Gangster Nayeem
-
పోలీసుల అదుపులో నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న
-
గ్యాంగ్‌స్టర్ నయీం జీవితాధారంగా సినిమా.. ట్రైలర్ విడుదల
కరుడుగట్టిన నేరస్థుడు గ్యాంగ్‌స్టర్ నయీం జీవితాధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాము బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'నయీం డైరీస్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వశిష్ట సింహ ప్రధాన పాత్రలో నటించగా, సీఏ వరదరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు సంపత్ నంది సోమవారం రిలీజ్ చేశారు. ఇలాంటి నిజ జీవిత కథలతో సినిమాలు చేస్తున్నప్పుడు కచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుందని సంపత్ నంది తెలిపారు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. హీరో వశిష్ట్ మాట్లాడుతూ 'ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా ఈ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నాకు చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుంది.' అని అన్నారు. ' ఈ సినిమాలో నయీం ఎందుకు క్రిమినల్‌గా మారాడు. అతన్ని మించిన నేరస్థులు సమాజంలో ఎవరున్నారు ? అనేది సినిమాలో చూపిస్తున్నాం.' అని చిత్ర దర్శకుడు బాలాజీ తెలిపారు. నయీం కథ వినగానే యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో బాగుంటుందని చేశామని నిర్మాత వరదరాజు తెలిపారు. వశిష్ట తామనుకున్న దానికన్న బాగా చేశారని కొనియాడారు. -
నయీం కుడి భుజం శేషన్న జాడేది..?
సాక్షి, హైదరాబాద్ : ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ఎన్కౌంటర్ సమయంలో నయీం దగ్గర దొరికిన ఏకే–47తో పాటు అతడి డెన్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాల గుట్టు వీడాలంటే శేషన్న దొరకాల్సిందే.. శేషన్న పట్టుకునే విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సైతం ఘోరంగా విఫలమైంది. నయీం హతమై నాలుగున్నరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ నయీం యాక్షన్ టీమ్ ఇన్చార్జ్ ఆచూకీ లభించలేదంటే సిట్ పనితీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. అతడు చిక్కలేదా..? పోలీసులు పట్టుకోవట్లేదా..? అన్న విషయం స్పష్టం కావట్లేదు. మరోపక్క నయీం రాసిన డైరీల ఆచూకీ లభించకపోవడంలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. ఆ టీమ్ అత్యంత కీలకం.. షాద్‌నగర్ శివార్లలోని మిలీనియం టౌన్షిప్లో 2016 ఆగస్టు 8న జరిగిన ఎన్కౌంటర్లో నయీం హతమయ్యాడు. ఇది జరిగిన నాటి నుంచి అతడి కేసుల్ని దర్యాప్తు చేసిన, చేస్తున్న పోలీసులు, సిట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా కేసులు నమోదు చేశారు. కేసుల కంటే ఎక్కువ సంఖ్యలోనే అతడి అనుచరుల్ని పట్టుకున్నారు. వీరంతా అప్పటివరకు తెరచాటుగా ఉంటూ నయీం ఆదేశాల మేరకు పని చేస్తూ వచ్చారు. భూ కబ్జాలకు పాల్పడటం, బెదిరింపుల ద్వారా వసూళ్లు, ల్యాండ్ సెటిల్మెంట్లలో కీలకపాత్ర పోషించడంతో పాటు నయీం ఆస్తులకు బినామీలుగా, ఆస్తిపత్రాలు, నగదు తదితరాలను దాచే డెన్లకు కేర్ టేకర్స్‌గా పని చేశారు. ఈ ముఠాకు భిన్నమైన యాక్షన్ టీమ్ ఒకటి నయీం కనుసన్నల్లో పనిచేసేది. వీరి పేర్లు, వ్యవహారాలు గతంలో అనేక సార్లు వెలుగులోకి వచ్చాయి. కరుడుగట్టిన నేరగాళ్లు, మాజీ మావోయిస్టులు, పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన, ఎక్కని వారితో కూడిన ఈ టీమ్ నల్లగొండ, హైదరాబాద్, సైబరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో యాక్టివ్‌గా పనిచేసింది. అనేక కేసుల్లో వీరి ప్రస్తావన ఉంది. ఆయుధాల గుట్టు వీడేనా? ఈ యాక్షన్ టీమ్ సాధారణ సమయంలో ఎవరి కంటపడేది కాదు. నయీం ఆదేశాల మేరకు నిర్దేశిత సమయంలో రంగంలోకి దిగడం.. హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడి ఆపై షెల్టర్ జోన్స్‌కు వెళ్లిపోవడం వీరి పని. ప్రతి కేసులోనూ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి మరో టీమ్ సిద్ధంగా ఉండేది. నయీంకు చెందిన యాక్షన్ టీమ్ చేసిన ఏ నేరమైనా.. మేమే చేశామంటూ తమ మీద వేసుకునే ఈ టీమ్ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోతుండేవారు. ఈ నేపథ్యంలో ఆయా కేసుల్లో యాక్షన్ టీమ్‌కు చెందిన వారు కేవలం కుట్రదారులుగానే నమోదయ్యారు. అంతకాలం రాజ్యమేలిన ఈ యాక్షన్ టీమ్ నయీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. నయీం వద్ద, అతడి డెన్లలోనూ దొరికిన భారీ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ విషయం నయీంతో పాటు యాక్షన్ టీమ్‌కు నేతృత్వం వహించిన శేషన్నకు మాత్రమే తెలిసే అవకాశముంది. గాలించినా ఫలితం శూన్యం.. కేవలం ఆయుధాల సమాచారమే కాదు.. నయీం వ్యవహారంలో అనేక చిక్కుముడుల్ని విప్పగలిగేది శేషన్న మాత్రమే. నయీం ‘వారసత్వాన్ని’కొనసాగించే ప్రయత్నం ఆ యాక్షన్ టీమ్ చేయవచ్చని తొలినాళ్లలో పోలీసులు అనుమానించారు. నయీంకు చెందిన యాక్షన్ టీమ్‌లో ఏడుగురున్నట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే మహబూబ్‌నగర్ జిల్లా మన్ననూరు కేంద్రంగా కార్యకలాపాలు నడిపి.. పటోళ్ల గోవవర్ధన్రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్ననే అత్యంత కీలకం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసు వర్గాలకు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలించాయి. ఓ దశలో శేషన్న పోలీసుల అదుపులోనే ఉన్నాడనే వార్తలు వచ్చినా.. ఎవరూ ధ్రువీకరించలేదు. ఈ గాలింపు మొదలై ఇప్పటికీ నాలుగున్నరేళ్లు కావస్తున్నా శేషన్న పోలీసులకు దొరకలేదు. గ్యాంగ్‌స్టర్‌నే పట్టుకున్న పోలీసులు అతడి కుడిభుజాన్ని పట్టుకోలేకపోవడం సిట్ పనితీరుపై సందేహాలకు తావిస్తోంది. డైరీలెన్ని? అవెక్కడ? సుదీర్ఘ కాలం మావోయిస్టులతో కలసి పనిచేసిన నయీంకు డైరీ రాసే అలవాటుంది. నయీం 2010 వరకు రాసిన డైరీలను సొహ్రబుద్దీన్ కేసు భయంతో తగలపెట్టాడని గతంలో చిక్కిన అతడి అనుచరుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఎన్కౌంటర్ జరిగే వరకు ప్రతి అంకాన్నీ నయీం తన డైరీల్లో రాసుకున్నాడు. ఎవరెవరితో సంబంధాలున్నాయి? ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చేశాడు? ఆయా దందాల్లో ఎంత డబ్బు వచ్చింది? దాన్ని ఎవరెవరికి పంచాడు? ప్రధాన అనుచరులెవరు.. ఇలా ఎన్నో అంశాలు డైరీల్లో రాసినట్లు సమాచారం. ఎన్కౌంటర్ తర్వాత షాద్‌నగర్‌తో పాటు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉన్న డెన్ల నుంచి పోలీసులు డైరీలు స్వాధీనం చేసుకున్నారనీ వార్తలు వెలువడ్డాయి. అయితే అవెన్ని? ఎక్కడున్నాయి? వాటిలో ఏముంది.. అనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. -
ఖాకీలందరికీ క్లీన్చిట్
-
నయీం మేనకోడలు దుర్మరణం
సాక్షి, నల్లగొండ: గ్యాంగ్‌స్టర్ నయీం మేనకోడలు (నయీం సోదరి సలీమా బేగం కుమార్తె) సాజీదా షాహీనా (35) ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిలో మిర్యాలగూడ వైపు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలు.. సాజీదా షాహీనా, ఆమె భర్త మహ్మద్ అబ్దుల్ హైదరాబాద్ హయత్‌నగర్ సమీపం కుంట్లూరులో నివాసముంటున్నారు. నల్ల గొండలో గృహ ప్రవేశానికి వచ్చిన షాహీనా.. మధ్యలో మిర్యాలగూడ వెళ్లి వస్తానని చెప్పి కారులో బయలుదేరింది. మధ్యాహ్నం 3.30 గంటలకు కారును సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ మిర్యాలగూడ వైపు వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో 120 కిలోమీటర్ల వేగంతో బలంగా ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కారులో ఇరుక్కుపోయిన షాహీనా మృతదేహాన్ని పోలీసులు బయటికి తీసి ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ అనంతరం పలు కేసుల్లో ఆమె జైలుకు వెళ్లి వచ్చింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నయీం కేసులో రాజకీయ నాయకులపై చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ప్రశ్నించారు. నయీం కేసు వివరాలు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్ననెన్స్ అధికారులను ఆర్టీఐ ద్వారా కోరింది. దీంతో అధికారులు నయీం కేసులో పలువురు రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు వెల్లడించారు. అయితే ఈ సమాచారంపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని తెలిపిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, పలు అంశాలతో గవర్నర్ నరసింహన్‌కు ఓ లేఖ రాసింది. దీనిపై పద్మనాభరెడ్డి గురువారం సాక్షి టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు సందేహాలను వెలిబుచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘నయీం ఎన్కౌంటర్ జరిగి మూడేళ్లు గడిచిన తరువాత ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నయీంతో పోలీసులు, రాజకీయ నాయకులు సంబంధాలు పెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డారని సిట్ ఏర్పాటు చేశారు. సిట్ దర్యాప్తు నివేదికలో రూ. 3.74 లక్షలు సీజ్ చేసినట్టు చెప్తున్నారు. కానీ నాడు నయీం ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు దొరికిందని కౌంటింగ్ మెషిన్లు తీసుకొచ్చి డబ్బులు లెక్కించారు. మరీ ఇంత తక్కువ మొత్తం లెక్కించడానికేనా కౌంటింగ్ మెషిన్లు తీసుకెళ్లింది?. రాజకీయ నాయకులకు ఎనిమిది మందికి ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్టు చెప్పారు. మరి వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?. నయీం ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు ఒక డైరీ దొరికిందని అన్నారు. మేము అందులో ఏముందో చెప్పాలని ఆర్టీఐ ద్వారా అడిగాం. కానీ దర్యాప్తు సమయంలో సమాచారం ఇవ్వలేమని చెప్పారు. డైరీలో ఉన్న సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలి. 2003 నుంచి నయీంపై 8 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ వాటిని అతను చనిపోయాక రీ ఓపెన్ చేశారు. నయీం చనిపోయిన తరువాత 250 కేసులు నమోదైనట్టు చెబుతున్న పోలీసులు.. అతడు బతికి ఉన్నప్పుడు ఏం చేశారు?. ఇప్పటికే నయీం కేసులో తమకున్న అనుమానాలపై గవర్నర్‌కు లేఖ రాశామ’ని తెలిపారు. చదవండి : నయీం కేసులో బయటపడ్డ సంచలన విషయాలు -
నయీం కేసులో బయటపడ్డ సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నయీం కేసు వివరాలు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులను కోరింది. దీంతో అధికారులు నయీం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నయాం కేసులో బీసీ సంఘాల నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారుల పేర్లు ఉండటం కలకలం రేపుతోంది. అంతేకాకుండా పలువురు టీఆర్ఎస్ నాయకులు కూడా ఈ కేసులో ఉండటం చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఎక్కువ మంది టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరినవారే కావడం గమనార్హం. నయీం కేసును సిట్‌కు అప్పగించిన తర్వాత 250 కేసుల నమోదు అయ్యాయి. అంతేకాకుండా 1.944 కేజీల బంగారం, 2,482 కేజీల వెండి, రెండు కోట్ల రూపాయలకు పైగా నగదును అధికారులు సీజ్ చేశారు. ఆ జాబితాలోని పేర్లు... అడిషనల్ ఎస్పీలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్, అమరేందర్‌రెడ్డి డీఎస్పీలు శ్రీనివాస్, సాయిమనోహర్‌రావు, శ్రీనివాసరావు, ప్రకాశ్‌రావు, వెంకటనర్సయ్య పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న ఇన్స్పెక్టర్లు మస్తాన్, శ్రీనివాసరావు, మాజీద్, వెంకటరెడ్డి, వెంకట సూర్యప్రకాశ్, రవికిరణ్‌రెడ్డి, బల్వంతయ్య, బాలయ్య, రవీందర్, నరేంద్రగౌడ్, దినేశ్, సాదిఖ్‌మియా టీఆర్ఎస్ నాయకులు.. భువనగిరి కౌన్సిలర్ అబ్దుల్ నాజర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్, మాజీ ఎంపీపీలు నాగరాజు, వెంకటేశ్, వెల్దండ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య మాజీ సర్పంచ్ పింగల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవ్ 2016లో షాద్‌నగర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో నయీం మరణించిన సంగతి తెలిసిందే. ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డ నయీంకు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో తెరవెనుక సంబంధాలు ఉన్నట్టు.. అతని ఎన్కౌంటర్ తర్వాత వెలుగుచూసింది. అధికార టీఆర్ఎస్ నాయకులతోపాటు, ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ నేతలతోనూ నయీంతో దగ్గరి సంబంధాలు ఉన్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నయీంతో పలువురు నాయకులు అంటకాగి.. భారీగా భూ దందాలు సాగించారు. -
శిక్షించండి లేదా..క్షమించండి!
సాక్షి, సిటీబ్యూరో: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ జరిగి రెండేళ్లు కావస్తోంది... అతడితో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పలువురు పోలీసులకు తాఖీదులు జారీ చేసి ఏడాదిన్నర దాటింది... దీనికి వారు సమాధానం ఇచ్చి సంవత్సరం కావస్తోంది... అయినా ఇప్పటికీ దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సస్పెన్షన్‌కు గురైన వారిపై చర్యలు ఉపసంహరించిన అధికారులు తాఖీదుల విషయం పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ చార్జ్మెమోలపై నిర్ణయం తీసుకోకుంటే అది తమ పదోన్నతుల ప్రక్రియపై ప్రభావం చూపుతుందని వారు గగ్గోలు పెడుతున్నారు. అనేక మందికి చార్జ్‌మెమోలు... నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడి వ్యవహారాలను దర్యాప్తు చేయడం కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లోతుగా ఆరా తీసింది. ఈ నేపథ్యంలో పలువురు బడాబాబుల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. వీరితో పాటు అనేక మంది పోలీసుల పైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరికి నయీంతో ఉన్న సంబంధాలపై పక్కా ఆధారాలు లభించగా.. మరికొందరు అతడితో దిగిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఐదుగురిని సస్పెండ్ చేయడంతో పాటు మరో 20 మందిపై విచారణ నిర్వహించారు. వీరిలో 16 మందికి నయీంతో ఉన్న సంబంధాలపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ చార్జ్‌మెమోలు జారీ చేశారు. సమాధానాన్ని పట్టించుకోలేదు... చార్జ్‌మెమోలు అందుకున్న వారిలో డీఎస్పీలతో పాటు ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు సైతం ఉన్నారు. వీరంతా ఆరు నెలల్లోపే వివరణ ఇచ్చారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేసిన నయీంతో విధి నిర్వహణలో భాగంగానే సంబంధాలు కొనసాగించామని, ఈ విషయంలో ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారమే వ్యవహరించినట్లు కొందరు పేర్కొన్నారు. మరికొందరు అధికారులు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అతడితో ఎలాంటి సంబంధాలు లేవని, అనుకోని పరిస్థితుల్లో కొన్ని ఫంక్షన్స్‌లో అతడు కలిశాడంటూ వివరణ ఇచ్చుకున్నారు. దాదాపు ప్రతి అధికారీ అతడితో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని, సెటిల్మెంట్లతో సంబంధాలు లేకపోవడమే కాదు అప్పట్లో ఈ వివరాలు తమకు తెలియవని చెప్పారు. పట్టించుకోని ఉన్నతాధికారులు... నయీంతో సంబంధాల ఆరోపణలపై సస్పెండ్ అయిన వారిలో ఇద్దరిపై ఇటీవల చర్యలు ఉపసంహరించారు. చార్జ్‌మెమోలు అందుకున్న అధికారులు వివరణలు ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. సాధారణంగా పోలీసులపై తీవ్రస్థాయి ఆరోపణలు వస్తే వారికి చార్జ్‌మెమో జారీ చేస్తారు. సదరు అధికారి ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకుని తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరణతో సంతృప్తి చెందితే చార్జ్‌మెమో ఉపసంహరించడం, లేదా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే నయీం కేసులో చార్జ్‌మెమోలు అందుకున్న వారు ఇచ్చిన వివరణల్ని అధికారులు పట్టించుకోవట్లేదు. సాధారణంగా వివరణ ఇచ్చిన మూడు నెలల్లో ఏదో ఒక చర్య తీసుకోవాల్సి ఉన్నా... డీజీపీ కార్యాలయంతో పాటు నగర పోలీసు కార్యాలయం ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు. పదోన్నతి ప్రక్రియకు అడ్డంకిగా... పోలీసు విభాగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రకారం పదోన్నతి ఓ ప్రహసనం. ఓ అధికారికి ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అలా అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి చార్జ్‌మెమోలు అడ్డంకిగా మారితే ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. ఆ తర్వాత ఆ మెమో డ్రాప్ చేసినా.. మళ్లీ పదోన్నతి ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో, ఎన్నాళ్లకు సాకారమవుతుంతో చెప్పలేని స్థితి. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ పదోన్నతి కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ జాబితాలో చార్జిమెమోలు అందుకున్న వారుసైతం ఉన్నారు. వారి వివరణలపై ఎలాంటి నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ప్రమోషన్‌కు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే తాము ఇచ్చిన సమాధానాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయా అధికారులు కోరుతున్నారు. -
నయీమ్ బతికి ఉంటే అమిత్‌షా జైల్లో ఉండేవారు
సాక్షి, యాదాద్రి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ బతికి ఉంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జైల్లో ఉండేవారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. గురువారం భువనగిరిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నయీమ్ బాధితులకు న్యాయం చేయడంలో సీఎం కేసీఆర్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నయీమ్‌ను తమ ప్రభుత్వమే చంపించిందని కేసీఆర్ అనుకుంటున్నారని, కానీ సోహ్రాబుద్దీన్ కేసులో అమిత్‌షా పాత్ర ఉందన్న విషయం బయటపడుతుందని కేంద్రమే నయీమ్‌ను ఎన్కౌంటర్ చేయించిందన్నారు. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే సిట్ నివేదికను, నయీమ్ డైరీని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
నయీం గ్యాంగ్ పేరుతో వసూళ్లు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం పేరుతో ఒక వ్యాపారవేత్తను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన నగేష్(20) అనే యువకుడు నయీమ్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తినంటూ ఒక వ్యాపార వేత్త పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరించి రూ.1 కోటి డిమాండ్ చేశాడు. మొదటి విడతగా రూ.5లక్షలను ఇచ్చేందుకు అంగీకరించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు వలపన్ని నగేష్‌ను గురువారం ఉదయం పట్టుకున్నారు. ఠాణాకు తరలించి అతడిని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నయీం అనుచరులకు ఖాకీల అండ
సాక్షి, యాదాద్రి : గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ అనంతరం అరెస్ట్ చేసిన అతడి అనుచరులకు పోలీస్‌ల సహకారం మెండుగా ఉంటోంది. శుక్రవారం వెలుగు చూసిన నలుగురు పోలీసుల సస్పెన్షన్‌తో నయీం ముఠాకు ఖాకీల సహకారం ఏ మేరకు ఉందో మరోసారి తేటతెల్లమైంది. ముఖ్య అనుచరుడు పాశం శ్రీను వరంగల్‌జైల్లో ఉన్నప్పటికీ అతనికి ఆరు నెలలుగా కొందరు పోలీసులు సహకరించారని తేటతెల్లమైంది. గురువారం పోలీసులు భువనగిరిలో పాశం శ్రీనుకు చెందిన ఐదుగురు అనుచరులను అరెస్ట్ చేయడంతో మరోమారు విషయం చర్చనీయాంశమైంది. పీడీ యాక్టు నమోదై వివిధ కేసుల్లో వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న పాశం శ్రీనును భువనగిరి కోర్టుకు తీసుకువచ్చే సమయంలో ఎస్కార్ట్ పోలీస్‌లు సహకరించినట్లు తేలడంతో వారిపై వేటు పడింది. అయితే పాశం శ్రీను ఎస్కార్ట్ పోలీస్‌లకు పెద్దఎత్తున డబ్బులను ముట్టజెబుతుండడంతో ఆ డ్యూటీలకు ఏఆర్ పోలీసుల్లో తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి భువనగిరి కోర్టుకు తీసుకువచ్చి తిరిగి జైలులో అప్పగించే వరకు పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది. డ్యూటీలో ఉన్న ఒక్కో పోలీస్‌కు రూ.30వేలు, డ్యూటీ వేసిన అధికారికి రూ.10 వేలు పాశం శ్రీను ముట్ట చెబుతున్నారని సమాచారం. ఒక్కసారి ఆ డ్యూటీకీ వెళ్తే చాలు కొంత మొత్తం చేతికి వస్తుందన్న ఆశతో డిమాండ్ పెరిగింది. శ్రీనుకు స్వేచ్ఛ..సెల్ఫోన్లలో బెదిరింపులు డబ్బులు తీసుకుంటున్న ఎస్కార్ట్ పోలీసులు..పాశం శ్రీనును స్వేచ్ఛగా సంచరించే అవకాశం కల్పించారు. కొన్ని సెటిల్మెంట్ల విషయంలో అతను సెల్ఫోన్లో బెదిరింపులకు దిగడంతో బాధితులు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జరిపిన విచారణలో పోలీసుల సహకారం ఉన్నట్లు అనుమానాలు వచ్చాయి. ఈ కోణంలో ఎస్కార్ట్ పోలీస్‌ల సెల్ఫోన్లతోపాటు, పాశం శ్రీనుకు చెందిన మరికొందరు అనుచరుల ఫోన్లపై నిఘాపెట్టారు. గత నెల భువనగిరి కోర్టుకు వచ్చి తిరిగి వరంగల్ జైలుకు తీసుకెళ్తున్న సమయంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ సరిహద్దు దాటిన తర్వాత..జనగామ జిల్లా కేంద్రానికి సమీపంలో జాతీయరహదారి పక్కన గల డాబాలో పాశం శ్రీను, అతని అనుచరులు కలిసి విందులు, వినోదలు చేశారు. ఎస్కార్ట్ పోలీస్ బృందంలోని ఆర్ఎస్ఐలు రమేష్, పాషా, హెడ్‌కానిస్టేబుళ్లు రమేష్, లక్షినారాయణకు చెందిన సెల్ఫోన్ల నుంచి బెదిరింపు కాల్స్ చేశాడు. ఈ విషయం సిట్ విచారణలో బయటపడడంతో పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇదే కేసులో పాశం శ్రీను తమ్ముడు మున్సిపల్ వార్డు కౌన్సిలర్ పాశం అమర్నాథ్, అనుచరులైన అందెసాయి కృష్ణ, అంగడి నాగరాజు,మెరుగు శివశంకర్, పులి శ్రీనివాస్ లపై కేసులు నమోదుచేసి జైలుకు పంపించారు. పెరిగిన నిఘా.. కొంతకాలంగా నయిమ్ ముఠా సభ్యుల బెదిరింపులు ప్రారంభమయ్యాయని పలువురు పోలీసులను ఆశ్రయిస్తుండడంతో..నిఘాపెంచారు. ఇందుకోసం సిట్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. నిరంతర నిఘా కొనసాగిస్తూ నయీమ్ పేరుతో ఆగడాలు సాగించే వారిని అణిచివేస్తామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ హెచ్చరిస్తున్నారు. -
యువతులను చెరబట్టాడు..చంపేశాడు..
-
చెరబట్టాడు.. చంపేశాడు..
నయీమ్ దుర్మార్గాలపై వెలుగులోకి మరిన్ని సంచలనాలు - బాలికలు, యువతుల జీవితాలను బలితీసుకున్న గ్యాంగ్‌స్టర్ - దగ్గరి బంధువుల పిల్లలనూ వదలని దుర్మార్గం - తన మాట వినకపోతే దారుణంగా హింసించిన వైనం - చివరికి నిద్రమాత్రలిచ్చి, గొంతు నులిమేసి హత్యలు - ఈ పైశాచిక ఆనందానికి తోడ్పడిన నయీమ్ భార్య, అత్త, అక్క - దందాలు, సెటిల్మెంట్ల సమయంలో రక్షణగా పసికందులు - నెలల వయసున్న చిన్నారులను కొనుక్కువచ్చి వినియోగం - ప్రస్తుతం రెస్క్యూ హోంలో ఉన్న 30 మంది చిన్నారులు! - వారిని తీసుకెళ్లేందుకు ముందుకురాని తల్లిదండ్రులు సాక్షి, హైదరాబాద్: హత్యలు, బెదిరింపులు, సెటిల్మెంట్లతో ఆగని గ్యాంగ్‌స్టర్ నయీమ్ మరెన్నో పాశవిక చర్యలకు పాల్పడ్డాడు. తన పైశాచిక ఆనందం కోసం అభం శుభం తెలియని బాలికలు, యువతులను చెరబట్టా డు. పెంచి, పోషిస్తానని, చదివిస్తానని చెప్పి తీసుకువచ్చి అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. కాదన్న వారిని క్రూరంగా హింసించాడు. చివరికి నిద్ర మాత్రలు ఇచ్చి, కాలితో గొంతు నులిమి చంపేశాడు. నయీమ్ అత్త, భార్య, అక్క, మేనకోడలు ఈ దారుణాలకు తోడ్పడ్డారు. ఇక తన దందాల సమయంలో పట్టుబ డకుండా ఉండేందుకు, పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు నెలల పసికందులను వినియోగించుకున్నాడు. నయీమ్ అనుచరులను, కుటుంబ సభ్యులను విచారిస్తున్న సమయంలో ఇలాంటి విస్తుపోయే దారుణాలెన్నో బయటపడుతున్నాయి. విచ్చలవిడిగా దుర్మార్గం.. తన పైశాచిక ఆనందాన్ని తీర్చుకోవడం కోసం నయీమ్ అత్యంత దుర్మార్గంగా వ్యవహరించాడు. బయటివారైతే విషయం బయటకు వెళతాయన్న ఉద్దేశంతో అమ్మాయిలను తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడు. చదివిస్తానని, ఉద్యో గం చేయిస్తానని చెప్పి తెప్పించుకున్నాడు. తాను ఎటు వెళ్లినా వారిని తీసుకువెళుతూ కామ వాంఛలను తీర్చుకున్నాడు. ఒప్పుకోకుంటే తీవ్రంగా హింసించేవాడు, హతమార్చేవాడు. ► 2006లో నయీమ్ తన దగ్గరి బంధువులకు చెందిన నలుగురు బాలికలను పెంపకం పేరుతో తీసుకువచ్చి, లైంగికంగా వేధించాడు. వారిని కాపాడేందుకు యత్నించిన అనుచరుడు ఆరీఫ్‌ను దారుణంగా చంపేశాడు. ► 2008లో గోవాలో ఇల్లు కొనుగోలు చేసిన నయీమ్.. తరచూ హైదరాబాద్‌లోని వైట్ హౌజ్ ఇంట్లో ఉన్న ఆరుగురు 14 ఏళ్ల బాలి కలను అక్కడికి తీసుకెళ్లి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. వాళ్లు వెళ్లేందుకు ఇష్టపడకపోతే నయీమ్ భార్య, అక్క వారిని కొట్టి మరీ బలవంతంగా పంపించేవారు. ► 2010లో బంధువులకు చెందిన 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ► 2012 ఆగస్టులో షాద్‌నగర్‌లోని ఇంట్లో 12 ఏళ్ల బాలికను తీవ్రంగా గాయపరిచి మరీ అత్యాచారం చేశాడు. అదే సంవత్సరం నవంబర్‌లో మరో 14 ఏళ్ల బాలికను రెండు రోజుల పాటు లైంగికంగా వేధించాడు. కొద్దిరోజులకు నయీమ్ సొంత చిన్నాన్న బంధువులైన 12 ఏళ్ల ముగ్గురు బాలికలను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేశాడు. ► 2013లో 15 ఏళ్ల ఇద్దరు బాలికలను, 2014 లో ముగ్గురిని తన దుశ్చర్యలకు బలిచేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. తమ్ముడితో కలసి భర్తను చంపింది నయీమ్ ఎంచుకున్న దారిలోనే నడిచిన అతడి సోదరి సలీమా తన భర్తను అతి దారుణంగా హతమార్చింది. నయీమ్ అనుచరుడు కృష్ణ అలియాస్ బాషాతో సలీమా అక్రమ సంబంధం పెట్టుకుందని ఇతర అనుచరులు పోలీసు విచారణలో వెల్లడించారు. అక్రమ సంబంధం విషయం తెలియడంతో సలీమా భర్త కొండా విజయ్‌కుమార్ అలియాస్ నదీం.. ఇంట్లోంచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. తమ రహస్యాలు బయటపడతాయనే ఉద్దేశంతో నయీమ్, సలీమా, ఇతర కుటుంబ సభ్యులు కలసి అతడిని హతమార్చారు. స్వయంగా సలీమానే భర్తను చున్నీతో బిగించి చంపేసింది. పసికందులను అడ్డం పెట్టుకుని.. తన కామవాంఛలకు బాలికలను, యువతు లను బలిచేసిన నయీమ్.. తన దందాల సమయంలో రక్షణగా నెలల వయసున్న పసికందులను ఉపయోగించుకున్నాడు. దందాల సమయంలో, సెటిల్మెంట్లలో వసూలు చేసిన సొమ్మును తరలించే సమయంలో నయీమ్ భార్య, అక్క, కోడలు ఆ పిల్లలను వెంట పెట్టుకునేవారు. పసిపిల్లలు, మహిళలు ఉండడంతో పోలీసులు ఆయా వాహనాలను తనిఖీ చేయకుండా వదిలేసేవారని, అలా పట్టుబడకుండా తప్పించుకునేవారని అనుచరులు వెల్లడించారు. తన అత్త సుల్తానా మిర్యాలగూడ, నల్లగొండ సమీప ప్రాంతాల నుంచి పసిబిడ్డలను కొనుగోలు చేసి తీసుకువచ్చేది. అలా 2010 నుంచి నయీమ్ ఎన్కౌంటర్ సమయం వరకు 30 మందికిపైగా పిల్లలను తీసుకువచ్చారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి మూడు నెలల వరకు వయసున్న ఈ చిన్నారులకు తానే పేర్లు పెట్టి.. వివిధ ప్రాంతాల్లోని తన నివాసాల్లో పెట్టాడు. ఈ పిల్లలంతా ప్రస్తుతం ఓ రెస్క్యూ హోంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నించినా.. కొందరి తల్లిదండ్రులను గుర్తించలేకపోతున్నారని, మరికొందరు పిల్లలను తీసుకెళ్లేందుకు ముందుకురావడం లేదని తెలిసింది. దారుణంగా హతమార్చాడు.. అలకాపురి కాలనీలోని ఇంట్లో 18 ఏళ్ల అనామిక (పేరు మార్చాం)పై 2015 జూలై 24న నయీమ్ అత్యాచారానికి పాల్ప డ్డాడు. ఆమె సహకరించలేదనే కోపంతో తీవ్రంగా గాయపరిచాడు. అదే రోజు రాత్రి తుక్కుగూడలో నయీమ్ తమ్ముడి కుమార్తె ఎంగేజ్మెంట్ ఉండడంతో.. అనామికకు నిద్ర మాత్రలు మింగించి, ఓ గదిలో పడేసి అందరూ వెళ్లిపోయారు. మరుసటి రోజు సాయంత్రం తిరిగి వచ్చారు. కదలకుండా పడి ఉన్న అనామికను చూసి చనిపోయిందనుకొన్నారు. బయటకు తరలించే క్రమంలో ఆమెకు ప్రాణం ఉన్నట్లు గుర్తించిన నయీమ్... క్రూరంగా ఆమె పొట్టపై తొక్కి, గొంతు నులిమి చంపేశాడు. తర్వాత డ్రైవర్‌తో కలసి ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలోని పొదల్లో మృతదేహాన్ని దహనం చేశారు. ► 2014లో ఇద్దరు బాలికలను తీసుకుని ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లిన నయీమ్.. వారిని తిరిగి హైదరాబాద్‌కు తీసుకురాలేదు. వారిని చంపేశాడా? లేకా అక్కడి అనుచరులకు వదిలేశాడా.. అన్నదానిపై పోలీసులు ఇంకా గుర్తించలేకపోయారు. ► 2016 ఫిబ్రవరిలో గోవాలోని ఇంట్లో ఉన్న యువతి పారిపోయేందుకు ప్రయత్నించడంతో.. నయీమ్ అతి దారుణంగా చంపేసినట్టు అనుచరులు పోలీసు విచారణలో వెల్లడించారు. -
డాన్ ఆయుధాలెక్కడ?
