Karne Prabhakar
-
మునుగోడులో ఓటమి భయంతో తనపై బీజేపీ తప్పుడు ప్రచారం : కర్నె ప్రభాకర్
-
Munugode Bypoll 2022: ఉప ఎన్నికల వేళ.. ఫేక్ ప్రచారాల గోల!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలాయి. పోలింగ్ ప్రక్రియ చివరి ఘట్టానికి చేరడంతో పార్టీల ప్రచారం పతాకస్థాయికి చేరింది. సోషల్ మీడియా వేదికగా పార్టీలు ఫేక్ పోస్టుల యుద్ధానికి దిగాయి. ఫలానా నేత తమ పార్టీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారని, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. స్రవంతిపై బోగస్ ప్రచారం: కాంగ్రెస్ గతంలో దుబ్బాక లో చేసిన విధంగా నేడు మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిపై అసత్య ప్రచారాలు చేస్తూ లబ్ధి పొందాలని అధికార పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను స్రవంతి కలిసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మకై తమ అభ్యర్థి పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బోగస్ వీడియో సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ నేతలు పోరిక బలరాం, పొన్నం ప్రభాకర్, మధుసూదన్‌రెడ్డి ట్విటర్ ద్వారా కోరారు. నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు: స్రవంతి తనపై జరుగుతున్న అసత్య ప్రచారం గురించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లతామని పాల్వాయి స్రవంతి తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి బోగస్ ప్రచారాలతో తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని స్రవంతి స్పష్టం చేశారు. బీజేపీలో చేరడం లేదు: కర్నె టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ బీజేపీలో చేరతారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీ మారడం లేదని, మునుగోడులో ఓటమి భయంతో తనపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కర్నె ప్రభాకర్ వివరణయిచ్చారు. ఇటువంటి అసత్య ప్రచారాలతో బీజేపీ గెలవాలనుకుంటే వారి దౌర్భాగ్యపు పరిస్థితికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇటువంటి వార్తలను నమ్మొద్దని ఆయన కోరారు. మునుగోడులో కచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
ప్రగతిభవన్‌కు మునుగోడు పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక సమయం దగ్గరపడినా ఆ పార్టీలో అసంతృప్తి సద్దుమణగడం లేదు. ఉపఎన్నిక సంకేతాలు వెలువడింది మొదలుకుని కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దంటూ గళం విప్పిన నేతలు నామినేషన్ల స్వీకరణ మొదలైనా పట్టు వీడటం లేదు. కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లు పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని రెండు రోజుల క్రితం ప్రకటించారు. కానీ నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు ఇంకా పట్టు వీడటం లేదు. ఈ నేపథ్యంలో మునుగోడుకు చెందిన అసంతృప్త నేతలతో శనివారం ప్రగతిభవన్‌లో కీలక భేటీ జరిగింది. కేటీఆర్, హరీశ్‌రావులతో భేటీ మునుగోడు నియోజకవర్గానికి చెందిన పార్టీ అసంతృప్త నేతలను వెంట బెట్టుకుని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ శనివారం ప్రగతిభవన్‌కు వచ్చారు. నారాయణపూర్ ఎంపీపీ, మునుగోడు వైస్ ఎంపీపీ, పలువురు సర్పంచులు సహా సుమారు 70 మంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావులతో భేటీ అయ్యారు. గతంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమను ఇబ్బంది పెట్టిన తీరును ఏకరువు పెట్టారు. తమపై కేసులు నమోదు చేయించడం, ఆర్థికంగా దెబ్బతీయడం వంటివీ చేశారని వివరించారు. ఉప ఎన్నిక వాతావరణం ప్రారంభమైనా తమకు పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ఇతర పార్టీల నుంచి చేరికలకు ఒత్తిడి, ప్రలోభాలు వస్తున్నా టీఆర్ఎస్పై అభిమానంతో కొనసాగుతున్నామని.. పార్టీ ఇన్చార్జులుగా నియమితులైన నేతలు కూడా తమను సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తాం మునుగోడు టీఆర్ఎస్ అసంతృప్త నేతల అభిప్రాయాలు విన్న కేటీఆర్, హరీశ్‌రావు రెండు, మూడు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అసంతృప్త నేతలను కలుపుకొని వెళ్లాలని ప్రస్తుతం యూనిట్ ఇన్‌చార్జీ్జలుగా నియమితులైన నేతలకు సూచించినట్టు సమాచారం. అయితే అసంతృప్త నేతలు కేటీఆర్, హరీశ్‌లతో జరిగిన భేటీపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే.. తమ ఇబ్బందులను పరిష్కరించకపోతే సొంత దారి చూసుకుంటామనే సంకేతాలు ఇస్తున్నట్టు తెలిసింది. -
కేసీఆర్ సభ: 3 గంటలకే ప్రాంగణానికి రావాలి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 28న, శనివారం సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రేపటి సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్ల నుంచి వేల మంది ప్రజలు సభకు హాజరవుతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక గేట్ల ద్వారా లోపలికి వస్తారు. ఎక్కువ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకే సభా ప్రాంగణానికి రావాలని ప్రజల్ని కొరుతున్నాను. కరోనా నిబంధనలకు అనుగుణంగా మాస్కులు, శానిటైజర్లు కూడా ఏర్పాటు చేశాము’ అన్నారు ప్రభాకర్. (చదవండి: 28న హైదరాబాద్‌లో హై వోల్టేజీ ) ఇక ‘సిటీ నలుమూలల నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రజల సభకు హాజరుకానున్నారు. వారందరి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసాం. సభ లో ప్రత్యేక ఎంక్లోజర్లను ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు క్రమశిక్షణ పాటించాలి. సభకు రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. ప్రజలు వీక్షించేందుకు 12 ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు చేశాం. కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించారని’ కర్నె ప్రభాకర్ తెలిపారు. -
‘గవర్నర్ కోటా’ కసరత్తు షురూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా స్థానాల భర్తీపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. వచ్చే నెల ఏడో తేదీన రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభానికి ముందు జరిగే కేబినెట్ సమావేశంలోగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలనే యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. కేబినెట్ భేటీలో అభ్యర్థుల జాబితాపై స్పష్టత ఇచ్చి గవర్నర్ ఆమోదానికి పంపే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గవర్నర్ కోటాలో ఒకేసారి మూడు స్థానాలకు నామినేట్ చేసే అవకాశం ఉండటంతో అభ్యర్థిత్వం ఆశిస్తున్న నేతల సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తోంది. మండలిలో నాలుగు స్థానాలు ఖాళీ నలభై మంది సభ్యులున్న శాసన మండలిలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి ఎన్నికల షెడ్యూలు ప్రకటించగా, మాజీ ఎంపీ కవిత టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కోవిడ్ మూలంగా ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. శాసన మండలిలో గవర్నర్ కోటా సభ్యుల సంఖ్య ఆరు కాగా, ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో గవర్నర్ కోటాలో శాసన మండలికి ఎన్నికైన రాములు నాయక్ 2018లో కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. రాములు నాయక్ పదవీ కాలం ఈ ఏడాది మార్చిలో, నాయిని నర్సింహారెడ్డి పదవీ కాలం కూడా ఈ ఏడాది జూన్ 19న, కర్నె ప్రభాకర్ పదవీ కాలం ఈ ఆగస్టు 18న ముగిసింది. పరిశీలనలో దేశపతి, వాణీదేవి? సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, బ్రూవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, పార్టీ నేతలు తక్కళ్లపల్లి రవీందర్రావు తదితరులు తమకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. అయితే తాజాగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిని శాసనమండలికి గవర్నర్ కోటాలో నామినేట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. కర్నెకు పక్కా.. నాయినికి అవకాశం? గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై హోం మంత్రిగా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డి మరో మారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 18న పదవీ కాలం పూర్తి చేసుకున్న ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్‌కు మరోమారు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. నాయినికి అవకాశం దక్కనిపక్షంలో ఆయన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మంత్రి చామకూర మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన అభ్యర్థిత్వం తెరమీదకు వచ్చినట్లు సమాచారం. -
అప్పుడు సమర్థించి ఇప్పుడు విమర్శలా?
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాల తరలింపును మొదటి నుంచి టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని, గతంలో నీటి తరలింపును సమర్థించిన వారే ఇప్పుడు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. శాసనసభలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలసి శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. నీటి కేటాయింపుల్లో బ్రిజేశ్ కుమార్ కమిటీ కూడా ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం చేసిందని, కొందరు కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ఏపీని వదిలి కర్ణాటకపై పోరాడుతున్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నీటి కేటాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలను టీఆర్ఎస్ ప్రభుత్వం కడిగే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. కృష్ణా జలాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను అడ్డుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు కర్నె వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల తాకట్టు: గువ్వల తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టినందునే కాంగ్రెస్ నేతలు రాజకీయ ఉనికిని కోల్పోయారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. కృష్ణా బేసిన్లో వాటాదారులు కాని వారు కూడా నీటి దోపిడీకి పాల్పడుతుంటే అప్పట్లో అధికారంలో ఉన్న వారు మౌనంగా ఉన్నారని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని వ్యాఖ్యానించారు. -
కేటీఆర్‌వి అద్వితీయ విజయాలు: కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అద్వితీయ విజయాలు సాధించారని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్లో గురువారం జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం నేత సామ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రమాదవశాత్తూ మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీమా మొత్తాన్ని పంపిణీ చేశారు. నేడు తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. -
రేవంత్‌వి నిరాధార ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: గోపన్‌పల్లిలో దళితుల భూ ములను లాక్కున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఉద్దేశపూర్వకంగా నిరాధార ఆరోపణ లు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, కర్నె ప్రభాకర్ విమర్శించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎ.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి ఆదివారం అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎదుటివారిపై బురదచల్లి రాజకీయ పబ్బం గడుపుకోవడం రేవంత్‌కు అలవాటు అని, 111 జీవో పరి«ధిలో ఉన్న వట్టినాగులపల్లి సర్వే నంబర్ 66/ ఈలో రేవంత్ బావమరిది జయప్రకాశ్‌రెడ్డి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. 111 జీవో పరిధిలో ఉన్న ప్రాంతంలో కాం గ్రెస్ నేతలకు ఎవరెవరికి భూములు ఉన్నాయో బయట పెడతామన్నారు. సంచలనాల కోసమే ఆరోపణలు సంచలనాల కోసమే మాట్లాడే రేవంత్‌రెడ్డి లాంటి నేతలు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమని, ఇలాంటి నాయకులు అవసరమో లేదో జాతీయ పార్టీలు ఆలోచించాలని కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ధర్మానికి కట్టుబడి ఉందని, కోర్టులంటే తమకు గౌరవం ఉందన్నారు. 111 జీవో పరిధిలో అతిపెద్ద భవనాన్ని నిర్మించిన రేవంత్ వ్యవహారం దొంగే దొంగ అన్న రీతిలో ఉందన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారని, పెయింటర్‌గా జీవితం ప్రారంభించిన ఆయన రూ.వేల కోట్లు ఎలా సంపాదించారో వెల్లడించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పీసీసీ పదవి కోసమే రేవంత్‌రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తున్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. -
విద్యుత్ బిల్లుపై పార్లమెంటులో పోరాడుతాం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్కరణలకు సంబంధించిన ‘విద్యుత్ బిల్లు’పై తమతో వచ్చే రాష్ట్రాలతో కలసి పార్లమెంటులో పోరాడతామని శాసన మండలిలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. విద్యుత్ సంస్కరణల గురించి మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలో వ్యవసాయానికి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకానికి అనుకూలమో, వ్యతిరేకమో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయం (టీఆర్ఎస్ఎల్పీ) లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రధా ని మోదీ ఫ్యూడల్ విధానాలను వ్యతిరేకించి తీరుతామని, పేదలకు వ్యతిరేకంగా సంస్కరణలు ఉండకూడదన్నదే టీఆర్ఎస్ పార్టీ వైఖరి అని పేర్కొన్నారు. తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఆకలైన వాడికి ఆరు నెలల తర్వాత బిర్యానీ పెడతామన్న రీతిలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఉందని ఎద్దేవా చేశారు. వాస్తవాలు మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. 70 ఏళ్లుగా కేంద్రంలో మోదీ మినహా ఎవరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని ఆయన వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుబంధు పథకం అమలుకు కేసీఆర్ పెట్టే షరతులను కేంద్రం షరతులతో పోల్చడం కిషన్‌రెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. ప్రస్తుత సంక్షోభంలో ప్రజల చేతికి డబ్బు అందేలా హెలికాప్టర్ మనీ అంశాన్ని కేసీఆర్ ప్రతిపాదించారని, ఆర్థిక వేత్తలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నా ప్రధాని మోదీ వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ సామాన్యులతో పాటు బీజేపీ నేతలకు కూడా అర్థం కావడం లేదన్నారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో కేంద్రం వెచ్చించేది రూ.2.50 లక్షల కోట్లకు మించదన్నారు. -
