మార్చి 28తో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 29న గవర్నర్ విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో 28నే అప్రాప్రియేషన్ బిల్లును ఆమోదించాలని నిర్ణయించింది. అదే రోజు అప్రాప్రియేషన్ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ నుంచి నిధుల వ్యయానికి మార్గం సుగమం అవుతుంది.