Shadnagar
-
పోలీస్ స్టేషన్లోనే రక్షణ కరువు.. గుట్టు చప్పుడు కాకుండా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోలీస్ స్టేషన్లో కూడా రక్షణ కరువైంది. స్టేషన్లోనే అందరూ చూస్తుండగానే గొంతు కోసిన వైనం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మిస్సింగ్ కేస్ క్లోజింగ్ కోసం వెళ్లిన ప్రేమికులకు ప్రాణహాని జరిగింది.పోలీస్ స్టేషన్ రిసెప్షన్లోనే అమ్మాయి తరపు బంధువు.. యువకుడి గొంతు కోసేశాడు. దీంతో గొంతుకు నాలుగు కుట్లు పడ్డాయి. గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించిన పోలీసులు.. ఇంటికి పంపేశారు. పోలీస్ స్టేషన్లోనే తమకు రక్షణ లేకపోతే ఇంకా బయట మా పరిస్థితి ఎలా ఉంటుందంటూ ఆ ప్రేమ జంట వాపోతున్నారు. -
స్కూల్ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్‌లోని ఓ పాఠశాల భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. శాస్త్ర గ్లోబల్ స్కూల్లో ఘటన జరిగింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి నీరజ్.. స్కూల్ భవనం రెండో అంతస్తు నుంచి పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్యమరో ఘటనలో ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయనపల్లిలోని అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో సీఈసీ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అఖిల ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేట్ హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
షాద్ నగర్ పరిధిలోని BRS ఆయిల్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
-
షాద్‌నగర్ వద్ద రోడ్డు ప్రమాదం
-
నిన్న వార్నింగ్.. నేడు క్షమాపణ
-
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
బీఆర్ఎస్ సర్కార్ 5 వేల పాఠశాలలను మూసివేసింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కొందుర్గులో ఇంటిగ్రేటేడ్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. వైద్య సదుపాయాలు కూడా మెరుగుపరిచి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తామని తెలిపారు.తెలంగాణ విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో టీచర్లలో అసహనం ఏర్పడిందన్న సీఎం.. ఈ ప్రభుత్వం 34 వేల మంది టీచర్లను బదిలీ చేసి, 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు.బదిలీలు, ప్రమోషన్ల విషయంలో చిన్న వివాదం కూడా లేకుండా పరిష్కరిస్తున్నామన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరిచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.బీఆర్ఎస్ పాలించిన పదేళ్లలో 10 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు సీఎం. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కేసీఆర్.. ప్రభుత్వ పాఠశాలల్ని బాగుచేయలేదని విమర్శలు గుప్పించారు. పేదలకు విద్యను దూరం చేయాలన్న కుట్రతో బీఆర్ఎస్ సర్కార్ పనిచేసిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సర్కార్ 5 వేల పాఠశాలలను మూసివేసిందని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడికి పదవులు ఇచ్చారు. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు చేశారు. 1020 రెసిడెన్సియల్ స్కూల్స్‌లో కనీస వసతులు లేవు. టీచర్లతో పెట్టుకుంటే ఏమీ చేయరు కానీ.. పోలింగ్ రోజు బూత్‌లలో చేయాల్సింది చేస్తారు. బర్రెలు, గొర్రెలు ఇవ్వాలని కేసీఆర్ చూశారు కానీ ఉద్యోగాలు ఇవ్వాలని ఎందుకు అనుకోలేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండుసున్నా వచ్చినా.. వాళ్ల బుద్ధి మారలేదని విమర్శించారు.ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. షాద్ నగర్ పోలీసులపై కేసు నమోదు
-
మహిళపై థర్డ్‌డిగ్రీ.! షాద్‌నగర్ పోలీసులపై కేసు
సాక్షి,షాద్‌నగర్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్ పోలీసులపై కేసు నమోదైంది. ఇటీవల ఒక దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. షాద్‌నగర్ పీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ (డీఐ) రామ్‌రెడ్డి సహా నలుగురు కానిస్టేబుళ్లపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వారిపై ఎఫ్ఐఆర్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల షాద్‌నగర్ పోలీసులు దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి విచారించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. -
కొడుకు కోసం.. తల్లి నిర్బంధం
బషీరాబాద్: షాద్‌నగర్ దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన మరవకముందే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో మరో దారుణం.. పదహారేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడైన కొడుకు ఆచూకీ చెప్పాలంటూ బాలుడి తల్లిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. రోజూ స్టేషన్‌కు పిలవడం.. కొడుకు గురించి వివరాలు చెప్పాలని ఒత్తిడి చేస్తూ సాయంత్రం వరకు కూర్చోబెట్టడం.. మధ్యలో లాఠీలతో విచక్షణారహితంగా కొట్టడం.. గడిచిన మే నుంచి ఆగస్టు 15 వరకూ ఇదే వరస.. కాలూచేయీ కూడ దీసుకోలేని స్థితిలో భర్త.. తను పనికి వెళ్తే కానీ పూట గడవని దుస్థితి.. పోలీసులు మాత్రం ఆమె పొట్టకొడుతూ మూడున్నర నెలలుగా ఠాణా చుట్టూనే తిప్పుతున్నారు.పంద్రాగస్టు సందర్భంగా వార్తా సేకరణకు బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులకు దీనస్థితిలో స్టేషన్ ముందు కూర్చున్న ఆమె కంటపడింది. ఆరా తీస్తే ఈ దారుణం వెలుగుచూసింది. బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కుమారుడిపై కిడ్నాప్ కేసు.. బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన లోహడ నరేష్ (17), కాశీంపూర్ గ్రామానికి చెందిన బాలిక (16) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మే 2న ఇంట్లోంచి పారిపోయారు. తమ కూతురును నరేష్ కిడ్నాప్ చేశాడంటూ బాలిక కుటుంబసభ్యులు బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మే 4న నరే‹Ùపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాలుడి తల్లి కళావతి, తండ్రి నర్సప్ప కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. పోలీసులు కళావతిని మే నెలలోనే ఠాణాకు పిలిపించారు. ఎస్ఐ రమేశ్‌కుమార్ ఆమెను విచారిస్తూ.. ‘నీ కొడుకు మైనర్ పిల్లను ఎత్తుకొనిపోయాడు.వాడు ఎక్కడున్నాడో రెండు రోజుల్లో వెతికి తీసుకురావాలి. లేదంటే వాణ్ణి నేనే పట్టుకొచ్చి తుపాకీతో కాల్చి చంపేస్తా..’అంటూ బెదిరించాడు. దీనికి కళావతి స్పందిస్తూ.. ‘కూలి పనులు చేసుకునే మాకు ఏం తెలుసు సారూ.. వాడు పట్నంలో పనిచేసుకునేవాడు. కాశీంపూర్ పిల్లతో ప్రేమ కుదిరింట. అది పిల్ల తల్లికి కూడా తెలుసు. వారు ఎక్కడికి పోయారో నాకు తెలీదు’ అని చెప్పింది. దీంతో ఎస్ఐ ఒక్కసారిగా ఆవేశానికి లోనై లాఠీతో విచక్షణారహితంగా కొట్టారు. ఆ దెబ్బలకు చేతులు, కాళ్లు వాచిపోయాయని, నడవడానికి కూడా రాలేదని బాధితురాలు వాపోయింది. ‘ఆ రోజు నుంచి ప్రతీ రోజు పోలీస్ స్టేషన్‌కి వస్తున్నా. రోజూ ఉదయం 9 గంటలకు పోలీస్ స్టేషన్‌కి వచ్చి కూర్చోవాలి. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరు. ఆకలితో రాత్రి 9 గంటల వరకు ఉండి సారుకు చెప్పి ఇంటికెళ్తున్న. నిన్న ఒక్క రోజే (బుధవారం) స్టేషన్‌కు రాలేదు’అంటూ ఠాణాకు వెళ్లిన విలేకరులకు చెబుతూ కళావతి కన్నీటి పర్యంతమైంది. రోజు కూలి పనులు చేసుకునే తమకు మూడు నెలలుగా పనిలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకుని, కళావతికి న్యాయం చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విచారణ జరుపుతాం: అశోక్, సీఐ తాండూరు రూరల్ కిడ్నాప్ కేసు విషయం మా దృష్టిలో ఉంది. కిడ్నాపర్ మైనర్ అయినా అరెస్టు చేయాల్సిందే. విచారణలో భాగంగా బాలుడి తల్లిని బషీరాబాద్ ఎస్ఐ స్టేషన్‌కు పిలిచి విచారించారు. ఎస్ఐ ఆమెను కొట్టాడనే విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరుపుతాం. -
దళిత మహిళపై షాద్‌నగర్ పోలీసుల వీరంగం.. సీపీ చర్యలు
సాక్షి, హైదరాబాద్: షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఓదళిత మహిళను కర్రలతో కొట్టి హింసించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మహిళపై దాడి చేసిన షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డితోపాటు మరో అయిదుగురు కానిస్టేబుళ్లను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రంగస్వామి తన నివేదికను సీపీకి సమర్పించారు. నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.ఏం జరిగిందంటే.. సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న సునీత, భీమయ్య దంపతులపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో డీఐ రామిరెడ్డి 26వ తేదీన వీరిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపేశారు. అనంతరం జూలై 30వ తేదీ రాత్రి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్,అ ఖిల.. మొత్తం ఐదుగురు పోలీసులు సునీత భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు 13 ఏళ్ల జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇష్టమొచ్చినట్లు హింసించారు.. అయితే డిఐ రాంరెడ్డి తనను చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు సునీత పేర్కొంది. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కన్న కొడుకు జగదీశ్వర్ ముందే అతి దారుణంగా చితకబాదారని ఆరోపించింది. తన చీర విప్పేసి సగం నిక్కరు తొడిగారని, తన భర్త చొక్కా విప్పించి వేసుకోమంటూ కొట్టాురని ఆరోపించింది. ఆ సమయంలో మహిళా పోలీసులెవరూ పక్కన లేరని పేర్కొంది. తన కుమారుడిని కూడా రబ్బరుబెల్టుతో కొట్టారని తెలిపిందిరాత్రి 2 గంటల వరకు చితకబాదడంతో పోలీసుల దెబ్బలకు తాళలేక స్పృహ తప్పి పడిపోగా.. ఫిర్యాదుదారుకు చెందిన వాహనంలోనే తనను ఇంటికి పంపించారని తెలిపింది. మర్నాడు నా భర్తతో కలిసి స్టేషన్‌కు వెళ్తే.. పిలిచినప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. తర్వాత చికిత్స కోసం నేను ఆసుపత్రిలో చేరాను’ అని బాధితురాలు సునీత వివరించారు. -
దళిత మహిళపై పోలీస్ జులుం
-
షాద్‌నగర్‌లో రియల్టర్ దారుణ హత్య
సాక్షి, షాద్‌నగర్: తెలంగాణలో ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రియల్టర్ కమ్మరి కృష్ణను అతి దారుణంగా చంపేశారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది.వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌లోని కేకే ఫామ్‌హౌస్‌లో రియల్టర్ కమ్మరి కృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. కాగా, కృష్ణ బుధవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు ఫామ్‌హౌస్ నుంచి బయటకు వస్తుండగా అటాక్ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణపై విచక్షణారహితంగా దాడి చేశారు. కత్తులతో నరికి చంపారు. మరోవైపు.. కృష్ణ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, కన్వేషన్ సెంటర్లు, ఫామ్‌హౌస్‌లను నిర్వహిస్తున్నట్టు సమాచారం. -
గ్లాస్ పరిశ్రమలో ఘోర ప్రమాదం
-
గ్లాస్ తయారీ పరిశ్రమలో ఘోర ప్రమాదం
షాద్‌నగర్: గ్లాస్ తయారీ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, 13 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల గ్రామశివారులో వాహనాలకు సంబంధించిన గ్లాస్ అద్దాలను తయారుచేసే సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమలో వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది కార్మికులు పని చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పరిశ్రమలోని ఆటో క్లేవ్ యూనిట్లో అద్దాలను గ్యాస్, వేడితో అతికించి, బాయిలర్ నుంచి బయటకు తీసే క్రమంలో ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో ఆటో క్లేవ్ యూనిట్ వద్ద ఐదుగురు కార్మికులు పనిచేస్తున్నారు. యూనిట్లో తయారైన గ్లాస్‌ను బయటకు తీసే క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో కార్మికులు తీవ్రంగా గాయపడి మృత్యువాత పడ్డారు. ఈ పేలుడుతో మృతుల శరీరభాగాలు చెల్లాచెదురుగా సుమారు వంద మీటర్ల దూరం వరకు ఎగిరి పడ్డాయి. ఓ కార్మికుడి మృతదేహం పరిశ్రమ షెడ్డు రేకులను చీల్చుకొని బయటకు ఎగిరిపడింది. మరో కార్మికుడి మృతదేహం పూర్తిగా యంత్రంలో ఇరుక్కుపోయింది. ముగ్గురి మృతదేహాలు ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా సుమారు వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి.శరీరాల నుంచి కాళ్లు, చేతులు, తల, తదితర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. మృతి చెందినవారిలో బిహార్ రాష్ట్రానికి చెందిన చిత్తరంజన్ (25), రాంఆశిష్ (18), రవుకాంత్ (25), రోషన్ (36), రతన్ దేవరియా (30) ఉన్నారు. వీరితోపాటు బిహార్‌కు చెందిన గోవింద్, మంటు, సమీద్కుమార్, రోషన్‌కుమార్, సురేంద్ర పాశ్వాన్, జార్ఖండ్‌కు చెందిన మైకేల్ ఎంబ్రామ్, కార్తీక్, సు¿ోద్, బూర్గుల గ్రామానికి చెందిన పుల్లని సుజాత, కాశిరెడ్డిగూడకు చెందిన నీలమ్మ, మమత, ఒడిశాకు చెందిన రేతికాంత్, రాజేశ్‌లు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. కేటీఆర్ దిగ్భ్రాంతిబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని అన్ని కర్మాగారాల్లో భద్రత తీరుపై పరిశీలన చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు: హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పలు పరిశ్రమల్లో ప్రమా దాలు జరుగుతున్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరుసగా ప్రమా దాలు జరుగుతున్నా, భద్రతా చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు.ప్రమాద ఘటనపై సీఎం ఆరా ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ఢిల్లీలో ఉన్న ఆయన వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి తగిన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, అగి్నమాపక శాఖ, కార్మిక, పరిశ్రమల శాఖ అధికారులు, వైద్య బృందాలు ఘటనాస్థలిలోనే ఉండి సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. దీంతో కలెక్టర్ శశాంక, శంషాబాద్ డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ రాంకుమార్, ఆర్డీఓ వెంకటమాధవరావులు ఘటనా స్ధలాన్ని సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. -
షాద్‌నగర్ గ్లాస్ పరిశ్రమలో పేలుడు.. ఆరుగురు కార్మికులు మృతి
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో గ్యాస్ కంప్రెష్ చేస్తుండగా ఒక్కసారిగా పేలింది. పేలుడు తీవ్రతకు ఆరుగురు కార్మికులు మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన సమయంలో ఫ్యాక్టరీలో 150 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని, వారందరూ యూపీ, బీహార్‌కు చెందిన వారని తెలుస్తోంది. ఇక గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.మరోవైపు పేలుడుతో ఫ్యాక్టరీలో పైకప్పు కూలగా..గ్లాస్ ముక్కలు గుచ్చుకుని బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
బిర్యానీ తిని ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో
-
ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అనుమానాస్పదం మరణం కలకలం రేపింది. షాద్ నగర్‌కి చెందిన అరటి అరవింద్ యాదవ్ అయిదు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో అరవింద్ సముద్రంలో శవమై తేలడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఇంటినుంచి వెళ్లిన అరవింద్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సోమవారం అతని మృతదేహం సముద్రంలో కనిపించింది. సిడ్నీలోని సముద్ర తీరానికి కొద్ది దూరంలో అరవింద్ కారును కూడా గుర్తించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. అతనిది హత్యా, ఆత్మహత్యా అనేకోణంలో ఆరాతీస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఆస్ట్రేలియా పోలీసులు మృతుడి స్నేహితులు, సహా ఉద్యోగులను విచారిస్తున్నారు. అతని భార్య ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది.కాగా ఉద్యోగం నిమిత్తం 12 ఏళ్లుగా సిడ్నీ లో స్థిరపడ్డాడు అరవింద్ 18నెలల క్రితం వివాహం చేసుకున్న అరవింద్ భార్య, తల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆరు రోజుల క్రితమే తల్లి షాద్‌నగర్‌కు తిరిగి వచ్చింది. ఇంతలోనే అరవింద్ కన్నుమూయడంతో మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.2006 ఏప్రిల్ 7న ఏలూరులో జరిగిన లారీ ప్రమాదంలో బీజేపీ నాయకుడు, అరవింద్ తండ్రి ఆరటి కృష్ణ యాదవ్ మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. కృష్ణ భార్య, అరవింద్ తల్లి ఉషారాణి షాద్‌నగర్‌లో నివసిస్తున్నారు. భర్త మరణం తరువాత ఒక్కగానొక్కకొడుకును పెంచి పెద్ద చేసింది. పెళ్లి చేసి అంతా బావుంది అనుకుంటున్న సమయంలోనే ఇపుడు అరవింద్ కూడా దూరం కావడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
షాద్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండల కేంద్రంలోని అల్విన్ ఫార్మసీ కంపెనీలో ప్రమదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడటంతో.. కంపెనీ మొత్తానికి మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 100కుపైగా కార్మికులు ఉండగా.. ప్రాణ భయంతో చాలా మంది బయటకు పరుగులు తీశారు. అయితే.. దట్టమైన పొగ అలుముకోవటంతో.. ఎటువెళ్లలేక సుమారు 50 మంది వరకు లోపలే చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయిదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పరిశ్రమను ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్ పనులు జరుగుతుండగా.. మంటలు అంటుకున్నాయని కార్మికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. కొందరు కార్మికులను కిటికీల్లోంచి నిచ్చెనల సాయంతో బయటకు తీసుకొచ్చారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియాల్సి ఉంది.బాలుడి సాహసంఅగ్ని ప్రమాద సమయంలో ఓ బాలుడు ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన బాలుడు సాయిచరణ్.. కంపెనీ మంటల్లో చిక్కుకున్న బాధితులను కాపాడాడు. అగ్నిప్రమాద తీవ్రతను పసిగట్టిన బాలుడు.. భవనం పైకి ఎక్కి తాడు కట్టాడు. కిటీకి ద్వారా కార్మికులు కిందకు దిగేందుకు సాయచరణ్ సాయం చేశాడు. మొత్తం 50 మందిని కార్మికులను కాపాడాడు. -
మోదీ పాలనలోనే దేశాభివృద్ధి
షాద్‌నగర్, కొందుర్గు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర గురువారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చేరుకుంది. ఈ సందర్భంగా లాల్‌పహాడ్, కొందుర్గు, షాద్‌నగర్‌లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో మోదీ నాయకత్వాన్ని మరోసారి బలపర్చాలని కోరారు. ప్రజా సంక్షేమం, దేశ భద్ర త, అవినీతి రహిత సమాజం ఆయనతోనే సాధ్యమన్నారు. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో ప్రశ్నించాలని సంజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ పార్టీ నేతలు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని స్పష్టంచేశారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలవుతున్నా ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని దారి మళ్లించి, అవినీతికి పాల్పడిందని ధ్వజమెత్తారు. రామరాజ్యం కావాలంటే.. ‘బీజేపీకి మోదీ ఉన్నాడు.. ఆయన వెనక శ్రీరాముడు ఉన్నాడు.. కాంగ్రెస్‌కు రాహుల్, కేసీఆర్, ఒవైసీలు ఉన్నారు. దేశంలో రామరాజ్యం కావాలంటే తిరిగి ఎవరు అధికారంలోకి రావాలో ప్రజలే తేల్చుకోవాలి’అని బండి సంజయ్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మళ్లీ మోదీ ప్రధాని అయితేనే రైతులకు సబ్సిడీలు, పేదలకు ఉచిత బియ్యం వస్తాయని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తారని అన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తేనే ఆరు గ్యారంటీలు అమలవుతాయని, అలా కావాలంటే బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరుకోవాలని చమత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌వాళ్లే రైతుబంధు ఆపారు: కేసీఆర్
సాక్షి, షాద్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ బాధలే. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలని ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సోమవారం సీఎం కేసీఆర్ షాద్‌నగర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ‘ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి వారో అన్నీ చూసి ఓటు వేయాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాం. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయ్యాలి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెన్షన్ రూ.5వేలు వరకు ఇస్తాం. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తారట. ధరణి స్థానంలో భూమాత తెస్తామంటున్నారు. కాంగ్రెస్ వాళ్లే రైతుబంధును ఆపారు. కాంగ్రెస్‌లో కూడా రైతుబంధు తీసుకున్న నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లకు సిగ్గు ఉందా?. రైతుల నోటికాడ బుక్క గుంజుకుంటారా?. షాద్‌నగర్ వరకు మెట్రో తెచ్చే బాధ్యత నాది. షాద్‌నగర్‌కు మెట్రో వస్తే.. ఇక్కడ భూముల ధరలు మూడింతలు పెరుగుతాయి. రైతుబంధు ఆపేస్తే కాంగ్రెస్ వాళ్లకు కూడా నష్టమే. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతోనే రైతుబంధును ఈసీ నిలిపివేసింది. పాలమూరు ఎత్తిపోతలు పూర్తి కాకుండా కాంగ్రెస్ వాళ్లే స్టేలు తెచ్చారు’ అంటూ విమర్శలు చేశారు. తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్.. తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ చరిత్ర ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణను సాధించేందుకే ఈ పార్టీ పుట్టిందని గుర్తు చేశారు. ఓటు తలరాతను మారుస్తుందని పేర్కొన్నారు. ఆచితూచి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఆందోల్‌లో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. పార్టీల చరిత్ర, అభ్యర్థుల చరిత్రను గమనించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రజల హక్కులను కాపాడే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత పెన్షన్లు రూ.5వేలకు పెంచామని తెలిపారు. కంటి వెలుగు వంటి మంచి కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా నడిచామని స్పష్టం చేశారు. -
అన్ని కులాలకు మతాలకు అతీతంగా కేసీఆర్ పాలన్: అంజయ్య యాదవ్
-
రెండో రోజు రాహుల్ పర్యటన.. పలువురు కాంగ్రెస్‌లోకి చేరిక
సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. నేటి (బుధవారం) మధ్యాహ్నం వరకు నొవాటెల్ హోటల్లోనే ఉండనున్న రాహుల్.. పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెండింగ్ సీట్లపై పీసీసీ నేతలతో సమావేశం కానున్నారు. రాహుల్ భేటీతో వామపక్ష సీట్లపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాహుల్ సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. మధ్యాహ్నం కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌లోకి గడ్డం వివేక్? కాసేపట్లో నోవోటెల్ హోటల్‌కు మాజీ ఎంపీ వివేక్ వెళ్తారనే ప్రచారం వినిపిస్తోంది. రాహుల్‌తో వివేక్ భేటీ అవుతారని, కొడుకు వంశీతో సహా కాంగ్రెస్ లో చేరతారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌లో చేరికను ఖండించిన బీజేపీ నేత గడ్డం వివేక్‌వెంకటస్వామి.. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫునే పోటీ చేస్తానని ప్రకటించారు. చదవండి: ఏరోజూ పదవి కోరుకోలేదు.. విజయశాంతి ఆసక్తికర ట్వీట్ -
శ్రీనాద్ రోటాప్యాక్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పేలిన సిలిండర్
-
ప్యాకేజీ కవర్ల పరిశ్రమలో భారీ పేలుడు
షాద్‌నగర్: ఆహారాన్ని ప్యాక్ చేసే సిల్వర్ కవర్లను తయారు చేసే ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా.. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బాధితులంతా ఇతర రాష్ట్రాల వారేనని తెలిసింది. పరిమితికి మించిన వేడితో.. షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని కాశిరెడ్డిగూడ శివారులో బ్లెండ్ కలర్ పరిశ్రమ ఉంది. ఇందులో ఫుడ్ ప్యాకేజీకి సంబంధించిన సిల్వర్ కవర్లను తయారు చేస్తారు. ఇందుకోసం మెటాలిక్ పొడిని వినియోగిస్తారు. కార్మికులు రోజూ మాదిరిగానే ఆదివారం రాత్రి విధుల్లో ఉండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో జాజిపతుర, పూర్ణాసింగ్, మందిరి,రాజుసాన్, మంజుదాస్, ప్రదీప్మాన్, సత్య, గిరిధర్‌సింగ్, రాహుల్ఘడ్, సునీల్ ఎంకీతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి, అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం డీఆర్డీఓ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని.. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రుల వివరాలను తెలుసుకున్నారు. పేలుడు షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిందా, మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కంపెనీలో కలర్ తయారు చేసే క్రమంలో వాడే మెటాలిక్ పొడి పరిమితికి మించి వేడి (ఓవర్ హీట్) కావడంతో ప్రమాదం జరిగిందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. -
రంగారెడ్డి: భార్యకు కరెంట్ షాక్ పెట్టిన తాగుబోతు
క్రైమ్: ప్రేమించి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. పదేళ్లు కాపురం కూడా చేసి పిల్లల్ని కన్నాడు. కానీ, మద్యం మత్తులో కుటుంబాన్ని ఆగం చేస్తూ వచ్చాడు. అయితే భర్త, బిడ్డలూ బాగుండాలని మద్యం తాగొద్దని బతిమాలిందామె. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు కోపంతో ఆమెను కిరాతకంగా హతమార్చాడు భర్త. రంగారెడ్డి షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. మద్యం తాగొద్దని అన్నందుకు కోపంతో నిద్రలో ఉన్న భార్యకు కరెంట్ షాక్ పెట్టాడు ఓ తాగుబోతు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పదేళ్ల కిందట.. కవిత, యాదయ్యలు ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే.. యాదయ్య పోనుపోను మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో ఆ అలవాటు మానుకోవాలని ఆమె కోరింది. పంచాయితీలు జరగ్గా.. పెద్దలు ఆమెకు సర్దిచెప్పి పంపించారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకుని కిరాతకంగా చంపాడు. అనంతరం మత్తు దిగడంతో.. భయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కరెంట్ షాక్‌తో చనిపోయిందని అబద్ధపు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు అనుమానంతో తమదైన శైలిలో ప్రశ్నించగా.. నిజం ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై కొండుర్గు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తమ బిడ్డను అన్యాయంగా బలిగొన్నాడంటూ కవిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇదీ చదవండి: తాగనికి పైసల్లేవని ఆ తాత ఏం చేశాడంటే.. -
షార్ట్ సర్క్యూట్‌తో 'చవర్లెట్ ఎంజాయ్' కారు దగ్ధం
-
Hyderabad: షార్ట్ సర్క్యూట్‌తో 'చవర్లెట్ ఎంజాయ్' కారు దగ్ధం
సాక్షి, హైదరాబాద్: షాద్ నగర్‌లోని రాంనగర్ కాలనీలో షార్ట్ సర్క్యూట్‌తో 'చవర్ లెట్ ఎంజాయ్' వాహనం దగ్ధమైంది. కొందుర్గు మండలానికి చెందిన నగేష్‌కు చెందిన ఈ వాహనం నంబర్ టీఎస్ ఓ7 యూసీ 8997 షార్ట్ సర్క్యూట్‌కు గురైందని డ్రైవర్ అశోక్ తెలిపాడు. ఉదయం రాంనగర్లో తన ఇంటి నుంచి కంపెనీకి బయలుదేరగా కొద్ది దూరం వెళ్ళాక వాహనంలో పొగలు వచ్చాయని, వెంటనే కారు దిగి బానట్ ఓపెన్ చేసి చూసేలోపే మంటలు చెలరేగాయని చెప్పాడు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, కారు మొత్తం మంటల్లో దగ్ధమైందని వాపోయాడు. అగ్నిమాపక సిబ్బంది వెళ్లే మంటలు ఆర్పారు. కానీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. చదవండి: హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు -
ఎఫ్సీఎన్ ఆధ్వర్యంలో కండర క్షీణిత బాధితులకు ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్‌లో ఎఫ్సీఎన్ హోమ్ ఆధ్వర్యంలో కండర క్షీణిత బాధితులకు నగదు, నిత్యవసరాలను బుధవారం పంపిణీ చేశారు. ఎఫ్సీఎన్ సంస్థ వ్యవస్థాపకులు డా. గీత, తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు.. కండర క్షీణిత బాధితులకు ఆర్థిక సాయాన్ని అందించారు. జంట నగరాల పరిసర ప్రాంతాల నుండి వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ. ఐదువేలు చొప్పున నగదు, జత బట్టలు, దుప్పటి, నిత్యావసరాలను అందజేశారు. ఈ కండర క్షీణిత వ్యాధితో దుర్భర జీవితాలను అనుభవిస్తున్న వారిని గుర్తించి మానవతా దృక్పథంతో వారికి తమ వంతు సహాయం అందజేస్తున్నామని వ్యవస్థాపకులు అన్నారు. కండర క్షీణిత వ్యాధితో బాధితులకు మానవత్వంతో తోచిన సాయాన్ని అందించాలని నిర్వాహకులు పిలుపునివ్వగా, కొందరు దాతలు ఉదార స్వభావంతో ముందుకు వచ్చారు. స్థానిక ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు స్లీవా రెడ్డి ఒక్కొక్కరికి రూ.1000 నగదు చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన దాతలకు ఎఫ్సీఎన్ సంస్థ వ్యవస్థాపకులు కృతజ్ఞతలు తెలిపారు. -
షాద్ నగర్: ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ
సాక్షి, రంగారెడ్డి: ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గీత థామస్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో షాద్ నగర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ZPHS హై స్కూల్ కిషన్ నగర్ ఊర్దూ మీడియం, మరియరాని పాఠశాలలో చదువుతున్న 558 మంది విద్యార్థులకు 558 బ్యాగ్స్, ఉచితంగా పంపిణి చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా ఎదిగినప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని అన్నారు. విద్యాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మరియరాని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫాదర్ అలెగ్జాండర్, జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివకుమారి, ఇతర సిబ్బంది హాజరై ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
టప్పాఖానాలకు కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: ఇది షాద్‌నగర్ సమీపంలోని మొగిలిగిద్ద టప్పాఖానా. 1925లో నిజాం ప్రభుత్వం నిర్మించిన భవనం. 97 ఏళ్లుగా అందులోనే తపాలా కార్యాలయం కొనసాగుతోంది. వందేళ్లకు చేరువవుతున్న నేపథ్యంలో దాదాపు రూ.10 లక్షలు వెచ్చించి దీనికి పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని, ప్రస్తుత అవసరాలకు వీలుగా మార్చాలని తపాలాశాఖ నిర్ణయించింది. స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగంగా మరమ్మతులకు శనివారం శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డా‘‘ పీవీఎస్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొగిలిగిద్ద పాత భవనం ముందు పచ్చికతో లాన్ కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తపాలాశాఖ అధికారులు సంతోశ్‌కుమార్ నరహరి, వెంకటేశ్వర్లు, గౌస్ పాషా, జుబేర్, హేమంత్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా... మొగిలిగిద్దతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిజాం హయాంలో నిర్మించిన టప్పాఖానాలను అభివృద్ధి చేసేందుకు తపాలాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు అందించిన వినతులు, సూచనలకు సంబంధించిన పనులను పూర్తి చేస్తున్నారు. ప్రజలు నేరుగా గానీ, సామాజిక మాధ్యమాల ద్వారా గానీ ఇచ్చిన వినతుల ఆధారంగా పరిష్కరిస్తున్నారు. కార్యాలయాల్లోని తుక్కు, అవసరం లేని కాగితాలు, ఇతర చెత్తను తొలగించి పరిశుభ్రం చేయటంతోపాటు తదుపరి అవసరాలకు వీలుగా ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. -
‘దసరాకి కొత్త దుస్తులు నాన్నా.. ఈ రోజే తెద్దాంలే కన్నా’.. అంతలోనే
సాక్షి, రంగారెడ్డి: ‘నాన్నా.. దసరా పండగకి నాకు కొత్త దుస్తులు కావాలి..’ ఇదీ కొడుకు కోరిక. తెద్దాంలే నాన్న.. ఈ రోజే తీసుకుందాం.. ఇదీ చిరునవ్వుతో తండ్రి వాగ్దానం. అంతలోనే విధి వక్రీకరించింది. గంట వ్యవధిలోనే కొడుకును నీటి గుంత పొట్టనపెట్టుకుంది. పండుగ దుస్తు లు కావాలన్న కొడుకు విగతజీవిగా కనిపించడంతో ఆ తండ్రి రోదనకు అంతే లేకుండా పోయింది. షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని సోలీపూర్ శివారులో నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందిన సంఘటనలో నెలకొన్న విషాదం ఇదీ. వ్యవసాయ కూలీగా పని చేసే భిక్షపతి కుమారుడు అక్షిత్ సోమవారం ఉదయాన్నే పండుగ దుస్తులు అడిగాడు. తీసుకుందాం అనుకున్నంతలోనే ఈ ఘోరం జరిగిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని కన్నీరుమున్నీరయ్యాడు. ముగ్గురు కుమారుల్లో చిన్న వాడైన అక్షిత్‌ను అల్లారుముద్దుగా చూసుకున్నామని.. ఇలా జరుగుతుందనుకోలేదని తల్లిదండ్రులు భిక్షపతి, శివలీల రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఆ ఇద్దరూ అన్నదమ్ముల కొడుకులు మృతి చెందిన మరో ఇద్దరిలో సైఫ్, ఫరీద్ అన్నదమ్ముల పిల్లలు. మృతుల తండ్రులు సలీం, నయూం వరుసకు అన్నదమ్ములు. ఎక్కడికి వెళ్లినా సైఫ్, ఫరీద్ ఒకరిని విడిచి ఒకరు ఉండే వారు కాదని.. ఒకరంటే మరొకరికి ఎంతో ప్రాణమని కుటంబ సభ్యులు తెలిపారు. బతుకమ్మలు, నవరాత్రులతో సందడిగా ఉన్న గ్రామంలో ముగ్గురి మరణం ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. -
22 రోజులకు రూ.1,17,694 కరెంట్ బిల్లు.. యాజమాని షాక్
సాక్షి, రంగారెడ్డి: కరెంటు బిల్లు చూసిన ఓ ఇంటి యజమాని గుండె గు‘బిల్లు’మంది. ఏకంగా లక్ష రూపాయల బిల్లు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. షాద్‌నగర్ మున్సిపల్ పరిధి చటాన్‌పల్లిలో రమాదేవి ఇంటికి సంబంధించిన విద్యుత్ మీటర్ గత నెల కాలిపోయింది. దీంతో ఆశాఖ సిబ్బంది కొత్త మీటర్ ఏర్పాటు చేశారు. గత నెలలో కాలిపోయిన మీటర్‌కు సంబంధించిన బిల్లును బుధవారం యజమానికి ఇచ్చివెళ్లారు. ఇందులో ఆగస్టు 16నుంచి ఈనెల 7వ తేదీ వరకు 22 రోజులకు గానూ 10,510 యూనిట్ల విద్యుత్ వాడినట్లు, ఇందుకు రూ.1,17,694 చెల్లించాలని బిల్లులో నమోదైంది. ప్రతి నెల రూ.వందల్లో వచ్చే బిల్లు ఒకేసారి లక్ష రూపాయలు దాటడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై రూరల్ ఏఈ రాకేశ్‌ను అడగగా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని, సరిచేస్తామమన్నారు. -
హైవే ఎక్కుతున్నారా.. ఓసారి జేబులు చెక్ చేసుకోండి!
షాద్‌నగర్: టోల్ బాదుడు ఏటా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. యథావిధిగా ఈ ఏడాది కూడా టోల్‌ప్లాజాలో ధరలు పెరుగుతుండటంతో జాతీయ రహదారిపై ప్రయాణం మరింత భారం కానుంది. టోల్ ప్లాజాలో రుసుములు పెరుగుతుండటంతో అటు వాహనదారులు, ఇటు సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ –బెంగళూరు 44వ జాతీయ రహదారిపై షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజాలో రుసుము భారీగా పెరిగింది. పెంచిన ధరలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రయాణికులపై మరింత భారం బెంగళూరు జాతీయ రహదారిపై ప్రయాణించే వారిపై భారం మరింత పెరగనుంది. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం టోల్ ధరలు పెంచుతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు సరికాదంటున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణికులు, వాహనదారులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారి వెంట సబ్వే సరిగా లేకపోవడంతో రోడ్డు పక్కన గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా తప్పని పెంపు షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వరకు జాతీయ రహదారిని (సుమారు 58 కి.మీ) రూ.600 కోట్లతో విస్తరించి అవసరమైన చోట బైపాస్ నిర్మించారు. ఈ జాతీయ రహదారిని 2009లో కొత్తూరులో ప్రారంభించారు. షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులో నిర్మించిన టోల్ ప్లాజాలో ఏటా టోల్ రుసుము పెంచుతూ వస్తున్నారు. స్కూల్ బస్సుల నుంచి యథావిధిగా.. టోల్ ప్లాజాలో నెలవారీ పాసుల రుసుమును కూడా పెంచుతున్నారు. కారు, ప్యాసింజర్, వ్యాను లేక జీపు రూ.2,115 నుంచి రూ.2,425, లైట్ కమర్షియల్ వాహనాలు, మినీ బస్సులు రూ. 3,700 నుంచి రూ. 4,245, ట్రక్కు, బస్సు రూ.7,395 నుంచి రూ.8,485, మల్టీయాక్సిల్ వాహనాలు రూ.11,895 నుంచి రూ.13,635కి పెంచనున్నారు. స్కూల్ బస్సుల నుంచి యథావిధిగా నెలవారీగా రూ.1000 వసూలు చేయనున్నారు. అన్ని వాహనాలపై బాదుడే.. టోల్గేట్లో ఈసారి అన్ని రకాల వాహనాలైన కారు, ప్యాసింజర్ వ్యాన్, లైట్ కమర్షియల్ వాహనాలతో పాటు ట్రక్కు, బస్సు, మల్టీయాక్సిల్ వాహనాలు (అనేక చక్రాల వాహనం)లకు రుసుములను భారీగా పెంచనున్నారు. దీంతో టోల్ ప్లాజాకు ఆదాయం కూడా పెరగనుంది. నిత్యం ఈ టోల్ ప్లాజా నుంచి సుమారు 15వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజు సుమారు రూ.28లక్షల మేర ఆదాయం సమకూరుతుంది. టోల్ ధరలు పెరుగుతుండటంతో మరో రూ.మూ డు లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. (క్లిక్: మందుబాబులకు షాక్.. తాగేదంతా మద్యం కాదు) రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పెట్రోల్, ఢీజిల్ ధరల పెరుగుదల, టోల్ రుసుములు రవాణా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వాహనాల యజమానులు తమ లారీలను నడపలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మళ్లీ టోల్ ధరల పెంపుతో భారం తప్పదు. – సయ్యద్ సాధిక్, లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుసుము తగ్గించాలి కరోనా నేపథ్యంలో సామాన్య, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టోల్ రుసుము పెంచడంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతుంది. రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయపడాల్సిన వస్తోంది. రుసుము తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – శివకుమార్, షాద్‌నగర్ -
సడన్ బ్రేక్.. ఒకదాని వెనుక మరోటి ఢీ.. వరుసగా 9 వాహనాలు ధ్వంసం
సాక్షి, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ శివారులోని బైపాస్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం తొమ్మిది వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. వివరాలివీ.. మహబూబ్‌నగర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు డ్రైవర్ ముందు వెళ్తున్న బస్సును ఓవర్టేక్ చేయబోయి సడన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న తొమ్మిది వాహనాలు ఒకదానికికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది వాహనాలు దెబ్బతిన్నాయి. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు క్రాసింగ్ ఉండటంతో వాహనాలు కొంతమేర నిదానంగా వెళ్తున్నాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. (క్లిక్: కారులో ఇద్దరు ఎక్కడికి వెళ్లారు..?) ఓవర్టేక్ చేయబోయి.. అదుపు తప్పిన బైక్.. వ్యక్తి దుర్మరణం చేవెళ్ల: ముదు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి బైక్‌పై ఉన్న వ్యక్తి అదుపుతప్పి కిందిపడిన ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు.. చేవెళ్ల మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఎల్వేర్తి నరేశ్(30) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం బైక్‌పై ఆలూరు నుంచి గేట్‌కు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యలో ముందు వెళ్తున్న బోలేరోను ఓవర్టేక్ చేయబోతుడంగా బైక్ ఆదుపు తప్పి పడిపోయాడు. తలకు తీవ్రగాయం కావటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు అతడి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య సంతోష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (క్లిక్: కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రేమకథ) -
కన్నతండ్రి కళ్ల ముందే విగతజీవిలా మారితే.. దిక్కులు పిక్కటిల్లేలా..
షాద్‌నగర్ (రంగారెడ్డి): కరోనా సృష్టించిన విషాదం కన్నీటి అక్షరం అయింది. కన్న తండ్రిని పోగొట్టుకున్న ఓ చిన్నారి గుండెలో వేదన లేఖగా మారింది. పాఠశాలలు మూసేసి .. ఇంటికి వెళ్తున్న తరణంలో ఓ విద్యార్థిని తన కన్నీటి గాథకు అక్షర రూపం ఇచ్చింది. కరోనా సమయంలో కన్న తండ్రిని కాపాడుకునేందుకు పడిన వేదన.. ఆస్పత్రి సేవల కోసం చేసిన శోధన.. అంటరాని వాళ్లను చేసి అందరూ దూరం చేస్తే ఒంటరిగా పడిన యాతన.. చివరికి కన్నతండ్రి కళ్ల ముందు విగత జీవిగా పడి ఉంటే దిక్కులు పిక్కటిల్లేలా చేసిన రోదన.. అన్నింటినీ తన లేఖలో వ్యక్తపరిచింది. ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సుధామాధురి ఐదో తరగతి చదువుతోంది. ఆదివారం నుంచి వేసవి సెలవులు కావడంతో శనివారం చివరి రోజు తన స్నేహితురాలికి లేఖ రాసింది. కరోనా సమయంలో చిన్నారి అనుభవించిన మానసిక వేదన చదివిన వారిని కంటతడి పెట్టించింది. చదవండి: (విషాదం: సంబంధాలు వస్తున్నాయి.. భూమి కొనడానికి ఎవరూ రాక..) -
కూతురి ఉసురు తీసిన తండ్రి.. అదృశ్యమైందంటూ..
సాక్షి, షాద్‌నగర్: కన్నకూతురును కళ్లలో పెట్టుకొని చూసుకోవాల్సిన తండ్రి కర్కశంగా ఆ చిన్నారి ఉసురు తీశాడు. ఈ ఘటన షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయత్రం వెలుగుచూసింది. ఫరూఖ్‌నగర్ మండలం బాపన్‌గుట్ట తండాకు చెందిన నరేశ్, రజిత దంపతులకు కూతురు ప్రియ (9 నెలలు) ఉంది. తన కూతురు కనిపించడంలేదని నరేశ్ ఆదివారం షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా క్లూస్ట్ టీం ,డాగ్ స్క్వార్డ్‌తో రంగంలోకి దిగిన సీఐ నవీన్ కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు 24 గంటల్లో కేసును చేధించారు. ప్రియ మిస్సింగ్ కేసు హత్య కేసుగా మార్చి హత్యకు గల కారణాలను ఏసీ కుశల్కర్ మంగళవారం మీడియాకు వెల్లాడించారు. రెండేళ్ల కిత్రం నరేశ్, రజితకు వివాహమైనట్లు తెలిపారు. అయితే నరేశ్ వ్యవహారశైలిని అనుమానించి అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా, చిన్నారిని తానే హత్యచేసినట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు. చదవండి: విషాదం మిగిల్చిన ఫోటోషూట్.. పెళ్లైన రెండు వారాలకే.. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో పరీక్షల్లో ఎయిడ్స్ ఉందని నిర్ధారణ అయ్యినట్లు, దీనితో అనారోగ్యం, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో తమకు ఏమైనా అయితే పాప పరిస్థితి ఏంటని అనాలోచితంగా ఆలోచించిన నరేశ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. హంతకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. అలాగే ఈ ఘటనలో తల్లిపాత్ర కూడా ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చదవండి: Extra Marital Affair: స్నేహితుడి ప్రియురాలితో సానిహిత్యం.. ఏడాది తర్వాత! -
జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మృతి.. నిద్రమత్తులో..