♦ 21 పిస్టళ్లను స్మగ్లింగ్ చేసిన అర్ఖాన్ భాయ్.. ఉత్తరప్రదేశ్ నుంచి తుపాకుల సరఫరా ♦ పోలీసులు సీజ్ చేసింది ఒక్క ఏకే–47, 6 పిస్టళ్లు మాత్రమే.. మిగతా ఏకే–47లు, పిస్టళ్లు ఎక్కడ? ♦ నయీం అనుచరుల వద్దే ఉన్న మారణాయుధాలు ♦ ఏడాది తర్వాత బయటకు వచ్చిన సంచలన అంశాలు ♦ రెండు గ్రూపులుగా చీలిపోయిన అనుచరులు ♦ మళ్లీ గ్యాంగ్‌వార్ మొదలయ్యే అవకాశముందంటున్న నిఘా వర్గాలు (ఐరెడ్డి శ్రీనివాసరెడ్డి) జేబులో పెన్ను పెట్టుకున్నంత సులభంగా గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఏకే–47 వంటి మారణాయుధాలను వినియోగించాడు. నయీమ్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరులు కూడా ఏకే–47లు, పిస్టళ్లు పట్టుకుని దందాలు చేశారు. అసలు నయీం 2003 నుంచి 2015 మధ్య ఏకంగా 11 ఏకే–47లు, 21 పిస్టళ్లు కొనుగోలు చేసినట్లు కుటుంబ సభ్యులు, అనుచరుల విచారణలో వెల్లడైంది. కానీ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులకు దొరికింది ఒకే ఒక ఏకే–47, ఆరు పిస్టళ్లు మాత్రమే. దీంతో మిగతా ఆయుధాలు ఏమయ్యాయనే దానిపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు నయీంకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్ని ఆయుధాలను కొనుగోలు చేశాడు, వాటికోసం ఎంత ఖర్చుపెట్టాడన్న అంశాలపై పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోయారు. అంతేకాదు ప్రస్తుతం నయీం అనుచరుల వద్ద ఉన్న ఆయుధాల పరిస్థితి ఏమిటి? మళ్లీ దందాలు, ముఠా కక్షలు మొదలవుతాయా అన్న ఆందోళన రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో నయీం ఆయుధాల అంశంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. ముఖ్యులందరి వద్దా ఏకే–47లు నయీం దందాలు, సెటిల్మెంట్లు వంటివి చేసే ముందు తన భార్య హసీనా, అక్క సలీమా, తల్లి తాహేరా, అత్త సుల్తానా, బావమరిది సాదిక్‌లను ‘టార్గెట్’ప్రాంతానికి పంపుతాడు. వారు మూడు ఏకే–47లు, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్‌తో అక్కడికి చేరుకుంటారు. తర్వాత నయీం తన ఆంతరంగికురాలు అమీనా, అనుచరులు శ్రీధర్‌గౌడ్, శ్రీధర్‌రాజు, శేషన్న, పాశం శ్రీను, రాంబాబు, గోపన్న, ఈశ్వరయ్యతో కలసి వస్తాడు. వీరందరి వద్దా ఏకే–47లు ఉంటాయి. వాటితోపాటు ప్రతీ ఒక్కరి వద్ద అదనంగా పిస్టల్ కూడా ఉంటుంది. ఏకే–47లను కారులో కనబడకుండా పట్టుకునే వీరు.. పిస్టళ్లను లోదుస్తుల్లో దాచుకునేవారని సమాచారం. ఇలా 2014 నుంచి 2016 ఆగస్టు వరకు దందాలు చేసేందుకు షాద్‌నగర్‌లోని ఇందిరాపార్క్ నివాసానికి వచ్చేవాడు. యాంజాల్ శివారులోని ఇంజాపూర్‌లో ఉన్న నివాసంలోనూ సెటిల్మెంట్లు చేశాడు. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయుధాలు ఐపీఎస్ వ్యాస్ హత్య కేసులో నయీంను అరెస్టు చేసిన పోలీసులు ముషీరాబాద్ జైలుకు పంపించారు. అక్కడే నయీంకు ఐఎస్ఐ ఉగ్రవాది షాహీద్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం షాహీద్ ఉత్తరప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన ఆయుధాల డీలర్ అర్ఖాన్‌భాయ్ అలియాస్ యుజవార్ను నయీంకు పరిచయం చేశాడు. అలా అర్ఖాన్‌భాయ్ ద్వారా 2000 సంవత్సరంలో నయీంకు ఆయుధాలు అందాయి. నయీం వాటిని మావోయిస్టుల హత్యలకు, భూ దందాలకు వినియోగించుకున్నాడు. ఈ క్రమంలో 2003లో అర్ఖాన్‌కు రూ.10 లక్షలు చెల్లించి.. రెండు ఏకే–47లు, రెండు పిస్టళ్లను తెప్పించాడు. ఆ డబ్బును తన అక్క సలీమా అర్ఖాన్‌కు అందించింది. తర్వాత 2006లో రూ.15 లక్షలు ఇచ్చి మరో 2 ఏకే–47లు, నాలుగు పిస్టళ్లను గోవాలోని తన చర్చిహౌస్కు తెప్పించుకున్నాడు. 2008లో అర్ఖాన్ రూ.20 లక్షలు తీసుకుని మరో రెండు ఏకే–47లను ఇంజాపూర్‌లోని నయీం అడ్డాకు తెచ్చి ఇచ్చాడు. 2013లో శంషాబాద్‌లోని రైల్వేహౌజ్లో ఇంకో రెండు ఏకే–47లు, రెండు పిస్టళ్లు ఇచ్చి రూ.20 లక్షలు తీసుకెళ్లాడు. 2015లో రూ.20 లక్షలు తీసుకుని ఒక ఏకే–47, ఒక కార్బైన్, 4 పిస్టళ్లను తెచ్చి ఇచ్చాడు. ఇవన్నీ నయీం కుటుంబ సభ్యులకు తెలిసి జరిగినవి. ఇవిగాకుండా ఛత్తీస్‌గఢ్‌లో రెండు సందర్భాల్లో 2 ఏకే–47లను, నాలుగు పిస్టళ్లను, ప్రకాశంలో ఉన్నప్పుడు రెండు పిస్టళ్లను నయీం తెప్పించినట్లు అనుచరుల విచారణలో వెల్లడైంది. మొత్తంగా నయీం దాదాపు కోటిన్నర వరకు చెల్లించి.. పదకొండు ఏకే–47లు, 21 పిస్టళ్లను తెప్పించాడు. దొరికింది మాత్రం ఒక్కటే.. గతేడాది ఆగస్టు 8న షాద్‌నగర్ మిలినీయం టౌన్షిప్లో ఉన్న ఇందిరాపార్క్ హౌజ్ వద్ద నయీం ఎన్కౌంటర్ జరిగింది. అనంతరం పోలీసులు అలకాపురి కాలనీ, శంషాబాద్, ఇంజాపూర్లలోని ఇళ్లు, తుక్కుగూడ ఫాంహౌస్.. ఇలా 12 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. రూ.2.5 కోట్ల నగదుతోపాటు భారీగా బంగారు ఆభరణాలు, పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. నయీం ఎన్కౌంటరైన ప్రాంతంలో ఒక ఏకే–47ను.. అతడి అనుచరులు శ్రీధర్‌గౌడ్, పాశం శ్రీనుల వద్ద మూడు చొప్పున ఆరు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలకాపురి కాలనీలోని ఇంట్లో ఒక కార్బైన్, 169 రౌండ్ల బుల్లెట్లు, 10 జిలెటెన్ స్టిక్స్ దొరికాయి. అయితే నయీం వద్ద 11 ఏకే–47 తుపాకులు, 21 పిస్టళ్లు ఉన్నట్లు లెక్క. మరి పోలీసులకు దొరికింది ఒక్క ఏకే–47, 6 పిస్టళ్లు మాత్రమే. మిగతా ఆయుధాల సంగతేంటి, అసలు అవి ఎక్కడికి వెళ్లాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నయీం షాద్‌నగర్ డెన్‌కు వెళ్లే ముందు రోజు అతడి భార్య, అక్క, అనుచరుల వద్ద ఏకే–47లు ఉన్నాయి. కానీ సోదాల సమయంలో మాత్రం లభించలేదు. దీనిపై పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. పోలీసులు సీజ్ చేసినట్లుగా పేర్కొన్న ‘ప్రాపర్టీ’లో ఆయుధాల వివరాలను పూర్తిగా చూపకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ గ్యాంగ్‌వార్.. నయీం ముఠా యాక్షన్ కమిటీలో కీలకంగా ఉన్న శేషన్న, ఇతర అనుచరులు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. వారు ఇటీవల పలు రాజకీయ పార్టీల కార్యాలయాలకు కూడా వెళ్లడం సంచలనంగా మారింది. నయీంకు సంబంధించిన ఆయుధాలు వారి వద్ద ఉండి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల నయీం కుటుంబీకులు, అనుచరులుగా ఉన్న వ్యక్తుల మధ్య విభేదాలు తలెత్తాయని నిఘా వర్గాలు గుర్తించాయి. నయీం ముఠాలో రెండు గ్రూపులు ఏర్పడి ఉంటాయని. వాటి మధ్య తిరిగి గ్యాంగ్‌వార్ మొదలయ్యే అవకాశముందని సమాచారం. -
227 కేసులు.. 895 మంది సాక్షులు!
- నయీమ్ మృతి చెంది ఏడాది పూర్తి - ఇప్పటివరకు 9 కేసుల్లోనే చార్జిషీట్ - త్వరలో 22 కేసుల్లో చార్జిషీట్ వేస్తామన్న సిట్ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ మృతికి మంగళవారంతో ఏడాది పూర్తయింది. నయీమ్ సాగించిన దందాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు.. ఇలా అన్నింటిపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏడాది నుంచి నయీమ్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్టేషన్లలో 227 కేసులు నమోదుకాగా, 895 మంది సాక్షులను సిట్ విచారించినట్లు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పోలీస్ శాఖ స్పష్టం చేసింది. మొత్తం 128 మందిని అరెస్ట్ చేసి, వీరిలో 109 మందిని తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినట్లు సిట్ పేర్కొంది. ఇప్పటివరకు 9 కేసుల్లో మాత్రమే చార్జిషీట్ దాఖలు చేశామని, త్వరలోనే మరో 22 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపింది. మిగతా కేసుల్లో దర్యాప్తు తుది దశకు చేరుకుందని వెల్లడించింది. నయీమ్ గ్యాంగ్‌లోని 14 మందిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నామని, ఐదుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు సిట్ వివరించింది. అదే విధంగా మరో నలుగురు పోలీస్ అధికారులకు తీవ్రత కలిగిన క్రమశిక్షణ చర్యలు, మరో 16 మంది అధికారులకు స్వల్ప తీవ్రత కలిగిన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. మిగిలిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేశామని, త్వరలోనే పూర్తిచేస్తామని సిట్ అధికారులు తెలిపారు. -
నయీం పెంచిన కుక్కలెక్కడ?
♦ ఎన్కౌంటర్ తర్వాత నెల పాటు ఓ సంరక్షణశాలలో ♦ ఆ తర్వాత అవి ఎక్కడన్న దానిపై లేని స్పష్టత ♦ గ్యాంగ్‌స్టర్ ఎన్కౌంటర్ జరిగి ఏడాది పూర్తి హైదరాబాద్: ఎవరి పైనైనా పగబడితే నిద్రపోయేవాడు కాదు... నడిరోడ్డుపై విరుచుకుపడేవాడు... కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేయించేవాడు.. ఆస్పత్రికి తరలించినా బతికే అవకాశం లేకుండా కత్తికో కండగా నరికించేవాడు... ఒక్కోసారి శరీరాల్ని ఖండఖండాలుగా చేసి పాతిపెట్టించాడు... ఏడాది క్రితం 2016 ఆగస్టు 8న షాద్‌నగర్ శివార్లలోని మిలీనియం టౌన్షిప్లో ఎన్కౌంటర్ అయిన నయీమ్ వ్యవహారశైలి ఇది. ఇంతటి కౄరమైన చరిత్ర ఉన్న కరుడుగట్టిన నేరగాడైన అతడికీ ఓ వీక్నెస్ ఉంది. ఇతడికి తన పెంపుడు కుక్కలంటే అమితమైన ప్రేమ. ఇప్పుడు ఇవి ఎక్కడున్నాయన్నది పోలీసులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. రెండింటిని పెంచుకుంటూ... నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని నెక్నంపూర్ అల్కాపురి టౌన్షిప్లో ఉన్న ఇంట్లో నయీం రెండు కుక్కలను పెంచాడు. సరిహద్దులో పహారా కోసం భద్రతా బలగాలు వినియోగించే ‘డాల్మటైన్’ జాతికి చెందిన శునకాలను నయీ మ్ తెచ్చుకుని పెంచే వాడు. వీటికి శాండో, కోమి అని పేర్లు కూడా పెట్టాడు. వాటి తిండికీ‘టైమ్ టేబుల్’.. ఈ రెండు శునకాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం కోసం ప్రత్యేకంగా ఓ వెటర్నరీ డాక్టర్‌ను ఏర్పా టు చేశాడు కూడా. వైద్యుడి సూచనల మేరకు వీటికి నిత్యం ఇవ్వాల్సిన ఆహారం, టానిక్స్ సంబంధించి ఓ పట్టిక తయారు చేశాడు. తన ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్‌లో వీటికోసం ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆహార, సమయ సూచిక’ పేరుతో ఓ బోర్డు సైతం ఏర్పాటు చేయించాడు. ఎన్కౌంటర్ తర్వాత నయీం ఇంటిని సీజ్ చేసిన పోలీసులు ఈ రెండు శునకాలనూ సంరక్షణ నిమిత్తం పుప్పాలగూడలోని ఓ కెన్నల్‌కు తరలించారు. దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉన్నాయి. ఆపై వాటిని పోలీసులే తీసుకువెళ్ళారని కెన్నల్ నిర్వాహకులు, జంతు సంరక్షణ విభాగం అధికారులు తీసుకువెళ్ళారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు అవి ఎక్కడున్నాయన్నది ఎవరూ స్పష్టం చెప్పలేకపోతున్నారు. నిర్మానుష్యంగా నయీమ్ ఇల్లు... ఏరియాకో గ్యాంగ్‌ను నిర్వహించిన నయీమ్ గల్లీకో డెన్ ఏర్పాటు చేసుకున్నాడు. నెక్నంపూర్ అల్కాపురి టౌన్‌షిప్‌తో పాటు శంషాబాద్, హస్తినాపురం, వస్థలిపురం, మన్సూరాబాద్, కుంట్లూర్ల్లో డెన్స్ నిర్వహించాడు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు గోవా, ఏపీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోనూ ప్రత్యేక డెన్లు ఏర్పాటు చేసుకున్నాడు. వీటిని తన భార్య, సోదరితో పా టు ప్రధాన అనుచరుల పేర్లతోనూ రిజిస్టర్ చేయించాడు. స్థలాలు, భూములు వీటికి అద నం. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన తొలినాళ్లల్లో స్థిరాస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా... అది కేవలం సీజ్ వరకే సాధ్యమైంది. దీంతో అనేక డెన్స్ ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. -
యాక్షన్ టీమ్ ఎక్కడ..?
గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ జరిగి ఏడాది - ఇప్పటికి చిక్కిన వారంతా ‘సివిల్ క్రిమినల్సే’ - ఎన్కౌంటర్ తర్వాత కనిపించని యాక్షన్ టీమ్ - కొందరు ఖాకీలపైనే వేటు.. సేఫ్జోన్లో రాజకీయ నాయకులు సాక్షి, హైదరాబాద్/యాదాద్రి: 2016 ఆగస్టు 8.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ అయిన రోజు. ఇది జరిగి రేపటికి ఏడాది.. నాటి నుంచి పోలీసులు, సిట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 174 కేసులు నమోదు చేశారు. 120 మంది నయీమ్ అనుచరుల్ని పట్టుకున్నారు. మరోవైపు నయీమ్‌తో అంటకాగిన ఖాకీలపై వేటు పడినప్పటికీ.. రాజకీయ నాయకులు మాత్రం ‘సేఫ్‌జోన్’లోనే ఉండిపోయారు. నయీమ్ డెన్ల నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు ఎన్ని? వాటిలో ఉన్న వివరాలు ఏంటి? అనేది సైతం రహస్యంగా ఉండిపోయింది. యాక్షన్ టీమ్ ఎక్కడ..? నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన అనుచరులంతా అప్పటి వరకు వెలుగులోకి రాని ‘సివిల్ నేరగాళ్ల’నే వాదన ఉంది. ఈ ముఠాకు భిన్నమైన యాక్షన్ టీమ్ ఒకటి నయీమ్ కనుసన్నల్లో పని చేసింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లా మన్ననూరు కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన, హైదరాబాద్‌లో జరిగిన పటోళ్ళ గోవర్థన్‌రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్న ఈ టీమ్‌లో కీలకం. మహబూబ్‌నగర్, అచ్చంపేట, సిద్ధిపేట, నగరంలోని ముషీరాబాద్, పాతబస్తీలకు చెందిన మరో ఆరుగురు సభ్యులుగా ఉండేవారు. నయీమ్ ఆదేశాలతో హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడటం.. ఆపై షెల్టర్ జోన్స్‌కు వెళ్లిపోవడం వీరి పని. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ టీమ్ ఏడాది గడిచినా పోలీసులకు చిక్కడం కానీ, అరెస్టు కావడం కానీ జరగలేదు. ఇంకా దర్యాప్తులో అనేక కేసులు... నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అనేక మంది బాధితులు ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో హత్య, భూకబ్జా, కిడ్నాప్, బెదిరింపుల ఆరోపణలపై 174 కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి 120 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అనేక మందికి బెయిల్ లభించింది. నయీమ్ భార్య హసీనాకు ఈ నెల 2న బెయిల్ రావడంతో సంరక్షణాలయంలో ఉన్న తన పిల్లల్ని సైతం ఆమె తీసుకువెళ్లింది. ఇన్ని కేసులు నమోదైనప్పటికీ అభియోగపత్రాలు దాఖలైన వాటి సంఖ్య తక్కువే. కేసుల విచారణ, చార్జిషీట్ల దాఖలులో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలతో ఇటీవల భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్కు ఈ బాధ్యతలను పోలీసు శాఖ అప్పగించింది. సేఫ్ జోన్లో రాజకీయ నాయకులు.. నయీమ్‌తో అనేక మంది పోలీసులు దందాల్లో పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది మేలో ఇలా ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. మరో 20 మంది పోలీసులపై విచారణకు ఆదేశాలు వెలువడ్డాయి. ఆరోపణలు రుజువైతే కేసులుంటాయని అప్పట్లో అధికారులు చెప్పినా.. ఇప్పటికీ రుజువులు లభించలేదు. గ్యాంగ్‌స్టర్‌తో అంటకాగిన వారిలో రాజకీయ నేతలు సైతం ఉన్నారని ఆరోపణలు వినిపించాయి. పోలీసులపై సస్పెన్షన్ వేటు పడినా.. నేతలు మాత్రం ‘సేఫ్‌జోన్’లో ఉండిపోయారు. కొందరికి నోటీసుచ్చిన సిట్ తమ కార్యాలయానికి పిలిపించి విచారించింది. తమకు నయీమ్‌తో దోస్తీ తప్ప దందాలు లేవంటూ చెప్పడంతో ఆ కథకు బ్రేక్ పడింది. -
తుపాకులు.. తూటాలు!
బయటకు వచ్చిన నయీమ్ షాద్‌నగర్ డెన్ వీడియో సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు చెందిన కీలక వీడియో ఆదివారం వెలుగులోకి వచ్చింది. అతడి ఎన్‌కౌంటర్‌కు ముందు తలదాచుకున్న షాద్‌నగర్ మిలీనియమ్ టౌన్‌షిప్‌లోని ఉనూర్ బాషా ఇంటి లోపలి వీడియోలు మీడియాలో హల్చల్ చేశాయి. అక్కడి నయీమ్ బెడ్రూమ్ నుంచి వెలికితీసిన తుపాకులు, తూటాలు, కత్తులు ఈ వీడియోలో కనిపించాయి. మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నయీముద్దీన్ గత ఏడాది ఆగస్టు 8న షాద్‌నగర్‌లోని మిలీనియమ్ టౌన్షిప్లో ఎన్కౌంటర్ అయ్యాడు. ఈ ప్రాంతానికి పక్కనే ఉన్న బాషా ఇల్లే నయీమ్ డెన్‌గా గుర్తించిన పోలీసులు అదే రోజు సోదాలు చేశారు. అప్పట్లో అధికారులు ఈ ఇంట్లో భారీ మొత్తం నగదు, డాక్యుమెంట్లు, ఆయుధాలు గుర్తించారు. బెడ్రూమ్లోని బీరువా సమీపం లో రెండు కవర్లలో భారీ సంఖ్యలో ఉన్న తూటాలు, ఓ బ్యాగ్‌లో ఉంచిన కార్బైన్, రివాల్వర్‌తో పాటు మరో కవర్లో ఉన్న రెండు కత్తుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని వీడియో ద్వారా చిత్రీకరించారు. అప్పటి నుంచి గోప్యంగా ఉండి పోయిన ఈ వీడియో పది నెలల తర్వాత వెలుగులోకి వచ్చి ఆదివారం హల్చల్ చేసింది. -
‘నయీం నెత్తుటి కూడులో వారికి వాటా’
సూర్యాపేట: ‘ఎంతో మంది అమాయకులను అదిరించి, బెదిరించి సంపాదించిన గ్యాంగ్‌స్టర్ నయీం నెత్తుటి కూడులో టీఆర్ఎస్ నాయకులకు వాటాలు ఉన్నాయి. నయీం బతికున్నప్పుడు అక్రమంగా సంపాదించాడు. ఇప్పుడు అతడు చనిపోయిన తర్వాత కూడా ఆస్తులను పంచకుండా జాప్యం చేస్తున్నారు’ అని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ అన్నారు. బుధవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధాకర్ మాట్లాడారు. నయీమ్ సంపాదించిన అక్రమాస్తులను బాధితులను పంచాలని, అందుకు ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడంలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబం అంటే అందరికీ గౌరవమే అని, అయితే ఉద్యమ కారులను ఉరికించి కొట్టిన తూర్పు జయప్రకాశ్ ఇలాఖాలో కాంగ్రెస్ పార్టీ వారు జూన్ 1న సమావేశం ఏర్పాటు చేయాలనుకోవడం శోచనీయమన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్లగొండ జిల్లాలో దళితుల ఇళ్లలో భోజనం చేసి అతిగా ప్రచారం చేసుకోవడం దళితుల మనోభావాలను కించపరచడమే అన్నారు. మొదటి నుంచి తెలంగాణ జెండా పట్టి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు నేడు కనుమరుగు అయ్యారని, వారికి సరైన గౌరవం కల్పించేందుకే ఇంటి పార్టీ స్థాపించామని చెప్పారు. రాష్ట్ర సాధన లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పాటు చేసే ఇంటి పార్టీ ఆవిర్భావ సభ జూన్ 2న హైదరాబాద్‌లో జరగనుందని ఉద్యమకారులు, మేధావులు, విద్యార్థులు సబ్బండ వర్ణాలు తరలి రావాలని పిలుపునిచ్చారు. -
‘నయీమ్’ నేతలపై వేటు?
♦ గ్యాంగ్‌స్టర్ వ్యవహారంలో కేసీఆర్ సీరియస్ ♦ ఏడుగురు టీఆర్ఎస్ నాయకులపై చర్యలకు రంగం సిద్ధం ♦ క్రిమినల్ కేసుల నమోదుకు అనుమతి! ♦ ఆనక పార్టీ నుంచి సస్పెన్షన్‌కు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో అంటకాగిన నేతలపై వేటు పడనుందా? వారిని టీఆర్ఎస్ నుంచి సాగనంపేందుకు రంగం సిద్ధమవుతోందా? పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారా?.. ఈ ప్రశ్నలకు పోలీసు అధికారుల నుంచి అవుననే సమాధా నమే వస్తోంది. నయీమ్‌ను మట్టుబెట్టడం ద్వారా వచ్చిన మంచి పేరును కాపాడుకు నేందుకు కఠినమైన చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టులో నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం అతడి డెన్ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పోలీసులకు కీలకమైన సమాచారం లభించింది. దాని ఆధారంగా చర్యలు ప్రారంభించగా.. ఇప్ప టికే ఐదుగురు పోలీసు అధికారులపై సస్పె న్షన్ వేటుపడింది. ఇక రాజకీయ నేతల వంతు వచ్చింది. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్కు చెం దిన పలువురు నేతలకు నయీమ్‌తో ఉన్న సంబంధాలు, సెటిల్మెంట్లకు సంబంధించిన ఆధారాలు పోలీ సులకు లభించాయి. ఏడుగురు నేతలపై చర్యలు! విపక్షాల విమర్శల నేపథ్యంలో ప్రభుత్వా నికి, అధికార పార్టీకి చెడ్డపేరు రాకుండా ఉండాలంటే నయీమ్‌తో సంబంధాలున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌కు వివరిం చారని సమాచారం. దీంతో ఆయా నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, కేసు నమోదైన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, మరో ఇద్దరు నేతలు మొత్తంగా ఏడుగురిపై చర్యలు తీసుకో ను న్నారని విశ్వసనీయ సమా చారం. ఈ మేరకు సీఎం కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులతో జరిపిన భేటీలో పచ్చ జెండా ఊపారని చెబుతున్నారు. వీరిలో గతంలో కాం గ్రెస్‌లో పనిచేసి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న నాయకులే ముగ్గురు ఉన్నారని అంటున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేపైనా క్రిమినల్ కేసులు పెట్టనున్నారని తెలిసింది. క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల కోసం వేట పార్టీ నేతల పనితీరుపై కేసీఆర్ దృష్టి సారిం చారు. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం ముం దస్తుగానే క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల జాబి తా తయారు చేయిస్తున్నారని తెలు స్తోంది. కేసీఆర్ ఈనెల మొదటి వారంలోనే మూడో అంతర్గత సర్వే కూడా చేయించారు. నయీ మ్తో సంబంధాలు నెరిపినవారు, ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో గీత దాటినవారు, నియోజక వర్గాల్లో వివాదాస్పద ఘటనల్లో బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వా రిపైనా ప్రత్యేక సమాచారం తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. ఆయా నేతలకు చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
నయీమ్ కేసులో మళ్లీ మొదలైన హడావిడి
-
నల్లగొండ నేతల్లో ‘నయీమ్’ వణుకు
-
నల్లగొండ నేతల్లో ‘నయీమ్’ వణుకు
- రాజకీయ నాయకులపై చర్యలుంటాయన్న వార్తలతో కలకలం - నయీమ్‌తో నేతి విద్యాసాగర్, చింతలకు సంబంధాల నిర్ధారణ - జిల్లాకు చెందిన ముగ్గురు, నలుగురు నేతలకూ సంబంధాలు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో కలిసి భూదందాలు, సెటిల్మెంట్లకు పాల్పడిన ఆయన అనుచరుల ఎపిసోడ్ అయిపోయింది. వారంతా అరెస్టయి జైలుకెళ్లి మళ్లీ బెయిల్‌పై విడుదలై కేసుల విచారణ ఎదుర్కొంటున్నారు. నయీమ్‌తో అంటకాగిన పోలీసు లపై చర్యలూ పూర్తయ్యాయి. ఐదుగురు అధికారులు సస్పెండ్ కాగా, మిగిలిన వారిని మౌఖిక విచారణ జరిపి నేరం రుజువైతే వారిని కూడా సస్పెండ్ చేసి కటకటాల పాలు చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఇక, మిగిలిం దల్లా రాజకీయ నాయకులే. అది కూడా నల్లగొండ జిల్లాకు చెందినవారే. నయీమ్ అనుచరులు, అంట కాగిన పోలీసుల ఎపిసోడ్లు ముగిసిన తర్వాత రాజ కీయ నాయకుల పీకలపై కత్తి పెట్టేందుకు రంగం సిద్ధమవుతుందన్న వార్తలు ఇప్పుడు నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులకు వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన మండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్, భువనగిరికి చెందిన టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డిలకు నయీమ్‌తో ప్రత్యక్ష సంబంధాలున్న విషయం కూడా ఇప్పటికే నిర్ధారణ అయింది. ఇందులో విద్యాసాగర్‌ను నయీమ్ కేసు విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్ విచారించింది కూడా. వీరిద్దరికి తోడు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వీరికి తోడు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డిలకు కూడా నయీమ్‌తో సంబంధాలున్నాయనే ప్రచారం ఉంది. అయితే, వీరి ప్రత్యక్ష ప్రమేయం పోలీసు విచారణలో నిర్ధారణ అయిందా, వీరిద్దరూ కేవలం మాటామంతీలు మాత్రమే నడిపించారా, భూదందాలు చేశారా? అన్నది బయటకు రానీయడం లేదు. ఈ నేపథ్యంలో నయీమ్ తో ఎవరి సంబంధాలు ఎంత వరకు ఉన్నాయి? అందు లో నేరపూరిత కోణం ఎవరి విషయంలో నిర్ధారణ అయింది? వారిని అరెస్టు చేస్తారా? లేదా పదవులకు రాజీనామా చేయిస్తారా? తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం కూడా ఆ నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారడం విశేషం. గన్‌లైసెన్స్ రద్దు? నేతి విద్యాసాగర్ వ్యక్తిగత గన్ లైసెన్స్‌ను రద్దు చేసినట్టు తెలుస్తోంది. తన గన్‌లైసెన్స్‌ను పునరుద్ధరించాలని ఆయన చేసుకున్న దరఖాస్తును పోలీసులు తిరస్కరించారని సమాచారం. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత ఆయనపై నాలుగైదు కేసులు నమోదు కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో లభించిన డైరీ ఆధారంగా ఆయన ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యులు, బినామీలు, బంధువులు, పోలీసు ఉన్నతాధికారులు, అధికార, ప్రతిపక్షపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీల వివరాలు బయటపడ్డాయి. మరో నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి తన కుటుంబీకుల పేరిట ఎలాంటి ఆస్తులు కూడగట్టకపోయినా, నయీమ్ తో కలసి నడిపిన ఓ భూదందాలో తన స్నేహితుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని పోలీసు విచారణలో తేలింది. ఎమ్మెల్యే గాదరి కిశోర్ కూడా నయీమ్‌కు దగ్గరయ్యాడని పోలీసు విచారణలో తేలినట్టు సమాచారం. నయీమ్ అనుచరులిద్దరిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు కాగా, వారిని పోలీసులు పట్టుకోకుండా తప్పించే యత్నం కిశోర్ చేశాడని, వారిని పోలీసులు వెంటాడినా పట్టుకోలేకపోయారని, భువనగిరి నుంచి తుంగతుర్తి వరకు పోలీసులు వెంబండించినా ప్రయోజనం లేకుండా పోయిందనే చర్చ అప్పట్లో హల్చల్ సృష్టించింది. వీరు ముగ్గురే కాకుండా నయీమ్‌తో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న నలుగురైదుగురు నేతలు జిల్లాలో ఉన్నా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ప్రస్తుతానికి ఈ ముగ్గురిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగు తోంది. మరి సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుం టారు..? రానున్న రోజుల్లో ఎలాంటి పరిణా మాలు జరుగుతాయన్నది వేచి చూడాల్సిందే. -
నయీం కేసులో మరో కొత్త మలుపు
-
నయీం కేసులో మరో కొత్త మలుపు
గ్యాంగ్‌స్టర్ నయీం కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. సీఐడీ అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, ఏసీపీ మలినేని శ్రీనివాస్ (మీర్‌చౌక్), సీసీఎస్ ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, కొత్తగూడెం సీఐ రాజగోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మస్తాన్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిలో మద్దిపాటి శ్రీనివాస్ పేరు చాలా సందర్భాల్లో బహిరంగంగానే వినిపించింది. మొత్తం 25 మంది మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఐదుగురిని సస్పెండ్ చేయగా, నలుగురిపై మౌఖిక విచారణ జరగనుంది, 16 మందిని స్వల్ప శిక్షలతో సరిపెడుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత మళ్లీ నయీం కేసు మరోసారి వెలుగులోకి రావడం, అందులో పోలీసులపై చర్యలు తీసుకోవడం సంచలనం సృష్టించింది. -
నయీమ్ ఆస్తుల జప్తు కష్టమే!
-
నయీమ్ ఆస్తుల జప్తు కష్టమే!
