Cabinet Meetings
-
మహిళా సాధికారతే.. సీఎం జగన్ లక్ష్యం: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, తాడెపల్లి: సీఎం జగన్ పరిపాలన మహిళా సాధికారతే లక్ష్యంగా జరుగుతోందని పౌర సరఫరాల శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. మహిళా స్వావలంబనతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అనేక మంది సంఘ సంస్కర్తల ఆలోచనల సమ్మిళతమే జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసినా చెప్పింది చేసే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన నాల్గవ విడత చేయూత పంపిణీ చేస్తామని మంత్రి చెల్లుబోయిన వేణు వెల్లడించారు. 26,98,931 మందికి 5వేల 60 కోట్ల 4 లక్షలు చేయూత పంపిణీకి ఆమోదం లభించినట్లు చెప్పారు. చేయూత పథకంపై ప్రతిపక్షాలు చేసేవన్నీ అసత్య ప్రచారాలేనని తెలిపారు. రూ.19,188 కోట్లను నాలుగు విడతల్లో చేయూత కింద అందించామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. డీఎస్సీ నిర్వహణకు 6,100 పోస్టులతో కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. 2019 నుంచి విద్యారంగంలో 14,219 పోస్టుల భర్తీ చేశామని చెప్పారు. యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచినట్లు తెలిపారు. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. 2019 నుంచి 2 లక్షల 13 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని వెల్లడించారు. ఎస్‌సీఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యం ఎస్‌సీఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినేట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదివే ఐబీని ఏపీ విద్యావ్యవస్థలోకి తీసుకురానున్నామని చెప్పారు. ఈ ఐబీ విద్యతో మన విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటారని తెలిపారు. ఈ విధానంతో విద్యార్థుల కమ్యునికేషన్ స్కిల్స్ అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతాయని అన్నారు. ఉపాధ్యాయ, విద్యాశాఖ అధికారులకు కూడా ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. ఐబీ విద్యతో విప్లవాత్మక మార్పులు ఉంటాయని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఇదీ చదవండి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. మెగా డీఎస్సీకి గ్రీన్‌సిగ్నల్ -
AP: నేడు కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం (జనవరి 31) ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంమొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఇందులో 2024–25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడుల ప్రాజెక్ట్‌లను కూడా మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..!
-
నేతల పనితీరుపై ఆరా.. కారెలా నడుస్తోంది?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. తన కేబినెట్ సహచరులతో వరుస భేటీలు జరుపుతున్నారు. ప్రగతి భవన్ వేదికగా ఉమ్మడి జిల్లాల వారీగా జరుపుతున్న సమావేశాల్లో నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై లోతుగా చర్చిస్తున్నారు. ఇప్పటివరకు నల్లగొండ, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన సమీక్షలు పూర్తయినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వివిధ సర్వే సంస్థలు, నిఘావర్గాల ద్వారా అందిన నివేదికలు, ఏప్రిల్, మే నెలల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలపై పార్టీ ఇన్చార్జిలు ఇచ్చిన రిపోర్టుల్లోని అంశాలు ఈ భేటీల్లో ప్రస్తావనకు వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ఇతర కీలక నేతల పనితీరు, నియోజకవర్గ స్థాయిలో వారి నడుమ సమన్వయ లోపం వంటి అంశాలపై మంత్రుల అభిప్రాయాలను సీఎం తెలుసుకుంటున్నారు. మంత్రులు కూడా తమ దృష్టికి వచ్చిన అంశాలను తెలియజేయడంతో పాటు ఎమ్మెల్యేల పనితీరుపై తమ మనోగతాన్ని వెల్లడిస్తున్నారు. ఎమ్మెల్యేల ఏకపక్ష ధోరణి కారణంగా చాలాచోట్ల పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోందనే అభిప్రాయం ఈ భేటీల్లో వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల పార్టీ నేతలు గ్రూపులను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేలకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని కేసీఆర్‌కు మంత్రులు తెలిపారు. కాగా పార్టీకి నష్టం చేస్తున్న నేతల వివరాలను సేకరిస్తున్న ముఖ్యమంత్రి, వారి విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై దిశా నిర్దేశం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నియోజకవర్గాల వారీగా విపక్ష పార్టీల బలాలు, బలహీనతలపై కూడా ఈ భేటీల్లో చర్చిస్తున్నట్లు తెలిసింది. అవసరమైన చోట చేరికలకు గ్రీన్ సిగ్నల్ సర్వే సంస్థల నివేదికలు, వివిధ నిఘా సంస్థల రిపోర్టుల ఆధారంగా, నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్, విపక్షాల బలాలు, బలహీనతలపై కేసీఆర్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల ద్వారా ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాల్సిందిగా మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు విఫలమైన చోట ఇతరులకు టికెట్ కేటాయించే అంశంపై మాత్రం ఈ భేటీల్లో సీఎం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది. పార్టీకి ఉపయోగపడతారని భావించే అసంతృప్త నేతలతో మాట్లాడి వారు పార్టీలోనే ఉండేట్టుగా చూడటంతో పాటు ఇతర పార్టీల్లో ప్రజాదరణ కలిగిన నేతలతో సంప్రదింపులు జరపాలనే సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. కేవలం క్షేత్ర స్థాయి పరిస్థితులకే పరిమితం కాకుండా ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పార్టీ మేనిఫెస్టో, ప్రచార వ్యూహం ఖరారు వంటి అంశాలపై కూడా కేసీఆర్ దృష్టి సారించారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై మంత్రుల నుంచి సీఎం అభిప్రాయాలు కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, వాటి ప్రభావం, చేపట్టాల్సిన మార్పులు చేర్పులు తదితర అంశాలపై తన అభిప్రాయాలను కూడా ఈ భేటీల్లో కేసీఆర్ వెల్లడిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు, కీలక నేతలకు కేటీఆర్ క్లాస్ సీఎం కేసీఆర్ ఇలా మంత్రులతో వరుస భేటీలు జరుపుతుండగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు.. పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలతో సమావేశమవుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందుతుండటం, టికెట్‌ను ఆశిస్తున్న నేతల నడుమ ఆధిపత్య పోరుపై ఆయన దృష్టి సారించారు. వివాదాస్పద ప్రకటనలు, పనులతో తరచూ వార్తలకెక్కుతున్న ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు కేటీఆర్ తరఫున ఫోన్లు వెళ్తున్నాయి. ఈ మేరకు ప్రగతిభవన్‌కు వస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు కేటీఆర్ సీరియస్‌గా క్లాస్ తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు రాజయ్య, శంకర్ నాయక్, రెడ్యా నాయక్, రోహిత్‌రెడ్డి, చెన్నమనేని రమేశ్ తదితరులు ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. టికెట్ల కేటాయింపు అంశం అధినేత కేసీఆర్ చూసుకుంటారని, వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండాలని కేటీఆర్ స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 20 నుంచి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించే వ్యూహంపై చర్చించేందుకు కేసీఆర్ మంగళవారం లేదా బుధవారం పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. -
కేబినెట్ భేటీలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
బయట నిర్ణయాలకు కేబినెట్ ముసుగు!
సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాలనలో తీసుకున్న అక్రమ నిర్ణయాలకు చివరి కేబినెట్ సమావేశాల్లో ఆమోదముద్ర వేయించడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాటికి సక్రమం ముసుగు వేశారు. నిబందనలకు విరుద్ధమని, సంబంధిత శాఖలు అభ్యంతరం తెలిపినా లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకుని కేబినెట్ భేటీలో ఆమోదించారు. రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడి మండలి (ఎస్ఐపీబీ)లో తీసుకున్న నిర్ణయాలను కూడా కేబినెట్లో ఆమోదించడం ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ ప్రభుత్వాలూ ఎస్ఐపీబీ నిర్ణయాలను కేబినెట్లో ఆమోదింపచేసుకున్న సందర్భాలు లేవని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అస్మదీయులకు ఖజానా దోచిపెట్టి.. గత ఐదేళ్లుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్ఐబీపీలో ప్రభుత్వ పారిశ్రామిక విధానానికి అనుకూలంగా కాకుండా పారిశ్రామిక వేత్తలు కోరిన మేరకు రాయితీలను ఇవ్వడమే కాకుండా తక్కువ ధరకు భూములను కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని కంపెనీలకైతే ఉదారంగా పెట్టుబడికి మించి రెట్టింపు రాయితీలను కూడా ఇచ్చేశారు. గత రెండేళ్లుగా ఐటీ రంగంలో పెట్టుబడుల పేరుతో అస్మదీయుల సంస్థలకు భారీ రాయితీలు ఇవ్వడమే కాకుండా చౌకగా భూములను కట్టబెట్టేశారు. ఐటీ విధానం ముసుగులో ఇష్టానుసారంగా రాయితీలు, భూముల ధరలను నిర్ణయించారు. బడా పారిశ్రామికవేత్తలకు ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఖజానా నుంచి రాయితీలను ఇవ్వడంతో భవిష్యత్‌లో ఇవి ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటాయోనని అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్ఐపీబీ సమావేశాల్లోనే నిర్ణయాలు.. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొచ్చే వారు పెట్టే పెట్టుబడి ఎంత? ఎంత భూమి కోరుతున్నారు? ఏ రాయితీలు అడుగుతున్నారు? కల్పించే ఉద్యోగాలు ఎన్ని? తదితర అంశాలను పరిశీలించాక పారిశ్రామిక విధానం మేరకు భూ కేటాయింపుల ధరను నిర్ణయించాలని ఎస్ఐపీబీలో నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమయ్యే ఎస్ఐపీబీలో సంబంధిత శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు ఉంటారు. ఎస్ఐపీబీలో నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) ఈ ప్రతిపాదనలను అధ్యయనం చేసి ఎంత మేరకు రాయితీలు కల్పించవచ్చో సూచిస్తుంది. ప్రభుత్వ విధానానికి మించి రాయితీలను కోరితే ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ ఎస్ఐపీబీలో తగిన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తుంది. ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాల మేరకు సంబంధిత శాఖలు జీవోలను జారీ చేస్తాయి. అయితే గతంలో ఎన్నడూ ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలు కేబినెట్‌కు వెళ్లలేదు. అక్రమాలకు సక్రమం.. ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్‌లో తమకు చిక్కులు సృష్టిస్తాయనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమైంది. దీంతో ఎస్ఐపీబీ నిర్ణయాలను కేబినెట్లో పెట్టి ఆమోదించాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధిత అధికారులు సూచించారు. కేబినెట్లో ఆమోదిస్తే తనకు కూడా సమస్య ఉండదని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా ఎస్ఐబీపీలో తీసుకున్న నిర్ణయాలను ఎన్నికలకు ముందు నిర్వహించిన రెండు కేబినెట్ సమావేశాల్లో ఆమోదించారు. అయితే ఇలా ఆమోదించినంత మాత్రాన అక్రమాలు సక్రమం ఎలా అవుతాయని సీనియర్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తొలుత నిర్ణయాలు తీసేసుకుని జీవోలు కూడా ఇచ్చేసిన తరువాత ఎప్పుడో కేబినెట్లో పెట్టి ఆమోదించారని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బయట తీసుకున్న నిర్ణయాలు కేబినెట్ నిర్ణయాల కిందకు రావని పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉండగా మరికొద్ది రోజుల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ఎస్ఐపీబీ నిర్ణయాలను సమీక్షించవచ్చని, ఖజానాకు నష్టం కలిగించేలా ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు ఇచ్చిన రాయితీలపై సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. -
నేడు ఏపీ కేబినెట్ భేటీ
-
నేడు మళ్లీ ‘ఎన్నికల’ కేబినెట్
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు తీసుకుంటున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న వరుస మంత్రివర్గ(కేబినెట్) సమావేశాలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సాధారణం కంటే భిన్నంగా రోజుల వ్యవధిలోనే వెంటవెంటనే కేబినెట్ భేటీలు ఏర్పాటు చేస్తుండడంపై అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 8వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు ఐదు రోజులు గడవకుండానే బుధవారం మళ్లీ ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెలలో ఇది రెండో మంత్రివర్గ సమావేశం. జనవరిలో రెండుసార్లు (21, 31 తేదీల్లో) కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. జనవరి 21 నుంచి 35 రోజుల వ్యవధిలోనే ఏకంగా నాలుగు మంత్రివర్గ సమావేశాలు (నేటి సమావేశంతో కలిపి) ఏర్పాటు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులు, అధికారుల్లో అసహనం ప్రభుత్వంలో కేబినెట్ భేటీ అత్యంత కీలకం. గత ప్రభుత్వాలు రెండు, మూడు నెలలకోసారి ఈ భేటీలను నిర్వహించేవి. కానీ, సరిగ్గా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తుండడం, వాటిని అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా కొనసాగిస్తుండడంపై అధికారులు, మంత్రుల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ చంద్రబాబు మంత్రివర్గ భేటీలను హడావుడిగా ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. కాపీ కొట్టిన పథకాలకు ఆమోదముద్ర 25 రోజుల వ్యవధిలో జరిగిన మూడు మంత్రివర్గ సమావేశాల్లో పలు పథకాలకు చంద్రబాబు ఆమోదముద్ర వేయించారు. ఇవన్నీ ప్రజలను మాయ చేసేందుకు నాలుగున్నరేళ్ల తర్వాత ప్రకటించినవే కావడం విశేషం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రూ.2,000 పెన్షన్ పథకాన్ని బాబు కాపీ కొట్టారు. జనవరి 1వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దాన్ని ఆమోదించారు. జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు పథకాన్ని సైతం కాపీ కొట్టి, అదే సమావేశంలో అమోదించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదు చేసిన కేసులను నాలుగున్నరేళ్లుగా పట్టించుకోలేదు. కానీ, ఉన్నట్టుండి జనవరి 31వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయా కేసులను రద్దు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులపై పెట్టిన కేసులను ఈ సమావేశంలోనే రద్దు చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నుంచి కాపీ కొట్టి ప్రకటించిన ‘పసుపు–కంకుమ’ పథకాన్ని ఈ భేటీలోనే ఆమోదించారు. జగన్మోహన్రెడ్డి ప్రకటించిన బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చేందుకు ఈ సమావేశంలో అనుమతించారు. ఇన్నాళ్లూ పట్టించుకోని అగ్రిగోల్డ్ బాధితులకు ఆర్థికసాయం చేయాలని ఈ సమావేశంలోనే నిర్ణయించారు. ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన కేబినెట్ భేటీలో ఉద్యోగులను ఆకర్షించేందుకు 20 శాతం మధ్యంతర భృతికి ఆమోదం తెలిపారు. ఇవన్నీ నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు కళ్లకు కనిపించలేదు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాల్లో ఆగమేఘాలపై వాటిని ఆమోదిస్తుండడం గమనార్హం. - జాయింట్ కలెక్టర్ల నుంచి ఆర్డీఓలకు అధికారాన్ని కల్పించే వివాదాస్పదమైన చుక్కల భూముల చట్టంలో సవరణలకు జనవరి 21న జరిగిన సమావేశంలో ఆమోదముద్ర వేశారు. ఇళ్ల పట్టాల కేటాయింపు అధికారాన్ని కూడా జాయింట్ కలెక్టర్ల నుంచి ఆర్డీఓలకు బదలాయించారు. - పుంగనూరులోని కేబీసీ షుగర్స్, నిండ్రాలోని ప్రొడెన్షియల్ షుగర్స్, బీఎన్ కండ్రిగలోని సుదలగుంట షుగర్స్, పొదలకూరలోని సుదలగుంట షుగర్స్, నాయుడుపేటలోని ఎంపీ షుగర్స్ సంస్థలకు జనవరి 21న జరిగిన సమావేశంలో రూ.47.54 కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చారు. కో–ఆపరేటివ్, నిజాం షుగర్స్, ఖండసారి షుగర్ మిల్లులకు సంబంధించిన రూ.227 కోట్ల కొనుగోలు పన్ను, వడ్డీలు, జరిమానాలను మినహాయించారు. - రూ.55,343 కోట్ల అమరావతి సమగ్ర ఆర్థిక ప్రణాళికను జనవరి 31న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. అందులో రూ.37,112 కోట్లను అప్పుగా తెచ్చుకునేందుకు సీఆర్డీఏకు అధికారం కల్పించారు. - రాజధానిలోని పలు ప్రాజెక్టులను తనఖా పెట్టి రుణాలు తెచ్చుకునేందుకు సీఆర్డీఏకు అధికారం కట్టబెట్టారు. పబ్లిక్ బాండ్ల ద్వారా రూ.500 కోట్ల సేకరించేందుకు పబ్లిక్ ఇష్యూకు వెళ్లేందుకు సీఆర్డీఏకు అనుమతిచ్చి ఇందుకయ్యే వడ్డీ చెల్లింపులకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు అనుమతించారు. - రాజధానిలో మౌలిక సదుపాయాల పనుల కోసం 715 మిలియన్ డాలర్ల అప్పు ఇచ్చే రాజధాని అమరావతి సుస్థిర మౌలిక సదుపాయాలు, సంస్థాగత అభివృద్ధి పథకానికి (ఏఎస్ఐడీపీ)కి ఆమోదముద్ర వేశారు. - కాకినాడ ఎస్ఈజెడ్లో హల్దియా పెట్రో కెమికల్ లిమిటెడ్ కంపెనీకి ప్రత్యేక రాయితీల ప్యాకేజీ ఇచ్చేందుకు ఇదే సమావేశంలో మంత్రివర్గ ఆమోదించింది. - వైకుంఠపురం బ్యారేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.801.88 కోట్ల నుంచి రూ.1,069 కోట్లకు పెంచుతూ నాలుగోసారి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సీఎం చంద్రబాబుకు సన్నిహితమైన నవయుగ సంస్థ 13.19 శాతం ఎక్సెస్(ఎక్కువ) ధరకు షెడ్యూలు కోట్ చేసి ఎల్–1గా నిలిచింది. నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే ఎక్సెస్‌కు కోట్ చేస్తే టెండర్‌ను రద్దు చేయాలి. కానీ. ఈ నెల 8న కేబినెట్ సమావేశంలో 13.19 శాతం ఎక్సెస్‌కు వైకుంఠపురం బ్యారేజీ పనులను నవయుగకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. భారీగా భూకేటాయింపులు, రాయితీలు పలు ప్రైవేట్ సంస్థలకు భారీ ఎత్తున భూకేటాయింపులు, పన్ను మినహాయింపులు ఇస్తూ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. 3,000 ఎకరాలను వివిధ సంస్థలకు కేటాయించారు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలో గ్రీన్కో ఎనర్జీస్ సంస్థకు ఎకరం రూ.2.50 లక్షల చొప్పున 2,467 ఎకరాలను కేటాయించారు. రాజధానిలో పలు సంస్థలకు చౌకగా భూకేటాయింపులు చేసేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నుంచి కాపీ కొట్టిన రైతుకు పెట్టుబడి సాయం పథకాన్ని బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం నుంచి ఏడు జిల్లాల్లో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్, ఈ నెలాఖరున సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో బుధవారం జరిగే సమావేశంలోనే దాదాపు తాను అనుకున్న అన్ని పనులకు ఆమోదం తెలిపేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు ఎవరో తరుముకొస్తున్నట్లు పథకాలను ప్రకటించడం, వాటి కోసం వరుసగా మంత్రివర్గ సమావేశాలు పెట్టి ఆమోదించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా చంద్రబాబు లెక్కచేయడం లేదు. -
విమర్శలను ఎండగట్టరేం?
