కాంగ్రెస్‌లో పెరుగుతున్న డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పుంజుకోవడంలో.. అటు కూటమి పక్షాల విజయంలో తనవంతు పాత్ర పోషించిన ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల్లో ఆయన పనితీరుపై అన్ని పక్షాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టి, పార్లమెంటులో ముందుండి పార్టీని నడిపించాలనే డిమాండ్‌లు క్రమంగా ఊపందుకుంటున్నాయి.
ఇండియా కూటమిలోని చిన్నాచితకా పార్టీల నేతలు ఆయన ఎంపికను సమరి్ధస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి 2014లో కాంగ్రెస్ 48, 2019 ఎన్నికల్లో 52 స్థానాలు గెలుచుకున్న సమయంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ సమయంలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్‌గాంధీని కొనసాగించాలనే డిమాండ్‌లు వచి్చనా ఆయన నిరాకరించారు. అయితే ప్రస్తుతం పారీ్టకి సొంతంగా 99 సీట్లు వచ్చాయి.
లోక్‌సభలో 10 శాతం సీట్లు అంటే కనీసంగా 55 సీట్లు వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రస్తుతం ఆ స్థానాలు గెలిచినందున ఆ హోదాలో రాహుల్‌గాంధీ ఉండాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఆయన ప్రస్తుత ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి భారీ మెజారీ్టలతో గెలవడంతో పాటు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడులో కూటమి పక్షాలకు మెజార్టీ స్థానాలు దక్కడంలో కీలకపాత్ర పోషించారు.
ఈ దృష్ట్యానే పార్టీ నేతలు ఆయన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాణిక్యం ఠాగూర్ ‘ఎక్స్’లో స్పందిస్తూ ‘నేను మా నాయకుడు రాహుల్ గాంధీ పేరు మీద ఓట్లు అడిగాను. ఆయన లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడిగా ఉండాలని భావిస్తున్నాను. ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు కూడా అలాగే ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను’ అని పోస్ట్ చేశారు. మరో సీనియర్ నేత డీకే శివకుమార్ సైతం రాహుల్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటారని జోస్యం చెప్పారు.
ఒకవేళ రాహుల్ కాదన్న పక్షంలో సీనియర్ నేతలైన శశిథరూర్, గౌరవ్ గొగోయ్, మనీశ్ తివారీ, కేసీ వేణుగోపాల్‌లలో ఒకరిని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేస్తారని చెబుతున్నారు. దీనిపై 8న జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత నిర్ణయం చేస్తారని అంటున్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సీడబ్యూసీ భేటీ జరగనుంది. ఇక రాహుల్ గెలిచిన రెండు స్థానాల్లో దేనిలో కొనసాగుతారు, దేనిని వదులుకుంటారన్న దానిపై ఇదే భేటీలో కొంత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment