budget meetings
-
రేపు ఉభయసభల్లో వార్షిక బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్నాయి. 25న శాసనసభ, శాసనమండలిలో 2024.25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన శాసనసభ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం ప్రకటించిన అనంతరం వాయిదా పడింది. ఆ తర్వాత స్పీకర్ చాంబర్లో జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తోపాటు ప్రభుత్వ విప్‌లు లక్ష్మణ్‌కుమార్, రామచంద్రునాయక్ హాజరయ్యారు. విపక్షం నుంచి బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ అసెంబ్లీలో తాము చర్చించదలిచిన అంశాల జాబితాను అందజేశాయి. పక్షంరోజులు సభ నిర్వహించాలని బీఆర్ఎస్, కనీసం 18 రోజులు సమావేశాలు జరగాలని బీజేపీ కోరాయి. అయితే గతంలో బడ్జెట్ జరిగిన సమావేశాల తీరుతెన్నులను వివరిస్తూ ఈ నెల 31 వరకు సభ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసినా, ఈ నెల 31 వరకు సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రోజూవారీ ఎజెండాపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్, బీజేపీ కోరాయి. అయితే ఎజెండాపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని ప్రభుత్వ పక్షం ప్రకటించింది. మొదట తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై తీర్మానం బీఏసీలో నిర్ణయించిన మేరకు బుధవారం ఉద యం 10 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై తీర్మానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై చర్చించి కేంద్రానికి తీర్మానం పంపుతారు. అనంతరం రుణమాపీ అంశంపైనా స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశముంది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాల బస్సుల ఫిట్నెస్, గ్రామపంచాయతీలుగా తండాలు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి డి.శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నెల 26న అసెంబ్లీకి విరామం ప్రకటించి.. తిరిగి 27న బడ్జెట్‌పై చర్చ ప్రారంభమవుతుంది. 28న సమావేశాలకు విరామం ప్రకటించి తిరిగి 29 నుంచి 31వ తేదీ వరకు మూడు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ కొనసాగుతుంది. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడుతుంది. కాగా శాసనమండలిలోనూ మంగళవారం చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన మండలి బీఏసీ సమావేశం జరిగింది. -
బడ్జెట్ సమావేశాల్లో జాబ్ కేలండర్: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లలో ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణలో జాప్యంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇకపై అలా జరగకుండా యూపీఎస్సీ తరహాలో ఏటా ప్రణాళికాబద్ధంగా కేలండర్ తేదీల ప్రకారం ఉద్యోగ నియామకాలు జరుపుతామని చెప్పారు. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ కేలండర్‌ను ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల నుంచి ప్రతి ఖాళీని మార్చి 31లోగా తెప్పించుకుని జూన్ 2లోగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని అన్నారు. ఎన్ని ఖాళీలున్నా డిసెంబర్ 9 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. శనివారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రం నుంచి ఏటా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్‌కు ఎంపికయ్యే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల్లో అర్హులకు సింగరేణి సంస్థ రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుంది. అభ్యర్థులు సింగరేణి సంస్థ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రారంభ కార్యక్రమంలో 2023 సివిల్స్ విజేతలు, 2024లో మెయిన్స్ రాసే అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. నిరుద్యోగుల బాధ నా కళ్లతో చూశా.. ‘రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల సమస్యలను పరిష్కరించడమే మా ప్రభుత్వ తొలి పాధాన్యత. మా ప్రభుత్వం బాధ్యతలను స్వీకరించిన తర్వాత 90 రోజుల్లోగా 30 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసింది. దీనిని బట్టి మా ప్రభుత్వ ప్రాధాన్యతను నిరుద్యోగ యువత అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో ఏ నోటిఫికేషన్ పరీక్షలు కూడా నిర్దేశిత సమయానికి జరగలేదు. ఉజ్వల భవిష్యత్తు ఆలోచనలతో యువత అమీర్‌పేట్, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లలోని కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటే సంవత్సరాల తరబడి పరీక్షలు వాయిదా పడ్డాయి. తీరా పరీక్షలు జరిగి ఫలితాలు వచ్చేసరికి ప్రశ్నపత్రాల లీకు వ్యవహారంతో నిరుద్యోగులు పడిన బాధ, భావోద్యేగాన్ని నా కళ్లతో చూశా. దీంతో యూపీఎస్సీ చైర్మన్‌ను కలిసి దాని తరహాలో టీజీపీఎస్సీని పునర్వ్యవస్థీకరించాం. యూపీఎస్సీ తరహాలో వెనువెంటనే నోటిఫికేషన్లు ఇచ్చాం. గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను విజయవంతంగా నిర్వహించాం. గ్రూప్–2 పరీక్షలు గ్రూప్–3తో కలిపి నవంబర్, డిసెంబర్లో నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేసి సామాజిక న్యాయాన్ని పాటిస్తాం. మా ప్రభుత్వ హయాంలో పరీక్షలు నిర్వహించిన ఏ సంస్థపైనా ఎలాంటి ఆరోపణలూ రాలేదు. నిరుద్యోగ అభ్యర్థులు కష్టపడి మంచి ఫలితాలు సాధిస్తే ప్రభుత్వం వారిని వ్యక్తిగతంగా కలుస్తుందని, వెన్నుతట్టి ప్రోత్సహిస్తుందనే సందేశం ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించాం. నిరుద్యోగ యువతలో నమ్మకం, విశ్వాసం కల్పించడం మా బాధ్యత..’అని సీఎం పేర్కొన్నారు. కేంద్ర కొలువులపైనా దృష్టి పెట్టాలి ‘నిరుద్యోగ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, సివిల్స్, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ వంటి వాటిపై సైతం దృష్టి సారించాలి. సివిల్స్‌లో టాప్ ర్యాంక్ సాధించి తెలంగాణ కేడర్‌ను తీసుకుని రాష్ట్ర ప్రజలకు సేవలు చేయాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసు పోస్టుల్లో తెలంగాణ యువత ఎక్కువగా అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రాష్ట్రానికి నిధులు, ఇతర ప్రయోజనాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరిపేటప్పుడు అక్కడ తెలంగాణ అధికారులు ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది..’అని రేవంత్ చెప్పారు. అభ్యర్థులకు ఆర్థిక తోడ్పాటే లక్ష్యం: భట్టి సివిల్స్ తరహా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడం వ్యయ ప్రయాసలతో కూడిన అంశమని, సీఎం రేవంత్ చొరవతో.. అలాంటి పరీక్షలు రాసే అభ్యర్థులకు ఆర్థిక తోడ్పాటును అందించడం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి తరఫున దీనిని చేపట్టడం అభినందనీయమన్నారు. 2023లో రాష్ట్రం నుండి సివిల్స్‌కు ఎంపికైన 35 మంది అభ్యర్థులను, ఐఎఫ్ఎస్కు ఎంపికైన ఆరుగురిని ఈ సమావేశంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్ రావు, సీఎస్ శాంతికుమారి, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
9 అంశాల ఎజెండా !
ఇవీ ఎజెండాలోని అంశాలు ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం – కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం– సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య. శాంతిభద్రతలు–రక్షణ సంబంధిత సమస్యలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం.సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలకు ముందే సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 16న మంత్రులతో కలిసి కీలక సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్కమిషనర్లు, ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొంటారు. పాలనను పూర్తిస్థాయిలో పరుగులు పెట్టించే క్రమంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు సమాచారం.గత డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకసారి కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సమావేశం నిర్వహించినా, ఆ తర్వాత వెంటనే లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడం, కలెక్టర్లు, ఎస్పీలంతా పూర్తిగా ఎన్నికల విధుల్లోనే నిమగ్నం కావడంతో పాలనపై దృష్టి సారించలేకపోయారు. కోడ్ ముగియడం, ఈ మధ్యనే కలెక్టర్లు, కార్యదర్శులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల బదిలీలు చేయడం ద్వారా కొత్తగా ఆయా స్థానాల్లోకి వచ్చిన అధికారులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ ప్రా«థమ్యాలపై దిశానిర్దేశం చేయడానికి ఈ సమావేశాన్ని వినియోగించుకోనున్నారు. 16న నిర్వహించే సమావేశ ఏజెండాలోని అంశాలను కూడా వారికి పంపించారు. ప్రధానంగా తొమ్మిది అంశాలను ఎజెండాలో చేర్చారు. ⇒ రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి, అక్కడ ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించడం, వాటిని సంబంధిత విభాగాలకు పంపించి అవి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.గడిచిన ఆరేడు నెలల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటిలో ఏ విధమైన విజ్ఞాపనలు ఉన్నాయి? వచి్చన విజ్ఞాపనల్లో ఎన్నింటికి పరిష్కరించారు? ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? పెండింగ్‌లో ఉండడానికి గల కారణలేంటి? అన్న అంశాలను ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ⇒ ఆర్థికంగా పెద్దగా భారం కాని పనులు కూడా పరిష్కరించకుండా ఉన్న పక్షంలో వాటిపై అధికారులకు నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ⇒ భూముల సమస్యకు సంబంధించి ధరణిని రద్దు చేస్తామని, రైతులకు ప్రయోజనకరంగా ఉండే కొత్త వ్యవస్థ తీసుకొస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచి్చన సంగతి తెలిసిందే. ధరణిపై ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి విదితమే. ఆ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై పూర్తిస్థాయిలో నివేదిక సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై కలెక్టర్ల నుంచి ఫీడ్ తీసుకొని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ⇒ వ్యవసాయ సీజన్ ప్రారంభమై దాదాపు నెలన్నర రోజులు అవుతున్న నేపథ్యంలో రైతులకు ఎరువులు, వర్షాభావ పరిస్థితులున్న చోట ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఈ సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ⇒ వర్షాకాలసీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉన్నందున, ముందస్తుగా చేపట్టాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, ఆస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయం కలి్పంచేందుకు డాక్టర్లు, సిబ్బంది, మందులు తదితర అంశాలను చర్చించనున్నారు. ⇒ వర్షాకాలంలో దాదాపు 20 కోట్ల మొక్కలను ఈసారి నాటాలని నిర్ణయించారు. కార్యక్రమం కొనసాగుతున్న తీరును కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించనున్నారు. ⇒ మహిళాశక్తి క్యాంటీన్ల ఏర్పాటు, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలని చర్చించనున్నారు.⇒ విద్యాసంవత్సరం ప్రారంభం, పాఠశాలల పరిస్థితి, వసతి గృహాలు, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల కొరత తదితర అంశాలను క్షుణ్ణంగా కలెక్టర్లతో సమీక్షిస్తారు. ⇒ ఇక శాంతిభద్రతలు, రక్షణపరమైన అంశాలతోపాటు, రాష్ట్రంలో పెరిగిపోతున్న మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాల మాట వినిపించరాదని సీఎం ఇదివరకు ఇచి్చన ఆదేశాలు మరోసారి ఈ సమావేశంలో పునరుద్ఘాటించనున్నారు. -
AP: నేడు కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం (జనవరి 31) ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంమొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఇందులో 2024–25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడుల ప్రాజెక్ట్‌లను కూడా మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
విపక్షాల ఐక్యతా రాగం..చేతులు కలిపిన 19 పార్టీలు
