మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేం దుకు ఆరు నెలల కిందే ‘ఆపరేషన్ నయీమ్’ మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేసిన నయీమ్, అతడి ముఠా పనిపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. పోలీసు శాఖ పక్కా వ్యూహాన్ని అమలు చేసింది. ముందు నయీమ్ అనుచరులు లొంగిపోయేలా చూసింది. అతడికి సహకరిస్తున్న, అతనితో సంప్రదింపుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను గుర్తించి.. వారిని గట్టిగా హెచ్చరించింది. నయీమ్‌తో సంబంధాలున్న పోలీ సు ఉన్నతాధికారులకు ఆపరేషన్ వివరాలు తెలియకుండా జాగ్రత్త పడింది.