• అన్ని విషయాలపైనా సీఎం ఒక్కరే స్పందించాలా? • మంత్రివర్గ సహచరులకు కేసీఆర్ ‘క్లాస్’ • పలువురి తీరుపై తీవ్ర అసంతృప్తి • ఒకరిద్దరు మంత్రుల కుటుంబ సభ్యుల పైరవీలపై హెచ్చరిక • కేబినెట్ సమావేశానికి ముందు గంట సేపు ప్రత్యేకంగా భేటీ సాక్షి, హైదరాబాద్: పలువురు మంత్రివర్గ సహచరుల పనితీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరు మంత్రుల కుటుంబ సభ్యులు పైరవీలు చేస్తున్నారన్న అంశాన్ని ప్రస్తావించి పరోక్షంగా హెచ్చరిం చారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీకి ముందు.. అధికారులెవరూ లేకుండా మంత్రు లతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులకు ‘క్లాస్’ తీసుకున్నట్లు సమాచారం. ‘జేఏసీ ఉద్యమాల పేరుతో జిల్లా ల్లో తిరుగుతూ కోదండరామ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే... అదే జిల్లా మంత్రులు ఎందుకు తిప్పికొట్టడం లేదు? ప్రజలకు వాస్తవాలు వివరించలేక పోతున్నా రెందుకు? పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కూడా జిల్లాలు తిరిగి ఏవేవో విమర్శలు చేస్తున్నారు. పాదయాత్ర పేరుతో సీపీఎం కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మీకు ఇవన్నీ ఎందుకు కనిపించడం లేదు, ఎందుకు తిప్పి కొట్టడం లేదు.. ఒక్కరూ కౌంటర్లు ఇవ్వరా.. అన్ని విషయాలకూ ముఖ్యమంత్రే స్పందిం చాలా..?’’ అంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరుద్యోగ ర్యాలీ విషయం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ‘కేబినెట్ సమావేశ మంటే ఆన్ ద రికా ర్డు, ఆఫ్ ద రికార్డని ఉండ దు. ఇక్కడ మనం మాట్లాడుకున్న విషయాలు ఎందుకు బయటకు వెళుతు న్నాయి..’ అని నిలదీసినట్లు తెలిసింది. కొందరు మంత్రులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఇక ఒకరిద్దరు మంత్రుల కుటుంబ సభ్యులు పైరవీలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సుమారు గంటసేపు జరిగిన ఈ ‘ప్రత్యేక’భేటీ మధ్యలో టీ బాయ్‌లను కూడా అను మతించలేదని, మంత్రులనూ లేవనీయ లేదని తెలుస్తోంది. మార్చి తొలి వారంలో బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను మార్చి మొదటి వారంలో నిర్వహించాలని భావిస్తున్నట్లుగా సీఎం సూత్రప్రాయంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఇక కేంద్రం కూడా తన పరిమితులకు లోబడి బడ్జెట్ ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ‘మనకు ఏం రావాలో చూసుకోవాలి. మంత్రులంతా కేంద్ర బడ్జెట్‌ను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయండి. రాష్ట్రం కేంద్రానికి ఇచ్చిన ప్రతిపాదనలు, శాఖల వారీగా రావాల్సిన నిధులపై కేంద్రంతో ఫాలో అప్ చేసుకోవాలి. మరిన్ని నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం..’అని సూచించినట్లు తెలిసింది. -
బాబోయ్ !