పోతిరెడ్డిపాడులో చుక్కనీటిని వదిలేది లేదు
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు అంశంలో కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం గుంట కాడి నక్కల్లా వ్యవహరిస్తున్నారని శాసనమండలిలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ విమర్శించారు. బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన ఒక్క నీటిచుక్క వదిలేది లేదని, ఉద్యమం సమయం నుంచి పోతిరెడ్డిపాడు అంశంపై టీఆర్ఎస్ ఒకే వైఖరికి కట్టుబడి ఉందన్నారు. హంద్రీ నీవాకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు తరలింపునకు అప్పటి మంత్రులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు హారతులు ఇచ్చారని విమర్శించారు. పోతిరెడ్డిపాడు అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ సంకీర్ణంలో ఉన్న తమ పార్టీకి చెందిన ఆరుగురు మంత్రులు రాజీనామా చేసి బయటకు వచ్చారని గుర్తుచేశారు. తెలం గాణ ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ నీరటిలా ఉన్నారని, కాంగ్రెస్ నేతలు తమ పాలనలో తెలంగాణ ప్రాజెక్టులను పెండిం గ్‌లుగా మార్చారని దుయ్యబట్టారు. పోతిరెడ్డిపాడు అంశంపై తాము చేసే పోరాటంలో కలసిరావడం ద్వారా కాంగ్రెస్ నేతలు పాపపరిహారం చేసుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేతలది భిన్నవైఖరి.. పోతిరెడ్డిపాడు అంశంపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం జోక్యం చేసుకునేలా చూడాలని కర్నె సూచించారు. దీనిపై తెలంగాణ, ఏపీ బీజేపీ నేతలు భిన్న వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల జల వివాదాలు ఉండొద్దని కేసీఆర్ పెద్ద మనసుతో వ్యవహరించారని, తెలంగాణకు అన్యాయం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా గతంలో ఎన్నోమార్లు స్పష్టం చేశారని, ఏపీ నీటి పారుదల శాఖకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 29న లేఖ రాసిందన్నారు. ప్రస్తుతమున్న 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు నీటి సామర్థ్యం పెంపు ప్రయత్నాలు మానుకోవాలని లేఖలో ప్రస్తావించినట్టు తెలిపారు. దీనిపై ఏపీ నుంచి స్పందన లేకపోగా, అక్కడి ప్రభుత్వం ఈ నెల 5న జారీ చేసిన ఉత్తర్వులపై కేసీఆర్ సమీక్ష జరిపి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసిన విషయాన్ని కర్నె గుర్తు చేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 12న మరో లేఖ రాసిందని వివరించారు. -
అది జరిగినప్పుడే అసలైన పల్లె ప్రగతి
సాక్షి, హైదరాబాద్: బెల్టు దుకాణాలు లేనప్పుడే నిజమైన పల్లెప్రగతి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. హోం, ఎక్సైజ్, పంచాయతీరాజ్ శాఖలు కలిసి ఈ దుకాణాల మీద దాడులు చేయాలన్నారు. శుక్రవారం ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ.. గ్రామాల్లో బెల్టు దుకాణాలు తీసివేయాలని.. మద్యాన్ని అరికట్టాలన్నారు. పల్లె ప్రగతి మంచి కార్యక్రమమని కొనియాడారు. కానీ, ప్రతి ఊరికి ట్రాక్టర్ అవసరం లేకపోవచ్చని, దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. (‘మెట్రో’పై కిషన్‌రెడ్డిది అనవసర రాద్ధాంతం: కర్నె ప్రభాకర్) బీజేపీ ఎమ్మెల్సీ రామ్‌చందర్ రావు మాట్లాడుతూ.. గ్రామాల్లో బహిరంగ మల విసర్జన లేకుండా మరుగుదొడ్లు నియమించాలని కోరారు. నగరాలు, పట్టణాలకు వలస వచ్చినవారు తిరిగి గ్రామాలకు వెళ్లే పరిస్థితి తీసుకురావాలని పేర్కొన్నారు. కేంద్రం.. గ్రామాలకు అనేక పథకాల ద్వారా నిధులు ఇస్తుందని తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రతి రోజు పండగనే జరుగుతుందన్నారు. పంచాయతీ రాజ్ శాఖకు నిధుల కేటాయింపు గతంలో రూ.13 వేల కోట్లు దాటలేదని, కానీ నేడు రూ.23 వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. -
బడ్జెట్ కేటాయింపుల్లో రైతులకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలను ఒక్క క్షణం కూడా అసంతృప్తిగా ఉంచకూడదనేదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఆదివారం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా ఇంత భారీ బడ్జెట్ ప్రవేశపెట్టడం కేసీఆర్ నాయకత్వానికే చెల్లిందన్నారు. గ్రామీణ అభివృద్ధికి రూ.23 వేల కోట్లు, హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు, గృహ నిర్మాణం రంగానికి రూ.11,900 కోట్లు, ఆర్టీసీ అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారని తెలిపారు. గ్రామ, పట్టణ ప్రజలందరికి ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో రైతులకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రైతుల కోసం ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ బడ్జెట్‌తో తెలంగాణ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
'కుంతియా, ఆజాద్‌ల ఆరోపణలు అసత్యం'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి విషయంలో ప్రభుత్వంపై, పోలీసులపై కాంగ్రెస్ నేతలు కుంతియా, ఆజాద్‌లు చేసిన ఆరోపణలు అసత్యమని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. గోపన్‌పల్లి భూ ఆక్రమణలు కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి కావాలనే అరెస్టు అయి జైలుకు వెళ్లాడని తెలిపారు. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా డ్రోన్లను ఎగిరేయడం చట్ట విరుద్ధం అన్నారు. చట్టాలు తెలిసిన వారు ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారన్నారు. ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు శోచనీయమని, ప్రతిపక్షాలు పసలేని పక్షాలుగా తయారయ్యాయని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తున్నప్పటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. 'అభివృద్ధి జరగలేదంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలను అచ్చంపేట నియోజకవర్గానికి ఆహ్వానిస్తున్నా. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం. అసెంబ్లీలో ఒక నిర్మణాత్మకమైన చర్చకు తావివ్వాలని ప్రతిపక్షాలను నేను ఈ సందర్భంగా కోరుతున్నా' అంటూ బాలరాజు మీడియాకు వెల్లడించారు. -
‘మెట్రో’పై కిషన్‌రెడ్డిది అనవసర రాద్ధాంతం: కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్ : మెట్రో రైలు ప్రారంభోత్సవంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిది అనవసర రాద్ధాంతం అని, ఆయనకు రాజకీయ ప్రయోజనాలే తప్ప తెలంగాణపై ప్రేమ లేదని మరోమారు నిరూపించుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, విప్ కర్నె ప్రభాకర్ విమ ర్శించారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కిషన్‌రెడ్డి వైఖరిని ఖండించారు. మెట్రో రైలుకు రూ.1,200 కోట్ల కేటాయింపు కేంద్రంతో కుదిరిన ఒప్పందం మేరకే జరిగిందని, అందులో కిషన్‌రెడ్డి మెహర్బానీ ఏమీ లేదని ప్రభాకర్ స్పష్టంచేశారు. మెట్రో ప్రారంభానికి సంబంధించిన ప్రతీ ప్రకటనలోనూ ప్రధాని మోదీ ఫొటోను వేయడాన్ని గుర్తు చేస్తూ, కేంద్రం నుంచి తెలంగాణకు ఏదైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తీసుకువస్తే పౌర సన్మానం చేస్తామని ప్రభాకర్ ప్రకటించారు. -
నిధుల విడుదలపై బీజేపీ దుష్ప్రచారం: కర్నె
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలో తెలంగాణకు కేంద్రం విడుదల చేసిన నిధులకు సంబంధించి రాష్ట్ర బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. నిధుల గణాంకాలను కేంద్ర ఆ ర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా ప్రకటించినా.. బీజేపీ నేతలు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన ని ధులకు సంబంధించి రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను ఖండించారు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల కాలంలో పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రం నుంచి రూ.2.72 లక్షల కోట్లు వెళ్లగా, కేంద్రం నుంచి రాష్ట్రానికి మాత్రం రూ. 1.12 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని గురువారం ఓ ప్రకటనలో వెల్లడిం చా రు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన గణాంకాలపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉ పాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ విమర్శిస్తే బీజేపీ నేతలు ఉలికిపడుతున్నారన్నా రు. ప్రగతిశీల రాష్ట్రాలకు నిధులు కేటాయింపు పెంచాలని సీఎం పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. తెలంగాణ కు నిధుల విడుదల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. -
మా ఎమ్మెల్యేలెవరూ బీజేపీతో టచ్‌లో లేరు
సాక్షి, హైదరాబాద్: కుట్రలు, కుతంత్రాలతోనే రాజకీయాలు నడపాలని బీజేపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. బీజేపీ రాజకీయ దుర్మార్గపు క్రీడ ఆడుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ నేత లక్ష్మణ్ పేర్కొనడం నీతి మాలిన రాజకీయానికి నిద ర్శనమన్నారు. గురువారమిక్కడ కర్నె విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలెవరూ బీజేపీతో టచ్‌లో లే రని, కేంద్రమంత్రులే తమతో టచ్‌లో ఉన్నారని వ్యం గ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మం త్రులు దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాల ను ఎలా అమలు చేయాలని ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరూ కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టంచేశారు. -
‘కేసీఆర్ నిజాయితీతో బడ్జెట్‌ను తయారు చేశారు’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మభ్యపెట్టే లెక్కల పద్దులు కాకుండా నిజాయితీతో బడ్జెట్‌ను తయారు చేశారని టీఆర్ఎస్ నేత కర్రె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈ బడ్జెట్‌ను రూపొందించారని తెలిపారు. కేంద్రం నుంచి రావలసిన నిధులను దృష్టిలో పెట్టుకుని ఓటన్ అకౌంట్ బడ్జెట్ రూపకల్పన చేశారని వెల్లడించారు. బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. మ్యానిఫెస్టోను ఓ బైబిల్, భగవద్గీత, ఖురాన్‌లాగా భావించి, చెప్పింది చేస్తున్నారన్నారు. లక్షా 82 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్లో 1800 కోట్లను కేటాయించి ఇచ్చిన మాట నిలుపుకున్నారని పేర్కొన్నారు. రైతు బంధు, వైద్యం, విద్య, ఆసరా వంటి అనేక రకాల సంక్షేమ పథకాలకు సముచిత రీతిలో నిధులను కేటాయించారని తెలిపారు. -
ఒంటేరుపై చర్యలు తీసుకోండి: టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ నియోజకవర్గంలో తన మామ కేసీఆర్‌ను ఓడించాలని మంత్రి హరీశ్‌రావు కోరి నట్లు ఆరోపణలు చేసిన టీడీపీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డితో పాటు ఓటర్లకు డబ్బులు పంచాలని సూచించిన బీజేపీ స్టార్ క్యాంపెయినర్ స్వామి పరిపూర్ణానందపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ సోమవారం ఇక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. అనం తరం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీని వాస్‌రెడ్డి మాట్లాడుతూ హరీశ్‌రావుపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన ప్రతాప్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. మునుగోడు నియోజ కవర్గం పరిధిలోని చౌటుప్పల్‌లో శనివారం నిర్వహించిన బీజేపీ ప్రచార ర్యాలీలో ఓటర్లకు రూ. 200 ఇచ్చి ప్రలోభాలకు గురి చేయాలని కోరిన స్వామి పరిపూర్ణానందపై సైతం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామని పార్టీ నేత విఠల్ తెలిపారు. డబ్బులిస్తే ప్రజలు ఓట్లేస్తారని చెప్పడం ద్వారా ఆయన రాష్ట్ర ప్రజలందరినీ అవమానించారని పార్టీ నేత ఉపేంద్ర అన్నారు. పరిపూర్ణానందవి పగటి కలలు: కర్నె సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత పరిపూర్ణానంద తనకు తాను యోగి ఆదిత్యనాథ్‌లా ఊహించుకుని పగటి కలలు కంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రవచనాలు చెప్పేందుకు స్వామి డబ్బులు తీసుకుంటారేమోనని.. అందుకే ప్రజలు డబ్బులు తీసుకుని సభలకు వస్తారని హేళనగా మాట్లాడారని చెప్పారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ నేతలు కేంద్రంలో అధికారంలో ఉండి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారు. బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదు. రాజకీయాలంటే ఛారిటీ కాదని మాట్లాడిన రాంమాధవ్ కూడా టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. పరిపూర్ణా నందస్వామి రాజకీయాలు ఇక్కడ నడవవు. మత రాజకీయాలతో బీజేపీకి తెలంగాణలో ఓట్లు పడవు. టీపీసీసీ అధికారిక ట్విట్టర్లో అన్నీ అబద్ధాలను ప్రచారం చేస్తోంది’ అని అన్నారు. -
ఉత్తమ్ ఓ అజ్ఞాని: కర్నె ప్రభాకర్
సాక్షి,హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ అజ్ఞాని అని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ఆయన తన పేరును గాలికుమార్‌రెడ్డిగా మార్చుకో వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం కర్నె విలేకరులతో మాట్లాడుతూ.. ఉత్తమ్ లాంటి అజ్ఞాని పీసీసీ అధ్యక్షుడిగా ఉండటం కాంగ్రెస్ పార్టీ దురదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారన్న ఉత్తమ్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ కంటిపరీక్షల కోసమే ఢిల్లీ వెళ్లారని అందరికీ తెలుసని, ప్రధాని మోదీ జపాన్ పర్యటనలో ఉంటే ఆయనను కేసీఆర్ ఢిల్లీలో ఎలా కలుస్తారని ప్రశ్నించారు. సోనియాగాంధీ కూడా ఆరునెలలకోసారి అమెరికా వెళ్తున్నారని, దేశ భద్రతకు సంబంధించిన విషయాలను పంచుకోవడానికే అక్కడికి వెళ్తున్నారని మేము అనగలమని కానీ మాట్లాడేటపుడు విచక్షణ కోల్పోకూడదని హితవు పలికారు. సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్య లను ఉత్తమ్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. యాష్కీ క్షమాపణలు చెప్పాలి: సుధారాణి నిజామాబాద్ ఎంపీ కవితపై వ్యాఖ్యలు చేసిన మధుయాష్కీ క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి డిమాండ్ చేశారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ, మధుయాష్కీపై గతంలో గొనె ప్రకాశ్‌రావు ఆరోపణలు చేశారని, వాటిపై సమాధానం ఇవ్వకుండా పారిపోయిన యాష్కీ ఇప్పుడు కవిత అవినీతి పరురాలంటూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. -
వైఎస్ జగన్‌తో కేసీఆర్ మాట్లాడితే...
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో అసహనం పెరిగిపోతుందని, మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ అధికార ప్రతినిధులు కర్నె ప్రభాకర్, గట్టు రామచంద్రరావులు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. బాబు ప్రతిదీ రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బాబు మనిషో, మరమనిషో అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగితే కేసీఆర్, కేటీఆర్‌లు సాటి మనుషులుగా స్పందించారని అన్నారు. వైఎస్ జగన్‌తో కేసీఆర్ మాట్లాడితే ఎందుకు అంత తత్తరపాటు అని ప్రశ్నించారు. అలిపిరిలో చంద్రబాబు మీద దాడి జరిగినపుడు తెలంగాణా బద్ధ విరోధి అయినా దాన్ని తాము ఖండించామని పేర్కొన్నారు. దాడిని ఖండిస్తే కేసీఆర్‌కు, మోదీతో సంబంధం అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో విభేదాలు ఉండవచ్చు కానీ మానవ సంబంధాలు అనేవి ఉంటాయని చెప్పారు. హరికృష్ణ మరణంపై, హుదూద్ తుపానుపై కూడా మానవీయంగానే స్పందించామని గుర్తు చేశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి పిలిస్తే కేసీఆర్ హాజరయ్యారని తెలిపారు. ఆపరేషన్ గరుడ నిజంగా ఉందో లేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఓటుకు నోటు కేసుతో అస్థిరత్వానికి గురిచేయాలని చూసింది మాత్రం నిజమని పేర్కొన్నారు. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కోవర్టు అని చెప్పామని ఇప్పుడు అదే నిజమైందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్లు కూడా చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేపు మహాకూటమి గనుక పొరపాటున అధికారంలోకి వస్తే చంద్రబాబుదే అజమాయిషీ ఉంటుందని చెప్పారు. కేసీఆర్‌కు మానవ సంబంధాలు కూడా ముఖ్యమని చంద్రబాబు గ్రహించాలని హితవు పలికారు. చంద్రబాబువి అన్నీ ఆర్ధిక సంబంధాలేనని, ఇకనైనా బాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. -
ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ చెప్పలేదు
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీ ఆర్ ఎన్నడూ చెప్పలేదని ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఎంఎస్.ప్రభాకర్‌రావు అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ చైర్మన్లు కిషన్‌రావు, రంగారెడ్డిలతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మాటలు చూస్తుంటే అబద్ధాల కంటే ముందే వారు పుట్టారనిపిస్తోందన్నారు. నిత్యం కాంగ్రెస్ నేతలు చెప్పే అబద్ధాలే రాహుల్ గాంధీ చెప్పారన్నారు. వారి ప్రసంగాలను విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌కి గౌరవం ఇస్తామని, కానీ ఆ స్థాయిలో ఆయన మాట్లాడలేదన్నారు. -
ఉత్తమ్ అమరావతి స్క్రిప్టు చదివారు
సాక్షి, హైదరాబాద్: కేవలం నాలుగు సీట్లు గెలవడం కోసం ప్రతిపక్ష పార్టీలు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో మంత్రి హరీశ్‌రావు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అమరావతి నుంచి వచ్చిన స్క్రిప్టును చదివారని విమర్శించారు. టీడీపీకి కట్టుబానిసలమని ఉత్తమ్ రుజువు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్‌రావు తో కలిసి కర్నె గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘హరీశ్‌రావు సంధించిన 12 ప్రశ్నలపై ఉత్తమ్ డొంక తిరుగుడు సమాధానమిచ్చారు. నదీ జలాల పంపకంపై ఉత్తమ్ కు కనీస అవగాహన లేదని తేలిపోయింది. సైన్యం లో కెప్టెన్‌గా పనిచేశానని చెప్పుకునే ఉత్తమ్‌కు కనీస పరిజ్ఞానం లేదు. నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వస్తే పరిష్కరించడానికి ఉన్నతస్థాయి కమిటీ ఉంది. ఆ కమిటీ ముందు చంద్రబాబు తెలంగాణ నీటి కేటాయింపులకు ససేమిరా అన్నారు. ఉత్తమ్ రాష్ట్ర ప్రయోజనాలను తాక ట్టు పెట్టి చంద్రబాబుకు వత్తాసు పలికాడు. అన్ని అనుమతులున్న సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడుతున్నాడు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని బాబుకు తాకట్టు పెట్టే కుతంత్రాల కూటమే మహాకూటమి. తెలంగాణ ప్రజలు మహాకూటమికి సరైన సమాధానం చెబుతారు. ప్రజలకు మహాకూటమి ప్రాతిపదిక లు చెప్పాలి. హరీశ్‌రావు 12 ప్రశ్నలు ఏమున్నాయో చదవకుం డానే అమరావతి ఆదేశాలతో ఉత్తమ్ స్పందించారు. కాంగ్రెస్ నేతలు ఎంత వ్యతిరేకించినా దామరచర్ల ప్లాంట్ కట్టి తీరుతాం’అని అన్నారు. పోలింగ్ కేంద్రాలు పెట్టాలి: టీఆర్ఎస్ ఇటీవల గ్రామపంచాయతీలుగా మారిన తండాలు, గిరిజన గూడేల్లో పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ కోరింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములునాయక్ ఈ మేరకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. -
బాబుతో అప్రమత్తంగా ఉండాలి: కర్నె ప్రభాకర్
సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభ తగ్గిందని సర్వేలు చెబుతున్నాయని.. అక్కడ ముఖ్యమంత్రి పదవి పోతుండటంతో తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తు న్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. తెలం గాణ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిన చంద్రబాబు విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ నేతల ఫోన్లను ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలపైనో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందలేదని, చంద్రబాబు కట్టిన హైటెక్ సిటీ గబ్బిలాల మందిరంగా తయారైందని చెప్పారు. చంద్రబాబు మరోసారి తెలంగాణలో కుట్రలు చేసే ప్రమాదం ఉందనే టీడీపీతో పొత్తులు పెట్టుకోలేదు. రాష్ట్ర ఏర్పాటు కోసమే పొత్తు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే 2009లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని కర్నె తెలి పారు. టీఆర్ఎస్ బహిరంగసభలకు ప్రజలు భారీగా స్వచ్ఛందంగా తరలి రావడాన్ని చూసి కాంగ్రెస్ వాళ్లు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. బతుకమ్మ చీరలను పంపిణీ చేయకుం డా కాంగ్రెస్ అడ్డుకోవడం నీతిమాలిన చర్యని, ఇది ఆడపడుచులను అవమానపరచడమేనని విమర్శించారు. మిషన్ భగీరథ పనులను ఆపా లని కేసు కూడా వేస్తారేమోనన్నారు. ఇలాంటి ప్రతిపక్షం భవిష్యత్తులో అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు కీడు జరుగుతుందన్నారు. కేసీఆర్‌కు రాఖీ కట్టినప్పుడు గుర్తు లేదా? గుండు సుధారాణి సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టినప్పుడు విజ యశాంతికి దొర పదం గుర్తుకు రాలేదా అని టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి విమర్శించారు. ప్రభుత్వ పథకాలు విజయశాంతికి సంపాదన పథకాలుగా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ చేనేత వర్గాలకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం బతుకమ్మ చీరల పం పిణీ చేపట్టిందని, మహిళలు కట్టుకునే చీరలపై రాజకీయం చేయడం సరికాదన్నారు. ‘తెలం గాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ. తరతరా ల నుంచి సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభుత్వం చీరలను ఇస్తోం ది. మహిళలకు ఇచ్చే చీరలను అడ్డుకోవడం కాంగ్రెస్ నీచ సంస్కృతి. కేసీఆర్ అమలు చేసిన ప«థకాలను, ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి’ అని మండిపడ్డారు. -
‘బతుకమ్మ పండుగపై కూడా ఈసీని ఆశ్రయిస్తారేమో..!’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు టీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు కర్నె ప్రభాకర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ ఓటమి ఖాయమని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబు ఏపీని వదిలి తెలంగాణకు వచ్చి రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలలు కూడా చంద్రబాబే దిక్కని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీకి అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు బతుకమ్మ పండుగపై కూడా ఈసీని ఆశ్రయించినా ఆశ్చర్యపడనక్కర్లేదని వ్యంగ్యంగా స్పందించారు. -
కాంగ్రెస్ నిరుద్యోగులను రెచ్చగొడుతోంది: కర్నె
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను రెచ్చగొడుతోం దని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉద్యోగులపై ప్రత్యేక శ్రద్ధ ఉందని, కాంగ్రెస్ మాత్రం వారిని బానిసలుగా చూస్తోందన్నారు. టీఆర్ఎస్ కార్యదర్శి గట్టు రాంచందర్‌రావుతో కలిసి ఆయన తెలంగాణ భవన్లో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ నిరుద్యోగుల పేరుతో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించి పాడిన పాటే పాడారన్నారు. నిరుద్యోగ సమస్యకు కారణం కాంగ్రెసేనని, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి అంటూ వారిని అయోమయంలో పడేస్తోందని విమర్శించారు. కోర్టు కేసులతో కాంగ్రెస్ వివాదాలు సృష్టించి ఉద్యోగాలు రాకుండా చేస్తోందని ఇప్పటికైనా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరుద్యోగులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశామో ప్రజలకు తెలుసన్నారు. అమలు సాధ్యంకాని హామీలతో ప్రజల్ని కాంగ్రెస్ మభ్యపెడుతోందన్నారు. -
కాంగ్రెస్, టీడీపీ పొత్తు నీతిమాలిన చర్య: కర్నె
సాక్షి, హైదరాబాద్: రాజకీయ సిద్ధాంతాలను వదిలేసి ఎన్నికల కోసం కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకోవడం నీతిమాలిన చర్య అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. అనైతిక పొత్తులను ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. టీఎస్ఐడీసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలసి కర్నె మంగళవారం తెలం గాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ తోక పార్టీలన్నీ కలసి కూటమి అవుతాయని మేము ముందు నుంచి చెబుతున్నదే నిజమవుతోంది. బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపిన టీడీపీతో పొత్తు కోసం కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణ అభివృద్ధి చెందాలని బాబు ఎందుకు కోరుకుంటారు? టీడీపీతో పొత్తుపై నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించాలి. వచ్చే ఎన్నికలు అభివృద్ధికి, అభివృద్ధి నిరోధకులకు మధ్య జరిగే ఎన్నికలు. తప్పు జరిగి వారు గెలిస్తే అమరావతి నుంచి ఇచ్చే సూచనలతోనే ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అరెస్టుతో టీఆర్ఎస్కు సంబంధం లేదు. గతంలో నమోదైన కేసు విచారణలో భాగంగానే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు’అని తెలిపారు. -
రికార్డు స్థాయిలో సభ: కర్నె, బాలమల్లు
సాక్షి, హైదరాబాద్: కేవలం పది రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో బహిరంగసభను నిర్వహించామని ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ నేత గట్టు రామచందర్‌రావు అన్నారు. సోమవారం విలేకరులతో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ సభకు 25 లక్షల మంది వస్తారా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారని, వారి అనుమానాలను తలకిందులు చేస్తూ అన్ని రికార్డులను అధిగమించిందన్నారు. దీనికి అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాయన్నారు. ఈ సభపై కాంగ్రెస్ నాయకులు దివాళాకోరు తనంతో దిగజారుడు విమర్శలు చేస్తున్నారని, ఈ సభ దేశంలోనే రికార్డు అని కర్నె ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 42 ఏళ్లు పాలించినా ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించారా అని ప్రశ్నించారు. ట్రాఫిక్ జామ్ వల్లే రాలేకపోయారు: దానం సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ జామ్ వల్ల వేలాదిమంది ప్రగతి నివేదన సభ జరుగుతున్న ప్రాంతానికి రాలేకపోయారని మాజీమంత్రి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, సభ విజయవంతమైనా కొందరు కాకి గోల చేస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రగతి నివేదన సభ గురించి ఉత్తమాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ను గద్దెదించడం సాధ్యంకాదని, గాంధీభవన్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తొలగిస్తేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందన్నారు. కాంగ్రెస్ నేతలు కాకి గోల చేస్తున్నారని, ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్‌లో తలొక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల అండ టీఆర్ఎస్కు ఉందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని నేరుగా ప్రధానమంత్రి మోదీకే కేసీఆర్ చెప్పాడని దానం వెల్లడించారు. ప్రగతి నివేదన సభలో అభివృద్ధి గురించి చెప్పడం తప్ప రాజకీయ విమర్శలు చేయలేదని, ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలను కేసీఆర్ కడిగి పారేస్తారని హెచ్చరించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ సాధ్యంకాదని ఉత్తమ్‌కు కాంగ్రెస్ నేతలే చెప్పారని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో ఉత్తమ్ ఎందుకు రహస్యంగా సమావేశం అయ్యారో చెప్పాలని దానం డిమాండ్ చేశారు. -
‘డబ్బులు పంచే అలవాటు మీదే’
సాక్షి, హైదరాబాద్: ప్రగతి నివేదన సభకోసం తాము పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటే, డబ్బాల్లో పెట్టి కోటి రూపాయలు ఇచ్చారని అనడానికి కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి బుద్ధి ఉండాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సోమవారం తెలంగాణ భవన్లో మరో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, పార్టీ నేత గట్టు రాంచందర్‌రావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. డబ్బులు పంచే అలవాటు కాంగ్రెస్ నేతలకే ఉందని వ్యాఖ్యానించారు. గత ఎన్నికలలో పంచేందుకు తీసుకెళ్లిన డబ్బులు బయటపడడంతో టాటాసఫారీ వాహనంలో కాల్చేసిన చరిత్ర ఉత్తమ్‌ది అయితే, నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్కు డబ్బులు ఇస్తూ పట్టుబడింది రేవంత్‌రెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా నేతలు నోరు అదుపులో పెట్టుకుని గాలి మాటలు మాట్లాడడం మానేయాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మాట్లాడుతూ, గత నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముందుంచి రానున్న రోజుల్లో ఏం చేస్తామో చెప్పేందుకే ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇది దేశంలోనే పెద్ద సభ అవుతుందని, ఈ సభ ద్వారా టీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణ, శక్తి ఏంటో నిరూపిస్తామని వ్యాఖ్యానించారు. గట్టు మాట్లాడుతూ ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని, ఆ రోజున ఏ పనులున్నా వాయిదా వేసుకోవాలని కోరారు. -
కాంగ్రెస్ నేతలు ఆంధ్రా కోవర్టులు: కర్నె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆంధ్రా ప్రాంతానికి ఏజెంట్లుగా, కోవర్టులుగా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీతో కలిసి పనిచేయాలనే కోరికతో కాళేశ్వరాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగంగా పనిచేస్తున్న తెలంగాణ జేఏసీ నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుపై అర్థంలేని విమర్శలు చేశారని అన్నారు. ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందడం తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడా మాటమీద నిలబడే పరిస్థితి లేదన్నారు. గోదావరి నీరు ధవళేశ్వరం బ్యారేజీకి, కృష్ణా నది నీరు కృష్ణా బ్యారేజీకి చేరాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని కర్నె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు రీ డిజైన్ చెయ్యలేదా అని ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎందుకు ప్రాజెక్టును పూర్తిచేయలేదో చెప్పాలన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు టూరిస్ట్ ప్లేస్ అయితే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఎందుకు బాధపడుతున్నాడని కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. -
‘టీజీకి మతి భ్రమించింది’
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ మతి భ్రమించిన, ఓ పిచ్చి నాయకుడని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ లోనూ ఎన్నో పదవులను చేపట్టిన ఎంపీ కె.కేశవరావుపై నోరుపారేసుకోవడం సరికాదని శనివారం హెచ్చరించారు. టీజీ లాంటి నాయకులు, వ్యక్తుల వల్ల ఏపీకే నష్టమన్నారు. ఇలాంటి నేతల తప్పుడు మాటల వల్ల 2 రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏపీ సీఎం చంద్రబాబుదేనని హెచ్చరించారు. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడుతున్న వారే.. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించేలా, కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదన్నారు. మతి భ్రమించి మాట్లాడుతున్న టీజీని తక్షణమే పిచ్చాసుపత్రిలో చేర్చాలని వ్యాఖ్యానించారు. -
‘చంద్రబాబు.. టీజీని అదుపులో పెట్టుకో’
సాక్షి, హైదరాబాద్ : ఏపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ సీనియర్ నేత కె కేశవరావుపై టీజీ వెంకటేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కర్నె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీ లాంటి వ్యక్తుల వల్ల ఆంధ్రప్రదేశ్‌కే నష్టం అని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీజీని అదుపులో ఉంచాలని సూచించారు. టీజీ వెంకటేష్ అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని, అటువంటి పరిస్థితి రాకుండా ఉండేలా చూడాలంటూ చంద్రబాబును కోరారు. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రను కించపరచొద్దంటూ హితవు పలికారు. ప్రజలను రెచ్చగొట్టడమే టీజీ పరమావధిగా పెట్టుకున్నారని కర్నె మండిపడ్డారు. -
చీకటి ఒప్పందాల చరిత్ర కాంగ్రెస్‌దే: కర్నె, రాములు
సాక్షి, హైదరాబాద్: అధికారం, పదవులే లక్ష్యంగా చీకటి ఒప్పందాలు చేసుకునే నీచ సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, రాములు నాయక్ విమర్శించారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కనుచూపు మేరలో కాంగ్రెస్ పార్టీకి అధికారం రాదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అర్థమైందన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధి, సంక్షేమం కోసమే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధాలున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని మోసం చేసిన పార్టీలు అని విమర్శించారు. -
రైతుబంధును బహిష్కరించే దమ్ముందా?