బలమైన ఆధారాలు ఉండాలన్న న్యాయ నిపుణులు - ఆస్తులపై పక్కాగా రిజిస్ట్రేషన్లు, సంబంధిత పత్రాలు - 15 ఏళ్ల కిందటి బెదిరింపులకు ఆధారాలు దొరకని వైనం - బాధితుల వాంగ్మూలాలు మాత్రమే సేకరించిన సిట్ - 24 ఇళ్లను సైతం జప్తు చేసుకోలేని పరిస్థితి - 1,130 ఎకరాల్లో 300 ఎకరాల స్వాధీనానికే అవకాశం - ఇళ్ల విషయాల్లో ట్యాక్స్ కడితే అభ్యంతరం లేదన్న ఐటీ శాఖ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకోవడం సులభం కాదని న్యాయ నిపుణులు తేల్చిచెప్పారు. నయీమ్ కబ్జాకు పాల్పడి నట్టు బలమైన ఆధారాలేవీ దొరకలేదని సిట్వర్గాలు గతంలోనే వెల్లడించాయి. నయీమ్ ఇళ్లతో పాటు డెన్లలో లభించిన డాక్యుమెంట్లను బట్టి 1,130 ఎకరాల భూమి నయీమ్ సంబంధీకులు, బినామీల పేర్ల మీద ఉన్నట్టు సిట్ గుర్తించింది. ఇక తెలంగాణతో పాటు గోవా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో 24 ఇళ్లను నయీమ్ తన సంబంధీకుల పేర్ల మీద పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించాడు. వాటికి సంబంధించి అన్ని పత్రాలు చట్టపరంగా సక్రమంగా ఉన్నాయని, వాటిని జప్తు చేసుకోవడం అంత సులభం కాదని న్యాయ నిపుణులు పోలీస్ శాఖకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనితో కేసులో ఏవిధంగా ముందుకెళ్లాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. 15 ఏళ్ల కిందటి వ్యవహారాలు.. భువనగిరి, యాదాద్రి, మిర్యాలగూడ, షాద్‌నగర్, కల్వకుర్తి, శంషాబాద్, నార్సింగి, నల్లగొండ.. ఇలా పలు ప్రాంతాల్లోని తమ భూములను నయీమ్ తక్కువ ధరలకే లాక్కున్నాడంటూ 204 మంది సిట్‌కు ఫిర్యాదు చేశారు. అయితే 10–15 ఏళ్ల కింద జరిగిన భూకబ్జాల్లో ఆధారాలు ఏ విధంగా సేకరించాలనేది సవాలుగా మారింది. పైగా బాధితులు స్వయంగా సంతకాలు పెట్టారు, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో, పహా ణీల్లో పక్కాగా నమోద య్యాయి. బాధితుల వాంగ్మూలం తప్ప అద నపు ఆధారాలేవీ లభించ లేదు. ఈ వ్యవహారాల్లో చార్జిషీట్ దాఖలు చేశాక కోర్టులో జరిగే వాదోప వాదాలపై ఆధారపడి జప్తు ఆదేశాలు వెలువడ తాయి. కానీ చార్జిషీట్ వేసేందుకు నయీమ్ ఇంట్లో దొరికిన అకౌంట్ బుక్, బాధితుల వాంగ్మూలం సరిపోతాయా? కోర్టులో ఇవి నిలబడతాయా? అన్నది సందేహంగా మారింది. ఇక నయీమ్ ఈ 1,130 ఎకరాల భూములను తన అనుచరులు, బంధు వులు, అధికారులు, రాజకీయ నాయకుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. వారంతా ఆయా భూముల కొనుగోలుకు సరిపడా ఆదాయ మార్గాలు చూపిస్తే.. వాటి జప్తు సులభం కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు గట్టి ఆధారాలున్న 300 ఎకరా లను మాత్రమే జప్తుకు గానీ, బాధితులకు అందించేందుకు గానీ వీలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇళ్ల విషయంలోనూ..! తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో 24 ఇళ్లను నయీమ్ నగదు చెల్లించి కొనుగోలు చేసినట్టు సంబంధిత ఇళ్ల పాత యజమానులు పోలీసు విచారణలో వెల్లడించారు. ఆ ఇళ్ల కేసుల్లోనూ జప్తు సులభం కాదని న్యాయ నిపుణులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఇళ్లు పోలీసుల స్వాధీనంలో ఉన్నాయి. కానీ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషనై ఉందో ఆ వ్యక్తి కోర్టు నుంచి సీజర్ రిలీఫ్ పిటిషన్ ద్వారా ఆ ఇళ్లను పొందేందుకు మార్గం ఉందని వెల్లడించినట్లు సమాచారం. అయితే ఎలాంటి చట్టపరమైన ఆదాయ మార్గాలు లేని నయీమ్ కోట్ల విలువచేసే 24 ఇళ్లను కొనుగోలు చేయడంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. యజమానులుగా చలా మణీలో ఉన్న వ్యక్తులు ఐటీ శాఖకు కట్టాల్సిన జరి మానా కట్టేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని.. ఆదాయ మార్గాలు, వనరులు చూపి, పన్ను చెల్లిస్తే సరిపోతుం దని న్యాయ నిపుణులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఐటీ శాఖ వెనక్కి తగ్గిందని చెబుతున్నారు. ఒక చోట అలా.. మరో చోట ఇలా.. నయీమ్ చేసిన భూకబ్జాలకు సంబంధించి తన డైరీలు, ఖాతా బుక్కుల్లో స్పష్టంగా రాసుకున్నాడు. ఈ డైరీలు, అకౌంట్ పుస్తకాల్లో ఉన్న ఆధారాలను చార్జిషీట్లో పేర్కొంటున్న సిట్ వర్గాలు... పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులతో ఆయనకున్న సంబంధాలను ఎందుకు ఉపయోగించుకోవడం లేదన్న అంశాలపై వివాదం చెలరేగుతోంది. నాయకులు, పోలీసులతో నయీమ్ సాగించిన సెటిల్ మెంట్ల కేసులను ఎందుకు ఆధారాలుగా వాడుకోవడం లేదన్నది విమర్శలకు తావిస్తోంది. బలంగా ఉంటేనే ఎన్ఫోర్స్మెంట్కు.. నయీమ్ అక్రమాస్తుల కేసులో పోలీసులు వేసే చార్జిషీట్లో బలమైన ఆధారాలుంటేనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట రేట్ రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చార్జిషీట్లలో మనీ ల్యాండ రింగ్, అసంబద్ధ పెట్టుబడులను స్పష్టమైన ఆధారాలతో చూపించగలిగి తేనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ కేసులను పరిశీలిస్తుందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. -
నయీమ్‌తో సంబంధాలు ఉన్నవారిని శిక్షించండి
కొనపూరి రాములు భార్య కవిత సాక్షి, యాదాద్రి: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలు ఉన్న అసాంఘిక శక్తులకు పదవులను ఇస్తే బంగారు తెలంగాణ కాకుండా బద్మాష్ తెలంగాణ అవుతుందని కొనపూరి రాములు భార్య కొనపూరి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో సాంబశివుడు, కొనపూరి రాములు వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నయీమ్‌తో చేతులు కలిపి అక్రమ వ్యాపారాలు, భూదందాలు చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడం బాధాకరంగా ఉందని ఆమె పరోక్షంగా మంత్రి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ఆరోపణలు చేశారు. బీసీలంతా ఏకమైతే తమకు రాజకీయ ఇబ్బంది ఏర్పడుతుందని కొందరు సభను అడ్డుకోవాలని చూశారన్నారు. నయీమ్‌ను ఎన్కౌంటర్ చేసి ఎంతో మేలు చేశారన్నారు. ఇప్పటికైనా నయీమ్‌తో సంబంధాలు ఉండి బయట తిరుగుతున్న వారిని శిక్షించాలని లేకుంటే మరికొంత మంది నయీమ్‌లు తయారవుతారన్నారు. -
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కుటుంబీకులపై కేసు
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఘట్కేసర్ మండల పరిధిలోని అవుశాపూర్‌కి చెందిన నాగభూషణం వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2006లో నాగభూషణంకి చెందిన సర్వే నంబర్ 10, పార్టు 14లోని 36 గుంటల భూమిని నయీమ్ అత్త తాహేరా బేగం పేరు మీద బలవంతంగా అతని అనుచరులు రిజిస్టర్ చేయించుకున్నారు. నాగభూషణం కుటుంబ సభ్యుల పేర ఉన్న భూమిని సైతం నయీమ్ కోడలు పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ విషయాలపై నాగభూషణం గురువారం పోలీసులను ఆశ్రయించాడు. ప్రాణ భయం ఉండటంతో ఇన్నిరోజులు ఫిర్యాదు చేయలేదని బాధితుడు తెలిపాడు. -
బెయిల్‌పై నయీం అనుచరుడి విడుదల
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు నగేష్ అలియాస్ క్రాంతి శనివారం ఉదయం చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. నయీం ఎన్కౌంటర్ అనంతరం ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మావోయిస్టు నేత కొనపురి రాములు, జడల నాగరాజు, పోచయ్య తదితర హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు. ఇతనిపై 45 కేసులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో దుబ్బాక ఏరియా మావోయిస్టు కమాండర్ గా పనిచేసిన నగేష్ 1996లో పోలీసులకు లొంగిపోయాడు. -
ఏడాదికి నాలుగు డైరీలు
► సోహ్రాబుద్దీన్ కేసు భయంతో పాత డైరీలు తగులబెట్టిన నయీమ్ ► 2010 నుంచి అందుబాటులో ఉన్న 25 డైరీలు ► సునిశితంగా దర్యాప్తు చేస్తున్నామన్న సిట్ అధికారులు సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడి ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీలపై సిట్ అధికారులు కొద్ది రోజులుగా దర్యా ప్తు వేగవంతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచ లనం రేపిన డైరీలు, అకౌంట్ పుస్తకాలపై ఇప్పు డిప్పుడే స్పష్టత వస్తోందని సిట్ అధికా రులు తెలిపారు. ఏటా నాలుగు డైరీలు నయీమ్ రాసే వాడని, వాటితో నాలుగు అకౌంట్ పుస్త కాలు మెయింటెయిన్ చేసేవాడని అతడి భార్య, అను చరులు విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. ఎవరెవరికి ఎంత ఇచ్చిందీ... నయీమ్ 2010 వరకు రాసిన డైరీలను తగులబెట్టినట్టు సిట్ వర్గాలు తెలిపాయి. 2005లో ఎన్కౌంటర్ అయిన సోహ్రాబుద్దీన్ వ్యవహారంలో తన పాత్రపై సీబీఐ దర్యాప్తు చేస్తుండటంతో భయాందోళనకు గురైన నయీమ్ 2010 వరకు రాసుకున్న డైరీలను తగులబెట్టినట్టు అతడి అనుచరులు విచారణలో వెల్లడించినట్టు సిట్ వర్గాలు తెలిపాయి. అయితే 2010 తర్వాత ఏటా నాలుగు డైరీలు మళ్లీ రాశాడని, ఇలా ఓ 25 డైరీలుంటాయని పేర్కొ న్నారు. సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బు, జీతభత్యాలుగా చెల్లించిన ఖర్చు, ఎక్కడెక్కడ ఎవరెవరికీ ఎంత ఇచ్చాడో అన్ని వివరాలను నాలుగు అకౌంట్ బుక్కుల్లో రాసుకునేవాడని చెబుతున్నారు. ఒక డైరీలో సెటిల్మెంట్లు చేసిన తీరు, ఎంత భూమి ఎంత ధరకు కొన్నాడో తదితర వివరాలను రాసుకున్నాడని సిట్ అధికారులు తెలిపారు. మరో డైరీలో సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బులను అధికారులకు, తన అనుచరులకు ఇచ్చిన తేదీలు, ప్రాంతాలను రాసుకున్నాడని, మూడో డైరీలో తనను ఎవరెవరు ఎప్పు డెప్పుడు కలిశారు... ఎందుకు కలిశారన్నది రాసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. నాలుగో డైరీలో తాను చంపాలనుకున్న, చంపిన వారి జాబితా రాసుకున్నాడు. చిన్నన్నతో మరుపురాని అనుభూతి ఈ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ఓ డీఎస్పీతో నయీమ్ దిగిన ఫొటోలు 28 ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఆ డీఎస్పీని చిన్నన్నగా నయీమ్ భావించేవాడు. చిన్నచిన్న ఫంక్షన్లకు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా వీరు ఒకరిళ్లకు ఒకరు తరచూ వచ్చిపోతుండేవారు. ఇలా చిన్నన్న రావడం మరుపురాని అనుభూతి అని నయీమ్ తన డైరీలో తేదీలతో సహా రాసుకున్నట్టు సిట్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు కేసులు, ఆధారాల సేకరణకు సమయం తీసుకున్న సిట్.. లభించిన ఆధారాలను అధ్యయనం చేసి, సంబంధిత అధికారుల దర్యాప్తు కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది. -
నయీమ్ అనుచరుల్లో గుబులు
పీడీయాక్ట్.. నయీమ్ అనుచరుల్లో గుబులు రేపుతోంది. గ్యాంగ్‌స్టర్ కేసు దర్యాప్తును పోలీస్ యంత్రాంగం ముమ్మరం చేయడం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. సిట్‌పై నమ్మకం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండడం.. అదే సమయంలో సీబీఐకి అప్పగించాలనే ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. సాక్షి,యాదాద్రి : గ్యాంగ్‌స్టర్ నయీమ్ ప్రధాన అనుచరులు మరో ఐదుగురిపై రాచకొండ పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. వీరంతా భువనగిరికి చెందినవారే. వీరిలో మున్సిపల్ కౌన్సిలర్ అబ్దుల్ నాసర్, బచ్చు నాగరాజు, కత్తుల జంగయ్య, పులి రాజు, సరిగడ హరిపై పీడీయాక్ట్ నమోదు చేసి అరెస్టు చేశారు. నయీమ్ ఎన్‌కౌంటర్‌కు ముందు గత ఏడాది ముఖ్య అనుచరులైన భువనగిరికి చెందిన పాశం శ్రీను, ఎస్కె షకీల్, భువనగిరి జెడ్పీటీసీ సందెల సుధాకర్‌పై పీడీయాక్ట్ నమోదు అయింది. ఇందులో ఎస్కె షకీల్ గుండెపోటుతో మృతిచెందారు. కాగా మిగతా ఇద్దరు పీడీయాక్ట్‌తో పాటు పలు కేసుల్లో వరంగల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అతని అనుచరులపై సుమారు 174 కేసులు నమోదయ్యాయి. ఇందులో 124 మందిని వివిధ కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానంగా కిడ్నాప్‌లు, బెదిరింపులు, హత్యలు, భూకబ్జాలు, బలవంతపు వసూళ్లు, అక్రమ ఆయుధాలు సరఫరా చేశారనే అభియోగాలతో పోలీసులు పీడీయాక్ట్ ప్రయోగించారు. ప్రతిపక్షాల విమర్శలు.. నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్ వస్తోంది. ఈనేపథ్యంలో ఇటీవల హైకోర్టుకు సిట్ అధికారులు సమర్పించిన నివేదికలో గ్యాంగ్‌స్టర్‌కు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పోలీసు అధికారులతో ఎలాంటి సంబంధాలు లేవని తేల్చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల పలువురు పోలీసు అధికారులు నయీమ్‌తో కలిసి భోజనాలు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో మరోసారి నయీమ్ కేసు రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నయీమ్ కేసు విషయంలో వెనుకడుగు వేసిందన్న విమర్శ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నయీమ్ కేసులో ఎవరిని వదిలిపెట్టమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర పోలీసులు బాగా పనిచేస్తున్నారని నయీమ్ కేసును సీబీఐకి అప్పగించేదిలేదని తేల్చేశారు. నిందితులు వీరే పీడీయాక్ట్ నమోదు అయిన వారిలో అబ్దుల్ నాసర్ టీడీపీ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. పలు కేసుల్లో జైలుకు వెళ్లిన ఆయన జనవరి30న మున్సిపల్ సమావేశానికి హాజరై సంతకం చేసి వెళ్లారు. ఈయన నయీమ్ ముఖ్య అనుచరుల్లో ఒకరిగా చలామణి అయ్యారు. ∙కత్తుల జంగయ్య, పులి నాగరాజు ఇద్దరు నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుకు అనుచరులుగా ఉన్నారు. పాశం శ్రీను చెప్పినట్లుగా వ్యాపారుల వద్దకు వెళ్లి నయీమ్ బెదిరింపులకు డబ్బులు తేవడం, బాధితులకు ఫోన్లు చేసి బెదిరించడం వీరి ప్రధాన వృత్తి. బచ్చు నాగరాజు ఓ సెల్ ఫోన్ షాపును నిర్వహిస్తుంటాడు. నాగరాజు తన షాపుకు వచ్చే వారి వివరాలతో కొత్త సిమ్ కార్డులను తీసుకుని నేరుగా పాశం శ్రీనుకు అందజేస్తాడు. దీంతో అ సీమ్ కార్డులు నేరుగా నయీం వద్దకు వెళ్తాయి. అ సీమ్ కార్డులను అనుచరుల వద్ద ఉంటాయి. ఇందులో భాగంగానే బచ్చు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి జైలుకు పంపారు. సరగడ హరి పట్టణంలోని గంజ్మార్కెట్కు వెళ్లే ఓ ఆలయం వద్ద ఉంటూ పూజలు చేస్తుంటాడు. ప్రధానంగా గంజ్మార్కెట్లో డబ్బులు ఎక్కువగా ఉండే షాపుల యాజమానుల వివరాలు తెలుసుకుని నేరుగా నయీమ్‌కు చేరవేస్తాడని పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. -
పోలీసులకు నయీంతో లింకులు.. ఇవీ ఆధారాలు!
-
పోలీసులకు నయీంతో లింకులు.. ఇవీ ఆధారాలు!
గ్యాంగ్‌స్టర్ నయీం వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన అధికారులు ఎవరికీ అతడితో సంబంధాలు లేవని ఎంత గట్టిగా చెప్పినా.. ప్రతిసారీ ఏదో ఒక ఆధారం బయటపడుతూనే ఉంది. తాజాగా మరోసారి కొంతమంది పోలీసు అధికారులు నయీంతో అంటకాగినట్లు రుజువులు లభించాయి. సీడీఐ డీఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు నయీంతో చర్చలు జరుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. వాళ్లిద్దరూ కలిసి ఓ రెస్టారెంటులో భోజనం చేస్తున్నట్లుగా ఉన్న ఫొటో బయటకు వచ్చింది. ఆయన గతంలో కీలకమైన విభాగాల్లో ఎస్ఐ స్థాయి నుంచి పనిచేశారు. నయీంతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని అంటున్నారు. ఎన్కౌంటర్ జరగడానికి కొంత కాలం ముందు నయీం హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తూ, పోలీసుల సమాచారాన్ని నయీంకు అందజేస్తూ అతడికి రక్షణగా ఉండేవారని ఆరోపణలున్నాయి. నయీంకు సంబంధించిన వ్యక్తుల వివరాలను కూడా పోలీసుశాఖలో తన పలుకుబడి ద్వారా సేకరిస్తూ వాటిని నయీంకు చేరవేసేవారంటున్నారు. మద్దిపాటి శ్రీనివాసరావుపై గతంలో అనేక సందర్భాల్లో ఆరోపణలొచ్చినా, సరైన సాక్ష్యాధారాలు దొరకలేదు. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో ఆధారాలు బయటకు రావడంతో ఇక ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం సీఐడీలోనే ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న మరో వ్యక్తి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. ఆయన గతంలో నల్లగొండ జిల్లాలో పనిచేశారు. ఇంత స్పష్టమైన ఆధారాలు బయటకు రావడంతో మరోసారి నయీం తేనెతుట్టె కదిలినట్లయింది. -
భువనగిరి కోర్టుకు నయీం భార్య, సోదరి
భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీం భార్య, సోదరి భువనగిరి కోర్టులో హాజరయ్యారు. నయూ కేసుకు సంబంధించి వారిని పోలీసులు ఈ రోజు భువనగిరి కోర్టుకు హాజరు పర్చారు. పీటీ వారెంట్‌పై ప్రత్యేక వాహనంలో కోర్టుకు తీసుకొచ్చారు. -
నయీం గ్యాంగ్ పేరుతో బెదిరింపులు..
నిజామాబాద్ : నయీం గ్యాంగ్ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, దర్పల్లి మండలాల పరిధిలో గ్యాంగ్‌స్టర్ నయీం పేరుతో బెదిరింపులకు దిగుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. తమకు బెదిరింపులు వస్తున్నాయని బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
నయీం మీద ఒట్టు..!
-
నయీం కేసులో అవన్నీ అవాస్తవం!
-
అంతా తూచ్!
► నయీమ్‌తో రాజకీయ నాయకులు, పోలీసులెవరికీ సంబంధాల్లేవ్.. ► హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి ► నయీమ్ ద్వారా వారు ఎటువంటి లబ్ధీ పొందలేదు ► మావోయిస్టులు, దావూద్‌తో సంబంధాలున్నట్లూ ఆధారాల్లేవ్ ► మాజీ డీజీపీ, మాజీ మంత్రిపై ఆరోపణలూ అవాస్తవం ► ఈ కేసు దర్యాప్తు సంతృప్తికరంగా సాగుతోంది ► 167 కేసులు పెట్టి.. 116 మందిని అరెస్టు చేశాం ► 848 మంది సాక్ష్యాలు నమోదు చేశాం ► రాజకీయ ప్రయోజనాలు, ప్రచారం కోసమే పిల్ ► భారీ జరిమానాతో దీనిని కొట్టివేయండి ► హైకోర్టులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కౌంటర్ ► ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని నివేదన సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ కేసు తేలిపోయింది. అతనితో రాజకీయ నాయకులకు గానీ, పోలీసులకు గానీ ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. నయీమ్ ద్వారా నేతలు, పోలీసులు లబ్ధి పొందారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, అందుకు ఎటువంటి ఆధారాలూ లేవని... ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరమూ లేదని హైకోర్టుకు వివరించింది. మావోయిస్టుల కదలికలను తెలుసుకునేందుకు పోలీసులు నయీమ్‌ను వాడుకున్నారన్న దాంట్లోనూ వాస్తవం లేదంది. నయీమ్‌కు మావోలతో గానీ, దావూద్ ఇబ్రహీంతో గానీ సంబంధాలు ఉన్నాయనేందుకూ ఆధారాలు లభించలేదని తెలిపింది. నయీమ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో హైకోర్టులో పిల్ వేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు నారాయణ తెలంగాణలో అధికార పార్టీకి రాజకీయ ప్రత్యర్థి అని... రాజకీయ ప్రయోజనాలు ఆశించి, ప్రచారం కోసమే ఈ పిల్ దాఖలు చేశారని నివేదించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యాజ్యాన్ని భారీ జరిమానాతో కొట్టివేయాలని కోరింది. పిల్ వేసిన నారాయణ నయీమ్ ఎన్కౌంటర్ తరువాత అతని దురాగతాలు వెల్లడైన నేపథ్యంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. దానిపై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాల మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీ గురువారం కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్లో త్రివేది పేర్కొన్న ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.. లొంగిపొమ్మని చెప్పినా వినలేదు నయీమ్ డబ్బు కోసం తనను బెదిరిస్తున్నారంటూ నిజామాబాద్ జిల్లా దాచేపల్లి మండలం అమృతపూర్కు చెందిన కురపాటి గంగాధర్ అనే వ్యక్తి దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో నయీమ్ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం కాలనీలో నివసిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో 8.8.2016న పోలీసులు మిలీనియం కాలనీకి వెళ్లగా.. నయీమ్, అతని డ్రైవర్ కాలనీలోని ప్రవేశిస్తున్నారు. పోలీసులను చూసిన నయీమ్ కాల్పులు ప్రారంభించి, తప్పించుకునే ప్రయత్నం చేశాడు. లొంగిపోవాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వొద్దంటూ పోలీసులు వారిని హెచ్చరించారు. అయినా వారు పోలీసులపై ఏకే 47 తుపాకీలో కాల్పులు జరుపుతూనే ఉండడంతో.. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు ప్రారంభించారు. దీంతో నయీమ్ అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటనపై షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కూకట్పల్లి ఏసీపీకి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. మిలీనియం కాలనీలోని నయీమ్ డెన్‌పై పోలీసులు దాడులు చేసి రివాల్వర్లు, స్టెన్ గన్, రెండు ఏకే 47 తుపాకులు, 17 సెల్ఫోన్లు, రెండు కార్లు, ఒక స్కూటీ, రూ.3.74 లక్షల నగదు, 5.5 తులాల బంగారు ఆభరణాలు, వ్యవసాయ భూములు, ఇళ్ల ప్లాట్లకు సంబంధించి పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 167 కేసులు.. 848 మంది సాక్షులు.. పోలీసులు నయీమ్ సోదరి సలీమా బేగం, భార్య హసీనా, బంధువులు మాతేన్, కలీమాలను డెన్ వద్దే అరెస్ట్ చేశారు. రాష్ట్ర డీజీపీ 10.8.16న ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. నార్త్‌జోన్ ఐజీపీ వై.నాగిరెడ్డిని సిట్‌కు ఇన్చార్జిగా నియమించారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా భువనగిరి, మిర్యాలగూడ, వనస్థలిపురం, నార్సింగి, కోరుట్ల, కరీంనగర్ తదితర చోట్ల దాడులు నిర్వహించి.. పిస్టళ్లు, రివాల్వర్లు, ఆస్తి డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పలు చోట్ల దాడులు చేసి నయీమ్ కుటుంబ సభ్యుల పేరు మీద పలు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం దర్యాప్తు మరింత పకడ్బందీగా, సమర్థవంతంగా జరిగేందుకు వీలుగా దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలను అదనపు డీజీ అంజనీ కుమార్‌కు డీజీపీ అప్పగించారు. దీంతో ఆయన నాలుగు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ వ్యవహారంలో 167 కేసులు నమోదు చేశారు, 8 పాత కేసులను మళ్లీ తెరిచారు. ఇందులో 10 కేసులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో, 135 కేసులు రాచకొండ కమిషనరేట్, 2 కేసులు సిద్దిపేట కమిషనరేట్, 3 కేసులు కరీంనగర్ కమిషనరేట్, 2 కేసులు వరంగల్ కమిషనరేట్, 2 కేసులు జగిత్యాల జిల్లా, ఒక కేసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఒక కేసు మెదక్ జిల్లాకు సంబంధించినవి. అన్ని కేసుల్లో 116 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 8 మంది నిందితులు సంబంధిత కోర్టుల ముందు లొంగిపోయారు. దర్యాప్తు నిమిత్తం 103 మంది నిందితులను పోలీసు కస్టడీకి తీసుకోవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా 848 మంది సాక్షులను విచారించి, వాంగ్మూలాలను నమోదు చేశారు. మరో 217 మంది సాక్షులను విచారించాల్సి ఉంది. 16 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. మిగతా కేసుల్లో చార్జిషీట్ దాఖలు ప్రక్రియ తుది దశలో ఉంది. పిటిషనర్వన్నీ నిరాధార ఆరోపణలు నయీమ్, అతడి బంధువులు, బినామీలు రాష్ట్రంలో పలు ప్రదేశాల్లో ఆస్తులు కలిగినట్లు తేలింది. రాష్ట్రం వెలుపల నుంచి ఎటువంటి ఫిర్యాదులూ రాలేదు. రాష్ట్రం వెలుపల నయీమ్, అతని అనుచరులు ఆశ్రయం పొందేందుకు కొన్ని ఇళ్లను కలిగి ఉన్నట్లు తేలింది. నయీమ్‌కు నక్సలైట్లతో సంబంధమున్నట్లు ఇప్పటి వరకు ఎటువంటి సాక్ష్యాలు లభించలేదు. దావూద్ ఇబ్రహీంతో నయీమ్ మాట్లాడారనే విషయంలో ఎటువంటి సమాచారం లేదు. ఆధారాలు లభిస్తే సిట్ తగిన చర్యలు తీసుకుంటుంది. నయీమ్ సేవలను పోలీసులు వాడుకోవడంగానీ, అతనితో కుమ్మక్కు కావడంగానీ జరగలేదు. ఈ విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాం. నయీమ్ ద్వారా పోలీసు అధికారులు లబ్ధి పొందారన్న ఆరోపణలు నిరాధారమైనవి. సోహ్రబుద్దీన్ కేసులో కూడా నయీమ్ సీబీఐ వాటెండ్ జాబితాలో ఉన్నారని చెబుతున్న పిటిషనర్.. అందుకు ఎటువంటి ఆధారాలను చూపలేదు. అలాగే నక్సలైట్ల కదలికలపై సమాచారం తెలిపే నిమిత్తం నయీమ్‌కు ప్రభుత్వం రూ.25 లక్షలు చెల్లించదన్న ఆరోపణలకు సైతం ఆధారాలను చూపడం లేదు. ఆధారాలు లేని ఆ ఆరోపణలను ఖండిస్తున్నాం. గతంలో నయీమ్‌ను అనేక కేసుల్లో అరెస్టు చేశారు. తరువాత బెయిల్‌పై విడుదలయ్యాడు. రాజకీయ నేతలతో సంబంధాల్లేవ్! నయీమ్‌తో సంబంధమున్న పోలీసులను, రాజకీయ నాయకులను కాపాడేందుకు సిట్ కంటి తుడుపుగా దర్యాప్తు చేస్తోందన్న పిటిషనర్ ఆరోపణ పూర్తిగా నిరాధారం. నయీమ్ బాధితులుగా చెప్పుకొంటూ ఇప్పటికీ అనేక మంది సిట్ ముందుకు వస్తున్నారు. ప్రతీ ఆరోపణపై సిట్ సమగ్రంగా దర్యాప్తు చేస్తోంది, ప్రతి సాక్ష్యాన్ని నమోదు చేస్తోంది. నయీమ్‌కు ఏపీ, గోవా, ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు, ఏజెంట్లు ఉన్న ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఏపీ, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కొన్ని ఇళ్లను గుర్తించాం. కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు నయీమ్ సేవలను ఉపయోగించుకుని ఆర్థిక ప్రయోజనాలు పొందారన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదు. ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ, మాజీ మంత్రిపై పిటిషనర్ చేసిన ఆరోపణలు కేవలం ఊహాజనితమైనవే. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సాక్ష్యం లభించలేదు. తదుపరి దర్యాప్తులో ఏవైనా ఆధారాలు లభిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. నయీమ్ కొందరు చిన్నారులను తన రక్షణ కవచాలుగా, లైంగిక కార్యకలాపాలకు వాడుకున్నారనేందుకు కొన్ని ఆధారాలు లభించాయి. షాద్‌నగర్, నర్సింగిల్లోని నయీమ్ డెన్ల నుంచి ఆరుగురు మైనర్లను రక్షించి, వారిని రక్షిత గృహాలకు పంపాం. నయీమ్ తమను ఏ విధంగా లైంగికంగా వాడుకున్నాడో ఆ చిన్నారులు వివరించగా.. వాంగ్మూలంగా నమోదు చేశాం. నయీమ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు రచించారనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. పోలీసు అధికారి కేఎస్ వ్యాస్ హత్యకు ప్రయత్నించినందుకు నయీమ్‌ను గతంలో అరెస్టు చేశాం. దర్యాప్తు సంతృప్తికరంగా సాగుతోంది పోలీసులు దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, అదనపు ఎస్పీ (రిటైర్డ్) సీహెచ్.రవీందర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ సీతారామ్, ఇన్స్పెక్టర్ బి.కిషన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాస్‌నాయుడు, హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ జె.నరేందర్‌గౌడ్, గోపాలపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహ్మద్ మాజీద్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బలవంతయ్య, మలక్‌పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.వెంకట్‌రెడ్డి, నల్లగొండ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఈ.రవీందర్, ఏసీబీ కరీంనగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులకు నోటీసులు జారీ చేసి నయీమ్‌తో సంబంధాలపై విచారించడం జరిగింది. ప్రజల్లో విశ్వాసం కలిగించేలా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పిటిషనర్ రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సినంత ప్రత్యేక పరిస్థితులేవీ లేవు. సీబీఐకి ఎందుకు అప్పగించాలో వివరించేందుకు పిటిషనర్ తగిన ఆధారాలను సమర్పించలేదు. పోలీసులు నిష్పాక్షికంగా, వేగవంతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
నయీం కేసులో కీలక పరిణామం
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాలకు సంబంధించిన కేసులో కీలక పరిణామాం చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ చెబుతూ వస్తున్నట్లుగా నయీంకు రాజకీయ నాయకులతోగానీ, పోలీసు అధికారులతోగానీ సంబంధాలు లేనేలేవని సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. గురువారం హైకోర్టులో దాఖలుచేసిన కౌంటర్ పిటిషన్లో తెలంగాణ హోం శాఖ పలు సంచలన విషయాలను ప్రస్తావించింది. నయీం కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతూ సీపీఐ నేత నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌కు కౌంటర్‌గా ప్రభుత్వం ఈ కౌంటర్ పిటిషన్ వేసింది. (నయీం కేసుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..) 'రాజకీయ నాయకులతో, పోలీసులు అధికారులతో నయీంకు ఎలాంటి సంబంధాలు లేవు. ఒక మాజీ డీజీపీ నయీంకు సహకరించారనే ఆరోపణలు కూడా అవాస్తవం. అంతర్జాతీయ ఉగ్రవాది, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో నయీంకు సంబంధాలున్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవు'అని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. నయీం కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందమే(సిట్) పర్యవేక్షిస్తుందని, దర్యాప్తును సీబీఐకి అప్పగించే ఆలోచన లేనేలేదని స్పష్టం చేసింది. గ్యాంగ్‌స్టర్ నయీం కేసుపై సీపీఐ నేత నారాయణ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. విచారణ నివేదిక సమర్పించటంతో పాటు, కౌంటర్ దాఖలు చేయాలని మూడు వారాల కిందట తెలంగాణ హోం శాఖను ఆదేశించించింది. గురువారంతో గడువు ముగియనుండటంతో హోంశాఖ ఈ మేరకు కౌంటర్ దాఖలుచేసింది. -
నయీం అనుచరుడి అనుమానాస్పద మృతి
-
నయీం అనుచరుడి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం ముఖ్య అనుచరుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నయీం ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్న టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యుడు పుల్లరి మహేష్ అలియాస్ ప్రసాద్ బుధవారం సిద్దిపేటలోని ఓ ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో విగతజీవిగా కనిపించాడు. మహేష్ కోసం కొన్ని రోజులుగా సిట్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నాలుగు నెలలుగా పోలీసుల కంటపడకుండా తిరుగుతున్నాడు. ఆరు హత్య కేసుల్లో ఇతను నిందితుడిగా ఉన్నాడు. నయీంతో కలసి పలు భూ దందాల్లో పాల్గొనట్లు తెలుస్తోంది. అనూహ్యంగా ఇతను మృతిచెందడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహేషే ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా అతన్ని హతమార్చారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నయీం గ్యాంగ్‌లో కీలక సభ్యుడు సామా సంజీవరెడ్డిని అరెస్టు చేసిన రోజే మరో అనుచరుడైన మహేష్ అనుమానాస్పదంగా మృతి చెందడం అనుమానాలకు దారితీస్తోంది. -
పోలీస్‌కస్టడీకి నయీం భార్య, కోడలు
మిర్యాలగూడ: ఎన్కౌంటర్లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నయీం భార్య హసీనా, కోడలు సాజిద్ షాహీన్‌లకు ఈ నెల 17 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ ఇద్దర్ని పోలీసులు శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కోర్టుకు హాజరు పర్చగా.. న్యాయస్థానం వీరికి ఈ నెల 17 వరకు పోలీస్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
నయీం కేసులో తొలి పొలిటికల్ వికెట్!
-
నయీం కేసులో తొలి పొలిటికల్ వికెట్!
హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో కీలక పరిణామాలకు రంగం సిద్ధమవుతున్నది. గ్యాంగ్‌స్టర్ నయీంతో అంటకాగి.. అతని అక్రమాల్లో భాగమైన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులపై వేటు వేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలి పొలిటికల్ వికెట్ దీపావళి తర్వాత పడనుందని అత్యంత విశ్వనీసయ సమాచారం. నయీంతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగొండ టీఆర్ఎస్ నేత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావుపై మొట్టమొదటగా వేటు పడనుందని తెలుస్తోంది. ఆయనను పదవీ నుంచి తప్పించాలని టీఆర్ఎస్ అధిష్ఠాన వర్గం నిర్ణయించింది. దీపావళి పండుగ ముగిసిన వెంటనే నేతి విద్యాసాగర్‌రావు స్వచ్ఛందంగా మండలి డిప్యూటీ చైర్మన్ పదవి నుంచి దిగిపోనున్నారని సమాచారం. నవంబర్ 2న ఆయన రాజీనామా చేస్తారని, అనంతరం నవంబర్ 5న ఆయన స్థానంలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు నారదాసు లక్ష్మణరావు డిప్యూటీ చైర్మన్‌గా పగ్గాలు చేపడుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరింతమంది నాయకులపైనా వేటు! అండర్ వరల్డ్ నేరసామ్రాజ్యాన్ని స్థాపించి సామాన్యులను గడగడలాడించిన నయీంతో అనేకమంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు అంటకాగినట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నయీంతో సంబంధాలున్న పలువురు నాయకులు, పోలీసు అధికారుల పేర్లు బయటకు వచ్చాయి. అంతేకాకుండా నయీం కేసు విచారిస్తున్న సిట్ కూడా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో నేతి విద్యాసాగర్ రావును పేరును ప్రస్తావించింది. ఆయనకు నయీంతో సంబంధాలు ఉన్నాయని పలువురు బాధితులు సిట్ ముందు వెల్లడించారు. అంతేకాకుండా నయీం బంధువులు కూడా నేతి సాయంతో తాము సెటిల్మెంట్లు చేసినట్టు వెల్లడించారని సమాచారం. నేతి విద్యాసాగర్‌రావుపై వేటు నేపథ్యంలో ఇతర రాజకీయ నాయకులపైనా చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నయీం కేసులో తాము పారదర్శకంగా వ్యవహరిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తూ వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు పలువురిపైనా చర్యలు తప్పవని వినిపిస్తోంది. దీంతో నయీంతో సంబంధం ఉన్న టీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల నేతల్లోనూ గుబులు మొదలైంది. -
’ఎదుర్కోలేక నాపై బురద జల్లుతున్నారు’
-మాజీ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్: ఏ ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..గ్యాంగ్‌స్టర్ నయీంతో నాకు సంబంధాలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రజల తరపున ప్రశ్నిస్తున్నందుకే నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. నాపై ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే పుట్ట మధు.. నయీం కేసును సీబీఐకి అప్పగించేలా సీఎం కేసీఆర్ ను కోరాలన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సీబీఐ విచారణ జరగాలన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాగా గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో శ్రీధర్‌బాబుకు సంబంధాలు ఉన్నాయని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ కోసం సీఎం కేసీఆర్, డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్యకేసులో సంబంధాలు ఉన్న వ్యక్తులను హతమార్చేందుకు శ్రీధర్‌బాబు నయీమ్‌తో దోస్తీ చేసినట్లు ఆరోపణలున్నాయని అన్నారు. తాను ఎమ్మెల్యే కాక ముందు హత్యకు కుట్ర జరిగిందని పుట్ట మధు ఆరోపించారు. -
నయీం వార్తలు చదివి..
- వ్యాపారులకు బెదిరింపులు కల్వకుర్తి: ఈజీ మనికోసం ఓ యువకుడు గ్యాంగ్ స్టర్ నయూం ను ఆదర్శంగా తీసుకున్నాడు. ఇటీవల పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీంకు సంబంధించిన వార్తలు చదివి అదే స్థాయిలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. అనుకున్న వెంటనే పలువురు వ్యాపారులను డబ్బు ఇవ్వాలని బెదిరించాడు. ప్రసారమాధ్యమాల్లో నయీం ప్రధాన అనుచరుడిగా వినిపించిన శేషన్న పేరును వ్యాపారులను బెదిరించడానికి ఉపయోగించుకున్నాడు. వివరాలు.. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం గురజాలకు చెందిన సతీష్ సులభంగా డబ్బు సంపాదించడం కోసం చెడు మార్గాన్ని ఎంచుకున్నాడు. నయీం అనుచరుడు శేషన్న పేరుతో మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు వ్యాపారులను బెదిరించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పక్కా ఆధారాలతో రంగంలోకి దిగిన కల్వకుర్తి పోలీసులు గురువారం నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నయీమ్‌ను పెంచి పోషించింది బాబే
-
నయీమ్ పేర ఎమ్మెల్యే దందా!
-
నయీమ్ పేర ఎమ్మెల్యే దందా!
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను అడ్డం పెట్టుకుని దందాలు నడిపిన వారి పేర్లు ఒక్కొక్కటే బయటికొస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు నయీమ్ పేరు చెప్పి తమను బెదిరించినట్లు పలువురు బాధితులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ ఎమ్మెల్యే తెరవెనుకే కథంతా నడిపారని సమాచారం. నయీమ్ ప్రధాన అనుచరునిగా పోలీసులు భావిస్తున్న శేషన్న, నయీమ్ బంధువు ఖలీమ్లను అడ్డంపెట్టుకుని ఆయన ఈ వ్యవహారాలన్నీ నడిపినట్లు చెబుతున్నారు. పైగా తన నియోజకవర్గంలోనే గాక నల్లగొండ చుట్టుపక్కల భూ లావాదేవీల్లోనూ వేలు పెట్టినట్టు ఫిర్యాదులున్నాయి. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత శేషన్న, ఖలీమ్ అజ్ఞాతంలో ఉండిపోయారు. వీరిని పట్టుకునేందుకు సిట్ వేట కొనసాగిస్తోంది. వీరిలో ఏ ఒక్కరు పోలీసులకు చిక్కినా సదరు ఎమ్మెల్యే బండారం బయటపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనపై నేరుగా సీఎంకే ఫిర్యాదులందాయని, నిజానిజాలను విచారించి తనకు నివేదిక అందివ్వాల్సిందిగా సిట్ అధికారులను ఆదేశించారని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే విచారణ ప్రారంభించిందని, దీనిపై క్షేత్రస్థాయి విచారణ జరపాల్సిందిగా నల్లగొండ ఎస్పీకి సూచించిందని చెబుతున్నారు. దాంతో ఎస్పీ ఆదేశాల మేరకు సంస్థాన్ నారాయణపురం ఎస్సై విచారణ కోసం రంగంలోకి దిగారని చెబుతున్నారు. ఆరోపణలివీ... విశ్వసనీయ సమాచారం మేరకు... నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో గ్రామ కంఠం భూములను (వీటినిక్కడ కందకాల భూములని కూడా అంటారు) ఆ ఎమ్మెల్యే మనుషులు ఆక్రమించారని కొందరు బాధితులు సిట్‌కు ఫిర్యాదు చేశారు. ఖలీమ్ ఇప్పటికే ఒక మహిళ పేర ఆ భూమిని రిజిస్టర్ చేయిం చాడు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం పరిసరాల్లోనూ ముంబైకి ఓ వ్యక్తి తాలూకు భూమికి అడ్వాన్సు చెల్లించి సొంతం చేసుకున్నారని, తర్వాత మిగతా మొత్తం అడిగితే నయీమ్ పేరు చెప్పి శేషన్న, ఖలీమ్ బెదిరించారని అంటున్నారు. చౌటుప్పల్, తంగడపల్లి, తాళ్లసింగా రం, లింగోజిగూడెం, పంతంగి తదితర గ్రామాల పరిధిలో ‘గోల్డెన్ ఫారెస్ట్’ అనే సంస్థకు సుమారు 1,300 ఎకరాల దాకా ఉంది. వీటిలో రియల్ ఎస్టేట్ వెంచర్లూ ఉన్నాయి. వీటిలోని వివాదాస్పద భూముల్లో ఈ గ్యాంగ్ తలదూర్చి సుమారు రూ.50 లక్షల దాకా బలవంతంగా వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అతని బాధితులు వందలాదిగా బయటికొస్తుండటం, దాదాపు అన్ని పార్టీల నేతలకూ గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటోంది. నిక్కచ్చిగా వ్యవహరించాలని సిట్ అధికారులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. -
నయీమ్ భూకబ్జా కేసు మళ్లీ వాయిదా
భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ భూకబ్జా కేసును భువనగిరి ఆర్డీఓ వచ్చేనెల 19వ తేదీకి వాయిదా వేశారు. భువనగిరి మండలంలోని బొమ్మాయిపల్లిలోని సర్వే నంబర్ 722, 723, 724తో పాటు 733 వరకు ఉన్న భూమిపై నమోదైన భూ కబ్జా కేసు వివాదంపై ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి శనివారం తన కార్యాలయంలో విచారణ చేపట్టారు. పట్టాదారులైన లక్ష్మీనరసింహనగర్ కాలనీ అసోసియేషన్‌కు చెందిన 200 మంది సభ్యులు విచారణకు హాజరై తమకు తమ ప్లాట్లను ఇప్పించాలని ఆర్డీఓను కోరారు. ఈ మేరకు 2003-04 సంవత్సరంలో హక్కుదారుగా ఉన్న లక్ష్మీనరసింహనగర్ కాలనీ వారినే పట్టదారులుగా చేర్చుతూ ఆర్డీఓ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమకు ప్లాట్లు ఇప్పించాలని కాలనీ వాసులు ఆర్డీఓను కోరగా తదుపరి విచారణ జరిగే సమయానికి సంబంధిత ప్లాట్లు, భూములపై తమకు ఉన్న హక్కులను, వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తే వారికి ప్లాట్లను ఇప్పిస్తామని ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు వాయిదాలు జరిగాయి. మొదటిసారి జూలైలో, రెండోసారి ఆగస్టులో, మూడోసారి సెప్టెంబర్ నెలలో 3న విచారణ, నాలుగోసారి అక్టోబర్ 1న విచారణ జరగగా మళ్లీ నవంబర్ 19కి వాయిదా పడినట్లు చెప్పారు. ఈ విచారణ కార్యక్రమంలో తహసీల్దార్ కె. వెంకట్‌రెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి పులికంటి నరేష్, యాకుబ్, కాశీశ్వర్, రాజేందర్, మల్లేష్, శ్యాంసుందర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
నయీం కేసులో వేగం పెంచిన సిట్
*నయాం ‘సన్నిహిత నేతల’కు ఆయుధ లెసైన్స్‌లు రద్దు హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయాం కేసును విచారిస్తున్న ‘సిట్’ పోలీసులు వేగం పెంచారు. దీనిలో భాగంగానే అధికార టీఆర్ఎస్తో పాటు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు ఉన్న లెసైన్సుడ్ ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పలువురు నాయకులకు నోటీసులు జారీ చేశారని, కొందరు నేతల ఆయుధ లెసైన్సులు కూడా రద్దు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరితో పాటు నయీమ్‌తో సత్సంబంధాలు నెరిపిన పోలీసు అధికారుల్లో ఎనిమిది మందికి మెమోలు ఇచ్చినట్లు సమాచారం. తమ సర్వీసు రివాల్వర్లను సరెండర్ చేయాలని ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలను ఆదేశించినట్లు తెలిసింది. నేతలకు త్వరలో నోటీసులు? నయాం ఎన్కౌంటర్ తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలు అన్నీ సంచలనాత్మకంగానే ఉన్నాయి. రెండు దశాబ్ధాలుగా అటు అధికారంలో ఉన్న పార్టీల నేతలతో, ఇటు పోలీసు అధికారులతో విడదీయలేని సంబంధాలున్న నయాం పాల్పడిన అరాచకాల్లో వీరికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఒక వైపు ఆయా జిల్లాల్లో పోలీసు కేసులు నమోదు అవుతుండగా వారిలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారూ ఉంటున్నారు. అధికార, విపక్ష పార్టీలన్న తేడా లేకుండా కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ పోలీసు బాసులు ఇలా అందరికీ సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయా నాయకులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ముందుగా ఆయా నేతలకు ఉన్న వ్యక్తిగత లెసైన్సు ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సిట్ నుంచి ఆయా జిల్లాల ఎస్పీలకు సమాచారం ఇవ్వడంతో, ఎస్పీలు సైతం కలెక్టర్లకు పరిస్థితిని విన్నవించారని చెబుతున్నారు. ఇప్పటికే కొందరు కలెక్టర్లు తమ పరిధిలో ఉన్న ఆయుధ లెసైన్సులను రద్దు చేశారని సమాచారం. కేసులు ఎలా ఎదుర్కొందాం ! నయాంతో సంబంధాలు ఉన్నాయని ప్రచారమైన నేతలు కొందరు ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో కూడా మార్గాలు అన్వేషిస్తున్నారు. ఒక వేళ అరెస్టు అయితే పరిస్తితి ఏమీటి..? కేసును ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాల్లో స్పష్టత కోసం ఇప్పటికే కొందరు నేతలు సీనియర్ న్యాయవాదులను కూడా సంప్రదించారని తెలిసింది. వీరిలో కొందరు సుప్రీం కోర్టు న్యాయవాదుల సలహా కూడా తీసుకున్నారని చెబుతున్నారు. అధికారిక పదవుల్లో ఉన్న నేతలే కాకుండా, ఆయా పార్టీలకు చెందిన నాయకులూ ఉన్నారు. ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే పోలీసు అధికారులకు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో తమపై కేసులు తప్పవన్న అభిప్రాయానికి నేతలు వస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు పోలీసుల నుంచి తమకు నోటీసులు అందేలోపే.. తమ పదవులకు రాజీనామా చేసి, సిట్ విచారణను స్వాగతిస్తున్నామని, విచారణ తర్వాత నిర్దోషులుగా తాము బయటకు వస్తామని మీడియా ఎదుట ప్రకటించాలన్న నిర్ణయానికి కూడా వచ్చారని చెబుతున్నారు. 8 మంది పోలీసు అధికారులకు మెమోలు గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సత్సంబంధాలు నెరిపిన పోలీసు అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. దశాబ్ద కాలంగా నయీంతో సెటిల్మెంట్లు జరిపిన అధికారులకు సంబంధించి బలమైన ఆధారాలు వెలుగు చూడటంతో వారిపై చర్యలకు రంగం సిద్ధమైంది. సిట్ దర్యాప్తులో ఇప్పటికే 21 మంది పోలీసు అధికారులు నయీంతో లావాదేవీలు కొనసాగించినట్లు ఆధారాలు బయటపడ్డాయి. పలు హత్య కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తి, అదీ తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తితో అత్యంత సన్నిహితంగా మెలగడం పట్ల పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. దానికి అనుగుణంగా మొదటి విడతలో 8మంది అధికారులకు మెమోలు జారీ చేసినట్లు సమాచారం. వీరు వెంటనే సర్వీసు రివ్వాలర్లు పోలీసు ప్రధాన కార్యాలయంలో అప్పగించాలని ఆదేశించింది. వీరిలో ఇద్దరు అదనపు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఉన్నట్లు సమాచారం. త్వరలో మరో 13 మందికి మెమోలు ఇచ్చి వారి నుంచి కూడా సర్వీసు రివాల్వర్లు స్వాధీనం చేసుకోవాలని పోలీసుశాఖ యోచిస్తోంది. వీరందరూ గ్యాంగ్‌స్టర్‌తో అత్యంత సన్నిహితంగా మెలగడంతో పాటు పెద్ద ఎత్తున లబ్ది పొందినట్లు సిట్‌కు పక్కా ఆధారాలు లభించాయి. నయీంతో పోలీసులు సన్నిహితంగా మెలిగినట్లు అతని డెన్‌లో ఫోటోలు లభించాయి. వీటితో పాటు భారీగా భూలావాదేవీలు జరిపిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. వీటిని రిజిస్ట్రేషన్ల శాఖ కూడా ధ్రువీకరించింది. మునుముందు వీరందరిపై క్రమశిక్షణ చర్యల కింద డిపార్టుమెంట్ నుంచి తొలగించే అవకాశం ఉందని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. -
‘నయీమ్’ కేసును సీబీఐకి అప్పగించాలి
-
మూడు రోజుల్లో తాఖీదులు..
♦ గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో చోటు చేసుకోనున్న కీలక పరిణామాలు ♦ పోలీసు, రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం ♦ బలమైన ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు ♦ నయీమ్ కుడిభుజం శేషన్న ముఖ్య అనుచరుడు ఈశ్వరయ్య అరెస్టు ♦ ఇప్పటి వరకు 130 కేసులు, 93 మంది అరెస్టు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో అంటకాగిన వారి పాపం పండబోతోంది... ఎన్కౌంటర్ జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత కీలక ఘట్టానికి తెరలేవనుంది. ఇప్పటి వరకు నయీమ్ అనుచరుల అరెస్టులకే పరిమితమైన ‘సిట్’... తాజాగా లభించిన కీలక ఆధారాలతో ముందడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గరిష్టంగా మూడు రోజుల్లో కొందరు రాజకీయ నేతలు, పోలీసు అధికారులకు తాఖీదులు ఇవ్వనుంది. సోమవారం జరిగిన కీలక పరిణా మాలు దీన్ని స్పష్టం చేస్తోంది. నయీమ్ అరాచకాలలో పరోక్ష, ప్రత్యక్ష సహకారం అందించిన ‘ముఖ్య’మైన వారికి నోటీసులు ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయించింది. ఈ కార్యాచరణను వడివడిగా పూర్తి చేస్తోంది.ఇప్పటికే ‘సిట్’కు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 21 మంది పోలీసు అధికారులకు చెందిన స్పష్టమైన ఆధారాలు లభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు డీజీపీ అనురాగ్‌శర్మ నివేదికనూ అందజేశారు. భూకబ్జాలు, బెదిరింపుల్లో నయీమ్‌కు ఎవరెవరు ఎలా సహకరించారో వివరించారు. అందుకు మరికొన్ని బలమైన ఆధారాలను కూడా సిట్ సేకరించింది. ఈ మేరకు తొలి విడతలో ఒక ఎమ్మెల్సీ, నలుగురు పోలీసు అధికారులకు నోటీసులు ఇవ్వాలని ‘సిట్’ యోచిస్తోంది. దీనిపై ఆ ఎమ్మెల్సీకి సోమవారం స్పష్టమైన సంకేతాలను పంపారు. రెండు, మూడు రోజుల్లో నోటీసులు ఇవ్వనున్నట్లు, సిద్ధంగా ఉండాలని సూచించారు. అలానే నోటీసులు అందుకోబోతున్న పోలీసు అధికారులకు కూడా సంకేతాలందాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొందరు అదనపు ఎస్పీలకు నాన్‌క్యాడర్ ఎస్పీ హోదా ఇవ్వాలని నిర్ణయించారు. ఆ లిస్టులో అర్హతలున్నా ముగ్గురు ఏఎస్పీలను... కేవలం నయీమ్ కేసుల నేపథ్యంలో పక్కన పెట్టారు. కనుక వారికీ నోటీసులిచ్చి విచారించాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా మరికొన్ని ఆధారాలు నయీమ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన రాజకీయ నేతలు, పోలీసులకు చెందిన మరికొన్ని బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. ఇది వరకే కొన్ని ఫొటోలు వెలువడగా... తాజాగా భూ లావాదేవీల లింకులు, కొన్ని పత్రాలు బయటపడ్డాయి. కొందరు బాధితులిచ్చిన ఫిర్యాదులతో పాటు తదుపరి కస్టడీలో భాగంగా నిందితులు చెప్పిన వివరాలపై దర్యాప్తు చేయగా అవి వెలుగు చూశాయి. ఇటీవల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అందజేసిన వివరాలూ వాటిని రూఢీ చేశాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, వారికి చెందిన వ్యక్తుల భూ బాగోతాలను రిజిస్ట్రేషన్లశాఖ అందజేసింది. నేతలు, అధికారులు తమ కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల పేరిట ఈ లావాదేవీలు జరిపినట్లు తేలింది. వీటి ఆధారంగా సిట్ ఉచ్చుబిగిస్తోంది. శేషన్న ముఖ్య అనుచరుడి అరెస్టు.. నయీమ్ కుడి భుజంగా పేరొందిన శేషన్న ముఖ్య అనుచరుడు ఈశ్వరయ్యను సిట్ సోమవారం అరెస్టు చేసింది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఈశ్వరయ్యను 15రోజుల క్రితమే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఈశ్వరయ్య ఇంటి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. ఇతని ద్వారా తప్పించుకొని తిరుగుతున్న శేషన్న వివరాలు రాబట్టినట్లు తెలిసింది. నయీమ్ డెన్ల వివరాలను కూడా రాబట్టినట్లు సమాచారం. ఇలా ఇప్పటి వరకు నయీమ్ ముఠాపై రాష్ట్ర వ్యాప్తంగా 130కేసులు నమోదవ్వగా... 93 మంది అరెస్టయ్యారు. -
నయీమ్ కబ్జా ప్లాట్లు చదును చేసిన రియల్టర్
ఘట్కేసర్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కబ్జాలో ఉన్న ప్లాట్లను ఓ రియల్టర్ చదును చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కొద్దిసేపటికే వదిలేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అవుశాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ ప్రకాష్ కథనం ప్రకారం.. గ్రామంలోని సర్వేనంబర్ 14లో ఉన్న పొలం గ్రామానికి చెందిన ఉదారి నాగభూషణం పేరు మీద ఉంది. ఆయన వద్ద కుషారుుగూడకు చెందిన బాపురెడ్డి కొన్నేళ్ల క్రితం జీపీఏ చేసుకున్నాడు. దీంతో పాటు సర్వేనంబర్ 10లో మరికొంత భూమికి సైతం జీపీఏ తీసుకొని 1988లో మొత్తం 14 ఎకరాలతో ఆయన వెంచర్ వేసి, ప్లాట్లను అమ్మేశాడు. అనంతరం గ్రామపెద్దల సహకారంతో రెండోసారి అవే సర్వేనంబర్లలోని 14 ఎకరాల్లో 2004లో వెంచర్ వేశారు. అందులోని 51 ప్లాట్లను నగరానికి చెందిన రియల్టర్ సురేందర్‌రెడ్డి రెండోసారి తక్కువ ధరకు కొన్నాడు. ఈ క్రమంలో నయీమ్ కొంత డబ్బివ్వాలని సురేందర్‌రెడ్డికి హుకుం జారీ చేశాడు. దీంతో రియల్టర్ కొంత నగదుతో పాటు తన 51 ప్లాట్లను నయీమ్‌కు అప్పగిం చాడు. అప్పటి నుంచి సదరు స్థలం వద్దకు ఎవరూ రాలేదు. నయీమ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో మిర్యాలగూడలోని ఓ నివాసంపై సిట్ అధికారులు దాడులు నిర్వహించగా.. అవుశాపూర్‌కు చెందిన ప్లాట్ల డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. దీంతో రియల్టర్ సురేందర్‌రెడ్డి సదరు ప్లాట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తున్నాడు. 4 రోజుల నుంచి చదును చేసి, ప్లాట్ల సరిహద్దు రాళ్లను ఏర్పా టు చేస్తున్నాడు. పంచాయతీ అధికారులు పనులను ఆపాలని కోరినా ఫలితం లేక పోలీ సులను ఆశ్రరుుంచారు. పోలీసులు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకొని పనులను నిలిపివేశారు. కొద్దిసేపటి తర్వాత పనులు ప్రారంభించారు. కాగా రియల్టర్వి 51 ప్లాట్లుంటే 14 ఎకరాల వెంచర్‌ను చదును చేయడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మౌఖిక ఆదేశాలు ఇచ్చారు: సీఐ ప్రకాశ్ వెంచర్‌లోని రియల్టర్ సురేందర్‌రెడ్డి 51 ప్లాట్ల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సిట్ అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని సీఐ ప్రకాశ్ తెలిపారు. -
‘24మందిని హతమార్చిన నయీం’
-
‘24మందిని హతమార్చిన నయీం’
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ అయినా అతడి అరాచకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. నయీం చేతిలో 24మంది హతమారినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. అయితే అందులో నాలుగు మృతదేహాలకు వైద్యులు తప్పుడు పోస్ట్‌మార్టం నివేదికలు ఇచ్చినట్లు తెలిపారు. ఆ వైద్యులకు నోటీసులు జారీ చేశామని, వారిని కూడా విచారణ జరపనున్నట్లు సిట్ అధికారులు సోమవారమిక్కడ పేర్కొన్నారు. అలాగే నయీం కేసులో ఇప్పటివరకూ 99కేసులో నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకూ లభించిన డాక్యుమెంట్లు, కీలక ఆధారాలను నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు. మరోవైపు నయీం కేసులో రాజకీయ, పోలీసుల లింక్‌లపై ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు సిట్ అధికారులు. ఆధారాల సేకరణకు రెండు బృందాలను ఏర్పాటు చేసి, పూర్తి ఆధారాలు లభ్యమైన తర్వాత నోటీసులు అందచేసి విచారణ జరుపుతామని అధికారులు చెబుతున్నారు. ఇక భూకబ్జాలకు సంబంధించి నయీంకు సహకరించిన అధికారుల వివరాల కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీజీకి లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యేలోపు ఈ కేసు దర్యాప్తును సిట్ ముగించనున్నట్లు తెలుస్తోంది. -
'నయీంను పెంచి పోషించింది ప్రభుత్వాలే'
నల్గొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను పెంచి పోషించింది ప్రభుత్వాలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఉన్నాయని, అవే నయీమ్ లాంటి వారిని పెంచి పోషించాయన్నారు. పోలీసులు, మంత్రులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నక్సలైట్లు, మాజీ నక్సలైట్లను చంపేందుకు నయీమ్‌కు ప్రభుత్వాలు డబ్బులిచ్చి ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. డీజీపీ స్థాయి అధికారులు, మంత్రులు నయీమ్‌తో సన్నిహితంగా ఉంటూ అనేక ఆస్తులు సంపాదించుకుని, సాంబశివుడి లాంటి వారిని చంపించారని దుయ్యబట్టారు. నయీమ్ కేసులో ఉన్న పెద్దలు బయటకి రావాలంటే సిట్ ద్వారా కాకుండా.. సీబీఐ ద్వారా విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై బీజేపీ మాట మార్చడం బాధకరమన్నారు. ఆనాడు ప్రత్యేక హోదాపై ఆశలు కల్పించి నేడు ఇలా మాట మార్చడంలో ఆంతర్యమేమిటో తెలపాలన్నారు. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి నాలుకపై నరం లేదని విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మధ్యలో ఉంటూ పోటీ చేస్తానని చెప్పిన పవన్‌కళ్యాణ్ మాటలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులతో చర్చిస్తానని చెప్పడం స్వాగతిస్తున్నామని తెలిపారు. -
నయీం గ్యాంగ్‌పై బాధితురాలి ఫిర్యాదు
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీంపై మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఓ ఫిర్యాదు నమోదైంది. నయీం గ్యాంగ్ తమను బెదిరించి ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకున్నట్లు మేడ్చల్‌కు చెందిన వరలక్ష్మి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు వరలక్ష్మీ వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో వరలక్ష్మికి 8 ఎకరాల పొలం ఉంది. ఈ పొలాన్ని ఆమె భర్త బాలకృష్ణ 2003లో కొనుగోలు చేశాడు. అనారోగ్యంతో బాలకృష్ణ 2009లో చనిపోయాడు. అనంతరం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి మేడ్చల్‌లో ఉంటోంది. అప్పటికే ఈ భూమిపై ఓ కేసు పెండింగ్‌లో ఉండగా... దీనిపై నయీం అనుచరుల కన్ను పడింది. ఎనిమిది నెలల కిందట అంజయ్య అనే వ్యక్తి భువనగిరి రాజు, కృష్ణ అనే న్యాయవాది, మరికొందరు నయీం అనుచరులమని బెదిరించారని వరలక్ష్మీ వాపోయింది. తమ నుంచి ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకుని రూ.50 వేల నగదు చెల్లించి ఆ భూమిని వారికే ఇవ్వాలన్నారని చెప్పింది. ఆ తర్వాత భువనగిరి రాజు వరలక్ష్మి మామయ్యకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని బెదిరించాడని ఆమె తెలిపింది. ఈ విషయంలో తేడా వస్తే తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘నయీమ్ భూముల’కు కంచె
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ చెరలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలాప్రాంతాల్లో నయీమ్ పెద్దఎత్తున స్థలాలను కబ్జాలో పెట్టుకున్నాడు. కొన్నిచోట్ల సొంతదారులను చంపుతానని బెదిరించి తక్కువధరకే కొనుగోలు చేయగా, మరికొన్ని చోట్ల నయాపైసా ఇవ్వకుండా ఆక్రమించాడు. ఈ కోవలో కొన్నిప్రాంతాల్లో ప్రభుత్వ భూములనూ స్వాహా చేశాడు. దీనికి రాజకీయ నేతలు, పోలీసు, రెవెన్యూ అధికారులు నయీమ్‌కు సహకరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సిట్ దర్యాప్తులో దాదాపు 1,500 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలను గుర్తించింది. నయీమ్ కుటుంబసభ్యుల పేరునే దాదాపు 800 ఎకరాలున్నట్టు సమాచారం. దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని భూముల వివరాలు వెలుగు చూసే అవకాశముంది. నయీమ్ కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి చట్టపరంగా ఉన్న ఇబ్బందులను పరిశీలించాల్సిందిగా న్యాయశాఖను ఆదేశించినట్టు తెలిసింది. రెవెన్యూ అధికారులు కూడా ఆ భూముల వివరాలపై ఆరా తీస్తున్నారు. వీటిలో ప్రభుత్వ భూములను నేరుగా స్వాధీనం చేసుకోనుండగా, పట్టా భూముల విషయంలో అనుసరించాల్సిన పద్ధతులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండు పడక గదుల ఇళ్లకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న రెండు పడకగదుల ఇళ్ల పథకం ఇంకా ముందుకు కదలటంలేదు. ఒకటి, రెండుచోట్ల మినహా ఎక్కడా ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. దీనికి స్థలాల కొరత ఉంది. ఈ నేపథ్యంలో నయీం కబ్జాలో ఉన్న భూముల్లో రెండు పడక గదుల ఇళ్లకు యోగ్యంగా ఉన్న వాటి వివరాలను అందించాల్సిందిగా ము ఖ్యమంత్రి కార్యాలయం నుంచి రెవె న్యూ అధికారులకు ఆదేశం అందింది. స్థానిక అధికారులు ప్రస్తుతం ఆ పనిలో నిమగ్నమయ్యారు. -
నయీం కేసులో మరో వ్యక్తి అరెస్ట్
రామన్నపేట: ఇటీవల ఎన్కౌంటర్లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరొ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంకు చెందిన బాలకృష్ణను ఆదివారం యాదగిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నయీంతో కలిసి పలు సెటిల్మెంట్లలో పాలు పంచుకున్న బాలకృష్ణ నుంచి కీలక సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. -
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నయీమ్ ఆయుధాలు
-
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నయీమ్ ఆయుధాలు
షాద్‌నగర్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఉపయోగించిన ఆయుధాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సీఐ రామకృష్ణ తెలిపారు. నయీమ్ ఎన్కౌంటర్ తరువాత అతను ఉపయోగించిన ఆయుధాలు ఏకే 47, మూడు రివాల్వర్లు, ఇతర మందుగుండు సామగ్రిని అదేరోజు పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఏకే 47, 3 రివాల్వర్లను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు తెలి సింది. శనివారం షాద్‌నగర్ మెజిస్ట్రేట్ సీఎచ్ఎన్ మూర్తి సమక్షంలో ఆయుధాల ను సీజ్ చేసి ల్యాబ్‌కు పంపించారు. సంఘటన స్థలంలో లభించిన బుల్లెట్లు, మందుగుండు సామగ్రిని కూడా తీసుకెళ్లారు. -
నయీం అనుచరుడికి 14 రోజుల రిమాండ్
కరీంనగర్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో అతని అనుచరుడు ఆసిఫ్‌ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని శుక్రవారం కోరుట్ల కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం ఈ నెల 16 వరకు ఆసిఫ్ ఖాన్ కు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని కరీంనగర్ జైలుకు తరలించారు. -
నయీం పోస్టర్‌ను ట్వీట్ చేసిన వర్మ!
దేశంలోని సంచలన సంఘటనలు, నేరచరితులపై సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత చరిత్ర ఆధారంగా వెండితెరపై మరో రియల్ క్రైం స్టోరీని వండివారుస్తానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అనంతపురం ఫ్యాక్షన్ ముఠాకక్షల నేపథ్యంలో ’రక్తచరిత్ర’, ’రక్తచరిత్ర-2’ సినిమాలను వర్మ తెరకెక్కించాడు. అలాగే, ముంబై మాఫియా నేపథ్యంతో ’సత్య’ వంటి సంచలన చిత్రాన్ని అందించాడు. ఇప్పుడు హైదరాబాద్ వేదిక తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన కిరాతక డాన్ నయీం కథతో సినిమా తీస్తానని ప్రకటించాడు. ప్రకటన అయితే చేశాడుగానీ ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు ఎంతమేరకు కొనసాగుతున్నాయో తెలియదు. కానీ తాజాగా వర్మ తన ట్విట్టర్ పేజీలో ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను పెట్టాడు. ’నయీం’ టైటిల్‌తో పైన రాంగోపాల్ వర్మ పేరుతో రూపొందిన పోస్టర్ ఇది. ఈ పోస్టర్లో నయీంలోని కిరాతక లక్షణాలైన క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్, గూండా, గ్యాంగ్‌స్టర్ వంటి పదాలతో టైటిల్‌ను సృజనాత్మకంగా రూపొందించారు. ఇది ఎవరు రూపొందించారో తెలియదు కానీ, ఇది నచ్చడంతో తాను ట్వీట్ చేశానని వర్మ చెప్పుకొన్నారు. Someone made this very innovative design of capturing Nayeem' s deeds in his own name ..look closely at the letters pic.twitter.com/CgDXnKFIP1 — Ram Gopal Varma (@RGVzoomin) 31 August 2016 -
నయీం కేసులో రోజుకో కొత్త ట్విస్ట్
-
విరసం నేతలపై కేసు ఎందుకు?