Junior Artist Jyothi Reddy Death News: రైలు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ స్టేషన్లో మంగళవారం తెల్లవారుజామున రైలు దిగి మళ్లీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ కథనం ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా చిట్వేన్ మండలం సిగమాల వీధికి చెందిన బట్టినపాత జ్యోతి (26) హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్టు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగిగానూ ఆమె విధులు నిర్వర్తిస్తోంది. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన జ్యోతిరెడ్డి.. సోమవారం రాత్రి తిరుగు పయనమైంది. చిత్తూరు నుంచి కాచిగూడ వస్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఆమె రైల్వేకోడూరులో ఎక్కి హైదరాబాద్‌కు బయలుదేరింది. రైలు మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో షాద్‌నగర్ రైల్వే స్టేషన్లో ఆగింది. నిద్రమత్తులో ఉన్న జ్యోతిరెడ్డి కాచిగూడ రైల్వేస్టేషన్ అనుకొని షాద్‌నగర్ స్టేషన్లో దిగింది. చదవండి: (వైద్యుని ఆత్మహత్య వెనుక హనీట్రాప్.. నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్) వెంటనే తిరిగి రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా.. అప్పటికే రైలు కదులుతుండటంతో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాంపై పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జ్యోతిరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రి వద్ద ఆందోళన.. చాదర్‌ఘాట్: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి మృతితో మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. షాద్‌నగర్ వద్ద చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో జ్యోతిరెడ్డి తీవ్ర గాయాల పాలైంది. చికిత్స నిమిత్తం ఆమెను మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలిస్తుండగా బంధువులు అభ్యంతరం చెబుతూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. చదవండి: (Dhanush and Aishwaryaa Separation: ఫలించని తలైవా ప్రయత్నం) -
జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతిపై రగడ
Junior Artist Jyothi Reddy Suspicious Death: Friends Demands Justice: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి అనుమానాస్పద మృతిపై జూనియర్ ఆర్టిస్టులు, స్నేహితులు ఆందోళన చేపట్టారు. వివరాల ప్రకారం కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి ఈరోజు( మంగళవారం) షాద్‌నగర్ రైలు పట్టాలపై గాయాలతో పడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం స్నేహితులు ఆమెను మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జ్యోతి రెడ్డి మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. దీంతో మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆసుపత్రి ఎదుట జూనియర్ ఆర్టిస్టులు ధర్నా చేపట్టారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
షాద్ నగర్లో క్షుద్ర పూజలు..బయటపడ్డ దొంగ స్వామీజీ బాగోతం
సాక్షి, రంగారెడ్డి: పల్లెల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. మంత్రతంత్రాలు, గుప్తనిధుల పేరుతో కొందరు గ్రామీణులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులు అంటూ మూఢ నమ్మకాలను అమాయక ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. తాజాగా షాద్‌నగర్ మండలం కమ్మదనం గ్రామ శివారులు ఓ దొంగ బాబా క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శివస్వామి అనే వ్యక్తి కొంతకాలంగా ఓ ప్రైవేట్ వెంచర్ లో ఇల్లు కట్టుకుని.. కాళికామాత విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నాడు. అతని వద్దకు వెళ్లేవారి కళ్లల్లో నిమ్మ రసం పిండి, వెంట్రుకలు పట్టి కొడుతున్నాడు. అమ్మవారి పాదాల కింద పోటోలు పెట్టి వశీకరణ మంత్రం రాగి పూతలతో కూడుకున్న పేర్లు రాసి పెడుతున్నాడు. గతంలో మధురాపూర్ గ్రామంలో ఇలాగే ప్రవర్తించగా.. గ్రామస్తులు బెదిరించడంతో అక్కడి నుండి వెంచర్ దగ్గరకు క్షుద్ర పూజలను షిఫ్ట్ చేశాడు. తాజాగా అతని వద్దకు హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పూజలు చేయించడానికి తీసుకొచ్చింది. చదవండి: కొలంబో క్యాసినోలో శాశ్వత టేబుల్! .. ఉద్యోగాలు పోయిన వారే టార్గెట్ అయితే డబ్బులు తీసుకొని తల్లి ఆరోగ్యాన్ని నయం చేయలేదని మోపోయానని గ్రహించిన సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా నిందితుడు ఎలా క్షుద్ర పూజలు చేస్తాడో ఆ వీడియోతో సహా ఆధారాలు బయటపెట్టింది. దీంతో శివ స్వామీ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. దొంగ స్వామిపై షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. కాగా తాను క్షుద్ర పూజలు చేయలేదని. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మంత్రిస్తానని స్వామి పోలీసులు తెలిపారు. చదవండి: మహిళా టెక్కీ ఆత్మహత్య.. రెండేళ్ల క్రితమే వివాహం.. -
వివాహేతర సంబంధం.. భార్యను పలుమార్లు హెచ్చరించాడు.. చివరకు
సాక్షి, షాద్‌నగర్ రూరల్: వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడా.. లేక మరేదైనా ఘటన హత్యకు దాసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాద్‌నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో గురువారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు.. కర్నూలుకు చెందిన నాగరాజు(40) కొంతకాలంగా పట్టణంలో రోడ్ల పక్కన చిత్తు కాగితాలు సేకరిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు పట్టణంలో నివాసం ఉంటున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. సదరు మహిళ భర్తతో కలిసి పటేల్ రోడ్డులోని అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. వివాహేతర సంబంధం విషయం భర్తకు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు అతడు భార్యకు సూచించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నాగరాజును ఎలాగైనా పక్కకు తప్పించాలని మహిళ భర్త పథకం పన్నాడు. అందులో భాగంగానే హత్య చేసినట్లు తెలుస్తోంది. తన భార్య కోసం ఇంటికి వచ్చిన నాగరాజును అతడు కొట్టి చంపేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నాగరాజు మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. -
దీపం ఆరింది.. దిశగా వెలిగింది.. ‘దిశ’ విషాదానికి నేటితో రెండేళ్లు
సాక్షి, షాద్‌నగర్: దేశవ్యాపంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ విషాదాంతానికి నేటితో రెండేళ్లు పూర్తయ్యా యి. నలుగురు మృగాళ్ల వికృత చేష్టలకు ఆమె అసువులుబాసినా మహిళా రక్షణ చట్టాలకు ‘దిశా’నిర్దేశం చేసింది. ఆమె మరణించిన కూతవేటు దూరంలోనే ఆ నలుగురికీ పడిన శిక్ష చర్చనీయాంశమైంది. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై.. షాద్‌నగర్ శివారులో ముగిసి.. ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించిన ఈ ఘటనను ఓసారి నెమరువేసుకుంటే.. చదవండి: ‘దిశ’ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు సరిగ్గా రెండేళ్ల క్రితం 2019 నవంబర్ 27న రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో దిశ అత్యవసర పరిస్థితుల్లో తన స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఆపి పని మీద వెళ్లి నలుగురు నరహంతకుల కంట పడింది. తిరిగి వచ్చి తన స్కూటీని తీసుకుని ఇంటికి వెళ్లే ప్రయత్నం చేసింది. కాపుకాసిన ఆ నలుగురు ఆమెను బలవంతంగా ఓ పాడుబడిన ప్రహరీ పక్కకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి అంతమొందించారు. నవంబర్ 28న తెల్లవారుజామున మృతదేహాన్ని లారీలో తెచ్చి షాద్‌నగర్ శివారులోని బైపాస్ జాతీయ రహదారి చటాన్‌పల్లి బ్రిడ్జి కింద కాల్చివేశారు. 2019 డిసెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం దిశను హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఘటనా స్థలికి తీసుకొచ్చారు. పోలీసులపై దాడి చేసి వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఎన్కౌంటర్ చేయడం మరో సంచలనం అయింది. దిశ హత్య ఘటన ఎంతగా కదిలించిందంటే ఎన్‌కౌంటర్‌ను ప్రతి ఒక్కరూ సమర్థిస్తూ పోలీసులపై పూల వర్షం కురిపించారు. అంతేకాదు ఈ హత్యోదంతం చట్టాలకు దిశానిర్దేశం చేసింది. కొత్త చట్టాలకు రూపకల్పన దుర్మార్గుల చేతిలో కిరాతకంగా బలైన దిశ పేరిట ప్రభుత్వాలు కొత్త చట్టాలను తీసుకొచ్చాయి. ఆపదలో ఉన్న ఏ ఆడపిల్లయినా ఫోన్ చేస్తే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని రక్షించేలా ఫోన్ నంబర్లు, పోలీసు వ్యవస్థను రూపొందించారు. ఇలాంటి సంఘటనలపై వేగంగా తీర్పు ఇచ్చి నిందితులకు శిక్షలు అమలయ్యేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఆడ పిల్లలు ఎక్కడున్నది వాహనాల ద్వార ఎక్కడికి వెళ్తున్నది ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని రక్షించేలా ప్రత్యేక యాప్‌లను క్రియేట్ చేశారు. మహిళలకు తగిన జాగ్రత్తలను సూచిస్తూ వారికి హాని తలపెడితే వేసే శిక్షలను కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఇదీ పరిస్థితి దిశ ఘటన తర్వాత కొంత మార్పు వచ్చినా ఇంకా పూర్థి స్థాయిలో రాలేదని చెప్పాలి. ఈ సంఘటన తర్వాత కూడా ఆగడాలు అక్కడక్కడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రాజధాని సాక్షిగా జరిగిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. హత్య ఉదంతమే ఇందుకు ఉదాహరణ. మహిళలపై లైంగిక దాడులు, బెదిరింపుల వంటివి కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్లో పూర్తి స్థాయిలో చైతన్యం రాకపోవడం.. పోలీసులు కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో దుర్మార్గుల నుంచి రక్షణ పొందలేకపోతున్నారు. ఏది ఏమైనా దిశ హత్యోదంతం పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మార్పునకు శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. సాగుతున్న విచారణ దిశ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే నిందితులకు శిక్ష అమలైంది. ఇది తమను తాము రక్షించుకోవడంలో భాగంగా చేసిందని పోలీసులు చెబుతున్నా దీనిలో నిజానిజాలు తేల్చే దిశగా మానవ హక్కుల కమిషన్ కోర్టు విచారణ కొనసాగుతున్నాయి. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ వేసింది. కమిటీ సభ్యులు ఇప్పటికే ఎంతో మందిని విచారించారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది. -
పరిమళించిన మానవత్వం..యాచకుడికి ట్రాఫిక్ కానిస్టేబుల్ సపర్యలు
సాక్షి, షాద్‌నగర్: ఆకలితో అలమటిస్తున్న ఓ యాచకుడు రోడ్డు దాటుతూ కిందపడిపోయాడు. వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్ సాయం అందించి మానవత్వాన్ని చాటాడు. షాద్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మురళీ శుక్రవారం పట్టణంలోని ముఖ్య కూడలిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో డొక్కలు ఎండిపోయి ఆకలితో అలుమటిస్తూ ఓ యాచకుడు రోడ్డు దాటేందుకు యత్నిస్తూ కింద పడిపోయాడు. చదవండి: టీఎస్ఆర్టీసీ: ప్రభుత్వ పూచీకత్తు లేకుండానే రూ.300 కోట్ల రుణం గమనించిన కానిస్టేబుల్ మురళీ ఆ యాచకుడిని పైకి లేపి పక్కన కూర్చోబెట్టాడు. ఆకలితో ఉన్నానని, కళ్లు తిరుగుతున్నాయని ఆ యాచకుడు సైగలు చేయడంతో వెంటనే కానిస్టేబుల్ యాచకుడికి నీళ్లు తాగించి, పక్కనే ఉన్న పండ్లు కొనిచ్చి ఆకలి తీర్చాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు. మానవత్వాన్ని చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. షాద్‌నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ కానిస్టేబుల్ మురళీకి రివార్డు అందజేశారు. తోటి పోలీస్ సిబ్బంది అతన్ని అభినందించారు. చదవండి: కూకట్‌పల్లిలో వ్యభిచార దందా.. ఓ మహిళను రప్పించి.. -
పెరిగిన టోల్‌ప్లాజా ధరలు.. నేటి నుంచి అమల్లోకి!
సాక్షి, షాద్‌నగర్: ప్రయాణికులు, వాహనదారులపై మరింత భారం పడనుంది. టోల్ ప్లాజా ధరలు పెరగనుండటంతో జేబులు మరింత ఖాళీ కానున్నాయి. ఏటా టోల్ ప్లాజా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 44వ జాతీయ రహదారిపై షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజాలో పెంచిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఏటా పెంపు.. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తూరు నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వరకు ఉన్న జాతీయ రహదారిని సుమారు 58 కిలోమీటర్ల మేర రూ.600 కోట్ల వ్యయంతో విస్తరించారు. అవసరమైన చోట్ల బైపాస్‌లు నిర్మించారు. 2009లో పనులు పూర్తిచేసి కొత్తూరులో ప్రారంభించారు. షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ శివారులో నిర్మించిన టోల్ ప్లాజా రుసుంను ఏటా పెంచుతున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇప్పటికే అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు టోల్ చార్జీలు కూడ పెంచడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన చార్జీలు సెప్టెంబర్ 1నుంచి అమలులోకి వస్తాయని టోల్‌ప్లాజా నిర్వాహకులు ప్రకటనలు కూడా జారీ చేశారు. చదవండి: ఇక్కడ బస్టాప్ ఎక్కడుందబ్బా.. కనిపించట్లేదు! పెరగనున్న పాసుల రుసుము టోల్ ప్లాజాలో నెల వారీ పాసుల రుసుంను కూడా పెంచనున్నారు. కారు, ప్యాసింజర్ వ్యాను లేక జీపు రూ.1,960 నుంచి రూ.2,115లు, లైట్ కమర్షియల్ వాహనాలు, మినీ బస్సులు రూ.3,430 నుంచి రూ.3,700, ట్రక్కు, బస్సు రూ.6,860 నుంచి రూ.7,395, మల్టీయాక్సిల్ వాహనాలు రూ.11,025 నుంచి రూ.11,895లు పెంచనున్నారు. స్కూల్ బస్సుకు నెలవారీ పాసు రుసుము రూ.1,000 వసూలు చేయనున్నారు. ఈ సారి పెంచేశారు గతేడాది కారు, ప్యాసింజర్ వ్యాన్లతో పాటుగా, లైట్ కమర్షియల్ వాహనాలకు టోల్ రుసుం పెంచలేదు. కానీ ఈసారి మాత్రం కారు, ప్యాసింజర్ వ్యాన్, లైట్ కమర్షియల్ వాహనాలతో పాటు ట్రక్కు, బస్సు, మల్టీయాక్సిల్ వాహనాల (అనేక చక్రాల వాహనం) రుసుం పెంచనున్నారు. అయితే పెంచిన ధరలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోని రానున్నాయి. పెరగనున్న ఆదాయం షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా మీదుగా నిత్యం సుమారు పదివేల వాహనాలకుపైగా రాకపోకలు సాగిస్తాయి. కరోనా నేపథ్యంలో చాలా మంది తమ సొంత వాహనాలపై ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ టోల్ ప్లాజాలో నిత్యం సుమారు రూ.25 లక్షల రూపాయల వరకు రుసుం వసూలవుతుంది. చార్జీలు పెంచడంతో టోల్ ఆదాయం రోజుకు రూ.2 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈమేర వాహనదారులపై భారం పడనుంది. వాహనం వెళ్లేందుకు రానుపోను (కొత్త చార్జీలు) కారు, జీపు ప్యాసింజర్ వ్యాన్ రూ.70 రూ.105 లైట్ కమర్షియల్, మినీ బస్ రూ.125 రూ.185 ట్రక్కు, బస్సు రూ.245 రూ.370 మల్టియాక్సిల్ వాహనాలు రూ.395 రూ.595 భారం మోపడం సరికాదు ఏటా టోల్ రుసుం పెంచి వాహనదారులపై భారం మోపడం సరికాదు. చార్జీల పెంపుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీలు, ట్రక్కులకు కిరాయిలే సరిగా రావడం లేదు. ఈ సమయంలో కిస్తులు కట్టడం కూడా గగనమవుతోంది. – సయ్యద్ సాధిక్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, షాద్‌నగర్ -
‘ఎన్ని కష్టాలెదురైనా.. ప్రజా ఆశీర్వాదంతో ముందుకు సాగుతాం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ప్రజా ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు ముందుకు సాగుతున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రూ.1 కోటి 88 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా స్థానిక కుంట్ల రాంరెడ్డి గార్డెన్లో జరిగిన షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 3కోట్ల 49 లక్షల రూపాయల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ రాష్ట్ర చైర్మన్ ఆయాచితం శ్రీధర్, జిల్లా చైర్మన్ పాండురంగారెడ్డి, హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రసంగిస్తూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని, కోట్లాది రూపాయలను వెచ్చించి ప్రజా సంక్షేమాన్ని చేపడుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల 4 వేల 70 మందికి కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులను అందించిందని పేర్కొన్నారు. మొదటి విడతగా 6వేల కోట్లు, రెండో విడతగా 2వేల కోట్లు మొత్తం 8వేల కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. పాలనలో తెలంగాణ రాష్ట్రం భారత దేశానికి ఆదర్శం అని అన్నారు. -
యువతిగా మారాలని యువకుడి కోరిక.. చివరికి
సాక్షి, హైదరాబాద్: యువతిగా మారాలన్న తన కోరికను కుటుంబికులు అంగీకరించట్లేదనే ఉద్దేశంలో షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదేపదే ‘అదృశ్యం’ అవుతున్నాడు. ఎట్టకేలకు ఈ అంశం సైబరాబాద్ ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్‌డెస్క్ వద్దకు వచ్చింది. అతడి ఆచూకీ కనిపెట్టిన అధికారులు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అంతటితో ఆగకుండా కుటుంబికులకు కౌన్సెలింగ్ చేసి అతడి కోరిక తీరేలా చేశారు. గత నెల 6 నుంచి పని చేయడం ప్రారంభించిన ఈ డెస్క్‌కు మొత్తం ఏడు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు గురువారం వెల్లడించారు. అయిదుగురికి కౌన్సెలింగ్ చేయగా.. రెండు అంశాల్లో కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదో తరగతిలో ఉండగానే యువతిగా మారాలని భావించాడు. తన కోరికను తల్లిదండ్రులకు చెప్పగా వారు ససేమిరా అన్నారు. దీంతో ఇల్లు విడిచి పారిపోయిన అతగాడు ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న ఓ ట్రాన్స్‌జెండర్స్ గ్రూప్‌లో చేరాడు. అప్పట్లో తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న షాద్‌నగర్ పోలీసులు అతడిని గుర్తించి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలా గడిచిన కొన్నేళ్ల కాలంలో మూడు నాలుగుసార్లు జరిగింది. ఇటీవల మరోసారి ఇంటి నుంచి వెళ్లిపోయిన అతగాడు సిద్దిపేటకు చేరాడు. అతడి తల్లిదండ్రులు షాద్‌నగర్ పోలీసుల వద్దకు వెళ్లగా.. అక్కడి అధికారులు గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్ డెస్క్‌కు పంపారు. సబ్– ఇన్స్పెక్టర్ నేతృత్వంలో సాగుతున్న ఈ డెస్క్ వీరి నుంచి ఫిర్యాదు స్వీకరించింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించింది. అతడు సిద్దిపేటలో ఉన్నట్లు గుర్తించి తీసుకువచ్చారు. యువతిగా మారాలన్న కోరిక తీరకపోతే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం కావడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని తీవ్ర పరిణామాలకు ఆస్కారం ఉందంటూ తల్లిదండ్రులకు హెల్ప్ డెస్క్ కౌన్సెలింగ్ చేసింది. ఫలితంగా పరిస్థితులు అర్థం చేసుకున్న వాళ్లు తమ కుమారుడి కోరికను మన్నించారు. హెల్ప్ డెస్కే చొరవ తీసుకుని అతడికి ఓ ఉద్యోగం ఇప్పించింది. ఎలాంటి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడనంటూ ‘ఆమె’గా మారిన అతడి నుంచి హామీ తీసుకుని పంపింది. ట్రాన్స్‌జెండర్స్ అంశాలకు సంబంధించి సహాయ సహకారాలు కావాల్సిన వారు 94906 17121లో వాట్సాప్ ద్వారా (transgender.cybsuprt121@gmail.com) ఇన్స్టాగ్రామ్ (transgender cybsupport), ఫేస్బుక్ ‘Transgender Cyberabad Support) ఖాతాల్లో సంప్రదించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. చదవండి: ట్రాన్స్‌జెండర్ వైద్యురాలికి కీలక పదవి -
మత్తుమందిచ్చి.. ఆ తర్వాత..
శంషాబాద్ (హైదరాబాద్): ఇంట్లో అద్దెకు దిగుతారు.. ఆపై నమ్మించి మాయచేసి మత్తుమందిస్తారు.. ఆపై దోచుకుంటారు... ఈ క్రమంలో అడ్డుకునే వారిని హత్య చేసేందుకూ వెనుకాడరు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లిలో ఓ మహిళ హత్య కేసులో నిందితులైన జంటను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి బుధవారం షాద్‌నగర్ ఏసీపీ కుశాల్కర్‌తో కలిసి తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామానికి చెందిన గుంజి వెంకటేశ్వర్రావు అలియాస్ వెంకటేష్ (33) వృత్తిరిత్యా మేస్త్రి. అతడు అనేక నేరాల్లో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. రొంపిచెర్ల మండలం ఇప్పర్లపల్లి గ్రామానికి చెందిన వివాహిత సానుగొమ్ముల నాగలక్ష్మి (30)తో వివాహేతర సంబంధం పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయి చిత్తూరు తదితర ప్రాంతాల్లో నివాసమున్న తర్వాత షాద్‌నగర్ చటాన్‌పల్లికి చేరుకున్నారు. రాంనగర్ కాలనీలోని అవ్వారి బల్రాం ఇంట్లో గతేడాది నవంబర్‌లో అద్దెకు దిగారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బల్రాం భార్య సువర్ణ ఒంటిపై ఉన్న నగలు దోచేయాలనుకుని ఇద్దరూ పథకం పన్నారు. అప్పటికే ఓ మెడికల్ షాపు వ్యక్తితో పరిచయం పెంచుకున్న వెంకటేశ్వర్రావు నిద్రమాత్రలు కొన్నాడు. నవంబర్ 22న తమ ఇంట్లో చికెన్ వండామని, కల్లు కూడా తెచ్చామని సువర్ణను పిలిచారు. కల్లులో నిద్రమాత్రవేసి ఆమెకు ఇచ్చారు. పూర్తిగా స్పృహ కోల్పోతున్న సమయంలో సువర్ణ ఒంటిపై ఉన్న నగలు తీసే ప్రయత్నంలో జరిగిన ప్రతిఘటనతో ఆమెపై కూర్చుని గొంతునులిమి చంపేశారు. పుస్తెల తాడు, చెవికమ్మలు, మాటీలు తీసుకున్న నిందితులు ఇంటి గుమ్మం పరిసరాల్లో కారం పొడి చల్లి గదికి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయారు. ఆటోలు మారుస్తూ.. హత్య చేసిన తర్వాత నిందితులు ఆటోలో షాద్‌నగర్ వైన్స్ వద్దకు వెళ్లారు. వెంకటేశ్వర్రావు మద్యం తాగిన తర్వాత మరో ఆటోలో నందిగామ బస్టాప్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా మరో ఆటో ఎక్కిన దశ్యాలు సీసీ టీవీలో నమోదయ్యాయి. అక్కడి నుంచి వెళ్లిన వీరు సూర్యాపేటకు వెళ్లి ఓ వ్యక్తి పరిచయంతో ముత్తూట్ ఫైనాన్స్‌లో నగలు తాకట్టుపెట్టి రూ.లక్ష రుణం తీసుకుని కొంతకాలం బెంగళూరు, గుంటూరులో గడిపారు. డబ్బులు పూర్తిగా అయిపోయాక ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఇంటి యజమానురాలైన వద్ధురాలు ఒంటరిగా ఉండడంతో ఫిబ్రవరి 18న ఆమెకు ఆహారంలో మత్తుమందు ఇచ్చి బంగారు నల్లపూసల దండ, బంగారు గాజులు, చెవికమ్మలు తీసుకుని పరారయ్యారు. నేరం చేసి మూడు నెలల దాటడంతో ఎవరూ గుర్తుపట్టరనే ధీమాతో షాద్‌నగర్‌లో సాయన్న అనే వ్యక్తి వద్ద కుదువ పెట్టిన బంగారం విడిపించుకోడానికి బుధవారం ఉదయం అక్కడికి రావడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వెంకటేశ్వర్రావుపై విశాఖపట్నం, సత్తెనపల్లి, ప్రకాశం, మోత్కూరు, సంతమాగులురు, జిన్నారం, మేడ్చల్, ఎల్లారెడ్డి, పెనిగంజిప్రోలు, బోదన్‌లలో ఈ తరహా మోసాలకు పాల్పడిన కేసులున్నాయి. అనేక మార్లు జైలుకుపోయి వచ్చిన అతడు నాగలక్ష్మిని తోడుచేసుకుని మరోసారి వరుస నేరాలకు పాల్పడుతున్న తీరుకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. నిందితుల నుంచి 10 తులాల బంగారం, 20 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: కట్టుకథ అల్లేసింది.. సీసీ టీవీ పట్టేసింది.. భార్య తప్పటడుగులు.. మార్పు రాకపోవడంతో.. -
సినిమా థియేటర్లో ఉరి వేసుకున్నాడు
షాద్‌నగర్‌రూరల్: కుటుంబ సభ్యులతో జరిగిన గొడవలతో మనస్థాపం చెందిన ఓ యువకుడు పనిచేసే సినిమా థియేటర్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. షాద్‌నగర్ పట్టణంలోని తిరుమల కాలనీకి చెందిన శ్రీను (22) పరమేశ్వర థియేటర్ క్యాంటీన్లో గత కొంత కాలంగా పనిచేస్తున్నాడు. ఇటీవల కుటుంబ సభ్యులతో జరిగిన గొడవల నేపథ్యంలో మనస్థాపం చెందిన శ్రీను బుధవారం తాను పనిచేస్తున్న పరమేశ్వర థియేటర్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒంటరి జీవితంపై విరక్తి చెంది మరొకరు.. చేవెళ్ల: ఒంటరి జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శంకర్పల్లి పోలీస్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచి్చంది. పోలీసులు తెలిపిన వివరాలు... ఒంగోలు జిల్లా టంగులూరు గ్రామానికి చెందిన మేదర్‌గాం«దీ(48) నాలుగు సంవత్సరాల కిత్రం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూరం గ్రామానికి కుటుంబంతో సహా వచ్చి బతుకుదెరువు నిమిత్తం వచ్చి కుటుంబంతో కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. సంవత్సరం కిత్రం మేదర్‌గాంధీ భార్య అతనితో విడిపోయి విడాకులు తీసుకుంది. అప్పటినుంచి అతడు మానసికంగా కుంగిపోయాడు. ఒంటరిగా ఉంటూ తీవ్ర మనస్థాపానికి గురైన మేదర్‌గాంధీ శంకర్‌పల్లిలోని వైష్ణవి హోండా షోరూంలో ఖాళీగా ఉండే మూడవ అంతస్తులో ఉరివేసుకున్నాడు. రెండు రోజుల అనంతరం అందులో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో ఆత్మహత్య చేసుకున్న విషయం బయటపడింది. మృతుడి వద్ద లభించిన ఐడీ కార్డుల ఆధారంగా అతని వివారలను పోలీసులు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమనాటకం.. పెళ్లనగానే ప్రేయసి పరార్ -
లేడీ శ్రీరాం కాలేజీలో ఫీజుల తగ్గింపు
న్యూఢిల్లీ : ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో చదువుతోన్న తెలంగాణ విద్యార్థిని ఆర్థిక సమస్యలతో చదువుని కొనసాగించలేక, ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం విద్యార్థి సంఘాల ఆందోళనల నేపథ్యంలో లేడీ శ్రీరాం కళాశాల కొన్ని కోర్సులకు ఫీజును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ల్యాప్‌టాప్‌లను అందించేందుకు ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. రెండో సంవత్సరం విద్యార్థులను హాస్టళ్ళలో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు కళాశాల పేర్కొంది. కాలేజీలు మూసివేయడంతో విద్యార్థులు కళాశాల సౌకర్యాలను వినియోగించుకోలేకపోతుండడంతో ఈ యేడాది ఫీజులో ఆ చార్జీలను తగ్గిస్తూ కాలేజీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. (ఐఏఎస్ కావాలన్న ఆశలు ఆవిరి..) దీంతో ఫీజు గణనీయంగా తగ్గనుంది. అలాగే మిగిలిన పీజు సైతం వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని సైతం కళాశాల కల్పించింది. కోవిడ్ తగ్గిన తరువాత అవసరాన్ని బట్టి రెండు, మూడో యేడాది విద్యార్థులకు మరింత మందికి హాస్టల్ వసతి కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. విద్యార్థుల హాస్టల్ సౌకర్యం పొడిగింపుని నిరోధించే కొన్ని వాక్యాలను సైతం దరఖాస్తు ఫారం నుంచి తొలగిస్తున్నట్లు కళాశాల అధికారులు పేర్కొన్నారు. (చదువుల తల్లి బలవన్మరణం) -
భర్త దోపిడీ వెనుక భార్య.. ఐదుకోట్లు స్వాహా
షాద్‌నగర్ టౌన్ : తప్పుడు పత్రాలతో రుణాలు కొట్టేస్తూ, రియల్టర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకుని డబ్బు ఎగ్గొట్టే నైజం ఆ భర్తది. ఆ మోసాలకు వంతపాడే పాత్ర అతని భార్యది. ఇలా వీరిద్దరూ కలిసి రూ.5 కోట్లకు ఇండియన్ బ్యాంకుకే ఎసరుపెట్టారు. చివరకు గుట్టురట్టయి పోలీసులకు చిక్కారు. ఈ ఉదంతం వివరాలను బుధవారం షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ విలేకరులకు వివరించారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన పబంతి ప్రభాకర్, సరిత దంపతులు హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఉంటున్నారు. వీరిద్దరూ ప్రొప్రెయిటర్లుగా సాయి ప్రాపర్టీ డెవలపర్స్ సంస్థను ఏర్పాటుచేసి షాద్‌నగర్, నాగోల్, బండ్లగూడ, రాజేంద్రనగర్, నార్సింగ్, ఫతుల్లాగూడ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. భూములను కొని వాటిని వెంచర్లుగా చేసి అమ్మేవారు. అయితే ఇవి గ్రామాలకు చివరన ఉండటంతో అమ్ముడుపోక.. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మోసానికి తెరలేచిందిలా.. షాద్‌నగర్ పరిధి సోలీపూర్ గ్రామ శివారులో ప్రభాకర్ దంపతులు కొన్నేళ్ల క్రితం 25 ఎకరాల భూమిని కొని వెంచర్ వేసి, ప్లాట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందుకు అవసరమైన రుణం కోసం 2015లో షాద్‌నగర్‌లోని ఇండియన్ బ్యాంక్‌ను ఆశ్రయించారు. ఇళ్లు అమ్మినట్లు బ్యాంకు వారిని తప్పుదోవ పట్టించడంతో పాటు బోగస్ వ్యక్తుల్ని, వారి ఆధార్‌కార్డులను, జీతాల ధ్రువీకరణ పత్రాల నకళ్లు సృష్టించి.. విడతలవారీగా రూ.5 కోట్లకుపైగా రుణం పొందారు. ఫతుల్లాగూడలో దివాకర్‌సింగ్‌కు చెందిన 9 ఎకరాల భూమిని కొనేందుకు అగ్రిమెంట్ చేసుకున్న వీరు అతనికి డబ్బులు సరిగా చెల్లించలేదు. అపార్ట్మెంట్ నిర్మాణదారుడు కిరణ్‌కుమార్‌రెడ్డిని కూడా మోసం చేశారు. ఇలాగే మరికొన్ని మోసాలకు పాల్పడిన వీరిపై అబ్దుల్లాపూర్‌మెట్, కేపీహెచ్‌బీ, రాజేంద్రనగర్, మాదాపూర్, నార్సింగ్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. మరోపక్క ప్రభాకర్ దంపతులు ఎంతకీ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు.. రుణపత్రాలను పరిశీలించారు. మోసం చేశారని గుర్తించి గత అక్టోబర్‌లో బ్యాంకు మేనేజర్ మహేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు ప్రభాకర్ దంపతులను అరెస్టు చేసేందుకు ఈనెల 17 రాత్రి టోలీచౌకిలోని వారి విల్లాకు వెళ్లారు. ప్రభాకర్ బంధువులు, సన్నిహితులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. షాద్‌నగర్ పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్, సిబ్బంది చాకచక్యంగా వారిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. అడ్డుకున్న వారిపై కూడా గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, ప్రభాకర్ దంపతులు చేసిన అప్పులను తీర్చేందుకు మరికొన్ని అప్పులు చేస్తూ చిట్టీల వ్యాపారం చేసే వారని, ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని ఏసీపీ సురేందర్ తెలిపారు. విలాసవంతమైన విల్లా, కార్లు, బైకులు కొన్నారని, ప్రభాకర్ చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడని చెప్పారు. -
ఐఏఎస్ కావాలన్న ఆశలు ఆవిరి...
షాద్‌నగర్ రూరల్: ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ కావాలని ఆమె కల. దాని కోసం శ్రమిస్తోంది. కానీ, ఆర్థిక పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేసి ఆత్మహత్యకు పురికొల్పాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని శ్రీనివాస కాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, సుమతి దంపతులకు ఐశ్వర్య(19), వైష్ణవి కూతుళ్లు. శ్రీనివాస్‌రెడ్డి బైక్ మెకానిక్. ఐశ్వర్య 8వ తరగతి వరకు హైదరాబాద్‌లో వారి బంధువుల వద్ద చదువుకుంది. ఆ తర్వాత 9, 10 తరగతులు, ఇంటర్ షాద్‌నగర్‌లో అభ్యసించింది. ఇంటర్లో 985 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు సాధించింది. ఢిల్లీ వెళితే డిగ్రీతో పాటు సివిల్స్‌లో కూడా శిక్షణ తీసుకోవచ్చని ఉపాధ్యాయులు సూచించారు. అయితే, ఐశ్వర్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. షాద్‌నగర్‌కు చెందిన కొందరు చదువులకయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఐశ్వర్యను తల్లిదండ్రులు ఢిల్లీకి పంపించారు. గత ఏడాదిన్నరగా ఆమె ఢిల్లీ వర్సిటీలోని హాస్టల్లో ఉంటూ డిగ్రీ (రెండవ సంవత్సరం) చదువుకుంటోంది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా వర్సిటీ వారు సెలవులు ప్రకటించడంతో ఐశ్యర్య షాద్‌నగర్‌కు వచ్చింది. ఇటీవల ఆమె ఫోన్‌కు వర్సిటీ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. వెంటనే హాస్టల్‌ను ఖాళీ చేయాలని అందులో ఉంది. మరోవైపు కేంద్ర, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇచ్చే ఇన్స్పైర్ స్కాలర్షిప్ రాలేదు. బయట అద్దెకు ఉండి చదువుకోవాలంటే డబ్బులు కావాలి. (చదవండి: ఐశ్వర్యది ప్రభుత్వ హత్యే!) దీంతో ఆమె తల్లిదండ్రులు అప్పు కోసం ఎంతో ప్రయత్నించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చిన వారు కూడా ముందుకురాలేదు. ఈ క్రమంలోనే శ్రీనివాస్‌రెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు. తన చదువు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను చూసిన ఐశ్వర్య తీవ్ర మనోవేదనకు గురైంది. తన చదువు తల్లిదండ్రులకు భారమని.. అలా అని చదువు లేకపోతే బతకలేనని.. నన్ను క్షమించండి అని పేర్కొంటూ లేఖ రాసి ఈ నెల 3న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కనీసం ఒక సంవత్సరం ఇన్స్పైర్ స్కాలర్షిప్ వచ్చేలా చూడండి అంటూ ఐశ్వర్య ఆ లేఖలో వేడుకుంది. (చదవండి: ‘అండగా ఉంటామని ముఖం చాటేశారు’) చదువులు కొనసాగవనే బెంగతోనే ఐశ్వర్య చిన్ననాటి నుంచి ఏ పరీక్షలు రాసినా మంచి మార్కులు సాధించేది. ఐఏఎస్ కావాలని కలలు కనేది. తన కలలను సాకారం చేయలేకపోయాం. చదువులు కొనసాగవనే బెంగతోనే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది. – శ్రీనివాస్‌రెడ్డి, ఐశ్వర్య తండ్రి -
ఐశ్వర్యది ప్రభుత్వ హత్యే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన విద్యార్థిని ఐశ్వర్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని లేడీ శ్రీరాం కళాశాల (ఎల్ఎస్ఆర్ ) స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ఆరోపించింది. కళాశాల ఉదాసీన వైఖరి సరికాదని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 3న ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి నిరసనగా కేంద్ర సైన్స్, టెక్నాలజీ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ, జేఎన్‌యూ విద్యార్థి నేతలు ధర్నా నిర్వహించారు.జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్, నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ), తెలుగు స్టూడెంట్ అసోసియేషన్ (టీఎస్ఏ), ఐద్వా–ఢిల్లీలు కూడా నిరసన గళం వినిపించాయి. జస్టిస్ ఫర్ ఐశ్వర్య నినాదంతో ఆందోళన చేశారు. ‘కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వైఫల్యం కారణంగా అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఉపకార వేతనం ఆలస్యం కావడం వల్లే ఐశ్వర్య ఆర్థిక ఒత్తిడికి గురైంది. కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి రాజీనామా చేయాలి. ఐశ్వర్య కుటుంబానికి ప్రభుత్వం పరిహారమివ్వాలి. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు తరగతులు బహిష్కరి స్తున్నాం’ అని ఎస్ఎఫ్ఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఐశ్వర్యకు చెల్లించాల్సిన ఉపకార వేతనంతో పాటు అదనంగా కొంత మొత్తాన్ని బాధిత కుటుం బానికి అందజేయాలి. విద్యార్థులందరి ఖాతా ల్లోనూ తక్షణమే ఉపకార వేతనాలు జమచేయాలి. కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులకు మద్దతుగా కేంద్రం చర్యలు తీసుకోవాలి’ అని ఐద్వా ఢిల్లీ అధ్యక్ష, కార్యదర్శులు మెమూనా మొల్లా, ఆశాశర్మ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ విద్యా విధానం బాగా సాగుతోందని కేంద్రమంత్రి భావిస్తున్నారని, కానీ విద్యార్థుల ఇబ్బందులు విస్మరిస్తున్నారని జేఎన్‌యూ ప్రతిని«ధులు పేర్కొన్నారు. ‘రాష్ట్రేతర వర్సిటీలు, విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానం తీసుకురావాలి. వేరే ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడమే ఐశ్వర్య ఆత్మహత్యకు కారణం. ఢిల్లీలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులను ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఐశ్వర్య కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలి. ఐశ్వర్య చెల్లెల్ని ప్రభుత్వమే చదివించాలి’ అని టీఎస్ఏ ప్రతినిధి వివేక్ తెలిపారు. ఎల్ఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉన్నిమాయ, ఎస్ఎఫ్ఐ ఢిల్లీ సంయుక్త కార్యదర్శి మౌనిక శ్రీసాయి, జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీ ఘోష్, అంబేడ్కర్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ కౌన్సిలర్ నవీన లాంబా, ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా సంయుక్త కార్యదర్శి దీప్సిత ధర్, ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి, ఏపీ బాధ్యురాలు బూస అనులేఖ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. కాగా, కేంద్ర విద్యా మంత్రి పోఖ్రియాల్ నివాసం వద్ద ఎన్ఎస్యూఐ, తెలుగు స్టూడెంట్ అసోసియేషన్ కార్యకర్తలు ఆందోళన చేయడానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కార్యక్రమాన్ని విరమించారు. ఒత్తిడికి లోనై.... ఎస్ఎఫ్ఐ ఢిల్లీ విభాగం నిర్వహించిన వెబ్ మీడియా సమావేశంలో ఐశ్వర్య తల్లి మాట్లాడారు. లాక్డౌన్ సమయంలో ఇంటికి వచ్చిన ఐశ్వర్యకు వసతి గృహం ఖాళీ చేయాలని ఇటీవల సందేశం వచ్చిందన్నారు. మధ్యలో చదువు మానేస్తే నవ్వులపాలు అవుతామని తీవ్ర ఒత్తిడికి లోనయిందని చెప్పారు. ఉపకార వేతనం సకాలంలో అంది ఉంటే తమ కుమార్తె దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐశ్వర్య మృతికి రాహుల్ సంతాపం ఐశ్వర్వ ఆత్మహత్య పట్ల కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సోమవారం ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు, లాక్డౌన్ వంటి నిర్ణయాలతో లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసిందని, ఇది నిజమని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. -
‘ఐశ్యర్యకి ఫోన్ కూడా కొనివ్వలేకపోయాం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందులే తమ కూతుర్ని పొట్టనపెట్టుకున్నాయని షాద్‌నగర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్యారెడ్డి తల్లిదండ్రులు శ్రీనివాస్‌రెడ్డి, సుమతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆన్లైన్ క్లాసులు వినడానికై కనీసం తమ కూతురికి ఫోన్ కూడా కొనివ్వలేకపోయామని కన్నీరుమున్నీరయ్యారు. సోమవారం వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘:ఐశ్యర్య మొదటి నుంచి చదువులో ఎంతో ముందుండేది. ఉన్నత చదువు కోసం అప్పు చేసి మరీ ఆమెను ఢిల్లీకి పంపించాం. కూతుర్ని ఐఏఎస్ చేయడం కోసం చివరకు మా ఇంటిని కూడా తాకట్టు పెట్టాం. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ క్లాసులు వినడం కోసం ఫోన్ లేదా ల్యాప్‌టాప్ అడిగింది. మా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఫోన్ కూడా కొనివ్వలేకపోయాం. చనిపోయే ముందు కూడా ఐశ్యర్య మా అందరితో కలివిడిగానే మాట్లాడింది. స్కాలర్షిప్ రాకపోవడం ఐశ్యర్యను మరింత కుంగదీసింది. గతంలో మా కూతురు టాపర్‌గా నిలిచినప్పుడు ఎందరో అండగా ఉంటామని ముందుకు వచ్చారు, కానీ కొద్దిరోజులకే ముఖం చాటేశారు. మాకొచ్చిన బాధ ఏ తల్లిదండ్రులకు రావొద్దు’ అని ఐశ్యర్య తల్లిదండ్రులు భోరున విలపించారు. ప్రభుత్వం ఆదుకొని తమ చిన్న కూతురు చదువుకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి : ఐశ్వర్య ఆత్మహత్య.. రాహుల్ స్పందన) షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ యాజమాన్యం హాస్టల్ ఖాళీ చేయించింది. ఈ క్రమంలో షాద్‌నగర్ వచ్చిన ఐశ్వర్య ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబానికి భారం కాకుడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో తెలిపింది. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఐశ్వర్య యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కాలర్షిప్ కింద బీఎస్సీ (హన్స్) గణితం చదవడానికి ఎల్‌ఎస్‌ఆర్‌లో చేరింది. ఇక ఈ ఏడాది మార్చి నుంచి స్కాలర్షిప్ రాకపోవడంతో పుస్తకాలు, హస్టల్ ఫీజు వంటి ఇతర ఖర్చులకు ఇబ్బంది తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
ఇది నిజం! ఇదే నిజం!!: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా హస్టల్ యాజమాన్యం బలవంతంగా ఖాళీ చేయించడంతో మనస్తాపానికి గురైన షాద్‌నగర్ డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఐశ్వర్య కుటుంబానికి తన సంతాపం తెలిపారు. బీజేపీ అనాలోచితంగా విధించిన లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను నాశనం చేసిందని మండి పడ్డారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. "ఈ విచారకరమైన క్షణంలో విద్యార్థి ఐశ్వర్య కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. బీజేపీ అనాలోచితంగా చేసిన నోట్ల రద్దు, లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది. ఇది నిజం” అని రాహుల్ ట్వీట్ చేశారు. (చదవండి: స్కూల్ ఫీజుకు బదులుగా కొబ్బరి బొండాలు..!) ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నాను. ఉద్దేశ పూర్వకంగా చేసిన నోట్ల రద్దు మరియు లాక్డౌన్ ద్వారా, బీజేపి ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది. ఇది నిజం! ఇదే నిజం!! pic.twitter.com/mSszEES6ha — Rahul Gandhi (@RahulGandhi) November 9, 2020 షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ యాజమాన్యం హాస్టల్ ఖాళీ చేయించింది. ఈ క్రమంలో షాద్‌నగర్ వచ్చిన ఐశ్వర్య ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబానికి భారం కాకుడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో తెలిపింది. ఇప్పటికే తన చదువు కోసం తల్లిదండ్రులు ఇంటిని తనఖా పెట్టారన్నది. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఐశ్వర్య యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కాలర్షిప్ కింద బీఎస్సీ (హన్స్) గణితం చదవడానికి ఎల్‌ఎస్‌ఆర్‌లో చేరింది. ఇక ఈ ఏడాది మార్చి నుంచి స్కాలర్షిప్ రాకపోవడంతో పుస్తకాలు, హస్టల్ ఫీజు వంటి ఇతర ఖర్చులకు ఇబ్బంది తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
షాద్‌నగర్‌లో విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్‌లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బలవంతంగా హాస్టల్‌ను ఖాళీ చేయించింది. యాజమాన్యం తీరుకు మనస్తాపానికి గురైన విద్యార్థిని ఐశ్వర్య షాద్‌నగర్ వచ్చి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె మరణానికి కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: (తునిలో ఎన్నారై సురేశ్ మృతి కలకలం.. భార్యే..!) (నంద్యాల కుటుంబం ఆత్మహత్య: సీఐ, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్) (పరిటాల సునీత ముఖ్య అనుచరుడి అరెస్ట్) -
షాద్‌నగర్‌లో కిడ్నాప్.. కొత్తూరులో హత్య
షాద్‌నగర్ రూరల్: భూవివాదాల నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఓ వ్యాపారిని శుక్రవారం షాద్‌నగర్‌లో కిడ్నాప్ చేసిన దాయాదులు కొత్తూరులో హత్య చేశారు. ఫరూఖ్‌నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డి (55) కొన్నేళ్లుగా జడ్చర్లలో స్థిరపడి అక్కడే పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. సొంత గ్రామంలో వ్యవసాయ పొలం ఉండటంతో అప్పుడప్పుడు అన్నారానికి వచ్చి వెళ్తుండేవాడు. కాగా పొలం విషయంలో రాంచంద్రారెడ్డికి అన్నారంలోని తన దాయాదులతో గతంలో ఘర్షణలు జరిగాయి. దీనిపై షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు సైతం నమోదయ్యాయి. తాజాగా భూ విషయంలో మాట్లాడుకుందామని దాయాదులు చెప్పడంతో రాంచంద్రారెడ్డి మధ్యాహ్నం డ్రైవర్ పాషాతో కలసి తన ఇన్నోవా వాహనంలో షాద్‌నగర్ పట్టణంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ వైపు వచ్చాడు. దీంతో భూమి విషయం మాట్లాడేందుకు దాయాదులు ఇన్నోవా కారు ఎక్కి మాట్లాడుతుండగా వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో వారు తమ వద్ద ఉన్న కత్తులను చూపించి బెదిరించడంతో డ్రైవర్ పాషా వాహనం దిగి పారిపోయాడు. ఇదే అదునుగా భావించిన వారు రాంచంద్రారెడ్డిని ఆయన వాహనంలోనే కిడ్నాప్ చేసి షాద్‌నగర్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా హైదరాబాద్ వైపునకు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. సెల్‌ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా రాంచంద్రారెడ్డి కొత్తూరు మండలంలోని పెంజర్ల శివారులోని ఓ వెంచర్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి కారును పరిశీలించగా కత్తిపోట్లకు గురై కొనఊపిరితో ఉన్న రాంచంద్రారెడ్డిని ప్రైవేటు వాహనంలో షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కాగా మార్గమధ్యలోనే రాంచంద్రారెడ్డి మృతి చెందాడు. గతంలో మృతుడు బాదేపల్లి సింగిల్ విండో చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. కొత్తూరులో సంఘటన స్థలాన్ని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఏసీపీ సురేందర్ పరిశీలించారు. అనంతరం క్లూస్‌టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. -
షాద్‌నగర్‌లో రియల్టర్ దారుణ హత్య!
సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్‌కు చెందిన రియల్టర్, కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఆయన ఈ సాయంత్రం కిడ్నాపైనట్టు తొలుత వార్తలొచ్చాయి. భూ వివాదం నేపథ్యంలో ఆయనను కిడ్నాప్ చేసినట్టు, రామచంద్రారెడ్డి డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. షాద్‌నగర్‌లోని టీచర్స్ కాలనీలో నివాసముండే రామచంద్రారెడ్డిని ఢిల్లీ వరల్డ్ స్కూల్ ముందు ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కిడ్నాప్ చేసినట్టు అతను పోలీసులకు తెలిపాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్డారు. అంతలోనే కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ సమీపంలో రామచంద్రారెడ్డి హత్యకు గురైనట్టు సమాచారం అందింది. పోలీసులు మృతదేహాన్ని షాద్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. షాద్‌నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో చాలా కాలంగా ఓ భూ వివాదం నడుస్తోంది. ఇరువర్గాల గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామచంద్రారెడ్డి జడ్చర్ల సింగిల్ విండో చైర్మన్‌గా పనిచేశారు. (చదవండి: చైనా వస్తువుల బ్యాన్ తొందరపాటు చర్య: కేసీఆర్) -
నాన్న వచ్చాడు.. నవ్వులు తెచ్చాడు!