► సంచలనం రేపిన ‘రాజధాని దురాక్రమణ’ కథనం ► గ్రామాల్లో బాధిత రైతుల ఆగ్రహావేశాలు ► సీఎం, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల మోసాలపై మండిపాటు ► వేలమంది రైతులకు అన్యాయం జరిగిందని ఆందోళన ‘రాజధాని దురాక్రమణ’ కథనం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సంచలనం సృష్టించింది. సీఎం ,మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల మోసాలు తెలుసుకున్న రైతు లోకం నివ్వెరపోయింది. దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతల కడుపుకొట్టిన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ‘దురాక్రమణ’లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదల భూములను రాబందుల్లా తన్నుకు పోయిన ప్రభుత్వ పెద్దల కుట్రలపై మండిపడింది. సాక్షి గుంటూరు మంత్రులు, కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు బీనామీల పేర్లతో తక్కువ ధరలకు భూములు కాజేసిన ‘దురాక్రమణ’లు ఒక్కసారిగా సాక్ష్యాధారాలతో బయటపడడంతో తెలుగుదేశం పార్టీలోనే బుధవారం తీవ్ర కలకలం రేగింది. కొందరు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు అయితే మంత్రులు, ఎమ్మెల్యేల వైఖరిపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే ముఖ్యమంత్రి వద్దకు పలువురు మంత్రులు క్యూ కట్టారు. కేబినెట్ సమావేశానికి ముందే మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చన్నాయుడు, సీఎంను కలిసి సాక్షి కథనంపై చర్చించినట్లు తెలిసింది. ఇక కేబినెట్ సమావేశం ఆసాంతం సాక్షి కథనంపైనే చర్చ జరిపినట్టు సమాచారం. మంత్రులు నారాయణ, పుల్లారావు ‘సాక్షి ’ దినపత్రిక ప్రతులను కేబినెట్ సమావేశానికి తీసుకెళ్ళారు. ఓ వైపు సమావేశం జరుగుతుండగానే మంత్రి పుల్లారావు, నారాయణ హడావుడిగా బయట విలేకరుల సమావేశం నిర్వహించారు. తమకే పాపం తెలియదని బొంకేందుకు నానా తంటాలు పడ్డారు. అంతేకాక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, సాక్షి దినపత్రికపై తమ ఆక్రోశాన్ని, అక్కసును వెళ్లగక్కారు. బాధిత రైతుల్లో ఆగ్రహావేశాలు ... రాజధాని ప్రాంతంలో తక్కువ ధరలకు భూములు కోల్పోయి టీడీపీ నేతల మోసాలకు బలైన అనేక మంది రైతులు ‘సాక్షి’ కథనంతో ధైర్యం కూడదీసుకున్నారు. తమకు జరిగిన అన్యాయంపై నోరు విప్పారు. టీడీపీ నేతలు తమకు అన్యాయం చేసి అతి తక్కువ ధరకు భూములను కాజేశారని మండి పడ్డారు. మొదటి నుంచి రాజధాని ప్రాంతంలో టీడీపీ ముఖ్యనేతలు భూ ఆక్రమణలకు, భూ దందాలకు దిగుతున్నారని తెలిసినప్పటికీ ‘సాక్షి’ దినపత్రికలో పక్కా ఆధారాలతో బయటపడడంతో తమకు జరిగిన అన్యాయమే వేల మంది రైతులకు జరిగిందని తెలిసి ఆందోళన చెందారు. ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వ పాలకులే ధనార్జన కోసం రైతుల కడుపు కొట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాజధానిలో జరుగుతున్న భూ దందాలపై మేధావులు, అన్ని వర్గాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రిక ప్రతులు తగలబెట్టి అక్కసు వెళ్లగక్కిన టీడీపీ నేతలు ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం ప్రచురితమైన ‘రాజధాని దురాక్రమణ’ కథనంతో కంగుతిన్న తెలుగు తమ్ముళ్లు తమ అక్కసును వెళ్లగక్కారు. మంగళగిరి పట్టణంలో సాక్షి దినపత్రికల ప్రతులను దహనం చేసి తమ నేతల తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. రాజధాని దురాక్రమణనుఆధారాల సహా బయట పెట్టినప్పటికీ ఎదురుదాడితో ప్రజల దృష్టి మరల్చే కుట్రకు తెరతీశారు. ఇక మంత్రులు అయితే క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పలేక వివరణ ఇవ్వలేక చివరకు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, సాక్షి దినపత్రికపై దూషణలకు దిగారు. ఎక్కడ చూసినా ‘సాక్షి’ కథనాలపై చర్చ ప్రధానంగా రాజధాని గ్రామాలతోపాటు... విజయవాడ, గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ, పెడన పట్టణాల్లో ‘రాజధాని దురాక్రమణ’పై చర్చ జోరుగా సాగింది. ఇదే స్థాయిలో కైకలూరు, నందిగామ, నూజివీడు, మైలవరం పట్టణాల్లోనూ పలువురు చర్చించుకోవడం విశేషం. కమ్యూనిస్టు పార్టీలు, ఇతర ప్రతిపక్ష వారు ‘సాక్షి’ పత్రికను ఆసక్తిగా చదివారు. ఉద్యోగుల్లో ప్రత్యేక చర్చ ... భూములు కొనుగోలు చేసిన వారంతా మంత్రులు, వారి అనుచరులు కావడంతో ఉద్యోగుల్లో ప్రత్యేక చర్చ జరిగింది. ఎన్జీవోల్లో చురుకైన చర్చ సాగింది. ఇటీవల ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటమే కాకుండా చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నాడు. ఈ వార్త కనువిప్పు కావాలంటూ కొందరు అధికారులు వ్యాఖ్యానించడం విశేషం. కొందరు టీడీపీ నాయకులు ఓర్వలేక బుధవారం సాయంత్రం లెనిన్ సెంటర్లో ‘సాక్షి’ దినపత్రిక ప్రతులను తగులబెట్టారు. -
వ్యవసాయశాఖలో భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ శనివారం మధ్యాహ్నం సమావేశమైంది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాల గురించి మంత్రులు ప్రస్తావించారు. వ్యవసాయ శాఖ విభాగంలో నియామకాలు చేపడతామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేశారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అగ్రి ఎక్స్టెన్షన్కు సంబంధించి 1000, అగ్రోనామిస్ట్లు 438 ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. -
అమ్మో కేబినెట్ మీటింగా !!