న్యూఢిల్లీ: బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం నిరంతర దాడికి గురవుతోందంటూ కాంగ్రెస్‌తో పాటు 19 విపక్ష పార్టీలు మండిపడ్డాయి. గురువారం బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డ అనంతరం పార్లమెంటు ప్రాంగణం నుంచి విజయ్ చౌక్ దాకా ‘తిరంగా మార్చ్’ పేరిట నిరసన ర్యాలీ జరిపాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఆప్, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), వామపక్షాలు, ఐయూఎంఎల్, ఆరెస్పీ తదితర పార్టీలు ఇందులో పాల్గొన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో సోనియాగాంధీతో పాటు ఎంపీలంతా త్రివర్ణ పతాకం చేబూని నినాదాలు చేస్తూ సాగారు. తమ ఐక్యతను పటిష్టపరుచుకుంటూ మోదీ సర్కారుపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని వారంతా ప్రకటించడం విశేషం! విపక్షాల ఐక్యతను మరింత ముందుకు తీసుకెళ్లడమే గాక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఉమ్మడిగా పోరాడతామని ఖర్గే ఈ సందర్భంగా ప్రకటించారు. అదానీ ఉదంతం, కులగణన ఎన్నికల్లో విపక్షాలకు ప్రధానాంశాలుగా మారతాయా అని ప్రశ్నించగా అన్ని పార్టీల అధ్యక్షులూ చర్చించుకుని వాటిపై నిర్ణయానికి వస్తారని బదులిచ్చారు. కులగణన తమ ఎజెండాలో అతి ముఖ్యమైన అంశమన్నారు. లోక్‌సభ స్పీకర్ ఇచ్చిన మర్యాదపూర్వక విందును విపక్ష నేతలు సంయుక్తంగా బహిష్కరించారు. తర్వాత కాన్స్టిట్యూషన్ క్లబ్లో 19 పార్టీల నేతలూ సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు! మోదీ సర్కారుది అహంభావపూరిత వైఖరి అంటూ దుయ్యబట్టారు. అదిలాగే కొనసాగితే దేశం పూర్తిస్థాయి నియంతృత్వంలో మగ్గిపోతుందన్నారు. కొంతకాలంగా కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడానికి ఇష్టపడని తృణమూల్, బీఆర్ఎస్, ఆప్, సమాజ్‌వాదీ పార్టీ కూడా ర్యాలీలోనూ, మీడియా సమావేశంలోనూ కలిసి పాల్గొనడం విశేషం! బడ్జెట్ సమావేశాలు ఆసాంతం ప్రభుత్వంపై విపక్షాలు సమైక్యంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మార్చి 13న రెండో విడత సమావేశాలు మొదలైనప్పటి నుంచీ సంయుక్తంగా నిరసనలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి. మాటల్లోనే ప్రజాస్వామ్యం: ఖర్గే రాజ్యాంగం, న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తామంతా పోరాడుతున్నామని ఖర్గే ప్రకటించారు. మోదీ సర్కారు ప్రవచిస్తున్న ప్రజాస్వామ్య స్ఫూర్తి మాటలకే పరిమితమవుతోందని మండిపడ్డారు. ‘‘అదానీ అవినీతిపై బదులివ్వాల్సి వస్తుందనే భయంతో బడ్జెట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోవాలని బీజేపీ ఆశించింది. అందుకు విపక్షాలను బాధ్యులను చేయజూడటం దారుణం. రూ.50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను కేవలం 12 నిమిషాల చర్చతో ఆమోదించడమా? సభల్లో ఎన్నిసార్లు నోటీసులిచ్చినా విపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. ఇలా జరగడం నా 52 ఏళ్ల ప్రజా జీవితంలో తొలిసారి. 19 విపక్షాల్లో 18 పార్టీలు అదానీ అంశంపై కేంద్రాన్ని నిలదీశాయి. ఆయన సంపద కేవలం రెండున్నరేళ్లలో రూ.12 లక్షల కోట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని పట్టుబట్టాయి. సభలో బీజేపీదే పూర్తి మెజారిటీ. జేపీసీ వేసినా ఎక్కువ మంది వాళ్లే ఉంటారు. అయినా విచారణకు వెనకాడుతున్నారంటే దాల్ మే కుచ్ కాలా హై’’ అన్నారు. అదానీతో మోదీకి, బీజేపీకి అక్రమ బంధం ఉందని ఆరోపించారు. ‘‘రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడగానే వాయువేగంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కానీ బీజేపీ అమ్రేలీ ఎంపీకి మూడేళ్ల జైలు శిక్ష పడి 16 రోజులైనా ఆయనపై వేటు వేయలేదు’’ అని మండిపడ్డారు. విపక్షాలన్నీ విభేదాలను పక్కన పెట్టి ఒక్కతాటిపైకి వస్తున్నాయి. మా ఐక్యతను ఇప్పుడు దేశమంతా చూస్తోంది. మేం నానాటికీ బలపడుతున్నాం. మ మ్మల్ని విడదీసేందుకు బీజేపీ చేసిన ప్ర యత్నాలు విఫలమయ్యాయి. దీన్నెలా ముందుకు తీసుకెళ్లాలో అంతా కలిసి నిర్ణయించుకుంటాం. విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహించాలన్నది ప్రశ్న కాదు – కె.కేశవరావు, బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఊరుకుంటామేమో గానీ అదానీపై నిలదీస్తే మాత్రం సహించబోమని బీజేపీ తన ప్రవర్తనతో రుజువు చేసింది. – సంజయ్‌సింగ్, ఆప్ భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో రాహుల్‌గాంధీని చూసి బీజేపీ భయపడుతోంది. అధికార పక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడాన్ని తొలిసారిగా చూశాం – టి.ఆర్.బాలు, డీఎంకే -
టీడీపీ హయాంలో భూ కబ్జాలపై విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం ‘జీరో’అవర్ సుదీర్ఘంగా సాగింది. రెండున్నర గంటలకు పైగా 46 మంది శాసన సభ్యులు వారి నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడారు. జీరో అవర్‌ను ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి నడిపించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగిన భూకబ్జాలపై విచారణ జరపాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేశ్ వారి పర్యటనల్లో అధికార పక్ష నాయకులపై భూ కబ్జా ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. టీడీపీ హయాం నుంచి ఎంత ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందో సమగ్ర విచారణ చేయించాలి కోరారు. దీనిపై ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి స్పందిస్తూ.. ‘నేను ఇప్పు డు చైర్లో కూర్చున్నా. లేకుంటే శాసన సభ్యుడినే కదా. రెండు నెలల కిందట చంద్రబాబు విజయనగరంలో నాపైనా ఆరోపణలు చేశారు. ఏ భూములైతే ఆక్రమించానని ఆరోపిస్తున్నారో.. ఆ భూముల్లో చంద్రబాబు కూర్చుని ఆందోళన చేస్తే ప్రజలకు బాగా అర్థమవుతుందని చెప్పాను. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆరోపణలపై విచారణకు ఆదేశించమని ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి వి డిపించి అర్హులైన పేదలకు ఇవ్వాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను త్వరితంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లోకేశ్ కబ్జా ఆరోపణలపై విచారణ చేయించాలి: ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పీలేరులో టీడీపీ నేత లోకేశ్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తాను, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఆక్రమించుకున్నామని లోకేశ్ ఆరోపించారన్నారు. గతంలో తమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది, 2014–19 మధ్య ఎంత భూమి మింగేశారు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి న తర్వాత ఎంత కబ్జాకు గురైందో సీఐడీ, విజిలెన్స్ ద్వారా విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. తాను ఏనాడూ ప్రభుత్వ భూముల విషయంలో జోక్యం చేసుకోలేదని చెప్పారు. పేజ్‌కు భూ కేటాయింపులపై వాస్తవాలు నిగ్గు తేల్చాలి టీడీపీ ప్రభుత్వంలో లోకేశ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండగా పేజ్ ఇండస్ట్రీకి 28 ఎకరాలు కారు చౌకగా ఎకరం రూ.10 లక్షలకు కేటాయించడంపై విచారణ జరపాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. అక్కడ ఎకరం రూ.4 కోట్లు ఉంటుందని, రూ.110 కోట్ల విలువైన స్థలాన్ని రూ.2.80 కోట్లకే రిజిస్టర్ చేశారని చెప్పారు. మూడేళ్ల తర్వాత భూమిని విక్రయించుకోవచ్చని జీవో కూడా ఇచ్చారన్నారు. 2016లో భూమి ఇస్తే 2019 వరకు ఆసంస్థ కార్యకలాపాలు ప్రారంభించలేదన్నారు. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరారు. టీడీపీ హయాంలో రామగిరిలో రూ.1000 కోట్ల విలువైన గ్రానైట్‌ను ఎటువంటి రాయల్టీలు చెల్లించకుండా తరలించారని అన్నారు. ఆన్లైన్ విధానంలో భూ యాజమాన్య మార్పులు చేసే వెసులుబాటుతో అనంతపురం రూరల్, రాప్తాడు నియోజకవర్గంలో వందల కోట్లు విలువ చేసే భూముల్లో బినామీల పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని, ఇలాంటి దోపిడీల్లో ప్రభుత్వం వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ చేపట్టాలి సరైన గుర్తింపు లేని బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ చేపట్టి ప్రభుత్వ పథకాలు అందించాలని కొందరు సభ్యులు కోరారు. దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఇది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని.. కేంద్ర కేబినెట్ ఆమోదంతో పార్లమెంట్ చట్ట సవరణ ద్వారా చేయాల్సి ఉంటుందన్నారు. బుడగ జంగాలు ఏ వర్గంలోకి వెళ్లాలనుకుంటున్నారో సంబంధిత కమిషన్‌కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. -
AP: అసెంబ్లీలో చివరి రోజూ అదే తీరు
సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరిరోజూ తెలుగుదేశం పార్టీ తన అరాచక బుద్ధిని ప్రదర్శించింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ లక్ష్యంగా ఆ పార్టీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ప్రశ్నోత్తరాలు మొదలవగానే వాయిదా తీర్మానానికి టీడీపీ పట్టుపట్టింది. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని స్పీకర్ వారించడంతో టీడీపీ సభ్యులు రెచ్చిపోయారు. తమను దగ్గరుండి కొట్టించడంతో పాటు.. ఎమ్మెల్యేపైనే స్పీకర్ దాడి చేశారంటూ ఆరోపించారు. చివరకు రెడ్‌లైన్ దాటి, సస్పెండై సభ నుంచి వెళ్లిపోయారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవగా, ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ‘ఆయుష్మాన్ భారత్’పై టీడీపీ సభ్యులే అడిగిన ప్రశ్నలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని బదులిస్తుండగా వినకుండా తమ స్థానాల నుంచే రన్నింగ్ కామెంట్రీ మొదలుపెట్టారు. జీవో నంబర్1ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను వినిపించేందుకు టీడీపీ సభ్యులకు స్పీకర్ మైక్ ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా తమ వాయిదా తీర్మానం తీసుకోవాలంటూ భీషి్మంచారు. 9.09గంటలకు వెల్‌లోని రెడ్‌లైన్ వరకు వచ్చి స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను సంప్రదించకుండా రెడ్‌లైన్ ఎలా పెడతారని శాసనసభ కార్యదర్శిని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రెడ్‌లైన్ దాటి సభాపతి పోడియంపైకి దూసుకెళ్లారు. సభా సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తున్నారంటూ టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో ఇచ్చిన రూలింగ్ ప్రకారం రెడ్ లైన్ దాటినందుకు టీడీపీ సభ్యులు కె.అచ్చెన్నాయుడు, డోలా బాలవీరాంజనేయస్వామి, గద్దె రామ్మోహన్రావు, గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పీజీవీఆర్ నాయుడు (గణబాబు), గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంతెన రామరాజు, నిమ్మకాయల చినరాజప్ప ఒక రోజు సభ నుంచి ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయినట్టు ప్రకటించారు. బయటకు వెళ్లేందుకు టీడీపీ సభ్యులు నిరాకరించడంతో మార్షల్స్‌ను రప్పించారు. అయితే 9.22 గంటలకు నవ్వుకుంటూ.. బయటకు వెళ్లిపోయారు. బయటకు వెళ్తూ అచ్చెన్నాయుడు శాసనసభను సంతాప సభతో పోల్చారు. -
చర్చలో రభస
సాక్షి, అమరావతి: బడ్జెట్ సమావేశాల సందర్భంగా నాలుగో రోజూ సభలో రభసను విపక్షం కొనసాగించింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారామ్ బడ్జెట్‌పై చర్చ చేపట్టారు. పార్టీ ల సంఖ్యాబలాన్ని అనుసరించి సభ్యులకు సమయం కేటాయిస్తానని సభ ప్రారంభంలోనే ప్రకటించారు. దీని ప్రకారం టీడీపీ సభ్యులకు 17 నిమిషాలు ఇస్తున్నట్లు పేర్కొంటూ చర్చలో తొలుత మాట్లాడే అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ బడ్జెట్ గణాంకాలు అంకెల గారడీ అని, ప్రభుత్వం హామీలను విస్మరించిందని చెప్పారు. ఫ్యాన్సీ నెంబర్‌పై 2,79,279పై ఉన్న దృష్టి ప్రజా సమస్యలపై లేదంటూ బడ్జెట్‌ను విమర్శించారు. ఈ సమయంలో సీఎం ఆస్తులంటూ ఆరోపణలు చేస్తుండడంతో అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అప్పటికే నిర్ణీత సమయం మించిపోవడం, వ్యక్తిగత విమర్శలు కొనసాగించడంతో ప్రసంగాన్ని త్వరగా ముగించాలని స్పీకర్ సూచించారు. బడ్జెట్‌పై చర్చించకుండా తప్పుదోవ పట్టించే యత్నాలు సరికాదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సూచించారు. అప్పటికే టీడీపీకి ఇచ్చిన నిర్ణీత సమయం దాటిపోయి 25 నిమిషాలు మాట్లాడడంతో అధికార పార్టీ నుంచి చర్చలో పాల్గొనేందుకు కోన రఘుపతికి స్పీకర్ అవకాశమిచ్చారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని తమకు సమయం సరిపోలేదంటూ నినాదాలు చేస్తూ చర్చకు ఆటంకం కల్పించారు. డోల బాలవీరాంజనేయులు, వెలగపూడి రామకృష్ణ, ఆదిరెడ్డి భవానీ తదితరులు సభాపతి కుర్చీ వద్దకు చేరుకుని స్పీకర్ డౌన్‌డౌన్... అంటూ నినాదాలు చేశారు. విపక్ష సభ్యులు తమ సీట్ల వద్దకు వెళ్లాలని స్పీకర్ పదేపదే కోరినా మైక్ ఇవ్వాలని పట్టుబట్టారు. భోజనం సమయం కావడంతో టీడీపీ సభ్యులు సభ నుంచి సస్పెండై బయటకు వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో ఉన్నారని ఆర్థిక మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. అనంతరం సభ ఆమోదంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో నినాదాలు చేస్తూ నిష్క్రమించారు. -
14 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 14వ తేదీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం నోటిఫికేషన్ జారీచేశారు. 14వ తేదీ ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని అందులో పేర్కొన్నారు. తొలిరోజు ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బీఏసీ (బిజినెన్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో సభ ఎన్నిరోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలనే అంశాలను నిర్ణయించనున్నారు. శాసనసభలో రెండోరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. శాసనమండలిలో రెండోరోజు సభ్యులు చల్లా భగీరథరెడ్డి, బచ్చుల అర్జునుడు మృతికి సంతాప తీర్మానం అనంతరం సమావేశం వాయిదా పడనుంది. మూడోరోజు నుంచి రెగ్యులర్‌గా మండలి సమావేశాలు జరుగుతాయి. 14 నుంచి 24వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మధ్యలో వారాంతపు సెలవులు, ఉగాది పోగా 7–8 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అధికారికంగా ఈ అంశాలన్నింటినీ బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాన్ని ఆ సమావేశంలోనే ఖరారు చేయనున్నారు. -
