు. భారత పౌరసత్వ చట్టం 1955 సెక్షన్ 5 ప్రకారం.. కోర్టును ఆశ్రయించారు. కానీ, కోర్టు ఆమెకు ఊరటనే ఇచ్చింది. ► రాజకీయంగా చెలరేగుతున్న రగడ కారణంగా.. ప్రధాని పదవి చేపట్టకూడదనే నిర్ణయానికి వచ్చారామె. బదులుగా ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పదవికి నామినేట్ చేశారామె. పార్టీ నేతలు కూడా అందుకు అంగీకరించారు. ఆ సమయంలో ఆమె త్యాగనీరతిని అభిమానులు ఆకాశానికెత్తగా.. పొలిటికల్ స్టంట్ అంటూ ప్రత్యర్థులు పెదవి విరిచారు. ఇది రెండోసారి. ► ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వివాదం కారణంగా.. ఎంపీ పదవికి, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్ పదవికి ఆమె రాజీనామా ప్రకటించారు. ఆపై 2006 మే నెలలో జరిగిన ఉప ఎన్నికలో రాయ్ బరేలీ నుండి 400,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ► 2009లో ఆమె నాయకత్వంలోనే మళ్లీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ కేంద్రంలో కొలువు దీరింది. ఆ ఎన్నికల్లో 206 లోక్‌సభ సీట్లు గెలవగా.. 1991 నుంచి అప్పటిదాకా ఏపార్టీ కూడా అంత సీట్లు గెలవకపోవడం విశేషం. ఈ ఎన్నికల్లోనూ రాయ్ బరేలీ నుంచి ఆమె గెలుపొందారు. ► 2013లో.. పదిహేనేళ్లపాటు వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌గా పని చేసిన వ్యక్తి రికార్డును నెలకొల్పారామె. ► 2013లోనే.. ఎల్జీబీటీ హక్కులను బలపరుస్తూ ఐపీసీ సెక్షన్ 377 మద్దతు ప్రకటించారు. ► 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైంది. కాంగ్రెస్‌కు 44, మొత్తంగా యూపీఏ కూటమికి 59 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే.. రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ గెలుపొందారు. ► అదే ఏడాదిలో తెలుగు రాష్ట్రాల విభజన ద్వారా సోనియమ్మగా పార్టీ నేతలచేత పిలిపించుకున్నారామె. ► ప్రతిపక్షాన్ని బంధించే జిగురు లాంటి వ్యక్తి సోనియా. ఈ కామెంట్ చేసింది ఎవరో కాదు వామపక్ష దిగ్గజ నేత సీపీఐ(ఎం) సీతారాం ఏచూరి. కాంగ్రెస్ పగ్గాలు సోనియాకా? రాహుల్‌కా? అనే చర్చ నడిచిన సమయంలో ఆయన సోనియాకే ఓటేశారు. ► 2016 నుంచి ఎన్నికల ప్రచారానికి ఆమె దూరంగా ఉంటూ వచ్చారు. 2017 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీకి 49వ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టారు. తిరిగి.. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె ప్రచారం ద్వారా తెర మీదకు వచ్చారు. బీజాపూర్‌లో ఆమె బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 78 సీట్లు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అదే సమయంలో బీజాపూర్ పరిధిలోని ఐదు స్థానాల్లో నాలుగింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. జనతా దళ్ (సెక్యులర్)తో పోత్తు విషయంలోనూ ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు. ► 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్-యూపీఏ కూటమి ఓటమిపాలైంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో.. తిరిగి సోనియా గాంధీకే పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ► కాంగ్రెస్‌కు కుటుంబ పార్టీ అనే మచ్చ చెరిపేసేందుకు.. శాశ్వత అధ్యక్ష ఎన్నిక జరగాలని, ఆ నాయకత్వంలోనే 2024 ఎన్నికలకు వెళ్లాలని సోనియా గాంధీ ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఆమె అధ్యక్ష ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు. అయితే గెహ్లాట్ ఎన్నికల బరి నుంచి తప్పుకోగా.. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించి కాంగ్రెస్‌కు గాంధీయేతర కుటుంబ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ► 1999లో అమేథీ నుంచి 4,18,960 ఓట్లు(67.12 శాతం ఓటు షేర్), బళ్లారి నుంచి 4,14,650 ఓట్లు(51.70 శాతం ఓటు షేర్) మెజార్టీతో ఆమె నెగ్గారు. ఆ తర్వాత 2004 ఎన్నికలో రాయ్ బరేలీ నుంచి 3,90,179 ఓట్ల మెజార్టీతో.. 2006 ఉప ఎన్నికలో ఏకంగా 4,74,891 ఓట్ల మెజార్టీతో ఆమె నెగ్గారు. తిరిగి 2009 ఎన్నికలో 4,81,490 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో 5,26,434 ఓట్ల మెజార్టీ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో 5,34,918 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ప్రతీ ఎన్నికకు ఆమె విక్టరీ మెజార్టీ గణనీయంగా పెరుగుతూ పోవడం గమనార్హం. ► 2004-14 అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో దేశంలో శక్తివంతమైన మహిళలు, ప్రభావశీలుర జాబితాలోనూ ఆమె ప్రతీ ఏడాది నిలుస్తూ వచ్చారు. ► 2007లో టైమ్స్ మ్యాగజైన్.. టాప్ 100 ప్రభావశీలుర జాబితాలో సోనియా గాంధీకి చోటు ఇచ్చింది. ► 2013లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తుల్లో 21వ ర్యాంక్, మహిళల్లో 9వ ర్యాంక్ కట్టబెట్టింది. ► మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా.. 2007 అక్టోబర్ 2వ తేదీన ఐక్యరాజ్య సమితిలో ఆమె ప్రసంగించారు. ఆనాటి నుంచి గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినంగా పాటిస్తూ వస్తున్నారు(ఐరాసలో తీర్మానం పాస్ అయ్యింది 2007 జులై 15న). ► నేషనల్ అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్‌గా, యూపీఏ చైర్‌పర్సన్‌గానూ ఆమె కీలక నిర్ణయాల్లో ముఖ్యభూమిక పోషించారు. అందులో నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టంగా మారడం అనే రెండు ప్రధానమైనవి ఉన్నాయి. రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్) కాంగ్రెస్ ప్లీనరీలో 76 ఏళ్ల సోనియా గాంధీ ప్రసంగిస్తూ.. పొలిటికల్ రిటైర్మెంట్ సంకేతాలు ఇచ్చిన సందర్భంలో.. -
తెలంగాణ నుంచి 47 మందికి అవకాశం
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈనెల 24 నుంచి 26 వరకు జరగనున్న ఏఐసీసీ 85వ ప్లీనరీలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి 47 మంది నాయకులకు అవకాశం కల్పించారు. ఇందు లో 33 మంది ఎన్నికైన సభ్యులు కాగా, మిగతా 14 మంది కోఆప్టేడ్ సభ్యులు. ఏఐసీసీకి ఎన్నిౖకైన సభ్యు లుగా తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, సీతక్క, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ముఖ్య నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. ఏఐసీసీ 85వ ప్లీనరీలో దామోదర రాజనర్సింహ, రేణుకాచౌదరి, బలరాం నాయక్, మధు యాష్కీగౌడ్, మహేశ్వర్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, వంశీచంద్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, కొండా సురేఖ, మల్లు రవి, గీతారెడ్డి, కోదండరెడ్డి, ప్రేమ్‌సాగర్‌రా వు, అజారుద్దీన్, మహేశ్‌కుమార్ గౌడ్, సంజీవరెడ్డి, శివసేన రెడ్డి, బల్మూరు వెంకట్ ఉన్నారు. కాగా, ఆర్.దామోదర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సురేశ్ షెట్కార్, రమేశ్ ముదిరాజ్, హర్కర వేణుగోపాల్, కుసుమ కుమార్, నిరంజన్, టి.కుమార్‌రావు, బెల్లయ్యనాయక్, బూ స అనులేఖ, సునీతా రావు, కోట నీలిమలకు ఏఐసీసీ కో ఆపె్టడ్ సభ్యులుగా అవకాశం కలి్పంచారు. ప్లీనరీలో ఈ ఏడాది జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికలకు దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొనేందుకు పార్టీ ఎలా సిద్ధం కావాలన్న అంశంపై చర్చించనున్నారు. 24వ తేదీన జైరామ్ రమేశ్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ తయారుచేసిన తీర్మానాలను చర్చించి ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
మ్యాజిక్ లేదు..మాటలతోనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి మాణిక్‌రావ్ ఠాక్రే చెప్పారు. ఏ సమ స్యకైనా పరిష్కారం ఉంటుందని, తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సమస్యలకు కూడా ఎక్కడోచోట పరిష్కారం లభిస్తుందని, ఆ పరిష్కారం కనుగొనేందుకే తాను తెలంగాణకు వస్తున్నానని అన్నారు. తాను రాష్ట్రానికి వచ్చి ఏదో మ్యాజిక్ చేయాలనుకో వడం లేదని, కూర్చుని మాట్లాడుకుంటే ఏదైనా సాధ్యమవుతుందనేది తన నమ్మకమని ఆయన పే ర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా నియా మకమైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా మంగళవారం ముంబై నుంచి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలుఠాక్రే మాటల్లోనే.. కాంగ్రెస్ బలం తగ్గలేదు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో మా బలం ఏమాత్రం తగ్గలేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుభూతితో ఉన్నారు. నాకున్న అవగాహనకు తోడు పార్టీ నేతల ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుని, డిస్కషన్స్ (చర్చలు)తోనే తెలంగాణ కాంగ్రెస్‌ను డీల్ చేయాలనుకుంటున్నా. కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయి. పీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎల్పీ నాయకుడిని విడివిడిగా కలవాలని నిర్ణయం తీసుకున్నా. వచ్చీ రాగానే విడివిడిగా సమావేశం ఎందుకు పెట్టారన్నదానికి ప్రత్యేక సమాధానం ఏం లేదు.. కానీ ఒంటరిగా కలిసిన ప్పుడే కొంతమంది అన్ని విషయాలు మాట్లాడతా రు. రాజకీయ పార్టీల్లో ఈ ఒరవడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే వేర్వేరుగా కలవాలని నిర్ణ యం తీసుకున్నా. రాష్ట్రానికి చెందిన మరికొందరు సీనియర్ నేతలతో కూడా విడిగా భేటీ అవుతా. పార్టీ పటిష్టత, గెలుపు కోసం వారి మనసులో మాట ఏంటో తెలుసుకుంటా. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు జ రుగుతాయి. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించే టాస్క్ ఏఐసీసీ నాకిచ్చింది. ఆ టాస్క్‌ను విజయవంతం చేయడం కోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తా.’ రాష్ట్రంలో బీజేపీ గాలిబుడగలాంటిది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నా యం. ఎవరు ఎన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రత్యామ్నాయం సాధ్యం కాదు. ప్రాంతీయ పార్టీల ప్రభావం కొంతమేర ఉన్నా మేం లేకుండా ఏమీ చేయలేరు. బీఆర్ఎస్ అయినా మరే కొత్త పార్టీ వచ్చినా అది సాధ్యం కాదు. తెలంగాణలో బీజేపీ గాలిబుడగ లాంటిది. కాంగ్రెస్ పార్టీని దాటి ముందుకెళ్లే పరిస్థితి ఇప్పట్లో జరిగేది కాదు. తెలంగాణలో ఈసారి మేం అధికారంలోకి వచ్చి తీరతాం. -
మాణిక్యం ఎగ్జిట్.. మాణిక్ ఎంట్రీ
సాక్షి,హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించి బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్యం ఠాగూర్‌ను అధిష్టానం తప్పించింది. ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత మాణిక్‌రావ్ ఠాక్రేను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. మాణిక్యం ఠాగూర్‌కు గోవా రాష్ట్ర వ్యవహారాలను అప్పగించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రాష్ట్రంలోని సీనియర్ నేతల ఒత్తిడితో పాటు, పార్టీ ఇన్చార్జిగా కొనసాగేందుకు మాణిక్యం సైతం విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో అధిష్టానం ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మాణిక్యంను తప్పిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు వెలువడడానికి కొద్దిగా ముందు, టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్‌రెడ్డి వేదాంత ధోరణిలో మాట్లాడడం పార్టీలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘రేవంత్’ వేదాంతం.. పదవిలో ఉన్నా లేకున్నా పార్టీకి కట్టుబడి పనిచేస్తా. అధ్యక్షుడిగా వేరేవారిని నియమించినా భుజాలపై మోస్తా. పార్టీ కోసం పదవులను, అవసరమైతే ప్రాణాలను కూడా త్యాగం చేసేందుకు సిద్ధం. అందరూ మానవమాత్రులే. అప్పుడప్పుడూ పొరపాట్లు జరుగుతాయి. వాటిని సరిదిద్దుకుంటాం. సీనియర్లు లేని శిక్షణ ‘హాథ్‌సే హాత్‌జోడో’ పాదయాత్రల గురించి చర్చించడంతో పాటు ధరణి పోర్టల్‌పై నేతలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి పలువురు సీనియర్లు డుమ్మా కొట్టారు. ఏఐసీసీ సమన్వయకర్త గిరీష్ జోడంకర్ హాజరైన భేటీకి సీనియర్లు గైర్హాజరవడం చర్చనీయాంశమయింది. ఏఐసీసీ సమన్వయకర్త గిరీష్ జోడంకర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్న ఈ భేటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి తదితరులు హాజరు కాగా.. కారణాలేవైనా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు లాంటి నాయకులు పాల్గొనకపోవడం చర్చనీయాంశమవుతోంది. పలు అంశాలపై టీపీసీసీ చర్చ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో బుధవారం ఏర్పాటు చేసిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా జనవరి 26 నుంచి నిర్వహించాల్సిన ‘హాత్‌సే హాత్‌జోడో’ పాదయాత్రల గురించి నేతలు చర్చించారు. ధరణి పోర్టల్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేతలకు అవగాహన కల్పించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన పక్షంలో బీమా కల్పన, మీడియాతో సమన్వయం, ఎన్నికల నిబంధనలు తదితర అంశాలపై కూడా చర్చ జరిగింది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, మల్లురవి, గాలి అనిల్‌కుమార్, సంపత్‌కుమార్, సుదర్శన్‌రెడ్డి, చిన్నారెడ్డి, అంజ¯న్‌కుమార్ యాదవ్, హర్కర వేణుగోపాల్, రాములు నాయక్, నిరంజన్‌లతో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, పీసీసీ ప్రతిని«ధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ ఏ గట్టునుంటారో చెప్పండి: రేవంత్ ఈ సమావేశాన్ని రేవంత్‌రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరణ ద్వారా ప్రారంభించారు. సమావేశం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన వివాదాల విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ గట్టునుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. ‘గోదావరి, కృష్ణా నదీ జలాల విషయంలో కేసీఆర్ ఎటువైపు ? ఆస్తుల విభజనలో తెలంగాణ వైపా, ఆంధ్రప్రదేశ వైపా?’ అని ప్రశ్నించారు. ఎన్నో త్యాగాలు చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఆ గట్టున చేరిన కేసీఆర్ తెలంగాణను ముంచాలనుకుంటున్నాడని విమర్శించారు. రెండుసార్లు ప్రజలు అధికారమిచి్చనా కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారని, కేసీఆర్ పాలనలో దగా పడని వర్గం లేదని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఉప్పెనలా కప్పేద్దాం కాంగ్రెస్ కార్యకర్తలంతా కార్యోన్ముఖులై కదలాలని, ఉప్పెనలా కేసీఆర్ కుటుంబాన్ని కప్పేద్దామని రేవంత్ పిలుపునిచ్చారు. పదవిలో ఉన్నా లేకున్నా తాను పార్టీ కోసం కట్టుబడి పనిచేస్తానని, పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధమని అన్నారు. పార్టీ ఏ ఆదేశాలిచ్చినా సామాన్య కార్యకర్తలా పనిచేస్తానన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ కుటుంబానికి జానారెడ్డి పెద్దదిక్కులాంటి వారని, ఆయన సూచనల ప్రకారం నడుచుకుని పార్టీని రాష్ట్రంలోని అన్ని మూలలకు తీసుకెళ్దామని చెప్పారు. కొన్ని దుష్టశక్తులు ఆశించినట్టుగా తెలంగాణ సమాజానికి నష్టం చేయబోమని కాంగ్రెస్ శ్రేణులు నిరూపించారని, తెలంగాణ ప్రజలకు నష్టం కలిగేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించబోదని ఈ వేదిక నుంచి సందేశం ఇద్దామని అన్నారు. ఐక్యంగా పనిచేస్తే అధికారం: జోడంకర్ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా హాత్‌సే హాత్‌జోడో యాత్రలు చేయాలని గిరీష్ జోడంకర్ పిలుపునిచ్చారు. ఈ యాత్రలను ఎన్నికల ప్రచారంగా ఉపయోగించుకోవాలని, హాత్‌సే హాత్‌జోడో యాత్రల విజయవంతం కోసం ఈనెల 8వ తేదీన జిల్లా, మండల, బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. పార్టీ నేతల మధ్య సమన్వయానికి ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయన్నారు. నేతలందరూ ఐక్యంగా పనిచేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పారీ్టదే అధికారమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ పాదయాత్ర ఓ చరిత్ర అంతకుముందు సమావేశం ప్రారంభం సందర్భంగా సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన చరిత్ర కాంగ్రెస్ పారీ్టదని, దేశాన్ని విచి్ఛన్నం చేసేందుకు బీజేపీ చేస్తున్న కుయుక్తులను తిప్పికొట్టేందుకే రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర చేపట్టారని చెప్పారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర ఓ చరిత్రగా నిలిచి పోయిందని, గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ యాత్ర తోడ్పడిందని తెలిపారు. వైఎస్సార్ స్ఫూర్తితో తెలంగాణలో పాదయాత్రలు చేద్దామని రేవంత్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హాత్‌సే హాత్‌జోడో యాత్ర ద్వారా రాష్ట్రంలోని ప్రతి గడపను తట్టి రాహుల్‌గాంధీ ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పారు. కేడర్‌ను ఉత్తేజితుల్ని చేయండి టీపీసీసీ సమావేశానంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ఏఐసీసీ నియమించిన హాత్‌సే హాత్‌జోడో అభియాన్ సమన్వయకర్త గిరీష్ జోడంకర్, రేవంత్‌రెడ్డిలు సమావేశమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కేడర్‌ను ఉత్తేజితులను చేయాలని, జనవరి 26 నుంచి జరగనున్న పాదయాత్రలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. అదే విధంగా జిల్లాలు, నియోజకవర్గాల వారీగా స్థానిక ప్రజలెదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఎక్కడికక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చార్జిషీట్లు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారం దక్కించుకునే దిశలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేని వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా..మంత్రిగా.. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన మాణిక్‌రావు ఠాక్రే 2008 నుంచి 2015 వరకు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1985 నుంచి 2004 మధ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, 2009 నుంచి 2018 మధ్య ఎమ్మెల్సీగా పని చేశారు. శరద్ పవార్, విలాస్ రావు దేశ్ ముఖ్, సుశీల్ కుమార్ షిండేల మంత్రి వర్గాల్లో మూడుసార్లు వివిధ శాఖల మంత్రిగా సేవలందించారు. మంత్రిగా పరిపాలన అనుభవంతో పాటు దాదాపు ఎనిమిదేళ్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మాణిక్‌రావ్ ఠాక్రేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. -