షాద్‌నగర్ రూరల్: పేదరికం ఓడిపోయింది.. మమకారమే గెలిచింది.. పిల్లలపై ఉన్న ప్రేమ, వాత్సల్యం, అనురాగం, ఆప్యాయతను కాదనుకోలేక ఆ తండ్రి మనసు మార్చుకున్నాడు. శిశువిహార్‌కు తరలించిన చిన్నారులను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. తల్లిని కోల్పోయి, తండ్రికి దూరమై అనాథలుగా శిశువిహార్‌కు వెళ్లిన చిన్నారులపై కథనం ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన విషయం తెలిసిందే. (సీఎం ఆఫీసులో కరోనా కలకలం) మమకారమే గెలిచింది షాద్‌నగర్ పట్టణంలో ఉండే గణేశ్, శ్రీలత దంపతులకు పిల్లలు శ్రీగాయత్రి(4), హన్సిక (17 నెలలు) ఉన్నారు. శ్రీలత కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూయడంతో పిల్లల బాగోగులు చేసుకునేందుకు గణేశ్‌కు భారంగా మారింది. నిరుపేద కుటుంబానికి చెందిన అతడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. చిన్నారుల ఆలనాపాలనా చూసేవారు లేకపోవడంతో శుక్రవారం వారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించడంతో శిశువిహార్‌కు తరలించిన విషయం తెలిసిందే. హాస్టల్‌కు వెళ్లేటప్పుడు చిన్నారుల పరిస్థితి అందరి మనసులను కదిలించిన విషయం విదితమే. (మహిళల రక్షణ కోసం ‘స్త్రీ’) ‘నాన్న నేను మళ్లీ వస్తా.. అమ్మ బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తుండె.. ఆమె గుండెనొప్పితో చనిపోయింది.. అందుకే నేను మా చెల్లి హాస్టల్‌కు వెళ్తున్నాం’ అని చిన్నారి శ్రీగాయత్రి చెప్పడంతో స్థానికులు, అధికారులు భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. అయితే, భార్య మృతిచెందడం, పిల్లలు శిశువిహార్‌కు తరలివెళ్లడంతో ఒంటరిగా ఉన్న గణేశ్ మనసు చలించిపోయింది. పేదరికంలో ఉన్నా చిన్నారులను పోషించుకుంటానని భావించాడు. ఈనేపథ్యంలో మనసు మార్చుకున్న అతడు తన పిల్లలను తిరిగి అప్పగించాలని కోరుతూ శనివారం శిశువిహార్‌కు వెళ్లి అధికారులకు విజ్ఞప్తి చేశాడు. చిన్నారులను తాను జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చి తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో పేదరికం ముందు తండ్రికి పిల్లలపై ఉన్న మమకారమే గెలిచింది. స్పందింపజేసిన కథనం ‘అమ్మలేదు..నాన్న పోషించ లేడు’ అని సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం ప్రజలను స్పందింపచేసింది. హాస్టల్‌కు వెళ్లేటప్పుడు చిన్నారి శ్రీగాయత్రి చెప్పిన మాటలు అందరి హృదయాలను ద్రవింపజేశాయి. దీంతో గణేశ్ మనసు మార్చుకొని శనివారం శిశువిహార్‌కు వెళ్లి తన కూతుళ్లు శ్రీగాయత్రి, హన్సికను తిరిగి ఇంటికి తీసురావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. నా పిల్లలను బాగా చూసుకుంటాను.. ‘అనారోగ్యంతో నా భార్య కన్నుమూయటం, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో పిల్లల పోషణ భారంగా మారింది. చిన్నారుల ఆలనాపాలనా చూసుకునేవారు లేకపోవడంతోనే వారిని శిశువిహార్‌కు అప్పగించాను. భార్య చనిపోవడం, పిల్లలు లేకపోవడంతో ఒంటరి వాడినయ్యాను. నా పిల్లలపై ఉన్న మమకారం, ప్రేమే వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చేలా చేసింది. నా పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటాన’ని చిన్నారుల తండ్రి గణేశ్ వివరించాడు. -
ఈ పోలీసులకు ఏమైంది..!
సాక్షి, షాద్‌నగర్ : ‘దిశ’ కేసులో వారు వ్యవహరించిన తీరుకు ప్రజలు జేజేలు పలికారు. జనారణ్యంలోకి వచ్చిన పులిని ప్రాణాలకు తెగించి ఎవరికీ హాని జరగకుండా పట్టుకున్న ఘనత వారిది.. కిడ్నాప్ అయిన చిన్నారిని గంటల వ్యవధిలో తీసుకొచ్చిన సాహసం వారి సొంతం. కానీ, ఇటీవల జరిగిన ఘటనలతో విమర్శల పాలయ్యారు. ప్రజా రక్షణకు అంకిత భావంతో పనిచేసే పోలీసులు స్వతహాగా క్రమశిక్షణ దిశగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సంఘటనలు సూచిస్తున్నాయి. షాద్‌నగర్ పరిధిలో ఇటీవల పోలీసులు చేసిన నృత్యాలు విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. పట్టణంలో పోలీసులు ఏర్పాటు చేసిన విందులో కొందరు నృత్యాలు చేయడం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ దాకా వెళ్లడంతో సీసీ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. షాద్‌నగర్ పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్‌ను కమిషనరేట్‌కు అటాచ్ చేసిన సంగతి విధితమే. ఈ వివాదం సమసిపోకముందే.. ఇటీవల రామేశ్వరం శివారులోని తోటలో మద్యం సేవిస్తూ పోలీసులు చేసిన నృత్యాల జోష్ అంతా ఇంకా కాదు. ఈ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. దీనితో మరోసారి పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. వరుస ఘటనలతో వచి్చన విమర్శలు పోలీసులను ఊపిరాడనీయకుండా చేశాయి. ఈ సంఘటనలో కొత్తూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ బాలస్వామి, కానిస్టేబుళ్లు అశోక్‌రెడ్డి, అమర్‌రాథ్, చంద్రమోహన్, వెంకటేష్, హోంగార్డు రామకృష్ణలను సైబరాబాద్ కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. షాద్‌నగర్ సబ్‌డివిజన్‌లో ఏం జరుగుతుందని పోలీసు శాఖ ఆరాతీస్తోంది. కొందరు కావాలనే వీడియోలను వైరల్ చేశారనే ఆలోచన పోలీసుల్లో ఉంది. కాగా, పోలీసుల్లో కూడా వర్గాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. రామేశ్వరంలో జరిగిన విందులో పోలీసు శాఖకు సంబందించిన వ్యక్తులే ఉన్నారు. ఇతరులెవరూ లేరు. అలాంటçప్పుడు అక్కడ నృత్యాలు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎలా వైరల్ అయ్యిందన్నదే ప్రశ్న. వీడియోలు బయటికి ఎలా వెళ్లాయన్నది పక్కన పెట్టి.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. నిరంతరం ప్రజల కోసం శ్రమించే పోలీసులు ఇలాంటి సరదాలకు దూరంగా ఉంటేనే మంచిదనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. -
మందేసి.. చిందేసి..!
నందిగామ: షాద్‌నగర్ పోలీసులు ఇటీవల నాగిని డ్యాన్స్ చేసిన ఘటన మరవకముందే.. కొత్తూరు పీఎస్‌లో పనిచేస్తున్న పోలీసులు సైతం ఇలాంటి వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. కొత్తూరు పీఎస్‌లో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్ వివాహం ఈ నెల 12న షాద్‌నగర్ సమీపంలోని రామేశ్వరం ఆలయంలో జరిగింది. ఈ పెళ్లికి కొత్తూరు పీఎస్‌లో పనిచేసే 12 మంది పోలీసులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత సమీపంలోని ఓ వెంచర్లో విందు చేసుకున్నారు. ఈ విందులో పాల్గొన్న కొంతమంది పోలీసులు మద్యం బాటిళ్లు చేతపట్టుకొని, మద్యం తాగుతూ, నృత్యాలు చేసిన వీడియోలు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. ఈ విషయమై కొత్తూరు ఇన్స్పెక్టర్ చంద్రబాబును వివరణ కోరేందుకు ప్రయత్నించగా తాను బిజీగా ఉన్నానని, ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడాలని ఫోన్ కట్ చేశాడు. ఏఎస్సై అబ్దుల్లాను అడగగా ఈ నెల 12న ఉన్నతాధికారుల అనుమతితోనే వివాహ వేడుకకు హాజరైనట్లు తెలిపారు. -
అక్రమ బంగారు బిస్కెట్ల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు మరో అక్రమ బంగారం రవాణాను భగ్నం చేశారు. బంగారం అక్రమ రవాణా జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో డీఆర్ఐ అధికారులు సోమవారం షాద్‌నగర్ సమీపంలోని చిలకమర్రి గ్రామ సమీపంలోని రాయికల్ టోల్గేట్ వద్ద ఓ ప్రైవేటు క్యాబ్‌ను ఆపారు. అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద 3,099 గ్రాముల బరువున్న 31 విదేశీ బంగారు బిస్కెట్లు లభించాయి. ఎలాంటి రసీదులు లేకుండా తరలిస్తున్న ఆ బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకొని నిందితులని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ బంగారు బిస్కెట్ల విలువ రూ. 1.38 కోట్లుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. -
కాళ్లు మొక్కుతాం.. కందులు కొనండి
షాద్‌నగర్ టౌన్: కందులను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని.. దళారులతో చేతులు కలిపి దందా నిర్వహిస్తున్నారని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ రైతులు ఆరోపించారు. తాము తెచ్చిన కందులను కొనుగోలు చేయమని కొనుగోలు కేంద్రం ఇన్చార్జి నర్సింహారెడ్డి కాళ్లు మొక్కారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జికి, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ కందులను కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో పట్టణ శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట పాత జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. పోలీసులు రైతులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు. కాగా ఘటనపై విచారణ చేపడతామని ఐపీఎస్ అధికారిణి రితిరాజ్ రైతులకు హామీ ఇచ్చారు. -
విచిత్రం: ‘ఆత్మ’లకు ఓటు!
సాక్షి, షాద్‌నగర్ : సహకార సంఘాల ఓటరు జాబితాలో అధికారులు మృతిచెందిన వారికి కూడా చోటు కల్పించారు. సంఘంలో సభ్యులై ఉండి చనిపోయిన రైతుల పేర్లను జాబితాలో నుంచి తొలగించలేదు. షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలో మేకగూడ, నందిగామ, చేగూరు, కొత్తపేట, షాద్‌నగర్, కొందుర్గులో వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో మొత్తం 16740 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు ఈసారి ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలను తయారు చేశారు. ఈ జాబితాలో చాలా మంది ఫొటోలు కనిపించడం లేదు. అదేవిధంగా చనిపోయిన ఓటర్ల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. ఒక్కో వార్డులో సుమారు పది నుంచి ఇరవై మంది మృతుల పేర్లు జాబితాలో కనిపిస్తున్నాయి. అయితే, ఓటరు జాబితాలో ఉన్న మృతులకు సంబంధించిన రుణాలను వారి కుటుంబ సభ్యులు చెల్లిస్తే జాబితాలో నుంచి పేర్లు తొలిగిపోతాయని, ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే ఆశతో రుణాలు చెల్లించకుండా ఉండటంతో ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారికి ఓటు హక్కు ఉన్న దృశ్యం ముందస్తు చర్యలేవీ.. ముందుగా ఓటర్ల జాబితాను రూపొందించి సహకార సంఘం కార్యాలయంలో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితాను తయారు చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండానే ఎన్నికలు నిర్వహిస్తుండటంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుల తడకగా ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొందరి ఓటర్ల ఫొటోలు లేకపోవడంతో ఓటర్లను గుర్తించడం ఇబ్బందిగా మారిందని నాయకులు అంటున్నారు. గ్రామాల్లో తిరిగి విచారణ చేశాం. సహకార ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా తయారు చేసేటప్పుడు గ్రామాల్లో పర్యటించి ఓటర్లను గుర్తించాం. చనిపోయిన వారి వివరాలు మాకు తెలియలేదు. దీంతో ఓటరు జాబితాలో పేర్లు తొలగించలేకపోయాం. – మహ్మద్ షరీఫ్, సీఈఓ, కొందుర్గు సహకార సంఘం -
హడలెత్తించిన చిరుత
షాద్‌నగర్ టౌన్/రూరల్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ఓ చిరుత హడలెత్తించింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక షాద్‌నగర్‌లోని పటేల్ రోడ్డుపై ఒక చిరుతవచ్చింది. అక్కడి నుంచి ప్రై వేట్ ఉద్యోగి మన్నె విజయ్‌కుమార్ ఇంటిపైకి చే రింది. పైపోర్షన్లో ఉండే ఆయన సోమవారం పా లు తీసుకొచ్చి చూడగా వాటర్ ట్యాంక్ పక్కన చి రుత తోక కనిపించింది. వెంటనే ఆయన ఇంట్లోని తన భార్యకు విషయం చెప్పి బయటకు రావొద్దని అప్రమత్తం చేశాడు. అలాగే కాలనీవాసులతో పా టు 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చాడు. షాద్‌నగర్ ఏసీపీ సురేందర్, సీఐ శ్రీధర్‌కుమార్ సిబ్బందితో అక్కడికి చేరుకొని మరో ఇంటి పైనుంచి చిరుతను పరిశీలించారు. మత్తు మందు ఇచ్చి..: విషయాన్ని పోలీసులు ఫారెస్టు అధికారులతో పాటు హైదరాబాద్ జూపా ర్కు సిబ్బందికి సమాచారమిచ్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి బీమానాయక్, శంషాబాద్ రేంజ్ ఆఫీసర్ హరిమోహన్‌రెడ్డి, రెస్క్యూ టీం అధికారి రమేష్‌కుమార్, జూపార్కు అసిస్టెంట్ డాక్టర్లు అస దుల్లా, అఖిల్, డిప్యూటీ డైరెక్టర్ ఎండీ హకీం ఘట నా స్థలానికి చేరుకున్నారు. రెస్యూ టీం సిబ్బంది చి రుత ఉన్న ఇంటి చుట్టూ వలలు వేశారు. ఉదయం 8కి చిరుత మెట్ల పైనుంచి కిందికి వచ్చి బాత్రూం ఎదుట పడుకుంది. రెస్యూ టీం ఇంటి లోపలికి వెళ్లి బాత్రూం కిటికీ నుంచి ట్రంక్ లైజర్ సాయంతో షూట్ చేసి రెండు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చారు. చిరుత పరుగులు.. మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన వెంటనే పులి ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టింది. దీంతో కాలనీలోని జనం భయాందోళనకు గురయ్యారు. చిరుత పరుగెత్తే సమయంలో దానికి ఎదురుపడిన కానిస్టేబుల్ లక్ష్మణ్‌పై పంజా విసరడంతో ఆయనకు స్వల్ప గాయాలవగా.. చిరుత పక్క వీధిలోని ఓ పాడుపడిన గోడల్లో పడిపోయింది. వెంటనే అటవీ సిబ్బంది, రెస్క్యూ టీం దానిని బంధిం చి ప్రత్యేక అంబులెన్సులో హైదరాబాద్‌లోని జూపార్కుకు తరలించారు. చిరుత విషయం తెలుసుకొని జనం పటేల్ రోడ్డుకు భారీగా తరలివచ్చారు. పట్టుబడిన చిరుత మగదని, రైల్వేస్టేషన్ సమీపంలోని కమ్మదనం అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని డీఎఫ్ఓ బీమానాయక్ అనుమానం వ్యక్తం చేశారు. చిరుతను బంధిస్తున్న దృశ్యం -
స్మార్టుగా ఎన్నికల ప్రచారాలు!
సాక్షి, షాద్‌నగర్ టౌన్: మున్సిపాలిటీ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో అభ్యర్థులు స్మార్టుగా ప్రచారం వైపు దృష్టి సారించారు. చాలా మంది స్మార్ట్ ఫోన్లలో ఇంటర్ నెట్‌ను అధికంగా ఉపయోగిస్తుండటంతో అభ్యర్థులు అన్ లిమిటెడ్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వార్డుల వారీగా వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేసి ఓట్లను అభ్యరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ‘ప్రజాసేవ చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించండి, ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తాం’ అంటూ అభ్యర్ధులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల్లో గెలిస్తే చేపట్టే అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను తయారు చేసి వాట్సాప్, ఫేస్బుక్ సహాయంతో ఇంటింటికి ప్రతి ఓటరుకు చేరవేస్తున్నారు. అభ్యర్థుల మద్దతుదార్లు వార్డుల వారీగా ఉంటే ఓటర్లకు సంబంధించిన సెల్ ఫోన్ నంబర్లను సేకరించి వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా కూర్చున్న చోటు నుంచి అభ్యర్థులు ఓటర్లుకు ఫోన్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సెల్ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను పలకరించడం చాలా సులభంగా మారింది. ఇంటింటి ప్రచారాలకు తోడుగా వ్యక్తిగతంగా ఫోన్లు చేసి పలకరిస్తే అధిక ఓట్లు రావచ్చనే భావనతో అభ్యర్థులు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. ఓటరు జాబితాల చేరవేత కొంత మందికి ఓటరు జాబితాలో పేరు ఉందోలేదో అన్న విషయం తెలియదు. ఓటు ఎక్కడ వేయాలో పోలింగ్ కేంద్రాల గురించి ఓటర్లకు చాలా మందికి తెలియదు. దీంతో ఓటరు జాబితాలతో పాటుగా పోలింగ్ స్టేషన్ల వివరాలను వాట్సాప్‌లలో పంపిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల ఎన్నికల సంఘం కొత్తగా రూపొందించిన పోర్టల్ ద్వారా సమాచారాన్ని సేకరించి అభ్యర్థులకు చేరవేస్తున్నారు. ఓటు ఏవార్డులో ఉంది. ఏ కేంద్రంలో ఓటు వేయాలన్న విషయాలను కూడా అభ్యర్థులు ఓటర్లకు వాట్సాప్‌ల ద్వారా ఇప్పటి నుంచే సూచిస్తున్నారు. హామీలకు వేదిక ఎన్నికల ప్రచారానికి పోస్టులు తయారు చేసుకునేందుకు ఇంటర్ నెట్లో పలు యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని ఆకర్షణీయంగా ప్రచార పత్రాలను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు తమ పని తీరు చేసిన అభివృద్ధి అంశాలను జోడించి సందేశాలు, వీడియోలు రూపొందిస్తున్నారు. కొత్తగా పోటీ చేసే అభ్యర్థులు హామీలు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు సామాజిక మాధ్యలు హామీలకు వేదికలుగా మారాయి. ఎన్నికల్లో విజయం సాధిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్న విషయాలను సామాజిక మాధ్యమాల ద్వార విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో చేసే ప్రచారం కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉంది. అభ్యంతరకర అంశాల ప్రచారాల పై ఎన్నికల అధికారులతో పాటుగా, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఫిర్యాదులు స్వీకరించిన తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బరిలో దంపతులు పురపోరులో భార్యభర్తలు ఇద్దరు వేర్వేరు వార్డులో కౌన్సిలర్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఇద్దరు కూడా గతంలో మేజర్‌గ్రామ పంచాయతీలో వేర్వేరు పాలకవర్గాల్లో పంచాయతీ వార్డు సభ్యులుగా పనిచేశారు. పట్టణంలోని సీనియర్ కాంగ్రెస్ నేత గొరిగె నందరాజ్‌గౌడ్ 14 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగగా.. ఆయన సతీమణి గొరిగె అన్నపూర్ణ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. ఇద్దరు కూడా గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసి మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. – శంషాబాద్ సెంటిమెంట్పల్లి! శంషాబాద్ పురపోరులో 25 వార్డుల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 20 మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు. వీరంతా టీడీపీ నాయకులే.. టీడీపీ ప్రభావం కోల్పోవడంతో ఎన్నికల్లో ‘సైకిల్’ గుర్తుపై పోటీచేసేందుకు ఇష్టపడక వీరంతా ఆల్ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీని ఆశ్రయించారు. జిల్లాలోని తలకొండపల్లి మండలంలో మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో ఏఐఎఫ్బీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్న తాము కూడా అదే తీరుగా ‘సింహం’ గుర్తుతో విజయఢంకా మోగించడం ఖాయమనే ధీమాతో ‘తలకొండపల్లి సెంటిమెంట్’ను ఇక్కడి ఏఐఎఫ్బీ అభ్యర్థులు గుర్తు చేసుకుంటున్నారు. పట్టణ పరిధిలో రెండు జాతీయ పార్టీల కన్నా కూడా వీరే ఎక్కువగా పోటీలో ఉండడం విశేషం, చివరికి ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో... మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే. – శంషాబాద్ టీ తాగండి.. ఓటు వేయండి ఆమనగల్లు పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఓ టీ స్టాల్ వద్ద నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యులు స్వయంగా టీ కాచీ అక్కడే ఉన్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, బైకని శ్రీనివాస్‌యాదవ్ తదితరులకు చాయ్ అందించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న కార్యకర్తలు, ప్రజలకు అందరూ చాయ్ తాగండీ.. టీఆర్ఎస్కు ఓటేయండీ అంటూ ఎంపీ రాములు అభ్యర్థించారు. – ఆమనగల్లు ఓటర్లకు పండుగ ప్యాకేజీ పురపోరులో సంక్రాంతి పండుగ కూడా కలిసి రావడంతో ఓటర్లకు పండుగ “ప్యాకేజీ’ అందింది. పట్టణంలోని ఆయా వార్డులలో పండుగ సందర్భంగా ఒక్కో కుటుంబానికి ఐదు లీటర్ల మంచి నూనె, రెండు కిలోల గోధుమపిండి, కిలో శనగ పిండికి సంబంధించిన ప్రత్యేక ప్యాకెట్లను పట్టణంలోని పలు సూపర్మార్కెట్లలో అభ్యర్థులు తయారు చేయించారు. వీటితో పాటు కిలో మటన్, చికెన్లతో పాటు ప్యాకెట్లను ఓటర్లకు సంబంధించిన కుటుంబాలకు అందజేశారు. గట్టి పోటీ ఉన్న చోట ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కూడా ఇదే తీరుగా పండగ ‘ప్యాకెట్’లను అందజేయడంతో ఓటర్లకు మొత్తం మీద పండుగ ఖర్చు కాస్తా తీరింది. –శంషాబాద్ తల్లీకూతుళ్ల సమరం ఆమనగల్లు: మున్సిపల్ ఎన్నికల సమరంలో తల్లీకూతుళ్లు తలపడుతున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు నుంచి తల్లీకూతుళ్లు పోటీకి దిగడం విశేషం. ఎన్నికలలో 5 వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పులికంటి నాగమ్మ, టీఆర్ఎస్ అభ్యర్థిగా పులికంటి అలివేలు పోటీ చేస్తున్నారు. పోటీకి దిగిన పులికంటి నాగమ్మ, పులికంటి అలివేలు సొంత తల్లీకూతుళ్లు. ఎన్నికల సమరంలో తలపడుతున్న తల్లీకూతుళ్ళలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. పోరాడితే పోయేదేమిటి! షాద్‌నగర్‌టౌన్: పోరాడితే పోయేదేమిటి అంటూ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేస్తే బరిలో నిలుస్తున్నారు షాద్‌నగర్ పట్టణానికి చెందిన న్యాయవాది అంజయ్య. తెల్ల వెంట్రుకల అంజయ్యగా పేరు పొందిన ఈయన 1994, 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. అదేవిధంగా 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన 12వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం 16వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పోటీ చేసిన అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లోనైనా విజయం లభిస్తుందో లేదో చూడాల్సి ఉంది. అయితే ఎన్నికల్లో అతి తక్కువ డబ్బులు ఖర్చు చేసి మంచి ఆశయంతో బరిలో నిలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఇతరుల మనోభావాలు దెబ్చతినే విధంగా సామాజిక మాధ్యమాలు పోస్టింగులు చేస్తే చర్యలు తప్పవు. ఎన్నికల సమయం నేపథ్యంలో సామాజిక మాధ్యమాల పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఎన్నికల నియమావళిని ఉల్లంఘింస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. సామాజిక మాధ్యమాలు విరివిగా ఉపయోగించే వారందరు విధిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – శ్రీధర్‌కుమార్, సీఐ, షాద్‌నగర్‌టౌన్ -
అత్యాచారాల్ని కులంతో ముడిపెట్టొద్దు
కవాడిగూడ: మహిళలపై జరిగే అత్యాచారాలు, హత్యలను కులంకోణంతో చూడొద్దని, కేవలం మానవతా దృక్పథంతోనే చూడాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు కులమతాలతో సంబంధం లేకుండా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని గొంతెత్తుతున్న చరిత్ర తమదని ఆయన స్పష్టం చేశారు. దిశ ఘటనకు మూడ్రోజుల ముందు మూడు ఘటనలు జరిగినప్పటికీ వాటిపై చర్యలు చేపట్టకుండా దిశ ఘటనపై మాత్రమే ఓ సామాజికవర్గం ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందని, అందుకే పోలీసులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన నిందితులను ఎన్కౌంటర్ చేశారని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ఛలో ఇందిరాపార్క్ మహాదీక్షకు వివిధ కుల, ప్రజా, విద్యార్థి సంఘాలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ..దేశాన్ని కుదిపేసిన గాంధీ, ఇందిరా, రాజీవ్‌గాంధీలను హత్యచేసిన నిందితులను చట్టపరంగానే శిక్షించారేతప్ప ఎన్కౌంటర్ చేయలేదని గుర్తుచేశారు. ఉగ్రవాది కసబ్ సజీవంగా దొరికినా కాల్చి చంపలేదెందుకని ప్రశ్నించారు. దేశంలో 15 ఏళ్లలో 3 లక్షల 41 వేలమంది మహిళలపై అత్యాచారాలు జరిగితే అప్పుడు లేని ఎన్కౌంటర్లు దిశా నిందితుల విషయంలో మాత్రమే ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఒకే సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులైన ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిశ ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు కానీ అంతకుముందు జరిగిన టేకు లక్ష్మీ, మానస కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. నెలరోజుల పాటు 119 నియోజకవర్గాల్లో అత్యాచార ఘటనలపై జరుగుతున్న వివక్ష న్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్య పరచాలన్నారు. దీనిపై త్వరలోనే ‘చలో హైదరాబాద్’కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జేబీ రాజు అధ్యక్షతన జరిగిన మహాదీక్షలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, దాసు సురేశ్, ప్రొఫెసర్ గాలి వినోద్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
దిశ కేసు: ఆ దారి మూసివేత
సాక్షి, షాద్‌నగర్ టౌన్: దిశ కేసు, నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి అడిషనల్ రిపోర్టును పోలీసులు షాద్‌నగర్ కోర్టుకు సమర్పించారు. దిశ కేసులో నిందితుల కస్టడీ, రిమాండ్ కాలం పూర్తి కావడంతో కేసుకు సంబంధించిన వివరాలు కోర్టుకు తెలియజేయాల్సిన నేపథ్యంలో పోలీసులు అడిషనల్ రిపోర్టును సమర్పించినట్లు సమాచారం. దిశ హత్యాచారం తర్వాత , నలుగురు నిందితులు ఎన్కౌంటర్లో చనిపోయిన విషయం విదితమే. నిందితుల ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులు, మృతుల వివరాలు, నిందితుల నుంచి సేకరించిన ఆధారాల వివరాలన్నింటినీ పేర్కొంటూ అడిషనల్ రిపోర్టును పోలీసులు కోర్టులో దాఖలు చేసినట్లు సమాచారం. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత తుది రిపోర్టును కోర్టుకు అందజేయనున్నట్లు తెలిసింది. దారి మూసివేత.. ఎన్కౌంటర్ చేసిన ఘటనా స్థలానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు దారి మూసేశారు. చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గరి నుంచి ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలానికి చెట్ల, పొలం గట్ల మధ్యలో నుంచి దారి ఉంది. ఘటనా స్థలానికి ఎవరూ వెళ్లకుండా ఇనుప కంచె ఏర్పాటు చేశారు. పోలీ సులు ఘటనా స్థలం వద్ద గుడారాన్ని ఏర్పాటు చేసుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌పై పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కె.సజయ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తోసిపుచ్చింది. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని, మృతదేహాలు పాడవకుండా ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది బృందా గ్రోవర్ అభ్యర్థించగా.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే న్యాయ విచారణ కమిషన్‌ను నియమించామని ధర్మాసనం పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. అయితే పిటిషనర్ అభ్యర్థన మేరకు హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను ధర్మాసనం కల్పించింది. -
దిశ కేసులో ‘ఫైనల్ రిపోర్ట్’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసు లోని నలుగురు నిందితులు ఎన్కౌంటర్లో మరణించిన నేపథ్యంలో వీరిపై నేరాభియోగపత్రం (చార్జిషీటు) దాఖలు చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే సైబరాబాద్ పోలీసులు చార్జిషీటు స్థానంలో ఫైనల్ రిపోర్టును సమర్పించనున్నారని సమాచారం. నవంబర్ 27న శంషాబాద్ తొండుపల్లి టోల్గేట్ వద్ద ‘దిశ’అపహరణ, హత్య నుంచి డిసెంబర్ 6న చటాన్‌పల్లిలో నిందితుల ఎన్కౌంటర్ వరకు జరిగిన ఘటనలన్నింటిని వివరిస్తూ షాద్‌నగర్ కోర్టుకు ఫైనల్ రిపోర్టు సమర్పించనున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ కేసులో నిందితులకు వేగంగా శిక్ష పడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఆరంభానికి ముందే నిలిచిపోయింది. చదవండి: దిశ: ఆ మృతదేహాలను ఏం చేయాలి? కోర్టు ఏర్పాటు ప్రకటన అనంతరం నిందితులంతా హతమవ్వడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు ఫైనల్ రిపోర్టును రూపొందించే పనిలో పడ్డారు. ఇది సమర్పించాక ఇక దర్యాప్తు దాదాపుగా ముగిసినట్లేనని ఓ సీనియ ర్ అధికారి వ్యాఖ్యానించారు. ఎన్‌కౌంటర్‌పై విచారణ చేయడానికి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణను కొనసాగించనుంది. ఇక ఎన్కౌంటర్ బూటకమంటూ సుప్రీంకోర్టులు పలు పిటిషన్లు దాఖలు కావడంతో దీనిపై విచారణకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిషన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ కమిటీ వారం రోజుల్లోపు నగరానికి రావొచ్చని డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ కమిషన్ సిఫార్సు మేరకే నిందితుల మృతదేహాల అప్పగింతపై తుది నిర్ణయం ఉంటుంది. అయితే తమ కుమారుల మృతదేహాలు త్వరగా అప్పగించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. చదవండి: దిశ: ఆ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి చదవండి: దిశ చట్టం తెచ్చిన సీఎం జగన్‌కు జేజేలు -
దిశ కేసు: నిందితుల డీఎన్ఏలో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్ : దిశ అత్యాచారం, హత్య కేసు విచారణలో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నివేదిక కీలకంగా మారింది. కాలిపోయిన దిశ శరీరం స్టెర్నమ్ బోన్ నుంచి సేకరించిన డీఎన్ఏ ఆధారంగా.. ఆ మృతదేహం దిశదే అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అదే విధంగా ఘటనాస్థలంలోనే నిందితులు అత్యాచారం చేసినట్లుగా స్పష్టమైన ఫోరెన్సిక్ ఆధారాలు లభించాయి. ఈ క్రమంలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దిశ శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్లుగా ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. దీంతో దిశపై అత్యాచారానికి పాల్పడటానికి ముందు నిందితులు ఆమెకు మద్యం తాగించినట్లుగా నిర్ధారణ అయ్యింది. కాగా ఈ విషయాన్ని నిందితులు ఇప్పటికే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇక ఎన్కౌంటర్లో మరణించిన దిశ నిందితుల డీఎన్ఏ నివేదికలో సైతం కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో జరిగిన నేరాలతో దిశ నిందితుల డీఎన్ఏ మ్యాచ్ అవుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. దీని ఆధారంగా నిందితులకు నేర చరిత్ర ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా వెటర్నరీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న దిశను నలుగురు నిందితులు చటాన్‌పల్లి వద్ద పాశవికంగా అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన విషయం విదితమే. అనంతరం ఆమె మృతదేహాన్ని కాల్చివేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. క్రైం సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనాస్థలికి తీసుకువెళ్లగా అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా... విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం... ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్‌ను నియమించింది. -
దిశ నిందితుల ఎన్కౌంటర్ @ ఉ 6:10 గం.
సాక్షి, హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నమోదైన ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్న సమయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నెల 6న ఉదయం దాదాపు 5:45 గంటల నుంచి 6:15 గంటల మధ్య దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు ఇప్పటికే పేర్కొనగా ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో కచ్చిత సమయం నమోదైంది. దీని ప్రకారం ఎన్కౌంటర్ ఘటనపై అదే రోజు ఉదయం 8.30 గంటలకు పోలీసులపై దాడి విషయాన్ని షాద్‌నగర్ ఏసీపీ వి. సురేందర్ షాద్‌నగర్ పోలీసు స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందులో ఎన్కౌంటర్ జరిగిన సమయాన్ని ఉదయం 6:10 గం.గా పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఈ సమయమే ప్రామాణికం కానుంది. ఈ ఫిర్యాదును ఎస్సై దేవరాజు స్వీకరించి క్రైం నంబర్ 803/2019గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాడి, ఆయుధాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులుపై కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ను ఉదయం 9.30 గంటలకల్లా షాద్‌నగర్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌కు పంపించారు. దిశకు సంబంధించిన ఆధారాల కోసం ఈ నెల 6న ఉదయం 5:30 గంటలు దాటిన తరువాత నిందితులను చటాన్‌పల్లిలోని ఘటనా స్థలానికి పోలీసులు తీసుకెళ్లడం, నిందితులు పోలీసుల ఆయుధాలు లాక్కొని కాల్పులు జరపడం, పోలీసుల ఎదురుకాల్పుల్లో వారు హతమవడం తెలిసిందే. అత్యాచారాన్ని నిర్ధారించిన ఫోరెన్సిక్ నివేదిక ఫోరెన్సిక్ నివేదికలో దిశపై అత్యాచారం నిజమేనని తేలింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఫోరెన్సిక్ టీం దిశ దుస్తులు, వస్తువులు, నిందితులు ఉపయోగించిన లారీలో గుర్తించిన రక్తపు మరకలు, వెంట్రుకలు, దుస్తులకు అంటిన వీర్యపు మరకల ఆనవాళ్లను సేకరించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తరువాత వారి నుంచి సేకరించిన శాంపిళ్లతో అవి సరిపోలినట్లు తెలియవచ్చింది. దీంతో దిశపై అత్యాచారం జరిపింది ఈ నలుగురేనన్న విషయం శాస్త్రీయంగా నిరూపితమైంది. అలాగే చటాన్‌పల్లి అండర్‌పాస్ వద్ద లభించిన కాలిన మృతదేహం దిశదేనని ఫోరెన్సిక్ బృందం తేల్చిందని, మృతదేహం నుంచి సేకరించిన స్టెర్నమ్ బోన్ డీఎన్ఏ దిశ తల్లి దండ్రులతో సరిపోలిందని సమాచారం. ఈ మేర కు ఫోరెన్సిక్ బృందం తమ నివేదికను దర్యాప్తు అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. -
దిశ కేసు: స్పష్టమైన ఫోరెన్సిక్ ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ సాక్షి టీవీ చేతికి చిక్కింది. ఇందులో ఉన్న వివరాల ప్రకారం... బాధితురాలు దిశ వస్తువులను రికవర్ చేయడంలో భాగంగా డిసెంబరు 6న నిందితులను ఘటనాస్థలం చటాన్‌పల్లికి పోలీసులు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఉదయం ఆరున్నర గంటలకు నిందితులు ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డారు. ఆయుధాలు లాక్కొన్ని పోలీసులను హతమార్చాలని చూశారు. ఆత్మరక్షణకై పోలీసులు కాల్పులు జరుపగా నలుగురు నిందితులు చనిపోయారు. ఈ మేరకు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ ఫిర్యాదుతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో నిందితుల వయస్సు 19 సంవత్సరాలుగా పేర్కొన్నారు. కాగా దిశ హత్యానంతరం పోలీసులు మాట్లాడుతూ నిందితుల వయస్సు 20 సంవత్సరాలు అని పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు దిశ అత్యాచారం, హత్య కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నివేదిక పోలీసులకు అందింది. కాలిపోయిన దిశ శరీరం స్టెర్నమ్ బోన్ నుంచి సేకరించిన డీఎన్ఏ ఆధారంగా.. ఆ మృతదేహం దిశదే అని నిర్ధారణ అయ్యింది. అదే విధంగా ఘటనాస్థలంలోనే నిందితులు అత్యాచారం చేసినట్లుగా స్పష్టమైన ఫోరెన్సిక్ ఆధారాలు లభించాయి. ఈ కేసులో కీలకంగా మారిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా నిజానిజాలు నిర్ధారణ కానున్నాయి. కాగా వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు నిందితులు చటాన్‌పల్లి వద్ద పాశవికంగా అత్యాచారం చేసి, హత్యకు పాల్పడి ఆమె మృతదేహాన్ని కాల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ఘటనపై నిరసనలు వెల్లువెత్తగా.. నిందితులను అదపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. ఈ క్రమంలో క్రైం సీన్ రీకన్‌ష్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనాస్థలికి తీసుకువెళ్లగా అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా... విచారణ జరిపిన న్యాయస్థానం... ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్‌ను నియమించింది.(ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్) -
బిడ్డ కంట చెమ్మ.. గాయమైనా వచ్చింది అమ్మ..
షాద్‌నగర్‌టౌన్: రోడ్డు ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలియని 8 నెలల చిన్నారి ఆకలితో రోదిస్తోంది. విషయాన్ని గుర్తించిన ఆ తల్లి గాయాలను సైతం లెక్క చేయకుండా.. బిడ్డకు పాలిచ్చింది. ఈ దృశ్యం మంగళవారం షాద్‌నగర్ బైపాస్ జాతీయ రహదారిపై ఉన్న చటాన్‌పల్లి బ్రిడ్జి సమీపంలో కనిపించింది. దిశ హంతకుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని చూసేందుకు డ్రైవర్ లారీని అపుతుండగా.. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కొత్తకోట వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తకోటకు చెందిన శాంతి టాటా ఏస్ వాహనంలో తన 8 నెలల కూతురితో ప్రయాణం చేస్తోంది. ఈ ప్రమాదంలో శాంతికి తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్ అయిన సమయంలో చిన్నారి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఆకలితో రోదించింది. దీంతో శాంతి రోడ్డు పక్కనే పడుకొని బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చింది. ఘటనా స్థలంలో ఉన్న మీడియా ప్రతినిధులు రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించి క్షతగాత్రులను బయటికి తీశారు. గాయపడిన వారిని పోలీసులు షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
‘దిశ’ కేసు : ఎన్హెచ్ఆర్సీ ముందుకు షాద్‌నగర్ సీఐ
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందం మంగళవారం కూడా విచారణను కొనసాగించింది. విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని పోలీస్ అకాడెమీలో ఉన్న ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధుల ముందు షాద్‌నగర్ సీఐ శ్రీధర్ హాజరయ్యారు. ఇక దిశ హత్యకేసు నిందితులు పెట్రోల్ కొనుగోలు చేసిన బంక్ యజమాని ప్రవీణ్‌ను కూడా ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు విచారించనున్నారు. ఇదిలాఉండగా.. ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు బృందాన్ని ఎన్హెచ్ఆర్సీ బృందం మంగళవారం ప్రశ్నించి పలు వివరాలు సేకరించింది. (చదవండి : చటాన్‌పల్లి ఎన్కౌంటర్ కేసులో కీలక మలుపు) (చదవండి : ఎన్‌కౌంటర్‌పై గాయపడ్డ పోలీసుల వెర్షన్!) -
ఎన్‌కౌంటర్‌పై గాయపడ్డ పోలీసుల వెర్షన్!
సాక్షి, హైదరాబాద్: దిశ కేసులోని నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందం మంగళవారం కూడా తన విచారణను కొనసాగించింది. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు బృందాన్ని ఎన్హెచ్ఆర్సీ బృందం ప్రశ్నించి పలు వివరాలు సేకరించింది. ఎన్కౌంటర్లో గాయపడిన పోలీసులను బృందం సభ్యులను ప్రధానంగా విచారించారు. సంఘటన జరిగిన తీరు, తాము గాయపడ్డ తీరును పోలీసులు వారికి వివరించారు. చదవండి:చటాన్‌పల్లి ఎన్కౌంటర్ కేసులో కీలక మలుపు చటాన్‌పల్లి వద్ద సంఘటనా స్థలికి తెల్లవారుజామున నిందితులను పోలీసులు తీసుకెళ్లారని, అక్కడ పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా ఒక్కసారిగా నిందితులు తిరగబడ్డారని, ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో దాడిచేసి పారిపోయేందుకు ప్రయత్నించారని గాయపడ్డ పోలీసులు వివరించారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి నుంచి సర్వీస్ రివాల్వర్‌ను సైతం నిందితులు లాకొని..కొంతదూరం పారిపోయాక కాల్పులు జరిపారని, దీంతో గత్యంతరంలేక పోలీసులు ఆత్మరక్షణ కోసమే ప్రతి కాల్పులు జరిపారని తెలిపారు. మరోవైపు ఎన్కౌంటర్ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఉన్నతాధికారులు ఎన్హెచ్ఆర్సీకి తెలిపారు. ఈ ఘటనా స్థలిలో పంచనామా నిర్వహించి, ఆధారాలు సేరించామని, సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం ఫోరెన్సిక్ నిపుణులతో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపిన పోలీసులు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్, సీసీటీవీ విజువల్స్, ఇతర కేసు వివరాలను ఎన్హెచ్ఆర్సీకి అందజేశారు. చదవండి: వెంకటేశ్వర్లు, అరవింద్‌ను ప్రశ్నించిన ఎన్హెచ్ఆర్సీ -
గాంధీ ఆస్పత్రి వద్ద గట్టి బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: దిశ కేసులో నిందితుల మృతదేహాలను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవస్థ మెడికల్ కాలేజీలో లేదంటూ పోలీసుల దృష్టికి కాలేజీ యాజమాన్యం తీసుకువచ్చింది. దీంతో పోలీసులు విషయాన్ని హైకోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలంటూ హైకోర్టు ధర్మాసనం అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని మార్చురీ 7, 8, 9, 10 నంబర్లు గల బాక్సులలో భద్రపరిచారు. మృతదేహాలు కుళ్లిపోకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రి మార్చురీ సమీపంలో షాద్‌నగర్ పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మార్చురీ వద్ద భద్రతను సికింద్రాబాద్ గోపాలపురం ఏసీపీ వెంకటరమణ పర్యవేక్షించారు. ఇక, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరుపుతున్న సిట్ బృందం మంగళవారం చటాన్‌పల్లికి వెళ్లనుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిణామాలపై సిట్ విచారణ జరపనుంది. షాద్‌నగర్ పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్తో పాటు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను సిట్ పరిశీలించనుంది. -
చటాన్‌పల్లి ఎన్కౌంటర్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: దిశ కేసులోని నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై విచారణ జరుపుతున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందానికి సైబరాబాద్ పోలీసులు మంగళవారం కీలక సాక్ష్యాలు అందజేశారు. ఎన్కౌంటర్ ఘటనలో చనిపోయిన నిందితులే దిశపై అత్యాచారం జరిపి.. హత్య చేసినట్టు రుజువు చేసే ఫోరెన్సిక్ ఆధారాలతో కూడిన నివేదికను పోలీసులు ఎన్హెచ్ఆర్సీకి అందజేశారు. దిశ కిడ్నాప్, అత్యాచారం, హత్య, మృతదేహం కాల్చివేత తదితర పరిణామాలకు సంబంధించి తమ దర్యాప్తులో సేకరించిన ఆధారాలను ఈ నివేదికలో పొందుపరిచారు. ఈ కేసులో అత్యంత కీలకమైన శాస్త్రీయ ఆధారాలు కూడా ఎన్‌హెచ్చ్‌ఆర్సీకి అందజేసిన నివేదికలో ఉన్నట్టు సమాచారం. సంఘటనాస్థలంలో దొరికిన రక్తం మరకలను, లారీ క్యాబిన్లో దొరికిన రక్తం మరకలకు సంబంధించిన డీఎన్ఏ రిపోర్ట్, ఘటనా స్థలంలో నిందితుల లారీ సంచరించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఎన్హెచ్ఆర్సీకి పోలీసులు అందజేశారు. చదవండి: దిశ కేసు.. వెలుగులోకి కీలక వీడియో కొత్తూరు సమీపంలో నిందితులు పెట్రోల్ కొనుగోలు చేసిన సీసీటీవీ ఫుటేజీని సైతం సమర్పించినట్టు తెలుస్తోంది. దిశ హత్యాచారం కేసులో శరవేగంగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఈ కేసులో తాము సేకరించిన ఆధారాలు, కేసుకు సంబంధించిన కీలక వివరాలు ఎన్హెచ్ఆర్సీ ముందు పెట్టారు. ఇక, దిశ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలను మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం వరకు మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరచనున్నారు -
దిశ: వెంకటేశ్వర్లు, అరవింద్‌ను ప్రశ్నించిన ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్: దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందం సోమవారం సాయంత్రం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను కలిసింది. నగరంలోని కేర్ ఆస్పత్రిలో నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్‌లను కలిసి వారి నుంచి వాంగ్మూలాన్ని సేకరించింది. చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో దిశ కేసు నిందితులు హతమవ్వగా.. నిందితులు జరిపిన ఎదురుకాల్పల్లో వీరిద్దరు గాయపడ్డారు. ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలో వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్లు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో వీరిని కలిసిన ఎన్హెచ్ఆర్సీ బృందం.. దాదాపు అరగంటపాటు వారిని ప్రశ్నించి.. పలు వివరాలు సేకరించింది. ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ బృందం దిశ కుటుంబసభ్యులు, ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల కుటుంబసభ్యుల వాంగ్మూలం తీసుకొని.. వివరాలు సేకరించిన సంగతి తెలిసిందే. ‘తప్పు చేసిన మా బిడ్డలను శిక్షించమనే చెప్పాం. మా బిడ్డలను అన్యాయంగా కాల్చి చంపారు..’ అంటూ ఎన్కౌంటర్ మృతుల తల్లిదండ్రులు ఎన్హెచ్ఆర్సీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు హత్యాచార ఘటన గురించి దిశ తండ్రితోపాటు సోదరిని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు అడిగి తెలుసున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో వీరందరి నుంచి ఎన్హెచ్ఆర్సీ బృందం స్టేట్మెంట్ రికార్డు చేసింది. చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన నలుగురు యువకుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచేందుకు నాలుగు ఫ్రీజర్ బాక్స్‌లను సిద్ధం చేశారు. ఇందుకోసం గాంధీ ఆస్పత్రి మార్చురీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అర్ధరాత్రి సమయంలో మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశముందని తెలుస్తోంది. నిందితుల మృతదేహాలను వచ్చే శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
దిశ కేసు.. వెలుగులోకి కీలక వీడియో
సాక్షి, హైదరాబాద్: యావత్ దేశాన్ని కదిలించిన దిశ హత్యాచారం కేసులో మరో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది. గత నెల 27వ తేదీన రాత్రి సమయంలో నలుగురు నిందితులు వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం చేసి.. పాశవికంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం నిందితులు చటాన్‌పల్లిలోని సంఘటన స్థలంలోనే పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. దిశ హత్యాచారం, నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన కీలక వీడియోను తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు దిశ కేసును ఛేదించి నిందితులను గుర్తించారు. నవంబర్ 27వ తేదీన రాత్రి 10.28 గంటల సమయంలో తొండూపల్లి టోల్గేట్ వద్ద నుంచి వెళ్తున్న ఈ లారీలో దిశ మృతదేహాన్ని నిందితులు తరలించారని పోలీసులు గుర్తించారు. టోల్గేట్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో లారీ వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది.. తొండూపల్లి టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో నిందితులు దిశపై సామూహిక అత్యాచారం జరిపి.. ఆపై హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. నవంబర్ 27వ తేదీన రాత్రి 10 గంటల తర్వాత దిశను నిందితులు హతమార్చారని, అనంతరం శరీరానికి దుప్పట్లు చుట్టి.. ఆపై కిరోసిన్ పోసి తగులబెట్టారని, ఈ ఘటనలో ఆమె మృతదేహం 70 శాతం కాలినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం.. ఘటనాస్థలం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల వరకు ఆమె మృతదేహాన్ని లారీలో తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. ఇలా లారీలో మృతదేహాన్ని తీసుకువెళుతుండగా.. ఆ దృశ్యం తొండూపల్లి టోల్గేట్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. నిందితుల లారీ వీడియో దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. చదవండి: ఇప్పటికైనా మృతదేహాలు అప్పగించండి! -
అసలు ఇదంతా ఎలా జరిగింది?