‘అదానీ’పై అదే దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ముగిశాయి. రెండో విడత సమావేశాలు మార్చి 13న ప్రారంభం కానున్నాయి. అదానీ వ్యవహారంపై సోమవారం కూడా రాజ్యసభలో విపక్ష ఆందోళనలు కొనసాగాయి. సభ ప్రారంభానికి ముందే 14 విపక్ష పార్టీలు సమావేశమై దీనిపై చర్చించాయి. కాంగ్రెస్ సహా డీఎంకే, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, జేడీయూ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. జేపీసీ గానీ సుప్రీం న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కమిటీకి డిమాండ్ చేయాలని నిర్ణయించాయి. అనంతరం బీఆర్ఎస్ సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు సభలో వాయిదా తీర్మానాలిచ్చారు. సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. జేపీసీకి డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీనిపై ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అభ్యంతరం తెలిపారు. జేపీసీ వేయాలని నినాదాలు చేస్తున్న 8 మంది సభ్యుల పేర్లను సైతం చదివి వినిపించారు. అయితే, వారిపై ఎలాంటి చర్యలను ప్రకటించలేదు. సభను నడిపేందుకు ఇది మార్గం కాదని, ఇప్పటికే చాలా సమయం వృథా అయిందని, సభ్యులు సహకరించాలని కోరారు. విపక్ష ఎంపీలు ఆందోళన విరమించకపోవడంతో సభను 11.50 గంటలకు వాయిదా వేశారు. సభ ఆరంభం అయ్యాక సైతం విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో చివరికి మార్చి 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అదానీ గ్రూప్‌లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్‌బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదికపై ప్రతిపక్షాల ఆందోళనలతోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి భాగమంతా గడిచిన విషయం తెలిసిందే. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం, ఆ తర్వాత బడ్జెట్, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సాధారణ బడ్జెట్‌పై చర్చ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం మినహా ఇతర కార్యకలాపాలేవీ జరగలేదు. -
అసెంబ్లీ సమావేశాలకు నేటితో తెర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం జరిగిన ఎనిమిదో రోజు పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ జరిగింది. ఈ నెల 9న శాఖల వారీగా ప్రభుత్వ పద్దులపై చర్చ ప్రారంభం కాగా, మొత్తం 37 పద్దులను ఆమోదించారు. నీటిపారుదల, గవర్నర్, మంత్రిమండలి, సాధారణ పాలన, వాణిజ్య పన్నుల నిర్వహణ, వైద్య, ఆరోగ్యం, పశు, మత్స్య పరిశ్రమ, హోం, జైళ్లు, వ్యవసాయ, సహకార, పంచాయతీరాజ్, గ్రామీణ శాఖలకు సంబంధించిన పద్దులను శాసనసభ ఆమోదించింది. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ నేరుగా ప్రశ్నోత్తరాలను చేపట్టింది. ‘2023 ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లుతో పాటు పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఆమోదించింది. విరామం అనంతరం తిరిగి సమావేశమైన శాసన సభ అర్ధరాత్రి వరకు కొనసాగింది. కాగా ఆదివారం వార్షిక బడ్జెట్ 2023–24 ద్రవ్య వినిమయ బిల్లు ఉభయసభల్లో చర్చకు రానున్నది. ఈ బిల్లును ఉభయ సభలు ఆమోదించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడనుంది. ఆదివారం ఉదయం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగే చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చే అవకాశముంది. ఈ బిల్లును శాసనసభ ఆమోదించిన తర్వాత శాసనమండలికి పంపుతారు. శాసనమండలిలోనూ ఈ బిల్లును ఆమోదించిన తర్వాత వాయిదా పడుతుంది. అర్ధరాత్రి వరకు కొనసాగిన అసెంబ్లీ అసెంబ్లీలో శనివారం రాత్రి 11.48వరకు వార్షిక బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు శాసనసభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రానుండటంతో పద్దుల ఆమోదానికి చర్చ కొనసాగింది. సుమారు 14 గంటల పాటు సమావేశం జరగ్గా శనివారం సాయంత్రం ఐదున్నర వరకు పద్దులపై సభ్యులు ప్రసంగించారు. మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ తమ శాఖలపై జరిగిన చర్చకు సుదీర్ఘంగా సమాధానాలు ఇచ్చారు. ప్రజలకు అవసరమైన ముఖ్య పద్దులపై చర్చ జరుగుతున్నా మూడు రోజులుగా బీజేపీ సభ్యులు గైర్హాజరు కావడంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పద్దులపై ఇచ్చిన కోత తీర్మానాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటింగ్ నిర్వహించారు. పద్దులను ఆమోదించినట్లు ప్రకటిస్తూ సభను ఆదివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. -
నూతన భవనంలోనే బడ్జెట్ సమావేశాలు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది బడ్జెట్ సమావేశాలు పార్లమెంట్ నూతన భవనంలో జరిగే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. నూతన భవన నిర్మాణ పనులు దాదాపు ముగింపుకు వచ్చాయని, ఈ నెలాఖరుకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేలా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 2023–24 ఆర్ధిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త భవనంలోనే ప్రవేశపెడతారని, ఇందుకు సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నాయి. 65 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పార్లమెంట్ నూతన భవనంలో విశాలమైన హాళ్లు, ఆధునిక లైబ్రరీ, అత్యాధునిక రాజ్యాంగ హాలు, ఆధునిక సాంకేతికతతో కూడిన కార్యాలయాలు, కమిటీ గదులు ఉన్నాయి. కొత్త భవనంలోని లోక్‌సభలో 888 సీట్ల అమరిక నెమలి ఆకారాన్ని స్ఫూరించేలా, రాజ్యసభ హాలులో కమలం పువ్వును గుర్తుకు తెచ్చేలా 384 సీట్ల అమరిక ఉంటుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్ పాత భవనంలోనే రాబోయే బడ్జెట్ సెషన్లో ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి జనవరి 31న ప్రసంగిస్తారని స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం వెల్లడించారు. మరోవైపు లోక్‌సభ సెక్రటేరియట్ పార్లమెంటు కొత్త భవనాన్ని యాక్సెస్ చేయడానికి ఎంపీల కోసం కొత్త గుర్తింపు కార్డులను సిద్ధం చేస్తున్నారు. కొత్త భవనంలో వినియోగించే ఆడియో విజువల్ పరికరాలపై ఎంపీలకు శిక్షణ ఇస్తున్నారు. ఒకవేళ కొత్త భవనంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తిన పక్షంలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగే తొలి విడత సమావేశాలను పాత భవనంలో, మార్చి 13 నుంచి జరిగే రెండో విడత సమావేశాలను కొత్త భవనంలో నిర్వహించే అవకాశాలున్నాయని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండో విడత సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం,, ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)లో వడ్డీ రేట్లు తగ్గింపు, రైతులకు కనీస మద్దతు ధర, రష్యా దాడులతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలకు పార్లమెంటు ఆమోద ముద్ర, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టడం కేంద్ర ప్రభుత్వం అజెండాలో ప్రధానమైనవి. సోమవారం లోక్‌సభ కార్యకలాపాలు మొదలు కాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కశ్మీర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత సమావేశాల్లో దానిపై చర్చ జరుగుతుంది. రాజ్యాంగ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆదేశాల (సవరణ) బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయించుకోవాలని కేంద్రం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు అదుపులోకి రావడంతో పార్లమెంటు ఉభయ సభలు యథావిధిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనున్నాయి. ఈ సారి సమావేశాలు ఏప్రిల్ ఎనిమిదో తేదీన పూర్తికానున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాలి : కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం ఉదయం పార్టీ పార్లమెంటు వ్యూహాల గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారు. సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఒకే భావజాలం కలిగిన పార్టీలతో సమన్వయంతో పని చేయాలని నిర్ణయానికొచ్చారు. బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తి, వాటిపై చర్చ జరిగేలా చూస్తామని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. -
బడ్జెట్ సమావేశాలు.. 7 రోజులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ 2022–23 బడ్జెట్ సమావేశాలను ఈ నెల 15వ తేదీ వరకు 7 రోజులు నిర్వహించాలని శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్ణయించింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినందున మరో 6 రోజులు సమావేశాలు కొనసాగనున్నాయి. సభ్యులు కోరితే సమావేశాల పొడిగింపుపై 15న మరోమారు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తమైంది. ప్రతి రోజూ కనీసం 12 గంటలు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. బీఏసీ నిర్ణయాలను ఈ నెల 9న బుధవారం శాసనసభకు సమర్పిస్తారు. శాఖల వారీ పద్దుపై 4 రోజులు చర్చ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మంగళవారం, ఈ నెల 13న ఆదివారం శాసనసభ సమావేశాలకు విరామం ఉంటుంది. 9న సభ సమావేశమయ్యాక బడ్జెట్‌పై అధికార, విపక్ష సభ్యుల ప్రసంగాలు, ఆర్థిక మంత్రి సమాధానం ఉంటుంది. 10, 11, 12, 14 తేదీల్లో బడ్జెట్ పద్దులపై శాఖల వారీగా చర్చ జరుగుతుంది. 10న సంక్షేమ శాఖలతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ పద్దులపై చర్చ జరగనుంది. 15న ద్రవ్య, వినిమయ బిల్లులు సభ ముందుకు రానున్నాయి. బీఎసీ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు పాల్గొన్నారు. బడ్జెట్‌పై మండలిలో 10న చర్చ ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ జాఫ్రీ అధ్యక్షతన జరిగిన శాసన మండలి బీఏసీ సమావేశంలోనూ సమావేశ తేదీలు, ఎజెండా ఖరారు చేశారు. 8, 9 తేదీల్లో శాసన మండలి సమావేశాలకు విరామం ప్రకటించడంతో పాటు ఈ నెల 10న తిరిగి సమావేశం కావాలని నిర్ణయించారు. 10న మండలిలో బడ్జెట్‌పై చర్చ, అదే రోజు ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారు. 11, 12 తేదీల్లో మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగే అవకాశముంది. ఎన్నిక షెడ్యూల్ విడుదలపై 10న జరిగే మండలి సమావేశంలో స్పష్టత రానున్నది. 14న మండలి సమావేశాలకు విరామం ప్రకటించారు. 15న మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది. -
‘ఓటాన్ అకౌంట్’పై ఆశలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ... లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టె ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై అందరు దృష్టి సారించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు నిధుల కేటాయింపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈసారి శాసనసభలో నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా, శాసనమండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టనున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌పై ప్రజలు భారీ ఆశలు పెంచుకున్నారు. లోక్‌సభకు మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయనే ఊహా గానాల నేపథ్యంలో బడ్జెట్ ప్రజాకర్షణగా ఉంటుం దని భావిస్తున్నారు. బడ్జెట్లో ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అన్ని వర్గాల ప్రజలను దష్టిలో పెట్టుకొని ఆకర్షణీయ బడ్జెట్‌ను రూపొందించినట్లుగా ఇదివరకే ప్రకటించగా, బడ్జెట్‌ను ఓట్లుగా మలుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో మిగిలిన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నిధుల కేటాయింపులు చేసినట్లుగా తెలుస్తోంది, సంక్షేమంతో పాటు సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని వృద్ధిలోకి తెచ్చేందుకు రైతు ఆర్థిక సాయంపై దృష్టి సారించినట్లు సమాచారం. వ్యవసాయానికి ప్రాధాన్యం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగానికి వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉంది. ఈసారి ఎన్నికల హామీ ప్రకారం ఉమ్మడి జిల్లాలో 13,42,045 ఎకరాలు సాగుభూమి ఉండగా, 6.62 లక్షల మంది రైతులకు రెండు పంటలకు కలిసి ప్రతి ఏటా రూ.1074 కోట్ల పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది. ఈ మేరకు రైతుల రుణమాఫీ, పెట్టుబడి సాయం, పంట రుణాల కింద అత్యధిక నిధులు కేటాయించాలని ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించగా, బడ్జెట్లో ఏ మేరకు నిధులు వస్తాయన్న చర్చ జరుగుతోంది. అలాగే విద్య, వైద్యంతో పాటు మౌలిక వసతుల కోసం ఏ మేరకు కేటాయింపులు ఉంటాయన్న ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రాజెక్టులపై నిధుల వర్షం కురిసేనా... ప్రభుత్వం 2018–19 బడ్జెట్లో జిల్లాలోని ప్రాజెక్టులకు రూ.7,484 కోట్లు కేటాయించి పెద్దపీట వేసింది. ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా తీసుకున్న కాళేశ్వరానికి రూ.6,094.41 కోట్లు కేటాయించగా, ఇందిరమ్మ వరదకాల్వకు రూ.689.93 కోట్లు, ఎల్లంపల్లి శ్రీపాదసాగర్కు రూ.300 కోట్లు, ఎస్సారెస్పీ–1, ఎస్సారెస్పీ–2లకు రూ.400 కోట్లు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యవసరం రూ.25 వేల కోట్లు కావాలంటున్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తి కోసం ఏ మేరకు నిధులు కేటాయిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్‌కు ‘వైద్య కళాశాల’ వస్తుందా... సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం వివిధ వ్యాధులతో బాధపడేవారిలో అత్యధికులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నట్లు తేలింది. ఈ సర్వే తర్వాత సీఎం హోదాలో మొదటిసారి కరీంనగర్ వచ్చిన కేసీఆర్ కరీంనగర్‌కు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేస్తామని ప్రకటించారు. అంతకుముందు బడ్జెట్లో ఏడు, 2018–19 బడ్జెట్లో నల్గొండ, సూర్యాపేటలకు వైద్య కళాశాలలను కేటాయించిన ప్రభుత్వం కరీంనగర్‌కు మొండిచెయ్యి చూపింది. ఐదు పర్యాయాల బడ్జెట్లు పూర్తయినా రూ.వెయ్యి కోట్లతో కరీంనగర్‌కు ‘సూపర్‌స్పెషాలిటీ’ వైద్యకళాశాల కలగానే మిగిలింది. ఉమ్మడి జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పలు ప్రాంతాల ప్రజలకు పెద్ద దిక్కుగా కరీంనగర్ పెద్దాసుపత్రి ఉంది. వైద్య కళాశాల మంజూరు చేయకపోవడం, గత బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపి నిమ్స్ స్థాయికి పెంచుతామని ప్రకటించినా.. ఇప్పటికీ ఆ హోదా దక్కలేదు. మానేరు రివర్ఫ్రంట్కునిధులేవి.... సబర్మతీ తీరాన్ని మించి మానేరు రివర్ ఫ్రంట్ నిర్మిస్తామని రెండేళ్లుగా ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే గుజరాత్ వెళ్లి వచ్చారు. మొత్తంగా రూ.506 కోట్ల వ్యయమయ్యే ప్రాజెక్టుకు 2017–18 బడ్జెట్లోనే రూ.199 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మానేరు రివర్‌ఫ్రంట్ పనులు వేగం అందుకుంటాయని అందరూ భావించారు. అయితే ఇప్పటికీ భూ సేకరణే పూర్తి కాకపోగా, పైసా ఖర్చు పెట్టలేదు. ఈ బడ్జెట్లో కనీసం రూ.300 కోట్లు కేటాయించి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించకుంటే ఇది వైద్య కళాశాల, నిమ్స్ కథలానే మారనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి పెద్ద మొత్తంలో కేటాయిస్తారని ఆశిస్తున్నారు. కొత్త మంత్రులపై ‘అభివృద్ధి’ భారం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల తరువాత పూర్తిస్థాయి మంత్రివర్గంతో జరుగనున్న బడ్జెట్ సమావేశాలపై జిల్లా ప్రజలు భారీ ఆశలు పెంచుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు పూర్తయితే రెండు పంటలకు నీరందడంతో పాటు ప్రస్తుతం రబీ పంటకు సంబంధించి కనీసం వారానికి రెండు తడులైనా నీటి సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు రైతులకు సబ్సిడీ విత్తనాలు, పనిముట్లు అందించే దిశగా చర్చలు సాగాలని కోరుకుంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్యకు తగ్గట్టుగా ఉద్యోగాల కల్పన జరగకపోవడంతో ఉమ్మడి జిల్లాలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఎంతో మందికి మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతో పాటు బొగ్గు ఆధారిత పరిశ్రమలు, వస్త్రోత్పత్తి రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మిషనరీ ఏర్పాటు తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి పెడితే ఉమ్మడి జిల్లాకు భారీగా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలకు మంత్రి పదవులు దక్కడంతో భారీ ఆశలు నెలకొన్నాయి. ఈటల రాజేందర్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా, కొప్పుల ఈశ్వర్ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి అసెంబ్లీలో వారి గళాన్ని విప్పనున్నారు. వీరికి తోడు జిల్లాకు చెందిన మరో 10 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లా సమస్యలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం, సంక్షేమంపై ప్రాధాన్యత పెరిగేలా మన ప్రజాప్రతినిధులు రాబోయే బడ్జెట్లో జిల్లాకు పెద్దపీట వేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. దేవాలయాలకు అరకొరే.. వేములవాడ ఆలయప్రాధికార సంస్థ (వీటీడీఏ)ను ఏర్పాటు చేసి రూ.వందల కోట్లు కేటాయించినట్లు ప్రకటించిన ప్రభుత్వం.. గత బడ్జెట్లో మాత్రం రూ.100 కోట్లను కేటాయించింది. ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు ఇచ్చింది. కొండగట్టులో రోప్‌వే కోసం ఈసారి నిధులు దక్కలేదు. ఇదిలా వుంటే కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థలకు ఒక్కోదానికి రూ.100 కోట్ల చొప్పున రూ.200 కోట్లు బడ్జెట్లో కేటాయిం చారు. శాతవాహన యూనివర్సిటీకి కేవలం రూ.20 కోట్లతో సరిపెట్టారు. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల పాటు చేపట్టనున్న సమావేశాలకు హాజరయ్యేందుకు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఉమ్మడి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పెద్ద ఎత్తున నిధుల మంజూరు అవసరం ఉంది. ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించడంతో పాటు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పనులకు ప్రాధాన్యత కల్పించేలా మంత్రులు, ఎమ్మెల్యేలు గళం విప్పాల్సిన అవసరం ఉంది. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 22 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 నుంచి 25 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వం గురువారమే అధికారికంగా ప్రకటించింది. 22న ఉదయం 11.30లకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభకు ప్రతిపాదిస్తారు. బడ్జెట్‌పై 24న శాసనసభ చర్చిస్తుంది. 25న ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్నాయి. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి, ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలకు అవసరమైన నిధులు కేటాయించేలా బడ్జెట్ రూపొందించాలని అధికారులకు ఇదివరకే సీఎం కేసీఆర్ సూచించారు. -
20 తర్వాత బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20 తర్వాత మొదలు కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసారి తాత్కాలిక (ఓటాన్ అకౌంట్) బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే బడ్జెట్ సమావేశాలు పూర్తి చేసేలా తేదీలను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 15వ ఆర్థిక సంఘం ఈ నెల 18 నుంచి 20 వరకు రాష్ట్రంలో పర్యటించనుంది. ఆర్థిక సంఘం పర్యటన పూర్తయ్యాకే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌లోపే దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీ ఇచ్చిన రైతు రుణ మాఫీ, రైతు బంధు, ఆసరా పెన్షన్ల మొత్తం పెంపుపై తాత్కాలిక బడ్జెట్లోనే ప్రభుత్వం నిధులను కేటాయించనుంది. ఎన్నికల షెడ్యూల్‌లోపే దీన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే ప్రభుత్వం అసెంబ్లీలో తాత్కాలిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. 19న సీఎం సమక్షంలో ఆర్థిక సంఘం భేటీ... ఈ నెల 18న ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె. సింగ్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌కు రానుంది. ఆర్థిక సంఘం కార్యదర్శి అర్వింద్ మెహతా, సభ్యులు శక్తికాంత్‌దాస్, అనూప్ సింగ్, రమేశ్ చంద్, అశోక్ లాహిరితో కూడిన ఈ బృందం మొదటి రోజు స్థానిక సంస్థలు, వాణిజ్య, పరిశ్రమల రంగాల ప్రతినిధులతో సమావేశం కానుంది. 19న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. 20న ఆర్థిక నిపుణులతో సమావేశమవుతారు. అనంతరం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తారు. ఆర్థిక సంఘానికి అందించేందుకు వీలుగా రైతుబంధు, రైతు బీమా, సాగునీటి ప్రాజె క్టుల నిర్మాణం, మిషన్ భగీరథ, టీఎస్–ఐపాస్, కేసీఆర్ కిట్, కేజీ టు పీజీ తదితర ప్రాధాన్యత అంశాలపై అధికారులు నివేదికలు రూపొందిస్తున్నారు. ఆర్థిక సంఘం పర్యటన నేపథ్యంలో ఆర్థిక, ఇతర కీలక శాఖల ఉన్నతాధికారులు నివేదికల తయారీలో నిమగ్నమయ్యారు. దీంతో ఆర్థిక సంఘం పర్యటన తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
31 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 2019, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకూ జరగనున్నాయి. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు సహా పలు కీలక అంశాలను కేబినెట్ కమిటీ చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ మంళవారం ఆమోదించిన పౌరసత్వ బిల్లు–2019ను బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభ ముందుకు తీసుకొచ్చే అవకాశముందని వెల్లడించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 31న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యంతర బడ్జెట్‌పై 2–3 రోజుల పాటు పార్లమెంటులో చర్చ సాగనుంది. అయితే కొన్ని కారణాల రీత్యా ఈసారి ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం లేదు. కాగా, ఆర్డినెన్సుల జారీకి అనుకూలంగా రాష్ట్రపతి పార్లమెంటును స్వల్పకాలం మాత్రమే ప్రోరోగ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందని ట్రిపుల్ తలాక్, మెడికల్ కౌన్సిల్, కంపెనీ వ్యవహారాల ఆర్డినెన్సులను మరోసారి జారీచేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
అన్ని అంశాలపై సమగ్ర చర్చ: హరీశ్
-
అటూ వారే.. ఇటూ వారే!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈసారి పూర్తిగా ఏకపక్షమైపోయాయి. ఆద్యంతం అధికార పార్టీయే కేంద్రంగా కొనసాగాయి. సమావేశాల తొలిరోజునే కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడంతో.. మజ్లిస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం సభ్యులు మాత్రమే మిగిలిన విషయం తెలిసిందే. ఇలా ప్రధాన ప్రతిపక్షం లేకుండానే, లోతైన చర్చ ఏదీ జరగకుండానే.. కీలకమైన ప్రైవేటు వర్సిటీల బిల్లు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీల బిల్లులు ఆమోదం పొందాయి. వర్సిటీల బిల్లు ఎప్పుడో సిద్ధమైనా వ్యతిరేకత రావచ్చనే ఉద్దేశంతో సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం వెనుకాడింది. ప్రస్తుత సమావేశాల తొలి రోజున నిర్వహించిన బీఏసీ సమావేశంలోనూ ఆ బిల్లు ప్రస్తావనే లేదు. కానీ కాంగ్రెస్ సభ్యులందరినీ సస్పెండ్ చేశాక అధికారపక్షం ఈ బిల్లును ఆమోదించుకుంది. వీటితో పాటు వివిధశాఖల పద్దులు, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపైనా లోతుగా చర్చ జరగకుండానే శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ప్రతిపక్షం లేకపోవడంతో కొన్ని అంశాల్లో టీఆర్ఎస్ సభ్యులే ప్రతిపక్షంగా వ్యవహరించారు.శాసన మండలిలోనూ యూనివర్సిటీల బిల్లు, ఇతర సమస్యలపై కొందరు సభ్యులు ఆయా శాఖల మంత్రులను ప్రశ్నించారు. శాసనసభలోనైతే గ్రామీణ రోడ్లపై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురి చేసింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు.. మిర్యాలగూడలో గ్రామీణ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కాంగ్రెస్‌ను వదిలి టీఆర్ఎస్లో చేరినందుకే నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా ఉందని సభలోనే నిరసన వ్యక్తం చేశారు. ఇక టీఆర్ఎస్కు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కూడా.. రోడ్ల నిర్మాణం, అధికారుల తప్పుడు నివేదికలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్చలే తప్ప నిలదీసే ప్రతిపక్షం లేకపోవడంతో.. మంత్రులకు కూడా ఎక్కువగా వివరాలు ఇస్తూ సమాధానాలు చెప్పాల్సిన పని లేకుండా పోయింది. -
అన్ని అంశాలపై సమగ్ర చర్చ: హరీశ్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు 13 రోజులు, 61 గంటలపాటు జరిగాయని శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు పుట్ట మధు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలసి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పద్దులు, బిల్లులు, అంశాలపై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు. సభానాయకుడిగా సీఎం కేసీఆర్ సుమారు ఐదు గంటలు మాట్లాడారని చెప్పారు. పద్దులపై 20 గంటలపాటు చర్చ జరిగిందన్నారు. గత సమావేశాలతో పోలిస్తే ఈసారి అన్నింటిపైనా సమగ్రంగా చర్చ సాగిందని, మొత్తం 11 బిల్లులకు సభ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. పేదలకు అసైన్మెంటు భూములపై హక్కులు కల్పిస్తూ ఆమోదించిన బిల్లు చరిత్రాత్మకమైందని అభివర్ణించారు. 4,380 కొత్త పంచాయతీల ఏర్పాటు.. లంబాడీలు, ఆదివాసీల జీవితాల్లో కొత్త వెలుగు నింపుతుందని హరీష్‌రావు చెప్పారు. తండాలను పంచాయతీలుగా చేస్తామని కాంగ్రెస్ నేతలు గతంలో హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద సాయాన్ని లక్షా 116 రూపాయలకు పెంచుతూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పేదలకు భరోసానిచ్చిందని పేర్కొన్నారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం బాధాకరమని, కాంగ్రెస్ సభ్యుల స్వయంకృతాపరాధం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. కొట్టడానికే కాంగ్రెస్ సభ్యులు శాసనసభకు వచ్చారని ఆరోపించారు. భవిష్యత్తులోనైనా కాంగ్రెస్ నేతలు హుందాగా, క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ఎవరూ అడగకుండానే సమావేశాలను రెండు రోజులు పొడిగించామన్నారు. తెలంగాణ సభలు దేశానికి ఆదర్శంగా ఉండాలనేది టీఆర్ఎస్ విధానమని పేర్కొన్నారు. గతంలో శాసనసభ సమావేశాలు జరిగితే ఖాళీబిందెలు, ఎండిపోయిన పంటలతో ప్రతిపక్షాలు వచ్చేవని హరీశ్ గుర్తుచేశారు. కరెంటు, నీళ్ల సమస్యను రూపుమాపినందుకే ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. -