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌రావు థాకరేను ఏఐసీసీ అధిష్టానం నియమించింది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ను గోవా ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. మాణిక్‌రావు థాకరే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. గతంలో ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. బీజేపీ, శివసేన ప్రభుత్వాలను తీవ్రంగా తూర్పార బట్టిన నాయకుడిగా ఆయనకు పేరుంది. చదవండి: (వైఎస్సార్ పాదయాత్ర దేశ రాజకీయాలలో ఓ సంచలనం: భట్టి) -
ఏపీ పరిశీలకుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ ఆధ్వర్యంలో జనవరి 26 నుంచి ప్రారంభించనున్న ‘హాత్ సే హాత్’ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ పరిశీలకుడిగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. అలాగే తెలంగాణ పరిశీలకుడిగా గోవా పీసీసీ మాజీ అధ్యక్షుడు గిరీష్‌చోడాంకర్‌ను నియమించారు. మహారాష్ట్ర పరిశీలకుడిగా కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, గోవా పరిశీలకుడిగా పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్, పుదుచ్చేరి పరిశీలకుడిగా మాజీ ఎంపీ వి.హనుమంతరావును నియమించారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ‘హాత్ సే హాత్’ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు నియమితులైన అన్ని రాష్ట్రాల పరిశీలకుల వివరాలను ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ఓ ప్రకటన ద్వారా విడుదల చేశారు. చదవండి: (దళిత మహిళపై చెయ్యెత్తిన పరిటాల సునీత) -
తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం.. డిగ్గీ రాజా హాట్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం.. దాన్ని చక్కదిద్దేందుకు హైకమాండ్ దిగ్విజయ్‌సింగ్‌ను బరిలోకి దింపడం.. ఆయన సుదీర్ఘంగా పది గంటల పాటు నేతలతో విడివిడిగా భేటీ అయి చర్చించడం ఉత్కంఠ రేపింది. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘తెలంగాణలో సీనియర్ నేతలు సమన్వయం పాటించాలి. పార్టీలో అంతర్గతంగా మాత్రమే చర్చించాలి. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవద్దు. ఎంతపెద్ద నాయకులైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటాం’’ అని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకోవాలి. పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేయాలి. కాంగ్రెస్ నేతలంతా ప్రజాక్షేత్రంలో ఉండాలి.ఇప్పటికే రేవంత్‌రెడ్డి నన్ను కలిశారు. చిన్న వయస్సులో ఉన్నవారికి పీసీసీ ఇస్తే తప్పేంటి?. కొత్తవారికి పీసీసీ చీఫ్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి’’ అని ద్విగిజయ్ పేర్కొన్నారు. కేంద్రం అన్ని రంగాల్లో విఫలమయ్యిందని మోదీ పాలనలో మధ్య తరగతి ప్రజలు నలిగిపోతున్నారన్నారు. ఈ స్థాయిలో ధరలు ఎప్పుడూ పెరగలేదన్నారు. ‘‘రాహుల్ యాత్రకు మంచి స్పందన వస్తోంది. దేశంలో నిరుద్యోగ సమస్య భారీగా పెరిగింది.కార్పొరేట్ల సంస్థలకే మోదీ ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది.ప్రత్యర్థులపై ప్రభుత్వ సంస్థలను ఉసిగొల్పుతున్నారు.ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు.మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచుతున్నారు. జోడో యాత్రను అడ్డుకోవడానికి కేంద్రం కుట్రలు చేస్తోంది’ అని ద్విగిజయ్ అన్నారు. ‘‘ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలే తెలంగాణను సాధించారా?. ప్రజలకు హామీ ఇచ్చాం. తెలంగాణను ఏర్పాటు చేశాం. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారు. కాంగ్రెస్ నేతలను బెదిరిస్తున్నారు.తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోంది. అవినీతిపై తెలంగాణ రికార్డు సాధిస్తోంది.బీజేపీకి మద్దతు పలికేందుకు బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేసింది. తెలంగాణలో మైనార్టీ రిజర్వేషన్లపై ఓవైసీ మౌనంగా ఎందుకున్నారు?. కేసీఆర్‌కు ఓవైసీ ఎందుకు మద్దతు ఇస్తున్నారు?. బీజేపీని గెలిపించేందుకు ఓవైసీ పోటీ చేస్తున్నారు’’ అని ద్విగిజయ్ సింగ్ దుయ్యబట్టారు. -
టీపీసీసీ ‘జంబో జట్టు’
సాక్షి, న్యూఢిల్లీ: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో కార్యవర్గాన్ని ఎంపిక చేసింది. అన్ని సామాజిక వర్గాలను సమతుల్యం చేస్తూ.. జంబో జట్టును ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. ఇందులో 24 మంది ఉపాధ్యక్షులు, 84 మంది ప్రధాన కార్యదర్శులు ఉండగా, 26 జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. వీరితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ అ«ధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజకీయ వ్యవహారాల కమిటీలో 17 మంది సభ్యులు, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. అంతేగాక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా 40 మందితో ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేసింది. ఇదీ జాబితా.. రాజకీయ వ్యవహారాల కమిటీ(22) : మాణిక్యం ఠాగూర్ (చైర్మన్), రేవంత్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, వి.హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.జానారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, జె.గీతారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, దామోదర సి. రాజనరసింహ, రేణుకా చౌదరి, పి.బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, శ్రీధర్‌బాబు, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్. అలాగే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న ఎండీ అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్ రాజకీయ వ్యవహారాల కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (40) .. రేవంత్‌రెడ్డి (చైర్మన్), మల్లు భట్టివిక్రమార్క, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.జానారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, జె.గీతారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, దామోదర రాజనరసింహ, రేణుకా చౌదరి, పి.బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, డి.శ్రీధర్‌బాబు, జి.చిన్నారెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎ.సంపత్ కుమార్, పి. సుదర్శన్‌రెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, నాగం జనార్దన్‌రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, సి.రామచంద్రారెడ్డి, కొండా సురేఖ, జి.వినోద్, మహమ్మద్ అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్ గౌడ్, డి.సీతక్క, పొదెం వీరయ్య, ఎ.మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, కోదండరెడ్డి, ఈరవత్రి అనిల్‌కుమార్, వేం నరేందర్‌రెడ్డి, మల్లు రవి, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని. టీపీసీసీ ఉపాధ్యక్షులు (24) .. పద్మావతిరెడ్డి, బండారు శోభా భాస్కర్, కొండ్ర పుష్పలీల, నేరెళ్ల శారదాగౌడ్, సీహెచ్.విజయ రమణారావు, చామల కిరణ్‌రెడ్డి, చెరుకు సుధాకర్‌గౌడ్, దొమ్మటి సాంబయ్య, శ్రవణ్‌కుమార్ రెడ్డి, ఎర్ర శేఖర్, జి.వినోద్, గాలి అనిల్‌కుమార్, హర్కర వేణుగోపాల్‌రావు, జగదీశ్వరరావు, మదన్మోహన్రావు, మల్రెడ్డి రంగారెడ్డి, ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, పొట్ల నాగేశ్వరరావు, రాములు నాయక్, సంజీవరెడ్డి, సిరిసిల్ల రాజయ్య, టి.వజ్రేశ్ యాదవ్, తాహెర్‌బిన్ హందాని. టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు (84) .. మధుసూదన్‌రెడ్డి, అద్దంకి దయాకర్, బి.కైలాశ్‌కుమార్, బి.సుభాష్‌రెడ్డి, భానుప్రకాశ్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, భూపతిగల్ల మహిపాల్, బొల్లు కిషన్, సీహెచ్. బాల్‌రాజు, చలమల కృష్ణారెడ్డి, చరణ్‌కౌషిక్ యాదవ్, చారుకొండ వెంకటేశ్, చేర్యాల ఆంజనేయులు, చిలుక మధుసూదన్‌రెడ్డి, చిలుక విజయ్‌కుమార్, చిట్ల సత్యనారాయణ, దారాసింగ్ తాండూర్, సుధాకర్ యాదవ్, దుర్గం భాస్కర్, ఈ.కొమురయ్య, ఎడవల్లి కృష్ణ, ఫక్రుద్దీన్, ఫిరోజ్‌ఖాన్, గడుగు గంగాధర్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, గోమాస శ్రీనివాస్, గౌరీ శంకర్, జానంపల్లి అనిరుధ్‌రెడ్డి, జెరిపేటి జయపాల్, కె.నాగేశ్వరరెడ్డి, కైలాష్ నేత, కాటం ప్రదీప్‌కుమార్ గౌడ్, కొండేటి మల్లయ్య, కోటంరెడ్డి వినయ్‌రెడ్డి, కోటూరి మానవతారాయ్, కుందూరు రఘువీరారెడ్డి, ఎం.నాగేశ్ ముదిరాజ్, ఎం.వేణుగౌడ్, ఎం.ఎ. ఫహీం, మొగల్‌గుండ్ల జయపాల్‌రెడ్డి, మహ్మద్ అబ్దుల్ ఫహీం, ఎన్.బాలు నాయక్, నర్సారెడ్డి భూపతిరెడ్డి, నూతి సత్యనారాయణ, పి.హరికృష్ణ, పి.ప్రమోద్ కుమార్, పి.రఘువీర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి, పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, ప్రేమ్‌లాల్, ఆర్.లక్ష్మణ్ యాదవ్, నర్సాపూర్ రాజిరెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, రంగినేని అభిలాశ్‌రావు, రంగు బాలలక్ష్మిగౌడ్, రాపోలు జయప్రకాశ్, ఎస్.ఎ. వినోద్‌కుమార్, సంజీవ ముదిరాజ్, సత్తు మల్లేశ్, సొంటిరెడ్డి పున్నారెడ్డి, శ్రీనివాస్ చెక్లోకర్, తాటి వెంకటేశ్వర్లు, వల్లె నారాయణరెడ్డి, వెడ్మ భొజ్జు, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, జహీర్ లలాని, భీమగాని సౌజన్యగౌడ్, లకావత్ ధన్వంతి, ఎర్రబెల్లి స్వర్ణ, గండ్ర సుజాత, గోగుల సరిత వెంకటేశ్, జువ్వాడి ఇంద్రారావు, కందాడి జ్యోత్స్న శివారెడ్డి, కోట నీలిమ, మందుముల్ల రజితారెడ్డి, మర్సుకోల సరస్వతి, పి.విజయారెడ్డి, పారిజాత నర్సింహారెడ్డి, కుచన రవళిరెడ్డి, శశికళా యాదవ్, సింగారపు ఇందిర, ఉజ్మా షకీర్ జిల్లా అధ్యక్షులు (26) : సాజిద్ ఖాన్ (ఆదిలాబాద్), పొదెం వీరయ్య (భద్రాద్రి కొత్తగూడెం), ఎన్.రాజేందర్‌రెడ్డి(హనుమకొండ), వలీయుల్లా సమీర్ (హైదరాబాద్), ఎ.లక్ష్మణ్ కుమార్ (జగిత్యాల). పటేల్ ప్రభాకర్‌రెడ్డి (జోగుళాంబ గద్వాల), కైలాశ్ శ్రీనివాస్‌రావు (కామారెడ్డి), కె.సత్యనారాయణ (కరీంనగర్), రోహిన్‌రెడ్డి (ఖైరతాబాద్), జె.భరత్‌చంద్రారెడ్డి(మహబూబాబాద్), జి.మధుసూదన్‌రెడ్డి (మహబూబ్‌నగర్), కె.సురేఖ (మంచిర్యాల), టి.తిరుపతిరెడ్డి (మెదక్), నందికంటి శ్రీధర్ (మేడ్చల్ మల్కాజ్గిరి), ఎన్.కుమారస్వామి (ములుగు), సి.వంశీకృష్ణ (నాగర్‌కర్నూల్), టి.శంకర్‌నాయక్(నల్లగొండ), శ్రీహరి ముదిరాజ్ (నారాయణపేట), ప్రభాకర్‌రెడ్డి (నిర్మల్), మానాల మోహన్‌రెడ్డి (నిజామాబాద్), ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్ (పెద్దపల్లి), ఆది శ్రీనివాస్ (రాజన్న సిరిసిల్ల), టి.నర్సారెడ్డి (సిద్దిపేట), టి.రామ్మోహన్‌రెడ్డి (వికారాబాద్), ఎం.రాజేంద్రప్రసాద్ యాదవ్ (వనపర్తి), కె.అనిల్‌కుమార్ రెడ్డి (యాదాద్రి భువనగిరి) -
టీపీసీసీ కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ.. కోమటిరెడ్డికి..?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్‌గా మాణిక్కం ఠాగూర్‌ను నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించారు. ఇక టీపీసీసీ కమిటీలలో ఏ ఒక్క కమిటీలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం కల్పించలేదు. ఈ మేరకు ఏఐసీసీ అధిష్టానం శనివారం అధికారికంగా ప్రకటించింది. టీపీసీసీ కమిటీలు ►పొలిటికల్ అఫైర్స్ కమిటీ -18మంది ►వర్కింగ్ ప్రెసిడెంట్స్ - 04 ►జిల్లా అధ్యక్షులు - 26 మంది ►వైస్ ప్రెసిడెంట్స్- 24 మంది ►జనరల్ సెక్రటరీ- 8 మంది తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ వ్యవహారాల కమిటీ నియమించిన కాంగ్రెస్ అధిష్టానం 1.మాణికం ఠాగూర్ ( చైర్మన్) 2. రేవంత్ రెడ్డి 3. మల్లు భట్టి విక్రమార్క 4. వి.హనుమంత రావు 5. పొన్నాల లక్ష్మయ్య 6. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి 7. కె. జానా రెడ్డి 8. టి. జీవన్ రెడ్డి 9. డా.జె. గీతారెడ్డి 10. మహమ్మద్ అలీ షబ్బీర్ 11. దామోదర్ సి రాజా నరసింహ 12. రేణుకా చౌదరి 13. పి. బలరాం నాయక్ 14. మధు యాష్కీ గౌడ్ 15. చిన్నా రెడ్డి 16. శ్రీధర్ బాబు 17. వంశీ చంద్ రెడ్డి 18. సంపత్ కుమార్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు రాజకీయ వ్యవహారాల కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులు 1. ఎండీ అజారుద్దీన్ 2. అంజన్ కుమార్ యాదవ్ 3. జగ్గా రెడ్డి 4. మహేష్ కుమార్ గౌడ్ -
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఆర్.దామోదర్ రెడ్డి కీలక రిపోర్ట్
-
అజయ్ మాకన్ (కాంగ్రెస్) రాయని డైరీ
ఖర్గే పిలిపిస్తే వెళ్లాను. అక్బర్ రోడ్డులోని ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యాలయానికి ఆయన నన్ను పిలిపించలేదు. సఫ్దర్‌జంగ్ రోడ్డులోని తన నివాస గృహానికి పిలిపించారు! నేను వెళ్లేసరికి నా రాజీనామా లేఖ ఆయన కూర్చొని ఉన్న సోఫా ముందరి టీపాయ్ మీద చిన్నపాటి బరువుతో.. తండ్రి గుప్పెటలో బిగిసి ఉన్న తన చూపుడు వేలును విడిపించుకుని ముందుకు నడిచేందుకు ప్రయత్నిస్తున్న పిల్లవాడిలా ఉంది. ‘‘ఏమిటిది అజయ్?’’ అన్నారు ఖర్గే... ఒక తండ్రిలాగే! ఎందుకు రాజీనామా చేశావు అని అడగలేదు ఆయన! ‘‘ఎలాంటి సమయంలో నువ్వు రాజీనామా చేశావో తెలుసా?’’ అన్నారు! ‘‘జోడో యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశిస్తున్న సమయంలో.. రాజస్థాన్‌లో ఒక ఉప ఎన్నిక కూడా జరగబోతున్న సమయంలో.. పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌కు ఇన్చార్జి అయిన ఒక ప్రధాన కార్యదర్శి రాజీనామా చేశారంటే కాంగ్రెస్ ప్రతిష్ఠ ఏమౌతుందో ఆలోచించావా అజయ్!’’ అన్నారు. ‘‘పార్టీ ప్రతిష్ఠకు ఏమీ కాకుండా ఉండేందుకే రాజీనామా చేశాను ఖర్గేజీ..’’ అన్నాను. అప్పుడు కూడా ఆయన.. ‘‘రాజీనామా చేసి ఎక్కడికెళతావ్?’’ అన్నారే గానీ.. పార్టీ ప్రతిష్ఠకు వచ్చిన ముప్పు ఏమిటని గానీ, ఎందుకు రాజీనామా చేశావు అని గానీ అడగలేదు! ‘‘రాజీనామా చేసి ఎక్కడికీ వెళ్లబోవడం లేదు ఖర్గేజీ! ఢిల్లీలోనే ఉంటాను. కార్మిక సంఘాలను సంఘటితం చేస్తాను. ఎన్జీవోలతో మమేకం అవుతాను. ఢిల్లీ వాయు కాలుష్యంపై గళమెత్తుతాను. వీధి వర్తకుల సంక్షేమం కోసం కృషి చేస్తాను. మురికివాడల పురోభివృద్ధికి పాటు పడతాను..’’ అన్నాను. ఒక్కసారిగా భళ్లున నవ్వారు ఖర్గే! కోపంతో ఇల్లొదిలి వెళ్తున్న కొడుకుని ఆపి, ‘బయటికెళ్లి ఎలా బతుకుతావ్రా..’ అని అతి సంపన్నుడైన తండ్రి ప్రశ్నిస్తే.. ‘ఎలాగైనా బతుకుతాను. మూటలు మోస్తాను, ముష్టెత్తుకుంటాను. ఆటో నడుపుతాను. హోటళ్లలో ప్లేట్లు కడుగుతాను. ఇంటికైతే రాను..’ అని కొడుకు అన్నప్పుడు ఆ తండ్రి నవ్విన నవ్వులా ఉంది ఖర్గే నవ్వడం. నవ్వీ నవ్వీ.. హఠాత్తుగా గంభీరంగా మారి, ‘‘పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం అన్నది పార్టీ అప్పగించిన బాధ్యతలకు రాజీనామా చేసి వెళ్లిపోయినంత సులభం కాదు అజయ్..’’ అన్నారు ఖర్గే! ‘‘గెహ్లోత్ మీద క్రమశిక్షణ చర్య తీసుకోవడం కూడా సులభం కాదా ఖర్గేజీ?!’’ అన్నాను. అందుకు ఆయనేమీ మాట్లాడలేదు. ‘‘రాజస్థాన్ సీఎంగా ఉండిపోవడానికి గెహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతను కూడా తప్పించుకున్నారు. కానీ అతడిపై చర్యలేదు! సోనియాజీ మిమ్మల్నీ, నన్ను రాజస్థాన్‌కు పంపి పెట్టించిన సీఎల్పీ మీటింగ్‌కి తన ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా రాకుండా వారితో గెహ్లోత్ తిరుగుబాటు చేయించారు. కానీ అతడిపై చర్యలేదు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలలో ముగ్గురితో కలసి నన్ను భారత్ జోడో యాత్రకు వెళ్లమంటున్నారు. అందుకే రాజీనామా చేస్తున్నాను. నా ప్రతిష్ఠ కోసం కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ కోసం..’’ అన్నాను. ఖర్గే నా వైపు ప్రయాసగా చూశారు. ‘‘గెహ్లోత్ తన ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించారు. నువ్వు నీ రాజీనామాతో తిరుగుబాటు చేస్తున్నావు. అంతే కదా? పార్టీ అధ్యక్షుడికి అతి కష్టమైన పనేంటో తెలుసా అజయ్? క్రమశిక్షణ చర్య తీసుకోవడం! పార్టీలోని నాయకులకు అతి సులువైన పనేంటో తెలుసా అజయ్? క్రమశిక్షణ చర్యకు అధ్యక్షుడిపై ఒత్తిడి తేకుండా ఉండటం! సులభమైన పనినే పార్టీ నాయకులు చేయలేక పోతున్నప్పుడు.. కష్టమైన పనిని పార్టీ అధ్యక్షుడు ఎలా చెయ్యగలడో చెప్పు’’ అన్నారు!! -
అంత ఆవేశం పనికిరాదు! ఇక్కడ ఎవరి మాట ఎవరు వింటున్నారని...!