♦ గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో కొత్త కోణం వరవరరావుపై జూన్ 25వ తేదీన ♦ నల్లగొండ కోర్టులో పిటిషన్ వేయించిన నయీమ్ ♦ నయీమ్ సూచన మేరకే న్యాయవాది ఛత్రపతితో కేసు ♦ పోలీసు విచారణలో వెల్లడించిన ఐటెన్ న్యూస్ సీఈవో ♦ హాని తలపెట్టే ఆలోచనతోనే అంటున్న పోలీసు వర్గాలు నల్లగొండ క్రైం: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో మరో కొత్త కోణంపై పోలీసులు దృష్టి సారించారు. ఎప్పటి నుంచో మావోయిస్టులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నయీమ్ తాజాగా విరసం నేతలపై కేసులు ఎందుకు వేయించారనే కోణంలో నల్లగొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విరసం నేతలు వరవరరావు, విజయలక్ష్మి, కాసీంలపై కోర్టులో కట్టంగూరుకు చెందిన న్యాయవాది ఛత్రపతి ద్వారా నల్లగొండ కోర్టులో జూన్ 25న పిటిషన్ వేశామని, ఈ పిటిషన్లో విరసం నేతలు హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశాల వీడియో క్లిప్పింగులను కూడా జత చేశామని పోలీసు విచారణలో నయీమ్ అనుచరుడు, ఐటెన్ న్యూస్ సీఈవో బి. హరిప్రసాదరెడ్డి వెల్లడించినట్టు తెలుస్తోంది. నయీమ్ ఫోన్ చేసి విరసం నేతలపై కోర్టులో పిటిషన్ వేయాలని, ఇందుకు గాను న్యాయవాది ఛత్రపతిని కలవాలని ఆదేశించాడని, ఆ మేరకే తాము ఆ పనిచేశామని పోలీసులకు హరి చెప్పినట్టు తెలుస్తోంది. కోర్టు ఆ పిటిషన్‌ను స్వీకరించలేదు కానీ.. కేసు ఎందుకు వేయించారనే కోణంలో పోలీసు దర్యాప్తు జరుగుతున్నట్టు సమాచారం. విరసం నేతలపై కేసు వేయడం ద్వారా వారు కోర్టు విచారణకు నల్లగొండకు రావాల్సిన పరిస్థితులను కల్పించాలని, ఆ క్రమంలో హాని తలపెట్టాలనే ఆలోచన నయీమ్ చేసి ఉంటాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా పౌరహక్కుల నేత ఆజం అలీని నల్లగొండలోనే నయీమ్ అనుచరులు హత్య చేశారని, కేసు వేయించేందుకు ప్రధాన కారణం ఏమిటనేది రాబడుతున్నామని అయితే, హరిని మరోసారి పోలీసు క స్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోనికి వస్తాయని పోలీసులంటున్నారు. -
నయీమ్ నమ్మినబంటు శ్రీధర్‌గౌడ్!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ కాలంపాటు తనను తాను రక్షించుకోవడానికే శక్తియుక్తుల్ని వినియోగించిన గ్యాంగ్‌స్టర్ నయీమ్.. దాదాపు గత ఏడేళ్లపాటు ధనార్జనే ధ్యేయంగా పని చేశాడు. ఈ నేపథ్యంలో ఎవరినీ పూర్తిస్థాయిలో నమ్మేవాడు కాదు. వనస్థలిపురం పరిధిలోని తుర్కయాంజాల్‌కు చెందిన శ్రీధర్‌గౌడ్‌కు మాత్రమే తన ప్రధాన ‘డెన్’ వివరాలు తెలిపాడు. ఇతడే టార్గెట్ల ‘రవాణా’ బాధ్యతలు చూసుకునేవాడు. అలాగే నయీమ్ తన చేతిలో హతమైన వారి ‘అంత్యక్రియల’ సమయంలో మహిళా అనుచరులతో నల్లవస్త్రాలు ధరింపజేసేవాడని తెలిసింది. పోలీసుల విచారణలో నయీమ్ భార్య హసీనా బేగం పలు కీలక అంశాలను వెల్లడించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘కీలక ఘట్టాలన్నీ’ షాద్‌నగర్ ఇంట్లోనే.. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్షిప్లో తన సమీప బంధువు సయ్యద్ సాదిఖ్ పాషా పేరుతో ఉన్న ఇంటినే నయీమ్ తన ప్రధాన డెన్‌గా వినియోగించుకున్నాడు. ఇంట్లో తన సమీప బంధువు మతీన్ కుటుంబాన్ని ఉంచి.. టార్గెట్లను బెదిరించడంతోపాటు కీలక వ్యవహారాలూ ఇక్కడ నుంచే నెరపేవాడు. అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప సాధారణంగా కుటుంబీకుల్ని అక్కడకు తీసుకువెళ్లేవాడు కాదు. ‘మామిడి’ అనే పేరు పెట్టిన ఈ ఇంటి వివరాలను అందరికీ తెలియనీయలేదు. ప్రతి ఒక్కరినీ అనుమానించే నయీమ్.. యాక్షన్ టీమ్ సభ్యులతోపాటు తనకు నమ్మిన బంటుగా ఉన్న శ్రీధర్‌గౌడ్‌కు మాత్రమే ఇంటి గురించి చెప్పాడు. టార్గెట్లను తొలుత అనుచరుల ద్వారా, ఆపై ఫోన్లో బెదిరించేవాడు. అవసరమైతే వారిని ‘మామిడి’కి రప్పించి ‘గడాఫీ సైన్యం’ మధ్యలో కూర్చుని బెదిరించే వాడు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన వారినైనా ఎల్బీ నగర్ మీదుగానే షాద్‌నగర్‌లోని డెన్‌కు రప్పించేవాడు. టార్గెట్లను అనుచరులు ఎల్బీనగర్ వరకు తీసుకొస్తారు. అక్కడి నుంచి వారి కళ్లకు గంతలు కట్టి, షాద్‌నగర్‌కు తరలించేది మాత్రం శ్రీధర్‌గౌడ్ అని తెలిసింది. శ్రీధర్‌గౌడ్ ఈ దందాల్లో ‘రెడ్డి భయ్యా’గా చెలామణి అయ్యాడని వెల్లడైంది. ఆ సమయంలో వారంతా నల్లవస్త్రాల్లో.. అనుమానం, విభేదాలు, అసహనం.. కారణమేదైనా నయీమ్ సమాధానం మాత్రం హత్యే. సొంత బావతోపాటు అనేక మంది పసి పిల్లలు, పని పిల్లల్ని తన ఇంట్లోనే కుటుంబీకులతో కలసి దారుణంగా చంపేవాడు. హత్యలు చేసిన తర్వాత మృతదేహాలను స్వయంగా తీసుకువెళ్లే నయీమ్.. నిర్మానుష్య ప్రాంతాల్లో కాల్చేయడమో, శివార్లలో పూడ్చేయడమో చేసేవాడు. అంత్యక్రియల కోసం మృతదేహాలను రవాణా చేసే సమయంలో మాత్రం తన వెంట ‘గడాఫీ సైన్యాన్ని’ తీసుకెళ్లేవాడు. ఆ సమయంలో వారు కచ్చితంగా నల్లరంగు వస్త్రాల్లో ఉండాలని స్పష్టం చేసేవాడు. అక్క సలీమా బేగం రెండో భర్త నదీం, పని పిల్ల నస్రీన్లను అల్కాపురి టౌన్‌షిప్‌లోని ఇంట్లో చంపిన నయీమ్.. నల్లవస్త్రాల్లో ఉన్న మహిళా అనుచరులతో వెళ్లి మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించాడని వెలుగులోకి వచ్చింది. ‘మావో’ల కనుమరుగు తర్వాతే ధనార్జన మావోయిస్టు పార్టీలో చేరడం.. పోలీసులకు కోవర్ట్‌గా మారడం.. మావోయిస్టు నేత ఈదన్న హత్యతోపాటు ఇతర పరిణామాల నేపథ్యంలో ఉద్యమం నుంచి బయటకు రావడంతోపాటు మావోయిస్టుల్ని అంతం చేస్తానంటూ నయీమ్ ప్రకటించాడు. దీంతో అతడు మావోయిస్టులకు టార్గెట్‌గా మారాడు. ఈ నేపథ్యంలో తనను తాను కాపాడుకోవడంపైనే దృష్టిపెట్టాడు. 2008 తర్వాతే నయీమ్ దృష్టి ధనార్జనపై పడింది. అప్పటికి రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తన అనుచరగణాన్ని పెంచుకుని, శత్రువుల్ని తుంచేయడంతో డబ్బు పైనే దృష్టి కేంద్రీకరించి సంపాదించడం ప్రారంభించాడు. -
'నాన్న అనారోగ్యానికి కారణం కల్యాణే'
హైదరాబాద్: 'మా నాన్న ఎనాడూ ఎవ్వరినీ మోసం చేయలేదు. బాధితులంటూ ఎవరూ లేరు. ఒకవేళ అలాంటివేమైనా ఉంటే వారికి చెల్లింపులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నిర్మాత సి. కల్యాణ్ అనుచిత వ్యాఖ్యల వల్లే మా నాన్న కలత చెందారు. ఆయన అనారోగ్యానికి కారణం కల్యాణే' అని నిర్మాత నట్టికుమార్ కూతురు కరుణ, కొడుకు క్రాంతిలు ఆరోపించారు. గ్యాంగ్ స్టర్ నయీంతో నిర్మాత సి. కల్యాణ్ కు సంబంధాలున్నాయని కొద్ది రోజుల కిందట తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన నట్టికుమార్ ప్రస్తుతం అనారోగ్యానిగురై హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నట్టికుమార్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతోన్న ఆయన పిల్లలు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. (అతడి జీవితమే బ్లాక్మెయిల్, నీలిచిత్రాలు) 'మా నాన్న చేసిన ఆరోపణలు నిజమో కాదో తేల్చకుండా సి. కల్యాణ్ మా ఫ్యామిలీపై నోరు పారేసుకున్నారు. ఆసుపత్రి నుంచి బయటికి రాగానే ఆధారాలతో సహా అన్నీ నిరూపిస్తారు' అని కరుణ, క్రాంతిలు చెప్పారు. నయీం ఎన్ కౌంటర్ అనంతరం సినీ పరిశ్రమలోని కొందరు నిర్మాతలతో అతనికి సంబంధాలున్నాయన్న నట్టికుమార్ వ్యాఖ్యలను నిర్మాతల మండలి తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సి. కల్యాణ్.. నట్టికుమార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
నయీమ్... మహా పిసినారి
-
నయీమ్... మహా పిసినారి
* సొంత మనుషులకూ సరిగా డబ్బులివ్వని వైనం * దాంతో బంగారం కుదువ పెట్టిన కుటుంబీకులు * ట్యూబ్‌లైట్ మార్చినా, ఉప్పు పొట్లం కొన్నా... * ప్రతిదానికీ డైరీలో ‘మిలిటెంట్’ లెక్కలు * తనను కలిసిన వారందరి వివరాలూ డైరీలో * ఫొటోలు, సీసీ కెమెరాల రికార్డింగులు కూడా * లొంగిపోయి ప్రజాజీవితంలోకి వచ్చే యోచన సాక్షి ప్రతినిధి, నల్లగొండ: భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, హత్యలు, అరాచకాలతో లెక్కలేనన్ని ఆస్తులు, నగదు పోగేసుకున్న గ్యాంగ్‌స్టర్ నయీమ్, వ్యవహారంలో మాత్రం చాలా పిసినారట. చివరికి తన సొంత కుటుంబసభ్యులకు కూడా సరిపడా డబ్బులిచ్చేవాడు కాదని విచారణలో వెల్లడవుతున్న పలు అంశాలను బట్టి తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో ఉన్న నయీమ్ కుటుంబసభ్యులు కొందరు అతను చేసిన పలు నేరాల్లో పాలుపంచుకున్నారు. అ యినప్పటికీ, కుటుంబం గడవడానికి బంగా రం కుదువ పెట్టుకుని డబ్బులు తెచ్చుకున్నామని పోలీసు విచారణలో వారు వెల్లడించారు!! బంగారం కుదువ పెట్టిన రసీదులు కూడా వారింట్లో లభ్యమవడం విశేషం!! మావోయిస్టుల తరహాలో నయీమ్ పక్కాగా ‘మిలిటెంట్ డైరీ’ రాసుకునేవాడట. అదెంత పకడ్బందీగా ఉంటుందంటే... తాను ప్రతి రూపాయికీ అందులో లెక్కలు రాసుకునేవాడట. చివరికి ట్యూబ్‌లైట్ మార్చినా, ఉప్పు ప్యాకెట్ కొన్నా వాటికీ లెక్కలు రాసుకునేవాడని పోలీసు వర్గాలంటున్నాయి. ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని కలిసిందీ, ఏం పని చేసిందీ కూడా విధిగా డైరీలో నమోదు చేసుకునేవాడు. అంతేగాక తనను కలిసిన ప్రతి ఒక్కరి ఫొటో దాచి ఉంచుకునేవాడట. ఇందుకోసం తానున్న చోట తప్పనిసరిగా సీసీ కెమెరా నిఘా ఉంచేవాడని విచారణలో తేలింది. పలు వివరాలు వెల్లడించిన హరి నల్లగొండ జిల్లాకు చెందిన హరిప్రసాద్‌రెడ్డి అనే జర్నలిస్టును సీఈవోగా పెట్టి వెబ్ చానల్ ఏర్పాటు చేయించిన నయీమ్, త్వరలోనే శాటిలైట్ చానల్ పెట్టే ఆలోచన కూడా చేసినట్టు వెల్లడైంది. ‘వెబ్ చానల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ చేయాలి. తర్వాత శాటిలైట్ చానల్ పెడదాం. దానికీ నిన్నే సీఈవో చేస్తా’నని హరిప్రసాద్‌రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. విచారణలో హరిప్రసాద్‌రెడ్డి ఆసక్తికర విషయాలు చెప్పినట్టు తెలిసింది. నయీమ్ నుంచి తాను డబ్బులు ఎలా, ఎవరి ద్వారా తీసుకున్నదీ, నయీమ్‌కు సెల్ఫోన్లు, సిమ్ కార్డులు ఎలా పంపిందీ, గతేడాది వినాయక ఉత్సవాల్లో తన పాత్ర, ఆ సమయంలో ఎవరెవరికి ఏమేం ఇచ్చిందీ, నయీమ్‌ను ఎప్పుడు కలిసిందీ హరి వెల్లడించినట్టు సమాచారం. నల్లగొండ జిల్లాలో ఎంతమంది మావోయిస్టు సానుభూతిపరులున్నారో తెలుసుకుని తనకు చెప్పాలని కూడా ఆయనకు నయీమ్ సూచించినట్టు సమాచారం. జిల్లా రాజకీయాలపైనా ఆరా తీసేవాడట. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలనే భావించాడని, చానళ్ల ద్వారా జనానికి దగ్గరై, తర్వాత లొంగిపోయి ప్రజాజీవితంలోకి వచ్చే యోచన చేశాడనితెలుస్తోంది. ‘నయీమ్‌ను కలిసేందుకు అతని అల్లుడు తబ్రేజ్ కారులో వెళ్లాను.నా కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారు. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నాకు ఎంతోమంది ఫోన్లు చేసి ఆరా తీశారు. నయీమ్ పోయాడు గనుక అందరి ఇళ్లపైనా దాడులు జరుగుతాయని, అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించా’నని హరి వెల్లడించినట్టు సమాచారం. సిట్ అధికారుల విచారణ చౌటుప్పల్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ బాధితులను నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు శనివారం విచారించినట్టు తెలిసింది. మండలంలోని తూఫ్రాన్‌పేట శివారులోని సర్వే నంబరు 12లో 50 ఎకరాల భూమిని తమను బెదిరించి నయీమ్ తన భార్య, బినామీల పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడని బాధిత రైతులు సిట్‌కు వివరించారు. ‘‘తమను బెదిరించి ఎకరా రూ.లక్షకే నయీమ్ లాక్కున్నాడు. తప్పనిసరై విక్రయించాం. నయీమ్ అనుచరుడు పాశం శ్రీను వచ్చి నయీమ్ అనుచరుల పేరిట మా భూములు రిజిస్టర్ చేయించుకున్నాడు’’ అని చెప్పినట్టు సమాచారం. -
ఒంగోలులోని నయీమ్ ఇంట్లో సిట్ సోదాలు
* ‘డెవిల్ హౌస్’ తాళాలు పగలగొట్టి లోపలకి ప్రవేశించిన సిట్ బృందం * ఏమీ దొరకకపోవడంతో వెనుతిరిగిన వైనం ఒంగోలు క్రైం: గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ న యీమ్ ఇంట్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం (సిట్) అధికారులు సోదాలు నిర్వహించారు. ఒంగోలులోని ముంగమూరు రోడ్డులో ఉన్న సురక్ష అపార్ట్మెంట్లో నయీమ్‌కు 510 నంబరుతో ప్లాటు ఉంది. దీనికి అతను ‘డెవిల్ హౌస్’ అని పేరు పెట్టుకున్నాడు. ఇందులో నయీమ్ ముఖ్య అనుచరుడు సలీం అలియాస్ ఫయూం ఉండేవాడు. నయీమ్ కేసులో ఫయూం రెండో నిందితుడు. ఈ ప్లాటులో సోదాలు చేసేందుకు సీఐ బిక్షపతితో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్ల బృందం శుక్రవారం హైదరాబాద్ నుంచి ఒంగోలు చేరుకుంది. తొలుత వారు ప్లాటు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించాలని భావించారు. అందుకు అపార్ట్మెంటు కమిటీ సభ్యులు నిరాకరించడంతో వెనుదిరిగారు. జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ అనుమతి తీసుకుని ఒంగోలు ఎస్సై సురేష్‌తో కలసి సిట్ అధికారులు మళ్లీ ప్లాటు వద్దకు వచ్చారు. నయీమ్ ఇంట్లో వంట మనిషిని వెంటబెట్టుకొని తాళా లు పగులగొట్టి ఇంట్లో తనిఖీలు చేశారు. ఆ ఇంటికి సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెం టు, నెల్లూరు, గుంటూరు ప్రాంతాలకు చెందిన కొన్ని నకళ్లు, విద్యుత్ బిల్లులు, అపార్ట్మెంటు కరెంటు బిల్లులు మాత్రమే లభ్యమయ్యాయని సమాచారం. లోపల భారీ మొత్తంలో నగదు, డాక్యుమెంట్లు, మారణాయుధాలు ఉంటాయని సిట్ అధికారులు భావించారు. ఏమి దొరకక వెనుతిరిగి వెళ్లిపోయారు. ఏమేమి దొరికాయని సిట్ పోలీసులను అడిగినా వారు వెల్లడించేందుకు నిరాకరించారు. చర్లపల్లి జైలుకు ఫయీమ్ హైదరాబాద్: రెండు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో నిందితులుగా ఉన్న ఫయీమ్, అతడి భార్య షాహీమ్లను నార్సింగి పోలీసులు శుక్రవారం సాయంత్రం ఉప్పర్‌పల్లి న్యాయస్థానంలో హజరుపరిచారు. ఇరువురిని న్యాయమూర్తి ఆదేశం మేరకు చర్లపల్లి జైలుకు తరలించారు. -
‘గ్యాంగ్‌స్టర్’మూలాల కోసం వేట
గ్యాంగ్‌స్టర్ సన్నిహితులెవరనే దానిపై నజర్ ‘కూరపాటి’ని టార్గెట్ చేయడంపై ‘సిట్’ ఆరా విచారణలో వెలుగు చూడనున్న అసలు ‘కథ’ సాక్షి ప్రతినిధి నిజామాబాద్ : జిల్లాలో గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్‌కు అత్యంత సన్నిహితులు ఎవరు? డిచ్పల్లి జెడ్పీటీసీ కూరపాటి అరుణ భర్త గంగాధర్‌ను ఆ గ్యాంగ్ కు టార్గెట్ చేసిందెవరు? ఎంతకాలంగా జిల్లాలో నయీం ముఠా కార్యకలాపాలు సాగిస్తోంది? ఈ ముఠాకు ఇన్నాళ్లు సహకరిస్తున్నదెవరు? అన్న అంశాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) రెండు రోజులుగా జిల్లాలో ఆరా తీస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. నల్గొండ జిల్లా భువనగిరి ఠాణాలో తెలంగాణ రైసుమిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంపా నాగేందర్ ఈ నెల 17న శాసనమండలి డిప్యూటీ చైర్మన్, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌పై ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ మేరకు ఆయనపై క్రైం నంబర్ 234/2016 ప్రకారం ఎఫ్ఐఆర్ జారీ అయిన అనంతరం జిల్లాలో ‘సిట్’ దర్యాప్తు ముమ్మరం చేయడం కలకలం రేపుతోంది. నేతి విద్యాసాగర్‌కు బంధువులు, సన్నిహితులు, వారి గత చరిత్రపై ఆరా తీస్తుండటం జిల్లాలో చర్చనీయాంశం అవుతోంది. ‘కూరపాటి’ని టార్గెట్ చేసిందెవరు? గ్యాంగ్ స్టర్ నయీంపై డిచ్పల్లి పోలీసుస్టేషన్లో నమోదైన క్రైం నంబర్ 125/2016. నల్గొండ జిల్లాలో అనేక ఆగడాలు కొనసాగించిన నయీం డిచ్పల్లి జెడ్పీటీసీ భర్తపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లాలో మొదటిసారి నయీం డబ్బుల కోసం బెదిరించడం జరిగింది. గంగాధర్‌కు సంబంధించి ఆస్తులు, వ్యక్తిగత వివరాలు నయీం పేర్కొన్నడం సంచలనం రేపింది. దీనిని బట్టి నయీంకు జిల్లా పరిస్థితులు, స్థానికంగా వివరాలు తెలిసిన వారే అనుచరులుగా కొనసాగుతున్నట్లు అనుమానాలకు తావిస్తోంది. నయీంకు కూరపాటి గంగాధర్‌కు సంబంధించి వివరాలు అందించింది ఎవరు? అసలు ఆయనను ఎందుకు టార్గెట్ చేశారు? అన్న అంశాలే ఇప్పుడు కీలకంగా మారాయి. నల్గొండ జిల్లా భువనగిరి పోలీసుస్టేషన్లో నేతి విద్యాసాగర్‌పై కేసు నమోదైన నేపథ్యంలో.. సిట్ జిల్లాలోని ఆయన బంధువర్గం వివరాలు ఆరా తీయడం కలకలం రేపుతోంది. నల్కొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీకి సమీప బంధువు దీంతో సిట్ జిల్లాలోని నయీం బెదిరింపు కాల్స్‌కు సంబంధించి ఆరా తీయనుంది. ఒకవేళ సదరు ప్రజాప్రతినిధి డిచ్పల్లి గంగాధర్‌కు చెందిన వివరాలు అందించారా? రాజకీయ లబ్ధి కోసం గంగాధర్‌ను భయపెట్టేందుకు చేసిందా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా నయీం అనుచరులు ఎవరెవరు ఉన్నారు? ఎక్కడెక్కడ ఉన్నారు? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నయూం మూలాలపై త్వరలో నివేదిక డిచ్పల్లి పోలీస్‌స్టేషన్‌లోనే కేసు నమోదు కావడంతో ఒక్కొక్కరిపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, ఇతర ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోంది. భువనగిరి ఠాణాలో ఎఫ్ఐఆర్ నమోదైన నల్గొండ ఎమ్మెల్సీ సమీప బంధువు జిల్లాలో సెటిల్మెంట్లు చేయడం పరిపాటి. ఇప్పటికీ ఉన్నతస్థాయి కోర్టు కేసులు ఎదుర్కొంటున్న అయన 2019 ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం కూడా చేస్తున్నట్లు ప్రచారం ఉంది. ఇదే క్రమంలో నయీంతో సంబంధాలు పెట్టుకొని జిల్లాలో మరిన్ని సెటిల్మెంట్లు చేసేందుకు పూనుకున్నడా? కూరపాటిని టార్గెట్ చేయడం ద్వారా.. ఆయన సీనియర్ నాయకులకు హెచ్చరిక చేయదలచుకున్నాడా? ఈ క్రమంలోనే గ్యాంగ్‌స్టర్‌గా గడగడలాడించిన నయీంతో జత కట్టాడా? అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో రాజకీయంగా పట్టుసాధించే క్రమంలో నయీం గ్యాంగ్‌ను దగ్గరయ్యాడా? అన్న వాదన కూడా సాగుతోంది. కాగా వీటన్నింటిని పక్కన బెడితే ‘సిట్’ పూర్తి స్థాయి విచారణ జరిపితే జిల్లాలో నయీం అనుచరుల ఎవరెవరు? ఒక వేళ నయీం కూడా నిజామాబాద్ వచ్చి వెళ్లేవాడా? వచ్చి వెళితే నయీంకు ఆశ్రయం కల్పించిన వారెవరు? అతని వెంట ఎవరెవరు ఉన్నది? అన్న విషయాల గుట్టు వెలుగులోకి రానుంది. గుట్టు చప్పుడు కాకుండా నయీం కార్యకలాపాలు కొనసాగించేవాడన్నది బహిరంగ రహస్యమే అయినా... జిల్లాలో నయీం మూలాలు ఎక్కడనేది? తేల్చే పనిలో ఇప్పుడు సిట్ నిమగ్నమైంది. త్వరలోనే నాగిరెడ్డి నేతృత్వంలోని సిట్ బృందం జిల్లాకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి తీసుక రానుందన్న చర్చ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. -
ఒంగోలులో నయీం ఆస్తులు?
-
ఒంగోలులో నయీం ఆస్తులు?
-నయీం సన్నిహితుడి ఇంట్లో సోదాలు ఒంగోలు : ఏపీలో గ్యాంగ్ స్టర్ నయీం దందాలపై తెలంగాణ సిట్ విచారణ చేపడుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో నయీం సన్నిహిత బంధువు ఏ2 నిందితుడు సలీమ్ అలియాస్ ఫహీం ఇంట్లో సిట్ బృందం సోదాలు చేసింది. స్థానిక పోలీసుల సమక్షంలో ఫ్లాట్‌లో సోదాలు చేసిన సిట్ విలువైన డ్యాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకుంది. సలీంపేరుతో చెలామణి అయిన ఫహీం ఒంగోలులో ఏడాదిన్నర పాటు నివాసం ఉంటున్నట్లు తెలిసింది. నయీం ఎన్‌కౌంటర్‌కు 10 రోజుల ముందే నుంచి ఫహీం కనిపించకుండా పోయాడని స్థానికులు చెబుతున్నారు. నయీం అరాచకం ఒంగోలులోనూ వెలుగుచూడటంతో ఒంగోలులో కలకలం రేగుతోంది. -
టీడీపీలో గ్యాంగ్‌స్టర్ నయీమ్ అలజడి
-
నయీమ్ అలియాస్ జేమ్స్
భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు మరో పేరు కూడా ఉందా..? ఛత్తీస్‌గఢ్‌లో జేమ్స్ అనే పేరుతో నయీమ్ చలామణి అయ్యాడా? దీనికి అవుననే సమాధానం చెబుతున్నా రు సిట్ అధికారులు. ఆడవేషాలు, బుర్ఖాలు, ముసుగులతో ఎప్పుడూ సంచరించే నయీమ్ తన పేరును జేమ్స్‌గా మార్చుకున్నట్లు భావిస్తున్నారు. ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి బెదిరింపులు, భూ ఆక్రమణలు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన నయీమ్ ఈ నెల 8న ఎన్కౌంటర్లో హతమైన సంగతి తెలిసిందే. నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం కేసు విచారణ జరుపుతున్న సిట్ అధికారులు నయీమ్‌కు జేమ్స్ అనే మరో పేరు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ల ఉద్యమాన్ని అణిచివేయడానికి పోలీస్ ఇన్ఫార్మర్గా ఉపయోగపడ్డ నయీమ్.. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ పోలీసులకు దగ్గరయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులను ఎదుర్కోవడానికి నయీమ్‌ను ఉపయోగించుకోవాలని అక్కడి పోలీసులు భావించారు. శత్రువులకు చిక్కకుండా ఉండటానికి అప్పుడే నయీమ్ తన పేరును జేమ్స్‌గా మార్చుకున్నట్లు తెలిసింది. భువనగిరిలో సిట్ విచారణ నయీమ్ అతని ముఠా సభ్యులు సాగించిన అరాచకాలపై బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో నయీమ్ అనుచరులు, సన్నిహితులపై సిట్ నిఘా పెట్టింది. సిట్ అధికారులు గురువారం భువనగిరి, రాయగిరి, యాదగిరిగుట్టలో పలువురిని విచారించారు. భువనగిరిలో నయీమ్‌కు ముఖ్య అనుచరుడు పాశం శ్రీనుతో సాన్నిహిత్యం ఉన్న సుమారు 20 మందికి సంబంధించిన వివరాలను సేకరించారు. వీరిలో పలువురు పాశం శ్రీనుకు దగ్గరగా ఉండే వాళ్లు, భూముల కొనుగోళ్లలో బినామీలు, దందాలో మధ్యవర్తులు, అతనికి సహకరించిన రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, డాక్యుమెంట్ రైటర్ల వివరాలు, వారికి సంబంధించిన నివాస గృహాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించారు. భువనగిరి గంజ్‌లోని ఓ ప్రముఖ యువ వ్యాపారి, వాహనాల కాంట్రాక్టర్‌ను సిట్ అధికారులు విచారించారు. కొందరిని అదుపులోకి తీసుకుని డీఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ అధికారిపై నిఘా భూములు, భవనాలను నయీమ్ గ్యాంగ్ బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసుల్లో రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ఓ అధికారిపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. నయీమ్‌కు సంబంధించిన పలు రిజిస్ట్రేషన్లు ఈ అధికారి ద్వారా ఎక్కువగా జరిగినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉద్యోగిగా ఉన్న ఇతను ప్రస్తుతం అధికారి హోదాలో ఈ ప్రాంతంలోనే పనిచేస్తున్నారు. వివాదాలెన్ని ఉన్నా నిబంధనలను తుంగలో తొక్కి నయీమ్, అతని అనుచరులకు భూములను రిజిస్ట్రేషన్లు చేయించడంలో ఇతను కీలకపాత్ర పోషించాడని సిట్ గుర్తించింది. -
'అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు'
హైదరాబాద్: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తనను ఎప్పుడూ చూడలేదని, అబద్ధాలాడుతున్నారని నట్టికుమార్ ఆరోపించారు. మంత్రిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం నట్టికుమార్ మీడియాతో మాట్లాడుతూ...గ్యాంగ్‌స్టర్ నయీం, మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపితే అన్ని వాస్తవాలు బయటకొస్తాయని చెప్పారు. మే 17న స్పైస్ జెట్ విమానంలో తామిద్దరం విశాఖ నుంచి హైదరాబాద్‌కు వచ్చామన్నారు. విమాన ప్రయాణ సమయంలో నయీంకు సంబంధించిన వ్యవహారాలపై మంత్రితో మాట్లాడానన్నారు. సీసీ టీవీ ఫుటేజీ బయటకు తీస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన చెప్పారు. టీడీపీ నేత జగ్గిరెడ్డికి ఉత్తరాంధ్రలో నాలుగే క్యాంటీన్లు ఉన్నాయని చెబుతున్నారని...అంతకంటే ఎక్కువ క్యాంటీన్లు ఉంటే ప్రభుత్వానికి స్వాధీనం చేస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు చైతన్యరెడ్డిపైనా కూడా విచారణ జరపాలని నట్టికుమార్ డిమాండ్ చేశారు. -
దండోపాయంతో ‘దారి’లోకి..
-
దండోపాయంతో ‘దారి’లోకి..