కుదిపేసిన బ్యాంకింగ్ స్కాంలు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనల మధ్య మలిదశ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఊహించినట్లే బ్యాంకింగ్ కుంభకోణాలపై విపక్షాలు ఉభయ సభల్ని స్తంభింపచేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంపై ప్రత్యేక చర్చ చేపట్టాలని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్, తృణమూల్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభ, రాజ్యసభల్లో పోడియంను చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించాయి. రిజర్వేషన్ల అంశంపై లోక్‌సభలో టీఆర్ఎస్, కావేరీ నదీ జలాల బోర్డు ఏర్పాటుపై సమాధానం చెప్పాలని పట్టుబడుతూ ఉభయ సభల్లో అన్నాడీఎంకే, డీఎంకేలు ఆందోళన కొనసాగించాయి. ప్రశ్నోత్తరాల్లేకుండానే... పీఎన్బీ కుంభకోణంపై విపక్షాల ఆందోళనలతో లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగింది. దీంతో ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టకుండానే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక.. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి పీఎన్బీ కుంభకోణం సూత్రధారి నీరవ్ మోదీ ఎక్కడున్నారో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే అంశంపై నినాదాలు చేస్తూ కాంగ్రెస్‌కు జతకలిసింది. తెలంగాణలో ఎస్టీలు, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్రానికే విడిచిపెట్టేలా ఆర్టికల్ 16ను సవరించాలని ఆ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఉదయం లోక్‌సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ సభలోకి రాగానే బీజేపీ సభ్యులు చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం అధికార, ప్రతిపక్ష సభ్యులకు మోదీ అభివాదం చేశారు. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాల విజయానికి సంకేతంగా బీజేపీ ఎంపీలు అస్సామీ గమోసా(కండువా)లతో దర్శనమిచ్చారు. నిబంధన మేరకు చర్చకు అనుమతిస్తా అటు పీఎన్బీ కుంభకోణంపై రాజ్యసభలోను ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే తృణమూల్ కాంగ్రెస్ బ్యాంకింగ్ కుంభకోణాల్ని ప్రస్తావించగా.. కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటుపై సుప్రీం ఆదేశాల్ని అమలుచేయాలని అన్నాడీఎంకే, డీఎంకేలు పట్టుబట్టాయి. దీంతో చైర్మన్ వెంకయ్య నాయుడు సభను పదినిమిషాలు వాయిదా వేశారు. అనంతరం సమావేశమయ్యాక వెంకయ్య మాట్లాడుతూ.. పీఎన్బీ అంశంపై చర్చించాలని 267 నిబంధన కింద పలువురు సభ్యుల నుంచి నోటీసులు అందాయని తెలిపారు. పీఎన్బీ కుంభకోణం అంశం చాలా ముఖ్యమైందని.. అయితే 267 కింద కాకుండా 176 నిబంధన మేరకు చర్చకు అనుమతి స్తానని చెప్పారు. నీరవ్ మోదీని భారత్‌కు తీసుకురావాలంటూ తృణమూల్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ మరోసారి సమావేశమైనా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించడంతో మంగళవారానికి వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం చర్చ చేపట్టాలి: ప్రతిపక్షాలు బ్యాంకింగ్ స్కాంలపై మంగళవారం 4 గంటలపాటు చర్చించా లని లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన జరిగిన భేటీలో తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ సభ్యులు మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 గంటలకు చర్చను చేపట్టాలని కోరారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ ఈ భేటీలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. -
మార్చి 28నే బడ్జెట్ సమావేశాల ముగింపు
-
మార్చి 28నే బడ్జెట్ సమావేశాల ముగింపు
సాక్షి, అమరావతి: మార్చి 28తో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 29న గవర్నర్ విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో 28నే అప్రాప్రియేషన్ బిల్లును ఆమోదించాలని నిర్ణయించింది. అదే రోజు అప్రాప్రియేషన్ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ నుంచి నిధుల వ్యయానికి మార్గం సుగమం అవుతుంది. మార్చి 5న ఉదయం 9.30 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. ఈ మేరకు సమాచార శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 6, 7 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ , ఆ చర్చకు సీఎం సమాధానమిస్తారు. మార్చి 8న ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. -
29 నుంచి బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జవనరి 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. ఆ మేరకు బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌పై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ కేంద్రానికి సిఫార్సులు చేసింది. వాడీ వేడిగా సాగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. డిసెంబర్ 15న సమావేశాలు ప్రారంభంకాగా ఇరు సభలు 13 రోజులు సమావేశమయ్యాయి. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందగా.. రాజ్యసభలో మోక్షం లభించలేదు. ఇరు సభలు 12 బిల్లులకు ఆమోదం తెలిపాయని కేంద్ర మంత్రి అనంత కుమార్ చెప్పారు. బడ్జెట్ సమావేశాలు 29న ప్రారంభమవుతాయని, మొదటి రోజు ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగిస్తారని చెప్పారు. ఆరోజే ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారన్నారు. తొలి దశ సమావేశాలు 29 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగుతాయి. లోక్‌సభ 13 రోజుల్లో 61 గంటల 48 నిమిషాలు సమావేశమైందని స్పీకర్ మహాజన్ చెప్పారు. ‘అంతరాయాలు, వాయిదాలతో 15 గంటల సమయం వృథా అయ్యింది. సమావేశాల్లో ప్రభుత్వం 16 బిల్లుల్ని పెట్టింది’ అని స్పీకర్ తెలిపారు. రాజ్యసభలో చివరి రోజు కూడా ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఎలాంటి చర్చా జరగలేదు. రాజ్యసభ మొత్తం 41 గంటలు సమావేశం కాగా.. అంతరాయాలు, వాయిదాలతో 34 గంటల సమయం వృథా అయ్యింది. ఈ నెలలో పదవీకాలం ముగుస్తున్న సీనియర్లు కరణ్ సింగ్, జనార్దన్ ద్వివేది, పర్వేజ్ హష్మిలకు రాజ్యసభ వీడ్కోలు చెప్పింది. -
అసెంబ్లీ తేదీలపై సందిగ్ధత!
⇒ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిద్దాం? ⇒ ఇందుకు ఏవైనా నిబంధనలున్నాయా? ⇒ అధికారుల నుంచి స్పష్టత కోరిన ముఖ్యమంత్రి ⇒ మంచి ముహూర్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టే యోచన! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావే శాలకు ఇంకా ముహూర్తం కుదరలేదు. ఈ నెల 8 నుంచి 10 మధ్య బడ్జెట్ సమావేశాలను ప్రారంభించి... 11 లేదా 13న బడ్జెట్ ప్రవేశ పెట్టేలా షెడ్యూల్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఆ ఫైలును ముఖ్యమంత్రికి పంపించినా ఆమోదం రాలేదు. ‘అసలు బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, అసెంబ్లీ నిబంధనల ప్రకారం బడ్జెట్ ఆమోదం పొందేందుకు సభ ఎన్ని రోజులు జరగాలనే నిబంధనలేమైనా ఉన్నాయా..?’ అనే వివరణలు కోరుతూ సీఎం ఆ ఫైలును సాధారణ పరిపాలనా విభాగానికి పంపించి నట్లు తెలిసింది. దీంతో సమావేశాల తేదీలపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆలోగా ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదంతోపాటు గవర్నర్ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడం తప్పనిసరి. ప్రత్యేక నిబంధనేమీ లేదు గతేడాది మార్చిలో కొత్తగా రూపొందించిన తెలంగాణ అసెంబ్లీ రూల్స్ ప్రకారం... బడ్జెట్ సమావేశాలకు నిర్ణీత వ్యవధి అనేదేమీ లేదు. ఆ రూల్స్‌లోని 18వ అధ్యాయం 151 (3) నిబంధన ప్రకారం బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ)తో సంప్రదింపుల మేరకు స్పీకర్ నిర్ణయిస్తారు. బడ్జెట్‌పై సాధారణ చర్చను ఎన్ని రోజులు కొనసాగించాలి, ఎన్ని రోజులు డిమాండ్లపై ఓటింగ్ నిర్వహించాలనేది స్పీకర్ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీ అసెంబ్లీ రూల్స్ ప్రకారం బడ్జెట్ సమావేశాలను కనీసం 24 రోజుల పాటు నిర్వహించాలనే నిబంధన ఉండేది. సాధారణ చర్చకు 6 రోజులు, డిమాండ్లపై ఓటింగ్‌కు 18 రోజులు కేటాయిం చాలని ఉంది. కానీ తెలంగాణ అసెంబ్లీ రూల్స్‌లో ఆ నిబంధనను సవరించారు. బీఏసీతో సంప్రదింపుల మేరకు స్పీకర్ తీసుకునే నిర్ణయం ప్రకారం ఎన్ని రోజులైనా బడ్జెట్ సమావేశాలు నిర్వహించే వెసులు బాటు ఉంది. కానీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టాక సాధారణ చర్చను ప్రారంభించేందుకు మధ్య 48 గంటల వ్యవధి ఉండాలనే నిబంధ న మాత్రం యథాతథంగా అమల్లో ఉంది. ముహూర్తం చూసుకునే బడ్జెట్! ఆర్థిక ప్రణాళికను, వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల పురోగతిని నిర్దేశించేది బడ్జెటే కావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం మంచి ముహూర్తం చూసుకుని బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఈసారి కూడా మంచి ముహూర్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వీలుగా సమావేశాల తేదీలను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. ఈనెల 29న ఉగాది పండుగ ఉండటంతో ఆలోగానే సమావేశాలను ముగించాలని భావిస్తున్నారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజున గవర్నర్ ప్రసంగిస్తారు. మరుసటి రోజున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం ఉంటుంది. అంటే సమావేశాలు ప్రారంభమైన మూడో రోజున బడ్జెట్ ప్రవేశపెట్టే వీలుంటుంది. తర్వాత ఒక రోజు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటికి అనుగుణంగా సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. -
గవర్నర్ ప్రసంగం అడ్డుకుంటే ఏడాది సస్పెన్షన్
♦ రెండు పూటలా బడ్జెట్ సమావేశాలు ♦ ప్రశ్నోత్తరాల సమయంలో నిరసనలకు నో ♦ సభలోకి ప్లకార్డులను అనుమతించేది లేదు ♦ అసెంబ్లీ రూల్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలని, సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయాలని శాసనసభ రూల్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అధ్యక్షతన స్పీకర్ చాంబర్లో సోమవారం రూల్స్ కమిటీ సమావేశం జరిగింది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్, టీడీపీ నుంచి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే వివేకానంద భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బడ్జెట్ సమావేశాలను రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 దాకా, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల దాకా రెండు సెషన్లుగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య రగడ జరుగుతోంది. ఎమ్మెల్యేల విషయంలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేద ని రూల్స్ కమిటీకి ఫిర్యాదులు అందాయి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి నేతృత్వంలో వారం రోజుల్లో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలను అర్థవంతంగా నిర్వహించేందుకు ప్రశ్నోత్తరాల సమయంలో నిరసనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదని, ప్రశ్నోత్తరాలను సాగదీయ వద్దని అభిప్రాయం వ్యక్తమైంది. ప్రధానంగా సభలోకి ప్లకార్డులను తీసుకురావడాన్ని నిషేధించారు. ఈసారి బడ్జెట్ సమావేశాలను పూర్తిగా డిజిటలైజ్డ్ (పేపర్‌లెస్) సెషన్‌గా జరపాలని... ఈ విధానం ఇప్పటికే అమలవుతున్న గోవా, హర్యానా అసెంబ్లీలను సందర్శించి ఆ పద్ధతులను అధ్యయనం చేయాలని, అసెంబ్లీ గ్రంథాలయాన్ని కంప్యూటరీకరించాలని నిర్ణయించారు. ఇక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వేతనాల పెంపుపైనా సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
మార్చి 5 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు మార్చి ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం జారీ చేసిన నోటిఫికేషన్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. మార్చి ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభమవుతాయి. మార్చి 5 నుంచి 31వ తేదీ వరకూ ఉభయ సభలు సమావేశం కానున్నాయి. మార్చి 12న శాసనసభలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను, 14వ తేదీన వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. -
కీలక బిల్లులపై విపక్షాలను ఎలా ఒప్పించాలి?