అంత ఆవేశం పనికిరాదు! ఇక్కడ ఎవరి మాట ఎవరు వింటున్నారని...! -
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈజ్ బ్యాక్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. గత నెల 21న విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన బుధవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కావడం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో విభేదాల నేపథ్యంలో.. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో వెంకట్‌రెడ్డి ఎలా వ్యవహరిస్తాన్నది అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. కానీ కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన సరిగ్గా పోలింగ్‌కు ముందు రోజు రావడం ఆసక్తికరంగా మారింది. ఆడియో లీక్ నేపథ్యంలో.. బీజేపీ అభ్యర్థి, తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మద్దతివ్వాలంటూ ఓ కాంగ్రెస్ కార్యకర్తతో వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో కొద్దిరోజుల కింద లీకవడం కలకలం రేపింది. దీనిపై ఏఐసీసీ గత నెల 23నే ఆయనకు నోటీసిచ్చింది. పది రోజుల్లో సమాధానమివ్వాలని ఆదేశించింది. ఆ గడువు గురువారంతో ముగియనుంది. మరోవైపు రాష్ట్రంలో రాహుల్ భారత్ జోడో యాత్ర సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వెంకటరెడ్డి జోడో యాత్రలో పాల్గొంటారా, లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మునుగోడు విషయంలో తాను స్పష్టంగా ఉన్నానని, తన ఆలోచనను అధిష్టానానికి చెప్పానని వెంకట్‌రెడ్డి సన్నిహితులతో పేర్కొన్నట్టు తెలిసింది. కొందరు ఫేక్ ఆడియోలు సృష్టించి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని.. దీనిపై తనకు క్లీన్చిట్ వచ్చేంత వరకు అధిష్టానం పెద్దలను కానీ, పార్టీ నేతలనుగానీ కలవబోనని వెంకట్‌రెడ్డి అన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఏఐసీసీ నోటీసుకు వెంకట్‌రెడ్డి ఎలా స్పందిస్తారు? గడువు ముగిసేలోపు సమాధానమిస్తారా లేదా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
Telangana Congress: మాణిక్యమేనా.. మారుతారా? లైన్లోకి చిదంబరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్యం ఠాగూరే కొనసాగుతారా లేక కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తారా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో గతంలో నియమితులైన సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జులందరూ వారి పదవులకు రాజీనామా చేశారు. ఈ పదవులన్నింటినీ మళ్లీ ఖర్గే భర్తీ చేయనున్నారు. అందులోభాగంగానే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి పదవికి మాణిక్యం ఠాగూర్ కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు తెలంగాణకు కొత్త ఇంచార్జి వస్తారా లేదా మాణిక్యమే కొనసాగుతారా అనే చర్చ మొదలైంది. చిదంబరంకు ఇస్తారా? రాష్ట్ర పార్టీ ఇన్చార్జి బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకుంటారనే చర్చ చాలాకాలంగా పార్టీలో జరుగుతోంది. ఆయన తమిళనాడు పీసీసీ అధ్యక్షుడిగా వెళ్లే అవకాశం ఉందని, ఆయన స్థానంలో కొత్తవారికి బాధ్యతలు ఇస్తారనే చర్చ ఉంది. అన్ని పదవులను భర్తీ చేసే అధికారం కొత్త అధ్యక్షుడు ఖర్గేకు కట్టబెడుతూ నేతలంగా రాజీనామా చేసిన నేపథ్యంలో మాణిక్యం ఠాగూర్‌ను మళ్లీ కొనసాగిస్తారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. పార్టీలోని కొందరు ఆయన మళ్లీ కొనసాగుతారని, సంప్రదాయంలో భాగంగానే ఆయన రాజీనామా చేశారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం గతం నుంచే ఆయన్ను మార్చాలనే ప్రతిపాదన ఉందని, అందువల్ల మార్పు జరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. చదవండి: ఫామ్‌హౌజ్ ఘటన.. టీఆర్ఎస్పై కిషన్‌రెడ్డి కౌంటర్ ఎటాక్ రాష్ట్ర పార్టీ వ్యవహారాలను నేరుగా ప్రియాంకాగాంధీ పర్యవేక్షిస్తున్నందున ఆమె అభిప్రాయమే కీలకమవుతుందని, ఆమె సిఫారసును బట్టి ఖర్గే నిర్ణయం తీసుకుంటారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. అయితే, కొందరు సీనియర్ నేతలు మాణిక్యం వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఆయన్ను మార్చి చిదంబరం లాంటి సీనియర్‌కు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని కూడా అంటున్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరనుండటం, రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందనే అభిప్రాయం అధిష్టానం పెద్దల్లో ఉన్న పరిస్థితుల్లో గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన సీనియర్‌ను పంపుతారనే చర్చ జరుగుతోంది. మరి, కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? మాణిక్యం కొనసాగుతారా? లేదా అన్నది కొద్ది రోజుల్లోనే తేలనుంది. -
పగ్గాలు చేపట్టిన ఖర్గే
న్యూఢిల్లీ: సహచర నాయకుడు శశిథరూర్‌ను ఓడించి ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే (80) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా పదవిలో కొనసాగుతున్న తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ (75) ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు లాంఛనంగా బాధ్యతలు అప్పగించారు. అయితే, ‘‘అధ్యక్ష బాధ్యతల బరువు నేటితో దిగిపోయింది. నాకు చాలా ఊరటగా ఉంది’’ అంటూ వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు! మార్పు సహజమంటూ కాస్త వేదాంత ధోరణిలో మాట్లాడారు. కార్యక్రమంలో రాహుల్‌గాంధీతో పాటు పార్టీ అగ్ర నేతలంతా పాల్గొన్నారు. అధ్యక్షునిగా ఎన్నికైనట్టు ఖర్గేకు నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఒక మామూలు కార్యకర్త కుమారుడైన అతి సాధారణ కార్యకర్తను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ కుటుంబం మొత్తానికీ కృతజ్ఞతలు. ఇది గొప్ప గౌరవం. నిరంతరం కష్టించి పని చేస్తా. ప్రతి కార్యకర్తకూ గొంతుకగా మారతా. పార్టీలో అన్ని స్థాయిల్లోనూ నాయకత్వాన్ని పెంపొందిస్తా’’ అని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఖర్గేను సోనియా స్వయంగా అధ్యక్ష కార్యాలయంలోకి తోడ్కొని వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు. తన పక్క కుర్చీలో కూర్చోవాల్సిందిగా ఖర్గే కోరగా సున్నితంగా తిరస్కరించారు. ‘భయపడొద్దు’ నినాదంతో ముందుకు తన ముందున్న సవాళ్ల గురించి పూర్తి అవగాహన ఉందని ఖర్గే అన్నారు. పార్టీగా కాంగ్రెస్‌కు ఇది కష్టకాలమేనని అంగీకరించారు. అయితే కార్యకర్తలు తమలో ఉన్న భయాలను పారదోలితే ఎంతటి సామ్రాజ్యమైనా వారిముందు మోకరిల్లుతుందన్నారు. రాహుల్ ఇచ్చిన ‘భయపడొద్దు’ నినాదం స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో బీజేపీని ఓడించేందుకు నేతలు, కార్యకర్తలూ స్వరశక్తులూ ధారపోయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పార్టీలో 50 శాతం పదవులను 50 ఏళ్లలోపు వయసు వారికే ఇవ్వడం వంటి నిర్ణయాలతో ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను సంపూర్ణంగా అమలు చేసి సమూల మార్పులు తేవాల్సి ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై కళ్లు మూసుకుంటూ ఆశ్రిత పెట్టుబడిదారీ మిత్రులకు సర్వం దోచిపెడుతోందని మండిపడ్డారు. ‘‘గాడ్సేను దేశభక్తునిగా, గాంధీని దేశద్రోహిగా చిత్రిస్తున్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చి సంఘ్ పరివార్ రాజ్యంగం తెచ్చే ప్రయత్నం జరుగుతోంది’’ అంటూ దుయ్యబట్టారు. ఈ అబద్ధాలను బట్టబయలు చేసి, మోసాలను ఎండగట్టి, విద్వేష ప్రచారాలను తుత్తునియలు చేసి తీరతామన్నారు. పార్టీని ఖర్గే మరింత పటిష్టపరుస్తారని, స్ఫూర్తిదాయకంగా నడుపుతారని సోనియా విశ్వాసం వెలిబుచ్చారు. ఇంతకాలం తనకు సహకరించిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనూ కాంగ్రెస్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని, ఓటమిని మాత్రం ఎన్నడూ అంగీకరించలేదని అన్నారు. దేశ ప్రజాస్వామిక సూత్రాలకే పొంచి ఉన్న పెను ముప్పును దీటుగా ఎదుర్కోవడం ఇప్పుడు పార్టీ ముందున్న పెద్ద సవాలని అభిప్రాయపడ్డారు. అధికారం కోసమే రాజకీయాలు చేసే ఈ కాలంలో సోనియా మాత్రం స్వార్థరహితంగా పార్టీని ముందుకు నడిపారంటూ ఖర్గే కొనియాడారు. సునాక్‌కు సోనియా లేఖ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌ను సోనియా అభినందించారు. ఇది భారతీయులందరికీ గర్వకారణమంటూ ఆయనకు లేఖ రాశారు. ఆయన హయాంలో ఇరు దేశాల సంబంధాలు మరింత పటిష్టమవుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. ఆఫీస్ బేరర్ల రాజీనామాలు... 47 మందితో స్టీరింగ్ కమిటీ 47 మందితో కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీని నూతన అధ్యక్షుడు ఖర్గే నియమించారు. కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీ ఏర్పాటయ్యేదాకా దాని బాధ్యతలను ఖర్గే సారథ్యంలోని ఈ కమిటీ చూస్తుంది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా, రాహుల్‌తో పాటు గత సీడబ్లు్యసీ సభ్యుల్లో అత్యధికులకు కమిటీలో చోటు దక్కింది. ప్రియాంక, ఏకే ఆంటోనీ, అంబికా సోని, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలా, దిగ్విజయ్‌సింగ్, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు కమిటీలో ఉన్నారు. సీడబ్లు్యసీ ప్రత్యేక ఆహ్వానితుల్లో మాత్రం ఎవరికీ చోటు దక్కలేదు. కొత్త టీములను ఏర్పాటు చేసుకునేందుకు ఖర్గేకు వీలు కల్పిస్తూ అంతకుముందు సీడబ్లు్యసీ సభ్యలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు తదితర ఆఫీసు బేరర్లంతా ఆయనకు లాంఛనంగా రాజీనామాలు సమర్పించారు. అధ్యక్షునిగా ఖర్గే ఎన్నికను ఆమోదించేందుకు వచ్చే మార్చిలో పార్టీ ప్లీనరీ జరిగే అవకాశముంది. ఖర్గే సారథ్యంలో జరిగిన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో గుజరాత్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. -
AICC అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే విజయం
-
ఎప్పుడూ ఏకగ్రీవమే, కానీ.. ఇప్పుడే ఇలా!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు కాసేపట్లో తేలిపోనున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో దేశంలోని వివిధ పోలింగ్ బూత్‌ల నుంచి చేరిన పోస్టల్ బాలెట్ల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌లో ఎవరు గెలుస్తారన్నది కాసేపట్లో తేలనుంది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారాయి. గాంధీయేతర కుటుంబం నుంచి అభ్యర్థి ఎన్నిక కాబోతుండడం, కాంగ్ సీనియర్లపై అభ్యర్థి శశిథరూర్ అసహనం వ్యక్తం చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ఓటింగ్‌పై శశిథరూర్ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. ఓటింగ్ ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు జరిగాయంటూ కౌంటింగ్ వేళ ఆరోపణలకు దిగారాయన. ఉత్తర ప్రదేశ్ ఓట్లను రద్దు చేయాలని కోరారు ఆయన. ఇక ఓటింగ్ అవకతవకలతో పాటు కొన్ని అంశాలపై ఎన్నికల అధికారి మధుసుధన్ మిస్త్రీని కలిసినట్లు, తమ వర్గం తరపున లేఖ అందించినట్లు థరూర్ ఎలక్షన్ ఏజెంట్ సల్మాన్ సోజ్ వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్ ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని, మల్లికార్జున ఖర్గేకు తెలియకుండా అది జరిగి ఉంటుందని, ఒకవేళ తెలిస్తే ఆయన సైతం ఆ అక్రమాలను సహించబోరని థరూర్ టీం లేఖలో పేర్కొంది. పోలింగ్‌తో సంబంధం లేని వాళ్ల సమక్షంలో బాలెట్ బాక్సులు ఉండడంపై అనుమానాలు ఉన్నట్లు తెలిపింది థరూర్ బృందం. ► అయితే ఓటింగ్ ప్రశాంతంగానే జరిగిందని, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించామని మధుసుదన్ మిస్త్రీ చెప్తున్నారు. మరో సీనియర్ సభ్యుడు జైరామ్ రమేశ్ సైతం ఎన్నికలు పారదర్శకంగానే జరిగినట్లు చెప్తున్నారు. ► మొత్తం పోలైన 9,915 ఓట్లలో అధికంగా.. సగానికి(50 శాతం) పైగా ఓట్లు ఎవరికి పోలైతే ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తుంది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలో మెజార్టీ తేలగానే కౌంటింగ్‌ను ఇక ఆపేస్తుంది కూడా. ► మునుపెన్నడూ లేని విధంగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ ‘అధ్యక్ష ఎన్నిక’.. పార్టీలో అంతర్గత పోరును బయటపెట్టింది. పంజాబ్, కేరళ, యూపీ, మహారాష్ట్ర.. ఇలా చాలా చోట్ల కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చును రాజేసింది. సీనియర్లు సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం గమనార్హం. ► అయితే ఎవరు గెలిచినా.. రిమోట్ కంట్రోల్ సోనియాగాంధీ కుటుంబం చేతుల్లోనే ఉంటుందన్న విమర్శలను పార్టీ ఖండిస్తోంది. సమర్థులైన ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారని కాంగ్రెస్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ► ఇక శశిథరూర్ అసహనం మొదటి నుంచి చర్చనీయాంశంగా మారింది. సీనియర్లు, పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్న వాళ్లతో సహా పీసీసీ చీఫ్‌లు సైతం మల్లికార్జున ఖర్గేకు బహిరంగ మద్దతు ప్రకటించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు.. ► థరూర్ నామినేషన్‌ను ప్రతిపాదించిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సైతం థరూర్ నినాదం ‘గుణాత్మక మార్పు’ ప్రచారం గురించి తప్పుడు సమాచారం కార్యకర్తల్లోకి వెళ్లిందని, అయినా ఆశాజనక ఓట్లు దక్కవచ్చని పేర్కొన్నారు. ► 2014తో పాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. 2019 ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. దీంతో తాత్కాలిక అధినేత్రిగా సోనియా గాంధీ కొనసాగుతూ వస్తున్నారు. ► పోటీలో శశిథరూర్ ప్రథమంగా బరిలో నిలవగా.. ఆయనకు ప్రత్యర్థిగా పలువురు అభ్యర్థులు పేర్లు తెరపైకి వచ్చాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బరిలో నిలవొచ్చని అంతా అనుకున్నారు. అయితే ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం ఆ రాష్ట్ర రాజకీయంలో చిచ్చు పెట్టగా.. అధిష్టాన జోక్యంతో చల్లారింది. చివరికి.. సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో నిలిచారు. ► స్వాతంత్రం అనంతరం నుంచి ఇప్పటిదాకా దాదాపుగా గాంధీ కుటుంబం నుంచే ఎవరో ఒకరు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికవుతూ వస్తున్నారు. ఆరుసార్లు మాత్రమే ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థి నిలబడడంతో ఎన్నిక నిర్వహించారు. ఆ సమయాల్లోనూ అధిష్టాన మద్దతుతోనే అధ్యక్ష ఎన్నిక సజావుగా పూర్తైంది. ఇప్పుడు సుమారు 22 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక.. అందునా గాంధీయేతర కుటుంబం నుంచి ఎన్నిక కాబోతుండడం, తటస్థంగా ఉన్నట్లు అధిష్టానం ప్రకటించుకోవడం గమనార్హం. -
ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. 96% ఓటింగ్ నమోదు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. దేశ వ్యాప్తంగా 96 శాతం ఓటింగ్ నమోదైంది. ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్‌లోని పోలింగ్ బూత్‌లో 100 శాతం ఓటింగ్ నమోదు కాగా.. చండీగఢ్‌లోనూ 100 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ నెల 19న ఢిల్లీలోని ఏఐఐసి కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. 238 ఓట్లకు గాను 228 మంది పీసీసీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, చల్లా వెంకట్రామిరెడ్డి ఓటు వేయలేదు. ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డి ఢిల్లీలో ఓటు వేశారు. హర్కర వేణుగోపాల్ ల్లక్షద్వీప్లో ఓటేయగా.. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు బెంగళూరులో ఓటేశారు. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో.. స్వాతంత్ర అనంతరం ఆరవసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. పైగా ఈ 22 ఏళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం ప్రత్యేకతను సంతరించుకుంది. గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది పార్టీ శ్రేణుల్లో. అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్లు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌లు నిలిచిన సంగతి తెలిసిందే. ► కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్నాయి. దాదాపు 9 వేల మంది పీసీసీ డెలిగేట్స్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. మరో గంటలో ఓటింగ్ ముగియనుంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కర్ణాటకలో ఓటేశారు. ► బహిరంగంగా, ప్రజాస్వామయుతంగా, పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా పార్టీ సభ్యులందరి నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ► శశిథరూర్‌తో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. అధ్యక్ష ఎన్నిక పోలింగ్ సమయంలో తన ప్రత్యర్ధి శశి థరూర్ గురించి మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘ మేం మిత్రులం. శత్రువులు కాదు. రాజ్యాంగం ప్రకారం ఐక్య సభలో పోరాడుతున్నాం.. మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నేను థరూర్‌తో ఫోన్లో మాట్లాడను’ అని తెలిపారు. ► కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం తిలక్ భవన్లో ఓటేశారు. Maharashtra Congress chief Nana Patole casts his vote to elect the next party president at the Maharashtra Pradesh Congress Committee office in Tilak Bhavan, Mumbai pic.twitter.com/LdzkGEUGOV — ANI (@ANI) October 17, 2022 ► ఓటేసిన రాహుల్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన.. బళ్లారిలో క్యాంప్సైట్లోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఓటు వేశారు. #WATCH | Congress MP Rahul Gandhi casts his vote to elect the next party president at Bharat Jodo Yatra campsite in Ballari, Karnataka (Source: AICC) pic.twitter.com/9Jit8vIpVo — ANI (@ANI) October 17, 2022 ► ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ ఏఐసీసీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్. Chhattisgarh CM Bhupesh Baghel cast his vote to elect the new party president, at the AICC office in Raipur pic.twitter.com/hWosfBAwmf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 17, 2022 ► ఓటేసిన మాజీ ప్రధాని మన్మోహన్ దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. Delhi | Former Prime Minister Dr Manmohan Singh casts his vote to choose the new Congress president pic.twitter.com/ETSvSdHKbk — ANI (@ANI) October 17, 2022 ► ఈ క్షణాల కోసమే ఎదురు చూస్తున్నా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన ఆమె.. ‘నేను కూడా ఈ క్షణం కోసమే చాలాకాలంగా ఎదురు చూస్తున్నా’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఆమె తన తనయ ప్రియాంక గాంధీ వాద్రాతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | "I have been waiting for a long time for this thing," says Congress interim president Sonia Gandhi on the party's presidential election pic.twitter.com/9giL5DeOEX — ANI (@ANI) October 17, 2022 #WATCH | Congress interim president Sonia Gandhi & party leader Priyanka Gandhi Vadra cast their vote to elect the new party president, at the AICC office in Delhi pic.twitter.com/aErRUpRVv0 — ANI (@ANI) October 17, 2022 ► తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో పీసీసీ ప్రతినిధులు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి(తాత్కాలిక) సోనియాగాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకుంటారని సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. ► ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలు చిదంబరం, జైరామ్ రమేశ్, ఇతర నేతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. Congress presidential elections | Congress MPs P Chidambaram, Jairam Ramesh and other party leaders cast their votes at the AICC office in Delhi. pic.twitter.com/IUMhCjKdst — ANI (@ANI) October 17, 2022 ► ఇద్దరు అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఫోన్లో ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నట్లు ప్రకటించారు. I believe the revival of Congress has begun: Congress presidential candidate Shashi Tharoor Today I spoke to Mr Kharge and said whatever has happened, we remain colleagues and friends, Tharoor adds. pic.twitter.com/4gv1zR5W99 — ANI (@ANI) October 17, 2022 ► తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు ఎంపీ శశిథరూర్. ► భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న వాళ్లు.. ఓటింగ్‌లో పాల్గొనడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంగనకల్లు దగ్గర మీటింగ్ రూంలనే పోలింగ్ బూత్‌లుగా మార్చేశారు. రాహుల్ గాంధీ సహా జోడో యాత్రలో పాల్గొంటున్న వాళ్లు ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటారు. ► ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లను సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసుదన్ మిస్ట్రీ దగ్గరుండి పర్యవేక్షించారు. బుధవారం(19 అక్టోబర్) కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పేపర్లు అన్నీ కలిసిపోయి ఉంటాయి. కౌంటింగ్‌లో చెల్లని ఓట్లను పక్కన పెడతారు. ఎవరికైతే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తే వారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. కౌంటింగ్ అనంతరం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసుదన్ అధికారికంగా విజేతను ప్రకటిస్తారు. ► కాంగ్రెస్‌లో సోనియా గాంధీ కుటుంబ జోక్యంపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో.. అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తటస్థంగా ఉండాలని భావించింది. అందుకే ఇద్దరిలో ఎవరికీ బహిరంగంగా తమ మద్దతును ప్రకటించలేదు. అయితే.. ► మల్లికార్జున ఖర్గేకు కొందరు పీసీసీ చీఫ్‌లు మద్దతు ప్రకటించడం, పార్టీ బేరర్ పదవుల్లో ఉన్న కొందరు ఓటేయాలని పిలుపు ఇవ్వడం పట్ల శశిథరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అధికార సంఘానికి కొందరి తీరుపై ఫిర్యాదు కూడా చేశారు. ► సుదీర్ఘ రాజకీయ అనుభవం, సీనియర్ల అండ, దళిత మార్క్, పైగా అన్ని రాజకీయ పార్టీలతోనూ మంచి సంబంధాలు కలిగి ఉండడం.. మల్లికార్జున ఖర్గేకు కలిసొచ్చే అంశం. ► కాంగ్రెస్ యువజన వర్గాల మద్దతుతో బరిలోకి దిగారు శశిథరూర్. ► సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో మొదలైన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్‌లలో.. 9వేల మందికిపైగా పీసీసీ ప్రతినిధులు.. ఎక్కడికక్కడే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
ఖర్గే వర్సెస్ థరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్‌ల మధ్య పోటీ నెలకొంది. సోమవారం జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్ ఎలక్టోరల్ కాలేజీలోని 9 వేల మందికి పైగా పీసీసీ ప్రతినిధులు రహస్య ఓటింగ్ ద్వారా ఏఐసీసీ కొత్త చీఫ్‌ను ఎన్నుకోనున్నారు. 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ పగ్గాలను చేపట్టనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో అ«ధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది ఆరోసారి మాత్రమే. ఖర్గే ఎన్నిక లాంఛనమే! కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ఎవరికీ మద్దతివ్వకున్నా గాంధీ కుటుంబం అండదండలతో ఖర్గే బరిలో దిగారు. జీ 23 అసమ్మతి నాయకులతో పాటు ఇతర సీనియర్లూ మద్దతు ప్రకటించడంతో ఆయన గెలుపు లాంఛనంగా కన్పిస్తోంది. అయితే పార్టీలో బ్లాక్ అధ్యక్షుడి నుంచి స్వయంకృషితో ఎదిగిన దళిత నాయకుడైన మల్లికార్జున ఖర్గే (80), అపారమైన మేధస్సుతో ఐక్యరాజ్య సమితిలో పని చేసిన అనుభవంతో కొత్త ఆలోచనలు చేసే నాయర్ కమ్యూనిటీకి చెందిన శశిథరూర్ ( 66) మధ్య రసవత్తర పోటీ సాగుతుందని కొందరు యువ నాయకుల అంచనా. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో అనుభవానికి ప్రాధాన్యతనివ్వాలని సంస్థాగతంగా పార్టీ గురించి ప్రతీ అంశం తెలిసిన వారినే గెలిపించాలని ఖర్గే ప్రచారం చేశారు. పార్టీలో మార్పు కోరుకునే వారు, వికేంద్రీకరణకు మద్దతునిచ్చేవారు తనను బలపరచాలంటూ థరూర్ విజ్ఞప్తి చేశారు. పీసీసీ ప్రతినిధుల్ని కలుసుకున్న సమయంలో ఖర్గేకి అండగా సీనియర్ నాయకులు నిలబడితే, యువ నాయకులందరూ థరూర్‌కి స్వాగతం పలికిన దృశ్యాలు కనిపించాయి. ఇరువురు నేతలూ తాము గాంధీ కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామనే స్పష్టం చేస్తూ వచ్చారు. గాం«ధీ కుటుంబానికి వీర విధేయుడైన ఖర్గే వారిచ్చే సూచనలు, సలహాలు తాను తప్పక పాటిస్తానని చెబితే గాంధీ కుటుంబ సభుల్ని దూరంగా ఉంచి పార్టీ అధ్యక్షులెవరూ పని చేయలేరని పార్టీ రక్తంలో వారి డీఎన్ఏ ఉందని థరూర్ వ్యాఖ్యానించడం విశేషం. అనారోగ్య కారణాలతో సోనియాగాంధీ, అధ్యక్ష పదవిపై ఆసక్తి లేక రాహుల్‌గాంధీ పోటీకి దిగడానికి నిరాకరించడంతో ఈ సారి ఎన్నికలు అనివార్యమయ్యాయి. సోనియా, ప్రియాంక గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో, భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ బళ్లారిలోని ఓటేయనున్నారు. -
రేవంత్ రెడ్డిపై ఏఐసీసీ ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ అసహనం
-
చివరి రోజు ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై థరూర్ ట్వీట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు శశి థరూర్. తనకు ఎదురయ్యే సవాళ్ల నుంచి తానెప్పుడూ వెనక్కి తగ్గబోనని, పోటీలో చివరకు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు పార్టీలోని ఇద్దరు సహచరుల మధ్య జరుగుతున్న స్నేహపూర్వక పోటీ మాత్రమేనని పునరుద్ఘాటించారు. శశి థరూర్ నామినేషన్ ఉపసంహరణ చేసుకుంటున్నారని వస్తున్న వార్తలపై తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో ద్వారా స్పష్టత ఇచ్చారు. ‘కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు కాల్స్ రావటం ఆశ్చరానికి గురి చేసింది. వారు ఢిల్లీ అధిష్ఠానం నుంచి సమాచారం అందినట్లు చెప్పారు. అయితే.. అవన్నీ అవాస్తవం. నా జీవితంలో ఇంతవరకెప్పుడూ సవాళ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. తగ్గను కూడా. ఇది పోరాటం. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న స్నేహపూర్వక పోటీ. ఇందులో నేను చివరి వరకు పోరాడాలి. నేను పోటీలో ఉన్నా. అక్టోబర్ 17న హాజరై ఓటు వేయాలని కోరుతున్నాను. రేపటి కోసం, థరూర్ కోసం ఆలోచించండి’ - శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ నామినేషన్లకు చివరి రోజైన అక్టోబర్ 8న థరూర్ ఈ వీడియో పోస్ట్ చేయడంతో అధ్యక్ష పదవికి పోలింగ్ ఖాయమైంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి థరూర్‌తో పాటు సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో పోలింగ్ అనివార్యమైంది. అక్టోబరు 17న ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబరు 19న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో 9వేల మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడైన ఖర్గేకు ఎక్కువమంది మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. Surprised to get calls saying that “sources in Delhi” claim that I have withdrawn! I am on this race till the finish. #ThinkTomorrowThinkTharoor pic.twitter.com/zF3HZ8LtH5 — Shashi Tharoor (@ShashiTharoor) October 8, 2022 ఇదీ చదవండి: నేనేం సోనియా రిమోట్‌ను కాను -
‘గాంధీలు లేకుండా కాంగ్రెస్ పార్టీ శూన్యం’
భోపాల్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ-గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ శూన్యమని నొక్కి చెప్పారు. మరోవైపు.. వివిధ రాష్ట్రాల్లో పార్టీలో తలెత్తిన సంక్షోభంపై మాట్లాడారు. ‘చాలా సార్లు పార్టీలో చీలికలు వచ్చాయి. కానీ 99 శాతం కాంగ్రెస్ నేతలు దేశానికి స్వంతంత్రానికి ముందు, తర్వాత సేవ చేసిన కుటుంబానికి మద్దుతుగానే నిలిచారు. నెహ్రూ-గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్‌కు గుర్తింపే లేదు.’ అని పేర్కొన్నారు. రాజస్థాన్ సంక్షోభం దురదృష్టకరం.. అశోక్ గెహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటంతో రాజస్థాన్‌లో సంక్షోభం తలెత్తిన పరిస్థితులు దురదృష్టకరమన్నారు దిగ్విజయ్ సింగ్. పార్టీ అధ్యక్ష పదవికి గెహ్లోట్ పోటీ చేస్తే.. ఆయన నిర్ణయాన్ని అధిష్టానం గౌరవించేదన్నారు. ‘ఇప్పటికీ, అశోక్ గెహ్లోత్ అధికారిక అభ్యర్థిగా భావిస్తున్నాం. ఆయన పోటీలో ఉంటే దానిని స్వాగతిస్తాం. ఆయన ఎల్లప్పుడూ కాంగ్రెస్‌కు విధేయుడిగానే ఉన్నారు. కానీ, రాజస్థాన్‌లో తలెత్తిన దురదృష్టకర పరిస్థితులతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది.’ అని తెలిపారు దిగ్విజయ్ సింగ్. ఇదీ చదవండి: దిగ్విజయ్‌తో థరూర్ భేటీ.. అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు -
పొలిటికల్ ట్విస్టుల మధ్య ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో పొలిటికల్ ట్విస్టుల మధ్య ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదలైంది. కాగా, శనివారం(సెప్టెంబర్ 24) నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అయితే, అక్టోబర్ 17న ఎన్నికలు జరుగనుండగా.. 19న కౌంటింగ్ ఉండనుంది. ఇదిలా ఉండగా.. అధ్యక్ష బరిలో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఎంపీ శశిథరూర్ ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ రేసులో నేను కూడా ఉన్నానంటూ చివరి నిమిషంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సైతం ఫ్రేమ్‌లోని వచ్చారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరే పోటీ చేయాలా? నేను చేయకూడదా? అని అన్నారు. నన్నెందుకు పోటీ నుంచి తీసేస్తున్నారని ప్రశ్నించారు. నామినేషన్లకు చివరి తేదీ ఆయిన సెప్టెంబర్ 30న పోటీలో ఎవరెవరు ఉండేది తెలుస్తుందన్నారు. ఈ క్రమంలో గురువారం దిగ్విజయ్ సింగ్.. పార్టీ అధినేత్రి సోనియాను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. అంతేకాదు అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదని దిగ్విజయ్ అన్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా బరిలో ఉండవచ్చన్నారు. పోటీ చేయొద్దనుకునే వారిని బలవంతం చేయవద్దని సూచించారు. అధ్యక్షుడు కాకపోతే పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా రాహుల్ నిర్వర్తిస్తారని దిగ్విజయ్ స్పష్టం చేశారు. గాంధీలు పదవుల్లో లేనప్పుడు ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీని నడిపించిన విషయాన్ని గుర్తు చేశారు. कांग्रेस अध्यक्ष चुनाव के लिए अधिसूचना जारी ... सेंट्रल इलेक्शन ऑथोरिटी हेड मदुसूदन मिस्त्री के AICC ऑफिस में अधिसूचना की कॉपी चिपकाई गयी . pic.twitter.com/z6BemDvQFO — रंजीता झा डडवाल Ranjeeta Jha Dadwal (@ranjeetadadwal) September 22, 2022 -
Chiranjeevi: ఏపీసీసీ డెలిగేట్‌గా మెగాస్టార్ చిరంజీవి
న్యూఢిల్లీ: మెగాస్టార్ చిరంజీవిని ఏపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తింపు కార్డును జారీ చేసింది. కొవ్వూరు నుంచి చిరంజీవి పీసీసీ డెలిగేట్‌గా ఉన్నారు. 2027వరకు చిరంజీవిని పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఐడీ కార్డు మంజూరు చేసింది. ఈ డెలిగేట్లకు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. దాదాపు తొమ్మిది వేల మంది డెలిగేట్లు త్వరలో జరగబోయే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. అయితే చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా.. రాజకీయంగా ఇన్ యాక్టివ్‌గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు అక్టోబర్ 8వరకు గడువు. ఎన్నికల అనంతరం రెండు రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి: (కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు) -
అనంతపురం బీఈఎల్‌కు లైన్ క్లియర్
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రక్షణరంగ ఉత్పత్తుల తయారీ యూనిట్‌కు లైన్ క్లియర్ అయింది. శుక్రవారం ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో ఎటువంటి పెనాల్టీలు లేకుండా యూనిట్ ఏర్పాటుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. రాడార్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీ, రక్షణరంగ ఉత్పత్తుల (మిస్సైల్ మాన్యుఫాక్చరింగ్) యూనిట్ కోసం ఏపీఐఐసీ 2016లో 914 ఎకరాల భూమిని కేటాయించింది. గత ప్రభుత్వ హయాంలో అనుమతుల జాప్యం వల్ల యూనిట్ ఏర్పాటుకు అడుగులు ముందుకు పడలేదు. సకాలంలో యూనిట్ పనులు ప్రారంభించకపోవడంతో ఏపీఐఐసీ నోటీసులు జారీచేసింది. దీంతో బీఈఎల్ ప్రతినిధులు ఇటీవల ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యాన్ని కలిసి యూనిట్ ఏర్పాటుకు అన్ని అనుమతులు మంజూరు చేయాలని కోరారు. భూములు కేటాయించినా పనులు మొదలుపెట్టని మరికొన్ని కంపెనీలకు సమయం ఇస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు గోవిందరెడ్డి చెప్పారు. చదవండి: (కన్సల్టెన్సీ.. కంత్రీ.. జాబులు పేరుతో ‘టీడీపీ’ నేత దగా) రూ.50 కోట్లలోపు పెట్టుబడి ఉన్న చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా తన సొంత జిల్లా అనంతపురం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. బోర్డు సమావేశంలో ఎండీ సుబ్రమణ్యం ఏపీఐఐసీ మూడేళ్ల ప్రగతిని వివరించారు. గత మూడేళ్లలో కరోనా విపత్తు వచ్చినప్పటికీ 93 పారిశ్రామిక హబ్‌ల ఏర్పాటుకోసం రూ.1,708 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు. మే 2019 నుంచి నేటివరకు 8,616 ఎకరాల భూమిని సమీకరించినట్లు తెలిపారు. గత మూడేళ్లలో 2,450 ఎంఎస్ఎంఈలకు భూమి కేటాయించినట్లు చెప్పారు. ఆ భూముల్లో 377 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయన్నారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జరిగిన భూ కేటాయింపుల ద్వారా రూ.52,161 కోట్ల పెట్టుబడులు, 2,31,309 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయని తెలిపారు. -
కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. సోనియాకు షాకిచ్చిన ఐదుగురు ఎంపీలు!
దేశంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఇటీవల కాలంలో సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. ఇటీవలే సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి విషయంలో అధిష్టానం వైఖరిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికీ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, అక్టోబర్ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు.. ఏఐసీసీ ఎన్నికల చీఫ్ మధుసూధన్ మిస్త్రీకి లేఖ రాయడం పొలిటికల్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎంపీలు శశిథరూర్, మనీష్ తివారీ, కార్తి చిదంబరం, ప్రద్యూత్ బోర్డోలై, అబ్దుల్ ఖలీక్‌లు లేఖను రాశారు. సదరు లేఖలో పార్టీ అధ్యక్ష ఎన్నికను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఎలక్టోరల్ బాండ్లకు చెందిన అంశంపై తప్పుడు సమాచారం వెళ్లడం దురదృష్టకరమని ఎంపీలు ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీని రిలీజ్ చేయాలని ఎంపీలు తమ లేఖలో డిమాండ్ చేశారు. ఇక, సొంత పార్టీ నేతలే ఇలా లేఖ రాయడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది. Questions on fairness in election of Congress President these 5 MPs including Shashi Tharoor expressed concern written letter - India Hindi News - कांग्रेस अध्यक्ष के चुनाव में निष्पक्षता पर सवाल, शशि थरूर समेत इन 5 सांसदों ने जताई चिंता; लिखी चिट्ठी https://t.co/GwirzlVAJW — Sandeep Choudhury (@Sandeep71121431) September 10, 2022 -
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి.. ఆమె స్పందన ఇదే..