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు మహిళా అనుచరులుగా చెలామణి అయిన ఫర్హానా, అఫ్షాలు కూడా మొదట్లో అతడి బాధితులే అని తేలింది. నయీమ్ బంధువులైన వీరిద్దరు అల్కాపురి టౌన్‌షిప్‌లోని గ్యాంగ్‌స్టర్ ఇంట్లో పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. నార్సింగ్ పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. తొలినాళ్లలో నయీమ్ క్రూరత్వాన్ని చవిచూసిన వీరు.. ఆ తర్వాతే అతడి వెంట ఉంటూ నేరాల్లో పాలుపంచుకోవడం, ఆస్తులకు బినామీగా మారడం చేశారు. మరోవైపు నయీమ్ రాష్ట్ర సరిహ ద్దులు దాటి ప్రయాణించేప్పుడు తన ఆయుధాలను మహిళల వద్ద ఉంచేవాడని తేలింది. వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. అధీనంలోకి తీసుకొని బినామీగా.. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పైలన్‌కు చెందిన ఫర్హానాకు 1999లో మిర్యాలగూడకు చెందిన సయ్యద్ అహ్మద్‌తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు. భర్త లారీ డ్రైవర్‌గా పనిచేసే వాడు. 2007లో భర్త చనిపోవడంతో 2009 వరకు అత్తగారింట్లోనే ఉంది. వరుసకు అన్న అయిన నయీమ్ ఇంట్లో పిల్లల్ని చూసుకునే పని చేయాల్సిందిగా అత్త చెప్పడంతో ఫర్హానా అంగీకరించింది. తన మూడో కుమారుడైన సలీమ్‌ను తీసుకుని నయీమ్ వద్దకు వచ్చింది. అప్పట్లో నయీమ్ హయత్‌నగర్‌లో ‘రంగన్న’ అనే పేరుతో ఉన్న ఇంట్లో నివసించేవాడు. ఆ ఇంట్లో యువతులపై జరిగే ఘోరాలను ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ ఫర్హానాను బెదిరించాడు. సలీమ్‌ను కూడా తీవ్రంగా హింసించడంతో అతడు నడవలేని స్థితికి చేరుకున్నాడు. వావి వరసలు మర్చిపోయిన నయీమ్... ఫర్హానాతోనూ వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఓ దశలో ఆమె పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చిందని నమ్మిన తర్వాత తన ఆస్తులకూ బినామీగా మార్చుకున్నాడు. అల్కాపురి టౌన్ షిప్‌లోని నయీమ్‌కు మూడంతస్తుల ఇల్లు ఉంది. మూడో అంతస్తులో జిమ్ ఉండగా రెండో అంతస్తులో నయీమ్ తన భార్య పిల్లలతో ఉండేవాడు. మొదటి అంతస్తులో ఫర్హానాతోపాటు యువతులు, మైనర్లు, గ్రౌండ్ ఫ్లోర్లో డ్రైవర్ కేసీఆర్ అలియాస్ కిషోర్ నివసించే వాడు. నయీమ్ తమపై చేస్తున్న అఘాయిత్యాలను మైనర్లు అప్పుడప్పుడు ఫర్హానాతో చెప్పేవారు. వారిని ఆమె ఓదార్చుతున్న విషయం తెల్సుకున్న నయీమ్.. శిక్షగా ఆమెకు గుండు గీయించాడు. ఫర్హానాను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత నేరాల్లోనూ ఆమెను వాడాడు. సొంత బావ నదీంను చంపిన తర్వాత మృతదేహాన్ని కొత్తూర్ తీసుకు వెళ్లి కాల్చేయడానికీ ఫర్హానాను వెంట తీసుకెళ్లాడు. పని ఇప్పిస్తానంటూ.. అఫ్షాను.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని ఈదులగూడెంకు చెందిన అఫ్షా వరుసకు నయీమ్ మేనకోడలు. ఈమె తండ్రికి భువనగిరిలో కేబుల్ నెట్వర్క్ ఉండేది. భువనగిరిలో పదో తరగతి వరకు చదివిన అఫ్షా చదువు అక్కడితో ఆపించి, తన వద్దకు పంపమంటూ నయీమ్ ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో చదువు మాన్పిం చిన అఫ్షా తల్లిదండ్రులు 2010లో మిర్యాలగూడకు చెందిన అమీర్‌కు ఇచ్చి ఆమె వివాహం చేశారు. డిగ్రీ పూర్తి చేసిన అమీర్ ఖాళీగానే ఉండటంతో అతడి తండ్రే కుటుంబ పోషణ చూసేవారు. ఏడాది తర్వాత వీరికి పాప పుట్టింది. ఓ సందర్భంలో బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లగా నయీమ్ కూడా అక్కడకు వచ్చాడు. అఫ్షా, ఆమె భర్తను చూసిన నయీమ్ హైదరాబాద్ వస్తే పని ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో వారు పాపతో సహా అప్పట్లో నయీమ్ ఇంటికి వచ్చారు. కొన్ని రోజులకు అమీర్ ప్రైవేట్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. బావ నదీంను హత్య చేయడానికి నిర్ణయించుకున్న రోజే అఫ్షాను నయీమ్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఇక అప్పటి నుంచి ఆమె జీవితం నయీమ్ చేతిలో చిక్కింది. కొన్ని నేరాల్లోనూ పాలుపంచుకుంది. వారంతా ఎక్కడున్నారు? అల్కాపురి టౌన్‌షిప్‌లోని ఇంటికి మారడానికి ముందు నయీమ్ షాద్‌నగర్‌లో ఓ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ ఏడాది పాటు తన తమ్ముడి భార్య హీనా, కుమార్తె చియాన్లను తీవ్రంగా హింసించగా వీరిద్దరూ సైతం కనిపించకుండా పోయారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడే నయీమ్ మిర్యాలగూడ నుంచి సాదియా, మాలియా, జోహా పేర్లతో ఉన్న యువతులను చదివిస్తానంటూ తీసుకువచ్చాడు. ఆ ముగ్గురిపైనా లైంగిక దాడికి పాల్పడటంతో పాటు తీవ్రంగా హింసించేవాడు. వీరితో పాటు నయీమ్ తమ్ముడి కుమార్తె షమ, బంధువు అషు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ఆచూకీ తెలియట్లేదు. అలాగే రాష్ట్ర సరిహద్దులు దాటే సమయంలో తన వెంట ఉండే శమ అలియాష్ అహేలా, సదా అలియాస్ నీలోఫర్, కరీన అలియాస్ అఫ్సలను తీసుకెళ్లేవాడు. వారికి జీన్‌ప్యాంట్స్ వేసి నడుముకు ఆయుధాలు ఉంచేవాడు. ఆపై బుర్ఖా వేయించి తనతో పాటే తీసుకువెళ్లేవాడు. వీరు ఎవరు? ఎక్కడున్నారన్న అంశాలపై పోలీసు విభాగం దృష్టిపెట్టింది. -
నయీమ్ జీవితంతో మూడు సినిమాలు!
ఎప్పుడూ ఓ నాలుగు కళ్లు నేరాలు-ఘోరాలు, మాఫియా కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయా? అని వెతుకుతుంటాయి. అందులో పోలీసులవి రెండు కళ్లు అయితే.. ఇంకో రెండు కళ్లు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మవి. మాఫియా, ఇతర నేరాలను అరికట్టాలని పోలీసులు ఓ కన్నేస్తే, సదరు గ్యాంగ్స్టర్లపై సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో వర్మ ఉంటారు. నిజజీవిత ఘటనలను వెండితెరపై ఆవిష్కరించడంలో వర్మ స్పెషలిస్ట్. హిందీలో ‘సత్య’, ‘కంపెనీ’, ‘సర్కార్’.. తెలుగులో ‘రక్త చరిత్ర’, ‘కిల్లింగ్ వీరప్పన్’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ప్రస్తుతం వర్మ కన్ను గ్యాంగ్‌స్టర్ నయీమ్ మీద పడింది. ఇటీవల పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన నయీమ్ జీవిత కథను వెండితెరపై ఆవిష్కరిస్తానని వర్మ ట్వీటారు. ‘‘నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్ఫార్మర్గా, ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఆల్ టైమ్ క్రిమినల్ నంబర్‌వన్ నయీమ్ నేరచరిత్రకు సంబంధించిన పలు కథనాలు తెలుసుకున్నాను. అతడు చేసిన పనులు భయంకరమైనవి. ఒక్క సినిమాలో నయీమ్ కథ అంతటినీ చెప్పడం అసాధ్యం. అందుకే, మూడు సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాను’’ అని వర్మ పేర్కొన్నారు. నయీమ్ మరణించిన తర్వాత ప్రతి రోజూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వర్మ దర్శకత్వంలో రాబోయే నయీమ్ ట్రయాలజీ ఇంకెన్ని సంచలనాలకు కేంద్రబిందువు అవుతుందో! -
నయీం వ్యవహారంలో 39కేసులు నమోదు
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్, అతని అనుచరుల ఆగడాలపై ఇప్పటివరకూ 39కేసులు నమోదు అయ్యాయి. ఇందుకు సంబంధించి నల్లగొండ, భువనగిరిలో మరో 10మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ వెల్లడించింది. కత్తుల జంగయ్య, పులి నాగరాజు, గుర్రం శివరాజు, బచ్చు నాగరాజు సహా పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. మరోవైపు నయీం బెదిరింపులకు పాల్పడిన వ్యాపారి గంపా నాగేందర్ ఫిర్యాదుపై సిట్ విచారణ ప్రారంభించింది. నయీం, నాగేందర్ ఫోన్ సంభాషణల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆ సంభాషణల్లో ప్రస్తావనకు వచ్చిన రాజకీయ నేతలతో సిట్ అధికారులు ఇవాళ ఫోన్లో మాట్లాడారు. కాగా నయీం కేసుకు సంబంధించి అతని అనుచరుల కస్టడీ పిటిషన్‌పై రాజేంద్రనగర్ ఉప్పరపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. నయీం కేసులో సూత్రధారులైన ఫర్హానా , అఫ్సాలను మరో ఏడు రోజుల కస్టడీతో పాటు అనుచరులైన ఫహీమ్, తాజుద్దీన్‌లను పది రోజుల కస్టడీకి అనుమతించాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారానికి రిజర్వ్ చేసింది. ఇక గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో పోలీసుల అదుపులో ఉన్న భార్య హసీనాభేగం, చెల్లెలు ఖలిమాభేగం, వాచ్మెన్ అబ్దుల్ మతిన్‌తో పాటు అతని భార్య సలీమాకు షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరిని కోర్టులో హాజరుపరిచారు. -
నయీం పై సినిమా తీస్తా:వర్మ
-
'నయీం ముఠాతో మోహన్‌రెడ్డికి సంబంధాలు'
కరీంనగర్ : నయీం మూఠాతో ఏఎస్సై మోహన్‌రెడ్డికి సంబంధాలున్నాయని మోహన్‌రెడ్డి బాధితుల సంఘం అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం కరీంనగర్లో మహేందర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.... నయీం తరహాలోనే మోహన్‌రెడ్డి ఆయుధాలతో బెదిరించి అరాచకాలకు పాల్పడ్డాడని విమర్శించారు. మోహన్‌రెడ్డికి లైవ్ డిటెక్ట్ పరీక్షలు నిర్వహిస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. మోహన్‌రెడ్డి ఇంటి వద్దే అతని అడ్డా అని విమర్శించారు. మణిరత్నాబార్ సీసీ కెమెరా పుటేజీని సిట్ స్వాధీనం చేసుకోవాలని మహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
నయీం నేర చరిత్రపై వర్మ సినిమా
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రతీ సంఘటనను తన సినిమాకు కథా వస్తువుగా స్వీకరించే వర్మ, మరో రియల్ క్రైం స్టోరిని వెండితెర మీద ఆవిష్కరించనున్నాడు. ఇప్పటికే మాఫీయా నేపథ్యంలో పలు చిత్రాలను తెరకెక్కించిన ఈ వివాదాస్పద దర్శకుడు ఇప్పుడు హైదరాబాద్ వేదిక తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన డాన్ నయీం జీవిత కథతో సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అనంతపురం ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన రక్తచరిత్ర సినిమాను కూడా రెండు భాగాలుగా తెరకెక్కించిన వర్మ ఇప్పుడు నయీం కథను మూడు భాగాలుగా రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు. ' నయీముద్దీన్‌కు సంబందించిన చాలా అంశాలను తెలుసుకున్నాను. ఇన్నేళ్ల అతని నేర చరిత్ర వింటుంటూ రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి. నయీం నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్ఫార్మర్గా మారటం తరువాత అండర్ వరల్డ్ డాన్‌గా ఎదగటం లాంటి అంశాలు భయం కలిగిస్తాయి. ఇంత విషయం ఉన్న కథను ఒక్క సినిమాలో చెప్పటం కష్టం. అందుకే నయీం కథను మూడు భాగాలుగా తెరకెక్కిస్తా', అంటూ వర్మ ప్రకటించాడు. Just gathered entire information on Nayeemuddin from multiple sources..His crimes over the years are full of truly hair rising details — Ram Gopal Varma (@RGVzoomin) 23 August 2016 Nayeemuddin's transformation from a naxalite to a police informant to a underworld gangster to become an all time Criminal no.1 is scary — Ram Gopal Varma (@RGVzoomin) 23 August 2016 Nayeemuddin's story is so complex and with so much of content that it's impossible to justify it by telling it in only one feature film — Ram Gopal Varma (@RGVzoomin) 23 August 2016 Am going to make a 3 part film on the Nayeem story ..Rakthacharitra had only two parts..Nayeem will have 3 parts — Ram Gopal Varma (@RGVzoomin) 23 August 2016 -
‘నయీమ్’ ఎఫ్ఐఆర్లో మండలి డిప్యూటీ చైర్మన్
-
‘నయీమ్’ ఎఫ్ఐఆర్లో మండలి డిప్యూటీ చైర్మన్
నేతి విద్యాసాగర్ పేరు ప్రస్తావన ► నయీమ్ బారినుంచి కాపాడాలంటూ నేతి దగ్గరికెళ్లా.. నయీమ్‌తోనే నేరుగా మాట్లాడుకొమ్మన్నాడు ► తర్వాత తనే ఫోన్ చేశాడు.. నయీమ్ ఫోన్ చేస్తాడని చెప్పాడు ► భువనగిరి పీఎస్‌లో వ్యాపారి నాగేందర్ ఫిర్యాదు.. ఎఫ్ఐఆర్ నమోదు సాక్షి ప్రతినిధి, నల్లగొండ గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు, ప్రజాప్రతినిధుల్లో కొందరు నయీమ్‌కు సహకరించారని ఇప్పటివరకు ఆరోపణలు పరోక్షంగా రాగా, తొలిసారి ఓ ప్రజాప్రతినిధి పేరును ఈ కేసులో పోలీసులే ప్రస్తావించడం రాజకీయ సంచలనానికి దారితీసింది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్, నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పేరును నయీమ్ కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్ఐఆర్)లో పోలీసులు ప్రస్తావించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన వ్యాపారి, తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్ (57) ఈ నెల 17న ఇచ్చిన ఫిర్యాదు మేరకు భువనగిరి టౌన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (నంబర్ 234/2016)లో నేతి పేరు ప్రస్తావించారు. ‘‘నయీమ్ నుంచి నాకు బెదిరింపులు రావడంతో, కాపాడాలంటూ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ను కలిశా. నేరుగా నయీమ్‌ను కలిసి మాట్లాడుకోవాలని ఆయన సూచించారు. తర్వాత కొన్ని రోజులకు మా పొరుగుంటికి విద్యాసాగర్ ఫోన్ చేశారు. నా సెల్ స్విచాఫ్ వస్తోందని, వెంటనే నాతో కాల్ చేయించాలని వారికి చెప్పారు. దాంతో నేను నా మొబైల్ నుంచి విద్యాసాగర్‌కు ఫోన్ చేశాను. ‘ఫోన్ స్విచాన్ చేసి పెట్టుకో. నయీమ్ ఫోన్ చేస్తాడు’ అని ఆయన నాకు చెప్పారు’’ అంటూ నాగేందర్ లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చినట్టు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఇలా మూడు నాలుగుసార్లు విద్యాసాగర్ పేరు ప్రస్తావనకు రావడం గమనార్హం. ఎఫ్ఐఆర్లో ఏముందంటే... భువనగిరిలో శివ పార్బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్ పేరిట నాగేందర్ రైస్ మిల్లు వ్యాపారం చేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు మంచాల ఆటో సర్వీస్ పేరుతో భువనగిరిలోనే పెట్రోల్ బంక్ నడుపుతున్నారు. నయీమ్‌ను కలవాలంటూ అతని అనుచరులుగా చెప్పుకునే పాశం శ్రీనివాస్, మరో వ్యక్తి నాగేందర్ ఆఫీసు మేనేజర్ కృష్ణకు మార్చి 8న సమాచారమిచ్చారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మార్చి 17న నాగేందర్‌కు పాశం 9866144889 నంబర్ నుంచి కాల్ చేశాడు. ‘మర్నాడు నయీమ్ భాయ్‌ని కలవాలి. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటా’యని బెదిరించాడు. నయీమ్‌కు తెలిసిన వ్యక్తి అయిన నేతి విద్యాసాగర్ (ఎమ్మెల్సీ) తనను రక్షించగలడని మార్చి 17న ఆయనను హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో నాగేందర్ కలిశాడు. నయీమ్, అతని అనుచరుల నుంచి రక్షించాలని కోరాడు. నయీమ్నే నేరుగా కలిసి మాట్లాడుకొమ్మని విద్యాసాగర్ సూచించారు. మార్చి 18న పాశం, మరో ఇద్దరు కలిసి నాగేందర్‌ను భువనగిరి రేణుకా ఎల్లమ్మ గుడి నుంచి డస్టర్ కారులో కళ్లకు గుడ్డలు కట్టి ఘట్కేసర్, ఔటర్రింగురోడ్డు దాటించి తీసుకెళ్లారు. తర్వాత నలుపు ఎక్స్‌యూవీ 500 కారులోకి మార్చి చివరికి నయీమ్ వద్దకు తీసుకెళ్లారు. నయీమ్ ముగ్గురు 20 ఏళ్ల సాయుధ యువతులతో కలిసి ఉన్నాడు. తనకు రూ.5 కోట్లు తనకు ఇవ్వాలన్నాడు. లేదంటే నాగేందర్‌ను, అతని కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. చివరికి రూ.కోటి ఇచ్చేందుకు నాగేందర్ అంగీకరించాడు. ఏప్రిల్ 30లోపు డబ్బులివ్వాలని, లేదంటే నాగేందర్ కొడుకుల్లో ఒకరిని చంపేస్తానని, తర్వాత మిగతా వాళ్లనూ అంతం చేస్తానని నయీమ్ హెచ్చరించాడు. ‘‘మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడిని చంపినట్టుగానే నీ కొడుకునూ హత్య చేస్తా. రోడ్డు ప్రమాదంగా చిత్రిస్తా, ఎవరూ పసిగట్టలేరు కూడా’’ అని నాగేందర్‌ను బెదిరించాడు. తర్వాత నాగేందర్‌ను గంతలు కట్టి తీసుకెళ్లి భువనగిరి రేణుకా ఎల్లమ్మ గుడి దగ్గర దింపేశారు. తర్వాత ఏప్రిల్ 30న నాగేందర్ పక్కింటి వ్యక్తికి ఎమ్మెల్సీ విద్యాసాగర్ ఫోన్ చేశారు. నాగేందర్ ఫోన్ స్విచాఫ్ వస్తోందని అతనికి చెప్పాడు. వెంటనే నాగేందర్‌తో తనకు ఫోన్ చేయించాలన్నాడు. దాంతో నాగేందర్ తన మొబైల్ నుంచి విద్యాసాగర్‌కు ఫోన్ చేశాడు. ‘నయీమ్ ఫోన్ చేస్తాడు, ఫోన్ ఆన్‌లోనే ఉంచుకో’ అని నాగేందర్‌కు విద్యాసాగర్ చెప్పాడు. ఉదయం 8:30 ప్రాంతంలో నాగేందర్‌కు నయీమ్ ఫోన్ చేశాడు. వెంటనే డబ్బు చెల్లించాలని బెదిరించాడు. తన అనుచరులు పాశం, సుధాకర్ల మీద నాగేందరే పీడీ యాక్టు పెట్టించాడని అనుమానించాడు. (ఇదంతా నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదులో ఉందని మాత్రమే ఎఫ్ఐఆర్లో పోలీసులు ప్రస్తావించారు) -
ఛత్తీస్‌గఢ్‌లో నయీమ్గ్యాంగ్ డెన్లు!
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఇతర రాష్ట్రాల్లో సృష్టించిన ఆగడాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దృష్టి సారించింది. రాష్ట్రంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆస్తులు, భూ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ నయీమ్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఛత్తీస్‌గఢ్‌లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కస్టడీలో ఉన్న నయీమ్ వంట మనిషి ఫర్హానా, డ్రైవర్ భార్య అఫ్సా, ఫయీమ్, అతని భార్య షాహిన్‌లను సిట్ అధికారులు ఛత్తీస్‌గఢ్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఇది వరకే గుర్తించిన రెండు డెన్లలో సోదాలు నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి ఛత్తీస్‌గఢ్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ కూడా పెద్ద మొత్తంలో భూ డాక్యుమెంట్లు, ఇళ్ల స్థలాలు, అత్యాధునిక ఆయుధాలు బయటపడినట్లు పోలీసు వర్గాల సమాచారం. అక్కడి సంబంధాలపై ఆరా..! ఛత్తీస్‌గఢ్‌లో నయీమ్ ఏం చేసేవాడనే దానిపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు ఎందుకు వచ్చేవాడు, ఎవరెవరిని కలిసే వాడనే విషయం మీద దృష్టి కేంద్రీకరించారు. అక్కడ కూడా నయీమ్ ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో డంపులు ఏర్పాటు చేసినట్లు డెన్లలో లభించిన ఆధారాల ద్వారా వెల్లడైనట్లు తెలిసింది. వాటిని గుర్తిం చేందుకు స్థానిక పోలీసుల సహకారంతో సిట్ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. -
నయీమ్ ఉదంతంలో 30 కేసులు
సిట్ చీఫ్ నాగిరెడ్డి సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ వ్యవహారంలో గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 30 కేసులు నమోదు చేసినట్టు సిట్ చీఫ్ నాగిరెడ్డి వెల్లడించారు. ఇప్పటిదాకా జరిపిన దర్యాప్తులో వివిధ ప్రాంతాల్లో నయీమ్ అనుచరుల నుంచి భూమి పత్రాలు, ఇళ్ల స్థలాలు, అక్రమ ఆయుధాలు, బంగారు ఆభరణాలు, పేలుడు పదార్థాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గురువారం నయీమ్ అనుచరుడు ఫయాజ్ అలియాస్ అమీర్‌ను శంషాబాద్విమానాశ్రయంలో అరెస్టు చేసినట్టు చెప్పారు. అతని నుంచి తపంచా, మూడు రౌండ్ల తూటాలు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. నయీమ్, అతని అనుచ రులకు సంబంధించి ఎలాంటి వందతులనూ ప్రజలు నమ్మొద్దని, మీడియా ప్రచారం చేయొద్దని, ప్రచురించొద్దని నాగిరెడ్డి కోరారు. లేదంటే ప్రజల్లో గందరగోళానికి దారి తీస్తుందన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు సిట్ పక్కా చర్యలు చేపడుతోందని వివరించారు. ఈ విషయంలో అనుమానాలు అక్కర్లేదన్నారు. కేసుకు సంబంధించి ఏ సమాచారాన్నయినా 9440627218 నంబరు ద్వారా సిట్‌కు తెలియజేయాలని కోరారు. సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నయీమ్ ఉదంతంలో జిల్లాలవారీగా నమోదైన కేసులు... నల్గొండ 14, మహబూబ్‌నగర్ 4, సైబరాబాద్ (ఈస్ట్, వెస్ట్) 7, కరీంనగర్ 4, నిజమాబాద్ 1, మొత్తం 30 -
కరీంనగర్లో నయీం అనుచరుల అరెస్ట్
కరీంనగర్: గ్యాంగ్‌స్టర్ నయీం ముఠాకు చెందిన రమేష్, గోవర్ధనచారి అలియాస్ గోపిలను కరీంనగర్ జిల్లా కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నయీం అనచరులను జగిత్యాల కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించింది. నయీం అనుచరుల నుంచి 2 తుపాకులు, 5 బుల్లెట్లు, 15 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు, 1.52 లక్షల రూపాయల నగదు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ఎన్కౌంటర్లో నయీం హతమైన తర్వాత అతని కుటుంబసభ్యులు, బంధువులతో పాటు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
నయీం బ్యాంక్ ఎకౌంట్ లేకుండానే..
హైదరాబాద్: పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం వ్యవహారంలో సిట్ చురుగ్గా దర్యాప్తు చేస్తోంది. సిట్ దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. నయీం ఎలాంటి బ్యాంక్ ఎకౌంట్ లేకుండా వేలకోట్ల రూపాయల లావాదేవీలు నడిపినట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. బంగారం, నగదుతో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లోని నయీం ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు ఉండవచ్చని సిట్ అంచనా వేస్తోంది. నయీం బినామీల పేరిట ఇప్పటివరకు 1015 ఎకరాల భూమి, లక్షా 67 వేల 117 చదరపు గజాల ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం వీటి విలువ 14.39 కోట్లు రూపాయలు కాగా, బహిరంగ మార్కెట్ విలువ 150 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని భావిస్తున్నారు. -
'నయీమ్‌తో నాకెలాంటి సంబంధాలు లేవు'
-
5 రోజుల కస్టడీకి నయీం భార్య
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నయీం భార్య హసీనా బేగం, చెల్లెలు సలీమా బేగం బావమరిది అబ్దుల్ మతిన్, మరో మహిళ ఖలీమాబేగంలను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నలుగురిని మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి షాద్‌నగర్ పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. నయీం ఆగడాలకు సంబంధించిన విషయాలపై మరిన్ని కోణాల్లో పోలీసులు విచారించనున్నారు. -
'నయీమ్‌తో నాకెలాంటి సంబంధాలు లేవు'
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో నాకెలాంటి సంబంధాలు లేవని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం డీజీపీని కలసిన కర్నె ప్రభాకర్ అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... నయీమ్ విషయంలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కర్నె విజ్ఞప్తి చేసినట్లు కర్నె ప్రభాకర్ తెలిపారు. అంతకుముందు డీజీపీ కార్యాలయంలో అనురాగ్ శర్మను కర్నెప్రభాకర్ కలిసి.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ విషయంలో నాపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
సిమ్‌కార్డుల గుట్టు తేలేనా?
* నయీమ్ డెన్ నుంచి స్వాధీనం చేసుకున్న 700 సిమ్‌కార్డులపై దర్యాప్తు షురూ * టెలికం కంపెనీల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసు దర్యాప్తు వేగం అందుకుంది. ఇన్నాళ్లు భూ డాక్యుమెంట్లు, ఇళ్లపై దృష్టిపెట్టిన పోలీసులు ఇప్పుడు సాంకేతిక సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు. పుప్పాలగూడ అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీమ్ ఇంటితో పాటు వంట మనిషి ఫర్హా నా పేరిట తిరుమల గార్డెన్లో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్, అంజలీ గార్డెన్లో ఉన్న మరో ఇంటి నుంచి లభించిన మొత్తం 700 సిమ్‌కార్డులపై విచారణను వేగవంతం చేశారు. ఆయా నెట్‌వర్క్‌ల సిమ్‌కార్డులతో ప్రత్యేక పోలీసు బృందం ఆయా కంపెనీలకు వెళ్లింది. ఆ సిమ్‌కార్డులన్నీ ఎవరి పేరిట ఇచ్చారు? చిరునామాలేంటి? అన్న వివరాలతోపాటు కాల్ డేటా జాబితాను సేకరిస్తున్నారు. తప్పుడు చిరునామాలతో.. : చాలా సిమ్‌కార్డులను తప్పుడు చిరునామాలతో తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. కొన్ని హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందినవారి ఆధార్ కార్డులు సమర్పించినట్టు గుర్తించారు. సిమ్‌కార్డులపై పూర్తిస్థాయి దర్యాప్తుతో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. అలాగే కొన్ని కాల్‌డేటా వివరాలను డాక్యుమెంటేషన్ రూపంలో రెడీ చేస్తున్నారు. వారిద్దరికీ మరో ఆరు రోజుల కస్టడీ.. అల్కాపురి కాలనీలోని నయీమ్ ఇంట్లో పట్టుబడ్డ ఫర్హానా, అఫ్సాలను 12 రోజుల పోలీసు కస్టడీ ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి న్యాయస్థానం మంగళవారం విచారించింది. తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల్లో ఆస్తులున్నాయని, మరిన్ని వివరాలు సేకరించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వాదించారు. అయితే న్యాయమూర్తి 6 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు బుధవారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి వారిద్దరిని కస్టడీలోకి తీసుకోనున్నారు. వీరిని రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీలోని నయీం ఆస్తులను గుర్తించేందుకు తీసుకువెళ్లనున్నారు. సమీరుద్దీన్ కస్టడీకి పిటిషన్ పోలీసులు సోమవారం అరెస్టు చేసిన నయీమ్ డ్రైవర్ సమీరుద్దీన్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హయత్‌నగర్ న్యాయస్థానంలో మంగళవారం పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. నల్లగొండకు చెందిన మహ్మద్ రియాజుద్దీన్ కుమారుడు మహ్మద్ సమీరుద్దీన్ ఏడాది క్రితం నుంచే నయీమ్, అతని అల్లుడైన ఫహీంల వద్ద పని చేసేవాడు. సమీరుద్దీన్‌ను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. -
నయీమ్‌పై సెంచరీ దాటిన ఫిర్యాదులు!
నాలుగు రోజుల్లో టోల్‌ఫ్రీ నంబర్‌కు 124 ఫిర్యాదులు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అరాచకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఫిర్యాదులు స్వీకరించడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఇప్పటివరకు 124 ఫిర్యాదులు వచ్చాయి. నయీమ్ ఎన్ కౌంటర్లో మరణించినా.. తొలుత ఫిర్యాదులు చేసేందుకు బాధితులు వెనుకాడారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు మొదటి రోజు కేవలం 14 ఫిర్యాదులే వచ్చాయి. దీంతో ఫిర్యాదులను గోప్యంగా ఉంచుతామని, బాధితులు ముందుకు రావాలని సిట్ చీఫ్ వై.నాగిరెడ్డి ప్రకటించడంతో.. ఫిర్యాదులు పెరిగాయి. ఈ నాలుగు రోజుల వ్యవధిలో 124 ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. వాటిలో ఎక్కువ భాగం నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచే వచ్చినట్లు తెలిసింది. రియల్ ఎస్టేట్, భూలావాదేవీల సెటిల్మెంట్లు, బలవంతపు వసూళ్లకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. కిడ్నాపింగ్‌కు సంబంధించి 22 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. అయితే ఫిర్యాదులన్నీ కూడా నయీమ్ అనుచరులు తమ భూములను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వాటిని తిరిగి ఇప్పించాలంటూ వస్తున్నాయి. దీంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. ఫిర్యాదు చేసే వారు ఆధారాలేమైనా ఉంటే పోలీసు స్టేషన్లలో అందజేయాలని, న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయని నచ్చచెబుతున్నారు. ఇక పలు ఫిర్యాదుల్లో సిట్ అధికారులకు సందేహాలు తలెత్తుతున్నాయి. భూలావాదేవీలకు సంబంధించిన సెటిల్మెంట్లలో వాస్తవమెంత, నిజమైన బాధితులెవరనే విషయాన్ని తేల్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఫిర్యాదులను సంబంధిత పోలీస్స్టేషన్లకు పంపి పరిశీలన చేయిస్తున్నారు. సిట్ కస్టడీకి నయీమ్ బంధువులు నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు ఇప్పటి వరకు 22 మందిని అరెస్టు చేశారు. వారిలో కీలకంగా భావిస్తున్న భార్య హసీనా, అక్క సలీమాతో పాటు ముఖ్య అనుచరులను కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయనుంది. ఇప్పటికే కొందరిని విచారించేందుకు అవకాశమివ్వాలని కోర్టును కోరింది. వరుస సెలవుల నేపథ్యంలో ఈ విజ్ఞప్తిపై విచారణ జరగలేదు. మంగళవారం అనుమతి వచ్చే అవకాశముంది. నయీమ్ అరాచకాలన్నీ అతడి భార్య హసీనా, సోదరి సలీమాకు తెలుసనని.. వారి ఆ సమాచారాన్ని రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. -
విశాఖలోనూ నయీమ్ కదలికలు
రైల్వే ప్లాట్‌ఫారాల సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న సిట్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో కూడా నేర సామ్రాజ్యాన్ని విస్తరించాలని చూశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నయీ మ్ గత రెండు, మూడు నెలల్లో పలుమార్లు విశాఖకు వచ్చి వెళ్లాడని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆదివారం సిట్ అధికారులు విశాఖలో పర్యటించారు. ప్రధానంగా రైల్వేస్టేషన్‌పై దృష్టి సారించి.. ఆర్పీఎఫ్, రైల్వే పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. విశాఖ నుంచి వెళ్లే గోదావరి, దురంతో ఎక్స్‌ప్రెస్‌ల రిజర్వేషన్ టికెట్ల వివరాలను తీసుకున్నారు. ప్లాట్‌ఫారాల సీసీ టీవీ ఫుటేజీలను తీసుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు రైళ్లలో ప్రయాణించిన సందర్భాల్లో నయీమ్ నేరుగా సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో కాకుండా ముందు స్టేషన్లలోనే దిగిన ట్టు అధికారులు గుర్తించారు. వరంగల్, జనగామ, ఘట్కేసర్లలో దిగినట్టు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నేరసామాజ్రాన్ని విస్తరించుకున్న నయీమ్ విశాఖ ఎందుకొచ్చినట్టు? ఏమైనా సెటిల్మెంట్లు, దందాలు చేశాడా? ఇక్కడ పోలీసు అధికారులతో కూడా అతనికి పరిచయాలు ఉన్నాయా? ఇక్కడ కూడా అతనికి అనుచరులు ఉన్నా రా? అన్న అంశాలపై సిట్ అధికారులు విచారణ చేపట్టినట్టు సమాచారం. -
పైసలంటే లక్షలు... రూపాయలంటే కోట్లు!