న్యూఢిల్లీ: కీలకమైన భూసేకరణ, బొగ్గు, గనుల బిల్లులను రాజ్యసభలో ఆమోదింపజేసుకోవటం ప్రభుత్వానికి సమస్యగా మారింది. లోక్‌సభలో ఆమోదం పొందిన భూసేకరణ, గనులు బిల్లు, బొగ్గు బిల్లులను రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది. వీటికోసం సోమవారం నుంచి రాజ్యసభ సాయంత్రం 7 గంటల తర్వాతా కొనసాగించేందుకు సర్కారు సిద్ధపడింది. గనుల, బొగ్గు బిల్లులను సవరణల నిమిత్తం సెలెక్ట్ కమిటీకి పంపాలని గతవారం రాజ్యసభ నిర్ణయించింది. కమిటీ ఈ నెల 18 నాటికి.. అంటే తొలి దశ బడ్జెట్ సమావేశాలు ముగియడానికి రెండు రోజుల ముందునివేదిక అందిస్తుంది. బొగ్గు, గనుల ఆర్డినెన్స్‌లు ఏప్రిల్ 5తో రద్దవుతాయి. భూసేకరణ బిల్లూ ఆ రోజే రద్దవుతుంది. ఆ లోపు వీటి స్థానంలో బిల్లులను పార్లమెంట్ ఆమోదించాలి. ఇందుకోసం ప్రభుత్వం అనధికారికంగా విపక్షాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. -
బడ్జెట్ సమావేశాలు
సాక్షి ముంబై: అనుకున్నట్టే బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. అయితే కొద్దిసేపటికే ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ మంగళవారానికి వాయిదా పడింది. రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రసంగంతో సభ ప్రారంభమైంది. అనంతరం దివంగత ఉప ముఖ్యమంత్రి ఆర్ఆర్ పాటిల్, దివంగత సీనియర్ కమ్యూనిస్ట్ నేత గోవింద్ పాన్సరే, దివంగత శివసేన ఎమ్మెల్యే బాలా సావంత్ తదితరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య సభను మంగళవారానికి వాయిదా వేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ అసెంబ్లీ ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్ర గవర్నర్ వాహనాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపేందుకు ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితి వల్ల రైతులు విలవిల్లాడుతోంటే.. వారికి కనీస మద్దతు లభించలేదని విపక్ష సభ్యులు విమర్శించారు. సీనియర్ కమ్యూనిస్టు నేత గోవింద్ పాన్సరే హత్య కేసులో ఇంకా ఎలాంటి పురోగతి సాధించలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ‘అమ్హీ సారే పాన్సరే’ (మేమందరం పాన్సరేలం) అంటూ నినాదాలు చేశారు. పాన్సారే హంతకులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎంత ఆర్థిక సాయం ఎప్పుడు ఇస్తుందో తెలపాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఇచ్చిన తేనేటి విందును బహిష్కరించిన విపక్షాలు... మొదటి రోజు దూకుడుతో వ్యవహరించాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చండి... -అజిత్ పవార్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాటవేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలు పూర్తి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు, వడగళ్ల వర్షం, పాన్సరే హత్యతో పాటు ముస్లిం రిజర్వేషన్ రద్దు, ధన్గర్ రిజర్వేషన్ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలి.... -ధనంజయ్ ముండే గత మూడు నెలల్లో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వంపై 302 సెక్షన్ కేసు నమోదు చేయాలని ప్రతిపక్ష నాయకుడు ధనంజయ్ ముండే డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వీరంగం సృష్టిస్తోందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం పడకలు కూడా లేవని ఆయన ఆరోపించారు. టామీ ఫ్లూ టాబ్లెట్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని..ప్రభుత్వం నియంత్రణ కోల్పోతోందని విమర్శించారు. -
బడ్జెట్లో ‘ముస్లిం’లే కీలకం
సాక్షి, ముంబై: బడ్జెట్ సమావేశాల్లో ముస్లిం రిజర్వేషన్ల అంశం కీలకం కానుంది. ఎన్నికలకు ముందు విడిపోయిన రెండు కాంగ్రెస్ పార్టీలు ఈ విషయంలో ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా రిజర్వేషన్ల విషయంపై బీజేపీకి వ్యతిరేకత తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మొదటి బడ్జెట్ సమావేశాలు మార్చి తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభమవనున్నాయి. మార్చి 18న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఒక్కటి కానున్న కాంగ్రెస్, ఎన్సీపీ? ముస్లీం రిజర్వేషన్ల అంశంతో ఎన్నికలకు ముందు విడిపోయిన రెండు కాంగ్రెస్‌లు ఒక్కటయ్యే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ముస్లిం ఓటర్లలో ‘ఎంఐఎం’ పార్టీ ఆదరణ పెరుగుతున్న తరుణంలో రిజర్వేషన్లపై ముస్లింలను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇరు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆదేశాలు వెనక్కితీసుకోవాలని బీజేపీని పట్టుబడుతున్నాయి. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరించాయి. గతంలో ముస్లిం వర్గం ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు ఓటుబ్యాంకుగా ఉండేవి. అయితే ఎంఐఎం వచ్చిన తర్వాత అనేక మంది ముస్లిం ఓటర్లు ఎంఐఎం వైపు మొగ్గుచూపుతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకోవడమే ఇందుకు ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ముఖ్యంగా రాబోయే ఔరంగాబాద్, ముంబై, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచకుని ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, ఎన్సీపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.ఎంపీసీసీ అధ్యక్షుడు అశోక్ చవాన్‌తోపాటు ఎన్సీపీ అధ్యక్షుడు సునీల్ తట్కరే బీజేపీ తన ఆదేశాలను రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేదిలేదని సమాచారం. రిజర్వేషన్ రద్దు కాలేదు-ముఖ్యమంత్రి.. ముస్లీం రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేదని అలానే కొనసాగుతాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాకు తెలిపారు. రిజర్వేషన్లు రద్దు చేశారనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తమ ప్రభుత్వం ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ (అందరితో, అందరి వికాసం) అనే నినాదంతో ముందుకు వెళ్తుందన్నారు. -
‘అసెంబ్లీ’ సన్నాహాలపై స్పీకర్ సమీక్ష
- హాజరైన సీఎస్, ఇన్చార్జి డీజీపీ - శాంతిభద్ర తలు, ఏర్పాట్లపై చర్చ - అసెంబ్లీ రూల్స్ కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల సన్నాహాలపై తెలంగాణ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్ల గురించి పలు సూచనలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకేరోజు మొదలవుతున్నందున ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేయాలని, శాంతిభద్రతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మ, ఇన్చార్జి డీజీపీ సుదీప్ లక్టాకియాతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే సమయాలను ముందే తెలుసుకోవాలని, ఏ రాష్ట సీఎం వస్తున్నా, రెండు రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల వాహనాలు నిలిపివేయాల్సిందేనని పోలీసు అధికారులకు సూచించారు. అసెంబ్లీ మొదటి గేటు నుంచి సీఎంలు, తెలంగాణ మంత్రులు ప్రవేశిస్తారని, రెండో గేట్ నుంచి ఏపీ మంత్రులు వస్తారని, వీరికి ఎల్పీ కార్యాలయాల వద్దే పార్కింగ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయిం చారు. అసెంబ్లీ రూల్స్ కమిటీ భేటీ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నిబంధనలు (రూల్స్) రూపొందించేందుకు ఏర్పాటైన ‘రూల్స్ కమిటీ’ మూడో సారి భేటీ అయ్యింది. ఈ మేరకు కమిటీ చైర్మన్, స్పీకర్ ఎస్. మధుసూదనాచారి అధ్యక్షతన శుక్రవారం ఆయన కార్యాలయంలో సమావేశమై, వివిధ అంశాలపై చర్చించింది. శాసనసభకు శాశ్వత ప్రాతిపదికన నిబంధనల తయారీకి సభ్యుల నుంచి పలు ప్రతిపాదనలు వచ్చాయి. సమావేశాలకు ప్రత్యక్ష ప్రసారాలు ఉండాలని, లైవ్ ఫీడ్‌ను సెన్సార్ చేయొద్దని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు సూచించారు. ప్రసారాల ఏజెన్సీని దూరదర్శన్‌కు ఇవ్వాలన్నారు. వాయిదా తీర్మానాలను ప్రశ్నోత్తరాల సమయం కంటే ముందే చేపట్టాలని దాదాపు అన్ని పార్టీల సభ్యులు స్పీకర్‌ను కోరారు. సమావేశాలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించేలా నిర్ణయించారు. బడ్జెట్‌పై సాధారణ చర్చకు ఆరు రోజులు, పద్దులపై చర్చకు 18 రోజులు అవసరమని కోరారు. అవసరమైతే పనిగంటలనే కాదు, పని రోజులు కూడా పెంచుతామని, ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారని తెలి సింది. కమిటీ సభ్యులు మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, కేటీఆర్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, టి.వెంకటేశ్వర్లుభేటీకి గైర్హాజరయ్యారు. మార్చి 4న రెండు రాష్ట్రాల సభాపతుల భేటీ మార్చి 4న తెలంగాణ, ఏపీ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్లు భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్రం త రఫున తీసుకున్న నిర్ణయాలను వారి దృష్టికి తీసుకు రావాలని, వారు ఏమైనా సూచనలు చేస్తే మార్పులు, చేర్పులు చేసుకోవాలని నిర్ణయించారు. బందోబస్తు ఏర్పాటుకు ప్రణాళికను సిద్ధం చేసేందుకు పోలీసు అధికారులూ 4వ తేదీనే భేటీ కానున్నారు. మొదటిగేటు, లేదా రెండో గేటు ఎక్కడి నుంచైనా ఇద్దరు సీఎంలు రావొచ్చన్న అంశాన్నీ చర్చించారు. ఈ భేటీకి ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, శాసన సభా కార్యదర్శి రాజసదారాం హాజరయ్యారు. మార్చి 7 నుంచి అసెంబ్లీ, మండలి బడ్జెట్ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఈఎస్ఎల్ న రసింహన్ శుక్రవారం వేర్వేరుగా నోటిఫికేషన్ జారీ చేశారు. సమావేశాలు ఉదయం 11 గంటలకు మొదలవుతాయని పేర్కొన్నారు. అదేరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. -
కఠినంగా ఉన్నందునే..