సాక్షి, నల్గొండ జిల్లా: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా తనను ఏఐసీసీ ప్రకటించడంతో పాల్వాయి స్రవంతి స్పందించారు. ఆమె ‘సాక్షి’ మీడియాతో ఫోన్లో మాట్లాడుతూ, టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం, సీనియర్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకుంటానన్నారు. సిట్టింగ్ స్థానంలో గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. కార్యకర్తలు కోరుకున్నట్లుగానే అధిష్టానం తనకు టికెట్ ఇచ్చిందన్నారు. అండగా ఉన్న ప్రతీ కార్యకార్తకి ధన్యవాదాలు తెలిపిన ఆమె.. నమ్మకాన్ని నిలబెడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులే తనను మునుగోడులో గెలిపిస్తాయన్నారు. చదవండి: రేవంత్ ఆ వైపు నిలిచినా.. పంతం నెగ్గించుకున్న సీనియర్లు కాగా, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని మునుగోడు అభ్యర్థిగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముఖుల్ వాస్నిక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు టీపీసీసీ నలుగురు అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపించింది. అందులో పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, కైలాష్ నేత, పల్లె రవి పేర్లు ఉన్నట్లు తెలిసింది. వీరిలో కాంగ్రెస్ అధిష్టానం పాల్వాయి స్రవంతి వైపే మొగ్గుచూపింది. మునుగోడు నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండటం కూడా ఆమెకు కలిసొచ్చింది. గతంలోనూ స్రవంతి అక్కడ నుంచి పోటీచేసి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించారు. -
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని ఏఐసీసీ ఖరారు చేసింది. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముఖుల్ వాస్నిక్ ప్రకటించారు. కాగా, అంతకుముందు టీపీసీసీ నలుగురు అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపించింది. అందులో పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, కైలాష్ నేత, పల్లె రవి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కాంగ్రెస్ అధిష్టానం పాల్వాయి స్రవంతి వైపే మొగ్గుచూపింది. మునుగోడు నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండటం కూడా ఆమెకు కలిసొచ్చింది. గతంలోనూ స్రవంతి అక్కడ నుంచి పోటీచేసి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించారు. చదవండి: (జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ.. ముహూర్తం ఫిక్స్!) -
భారత్ జోడో యాత్ర.. 3,570 కిలోమీటర్లు.. 12 రాష్ట్రాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ ఏడవ తేదీన శ్రీకారం చుట్టనున్న ‘భారత్ జోడో యాత్ర’ కన్యాకుమారిలో మొదలై కశ్మీర్లో పూర్తికానుంది. ఇందులోభాగంగా దేశంలోని 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా ఏకంగా 3,570 కిలోమీటర్ల పొడవునా ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగనుంది. ‘కలిసి నడుద్దాం..దేశాన్ని కలిపి ఉంచుదాం (మిలే కదమ్.. జుడే వతన్)’ నినాదంతో సుదీర్ఘంగా ఐదు నెలలపాటు ఈ ప్రజాఉద్యమం ముందుకు కొనసాగుతుంది. ఏకధృవ సామాజిక పోకడ, దేశంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు, విద్వేషాలను రూపుమాపేందుకు కాంగ్రెస్ నడుంబిగించింది. కులమతాలకతీతంగా దేశ ప్రజానీకం పాదయాత్రలో కదంతొక్కనున్నారు. పాదయాత్రగా కొనసాగే ఈ కార్యక్రమాన్ని స్వాతంత్య్రభారతంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమ స్థాయికి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పాదయాత్రను మొదలుపెట్టనున్నారు. తర్వాత తిరువనంతపురం, కొచ్చి, నీలాంబర్, మైసూరు, బళ్లారి, రాయచూర్ మీదుగా యాత్రను కొనసాగిస్తారు. షెడ్యూల్లో భాగంగా తెలంగాణలోని వికారాబాద్లోనూ యాత్ర ఉంటుంది. మహారాష్ట్రలోని నాందేడ్, తర్వాత జల్గావ్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, రాజస్తాన్‌లోని కోటా పట్టణం.. తర్వాత డౌసా, అల్వార్‌లో పాదయాత్ర ముందుకు వెళ్లనుంది. ఉత్తరభారతం విషయానికొస్తే ఉత్తరప్రదేశ్‌లోని బులందర్ షహర్, తర్వాత దేశ రాజధాని ఢిల్లీ, అంబాలా(హరియాణా)లనూ పాదయాత్ర పలకరించనుంది. జమ్మూ పట్టణం, ఆ తర్వాత చివరిగా శ్రీనగర్‌లో పాదయాత్ర పూర్తికానుంది. భౌగోళికంగా నదీజలాలు, కొండలు, అటవీప్రాంతం.. పాదయాత్ర మార్గానికి ఆటంకం కలగకూడదని అవి లేని మార్గాల్లో పాదయాత్ర రూట్‌మ్యాప్‌కు కాంగ్రెస్ నాయకులు తుదిరూపునిచ్చారు. 100 మంది ‘భారత యాత్రికులు’ పాదయాత్రలో యాత్ర తొలి నుంచి తుదికంటా 100 మంది మాత్రం కచ్చితంగా పాలుపంచుకోనున్నారు. వీరిని ‘భారత యాత్రికులు’గా పిలవనున్నారు. ఏ రాష్ట్రం గుండా అయితే భారత్ జోడో యాత్ర మార్గం లేదో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ మరో 100 మంది ‘అతిథి యాత్ర’లు చేస్తారు. పాదయాత్ర ఉన్న రాష్ట్రాల నుంచి మరో 100 మంది ‘ప్రదేశ్ యాత్రికులు’ జతకూడుతారు. అంటే ప్రతిసారి 300 మంది పాదయాత్రికులు కచ్చితంగా ఉంటారు. రోజూ దాదాపు పాతిక కిలోమీటర్ల దూరం యాత్ర ముందుకెళ్తుంది. ఇదీ చదవండి: కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ లోగో విడుదల -
అధిష్ఠానం పిలుపు.. ఢిల్లీకి వెంకట్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా లేదంటే ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మంగళవారం సాయంత్రం ఏఐసీసీ ఆఫీస్ నుంచి కోమటిరెడ్డికి ఫోన్ వచ్చింది. ఇప్పటికే ఢిల్లీలో భట్టి విక్రమార్క్, శ్రీధర్‌బాబు ఉన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాత్రం నిన్న రాత్రే హైదరాబాద్‌కు వచ్చేశారు. దీంతో వీళ్లిద్దరి సమక్షంలోనే ప్రియాంక లేదంటే ముఖ్యనేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని బుజ్జగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుజ్జగింపా? సాగనంపడమా? కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రియాంక సమక్షంలోనే ఆయన పంచాయితీ తేలనుందని కొందరు అంటుంటే.. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్‌లతో చర్చలు జరిపించే అవకాశాలు ఉన్నాయని మరో సమాచారం. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా వెంకట్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, తననూ విమర్శిస్తున్నారని, అది పార్టీకి చేటు చేస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ప్రియాంక గాంధీ వద్ద ప్రస్తావించారు. అలాంటప్పుడు ఇంకా ఉపేక్షించకుండా.. వెంకట్‌రెడ్డిని సాగనంపడమే మేలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అయితే.. సస్పెండ్ చేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సానుభూతి పెరిగి అది రాజగోపాల్‌రెడ్డికి లాభం చేకూరుస్తుందని కొందరు చెప్పినట్లుగా సమాచారం. ఎంపీ కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అంశంపై చర్చ జరగ్గా.. ప్రియాంక సహా కొందరు నేతలు తీవ్రంగా తప్పుపట్టినట్లు సమాచారం. ఇదీ చదవండి: పాస్‌పోర్టు వాడినంత మాత్రాన చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడు కాలేడు -
సోనియా గాంధీకి మళ్లీ కరోనా
ఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(75) మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంచార్జ్ జైరామ్ రమేశ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ప్రొటోకాల్ ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని జైరామ్ వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ అధికారిక ట్విటర్ పేజీ సైతం ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసింది. Congress President Smt.Sonia Gandhi has tested positive for Covid-19 today. She will remain in isolation as per Govt. protocol. आज कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी का कोविड-19 टेस्ट रिपोर्ट पॉजिटिव आया है। वह सरकार द्वारा जारी प्रोटोकॉल का पालन करते हुए आइसोलेशन में रहेंगी। — Jairam Ramesh (@Jairam_Ramesh) August 13, 2022 ఇదిలా ఉంటే జూన్‌లో ఆమె కరోనా బారినపడిన సంగతి తెలిసే ఉంటుంది. ఆ సమయంలో కరోనా కారణంగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమె ఈడీ ఎదుట హాజరు అయ్యేందుకు గడువు సైతం కోరారు. ఈలోపు కరోనాతో ఇబ్బందిపడ్డ ఆమెను గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు కూడా. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ కీలక, అగ్రనేతలు వరుసగా కొవిడ్-19 బారినపడుతున్నారు. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ హెడ్ పవన్ ఖేరా, పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ, మల్లికార్జున ఖర్గే.. ఈ వారం మొదట్లో సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ వాద్రా సైతం కరోనా బారినపడడం విశేషం. ఇదీ చదవండి: కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి -
అదంతా ఓ జ్ఞాపకం.. ఆ నలుగురి నియంతృత్వంలో దేశం: రాహుల్ ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇప్పుడు అది ఒక జ్ఞాపకమేనన్నారు. భారత్‌లో ప్రస్తుతం నియంత పాలన నడుస్తోందని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని స్వతంత్ర సంస్థలను ఆర్ఎస్ఎస్ నియంత్రిస్తోందని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది కాంగ్రెస్. దీనికి ముందు ఢిల్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ.. మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. భారత్ నలుగురు వ్యక్తుల నియంతృత్వంలో ఉందని రాహుల్ పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను చర్చించడానికి అవకాశం ఇవ్వట్లేదన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. నిబంధనలకు విరుద్దంగా నిరసనలు చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆంక్షలు విధించారు. చదవండి: జుమ్లానామిక్స్‌ను దాచలేరు.. నిర్మలవి అసత్యాలు.. -
తెలంగాణ కాంగ్రెస్‌పై ఏఐసీసీ ఫోకస్
-
తెలంగాణ కాంగ్రెస్ పై ఏఐసీసీ ఫోకస్
-
కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీ మార్పు ప్రచారంపై ఏఐసిసి రియాక్షన్
-
ఏఐసీసీ గేట్లు బద్ధలు కొట్టిన పోలీసులు!.. కాంగ్రెస్ ఆగ్రహం
ఢిల్లీ: ఢిల్లీ పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో.. కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలను ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం, ఆపై కార్యాలయంలోనే కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బుధవారం నిరసనలు కొనసాగుతున్న సమయంలో.. అక్బర్‌రోడ్డు వద్ద ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు ఢిల్లీ పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఒకానొక టైంలో ఏఐసీసీ గేట్లు బద్ధలు కొట్టి పోలీసులు కార్యాయంలోకి వచ్చి, తమ నేతలను అరెస్ట్ చేసినట్లు కాంగ్రెస్ ఆరోపణలకు దిగింది. ఈ పరిణామంపై పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తీవ్రంగా స్పందించారు. అసలు పార్టీ కార్యాలయంలోకి పోలీసులు ఎలా వస్తారని నిలదీశారు. పోలీసులు గుండాల్లా ప్రవర్తించారని మండిపడ్డారాయన. #WATCH Congress leader Sachin Pilot detained by police amid protests by party workers over the questioning of Rahul Gandhi by the Enforcement Directorate in the National Herald case#Delhi pic.twitter.com/smlKTJ62hS — ANI (@ANI) June 15, 2022 కాంగ్రెస్ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఏఐసీసీ కార్యాలయం దగ్గర చాలా మంది వ్యక్తులు పోలీసులపై బారికేడ్లు విసిరారు. కాబట్టి గొడవ జరిగి ఉండవచ్చు. అంతేగానీ పోలీసులు ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లి లాఠీఛార్జ్ చేయలేదు. పోలీసులు ఎలాంటి బలప్రయోగం చేయడం లేదు. మాతో సమన్వయం చేసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తాం అని ఎస్పీ హుడా, స్పెషల్ సీపీ (ఎల్‌అండ్‌ఓ) తెలిపారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. #WATCH | Delhi: Many people threw barricades at police near AICC office, so there might've been a scrimmage. But police didn't go inside the AICC office & use lathi charge. Police are not using any force. We will appeal to them to coordinate with us...: SP Hooda, Special CP (L&O) pic.twitter.com/umkUd7pAzz — ANI (@ANI) June 15, 2022 ఇదిలా ఉంటే.. ఏఐసీసీ కార్యాలయం వద్ద జరిగిన పరిణామంపై కాంగ్రెస్ నిరసనలకు పిలుపు ఇచ్చింది. గురువారం రాజ్భవన్ల ముట్టడికి ఏఐసీసీ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో భాగంగా.. తెలంగాణలో రాజ్‌భవన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టనున్నాయి. రాహుల్‌పై కేంద్రం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. -
మహోజ్వల భారతి: విభజనకు ఏఐసీసీ ఓకే చెప్పిన రోజు
భారతదేశానికి ఆగస్టు 15 ఎంత ప్రధానమైనదో, జూన్ 15 కూడా అదే విధంగా గుర్తుంచుకోదగ్గది. ఇండియాను విభజించేందుకు భారత జాతీయ కాంగ్రెస్ అంగీకరించిన రోజు ఇది. విభజన వాదంతో భారత్ రక్తమోడుతున్న క్షణాలలో 1947 మార్చి 22న మౌంట్‌బాటన్ భారత్‌లో అడుగుపెట్టాడు. వెంటనే నేతలతో చర్చించాడు. విభజనకి గాంధీజీ అంగీకరించలేదు. ఆ వేసవిలో నెహ్రూను సిమ్లాకు ప్రత్యేక అతిథిగా పిలిచి విభజన ప్రణాళికను ఆయన ముందుంచాడు వైస్రాయ్. నెహ్రూ మండిపడ్డాడు. తరువాత విభజన పట్ల కాస్త మెత్తబడినా మిగిలిన విషయాలకు జాతీయ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగానే ఉన్నారు. చదవండి: ఎడిటర్‌కి ఎనిమిదేళ్ల జైలు!.. రెండేళ్లకే పేపర్ మూత!! దీనితో తన వ్యక్తిగత సిబ్బందిలోని ఏకైక భారతీయుడు వీపీ మేనన్ (రాజ్యాంగ వ్యవహారాల సలహాదారు)ను కొత్త ప్రణాళిక తయారు చేయమని మౌంట్‌బాటన్ ఆదేశించాడు. ఆ ప్రణాళికను తీసుకుని మౌంట్‌బాటన్ లండన్ వెళ్లాడు. దీనిలో కీలకాంశమూ విభజనే. దీనిని ఆమోదించడానికి అట్లీ మంత్రిమండలి తీసుకున్న సమయం ఐదు నిమిషాలే! మే 31న మౌంట్‌బాటన్ భారత్ తిరిగి వచ్చాడు. మళ్లీ చర్చలు. పటేల్, రాజాజీ వంటివారు ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డారు. ఇది తక్కువ ప్రమాదకరమైన ఆలోచన అన్నారు నెహ్రూ. 1947 జూన్ 2న వైస్రాయ్ హౌస్ (నేటి రాష్ట్రపతి భవన్)లో సమావేశం. అది జరగడానికి రెండు మూడు గంటల ముందు కూడా విభజనకు జిన్నా సైతం అంగీకరించలేదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలతో పాటు అస్సాం కూడా పాకిస్తాన్లో ఉండాలని ఆయన కోరిక. మొత్తం తొమ్మిది మంది విభజన ప్రణాళిక /మౌంట్‌బాటన్ పథకానికి ఆమోదముద్ర వేశారు. విభజనతో కూడిన బదలీ గురించి జూన్ 3 న రేడియోలో మౌంట్‌బాటన్, నెహ్రూ, జిన్నా, బల్దేవ్ సింగ్ అధికారికంగా వెల్లడించారు. ఆ సాయంత్రమే బ్రిటిష్ పార్లమెంట్ దిగువ సభ ఆమోదించింది. జూన్ 15 న వాగ్వాదాల మధ్య ఏఐసీసీ కూడా అంగీకరించింది. ఆ సమయంలో అక్కడ గాంధీజీ లేరు. మౌట్ బాటన్ అభీష్టం మేరకు భారతీయ నేతలు గాంధీజీని సమావేశానికి ఆహ్వానించ లేదు. -
బల ప్రదర్శన నడుమ.. ఈడీ ముందుకు రాహుల్
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (51) సోమవారం ఢిల్లీలో హైడ్రా మా నడుమ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భారీ బలప్రదర్శనకు, నిరసనలకు దిగింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి ఉదయం 9కల్లా కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ప్రియాంకాగాంధీతో పాటు పలువురు అగ్ర నేతలతో రాహుల్ భేటీ అయ్యాక 10.30కు అంతా కలిసి ‘సత్యాగ్రహ యాత్ర’ పేరిట రెండు కిలోమీటర్ల దూరంలోని ఈడీ ఆఫీసుకు కాలినడకన బయల్దేరారు. రాహుల్‌కు సంఘీభావంగా, కేంద్రానికి, ఈడీకి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘విప్లవం వర్ధిల్లాలి’, ‘పోరాడు రాహుల్, అండగా మేమున్నాం’ అంటూ హోరెత్తిం చారు. ఈడీ, సీబీఐ తదితర కేంద్ర సంస్థలు పంజరంలో చిలకలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసులను ప్రతిఘటిస్తూ ముందుకు సాగారు. భారీ భద్రతతో కూడిన రెండు బారికేడ్లను దాటాక మూడో పాయింట్ దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్‌సింగ్, రణ్‌దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, అధీర్ రంజన్ చౌధరి, ముకుల్ వాస్నిక్, జైరాం రమేశ్, సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగేల్ సహా పలువురు నేతలతో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. నేతలను తరలిస్తున్న వాహనాలకు పైకెక్కి నిరసన తెలిపారు. అక్కడి నుంచి ప్రియాంకతో కలిసి రాహుల్ కార్లో ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. అక్క డ భారీగా బలగాలను మోహరించారు. మధ్యా హ్నం ప్రియాంక ఈడీ ఆఫీసు నుంచి బయల్దేరి అగ్ర నేతలను తరలించిన తుగ్లక్ రోడ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. తనతో పాటు పలువురు నేతలపై పోలీసులు చేయి చేసుకుని గాయపరిచారని అధీర్ ఫిర్యాదు చేశారు. రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ నేతలు, వాటికి కౌంటర్లిస్తూ బీజేపీ నాయకులు రోజంతా పోటాపోటీ ట్వీట్లు చేశారు. రాహుల్‌కు సంఘీభావంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఇదే తొలిసారి రాహుల్ ఓ కేంద్ర దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరవడం ఇదే తొలిసారి. ఈ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్‌లను కూడా ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని కూడా 23న ఈడీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విచారణ రాహుల్‌గాంధీని ఈడీ సోమవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా 10 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 11.10కు ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరైన ఆయనను మధ్యాహ్నం 2.10 దాకా ప్రశ్నించారు. లంచ్ విరామం తర్వాత 3.45 నుంచి రాత్రి 11.10 దాకా విచారణ కొనసాగింది. ముందుగా రాహుల్ న్యాయపరమైన లాంఛనాలు పూర్తి చేసి తన హాజరు నమోదు చేశారు. తర్వాత మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 50 కింద ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం నేషనల్ హెరాల్డ్, దాని ప్రస్తుత యాజమాన్య సంస్థ యంగ్ ఇండియాలపై నమోదైన పలు ఆర్థిక అవకతవకల అభియోగాలపై అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారి విచారణ జరిపారు. కాంగ్రెస్ ప్రమోట్ చేసిన యంగ్ ఇండియా వ్యవస్థాపన జరిగిన తీరు, నేషనల్ హెరాల్డ్ కార్యకలాపాలు, అంతర్గతంగా నిధుల బదిలీ, హెరాల్డ్ ప్రచురణ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు కాంగ్రెస్ ఇచ్చిన రుణం తదితరాలపై ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. మరో అధికారి స్టేట్మెంట్ను టైప్ చేసి రికార్డ్ చేశారు. డిప్యూటీ డైరెక్టర్ ర్యాంకు అధికారి పర్యవేక్షించారు. లంచ్ విరామంలో ఇంటికి వెళ్లిన రాహుల్ అక్కడి నుంచి సోదరి ప్రియాంకతో కలిసి తమ తల్లి, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ కరోనాకు చికిత్స పొందుతున్న గంగారాం ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం విచారణ కోసం 3.30 కల్లా తిరిగి ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. రాత్రి 11.10 దాకా విచారణ కొనసాగించిన అనంతరం మంగళవారం మళ్లీ విచారణకు హాజరవాలని అధికారులు ఆదేశించారు. -
కాంగ్రెస్ నేతలపై ‘కన్ను’గోలు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని ‘హస్త’గతం చేసుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రనేతల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేది కలు తెప్పించుకుంటోంది. ఇందుకోసం పార్టీ పక్షాన నియ మించిన సునీల్ కనుగోలు రిపోర్టులు తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా పార్టీ గెలిచే అవకాశాలున్న స్థానాల్లో నేతలు ప్రజల్లో ఏ మేరకు ఉంటున్నారు... పార్టీకి ఇంకా పట్టురావా ల్సిన ప్రాంతాల్లో చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటనే అంశా లను ఫోకస్ చేస్తూ సునీల్ ఈ నివేదికలు తయారు చేసి అధిష్టానానికి పంపిస్తున్నారని సమాచారం. ఈ నివేదికలు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ ద్వారా అగ్రనేత రాహుల్‌గాంధీ దృష్టికి వెళుతున్నాయని సమాచారం. ‘రచ్చబండ’పై రోజువారీ నివేదికలు రాహుల్ సమక్షంలో మే ఆరో తేదీన వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఏ మేరకు ప్రజ ల్లోకి వెళ్లిందన్న దానిపై వివరాలు సేకరిస్తోంది. ఈ డిక్లరేషన్‌ను రాష్ట్రంలోని 12 ఏళ్ల బాలుడికి కూడా అర్థమయ్యేలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ రాష్ట్ర నేతలను ఇదివరకే ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే నెలరోజులపాటు పల్లెపల్లెకు కాంగ్రెస్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రైతు రచ్చబండ కార్యక్ర మాలను నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను రైతులకు వివరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందన్న విషయాలను తెలియజేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంపై సునీల్ ప్రతిరోజు నియోజకవర్గాలవారీగా వివరాలను ఏఐసీసీకి పంపించారు. ఈ నివేదికలను పరిశీలించిన తర్వాత రైతు రచ్చబండల నిర్వహణపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారని, దీంతో ఈ నెల 21తో ముగియాల్సిన ఈ కార్యక్రమాన్ని మరో 15 రోజులు పొడిగించారని తెలిసింది. రేవంత్ వ్యాఖ్యల్లోని మర్మమూ అదే... ఏఐసీసీ ఆలోచనలకు అనుగుణంగానే శనివారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ముఖ్యనేతల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. ‘నాయకులు పనిచేయకపోతే పదవులు రావు. గాంధీభవన్ చుట్టూ తిరిగితే పదవులు రావు. గ్రామాల్లో తిరగాలి. ప్రతి గడపా తట్టాలి. పెద్ద నాయకులు బాగా పనిచేస్తుంటే, కాబోయే నేతలు ప్రజల్లో తిరగడంలేదు. ఎప్పటికప్పుడు ఏఐసీసీకి నివేదికలు వెళుతున్నాయి. ప్రజల్లో నిత్యం ఉండే నాయకులకే పదవులు వస్తాయి’అన్న రేవంత్ వ్యాఖ్యల వెనుక మర్మం కూడా ఇదేనని తెలుస్తోంది. -
కాంగ్రెస్‌లో భారీ సంస్కరణలు!