సాక్షి, శంషాబాద్ : ‘దిశ’అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) విచారణ మొదలైంది. కమిషన్ ప్రతినిధులు శనివారం మహబూబ్‌నగర్ లో విచారణ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు సోమవారం వరకు రాష్ట్రంలోనే ఉండి ఎన్కౌంటర్ జరిగిన తీరుపై సమగ్ర విచారణ జరపనున్నారు. తొలిరోజు ఎన్కౌంటర్లో చనిపోయిన వారి మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నివేదికను అధ్యయనం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఎన్కౌంటర్ జరిగిన చటాన్‌పల్లి సంఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. ఆదివారం మృతుల తల్లిదండ్రులతో సమావేశం కానున్నారు. అయితే వారి తల్లిదండ్రులను హైదరాబాద్‌కు పిలిపించుకుంటారా? లేక మృతుల స్వస్థలమైన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్ గ్రామాలకు వెళ్తారా అనే దానిపై శనివారం రాత్రి వరకు స్పష్టత రాలేదు. సోమవారం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, ఎన్కౌంటర్ చేసిన పోలీసులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని పోలీసువర్గాలు తెలిపాయి. విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడున్నర గంటల పాటు భేటీ... శనివారం మధ్యాహ్నం 1.20 గంటలకు మహబూబ్‌నగర్ వచ్చిన ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు స్థానిక పోలీసు అధికారులు, పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్య బృందం, స్థానిక జనరల్ ఆస్పత్రి వైద్యులతో సుమారు మూడున్నర గంటల పాటు భేటీ అయ్యారు. ‘దిశ’అత్యాచారం, హత్య మొదలు.. ఎన్కౌంటర్, శవపరీక్ష వరకు అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. దిశ హత్య తర్వాత, ఎన్కౌంటర్ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదికను పరిశీలిస్తున్న సమయంలో ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులకు పలు అనుమానాలు రావడంతో పోస్టుమార్టం చేసిన వైద్యులను పిలిపించాలని కోరారు. దీంతో గాంధీ ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ కృపాల్‌సింగ్, అసోసియేట్ ప్రొఫెసర్ లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేందర్, మరో వైద్యుడు హుటాహుటిన మహబూబ్‌నగర్ వచ్చి, వారి సందేహాలను నివృత్తి చేశారు. రెండుసార్లు మృతదేహాలు పరిశీలన.. ఆస్పత్రికి చేరుకున్న వెంటనే నేరుగా మార్చురీకి వెళ్లిన ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు.. అక్కడ మృతదేహాలను వారి పేర్లతో సహా వివరాలన్నీ నిర్ధారించుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ చాంబర్‌కు వెళ్లి పోస్టుమార్టం నివేదికను క్షుణ్ణంగా చదివారు. ముఖ్యంగా ఎంత దూరం నుంచి కాల్చి ఉండొచ్చు? తూటాలు మృతుల శరీరాల్లో చొచ్చుకుని పోవడంతో ఏ మేరకు రంధ్రం ఏర్పడింది? మృతులు పారిపోతున్నట్టు ధ్రువీకరించే ఆధారాలు ఏవైనా ఉన్నాయా అనే కోణాల్లో ఆరా తీశారు. అనంతరం మరోసారి మార్చురీకి వెళ్లి.. మృతదేహాలను పరిశీలించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అక్కడ నుంచి చటాన్‌పల్లి శివారులో దిశను కాల్చివేసిన స్థలానికి చేరుకున్నారు. నిందితులు దిశను శంషాబాద్ నుంచి అక్కడకు ఎలా తీసుకొచ్చారు..? ఆమె మృతదేహాన్ని ఎక్కడ దహనం చేశారు..? అనే విషయాలను శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి వారికి వివరించారు. తర్వాత ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి చేరుకుని.. మృతదేహాలు ఎక్కడ పడి ఉన్నాయి.. ఎన్కౌంటర్ ఎలా జరిగిందనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దిశను కాల్చేసిన స్థలానికి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం ఎంత దూరంలో ఉందనే వివరాలను కూడా సేకరించారు. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఎంతమంది పోలీసులు ఉన్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆ ప్రదేశాన్ని క్షుణ్నంగా పరిశీలించాక, అక్కడి నుంచి నిందితులు దిశపై హత్యాచారం చేసిన తొండుపల్లిలోని టోల్‌ప్లాజా వద్దకు వెళ్లారు. దిశపై అత్యాచారం, హత్య జరిగిన ప్రహరీ లోపలి ప్రదేశాన్ని నిశితంగా గమనించారు. నిందితులు ఆమెపై ఘాతుకానికి ఎలా పాల్పడ్డారో డీసీపీ ప్రకాష్‌రెడ్డి వారికి వివరించారు. నేడు మృతుల తల్లిదండ్రులతో భేటీ... జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రతినిధులు ‘దిశ’ఎన్కౌంటర్ మృతుల తల్లిదండ్రులతో ఆదివారం సమావేశం కానున్నారు. మృతుల వ్యక్తిత్వం.. అలవాట్ల వివరాలతో పాటు ఎన్‌కౌంటర్‌పై వారి అభిప్రాయాలు సేకరించనున్నారు. నిందితులను పోలీసులు ఎప్పుడు తీసుకెళ్లారు? ఎలా తీసుకెళ్లారు? ఏం చెప్పి తీసుకెళ్లారు? ఎన్కౌంటర్ చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారా? చేసిన తర్వాత వారి స్పందన ఏమిటి? అనే విషయాలపై ఆరా తీస్తారని ఓ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. రహస్యంగా విచారణ.. ఎన్కౌంటర్ నిజానిజాలను నిర్ధారించేందుకు వచ్చిన ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు తమ విచారణను రహస్యంగా నిర్వహించారు. ఎన్కౌంటర్, పోస్టుమార్టంపై తమ అనుమానాలను నివృత్తి చేసుకునే క్రమంలో వైద్యులు, పోలీసు ఉన్నతాధికారులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు. మీడియాతో మాట్లాడతారని భావించినా మాట్లాడలేదు. మూడు రోజుల విచారణ పూర్తయిన తర్వాతే వారు మీడియాతో మాట్లాడతారని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఈ క్రమంలో విచారణకు అంతరాయం కలగకుండా పోలీసులు ఆస్పత్రి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులెవరినీ లోపలికి అనుమతించలేదు. రోగులను క్షుణ్ణంగా పరిశీలించి.. నిర్ధారించుకున్న తర్వాతే వదిలిపెట్టారు. మీడియాను సైతం గేటు బయటకు పంపేశారు. మరోవైపు దిశ తల్లిదండ్రులను కమిషన్ ప్రతినిధులు కలుస్తారని భావించినా.. వారు ఆమె ఇంటికి వెళ్లలేదు. మూడురోజుల్లో ఫోరెన్సిక్ నివేదిక ‘‘ఎన్కౌంటర్లో చనిపోయిన దిశ నిందితుల పోస్టుమార్టం నివేదికను మరో మూడు రోజుల్లో జిల్లా జడ్జి ద్వారా హైకోర్టుకు సమర్పిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదుగురితో కూడిన వైద్య బృందం నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసింది. ఈ వ్యవహారంలో అన్ని నిబంధనలూ అనుసరించాం. పోస్టుమార్టానికి సంబంధించి ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు అడిగిన సందేహాలను నివృత్తి చేశాం’’ – డాక్టర్ కృపాల్‌సింగ్, గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణుడు ఘటన తీరును తెలుసుకునేందుకే వచ్చారు ‘‘దిశ హత్యోదంతం, నిందితుల ఎన్కౌంటర్ జరిగిన తీరును పరిశీలించేందుకే జాతీయ మానవ హక్కుల సంఘం బృందం వచ్చింది. ఏడుగురు సభ్యులతో కూడిన బృందం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ వెళ్లి తిరుగు ప్రయాణంలో చటాన్‌పల్లి వద్ద దిశను కాల్చిన స్థలాన్ని, ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించింది. విచారణ కమిటీలో ఓ ఫోరెన్సిక్ నిపుణుడితోపాటు ఏడుగురు సభ్యులున్నారు. విచారణ ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం’’ – ప్రకాష్‌రెడ్డి, డీసీపీ -
వివరాలు మాత్రమే తీసుకున్నారు: డీసీపీ
సాక్షి, శంషాబాద్: దిశ ఘటన, నిందితుల ఎన్కౌంటర్ స్థలాన్ని ఏడుగురు సభ్యులతో కూడిన జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం పరిశీలించిందని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో మార్చురీలో ఉన్న నలుగురు నిందితుల మృతదేహాలను పరిశీలించిందని పేర్కొన్నారు. అనంతరం నలుగురు నిందింతులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఎన్హెచ్ఆర్సీ బృందానికి సీనియర్ ఎస్పీ నేతృత్వం వహిస్తున్నారని ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ బృందంలో ఫోరెన్సిక్ నిపుణుడు కూడా ఉన్నారని తెలిపారు. ఘటనకు సంబంధించి వారు తమ దగ్గర వివరాలు మాత్రమే తీసుకున్నారని వెల్లడించారు. వారు మీడియాతో మాట్లాడే వీలు లేనందున వాళ్ల తరఫున తనను మాట్లాడమన్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణాధికారిగా రాచకొండ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి నియమితులయ్యారు. చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఆయన దర్యాప్తు జరుపనున్నారు. కాగా షాద్‌నగర్ సమీపంలో గత నెల 27న వెటర్నరీ వైద్యురాలిపై మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు అత్యాచారం చేసి, అనంతరం ఆమెపై పెట్రోలు పోసి తగులబెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం.. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా వారు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. -
వాళ్లు కేవలం కొంగు కప్పుకొనే తిరుగుతారు
సాక్షి, హైదరాబాద్ : మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించాలని నటి, సామాజిక వేత్త రేణూ దేశాయ్ అన్నారు. చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో మహిళలకు ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు. ఏదేమైనా వ్యవస్థ, సమాజంలో మార్పు వచ్చినపుడే నిర్భయ, దిశ వంటి ఘటనలు జరగవని అభిప్రాయపడ్డారు. అదే విధంగా అత్యాచార ఘటనలకు మహిళల వస్త్రధారణను కారణంగా చూపడం దారుణమన్నారు. దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దిశ నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో శనివారం ఆమె సాక్షితో తన మనోభావాలు పంచుకున్నారు. ‘ఇంట్లో లక్ష్మీదేవి, సరస్వతిని పూజిస్తారు కానీ చాలా మంది మగవాళ్లు తమ ఇంటి లక్ష్మిని మాత్రం సరిగ్గా చూసుకోరు. ఇందుకు ఎవరూ అతీతం కాదు. దేవుడిపై ఉన్న భయం, భక్తి చట్టాలపై కూడా ఉండాలి. అప్పుడే నేరాలు కాస్తైనా తగ్గుతాయి. ఇక బట్టల వల్లే బలత్కారం అనే వాళ్లని అస్సలు క్షమించకూడదు. వారన్నట్లుగా మరి మూడు నెలల పసివాళ్లు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు. దిశ కూడా సల్వార్, దుపట్టా వేసుకునే బయటికి వచ్చారు కదా. చాలా వరకు ట్రైబల్ ఏరియాల్లో కొంగు కప్పుకొని మాత్రమే తిరుగుతారు. మరి వాళ్లందరి పట్ల మగవాళ్లు అలా ప్రవర్తించడం లేదు కదా. మహిళల స్వేచ్ఛను హరించవద్దు. బట్టల కారణంగా.. రాత్రి వేళల్లో బయట ఉన్నందు వల్లే అత్యాచారం చేశానంటే కుదరదు. మనకు స్వీయ నియంత్రణ ఉండాలి. ఓ మహిళ మీ ముందు నగ్నంగా ఉన్నా సరే అమ్మలా భావించి ఏమైందమ్మా అని అడిగి మరీ తనకు సాయం చేసే మానసిక పరిపక్వత రావాలి’ అని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. ‘ఇక దిశ ఘటనతో ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులకు భయం కలిగింది. నిందితుల పట్ల ఎన్‌హెచ్చార్సీ స్పందించిన తీరు సరైందే. అయితే దిశ మానవ హక్కులకు కూడా భంగం కలిగిన విషయాన్ని గుర్తించాలి కదా. పథకం ప్రకారం ఆమె స్కూటీని పంక్చర్ చేసి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేయడం ఎంత వరకు సమంజసం. కేవలం రూపాన్ని బట్టి మనిషి అనటం సరికాదు. మనిషి రాక్షసుడిగా ప్రవర్తించినపుడు అతడిని జంతువుగానే గుర్తించాలి. రాక్షసుడే అవుతాడు అలాంటి వాళ్లకు మానవ హక్కులు ఎలా వర్తిస్తాయి. పేద, ధనిక, కుల, వర్గ, మతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికీ ఒకే న్యాయం ఉండాలి. తప్పు చేసింది ఎవరైనా అందరికీ సమానంగా శిక్షలు పడాలి. అయితే ఆ క్రమంలో నిజమైన దోషులెవరో గుర్తించగలగాలి. అంతేకాదు విద్యావిధానంలోనూ మార్పులు రావాలి. సైకాలాజీని పాఠ్యాంశంగా బోధించాలి. ఇక చదువుకునే అవకాశం లేని వాళ్లకు విద్యను అందించుటకై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మనిషి స్వభావంలో మార్పు వచ్చినపుడు, చట్టాల పట్ల భయం కలిగి ఉన్నపుడే మార్పు సాధ్యమవుతుంది. దిశ ఘటన జరిగిన రోజు దేశవ్యాప్తంగా ఎన్నో అత్యాచారాలు జరిగాయి. అయితే ఘటన తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి. నిన్నటి ఎన్‌కౌంటర్‌ను నేను పూర్తిగా అంగీకరించను. అలాగని వ్యతిరేకించను. అయితే తెలంగాణ పోలీసుల చర్యకు జనామోదం లభించడం చూస్తుంటే అత్యాచార ఘటన పట్ల వారు స్పందించిన తీరు స్పష్టమవుతోంది. నిజానికి దిశ ఘటనలో ఆ నలుగురే కాదు. ఘటన జరుగుతున్నా ఆ వైపుగా దృష్టి సారించని వాళ్లతో సహా ఈ సమాజం మొత్తం ఆ నేరంలో భాగస్వామ్యమే. ఇక్కడ నేను ఓ ఆడపిల్లకు తల్లిగా మాట్లాడుతున్నాను’ అని చెప్పుకొచ్చారు. -
పవన్‌పై పూనమ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : దిశ నిందితుల్ని తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నారు. దిశకు న్యాయం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దిశ ఎన్‌కౌంటర్‌పై సిని నటి పూనమ్ కౌర్ స్పందించారు. దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దిశ నిదితుల్ని ఎన్ కౌంటర్ చేయటం అభినందనీయమని ఆమె సంతోషం వ్యక్తంచేశారు. దిశ ఘటన తెలిసి తానుఎంతో ఆవేదన చెందాననీ.. ఆందోళన చెందానని కానీ.. నిందితులకు ఇంత త్వరగా శిక్ష వేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడినవారికి ఇదే సరైన శిక్ష అని అన్నారు. ఇక ఏ ఆడపిల్లకు ఇటువంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులకు..ప్రభుత్వాలకు ఉందన్నారు. ఇలా పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూనే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసింది పూనమ్. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన పూనమ్.. ఆ తరువాత కాసేపటికే డిలీట్ చేసింది. అయితే ఆ లోపే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ ట్వీట్లో ఏముందంటే...‘ ఉదయమే మంచి వార్త విన్నాను. దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ సీఎం, తెలంగాణ డీజీపీకి ధన్యవాదాలు. ఇదే విధంగా నాతో పాటు పలువురి మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్ రాజకీయ నాయకులను శిక్షిస్తారని భావిస్తున్నా. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు’’ అని పూనమ్ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్లో పవన్ కల్యాణ్ పేరును ప్రత్యక్షంగా వాడనప్పటికీ.. ఇటీవల కాలంలో ఆయన మాట్లాడిన మాటలను కామెంట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్ పవన్‌కేనని అందరికీ అర్థమైంది. కాగా, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై పవన్ స్పందిస్తూ.. ‘వైద్యురాలిపై హత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు.అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు తగిలిస్తే సరిపోతుంది’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
ఈ రోజుకు హ్యాపీ.. రేపు ఏంటీ? – జయసుధ
దిశ ఘటనలో సత్వర న్యాయం జరిగినందుకు ఈ రోజుకు హ్యాపీగా ఉన్నాం. కానీ రేపు ఏంటనే భయం అందరిలో ఉంది. నిర్భయ ఘటనలో ఏడేళ్లయినా శిక్ష పడలేదు. ‘ఉన్నావ్’లో ఏకంగా బాధితురాలిని నడిరోడ్డుపైనే కాల్చేశారు. అసలు మహిళలపై హింసకు కారణమవుతున్న అంశాలపై లోతైన చర్చ, ఆ దిశగా నివారణ చర్యలు తక్షణం చేపట్టాలి. ముఖ్యంగా దేశంలో సగభాగం ఉన్న మహిళలకు ప్రధాని మోదీ ఈ విషయంలో ఏ రకమైన భరోసానిస్తారో స్పష్టం చేయాలి. మహిళలపై హింస నివారణకు కుటుంబం, పాఠశాలల నుండే మొదలు కావాలి. మహిళల ఇబ్బందుల విషయంలో పోలీసుల తీరులో సమూల మార్పు, కోర్టులు సత్వర తీర్పులు వెలువరించే దిశగా అన్ని వ్యవస్థలు పనిచేయాలి. అప్పుడే మహిళలు, కుటుంబాలు రోజూ హ్యాపీగా ఉండే పరిస్థితి ఉంటుంది. -
సాహో.. సజ్జనార్!
సాక్షి, హైదరాబాద్: ‘సజ్జనహారం న్యాయానికి జయహారం ఓరుగల్లు భద్రకాళి కళ్లుతెరిచి ఆనతినిచ్చిన ప్రదోషకాలం అపరవీరభద్రుడై సజ్జనార్‌సలిపిన మృగ సంహారం’ సోషల్‌మీడియాలో ఇలాంటి మాటలెన్నో.. విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్.. ఇప్పు డు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. దమ్మున్న పోలీస్.. రియల్ సింగం.. ఇలాం టి పోలీస్ రాష్ట్రానికి కనీసం ఒక్కరన్నా ఉండాలి.. పోలీసులు ఎలా ఉండాలో ఈయనను చూసి నేర్చుకోవాలి.. ఐపీఎస్ అధికారిగా ఆయన తెలంగాణలో ఉన్నందుకు గర్విస్తున్నా.. అత్యాచారం చేసేవారికి వెన్ను లో వణుకుపుట్టే పేరు సజ్జనార్.. దేశవ్యాప్తంగా ‘యాంటీ రేప్ బ్యూరో’ఏర్పాటు చేసి దానికి బాస్‌గా సజ్జనార్‌ను నియమించాలి. శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో ఇలాం టి కామెంట్స్ కోకొల్లలు. గత కొన్ని రోజులుగా యావత్తు దేశాన్ని కుదిపేస్తున్న ‘దిశ’కేసుకు ఓ ముగింపునిస్తూ చోటుచేసుకున్న ఎన్కౌంటర్ అంతకంటే పెద్ద సంచలనంగా మారింది. అత్యాచార నిందితుల్లో భయం పుట్టాలంటే తెలంగాణ పోలీస్ తరహా పనిచేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ‘సాహో.. సజ్జనార్’అంటూ నినాదం హోరెత్తుతోంది. విమర్శలు పోయి ప్రశంసలు.. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ‘దిశ’ఘటన జరిగి ఉండకపోయేదని కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం స్పందించలేదని, సీఎం ఆలస్యంగా స్పందించారని, హోంమంత్రి అభ్యంతరకరంగా మాట్లాడారని.. ఇలా ఒక టే విమర్శల దాడి. కానీ శుక్రవారం తెల్లవారుజామునే పరిస్థితి మారిపోయింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ పోలీ సులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను తెగపొగిడేస్తు న్నారు. కొన్ని చోట్ల ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసిన ఫొటోలు షేర్ చేస్తున్నా రు. సజ్జనార్ పేరు మారుమోగటంతో చాలామంది ఆయన వివరాల కోసం ఆన్లైన్లో వెతుకుతున్నా రు. ఆయన పిస్టల్ పట్టు కుని ఉన్న ఫొటో ప్రధానంగా కనిపిస్తోంది. ఇదీ సజ్జనార్ నేపథ్యం.. కర్ణాటకలోని దావణగెరె ప్రాంతానికి చెం దిన సజ్జనార్.. ధార్వాడ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సజ్జనార్.. ఉమ్మడి ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యారు. జనగాం ఏఎస్పీగా, నల్లగొండ, మెదక్, కడప, గుంటూరు, వరంగల్ జిల్లా లతో పాటు సీఐడీలో ఎస్పీ గా పని చేశారు. డీఐజీగా, ఐజీగా పదోన్నతులు పొం ది వివిధ విభాగాల్లో కీలక విధులు నిర్వర్తించారు. ఎవరినీ వదల్లేదు.. అసాంఘిక శక్తులపై మాత్రమే కాదు తీవ్రవాదులు, ఉగ్రవాదులు సైతం ఆయన తూటాలకు నేలకొరిగారు. డీఐజీగా పదోన్నతి పొందిన తర్వాత మావోయిస్టు వ్యతిరేక నిఘా విభాగమైన ఎస్ఐబీలో పనిచేశారు. ఐజీ అయ్యాక కూడా అక్కడే కొనసాగుతూ ఉగ్రవాద వ్యతిరేక నిఘా విభాగమైన కౌం టర్ ఇంటెలిజెన్స్ సెల్‌కు ఇన్చార్జ్గా పనిచేశారు. ఐజీ హోదాలో గతేడాది సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా బదిలీపై వచ్చారు. మూడు ఎన్కౌంటర్లు.. సజ్జనార్ ఎస్పీ హోదాలో ఉండగా రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ హోదాలో ఉండగా.. దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఈ మూడు కేసుల్లో కూడా ప్రధానంగా బాధితుల ‘కాల్చివేత’లే మూలంగా ఉన్నాయి. మెదక్ ఎస్పీగా పని చేస్తుండగా బిక్కు అనే గంజాయి స్మగ్లర్‌ను మట్టుపెట్టారు. తన వ్యవహారాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను పెట్రోల్ పోసి కాల్చేసిన బిక్కు ఆపై పోలీసుల కాల్పుల్లో మృత్యువాత పడ్డాడు. సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి జరిగింది. ఆ నిందితులు కూడా ఎన్కౌంటర్లోనే చనిపోయారు. ఇప్పుడు దిశ కేసులో కూడా బాధితురాలిపై పెట్రోల్ పోసి కాల్చేసిన నలుగురూ కస్టడీలో ఉండగా ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. ఎన్‌కౌంటర్‌తో దిశకు న్యాయం జరిగిందంటూ శుక్రవారం కరీంనగర్‌లోని గీతాభవన్ చౌరస్తాలో వివిధ కళాశాలల విద్యార్థుల హర్షాతిరేకాలు ఆయనది కీలకపాత్ర.. గ్యాంగ్‌స్టర్ నయీం ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన వారిలో సజ్జనార్ కూడా ఉన్నా రు. ఈయన హయాంలో కొనాపురి రాము లు, సాంబశివరావులు వంటి కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌కు ఇన్చార్జ్గా ఉండగా.. హుజీ, జేకేహెచ్, జేకేబీహెచ్ తదితర మా డ్యుల్స్కు చెందిన ఉగ్రవాదులు అరెస్టయ్యా రు. ఘరానా మోసాలకు పాల్పడే వైట్ కాలర్ నేరగాళ్లు కూడా ఈయన పేరుకు వణికిపోతారు. నల్లగొండ ఎస్పీగా ఉండగా అయస్కాంత పరుపుల పేరుతో జరిగిన జపాన్ లైఫ్ స్కామ్‌కు చెక్ చెప్పడంతో మొ దలు పెట్టిన సజ్జనార్ సీఐడీలో ఉండగా ఆమ్వే సంస్థ పైనా చర్యలు తీసుకున్నారు. ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నాం త్రేతాయుగంలో రావణుడు, ద్వాపర యుగంలో దుశ్శాసనుడు మన ఆడబిడ్డలను కేవలం ఎత్తుకెళ్లారు. కానీ ఈ యుగంలోని రాక్షసులు మన సీతలు, ద్రౌపదులను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి తగలబెడుతున్నారు. అలాం టప్పుడు రాముడు, కృష్ణుడిలా మారకుండా ఎంతకాలమని వారిని పూజిస్తూ ఉంటాం.– కైలాశ్ సత్యార్థి, నోబెల్ బహుమతి గ్రహీత దిశ ఘటనలో తప్పించుకొనేందుకు యత్నించిన నిందితులను ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసులు చేసిన ప్రకటనను విశ్వసిస్తున్నా. రాష్ట్రంలో ఫామ్‌హౌస్ సీఎం, డమ్మీ హోం మినిస్టర్ ఉన్నా పోలీసులు మాత్రం బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నారు. – అరవింద్, ఎంపీ దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడం శుభపరిణామం. దేశంలో మహిళలపై ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా ఇదే శిక్ష వేయాలి. తెలంగాణ పోలీసులను ఎంతోమంది తిట్టారు. అందులో నేనూ ఒకడిని. నిందితులను ఎన్కౌంటర్ చేసినందుకు పోలీసులకు హాట్సాఫ్. పోలీసులు ఇలా వ్యవహరిస్తేనే మహిళలపై దాడులు ఆగుతాయి. – బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిందితులను ఉరితీయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలన్న ప్రజల డిమాండ్ నెరవేరినందుకు సంతోషిస్తున్నా. నిందితులపై సత్వర చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు. దిశ నిందితుల ఎన్కౌంటర్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. అవి చూసి దిశ లాంటి ఘటనలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. – కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కేసీఆర్ సార్‌కు శతకోటి వందనాలు. మీ మౌనం ఎంత భయంకరంగా ఉంటుందో మీ రియాక్షన్ అంతకంటే భయంకరంగా ఉంటుంది. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని నిరూపించారు. –టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.చందర్ పోలీసు ఎన్కౌంటర్లను సీపీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని, అయితే ప్రత్యేక కేసుగా భావిస్తూ దిశ నింది తుల ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నా. దిశపై హత్యాచార నింది తులపై దేశవ్యాప్తంగా ప్రజలు స్పందించారు. రోడ్లపైకి వచ్చి వారిని కాల్చి చంపాలనే డిమాండ్ వచ్చిన విషయం కూడా గుర్తుంచుకోవాలి. –సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఇలాంటి ఘటనల్లో నిర్దిష్ట కాలపరిధిలో దోషులకు వేగంగా శిక్షపడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. దిశ ఘటనలో దోషులకు కఠినశిక్ష పడాల్సిందే. ఇటీవల కొమురం భీం జిల్లాలో దళిత మహిళపై జరిగిన హత్యాచారం, వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న మానభంగం, హత్య ఘటనలపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. – సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి దిశ అత్యాచారం, హత్య చేసిన వారికి సరైన శిక్ష పడింది. దీనికి స్వాగతిస్తున్నాం. సత్వర న్యాయం చేశారని భావిస్తున్నాం. ఇకపై రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హత్యాచారం చేసిన వారికి వెంటనే శిక్ష అమలయ్యేలా చట్టాలను మరింత కఠినంగా మార్చాలి. చట్టం తన పని తాను చేసుకుపోయిందని భావిస్తున్నాం. – గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు దిశ నిందితులకు ఎన్కౌంటర్ ద్వారా తగిన శాస్తి జరి గింది. పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి నిందితులకు శిక్షపడేలా చేసి వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు. శాంతిభద్రతలు కాపాడటంలో రాష్ట్ర పోలీసులు భేష్ అని రుజువైంది. – టీఎన్జీవో, రాష్ట్ర ఎంప్లాయిస్ అసోసియేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా టేకు లక్ష్మి, మానస సంఘటనల నిందితులను ఉరితీసి చూపించాలి. రాష్ట్రంలో దళిత, బహుజన వర్గాల పట్ల వివక్ష జరుగుతోంది. దిశ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం నిందితులను చంపడం మంచి విషయమే కానీ, అది రాజ్యాంగబద్ధంగా జరిగి ఉంటే బాగుండేది. ఉరిశిక్ష పడే అవకాశమున్న నిందితులను ఎన్కౌంటర్ చేయడం దేనికి సంకేతమో చెప్పాలి. – చెరుకు సుధాకర్, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిశ హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే హాజీపూర్ నిందితున్ని కూడా కఠి నంగా శిక్షించాలి. మానవ మృగాలకు ఎన్కౌంటర్ ఒక గుణపాఠంగా మారుతుంది. దిశ, వరంగల్ హంతకుల మాదిరి గానే దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎన్కౌంటర్ సరికాదు.. ఎన్కౌంటర్లకు నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. నిందితులు పోలీసుల కస్టడీలో ఉండగానే ఈ ఎన్కౌంటర్ అయింది. దీనిపై మెజీస్టీరియల్ విచారణ జరగనుంది. అజ్మల్ కసబ్ లాంటి ఉగ్రవాది కేసులు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ కేసులో ఎందుకు అలా జరగలేదు. – అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ పార్టీ నిర్ణయం వచ్చే వరకు ఎన్‌కౌంటర్‌పై స్పందించం. ఇది ఎమోషన్‌గా మాట్లాడే అంశం కాదు. చట్టం పని న్యాయస్థానం చేయదు. న్యాయస్థానం పని చట్టసభలు చేయవు. అత్యాచార నిందితులను ఎవరు వెనకేసుకురారు. ఏ వ్యవస్థ చేయాల్సిన పని.. ఆ వ్యవస్థ చేయాలి. ఈ ఎన్‌కౌంటర్‌తో సమస్య పరిష్కారం అయితే ఇబ్బంది లేదు. గతంలో ఎన్కౌంటర్ జరిగాక అత్యాచారాలు ఆగిపోయాయా. నాకున్న అనుమానాలపై శనివారం ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిస్తా.. – కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి -
నా కూతురి కేసులో అసలు తీర్పే రాలేదు
ప్రత్యూష ఉదంతం 2002, ఫిబ్రవరిలో జరిగింది. పదిహేడేళ్లు పూర్తయ్యాయి. న్యాయం కోసం పోరాటం సాగుతూనే ఉంది. న్యాయం ఎప్పటికి వస్తుందో తెలియదు. కేసు సుప్రీం కోర్టులో డబుల్ బెంచ్‌లో ఉంది. ఈ ఏడాది మేలో ఒకసారి బెంచ్ మీదకు వచ్చింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి తరఫు న్యాయవాది మరణించడంతో మరికొంత జాప్యం చోటు చేసుకుంది. మళ్లీ టేబుల్ మీదకు ఎప్పుడు వస్తుందోనని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఎదురు చూస్తున్నారు. ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ‘సాక్షి’ ఆమెను పలకరించింది. ‘‘దిశ సంఘటనలో చోటు చేసుకున్న పరిణామాలు చూసినప్పుడు కడుపుకోతకు గురైన మాలాంటి తల్లులకు మాత్రం ఇదే సరైంది... అనిపిస్తుంది. ‘దుష్ట శిక్షణ జరిగింది’ అనే భావన మహిళలకు మనోనిబ్బరాన్నిచ్చింది కూడా. కానీ శిక్ష ఎప్పుడూ న్యాయపరిధిలోనే ఉండాలి. ఇలాంటి కేసుల్లో శిక్ష ఎప్పుడూ కఠినంగానే ఉండాలి. మరొకరు నేరానికి పాల్పడేటప్పుడు శిక్ష గుర్తుకు వచ్చి భయపడేలా ఉండాలి. దిశ సంఘటన జరిగిన ఈ కొద్ది రోజుల్లోనే నిందితులు సమాధి అవుతున్నారు. ఆమె ఆత్మ శాంతించి ఉంటుంది. అలాంటి శాంతి ప్రత్యూష ఆత్మకు ఎప్పుడు కలుగుతుందో ఏమో? నిర్భయ కేసులో న్యాయస్థానం సత్వరం స్పందించి తీర్పునిచ్చింది. కానీ ఆ తీర్పును అమలు చేయడంలో జాప్యం చేస్తోంది. ప్రత్యూష కేసులో ఇంకా తుది తీర్పు వెలువడనే లేదు. ఎప్పుడైనా సరే... ఒక ఆడపిల్ల విషయంలో... అది కూడా అత్యాచారం హత్య జరిగినప్పుడు న్యాయస్థానాలు వీలయినంత త్వరగా విచారణ పూర్తి చేసి తీర్పునివ్వాలి. ఆలస్యం జరిగే కొద్దీ కేసు తీవ్రత తగ్గిపోతుంటుంది. కేసు పలుచబడిపోతుంటుంది. అవకాశవాదుల చేతుల్లో సాక్ష్యాలు తారుమారయిపోతుంటాయి. దాంతో శిక్షలు నామమాత్రంగా మారిపోతుంటాయి. సిద్ధార్థ కేసులో కూడా ఒక కోర్టు విధించిన శిక్షను∙మరొక కోర్టు తగ్గించింది. విచారణ ఆలస్యం జరగడం కూడా ఇందుకు ఒక కారణమే. తొమ్మిది నెలల పాపాయి మీద అత్యాచారం చేసిన నిందితుడికి ఒక కోర్టు మరణ శిక్ష విధిస్తే, పై కోర్టు ఆ శిక్షను సవరించి జీవితఖైదుగా మార్చింది. ఈ సందర్భంగా నాది మరొక విన్నపం. ఆడపిల్లలకు అన్యాయం జరిగిన కేసుల విషయంలో న్యాయవాదులు స్వీయ నియంత్రణ పాటించాలి. అమ్మాయి మీద అత్యాచారం జరిగిందనేది వాస్తవం, హత్య జరిగిందనేది వాస్తవం. నిందితుల తరఫున వాదిస్తూ రెండు వాస్తవాలను అవాస్తవాలుగా నమ్మించే ప్రయత్నం చేసే ముందు దయచేసి ఒక్కసారి ఆలోచించండి. న్యాయవాదులందరూ కలిసి మన చట్టాలను పటిష్టం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మాలాంటి బాధిత కుటుంబాలకు న్యాయపోరాటంలో ప్రభుత్వం కూడా అండగా ఉండాలి. బలవంతులతో న్యాయపోరాటం చేయాల్సి వచ్చినప్పుడు బలహీనులు అడుగడుగునా ఎదురీదాల్సి వస్తోంది. అందుకు నేనే ఉదాహరణ’’. -
ఎన్‌కౌంటర్‌పై స్పందించిన దిశ తల్లిదండ్రులు
సాక్షి, హైదరాబాద్ : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. దిశని కాల్చిన చోటే నిందితులని ఎన్కౌంటర్ చేయడంతో తమ బిడ్డకు తగిన న్యాయం జరిగిందని, నిందితులకు తగిన శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎన్కౌంటర్ జరిగిన సమాచారం తెలుసుకుని ... సంఘటనా స్థలానికి స్థానికులు భారీగా తరలి వస్తున్నారు. చటాన్‌పల్లి బ్రిడ్జ్ వద్దకు చేరుకున్న స్థానికులు...పోలీసులు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... నిందితులను ఎన్కౌంటర్ చేసి మంచి పని చేశారంటూ పోలీసులు, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభిప్రాయాన్నే పోలీసులు అమలు చేశారని అభిప్రాయపడ్డారు. సీఎం జిందాబాద్, పోలీసులు జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దిశ కేసు వివరాల్లోకి వెళితే.... నవంబర్ 27న దిశపై అత్యాచారం, హత్య దిశను దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులు నవంబర్ 28న నిందితులు అరెస్ట్ నవంబర్ 29న షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో నిందితుల విచారణ నవంబర్ 30న నిందితులకు జ్యుడిషియల్ కస్టడీ, జైలుకు తరలింపు డిసెంబర్ 4న నిందితులను పోలీస్ కస్టడీకి ఇచ్చిన షాద్ నగర్ కోర్టు డిసెంబర్ 5న నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నిన్న చర్లపల్లి జైలులో నలుగురు నిందితులను విచారణ చేసిన పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున నిందితుల ఎన్కౌంటర్ నిందితులను కస్టడీకి ఇచ్చిన మరుసటి రోజే ఎన్కౌంటర్ చదవండి: దిశ నిందితుల ఎన్కౌంటర్ దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్.. -
దిశ నిందితుల ఎన్కౌంటర్
సాక్షి, షాద్‌నగర్ : ‘దిశ’ నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. కాగా గత నెల 27న వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద కాల్చివేశారు. దిశ కేసులో నిందితులను నిన్న (గురువారం) పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా .... దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు నిందితులను తీసుకు వెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా... వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు దాడికి యత్నించారు. దీంతో వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ప్రధాన నిందితుడుఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ఘటనలో విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు అనుమతితో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ 3వ తేదీతో న్యాయ శాఖ ఉత్తర్వులు (జీవో ఆర్టీ నంబర్ 639) జారీ చేసింది. -