సజావుగా సమావేశాలు: హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: శాసనసభలో కఠినంగా వ్యవహరించినందుకే సమావేశాలు సజావుగా, సంతృప్తికరంగా జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ దశాదిశను నిర్దేశించే విధంగా ఈ సమావేశాలు పూర్తి సంతృప్తికరంగా జరిగాయన్నారు. ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నా అన్ని పార్టీలతోనూ సంప్రదించిన తర్వాతనే నిర్ణయాలను తీసుకున్నామన్నారు. అన్ని పక్షాల నేతలతో స్వయంగా మాట్లాడి, ఆయా పార్టీల సభ్యులను సమన్వయం చేసుకుని శాసనసభలో వ్యవహరించామని హరీశ్ చెప్పారు. చిన్నచిన్న గొడవలకే గత ప్రభుత్వాలు శాసనసభను వాయిదా వేసేవని ఆరోపించారు. ఈ సమావేశాల్లో కొంత కఠినంగా వ్యవహరించడం వల్లనే పోడియం దగ్గరకు వెళ్లే సభ్యుల సంఖ్య తగ్గిందన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కొన్ని పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కొంత కఠినంగా వ్యవహరించినామని మంత్రి చెప్పారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా రా్రష్ట్ర ద్రోహానికి పాల్పడే కొన్ని పార్టీల సభ్యులను సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్నారు. దీనివల్లనే అనేక సమస్యలు చర్చకు వచ్చాయని, ఎంతోమంది కొత్త సభ్యులకు మాట్లాడే అవకాశం దక్కిందన్నారు. గతంలో అయిదేళ్లు కూడా నోరువిప్పని సభ్యులున్నారని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు కోరిన అంశాలపైనా సావధాన తీర్మానం సందర్భంగా చర్చించామని హరీశ్‌రావు వివరించారు. కొన్ని ప్రభుత్వమే ప్రకటనలు చేయంగా, ప్రతిపక్షాలు కోరిన అంశాలపైనా సుదీర్ఘంగా చర్చలు జరిపామన్నారు. 1996 తర్వాత పద్దులపై ఇంత చర్చ జరగడం ఇదే తొలిసారని చెప్పారు. చర్చలు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రతిపక్ష సభ్యులు కూడా చెప్పే స్థాయిలో తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు జరిగాయన్నారు. సంక్షేమంపై 7.27 గంటలపాటు చర్చలు జరిపామంటే దానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చునన్నారు. -
నేటి సభలో విద్యుత్ పంపిణీపై చర్చ
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ‘విద్యుత్’ సెగలు తాకనున్నాయి. బడ్జెట్ సమావేశాల రెండో రోజైన శుక్రవారం నాడు ప్రధానంగా విద్యుత్ సమస్యపై చర్చ జరుగనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగనుంది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావనకు వచ్చే పది ప్రశ్నల్లో.. మూడు ప్రశ్నలు విద్యుత్‌కు సంబంధించినవే ఉన్నాయి. దీంతో అధికార, విపక్షాల మధ్య ఈ అంశంపై వివాదం రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రశ్నోత్తరాల్లో సీఎం కేసీఆర్ సమాధానాలు ఇవ్వనున్నారు. విద్యుత్ ఉత్తత్తి, పంపిణీ, నూతన పారిశ్రామిక విధానం, కల్యాణ లక్ష్మీ, భూ పంపిణీ, ఫీజు రీయింబర్స్ మెంట్ లపై తదితర అంశాలు ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బడ్జెట్ పై చర్చను ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రారంభిస్తారు. -
తెలంగాణ అసెంబ్లీలో నేడు ‘కరెంటు’ సెగ!
ప్రభుత్వాన్ని నిలదీయనున్న విపక్షాలు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ‘విద్యుత్’ సెగలు తాకనున్నాయి. బడ్జెట్ సమావేశాల రెండో రోజైన శుక్రవారం నాడు ప్రధానంగా కరెంట్ సమస్యపైనే చర్చ జరుగనుంది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావనకు వచ్చే పది ప్రశ్నల్లో.. మూడు ప్రశ్నలు విద్యుత్‌కు సంబంధించినవే ఉన్నాయి. దీంతో అధికార, విపక్షాల మధ్య ఈ అంశంపై వివాదం రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరెంటు సంక్షోభంపై ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ తరుణంలో అసెంబ్లీలోనూ ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అని పార్టీలూ సమాయత్తమయ్యాయి. మరోవైపు ఈ సమస్యకు సమైకాంధ్ర పాలకుల వివక్షనే ప్రధాన కారణమని, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఉల్లంఘించి.. న్యాయమైన వాటా ప్రకారం రావాల్సిన విద్యుత్‌ను ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుపడుతోందని వాదిస్తున్న అధికార పార్టీ.. ఇప్పుడు ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజెప్పేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి, కొరత వంటి గణాంకాలతో పాటు తెలంగాణ, ఏపీల మధ్య ఒప్పందాలు, విద్యుత్ పంపిణీ, కృష్ణపట్నం, వైజాగ్ హిందూజా, దిగువ సీలేరు ప్రాజెక్టుల్లో రాష్ట్రానికున్న వాటాలు, వ్యవసాయానికి 9 గంటల సరఫరా, పంప్‌సెట్లపై సర్‌చార్జీ రద్దు.. వంటి అంశాలు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. -
హామీలపై అసెంబ్లీలో చర్చించాలి
ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని సీపీఐ రాష్ట్ర నాయకుడు గుండా మల్లేశ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. హామీల అమలులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముట్టడించారు. ఈ సందర్భంగా గుండా మల్లేశ్ మాట్లాడుతూ ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదని విమర్శించారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని, వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని అన్నారు. ఆగస్టు 19న సర్వే చేసి ఇప్పుడు మరో సర్వే ఎందు చేపడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ముందుకు సాగుతుందో.. లేదోననే అనుమానం ఉందన్నారు. రాష్ట్రంలో ఐదు లక్షల మంది దళితులు ఉన్నారని, వీరికి సుమారు 15 లక్షల ఎకరాల భూమి అవసరమని తెలిపారు. పరిశ్రమలకు భూమి సిద్ధగా ఉందంటున్న ప్రభుత్వం దళితులకు మూడెకరాలు ఎందుకు పంపిణీ చేయలేకపోతుందో చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాాష్ట్ర నాయకులు వెంకటరామయ్య, సీపీఎం రాష్ట్ర నాయకుడు టి.సాగర్, సీపీఐ జిల్లా కార్యదర్శి శంకర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.విలాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు నారాయణ, సీపీఐ నాయకులు ముడుపు ప్రభాకర్‌రెడ్డి, నళినిరెడ్డి, విద్యార్థి నాయకులు చంటి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు వామపక్షాల నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌కు ర్యాలీగా తరలివచ్చారు. గేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. సమస్యలతో కూడిన వినతిపత్రం కలెక్టర్ జగన్మోహన్కు అందజేసేందుకు లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాయకులను జీపుల్లో, డీసీఎంలో తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని సుమారు 250 మంది వరకు వన్‌టౌన్‌కు వెళ్లారు. నాయకులను విడుదల చేయాలని నినదించారు. -
బడ్జెట్లో సంక్షేమానికే ప్రాధాన్యం: ఈటెల
ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తొలి బడ్జెట్: ఈటెల ♦ మా ప్రాథమ్యాలను ఇందులో ఆవిష్కరించబోతున్నాం ♦ కొత్త రాష్ట్రంలో ఆదాయానికి, వనరులకు కొదువ లేదు ♦ నిధుల సమీకరణకు మార్గాలున్నాయి.. కేంద్ర నిధులు వస్తాయి ♦ ఆదాయం పడిపోతుందంటూ కొన్ని దుష్టశక్తులు ప్రచారం చేస్తున్నాయి ♦ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రలు జరుగుతున్నాయి ♦ రైతుల ఆత్మహత్యల నివారణకు దీర్ఘకాలిక చర్యలు చేపడతామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధికి తోడ్పడేలా తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యలపై ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో తాను ఎన్నోసార్లు కొట్లాడానని.. అయినా ఆంధ్రా పాలకులు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదన్నారని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం కలిగినందుకు సంతోషంగానూ, గర్వంగానూ అనిపిస్తోందని ఈటెల చెప్పారు. బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రాథమ్యాలు, స్వరూపం, భవిష్యత్ లక్ష్యాలకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఆకలితో అలమటిస్తున్న అణగారిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మా బడ్జెట్ ఉండబోతోంది. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటివరకూ రూ. 200గా ఉన్న పింఛన్లును రూ. 1,000కి, రూ. 500 పింఛన్లను రూ. 1,500కు పెంచాం. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి ఇచ్చే బియ్యాన్ని ఆరు కేజీలకు పెంచాం. 20 కేజీల బియ్యం పరిమితిని తీసేశాం. వ్యవసాయంతో గ్రామ ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉన్నందున ఈ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పేద దళిత యువతుల వివాహాలకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాం. * తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రరూపం చేసి రాష్ట్రాన్ని ఎలా సాధించామో... అలాగే మా ప్రభుత్వం చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్ వంటి ప్రాజెక్టులను అమలుచేసి తీరుతాం. మా ప్రాథమ్యాలను బడ్జెట్ రూపంలో ఆవిష్కరించబోతున్నాం. నిధుల సమీకరణకు మా మార్గాలు మాకున్నాయి. ఏడాదిలోనే మా సృజనాత్మకత ఏమిటో చూపెడతాం. దుష్టశక్తుల ప్రచారమది.. కేంద్రంతో పంచాయితీ పెట్టుకోవాలని మాకేం లేదు. గత ప్రభుత్వాలు ఎలాంటి సంబంధాలు కొనసాగించాయో... మేం కూడా అదే రీతిన వ్యవహరిస్తాం. నిద్రపోయేవాళ్లను లేపొచ్చు గానీ, నిద్ర నటించే వాళ్లను లేపలేం కదా. టీడీపీ, బీజేపీ మధ్య అవినాభావ సంబంధం ఉంది. తెలంగాణలో ఆదాయం పడిపోతుందని, మా ప్రభుత్వంపై కొంత విషప్రచారం జరుగుతోంది. కొత్త రాష్ట్రంలో ఆదాయానికి, వనరులకు కొదువలేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూసే కొన్ని దుష్ట శక్తుల వల్లే ఇటువంటి ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన జరిగాక రెండు రాష్ట్రాల ప్రజలు బాగానే ఉన్నారు. తెలంగాణలో పాలన సజావుగా జరగవద్దనే సంకుచిత మనస్తత్వంతో వ్యవహరించడం సమంజసం కాదు. నిధులు తప్పకుండా వస్తాయి.. కేంద్రంతో ఘర్షణకు, నిధులకు సంబంధం లేదు. 13వ ఆర్థిక సంఘం నిధులు ఎలా వచ్చాయో, 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా అలాగే వస్తాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, మాకు రావాల్సిన గ్రాంట్లు కేంద్రం నుంచి తప్పకుండా వస్తాయి. కొత్త రాష్ట్రానికి అవసరమైన మేరకు కేటాయింపులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం. ఈ దిశగా మా ప్రయత్నం కొనసాగుతుంది. ఏళ్లుగా ఉన్న సమస్యల వల్లే.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ఒక నెల, ఒక ఏడాదిలో వచ్చే సమస్యలు కారణం కాదు. అనేక ఏళ్లుగా ఉన్న సమస్యలే కారణం. పంటలు ఎండిపోయి, అప్పుల పాలై, ఏదిక్కూ లేని పరిస్థితుల్లోనే రైతులు ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎండిపోతున్న బోర్లు, బావులు, కాలిపోతున్న మోటార్లు, పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం ఆత్మహత్యలకు కారణాలు. 1984 నుంచి ఇప్పటివరకు 25 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మా ప్రభుత్వం వచ్చి ఐదు నెలలే అయింది. ఈ సమస్యలకు మూలాలను అర్థం చేసుకొని వాటిని నివారించాలనే మా ప్రయత్నం. పైసలిచ్చినంత మాత్రాన ఆత్మహత్యలు ఆగవు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నాం. మా ప్రభుత్వం చేపట్టిన పథకాలు అమలయ్యాక ఆత్మహత్యలు కొనసాగితే అప్పుడు మాది బాధ్యత అవుతుంది. హామీలన్నీ నెరవేరుస్తాం.. ఉద్యమకారులుగా మా గమ్యాన్ని చేరాం. పాలకులుగా కూడా ప్రజలకిచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తాం. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాం. టాస్క్‌ఫోర్స్ నివేదికలు తెప్పించుకున్నాం. అన్ని అంశాలను బేరీజు వేసుకొని బడ్జెట్‌ను రూపొందించాం. 14 ఏళ్లుగా మాపై విశ్వాసం ఉంచారు. సాధ్యం కాదనుకున్న తెలంగాణను సాధించాం. ఆంధ్రా పార్టీల, ఆంధ్ర మీడియా రణ గొణ ప్రచారాలని నమ్మకుండా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నా. బంగారు తెలంగాణను నిర్మించేదాక ఈ ప్రభుత్వం నిద్రపోదు. -
బడ్జెట్లో జిల్లాకు భారీ కేటాయింపులు?