న్యూఢిల్లీ: అంతర్గతంగా బలోపేతం కావాలంటే కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ సంస్కరణలు తప్పనిసరి అని సీనియర్ నేతల్లో అత్యధికులు భావిస్తున్నారు. అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మొదలుకుని ఏఐసీసీ, పీసీసీ నుంచి బ్లాక్ స్థాయి దాకా అన్ని కమిటీల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం వారి జనాభాకు అనుగుణంగా బాగా పెరగాలని అభిప్రాయపడుతున్నారు. దాన్ని ఇప్పుడున్న 20 శాతం నుంచి కనీసం 50 శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. వచ్చే వారం రాజస్తాన్‌లో జరగనున్న కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో చర్చించాల్సిన ప్రతిపాదనల ముసాయిదాల తయారీకి ఏర్పాటైన ఏఐసీసీ ప్యానళ్లు ఇదే అభిప్రాయం వెలిబుచ్చాయి. ఈ ప్రతిపాదనలు కార్య రూపం దాల్చాలంటే ఏఐసీసీ ప్యానళ్లతో పాటు సీడబ్ల్యూసీ, చింతన్ శిబిర్ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది. చింతన్ శిబిర్ సన్నాహకాల్లో భాగంగా సోమవారం జరిగే సీడబ్ల్యూసీ భేటీలో వీటిని సమర్పించనున్నారు. పదవులనూ తగ్గించాలి ఏఐసీసీలోనూ, పీసీసీల్లోనూ అన్ని విభాగాల్లో పదవులను కనీస స్థాయికి తగ్గించాలని సంస్థాగత వ్యవహారాల కమిటీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం సంఖ్యపై గరిష్ట పరిమితి విధించాలని పేర్కొన్నట్టు చెప్తున్నారు. ‘‘ఉదాహరణకు ఏఐసీసీలో 100 మందికి పైగా కార్యదర్శులున్నారు. ఈ సంఖ్యను 30కి తగ్గిస్తే మేలు. పీసీసీల్లోనూ ఈ పరిమితిని పాటించాలి’’ అని ప్యానల్ సభ్యులు అభిప్రాయపడ్డారు. ముకుల్ వాస్నిక్ సారథ్యంలోని సంస్థాగత వ్యవహారాల కమిటీలో రమేశ్ చెన్నితాల, తారిఖ్ అన్వర్, అజయ్ మాకెన్ తదితరులున్నారు. అలాగే డీసీసీ అధ్యక్షులను ఢిల్లీ నుంచి ఏఐసీసీ స్థాయిలో నామినేట్ చేసే పోకడకు స్వస్తి పలికి పీసీసీ నాయకత్వమే నియమించుకునేలా చూడాలన్న ప్రతిపాదన కూడా ఉంది. -
పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన!
సాక్షి, న్యూఢిల్లీ: పూర్తిస్థాయిలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా ‘కాంగ్రెస్’ను ప్రక్షాళన చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉదయం నుంచి జరుగుతున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జిల భేటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు మూడు గంటలపాటు సాగిన అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్‌ఛార్జిలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశం వాడీవేడిగా సాగింది. రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి పై పలు సూచనలు, అభిప్రాయాలను అధిష్టానానికి వెల్లడించారంతా. ఈ భేటీలో సంస్థాగత నిర్మాణంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఏప్రిల్‌లో ధరల పెరుగుదలపై ఆందోళన చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఏప్రిల్ 7న రాష్ట్రాల రాజధానుల్లో నిరసనలతో పాటు థాలీ బజావో పేరిటా నిరసనలకు పిలుపు ఇచ్చింది కాంగ్రెస్. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ త్వరలో పూర్తి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ పార్టీ గడ్డు స్థితిని ఎదుర్కొంటోంది. వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలవుతూ వస్తోంది. ముఖ్యంగా తాజా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. పంజాబ్‌లో అధికారాన్ని సైతం కోల్పోయి.. అధికార రాష్ట్రాల సంఖ్యను 2కి చేర్చుకుంది. ఈ తరుణంలో.. సీనియర్ల రెబల్ గ్రూప్ జీ23 విమర్శలు ఎక్కుపెట్టడంతో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పలు రాష్ట్రాల ఇన్‌ఛార్జిల మార్పునకు పచ్చాజెండా ఊపగా.. పూర్తి మార్పులను అతి త్వరలోనే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: బీజేపీలో చేరాకే ‘కాంగ్రెస్’ పేరు మారింది!! -
తెలంగాణ కాంగ్రెస్ అసంతృప్తి నాయకుల అత్యవసర సమావేశం
-
తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం మొదలైంది. ఆ పార్టీ అసంతృప్త నేతల అత్యవసర భేటీపై హై కమాండ్ సీరియస్ అయ్యింది. సమావేశాలు పెట్టి పార్టీని ఇబ్బందుల్లో నెట్టొందని ఏఐసీసీ హెచ్చరించింది. సమావేశం రద్దు చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది. సీనియర్లకు ఫోన్ చేసిన ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు.. సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలన్నారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశం పెట్టి తీరతామని చెప్పిన సీనియర్ నేత వీహెచ్‌తో సహా అసంతృప్త నేతలంతా ఆదివారం హైదరాబాద్‌లోని హోటల్ అశోకలో భేటీ అయ్యారు. చదవండి: కేసీఆర్ మాటలు నమ్మొద్దు వీహెచ్‌పై చర్యలు! కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్)పై పార్టీ పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్ విధేయుల ఫోరం పేరుతో సమావేశమైన మరుసటి రోజున ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావును కోకాపేటలోని ఆయన నివాసంలో వీహెచ్ కలిశారనే ఆరోపణలున్నాయి. ఇరువురు రెండు గంటలకు పైగా సమావేశమయ్యారని పార్టీ నాయకత్వానికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే హరీశ్‌ను కలిసిన విషయాన్ని గోప్యంగా ఉంచడపై టీపీసీసీ క్రమశిక్షణా సంఘం వీహెచ్‌కు షోకాజ్ నోటీసులు జారీచేసింది. దీంతోపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే సిఫారసు చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే, మాజీ ఎంపీ హోదాలో వీహెచ్ సస్పెన్షన్‌పై ఏఐసీసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని వ్యతిరేకిస్తున్న అసంతృప్త నేతలంతా ఆదివారం హైదరాబాద్‌లోని హోటల్ అశోకలో భేటీ అయ్యారు. -
కాంగ్రెస్‌ను చీల్చొద్దు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఓటమి ఫలితాలపై కాంగ్రెస్‌లో ముఖ్యంగా గాంధీ కుటుంబ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక గాంధీ కుటంబ నాయకత్వం పక్కకు తప్పుకోవాల్సిందేనని జీ23 గ్రూపు నేతలు పెద్ద ఎత్తును డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం స్పందించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటమికి.. గాంధీ కుటుంబ నాయకత్వం మాత్రమే బాధ్యుల్ని చేయడం సరికాదని అన్నారు. పరాజయం బాధ్యత నుంచి ఎవరు పారిపోవడం లేదని.. ఓటమికి తాము బాధ్యత వహిస్తున్నామని గాంధీ కుటుంబం ప్రకటించిందని గుర్తుచేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ఓటమికి తానూ బాధ్యత వహిస్తున్నానని చిదంబరం తెలిపారు. అదే విధంగా మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి కూడా ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యనేతలు బాధ్యత వహిస్తున్నారని చెప్పారు. జీ 23 గ్రూప్ నేతలు తమ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేయవద్దని చిదంబరం విజ్ఞప్తి చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆగస్ట్‌లో జరిగే అవకాశం ఉందని, అప్పటివరకు సోనియా గాంధీనే నాయకత్వం వహిస్తారని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమిపై గాంధీ కుటుంటాన్ని నిందించడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘ఎవరూ బాధ్యత నుంచి పారిపోరు. బ్లాక్, జిల్లా, రాష్ట్ర AICC(ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) స్థాయిలో నాయకత్వ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఆ బాధ్యత ఉంది. ఎన్నికల ఓటమికి కేవలం ఏఐసీసీ నాయకత్వానిదే బాధ్యత అనడం సరికాదు’ అని చిదంబరం అన్నారు. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిలోకి తీసుకురావడానికి కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలని జీ23 గ్రూపు నేతల్లో ఒకరైన సీనియర్ నేత కపిల్ డిమాండ్ చేస్తున్నారు. -
ఎవరూ సుముఖంగా లేర్సార్ తీసుకోవడానికి! మళ్లీ మీరే చేపట్టాలి..!
-
రాఫెల్ కుంభకోణానికి ప్రధాని మోదీనే బాధ్యుడు
సాక్షి, హైదరాబాద్: రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్ల కుంభకోణానికి ప్రధాని నరేంద్ర మోదీనే బాధ్యుడని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. రక్షణ శాఖ కొనుగోళ్ల విషయంలో ప్రధానికి అధికారం ఉండదని, అయినా మోదీ రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల విషయంలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. పీఎంవో జోక్యం తగదంటూ రక్షణశాఖ లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. దీన్ని బట్టి ప్రధాని మోదీనే ఈ కుంభకోణానికి పూర్తి బాధ్యుడని అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన గతంలోనే పలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, గతవారం ఫ్రెంచ్ మీడియాలో వచ్చిన కథనంతో ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని నిర్ధారణ అయిందని వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019, మార్చిలో ఈడీ అధికారులు సుశేన్‌గుప్తా ఇంటిపై దాడి చేసినప్పుడు ఈ కుంభకోణానికి సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు లభించాయని, రక్షణ శాఖ వద్ద ఉండాల్సిన పత్రాలు ఆయన ఇంట్లో ఎలా దొరికాయని ప్రశ్నించారు. దేశానికి రూ.41,205 కోట్ల నష్టం రక్షణ శాఖ వద్ద ఉండాల్సిన డాక్యుమెంట్లు సుశేన్‌గుప్తా అనే దళారి ఇంట్లో ఉన్నాయంటే డసాల్ట్ కంపెనీకి, కేంద్రానికి మధ్య ఆయన పోషించిన పాత్ర ఏంటో అర్థమవుతుందని పవన్ ఖేరా అన్నారు. అప్పటి నుంచి 2021, నవంబర్ వరకు సుశేన్‌గుప్తాపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదో, రాఫెల్ కంపెనీపై సీబీఐ, ఈడీ ఎందుకు విచారణ చేయలేదో చెప్పాలని నిలదీశారు. యూపీఏ హయాంలో 126 ఎయిర్‌క్రాఫ్ట్‌లను రూ.526 కోట్ల చొప్పున కొనుగోలు చేయాలని రాఫెల్‌తో ఒప్పందం కుదిరితే, మోదీ అధికారంలోకి వచ్చాక ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్యను 36కి తగ్గించి ఒక్కో ఎయిర్‌క్రాఫ్ట్ ధరను రూ.1,670 కోట్లకు పెంచిందని, తద్వారా దేశానికి రూ.41,205 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
హుజురాబాద్ ఓటమిపై ఏఐసీసీ సమీక్ష
-
16న సీడబ్ల్యూసీ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఈనెల 15న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుందని ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు పలు విషయాలను కమిటీ చర్చిస్తుందన్నారు. మే తర్వాత సీడబ్లు్యసీ సమావేశం జరగడం ఇదే తొలిసారి. సమావేశంలో గతంలో ధిక్కార స్వరం వినిపించిన జీ23 గ్రూపు నేతలు ఎలా ప్రవర్తిస్తారని ఆసక్తి నెలకొంది. అలాగే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికపై చర్చను లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ విషయంపై జీ–23 నేతలు లేఖ రాయడం ద్వారా సంచలనం సృష్టించారు. తాజాగా గ్రూపులోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీ నాయకత్వంపై మాటల దాడి చేశారు. పారీ్టలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారని, లేఖ రాసి ఒక సంవత్సరం గడిచినప్పటికీ, అధ్యక్ష ఎన్నిక కోసం చేసిన డిమాండ్ నెరవేరలేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో పరిణామాలు, అంతర్గత కలహాలు, ఉత్తర్‌ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ ఘటన సహా ఇతర రాజకీయ పరిణామాలపై సమావేశంలో విస్తృత చర్చలు జరగవచ్చని అంచనా. -
TS: ‘కోర్’ స్థానంలో పీఏసీ
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరో కొత్త కమిటీ ఏర్పాటయ్యింది. గతంలో ఉన్న టీపీసీసీ కోర్ కమిటీ స్థానంలో రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)ని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి షబ్బీర్ అలీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కె.జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జీవన్‌రెడ్డి, రేణుకాచౌదరి, పి.బలరాం నాయక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి. శ్రీధర్‌బాబు, పొడెం వీరయ్య, అనసూయ (సీతక్క), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతో కూడిన ఈ కమిటీ తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటనలో తెలిపారు. కన్వీనర్ నియామకంపై చర్చ కమిటీ కూర్పులో తేడా కనిపించకపోయినా ఉన్నట్టుండి అధిష్టానం నుంచి ప్రకటన రావడం, ఈ కమిటీలో కొత్తగా కన్వీనర్ హోదా కల్పించడంపై గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఉండే కోర్ కమిటీల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి చైర్మన్‌గా, టీపీసీసీ అధ్యక్షుడితో పాటు ఇతరులు సభ్యులుగా ఉండేవారు. కానీ, తాజాగా నియమించిన పీఏసీకి కొత్తగా కన్వీనర్‌ను నియమించి ఆ బాధ్యతలను మొదటి నుంచీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలుస్తోన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీకి అప్పగించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కన్వీనర్ హోదాలో షబ్బీర్ అలీ ఏం చేస్తారనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్య నేతలకు ఉపశమనం ఈ కమిటీ ఏర్పాటు ద్వారా కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ అధిష్టానం మరో సంకేతాన్ని కూడా పంపిందన్నది రాజకీయ వర్గాల భావనగా కనిపిస్తోంది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక పార్టీ వ్యవహారాల్లో గతంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల చరిష్మా కొంత మేర తగ్గిందని, అయితే తాజా కమిటీలో ముఖ్యులందరికీ స్థానం కల్పించడంతో ఆయా శిబిరాల్లో కొత్త జోష్ వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు సీనియర్లకు కూడా పార్టీ ప్రాధాన్యత ఇస్తోందనే సంకేతాలను అధిష్టానం దీనిద్వారా పంపిందని అంటున్నారు. గతంలో కోర్ కమిటీలో ఉన్నట్టే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు, ఇన్చార్జి కార్యదర్శులు, ఏఐసీసీ ప్రకటించిన ఇతర కమిటీల చైర్మన్లకు తాజా కమిటీలో సైతం ప్రాతినిధ్యం లభించడంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో అసలు ఆట మొదలయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నేడు కాంగ్రెస్ ‘పెట్రో’ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు. ఆయా కేంద్రాల్లో సైకిల్, ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించాలని ఈనెల 8న జరిగిన టీపీసీసీ నూతన కార్యవర్గం తొలిసమావేశంలో నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిర్మల్‌లో సైకిల్, ఎడ్లబండ్ల ర్యాలీల్లో పాల్గొని అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాగా, ఆదివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క నేతృత్వంలో పలువురు వికలాంగులు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో ఆయనను కలసి టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపికయినందుకు శుభాకాంక్షలు తెలిపారు. -
‘సోనియా భిక్షతోనే కేసీఆర్, కేటీఆర్ అధికారం అనుభవిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తామని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియా భిక్షతోనే కేసీఆర్, కేటీఆర్ అధికారం అనుభవిస్తున్నారని, చరిత్ర మరిచేపోయి మాట్లాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. రేవంత్ టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతే కాంగ్రెస్‌లో చేరారని, సంతలో కొన్నట్లు నాయకులను కొనేవాళ్లా కాంగ్రెస్ గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు రేవంత్ రాష్ట్ర అధ్యక్షులయ్యారు.. కేటీఆర్ కేవలం ప్రాంతీయ పార్టీకే వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కల్వకుంట్ల డబ్బు సంచులకు అమ్ముడుపోయిన 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుదారులను వదిలిపెట్టమని ఆయన అన్నారు. -
టీపీసీసీ: అసంతృప్త నేతలకు బుజ్జగింపులు లేవు
సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీ కొత్త సారథి, కార్యవర్గం ప్రకటన తర్వాత జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం నిశితంగా దృష్టి సారించింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకంపై పార్టీలో నెలకొన్న అసంతృప్తి, నాయకుల అలకల విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు సమాచారం. కొత్త కమిటీ ఏర్పాటుపై అసంతృప్తితో ఉన్న నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని బుజ్జగించే ఉద్దేశం పార్టీ పెద్దల్లో లేదని తెలిసింది. పార్టీ అధినేత్రి తీసుకున్న నిర్ణయానికి ప్రతీ ఒక్క నాయకుడూ కట్టుబడి ఉండాల్సిందేనన్న ధోరణిలో హైకమాండ్ ఉందని ఏఐసీసీ కీలక నేత ఒకరు తెలిపారు. కొద్దిరోజుల్లో అన్నీ సర్దుకుంటాయని, రాష్ట్రంలో కొత్త నాయకత్వం పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటుందని భావిస్తోందని పేర్కొన్నారు. అందరినీ కలుపుకొనేలా.. అసమ్మతి, అసంతృప్తి, విమర్శల విషయంలో అందరు నేతలను కలుపుకొనిపోవాల్సిన బాధ్యత, అవసరం పార్టీ నూతన అధ్యక్షు డిగా రేవంత్‌రెడ్డికి ఉంటుందనే విషయాన్ని పార్టీ హైకమాండ్ ఇప్ప టికే స్పష్టం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే రేవంత్‌రెడ్డి తనకు వ్యతిరేకంగా అధిష్టానానికి లేఖ రాసిన సీనియర్ నేత వీహెచ్‌ను ఆస్పత్రికి వెళ్ల పరామర్శించారు. స్వయంగా సీనియర్ నేతల ఇళ్లకు వెళ్లి వారిని కలుస్తున్నారు. ఇక పాదయాత్ర వంటి కీలక అంశాల విషయంలో సీనియర్లు, కీలక నాయకులతో తొలుత చర్చించాలని, తర్వాత అధిష్టానం అనుమతి తీసుకుని బహిరంగ ప్రకటన చేయాలని రేవంత్‌రెడ్డికి సూచించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. భట్టి ఢిల్లీ పర్యటనపై చర్చ... కొత్త పీసీసీ ఏర్పాటైన రెండు మూడు రోజులకే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఢిల్లీకి రావడం, పార్టీ పెద్దలతో సుదీర్ఘంగా భేటీ కావడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిసిన నేపథ్యంలో.. వివరణ కోరేందుకే భట్టిని హైకమాండ్ పిలిపించిందన్న ప్రచారాన్ని ఏఐసీసీ కీలక నేత ఒకరు తోసిపుచ్చారు. కొత్త పీసీసీ ప్రకటన తర్వాత పార్టీకి సంబంధించిన పలు అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు భట్టి ఢిల్లీ వచ్చారని పేర్కొన్నారు. ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. భట్టి విక్ర మార్క గురువారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శు లు బోసురాజు, శ్రీనివాసన్‌లతో భేటీ అయ్యారు. పార్టీలో ప్రస్తుత పరిస్థితులు, పలువురు నాయకుల అసంతృప్తి, పదవుల విష యంలో భిన్నాభిప్రాయాల వంటి అంశాలపై చర్చించారు. సీఎంను కలవడం తప్పేం కాదు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం సీఎంను కలవడంలో తప్పేమీ లేదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో జరిగే ప్రతీచిన్న విషయంపై ఏఐసీసీ స్థాయి నుంచి అబ్జర్వేషన్ ఉండదని, రాష్ట్ర నాయకులు ఎవరిని కలవాలి, ఎవరిని కలవకూడదనేది హైకమాండ్ సూచించదని అంటున్నాయి. భట్టి విషయంలో ఎలాంటి బుజ్జగింపులు, మందలింపులు వంటివేమీ జరగలేదని, సీఎల్పీ నేత హోదాలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు, వ్యూహాలపైనే పార్టీ పెద్దలు చర్చించారని పేర్కొంటున్నాయి. -
నేను పీసీసీ రేసులో లేను: శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: ‘‘నేను పీసీసీ రేసులో లేను.. ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్న అంగీకారమే.. దానికి కట్టుబడి ఉంటాను’’ అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల ఎకరాల భూమిని అమ్మాలని చూస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన జీవో 13 ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆస్తులను కాపాడుకునేందుకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం నాలుగు లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళింది. ఉమ్మడి రాష్ట్రంలో భూములు అమ్మ లేదా అని హరీష్ రావు అంటున్నారు. ఆనాడు ఆస్తులు అమ్మతుంటే వద్దని మేము ఆనాటి ముఖ్యమంత్రి కి చెప్పాము. జిల్లాలో భూముల్ని అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని’’ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. ‘‘ఆరున్నర సంవత్సరాలుగా అనేక పనులు కూడా ప్రజావ్యతిరేకంగానే ఉన్నాయి. ఇప్పుడు అమ్మే భూములు ఎవరికి ఏ ప్రాంతానికి అమ్ముతారు. ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగానేతరులకు భూములు అమ్మే ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ హయాంలో వేల ఎకరాలు పేదలకు పంచాం. పొడు భూములు కూడా పంపిణీ చేశాం. మన భూములను మన తెలంగాణ రాష్ట్ర సమితి అమ్మే ప్రయత్నం చేస్తోంది.. మిమ్మల్ని ఏ విదంగా వెల్లగొట్టాలని ప్రజలు ఆలోచిస్తున్నారు’’ అంటూ శ్రీధర్ బాబు మండిపడ్డారు. చదవండి: కాంగ్రెస్‌లో వీహెచ్ వ్యాఖ్యల దుమారం -
ఎన్నికల పద్ధతిలో కాంగ్రెస్‌కు కొత్త చీఫ్!