* డబ్బును లెక్కపెట్టడంలో నయీమ్ అలవాటిదీ * నక్సలైట్లను చంపడం తనకు వ్యసనం * ఎన్నారై శ్రీధర్ పేరిట వాట్సప్‌లో హల్చల్ చేస్తున్న మెసేజ్ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ లెక్కల్లో పైసలంటే లక్షలు.. రూపాయలంటే కోట్లు. వందలాది మందిని అనేక రూపాల్లో బెదిరించి కోట్ల రూపాయల వసూలు చేసిన నయీమ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ బాధితుడు కొంచెం ధైర్యం చేసి నయీమ్ ఆగడాలను సమాజానికి చెప్పే ప్రయత్నం చేశాడు. భువనగిరికి చెందిన ఎన్నారై శ్రీధర్ డోగిపర్తి పేరిట వాట్సప్‌లో హల్చల్ చేస్తున్న ఈ ప్రింట్ మెసేజ్.. నయీమ్ స్వరూపాన్ని కళ్లకు కడుతోంది. నయీమ్‌ను మట్టుబెట్టిన పోలీసులు, సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతునట్టు ఆ మెస్సేజ్‌లో పేర్కొన్నారు. అందులో ఉన్న అంశాల ఆధారంగా నయీమ్ డీల్ తీరు.. ‘‘భువనగిరిలోని నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీను నాకు (శ్రీధర్ డోగిపర్తి) ఫోన్ చేసి నయీమ్ కలవాలన్నాడని చెప్పాడు. ఎందుకు రావాలంటే.. ‘భాయ్ ఆర్డర్’ అని హెచ్చరించాడు. ఈ ఏడాది జనవరి 29న ఉదయం భువనగిరిలోని సాయిబాబా ఆలయం వద్ద వాహనంలో ఎక్కించుకున్నారు. అందులో పాశం శ్రీను, డ్రైవర్ కత్తుల జంగయ్య, భువనగిరి జెడ్పీటీసీలు ఉన్నారు. నా సెల్‌ఫోన్ తీసేసుకున్నారు, ఆయుధాలేమైనా ఉన్నాయని తనిఖీ చేశారు. సాయిబాబా గుడి, అయ్యప్ప, ఎల్లమ్మ దేవాలయాల వద్ద పూజలు చే శాక తుక్కుగూడకు తీసుకెళ్లారు. అక్కడ మరో వాహనం (బ్లాక్ ఎక్స్‌యూవీ500, నంబర్ టీఎస్08ఈబీ0645) ఎక్కించి.. నా కళ్లు మూసేశారు. అరగంట ఒక పెద్ద గెస్ట్‌హౌస్‌లోకి తీసుకెళ్లి.. కళ్లు తెరవమన్నారు. ఏకే 47లు ధరించిన ఇద్దరు గన్మన్లు మరోసారి చెక్ చేసి న యీమ్ ఉన్న గదిలోకి తీసుకెళ్లారు. నయీమ్: అన్నా.. నన్ను గుర్తు పట్టావా? నేను: గుర్తుపట్టాను.. 28 ఏళ్ల కింద మా నాన్న దగ్గరకు వచ్చారు కదా... నయీమ్: ఎలా ఉన్నాడు మీ నాన్న నేను: చనిపోయి ఐదేళ్లయింది నయీమ్: మీనాన్న చాలా ధైర్యవంతుడు. అప్పట్లో నేను స్టూడెంట్ లీడర్‌గా ఉన్నప్పుడు భయపెట్టే ప్రయత్నం చేసినా భయపడలేదు. (కొంత సాధారణ సంభాషణ) నయీమ్: నేను నక్సలైట్ల మీద పోరాటం చేస్తున్నా.. వాళ్లను చంపడం నాకు వ్యసనం. దానికోసం యుద్ధం చేసే వాళ్లుగానీ, డబ్బులిచ్చే వాళ్లుగానీ కావాలి. నువ్వు ఒకరిని చంపమంటే చంపలేవు కదా.. అందుకే డబ్బు రూపంలో సాయం చేయాలి. రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలి. నేను: ఏమన్నా రెండు కోట్లు అంటూ జోక్ చేస్తున్నావా? నయీమ్: నీకు జోకర్లా క న్పిస్తున్నానా..? నీకు సీరియస్ తెలియడం లేదు. (ఐపీఎస్ అధికారి వ్యాస్, సాంబశివుడు, కోనపురి రాములు, పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి, అచ్చంపేట లో రిపోర్టర్, భువ నగిరికి చెందిన సోమ రాధాకృష్ణను చంపిన విషయాలు వివరించా డు) నేను: అంత డబ్బు ఇచ్చుకోలేను నయీమ్: డబ్బు ఇవ్వకు వెళ్లిపో.. మీవాళ్లు ఎక్కడుంటారో నాకు తెలుసు. మీ బావ కారుకు యాక్సిడెంట్ అవుతుంది. మామూలు యాక్సిడెంటని మీరనుకుంటారు. కానీ అది నేనే చేయించానని ఫోన్ చేస్తా.. నాకు కోడిని కోసినా, మేకను కోసినా, మనిషిని కోసినా ఒకటే.. చెప్పింది చెయ్యి. లేకుంటే అమెరికా నుంచి రెండు గన్స్ తీసుకురా.. నీ దగ్గర ఎంత ఉందో నాకు తెలుసు. చచ్చేటప్పుడు ఏం తీసుకుపోతావు? ఏదీ నీతో రాదు. నువ్వు పోతే రెండు రోజులు ఏడ్చి.. మర్చిపోతారు. నేను: పది లక్షలు ఇస్తానన్నా.. నయీమ్: పది పైసలు (పదిలక్షలు) ఇస్తావా.. దాని కోసం ఇంత స్కెచ్ వేయాలా? నువ్వు కావాలంటే రెండు కోట్లు ఇవ్వొచ్చు. కానీ 50 లక్షలు ఇవ్వు. అదే ఫైనల్. నేను: నువ్వు కావాలంటే డబ్బు లాగడం పెద్ద పనికాదు. ఉన్న ఊరు కన్నతల్లిలాంటిది అంటారు.. భువనగిరి మిడిల్ క్లాస్ వాళ్లను ఎందుకు ఇబ్బందిపెడతారు? నయీమ్: నాకు మీతో స్నేహం చేయాలని ఉంది. ఉట్టిగానే చేయమంటే చేస్తావా? నీకు నష్టం చేస్తే.. భయ్యాతో నష్టం జరిగింది, కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి స్నేహం చేద్దామనుకుంటారు. (ఇదంతా జరిగాక తిరిగి తీసుకొచ్చి, సెల్‌ఫోన్ ఇచ్చి వదిలేశారని.. ఫిబ్రవరి 20, 2016 రోజున తమ అమ్మతో కలసి వెళ్లి పాశం శ్రీను ఇంటికి వెళ్లి రూ.50 లక్షలు ఇచ్చానని వాట్సప్ మెసేజ్‌లో ఉంది) -
మహిళలు, పిల్లలను అమ్మేశాడా?
* నయీమ్ నివాసాల్లో జరుగుతున్న సోదాల్లో ఆధారాలు * గ్యాంగ్‌స్టర్‌కు సహకరించిన వారిని ప్రశ్నిస్తున్న సిట్ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ మహిళలు, పిల్లలను సైతం అమ్మేశాడా.., మనుషుల అక్రమ రవాణాకూ పాల్పడ్డాడా అనే కోణంలో సిట్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నయీమ్ భూదందాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు ఇప్పటివరకు అనేక ఆధారాలు వెలుగు చూశాయి. అయితే అధికారులు చేస్తున్న సోదాల సందర్భంగా మహిళలు, చిన్న పిల్లల అక్రమ రవాణా చేసినట్లుగా ఆధారాలను గుర్తించారు. భూసెటిల్‌మెంట్లకు వచ్చే కొంత మంది అనుచరులు మహిళలు, చిన్న పిల్లలను నయీమ్ వద్దకు తీసుకొచ్చేవారని.. అందులో నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని సమాచారం. వారిని ఉపాధి కల్పిస్తామనే ఆశ చూపి ముగ్గులోకి లాగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా సిట్‌కు కొన్ని ఫిర్యాదులు అందినట్లు సమాచారం. వాటిని గోప్యంగా ఉంచుతున్న అధికారులు.. కొంత మంది బాధ్యులను గుర్తించినట్లు తెలిసింది. వారిపై ట్రాఫికింగ్ (మనుషుల అక్రమ రవాణా)కు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పోలీసు అధికారులపై ఆరా మరోవైపు నయీమ్‌తో సన్నిహితంగా మెలిగిన పోలీసు అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. సిట్ దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. నయీమ్ డైరీలో పేర్లున్న పోలీసు అధికారులకు అతడితో ఎలాంటి సంబంధాలున్నాయి. నయీమ్ దందాల్లో వీరి ప్రమేయం ఏమిటనే దానిపై సిట్ ఆరా తీస్తోంది. ఆదివారం ఏపీ పోలీసు విభాగానికి చెందిన ఒక రిటైర్డ్ అధికారిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని నాలుగు గంటల పాటు విచారించినట్లు తెలిసింది. ఆయన నల్లగొండ జిల్లాలో విధులు నిర్వహించినప్పుడు నయీమ్‌తో సన్నిహితంగా మెలిగారని, భారీగా ఆస్తులు సమకూర్చుకున్నారని ఆరోపణలున్నాయి. నయీమ్‌తో సంబంధమున్న వారందరిపై ఒకట్రెండు రోజుల తర్వాత మూకుమ్మడిగా దాడు లు చేయాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో దర్యాప్తు రాష్ట్రవ్యాప్తంగా నయీమ్‌కు సం బంధించిన ఇళ్లను గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేస్తున్నారు. వాటిలో నిర్వహిస్తున్న సోదాల్లో రూ.వందల కోట్ల ఆస్తులు వెలుగు చూస్తున్నాయి. అంతేకాదు నయీమ్‌కు ఏపీ, గోవా, బెంగళూరు, ఒడి శా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్‌లలోనూ నివాసాలున్నట్లు వెల్లడైంది. అక్కడా ప్రత్యేక బృందాలను పంపి దర్యాప్తు చేయిస్తున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లోనూ పోలీస్ ఇన్ఫార్మర్గా..
-
'నయీం 28 ఎకరాలు కబ్జా చేసి..మా వాళ్లను చంపేశాడు'
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం అరాచకాలపై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, ఆదిభట్లలో నయీంపై ఆదివారం పెద్ద సంఖ్యలో పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. 12 ఏళ్ల క్రితం తమ 28 ఎకరాల పొలాన్ని నయీం గ్యాంగ్ కబ్జా చేయడంతో పాటు తన భర్త, కొడుకును పొట్టన పెట్టుకున్నాడని బాధితురాలు మల్లమ్మ ఆరోపిస్తోంది. దీనిపై ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆదిభట్లలో తమ బంధువులను కూడా నయీం ముఠా బెదిరించి భూ కబ్జాకు పాల్పడినట్లు ఆమె చెబుతోంది. కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఇళ్లల్లో పాచిపని చేస్తూ జీవనం సాగిస్తున్నానని, ప్రభుత్వం ఆదుకోవాలని మల్లమ్మ కోరుతుంది. -
నయీం డెన్‌లో హత్యలు
-
ఛత్తీస్‌గఢ్‌లోనూ పోలీస్ ఇన్ఫార్మర్గా..
హైదరాబాద్: ఉమ్మడి ఏపీలో మాదిరిగానే నయీమ్ ఛత్తీస్‌గఢ్ పోలీసులకు నక్సల్స్‌కు సంబంధించిన సమాచారం అందించాడా? టెక్‌మధుతో కలసి ఎప్పటికప్పుడు ఉప్పందించాడా? అందుకే అక్కడ పెద్దఎత్తున ఎన్కౌంటర్లు జరిగాయా? అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు! వరంగల్‌కు చెందిన మాజీ మావోయిస్టు తోట కుమార స్వామి అలియాస్ టెక్ మధు అలియాస్ శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో నయీమ్ ఈ కార్యకలాపాలు సాగించినట్టు సమాచారం. మావోయిస్టులకు రాకెట్ లాంచర్ల తయారీలో కీలకపాత్ర పోషించిన టెక్‌మధు.. ఛత్తీస్‌గఢ్‌లో నయీమ్ గ్యాంగ్ కార్యకలాపాలను పర్యవేక్షించేవాడు. భువనగిరిలో అరెస్టయిన మరో మాజీ మావోయిస్టు రెవల్లి శ్రీనివాస్ కూడా టెక్మధుకు సాయంగా ఉన్నట్టు తేలింది. వీరి ద్వారా సమాచారం సేకరించిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు.. మావోయిస్టుల ఏరివేతకు సన్నద్ధమయ్యారు. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అక్కడ అత్యాధునిక ఆయుధాలతోపాటు 2 దేశీయ ఆయుధాలు దొరికాయి. ఇవి బిహార్‌లో రూ.వెయ్యికే దొరుకుతాయి. ఈ అత్యాధునిక ఆయుధాలు ఎక్కడ్నుంచి వచ్చాయనే దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
అన్న రాఖీ పండుగకు వస్తే బాగుండు
* నయీమ్ వల్ల మేమంతా చెల్లాచెదురయ్యాం * 17 ఏళ్ల తర్వాత కలుసుకున్నాం * మీడియాతో బెల్లి లలిత అక్కాచెల్లెళ్లు తుర్కపల్లి: ‘‘గ్యాంగ్‌స్టర్ నయీమ్ కారణంగా 17 ఏళ్లుగా మా నలుగురం అక్కాచెల్లెళ్లం, అన్నయ్య విడిపోయాం. నయూమ్ చనిపోయూడని తెలిసి ఈ రోజు ముగ్గురం అక్కాచెల్లెళ్లం కలుసుకున్నాం.. మా అన్నయ్య జాడ తెలియదు. ఈ రాఖీ పండుగకైనా వస్తే బాగుండు.. మేమంతా కలుసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాం’’ అని బెల్లి లలిత సోదరీమణులు బాలకృష్ణమ్మ, గుంటి కవిత, సరిత అన్నారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ ‘‘మేము నలుగురం ఆడపిల్లలం, ఒక అన్నయ్య ఉన్నాడు. మా నాన్న ఒగ్గు కథలు చెప్పి కుటుంబాన్ని పోషించేవాడు. చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో అన్న బెల్లి కృష్ణ ఆలనా పాలనా చూస్తూ మా పెళ్లిళ్ల్లు కూడా చేశాడు. తెలంగాణ సాధన కోసం లలిత కాలుకు గజ్జెకట్టి ఎన్నో వేదికల మీద తన ఆట పాటలతో జనాన్ని ఉర్రూతలూగించింది. భువనగిరి నియోజకవర్గంలో రాజకీయంగా ఎదుగుతుం దన్న కారణంతో కొంతమంది నాయకులు కక్షగట్టి 1999లో లలితను హత్య చేయించారు. అదే ఏడాది లలిత చెల్లెలు సరిత భర్త కరుణాకర్‌ను భువనగిరిలో హత్య చేశారు. ఆ తరువాత మా అక్క బాల కృష్టమ్మ భర్తను కూడా హత్య చేశారు. అలా ముగ్గురి హత్యలు జరిగిన తర్వాత మా కుటుంబం ఛిన్నాభిన్నమైంది. మా అన్న ఎక్కడున్నాడో కానీ.. రాఖీ పండుగకు రావాలని ఎదురుచూస్తున్నాం’’ అని చెప్పారు. -
హీరోయిన్ స్థలాన్ని కబ్జా చేసిన నయీం
-
హీరోయిన్ స్థలాన్ని కబ్జా చేసిన నయీం
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం భూ దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నయీం భూకబ్జా బాధితుల్లో ఓ ప్రముఖ హీరోయిన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నానక్ రాం గూడ ప్రాంతంలోని ఆమె ఆరు ఎకరాల స్థలాన్ని నయీం కబ్జా చేసి మరీ స్వాధీనపరచుకున్నట్లు సమాచారం. అలాగే రంగారెడ్డి జిల్లా చార్టెడ్ అకౌంటెంట్ హత్యకేసులోనూ నయీం పాత్ర ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయి. ఈ నయవంచక దందాలో నయీంకు కొంతమంది పోలీసులు సైతం సహకరించినట్లు వెలుగుచూడటం ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని ఓ ఐపీఎస్ అధికారి పాత్రపై సిట్ దృష్టి పెట్టింది. కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ తన దందాను విస్తరించేందుకు నయీం సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకు సహకరించినందుకు పోలీసులకు రూ.5 కోట్లు అతడు చెల్లించినట్లు తెలుస్తోంది. తను చేసిన అక్రమాలన్నీ పూసగుచ్చినట్టు నయీం డైరీలో రాసుకున్న సంగతి తెలిసిందే. నయీం డైరీని విశ్లేషిస్తున్నకొద్దీ ఇలాంటి వాస్తవాలెన్నో వెలుగుచూస్తున్నాయని విశ్వసనీయవర్గాలు చెప్తున్నాయి. వికారాబాద్‌లో నయీంకు చెందిన 15 ఎకరాలు ఫాంహౌస్‌ను తాజాగా సిట్ అధికారులు గుర్తించారు. అలాగే దుర్గామాత సొసైటీలో 60 ప్లాట్లు నయీం కబ్జా చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ పోలీస్ అధికారికి శంషాబాద్‌లో భూమి ఉందని, ఆ పోలీస్ అధికారి ఈ లావాదేవీలను నయీం దగ్గరుండి నడిపించినట్లు సమాచారం. ఆ అధికారికి శంషాబాద్‌లో షాపింగ్ కాంప్లెక్స్‌తోపాటు 10 ఎకరాల్లో ఫంక్షన్ హాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లాలో ఓ న్యాయవాది హత్య వెనుక నయీం హస్తమున్నట్లు సమాచారం. రెండెకరాల స్థల వివాదంలో అతడు ఈ దురాగతానికి పాల్పడ్డాడని, ఇందుకు అతనికి పోలీసులు సైతం మద్దతు తెలిపారని అంటున్నారు. తనకు సహకరించినందుకుగాను కొందరు పోలీసులకు నయీం మంచి పోస్టింగ్‌లు ఇప్పించినట్టు వినిపిస్తోంది. వీటన్నింటిపైనా సిట్ దృష్టిపెట్టింది. ఆరోపణలు ఉన్న పోలీసులు, రాజకీయ నాయకులపై దర్యాప్తును ఎలా ముందుకు తీసుకెళ్లాలి? మరిన్ని ఆధారాల సేకరణపై సిట్ శనివారం సమావేశమైంది. -
నయీమ్ దాదా దర్బార్
-
నయీమ్ హతమైనా ఇంకా తగ్గని భయం?
నయీమ్ అరాచకాలపై స్పందించేందుకు వెనకడుగు వేస్తున్న బాధితులు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ హతమైనా అతడి బాధితుల్లో ఇంకా భయం వెంటాడుతోందా..? అతడి అనుచరులను అరెస్టు చేస్తున్నా ఏ మాత్రం భరోసా కలగడం లేదా? ప్రస్తుత పరిస్థితులు ఈ సందేహాలకు బలాన్ని చేకూర్చేలా కనిపిస్తున్నాయి. నయీమ్ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, రాజకీయ నాయకుల అండతో చెలరేగిపోయిన నయీమ్ సృష్టించిన అనేక అరాచకాలు మరింతగా బహిర్గతమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రియల్ఎస్టేట్ రంగానికి సంబంధించి నయీమ్, అతని అనుచరులు పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నయీమ్ వ్యవహారం పై దర్యాప్తు చేస్తున్న సిట్ చీఫ్ వై.నాగిరెడ్డి.. బాధితులెవరైనా ధైర్యంగా ఫిర్యాదు చేయాల్సింగా సూచిస్తూ, 9440627218 నంబర్ ను ప్రకటించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించా రు. కానీ ఈ నంబర్‌కు పెద్దగా ఫిర్యాదులు రావడం లేదని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. తొలి రోజు కేవలం 14 ఫిర్యాదులు మాత్రమే అందినట్లు తెలుస్తోంది. అవికూ డా చిన్నా చితకా అంశాలకు సంబంధించినవేనని సమాచారం. ప్రభుత్వం నుంచి తగిన భరోసా కలగకపోవడం వల్లే నయీమ్ బారినపడ్డ ‘పెద్ద’ వ్యక్తులు ఫిర్యాదు చేసేందుకు సంశయిస్తున్నట్లు చెబుతున్నారు. కొనసాగుతున్న దర్యాప్తు.. నయీమ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 12కేసులు నమోదవగా,22 మందిని అరెస్టు చేశారు. నయీమ్ కుటుంబీకులు, సన్నిహితుల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. వందల సంఖ్యలో లభించిన భూముల డాక్యుమెంట్లకు సంబంధించి రెవెన్యూ అధికారుల సహాయంతో పరిశీ లిస్తున్నారు. నయీమ్ డైరీలో కొంత మంది అత్యున్నత స్థాయి కలిగిన వారి పేర్లున్నట్లు సమాచారం. నయీమ్ అనుచరులందరి వద్ద గన్స్, బుల్లెట్లు, డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు లభిస్తున్నాయి. నయీమ్‌తో కొంత మంది బడా రాజకీయ నేతలు, పోలీసు అధికారులు దిగిన ఫోటోలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నివ్వెరపోతున్న అధికారులు నయీమ్ ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్‌ను పరిశీలించిన సిట్ అధికారులు నివ్వెరపోతున్నారు. తన శత్రువులుగా భావించిన వారి కదలికలు, టార్గెట్ చేసిన వ్యక్తుల సమాచారం మొత్తం ఎప్పటికప్పుడు సేకరించేందుకు దాదాపు వెయ్యి మందిని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. -
టాలీవుడ్‌తోనూ నయీం లింకులు !
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం తెలుగు సినీ పరిశ్రమలోనూ కొందరితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ‘రక్తచరిత్ర’తో స్ఫూర్తి పొందిన నయీం స్వీయ చరిత్రనూ తెరకెక్కించాలని భావించినట్లు సమాచారం. నయీంకు చెందిన డెన్స్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీల్లోని ఓ దాంట్లో దీనికి సంబంధించిన విషయాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో ఉన్న నయీం భువనగిరి అసెంబ్లీ సీటుపై కన్నేసినట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. ఈ సన్నాహాల్లో భాగంగానే ఈ సినిమానూ ఓ ప్రచారాస్త్రంగా వాడుకోవాలని భావించాడని తెలిసింది. నెగెటివ్ ఇమేజ్ తగ్గించుకునేందుకు... కరుడుగట్టిన నేరగాడైన నయీంకు మాజీ మావోయిస్టుగా, గ్యాంగ్‌స్టర్‌గానే పేరుంది. ఇతడి ఆగడాలు, చేసిన దారుణాలకు అంతే లేకపోవడంతో స్థానికంగానూ నయీం అంటే భయంతో పాటు చెడ్డపేరూ ఉంది. ఇవి ఇలానే కొనసాగితే రాజకీయాల్లో అడుగుపెట్టడం, రాణించడం కష్టమంటూ నయీంకు ‘సన్నిహితులు’ సలహా ఇచ్చారు. దీంతో నెగెటివ్ ఇమేజ్ను పొగొట్టుకునే ప్రయత్నాల్లో భాగంగానే భువనగిరి నియోజకవర్గంలోని 30 వార్డుల్లో 30 వాటర్‌ప్లాంట్స్ నిర్మాణానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే నయీం దృష్టి రాయలసీమ ఫ్యాక్షనియం ప్రధానంగా వచ్చిన ‘రక్తచరిత్ర’ చిత్రాలపై పడింది. అదే మాదిరిగా తన స్వీయచరిత్రను తెరకెక్కించాలని భావించాడు. నయీం గతంలో జూబ్లీహిల్స్‌లోని ఓ క్లబ్‌కు తరచుగా వెళ్ళేవాడు. ఇది సినీ ప్రముఖులు ఎక్కువగా వచ్చేది కావడంతో అక్కడే పరిచయమైన వారిని ద్వారానే చిత్రీకరించడానికి నిర్ణయించుకున్నాడని సమాచారం. నెగెటివ్ లేకుండా పాజిటివ్‌గా... ఈ చిత్రంలోనూ తనలోని నెగెటివ్ షేడ్స్ కాకుండా పాజిటివ్ అంశాలనే చూపించి, వాటినే ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నయీం భావించాడు. తన భూకబ్జాలు, దందాలు వంటి నేర జీవితాన్ని మినహాయించి మావోయిస్టుగా తాను చేసిన పనులు, ఉద్యమం నుంచి బయటకు వచ్చాక మావోయిస్టు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లతో పాటు పోలీసులకు ఇన్ఫార్మర్గా పని చేసినప్పుడు తన ద్వారా అధికారులు సాధించిన ‘సక్సెస్’లు మాత్రమే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీనికోసం తాన డైరీల్లో రాసుకున్న అనేక కీలకాంశాలను నెమరు వేసుకున్నాడని సమాచారం. తెలుగు సినీరంగానికి చెందిన రెండోస్థాయి దర్శకులు ఇద్దరితో నయీం సంప్రదింపులు జరిపాడు. చిత్ర నిర్మాణానికి అవసరమైన నిధులు తానే ఇస్తానని, సినిమా తీయాలంటూ వారిని కోరినట్లు తెలిసింది. 2019లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న నేపథ్యంలో 2018 ద్వితీయార్థం లేదా 2019 ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదలయ్యేలా నయీం ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. అక్కడా ఓ ‘పోలీసు’తో పరిచయం... ఈ‘ నయీం కీ కహానీ’తో కూడిన చిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు గోవాలో నయీంకు ఉన్న కోకోనట్ గెస్ట్‌హౌస్‌లో జరిగాయని తెలిసింది. సదరు దర్శకులతో కలిసి రోడ్డు మార్గంలో అక్కడకు వెళ్ళిన నయీం మూడు రోజుల పాటు చర్చించాడు. ఈ సందర్భంలో నయీంతో పాటు ఓ మహిళ కూడా కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. సదరు దర్శకుల్లో ఒకరి సలహా మేరకే పోలీసులు గుర్తుపట్టకుండా ఉండేందుకు వేషం మార్చడం, మేకప్ కిట్స్ వినియోగించడం, మేకప్ చేసుకోవడం వంటివి ప్రారంభించినట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. సినీ రంగంతో మంచి పరిచయాలు ఉన్న ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారితో ఆ సందర్భంలోనే నయీంకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు ఈ పరిచయం కొనసాగిందని తెలుస్తోంది. సదరు పోలీసు అధికారికి నయీంతో ఉన్న సంబంధాలు ఏమిటి? అనే అంశంపై పోలీసు వర్గాలు దృష్టిపెట్టి కూపీ లాగుతున్నాయి. -
నయీమ్‌కు ఆయుధాలెక్కడివి?
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు జరుపుతున్న సోదాల్లో అత్యాధునిక తుపాకులు బయటపడుతున్నాయి. నయీమ్ ఇళ్లతోపాటు అతని అనుచరుల వద్ద కూడా భారీగా ఆయుధాలు లభిస్తున్నాయి. ఇప్పటివరకు 19 వెపన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా వాటిలో ఎక్కువ భాగం జర్మనీ, బెల్జియం, రష్యా తయారీవే కావడం గమనార్హం. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఏకే 47తోపాటు 9 ఎమ్ఎమ్ పిస్టళ్లు, తపంచాలు, భారీగా తూటాలు, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, గొడ్డళ్లు, కత్తులు ఉన్నాయి. వాటిలో కొన్ని వెపన్స్‌ను నయీమ్ గ్యాంగ్ ఉపయోగించినట్లు గుర్తించారు. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి నయూమ్‌కు సమకూరాయనేది పోలీసులకు అంతబట్టడం లేదు. దాదాపు 4 రోజులు విస్తృతంగా గాలిస్తున్నా ఆయుధాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించడం లేదు. పట్టుబడిన నయీమ్ అనుచరులను ప్రశ్నిస్తున్నా ‘అంతా భాయ్’ చూసుకునే వాడంటూ సమాధానం ఇస్తున్నారు. ఆయుధాలు సమకూర్చిందెవరు..? నయీమ్‌కు వివిధ రంగాలలో ఉన్న వారితో విస్తృత పరిచయాలున్నాయి. మాజీ మావోయిస్టు నేత కావడంతో నక్సల్స్‌తో కూడా పరిచయాలున్నాయి. దీంతో నక్సల్స్ నుంచి ఆయుధాలు సరఫరా అయ్యాయా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే నయీమ్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నట్లు గతంలోనే పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అంతేకాదు హిజ్బుల్ నేత ముజీబ్‌తో కలసి నయీమ్ అక్రమంగా ఆయుధాల వ్యాపారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకసారి పాకిస్తాన్ వెళ్లి దావుద్ ఇబ్రహీంను కలసి చర్చించినట్లు సమాచారం. మరోసారి దుబాయ్ వెళ్లి అక్కడ డీ-గ్యాంగ్ సభ్యులతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలిసింది. -
ఇదీ రిమాండ్ రిపోర్టు!
-
ఇదీ రిమాండ్ రిపోర్టు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం ఏమి జరిగింది.. పోలీసులు ఏయే వస్తువులు.. ఎంత డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తదితర ప్రశ్నలు ఇంకా తలెత్తుతూనే ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పేర్కొన్న రిమాండ్ రిపోర్ట్ ఇలా ఉంది. జరిగింది ఇలా.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన ఓ రియల్టర్‌ను గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు డిచ్పల్లి సీఐ తిరుపతయ్య నయీమ్ ఫోన్‌కాల్‌పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో నయీమ్ షాద్‌నగర్‌లోని తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్న సీఐ తిరుపతయ్య సిబ్బందితో నయీమ్ వాహనాన్ని వెంబడించాడు. అదే సమయంలో గ్రే హౌండ్స్ బలగాలను ముందుగానే నయీమ్ ఇంటి వద్దకు పంపించారు. నయీమ్ భార్య అసీనా బేగం, అక్క సలీమా బేగం ముందు హోండా అమేజ్ కారులో షాద్‌నగర్ ఇంటికి చేరుకున్నారు. వెనుక ఫోర్డ్ ఇండీవర్ కారులో నయీమ్ అతని అనుచరులు నలుగురితో కలసి షాద్‌నగర్ వస్తుండగా ఇంటీ సమీపంలోనే గ్రే హౌండ్స్ బలగాలు అడ్డుకున్నాయి. విషయం గ్రహించిన నయీమ్ పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు జరుపగా నయీమ్ అక్కడికక్కడే మృతిచెందాడు. నయీమ్ వెంట ఉన్న అనుచరులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. లభించిన వస్తువులు.. అనంతరం పోలీసులు నయీమ్ ఇంట్లో, బయట సోదాలు చేశారు. తుపాకులు, డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. సలీమా బేగం వద్ద ఒక స్టెన్‌గన్, అసీనా బేగం వద్ద రెండు ఏకే 47లు, అబ్దుల్ మతీన్ వద్ద రివాల్వర్, నయీమ్ వద్ద 1 పిస్టల్, 1 ఏకే 47తో పాటు మూడు మ్యాగజెన్లు స్వాధీనం చేసుకున్నారు. వెపన్ ఆర్మ్స్(బుల్లెట్లు) ఏకే 47వి 250, పిస్టల్‌వి 132, రివాల్వర్‌వి 60, చిన్న రివాల్వర్‌వి 80, 3.8 రివాల్వర్‌వి 50 స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా 17 సెల్ఫోన్లు, 54 ఒరిజినల్ డాక్యుమెంట్లు, లింకు డాక్యుమెంట్లు 121 వరకు స్వాధీనం చేసుకున్నారు. జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లతో పాటు రూ. 3,74,660 నగదు, ఐదున్నర తులాల బంగారం, హోండా అమేజ్, ఫోర్ట్ ఇండీవర్ కారు, ఒక స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన డాక్యుమెంట్లకు సంబంధించి మార్కెట్లో వాటి విలువ రూ.14 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భువనగిరి, గడ్డి అన్నారం, జూపార్కు, శంషాబాద్, దిల్సుఖ్నగర్ ప్రాంతాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నట్లు సమాచారం. -
ఏపీ పోలీసులకు టీఎస్‌లో దందాలు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులతోనూ గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయా..? తెలంగాణలో దందాలు, సెటిల్మెంట్ల కోసం వారు నయీమ్‌ను వాడుకున్నారా..? ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నాయి పోలీసు వర్గాలు. నయీమ్ ఇంట్లో దొరికిన డైరీలో ఉన్న ‘కోడ్స్’ను డీ-కోడ్ చేస్తున్న అధికారులు ప్రాథమికంగా ఏపీలో పని చేస్తున్న ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వీరికి నోటీసులు జారీ చేసి విచారించాలని భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘ఉమ్మడి’లోనే పరిచయం.. ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేసిన నయీమ్.. మావోయిస్టులకు సంబంధించిన సమాచారం అందిస్తున్నప్పుడే ఓ అధికారితో పరిచయం ఏర్పడింది. అప్పట్లో ఆయన మావోయిస్టు వ్యతిరేక విభాగంలో విధులు నిర్వర్తించారు. విభజన తర్వాత ఏపీ పోలీసులో పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో పాటు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్స్‌లో అనుభవజ్ఞులు చాలా మంది తెలంగాణలో ఉండిపోయారు. దీంతో మావోయిస్టుల ప్రాబల్యం పెరిగే అవకాశం ఉందని భావించిన ఆయన వారి కదలికలపై సమాచారం కోసం రహస్యంగా నయీమ్‌ను సంప్రదించారు. తమకు ఉపయుక్తమైన వివరాలు వెల్లడిస్తుంటే అవసరమైన ‘సహాయ సహకారాలు’ అందిస్తామంటూ వీరి మధ్య ఒప్పందం కుదిరింది. ‘ఓటుకు కోట్లు’తో మారిన సీన్.. ఆ ఇద్దరు అధికారులూ ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం హైదరాబాద్ కేంద్రంగానే పనిచేశారు. వీరిలో ఒకరికి నగరంతో పాటు శివార్లలోనూ కొన్ని రియల్ ఎస్టేట్ దందాలు, లావాదేవీలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయినా కొంత కాలం ఆయన హవా తెలంగాణలో నడిచింది. అయితే గత ఏడాది వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసుతో రెండు రాష్ట్రాల మధ్యా అగాధం ఏర్పడింది. ఈ ప్రభావం పోలీసు విభాగాలపైనా పడటంతో సదరు ఉన్నతాధికారి దందాలు సాగడం కష్టంగా మారిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే నయీమ్‌ను మరో కోణంలోనూ వాడుకోవాలని నిర్ణయించుకున్న ఆయన.. నయీమ్‌ను తనకు పరిచయం చేసిన అధికారి ద్వారా రాయబారం పంపారు. నయీమ్‌కు గిఫ్ట్‌గా శాటిలైట్ ఫోన్..? నయీమ్ ఆ ఇద్దరితో విజయవాడ-గుంటూరు మధ్య ఉన్న ఓ రిసార్ట్‌లో గత ఏడాది ద్వితీయార్థంలో సమావేశమైనట్లు తెలిసింది. వారిలోని ఉన్నతాధికారికి హైదరాబాద్, శివార్లలో ఉన్న భూ దందాలను పర్యవేక్షించే, సెటిల్మెంట్లు చేసే బాధ్యత నిర్వర్తించడానికి నయీమ్ అంగీకరించాడని తెలిసింది. అయితే తనకో శాటిలైట్ ఫోన్ గిఫ్ట్‌గా కావాలని నయీమ్ కోరాడని, అమెరికా నుంచి ఓ ఫోన్‌ను ఖరీదు చేసిన సదరు అధికారి నయీమ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారని సమాచారం. దీంతో అప్పటి నుంచి నయీమ్‌ను తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్న ఆ ఇద్దరు అధికారులూ భారీ మొత్తంలో డబ్బుతో పాటు హైదరాబాద్, శివారులో భూములు కూడగట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నయీమ్ కేసులపై దృష్టిపెట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ దిశలోనూ ఆరా తీయడంతో పాటు శాటిలైట్ ఫోన్ ఏమైందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నయీమ్ ఎన్కౌంటర్ నుంచి ఆ ఇద్దరు అధికారులూ తెలంగాణలో ఉన్న కొందరు పరిచయస్తులైన అధికారుల్ని సంప్రదిస్తూ... కేసు పూర్వాపరాలు, దర్యాప్తు అంశాలను తెలుసుకునే ప్రయత్నాలు చేశారని సమాచారం. ఎన్కౌంటర్ల తర్వాత ‘పెద్దాయన’తో.. ఏపీలో మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు అంగీకరించిన నయీమ్ ప్రతిఫలంగా తనకు ఏం కావాలో తర్వాత చెప్తానని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. 2014, 2015ల్లో కోస్తా జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతంలోనూ రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. ఇవి నయీమ్ అందించిన సమాచారంతోనే జరిగినట్లు తెలిసింది. దీంతో నయీమ్‌పై నమ్మకం పెరిగిన సదరు అధికారి ఇతడిని మరో ఉన్నతాధికారికి పరిచయం చేశాడు. అప్పట్లో ఈ ఉన్నతాధికారి సీఆర్డీఏ పరిధిలో కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఇలా ఇద్దరు అధికారులూ నయీమ్‌ను మావోయిస్టు కోణంలోనే వినియోగించుకోవాలని తొలుత భావించారు. -
నయీమ్.. నాట్ ఏ జోక్
* సెటిల్మెంట్ల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో దిట్ట * డబ్బులు వసూలు చేయాల్సిన వ్యక్తుల పూర్తి సమాచారం సేకరణ * చంపడం కిరాతకంగానే.. కానీ సెటిల్మెంట్లు మాత్రం చాలా సాఫ్ట్‌గా.. * ‘అన్నా’ అని సంబోధిస్తూనే తనకు కావాల్సింది రాబట్టుకునే నైజం * వినకపోతే చితకబాదడం.. అవసరమనుకుంటే లేపేయడమే.. సాక్షి హైదరాబాద్: నయీమ్.. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన ఈ పేరు చాలా కాలంగా అండర్ వరల్డ్ మాఫియాలో సుపరిచితమైందే. విప్లవ పార్టీ నేపథ్యం నుంచి వచ్చిన అతడు గ్యాంగ్‌స్టర్‌గా మారి పోలీసులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఈ మాఫియా డాన్ నైజమే చాలా ప్రత్యేకమైనదని, ఎప్పుడు ఎలా వ్యవహరించాలో, ఏ కేసును ఎలా డీల్ చేయాలో అతడికి వెన్నతో పెట్టిన విద్య అని గతంలో జరిగిన పరిణామాలు తెలియజేస్తున్నాయి. తన ప్రత్యర్థులను హతమార్చడంలో ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. కానీ, సెటిల్మెంట్ల విషయంలో మాత్రం నయీమ్ చాలా సాఫ్ట్‌గా డీల్ చేస్తాడు. డబ్బులు వసూలు చేయాలన్నా, వివాదాలు సెటిల్ చేయాలన్నా ఆయన అనుచరుల నుంచీ అందరూ పకడ్బందీగానే వ్యవహరిస్తారు. నయీమ్‌ను కలవాలని ఎవరూ అనుకోరు కానీ.. కలిసే పరిస్థితి వస్తే మాత్రం ఆయన చెప్పినట్టు చేయాల్సిందే. అందుకు తగిన సరంజామాను సిద్ధం చేసుకుని అలా చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తాడు. కళ్లు తెరిచి చూసే లోపు ఆయుధాలతో ఉన్న సుశిక్షితులైన అంగరక్షకుల నడుమ నవ్వుతూ పలకరిస్తాడు. చెప్పినట్టు వింటే సరి.. లేదంటే మాత్రం దండన తప్పనట్టే. చితకబాదడం.. అవసరమైతే లేపేయడం. మీకు షుగర్ ఉంది కదా.. ట్యాబ్లెట్లు తెచ్చుకున్నారా? నయీమ్ ముఠా చేసిన హత్యలు పైకి కనిపిస్తాయి కాబట్టి ఎంత కిరాతకంగా హత్య చేశాడో అర్థమవుతుంది. కానీ, నయీమ్ అంతర్గతంగా చేసే సెటిల్మెంట్ల గురించి ఆయన బాధితులు, అనుచరులకు మాత్రమే తెలుస్తుంది. ఫలానా వ్యక్తి నుంచి పైసలు వసూలు చేయాలనుకున్నా.. ఏదైనా వివాదం సెటిల్ చేయాలనుకున్నా దాదాపు అనుచరులే కార్యక్రమం పూర్తి చేస్తారు. భాయ్ చెప్పాడు.. అంటూ వెళ్లి భయపెట్టి తమ దారిలోకి తెచ్చుకుంటారు. కానీ, కీలకమైన వ్యవహారాలను మాత్రం నయీమే స్వయంగా పర్యవేక్షిస్తాడు. ఆ సెటిల్మెంట్లు చేసేందుకు గాను అవసరమైన వ్యక్తులను నయీమ్ ముఠా సభ్యులు ‘భాయ్’ దగ్గరకు తీసుకెళ్తారు. వెళ్లేటప్పుడు కూడా అర్థం కాకుండా తీసుకెళ్తారు. గతంలో నయీమ్‌ను కలిసి వివాదాలు సెటిల్ చేసుకున్న, డబ్బులు ఇచ్చిన కొందరు ఇచ్చిన సమాచారం ప్రకారం.. నయీమ్ అసభ్యంగా మాట్లాడడు. బెదిరించడు. అన్నా అని సంబోధించి దగ్గరకు తీసుకుంటాడు. అన్నా.. నిన్ను ఫలానా పని కోసం పిలిపించాను. అంతవరకు చేయి.. నీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా అని భరోసా ఇస్తాడు. ఆ తర్వాత కూడా సెటిల్ కాకపోతే సదరు వ్యక్తులకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి.? అవి ఎంత విలువ ఉంటాయి? ఈ మధ్య కాలంలో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి ఆ వ్యక్తి జరిపిన లావాదేవీలేంటి? అనే వివరాలను డాక్యుమెంట్లతో సహా ఉంచుతాడు. కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? అనే విషయాలను కూడా చెప్పి వారి యోగక్షేమాల గురించి ఆరా తీస్తాడు. ఎందుకన్నా.. రోజులు బాగాలేవు.. ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో నీ కొడు కో.. కూతురో ఉంటే పరిస్థితేంటి? అని సినీఫక్కీలో హెచ్చరిస్తాడు. సెటిల్మెంట్ల విషయంలో నయీమ్ ఎంత పకడ్బం దీగా ఉంటాడంటే.. సెటిల్మెంట్ చే యాల్సిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను పూర్తిగా తెలుసుకుంటాడు. ఎంతగా అంటే.. ‘అన్నా నీకు షుగర్ ఉంది కదా.. నువ్వు ఫలానా టాబ్లెట్ వేసుకుంటావు.. ఆ టాబ్లెట్ తెచ్చుకున్నావా.. లేదంటే నా దగ్గర ఉంది ఇస్తాను ’ అని కూడా చెప్తాడంటే నయీమ్ ఎంత పకడ్బందీగా ఉంటాడో ఇట్టే అర్థమవుతుంది. అయితే, మాట వినకపోతే మాత్రం విశ్వరూపం చూపిస్తాడని బాధితులు వాపోతున్నారు. మాఫియా సామ్రాజ్య విస్తరణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మారిన పరిస్థితుల్లో నయీమ్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే వెళ్లాడ ని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆయన కేరళ స్థావరంగా కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనే ప్రచారం కూడా ఉంది. విదేశాల్లోని కొందరు నేరస్తులతో కూడా సంబంధా లు పెట్టుకున్నాడని, త్వరలోనే దుబాయ్‌కి వెళ్లాలనుకున్నాడని కూడా పోలీ సులు చెబుతున్నారు. ఆయన కోసం గుజరాత్ పోలీసులు వెతుకుతున్నారని, సోహ్రాబుద్దీన్‌తో ఆయనకున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారని కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను విస్తరించాడని కూడా సమాచారం. -
'నక్సల్స్ సమాచారం పోలీసులకు అందించాడు'
-
నయీంను పెంచి పోషించింది పోలీసులే..
-
నయీం.. బాబు పెంచిన విషనాగు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నరహంతక ముఠా నాయకుడు నయీం చంద్రబాబు నాయుడు పెంచి పోషించిన విష నాగు అని, ప్రజా కళాకారులను, ప్రజా సంఘాల నాయకులను, పౌరహక్కుల నేతలను పొట్టనపెట్టుకున్న నరరూప రాక్షసుడు నయీం అని అంచనాలు, పద్దుల కమిటీ ఛైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడు అండదండలతోనే నయీం గ్యాంగ్‌స్టర్ స్థాయికి ఎదిగాడని, నక్సలైట్లను అంతమొందించటానికి చంద్రబాబునాయుడు ఇలాంటి ‘బ్లాక్ కోబ్రా’లను పెంచారని రామలింగారెడ్డి ఆరోపించారు. 2004లో ఒకసారి, 2008లో మరోసారి నయీం తనను బెదిరించిన మాట వాస్తవమే అని చెప్పారు. 2008లో తమ గ్రామం చిట్టాపూర్‌కు నయీం అతని అనుచరులు వచ్చి రామలింగారెడ్డిని చంపివేస్తామని బెదిరించి వెళ్లిపోయారని, దీనిపై తాను అప్పట్లో సిద్దిపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్లుగా నయీం నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడని, అప్పటి నాయకులు, అధికారులు ఈ రాక్షసుని చేతిలో కీలుబొమ్మలుగా మారారని చెప్పారు. దుబ్బాక పరిసర గ్రామాల్లో నయీం ముఠా ముగ్గురిని కిడ్నాప్ చేసిందని, వారి ఆచూకీ ఇప్పటికీ దొకరలేదన్నారు. ఈ జీవితం నాకు బోనస్ 20 ఏళ్ల కిందట గిరాయిపల్లి ఎన్కౌంటర్లోనే తాను అమరున్ని కావాల్సిందని, ఆరోజు అదృష్టం బాగుండి బయటపడ్డానని అన్నారు. ఇప్పుడున్న ఈ జీవితం, ఎమ్మెల్యే పదవి తనకు బోనస్ లాంటివన్నారు. తనకు ప్రాణాల మీద తీపి, డబ్బుమీద ఆశ లేదన్నారు. నయీం లాంటి హంతకుల హెచ్చరికలు తనకు వెంట్రుకతో సమానం అని అన్నారు. ఇప్పటికీ తాను గన్‌మెన్స్ లేకుండానే ప్రజల్లో తిరుగుతానన్నారు. మంత్రి హరీశ్‌రావు, సీఎం విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం ఒకే ఒక గన్‌మెన్‌ను పెట్టుకున్నానన్నారు. తనకు దుబ్బాక ప్రజలే రక్షణ కవచాలన్నారు. నయీం పీడ విరగడ కావటమనే సంఘటనతో పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. -
అతనికి సహకరించిన వారి సంగతేమిటి?
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు సహకరించిన ఘరానా నాయకులు, అధికారులను విచారించకుండా శిక్షించకుండా నేరసామ్రాజ్యాన్ని కూల్చేశామని ప్రభుత్వం ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నయీం హత్యలు, దందాలు, కబ్జాల్లో పాలుపంచుకున్న నేరస్తుల పేర్లను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నయీమ్ వంటి నరహంతకుణ్ని చేరదీసి చివరి వరకు ఆశ్రయం కల్పించి అవసరం తీరాక హత్య చేశారని ఆరోపించారు. దీనిని ఎన్‌కౌంటర్‌గా పోలీసులు పేర్కొనటం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన పేర్కొన్నారు. నయీమ్‌ను సజీవంగా పట్టుకుని ఉంటే అతని పాపాల్లో పాలకులు, పోలీసులు, జర్నలిస్టులకు ఎంత భాగముందనేది వెల్లడి అయ్యేదని చెప్పారు. నయీమ్‌ను అడ్డుపెట్టుకుని నాయకులు, పాలకులు, పోలీసులు ఎన్ని దురాగతాలకు పాల్పడ్డారనేది ప్రజలకు తెలిసి ఉండేదని సాదినేని వెల్లడించారు. -
నయీమ్ చుట్టూ ‘గడాఫీ’ సైన్యం!
* ఆడవాళ్లే రక్షణ కవచాలు.. డెన్ల రక్షణ బాధ్యతలూ వారికే * ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో లిబియాకు నియంత గడాఫీని మించిపోయాడు. గడాఫీ తరహాలో తనకు రక్షణ కవచంగా మహిళలను, యువతులను ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఆయుధాల వినియోగంలోనూ శిక్షణ ఇప్పించాడు. అవసరమైన సందర్భాల్లో వారిని ‘ఎర’లుగానూ వినియోగించుకున్నాడు. అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీమ్ ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు మహిళల విచారణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. నయీమ్ ఇంట్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఫర్హానా వంట మనిషిగా పనిచేస్తోంది. అదే పట్టణానికి చెందిన అమీర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, అతని భార్య అఫ్సానా అలియాస్ ఇన్షియాద్ నయీమ్ ఇంట్లోనే ఉండేది. వారిద్దరూ నయీమ్‌కు నమ్మినబంట్లు కావడంతో సెల్ఫ్ డిఫెన్స్, తుపాకులు కాల్చడంలో శిక్షణ ఇచ్చాడు. వారికి అత్యాధునిక పిస్టళ్లు, తూటాలు అందజేసి.. భార్య, పిల్లలతో పాటు ఇంటి వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతలను అప్పగించాడు. ఆయుధాలతో పాటు స్థలాల డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు, నగదును కూడా వారి సమక్షంలోనే ఇంట్లోనే దాచేవాడు. నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు దాడి చేసిన సమయంలో ఫర్హానా, అఫ్సానా పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. హ్యాండ్ బ్యాగుల్లో పిస్టళ్లు, తూటాలు దొరికాయి. ఆశ్రయం కల్పిస్తామని తీసుకువచ్చి.. నయీమ్ నల్లగొండ జిల్లాలోని మారుమూల ప్రాంతాలు, తండాల నుంచి ఆడపిల్లల్ని డబ్బు చెల్లించి తీసుకువస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారితో పాటు చిన్న వయసులోనే భర్త చనిపోయిన, అనాథలుగా మారిన వారిని కూడా ఆశ్రయం కల్పిస్తామంటూ తీసుకువచ్చి కొందరు బంధువులు నయీమ్‌కు అప్పగిస్తున్నారని తెలిసింది. సోమవారం నయీమ్ ఇంట్లో పట్టుబడిన ఐదుగురు ఆడపిల్లలూ ఇలానే అక్కడికి చేరి ఉంటారని భావిస్తున్నారు. సెటిల్మెంట్ల కోసంగానీ, మరెక్కడికైనాగానీ వెళ్లేటపుడు మహిళలు, యువతులను తీసుకెళ్లేవాడు. అలాగైతే ఎవరో కుటుంబం మొత్తం ప్రయాణిస్తున్నట్లు పోలీసులు భావిస్తారని.. తనిఖీలు చేయడానికి వెనకడుగు వేస్తారనే నయీం వ్యూహం. అంతేగాకుండా టార్గెట్ చేసిన వారిని ఆకర్షించడం కోసం యువతుల్ని ఎరగా వేస్తాడని పోలీసులు చెబుతున్నారు. ఇక అల్కాపురిలోని ఇంట్లో ఉన్న వంట గదుల్లో వంట చేసిన ఆనవాళ్లేమీ లేవని పోలీసులు చెబుతున్నారు. నిత్యం హోటళ్ళ నుంచి తెచ్చుకుని తినేవారని.. వంట మనిషిగా చెబుతున్న ఫర్హానాను రక్షణ కోసమే వినియోగించారని పేర్కొంటున్నారు. -
నయీమ్‌తో ఖాకీ.. ఖద్దరు చెట్టపట్టాల్
భూముల డీడ్ పత్రాల్లో వెల్లడైన డీఎస్పీ లింకు * ‘మన్సూరాబాద్ డీఎస్పీ రిఫరెన్స్’ అని రాసుకున్న నయీమ్ * పోలీసులు, నేతలు, మీడియాకు రూ.80 కోట్లు పంచినట్టు లెక్కలు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని పత్రాల సాక్షిగా వెల్లడైంది. నార్సింగి పోలీసులు నయీమ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, డైరీల్లో ఓ డీఎస్పీ అధికారి లింకు వెలుగులోకి వచ్చింది. ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 35 జిరాక్సు ప్రతుల్లో హైదరాబాద్‌లోని గౌలిపురాకు చెందిన లాల్ భాయ్‌కి చెందిన సర్వే నం. 66/7కు సంబంధించిన విల్ డీడ్ కూడా ఒకటి. దీనిపై మన్సూరాబాద్‌లో ఉండే ‘డీఎస్పీ రిఫరెన్స్’ అని నయీమ్ రాసుకున్నాడు. ‘మన్సూరాబాద్ డీఎస్పీ ల్యాండ్ డిటేల్స్’ అని రాసి ఉన్న మరో పత్రం కూడా లభ్యమైంది. వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న మన్సూరాబాద్‌కు డీఎస్పీ ఉండరు. ఇది సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లో ఉండటంతో డివిజన్‌కు ఏసీపీ ఉంటారు. వీటిని బేరీజు వేస్తున్న పోలీసులు అతడిని మన్సూరాబాద్ ప్రాంతంలో ఉండే లేదా గతంలో ఉన్న డీఎస్పీ స్థాయి అధికారిగా అనుమానిస్తున్నారు. లాల్భాయ్కు చెందిన వివాదాన్ని సెటిల్ చేయాలని, తన స్థలానికి ‘న్యాయం’ చేయమంటూ సదరు డీఎస్పీ నయీమ్‌ను ఆశ్రయించాడని భావిస్తున్నారు. ఈ పరిచయాల నేపథ్యంలోనే కొన్ని అంశాల్లో సదరు డీఎస్పీ నయీమ్‌కు సహాయ సహకారాలు అందించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బంధువుతో రూ.3 కోట్ల డీల్ ఎల్బీనగర్ ఠాణా పరిధిలో 2010లో జరిగిన రామకృష్ణ హత్య కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ సైతం నయీమ్ ఇంట్లో లభించింది. మరోపక్క హైదరాబాద్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సమీప బంధువుతో రూ.3.5 కోట్ల లావాదేవీలు నెరిపినట్లు ఉన్న రికార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి మధ్యా సన్నిహిత సంబంధాలు ఉండి ఉంటాయని పోలీసులు అనుమానిస్తూ.. ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. నయీమ్‌కు చెందినదిగా అనుమానిస్తున్న ఓ డైరీని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో గడిచిన ఆరు నెలల్లో రూ.80 కోట్ల వరకు పోలీసులకు, మీడియా, రాజకీయ నాయకులకు పంచినట్లు లెక్కలున్నాయి. అందులో డీఎస్పీ-1, డీఎస్పీ-2, ఎమ్మెల్యే-1, ఎమ్మెల్యే-2, మీడియా-1, మీడియా-2... ఇలా మాత్రమే రాసి ఉండటంతో వారు ఎవరనేది ఆరా తీస్తున్నారు. మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇస్తానంటూ నయీమ్ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన పోలీసులతోనూ ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగా అక్కడి అధికారుల సాయంతో దందాలు సాగించినట్లు అనుమానిస్తున్నారు. -
'చిన్నప్పటి నుంచీ నేర ప్రవృత్తే'
-
నయీం ఆస్తులలో ఆశ్చర్య పరిచే నిజాలు !
-
ఆర్నెల్ల కింద నుంచే ‘ఆపరేషన్ నయీమ్..’!
-
చిన్నప్పటి నుంచీ నేర ప్రవృత్తే
ఎన్నో హత్యలు.. మరెన్నో ఘోరాలు చేసిన నయీమ్ * ఐపీఎస్ వ్యాస్ హత్యానంతరం పోలీసులకు కోవర్టుగా * అజ్ఞాతంలో ఉంటూనే నేర సామ్రాజ్యం విస్తరణ * వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో దిట్ట * అధికార పార్టీ ఎమ్మెల్యేలకూ తప్పని బెదిరింపులు భువనగిరి: చిన్నతనంలోనే విద్యార్థి సంఘాల్లో చురుగ్గా వ్యవహరించిన నయీముద్దీన్ అలియాస్ నయీం.. తొలి నుంచీ నేర ప్రవృత్తి ప్రదర్శించేవాడు. అప్పట్లోనే పాములు, తేళ్లు జేబులో వేసుకుని వచ్చి తోటి వారిని భయపెట్టేవాడని.. అతడితో కలసి చదువుకున్నవారు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరిలోని బీచ్ మొహల్లా దర్గా సమీపంలో నివాసముండే ఎండీ నిజాముద్దీన్, అయేషాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్ద కుమారుడు నయీం. భువనగిరిలోని బీచ్మొహల్లా ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘంలో చురుకుగా వ్యవహరించాడు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సీఈసీ చదువుతున్నప్పుడు ఎస్ఎఫ్ఐలోకి మారాడు. తర్వాత ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాలలో చదువుతూ.. పీపుల్స్‌వార్ అనుబంధ సంస్థ ఆర్ఎస్యూలో చేరాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే నయీంలో నేర స్వభావం కనిపించేదని అప్పటి తోటి విద్యార్థులు వెల్లడించారు. పాములు, తేళ్లు జేబులో వేసుకుని వచ్చి తోటి వారిని భయపెట్టేవాడని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో పోలీసులపై బాంబు దాడి 1990లో ఆర్ఎస్యూలో చేరిన నయీమ్ పీపుల్స్‌వార్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పోలీసులు తనిఖీలు జరుపుతుండగా వారిపై బాంబు దాడి చేశాడు. అప్రమత్తమైన పోలీసులు నయీంను పట్టుకుని జైలుకు పంపించారు. జైల్లో పీపుల్స్‌వార్ అగ్రనాయకులతో పరిచయం పెరిగింది. అయితే ఆ సమయంలో పీపుల్స్‌వార్‌ను అంతం చేయడానికి ఐపీఎస్ అధికారి వ్యాస్.. గ్రేహౌండ్స్ పోలీస్ వ్యవస్థను రూపొందించారు. దీంతో వ్యాస్పై కక్షగట్టిన పీపుల్స్‌వార్.. ఆయనను చంపేందుకు ఏర్పాటు చేసిన యాక్షన్ టీంలో నయీమ్ ఒకడు. 1993లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యాస్‌ను ఏకే-47తో అతి సమీపం నుంచి కాల్చి హతమార్చారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే పీపుల్స్‌వార్‌లో పటేల్ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావులతో విభేదాలు రావడంతో 1999లో పోలీసులకు లొంగిపోయాడు. నక్సలైట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా.. పీపుల్స్‌వార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నక్సల్స్‌ను అంతం చేయడమే తన జీవితాశయమని నయీమ్ ప్రకటించాడు. దీనికి సంబంధించి తెలంగాణవ్యాప్తంగా పలు చోట్ల ప్రదర్శనలు కూడా నిర్వహించాడు. ఈ సమయంలో పోలీసులకు కోవర్టుగా మారాడు. నయీంను చేరదీసిన పోలీసులు.. నక్సలైట్ల ఏరివేతతో పాటు అజ్ఞాత కార్యకలాపాల్లో వినియోగించుకోవడం ప్రారంభించారు. వార్‌లో పనిచేసిన సమయంలో తెలిసిన సమాచారం, ఎత్తుగడలు, డంప్‌లు, ఆయుధాలకు సంబంధించి నయీమ్ ఇచ్చిన సమాచారంతోనే.. అనేక ఎన్ కౌంటర్లలో పీపుల్స్‌వార్, మావోయిస్టు నేతలను పోలీసులు మట్టుబెట్టారనే ప్రచారం ఉంది. పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని నయీమ్ వారి చేతిలో ఆయుధంగా మారిపోయాడని పీపుల్స్‌వార్ ఆప్పట్లోనే ఆరోపించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో.. భువనగిరి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చాలా వివాదాల్లో నయీమ్ పాత్ర ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కనిపిస్తుంది. భువనగిరి, ఆలేరు, వలిగొండ, నల్లగొండ, చౌటుప్పల్, వరంగల్ జిల్లా జనగామ, రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం, ఉప్పల్ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో తన అనుచరులతో రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేయించేవాడు. రియల్ ఎస్టేట్ బూమ్ తగ్గాక ఆ ముఠా ఆస్తి తగాదాల సెటిల్మెంట్లకు దిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నయీమ్ అండర్ గ్రౌండ్‌లోనే ఉంటున్నా.. అతడి పేరిట కొందరు అనుచరులు, దగ్గరి బంధువులు దౌర్జాన్యాలు, అక్రమ వసూళ్లు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ‘కోబ్రా’ల సృష్టికర్త మావోయిస్టులకు వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా నయీంను చూసీ చూడనట్లు వదిలేసేవారనే ఆరోపణలున్నాయి. దాంతో ల్యాండ్ సెటిల్మెంట్లు, ఆర్థిక లావాదేవీ ల్లో నయీమ్ ముఠా చెలరేగిపోయింది. నల్లమల కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్, నర్సా కోబ్రాస్, క్రాంతిసేన పేరిట రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ నయీమ్ అనుచరులను పెంచుకున్నాడు. ఆ సమయంలో మావోయిస్టు పార్టీ నుంచి బయటికి వచ్చి టీఆర్ఎస్లో చేరిన సాంబ శివుడు తమ సెటిల్మెంట్లకు అడ్డుతగులుతున్నాడంటూ హత్య చేయిం చాడు. సాంబశివుడు ఉద్యమంలో ఉండగా అతడి ఇంటి వద్ద త్రాచుపాములను వదిలి బంధువులను భయ భ్రాంతులకు గురిచేశాడు. గణపతి నవరాత్రులతో పట్టు నయీమ్ ఆయా ప్రాంతాల్లో పట్టు సాధించడానికి ఉర్సు, గణపతి నవరాత్రుల వంటి ఉత్సవాలను వాడుకునేవాడు. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, నల్లగొండ, వలిగొండల్లో తన అనుచరులతో ఉత్సవాలను నిర్వహించేవాడు. అందుకోసం స్థానికంగా భారీగా చందాలు వసూలు చేసి ఖర్చు చేసేవాడు. అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలతో స్థానిక యువతను ఆకర్షించి, అనుచరులుగా చేర్చుకునేవాడు. ఎప్పుడూ భద్రత మధ్య.. పీపుల్స్‌వార్‌లో పనిచేసిన నయీమ్ ఎప్పుడు ఉదాసీనంగా వ్యవహరించేవాడు కాదని అతని అనుచరులు చెబుతారు. 2007 నుంచి రహస్య జీవితం గడుపుతున్న నయీం.. ఎప్పుడైనా బయటకు వస్తే పక్కా బందోబస్తుతో వచ్చేవాడు. తను ఉండే చోట ఆయుధాలతో కూడిన అనుచరులు కాపలాగా ఉంటారు. ఎక్కడా తనెవరో బయటపడకుండా జాగ్రత్త పడేవాడు. ఫొటోలకు దూరంగా ఉంటాడు. గతేడాది రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన తన కుటుంబ సభ్యుల వివాహానికి హాజరైన నయీమ్ అలాగే అనుచరుల రక్షణ మధ్యే వచ్చి వెళ్లాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో వివాదం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నయీమ్ బెదిరించినట్లు సీఎంకు ఫిర్యాదులు అందాయి. తమను నయీమ్ బెదిరిస్తున్నాడని ము ఖ్యంగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు ఫిర్యాదు చేశారు. దీంతో నయీమ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సర్కారు నిర్ణయించింది. ముందుగా భువనగిరిలో నయీమ్ ముఖ్య అనుచరులైన పాశం శ్రీను, షకీల్, జెడ్పీటీసీ సభ్యుడు సందెల సుధాకర్‌లపై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. భూదందాలు, డబ్బుల వసూళ్లు, బెదిరింపులు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. ఇటీవల షకీల్ గుండెపోటుతో చనిపోగా.. పాశం శ్రీను, సందెల సుధాకర్ పోలీసులకు లొంగిపోయారు. అప్పుడే నయీమ్ కూడా లొంగిపోతున్నాడన్న వార్తలు వచ్చాయి. -
ఆర్నెల్ల కింద నుంచే ‘ఆపరేషన్ నయీమ్..’!
≈ నయీమ్ ఆగడాలకు అడ్డుకట్టవేయాలని సర్కారు నిర్ణయం ≈ అతడి అనుచరులు లొంగిపోయేలా వ్యూహం ≈ నయీమ్‌తో సంబంధాలున్న అధికారులకు వివరాలు తెలియకుండా జాగ్రత్త ≈ ఏదో జరుగుతోందని అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నయీమ్ ≈ ఇటీవలే మళ్లీ బెదిరింపులు మొదలుపెట్టిన ముఠా ≈ నియోజకవర్గంలో తిరగొద్దంటూ భువనగిరి ఎమ్మెల్యేకు బెదిరింపులు ≈ అప్రమత్తమైన పోలీసులు.. పక్షం రోజులుగా పూర్తిస్థాయి నిఘా ≈ ముఠా కార్యకలాపాలపై ఆధారాల సేకరణ.. ఎన్కౌంటర్ సాక్షి, హైదరాబాద్: మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేం దుకు ఆరు నెలల కిందే ‘ఆపరేషన్ నయీమ్’ మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేసిన నయీమ్, అతడి ముఠా పనిపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. పోలీసు శాఖ పక్కా వ్యూహాన్ని అమలు చేసింది. ముందు నయీమ్ అనుచరులు లొంగిపోయేలా చూసింది. అతడికి సహకరిస్తున్న, అతనితో సంప్రదింపుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను గుర్తించి.. వారిని గట్టిగా హెచ్చరించింది. నయీమ్‌తో సంబంధాలున్న పోలీ సు ఉన్నతాధికారులకు ఆపరేషన్ వివరాలు తెలియకుండా జాగ్రత్త పడింది. ఈ క్రమంలో మెదక్, నల్లగొండ జిల్లాలకు చెందిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నయీమ్ నేరుగా బెదిరించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. మెదక్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లి, ఆయనతోనే గొడవపడి అంతు చూస్తాననడం... నియోజకవర్గంలో తిరగొద్దంటూ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని హెచ్చరించడం..మరో ఎమ్మెల్యేకు ఫోన్‌చేసి బూతులు తిట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. దీంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వందల సంఖ్యలో భూ సెటిల్మెంట్లు చేయడం, భూముల యజమానులను బెదిరిం చి తక్కువ ధరకే లాక్కోవడం వంటి ఫిర్యాదులు లెక్కకు మించి వచ్చాయి. మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలనే హెచ్చరించడంతో నయీమ్‌ను మట్టుబెట్టాలని ప్రభుత్వం పోలీ సు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. సన్నిహితుల లొంగుబాటుతో ఛత్తీస్‌గఢ్‌కు... భువనగిరి ప్రాంతంలో నయీమ్‌తో కలసి సెటిల్మెంట్లు చేసేవాళ్లను లొంగిపోవాల్సిందిగా పోలీసులు ఆదేశించడంతో నయీమ్ హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు మకాం మార్చాడు. అక్కడ నక్సలైట్లను రూపుమాపేందుకు నయీమ్ ఉపయోగపడతాడని ఇక్కడి కొందరు పోలీసు అధికారులు చెప్పడంతో.. ఛత్తీస్‌గఢ్ ఉన్నతాధికారులు అతనికి ఆశ్రయమిచ్చారు. దీంతో నయీమ్ అక్కడి పోలీసు ఉన్నతాధికారుల సహాయంతో కాంట్రాక్టర్‌గా అవతారమెత్తాడు. కొన్ని పను లు కూడా చేశాడు. తర్వాత కొన్నాళ్లకు హైదరాబాద్ చేరుకున్న నయీమ్... ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి బెదిరించడం, వ్యాపారులను హెచ్చరించడం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో అతడిని ఎలాగైనా పట్టుకోవాలన్న ఉద్దేశంతో పక్కా ఆపరేషన్‌కు పోలీసులు రూపకల్పన చేశారు.అతడి సెల్ నంబర్లు, ఎప్పుడు ఎక్కడ ఉంటున్నదీ గుర్తించారు. కొద్ది రోజులుగా షాద్‌నగర్-హైదరాబాద్ మధ్య తిరుగుతున్నట్లు తెలుసుకున్నారు. రెండు ప్రాంతాల్లోని నయీమ్ ఇళ్లపై వారంగా నిఘా పెట్టారు. అతడి కార్యకలాపాలు, వాటికి సంబంధించిన ఆధారాలను పూర్తిస్థాయిలో కనిపెట్టేందుకు ఆదివారం నుంచే రహస్యంగా వెంబడించడం ప్రారంభించారు. అయితే సోమవారం పోలీ సుల కదలికలను గుర్తించిన నయీమ్ కాల్పులకు దిగాడు. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నయీమ్ హతమయ్యాడు. ఎమ్మెల్యేకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనం సాధారణంగా అయితే ముఖ్యమంత్రి, హోంమంత్రితోపాటు జెడ్ కేటగిరీలో ఉన్న వాళ్లకే బుల్లెట్‌ప్రూఫ్ వాహనం సమకూరుస్తారు. కానీ నయీమ్ బెదిరింపుల నేపథ్యంలో ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డికి పోలీసు శాఖ బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చడంతో పాటు భద్రత ఏర్పాటు చేసింది. ‘‘నయీమ్, అతడి ముఠా కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నదీ, ఎంత మందిని ఇబ్బంది పెడుతున్నదీ తెలిసింది. అధికార పార్టీలో కొందరితో సంబంధాలు పెట్టుకుని వారి కోసం సెటిల్మెంట్లు చేసినట్లు తేలింది. కొందరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం, వ్యాపారంలో వచ్చిన లాభాల్లో వాటాలు ఇవ్వాలని మరికొందరిని బెదిరించడం వంటివి మా దృష్టికి వచ్చాయి. కొందరు పోలీసు అధికారులతోనూ అతడికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. దాంతో నయీమ్‌ను పట్టుకునేందుకు రహస్యంగా ఆపరేషన్ చేపట్టాం’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. -
షాద్ నగర్ లో కాల్పులు, నయీమ్ హతం
-
షాద్ నగర్ లో కాల్పులు, నయీమ్ హతం
షాద్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ మిలీనియం టౌన్ షిప్ లో కాల్పుల కలకలం రేగింది. గ్రేహౌండ్స్ పోలీసుల కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ నయీమ్ హతమయ్యాడు. నయీమ్ నక్కిన ఇంటిని ఈ తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు. అతడు పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో నయీమ్ హతమయ్యాడు. మాజీ మావోయిస్టులు సాంబశివుడు, రాములు, పటోళ్ల గోవర్థన్ రెడ్డి, ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసులో నయీమ్ నిందితుడు. నల్లగొండ జిల్లా భువనగిరి నయీమ్ స్వస్థలం. గత కొంతకాలంగా అతడు షాద్ నగర్ లో తలదాచుకుంటున్నట్టు తెలిసింది. అతడిపై 100పైగా కేసులున్నాయి.