నేటి నుంచే బడ్జెట్ సమావేశాలు తెలంగాణ తొలి బడ్జెట్... రాజీలోని పోరాటంతో రాష్ట్రం సాధించిన టీఆర్ఎస్ తొలిసారి ప్రవేశపెట్టబోతోన్న బడ్జెట్.. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కలల బడ్జెట్.. అందుకే ఇపుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడంతో పాటు, నీటిపారుదల శాఖ మంత్రి, డిప్యూటీ స్పీకర్లు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో మెతుకుసీమపై ఎలాంటి వరాలు కురుస్తాయోనని జిల్లా వాసులంతా ఎదురుచూస్తున్నారు. మన ఆశలకు తగ్గట్టుగానే తొలి బడ్జెట్లో మనకే తొలి ప్రాధాన్యం దక్కినట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాకతీయల కాలంలో ఆతర్వాత నిజాం హయాంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు కాలంతో పాటే అంతర్థానమయ్యాయి. మాయమైన చెరువులకు మళ్లీ జీవం పోసి నాటి జలకళను తెప్పించి, బీడు భూములను తడిపే దిశగా కేసీఆర్ సర్కారు తొలి అడుగులు వేస్తోంది. ఉన్న ఒక్క మంజీరా జీవనదిని వలస వాదులు చెరబట్టి హైదరాబాద్‌కు తరలించుకుపోతే, ఉన్న చిన్న నీటి వనరులతోనే ఆయకట్టుకు నీరు పారించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కసరత్తు చేశారు. నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇంతకాలం కాంట్రాక్టర్ల జేబులు నింపిన చెరువుల మరత్తుల పునరుద్ధరణ ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు నడిపించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుల శాఖ మంత్రి హరీష్‌రావు ఈ జిల్లాకు చెందిన బిడ్డలే కావటంతో బడ్జెట్లో జిల్లాకే పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. రోడ్ల విస్తరణ కోసం రూ.1000 కోట్లు, చెరువుల పునరుద్ధరణకు రూ. 500 కోట్లు వాటర్ గ్రిడ్లకు రూ. 500 కోట్లు, గ్రీన్‌హౌస్‌కు రూ.200 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు సమాచారం. ప్రాణహిత- చేవెళ్ల, సింగూరు, ఘణపురం ప్రాజెక్టులకు కూడా బడ్జెట్లో నిధుల వరద పారినట్టు తెలుస్తోంది. ఇవికాకుండ ‘మన ఊరు- మన ప్రణాళిక’ పథకం కింద సిద్ధం చేసిన ప్రతిపాదనల కోసం రూ.1,500 కోట్లు ఇచ్చి, తొలి తెలంగాణ బడ్జెట్ మెతుకు సీమ రైతాంగం ఆశలను చిగురించే విధంగా రూపొందించినట్లు తెలుస్తోంది. సామాజిక ఉద్యమంగా చెరువుల పునరుద్ధరణ జిల్లాలో ఇటీవలే నీటివనరులకు సంబంధించి నీటిపారుదలశాఖ సమగ్ర సర్వే నిర్వహించింది. జిల్లాలో మొత్తం 9,970 నీటి వనరులు ఉన్నట్లు తేలింది. వీటిలో 578 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 109 ఆనకట్టలు, 5,509 పంచాయతీరాజ్ కుంటలు, 274 ప్రైవేటు కుంటలు, 1,927 చెక్‌డ్యాంలు, 1,336 పర్కులేషన్ ట్యాంకులు, 237 ఇతర నీటి వనరులు ఉన్నాయి. వీటి మీదనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. జిల్లాలో గుర్తించిన చెరువుల, కుంటలను ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో దశల వారీగా పూర్తి చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం జిల్లాలోని 20 శాతం చెరువుల, కుంటల అభివృద్ధి, మరమ్మతు పనులను చేపట్టనున్నారు. నీటివనరుల సమగ్ర సర్వే ఆధారంగా అధికారులు జిల్లాలో మొదటి దశలో చెరువులు, కుంటల మరమ్మతు పనులు చేపట్టేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. జిల్లాలో మొదటి దశ కింద 1,588 చెరువులు, కుంటల అభివృద్ధి, మరమ్మతు పనులు చేపట్టనున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 175, దుబ్బాకలో 275, గజ్వేల్‌లో 239, అందోలులో 124, సంగారెడ్డిలో 107, పటాన్చెరులో 92, జహీరాబాద్‌లో 25 చెరువుల మరమ్మతు పనులు చేపట్టనున్నారు. నర్సాపూర్, మెదక్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 551 చెరువుల మరమ్మతు పనులు చేపట్టే విధంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం. వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి దశల వారీగా జిల్లాలోని ప్రతి ఇంటికీ తాగునీటి నల్లా కనెక్షన్ ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు. మొత్తం 446 కిలోమీటర్ల మేరకు పైప్‌లైన్ ఏర్పాటు చేసి నీళ్లు అందించే యోచనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. దీనికోసం ప్రభుత్వం రూ.5,600 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. తాగునీటికోసం సింగూరు ప్రాజెక్టు నుంచి 8 టీఎంసీల నీళ్లను వాడుకునేందుకు రూపకల్పన చేసినట్లు సమాచారం. మండలానికి రెండు లేన్ల రోడ్లు బడ్జెట్లో జిల్లాలోని రోడ్లకు అధిక ప్రాముఖ్యత కల్పించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించినట్లుగా మెదక్ జిల్లాలో రోడ్ల విస్తరణకు రూ.1,000 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు సమాచారం. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాన్ని కలుపుతూ కనీసం రెండు లేన్ల రోడ్లు నిర్మించే విధంగాబడ్జెట్లో రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు, ఇస్మల్కాపూర్ నుంచి హైదరాబాద్ వరకు నాలుగు లేన్ల రోడ్ల నిర్మాణానికి రూపకల్పన చేసినట్లు సమాచారం. దీంతోపాటు గజ్వేల్, సంగారెడ్డి పట్టణాల్లో రింగ్ రోడ్డు నిర్మాణానికి బడ్జెట్లో పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. విత్తనోత్పత్తి హబ్‌గా జిల్లాలో గ్రీన్ హౌస్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లోరూ. 200 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. గజ్వేల్ పట్టణంలో ఉద్యాన విశ్వవిద్యాలయం, ములుగులో ఫారెస్ట్రీ కాలేజ్ , హార్టీకల్చర్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ తదితర సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కూరగాయల సాగు చేయడానికి వీలుగా నిధుల కేటాయింపు జరిగినట్లు తెలిసింది. జిల్లాలో నాణ్యమైన విత్తన గింజలను పండించే విధంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సమచారం. -
అన్నీ బడ్జెట్ తర్వాతే!
కేబినెట్ విస్తరణ, పదవుల భర్తీ, ప్లీనరీ సమావేశాలు అన్ని కార్యక్రమాలు తర్వాతే చేపట్టాలని కేసీఆర్ యోచన హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల తర్వాతే తన మార్కు పాలన మొదలుపెట్టాలని, అన్ని పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. కేబినెట్ విస్తరణ మొదలు టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల వరకు అన్ని కార్యక్రమాలనూ బడ్జెట్ తర్వాతే చేపట్టాలని యోచిస్తున్నారు. ఈ మేరకు సన్నిహితులతో సీఎం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సెప్టెంబర్ తొలి వారంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని అప్పట్లో సర్కారు ప్రకటించినా ఇప్పటివరకు కుదరలేదు. అయితే వచ్చే నెల తొలివారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్లకు పాలకవర్గాల ఎంపిక, మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు, కేంద్ర సర్వీసు అధికారుల బదిలీలు(ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల కేటాయింపులు పూర్తయితే) తదితర అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంటున్నారు. నిజానికి బుధవారమే(22న) కేబినెట్ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. అయితే రెండు రోజులుగా సీఎంతో పలు అంశాలపై అభిప్రాయాలను పంచుకున్న పలువురు నాయకులు మాత్రం దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమావాస్యకు ముందు కేసీఆర్ ఆ పని చేపట్టబోరని వారు చెబుతున్నారు. ముహూర్తాలు, శకునాలపై విశ్వాసమున్న సీఎం.. 22న కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం లేదంటున్నారు. బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం: బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల తొలివారంలో నిర్వహించే అవకాశమున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ నెల 27న సమావేశాలు ప్రారంభించాలని తొలుత అనుకున్నా పలు కారణాలతో దాన్ని నవంబర్ మొదటి వారానికి మార్చుకున్నట్టు తెలుస్తోంది. పనులన్నింటిలో జాప్యానికి కేంద్ర సర్వీసు అధికారుల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యమే కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అధికారుల సంఖ్య పరిమితంగా ఉండటంతో వారికి ఎక్కువ బాధ్యతలను అప్పగించాల్సి వస్తున్నదని అంటున్నాయి. -
నెలాఖరులో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్: రాష్ర్ట బడ్జెట్ సమావేశాలను ఈ నెలాఖరులో నిర్వహించడానికి సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు కసరత్తును దాదాపు పూర్తి చేశారు. బడ్జెట్ సమావేశాల కోసం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం సాయంత్రం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు రూ. 80 వే ల కోట్ల మేరకు బడ్జెట్ ఉంటుందని అంచనా. జూన్ 2 నుంచే బడ్జెట్ ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే జూన్ నుంచి అక్టోబర్ వరకు అయిన ఖర్చుతోపాటు నవంబర్ నుంచి మార్చి వరకు చేయాల్సిన వ్యయానికి సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదం పొందనుంది. సమావేశాలు 20 రోజులు జరిగే అవకాశమున్నట్లు సమాచారం. -
ప్రధాన ప్రతిపక్ష హోదా మాకే దక్కాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా తమకు సహజంగానే దక్కాలని కాంగ్రెస్ అభిప్రాయపడింది. దీనికి భిన్నంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది నియంతృత్వ పోకడ కిందకు వస్తుందని, అది దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొం ది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభలో ప్రధా న ప్రతిపక్ష నేత ఎంపికపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పైవిధంగా స్పందించింది. ఈ అంశంపై పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. అధికార పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీకిగానీ, కూటమి ని సాధారణంగానే ప్రధాన ప్రతిపక్షంగా పరిగణిస్తారని, ఆ ప్రకారం తమకే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సజావుగా నడవాలన్నా.. పలు విభాగాల అధిపతుల నియామకం సక్రమంగా జరగాలన్నా ప్రధాన ప్రతి పక్ష నేత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నా రు.లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం స్థానాల్లో పది శాతం(55 సీట్లు) దక్కాలి. అయితే ప్రస్తుత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో ప్రధాన ప్రతిపక్ష నేత ఎం పికపై లోక్‌సభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
జనరంజకంగా!
నేటినుంచి బడ్జెట్ సమావేశాలు సాక్షి, ముంబై: ప్రజాసామ్యకూటమి (డీఎఫ్) ప్రభుత్వం చివరిసారిగా ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల ప్రభావం ఈ సమావేశాల్లో కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఈసారి ప్రభుత్వం ప్రతిపాదించే జనాకర్షణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఓటర్లను ఆకట్టుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వీలుగా అధికారపక్షం అందరికీ అనుకూలమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే విధంగా కొన్ని అంశాలను తెరమరుగు చేసేందుకు యత్నించే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇలాంటి విషయాల్లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించడమనేది సర్వసాధారణం. ఆదర్శ్ కుంభకోణం, టోల్ వసూలు, శాంతి భద్రతలు, అక్రమ నిర్మాణాలు తదితర అంశాలతోపాటు విద్యుత్, జలవనరుల శాఖల్లో అవినీతి ఆరోపణలు ఈ సమావేశాల్లో గందరగోళాన్ని సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా 2000 సంవత్సరం వరకు మురికివాడల క్రమబద్ధీకరణ అంశం చర్చల్లోకి రానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రితోపాటు అధికారపక్షానికి చెందిన ఇతర నాయకులు ఈ అంశంపై ప్రజలకు హామీలిచ్చారు. దీంతో ఎన్నికలకు ముం దు జరగనున్న ఈ బడ్జెట్లో 2000వ సంవత్సరం వరకు ఏర్పాటైన మురికివాడలను క్రమబద్ధీరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రతిపాదించనున్నా రు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1995 నాటికి మురికివాడల సంఖ్య 10 లక్షలు కాగా 2011 నాటికి అది ఏకంగా 27 లక్షలకు చేరుకుంది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మురికివాడలను క్రమబద్ధీకరించాలని అధికార పక్షాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తే ఇబ్బంది ఉండదని కొందరు కాంగ్రెస్ నాయకులు సూచిం చినట్టు తెలిసింది. దీంతో ఈ సమావేశాల్లో మురికివాడల క్రమబద్ధీకరణకు సంబంధించి ఓ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా మురికివాడల క్రమబద్ధీకరణ నిర్ణయానికి అన్ని పార్టీలు మద్దతు పలికే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. తేనీటి విందు బహిష్కరణ సరికాదు: సీఎం శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు ఇచ్చే తేనీటి విందుకు ప్రతిపక్షాలు హాజరుకాకపోవడం శోచనీయమని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్ పేర్కొన్నారు. తేనీటి విందులో పాల్గొన్న అనం తరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తేనీటి విందును బహిష్కరించడం పార్లమెంటరీ సంప్రదాయానికి విరుద్ధం. ప్రభుత్వం లేవనెత్తే అంశాలపై చర్చలు జరి పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రతిపక్షాలు ఆవిధంగా వ్యవహరించాయి. ప్రచార లబ్ధి పొందేందుకే ఇలా చేశాయి’ అని ఆయన అన్నారు. ఆదర్శ్’పై జవాబు కోరతాం: ఏక్నాథ్ ఖడ్సే ముంబై: ఆదర్శ్ కుంభకోణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అశోక్చవాన్పై ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయమై గవర్నర్ జవాబుకోరతామని శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే పేర్కొన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్ని పురస్కరించుకుని ఆదివారం ఆయన ఇక్కడ మీడియా తో మాట్లాడారు. ఈ సమావేశాల్లో ఆదర్శ్ కుంభకోణంతోపాటు వివిధ అంశాలను సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుందనే విషయం చెప్పాలంటూ డిమాండ్ చేస్తామన్నారు. ప్రతిపక్షాలు బలహీనంగా లేవని, ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లోనూ నిలదీస్తాయన్నారు. సమావేశాల వ్యవధిని పెంచాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. కాగా సమావేశాల ప్రారంభానికి ముందురోజు ముఖ్యమంత్రి ఇచ్చే సంప్రదాయ తేనీటి విందును విపక్షాలు బహిష్కరించాయి.