విమర్శలను ఎండగట్టరేం?
• అన్ని విషయాలపైనా సీఎం ఒక్కరే స్పందించాలా?
• మంత్రివర్గ సహచరులకు కేసీఆర్ ‘క్లాస్’
• పలువురి తీరుపై తీవ్ర అసంతృప్తి
• ఒకరిద్దరు మంత్రుల కుటుంబ సభ్యుల పైరవీలపై హెచ్చరిక
• కేబినెట్ సమావేశానికి ముందు గంట సేపు ప్రత్యేకంగా భేటీ
సాక్షి, హైదరాబాద్: పలువురు మంత్రివర్గ సహచరుల పనితీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరు మంత్రుల కుటుంబ సభ్యులు పైరవీలు చేస్తున్నారన్న అంశాన్ని ప్రస్తావించి పరోక్షంగా హెచ్చరిం చారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీకి ముందు.. అధికారులెవరూ లేకుండా మంత్రు లతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులకు ‘క్లాస్’ తీసుకున్నట్లు సమాచారం. ‘జేఏసీ ఉద్యమాల పేరుతో జిల్లా ల్లో తిరుగుతూ కోదండరామ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే... అదే జిల్లా మంత్రులు ఎందుకు తిప్పికొట్టడం లేదు? ప్రజలకు వాస్తవాలు వివరించలేక పోతున్నా రెందుకు? పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కూడా జిల్లాలు తిరిగి ఏవేవో విమర్శలు చేస్తున్నారు.
పాదయాత్ర పేరుతో సీపీఎం కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మీకు ఇవన్నీ ఎందుకు కనిపించడం లేదు, ఎందుకు తిప్పి కొట్టడం లేదు.. ఒక్కరూ కౌంటర్లు ఇవ్వరా.. అన్ని విషయాలకూ ముఖ్యమంత్రే స్పందిం చాలా..?’’ అంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరుద్యోగ ర్యాలీ విషయం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ‘కేబినెట్ సమావేశ మంటే ఆన్ ద రికా ర్డు, ఆఫ్ ద రికార్డని ఉండ దు.
ఇక్కడ మనం మాట్లాడుకున్న విషయాలు ఎందుకు బయటకు వెళుతు న్నాయి..’ అని నిలదీసినట్లు తెలిసింది. కొందరు మంత్రులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఇక ఒకరిద్దరు మంత్రుల కుటుంబ సభ్యులు పైరవీలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సుమారు గంటసేపు జరిగిన ఈ ‘ప్రత్యేక’భేటీ మధ్యలో టీ బాయ్‌లను కూడా అను మతించలేదని, మంత్రులనూ లేవనీయ లేదని తెలుస్తోంది.
మార్చి తొలి వారంలో బడ్జెట్ సమావేశాలు
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను మార్చి మొదటి వారంలో నిర్వహించాలని భావిస్తున్నట్లుగా సీఎం సూత్రప్రాయంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఇక కేంద్రం కూడా తన పరిమితులకు లోబడి బడ్జెట్ ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ‘మనకు ఏం రావాలో చూసుకోవాలి. మంత్రులంతా కేంద్ర బడ్జెట్‌ను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయండి. రాష్ట్రం కేంద్రానికి ఇచ్చిన ప్రతిపాదనలు, శాఖల వారీగా రావాల్సిన నిధులపై కేంద్రంతో ఫాలో అప్ చేసుకోవాలి. మరిన్ని నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం..’అని సూచించినట్లు తెలిసింది.