సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం (జనవరి 31) ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంమొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఇందులో 2024–25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అలాగే, పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడుల ప్రాజెక్ట్‌లను కూడా మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
AP: నేడు కేబినెట్ భేటీ
Published Wed, Jan 31 2024 4:17 AM | Last Updated on Wed, Jan 31 2024 10:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment