హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీమ్తో నాకెలాంటి సంబంధాలు లేవని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం డీజీపీని కలసిన కర్నె ప్రభాకర్ అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... నయీమ్ విషయంలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కర్నె విజ్ఞప్తి చేసినట్లు కర్నె ప్రభాకర్ తెలిపారు.
అంతకుముందు డీజీపీ కార్యాలయంలో అనురాగ్ శర్మను కర్నెప్రభాకర్ కలిసి.. గ్యాంగ్స్టర్ నయీమ్ విషయంలో నాపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.