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు పథకాన్ని బహిష్కరించే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా అని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రైతుబంధు ద్వారా పెట్టుబడికోసం ఎకరానికి 4వేల రూపాయలు, పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకున్న రైతుల కళ్లల్లో ఆనందాన్ని కాంగ్రెస్ నేతలు చూడలేకపోతున్నారని ఆరోపించారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు రైతుబంధు పథకాన్ని సూటిగా వ్యతిరేకించాలన్నారు. దీనిని బహిష్కరిస్తున్నామని బస్సుయాత్ర వేదికగా ప్రకటించే దమ్ముందా అని సవాల్ చేశారు. బస్సుయాత్రలో 60 మంది సీఎం అభ్యర్థులు పాల్గొంటున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్త మాటలు మాట్లాడుతూ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని కర్నె వ్యాఖ్యానించారు. ఇలాంటి బాధ్యతారహిత కాంగ్రెస్‌లాంటి పార్టీ ప్రతిపక్షంలో ఉండటమే దురదృష్టమన్నారు. తుపాకీరామునిలాగా ఉత్తమ్ మాట్లాడుతున్నాడని అన్నారు. రైతులను ఆదుకోవాలని, పొలాలకు సాగునీరు ఇవ్వాలని, వారికి పెట్టుబడి అందించాలని అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న సీఎం కేసీఆర్ సంకల్పాన్ని ఎవరూ మార్చలేరని కర్నె చెప్పారు. కౌలు రైతుల పేరుతో కపట నాటకం ఆడుతున్న కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవడం ప్రభుత్వాలకు కొత్తకాదని, టీఆర్ఎస్పై అనవసర ఆరోపణలు సరికాదన్నారు. -
ప్రాజెక్టులు చూసి కుళ్లుకుంటున్న కాంగ్రెస్: కర్నె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం వేగంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూసి కాంగ్రెస్ పార్టీ కుళ్లుకుంటుందని, ఆ పార్టీ నేతల కడుపు మండిపోతుందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, జీవన్‌రెడ్డిలు నోటికొచ్చినట్టు మాట్లాడి తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటున్నారన్నారు. పచ్చి అబద్ధాలు, అసత్యాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం ఎడారులుగా మారిన ప్రాజెక్టులు, నాలుగేళ్లలోనే నీటితో కళకళలాడుతున్నాయని తెలిపారు. నీటితో నిండిన ప్రాజెక్టులను చూడటానికి అన్ని వర్గాలు వెళ్తే, కాళేశ్వరంను పర్యాటక కేంద్రంగా మార్చారని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. -
ఉత్తమ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ మండిపడింది. ఉత్తమ్ వాస్తవాలను తెలుసుకోలేక మాట్లాడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి అధికారిక నివాసమన్నారు. అంతేతప్ప అది ఎవరి సొత్త కాదని తెలిపారు. ప్రగతిభవన్‌లో 150 గదులుంటాయని కాంగ్రెస్ నేతలే అంటున్నారన్నారు. కేసీఆర్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించమని హెచ్చరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంటే.. అవినీతి అంటారా అని ఆయన ప్రశ్నించారు. -
అవిశ్వాసానికి మద్దతు ఇస్తాం: కర్నె
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకం గా, అవిశ్వాస తీర్మా నా నికి మద్దతుగా టీఆర్ఎస్ ఎంపీలు ఓటేస్తారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రకటించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తామని ఎంపీ వినోద్‌కుమార్ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆ ర్ శక్తి ఏమిటో దేశ ప్రజలు త్వరలోనే చూడబోతున్నారన్నారు. రాష్ట్ర బడ్జెట్ అంకెలగారడీ కాదని, తెలంగాణ ప్రగతిని ప్రతి బింబిస్తున్నదన్నారు. టీఆర్ఎస్లో చేరితే కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టినట్టుగా సంపత్‌కుమార్ మాట్లాడటం సరికాదని, ఆ ఖర్మ టీఆర్ఎస్కు లేదన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డిపై కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, నల్లగొండలో హత్యా రాజకీయాలకు పాల్పడిన చరిత్ర కోమటిరెడ్డిది అని విమర్శించారు. -
కాంగ్రెస్ పార్టీది దుర్మార్గపు చర్య: కర్నె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తప్పుబట్టారు. రాజ్యాంగాధినేత అయిన గవర్నర్ ప్రసంగిస్తుంటే కాంగ్రెస్ అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని ఆయన అన్నారు. గడచిన నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టిందని, వాటిగురించి గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు అడ్డుకోవడాన్ని సరికాదన్నారు. కనీసం గవర్నర్ ఏం మాట్లాడుతున్నారో కూడా వినే పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ నేతలు లేరని కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. ఈ చర్య ద్వారా కాంగ్రెస్ పార్టీ తన ధోరణిని మరోసారి నిరూపించుకుందన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వారిలో వారే కొట్టుకోవడం, పేపర్లు విసురుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారన్నారు. టీఆర్ఎస్ లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి అని, అయితే కొంతమంది వ్యక్తులు రాజకీయ కుట్రతో రాష్ట్రాన్నిసోమాలియా, ఉగాండా దేశాలలాగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యట్టారు. -
కాంగ్రెస్ ఒక సర్కస్ కంపెనీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కస్ టీమ్ తెలంగాణలో ప్రదర్శనలు చేసిందని, ఆ పార్టీ ఎన్ని ఫీట్లు చేసినా ప్రజలు పట్టించుకోలేదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలసి శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బస్సుయాత్ర చేసిన కాంగ్రెస్ నేతలకు వచ్చే ఎన్నికల్లోనూ పుట్టగతులుండవని హెచ్చరించారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా టీఆర్ఎస్ నేతలపై, మంత్రులపై కాంగ్రెస్ నోరు పారేసుకుంటోందని మండిపడ్డారు. మంత్రి ఈటల రాజేందర్‌పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ పీనుగ లాంటిది: రసమయి బడుగు బలహీనవర్గాలకు అండగా ఉన్న మంత్రి ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి పిచ్చి పట్టినట్టుగా విమర్శలు చేశారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పీనుగ లాంటిదని, అది కోలుకునే పరిస్థితి లేదన్నారు. రేవంత్‌రెడ్డికి మైక్ దొరికితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ప్రజలు ఆయనను జోకర్‌లాగా చూసి నవ్వుతున్నారన్నారు. -
బీజేపీ అసలు పేరు భారతీయ జూఠా పార్టీ: కర్నె
సాక్షి, హైదరాబాద్: అబద్ధాలతో పబ్బం గడుపుతున్న బీజేపీ అసలు పేరు భారతీయ జూఠా పార్టీ అని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశ ప్రజలకు ఎగనామం పెట్టేందుకు బీజేపీ రోజుకో కొత్త నాటకమాడుతోందని విమర్శించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు ఏదో చేసినట్టు అబద్ధాలు చెప్పారన్నారు. ప్రధాని మోదీని దూషించే విధంగా మాట్లాడలేదని సీఎం కేసీఆర్ స్పష్టంగా వివరణ ఇచ్చిన తర్వాత కూడా బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలకు సంబంధం లేని అంశాలతో, మతం పేరుతో రాజకీయాలు చేసే ఏకైక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ నేతలంతా కాలకేయ ముఠా: కర్నె
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఉసురుపోసుకుంటూ, అభివృద్ధిని అడ్డుకుంటూ కాంగ్రెస్ నేతలంతా కాలకేయ ముఠాలాగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని పదేళ్లపాటు మిడతల దండులాగా దోచుకున్నారని ఆరోపించారు. గాంధీ భవన్లో కూర్చుని పిచ్చికూతలతో హింసావాదాన్ని రెచ్చగొట్టాలని కాంగ్రెస్ నేతలు కుట్రలు చేసినా, టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించిదని చెప్పారు. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్ దండుకు ప్రజలే బుద్ధి చెప్తారని ఎమ్మెల్సీ రాజు హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ పనిచేసే తత్వాన్ని, సమర్థతను ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా విమర్శించారు. కేటీఆర్ విజయాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్ మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల నుంచి సిలికాన్ వ్యాలీ దాకా మంత్రి కేటీఆర్‌కు సర్వత్రా అభినందనలు వస్తున్నాయని, దీనిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు పిచ్చిపట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ నేతలంతా ప్రజలను పట్టించుకోకుండా క్లబ్బుల్లో, ఏసీ గదుల్లో గడిపారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ప్రజల్లో తిరుగుతూ సమస్యలను పరిష్కరించడమే కాకుండా విదేశాలను ఆకర్షించి పెట్టుబడులు తీసుకొస్తున్నాడని అన్నారు. అవినీతి పొరలు కమ్మిన కాంగ్రెస్ నాయకుల కళ్లకు ప్రతీ స్కీమ్‌లోనూ స్కామ్ కనబడుతోందని విమర్శించారు. -
రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్రతో కాంగ్రెస్ అబద్ధాల్ని చెబుతూ దివాళాకోరు రాజకీయం చేస్తోందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ తమ పాలనలో ఏనాడూ నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం కర్నె విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో 24 వేల ఉద్యోగాల భర్తీ జరిగితే, అందులో సింహభాగం ఆంధ్రా వారికే కట్టబెట్టారన్నారు. ఆనాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి దీనిపై అప్పుడు నోరెందుకు మెదపలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మూడున్నరేళ్ల కాలంలోనే 81,739 ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టిందన్నారు. -
విపక్షాల తొత్తు మంద కృష్ణ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ ప్రతిపక్ష పార్టీలకు తొత్తుగా మారారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పూల రవీందర్‌తో కలసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వర్గీకరణపై చిత్తశుద్ధితో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికే అఖిలపక్ష పార్టీలతో రౌండ్‌టేబుల్ పేరిట రాజకీయ ప్రసంగాలు చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2004 డిసెంబర్లోనే ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసిందని, ఇప్పటిదాకా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రంలో యూపీఏ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా 10 ఏళ్లు అధికారంలో ఉన్నా వర్గీకరణ చేయలేదని, అలాంటిది ఇప్పుడెలా మాట్లాడుతున్నారని కర్నె ప్రశ్నించారు. వర్గీకరణపై చిత్తశుద్ధి ఉన్నందునే అసెంబ్లీలో టీఆర్ఎస్ తీర్మానం చేసిందని, కేంద్రానికి పంపిందని వారు చెప్పారు. దీనిపై కలిసి మాట్లాడటానికి ప్రధాని మోదీ అపాయింట్మెంటు ఇవ్వడంలేదని, బీజేపీ నేతలకు చేతనైతే ఇప్పించాలని సవాల్ చేశారు. -
గవర్నర్‌పై కాంగ్రెస్ అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ పదవికే వన్నె తెచ్చిన తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌పై కాంగ్రెస్ నీచ రాజకీయం చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...రాష్ట్రంలో జరిగే ప్రతి పనిని వ్యతిరేకించి అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ ప్రధాన విధిగా పెట్టుకుందని మండిపడ్డారు. గవర్నర్ పదవిని రబ్బర్ స్టాంప్‌గా మార్చి, రాజ్భవన్లను తమ రాజకీయాలకు అడ్డాగా మార్చింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకాన్ని క్షేత్ర స్థాయిలో గవర్నర్ పరిశీలిస్తున్నారని తెలిపారు. గవర్నర్ల వ్యవస్థ గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. గవర్నర్లను తమ ఏజెంట్లుగా మార్చుకొని గిట్టని ప్రభుత్వాలను బర్తరఫ్ చేయించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్‌దని దుయ్యబట్టారు. -
'పవన్‌ను రాజకీయనేతగా చూడటం లేదు'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌పై కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. ఆయనిక్కడ సోమవారం మాట్లాడుతూ రాజ్‌భవన్‌ను రాజకీయాలకు అడ్డాగా మార్చింది కాంగ్రెస్సే అని వ్యాఖ్యానించారు. గవర్నర్ వాస్తవాలు మాట్లాడినా ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ నేతలకు పనిగా మారిందని విమర్శించారు. మరో వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రపై కర్నె ప్రభాకర్ స్పందించారు. పవన్ ను తాము రాజకీయ నేతగా చూడటం లేదన్నారు. సినీ నటుడిగానే పవన్ కల్యాణ్.. కేసీఆర్‌ను కలిశారని స్పష్టం చేశారు. పవన్ పర్యటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. -
కాంగ్రెస్ కోసమే కోదండరాం సత్యాగ్రహం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కండువా కప్పుకోకుండానే జేఏసీ చైర్మన్ ఆ పార్టీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. కోదండరాం ముసుగు తొలగిపోయిందని, అభివృద్ధి నిరోధక కాంగ్రెస్ ఎజెండాను అమలుచేసే పనిలో పడ్డారని మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుతో కలసి కర్నె విలేకరులతో మాట్లాడారు. రైతు సమన్వయ సమితుల రద్దు కోసం సత్యాగ్రహం చేయాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని కోదండరామ్ సమర్ధించడం దారుణమన్నారు. కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్న ఆయన దేనికోసం సత్యాగ్రహం చేస్తున్నారో రాష్ట ప్రజలకు సమాధానం చెప్పాలని కర్నె డిమాండ్ చేశారు. -
తెలంగాణలో బీజేపీకి అది పగటి కల!