ఘటనాస్థలికి ‘దిశ’ నిందితులు!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసులో బుధవారం సాయంత్రం నుంచి అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. ఇప్పటికే పోలీసుల నిర్లక్ష్యం జరిగిందంటూ విమర్శలు రావడంతో నిందితులను షాద్‌నగర్ కోర్టు కస్టడీకి ఇచ్చిన విషయాన్ని లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ విషయంలో షాద్ నగర్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, డీజీపీ కార్యాలయాలు అత్యంత గోప్యత పాటిస్తున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలు, ప్రచారంపై పోలీసులు ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు. నలుగురు నిందితుల కస్టడీపై తమకు కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. మొబైల్‌ను తవ్వి తీయించారు అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చర్లపల్లి జైలు నుంచి రహస్యంగా పోలీసులు తరలించారు. తొలుత తొండుపల్లి టోల్గేట్ ప్రాంతంలో ఘటనాస్థలానికి నిందితులను తీసుకెళ్లారు. అక్కడ లారీ నిలిపిన స్థలం, మద్యం తాగిన ప్రాంతాలను పరిశీలిం చారు. దిశను ముందు చూసిందెవరు? అత్యాచారం ఆలోచన ముందు ఎవరికి వచ్చింది?.. తదితర వివరాలు తెలుసుకున్నారు. పంక్చర్ చేసిందెవరు? స్కూటీ బాగు చేయించేందుకు ఏ షాప్‌కు వెళ్లారు? దిశను ఎత్తుకెళ్లిన ప్రాంతాన్ని నిందితులు పోలీసులకు చూపించారు. అత్యా చారం జరిగిన ప్రాంతానికి సమీపంలో పాతి పెట్టిన దిశ మొబైల్‌ను నిందితులతోనే తవ్వి తీయించారు. అక్కడి నుంచి దిశ మృతదేహాన్ని క్యాబిన్లో ఎలా వేసుకుని వెళ్లారు? ఎవరెవరు సాయం చేశారు? నవీన్, శివ పెట్రోల్ కొన్న బంకులు కూడా చూపించారు. ఇక షాద్‌నగర్ వైపు వెళ్లిన తర్వాత వెనక్కి రావడం, చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద మృతదేహాన్ని దహనం చేసేవరకు జరిగిన ఉదంతాన్ని నిందితులు పోలీసులకు కళ్లకు కట్టారు. శవాన్ని ఈడ్చుకెళ్లిన దుండగులు.. చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద లారీని నిలిపిన నిందితులు మృతదేహాన్ని క్యాబిన్ నుంచి దించారు. వారే మోసుకెళ్లి బ్రిడ్జి కింద ఒక మూలకు ఈడ్చుకెళ్లినట్లు పోలీసులకు వివరించినట్లు తెలిసింది. తొండుపల్లి వద్ద ఘటనాస్థలంలోనే దిశ చనిపోయినా.. ఇంకా దిశ బతికే ఉండొచ్చన్న అనుమానంతో ఆనవాళ్లు కూడా దొరక్కుండా వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో పాటు, లారీ నుంచి డీజిల్ తీసి దహనం చేసిన విధానాన్ని చూపారు. ఆ మంటల్లోనే దిశ సిమ్ కార్డులు వేసినట్లు వివరించారు. మరోసారి లారీ పరిశీలన చటాన్‌పల్లి నుంచి నేరుగా క్లూస్ టీం షాద్‌నగర్‌లో ఉన్న లారీ వద్దకు వెళ్లి మరోసారి ఆనవాళ్లు సేకరించింది. స్థానిక ఆర్టీసీ డిపోలో నిలిపి ఉంచిన లారీ క్యాబిన్లో ఆధారాలు సేకరించింది. రక్తపు మరకలు, వెంట్రుకలు, వేలిముద్రలు, బ్లాంకెట్ పోగులు తదితర ఆనవాళ్లు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో మొత్తం 50 మంది పోలీసులు పాలుపంచుకుంటున్నట్లు వినికిడి. మొత్తం 7 బృందాలను సీపీ సజ్జనార్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నలుగురు అదనపు ఎస్పీ స్థాయి అధికారులు ఈ బృందాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విభజించి దర్యాప్తు.. 20 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేయాలన్న గడువు విధించుకోవవడంతో.. కేసును విభజించి దర్యాప్తు చేస్తున్నారు. డీఎన్ఏ, శరీర స్రావాల విశ్లేషణ, ప్రత్యేక సాక్షుల నుంచి వివరాల సేకరణ, సాంకేతిక ఆధారాలైన సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఫుటేజీ, లారీ, వాహనాల టైర్ల మార్కుల సేకరణ, లీగల్ ప్రొసీడింగ్స్ ఇలా ప్రతి పనిని విభజించి ఆయా బృందాలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ ఏడు బృందాలకు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. కేసు వివరాలను ఎప్పటికపుడు సజ్జనార్ తెలుసుకుంటున్నారని సమాచారం. పైకోర్టుకు వెళ్లినా.. ఉరి పడాల్సిందే ఈ కేసులో ప్రత్యక్ష సాక్షుల కన్నా.. సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలే కీలకం కానున్నాయి. ఘటన జరిగిన ప్రాంతంలో మనుషుల సంచారం లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఘటనను నేరుగా చూసిన వారు లేకపోవడంతో ఈ కేసులో నిందితుల పాత్ర నిరూపించడం పోలీసులకు సవాలుగా మారింది. దిశ కేసు నేపథ్యంలో దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తుతుండటంతో తెలంగాణ పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దీంతో నిందితులకు ఉరిశిక్ష పడేలా.. పైకోర్టుకు వెళ్లినా.. శిక్షలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోకుండా అత్యంత పకడ్బందీగా సాక్ష్యాలు సేకరిస్తున్నారు. వరంగల్ కేసులా కాకుండా.. వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై లైంగికదాడి, హత్య కేసులో కూడా ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. కానీ, కేసులో నిందితుడి పాత్ర నిరూపించడంలో పోలీసులు సఫలమయ్యారు. తొలుత ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. అయితే నిందితుడు పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన కోర్టు.. అత్యంత అరుదైన కేసుల్లోనే ఉరి శిక్ష విధించాలంటూ.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ.. తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ‘దిశ’కేసును దర్యాప్తు చేస్తున్న బృందం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వరంగల్ పోలీసుల సలహాలు తీసుకున్నట్లు సమాచారం. దిశ కేసు అత్యంత అరుదైనది కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులు పైకోర్టుకు వెళ్లినా.. శిక్షలో మార్పు లేకుండా చూడాలన్న పట్టుదలతో పోలీసులు పనిచేస్తున్నారు. గొర్రెల కాపరి, కానిస్టేబుల్ సమయ స్ఫూర్తి.. బాధితురాలి మృతదేహం కాలిపోతుండగా చూసిన గొర్రెల కాపరి, అతడిచ్చిన సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి వెళ్లిన కానిస్టేబుల్ వెంటనే స్పందించడంతోనే పోలీసులు బాధితురాలిని గుర్తించడం సాధ్యమైంది. ఆధారాల సేకరణ కూడా వేగంగా జరిగింది. ఈ ఇద్దరూ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే దర్యాప్తు సాఫీగా సాగుతోందని చెప్పుకోవచ్చు. మాకెలాంటి ఆదేశాలు రాలేదు.. దిశ కేసు దర్యాప్తు విషయంలో గురువారం ఉదయం నుంచే రకరకాల కథనాలు, విశ్లేషణలు జరుగుతున్నా.. పోలీసులు మాత్రం తమకు కోర్టు నుంచి ఇంకా కస్టడీ ఆదేశాలు రాలేదని స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఈ విషయంలో వివరణ అడిగేందుకు మీడియా ప్రతతినిధులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. -
దిశ ఫోన్‌ను పాతిపెట్టిన నిందితులు
సాక్షి, హైదరాబాద్ : మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వాలు, పోలీసులు అనుసరిస్తున్న తీరుకు సవాలుగా నిలిచిన దిశ అత్యాచారం, హత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన షాద్‌నగర్ దిశ కేసు దర్యాప్తును సైబరాబాద్ పోలీసులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఏడు బృందాలు రంగంలోకి దిగి సాక్ష్యాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో దిశ కేసులో కీలకంగా మారిన ఆమె సెల్‌ఫోన్‌ను నిందితులు పాతిపెట్టినట్లుగా గుర్తించినట్లుగా సమాచారం. దీంతో మరిన్ని ఆధారాల కోసం ఘటనాస్థలంలో క్లూస్ టీం మరోసారి తనిఖీలు చేపట్టింది. బాధితురాలి ఫోన్ లభ్యమైన నేపథ్యంలో ఆమె కాల్ లిస్టు, కాల్ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా దిశపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హత్య చేసిన నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొచి విచారించేందుకు డీసీపీ ప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో విచారణ బృందం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ బృందం ఇప్పటికే మహ్మద్ ఆరిఫ్, నవీన్, శివ, చెన్నకేశవులును అదుపులోకి తీసుకొని.. విచారణను కొనసాగిస్తుంది. ఇక మిగిలిన పోలీసు బృందాల్లో ఒక బృందం సాక్ష్యాలను సేకరించనుండగా.. మరో బృందం ఫోరెన్సిక్ , డీఎన్ఏ ఆధారాలను పరిశీలించనుంది. ఇంకొక బృందం లీగల్ ప్రొసీడింగ్స్ సమర్థంగా చేపట్టేందుకు ఏర్పాటైంది. కేసులో ప్రధానంగా ఉన్న ప్రత్యక్ష సాక్షుల విచారణ, ఐడెంటిఫికేషన్ పరేడ్ కోసం మరొక టీమ్ రంగంలోకి దిగింది. -
రంగంలోకి ఏడు బృందాలు.. నెలలోపే చార్జ్‌షీట్
సాక్షి, హైదరాబాద్: యావత్ దేశాన్ని కుదిపేసి.. మహిళల భద్రతపై పెను సవాళ్లు విసిరిన దిశ అత్యాచారం, హత్య కేసు విచారణను సైబరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శరవేగంగా దర్యాప్తు జరిపి.. నెలరోజుల్లోపే ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా ఈ కేసులో ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేసేందుకు పోలీసులు ప్రత్యేకంగా ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఏడుగురు పోలీసులు ఉండనున్నారు. మొత్తం 50 మంది పోలీసులు దిశ కేసును విచారించనున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ మొదలు కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరూ ఇన్వెస్టిగేషన్తో తమవంతు పాత్ర పోషించనున్నారు. ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసేవరకు ఈ ఏడు పోలీసు బృందాలు పనిచేయనున్నాయి. చదవండి: దిశ కేసు: పోలీసు కస్టడీకి నిందితులు ఇక, దిశను అత్యాచారం చేసి, క్రూరంగా చంపేసిన నిందితులను కస్టడీలోకి తీసుకొచి విచారించేందుకు డీసీపీ ప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో విచారణ బృందం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ బృందం ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకొని.. విచారణను కొనసాగిస్తుంది. ఇక మిగిలిన పోలీసు బృందాల్లో ఒక బృందం సాక్ష్యాలను సేకరించనుండగా.. మరో బృందం ఫోరెన్సిక్ , డీఎన్ఏ ఆధారాలను పరిశీలించనుంది. ఇంకొక బృందం లీగల్ ప్రొసీడింగ్స్ సమర్థంగా చేపట్టేందుకు ఏర్పాటైంది. కేసులో ప్రధానంగా ఉన్న ప్రత్యక్ష సాక్షుల విచారణ, ఐడెంటిఫికేషన్ పీరియడ్ కోసం మరొక టీమ్ రంగంలోకి దిగింది. కేసులో కీలకం కానున్న సీసీటీవీ కెమెరా దృశ్యాల వీడియో అనాలసిస్, టెక్నీకల్ ఎవిడెన్స్ అనాలసిస్‌కు ఇంకొక టీమ్ పనిచేస్తోంది. సీన్ టు సీన్ అనాలసిస్ , క్రైమ్ సీన్ రికన్స్ట్రక్షన్ కోసం మరో టీమ్ రంగంలోకి దిగింది. మొత్తానికి ఈ ఏడు బృందాలు సమన్వయంతో పనిచేస్తూ... సత్వరమే ఆధారాలు సేకరించి.. సాక్ష్యాలు క్రోడీకరించే సమగ్రంగా నెలరోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడంతో నెలరోజుల్లోపు విచారణ జరిగి దోషులకు శిక్షలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. -
దిశ కేసు: పోలీసు కస్టడీకి నిందితులు
సాక్షి, హైదరాబాద్: దిశ అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను పోలీసులు తొలిరోజు కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. వారం రోజులపాటు నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ షాద్‌నగర్ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా నిందితుల సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. జైల్లోనే నిందితులకు వైద్య పరీక్షలు చేసినట్టు తెలుస్తోంది. నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు గురువారం తెల్లవారుజామున 3.45 గంటలకు నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి.. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణను తర్వితగతిన పూర్తి చేయడానికి ఇప్పటికే ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసిన నేపథ్యంలో వీలైనంత తర్వగా నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి లారీలో దొరికిన ఆధారాలను ఇప్పటికే ఫొరెన్సిక్ ల్యాబ్‌కు అధికారులు పంపించారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ (ఎఫ్ఎస్ఎల్) నివేదిక కీలకం కానుంది. చదవండి: రంగంలోకి ఏడు బృందాలు.. నెలలోపే చార్జ్‌షీట్ కస్టడీలోకి తీసుకున్న నిందితులను విచారించేందుకు శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. నలుగురు అదనపు ఎస్పీ స్థాయి అధికారులు ఈ కమిటీలో ఉన్నారు. నిందితులను విచారించడం, శాస్త్రీయ ఆధారాల సేకర, ఫొరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదికలు తెప్పించడం తదితర అంశాలపై కమిటీ దృష్టి సారించింది. దిశ కిడ్నాప్, రేప్, హత్య తదితర కేసులన్నింటినీ ఈ కమిటీ నేతృత్వంలో పలు బృందాలు విచారించనున్నాయి. దిశను ఎలా ట్రాప్ చేశారు? వారం రోజుల కస్టడీలో భాగంగా నిందితులను విచారించి.. వారి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసుకోనున్నారు. ఈ విచారణ సందర్భంగా నిందితుల దగ్గరికి నుంచి కీలక ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. హత్యాచారం, హత్య జరిగిన సంఘటన స్థలానికి నిందితులను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. సీన్ టూ సీన్ మొత్తం వివరాలను నిందితుల నుంచి పోలీసులు రాబట్టనున్నారు. దిశ మొబైల్‌ను ఏం చేశారనే నిందితులను ప్రశ్నించనున్నారు. దిశను ఎలా ట్రాప్ చేశారు, అత్యాచారం, హత్య చేసి అనంతరం ఎందుకు దిశ శరీరాన్ని తగలబెట్టారనే వివరాలు క్షుణ్ణంగా నిందితుల నుంచి తెలుసుకోనున్నారు. ఈ దారుణమైన సంఘటనకు ముందు నిందితులు మద్యం సేవించారా అనేది కూడా పోలీసులు తెలుసుకోనున్నారు. నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించడంతోపాటు దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను ఏ ప్రదేశంలో విచారిస్తారనే దానిపై పోలీసులు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. పోలీసుల కస్టడీ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలు వద్ద ఎలాంటి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా సెక్షన్ 144ను విధించారు. ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు దిశ కేసులో దోషులను త్వరితగతిన తేల్చేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. జస్టిస్ ఫర్ దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు హైకోర్టు ఆమోదముద్ర వేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు వీలుగా బుధవారం రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ మొదటి అదనపు సెషన్స్ జిల్లా జడ్జి కోర్టును ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజువారీగా ‘దిశ’కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించి సత్వరం తీర్పు వెలువరించనుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు కావడం ఇది రెండోసారి. ఇటీవల వరంగల్ జిల్లాలో 9 నెలల పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఈ కేసులో సత్వర విచారణ జరిపిన కోర్టు 56 రోజుల్లో తీర్పు చెప్పింది. నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేసింది. -
మరే తల్లి, తండ్రికీ ఈ వేదన మిగలకూడదు
నిర్భయకు ముందు .. తర్వాతా ఎలాంటి మార్పూ రాలేదు అమ్మాయిల గౌరవ మర్యాదలకు సంబంధించి! నిర్భయ తాలూకు ప్రకంపనలు పార్లమెంట్ ఆవరణను తాకినా ఇంటా, బయటా ఎక్కడా మహిళలకు భద్రత లేదు! ముంబైలో తెలుగు అమ్మాయి ఎస్తర్ అనూహ్య, హాజీపూర్‌లో అక్కాచెల్లెళ్లు, వరంగల్‌లో తొమ్మిదినెలల పాప, నిన్నటికి నిన్న మానస, టేకుల లక్ష్మి, దిశ.. పసిపిల్ల దశ నుంచే రక్షణ కరువు! తన బిడ్డను పోగొట్టుకున్న బాధ తెలిశాక ఇంకే బిడ్డా ఇలాంటి ఘోరానికి బలికావద్దు.. మరే తల్లి, తండ్రికీ ఈ వేదన మిగలకూడదు అనుకున్నాడు ఎస్తర్ అనూహ్య తండ్రి.. ఎస్.జి.ఎస్ ప్రసాద్. దిశ సంఘటన నేపథ్యంలో తాము మింగిన విషాదాన్ని గుర్తు చేసుకుంటూ.. సమాజానికి ఈ విశ్రాంత అధ్యాపకుడు చేస్తున్న విన్నపం ఆయన మాటల్లోనే... ‘‘దిశ ఇన్సిడెంట్ గురించి కంప్లయింట్ ఇవ్వడానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు స్టేషన్ కు వెళ్లడం, పోలీసుల ప్రవర్తన అన్నీ మా అమ్మాయి ఇన్సిడెంట్‌నే గుర్తుచేశాయి. 2014లో మాదీ ఇలాంటి విషాదమే. మా అమ్మాయి ముంబైలో టీసీఎస్‌లో వర్క్ చేసేది. సెలవుమీద డిసెంబర్లో మచిలీపట్టణం వచ్చిన.. జనవరి 4న (2014) మళ్లీ ముంబైకి బయలుదేరింది. అయిదో తారీఖు ఉదయం కల్లా చేరుకోవాలి. ఏడుగంటలకు తన సెల్‌కి కాల్ చేశా. రింగ్ అవుతోంది కాని రిప్లయ్ లేదు. అమ్మాయి రూమ్మేట్కీ ఫోన్ చేశా. ఇంకా చేరుకోలేదని చెప్పింది. మనసు కీడు శంకించి వెంటనే ముంబై వెళ్లాం. రైల్వే పోలీసులు.. ట్రాక్‌కి అవతల ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లమన్నారు. వెళ్లి కంప్లయింట్ ఇచ్చాం. ‘మిస్సింగ్ కేస్’గా నమోదు చేసుకొని.. ‘‘కనపడితే ఇన్ ఫామ్ చేస్తాం’’ అని చాలా నింపాదిగా చెప్పారు. పోలీసుల నుంచి దిశ పేరెంట్స్ ఎదుర్కొన్న ప్రశ్నలనే నాడు మేమూ ఎదుర్కొన్నాం. ‘‘ఏ ఫ్రెండ్‌తోనో వెళ్లుంటుంది’’ అని, ‘‘కంగారు పడకండి.. రెండు రోజుల్లో అమ్మాయి నుంచి మీకుఫోన్ వస్తుంది పెళ్లి చేసుకున్నట్టుగా..’’ అంటూ కామెంట్స్ చేశారు. ‘‘మా అమ్మాయితో మేం చాలా ఫ్రెండ్లీగా ఉంటామండీ.. అలాంటిదేదైనా ఉంటే మాతో చెప్పేంత చనువు తనకు ఉంది’’ అని చెప్పినా వాళ్ల తీరు మారలేదు. మా టెన్షన్ , భయాన్ని అర్థంచేసుకోలేదు, పట్టించుకోలేదు. టీసీఎస్‌లోని హయ్యరఫీషియల్స్ ఇన్వాల్వ్ అయితేనే రెస్పాన్స్ వచ్చింది. అప్పటికీ మా బంధువులు, స్నేహితులు అందరూ రంగంలోకి దిగి మా అమ్మాయి సెల్ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేశారు. ఇలా అన్ని వైపుల నుంచి అన్నిరకాల సమాచారం తీసుకొని పోలీసులకు అందిస్తే అప్పుడు దాన్ని పట్టుకొని వాళ్లు ముందుకెళ్లారు. పదో రోజుకి మా అమ్మాయి దొరికింది! అప్పటికే మీడియా ప్రచారం, పొలిటికల్ ప్రెజర్ పెరిగి ఉండడం వల్ల ట్రయలప్పుడు మాత్రం చురుగ్గా కదిలారు. సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ తప్ప ఏమీ లేదు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు అయింది. యేడాదిలోగా నేరస్తుడికి శిక్ష పడింది. ఇంకా అమలు కాలేదు. స్టేషన్‌లోని ఎస్తర్ సీసీ ఫుటేజ్ దృశ్యం ►2014, జనవరి అయిదో తారీఖు తెల్లవారు జామున ముంబై, కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్‌లో దిగిన ఎస్తర్ అనూహ్య ఒక టూ వీలర్ ట్యాక్సీలో తన రూమ్‌కి బయలుదేరింది. పదో రోజున ముంబై శివార్లలో అస్థిపంజరమై కనిపించింది. డ్రాప్ చేస్తానని చెప్పిన ఆ టూ వీలర్ రైడర్ చంద్రభాన్ సానప్ ఆమె మీద లైంగిక దాడి, హత్య చేశాడని రుజువైంది. అతనికి మరణ శిక్ష ఖరారైంది. సున్నితంగా ఆలోచించరు ఎందుకు? పోలీసులు ఇంట్రెస్ట్ పెడితే తప్పకుండా చేయగలరు. అమ్మాయి కనపడట్లేదు అని తల్లిదండ్రులు కంప్లయింట్ ఇస్తే ఈ స్టేషన్ కాదు ఇంకో స్టేషన్ అని తప్పించుకోవడం ఎందుకు? ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినా.. జ్యురిస్ సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా రిపోర్ట్ తీసుకోవాలి అని స్పష్టంగా ఉంది కదా! సుప్రీం కోర్టే ఆర్డర్ ఇచి్చంతర్వాత కూడా ఈ కాలయాపన ఎందుకు? ఆడపిల్ల కనిపించకుండా పోయింది అనేది చాలా సీరియస్, సెన్సిటివ్ విషయం. ‘‘మీ అమ్మాయికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా?, లవ్ మ్యాటరా?, రెండ్రోజులాగి తనే వస్తుందిలెండి, పెళ్లిచేసుకొని మీకు ఫోన్ చేస్తుంది..’’ లాంటి ప్రశ్నలు అడగొచ్చా? బాయ్‌ఫ్రెండే ఉన్నాడనుకోండి, పెళ్లిచేసుకోవడానికే వెళ్లిందనుకోండి. పోలీసులు ముందు ప్రమాదాన్నయితే శంకించి జాడ తీయాలి కదా! సున్నితంగా ఆలోచించరెందుకు? ఫ్రెండ్లీ పోలీసే కాదు.. బాధ్యత గల పోలీసులూ కావాలి. ఏమైంది ఈ రోజు? మరో తల్లికి, తండ్రికి శోకం తప్ప ఏం మిగిలింది? నా బిడ్డ పోయినప్పుడు అనుకున్నాను.. ఇంకే పేరెంట్స్‌కీ ఇలాంటి అనుభవం ఎదురుకావొద్దు. మరే తల్లిదండ్రులకూ మా బాధ రాకూడదు అని. ఇప్పుడు దిశ వాళ్ల అమ్మానాన్నా అదే అనుకుంటున్నారు. నాడు నిర్భయ తల్లిదండ్రులూ అదే కోరుకున్నారు. కాని ఆగలేదు. దిశను తిరిగి తేలేం. ఆ అమ్మాయి తల్లిదండ్రుల బాధనూ తీర్చలేం. నిబ్బరంగా ఉండండి అని చెప్పడం తప్ప ఏం చేయగలుగుతున్నాం? కోపంగా, ఆవేశంగా కాదు... మాకు జరిగిన దారుణం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఇలాంటివెన్నో వింటున్నాం. అమ్మాయిలు బాగా చదివి, జీవితంలో చక్కగా స్థిరపడాలని కోరుకోవడం తప్పు కాదుకదా! ఆడపిల్లలు మగపిల్లలతో పోటీపడి ముందుండాలనుకోవడమూ పొరపాటు కావొద్దు కదా! ఇవన్నీ చూస్తుంటే ఆడపిల్లలను మళ్లీ గడపకే పరిమితం చేస్తారేమోననే దిగులు. ఓ బిడ్డను పోగొట్టుకున్న తండ్రిగా ఈ సమాజానికి నాదొక్కటే విన్నపం.. ఆడపిల్లల్ని బతకనిద్దాం. మనం సంట్రేట్ చేయాల్సింది ఆడపిల్లల మీద కాదు. మగపిల్లల మీద, వాళ్ల పెంపకం, ప్రవర్తన మీద. మగపిల్లాడు ఏం చేసినా చెల్లుతుంది అనే భావన పెంచొద్దు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ సమానమే. ఇద్దరికీ ఒకే రెస్పెక్ట్ ఉండాలని తెలియచేయాలి. బాధను అనుభవించిన వాళ్లు చెబితే అర్థం అవుతుందని, అర్థం చేసుకుంటారని ముందుకొచ్చాను. ఒక అమ్మాయిని కోల్పోవడం ఆ కుటుంబానికే కాదు సమాజానికీ లోటే. ఒక అబ్బాయి నేరస్తుడవుతే ఇంటికే కాదు సమాజానికీ ప్రమాదమే! ఇలాంటి సంఘటనలు జరగగానే కోపం,ఆవేశం రావడం సహజమే. ఆ భావోద్వేగంలో నేరస్తులను పట్టుకొని నడిరోడ్డుమీద కొట్టాలి, చంపాలి అంటారు. నా బిడ్డ పోయినప్పుడు నాకూ అలాగే అనిపించింది. కాని ఇలాంటి ఆటవిక న్యాయం మరెన్నో ఘోరాలకు కారణమవుతుంది. మనకు చట్టాలున్నాయి. ఇలాంటి దారుణాలు మళ్లీ జరక్కుండా చూసే తీర్పులు కావాలి. అలాంటి చట్టాలు రావాలి. సత్వరంగా న్యాయం అందేలా ఉండాలి’’ అంటున్నారు మచిలీపట్టణంలోని నోబుల్ కాలేజ్ పొలిటికల్ సైన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా రిటైరైన ఎస్.జి.ఎస్.ప్రసాద్. -
దిశ కేసు: షాద్‌నగర్ కోర్టు కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ ఫర్ దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను వారం రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ షాద్‌నగర్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం నలుగురు నిందితులు చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. నిందితులను పోలీసులు గురువారం తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. తమ కస్టడీలో వారిని విచారించి.. కేసుకు సంబంధించి మరిన్ని కీలక వివరాలు రాబట్టనున్నారు. అయితే, నిందితులను మరోచోటుకు తరలించి విచారించాలా? లేక జైల్లోనే విచారించాలా? అనేదానిపై పోలీసులు తర్జనభర్జనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. దిశ హత్యాచారం కేసుపై తీవ్ర ప్రజాగ్రహం వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. నిందితులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. దిశను అమానుషంగా అత్యాచారం చేసి.. ఆపై చంపేసిన నలుగురు నిందితుల్ని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాగ్రహం దృష్ట్యా.. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశముండటంతో నిందితులు వేరే ప్రాంతానికి తరలించి విచారించే విషయంలో పోలీసులు వెనుకాముందు ఆడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జైల్లోనే నిందితులను విచారించి.. కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోనున్నట్టు సమాచారం. కస్టడీ విచారణలో భాగంగా భారీ భద్రత మధ్య నిందితులను సంఘటనాస్థలానికి తీసుకెళ్లి.. అక్కడ మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును హైకోర్టు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
నిందితులను మా కస్టడీకి ఇవ్వండి
సాక్షి, షాద్‌నగర్ టౌన్: ‘దిశ’ను అత్యాచారం, హత్య చేసిన నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సోమవారం షాద్‌నగర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉదయం కోర్టుకు వచ్చిన పోలీసులు ఇన్చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందుబాటులో లేకపోవడంతో కొద్ది సేపటికే వెళ్లిపోయారు. తిరిగి మధ్యాహ్నం కోర్టుకు వచ్చి పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను విచారించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాల్సి ఉందని, పది రోజుల కస్టడీ కావాలని పిటిషన్లో కోరినట్లు సమాచారం. కస్టడీపై కోర్టు తమ నిర్ణయాన్ని నేడు వెల్లడించనుంది. కాగా, నిందితులను చర్లపల్లి జైలు నుంచి షాద్‌నగర్ కోర్టుకు తీసుకొస్తున్నారన్న పుకార్లతో జనం పెద్ద ఎత్తున కోర్టు వద్దకు వచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిందితుల కస్టడీ పిటిషన్‌పై షాద్‌నగర్ కోర్టు నేడు తుది నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో పోలీసులు చర్లపల్లి జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిరసనలు, ఆందోళనకు అనుమతి లేదన్నారు. కాగా షాద్‌నగర్‌లో నిరసనలు అట్టుడుకుతున్నందున అవసరమైతే జైలులోనే ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించే అవకాశముంది. -
‘కేసీఆర్ గారు.. మీ పేరు మార్చుకోండి’
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనకు నిరసనగా ‘జస్టిస్ దిశ’ పేరుతో ఏబీవీపీ హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఎస్వీకే నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆలస్యం చేయకుండా నిందితులకు కఠిన శిక్షలు విధించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. దిశకు న్యాయం జరిగేవరకూ తమ ఉద్యమం ఆగదన్నారు. దిశ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి స్పందించిన తీరు దారుణంగా ఉందన్నారు. దిశ ఇంటికి ఫోన్ చేయాల్సింది కాదు, పోలీసులకు ముందు ఫోన్ చేయల్సిందని హోం మంత్రి అనడం సిగ్గు చేటన్నారు. ఫిర్యాదు ఇవ్వబోతే తమ పరిధిలోకి రాదని చెప్పడాన్ని బట్టే పోలీసులు ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతుందని విమర్శించారు. ‘చంద్రశేఖర్ ఆజాద్ లాంటి పేరు పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ .. ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారని, వెంటనే ఆయన పేరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమం మహిళల చేతిలోకి వెళ్లిందని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. -
దిశ కేసు: ఆరోజు పూర్తి వివరాలు తీసుకోలేదు!
సాక్షి, షాద్‌నగర్: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దిశ అత్యాచారం, హత్యకేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై షాద్‌నగర్ కోర్టు విచారణ చేపట్టింది. నిందితులను పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం విచారణ జరుగనున్న నేపథ్యంలో పోలీసులు షాద్‌నగర్ కోర్టుకు చేరుకున్నారు. 784 / 2019 క్రైమ్ నెంబరులో నిందితులను విచారించాలని పోలీసులు పిటిషన్లో కోరారు. అదే విధంగా ఈ కేసులో సమగ్ర విచారణ జరిపించాలని పేర్కొన్నారు. విచారణలో భాగంగా... నిందితుల దగ్గర నుంచి మరింత సమాచారం తెలుసు కోవాల్సిఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. దిశ కేసులో నిందితులను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించే రోజు వేలాది మంది పోలీస్ స్టేషనుకు చేరుకోవడంతో నిందితుల నుంచి పూర్తి వివరాలు తీసుకోలేదని తెలిపారు. కాబట్టి పది రోజులు కస్టడీకి అనుమతి ఇస్తే వారిని మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. ఘటనలో మిస్సయిన మొబైల్ ఫోన్ రికవరీ చేయాల్సి ఉందని.. అదే విధంగా నిందితుల స్టేట్మెంట్ రికార్డు చెయ్యాల్సి ఉందని పిటిషన్లో వెల్లడించారు. కాగా కస్టడీ పిటిషన్‌ను న్యాయమూర్తి పరిశీలిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో నిందితుల కస్టడీపై కోర్టు తన నిర్ణయం వెల్లడించనుంది. ఇదిలా ఉండగా... కోర్టు వద్ద న్యాయవాదులంతా దిశకు మద్దతు తెలిపారు. షాద్‌నగర్, మహబూబ్‌నగర్‌లో ఏ న్యాయవాది కూడా నిందితులకు న్యాయ సహాయం చేయకూడదని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఫర్ దిశకు ప్రతి ఒక్క న్యాయవాది మద్దతు ఇవ్వాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
‘ఆ కొడుకులు ఉన్నా ఒకటే.. పోయినా ఒక్కటే’
సాక్షి, నారాయణపేట: ‘ఇలాంటి కొడుకులను కన్నామా.. లోకమంతా అమ్మాయిని పాడు చేసి కాల్చారని చెబుతుంటే వినేందుకు గుండె జల్లుమంటుంది.. ఆ కొడుకులు ఉన్నా ఒకటే.. పోయినా ఒక్కటే..’ అంటూ జస్టిస్ ఫర్ దిశను దారుణంగా హత్య చేసిన వారికి ఏ శిక్ష పడినా బాధపడబోమని మహ్మద్‌పాషా, శివ, నవీన్‌కుమార్, చెన్నకేశవుల తల్లిదండ్రులు కన్నీరు పెట్టారు. మరో నిందితుడు అంటూ హల్చల్.. ‘జస్టిస్ ఫర్ దిశ’ హత్య కేసులో మరో నిందితుడు ఉన్నాడంటూ శనివారం సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఊట్కూర్ మండలంలోని చిన్నపొర్ల గ్రామానికి చెందిన వ్యక్తి ఉన్నరంటూ వదంతులు వచ్చాయి. దానిపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. ఆ మండల పోలీస్ బాస్ చిన్నపొర్లకు వెళ్లి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ అలాంటి వారు ఎవరూ లేరంటూ తెలింది. అయితే గుడిగండ్ల నవీన్‌కుమార్ చిన్నపొర్లలో వారి బంధువుల ఇంటా ఉండి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై తల్లి లక్ష్మిని ప్రశ్నించగా చిన్నపుడు చిన్నపొర్లలలో చదువుకున్నాడంటూ తెలిపింది. దేశమంతటా గుడిగండ్ల, జక్లేర్ మాటే.. జస్టిస్ ఫర్ దిశని హత్య చేసిన నిందితులు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్‌గ్రామాలకు చెందిన మహ్మద్‌పాషా, నవీన్‌కుమార్, చెన్నకేశవులు, శివలనే నిర్ధారణ అనంతరం పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు పంపారు. ఈ సంఘటన దేశమంతటా కలకలం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో జాతీయ మీడియా సైతం జస్టిస్ ఫర్ దిశ హత్యకు సంబంధించిన వార్త కథనాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో మారుమూల గ్రామాలైన గుడిగండ్ల, జక్లేర్ల పేర్లు దేశమందరి నోటా వినిపించినట్లయింది. రాయిచూర్ టూ హైదరాబాద్‌కు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు సైతం హత్యచేసింది ఇదే గుడిగండ్ల, జక్లేర్ గ్రామ యువకులంటూ చెప్పుకున్నారు. ఈ సంఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లు వెంటనే ట్విట్ చేశారు. దీంతో జాతీయ నేతలు సైతం స్పందించడంతో ప్రతి ఒక్కరి నోటా ఇదే మాటా వినిపిస్తుంది. నేను బతికున్నా.. సచ్చినట్లు అనిపిస్తోంది ఎప్పుడైతే పదో తరగతి ఫెయిల్ అయ్యాడో అప్పటి నుంచి నా కొడుకు గాడిదికిందపడేనప్పా.. అంటూ మహ్మద్‌పాషా అలీయాస్ ఆరీఫ్ తండ్రి హుస్సేన్ భార్య మౌలానీబీతో కలసి కన్నీరుపెట్టారు. ఏదో పెట్రోల్ బంకులో పనిచేస్తానంటే సరే అంటిమి.. లారీ డ్రైవర్లతో కూనమై హైదరాబాద్పాయే.. వాడు ఇంత లంగపనులు చేస్తాడని ఏ తండ్రి అనుకుంటాడో చెప్పండి. దునియాల చాలా మంది లారీ డ్రైవర్లుగా పనిచేస్తుండ్రు... కానీ ఇలా చేశారని నేను ఎక్కడ వినలేదబ్బా. నాకు ఒక బిడ్డా ఉంది. ఆ ఆడపిల్లను కాల్చిచంపిండు అని వినగానే నేను బతికున్నా సచ్చినట్లు అనిపిస్తోందబ్బా. నీ కొడుకు కేసు మీదా సంతకం చేయమని చెప్పి షాద్‌నగర్ పోలీసులు చెబితే శనివారం వెళ్లా. వారు ఇచ్చిన కాగితాలపై సంతకాలు పెట్టా. బయట ఎక్కడ చెప్పొద్దు తండ్రివని చంపుతారని పోలీసులు చెప్పారు. నన్ను టోల్‌ప్లాజా దగ్గర వదిలిపెట్టారు. అక్కడి నుంచి ఊరికి వచ్చా. – మహ్మద్ పాషా తండ్రి హుస్సేన్ ఆవేదన నా కొడుకని చెప్పుకొనేందుకు పానం ఒప్పడం లేదు నా కొడుకు శివ అని చెప్పుకునేందుకు పానం ఒప్పడం లేదు. వాడు చేసిన పనికి ఉరితీసిన పోను.. కోర్టుకు పిలిచిన వెళ్లను అంటూ తండ్రి గొర్రెల కాపరి రాజప్ప గొల్లుమని ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిని నీ కొడుకు శివ మరో ముగ్గురితో కలిసి కాల్చిచంపిన కేసులో జైలుకు పంపుతున్నమంటూ షాద్‌నగర్ నుంచి పోలీసులు రమ్మని చెబితే శనివారం అక్కడికి వెళ్లాను. పోలీసులు కేసు నమోదుచేసిన కాగితాలపై సంతకం చేయాలని చెప్పారు. ఏడుస్తూ నా కొడుకును ఉరితీసినా రాను అంటూ సంతకం పెట్టి వచ్చానని తెలిపాడు. – శివ తండ్రి రాజప్ప పరువు తీసిండ్రు జస్టిస్ ఫర్ దిశను అత్యాచారం చేసి దారుణంగా కాల్చి చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలి. ఈ దారుణానికి పాల్పడింది మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్ల గ్రామాల వారు అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ అమ్మాయిని హత్యచేసి మక్తల్ పరువు తీశారు. వారికి తగిన శిక్ష పడినప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. – చిట్టెం రాంమోహన్‌రెడ్డి, మక్తల్, ఎమ్మెల్యే -
జస్టిస్ ఫర్ దిశ హత్య: టెక్నికల్ డేటాది కీలక పాత్ర...
సాక్షి, హైదరాబాద్: దిశపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులకు ఉరే సరి అంటూ చేస్తోన్న ప్రజాందోళనలకు తగ్గట్టుగానే సైబరాబాద్ పోలీసులు పనిచేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు లేని ఈ కేసులో పరోక్ష సాక్ష్యాలు, భౌతిక సాక్ష్యాలతో నిందితులు మహమ్మద్ ఆరీఫ్, శివ, నవీన్ కుమార్, చెన్నకేశవులకు కఠిన శిక్ష పడేలా చూసేందుకు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. అత్యాచారం జరిగిన ఓఆర్ఆర్ తొండుపల్లి టోల్గేట్ సర్వీసు రోడ్డు ప్రాంతం, పెట్రోల్, డీజిల్ పోసి మృతదేహన్ని కాల్చిన షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి అండర్‌పాస్ ప్రాంతంలో లభించిన శాస్త్రీయ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించిన మృతురాలి దుస్తులు, నిందితులు తాగిన మందు బాటిళ్లు, లారీలో నుంచి సేకరించిన దిశ రక్తపు మరకలు, వెంట్రుకలు, మృతదేహం దహనం చేసిన ప్రాంతం నుంచి సేకరించిన రిస్ట్ వాచ్, కొత్తూరులో స్వాధీనం చేసుకున్న మృతురాలి బైక్ ఈ కేసులో కీలకం కానున్నాయి. లారీలో నుంచి సేకరించిన రక్తపు మరకలు, వెంట్రుకలు మృతురాలివేనని తేలితే నిందితులు తప్పించుకునే అవకాశం లేదు. అత్యాచార సమయంలో ఆమె ప్రతిఘటించినప్పుడు ఆమె వేళ్లకు నిందితుల కణాలు అంటుకున్నా మృతదేహాన్ని కాల్చేయడంతో సరైన ఆధారం లేకుండా పోయింది. పోలీసులకు లభించిన దిశ దుస్తులకు నిందితుల వీర్యకణాలు అంటుకొని ఉంటే డీఎన్ఏ పరీక్షలో నిర్ధారణ కానుంది. నిందితులు ఆమె దుస్తులను విప్పి పక్కకు పడేయడంతో వారి వీర్యకణాలు అంటుకొని ఉండే అవకాశాలు తక్కువని తెలుస్తోంది. స్కూటీలో గాలి నింపేందుకు సమీపంలోని పంక్చర్ షాప్‌కు వచ్చిన నిందితుడి గురించి ఆ యజమాని పోలీసులకు చెప్పడం కూడా కేసు విచారణలో ఉపయోగపడనుంది. టెక్నికల్ డేటాది కీలక పాత్ర... అత్యాచారం జరిగిన సమయంలో నిందితుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా అదే ప్రాంతంలో సూచించడం కూడా ఈ కేసుకు బలం చేకూరేలా ఉంది. నవీన్, శివ ఓ బాటిల్ తీసుకొని పెట్రోల్ కోసం కొత్తూరు శివారులోని ఎస్ఆర్ బంక్‌కు వెళ్లిన దృశ్యాలతోపాటు అక్కడే సమీపంలోని ఐవోసీ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌ను బాటిల్ లో కొనుగోలు చేసినట్లు సీసీటీవీ రికార్డుల్లో ఉండటం కూడా ఈ కేసులో ఉపయోగపడనుంది. తొండుపల్లి టోల్గేట్ నుంచి షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి అండర్‌పాస్ ప్రాంతం వరకు లారీ, స్కూటీ వెళ్లిన దృశ్యాలు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దిశ స్కూటీని నిందితులు నడుపుకుంటూ వెళ్లడం సాంకేతిక సాక్ష్యంగా ఉపయోగపడనుంది. నిందితులపై ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసులివి... ►120 (బీ): నేరపూరితమైన కుట్ర (నేర తీవ్రతను బట్టి జైలుశిక్ష) ►366: కిడ్నాప్ చేయడం (పదేళ్ల వరకు జైలు శిక్ష) ►506: చంపుతానని బెదిరించడం (రెండేళ్ల జైలుశిక్ష) ►376 (డీ): సామూహిక అత్యాచారం (చనిపోయే వరకు జైలుశిక్ష) ►302: హత్య చేయడం (నేర తీవ్రతను బట్టి జైలుశిక్ష) ►201 రెడ్‌విత్ 34: సాక్ష్యాలను తారుమారు చేయడం (నేరతీవ్రతను బట్టి జైలుశిక్ష) ►392: దోపిడీ (14 ఏళ్ల జైలుశిక్ష) -
వినిపించిన ఆ గళం
హైదరాబాద్‌లో ‘దిశ’ అత్యాచారం, హత్య తర్వాత దేశమంతా అట్టుడికి పోతుంటే ఢిల్లీలో ఒక అమ్మాయి చేతిలో ప్లకార్డ్‌తో మౌనంగా పార్లమెంట్ ముందు నిలబడింది. అది నచ్చని పోలీసులు ఆమెను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. వెళ్లకుండా మొండికేసిన ఆమెపై దౌర్జన్యం చేశారు కూడా! ఆమె పేరు అనూ దూబే. ఢిల్లీ వాసి. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి? ‘దిశ’ ఘటనపై నిరసన వ్యక్తం చేయడమే. అదీ పార్లమెంట్ ముందు నిలబడి. ‘‘రేప్పొద్దున నేనూ రేప్‌కు, హత్యకు గురై దహనం కాదల్చుకోలేదు. ఇలాంటి సంఘటనల గురించి ఇక నేను వినదల్చుకోలేదు. దేశంలో ఎక్కడా రేప్ అనే మాట వినపడకూడదు. ప్రియాంకలా ఏ అమ్మాయీ బలికాకూడదు. చదువు కోసం, ఉద్యోగాల కోసం బయటకు వెళ్లాలి. తిరిగి రావడం ఏమాత్రం ఆలస్యమైనా ఇంట్లో వాళ్ల గుండె ఆగిపోతోంది. భయంతో బిక్కచచ్చిపోతున్నారు. మా అన్న అడుగుతున్నాడు.. ఎక్కడున్నావ్? అని. ఇంటికొచ్చే వరకు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఉంటున్నాడు. బయటకు వెళ్లినప్పుడు లేట్ అవ్వొచ్చు. ఆలస్యం ఆడపిల్ల ప్రాణానికి ఖరీదు కాకూడదు కదా. మాన, ప్రాణాలకు హాని ఉంది ఆడపిల్లలంతా ఇంట్లో కూర్చోవాలా? ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టుకున్నట్టే కదా ఈ వ్యవహారం. వ్యవస్థలో మార్పు రావాలి. మార్చాలి. నాకు రేప్ సంఘటనలు వినపడకూడదు. ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలియదు. స్పందించాలి. అందుకే ప్లకార్డ్‌తో పార్లమెంట్ బయటనిలబడ్డా. చట్టాలు చేసే భవనం ముందు సైలెంట్‌గా ప్రొటెస్ట్ చేశా. పనిష్మంట్ ఇచ్చారు పోలీసులు’’ అని చెప్పింది అనూ దూబే. తన మీద పోలీసులు చేసిన జులుం గురించి ఢిల్లీ విమెన్ కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేసింది అనూ. ఢిల్లీ విమెన్ కమిషన్ చైరపర్సన్ స్వాతి మాలివాల్ వెంటనే స్పందించారు. జరిగిన నేరం గురించి నిరసన తెలిపితేనే పోలీసులు వేధించి, హింసిస్తే నేరాలను ఆపేదెవరు? జరగకుండా చూసేదెవరు? -
జస్టిస్ ఫర్ ‘దిశ’ ఘటనపై ఫేస్బుక్ ఏమంటోంది?
