main opposition leader
-
ప్రతిపక్ష నేతగా రాహుల్!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పుంజుకోవడంలో.. అటు కూటమి పక్షాల విజయంలో తనవంతు పాత్ర పోషించిన ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల్లో ఆయన పనితీరుపై అన్ని పక్షాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టి, పార్లమెంటులో ముందుండి పార్టీని నడిపించాలనే డిమాండ్లు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇండియా కూటమిలోని చిన్నాచితకా పార్టీల నేతలు ఆయన ఎంపికను సమరి్ధస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి 2014లో కాంగ్రెస్ 48, 2019 ఎన్నికల్లో 52 స్థానాలు గెలుచుకున్న సమయంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ సమయంలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్‌గాంధీని కొనసాగించాలనే డిమాండ్లు వచి్చనా ఆయన నిరాకరించారు. అయితే ప్రస్తుతం పారీ్టకి సొంతంగా 99 సీట్లు వచ్చాయి. లోక్‌సభలో 10 శాతం సీట్లు అంటే కనీసంగా 55 సీట్లు వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రస్తుతం ఆ స్థానాలు గెలిచినందున ఆ హోదాలో రాహుల్‌గాంధీ ఉండాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఆయన ప్రస్తుత ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి భారీ మెజారీ్టలతో గెలవడంతో పాటు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడులో కూటమి పక్షాలకు మెజార్టీ స్థానాలు దక్కడంలో కీలకపాత్ర పోషించారు. ఈ దృష్ట్యానే పార్టీ నేతలు ఆయన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాణిక్యం ఠాగూర్ ‘ఎక్స్’లో స్పందిస్తూ ‘నేను మా నాయకుడు రాహుల్ గాంధీ పేరు మీద ఓట్లు అడిగాను. ఆయన లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడిగా ఉండాలని భావిస్తున్నాను. ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు కూడా అలాగే ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను’ అని పోస్ట్ చేశారు. మరో సీనియర్ నేత డీకే శివకుమార్ సైతం రాహుల్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటారని జోస్యం చెప్పారు. ఒకవేళ రాహుల్ కాదన్న పక్షంలో సీనియర్ నేతలైన శశిథరూర్, గౌరవ్ గొగోయ్, మనీశ్ తివారీ, కేసీ వేణుగోపాల్‌లలో ఒకరిని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేస్తారని చెబుతున్నారు. దీనిపై 8న జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత నిర్ణయం చేస్తారని అంటున్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సీడబ్యూసీ భేటీ జరగనుంది. ఇక రాహుల్ గెలిచిన రెండు స్థానాల్లో దేనిలో కొనసాగుతారు, దేనిని వదులుకుంటారన్న దానిపై ఇదే భేటీలో కొంత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. -
కరుణా.. స్టాలినా?
సాక్షి, చెన్నై : ప్రధాన ప్రతిపక్ష నేత కుర్చీలో కూర్చోనున్నది డీఎంకే అధినేత కరుణానిధా లేదా దళపతి ఎంకే స్టాలినా అన్న ప్రశ్న బయలు దేరింది. మెజారిటీ శాతం మంది స్టాలిన్ అంటున్నా, ఈ సారి కరుణానిధి అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం మంగళవారం తేలనుంది. ఆ రోజున డీఎంకే ఎమ్మెల్యేలు, పార్టీ వర్గాలతో సమాలోచనా సమావేశానికి కరుణానిధి పిలుపునిచ్చారు. రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా బలమైన ప్రతిపక్షం అధికార పక్షానికి ఎదురుగా కూర్చోబోతున్నది. అధికార అన్నాడీఎంకే పక్షాన్ని ఢీకొట్టేందుకు తగ్గ బలంతో ప్రధాన ప్రతి పక్షంగా డీఎంకే అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇది వరకు పరిమిత సంఖ్యలో సభ్యుల్ని కల్గిన డీఎంకే ఈ సారి తమ గళం గంభీరంగా ఉంటుందని, ప్రధాన ప్రతిపక్షం అంటే ఏమిటో చూపిస్తామన్న వ్యాఖ్యలు చేస్తుండడంతో ఇక, అసెంబ్లీలో ప్రతిరోజూ సమరమేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ సమరంలో అధికార పక్షానికి నేతృత్వం వహించేందుకు సీఎం జయలలిత సిద్ధమయ్యారు. ఇక, ప్రధాన ప్రతిపక్షానికి నేతృత్వం వహించే నేత డీఎంకేలో ఎవరన్న ప్రశ్న బయలు దేరింది. 2011లో కరుణానిధి అసెంబ్లీకి ఎన్నికైనా సమావేశ మందిరంలో మాత్రం అడుగు పెట్టలేదు. తాను కూర్చునేందుకు తగ్గ వసతి కల్పిస్తే, సభకు వస్తానని ఆయన వ్యాఖ్యలు చేసినా లేఖలు పంపినా పాలకులు మాత్రం పట్టించుకోలేదు. ఇందుకు కారణం డీఎంకే సభ్యులు సభలో పరిమితంగా ఉండడమే. అయితే, ఈసారి ఎక్కువ సంఖ్యలో సభ్యులతో డీఎంకే ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న దృష్ట్యా, కేబినెట్ హోదా కల్గిన ప్రధాన ప్రతిపక్ష నేతకు సౌకర్యాల్ని కల్పించాల్సిన అవసరం తప్పనిసరి. ఈ దృష్ట్యా, కరుణానిధి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారా.. అన్న ప్రశ్న బయలుదేరింది. కరుణానిధి ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగు పెట్టిన పక్షంలో ఆయనకు కావాల్సిన వసతులు కల్పించాల్సిందే. ఇందులోనూ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అనుసరించిన పక్షంలో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ప్రధాన ప్రతిపక్ష నేతగా తన సేనలతో కలిసి అధికార పక్షాన్ని ఢీకొట్టడం ఖాయం. ఒక వేళ ప్రధాన ప్రతిపక్ష నేతగా కరుణానిధి ఉంటే, డీఎంకే శాసన సభా పక్ష ఉప నేతగా స్టాలిన్ వ్యవహరించేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందుకు తగ్గ నిర్ణయాలు మంగళవారం అధికార పూర్వకంగా వెలువడనున్నది. పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లాల కార్యదర్శులు, సర్వ సభ్య సభ్యులతో మంగళవారం సమావేశానికి కరుణానిధి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రధాన ప్రతి పక్ష నేతను, శాసన సభా పక్ష ఉప నేత, పార్టీ విప్‌లను ఎంపిక చేయనున్నారు. శుభాకాంక్షల..