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి అధికారంలోకి రావడం పగటికల మాత్రమేనని, టు-లెట్ బోర్డు పెట్టుకుని ఎదురుచూస్తున్నా బీజేపీలో ఎవరూ చేరరని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఙానానికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలంలో మంగళవారం కర్నె విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలను అమలు చేస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేస్తుందో కూడా తెలియకుండా అవగాహన లేమితో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీకి చెందిన రాంమాధవ్ ఆ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయకుండా తెలంగాణలో అర్థం పర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రులే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే వారి వ్యాఖ్యలను రాంమాధవ్ వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎం కేసీఆర్‌కు కితాబిచ్చారన్నారు. తమ పార్టీలో సమర్థులు లేరని, ఇతరులు బీజేపీలోకి రావాలని రాంమాధవ్ చెప్పకనే చెబుతున్నారని విమర్శించారు. బీజేపీలో చేరడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఓ రెండు సంక్షేమ పథకాలు చెప్పగలరా అని నిలదీశారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన రాంమాధవ్ అదే ఆర్ఎస్ఎస్లో పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేసిన దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణకు కేంద్రం చేసిన ప్రత్యేక సాయం ఏమీ లేదని, అలాంటప్పుడు తెలంగాణ బీజేపీని ఎందుకు ఆదరిస్తుందని ప్రశ్నించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను సొంతంగానే పూర్తి చేస్తున్నామని, తెలంగాణలో కాషాయ జెండా ఎగిరే ప్రసక్తే లేదని అన్నారు. -
కాంగ్రెస్‌కు రైతుల శాపమే తగిలింది
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నేతల్లో అజ్ఞానం మూర్తీభ విం చిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. వారి హయాంలో రైతులకు చేయలేని పనులను టీఆర్ఎస్ చేస్తుందని కాంగ్రెస్ నేతలు అక్కసు వెళ్లగ క్కుతున్నారన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యా లయంలో ఆయన మంగళవారం మాట్లా డారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రైతుల కంచంలో మట్టి కొడుతు న్నారన్నారు. 2019లో తామే అధికారం లోకి వస్తామని ఉత్తమ్ ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. కాంగ్రెస్‌కు రైతుల శాపమే తగిలిందని, అందుకే రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం కోల్పోయిందని, ఆ పార్టీ నేతలు శాపగ్రస్తులు అయ్యారని పేర్కొన్నారు.2019లోనే కాదు... 3019లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని, త్వరలో మళ్లీ బుద్ధి చెప్పబోతున్నారన్నారు. -
'ఎన్ని కుట్రలు చేసినా కొత్త సచివాలయం ఖాయం'
సాక్షి, హైదరాబాద్ : ఎవరు ఎన్నికుట్రలు చేసిన తెలంగాణకు కొత్త సచివాలయం నిర్మించి తీరుతామని టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రతిపక్షాలు కొత్త అసెంబ్లీ నిర్మాణం విషయంలో రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం సచివాలయంలో కనీసం వసతులు లేవన్న ఆయన అగ్ని ప్రమాదం జరిగితే ఫైరింజన్ తిరిగే పరిస్థితి కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయానికి ఉండాల్సిన విధి విధానాలు పాటించలేదని, విధుల నిర్వహణకు ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయపడ్డారు. సచివాలయంలో నాలుగు వేల మంది ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా కేవలం రెండు వేల మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. బైసన్ పోలో గ్రౌండ్లో నూతన సచివాలయం నిర్మిస్తామంటే ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుతగులుతున్నాయో అర్థం కావడం లేదని, ఎవరు అడ్డుకున్నా తాము నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. -
అబద్ధాల చిట్టాతో ఢిల్లీలో తిరుగుతున్నారు
జేఏసీ చైర్మన్ కోదండరాంపై ఎమ్మెల్సీ కర్నె ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఢిల్లీలో అబద్ధాల చిట్టా పట్టుకుని తిరుగుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలో కోదండరాం అబద్ధాలతో ఎవరినీ మెప్పించలేరని అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,45,000 కోట్లు అప్పులు తెచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, అప్పులు తీర్చగలిగే వారికి ఎవరైనా అప్పులు ఇస్తారని ఎద్దేవా చేశారు. దేశంలో మిగతా రాష్ట్రాలు అప్పులు చేయడం లేదా ? ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడే అప్పులు తెస్తున్నామన్న విషయం కోదండరామ్‌కు తెలియదా అని ప్రశ్నించారు. -
కోదండరామ్‌కు ఆ విషయం తెలియదా?
జేఏసీ చైర్మన్ కోదండరామ్‌పై కర్నె ధ్వజం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఢిల్లీలో అబద్దాల చిట్టాతో సంచరిస్తున్నారని, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కోదండరామ్ అబద్దాలతో ఎవరినీ మెప్పించలేరని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం లక్షా నలభై అయిదు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిందని మాట్లాడుతున్నారని, అప్పులు తీర్చగలిగే వారికి ఎవరైనా అప్పులు ఇస్తారని పేర్కొన్నారు. దేశంలో మిగతా రాష్ట్రాలు అప్పులు చేయడం లేదా ? ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడే అప్పులు తెస్తున్నామన్న విషయం కోదండరామ్‌కు తెలియదా అని ప్రశ్నించారు. అసలు ఎలాంటి తెలంగాణ కావాలో కోదండరామ్ స్పష్టం చేయాలన్నారు. -
కాంగ్రెస్‌ను నిలదీయండి: కర్నె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అడ్డు తగులుతున్న కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రజలను కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2018 నాటికి ప్రాజెక్టులను పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. అయితే కాంగ్రెస్‌పార్టీ నీచ బుద్ధితో వీటిని అడ్డుకోవడానికి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి కాళేశ్వరంపై కేంద్రానికి ఫిర్యాదులు చేయడం దుర్మార్గమన్నారు. గతంలో కీలక పదవులను వెలగబెట్టిన శశిధర్‌రెడ్డి వంటివారే తెలంగాణ రైతాంగానికి నీటిని రాకుండా అడ్డుకోవడం కుట్రపూరితమని ప్రభాకర్ విమర్శించారు. గతంలో పోలవరం, ప్రాణహిత వంటి ప్రాజెక్టులకు జరిగినట్టుగానే ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నదన్నారు. -
ఉత్తమ్‌వి చౌకబారు ఆరోపణలు: కర్నె
హైదరాబాద్: పులిచింతల హైడల్ ప్రాజెక్టుపై టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. హుజూర్నగర్ ప్రాంతానికి చెందిన కొందరు కాంగ్రెస్ రైతులను గాంధీ భవన్‌కు తీసుకువచ్చి అన్నీ అసత్యాలే చెప్పించారని ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, హుజూర్నగర్ టీఆర్ఎస్ నేతలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టు కింద 13 ముంపు గ్రామాల ప్రజలకు సరైన నష్ట పరిహారం ఇప్పించని ఉత్తమ్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముంపు పరిహారం విషయంలో నల్లగొండ జిల్లా రైతులకు ఉత్తమ్ అన్యాయం చేశారని ఆరోపించారు. మాయ మాటలు చెప్పి తమ భూములు లాక్కున్నారని, పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల పరిహారానికి సంబంధించిన జీవో 68ని పరిశీలిస్తే జరిగిన అన్యాయం తెలిసిపోతుందని హుజూర్నగర్ రైతులు వెల్లడించారని పేర్కొన్నారు. -
గందరగోళానికి కాంగ్రెస్, జేఏసీ పోటీ
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్, దాని అనుబంధ టీ జేఏసీ పోటీపడుతున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. గ్రామ పర్యటనల పేరుతో టీజేఏసీ అశాంతి సృష్టిస్తోందన్నారు. సోమవారం ఇక్కడ ఆయన విలేకరులతో మా ట్లాడారు. ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని కోదండరాం అవాస్తువాలు చెబుతున్నారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి నల్లగొండకు నీళ్లు ఇవ్వొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి వ్యాఖ్యా నించడంపై కర్నె అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఈ పథకం అటకెక్కినప్పుడు వంశీచంద్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. -
కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కోదండరామ్
-
కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కోదండరామ్
మండిపడిన ఎమ్మెల్సీ కర్నె, ఎమ్మెల్యే కూసుకుంట్ల సాక్షి , హైదరాబాద్: ప్రభుత్వం ఏ పనిచేసినా గుడ్డిగా వ్యతిరేకించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని, టీఆర్ఎస్ గెలిచిన మరుసటి రోజు నుంచే విమర్శలు మొదలుపెట్టిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్ కూడా ఇపుడు కాంగ్రెస్ బాటలోనే నడుస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. ఒక ఎజెండా పెట్టుకుని కోదండరాం పనిచేస్తున్నారని, పేరుకు వేదిక వేరే అయినా, ఫక్తు కాంగ్రెస్ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. నార్లపూర్ నుంచి డిండికి నీళ్లు తీసుకుపోవద్దని ఆయన కొత్త పల్లవి అందుకున్నాడని, ఫ్లోరోసిస్ కేంద్రంగా ఉన్న నల్లగొండ జిల్లా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీళ్లు తీసుకుపోవద్దని కోదండరాం చెప్పటం సరికాదని అన్నారు. ఇలాంటి ప్రాంతంపై సానుభూతి లేకుండా మాట్లాడుతున్నాడని, ఆయన ప్రజలపక్షం కాదని తేలిపోయిందన్నారు. కోదండరాం గాంధీభవన్‌లో కూర్చుని మాట్లాడితే తమకేమీ అభ్యంతరం లేదని వారు అన్నారు. -
బీజేపీతో ఉన్నది అభివృద్ధి ఒప్పందమే: కర్నె
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో తమకున్నది అభివృద్ధి ఒప్పందం మాత్రమేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి కార్యకర్త స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. తమ పార్టీ ఏ కూటమిలోనూ భాగస్వామిగా లేదన్నా రు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే ముందు ఎన్డీఏ టీఆర్ఎస్ను సంప్రదించగా, సీఎం కేసీఆర్ సూచన మేరకే దళిత నేతను అభ్యర్థిగా ప్రకటించిందని తెలిపారు. గతంలో అంబేడ్కర్‌ను ఎన్నికల్లో ఓడించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయన మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్‌ను కూడా మోసం చేసిందని, రాజకీయాల కోసం లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ను బలి చేయొద్దని హితవు పలికారు. -
కేసీఆర్‌ను ఎక్కువసార్లు కలిసింది కోమటిరెడ్డే
-
కేసీఆర్‌ను ఎక్కువసార్లు కలిసింది కోమటిరెడ్డే
హైదరాబాద్: కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో చీఫ్ సెక్రటరీని కలిసిన తరువాత ఏం మాట్లాడాలో తెలియక అనవసర ఆరోపణలు చేశారని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు తక్కువగా ఇస్తున్నారనే ఆరోపణలు అవాస్తమన్నారు. సీఎంను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదని చెప్పటం చాలా హాస్యస్పదమని తెలిపారు. కాంగ్రెస్ నేత్లో సీఎం ను ఎక్కువ సార్లు కలిసింది కోమటిరెడ్డెనని స్పష్టం చేశారు. దాదాపుగా ఆయన తరుపున ఇప్పటికే 391 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామని కర్రె తెలిపారు. పైరవీలకు కాంగ్రెస్ నేతలు అలవాటు పడ్డారని టీఆర్ఎస్ ప్రభుత్వంలో పైరపీలకు తావులేదన్నారు. కాంగ్రెస్ నేతలు తెలుగు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. వారికి ఢిల్లీ భాష మాత్రమే గుర్తుందన్నారు. అందుకే కేసీఆర్ భాషపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కోమటి రెడ్డి గతంలో ఐటీ మినిస్టర్‌గా ఉన్నప్పుడు చేసిందేమీ లేదని విమర్శించారు. కేటీఆర్ అమెరికా టూర్‌పై విమర్శలు చేయటం తగదని అన్నారు. కేటీఆర్ 5 సార్లు అమెరికా వెళ్లటం తో అనేక ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ నేతలకు స్కాంలు మాత్రమే తెలుసునని.. స్కీమ్ ల గురించి తెలియదన్నారు. అందుకే గొర్రెల పంపణీలో కూడా స్కాం ఉందని ఆరోపిస్తున్నారని విమర్శించారు. -
‘ప్రతిపక్షాలు బాధపడుతున్నాయ్’
-- టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హైదరాబాద్: కులవృత్తులను బలోపేతం చేసేందుకు, ఆయా కులాలకు ప్రత్యక్షంగా మేలు చేసే కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. వివిధ కులాలకు చెందిన ప్రజలంతా చాలా సంతోషంగా ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం బాధపడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. గడిచిన రెండు దశాబ్దాల్లో చెరో పదేళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు కులవృత్తులను సర్వనాశనం చేశాయని మండిపడ్డారు. ఫలితంగా దాదాపు అన్ని కులవృత్తుల వారు పొట్టకూటి కోసం వలసలు పోయారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఉద్యమ కాలంలో ఇచ్చిన మాట మేరకు మార్పులు తీసుకొస్తుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. గతంలో ఓట్ల కోసమే హాహీలు ఇచ్చి, తెల్లారే మరిచిపోయేవారని, తాము మాత్రం ఇచ్చిన హామీలను గౌరవంగా భావించి అమలు చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 15 వందల గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం మొదలైందన్నారు. వీటి విలువ రూ. 400 కోట్లని చెప్పారు. వెనకబడిన కులాల పక్షాన టీఆర్ఎస్ ఉందన్న భరోసా ఇస్తున్నామని తెలిపారు. -
బీసీలను ఓటు యంత్రాలుగా మార్చిన కాంగ్రెస్: కర్నె
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాల తరబడి దే శాన్ని, ఉమ్మడి ఏపీని పాలించిన కాంగ్రెస్ పార్టీ బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మార్చిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. బీసీలు అభి వృద్ధికి ఆమడదూరంలో ఉండిపోవడానికి కాంగ్రెస్ ప్రధాన కారణమన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమ వారం కర్నె మాట్లాడారు. తెలంగాణలో 50 శాతానికిపైగా ఉన్న బీసీలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడు తోందన్నారు. రాష్ట్రంలో కులవృత్తులను నిలబెట్టడానికి ప్రభుత్వం అనేక నిర్ణయా లు తీసుకుందన్నారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం కాంగ్రెస్‌కి మౌత్‌పీస్‌గా మారి పోయారన్నారు. మియాపూర్ భూముల విషయంలో ప్రభుత్వానికి అందిన సమాచారం ఆధారంగానే సీఎం విచార ణకు ఆదేశించారన్నారు. -
బీసీలను ఓట్లేసే మిషన్లుగానే చూశాయి: కర్నె
హైదరాబాద్: ప్రముఖ రచయత, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత సి.నారాయణరెడ్డి మృతికి టీఆర్ఎస్ఎల్పీ తరపున ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ రావు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతి సాహితీ రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. గత పాలకులంతా బీసీలను ఓటేసే మర యంత్రాలుగా చూశారని, ఓబీసీ కమీషణ్‌కు చట్టబద్దత తేవాలని ప్రయత్నిస్తే రాజ్యసభలో బిల్లును అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు. టీఆర్ఎస్ బీసీ ఉన్నతికి విశేషంగా కృషి చేస్తోందన్నారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా 119 బీసీ గురకుల పాఠశాలలు ప్రారంభిస్తుండడం చారిత్రాత్మకం అన్నారు. కాంగ్రెస నేతలది మాత్రం ఓట్ల రాజకీయ విద్యార్థులకు నీతి పాఠాలు చెప్పాల్సిన కోదండరాం అపద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోదండరాం ఏఆధారాలతో ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని ప్రశ్నించారు. కోదండరాం మాటలు కాంగ్రెస్ మాటలకు జిరాక్స్‌లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మియాపూర్ కుంభకోణాన్ని ప్రభుత్వమే వెలుగులోకి తెచ్చిందన్నారు. ఇందులో ఎలాంటి వారు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అందుకే కమ్యూనిస్టులు విధ్వంసం సృష్టించారు: కర్నె
హైదరాబాద్: ధర్నా చౌక్ వద్ద ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కమ్యూనిస్టులు విధ్వంసం సృష్టించారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రోజు జరిగిన హింసకు వామపక్షాలే బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనలను టీఆర్ఎస్ఎల్పీ పక్షాన ఖండిస్తున్నామన్నారు. తాము అనుకున్నట్టే హింస జరిగినందుకు కమ్యూనిస్టులు సంతోషిస్తున్నారన్నారు. ధర్నా చౌక్ వ్యవహారం కోర్టుల్లో ఉందని, ధర్నా చౌక్ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ధర్నా చౌక్ ను ఆక్రమించడానికి అదేమైనా వస్తువా ? అని ప్రశ్నించారు. పేదలకు స్థలాల పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని వాటిని బడా వ్యక్తుల కట్టబెట్టింది ఎవరో అందరికి తెలుసునన్నారు. ధర్నా చౌక్‌ను వ్యతిరేకిస్తుంది గత పది సంవత్సరాలుగా స్థానిక ప్రజలేనని స్పష్టం చేశారు. కాలనీ వాసులను, వాకర్స్ ను గాయపరిచే హక్కు విపక్షాలకు ఎక్కడిది ? సూటిగా అడిగారు. ప్రజలను హింసించే హక్కు విపక్ష నేతలకు ఎవరు ఇచ్చారు ? అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు సూది దప్పడం దాడుల నైజాన్ని మరో సారి చాటుకున్నారని ఎద్దేవా చేశారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన నాయకులను దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేకే ఈర్ష్యతో కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపారు. కోదండరాం, రేవంత్, ఉత్తమ్, తమ్మినేనిలు ఈ రోజు జరిగిన ఘటనపై ప్రజలకు క్షమాపాణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ధర్నా చౌక్ వద్ద వేర్వేరు సంస్థలు ఓకే రోజు ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయని, విపక్షాలకు ఏ అంశం లేకనే ధర్నా చౌక్ అంశాన్ని ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. -
కేంద్రమంత్రి వ్యాఖ్యలు దురదృష్టకరం: టీఆర్ఎస్
హైదరాబాద్: కేంద్రమంత్రి దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అధికార పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. దత్తాత్రేయ నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనే రీతిలో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దాహం వేసినపుడే బావి తవ్వుకుందామనే రీతిలో బీజేపీ వైఖరి ఉందన్నారు. దత్తాత్రేయ లాంటి పెద్ద మనిషి కూడా అబద్దాలాడుతుండటం శోచనీయమని మిర్చి రైతుల విషయంలో చాలా ఆలస్యంగా స్పష్టత లేని విధంగా కేంద్రం స్పందించిందని దుయ్యబట్టారు. మిర్చి సమస్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ముద్దాయి చేసే ప్రయత్నం బీజేపీ నేతలు మానుకోవాలని సూచించారు. కాషాయ జెండాను విస్తరించుకునే క్రమంలోనే బీజేపీ నేతలు రైతులను రెచ్చ గొడుతున్నారని విమర్శించారు. బ్యాంకులను వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా మీద ఉన్న ప్రేమ రైతుల మీద కేంద్రానికి లేక పోవడం విచారకరమన్నారు. కేంద్రంలో మంత్రిగా ఉండి సహచర మంత్రి రాధామోహన్ సింగ్, ప్రధాని మోదీలతో మాట్లాడి తెలంగాణా రైతుల కు న్యాయం చేయాలని దత్తాత్రేయ భావించడం లేదని ప్రభాకర్ మండి పడ్డారు. -
అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ ఎజెండా
మండిపడిన టీఆర్ఎస్ నేతలు కర్నె, చింతా ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధి ని అడ్డుకోవడమే కాంగ్రెస్ ఎజెండా అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మండిపడ్డారు. పాలమూరులో కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల కు అడ్డుపడుతుంటే రంగారెడ్డి జిల్లాలో అదే పార్టీ నేతలు ప్రాజెక్టులు కావాలంటూ పాదయాత్రలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో వారు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ తాండూర్ బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. భూదందాలు, అరాచకాలు చేసిన కాంగ్రెస్‌లో ఉంటూ సంపత్ విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. ‘వ్యవ సాయ ఉత్పత్తులకు ధరలు నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమే అన్న సంగతి కాంగ్రెస్ నేతలకు తెలియదా? ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలకు ఈ విషయాలు తెలిసీ ధర్నాలు చేస్తున్నారా? నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతాంగానికి కంపెనీలతో నష్ట పరిహారం ఇప్పించిన విషయం వారు మరిచిపోయారా? ఖమ్మంలో జీవ అనే కంపెనీతో రూ. కోటి నష్ట పరిహారం ఇప్పించలేదా’ అని నిలదీశారు. -
కాగ్ రిపోర్టుపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం: కర్నె
సాక్షి, హైదరాబాద్: కాగ్ రిపోర్టుపై కాంగ్రెస్ నేతలు లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని, ఆ రిపోర్టులు సాధారణ ప్రక్రియలో భాగమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీగా కాకుండా ఓ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీగా కాంగ్రెస్ మారిందని, ఆ పార్టీ నేతలు చెప్పేవన్నీ బోగస్ మాటలేనని విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలన్నీ టీఆర్ఎస్ నెరవేర్చిందని, ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఉగాది రోజున మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను కలిసినపుడు అనేక అంశాలు చర్చకు వచ్చాయన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా వెనుకబడిన పాలమూరును అభివృద్ధి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చర్చించారన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాత్రం ఈ భేటీపై చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్ చేసిన సూచనలను సీఎం ఆమోదించారని, పాలమూరులో 15 లక్షల ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాలమూరు పథకం మొదటి లిఫ్ట్ రీడిజైన్‌ను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే వంశీచంద్.. ఆ మాటను సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చెప్పించగలరా అని సవాలు చేశారు. -
ఉత్తమ్ మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రి కేటీఆర్ రాజకీయాల్లోకి రాలేదని, తెలంగాణ వస్తదో, రాదో కూడా తెలియని స్థితిలో ఉద్యోగం వదులుకుని ఉద్యమంలోకి వచ్చారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తలంతా తెలంగాణ వైపు చూసేలా రెండు, మూడు లక్షల ఉద్యోగాలు వచ్చేలా కేటీఆర్ కృషి చేస్తున్నారని, ఆలాంటి వ్యక్తిని పట్టుకుని దోచుకోవడానికే అమెరికా నుంచి వచ్చారని అవాకులు, చవాకులు పేలడం పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిక్కుమాలిన రాజకీయాలకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. బుధవారం కర్నె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీది ఐరన్ లెగ్ అని, మంత్రి కేటీఆర్‌ది గోల్డెన్ లెగ్ అని పేర్నొన్నారు. కేటీఆర్‌కు రాహుల్‌ను విమర్శించే స్థాయి లేదని ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. -
'రాహుల్‌ది ఐరన్ లెగ్.. కేటీఆర్‌ది గోల్డెన్ లెగ్'
హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీది ఐరన్ లెగ్ అని, మంత్రి కేటీఆర్‌ది గోల్డెన్ లెగ్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌కు రాహుల్‌ను విమర్శించే స్థాయి లేదని ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రాహుల్ ఎక్కడ కాలుపెడితే అక్కడ కాంగ్రెస్ ఎందుకు పార్టీ మటాష్ అవుతోంది..? ఉత్తర ప్రదేశ్‌లో మంచి ఊపుమీదున్న సమాజ్‌వాదీతో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఉత్తమ్ మాట్లాడేవన్నీ పచ్చి అబద్దాలని కర్నె మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తుందో, రాదో కూడా తెలియని స్థితిలో ఉద్యోగం వదులుకుని ఉద్యమంలోకి వచ్చాడని పేర్కొన్నారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తలంతా తెలంగాణ వైపు చూసేలా మూడు లక్షల ఉద్యోగాలు తీసుకురావాలని కేటీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఆలాంటి వ్యక్తిని పట్టుకుని దోచుకోవడానికే అమెరికా నుంచి వచ్చాడని అనడం ఉత్తమ్‌కుమార్ రెడ్డి దిక్కుమాలిన రాజకీయాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో మంత్రి పదవి కోసం ఆంధ్రా పాలకుల వద్ద ఊడిగం చేసిన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది కాదా అని ప్రశ్నించారు. ఇళ్ల పేరుతో దోచుకుతిన్న ఆయన అవినీతికి సూర్యాపేట వద్ద కారులో కాలిపోయిన నోట్ల కట్టలే నిదర్శనం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఎంత అనుభవం ఉందో మంత్రి కేటీఆర్‌కు అంతే అనుభవం ఉందన్నారు. దేశాన్ని రక్షించే సైనికుడిగా పనిచేశానని చెప్పుకునే ఆయన, తెలంగాణ రాష్ట్రాన్ని నష్టపరిచే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. -
'దొంగే దొంగ అన్నట్లుంది రేవంత్ వ్యవహారం'
