సీఎంను అకారణంగా విమర్శిస్తున్నారు
కాంగ్రెస్, టీడీపీ నేతలపై కర్నె ప్రభాకర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన వల్ల రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని, తమకు ఉనికి లేకుండా పోతుందన్న భయంతో కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ నేతలు అకారణంగా ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ను గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, గోదావరిపై అయిదు బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఈనెల 8వ తేదీన ఒప్పందం చేసుకోబోతున్న తరుణంలో ప్రతిపక్ష నేతలు అనవసర విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.