-
మంత్రివర్గ నిర్ణయాలలో గోప్యత ఇంకానా?
ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఇవ్వగలిగిన సమాచారం ఏదైనా మామూలు జనానికి కూడా అందుబాటులో ఉంచడమే ఈ సమాచార హక్కు లక్ష్యమని చట్టమే వివరిస్తున్నది. ఇదివరకు బడ్జెట్ లోక్‌సభలో చర్చకు రాకముందే వెల్లడైతే ఆర్థికమంత్రి పదవి ఊడిపోయేది. ఇప్పుడు అలాంటి గోప్యతను ఊహించలేం. పన్నులూ, లోటూ గురించి ముందే జనానికి చెప్పి వారి సూచనలు తీసుకుని, తగిన విధంగా బడ్జెట్లో మార్పులు చేయడం నిజమైన ప్రజాస్వామ్యం అని నేటి భావన. అయితే ఇప్పటికీ అతి రహస్యంగా జరిగేవి ఏవంటే మంత్రివర్గ సమావేశాలు, శాసన నిర్ణయాలు. కోర్టు తీర్పులు బహిరంగంగా వస్తున్నా కేబినెట్ చర్చలు మా త్రం మంత్రి చెప్పేదాకా రహస్యమే. అధికార రహస్యా లు కాపాడతామని మంత్రులు ఇంకా ప్రతిజ్ఞలు చేస్తూనే ఉన్నారు. సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత కూడా కేబినెట్ నిర్ణయాలు రహస్యమేనా? ఈ చట్టం చేసినప్పు డు ఈ నిషేధానికి ఒక మినహాయింపు ఇచ్చారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తరువాత ఆ అంశానికి సంబం ధించి ఏ సమాచారమైనా అడగవచ్చు. రాబట్టుకోవచ్చు. నిర్ణయం తీసుకోకపోతే మాత్రం అడగరాదని సెక్షన్ 8 (1)(ఐ)లో చేర్చారు. నిర్ణయం తీసుకున్న ఆ అంశం వ్యవహారం ముగిసిపోయిన తరువాత, మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడానికి కారణాలను బహిర్గతం చేయ వచ్చు అని ఆ మినహాయింపులో మరొక మినహాయిం పునకు చోటిచ్చారు. అంశం వ్యవహారం ముగిసిపోవడం అంటే ఏమిటి? జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ బిల్లుపైన కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పూర్త యింది కనుక దానిపైన కేబినెట్ నోట్‌ను, ఇతర వివరా లను ఇవ్వాలని సమాచార హక్కు కింద ఒక న్యాయవాది కోరారు. రాజ్యసభలో ప్రవేశ పెట్టినప్పటికీ ఈ బిల్లు ఇంకా లోక్‌సభలో ఆమోదం పొందలేదు కనుక, సమా చారం ఇవ్వడానికి వీల్లేదని న్యాయ వ్యవహారాల శాఖ అప్పట్లో జవాబిచ్చింది. నిర్ణయం వ్యవహారం ముగిసి పోవడం అంటే, జాతీయ న్యాయ కమిషన్ ఏర్పడే దాకా అని అర్థం చెప్పకుంటే, అందుకోసం ఎంతకాలం పడితే అంతకాలం ఆ సమాచారం ఇవ్వకుండా ఉండవచ్చా! ప్రభుత్వ వాదన అదే. న్యాయమూర్తుల నియామక కమి షన్ ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగాన్ని కూడా సవరిం చాలి. ఇది భారీ సవరణ కనుక సగం రాష్ట్రాల శాసన సభలు కూడా ఆమోదిస్తే తప్ప బిల్లు చట్టంగా మారి కమిషన్ ఏర్పాటు వీలుకాదని కేంద్ర మంత్రివర్గం భావించింది. రాజ్యాంగం ఐదో భాగం, నాల్గో అధ్యా యంలో అధికరణాలు 124, 217, 222, 231, 124ఎ లను సవరించాలని రాజ్యాంగం 120వ సవరణ బిల్లు- 2013ను, కొత్తగా న్యాయమూర్తుల నియామక కమిషన్ బిల్లు 2013ను ప్రతిపాదిస్తూ ఆగస్టు 2, 2013న వీటిని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయిం చింది. కొత్త ప్రభుత్వం మరికొన్ని సవరణలు చేసిన తరు వాత ఈ బిల్లులను ఆమోదించింది. అయినా బిల్లు చట్టమై కమిషన్ ఏర్పడే దాకా నిర్ణయం వ్యవహారం పూర్తికాలేదని అంతవరకు సమాచారం ఇవ్వనవసరం లేదని వాదించారు. ఇదివరకు ఇటువంటి అంశం మీదనే కేంద్ర సమా చార కమిషన్ తీర్పు ఇస్తే కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు అప్పీ లు చేసింది. 