హైదరాబాద్‌సిటీ: ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారం దొంగే దొంగ అన్నట్టుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు తెలంగాణ పై విషం గక్కుతున్నాడు..ముందు దాని మీద రేవంత్ రెడ్డి మాట్లాడాలన్నారు. చంద్రబాబుకు కసి ఎవరి మీద ? అని ప్రశ్నించారు ప్రభాకర్. రేవంత్ రెడ్డిని తుపాకీ రాముడిగా అభివర్ణించారు..ఈటెల, ఇంద్రకరణ్ రెడ్డి ల నిజాయితీ గురించి తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి సోషియోపతి అనే వింత మానసిక జబ్బుతో బాధ పడుతున్నట్టుంది అని ఎద్దేవా చేశారు. .జైలు నుంచి వచ్చిన తర్వాత రేవంత్ వికృత చేష్టలు పెరిగాయన్నారు. ఈటెల రాజేందర్ నిప్పు లాంటోడు..నిప్పుతో ఆడుకుంటే రేవంత్ మసి కావడం ఖాయమన్నారు. ఈటెల మంత్రి అయిన తర్వాత పౌర సరఫరాల శాఖలో రూ.వెయ్యి కోట్ల ఆదా అయ్యే సంస్కరణలు చేపట్టారని గుర్తు చేశారు. మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబు యేలుబడిలో ఉన్న ఏపీలో అవినీతి గురించి మాట్లాడిన తర్వాతనే ఇక్కడ స్పందించాలని రేవంత్ రెడ్డిని కోరారు. ఏపీలో చంద్రన్న కానుకల్లో ఎంత అవినీతి జరిగిందో మీడియాలో ఎన్ని కథనాలు వచ్చాయో అందరికీ తెలుసని..రేవంత్ రెడ్డి ఇకనైనా గాలి మాటలు కట్టిపెట్టాలన్నారు. -
కాంగ్రెస్ బాకా కోదండరాం: కర్నె
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కి బాకాగా మారిన టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టడమో, లేదా ఏదో ఒక పార్టీ పంచన చేరడంపై స్పష్టమైన సంకేతం ఇచ్చిన కోదండరాం ముసుగు తొలగిపోయిందన్నారు. తెలం గాణ వచ్చిన తరువాత జేఏసీ అవసరం లేదన్న అభిప్రా యం వ్యక్తమైందని, కోదండరాంను బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామి కావాలనుకున్నామన్నారు. కానీ ఆయనకు రహస్య ఎజెండా ఉందన్నారు. కాంగ్రెస్ పీఆర్వో కోదండరాం: పిడమర్తి కోదండరాం కాంగ్రెస్ పార్టీ పీఆర్వోగా పనిచేస్తున్నారని, ఆయన కాంగ్రెస్‌లో ఎప్పుడో భాగమయ్యారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ధ్వజమెత్తారు. ఆయన తీరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. -
అభివృద్ధి వ్యతిరేక ముఠాగా టీటీడీపీ: కర్నె
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ నాయకులు తెలంగాణ అభివృద్ధి వ్యతిరేక ముఠాగా ఏర్పడ్డారని, ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండి పడ్డారు. గురువారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అబద్ధాలు మాట్లాడటంలో రేవంత్‌రెడ్డి, ఆయన ముఠాకు అవార్డు ఇవ్వొచ్చన్నారు. అభివృద్ధి లో తెలంగాణ వెనుకబడి పోవాలని, ఏపీ అగ్రభాగాన నిలవాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నట్లు అనిపిస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై రాష్ట్రంలో ఏ గ్రామం లోనైనా చర్చకు తాము సిద్ధమన్నారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీపై గజ్వేల్ ప్రజాపోరులో రేవంత్ పిచ్చి కూతలు కూయడం దిక్కుమాలిన రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై రేవంత్ పేదల ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. -
'టీడీపీకి ఇది గ్రేస్ పీరియడ్'
హైదరాబాద్: టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి వ్యతిరేక ముఠా నాయకుడని ఆ పార్టీ నేతలు అబద్ధాలతో ఊరేగుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అభివృద్ధిలో ఏపీ అగ్రభాగాన ఉండాలి, తెలంగాణ అట్టడుగున ఉండాలి అనేది టీటీడీపీ నేతల కుట్ర అన్నారు. టీటీడీపీ నేతల బహిరంగ చర్చ సవాలుకు మా సర్పంచులు చాలని ఎద్దేవ చేశారు. తెలంగాణా లో ఉన్న దాదాపు 15 వేల గ్రామాల్లో ఎక్కడైనా టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సర్పంచులు సిద్ధంగా ఉన్నారన్నారు. దళితుల భూ పంపిణీ కోసం 9,663 ఎకరాలు ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయం వాస్తవం కాదా.. టీడీపీ నేతల కళ్ళకు ఇవి కనబడడం లేదా అని ప్రశ్నించారు. రాళ్లు రప్పలు ఉన్న భూములను దళితులకు కేటాయించి పట్టాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించినా ఘనత టీడీపీ, కాంగ్రెస్ పాలకులదే అని డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందని.. 2 లక్షల 60 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని.. మోడల్ ఇళ్ళ నిర్మాణం ఎర్రవల్లి కే పరిమితం కాదని రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామన్నారు. పని అయిపోయింది టీఆర్ఎస్ది కాదని.. టీడీపీయే ఇపుడు గ్రేస్ పీరియడ్ లో నడుస్తోందన్నారు. -
గోబెల్స్ ప్రచారానికి అడ్డా గాంధీ భవన్
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: గోబెల్స్ ప్రచారానికి గాంధీభవన్ ప్రధాన అడ్డాగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్‌కు గోబెల్స్–2 ఆఫీసుగా పేరు మార్చుకుంటే బావుంటుందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మంగళ వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్నింటిని భర్తీ చేయాలనే విషయాలపై కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ నేతలు కాకి లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని షబ్బీర్ అలీకి హితవుపలికారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాం గ్రెస్‌కు 50 సీట్లు వస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రకటన నవ్వు తెప్పిస్తోందని, వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే కాంగ్రెస్ పరిమితం కాక తప్పదన్నారు. -
ఉద్యమంలో కేటీఆర్ పాత్ర అసామాన్యం: బాల్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో మంత్రి కేటీఆర్ నిర్వహించిన పాత్ర అసామాన్యమని, జేఏసీ చైర్మన్ కోదండరాంతో పోల్చడం అసంబద్ధమైనదని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అప్పగించిన బాధ్యతతోనే కోదండరాం అంటే ప్రజలకు తెలి సిందని, అప్పటిదాకా కోదండరాం అంటే ఎవరో కూడా ప్రజలకు తెలియదన్నారు. అమెరికాలో 4 లక్షల జీతాన్ని వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పాల్గొన్నారన్నారు. కోదండరాంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, టీడీపీ నేతలు స్పందించిన తీరు టీఆర్ఎస్ వాదనకు బలం చేకూర్చిందన్నారు. కాంగ్రెస్‌కు ఏజెంటుగా కోదండరాం పనిచేస్తున్నారని మరోసారి రుజువైందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అప్పట్లో కోదండరాం ప్రయత్నించారని ఆరోపించారు. నోట్లకట్టలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న కేటీఆర్ వల్లే రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని, కొంతమంది విమర్శలు చేసినంత మాత్రాన ఆయన సంకల్పం ఆగిపోదన్నారు. -
మోసగాళ్లకు టీఆర్ఎస్లో స్థానం లేదు: కర్నె
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలిప్పిస్తానని యువత నుంచి డబ్బులు వసూలు చేస్త్తు న్న ఎదునూరి సంతోష్‌తో టీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని, కొన్ని చానళ్లలో పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. మోసగాళ్లకు పార్టీలో స్థానం ఉండదని, నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తితో మంత్రి జగదీశ్‌రెడ్డికి సంబంధం ఉందని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తు న్నామన్నారు. సోమవారం అసెంబ్లీ మీడి యా పారుుంట్‌లో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తగా సంతోష్ పనిచేశాడని, రెండేళ్ల కిందట జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాం గ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడని, ప్రస్తుతం ఆమ్ఆద్మీ పార్టీ నాయకునిగా ప్రచారం చేసుకుంటున్నాడన్నారు. టీఆర్ ఎస్వీ నాయకులే అతన్ని అరెస్ట్ చేయా లని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. -
మంత్రి జగదీశ్‌రెడ్డిపై అసత్యప్రచారం: కర్నె
హైదరాబాద్‌సిటీ: సోషల్ మీడియాలో, కొన్ని చానళ్లలో పనిగట్టుకుని మంత్రి జగదీశ్ రెడ్డి మీద అసత్య ప్రచారం జరుగుతోందని, దీనిని ఖండిస్తున్నట్లు టీఆర్ఎస్ అధికార ప్రతినిథి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ.. వీడియోలో ఉన్న సంతోష్‌కు, టీఆర్ఎస్, మంత్రి జగదీశ్‌రెడ్డితో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. టీఆర్ఎస్వీ నాయకులే అతన్ని అరెస్ట్ చేయండని చట్టప్రకారం చర్యలు తీసుకొమ్మని పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. సంతోష్ గతంలో కాంగ్రెస్ నాయకుడిగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశాడని, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాడని చెప్పారు. సంతోష్, మంత్రి జగదీశ్ రెడ్డి మనిషని తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సుమోటోగా కేసు నమోదు చేసి డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాపార్టీపైనా, మా మంత్రి పైన తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేయబోతున్నామని తెలిపారు. -
నల్లధనానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్: కర్నె
-
నల్లధనానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్: కర్నె
సాక్షి, హైదరాబాద్: నల్లధనానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. నల్లధనంఫై అసలు తమ వైఖరి చెప్పని కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీల వైఖరిపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. శుక్రవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, పలు కుంభకోణాలకు పాల్పడి డబ్బులు దోచుకుని, దాచుకున్న పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వైఖరి చెప్పాలనడం ఏమిటని ప్రశ్నించారు. కచ్చితంగా చెప్పాల్సిన చోట తమ వైఖరి చెబుతామని కర్నె అన్నారు. పెద్ద నోట్ల రద్దును ఇప్పటికే స్వాగతించామని, రాష్ట ఆర్థిక మంత్రి ఇప్పటికే పార్టీ వైఖరి వెల్లడించారని గుర్తు చేశారు. ప్రధాని మోదీయే కెసీఆర్‌ను సలహాల కోసం ఢిల్లీకి ఆహ్వానించారని కర్నె చెప్పారు. కాంగ్రెస్‌నేత షబ్బీర్ అలీ.. కనీస అవగాహన లేకుండా నోటి కొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ది ద్వంద్వ నీతి అని.., రాష్ట్రానికో నీతి వారిదని అన్నారు. పెద్ద నోట్ల రద్దుని వ్యతిరేకిస్తే కేజ్రీవాల్, మమతా బెనర్జీలతో కాంగ్రెస్‌ఎందుకు కలవడంలేదని నిలదీశారు. సీఎం కేసీఆర్ నల్ల డబ్బును వైట్‌గా మార్చుకునేందుకే ఢిల్లీ వెళుతున్నారన్న డీకే అరుణ ఆరోపణలు ఖండిస్తున్నామని అన్నారు. -
రైతులకు ఏం ఒరగబెట్టారని పాదయాత్ర?
టీటీడీపీపై మండిపడ్డ ఎమ్మెల్సీ కర్నె సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజల ఉసురు పోసుకు న్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. టీడీపీ గ్యాంగ్.. పచ్చని పంటపొలాలను నాశనం చేసే మిడతల దండు అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్నదాతల ఉసురు పోసుకున్న టీడీపీ నీచపు చరిత్ర ప్రజలింకా మరిచిపోలేదని, ఏమాత్రం సిగ్గూశరం లేకుండా ఆ పార్టీ నేతలు రైతు పోరు యాత్ర పేరుతో పగటి వేషాలు వేస్తున్నారని విమర్శించారు. -
రాజకీయం కోసం కోర్టులను వాడుకుంటారా?
కాంగ్రెస్‌పై కర్నె ప్రభాకర్ మండిపాటు సాక్షి, హైదరాబాద్: తమ రాజకీయాల కోసం కోర్టులను కూడా వాడుకుంటున్న నీచమైన సంస్కృతి కాంగ్రెస్‌దేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. నాలుగు దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ నేతలకు ప్రజల సమస్యలు ఏనాడూ పట్టలేదని విమర్శించారు. బుధవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, తమ హయాంలో కాంగ్రెస్ పాలకులు తెలంగాణ ప్రజల సమస్యలు తమవి కావన్న రీతిలో వారు వ్యవహరించే వారని పేర్కొన్నారు. మల్లన్న సాగర్ వ్యవహారంలో 2014లోనే చనిపోయిన ఓ రైతు పేరిట కాంగ్రెస్ నేతలు కోర్టులో పిటిషన్ వేశారని విమర్శించారు. ఇలా తప్పుడు పిటిషన్ వేసిన వారిపై కోర్టు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ పట్ల డెంగీ దోమలుగా తయారయ్యారని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడలేక అడ్డుపుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు. అన్ని సర్వేలు టీఆర్ఎస్కు అనుకూలంగా వస్తున్న విషయం కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా అని కర్నె ప్రభాకర్ నిలదీశారు. -
‘సర్వే ఫలితాలతో కాంగ్రెస్ మైండ్ బ్లాంక్’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో భారీగా పెరిగిన ఆదరణను జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. సర్వేలలో టీఆర్ఎస్ పాలనకు వస్తున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిందని అన్నారు