ప్రధాన ప్రతిపక్ష హోదా మాకే దక్కాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా తమకు సహజంగానే దక్కాలని కాంగ్రెస్ అభిప్రాయపడింది. దీనికి భిన్నంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది నియంతృత్వ పోకడ కిందకు వస్తుందని, అది దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొం ది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభలో ప్రధా న ప్రతిపక్ష నేత ఎంపికపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పైవిధంగా స్పందించింది. ఈ అంశంపై పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. అధికార పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీకిగానీ, కూటమి ని సాధారణంగానే ప్రధాన ప్రతిపక్షంగా పరిగణిస్తారని, ఆ ప్రకారం తమకే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందన్నారు.
ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సజావుగా నడవాలన్నా.. పలు విభాగాల అధిపతుల నియామకం సక్రమంగా జరగాలన్నా ప్రధాన ప్రతి పక్ష నేత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నా రు.లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం స్థానాల్లో పది శాతం(55 సీట్లు) దక్కాలి. అయితే ప్రస్తుత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో ప్రధాన ప్రతిపక్ష నేత ఎం పికపై లోక్‌సభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.