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా ఎదురుదెబ్బలు తింటూ, క్షేత్రస్థాయిలో పట్టుకోల్పోతున్న పార్టీని గాడిలో పెట్టేందుకు నూతన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకోసం ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వచ్చే వారం సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహించిన రాహుల్ గాంధీ 2019 జూలైలో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. రాహుల్ రాజీనామా తర్వాత 2019 ఆగస్టు నుంచి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడి ఎంపిక, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం తదితరాలపై ఇటీవల కాలంలో పార్టీలోని పలువురు సీనియర్లు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే సమూల మార్పు జరగాల్సిందే అంటూ 23 మంది నాయకులు సోనియా గాంధీకి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీలోని అట్టడుగు స్థాయి నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వరకు అన్ని స్థాయిల్లో నాయకులను మార్చాలంటూ వీరు డిమాండ్ చేశారు. ఎన్నిక ద్వారానే ఎంపిక పార్టీలో నెలకొన్న అసంతృప్తికి చెక్ పెట్టేందుకు జీ–23 లోని పలువురు కీలక నాయకులతో పాటు, పార్టీ సీనియర్లు కొందరితో గత డిసెంబర్లో సోనియాగాంధీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. సమావేశంలో కొందరు నాయకులు రాహుల్ గాంధీనే పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరారు. అయితే పార్టీ అధ్యక్ష ఎంపికను ఎన్నికల ద్వారా నిర్వహించాలని రాహుల్ గాంధీ, సోనియాగాంధీ నాయకులకు సూచించారు. ఈ క్రమంలో వచ్చేవారం మరోసారి సీనియర్లతో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ భేటీ అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఏఐసీసీ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై ఒక నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయని నాయకులు పేర్కొన్నారు. ఒకవేళ రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకపోతే, ఆ స్థానంలో ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపైన కూడా చర్చలు జరుతాయని పార్టీ వర్గాలు వివరించాయి. ఇప్పటికే ఏఐసీసీ సభ్యులకు సంబంధించిన ఐడీకార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
ఏఐసీసీ కొత్త కమిటీలో ఉత్తమ్‌కు చోటు
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సంస్మరణ ఉత్సవాల నిర్వహణ కోసం ఏఐసీసీ నియమించిన కమిటీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చోటు దక్కింది. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం 10 మంది నేతలతో కమిటీ వేసినట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ మంగళవారం జారీ చేసిన ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. రక్షణ, విదేశాంగ అనుభవం ఉన్న, సరిహద్దు ప్రాంత నేతలకు కమిటీలో చోటు కల్పించారు. ఏకే ఆంటోనీ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో ఉత్తమ్‌తో పాటు మీరాకుమార్, కెప్టెన్ అమరీందర్‌సింగ్, పృథ్వీరాజ్ చౌహాన్, జితేంద్ర సింగ్, కిరణ్ చౌదరి, మేజర్ వేద్‌ప్రకాశ్, శర్మిష్టా ముఖర్జీలకు చోటు లభించింది. కమిటీ కన్వీనర్‌గా కెప్టెన్ ప్రవీణ్ దావర్‌ను నియమించారు. జగ్గారెడ్డి దీక్ష రద్దు: ఎల్ఆర్ఎస్ రద్దు కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించ తలపెట్టిన ఒక రోజు దీక్ష రద్దయింది. పాత పద్ధతిలోనే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న స్థలాలు, నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు చేయాలని మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తన దీక్షను రద్దు చేసుకున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ‘పంట కొనుగోళ్ల’ పోరు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు పండించే పంటలను కొనే కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ అంశంపై రైతులతో కలసి ఉద్యమించాలని టీపీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సుంకేట అన్వేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పార్టీ నేతలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు మంగళవారం గాంధీభవన్‌లో సమావేశమై చర్చించారు. పంట కొనుగోలు కేంద్రాల ఎత్తివేతను వ్యతిరేకిస్తూ రైతులతో కలసి పోరాటం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. చదవండి: (పల్లెల్లో పంట కొనుగోలు కుదరదు!) బుధవారం నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వాలని, జనవరి 11న జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేయాలని, 18న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి ఉద్యమం నిర్వహించాలని తీర్మానించారు. అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. ఒకట్రెండు రోజుల్లో ఇదే అంశంపై అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో కలసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసిన కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తే కాంగ్రెస్ పార్టీ సహించబోదని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులతో కలసి ఉద్యమాలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన సీఎం కేసీఆర్ అక్కడి బీజేపీ పెద్దలతో సయోధ్య కుదుర్చుకున్నారని, అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. వ్యవస్థలను కూల్చే పనిలో టీఆర్ఎస్..: భట్టి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన వ్యవస్థలను కూల్చే పనిలో టీఆర్ఎస్ ఉందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం పాలన చేయాలి కానీ.. లాభాల కోసం ప్రభుత్వాలను నడపరని, లాభాల కోసం ఆలోచిస్తే ప్రజాస్వామ్యయుతంగా పాలించినట్టు కాదని కేసీఆర్‌కు హితవు పలికారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ధర్నాల పేరిట టీఆర్ఎస్ వేసుకున్న ముసుగు తొలగిపోయిందని, ఢిల్లీకి మోకరిల్లి ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు వారి పతనానికి ప్రారంభాలని టి.జీవన్‌రెడ్డి అన్నారు. -
పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీకి లేఖను పంపించారు. కాగా గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపిన ఉత్తమ్.. గతంలోనే ఏఐసీసీకి లేఖ రాశానని, ఆమోదించాలని కోరారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. చదవండి: హస్తం ఖేల్‌ఖతం.. మరోసారి సింగిల్ డిజిట్! ఇదిలా ఉండగా గత కొద్ది కాలంగా ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడంపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి అనంతరం ఈ ఒత్తిడి మరింత ఎక్కువైంది. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కేవలం 2 డివిజన్లలో(ఉప్పల్, ఏఎస్ రావు నగర్) మాత్రమే విజయం సాధించడంతో ఓటమికి భాద్యత వహిస్తూ ఉత్తమ్ రాజీనామా చేశారు. చదవండి: 2023లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం: బండి సంజయ్ -
రాహుల్ గాంధీ పునరాగమనం!
సాక్షి, న్యూఢిల్లీ : ‘అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సాధ్యమైనంత త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. వేదిక, తేదీలు ఖరారుకాగానే మీకు సమాచారం అందజేస్తాం’ అని దేశంలోని అన్ని పార్టీ శాఖలకు ఇటీవల రాసిన లేఖలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బృందానికి సారథ్యం వహిస్తోన్న మధుసూదన్ మిస్త్రీ తెలియజేశారు. పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో పార్టీ జాతీయ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే సమావేశం గురించి మిస్త్రీ ప్రస్తావించారు. సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ పార్టీ ఉపాధ్యక్ష, అధ్యక్ష పదవుల్లో కొనసాగినప్పుడే రెండు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పరాజయాన్ని ఎదుర్కొంది. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడిగా 2019 పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగినప్పుడు సొంత నియోజకవర్గంలో కూడా ఓటమిని చవిచూడాల్సి రావడంతో రాహుల్ ఉద్దేశపూర్వకంగానే పార్టీ నాయకత్వం బాధ్యతలను వదిలేసి ప్రవాసం వెళ్లారు. పర్యవసానంగా సోనియా తాత్కాలిక ప్రాతిపదికపై పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. (నితీష్ కుమార్‌కు ఆర్జేడీ ఆఫర్) పార్టీ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే రాహుల్ గాంధీ పునరాగమనం తథ్యమని తెలుస్తోంది. 1998 నుంచి ఇదే జరగుతోంది. 1998 నుంచి 2017 వరకు పార్టీ అధ్యక్షులుగా సోనియా గాంధీ, 2017 నుంచి 2019 వరకు రాహుల్ గాంధీ, 2019–2020 వరకు తాత్కాలిక అధ్యక్షులుగా సోనియా గాంధీ కొనసాగగా, 2021లో మళ్లీ పార్టీ సారథ్య బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం స్క్రిప్టు ప్రకారం నడవడం లేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నాయకత్వంలోని మహా కూటమి విజయావకాశాలు కాస్త కాంగ్రెస్ వల్ల దెబ్బతిన్నాయన్న అపఖ్యాతి వచ్చింది. పార్టీ నుంచి ముస్లిం ఓట్లను ఏఐఎంఐఎం తన్నుకు పోయిందంటూ ఆ పార్టీ మీద పార్టీ విమర్శలు సంధించింది. ఆ తర్వాత తాను బలంగా ఉన్న మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల ఉప అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ పనితీరు పట్ల పార్టీకి చెందిన 23 మంది నాయకులు బాహటంగానే పార్టీ వ్యవహారాలను విమర్శిస్తున్నారు. పార్టీకి పూర్తి స్థాయి నాయకుడు అవసరమని చెబుతున్నారు. అవకాశం దొరికితే పీ. చిదంబరం, కపిల్ సిబాల్, వివేక్ తన్ఖా తదితరులు పార్టీ పదవికి పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు. -
పీసీసీ చీఫ్ మార్పు గురించి చెప్పలేను
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ మార్పు వంటి అంశాల గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ.. ‘మా లక్ష్యం మిషన్-2023. మోదీ, కేసీఆర్ విధానాలపై పోరాడతాం. సిస్టమేటిక్ టీం వర్క్‌తో ముందుకు వెళతాం. తెలంగాణలో సమర్థులైన నాయకులు ఉన్నారు. పార్టీ నిర్ణయాలను ప్రతి నాయకుడు పాటించాలి. దేశంలోని ప్రతి గవర్నర్ మేము ఇచ్చిన వినతి పత్రాలు తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ మాత్రం వినతి పత్రం తెలుసుకోలేదు. గవర్నర్ కార్యాలయంలో అపాయింట్మెంట్ కోరాం.. ఇవ్వలేదు. కోవిడ్ ఒక్క తెలంగాణలోనే లేదు. వినతిపత్రం మెయిల్ చేయమని చెప్పారు. కార్యకర్తల, నేతల మధ్య ఐక్యత కీలకం’ అన్నారు. (చదవండి: 2023లో అధికారమే లక్ష్యం ) దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం మొదలు పెట్టాయి. దీనిపై మాణిక్యం ఠాగూర్ స్పందిస్తూ.. కుందేలు- తాబేలు కథలో.. చివరకు ఏం జరిగింది అనేది అందరికి తెలుసు అన్నారు. తెలంగాణ నేతలను ఇండియన్ క్రికెట్ టీంతో పొల్చారు. కాంగ్రెస్‌లో గ్రూపులపై స్పందిస్తూ.. ఐక్యతతో 2023 లో గెలుస్తామని స్పష్టం చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కోదండరామ్‌కి మద్దతుపై కోర్ కమిటిలో చర్చించాం అన్నారు. దాని సూచన మేరకు తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఇక పీసీసీ చీఫ్ మార్పు గురించి తానేమి చెప్పలేనన్నారు మాణిక్యం ఠాగూర్. -
ఐక్యత, క్రమశిక్షణతోనే విజయం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ మరోసారి జూమ్ మీటింగ్‌లో రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇన్చార్జిగా నియమితులైన తర్వాత రెండోసారి శనివారం ఆయన పార్టీ నాయకులతో జూమ్ యాప్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు, లోక్‌సభ అభ్యర్థులు, మాజీ మంత్రులు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాణిక్యం మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పార్టీ నాయకులు పనిచేయాలని సూచించారు. నేతల మధ్య ఐక్యత, క్రమశిక్షణే విజయసోపానాలని వ్యాఖ్యానించారు. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం నియోజకవర్గ కేంద్రీకృత విధానాన్ని అవలంబించాలని, రాష్ట్రంలో ఉన్న 34,360 పోలింగ్ బూత్‌లలో ప్రతి బూత్‌లో పార్టీకి మెజార్టీ వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ‘మనం ఆటకు దూరంగా లేము. సరైన అవగాహనతో పోరాడాలి. నాయకులందరి మధ్య నిరంతర సమన్వయం ఉండాలి. కేడర్‌ను గాడిలో పెట్టడం ద్వారా, వారికి క్రమశిక్షణ అలవర్చడం ద్వారా విజయం సాధించాలి’అని పిలుపునిచ్చారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనే భేదాలు లేవని, అవసరమైనప్పుడు సీనియర్ల సలహాలు తీసుకోవడం చాలా విలువైనదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ముఖ్య నేతలను మరోమారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మాణిక్యంకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, తెలంగాణలో ఏ వర్గం సంతృప్తిగా లేదని, సంపద అంతా ఒకే కుటుంబం వైపు పోగుపడుతోందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, రాష్ట్ర మాజీ మంత్రులు జె.గీతారెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, ఎస్.చంద్రశేఖర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, టీపీసీసీ ముఖ్య నేతలు మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్, ఫిరోజ్‌ఖాన్, మదన్ మోహన్, గడ్డం వినోద్ తదితరులు పాల్గొన్నారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై చర్చించారు. పలువురు నాయకులు ఎన్నికల కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. -
సోనియా గాంధీ రాజీనామా
-
ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : సోనియా గాంధీ అన్నంత పని చేశారు. గత కొన్ని రోజులు వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఆమె రాజీనామా చేశారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియా గాంధీ తన నిర్ణయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగలేనని, బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని సీడబ్ల్యూసీ భేటీలో ఆమె స్పష్టం చేశారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు ఆమె సూచించారు. (చదవండి : కొనసాగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం) సోనియా రాజీనామాను సభ్యులకు కేసీ వేణుగోపాల్ చదివి వినిపించారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల్లో సోనియా గాంధీ కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగే ఆసక్తి తనకు లేదని సోనియా గాంధీ సీడబ్లూసీ సభ్యులకు స్పష్టం చేశారు. ఈ పదవికి మరొకరిని ఎన్నుకోవాలని ఆమె సూచించారు.దీంతో పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపీక కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు చర్చలు జరుపుతున్నారు. (చదవండి : కాంగ్రెస్ పార్టీలో విభేదాలు!) మరోవైపు కాంగ్రెస్‌లో సమూల మార్పులు చేయాలని కోరుతూ 23 మంది నేతలు పార్టీ నాయకత్వానికి లేఖ రాయడంపై రాహుల్ గాంధీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాంటి లేఖ రాయడానికి ఇది సరైన సమయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సోనియాగాంధీ ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఈ రకమైన లేఖను ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ సంక్షోభం సమంలో లేఖలు రాయడం సరికాదన్నారు. సోనియా అధ్యక్ష పదవిలో కొనసాగాలన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్ల లేఖ వెనుక బీజేపీ హస్తం ఉందని రాహుల్ అనుమానం వ్యక్తం చేశారు. -
రైతుల నోట్లో మట్టికొడుతున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ అధికార పీఠం పదిలం చేసుకోవడం కోసమే రైతుబంధు పేరిట రైతులను ముంచుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికలొచ్చినప్పుడల్లా ఓట్లు దండుకోవడం కోసం టీఆర్ఎస్ జిమ్మిక్కుల పథకాలు రూపొందిస్తుందని, రైతుల ఓట్ల కోసం రైతుబంధు పథకాన్ని సృష్టించారని విమర్శించారు. రైతాంగాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి సీఎంకి ఉంటే ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ ఏడాది వర్షాకాలానికి 5వ విడత 59 లక్షల 30 వేల మంది రైతులుంటే కేవలం 50 లక్షల 84 వేల మందికి రైతుబంధు డబ్బులను చెల్లించి మిగతా 8 లక్షల 46 వేల మంది రైతుల నోట్లో మట్టి ఎందుకు కొట్టిందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడతలో 5 లక్షల 43 వేలు, 3వ విడతలో 5 లక్షల 21 వేలు, 4వ విడతలో 17 లక్షల 80 వేలు, 5వ విడతలో 8 లక్షల 46 వేలు కలిపి మొత్తం 36 లక్షల 90 వేల మంది రైతులకు డబ్బులు చెల్లించలేదని లెక్కలు చెప్పారు. ఈ ఏడాది 5వ విడత రైతుబంధు కింద రూ.7 వేల కోట్లు అవసరమైతే, కేవలం 5,294 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. -
‘కేటీఆర్‌కు వాళ్ల సమస్య కనిపించడం లేదా’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా గోస పడుతున్నారని తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. కంది రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారని దుయ్యబట్టారు. కంది రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని సూచించారు. టమాటా పండించిన రైతు పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లో కంది కొనుగోలుకు పరిమితులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. కంది కొనుగోళ్లలో పరిమితులు ఎత్తేయాలని, టమాటాకు మద్దతు ధర కల్పించాలని కోరారు. (ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన ఐఏఎస్ అధికారిణి) అదే విధంగా గిట్టుబాటు ధరను కల్పించడంలో, విత్తన సబ్సిడీ కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చే వ్యవసాయ పనిముట్ల సబ్సిడీని సైతం కేసీఆర్ సర్కార్ ఎత్తేసిందని మండిపడ్డారు. వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ అంటే కేసీఆర్ సర్కార్ కు గుర్తుకొచ్చేది కేవలం ట్రాక్టర్లు మాత్రమేనని, ట్రాక్టర్లు ఇస్తే కమీషన్లు వస్తాయనే వాటిపైనే దృష్టి పెడుతున్నారని విమర్శించారు. రైతు సమస్యలపై ట్విట్టర్ లోనైనా స్పందిస్తాడో ఏమోనని ట్విట్ చేసినా పట్టించుకోలేదన్నారు. ఈటెల రాజేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి కోసం చికెన్ కొనుగోళ్లు పడిపోకుండా స్పందించిన కేటీఆర్‌కు రైతు సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. (జనరల్ మేనేజర్‌పై పగబట్టిన మేనేజర్ ) -