జస్టిస్ ఫర్ ‘దిశ’ ఘటన గురించి సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. కొందరు కోపంగా, కొందరు ఆగ్రహంగా, కొందరు సాలోచనగా స్పందిస్తున్నారు. కొందరు తమ ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. చాలా చర్చలు కొనసాగుతున్నాయి. వాటిలో కొన్ని స్పందనలను ఇక్కడ ఇస్తున్నాం. జాగ్రత్త అమ్ములూ (కూతురికి తల్లి లేఖ) చూశావు కదా అమ్మలూ... తెలిసినవాడే, స్నేహితుడే అని మాట్లాడటానికి వెళ్ళింది. ఏమైందో చూడు. ఎవర్నీ నమ్మొద్దు. జాగ్రత్త. రాత్రి తొమ్మిదే కదా ఏమవ్వుద్ధి అనుకోవద్దు. మొన్న రాత్రి ఒక్కదానివే సెవెన్ సీటర్‌లో వచ్చావు కదా. డాడీకి ఫోన్ చేస్తే వచ్చి తీసుకొచ్చేవాడు, ఒక్కదానివే ఎందుకొచ్చావు అని కోప్పడితే కోపమొచ్చింది కదా. చూడు... చదువుకుని ఉద్యోగం చేసే ధైర్యం ఇచ్చిన నమ్మకంతో, తనను తాను నమ్ముకుని రోడ్డు మీదకు ఒంటరిగా రాత్రి పూట వెళ్ళింది. ఏమైందో చూడు. జాగ్రత్త. చూడు అమ్మలూ... మేము రావటానికి ఇంకో గంట పడుతుంది. ఎవరయినా కాలింగ్ బెల్ కొట్టితే కీ హోల్ లోంచి చూసి తలుపు తియ్యి. ఎడాపెడా తలుపు తియ్యొద్దు. జాగ్రత్త. ఆటోని నమ్మకు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని నమ్ము. వీలైనంతవరకూ బస్సు ఎక్కు. లేట్ అయితే ఫోన్ చెయ్యి. ఎవరో ఒకళ్ళం వస్తాం. జాగ్రత్త దగ్గర దారి గదా అని చీకట్లో, సందుగొందుల్లో రాకు. దూరమైనా లైట్లున్న రోడ్లో, నలుగురు తిరిగే రోడ్లోనే రా. జాగ్రత్త. చూడు. ఇంట్లో ఒక్కదానివి ఉండకు. డాడీ ఆఫీస్ నుండి తొందరగా వస్తారు. లేదు నేను లీవ్ పెడతాను. రైలింగ్ పని చేస్తున్నారు, ఎక్కడెక్కడ్నుంచొచ్చారో. అందరూ తెలియనోళ్లే. మన జాగ్రత్తలో మనముండాలి కదా! చూడు... ట్యూషన్ నుండి దగ్గరే కదా అని నడుచుకుంటూ రాకు. డాడీనో, నేనో వచ్చి తీసుకొస్తాం. గేటు దగ్గర్నుంచి ఒకోసారి లైట్లు లేక చీకటిగా వుంటుంది. ఎవరయినా వెంటపడితే? జాగ్రత్త. స్కూల్ అయిపోయాక కూర్చుని కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నారా.. స్కూల్ లో ఇంకా ఎవరయినా వుంటున్నారా.. వాచమేన్ ఒక్కడే వుంటున్నాడా... జాగ్రత్త. ఫోన్ తీసుకెళ్లు. ఏదైనా అవసరమయితే వెంటనే ఫోన్ చెయ్యి. తెలియని ఊరులో ఒక్కదానివే టాయిలెట్ దాకా వెళ్ళటం క్షేమం కాదు. వొక్కదానివే వెళ్లొద్దు. చూడు అక్కడ తుప్పలు బాగా వున్నాయి. ఎవరో తిరుగుతున్నారు. జాగ్రత్తగా వుండాలి. నేనూ వస్తున్నాను పద. చూడు. చిన్నప్పుడు వేరు. ఇప్పుడు వేరు. వాళ్ళందరూ తెలిసినవాళ్లే. ఏమో ఎవరి బుద్ధి ఎలాంటిదో. పక్కన కూర్చోవడం, చనువుగా ముట్టుకోవటం చేయ్యొద్దు. మన జాగ్రత్తలో మనముండాలి. క్యాబ్ బుక్ చెయ్యొచ్చు కదా, పగలే కదా అంతదూరం వెళ్తానని అంటావా. వద్దు. వాళ్ళింటికా, నైట్ స్టే చేస్తావా, వొద్దు. ఒద్దొద్దు. జాగ్రత్తగా వుండాలి. ఇంట్లో చదువుకో, చాల్లే, వచ్చినన్ని మార్కులు వస్తాయి. ఎన్ని జాగ్రత్తలు చెప్పీ, తీసుకుని పెంచుతున్నామురా. అయినా కానీ మింగుతున్నారు కదరా. మా రెక్కలు ఎంత బలహీనమయినవో పదే పదే నిరూపిస్తున్నారు కదరా. – బోడపాటి పద్మావతి వ్యవస్థను పని చేయనివ్వాలి ‘దిశ’ ఘాతుకం నుంచి నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే మనకు వ్యవస్థను సరిగా ఉపయోగించుకోవడం రాదని. ఒక సౌకర్యం గురించి విస్తృతంగా అవగాహన లేదని. అమెరికాలో ఏ కష్టం వచ్చినా, పిల్లి చెట్టెక్కినా, దొంగలు పడ్డా, హార్ట్ ఎటాక్ వచ్చినా వెంటనే 911కి ఫోన్ చేస్తారు. ఇది చిన్న పిల్లలకి కూడా తెలిసిన విషయం. సరే అమెరికా కనుక వెంటనే స్పందించి పోలీసులు మూడు నిమిషాల్లో గుమ్మం దగ్గర ఉంటారు. మన దగ్గర అలా కాకపోవచ్చు. కానీ అసలు పని చేయవు వ్యవస్థలు అని తిట్టిపోయడం పరిష్కారమా అని కూడా ఆలోచించాలి.100, 112 మొదలైన నెంబర్లు సరిగా పనిచేయకపోతే వాటిని పని చేయించాలి. మనకి తెలీకుండా వాటిని వాడుకోకుండా అసలు ఏవీ పని చేయమని కొట్టిపారేయడం కూడా కరెక్ట్ కాదు. మనం ఉండాల్సింది ఈ సమాజంలోనే. మనని చూడాల్సింది ఈ పోలీసులే. వాళ్ళకి జీతాలిచ్చి పెట్టింది అందుకే. జనాలు ఆపద వచ్చినప్పుడు కాల్ చేస్తున్నారు అంటే పోలీసులు కూడా అప్రమత్తం అవుతారు. అధికారులు కూడా system streamline చేస్తారు. టెక్నాలజీ విషయంలో ప్రపంచానికే పుట్టిల్లయిన మన దేశంలో అందులోనూ హైదరాబాదులో మనం టెక్నాలజీని వాడుకుని వ్యవస్థలు పని చేసేలా చెయ్యకపోతే ఎలాగ? హండ్రెడ్ నెంబర్ దేనికి పని చేస్తుంది. చైల్డ్ హెల్ప్ లైన్ ఏమిటి, షీటీమ్స్‌ని ఏ సందర్భంలో పిలవచ్చు, భరోసా సెంటర్ ఎందుకు ఉంది అన్నీ ముందు ఆకళింపు చేసుకోవాలి.ఏదన్నా చిన్న సంఘటన జరిగినా దాన్ని పోలీసుల దష్టికి తీసుకురావాలి. ఏ గొడవా మనకు సంబంధం లేదులే అని దులుపుకొని పోయే అలవాటు మానుకోవాలి. మనకి అత్యంత సమీపమైన పోలీస్ స్టేషన్ ఏదీ అనేది తెలుసుకొని నెంబర్లు రాసి పెట్టుకోవాలి. ఒక కమ్యూనిటీగా వెళ్లి లోకల్ పోలీస్ స్టేషన్లో పరిచయం చేసుకుని మన నెంబర్లు కూడా వాళ్ళకి ఇచ్చి ఏ గొడవ వచ్చినా మేము కూడా స్పందిస్తామని చెప్పి రావాలి వాళ్ల contact తీసుకోవాలి. – ఉషా తురగా సమాజానికి ఇవ్వడం తెలుసుకో సమాజమంటే నీ ఇష్టానుసారం వాడుకుని వదిలేసే ఒక ఉచిత వనరు అనే కద నీ అవగాహన. అయితే నీవు వాడుకుని వదిలేసే సమాజం నీ సమస్యగా మారుతుందనీ, నీవు పట్టించుకోని సమాజమే నీకు ప్రమాదాలు తెచ్చిపెడుతుందనీ నీకెవరూ చెప్పలేదు కద. అంతా నా తెలివే, అంతా నా చాకచక్యమే, అంతా నా లౌక్యమే అని విర్రవీగే నీకు... నీ భద్రతా, నీ శాంతి, నీ సుఖాలూ సమాజం వేసిన భిక్ష అనీ, ఏ సుఖాలూ నోచని జనాల చాకిరీ వల్లే నీకీ భద్ర జీవితమనీ నీవు తెలుసుకోవలసిన రోజొచ్చింది. నీ పిల్లలతో పాటూ అందరు పిల్లలూ సంతోషంగా, ప్రేమగా ఎదిగినప్పుడే అందరూ బాగుంటారని నీవు గ్రహించాల్సిన రోజొచ్చింది. నీ ఇంట్లో చెత్త వీధిలో పారేస్తే చాలదు. నీ వీధిలోని చెత్త కూడా నీవు ఎత్తేయాల్సి వుంటది. నీ ఒక్కడివి సంతోషంగా, గౌరవంగా ఉంటే చాలదు. అందరికీ ఆ సంతోషం, గౌరవం ఎలా దక్కుతాయో నీవు ఆలోచించాల్సి ఉంటుంది. నీ అంతులేని స్వార్థం, నీ నిర్దయలే నీ పాలిటి శత్రువులై నిన్ను చుట్టుముడతాయని నీవు తెలుసుకోక తప్పని రోజొచ్చింది. – గడియారం భార్గవ లైంగిక అవసరాల పట్ల మౌనం ఎందుకు? మూల కారణాలన్నీ చర్చించాలి. పరిష్కారాలు అన్వేషించాలి, తోచిన మార్గంలో పని చేయడానికి ముందుకు రావాలి. నేరస్తులకు శిక్ష పడాలి– వీటన్నిటి చివరా ఏ ట్రోలింగ్‌కీ జడవకుండా మాట్లాడాల్సిన విషయం ఒకటి ఉంది. స్త్రీ పురుషుల తొలి యవ్వనోద్రేకపు, సాధారణ – (ఆరోగ్యకరమైన) లైంగిక అవసరాల పట్ల మనందరి మౌనం ఏది ఉందో అది కూడా ఒక నేరకారణం. అత్యాచారాలు తక్కువ ఉన్న దేశాల్లో లైంగిక సంబంధాలు ఎట్లా ఉన్నాయన్నది విశ్లేషణ చేయడం ఏవన్నా ఉపయోగపడొచ్చు. – కె.ఎన్.మల్లీశ్వరి ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది అన్నిటికీ ప్రభుత్వాలని అంటే ఎలా ఇంటినుంచి మార్పు రావాలి అని సన్నాయి నొక్కులు నొక్కకండి. ప్రభుత్వాలు చెయ్యాల్సింది చాలా ఉంది. జెండర్ ఎడ్యుకేషన్ తేవాలి స్కూలు స్థాయి నుంచి. ప్రభుత్వంలో ప్రతి ఉద్యోగికి జెండర్ ట్రైనింగ్ ఇవ్వాలి. అటు పేదరికం వల్ల పట్టించుకునే కుటుంబం లేక, ఇటు బతకటానికి అవసరమయ్యే ఏ స్కిల్ రాక, నేర్పే వాళ్ళూ లేక ఆ ఫ్రస్టేషన్ నుంచి మీరు ఫ్రీగా అందిస్తున్న పోర్న్ చూసి పెర్వర్ట్లుగా మారుతున్న టీన్స్‌ని ట్ఛ్చఛిజి ౌu్ట కావాలి. చెయ్యదలుచుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి మార్పులు ఉద్యమాల వల్ల, దాని వల్ల ఏర్పడే పొలిటికల్ విల్ వల్ల మాత్రమే జరుగుతాయి. మనకు ఉద్యమాలు గిట్టవు. పొలిటికల్ విల్ లేదు. – సి.వనజ -
బాధ్యత ఎవరు తీసుకోవాలి
స్త్రీలను గౌరవించాలి. వారు భద్రమైన వాతావరణంలో ఉండాలి.వారికి అనుక్షణం రక్షణ ఇచ్చే వ్యవస్థ ఉండాలి. వారిని లైంగిక వస్తువులుగా చూడని సంస్కారం పురుషులలో ఏర్పడాలి. ఇందుకు ఎవరు పూనుకోవాలి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? తల్లిదండ్రులా? టీచర్లా? పోలీసులా? ‘ధైర్యం, స్వేచ్ఛ ఎంత ముఖ్యమో పరిస్థితులను ఎరిగి జాగ్రత్తలో ఉండడం కూడా అంతే ముఖ్యం’ ‘దిశ’ హత్య సంఘటన నేపథ్యంలో ఫేస్బుక్లో కనిపించిన ఒక కామెంట్ అది. ఈ కామెంట్లో వాస్తవం ఉంది. ‘దిశ’ ఘటనలోగాని, వరంగల్‌లో కారులో అత్యాచారం జరగడం వల్ల షాక్‌కు గురై మరణించిన మానస విషయంలోగాని జరిగింది అదే. పరిస్థితులను ఎరిగి జాగ్రత్తలో లేకపోవడం. ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగాక మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలను మరింత కట్టుదిట్టం చేశారు. కొత్త చట్టాన్నీ తెచ్చారు. అయినా లైంగిక దాడులతో కూడిన హత్యలు ఆగడం లేదు. ఇందులో సమాజంలో స్త్రీల పట్ల పేరుకునిపోయిన క్రూర దాడి స్వభావంతో పాటు మహిళలు తామున్న పరిస్థితిని గుర్తెరిగి ప్రవర్తించకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఒక తప్పుకు కేవలం ఒకరు మాత్రమే బాధ్యత వహించవలసిన పని లేదు. సమష్టిగా బాధ్యత వహించాల్సిందే. అందులో తల్లిదండ్రులు, టీచర్లు, పోలీసులు.. ఈ అన్ని వ్యవస్థల సంరక్షణా కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన ప్రభుత్వం కూడా ఉంది. ఎందుకు? మంచి జీవితం కోసం ఇప్పుడు అమ్మానాన్నా ఇద్దరూ జీతం తేవాల్సిందే. పిల్లలకు ‘మంచి’ చదువు ఇప్పించడం కోసం ప్రైవేట్ స్కూల్లో వేయాల్సిందే. బాగా చదువుచెప్పే పనిలో ఆ స్కూళ్లూ పిల్లలను దాదాపు ఉదయం ఏడు నుంచి సాయంకాలం ఆరుగంటల దాకా ఎంగేజ్ చేస్తున్నాయి. దీంతో పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో కంటే స్కూల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇంటికొచ్చాక కూడా స్కూల్ ఇచ్చిన పనిలో కొంతసేపు ఉండి, మిగిలిన కాసేపు సోషల్ మీడియా బడిలో సేద తీరుతున్నారు. కాలేజ్ పిల్లల షెడ్యూల్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంది కొంత మార్పుతో. ఏతావాతా పిల్లలతో తల్లిదండ్రులు గడిపే సమయ పరిమాణం, సమయ నాణ్యత గణనీయంగా తగ్గింది. తల్లిదండ్రుల పాత్రను టీచర్లే పోషించాల్సిన అవసరం ఏర్పడింది. అలాగని పిల్లల సమయం ఎక్కడోఒకచోట పూరింపబడుతోంది కదా అని సంతోషపడాల్సిన ముచ్చట లేదు. ప్రైవేట్ లేదా కార్పొరేట్ స్కూళ్లు పిల్లలను తెలివైన విద్యార్థులుగా తీర్చిదిద్దుతామని తల్లిదండ్రులకు మాటిస్తాయి తప్ప మంచి విద్యార్థిగా అని కాదు. తల్లిదండ్రుల షరతు కూడా తెలివైన బిడ్డలు కావాలనే. మంచి పిల్లలు అని కాదు. ఇక ప్రభుత్వ పాఠశాల విషయానికి వస్తే.. వికాసవంతమైన విద్య, క్రీడా విద్య, ఆరోగ్యం, లైఫ్ స్కిల్స్ మొదలైనవన్నీ కరిక్యులమ్‌లో భాగాలే. ప్రతి యూనిట్, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పరీక్షల్లో పై వాటికీ మార్కులుంటాయి. ప్రతి విద్యార్థి ప్రవర్తనను, ఆరోగ్య, మానసిక దృఢత్వాన్ని పరీక్షించే మార్కులు వేయాలి. కాని ప్రాక్టికల్‌గా అలా ఉండదు. ఎందుకంటే చాలా ప్రభుత్వ పాఠశాలలు దాదాపుగా ఇద్దరు టీచర్ల నిర్వహణలో నడుస్తున్నాయి. ఈ స్థితిలో మొక్కుబడిగా మార్కులివ్వడం తప్పిస్తే పరీక్షించి రిపోర్ట్ రాయడం కుదరని పని. ఈ కరిక్యులమ్‌కు రూపకల్పన చేసిన ప్రభుత్వ సిబ్బందికీ ఆ విషయం తెలుసు. ఇక పోలీసులు.. సమాజంలోని కుల, మత, వర్గ, లింగ వివక్ష చూపకుండా, చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ రక్షణ చూసుకోవాల్సిన వారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి నుంచి విధానాలు రూపొందే అసెంబ్లీ (రాష్ట్రం వరకు మాట్లాడుకుంటే) వరకు శాంతి, భద్రతల బరువును మోయాల్సిన వారు. అంటే పిల్లలకు సంబంధించి పేరెంటింగ్ పాత్రనూ చేపట్టాల్సిన వారు. వీటన్నిటినీ సమన్వయం చేయాల్సిన ప్రభుత్వమూ ఉమ్మడి కుటుంబంలో పెద్ద వాళ్ల భూమికను పోషించాలి. ఆడవాళ్ల మీద హింస తగ్గించడానికి, అలాంటి నేరాలు జరిగినప్పుడు అమ్మాయిలు ధైర్యంగా పోలీసులను సంప్రదించడానికి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అది – ఆ జిల్లాలోని స్కూళ్ల నుంచి అమ్మాయిలను ఎంపిక చేసి వారానికి ఒకరోజు ఆ ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్ ఇన్చార్జిగా పెట్టడం. దీనివల్ల నేరాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా రిపోర్ట్ చేయాలి వంటి వాటి మీద అమ్మాయిలకు అవగాహన పెరగడమే కాక భయం పోతుంది. పోలీసులు సున్నితంగా వ్యవహరించే వీలుంటుంది అని. ఇలాంటివి ఇక్కడా ప్రయోగించవచ్చేమో. ‘దిశ’ ఘటన నేపథ్యంలో ఆయా వర్గాలు ఏమంటున్నాయో చూద్దాం. ఒక్కోనెల ఒక్కోరంగంలోని నిపుణుడితో సెషన్ పెట్టించాలి పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా ముందు పిల్లలను మార్కుల కోసం వత్తిడి చేయడం ఆపాలి. వారి లైఫ్ స్కిల్స్ పట్ల దృష్టి పెట్టాలి. ఇంతకుముందు ఇంట్లోంచి ఇవి అందేవి. ఇప్పుడు స్కూల్లో అందేలా చూడాలి. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లకు శ్రద్ధ పెట్టే టైమ్‌లేక నైతికవిద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్, జీవన నైపుణ్యాలు వంటి అంశాలను కూడా మామూలు పరీక్షల్లాగే భావించి అందరికీ ఒకే రకంగా మార్కులు వేసి పాస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలా చేయడం నిజంగా ఏ టీచర్‌కూ ఇష్టం ఉండదు. బాధగానే ఉంటుంది. కాని ఏం చేస్తాం? నేను కోరేది ఒక్కటే.. ప్రతి స్కూల్లో ప్రతి నెల ఆయా రంగాల్లోని నిపుణులను పిలిపించి ఆ రోజు పిల్లలతోపాటు, టీచర్లు, పేరెంట్స్‌కి కూడా క్లాస్ ఇప్పించాలి. అంటే కౌన్సిలింగ్ సెషన్‌లా ఉండాలన్నమాట. – గాజోజు నాగభూషణం, మన్నెపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కరీంనగర్ జిల్లా. విపరీతంగా ప్రచారం చేయాలి ఈరోజు ప్రతి వాళ్లకు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ దినచర్యలో ప్రయాణం తప్పనిసరి అయింది. నేరాలు జరిగే అవకాశం కూడా ఈ మూమెంట్లోనే ఎక్కువ. ఒక ప్రొడక్ట్‌కి మార్కెట్లో ఎలా అయితే ప్రచారం జరుగుతుందో అలాగే ఈ సేఫ్టీ అండ్ సెక్యురిటీని కూడా మార్కెటైజ్ చేయాలి అంటాను. వాట్సప్‌లో అప్పుడప్పుడూ కొన్ని మెసేజెస్ వస్తూంటాయి.. ఫలానా దేవుడి నామాన్ని 108 మందికి ఫార్వర్డ్ చేయండి.. లేదంటే ఏదో అవుతుంది అనుకుంటూ! అదిగో ఆ స్థాయిలో ఈ సేఫ్టీ అండ్ సెక్యురిటీ ప్రచారం సాగాలి. ఇంటి నుంచి డెస్టినేషన్‌కు వెళ్లే దారిలో ప్రజల దృష్టి పడే చోట్లంతా దీనికి సంబంధించిన పత్రాలను, హోర్డింగ్స్‌ను పెట్టాలి. పేరెంట్స్, టీచర్స్, పోలీసులు అని కాకుండా అందరం దీన్నో క్యాంపెయిన్‌లా ముందుకు తీసుకుపోవాలి. – సుమతి, ఐపీఎస్ పేరెంట్స్ మీటింగ్‌కి కూడా హాజరు కావడం లేదు నిజమే .. స్కూల్లో టీచర్ పేరెంట్ పాత్ర పోషించాలి. పోషిస్తున్నాం కూడా. కాని ఇంట్లో తల్లిదండ్రులూ శ్రద్ధ పెట్టాల్సిందే. పాఠాలు ఎంత ముఖ్యమో.. బతుకు పాఠాలు అంతకన్నా ముఖ్యం. నేను ప్రతి క్లాస్‌లో లెసన్ చెప్పేకంటే ముందు పదినిమిషాలు జనరల్ విషయాల గురించే పిల్లలతో మాట్లాడ్తా. వాళ్ల అబ్జర్వేషన్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా. దాంతో వాళ్ల ఆలోచనా ధోరణి తెలుస్తుందని. ఏ కొంచెం తేడా అనిపించినా తల్లిదండ్రులతో మాట్లాడొచ్చు అని. ఇవి కరిక్యులమ్‌లో భాగమైనా కాకపోయినా ఓ టీచర్ పాఠంలో భాగం కావాలని అనుకుంటా, నమ్ముతా, అమలుచేస్తా. ఇలాంటి ఎక్సర్సైజ్ ఇంట్లోనూ జరగాలి. పేరెంట్స్ మీటింగ్‌లో పిల్లల మార్కులనే కాదు ప్రవర్తననూ డిస్కస్ చేస్తా. అందుకే పేరెంట్ మీటింగ్‌కి తప్పకుండా తల్లి, తండ్రి ఇద్దరూ హాజరుకావాలి. కాని వాస్తవం ఏమిటంటే తల్లిదండ్రులకు అందుకోసం కూడా టైమ్ ఉండటం లేదు. – కె. కవిత, ప్రభుత్వ టీచర్, మనోహరాబాద్, మెదక్ జిల్లా. ఇంగితాన్ని నేర్పాలి కొన్ని పరిస్థితుల్లో గుడ్డిగా నమ్మడం కంటే అనుమానించడమే మంచిది అని ఇంగ్లిష్ సామెత. అయితే అబ్బాయిల కన్నా అమ్మాయిల్లో నమ్మకం పాలు ఎక్కువని సైంటిఫిక్‌గా రుజువైంది. అమ్మాయిల్లో విడుదలయ్యే కొన్ని హార్మోన్సే ఇందుకు కారణం. జాలి, దయ, సహాయం చేస్తుంటే వారించలేనితనాన్ని ఈ హార్మోన్లు ప్రేరేపిస్తూంటాయి. కాని ఎల్లవేళలా ఇది మంచిదికాదు కదా. ఏ పరిస్థితికి ఆ పరిస్థితి వేరు అనే స్పృహను, ఎవరినీ అంతలా నమ్మకూడదు అనే అవగాహనను పెంచాలి. ప్రతి సంఘటనను దేనికదే విడిగా చూడాలనే ఇంగితాన్నీ నేర్పాలి. ఇది స్కూల్లో పాఠంగా మారాలి. ఎనిమిదేళ్లు నిండిన ప్రతివాళ్లకు చెప్పాలి. అమ్మాయిలకు కూడా శారీరక దృఢత్వంతోపాటు మానసిక దృఢత్వమూ అవసరం అనే ఎరుకను పెంచాలి. శిక్షణనూ ఇవ్వాలి. ప్రతిరోజు అసెంబ్లీలో దీనికి సంబంధించిన చర్చ ఒకటి చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్లైన్లను ఎలా సంప్రదించాలో చెపుతూ అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రవర్తించాల్సిన తీరునూ వివరించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి అమ్మాయి తనకు నిర్భయలాంటి ప్రమాదకర స్థితి పొంచి ఉందనే జాగరూకతతో వ్యవహరించాలి. – కళ్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్. -
షాద్‌నగర్ ఘటనలో బాధితురాలి పేరు మార్పు
సాక్షి, హైదరాబాద్ : నగర శివార్లలో అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ వైద్యురాలి పేరును మార్చినట్టు పోలీసులు తెలిపారు. ఇకపై బాధితురాలిని ‘జస్టిస్ ఫర్ దిశ’ పేరుతో పిలవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులను సజ్జనార్ ఒప్పించారు. సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో బాధితురాలి పేరు వాడొద్దని కోరారు. జస్టిస్ ఫర్ దిశకు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా నిర్భయ, అభయ కేసుల్లో సైతం బాధితురాలి అసలు పేర్లను మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికారులు బాధితురాలి పేరును మార్చారు. -
ప్లీజ్ మా ఇంటికి ఎవరూ రావొద్దు: ప్రియాంక పేరెంట్స్
సాక్షి, హైదరాబాద్ : అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మృగాళ్ల దాష్టీకానికి ప్రాణాలు కోల్పోవటాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ దుస్సంఘటనను తలచుకుని ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. అయితే పరామర్శల పేరుతో పలువురు నేతల పర్యటనతో వారు మరింత మానసిక వేదనకు గురవుతున్నారు. చనిపోయిన తమ కుమార్తెను ఎవరూ తిరిగి తీసుకురాలేరని, దయచేసి తమను పరామర్శించేందుకు ఎవరూ రావొద్దని ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు రాజకీయ నేతలు, పోలీసులు, మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల నుంచి పలువురు నేతలు ప్రియాంక కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: ముందే దొరికినా వదిలేశారు! మాకు సానుభూతి అవసరం లేదు.. అయితే ప్రియాంకా రెడ్డి కుటుంబసభ్యులు... తమ ఇంట్లోకి ఎవరూ రాకుండా లోపల నుంచి గేటుకు తాళం వేసుకున్నారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి సరైన న్యాయం జరిగితే చాలని, సానుభూతి అవసరం లేదని స్పష్టం చేశారు. తమ వేదనను అర్థం చేసుకోవాలని కోరారు. సరైన సమయంలో పోలీసులు స్పందించి ఉంటే తమ ప్రియాంక దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపదలో ఆదుకోవాల్సిన పోలీసులు ఇప్పుడు తమ ఇంటి చుట్టూ తిరగడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి స్పందించాల్సి ఉందని డిమాండ్ చేశారు. బిడ్డ చనిపోయాక ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి రాజకీయ నాయకులు రావడం ఎందుకంటూ మండిపడ్డారు. సానుభూతి, పరామర్శల పేరుతో తాము విసిగిపోయామని... ఎవరు వచ్చినా తమకు చేసేదేమీ లేదని అన్నారు. అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులను శిక్షించాలని ఆందోళన చేసినవారిపై లాఠీఛార్జ్ ఎలా చేస్తారంటూ ప్రశ్నలు సంధించారు. సంబంధిత వార్తలు 28 నిమిషాల్లోనే చంపేశారు! పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా? పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త ప్రియాంక కేసులో ఇదే కీలకం ‘నా కొడుకుకు ఉరిశిక్ష వేసినా ఫర్వాలేదు’ ఈ ఘటన నన్ను కలచివేసింది -
మా కొడుకులను శిక్షించండి
నారాయణపేట/మక్తల్: ‘ఒక్కడు చేసిన తప్పుతో మా గ్రామం మొత్తానికి చెడ్డపేరు వస్తోంది.. తప్పు చేసిన నిందితులను గ్రామంలోనే బహిరంగంగా ఉరితీయాలి’ అని ప్రియాంక హత్య కేసులో నిందితుల తల్లిదండ్రులు, జక్లేర్ గ్రామస్తులు పేర్కొన్నారు. ఘోరమైన తప్పిదానికి పాల్పడిన తమ కుమారులను కఠినంగా శిక్షించాలని నిందితుల తల్లులు అన్నారు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక హత్యను నిరసిస్తూ ప్రధాన నిందితుడు ఆరిఫ్ స్వగ్రామమైన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్‌లో శనివారం గ్రామస్తులు, నిందితుల తల్లిదండ్రులతో కలసి రాస్తారోకో చేశారు. మిగతా నిందితుల గ్రా మం గుడిగండ్ల నుంచీ ప్రజలు, నిందితుల కుటుంబీకులు ఇక్కడికొచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. నన్ను.. నా కొడుకును శిక్షించండి ‘నాకు ఆపరేషన్ అయింది.. నేను ఎక్కువ రోజులు బతకను. నా కొడుకు ఇలాంటి పనిచేశాడంటే నమ్మలేకపోతున్నా. నన్ను, నా కొడుకును శిక్షించండి’అంటూ ప్రియాంకారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆరిఫ్ తల్లి మౌలానాబీ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఊళ్లో వారంతా నీ కొడుకు ఈ పనిచేశాడంటా.. అని మాట్లాడుతుంటే వినలేకపోతున్నా. నాకు ఒక కూతురు, భర్త ఉన్నారు. ఆ పిల్ల కోసం బతకాలనే ఆశ ఉంది. అన్నకు ఏం అయిందని బిడ్డ అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థమైతలేదు. నా పిల్లకు దోస్తులే ధైర్యం ఇస్తూ బాధపడొద్దని చెబు తున్నారు. గుండెనిండా బాధ ఉంది. కంటికి కునుకులేకుండాపోతుంది మాకు’ అని విలపించింది. నా కొడుకును కాల్చేయండి ‘ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకునూ అలాగే కాల్చిచంపండి’ అంటూ ప్రియాంక హత్య కేసులో నిందితుడు చెన్నకేశవులు తల్లి జయమ్మ కన్నీరుపెడుతూ చెప్పింది. ‘ఏ తల్లికైనా కడుపుకోతనే.. ఆ తల్లి అయినా.. నేనైనా బిడ్డను తొమ్మిది నెలలు మోసి కన్నవాళ్లమే. నాకూ ఆడపిల్లలున్నారు.. నా కొడుకు ఇలాంటి పాడుపని చేస్తాడనుకోలేదు. పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు నా కొడుకును తీసుకుపోయారు. ఎం దుకంటే.. మళ్లీ పంపిస్తామన్నారు. మధ్యాహ్నం తర్వాత ఊళ్లో కొంతమంది నీ కొడుకు ఒక అమ్మా యిని ఇలా చేశాడంటా.. అని చెబితే విషయం తెలిసింది. ఇప్పుడు నా కొడుకును ఏం చేయొద్దంటే ఎవరు వింటారు’ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘నా కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నడు సర్దుకుపోయాం. వాడికి కిడ్నీ రోగం ఉంది. లారీడ్రైవర్ పని బంద్ చేయమని చెప్పాం. కానీ, వినకుండా జక్లేర్ ఆరిఫ్ మాట విని వెళ్లిపోయిండు. ఇప్పుడు ఊరంతా మావోడి గురించే మాట్లాడుతుంటే నేను ఏమని చెప్పనయ్యా.. అందరికీ ఒకటే బాధ’అంటూ తన కొడుకు ఇలాంటి పనిచేశాడని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ ఘటన విని తన భర్త చావడానికి ప్రయత్నించాడని.. ఎవరు చేసినా పాపం పాపమే కదా.. శిక్ష అనుభవించాల్సిందే అంటూ బాధ పడింది. నా కొడుకును మోసం చేసిండ్రు తన కొడుకు అలాంటివాడు కాదని నిందితుడు శివ తల్లి మణెమ్మ పేర్కొంది. ‘కొడుకు లారీ క్లీనర్ పని మానేయమని చెబితే, జీతం తీసుకువస్తానని చెప్పి కంపలో పడిండు. నా కొడుకును మోసం చేసిం డ్రు. అసలే వాడు అప్పుడప్పుడు ఎద పట్టుకొని రక్తం కక్కేవాడు. వద్దురా ఈ లారీల మీద పోవద్దని చెప్పినా వినకుండా నవీన్ ఫోన్ చేస్తే వెళ్లిపోయా డు. పెద్ద కొడుకు రాజశేఖర్ మట్టి పనిచేస్తూ బతుకుతలేడా.. నీవు ఊర్లో ఉండి కూలీ నాలీ చేసి బతుకురా అంటే వినకుండా పోయి ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నడు’ అని వాపోయింది. మొగుడు అలా.. కొడుకు ఇలా.. ‘నవీన్ చిన్నగ ఉన్నప్పుడే నా మొగుడు ఎల్లప్ప సచ్చిపోయిండు. కొడుకు పెద్దగా అయ్యిండు సంసారం సాగదీస్తాడనుకుంటే ఈ పాడు పని చేసి జైలుపాలాయే’అని నిందితుడు నవీన్ తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తంచేసింది. ‘వాడు చదివింది ఏడో తరగతే. చదువు అబ్బలేదు. నా కొడుకుకు జక్లేర్ ఆరిఫ్నే మోటార్‌సైకిల్ ఇప్పించిండు. ఆరిఫ్ ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఉరికేవాడు. ఆరిఫ్ వల్లే లారీ డ్రైవర్‌గా హైదరాబాద్‌కు వెళ్లాడు. శ్రీనివాస్‌రెడ్డి వద్ద లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పేవాడు. యాక్సిడెంట్లు అవుతుండటంతో ఆరు నెలలుగా లారీ డ్రైవర్‌గా పని బంద్ చేయించా. మొన్ననే సోమవారం పాషా ఫోన్ చేసి లారీ లోడ్ ఖాళీ చేసి వద్దాం రా అంటూ చెప్పడంతో వెళ్లిపోయాడు. సోమవారం వెళ్లాడు.. గురువారం రాత్రి వచ్చి పడుకున్నాడు. తెల్లారేసరికి పోలీసులు వచ్చి తీసుకెళ్లారు’అని లక్ష్మి తెలిపింది. -
తారాగ్రహం
ప్రియాంకారెడ్డి దారుణ మృతి దేశమంతా ప్రతిస్పందనలను వినిపిస్తూనే ఉంది. నిందితులను అప్పజెప్తే ప్రజాకోర్టులో శిక్షిస్తామని ప్రజలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాల నుంచే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా తారలు తమ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ కొందరి ట్వీట్స్ ఇస్తున్నాం. ప్రియాంక ఘటన నన్ను బాధించింది. ఆమె ఎంత బాధను అనుభవించిందో అనే ఆలోచనే కష్టంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించా ల్సిందిగా నా అక్కాచెల్లెళ్లను వేడుకుంటున్నాను. – నటుడు మంచు మనోజ్ ఇలాంటి ఆలోచన వస్తే భయం వేసేలా ఒక్క తీర్పు రావాలి. అప్పుడే నేరాలు చేయాలనుకునేవారిలో మార్పు వస్తుంది. – నటుడు రామ్ ప్రియాంక హత్యను ఖండించడానికి దారుణం, కిరాతకం వంటి మాటలు సరిపోవు. ఆడపిల్లలను కాపాడుకోలేకపోతే మనకు భవిష్యత్తు ఉండదు. – నటుడు ‘అల్లరి’ నరేశ్ ప్రియాంక ఘటన షాక్‌కు గురి చేసింది. చాలా కోపం వచ్చింది. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదు. – నటుడు సుశాంత్ ప్రియాంక ఘటన విని చాలా కలత చెందాను. మహిళలపై అఘాయిత్యాలకు ఫుల్స్టాప్ పడాలి. మన మహిళలు సురక్షితంగా ఉండే వాతావరణం రావాలి – నటుడు అఖిల్ ఆపద సమయంలో పోలీసుల సహాయం తీసుకోవాలి. లైవ్ లొకేషన్ యాప్స్, అత్యవసర ఫోన్ కాల్ ఆప్షన్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలి. – నటుడు సుధీర్‌బాబు దోషులకు మరణశిక్ష విధించినప్పుడే ఇలాంటి భయంకర ఘటనలు ఆగుతాయి. నీకు (ప్రియాంక) ఇలా జరిగినందుకు సమాజం సిగ్గుపడాలి. – నటుడు నిఖిల్ ప్రియాంక హత్య వినగానే బాధ, కోపం, నిస్సహాయత వంటి భావోద్వేగాలు కలిగాయి. మనందరి ఆగ్రహం ఆమెకు న్యాయం జరగడానికి తోడ్పడాలి. మహిళలు కూడా భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. – నటుడు అల్లు శిరీష్ ప్రియాంకకు జరిగినదానికి ఏ విధంగా న్యాయం చేయగలం? మహిళలకు ఈ ప్రపంచంలో రక్షణ ఎప్పుడు లభిస్తుందో? – నభా నటేష్ ప్రియాంక ఘటనలో దోషులకు జీవిత ఖైదు సరిపోదు. రేపిస్టులను కఠినంగా శిక్షించినప్పుడు ఇలాంటివి ఆగుతాయి. లేకపోతే ఆగవేమో అనిపిస్తోంది. మహిళా చట్టాలు మరింత బలంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – నటి, నిర్మాత చార్మీ అసలు మహిళలకు రక్షణ ఉందా? అనిపిస్తోంది. మీరు (స్త్రీ) అపాయంలో ఉన్నప్పుడు సహాయం అడగటానికి వెనకాడకండి. అలాగే మరొకరు ఆపదలో ఉన్నారన్నప్పుడు సహాయం చేయకుండా ఉండకండి. – నటి రష్మికా మందన్నా ప్రియాంక ఘటన బాధించింది. ఇది మనకు తెలిసిన ఘటన. ఇలాంటి తెలియని çఘటనలు ఇంకా ఎన్ని ఉన్నాయో? దోషులకు శిక్ష పడాలి. – నిధీ అగర్వాల్ చట్టాలు మారే లోపు ఇంకెంతమంది అమాయక మహిళలు చనిపోవాలి? దేశంలోని మహిళలకు సరైన న్యాయం ఎప్పుడు? స్త్రీలకు సురక్షిత వాతావరణం ఎప్పుడొస్తుంది? ప్రియాంక ఘటనలో మానవత్వం చనిపోయిందనిపిస్తోంది. – నటుడు అనిల్ కపూర్ హైదరాబాద్‌లో ప్రియాంక, తమిళనాడులో రోజా, రాంచీలో లా స్టూడెంట్... ఇలా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉండటం విచారకరం. సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. నిర్భయ చట్టం వచ్చి ఏడేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇలాంటి భయంకర ఘటనలు ఆగడం లేదు. మన చట్టాలు ఇంకా కఠినంగా ఉండాలి. – నటుడు అక్షయ్ కుమార్ ప్రియాంక ఘటన నన్ను బాధిస్తోంది. మానవ రూపంలో ఉన్న సైతాన్లు వాళ్లు. నిర్భయ, ప్రియాంక వంటి అమాయకులు మన మధ్యలోనే ఉన్న కొందరు సైతాన్ల వల్ల చనిపోతున్నారు. మరో అమాయకురాలు ఇలాంటి ఘటన బారిన పడకుండా మనం అందరం చేతులు కలపాలి. ఇలాంటి సంఘటనలను ఆపాలి. – నటుడు సల్మాన్ ఖాన్ మహిళలపై ఆత్యాచారాలు జరగకుండా దేశం అంతా సంఘటితం కావాల్సిన తరుణం ఇది. అంత సులభంగా మహిళలపై అఘాయిత్యాలకు ఎలా పాల్పడుతున్నారు? ఆ రాక్షసులు చట్టానికి ఎందుకు భయపడటం లేదు? ప్రియాంకకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా మనం పోరాడాలి. – నటుడు వరుణ్ ధావన్ -
చర్లపల్లి జైలుకు ఉన్మాదులు
షాద్‌నగర్‌టౌన్, షాద్‌నగర్ రూరల్: ప్రియాంకారెడ్డి హత్యోదంతంలో పాల్గొన్న దుండగులు ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును పోలీసులు శనివారం తెల్లవారు జామున 4గంటల సయమంలో శంషాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించా రు. పోలీసులు స్టేషన్లోనే నిందితులకు వైద్య పరీక్షలు చేయించి తహసీల్దార్ ఎదుట హాజరు పర్చి ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీస్ స్టేషన్లోనే నిందితులకు వైద్య పరీక్షలు ప్రియాంకరెడ్డిని హత్య చేసిన దుండగులు ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును మెజిస్ట్రేషన్ ఎదుట హాజరు పరిచే ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. షాద్‌నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో నిందితులకు వైద్య పరీక్షలు చేయించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, నిందితులు పోలీస్‌స్టేషన్‌లో ఉండటం.. బయట ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ముగ్గురు డాక్టర్లు పోలీస్ స్టేషన్‌కే వచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ సురేందర్, డాక్టర్ కిరణ్‌లు నిందితులకు సుమారు రెండు గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. జడ్జి అందుబాటులో లేకపోవడంతో.. పట్టుబడిన నిందితులను షాద్‌నగర్ కోర్టులో శనివారం ఉదయం హాజరుపరచాల్సి ఉంది. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో సమావేశం నిమిత్తం షాద్‌నగర్ కోర్టు జడ్జిలు అక్కడికి వెళ్లారు. దీంతో ఫరూఖ్‌నగర్ తహసీల్దార్ పాండునాయక్, ఆర్ఐ ప్రవీణ్ పోలీసు వాహనంలో స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్లో తహసీల్దార్ పాండునాయక్ ఎదుట పోలీసులు నిందితులను హాజరుపరిచారు. వారికి తహసీల్దార్ 14రోజుల రిమాండ్ విధించారు. చర్లపల్లి జైల్ వద్ద పోలీసులతో వాగ్వివాదం చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలు చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్తత... కుషాయిగూడ: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసులో అరెస్టైన నిందితులను శనివారం కట్టుదిట్టమైన భద్రత నడుమ షాద్‌నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. విద్యార్థి సంఘాల నాయకులు పెద్దెత్తున్న జైలు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. నిందితులను ఉరి తీయాలంటూ నినాదాలు చేస్తూ జైలు వైపు దూసుకొచ్చారు. జైలు మెయిన్ గేట్‌కు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. జైలు వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులను తరలిస్తున్న వాహనాలు జైలు వద్దకు చేరుకునే సమయంలో చక్రిపురం నుంచి, చర్లపల్లి నుంచి జైలు వైపుగా వచ్చే వాహనాలను నిలిపేశారు. నిందితులను తరలిస్తున్న వాహనం సాయంత్రం 6:05 నిమిషాలకు జైలులోకి ప్రవేశించింది. ఈ క్రమంలో జైలు వైపు వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు రోప్‌తో అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో వారందరిని పోలీసులు అరెస్టు చేసి కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులను చర్లపల్లి జైలులోని హై సెక్యూరిటీ బ్యారక్‌లో వేర్వేరు సెల్‌లలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వార్తలు: ముందే దొరికినా వదిలేశారు! 28 నిమిషాల్లోనే చంపేశారు! -
ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలి
హైదరాబాద్: ప్రియాంకారెడ్డిపై జరిగిన అఘాయిత్యం పట్ల రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీలు బాధ్యతారహితంగా హేళనగా మాట్లాడటం సమంజసం కాదని, దీనికిగానూ తక్షణమే వారిద్దరూ క్షమాపణ చెప్పాలని మాజీ మం త్రి, బీజేపీ నాయకురాలు డి.కె.అరుణ డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ ధర్నాచౌక్ వద్ద మౌనదీక్ష నిర్వహించింది. ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలని, మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేసింది. మౌనదీక్షకు ముందు జరిగిన సభలో డి.కె.అరుణ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణలో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా అత్యాచారాలు, హత్యలు, యాసిడ్ దాడు లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రియాంక హత్య: చిలుకూరు ఆలయం మూసివేత
మొయినాబాద్ (చేవెళ్ల): వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణహత్యకు నిరసనగా శనివారం రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని మూసివేశారు. ఉదయం 11 గంటల నుంచి 20 నిమిషాలపాటు ప్రదక్షణలు, దర్శనాలు పూర్తిగా నిలిపివేసి ఆలయాన్ని మూసివేశారు. అనంతరం ఆలయం ఎదుట భక్తులతో మహాప్రదక్షణ చేయించారు. ‘రక్షిద్దాం.. రక్షిద్దాం.. స్త్రీజాతిని రక్షిద్దాం’అంటూ భక్తులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ మహాప్రదక్షణ నిర్వహించారు. స్త్రీలకు రక్షణ కల్పించాలంటూ మొక్కతున్న భక్తులు ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ.. ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. 9 నెలల పాప నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు రక్షణ లేకుండాపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలు సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు కన్నయ్య, మురళీ తదితరులు పాల్గొన్నారు. -
నా రక్షణ సంగతేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రియాంకారెడ్డి హత్యపై పార్లమెంటు వద్ద ఓ యువతి గళమెత్తింది. తన సొంత దేశంలో తనకు రక్షణ ఉన్న భావన కలగడం లేదని వాపోయింది. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల వార్తలు వినీ వినీ తాను అలసిపోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రియాంకకు ఎదురైన ఉదంతం తనకు ఎదురైతే పరిస్థితి ఏంటి? అంటూ కన్నీటిపర్యంతమైంది. ఈ దేశంలో తనకు ఉన్న రక్షణ ఏంటి? అంటూ నిలదీసింది. ప్రియాంక హత్యపై ఢిల్లీకి చెందిన అను దూబే తీవ్ర కలత చెందింది. ఈ ఘటన తనకు ఎదురైతే పరిస్థితి ఏంటని ఊహించుకొని కుమిలిపోయింది. తన రక్షణపై పాలకులను ప్రశ్నిస్తూ శనివారం ఉదయం 7 గంటలకే పార్లమెంటు వద్ద తనొక్కటే నిరసనకు దిగింది. దేశంలో తనకు ఉన్న రక్షణ ఏంటి అంటూ ప్రశ్నిస్తూ ప్లకార్డు పట్టుకొని కూర్చుంది. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక మరోసారి ఈ దేశంలో ఇలాంటి ఘటనలు చూసేందుకు తాను సిద్ధంగా లేనంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆ యువతి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. చివరికి పోలీసులు ఆమెను బలవంతంగా పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, అను దూబేను పోలీసులు అడ్డుకున్న తీరును ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తీవ్రంగా ఆక్షేపించారు. దూబేతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని దూబేకు సంఘీభావం తెలిపారు. ఢిల్లీలో ఆందోళనలు.. ప్రియాంకారెడ్డి హత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. యువ వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేయడంపై యావత్తు దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రియాంక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. దోషులను ఉరితీయాలంటూ శనివారం పార్లమెంటు స్ట్రీట్ వద్ద ఆందోళన బాటపట్టాయి. చదవండి: ముందే దొరికినా వదిలేశారు! 28 నిమిషాల్లోనే చంపేశారు! -
పెల్లుబికిన ప్రజాగ్రహం
షాద్‌నగర్ టౌన్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. ఆమెను దారుణంగా హత్యచేసిన ఉన్మాదులను వెంటనే ఎన్కౌంటర్ చేసి చంపేయాలంటూ పెద్ద ఎత్తున ప్రజలు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు పోటెత్తారు. వారిని తమకు అప్పగిస్తే ప్రజాకోర్టులో తగిన బుద్ధి చెబుతామంటూ ఆందోళన చేశారు. ఓ దశలో పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రియాంకారెడ్డి హత్య కేసులో నిందితులను పోలీసులు శనివారం తెల్లవారుజామున 4 గంటలకు షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు, విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు స్టేషన్‌కు భారీగా చేరుకున్నారు. వేలాది మంది ఒక్కసారిగా తరలి రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిందితులను తమకు అప్పగించాలంటూ నినాదాలు చేశారు. లాఠీచార్జి చేసి నిరసనకారులను చెదరగొడుతున్న పోలీసులు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో కొంతమంది పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా.. పలువురు నిరసనకారులు పోలీసులపైకి చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు. అరగంట తర్వాత మళ్లీ వారంతా స్టేషన్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. వారిని అదుపు చేయాలని పోలీసులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఠాణా ఎదుట ఏర్పాడు చేసిన బారికేడ్లను కూడా ఆందోళనకారులు తోసేసి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఆందోళనకారులపై లాఠీచార్జీ చేసి చెదరగొట్టాయి. పోలీసు వాహనాల అడ్డగింత.. రాళ్లదాడి ప్రియాంక హత్య కేసులోని నిందితులను పోలీసులు భారీ బందోబస్తు మధ్య చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఓ వ్యక్తి పోలీసు వ్యాన్‌కు అడ్డుగా పడుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతడిని పక్కకు లాగేశారు. దీంతో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు మరోసారి లాఠీచార్జీ చేసి, వారిని చెదరగొట్టారు. అనంతరం నిందితులను అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు షాద్‌నగర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల వాహనాలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రజలు ఆందోళన విరమించారు. చదవండి: ముందే దొరికినా వదిలేశారు! 28 నిమిషాల్లోనే చంపేశారు! పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా? పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త -
ముందే దొరికినా వదిలేశారు!