2009లో ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీ లించిన తరువాత సెక్షన్8 (1)(ఐ) కింద కేబినెట్ సమా చారానికి కొంత రక్షణ ఉందనీ, కాని అది పరిమితమైన కాలపరిధికి మాత్రమే లోబడి ఉంటుందనీ కోర్టు వివరిం చింది. మంత్రివర్గ చర్చల వివరాలు, సచివుల సల హాలు, ఇతర దస్తావేజులు, కేబినెట్ నోట్లు వెంటనే ఇవ్వకుండా ఈ సెక్షన్ కింద మినహాయింపు కాస్త వెసు లుబాటు కలిగిస్తుందని వివరించారు. అయితే కేబినెట్ నిర్ణయం పూర్తిస్థాయిలో అమలయ్యే దాకా ఎంతకాలం పట్టినా సరే అంతవరకు సమాచారం కోసం నిరీక్షిం చాలని కాదు. రాజ్యసభలోనో, లోక్సభలోనో ప్రవేశ పెట్టిన మరుక్షణం మంత్రుల నిర్ణయానికి సంబంధిం చిన ప్రక్రియ పూర్తయి, జనం ముందుకు బిల్లు వచ్చి నట్టే. ఈ విషయంలో న్యాయ కమిషన్ ఏర్పాటు చేయ డానికి ఇంకా ఏమైనా సూచనలు ఉన్నాయా అని ప్రజ లను, ప్రముఖులను కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఒక సంప్రదింపుల పత్రాన్ని రూపొందించి అనేక రాష్ట్రాలలో చర్చా వేదికలను ఏర్పాటు చేసింది. ఇంత జరిగిన తరు వాత కూడా సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా దాచడానికి ఏముంది? ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఇవ్వగలిగిన సమాచారం ఏదైనా మామూలు జనానికి కూడా అందుబాటులో ఉంచడమే ఈ సమాచార హక్కు లక్ష్యమని చట్టమే వివరిస్తున్నది. కనుక న్యాయవాది అడిగిన సమాచారం నెలరోజుల్లో ఉచితంగా ఇవ్వాలని ఆదేశించడం జరిగిం ది. నిజానికి కేబినెట్లో జరిగిన చర్చల వివరాలు ఇవ్వ డానికి ప్రతిబంధకాలు ఉండకూడదు. దేశ రక్షణ విష యాలయితే తప్ప మరొక అంశమేదీ కేబినెట్లో చర్చకు వచ్చిన తరువాత రహస్యంగా ఉండాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైన పాలన రావాలంటే నిర్ణయాలు స్వ చ్ఛంగా ఉండాలి. స్వచ్ఛమైన నిర్ణయాలు తీసుకోవాలం టే సమాచారం ప్రజలకు చేరాలి. (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com - మాడభూషి శ్రీధర్ -
జనవరి నుంచి ఈ-కేబినెట్
న్యూఢిల్లీ: జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ-కేబినెట్ సమావేశాలు నిర్వహించనుంది. పాలన సమర్థవంతంగా అందడానికి, నిర్ణయాలు వేగంగా అమలు కావడానికి కంప్యూటరీకరణ దోహదపడుతుందని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అన్నారు. కేబినెట్ సమావేశాల్లో సభ్యులకు ఇచ్చే సమాచారం, తీసుకునే నిర్ణయాలన్నీ జనవరి నుంచి కంప్యూటరీకరిస్తామన్నారు. తన ఆఫీసునూ కాగితరహితంగా చేయాలని అధికారులకు సూచించానన్నారు. ప్రధాని మోదీ సూచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.