ఆ కమిటీల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ఆఫీస్ బేరర్స్, డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ శుక్రవారం ప్రకటించింది. 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శుల పేర్లను ఖరారు చేసింది. 29 మందితో కోఆర్డినేషన్ కమిటీ, 12 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసింది. 18 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజకీయ వ్యవహారాలు, సమన్వయ కమిటీల్లో స్థానం కల్పించారు. రాజకీయ వ్యవహారాల కమిటీకి చైర్మన్‌గా పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వ్యవహరిస్తారు. సమన్వయ కమిటీకి ఊమెన్ చాందీ చైర్మన్‌గా ఉంటారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ చైర్మన్లు ఎక్స్అఫిషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డికి కూడా ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కింది. మొత్తంగా చూస్తే మహిళలకు తగిన ప్రాధాన్యం లభించలేదు. (చదవండి: వచ్చే నెలలో రాయపాటి ఆస్తుల వేలం) డిసీసీ అధ్యక్షులు వీరే 1. శ్రీకాకుళం: బొడ్డెపల్లి సత్యవతి 2. విజయనగరం: సారగడ్డ రమేశ్‌కుమార్ 3. అనకాపల్లి: శ్రీరామమూర్తి 4. కాకినాడ(రూరల్): డాక్టర్ పాండురంగారావు 5. అమలాపురం: కొట్టూరి శ్రీనివాస్ 6. రాజమండ్రి(రూరల్): ఎన్వీ శ్రీనివాస్ 7. నరసాపురం: మారినేడి శేఖర్ (బాబ్జి) 8. ఏలూరు (రూరల్): జెట్టి గురునాథం 9. మచిలీపట్నం: లామ్ తానియా కుమారి 10. విజయవాడ(రూరల్): కిరణ్ బొర్రా 11. నర్సరావుపేట: జి. అలెగ్జాండర్ సుధాకర్ 12. ఒంగోలు (రూరల్): ఈదా సుధాకరరెడ్డి 13. నంద్యాల: లక్ష్మీనరసింహరెడ్డి 14. కర్నూలు(రూరల్): అహ్మద్ అలీఖాన్ 15. అనంతపురం(రూరల్): ఎస్. ప్రతాపరెడ్డి 16. హిందూపురం: కె. సుధాకర్ (మాజీ ఎమ్మెల్యే) 17. నెల్లూరు (రూరల్): దేవకుమార్‌రెడ్డి 18. చిత్తూరు: డాక్టర్ సురేశ్‌బాబు -
‘జార్ఖండ్ ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు’
సాక్షి, హైదరాబాద్ : జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు బీజేపీ విధానాలకు చెంపపెట్టు అని ఏఐసీసీ కార్యర్శి సంపత్ విమర్శించారు. జార్ఖండ్ ఫలితాల సందర్భంగా గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఇప్పటికే బీజేపీ అయిదు రాష్ట్రాల్లో ఓడిపోయిందని, దేశంలో బీజేపీ లేకుండా పోయే రోజులు రాబోతున్నాయి అభిప్రాయపడ్డారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు. వార్డుల విభజన అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారని, వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని విమర్శించారు. అన్నివర్గాల ప్రజలు అధికారపార్టీకి దూరం అయ్యారన్నారు. అభ్యర్థుల ఎంపిక స్థానిక నాయకత్వానిదేనని, అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. (జార్ఖండ్ ఫలితాలపై స్పందించిన చిదంబరం) సంబంధిత వార్తలు : సాదాసీదా సొరెన్.. భార్యతో కాబోయే సీఎం! జార్ఖండ్‌లో నూతన శకం: సోరేన్ -
కాంగ్రెస్ ఎన్నికల వ్యయం ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఖర్చు వివరాలు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. అందులోని వివరాల ప్రకారం ఆ పార్టీకి రూ. 856 కోట్లను సమీకరించగా, అందులో రూ. 820.9 కోట్లు ఖర్చయినట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ట్రెజరర్ అహ్మద్ పటేల్ సంతకం చేసిన పత్రాలను ఈసీకి అందించారు. ఇందులో ఎన్నికల వ్యవహారాల కోసం రూ. 626.36 కోట్లు ఖర్చు చేయగా, రూ. 194 కోట్లు అభ్యర్థుల కోసం ఖర్చు చేసినట్లు తెలిపింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం తమ దగ్గర మొత్తం రూ. 315.88 కోట్లు మిగిలినట్లు తెలిపింది. ఇందులో రూ. 265 కోట్లు బ్యాంకులో ఉండగా, రూ. 50 కోట్లు చేతిలో ఉన్నట్లు తెలిపింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ రూ. 516 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు బీజేపీ రూ. 714 కోట్లు ఖర్చుచేయగా 2019 వివరాలు వెల్లడించాల్సి ఉంది. (చదవండి: ‘గాంధీ’లకు ఎస్పీజీ భద్రత తొలగింపు) -
ఉపఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రంలో అక్టోబర్ 21న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. వట్టియూర్కావు, కొన్ని, ఆల్‌రూర్, ఎర్నాకుళం, మంజేశ్వరమ్ స్థానాలలో ఉపఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నాలుగు స్థానాలలో తమ అభ్యర్థులను ప్రకటించగా మిత్రపక్షం యూనియన్ ముస్లిం లీగ్ ఓ స్థానంలో పోటీ చేయనుంది. టీజీ వినోద్, (ఎర్నాకుళం), ఏడీవీ శానిమోల్ ఉస్మాన్, (ఆరూర్), పి.మోహన్ రాజ్న్,(కొన్ని) (వట్టియూర్కావు) నుంచి కె.మోహన్ కుమార్ బరిలో ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం పార్టీ అభ్యర్థుల జాబితాను ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు. గత వారం కేరళలోని పాలా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షమైన యూనైటెడ్ డెమోక్రెటిక్ ఫ్రంట్ సాంప్రదాయక ఓటు బ్యాంకును కోల్పోవడం యూడీఎఫ్‌ను కలవరపరుస్తోంది. ఈ ప్రభావం త్వరలో జరిగే ఉపఎన్నికలపై పడుతుందేమోనని ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌లోని ముఖ్య నేతల మధ్య అంతర్గత విభేదాలు ఏ మేరకు విజయావకాశాలను దెబ్బతీస్తాయోనని పార్టీ నాయకులు మదనపడుతున్నారు. -
యూరియా కష్టాలు ఎవరి పాపం?
గత నెల రోజులుగా తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పంటలకు డోకా లేదు, ఈ ఫసలు గట్టెక్కుతం అనుకున్న రైతన్నలను ఈ ఖరీఫ్ సీజన్లో ’యూరియా’ కొరత తీవ్రంగా బాధపెడుతోంది. రైతులు ఆధార్ కార్డులు చేతబట్టి, డీ.సీ.ఎం.ఎస్.ల ముందు వారం రోజుల పాటు తిరిగితే తప్ప యూరియా బస్తాలు దొరకడం లేదు. పగలు– రాత్రి అని తేడా లేకుండా వంతుల వారిగా రైతులు క్యూలో నిలబడుతున్నారు. పంట పొలాల్లో ఉండాల్సిన రైతన్నలు తిండితిప్పలు మానేసి యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు వదులుతున్నారు. అసలు రైతులకు ఇన్ని బాధలు ఎందుకు? ఈ పరిస్థితికి రావటానికి కారణం ఎవరు? ఈ యూరియా కొరత పాపం ఎవరిది? యూరియా మన రాష్ట్రంలో తయారీ కాదు. మహారాష్ట్ర, బిహార్ లాంటి పక్క రాష్ట్రాల మీద ఆదారపడాల్సిందే. సీజన్ ప్రారంభంలోనే అంచనా వేసిన మొత్తం ఎరువులను మన రాష్ట్రానికి తెచ్చి, మార్కుఫెడ్ గోదాములలో నిల్వచేసుంటే రైతులకు ఈ కష్టాలు వచ్చేవి కాదు. వర్షాలు కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతూనే పంటలు పచ్చగా కావాలంటే రైతులు యూరియా మందు వేయాల్సిన పరిస్థితి. అసలే ఇక్కడ మన రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతుంటే, మన రాష్ట్రానికి రావాల్సిన యూరియాను నాలుగు రోజులపాటు పక్క రాష్ట్రం కర్ణాటకకు మళ్ళిం చారు. రైతులు వేసే అడుగు మందుల ద్వారా మొక్కజొన్న కర్రలకు, పత్తి చెట్లకు పూర్తి బలం చేకూర్చాలంటే తేమ అధికంగా ఉన్నపుడే యూరియా వేయవలిసి ఉంటుంది. కాలం పోతే (వానలు ఆగిపోతే) పదును లేకపోతే, ఆరుగాలం చేసిన కష్టం మట్టిలో కల్సిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి, ఖరీఫ్ సీజన్ ప్రారంభించడానికి ముందే, ఈ సీజన్లో ఎంత యూరియా అవసరం పడుతుందనే లెక్కలు అంచనా వేసి, దానికనుగుణంగా యూరియా నిల్వ సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ, రాష్ట్ర వ్యవసాయ మంత్రి, అధికారులు ఏ ముందస్తు చర్యలూ చేపట్టలేదు. దీంతో కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, జగిత్యాల జిల్లాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. యూరియా బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధర రూ. 267. కానీ, యూరియా కొరతను సాకుగా చూపి కొన్ని ప్రాంతాల్లో పెర్టిలైజర్ దుకాణాదారులు ఒక్కొక్క యూరియా బస్తా మీద రూ. 50 పెంచి అమ్ముతున్నారు. మొన్న దుబ్బాక మండల కేంద్రంలో యూరియా కోసం క్యూలో నిలబడి, అలసిపోయి ఎల్లయ్య అనే రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. సీఎం సొంత ఇలాకాలో ఎరువుల కొరత ఒక రైతు ప్రాణం తీసింది. వ్యవసాయ మంత్రి రైతుల కష్టాలను హేళన చేస్తూ వెకిలిగా, అసంబద్ధంగా మాట్లాడారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరో వారం రోజుల్లో పత్తి, మొక్కజొన్న పంటలు పూతకు వస్తున్నాయి. ఇప్పుడు వాటికి సకాలంలో యూరియా అందించకపోతే పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. తరువాత రాబోయే వారం, పది దినాల్లో వరి పొలాలకు యూరియా ఎక్కువ అవసరం. కనీసం ఇప్పటికైనా, ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి, యుద్ధ ప్రాతిపదికన ఎరువులు తెప్పించి, రైతులకు అందుబాటులో ఉంచి, పంటలను కాపాడాలి. వ్యాసకర్త: కొనగాల మహేష్, ఏఐసీసీ సభ్యులు మొబైల్ : 98667 76999 -
అజ్ఞాతం వీడిన చిదంబరం
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ గత 24 గంటలుగా అజ్ఞాతంలో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం బుధవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. చిదంబరం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి రావడంతో అక్కడ హైడ్రామా నెలకొంది. ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తాను నిందితుడిని కాదని, చార్జిషీట్లో తన పేరుకూడా లేదని ఆయన చెప్పారు. తనకూ, తన కుమారుడికి ఈ కేసులో సంబంధం ఉందని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ఐఎన్ఎక్స్ కేసులో తన కుటుంబానికి ఎలాంటి సంబంధంలేదని, ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా లేదని చెప్పుకొచ్చారు. నిన్న రాత్రంతా తాను తన న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతూ గడిపానని చెప్పారు. మరోవైపు చిదంబరం కోసం గాలిస్తున్న సీబీఐ అధికారులు కాంగ్రెస్ కార్యాలయానికి బయలుదేరారు. కాగా, అరెస్ట్ నుంచి తక్షణ ఉపశమనం కల్పించాల్సిందిగా ఆయన చేసుకున్న అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. చిదంబరం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ శుశ్రవారం విచారణకు రానుంది. చిదంబరం అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం చేసిన క్రమంలో గడిచిన 24 గంటల నుంచీ ఆయన అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇక 2007లో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు సమకూరడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) ఆమోదముద్ర వేయడంలో అప్పటి ఆర్థిక మంత్రిగా నిబంధనలకు విరుద్ధంగా పచ్చజెండా ఊపారని చిదంబరం అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ నిధుల రాకకు ఎఫ్ఐపీబీ ఆమోదం లభించడం వెనుక అవకతవకలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. -
బీసీలు, ముస్లింలకు సగం టికెట్లు
సాక్షి, సంగారెడ్డి: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లు కాకుండా బీసీలు, ముస్లింలకు ప్రత్యేకంగా 50 శాతం సీట్లు కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాలతో కాంగ్రెస్ ఏకీభవిస్తోందని, ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన టీపీసీసీ పురపాలక ఎన్నికల రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. ఈ భేటీ అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై టీఆర్ఎస్ విధానాన్ని తప్పుపడుతూ ఈ నెల 23న అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండాలని, ఈ నెల 26న అన్ని మున్సిపాలిటీల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో అన్ని మున్సిపాలిటీలలో స్థానిక నేతల ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ కాంగ్రెస్–వాడవాడనా జెండా‘నినాదంతో పార్టీ శ్రేణులు ముందుకు కదలాలన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందని ఉత్తమ్ పునరుద్ఘాటించారు. కౌన్సిలర్ లేదా కార్పొరేటర్‌గా గెలిచాక చైర్మన్, వైస్‌చైర్మన్, కో–ఆప్టెడ్ సభ్యులకు ఓటు వేసే విషయంలో పార్టీ విప్ ధిక్కరించనని, గెలిచాక పార్టీ వీడనని అభ్యర్థులు అఫిడవిట్లో స్పష్టం చేయాలన్నారు. ప్రస్తుతం ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టిన తనకు పార్లమెంటు భవనం కంటే తెలంగాణ అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలే బాగున్నట్లు అనిపించిందన్నారు. వీఆర్వో వ్యవస్థలో లోపాలను ప్రభుత్వం మెరుగుపరచాలే కానీ రద్దు చేయాలనుకోవడం తగదన్నారు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే... అంతకుముందు జరిగిన సన్నాహక సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఇచ్చి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు పగటి కలలు కంటున్నారని, అది ఎన్నటికీ నెరవేరదని ఎద్దేవా చేశారు. కొత్త మున్సిపల్ చట్టం లో ప్రత్యక్ష పద్ధతిలో చైర్మన్‌ను ఎన్నుకుంటే బాగుండేదన్నారు. కౌన్సిలర్లు, చైర్మన్లను తొలగించే అధికారం కలెక్టర్లకు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు: కుంతియా మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుస్తామని ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి. కుంతియా ధీమా వ్యక్తం చేశారు. గెలిచే వారిని గుర్తించి టికెట్లు కేటాయించాలని ఆయన సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి తక్కువ సీట్లు వచ్చినా ఓట్ల శాతం మాత్రం పెరిగిందన్నారు. ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తూ కొత్త మున్సిపల్ చట్టంలో కలెక్టర్లకు సంపూర్ణ అధికారాలు కట్టబెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపçహాస్యం చేయడమేనని సీఎల్పీనేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టడం విచారకరమన్నారు. శాసనసభలో మందిబలం ఉందని సీఎం కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు చట్టాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల సీట్ల కేటాయింపులో ముస్లింలు, యువతకు ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సూచించారు. పట్టణాల్లో వ్యతిరేకత ఉంది... మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా ఎదుర్కోవాలని టీపీసీసీ రాష్ట్ర స్థాయి సమావేశంలో నేతలు నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, దాన్ని సొమ్ము చేసుకోవడానికి మున్సిపల్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్లేలా కసరత్తు చేయాలని తీర్మానించారు. ఒకరిద్దరు జిల్లా అధ్యక్షులు పార్టీ నేతల వైఖరి మార్చుకోవాలని సూచించినట్టు తెలిసింది. ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, పోడెం వీరయ్య, ఇతర ముఖ్య నేతలు హాజరు కానప్పటికీ వారంతా వ్యక్తిగత పనుల వల్లే రాలేదని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. సమావేశంలో పార్టీ నేతలు సంపత్‌కుమార్, వంశీధర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పద్మావతి, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, గీతారెడ్డి, నాగం తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటిని మెదక్‌కు ఎప్పుడు తెస్తారో ?
సాక్షి, మెదక్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీటిని మెదక్‌కు ఎప్పుడు తెస్తారో.. టీఆర్ఎస్ నాయకులు చెప్పాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ డిమాండ్ చేశారు. మరో 20ఏళ్లు గడిచినా ఆ నీరు మెదక్‌కు వచ్చే ప్రసక్తి లేదన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో 70శాతం సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నయమంటూ కొందరు నాయకులు చంకలు గుద్దుకుంటున్నారని, మొన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కనీసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు కూడా పోటీ చేయలేనివారు.. టీఆర్ఎస్కు ప్రత్యామ్నయం ఎలా అవుతుందన్నారు. కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌పార్టీకి ఘనమైన చరిత్ర ఉందని, చిరంజీవిలా ఎప్పుడూ వికసిస్తూనే ఉంటుందననారు. మెదక్‌జిల్లాకు ఇందిరమ్మ పేరు పెట్టాలని కోరడం జరిగిందన్నారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల వల్ల కుదురలేదన్నారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి..డబ్బులు సంపాదించి నేడు పార్టీలు మారుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పేర్కొన్నారు. శనివారం మెదక్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక క్రిస్టల్ గార్డెన్స్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోసురాజు మాట్లాడుతూ పార్టీ మారిన నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లో చేరే విధంగా పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఇందుకోసం జిల్లా మండల, నియోజకవర్గ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల బీఫాంల విషయంలో పీసీసీ, ఏఐసీసీ తలదూర్చదని తెలిపారు డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన విధంగా కాంగ్రెస్‌లో అనేక పదవులు అనుభవించి, నేడు పార్టీ మారినవారు నీతిమాలిన వారన్నారు. కానీ నాయకులు మాత్రమే పార్టీలు మారుతున్నారు తప్ప..కార్యకర్తలు కాదన్నారు. పార్టీలో ఎలాంటి గ్రూప్‌లు లేవని, అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లా నుంచి అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఇతర జిల్లాలకు తరలిపోయాయని, ప్రస్తుతం మహిళా డిగ్రీ కళాశాల సైతం తరలిస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. అదే జరిగితే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఐదేళ్లుగా మెదక్‌లో రోడ్డు పనులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. సింగూర్ జలాలను ఎలాంటి జీఓ లేకుండా కేటీఆర్ నియోజకవర్గంలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు తరలించి ఈ ప్రాంత రైతుల నోట్లో మట్టి కొట్టారని విమర్షించారు. తాము అధికారంలోకి రాగానే ఎన్డీఎస్ఎల్ను స్వాధీనం చేసుకుంటామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరి మ్యాడం బాలకృష్ణ, నాయకులు మామిళ్ల ఆంజనేయులు, మధుసూదన్‌రావు, పోతరాజు రమణ, ఆవుల గోపాల్‌రెడ్డి, లక్ష్మి, కిష్టయ్య తదితరులు ఉన్నారు.