డ్రైవింగ్ లైసెన్స్ లేదు.. పైగా ఓవర్ లోడ్.. అలాంటి లారీ కనిపిస్తే ఆర్టీఓ ఏం చేయాలి? స్వాధీనం చేసుకోవాలి. కానీ మహబూబ్‌నగర్ ఆర్టీఓ ఆ పని చేయలేదు. ముందు హైవేపై అక్రమ పార్కింగ్.. తర్వాత సర్వీస్ రోడ్డులో గంటల తరబడి లారీ... అప్పుడు పెట్రోలింగ్ పోలీసులు ఏం చేయాలి? లారీని తీసేలా చర్యలు తీసుకోవాలి. కానీ వారు ఆ పని చేయలేదు. ఈ రెండు ఘటనల్లో ఎవరి పని వారు సక్రమంగా నిర్వర్తించి ఉంటే.. ప్రియాంక ప్రాణాలతోనే ఉండేది. అక్కడ ఆర్టీఓ, ఇక్కడ పోలీసులు తమ విధులు కచ్చితంగా పాటించి ఉంటే ఓ అమాయక అతివ..ఉన్మాదుల పశువాంఛకు బలయ్యేది కాదు. సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డిజిల్లా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేర్వేరు అంశాల్లో నిబంధనలు ఉల్లంఘించిన నిందితులను రెండుసార్లు వదిలేయడమే ప్రియాంక పాలిట శాపమైంది. ఆమెపై హత్యాచారం జరగడానికి ఒకరోజు ముందు నిందితులు వస్తున్న లారీని మహబూబ్‌నగర్ ఆర్టీఓ పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడం, పైగా ఓవర్ లోడ్ ఉండటంతో నిబంధనల ప్రకారం దానిని సీజ్ చేయాల్సి ఉండగా.. ఆర్టీఓ ఆ పని చేయకుండా వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం తొండుపల్లి చేరుకున్న నిందితులు లారీని హైవేపై అక్రమంగా పార్క్ చేశారు. ఘటన జరగడానికి 12 గంటల ముందు అటుగా వచ్చిన హైవే పెట్రోలింగ్ పోలీసులు.. లారీని అక్కడి నుంచి తీసేయాలని హెచ్చరించి వెళ్లిపోయారు. దీంతో నిందితులు తొండుపల్లి టోల్‌ప్లాజా గేట్ దగ్గరున్న సర్వీస్ రోడ్డులో లారీని నిలిపి అలాగే ఉంచారు. అక్కడే చాలాసేపు లారీ ఉండటం.. ఆపై అక్కడకు వచ్చిన ప్రియాంకను నిందితులు చూడటంతో వారి మదిలో దుర్బుద్ధి పుట్టి పథకం ప్రకారం ఘాతుకానికి తెగబడ్డారు. ఒకవేళ ఆర్టీఓ ఆ లారీని సీజ్ చేసినా.. సర్వీస్ రోడ్డులో కూడా అంతసేపు లారీని నిలపకుండా పోలీసులు చర్యలు తీసుకున్నా.. ఈ దురాగతం జరిగి ఉండేది కాదని రిమాండ్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను పోలీసులు శనివారం షాద్‌నగర్ మొదటి శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించారు. అందులోని ముఖ్యాంశాలివీ.. ఆర్టీఓకి చిక్కి ... నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ నవంబర్ 21న బూర్గుల గ్రామం నుంచి ఇనుప కడ్డీలు తీసుకుని వెళ్లి కర్ణాటకలోని రాయచూర్‌లో ఆన్లోడ్ చేశారు. అనంతరం లారీ యజమాని సూచనలతో నవంబర్ 24న గంగావతికి వెళ్లి ఇటుకలు లోడ్ చేసుకొని హైదరాబాద్ బయలుదేరారు. వచ్చేదారిలో నవీన్, చెన్నకేశవులు గుడిగండ్ల గ్రామంలో కలిశారు. అదే గ్రామంలో పొదల్లో ఉన్న ఐరన్ చానల్స్‌ను లోడ్ చేసుకుని తీసుకొస్తుండగా 26న మహబూబ్‌నగర్ ఆర్టీఓ లారీని ఆపి తనిఖీలు చేశారు. ఆరిఫ్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, పైగా లారీ ఓవర్ లోడ్‌తో ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆర్టీఓకు లారీ అప్పగించి రావొద్దంటూ యజమాని స్పష్టంచేయడంతో ఆరిఫ్.. లారీ స్టార్ట్ కాకుండా చూసేందుకు సెల్ఫ్ స్టార్ట్ వైర్ పీకేశాడు. దీంతో ఆర్టీఓ లారీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచి బయలుదేరి మార్గమధ్యంలో రాయ్కల్ టోల్ ప్లాజా వద్ద ఇనుప కడ్డీలను విక్రయించిన నిందితులు రూ.4 వేలు సంపాదించారు. అనంతరం తొండుపల్లి వచ్చి అక్కడే లారీ కేబిన్‌లో నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు పోలీసు పెట్రోలింగ్ వాహనం వచ్చి అక్కడి నుంచి లారీని తీసేయాలని హెచ్చరించడంతో.. సమీప దూరంలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులోకి లారీని తీసుకెళ్లి అక్కడ నిలిపి ఉంచారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో మద్యం కొనుగోలు చేసి, కేబిన్‌లోనే తాగుతూ కూర్చున్నారు. ఆ సమయంలో లారీ పక్కనే స్కూటీ పార్క్ చేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ప్రియాంకారెడ్డిని చూశారు. ఆమె అందంగా ఉందని, స్కూటీ కోసం తిరిగి వచ్చినప్పుడు ఆమెపై అత్యాచారం చేయాలని నిందితులు కుట్ర పన్నారు. పథకం ప్రకారం స్కూటీ వెనుక టైర్‌ను నవీన్ పంక్చర్ చేశాడు. అప్పటికే ఫుల్ బాటిల్ మద్యం తాగిన నిందితులు మరో హాఫ్ బాటిల్ తెచ్చుకుని తాగుతూ కూర్చున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో ప్రియాంక రావడాన్ని గమనించారు. ఆరిఫ్, చెన్నకేశవులు ఆమె వద్దకు వెళ్లి.. మేడమ్, మీ స్కూటీ టైర్ పంక్చర్ అయిందని చెప్పి మాట కలిపారు. వారి వాలకం చూసిన ప్రియాంక స్పందించలేదు. కానీ నిందితులు ఆమెకు సహాయం చేస్తున్నట్టు నటించారు. స్కూటీ టైర్లో గాలి నింపుకొని తీసుకురావాలని ఆరిఫ్.. శివను పంపించాడు. ఆరిఫ్ మాట్లాడుతుండగానే ప్రియాంక తన చెల్లెలికి ఫోన్ చేసి లారీ డ్రైవర్లును చూస్తుంటే భయమేస్తోందని చెప్పింది. కొద్దిసేపటికి షాప్ మూసి ఉందంటూ శివ తిరిగి వచ్చాడు. హెల్ప్.. హెల్ప్ అన్నా వదిలిపెట్టలేదు మరో షాప్‌లో గాలి నింపుకొని వస్తానంటూ శివ మళ్లీ బండి తీసుకుని వెళ్లాడు. అతడు గాలి నింపుకొని తిరిగి వచ్చిన వెంటనే నిందితులు తమ పథకాన్ని అమలు చేశారు. ఆరిఫ్ ప్రియాంక చేతులు పట్టుకోగా.. చెన్నకేశవులు ఆమె కాళ్లు, నవీన్ నడుము వద్ద పట్టుకుని ప్రహరీ గోడ లోపలున్న చెట్ల పొదల్లోకి బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో ఆమె హెల్ప్.. హెల్ప్ అంటూ ఆర్తనాదాలు చేసినా నిందితులు కనికరించలేదు. అరుపులు బయటకు వినిపించకుండా ఆరిఫ్ ఆమె నోటిని తన చేతితో మూసివేశాడు. వెంటనే నవీన్ ఆమె సెల్‌ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశాడు. శివ ఆమె దుస్తులను లాగేశాడు. దీంతో మళ్లీ హెల్ప్.. హెల్ప్ అని అరవడంతో నవీన్, చెన్నకేశవులు ప్రియాంక నోట్లో మద్యం పోశారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు పాశవికంగా అత్యాచారం చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రియాంక స్పృహ కోల్పోయింది. కొంతసేపటికి స్పృహ రావడంతో నిందితులు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. ఆరిఫ్ ఆమె నోరు, ముక్కును చేతులతో గట్టిగా అదిమి పట్టడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. నవీన్ కుమార్ ఆమె సెల్‌ఫోన్, పవర్ బ్యాంక్, వాచీలను కవర్లో పెట్టి లారీలో ఉంచాడు. అనంతరం ఓ బెడ్‌షీట్‌లో మృతదేహాన్ని చుట్టి లారీలో పడేశారు. అక్కడి నుంచి నవీన్, శివ స్కూటీపై, మహమ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు లారీలో షాద్‌నగర్ వైపు రాత్రి 11 గంటలకు బయలుదేరారు. నవీన్, శివ బాటిల్ తీసుకుని పెట్రోల్ కోసం కొత్తూరు శివారులోని బంకుకు వెళ్లారు. అయితే, వారిపై అనుమానం వచ్చిన బంక్ ఉద్యోగి లింగరామ్ గౌడ్ బాటిల్లో పెట్రోల్ పోయడానికి నిరాకరించాడు. దీంతో దగ్గర్లో ఉన్న ఐవోసీ పెట్రోల్ బంక్‌లో నిందితులిద్దరూ పెట్రోల్ కొనుగోలు చేశారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి అండర్‌పాస్ వద్దకు అందరూ చేరుకున్నారు. మృతదేహాన్ని లారీ నుంచి దింపి అండర్‌పాస్ కిందికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత ప్రియాంక సిమ్‌కార్డులు, బ్యాగ్‌ను అదే మంటల్లో వేసి కాల్చేశారు. అనంతరం అక్కడి నుంచి ఆరాంఘర్ వైపు వెళ్లిపోయారు. సంబంధిత వార్తలు 28 నిమిషాల్లోనే చంపేశారు! పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా? పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త ప్రియాంక కేసులో ఇదే కీలకం ‘నా కొడుకుకు ఉరిశిక్ష వేసినా ఫర్వాలేదు’ -
ప్రియాంక హత్య కేసు : ముగ్గురు పోలీసులపై వేటు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: డాక్టర్ ప్రియాంకారెడ్డి అత్యాచారం, హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు పడింది. శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రియాంక తల్లి, చెల్లి భవ్య పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించిన తీరుపై, కేసు నమోదులో జాప్యం కారణంగా ఎస్సై రవికుమార్, హెడ్‌కానిస్టేబుళ్లు పి.వేణుగోపాల్‌రెడ్డి, ఎ.సత్యనారాయణ గౌడ్లను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై బాధితురాలి కుటుంబం చేసిన ఫిర్యాదును ఆధారం చేసుకుని విచారణ జరిపించిన కమిషనర్.. ఈమేరకు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. ప్రియాంక అదృశ్యంపై ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి తనిఖీలు నిర్వహించి ఉంటే తమ కూతురు ప్రాణాలతోనైనా దక్కేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆమె చనిపోయిన తర్వాత ఎన్ని బృందాలతో దర్యాప్తు చేసినా ఏ ఫలితం లేదని కన్నీటి పర్యంతం కావడం, మీడియాలో సైతం పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కమిషనర్ వేటు వేశారు. (చదవండి : ప్రియాంక ఫోన్ నుంచి ఆరిఫ్‌కు కాల్) -
ప్రియాంక ఫోన్ నుంచి ఆరిఫ్‌కు కాల్
సాక్షి, షాద్‌నగర్: ప్రియాంకారెడ్డి హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోని వచ్చాయి. బైక్ టైర్ పంక్చర్ చేపిస్తామని స్కూటీని తీసుకెళ్లిన ఆరిఫ్ ఎంతకీ రాకపోవడంతో ప్రియాంక తన మొబైల్ నుంచి ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. ప్రియాంక రెడ్డి ఫోన్ ఆధారంగా మహమ్మద్ ఆరిఫ్ ఆచూకీని పోలీసులు కనుకున్నారు. దీంతో కేసు విచారణలో ప్రియాంక ఫోన్ కీలక ఆధారంగా మారింది. రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు బయటకొచ్చాయి. నిందితులు ప్రియాంకను బలవంతంగా తీసుకెళ్లే సమయంలో.. హెల్ప్ హెల్ప్ అని వేడుకున్నా నిందితులు కనికరించలేదు. బలవంతంగా ఆమె నోట్లో మద్యం పోసి అత్యాచారం జరిపి.. రాక్షసానందం పొందారు. ఒకరి తరువాత ఒకరు బాధితురాలిపై అత్యాచారం జరిపినట్లు రిపోర్టులో తేలింది. బుధవారం రాత్రి 9.30 నుండి 10.20 వరకు కీచకులు ఈ దారుణకాండ కొనసాగించారు. ఆ సమయంలో ప్రియాంక తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితులు ముక్కు, నోరు గట్టిగా నొక్కి పట్టారు. దీంతో ఊరిపి ఆడక బాధితురాలు మృతి చెందింది. అనంతరం బాధితురాలిని ప్యాంట్ లేకుండానే లారీ క్యాబిన్ లోకి ఎక్కించారు. లారీలోకి ఎక్కించి తరువాత కూడా మృతదేహంపై కూడా పలుమార్లు అత్యాచారం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడయింది. లారీ క్యాబీన్‌ను పరిశీలించిన పోలీసులు రక్తపు మరకలు, వెంట్రుకలను సేకరించారు. అయితే షాద్‌నగర్ బ్రిడ్జ్ వద్ద ప్రియాంకను కిందకు దింపాలని వారు నిర్ణయించారు. ప్రియాంక బతికే ఉంటుందన్న అనుమానం రావడంతో పెట్రోల్ పోసి కాల్చి చంపారు. కాగా ప్రియాంకను అత్యంత దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను ఇప్పటికే 14 రోజుల రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని, వెంటనే ఉరివేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఎదురైన నిరసనలు.. చర్లపల్లి జైలు వద్ద కూడా కొనసాగుతున్నాయి. ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితులను తమకు అప్పగించాంటూ కొంత మంది యువకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వారిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తన పోలీసులు రంగంలోకి దిగారు. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జైలు పరిసర ప్రాంత్తాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను నిలువరించేందుకు జైలు వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నలుగురు నిందితులను హైసెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచినట్లు జైలు అధికారుల సమాచారం. కాగా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ నుంచి కొంత సమయం క్రితమే నిందితులను చర్లపల్లికి తరలించిన విషయం తెలిసిందే. దీంతో జైలు వద్దకు ముందుగానే భారీగా ఆందోళనకారులు చేరుకున్నారు. నిందితులను తమకు అప్పగించాలని ధర్నాకు దిగారు. లేనిపక్షంలో వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. -
14 రోజుల రిమాండ్.. జైలుకు నిందితులు
సాక్షి, షాద్‌నగర్: ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను పోలీసుల విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే ప్రజాగ్రహం కారణంగా వారిని కోర్టులో ప్రవేశపెట్టడం పోలీసులకు కష్టతరంగా మారింది. దీంతో మండల మెజిస్ట్రేట్ పాండునాయక్, డాక్టర్లు నేరుగా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపారు. నిందితులను చర్లపల్లి జైలుకు తరలించేందుకు పోలీసులు భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. ఆందోళకారులు పెద్ద ఎత్తన అక్కడికి చేరుకోవడంతో వారి కంటపడకుండా నిందితులను తరలించేందుకు దాదాపు పదికి పైగా వాహనాలను సిద్ధం చేశారు. పటిష్ట బందోబస్త్ నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు. ఇదిలావుండగా పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు 5 గంటలుగా ఆందోళకారులు పెద్ద ఎత్తన నిరసనల వ్యక్తం చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో.. స్టేషన్ ప్రధాన గేటుకు తాళం వేశారు. పోలీసుపై కోపంతో చెప్పులు విసురుతున్నారు. ఆందోళకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అంతకీ అదుపులోకి రాకపోవడంతో స్వల్ప లాఠీఛార్జ్ చేశారు. తాజా పరిస్థితిని షాద్‌నగర్, చేవెళ్ల, శంషాబాద్ ఏసీపీలు పర్యవేక్షిస్తున్నారు. -
ప్రియాంక తల్లిదండ్రులు నాతో అదే చెప్పారు: అలీ
సాక్షి, హైదరాబాద్: ప్రియాంకరెడ్డి ఘటన చాలా బాధాకరమని, వారి ఇంట్లో జరిగిన అన్యాయం ఇంకెవరి ఇంట్లో జరగకూడదని సినీనటుడు అలీ అన్నారు. శనివారం ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రియాంక తల్లిదండ్రులతో నేను మాట్లాడినప్పుడు వారు ఒకటే డిమాండ్ చేశారు. తమ కూతురు ఎలాంటి పరిస్థితుల్లో మృతి చెందిందో అలాగే నిందితులను కూడా అలాగే తగలబెట్టాలి అని కోరారు. ప్రియాంక తల్లిదండ్రుల కడుపుకోత వర్ణణాతీతంగా ఉంది. నా కూతురు కూడా డాక్టర్ చదువుతోంది. డాక్టర్ అయిన కూతురు చనిపోతే ఆ కుటుంబం ఎంత బాధ పడుతుందో అర్థం చేసుకోవాలి. భవిష్యత్‌లో ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాన’ని అలీ అన్నారు. పోలీసులూ.. మారండి: భట్టి ప్రియాంకరెడ్డి హత్య సభ్య సమాజం తలదించుకునే దాడి అని, మృగాల్లాగే అమ్మాయిపై దాడి చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ప్రియాంక కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలని, నిందితులని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా విక్రమార్క డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు శిక్ష విధించాలని అభిప్రాయపడ్డారు. పోలీసులు కూడా ఎవరికైనా ఆపద వస్తే తక్షణమే స్పందించాలని సూచించారు. వారి స్టేషన్ పరిధిలోకి వచ్చినా రానున్న కూడా బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి తాము సహకరిస్తామన్నారు. కొంతమందితోనే ఫ్రెండ్లీగా పోలీసులు: శ్రీధర్‌బాబు ప్రియాంక హత్య ఘటనపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా దిగ్బ్రాంది చెందారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సోనియ గాంధీ తమతో మాట్లాడి వివరాలు అడిగారని వెల్లడించారు. పోలీసులు కొంతమందితోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు వైఫల్యం చెందినట్లు కుటుంబ సభ్యులు చెపుతున్నారని అన్నారు. నిందితులపై కట్టిన చర్యలు తీసుకోవాలని రాజకీయాలకు అతీతంగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. సంబంధిత వార్తలు ‘బహిరంగంగా కాల్చి చంపండి’ షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత 28 నిమిషాల్లోనే చంపేశారు! పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా? పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త ప్రియాంక కేసులో ఇదే కీలకం నా కొడుకుకు ఉరిశిక్ష వేసినా ఫర్వాలేదు -
‘మాకు అప్పగించండి.. నరకం చూపిస్తాం’
సాక్షి, హైదరాబాద్: తన కూతురిని అత్యంత పాశవికంగా హత్య చేసిన నలుగురు నేరస్తులను బహిరంగంగా సజీవంగా తగులబెట్టాలని ప్రియాంకరెడ్డి తల్లి విజయమ్మ డిమాండ్ చేశారు. లోకం పోకడ తెలియని తన పెద్ద కుమార్తెను అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘నా కూతురు చాలా అమాయకురాలు. అకారణంగా నా బిడ్డను హత్య చేసిన నిందితులను సజీవంగా తగులబెట్టాలని కోరుకుంటున్నాన’ని విజయమ్మ మీడియాతో చెప్పారు. తాము ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు పోలీసులు సరిగా స్పందించలేదని ఆమె ఆరోపించారు. ‘మా చిన్నమ్మాయి ముందుగా ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. సీసీటీవీ దృశ్యాలు పరిశీలించిన పోలీసులు.. ప్రియాంక గచ్చిబౌలి వెళ్లి తిరిగి రాలేదని చెప్పారు. తమ పరిధిలోకి రాదన్న సాకుతో తర్వాత మమ్మల్ని శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లమన్నారు. అక్కడ ఫిర్యాదు చేయడానికి వెళ్లినపుడు పోలీసులు అభ్యంతకర ప్రశ్నలు వేశార’ని విజయమ్మ వాపోయారు. జైలు వద్దు.. ఎన్కౌంటర్ చేసేయండి ఎంతో సౌమ్యంగా, పద్ధతిగా ఉండే ప్రియాంకరెడ్డి దారుణ హత్యను శంషాబాద్‌లోని నక్షత్ర కాలనీ వాసులు జీర్ణించుకోలేపోతున్నారు. అత్యంత కిరాతకంగా ప్రియాంకను హత్య చేసిన నలుగురు నిందితులను జైల్లో పెట్టొద్దని తమకు అప్పగిస్తే నరకం చూపిస్తామని అంటున్నారు. నలుగురు నేరస్తులను ఎన్కౌంటర్ చేసి చంపాలని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మరోవైపు నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీ ఎత్తున తరలివచ్చారు. నిందితులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బారికేడ్లను ఎత్తిపడేశారు. వీరిని అదుపుచేయలేక పోలీసులు లాఠీచార్జి చేశారు. కాగా, ఇంతటి ఘోరానికి పాల్పడిన తన కొడుకును ఉరి తీసినా ఫర్వాలేదని ఏ–4 చింతకుంట చెన్నకేశవులు తల్లి జయమ్మ వ్యాఖ్యానించారు. సంబంధిత వార్తలు 28 నిమిషాల్లోనే చంపేశారు! పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా? షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త ప్రియాంక కేసులో ఇదే కీలకం నా కొడుకుకు ఉరిశిక్ష వేసినా ఫర్వాలేదు -
హోం మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం: గీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ నేత గీతారెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా నగరంలో చోటుచేసుకున్న ప్రియాంకరెడ్డి హత్యపై స్పందించిన గీతా రెడ్డి శనివారం ప్రియాంక తల్లిదండ్రులను కలిసి పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రియాంక హత్య అందరిని కలచివేస్తుందన్నారు. ప్రియాంక ఘటన మరవక ముందే మరో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం బాధాకరమన్నారు. 50 శాతం ఉన్న మహిళలకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 2017లో మహిళలపై 14 శాతం హత్యలు పెరిగాయన్నారు. అంతేగాక మహిళ అక్రమ రవాణా కూడా పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, వారితో కూడా సరిగా మాట్లాడలేదని గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రమాద సమయంలో ప్రియాంక తన చెల్లెలికి కాకుండా పోలీసులకు కాల్ చేయాలి’ అని హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి : ప్రియాంక చిన్న పొరపాటు వల్లే: మహమూద్ అలీ -
షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర టెన్షన్..టెన్షన్..
సాక్షి, రంగారెడ్డి : షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రియాంకారెడ్డి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు, నగర ప్రజలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నిందితులను తమకు అప్పగించాలంటూ నినాదాలు చేసుకుంటూ స్టేషన్లోకి వచ్చేందుకు యత్నించారు. బారికేడ్లను తోసుకుంటూ స్టేషన్‌వైపు పరుగులు తీశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నిందితులను ఆస్పత్రికి తరలించే పరిస్థితి లేకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్దకే డాక్టర్లను రప్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో నిందితులను షాద్‌నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రియాంకారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ శనివారం మధ్యాహ్నం 3గంటలకు ఆమె ఇంటికి వెళ్లనున్నారు. న్యాయ సహాయం అందించం ప్రియాంకారెడ్డి హత్యను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ బార్ అసోసియేషన్లు తీవ్రంగా ఖండించాయి. నిందితులకు ఎటువంటి న్యాయ సహాయం అందించకూడదని మహబూబ్‌నగర్ జిల్లా బార్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. నిందితుల బెయిల్ కోసం ఎవరూ సహకారం అందించకూడదని విజ్ఞప్తి చేశారు. -
నా కొడుకును ఎలా చంపినా పర్లేదు
సాక్షి, మహబూబ్‌నగర్ : ప్రియాంకను ఎలా చంపారో.. తన కొడుకును కూడా అలాగే చంపినా ఫర్వాలేదని ప్రియాంకారెడ్డి హత్యకేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తల్లి జయమ్మ మీడియాకు తెలిపారు. తన కొడుకు ఇలాంటి పని చేశాడని తెలిసి తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులు.. ఏ-1 మహమ్మద్ ఆరిఫ్ (26), ఏ-2 జొల్లు శివ (20), ఏ-3 జొల్లు నవీన్ (20), ఏ-4 చింతకుంట చెన్నకేశవులు (20) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. ప్రియాంకను లాక్కెళ్లి, లైంగికదాడికి పాల్పడి, హత్య చేయడం అంతా 28 నిమిషాల్లోనే జరిగిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలో నిందితులను ఉరి తీయాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడు చెన్నకేశవులు తల్లి జయమ్మ ’సాక్షి’తో మాట్లాడారు. ’నా కొడుకు ఇట్లా చేస్తాడనుకోలేదు. లవ్ మ్యారేజీ చేసుకున్నప్పటికీ ఏం అనలేదు. అయ్యిందేదో అయ్యిందనుకున్నాం. వాడికి కిడ్నీ పాడైంది. జక్లేర్ వ్యక్తి(మహ్మద్ ఆరిఫ్)తో స్నేహం చేసిన తర్వాతే పాడైపోయాడు. లారీ లోడ్ చేయాలని వాడే నా కొడుకును తీసుకుపోయిండు. ఇప్పుడు ఊరంతా మా గురించే మాట్లాడుతున్నారు. అయితే అందరికీ ఒకటే బాధ. నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. పోలీసులు తెల్లవారుజామున రెండు గంటలకు నా కొడుకును తీసుకుపోయారు. ప్రియాంకను ఎలా చంపారో నా కొడుకును అలా చంపినా ఫర్వాలేదు. ఉరి వేయండి లేదా కాల్చి చంపుర్రి. ఇప్పుడు నా కొడుకును ఏం చేయొద్దంటే ఎవరూ వినరు. నేను మాత్రమే తొమ్మిది నెలలు మోసి కొడుకును కనలేదు కదా. ఆ అమ్మాయి తల్లిది కూడా కడుపుకోతే. అందరిదీ అదే బాధ’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక హత్యకేసులో కొత్త ట్విస్ట్! నా కొడుకు అలాంటివాడు కాదు: ఆరిఫ్ తల్లి అందుకే మా పాప ప్రాణం పోయింది: ప్రియాంక తండ్రి ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు 28 నిమిషాల్లోనే చంపేశారు! -
ప్రియాంక హత్యకేసులో కొత్త ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై నలుగురు కాకుండా ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో ఐదో వ్యక్తి ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. పరారీలో ఉన్న ఐదో నిందితుడు నారాయణపేట జిల్లా పొర్లకు చెందిన యువకుడిగా గుర్తించినట్లు సమాచారం. నిందితుడి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూరులోని ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యురాలిగా పనిచేస్తున్న ప్రియాంకారెడ్డిని బుధవారం రాత్రి షాద్‌నగర్ హైవేలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితులు.. ఏ–1 మహమ్మద్ ఆరిఫ్ (26), ఏ–2 జొల్లు శివ (20), ఏ–3 జొల్లు నవీన్ (20), ఏ–4 చింతకుంట చెన్నకేశవులు (20)లను పోలీసులు అదుపులోకి తీసుకొని షాద్‌నగర్ పీఎస్‌కు తరలించారు. శుక్రవారం రాత్రంతా నిందితులను విచారించారు. ఈరోజు(శనివారం) కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి కోరనున్నారు. ప్రియాంక ఇంటికి జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కాగా, ప్రియాంకారెడ్డి హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కాసేపటి క్రితమే ప్రియాంక ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రియాంకారెడ్డి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు, నగర ప్రజలు డిమాండ్ చేశారు. నినాదాలు చేసుకుంటూ స్టేషన్లోకి వచ్చేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కాగా, నిందితులను మెడికల్ ఎగ్జామిన్ కోసం ఆస్పత్రికి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. మెడికల్ ఎగ్జామిన్ తర్వాత నిందితులను షాద్‌నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. చదవండి: 28 నిమిషాల్లోనే చంపేశారు! ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు -
పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త
హైదరాబాద్‌లో శంషాబాద్ హైవే మీద అఘాయిత్యం జరిగింది. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై నలుగురు దుర్మార్గుల దాష్టీకం సాగింది. ఇది సిగ్గు పడాల్సిన సమయం కడుపులో అగ్గి రగలాల్సిన సమయం. ప్రతి అమ్మాయికి రోడ్డు మీద తిరుగుతున్న పశువుల గురించి హెచ్చరించాల్సిన సమయం. సాక్షి ఫీచర్స్ డెస్క్: అమ్మాయీ... పని మీద బజారుకు వెళుతున్నావు జాగ్రత్త. రోడ్డు మీద పశువులు తిరుగుతున్నాయి. అమ్మాయీ.. చదువుకోవడానికి కాలేజీకి వెళుతున్నావు జాగ్రత్త. దారిలో పశువులు రంకెలు వేస్తున్నాయి. అమ్మాయీ... ఉద్యోగానికి బండెక్కి వెళుతున్నావు జాగ్రత్త. పశువులు మాటేసి, దారి కాచి పడేస్తున్నాయి. పశువులు ఇవి. ప్యాంటూ షర్టూ వేసుకున్న పశువులు. మీసాలు గడ్డాలు ఉన్న పశువులు. ఛాతీ మీద వెంట్రుకలుండే పశువులు. మగవాడంటే మొలభాగం మాత్రమే అని, స్త్రీ అంటే కటి భాగం మాత్రమే అని భావించే పశువులు. పశువులకే తలవొంపులు తెచ్చే పశువులు. అమ్మాయీ.. జాగ్రత్త. బయలుదేరే ముందు నీ హ్యాండ్ బ్యాంగ్‌లో కత్తి పెట్టుకో. కారప్పొడి పెట్టుకో. వీలైతే ఒక తుపాకీ పెట్టుకో. కుప్పకూల్చే ఒక పిడుగునే పెట్టుకో. అన్నింటికీ మించి చాలా చాలా ధైర్యం పెట్టుకో. నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన సమయస్ఫూర్తి పెట్టుకో. అమ్మాయీ... పశువులు ముందు నమ్మించేలా వస్తాయి. నమ్మకాన్ని కలిగిస్తాయి. తోక ఊపుతాయి. మాట కలుపుతాయి. వెంటనే నమ్మకు తల్లీ. ఏమాత్రం నమ్మకు. మగది అని తెలిస్తే ఆఖరుకు పశువును కూడా నమ్మకు. మగ మనిషిని అసలు ఏమాత్రం నమ్మకు. అమ్మాయీ... పశువు ఒకోసారి ప్రేమ అనే చర్మం కప్పుకొని వస్తుంది. ప్రియుడు అనే పేరుతో వస్తుంది. కబుర్లు చెబుతుంది. కానుకలు ఇస్తుంది. ఒంటరి ప్రదేశంలో కలుద్దామని చెబుతుంది. వెళ్లకు తల్లీ. వెళ్లకు. ప్రేమను కూడా కలుషితం చేసే స్థాయిలో, ప్రేమకు కూడా పాపం అంటగట్టే స్థాయిలో, ప్రేమంటేనే భయపడే స్థాయిలో పశువులు కొమ్ములు విసురుతాయి. దొరికావా? కూల్‌డ్రింకుల్లో మత్తుమందులు కలుపుతాయి. నగ్నంగా వీడియోలు తీస్తాయి. కారులో తిప్పుతూ కోరలు దింపుతాయి. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టి పెంచుకున్న తల్లివమ్మా నువ్వు. ఈ ప్రేమ పశువుల నుంచి నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఎప్పుడో ఒకసారి పులి ఎదురొస్తుంది. ఎప్పుడో ఒకసారి పాము కరుస్తుంది. ఎప్పుడో ఒకసారి తేలు కనపడుతుంది. కాని ఇది అలా కాదు తల్లీ. అనుక్షణం ప్రమాదం నీ పక్కనే పొంచి ఉంటుంది. ఊరు అని లేదు, వాడ అని లేదు, వీధి అని లేదు, హైవే అని లేదు, రాత్రి అని లేదు, పగలు అని లేదు. తనవాళ్లని లేదు, పరాయి వాళ్లని లేదు. నువ్వొక అమ్మాయివైతే, స్త్రీవైతే, మహిళవైతే, చిన్నారి పాపవైనా సరే, ప్రమాదంలో ఉన్నట్టే. చాలా ప్రమాదంలో ఉన్నట్టే. అనుక్షణం నువ్వు వేయి కళ్లతో లక్ష ఆయుధాల పహారాతో నిన్ను నువ్వు రక్షించుకోవాల్సిందే. మరి ఈ సమాజం ఏం చేస్తుంది? చూస్తూ ఉంటుంది. అంతా జరిగాక ‘అయ్యయ్యో’ అంటుంది. ఫేస్బుక్లో పోస్టులు రాస్తుంది. టీవీ కెమెరాల ముందు ఖండిస్తుంది. కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేస్తుంది. ర్యాలీలు నిర్వహిస్తుంది. అంతే తప్ప తన ఇంట్లో మగవాళ్లు ఎలా ఉన్నారు, తన ఇంట్లో మగ అబ్బాయిలు ఎలా ఉన్నారు అని చూసుకోదు. చెక్ చేసుకోదు. వాళ్లు ఎలాంటి ఆలోచనల్లో ఉన్నారో, ఎలాంటి అఘాయిత్యపు తెగింపులో ఉన్నారో నిఘా పెట్టదు. వాళ్లను ముందు తమ ఇంటి స్త్రీలను గౌరవించమని నేర్పదు. ఇంట్లోని స్త్రీలను గౌరవించినవాడే బయట సమాజంలో ఉన్న స్త్రీలను గౌరవిస్తాడు. ఇంట్లో అవమానించినవాడు బయట అఘాయిత్యానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే ఇవాళ సమాజంలో అతి అరుదుగా వినిపిస్తున్నది ‘సంస్కారం’ అనేమాటే తల్లీ! సంస్కార హీనమైన సమాజంలోనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుంటాయి. స్త్రీని గౌరవించని సంస్కారం, స్త్రీకి రక్షణ ఇవ్వలేని సంస్కారం, ఒంటరిగా ఒక స్త్రీ కనిపిస్తే ఆమెకు నిజమైన సహాయం చేయలేని సంస్కారం, ఆమెకు ఏ ఆందోళనా ఇవ్వకుండా ఇల్లు చేరేలా చూసే సంస్కారం... ఇది లేకుండా పోయిందమ్మా. అదృశ్యమైపోయింది. ఏ సైంటిస్టులైనా వచ్చి తిరిగి సృష్టిస్తే, మాత్రలుగా తయారుచేసి మింగిస్తే, ఇంజక్షన్లుగా జబ్బల్లో పొడిస్తే తప్ప ఈ సంస్కారం ఇప్పుడప్పుడే సమాజంలో వచ్చేలా లేదమ్మా! అమ్మాయీ... మన చదువులు చట్టుబండలు... ఇవి ర్యాంకులు ఎలా తెచ్చుకోవాలో చెప్తాయి గాని, క్యాంపస్ సెలక్షన్లో ఎలా జాబ్ కొట్టాలో నేర్పుతాయిగానీ, వీసా తెచ్చుకొని ఎలా దూరదేశాలకు ఎగిరిపోవాలో చెబుతాయిగానీ, పక్కనే ఉన్న ఒక ఆడపిల్లను, స్త్రీని, మహిళను, తల్లిని, చెల్లిని, ఉపాధ్యాయురాలిని, ఉద్యోగినిని ఎలా గౌరవించాలో నేర్పించవు. గతంలో కాండక్ట్ సర్టిఫికెటు ప్రతి ఒక్కరికీ ఒక యోగ్యతా పత్రంగా ఉండేది. ఇవాళ కాండక్ట్ అనేది ఒక హేళన చేయదగ్గ సంగతి అయిపోయిందమ్మా. అయినా తల్లీ! నువ్వు తెలుసుకోవాలి! ఎప్పుడూ నీ ఫోన్లో పోలీసు శాఖల నంబర్లు ఏమేమి ఉండాలో తెలుసుకోవాలి. షీ టీమ్‌ల నంబర్లు ఉంచుకోవాలి. అర్జెంట్‌గా నీకు సహాయం చేసేవారి నంబర్లు నోటికి వచ్చి ఉండాలి. గుంపులో ఉంటేనే సేఫ్టీ లేదు తల్లీ. ఒంటరి ప్రదేశానికి చేరుకోగానే నువ్వు తక్షణమే ఏ రక్షణ విభాగానికి ఫోన్ చేయాలో నీకు తెలిసి ఉండాలి. చాలు తల్లి! చాలు! వంట నేర్చుకున్నది చాలు! ఊడ్చడం నేర్చుకున్నది చాలు! అంట్లు కడగడం నేర్చుకున్నది చాలు! ఇక ఈ చేతులు ఉక్కుముక్కలుగా ఎలా మార్చాలో తెలుసుకోవాలి. శరీరాన్ని ఒక ఆయుధంగా ఎలా మార్చుకోవాలో తెలియాలి. యుద్ధవిద్యల్లో నువ్వు ఆరితేరాలి. పద్ధతిగా వస్తే ఒంటరిగా పెద్ద సైన్యంతో పోరాడవచ్చు. కాని ఇవి ఎటునుంచి ఎలా దాడి చేస్తాయో తెలియని పశువులమ్మా! పాశవిక మందలమ్మా! కొమ్ములతో పొడిచి కామం తీర్చుకోవాలనుకునే వికృత జంతువులమ్మా! పురుగులమ్మా! చెదకు మందు కనిపెట్టగలిగాం కానీ, ఈ వికృత మగవాంఛకు మందు కనిపెట్టలేకపోయాం. అందుకే నువ్వు ఎంత పెద్ద మూకతో అయినా సరే, తలపడే స్థయిర్యాన్ని, ధైర్యాన్ని సదా కలిగి ఉండాలమ్మా! తల్లిదండ్రులారా... అమ్మాయిల కోసం ఆందోళన పడుతూనే ఉన్నారు. అబ్బాయిల కోసం ఆందోళన పడండి. వారితో మాట్లాడండి. వారి భావోద్వేగాలు వినండి. వారి మానసిక స్థితి తెలుసుకోండి. వారిని నిత్యం గమనించండి. వారు ప్రమాదంలో పడకుండా, ఒకరిని ప్రమాదంలో పడవేయకుండా ఎలా తమను తాము అదుపు చేసుకోవాలో తెలియచేయండి. మాట్లాడండి తల్లిదండ్రులారా.... మాట్లాడండి... మాట్లాడుతూనే ఉండండి... అబ్బాయిలు పశువులుగా మారకుండా ఉండేందుకు... పశువులుగా మారినవారు మనుషులుగా మారేంత వరకూ మాట్లాడుతూనే ఉండండి. ఈ పశు సంస్కృతి ప్రియాంకారెడ్డితో ఆఖరు కావాలి. ఈ పశుహేల ఆమె అర్ధరాత్రి ఆక్రందనలతో అంతం కావాలి. అందుకు అందరం చైతన్యవంతం అవుదాం. సంస్కారవంతం అవుదాం. ఉరిశిక్ష అనడం వల్లే చంపేస్తున్నారు నిర్భయ చట్టంలో నేరం రుజువైతే ఉరిశిక్ష తప్పనిసరి అనేసరికి ఎక్కడ తమ గురించి చెబుతుందో అనే ఉద్దేశ్యంతో నిందితులు ఆ బాధితురాలిని అతికిరాతకంగా చంపేస్తున్నారు. చట్టం ఫెయిల్యూర్ బాధ్యత ప్రభుత్వాలదే. ఐదేళ్ల నుంచి యాభై ఏళ్లలోపున్న ఆడవారిపై అరవై శాతం అఘాయిత్యాలు జరుగుతున్నాయని పోలీసులే ధ్రువీకరించారు. ఒక స్త్రీ తనకు తాను జాగ్రత్తలు తీసుకున్నా ఆమెకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థదే. – బి.అనిత, అడ్వకేట్ మానసిక స్థితిలో మార్పు రావాలి ఇలాంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలనే నిర్భయ చట్టం తీసుకువచ్చారు. కానీ, మగాడు ఆ శిక్షలకు కూడా భయపడటం లేదు. మగవాడిలో ఇలాంటి నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుందో, మానసిక స్థితి ఏంటో తెలుసుకోవాలి. దానికి చికిత్స చేయాలి. చట్టాలు వస్తున్నాయి. తగిన శిక్షలు అమలవుతున్నాయి. అలాగని ఏవీ తగ్గడం లేదు. మనుషులకు భయం అనేది పోయింది. ఇంటర్నెట్లో పోర్న్ సైట్స్ చూసి కూడా ఇలా ఉన్మాదుల్లా తయారవుతున్నారు. – జి.మమత, అడ్వకేట్ అమాయకురాలైన ప్రియాంకా రెడ్డిపై ఆత్యాచారం చేసి హత్య చేశారు. మానవాళిని కదిలించే ఓ విషాదకరమైన çఘటన ఇది. ఈ ఘటనలో దోషులైనవారిని క్రూరమృగాలతో పోల్చితే అవి కూడా సిగ్గుపడతాయి. ఈ సమాజంలో మహిళగా పుట్టడం నేరమా? ప్రియాంకా రెడ్డి మరణానికి కారకులై, తప్పు చేసిన వారికి శిక్షపడేలా మనమందరం పోరాడాలి. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను – అనుష్క ప్రియాంకా రెడ్డి సంఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. మాటలు రావడం లేదు. రోజు రోజుకీ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. నేను ఎంతో సేఫ్ ప్లేస్‌గా భావించిన హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన జరగడం బాధ కలిగించింది. ఏ సమయంలోనైనా, ఎక్కడికి వెళ్లినా మహిళలు సురక్షితంగా తిరిగి రాగల పరిస్థితులు దేశంలో ఎప్పుడు వస్తాయో? ప్రియాంకను కిరాతకంగా చంపిన దోషులకు శిక్ష పడాలి. – కీర్తీ సురేష్ చాలా కోపం తెప్పించే ఘటన ఇది. మహిళలపై రోజు రోజుకీ జరుగుతున్న అఘాయిత్యాలు నన్ను బాధపెడుతున్నాయి. అసలు మహిళలు సురక్షితంగా ఉండగల ప్లేస్ ఎక్కడైనా ఉందా? అనిపిస్తోంది. ప్రియాంకారెడ్డి ఘటనలో నేరస్తులకు పెద్ద శిక్ష విధించాలి – కాజల్ అగర్వాల్ ఇలాంటి దిగ్భ్రాంతికర సంఘటనపై ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి నేరం చేయాలనే ఆలోచన కూడా రాని విధంగా నేరస్తులను శిక్షించాలి – రకుల్‌ప్రీత్ సింగ్ ప్రియాంకా రెడ్డి ఘటన తెలిసిన తర్వాత నా గుండె పగిలిపోయింది. స్పందించడానికి మాటలు రావడం లేదు. ఇలాంటి వార్తలను చదవాలన్నా చాలా విచారకరంగా ఉంది. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆ రాక్షసులను ఉరి తీయాలి – రాశీ ఖన్నా ఇది చాలా హేయమైన సంఘటన. చాలా కలత చెందాను. ఈ అమానవీయ ఘటనలో ప్రియాంకా ఎంతటి క్షోభను అనుభవించి ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. వారి కుటుంబ సభ్యుల బాధను మాటల్లో చెప్పలేం. నిందితులకు శిక్షపడాలి. – లావణ్యా త్రిపాఠి -
పోలీసుల తీరుపై మహిళా కమిషన్ అసంతృప్తి
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: ప్రియాంకపై లైంగికదాడి, హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్య్లూ) స్పందించింది. జరిగిన ఘటన చాలా దారుణమని కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ అభివర్ణించారు. ప్రియాంక అదృశ్యమవగానే పోలీసులు స్పందించిన తీరుపైనా ఆమె ట్వీట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అమ్మాయి కనిపించకండా పోగానే వెతకకుండా ఎవరితోనో వెళ్లిపోయిందని ఎలా నిందిస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రియాంక హత్య కేసులో దోషులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు సాయం చేసేందుకు, కేసు త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకునేలా పోలీసులతో స్వమన్వయం చేసుకునేందుకు తమ ప్రతినిధులను పంపనున్నట్లు తెలిపారు. సదరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, తెలంగాణ సీఎంవో కార్యాలయానికి సూచించారు. ఊహే భయానకంగా ఉంది: రాహుల్ ప్రియాంక హత్య తనను తీవ్రంగా కలచివేసిం దని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. ఒక మనిషి సాటి మనిషిపై ఇంత క్రూరంగా ఎలా దాడికి పాల్పడతాడనేది ఊహే భయానకంగా ఉందన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
స్కూటీ అక్కడ.. నంబర్ ప్లేటు ఇక్కడ
షాద్‌నగర్ టౌన్: హత్యకు గురైన పశు వైద్యురాలు ప్రియాంకారెడ్డి స్కూటీ నంబర్ ప్లేటు (టీఎస్ 08 ఈఎఫ్ 2677) షాద్‌నగర్ పరిధి లోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి పక్కన పడి ఉంది. నిందితులు ప్రియాంకా రెడ్డిని తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద అత్యాచారం చేసి హతమార్చి లారీలో చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. దుండగులు శివ, నవీన్ లారీ వెంట చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు వచ్చారు. ప్రియాంకారెడ్డి మృతదేహాన్ని తగులబెట్టి ఆ తర్వాత స్కూటీ నంబర్ ప్లేటును ఘటన స్థలం వద్దనే తొలగించి జాతీయ రహదారి పక్కనే చెట్లలో పడేశారు. అయితే ఈ నంబర్ ప్లేటుపై ఎస్, ఎఫ్ అక్షరాలు లేవు. నంబర్ ప్లేటు తొలగిం చిన స్కూటీపై శివ, నవీన్ కొత్తూరు జేపీ దర్గా జంక్షన్ వద్దకు వెళ్లారు. మృతదేహం మంటల్లో పూర్తిగా కాలిపోయిందో.. లేదో.. చూసేందుకు చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు మళ్లీ అదే స్కూటీపై వచ్చారు. మృతదేహం పూర్తిగా కాలిపోయిన విషయాన్ని గుర్తించి స్కూటీ పై కొత్తూరు జేపీ దర్గా జంక్షన్ వద్దకు వెళ్లారు. జేపీ దర్గా రోడ్డులో ఉన్న నాట్కో పరిశ్రమ సమీపంలో స్కూటీని విడిచి పెట్టి మిగతా ఇద్దరు నిందితులతో కలసి లారీలో పరారయ్యారు. కఠిన శిక్ష : డీజీపీ సాక్షి, హైదరాబాద్: ప్రియాంకారెడ్డి హత్యపై డీజీపీ మహేందర్‌రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ ఏర్పాటు చేస్తా మని తెలిపారు. ఎవరు ఆపదలో ఉన్నా సరే 100 నంబర్‌కి డయల్ చేయాలని, లేదా హాక్ ఐ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని డీజీపీ సూచించారు. -
పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా?