ఆశీస్సులు : ప్రధాన ప్రతి పక్ష నేత ఎంపిక కసరత్తులు ఓ వైపు సాగుతుంటే, మరో వైపు రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ తరఫున టీకేఎస్ ఇళంగోవన్, ఆర్ఎస్ భారతీల పేర్లను అధికార పూర్వకంగా కరుణానిధి ప్రకటించారు. తమకు అవకాశం కల్పించడంతో ఆ అభ్యర్థులు ఆదివారం గోపాలపురంలో కరుణానిధి ఆశీస్సులు అందుకున్నారు. ఈసందర్భంగా చిరునవ్వులు చిందిస్తూ కరుణానిధి ఫొటోకు ఫోజు ఇవ్వడం విశేషం. తదుపరి మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కరుణానిధి వేర్వేరుగా లేఖలు రాశారు. ఇందులో పశ్చిమ బెంగాళ్ సీఎం మమత బెనర్జీ, కేరళ సీఎం. పినరాయ్ విజయన్, అసోం సీఎం సర్బంధ సోనోవాల్ ఉన్నారు. వారికి తన శుభాకాం క్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరునల్వేలి జిల్లా కడయనల్లూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యుడు అబూబక్కర్, ఆ పార్టీ నేత ఖాదర్ మొహిద్దీన్ కరుణానిధిని కలుసుకున్నారు. అనంతరం కరుణానిధి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఎన్నికల యంత్రాంగం తీరుపై అనుమానాల్ని వ్యక్తం చేశారు. తమ బాధ్యత పెరిగిందని, బాధ్యత గల ప్రతిపక్షంగా అసెంబ్లీలో వ్యవహరిస్తామని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, తనకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు డీఎంకే దళపతి స్టాలిన్ నిర్ణయించారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి కృతజ్ఞతలు తెలుపుకోనున్నారు. ఓటమి చవిచూసిన డీఎంకే కార్యదర్శులు, జిల్లాలో ఓటమికి బాధ్యత వహిస్తూ మరికొందరు పార్టీ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డట్టుంది. ఇందుకు అద్దం పట్టే రీతిలో తిరుప్పూర్ ఉత్తరం జిల్లా కార్యదర్శి సెల్వరాజ్ పదవికి రాజీనామా చేశారు. -
ఎల్‌వోపీపై నిర్ణయాన్ని సమర్థించుకున్న స్పీకర్
ఇండోర్: లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత (ఎల్వోపీ) హోదాను కాంగ్రెస్‌కు కట్టబెట్టేందుకు నిరాకరించడాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ మరోసారి సమర్థించుకున్నారు. నిబంధనలు, గత సంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించినట్టు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో తనకు వ్యతిరేకంగా ఏమీ వ్యాఖ్యానించలేదన్నారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత(ఎల్వోపీ) హోదాకు భాష్యం చెప్పాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన నేపథ్యంలో.. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడిన స్పీకర్ పైవిధంగా స్పందించారు. ‘‘ప్రస్తుతం లోక్‌సభలో ఏ ఒక్క ప్రతిపక్షం కూడా 55కుపైగా స్థానాలు సాధించలేదు. సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పొందాలంటే.. సదరు పార్టీకి మొత్తం లోక్‌సభ స్థానాల్లో కనీసం పది శాతం సీట్లు వచ్చి ఉండాలన్నది నిబంధన. ఇదే నిబంధన ఇప్పటికీ కొనసాగుతోంది. ఇందులో ఎలాంటి మార్పూ జరగలేదు’’ అని ఆమె అన్నారు. -
ప్రధాన ప్రతిపక్ష హోదా మాకే దక్కాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా తమకు సహజంగానే దక్కాలని కాంగ్రెస్ అభిప్రాయపడింది. దీనికి భిన్నంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది నియంతృత్వ పోకడ కిందకు వస్తుందని, అది దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొం ది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభలో ప్రధా న ప్రతిపక్ష నేత ఎంపికపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పైవిధంగా స్పందించింది. ఈ అంశంపై పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. అధికార పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీకిగానీ, కూటమి ని సాధారణంగానే ప్రధాన ప్రతిపక్షంగా పరిగణిస్తారని, ఆ ప్రకారం తమకే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సజావుగా నడవాలన్నా.. పలు విభాగాల అధిపతుల నియామకం సక్రమంగా జరగాలన్నా ప్రధాన ప్రతి పక్ష నేత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నా రు.లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం స్థానాల్లో పది శాతం(55 సీట్లు) దక్కాలి. అయితే ప్రస్తుత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో ప్రధాన ప్రతిపక్ష నేత ఎం పికపై లోక్‌సభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.