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా/శంషాబాద్: ఆధునిక వాహనాలు.. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్నా క్షేత్రస్థాయిలో పోలీసుల తీరు లో మాత్రం మార్పు రావట్లేదు. శంషాబాద్ పరిధి లో చోటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృ ష్టించిన పశువైద్యురాలు ప్రియాంకారెడ్డి దారు ణ హత్య ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఘటన జరిగిన 24 గంటల్లోగా నిందితుల్ని పట్టుకున్నప్పటికీ ఘటనకు ముందు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఉంటే ప్రియాంక ప్రాణాలతో మిగిలి ఉండేది. ఈ కేసులో పోలీసుల అలసత్వం అడుగడుగునా ప్రస్ఫుటమవుతోంది. ఈ కేసు నమోదు, ప్రాథమిక దర్యాప్తులో సైబరాబాద్ పోలీసుల తీరును ప్రియాంక తండ్రి శ్రీధర్‌రెడ్డితో పాటు పౌరసమాజం తీవ్రంగా విమర్శిస్తోంది. ఫిర్యాదు తీసుకోవడానికీ విముఖత బుధవారం రాత్రి ప్రియాంక సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ అయిన తర్వాత ఆమె కుటుంబీకులు అనేక ప్రాం తాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ (ఆర్జీఐఏ) పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. జరిగిన విషయం చెప్పి ప్రియాంక ఆఖరుసారి మాట్లా డినప్పుడు ఉన్న ప్రదేశం వివరాలు చెప్పారు. ఆ రాత్రి డ్యూటీలో ఉన్న పోలీసులు ఆ ఏరియా తమ పరిధిలోకి రాదని, శంషాబాద్ రూరల్ పీఎస్‌కు వెళ్లాలని పంపించారు. అక్కడకు వెళ్లిన వారిని మళ్లీ ఆర్జీఐఏ ఠాణాకు తిరిగి పంపించారు. ప్రియాంక తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఏ స్టేషన్లోనైనా ఫిర్యా దు తీసుకుని పోలీసులు రంగంలోకి దిగివుంటే ఆమె ప్రాణాలతో ఉండేదనే వాదనలు విన్పిస్తున్నాయి. ప్రియాంక కుటుంబీకులు రెండోసారి తమ ఠాణాకు వచ్చిన తర్వాతగానీ మిస్సింగ్ కేసు నమోదు చేయలేదు. ఇక్కడే జరగాల్సిన జాప్యం జరిగిపోయింది. బాధితులు వచ్చినప్పుడు పరిధుల విషయం పక్కన పెట్టి స్పందించాలని ఉన్నతాధికారులు, కోర్టులు పదేపదే స్పష్టం చేస్తున్నా పోలీసుల తీరులో మాత్రం మార్పు రావట్లేదు. తక్షణం స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం, ఆ తర్వాత పరిధి ఆరా తీసి ఆ ఠాణాకు బదిలీ చేయడం వంటి విధానాలే కరువయ్యాయి. కాగా, ప్రియాంకారెడ్డి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వహించిన ఓ సీఐ, ఓ ఎస్ఐపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. కెమెరాల ఫీడ్ చూస్తూ కాలక్షేపం... మిస్సింగ్ కేసుల దర్యాప్తులో పోలీసులు తీవ్ర నిర్ల క్ష్యం వహిస్తున్నారు. తప్పిపోయింది యుక్త వయ స్సు వారైతే ఉద్దేశపూర్వకంగానే ఎవరితోనో కలిసి వెళ్లిపోయి ఉంటారని, పెద్ద వయస్సు వారు అయి తే కుటుంబీకులతో ఉండటం ఇష్టం లేక దూరమై ఉంటారని చెప్తూ కాలయాపన చేస్తుంటారు. ప్రియాంక మిస్సింగ్ కేసు దర్యాప్తులోనూ సైబరాబాద్ పోలీసులు ఇదే నిర్లక్ష్యం ప్రదర్శించారు. కేసు నమోదు చేసిన తర్వాత.. పోలీసులు అవమానకరంగా, హేళనగా మాట్లాడినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ‘మీ బిడ్డ ఎవరితోనైనా వెళ్లిందేమో? లవర్ తీసుకెళ్లాడేమో? ఎక్కడకీ పోదులే.. తిరిగి ఇంటికి వస్తుందిలే’ అంటూ వ్యాఖ్యలు చేసి వారిని మనోవేదనకు గురి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు టోల్‌ప్లాజా వద్దకు వచ్చి సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తూ కాలక్షేపం చేశారే తప్ప సరైన దిశలో కేసును దర్యాప్తు చేయలేకపోయారు. ఉదంతం తీవ్రతను, పూర్వాపరాలను కుటుంబీకులు వివరించి లారీడ్రైవర్ల ప్రమేయంపై అనుమా నం కూడా వ్యక్తం చేశారు. అప్పుడైనా రంగంలోకి దిగి శంషాబాద్‌తో పాటు పక్కన ఉన్న షాద్‌నగర్ అధికారులను అప్రమత్తం చేసి అనుమానిత ప్రాం తాల్లో పోలీసు వాహనాలతో పెట్రోలింగ్ నిర్వహించినా నిందితులు మృతదేహంతో సహా దొరికేవా రు. అలా చేయకపోవడంతోనే నిందితులు మృతదేహాన్ని లారీలో పెట్టుకుని దాదాపు 30 కి.మీ. ప్ర యాణించగలిగారన్న వాదనలు విన్పిస్తున్నాయి. పట్టింపులేని పెట్రోలింగ్ సంఘటన జరిగిన ప్రాంతం పక్కనే ఉన్న సర్వీసు రహదారి నుంచి పెట్రోలింగ్ వాహనం నాలుగు సార్లు చక్కర్లు కొట్టినట్లు సీసీ టీవీల్లో నమోదైంది. పెట్రోలింగ్ వాహనంలో ఉన్న పోలీసులు అటు ఇటుగా తిరగడమే తప్ప ఆగి ఉన్న లారీలను తీయించే విషయంలో నిర్లక్ష్యం వహించినట్లు స్పష్టమవుతోంది. రోడ్డుపై అడ్డంగా ఆగి ఉన్న లారీని అక్కడి నుంచి తీయిస్తే జాతీయరహదారి నుంచి రాకపోకలు సాగించే వారికి లోపల జరిగే సంఘటన స్పష్టంగా కనిపించేది. దీంతో ప్రియాంక దుర్ఘటన జరిగి ఉండకపోయేదనే వాదనలున్నాయి. భయం భయంగా ఉంది పెద్దకూతురి మరణం తీవ్రంగా కలచివేసిందని, చిన్న కుమార్తెను ఉద్యోగానికి పంపేందుకు భయపడుతున్నామని శుక్రవారం పరామర్శించడానికి వచ్చిన మంత్రులతో ప్రియాంకరెడ్డి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాలలో ప్రియాంక చదువుతున్న సమయం లోనే నాలుగేళ్ల క్రితమే శంషాబాద్‌కు వచ్చామని, భవ్యకు కూడా సమీప ఎయిర్ పోర్టులో ఉద్యోగం రావడంతో ఇక్కడే ఉండిపోయామన్నారు. కొద్దిరోజుల తర్వాత ప్రియాంక కూడా హైదారాబాద్‌కు బదిలీ చేయించుకుంటానందని, ఇంతలోనే ఘో రం జరిగిపోయిందని వాపోయారు. సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన లేక కూడా తన కుమార్తె హత్యకు ఓ కారణమని ప్రియాంక తండ్రి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. నేరాలపై అవగాహన పెంచాల్సిన అవసరముందని, నిందితుల తరఫున న్యాయవాదులు ఎవరూ వాదించకూడదని కోరారు. నిందితులకు ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా త్వరగానే శిక్షపడుతుందని ఆశిస్తున్నానన్నారు. 10 అడుగులు వేసుంటే.. టోల్ ప్లాజాకు యాభై నుంచి అరవై మీటర్ల దూరం.. జాతీయ రహదారికి కేవ లం ఇరవై నుంచి ముప్పై అడుగుల దూరంలోనే దారుణం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి సర్వీసు ర«హదారిని ఆనుకుని ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ప్రియాంకపై అత్యాచారం చేశారు. ప్రియాంక కాస్త ధైర్యం చేసి పదడుగులు ముందుకు వెళ్లి ఉంటే అక్కడే హైమాస్ట్ వెలుగులతో పాటు, వాహనాల రాకపోకలతో జన సమ్మర్దమైన ప్రాంతంలోకి చేరి సురక్షితంగా వచ్చి ఉండేదని, ఆమె దుండగుల బారినుంచి తప్పించుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. శవం దొరికాక హడావుడి: ప్రియాంక బంధువులు ప్రియాంకారెడ్డి అదృశ్యం అయిన తీరు, ఆఖరిసారిగా సోదరితో మాట్లాడటం, సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోవడం వంటి విషయాలు సామాన్య వ్యక్తి విన్నా తక్షణం అప్రమత్తమై వెతికే ప్రయత్నం చేసుండేవాడు. కానీ, సైబరాబాద్ పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించారు. ఆమె మృతదేహం లభించిన తర్వాత మాత్రం 10 బృందాలు, 15 బృందాలతో దర్యాప్తు అంటూ హడావుడి చేశారు. నిందితుల్ని మరుసటి రోజే పట్టుకున్నారు సరే... అసలు ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి ఉంటే అసలు ఈ హత్యే జరగకపోయేది. -
అత్యంత అమానుషం
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో వరస దురంతాలు వెలుగు చూసి ఆర్నెల్లు కాలేదు. ఆ తర్వాత కూడా అడపా దడపా ఆడపిల్లలపై అఘాయిత్యాలు సాగుతూనే ఉన్నాయి. కానీ హైదరాబాద్ నగర శివారులో, రంగారెడ్డి జిల్లా తొండుపల్లి టోల్ ప్లాజాకు సమీపంలో బుధవారం రాత్రి పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డిని అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హతమార్చిన తీరు సమాజం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనా స్థలి ఎక్కడో మారుమూల లేదు. అది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉంది. దానికి అత్యంత సమీపాన టోల్ ప్లాజా ఉంది. పక్కనే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పోయే అతి పెద్ద జాతీయ రహదారి ఉంది. దానిపై నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ఉన్నట్టుండి ఆచూకీ తెలియకుండా పోయిన కేసు కూడా కాదిది. తాను ఆపదలో చిక్కుకున్నానని ఆమె సకాలంలో గ్రహించింది. ఆ సంగతినే తన సోదరికి రాత్రి 9.22 నిమిషాలకు ఫోన్ చేసి చెప్పింది. హఠాత్తుగా ఆమె ఫోన్ స్విచాఫ్ కావడంతో కుటుం బసభ్యులు కూడా కీడు శంకించారు. రంగంలోకి దిగారు. కానీ ఇవేవీ ఆ నిస్సహాయురాలిని కాపాడ లేకపోయాయి. ఈ దారుణ ఉదంతం వెల్లడై 24 గంటలు గడవకముందే అదే శంషాబాద్ సమీపంలో శుక్రవారం మరో యువతిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ప్రియాంక హత్య అయినా, మరో మహిళ హత్య అయినా మన వ్యవస్థల పనితీరునూ, సమాజం పాటిస్తున్న విలువలనూ ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మన దేశంలో ఎన్నో కఠిన చట్టాలున్నాయి. దేశ రాజధాని నగరంలో 2012లో నిర్భయ ఉదంతం చోటుచేసుకున్నాక అత్యంత కఠినమైన చట్టం వచ్చింది. పోక్సో చట్టంలో ఉరిశిక్షతోసహా కఠిన శిక్షలు విధించడానికి వీలు కల్పించే సవరణ కూడా చేశారు. వీటితోపాటు తెలంగాణలో ఆడపిల్లల రక్షణ కోసం ‘షీ టీమ్’లు ఏర్పాటు చేశారు. ఆపత్స మయాల్లో ఫోన్ చేయడం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లున్నాయి. తెలంగాణలో అయితే రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ కనబడుతూనే ఉంటుంది. ఇన్ని చట్టాలున్నా, ఇన్ని రకాల జాగ్రత్తలు తీసు కుంటున్నా లైంగిక నేరాలు ఆగుతున్న దాఖలా లేదు. అవి నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. నేర గాళ్లు ఏ మాత్రం భయపడటం లేదు. గడప దాటి బయటికెళ్లే ఏ ఆడపిల్లకైనా ఈ దేశంలో వేధింపులు నిత్యానుభవం. అవి నగరాలా, పట్టణాలా, గ్రామాలా అన్న తేడా లేదు. వీధి చివరా, నడిరోడ్డుపైనా, నిర్మానుష్య ప్రదేశంలోనా అన్న తేడా లేదు. ఎక్కడైనా ఆడపిల్లలు భయపడుతూ బతుకీడ్వవలసిన పరిస్థితులే ఉంటున్నాయి. వెకిలిగా నవ్వడం, ఇష్టానుసారం కామెంట్ చేయడం, అసభ్యంగా తాకడం వంటి ఉదంతాలు కోకొల్లలు. అత్యంత అమానుషమైన ఘటనలు జరిగినప్పుడు మాత్రమే సమాజం మొత్తం కదిలిపోతుంది. వాటిపై వెనువెంటనే ప్రభుత్వాలు స్పందించడం మొదలెడతాయి. ఇప్పుడు ప్రియాంక విషాద ఉదంతమే తీసుకుంటే బుధవారం రాత్రి ఆమె కుటుంబం దాదాపు ఒంటరిగానే ఆరాటపడవలసి వచ్చింది. ఒక పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే మరో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లమని పంపించేశారని ప్రియాంక తండ్రి చెప్పారు. అక్కడ ఫిర్యాదు చేశాక కూడా పోలీసులు వెనువెంటనే కదలలేదంటున్నారు. తమ ఇంటి దీపం ఏమైందో తెలియక ఆత్రపడుతున్న ఆ కుటుంబానికి ‘లోకంలో మానవత్వం చచ్చిపోయిందా...’అని ఆ క్షణంలో అనిపించిందంటే అది పోలీసుల పనితీరుకు అద్దంపడుతుంది. బాధితుల పట్ల కనీస సహానుభూతి ప్రదర్శించలేని ఆ మనస్తత్వాలను సరిచేసేందుకు చర్యలు తీసుకోనంతకాలం ఈ స్థితి మారదు. పిల్లలు తప్పిపోయారని ఫిర్యాదు చేయడం కోసం వెళ్లేవాళ్లకూ, ముఖ్యంగా ఆడపిల్లల ఆచూకీ తెలియడం లేదని ఫిర్యాదు చేసేవారికీ పోలీస్స్టేషన్లలో ఎదురవుతున్న ప్రశ్నే ప్రియాంక కుటుంబసభ్యులకు కూడా ఎదురైంది. వారు పోలీసులను ఆశ్రయించినప్పుడు ‘ఏం జరిగిందో నిజాలు మాత్రమే చెప్పండి’ అనడం, ‘ఎవరితోనో వెళ్లివుంటుంది. రేపు వస్తది’ అని నిర్లక్ష్యంగా చెప్పడం బండబారుతున్న వ్యవస్థ తీరుకు నిదర్శనం. ‘వారు సకాలంలో స్పందించివుంటే మా అమ్మాయి మాకు దక్కేది’ అని రోదిస్తున్న ప్రియాంక కుటుంబసభ్యుల్ని ఓదార్చగలిగేది ఎవరు? నిజమే... చాలా తక్కువ వ్యవధిలోనే ప్రియాంక హంతకుల ఆచూకీని పోలీసులు రాబట్టగలిగారు. రాత్రికి రాత్రి దుండగుల్ని అదుపులోకి తీసుకున్నారు. పది టీంలు రంగంలోకి దిగి అణువణువూ గాలించాయి. స్వయానా సీనియర్ పోలీస్ ఉన్నతాధికారులు ఈ కేసుపై శ్రద్ధ పెట్టి పర్యవేక్షించారు. ఇవన్నీ పోలీసు వ్యవస్థ సామర్థ్యాన్ని వెల్లడి స్తాయి. అదే సమయంలో దాని బలహీనతల్ని కూడా పట్టిస్తాయి. ఉన్నత స్థాయిలో జోక్యం చేసు కుంటే తప్ప, ఉన్నతాధికార వర్గం ఉరకలెత్తిస్తే తప్ప సత్ఫలితాలు లభించవా అన్న సందేహం కలుగుతుంది. నేరం చోటుచేసుకున్న వెంటనే నేరగాళ్లను పట్టుకోవడంతోపాటు వారిపై వెంటవెంటనే సాక్ష్యా ధారాలు సేకరించి, సాధ్యమైనంత త్వరగా న్యాయస్థానాల్లో విచారణ మొదలయ్యేలా,అది త్వరగా పూర్తయి, శిక్షలుపడేలా చూసినప్పుడు మాత్రమే ఈ నేరాలు తగ్గుతాయి. అలాగే నేరాలు జరగడానికి ఆస్కారం ఉండే ప్రాంతాల్లో పకడ్బందీ గస్తీ నిరంతరాయంగా జరగాలి. ప్రియాంక విషాద ఉదంతం వెల్లడై 24 గంటలు గడవకుండానే... ఆ కేసు దర్యాప్తు కోసం ఆ ప్రాంతంలో పోలీసులు సంచరిస్తూనే వున్నా అక్కడికి సమీపంలో మరో యువతి హత్యకు గురైన తీరు చూశాక ఇది ఎంత అవసరమో అర్థమవుతుంది. దానికితోడు సమాజంలో, కుటుంబాల్లో ఉన్న లింగ వివక్ష, దానివల్ల కలుగుతున్న దుష్ఫలితాలపై పిల్లలకు అవగాహన కలిగించే పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలి. ఆడపిల్ల బలహీనురా లన్న భావన మృగాళ్లను తయారుచేస్తుంటే... ఆడపిల్లలను నిస్సహాయులుగా మారుస్తోంది. సామా జిక శాస్త్రవేత్తలు, మనస్తత్వ శాస్త్రవేత్తల సాయంతో ప్రభుత్వాలు బహుముఖ చర్యలు తీసుకున్నప్పుడే ఆడపిల్ల భద్రంగా ఉండగలుగుతుంది. -
ప్రియాంక హత్య; 40 నిమిషాల్లోనే ఘోరం
సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డిను పథకం ప్రకారం హత్య చేశారని తేలిపోయింది. కామంతో కళ్లు మూసుకుపోయి మద్యం మత్తులో హంతకులు ఈ ఘోరానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్రియాంక కదలికలను పసిగట్టి నలుగురు దుండగులు అప్పటికప్పుడు 40 నిమిషాల వ్యవధిలోనే పథకం పన్ని ఆమెను కిరాతంగా హత్య చేశారు. ప్రియాంకకు సహాయం చేస్తున్నట్టు నటించి ఆమెను నమ్మించి ఈ అఘాయ్యితానికి పాల్పడ్డారు. అమాయకంగా వారిని నమ్మిన ప్రియాంక చివరకు తన ప్రాణాలు పోగొట్టుకుంది. కుట్రలో భాగంగా ప్రియాంక స్కూటర్ టైర్ గాలి దుండగులు తీశారు. టైర్ పంక్చర్ అయిందని, బాగు చేయించుకొస్తామని నమ్మబలికి ఆమెను ఏమార్చారు. తమ లారీని అడ్డంగా పెట్టి ఆమెను ఎత్తుకుపోయారు. టోల్‌ప్లాజాకు కూతవేటు దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి అమాయకురాలిని దారుణంగా చంపేశారు. టోల్‌ప్లాజాకు సమీపంలోనే ఇదంతా జరుగుతున్నా ఎవరు పసిగట్టలేకపోవడం బాధాకరం. పోలీసుల నిఘా వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందని స్పష్టంగా అర్థమవుతోంది. హంతకులు లారీని రోడ్డు పక్కన ఆపి సాయంత్రం నుంచి రాత్రి వరకు మద్యం సేవిస్తున్నా హైవే పెట్రోలింగ్ పోలీసుల దృష్టికి రాకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించలేదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. హంతకులు ప్రియాంక మృతదేహాన్ని తమ లారీలో 27 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి తగులబెట్టినా పోలీసులు గుర్తించలేకపోయారు. నిందితులు నలుగురిలో ముగ్గురు ఒకే వయసు వారు కావడం గమనార్హం. ప్రియాంక దారుణ హత్య దేశంలోని అందరినీ ఎంతగానో కదిలించింది. అత్యంత క్రూరంగా అమాయకురాలి నిండు ప్రాణాన్ని బలికొన్న మృగాళ్లను కఠినంగా శిక్షించాలని దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు డిమాండ్ చేశారు. టోల్‌ప్లాజాకు దగ్గరలోనే, రహదారికి పక్కనే మద్యం దుకాణానికి ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆపద సమయంలో ఉన్నవారెవరైనా తప్పకుండా 100 నంబరుకు డయల్ చేయాలని తెలంగాణ డీజీపీ సహా రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంబంధిత వార్తలు... ప్రియాంక హత్య కేసు; ఉలిక్కిపడ్డ గుడిగండ్ల ప్రియాంక హత్య.. గుండె పగిలింది నమ్మించి చంపేశారు! భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! -
ప్రియాంకను హత్య చేసింది ఆ నలుగురే: సీపీ సజ్జనార్
సాక్షి, శంషాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసు విషయాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా ముందు వెల్లడించారు. ప్రియాంకారెడ్డిని పక్కా పథకం ప్రకారమే ట్రాప్ చేసి అత్యాచారం జరిపి, దారుణంగా హత్య చేశారని తెలిపారు. నిందితులు మహ్మద్ ఆరీఫ్ ఏ1 (26), శివ ఏ2 ( 20) నవీన్ ఏ3 (20) కేశవులు ఏ4 (20) కలిసి హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో సీపీ వివరాలు వెల్లడిస్తూ.. ‘ప్రియాంక స్కూటీని టోల్‌ప్లాజా పక్కన పార్క్ చేయడం ఈ నలుగురు చూశారు. సాయంత్రం బైక్ తీసుకుపోవడానికి వస్తుందని మాటువేశారు. ఆమెపై ఎలానైనా అత్యాచారం జరపాలని పథకం రచించారు. శివ అనే వ్యక్తి దీనికి ప్రణాళికను రూపొందించారు. దానిలో భాగంగానే ఆమె ఎక్కడికీ వెళ్లకుండా ఉండాలని నవీన్ బైక్ పంక్చర్ చేశాడు. ప్రియాంక బైక్ కోసం తిరిగి వచ్చేలోపు అప్పటికే నలుగురూ మద్యం సేవించి ఉన్నారు. స్కూటీ పంక్చర్ కావడంతో ఆమె ఒంటరిగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే తొలుత ఆమె దగ్గరకు ఆరీఫ్ వచ్చి బైక్ తీసుకున్నాడు. పంక్చర్ చేయిస్తా అని బైక్‌ను తీసుకుని శివను పంపించాడు. అదే సమయంలో ప్రియాంక ఆమె సోదరికి ఫోన్ చేసి మాట్లాడింది. అప్పటికీ సమయం రాత్రి 9:30. శివ కేవలం గాలి మాత్రమే కొట్టించాడు. ఈ లోపు ఆరీఫ్, నవీన్, కేశవులు కలిసి ప్రియాంకను టోల్‌ప్లాజా పక్కనే ఉన్న.. నిర్మానుష్య ప్రాంతానికి బలవంతంగా లాక్కుని వెళ్లారు. ఆరీఫ్ ముక్కు, నోరు గట్టిగా నొక్కిపట్టాడు. ఈలోపు శివ కూడా వచ్చాడు. అనంతరం ఆమెపై అత్యాచారం జరిపి, హత్య చేశారు. బుధవారం రాత్రి 10: 08 గంటలకు ఆమె చనిపోయింది. ప్రియాంక శవాన్ని 10:30కి లారీలో తీసుకుని వెళ్లారు. మధ్యలో ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి బాటిల్లో పెట్రోల్ తీసుకున్నారు. తెల్లవారుజూమున 2:30 గంటలకు చటాన్‌పల్లి పెట్రోల్ పోసి దహనం చేశారు. రెండు గంటల తరువాత మరోసారి వచ్చి..శవం కాలిపోయిందా లేదా అనేది చూసుకున్నారు. అనంతరం వారంతా తిరిగి వెళ్లిపోయారు’ అని తెలిపారు. ప్రియాంక కనిపించట్లేదని బుధవారం రాత్రి ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే 10 టీంలను ఏర్పాటు చేశాం. 24 గంటల్లో హత్య కేసును ఛేదించాం. నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశాం. దీనిపై మరిన్ని వివరాలను సేకరిస్తున్నాం. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం’ అని తెలిపారు. ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు -
ప్రియాంక ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : షాద్‌నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్య కు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రియాంకారెడ్డిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని శంషాబాద్‌లోని ప్రియాంక నివాసం వద్ద స్థానికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందింతులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు ఆలస్యంగా స్పందిచారని మండిపడుతున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. ‘దుండగులపై కేసులు వద్దు.. ఎన్కౌంటర్ చేయండి’ అని రాసి ఉన్న ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికులను పక్కకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు మాత్రం పోలీసులు చర్యను ప్రతిఘటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియాంక నివాసం ఉంటున్న కాలనీలో ఎక్కువ మంది ఉత్తర భారతీయులు అయిన కూడా.. అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రియాంక దారుణ హత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. -
ప్రియాంక హత్యపై స్పందించిన రాహుల్
న్యూఢిల్లీ : హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రియాంక హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు. ప్రియాంకారెడ్డి హత్య తనను తీవ్రంగా కలచివేసిందని రాహుల్ పేర్కొన్నారు. ఓ మనిషి సాటి మనిషిపై ఇంత క్రూరంగా ఎలా దాడికి పాల్పడతాడనేది ఊహించుకోవడానికే భయంకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో బాధితురాలి కుటుంబానికి ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ప్రియాంకా మృతి తమను కలచివేసిందని పేర్కొంటున్నారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మరో ఆడపిల్లకు రాకుండా చూడాలని కోరుతున్నారు. చదవండి : ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు సారీ ప్రియాంక.. ఇంత దారుణమా? -
ప్రియాంక చేసిన పొరపాటు వల్లే: హోం మంత్రి
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి ఉదంతంపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ప్రియాంకారెడ్డి హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. తన సోదరికి ఫోన్ చేసే బదులు బాధితురాలు 100 నంబరుకు కాల్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందని... ప్రియాంకారెడ్డి చేసిన చిన్న పొరపాటు వల్లే ఇంతటి ఘోరం జరిగిందని వ్యాఖ్యానించారు. ప్రియాంకారెడ్డి కుటుంబసభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. ప్రియాంకారెడ్డికి జరిగిన అన్యాయం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ‘షాద్‌నగర్‌లో జరిగిన ఘటన విచారకరం. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హన్మకొండలో కూడా చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకున్నాం. ప్రియాంక కేసును కూడా స్వల్పకాలంలో ఛేదించారు. నలుగురిని అరెస్టు చేశారు. లోతుగా విచారణ జరిపించి నిందితులకు శిక్ష వేయిస్తాం. ఇక్కడి పోలీసులు అప్రమత్తంగానే ఉన్నారు. అయితే ఉన్నత విద్యనభ్యసించి కూడా ప్రియాంక ఇలాంటి పొరపాటు చేయడం విచారించదగ్గ విషయం. రాత్రి సమయంలో తన సోదరికి ఫోన్ చేసే బదులు 100కి ఫోన్ చేయాల్సింది. పోలీసులు 3 నిమిషాల్లో అక్కడికి చేరుకునే వారు. పరిస్థితి చేయిదాటి పోకుండా ఉండేది’ అని మహమూద్ అలీ పేర్కొన్నారు. కాగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్డు బ్రిడ్జి కింద తగలబడిన స్థితిలో ప్రియాంకారెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. నలుగురు నిందితులు పథకం ప్రకారం ప్రియాంకారెడ్డి స్కూటీ పంక్చర్ అతికిస్తామంటూ ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. లారీని అడ్డుపెట్టి అత్యాచారానికి పాల్పడి..అనంతరం హతమార్చారు. ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించారు. అత్యంత హేయమైన చర్యలకు పాల్పడిని నలుగురిని పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. నిందితులది మహబూబ్‌నగర్ జిల్లాగా గుర్తించారు. అయితే తమ ఫిర్యాదుకు వెంటనే స్పందించి ఉంటే.. ప్రియాంక ప్రాణాలతో ఉండేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా దేశ రాజధానిలో నిర్భయ ఘటనను తలపిస్తున్న ప్రియాంకరెడ్డి ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. దర్యాప్తు నివేదిక అందజేయాల్సిందిగా రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బృందాన్ని రాష్ట్రానికి పంపనుంది. నా కొడుకు అలాంటివాడు కాదు: పాషా తల్లి ప్రియాంకను రాత్రంతా చిత్రహింసలు పెట్టి.. ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు #WATCH Telangana Home Min on alleged rape&murder case of a woman veterinary doctor: We're saddened by the incident,crime happens but police is alert&controlling it. Unfortunate that despite being educated she called her sister¬ '100',had she called 100 she could've been saved. pic.twitter.com/N17THk4T48 — ANI (@ANI) November 29, 2019 -
నా బిడ్డలానే ప్రియాంకా బలైంది: నిర్భయ తల్లి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇలాంటి ఘటన జరగటం చాలా బాధాకరమన్నారు. ఆడపిల్లలు బయటకు వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి దేశంలో లేకుండా పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పాశవిక దాడులు జరుగుతుంటే పోలీసులు, అధికార వ్యవస్థ ఏ స్థితిలో ఉందో అర్థమవుతోందని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన అనంతరం శుక్రవారం ఆమె స్థానిక మీడియాతో ఆమె మాట్లాడారు. తన బిడ్డలానే ప్రియాంక కూడా కామాంధుల దాహనికి బలైపోయిందని గుర్తుచేశారు. ప్రియాంకను హతమార్చిన వారిని వెంటనే అరెస్ట్ చేసి ఉరి శిక్షను వేయాలని ఆమె డిమాండ్ చేశారు. దేశంలో మహిళలకు కనీస భద్రత లేకుండాపోయిందని, దీనికి కేంద్రప్రభుత్వం తగు చర్యలను తీసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి ఘటనలు జరకుండా ఉండాలంటే దోషులకు కఠిన శిక్షలు వేయాలని అన్నారు. నిర్భయ ఘటన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్న దోషులకు ఇంకా ఉరిశిక్ష అమలు చేయకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లను ఉరి తీసేంతవరకు తమ పోరాటం ఆగదని ఆశాదేవి తెలిపారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని నిర్భయ ఘటనను తలపిస్తున్న ప్రియాంకరెడ్డి ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. ఈ కేసును సుమోటాగా తీసుకుని.. విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించేవరకు పోరాడుతామని స్పష్టం చేసింది. దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కాగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు.. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారని.. ఇలాంటి దారుణ ఘటనలు జరిగితే మహిళలు స్వేచ్ఛగా ఎలా తిరగలుగుతారని మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఓ లేఖ రాశారు. కాగా వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్యపై టాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ప్రియాంకరెడ్డి హత్య తమను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు -
సారీ ప్రియాంక.. ఇంత దారుణమా?
సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్యపై టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందించారు. ప్రియాంకరెడ్డి హత్య తమను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. అల్లరి నరేశ్, అల్లు శిరీశ్, సుధీర్‌బాబు, వివి వినాయక్, కీర్తి సురేశ్, మెహ్రీన్ పిర్జాదా, లావణ్య త్రిపాఠి, రాశిఖన్నా, స్మిత తదితరులు ట్విటర్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాటలు రావడం లేదు పరిస్థితులు రోజురోజుకి దారుణంగా తయావుతున్నాయని, ప్రియాంకరెడ్డి హత్య తెలియగానే ఆ సమయంలో తనకు మాటలు రాలేదని హీరోయిన్ కీర్తి సురేశ్ పేర్కొన్నారు. తాను అత్యంత సురక్షిత నగరమని భావించే హైదరాబాద్‌లో ఇంత దారుణ ఘటన బాధ కలిగించిందన్నారు. ఏ సమయంలోనైనా బయటికి వెళ్లిన మహిళలు సురక్షితంగా తిరిగివచ్చే పరిస్థితులు దేశంలో ఎప్పుడొస్తాయని ప్రశ్నించారు. ప్రియాంకను అత్యంత కిరాతంగా హత్యచేసిన హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రియాంక మృతికి సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. తాను కర్మను నమ్ముతానని, అది ఎల్లవేళలా పనిచేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. హంతకులను ఉరి తీయాలని హీరోయిన్ రాశిఖన్నా అన్నారు. ప్రియాంక హత్య గురించి తెలియగానే గుండె పగిలినంతపనైందని తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మన సమాజం ఎటుపోతోందని ఆవేదనగా ప్రశ్నించారు. దిగ్భ్రాంతికి లోనయ్యాం ప్రియాంక హత్య పట్ల హీరోయిన్ లావణ్య త్రిపాఠి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక అమ్మాయిని ఇంత కిరాతంగా చంపుతారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరగాలని ఆమె ట్వీట్ చేశారు. ప్రియాంక హత్య వార్త గురించి తెలియగానే షాక్‌కు గురయ్యానని మరో హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా పేర్కొన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ప్రియాంకరెడ్డి తన చెల్లితో మాట్లాడిన చివరి ఫోన్‌కాల్ హృదయాన్ని మెలిపెట్టేలా ఉందని హీరోయిన్ దివ్యాంషా కౌశిక్ పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో యువతులు చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మొద్దని సూచించారు. చాలా బాధాకరం. ‘ఈ దారుణాలకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుంది? ప్రాథమిక పాఠశాల విద్యాభ్యాసంలో భాగంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించాలి. ఆడ పిల్లలతో ఎలా మెలగాలి, వారిని ఎలా కాపాడాలనే దాని గురించి బాలురకు శిక్షణ ఇవ్వాలి. ఇటువంటి చర్యలతోనే వచ్చే తరాన్ని కాపాడుకోవాలి. సారీ ప్రియాంక’ అంటూ ప్రముఖ గాయని స్మిత ట్వీట్ చేశారు. బాధ, కోపం, నిస్సహాయత ప్రియాంక హత్యను ఖండించడానికి దారుణం, కిరాతం వంటి మాటలు కూడా సరిపోవని హీరో అల్లరి నరేశ్ పేర్కొన్నారు. ఈ వార్త విని చాలా బాధపడ్డానని తెలిపారు. దేశంలో ఆడపిల్లలను కాపాడుకోలేకపోతే మనకు భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. ప్రియాంక కేసులో న్యాయం జరుగుతున్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆపద సమయంలో పోలీసుల సహాయం తీసుకోవాలని హీరో సుధీర్‌బాబు సూచించారు. లైవ్ లొకేషన్ యాప్స్, అత్యవసర ఫోన్ కాల్ ఆప్షన్స్ తప్పనిసరిగా ఉండేట్టు చూసుకోవాలన్నారు. ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. హంతకులను అరెస్ట్ చేసి సాధ్యమైనంత త్వరగా శిక్షించాలని దర్శకుడు వివి వినాయక్ డిమాండ్ చేశారు. ప్రియాంక హత్య గురించి తెలియగానే తనకు బాధ, కోపం, నిస్సహాయత వంటి భావోద్వేగాలు కలిగాయని హీరో అల్లు శిరీష్ పేర్కొన్నారు. మన అందరి ఆగ్రహం ప్రియాంకరెడ్డికి న్యాయం జరగడానికి తోడ్పడాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. అదే సమయంలో మహిళలు భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. #RIPPriyankareddy #Justiceforpriyankareddy హ్యాష్‌టాగ్స్‌తో ప్రియాంకరెడ్డికి ట్విటర్లో నివాళి అర్పిస్తున్నారు. సంబంధిత వార్తలు... నమ్మించి చంపేశారు! భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! -
నా కొడుకు అలాంటివాడు కాదు: పాషా తల్లి
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసులో లారీ నెంబరు(ts 07 ua 3335) ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న నలుగురిని తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో మక్తల్‌లో అరెస్టు చేశారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని లారీ యజమానిగా గుర్తించారు. గత కొంతకాలంగా శ్రీనివాస్‌రెడ్డి వద్ద లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న మహ్మద్ పాషాను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. జక్లేర్ గ్రామానికి చెందిన పాషాతో పాటు చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ కుమార్‌లను నిందితులుగా గుర్తించారు. ప్రియాంకారెడ్డి మర్డర్ కేసును ఛేదించిన క్రమంలో సాయంత్రం ఆరు గంటలకు సైబరాబాద్ పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. మహ్మద్ పాషా తల్లి కాగా నిందితులంతా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారే. గుడిగండ్ల గ్రామానికి చెందిన జొల్లు నవీన్ కుమార్, జొల్లు శివ లు అన్నదమ్ముల బిడ్డలు. చెన్నకేశవులుది కూడా అదే గ్రామం. ఇక ఘటన గురించి మహ్మద్ పాషా తల్లి మోలే బీ మాట్లాడుతూ.. తన కొడుకు అలాంటివాడు కాదని పేర్కొంది. ‘ నా కొడుకు హైదరాబాద్‌లో లారీ నడిపిస్తున్నాడు. నిన్న అర్దరాత్రి తర్వాత ఎవరో వాడిని తీసుకెళ్లారు. అసలేం జరిగిందో నాకు తెలియదు’ అని పేర్కొంది. మరోవైపు... నవీన్, శివ ఇంట్లో కూడా దిగ్భ్రాంతి వాతావరణం నెలకొంది. వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ‘ఉదయం నుంచి వాళ్ళ గురించి ఎవరికీ ఏమీ తెలియడం లేదు. తెల్లవారక ముందే వచ్చి ఎవరో తీసుకుని వెళ్ళారు. టీవీలో ఈ వార్తలు వచ్చేంత వరకూ మాకు ఈ విషయం తెలియదు’ అని వాపోయారు. ఇదిలా ఉండగా... ప్రియాంకారెడ్డి కుటుంబ సభ్యులను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ హైదరాబాద్‌లో పరామర్శించారు. సంబంధిత వార్తలు... వీడిన ప్రియాంకా రెడ్డి మర్డర్ మిస్టరీ.. ఆ నలుగురే అందుకే మా పాప ప్రాణం పోయింది: ప్రియాంక తండ్రి ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు -
అందుకే ఆలస్యం: సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ప్రియాంకారెడ్డిని ప్రాణాలతో కాపాడలేకపోయినందుకు బాధపడుతున్నామని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ విచారం వ్యక్తం చేశారు. ఆమె డయల్ 100కి కాల్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్డు బ్రిడ్జి కింద తగలబడిన స్థితిలో ప్రియాంకారెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ మహిళా కమిషన్ సైతం ఈ కేసును సుమోటోగా స్వీకరించి నివేదిక సమర్పించాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. మరోవైపు... పోలీసుల అలసత్వం కారణంగానే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలపై సీపీ సజ్జనార్ స్పందించారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ఇది బాధాకర ఘటన అన్నారు. ప్రియాంక మర్డర్ కేసును ఛేదించేందుకు 10 బృందాలు రంగంలోకి దిగాయని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ‘ ఘటన జరిగిన వెంటనే సమాచారం అందలేదు. అయితే సమాచారం అందిన వెనువెంటనే టోల్ ప్లాజా వెరిఫై చేశాం. ప్రియాంక మృతదేహం కాలిపోవడంతో కొన్ని ఆధారాలు మిస్సయ్యాయి. అయినప్పటికీ చాలా కష్టపడి క్లూస్ సంపాదిస్తున్నాం. కీలక ఆధారాలు లభించాయి. వీటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. కేసులో పురోగతి సాధించాం. ఈ క్రమంలో కాస్త ఆలస్యం జరిగింది’ అని తెలిపారు. మహిళలు, వృద్ధులు ఎవరైనా సరే తాము సమస్యలో ఉన్నామని భావిస్తే వెంటనే డయల్ 100కి ఫోన్ చేయాలని విఙ్ఞప్తి చేశారు. చదవండి: ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు -
అందుకే మా పాప ప్రాణం పోయింది: ప్రియాంక తండ్రి
సాక్షి, హైదరాబాద్ : పోలీసులు వెంటనే స్పందించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలతో దక్కేదని డాక్టర్ ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన తర్వాత ఎన్ని బృందాలతో వెళ్తే మాత్రం ఏం ఉపయోగం ఉంటుందని పోలీసుల తీరును ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్డు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో ప్రియాంకారెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు స్వల్పకాలంలోనే ఛేదించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పథకం ప్రకారం ప్రియాంకారెడ్డి స్కూటీని పంక్చర్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ప్రియాంకారెడ్డి తండ్రి శ్రీధర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ‘రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రియాంక ఇంటికి రాలేదని ఫోన్ వచ్చింది. పదకొండు గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశా. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ప్రియాంక వెళ్లేటప్పుడు విజువల్స్ ఉన్నాయి. వచ్చే విజువల్స్ లేవని చెప్పారు. సీసీ కెమెరాలు చూసుకుంటూ కూర్చోవడం వల్లే మా పాప ప్రాణం పోయింది. పోలీసులు సమయం వృథా చేశారు. వెంటనే స్పందించి ఉంటే తను ప్రాణాలతో దొరికేది. పోలీసుల తీరు చూస్తే మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తోంది. ఓ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడానికి వెళ్తే మరో స్టేషనుకు వెళ్లమన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల స్పందన సరిగా లేదని.. తమకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని ఉద్వేగానికి గురయ్యారు. తమ కూతురు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేశారు. ఇక ప్రియాంకారెడ్డి తల్లి విజయమ్మ మాట్లాడుతూ... ‘ఫిర్యాదు చేయడానికి వెళ్లినపుడు వాళ్ల ఫ్రెండ్స్‌తో పోయి ఉంటుంది అన్నారు. ఏం జరిగిందో.. నిజాలు మాత్రమే చెప్పండి అని అడిగారు. వెళ్లేటప్పుడు సీసీటీవీ ఫుటేజీ ఉంది. వచ్చేటపుడు ఫుటేజీ లేదు. మీ అమ్మాయి ఎవరితోనూ వెళ్లి ఉంటుంది. రేపు వస్తది చూడండి అని మాట్లాడారు. వాళ్లు తొందరగా స్పందించి ఉంటే మా అమ్మాయి బతికి ఉండేది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు -
ప్రియాంకను చిత్రహింసలు పెట్టి..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అదుపులోకి తీసున్నారు. లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు కలిసి ప్రియాంకరెడ్డిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు నిర్ధారించారు. మహ్మద్ పాషా అనే వ్యక్తి(నారాయణపేట)ని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. తొండూపల్లి టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో చిత్రహింసలకు గురిచేసి.. ఆమెను హత్య చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తించారు. ఇక ప్రియాంకరెడ్డి పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం... ఆమెను దహనం చేసేందుకు నిందితులు కిరోసిన్ వాడినట్లు వైద్యులు తేల్చారు. శరీరానికి దుప్పట్లు చుట్టి.. ఆపై కిరోసిన్ పోసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆమె మృతదేహం 70 శాతం కాలినట్లు తెలిపారు. ఇక ప్రియాంకరెడ్డిని హత్య చేసిన అనంతరం.. ఘటనాస్థలం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల వరకు ఆమె మృతదేహాన్ని లారీలో తీసుకువెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాత్రి. 9.30 గంటల నుంచి తెల్లవారుజాము వరకూ అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి.. ఆమెను హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడు మహ్మద్ పాషా మద్యం మత్తులో మృగాళ్ల పైశాచికత్వం నగరంలో రాత్రి సమయంలో లారీ నో ఎంట్రీ ఉండడంతో... తొండూపల్లి గేట్ వద్ద లారీ ఆపి నిందితులు మద్యం సేవించారు. ఈ క్రమంలో టోల్గేట్ వద్ద ఒంటరిగా ఉన్న ప్రియాంకరెడ్డిపై కన్నేశారు. అనంతరం స్కూటీ బాగు చేయిస్తామంటూ ఆమెకు మాయమాటలు చెప్పి తమతో తీసుకువెళ్లారు. లారీని అడ్డుపెట్టి అత్యాచారం చేసి... హతమార్చారు. ఆమె మృతదేహాన్ని దాదాపు 30 కిలో మీటర్ల దూరంలో పడేసి.. ఇద్దరు బైక్‌పై, మరికొంత మంది లారీలో తిరుగు ప్రయాణం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నివేదిక ఇవ్వండి: మహిళా కమిషన్ ఇక దేశ రాజధాని ఢిల్లీలోని నిర్బయ ఘటనను తలపిస్తున్న ప్రియాంకరెడ్డి ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసును సుమోటాగా తీసుకుని... విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించేవరకు పోరాడుతామని స్పష్టం చేసింది. దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఓ లేఖ రాసింది. కేసు విచారణకు ఓ బృందాన్ని పంపుతున్నట్లు పేర్కొంది. కాగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు.. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారని.. ఇలాంటి దారుణ ఘటనలు జరిగితే మహిళలు స్వేచ్ఛగా ఎలా తిరగలుగుతారని మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ప్రియాంక! ప్రియాంకారెడ్డి చివరి ఫోన్‌కాల్ నమ్మించి చంపేశారు! ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు Sending a member to Hyderabad to assist the family and take it up with the police @NCWIndia won't leave any stone unturned till these perpetrators get the punishment they deserve. https://t.co/kYBQivLKN0 — Rekha Sharma (@sharmarekha) November 29, 2019 -
ప్రియాంకా రెడ్డి హత్య కేసులో పురోగతి
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన ప్రియాంకా రెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. టోల్ ప్లాజా వద్ద ఉన్న లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరుని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. నిందితులంతా మహబూబ్‌నగర్‌కు చెందినవారు. లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ప్రియాంక తన చెల్లితో మాట్లాడిన సమయంలో ఆ ప్రాంతంలోని ఫోన్ సిగ్నల్స్‌ను పోలీసులు ట్రేస్ చేశారని, ఆ సమయంలో వీరిద్దరి ఫోన్ కాల్స్ గుర్తించినట్లు, వారి కాల్‌డేటా ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే ప్రియాంకా రెడ్డి స్కూటీ పంక్చర్ చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. చదవండి: నమ్మించి చంపేశారు! చదవండి: అప్పుడు అభయ.. ఇప్పుడు ! ముందే ప్రియాంక స్కూటీకి పంక్చర్ చేసి అనంతరం పంక్చర్ వేయిస్తానంటూ మాయమాటలు చెప్పి... ఆ తర్వాత ఆమెను బలవంతంగా అక్కడ నుంచి తీసుకు వెళ్లినట్లు విచారణలో నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. నిర్మానుష్య ప్రాంతంలో ప్రియాంకా రెడ్డిపై అత్యాచారం చేసి, అనంతరం హతమార్చి.. షాద్ నగర్ సమీపంలో ఆమెను సజీవ దహనం చేశారు. అనంతరం నిందితులు తిరిగి హైదరాబాద్ వచ్చి అక్కడ నుంచి కొత్తూరు వైపు వెళ్లారు. లారీలో ఉన్న ప్రియాంకా రెడ్డి స్కూటీ నెంబర్ ప్లేట్‌ను కొత్తూరు వద్ద పడవేశారు. వీరిలో ముగ్గురు నిందితులు 25ఏళ్ల యువకులు. నిందితులను ఇవాళ మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రియాంక కుటుంబానికి పరామర్శ మరోవైపు మృతురాలు ప్రియాంకారెడ్డి కుటుంబాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ప్రియాంక తల్లిదండ్రులను మంత్రి ఓదార్చారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇల్లు, ఉద్యోగం తప్ప తమ కుమార్తెకు మరొకటి తెలియదని విలపిస్తున్న ప్రియాంక తల్లి ఆవేదనను ఎవరూ తీర్చలేనిదన్నారు. మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మహిళలు.. షీటీమ్స్ ఫోన్ నెంబర్స్ దగ్గర ఉంచుకోవాలని అన్నారు. ప్రియాంక పోలీసులకు కాల్ చేసి ఉంటే.. దారుణం జరిగేది కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. చదవండి: ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి ప్రియాంకారెడ్డి హత్యకేసుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ కేసును తాను పర్సనల్‌గా మానిటర్ చేస్తున్నట్లు ట్వీటర్లో పేర్కొన్నారు. కేసు వివరాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నామని, ఈ దారుణానికి పాల్పడిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పోలీసులను కోరారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా చేస్తామని అన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే 100 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. Outraged and deeply anguished by the murder of #Priyankareddy I am confident that @TelanganaDGP & the police will catch the animals who committed this heinous crime & deliver justice at the earliest. I’ll personally monitor the case too. Anyone in distress, please dial 100 🙏 🙏 — KTR (@KTRTRS) November 29, 2019 -
ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు
సాక్షి, హైదరాబాద్: పశువైద్యురాలు ప్రియాంకారెడ్డి బుధవారం రాత్రి తొండుపల్లి ఓఆర్ఆర్ టోల్గేట్ వద్ద ఇరుక్కుపోయారు. తన స్కూటీ పంక్చర్ కావడంతో రోడ్డుపై ఒంటరిగా మిగిలారు. ఆ సమయంలోనో లేదా ఈ ప్రయాణం ప్రారంభించడానికి ముందో ఆమె పోలీసు అధికారిక యాప్ హాక్–ఐ లేదా పోలీసు కంట్రోల్ రూం నంబర్ 100ను సంప్రదించి ఉంటే హత్యకు గురయ్యేవారు కాదు. అయితే ఈ యాప్‌ను లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నా కేవలం వందల మందే వాడుతున్నారు. ‘హాక్–ఐ’లో ఉన్న ఎస్ఓఎస్లో ముందు రిజిస్టర్ చేసుకోవాలి. ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ‘ఎస్ఓఎస్’ను నొక్కితే పోలీసులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. హాక్–ఐ మొబైల్ యాప్ ద్వారా ‘డయల్–100’కు సైతం ఫోన్ చేసే ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా నేరుగా కాకపోయినా ఈ యాప్ ద్వారానైనా సంప్రదించే అవకాశం ఉంది. వేళకాని వేళల్లో లేదా ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం ‘హాక్–ఐ’లో ఏర్పాటు చేసిన విభాగమే ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్. ప్రయాణ ప్రారంభానికి ముందు యాప్‌లోని ఈ విభాగంలోకి ప్రవేశించి సదరు మహిళ/యువతి ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నారో (డెస్టినేషన్) ఫీడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నంబర్లను ఫొటో లేదా మ్యాన్యువల్‌గా నమోదు చేయాలి. జీపీఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ యాప్ ద్వారా ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు కమిషనరేట్‌లోని ఐటీ సెల్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. నిర్దేశించిన డెస్టినేషన్ కాకుండా సదరు వాహనం వేరే మార్గంలో ప్రయాణిస్తే పోలీసులే గుర్తించి ప్రయాణికురాలిని సంప్రదిస్తారు. అటు వైపు నుంచి స్పందన లేకుంటే అప్రమత్తం కావాలని భావించి వెంటనే రంగంలోకి దిగుతారు. మార్గమధ్యంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా క్షణాల్లో ఫిర్యాదు చేసేందుకు ఓ బటన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరి సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు చేరుకుంటారు. ఈ యాప్‌తోపాటు డయల్ ‘100’, వాట్సాప్ (హైదరాబాద్: 9490616555, సైబరా బాద్: 9490617444) రాచకొండ: 9490617111) ద్వారానూ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పొందవచ్చు. నిరంతర పర్యవేక్షణ... పోలీసులకు సంబంధించిన అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూచనల్ని నిరంతరం పర్యవేక్షి స్తుంటాం. మహిళల కోసం ఏర్పాటు చేసి న విభాగాలను ఐటీ సెల్లో ఉండే సిబ్బంది 24 గంటలూ గమనిస్తూ అందుబాటులో ఉంటా రు. ఈ యాప్ తెలంగాణవ్యాప్తంగా సేవలు అందిస్తోంది. – ఐటీ సెల్ అధికారులు -
నమ్మించి చంపేశారు!
శంషాబాద్, షాద్‌నగర్ టౌన్, షాద్‌నగర్ రూరల్: స్కూటీ టైర్ పంక్చర్ అతికిస్తామంటూ నమ్మించి ఓ యువతిని హత్య చేసి, ఆ తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో అదృశ్యమై షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద శవమై కనిపించింది. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లికి చెందిన శ్రీధర్‌రెడ్డి, విజయమ్మకు ఇద్దరు కూతుళ్లు. శ్రీధర్‌రెడ్డి పీఏసీఎస్ సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కూతురు ప్రియాంకారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూరులోని ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యురాలిగా పనిచేస్తోంది. రెండో కూతురు భవ్య శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగి. వీరి కుటుంబం నాలుగేళ్లుగా శంషాబాద్‌లో నివాసముంటోంది. బుధవారం కొల్లూరులో విధులు ముగించుకున్న ప్రియాంక.. సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చింది. ముఖంపై ఏర్పడిన మచ్చలకు చికిత్స కోసం ఇంటి నుంచి స్కూటీపై సాయంత్రం 6 గంటలకు బయల్దేరింది. స్కూటీని తొండుపల్లి వద్ద ఉన్న టోల్ ప్లాజాకు కొద్ది దూరంలో ఆపి అక్కడి నుంచి మరో వాహనంలో గచ్చిబౌలిలోని ఓ క్లినిక్‌కు వెళ్లింది. తిరిగి రాత్రి 9 గంటల సమయంలో టోల్‌ప్లాజా వద్దకు చేరుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడింది. అయితే స్కూటీ పంక్చర్ అయినట్లు గుర్తించింది. పంక్చర్ వేయిస్తామంటూ.. స్కూటీ పంక్చర్ అతికించి ఇస్తామంటూ అక్కడే ఉన్న ఓ 20 ఏళ్ల గుర్తు తెలియని యువకుడు ప్రియాంక స్కూటీ తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి.. పంక్చర్ అతికించేవారు లేరని, మరో చోటుకు తీసుకెళ్తానని ప్రియాంకకు చెప్పాడు. అందుకు ఆమె అడ్డుచెబుతూ.. ముందుకు వెళ్లి తానే ఎక్కడైనా పంక్చర్ అతికించుకుంటానని చెప్పినా ఆ వ్యక్తి వినకుండా మధ్యలోనే స్కూటీ ఆగిపోతుందని చెప్పి పంక్చర్ అతికించేందుకు మరో చోటుకు తీసుకెళ్లాడు. భయమేస్తుందంటూ చెల్లికి ఫోన్.. ‘స్కూటీ పంక్చర్ అయ్యింది.. బాగుచేసుకొస్తానని ఓ వ్యక్తి తీసుకెళ్లాడు. పక్కన లారీలో ఎవరో ఉన్నారు. నాకు భయంగా ఉంది’అంటూ ప్రియాంక తన చెల్లెలికి రాత్రి 9.22 గంటల సమయంలో ఫోన్ చేసి చెప్పింది. చుట్టూ లారీ డ్రైవర్లు ఉన్నారని, వారిని చూస్తే భయమేస్తోందని, అంతా తననే చూస్తున్నారంటూ వివరించింది. ఒంటరిగా ఉన్నానని, కొద్దిసేపు మాట్లాడాలంటూ సోదరిని కోరింది. ఇలా సుమారు 6 నిమిషాల పాటు ప్రియాంక తన చెల్లెలితో ఫోన్లో సంభాషించింది. ఆ తర్వాత ప్రియాంక ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. చదవండి: ప్రియాంక హత్య కేసు; నిందితుల్లో ఒకడిది లవ్‌మ్యారేజ్ లారీని అడ్డుపెట్టి అత్యాచారం చేసి... హతమార్చారు నా బిడ్డలానే ప్రియాంకా బలైంది: నిర్భయ తల్లి నా కొడుకు అలాంటివాడు కాదు: పాషా తల్లి వీడిన ప్రియాంక మర్డర్ మిస్టరీ.. రాత్రంతా.. ప్రియాంకా రెడ్డి హత్య కేసులో పురోగతి ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు అప్పుడు అభయ.. ఇప్పుడు ! సంఘటన స్థలంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు చటాన్‌పల్లిలో శవమై.. గురువారం తెల్లవారుజామున షాద్‌నగర్ శివారులోని చటాన్‌పల్లి వద్ద మంటలను చూసిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే బుధవారం రాత్రి చెల్లెలితో మాట్లాడే సమయంలో ప్రియాంక ఫోన్ స్విచ్ఛాఫ్ అయిన తర్వాత రాత్రి 11 గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ప్రియాంక అదృశ్యం కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం షాద్‌నగర్‌లో మహిళ హత్య జరిగిన సంఘటన వెలుగుచూడటంతో పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టని స్థితిలో ఉన్న ప్రియాంక మెడలో ఉన్న బంగారు లాకెట్ ఆధారంగా ఆమెను పోలీసులుగుర్తుపట్టారు. ఎన్నో అనుమానాలు.. ప్రియాంకను వేరే ప్రాంతంలో హత్య చేసి చటాన్‌పల్లి వద్దకు తీసుకొచ్చారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద ఉన్న లారీ డ్రైవర్లు ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారా.. ఆమె ప్రతిఘటించడంతోనే హత్య చేసి నిప్పంటించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం రాత్రి సుమారు 9.30 సమయంలో ప్రియాంకరెడ్డి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. ఆ తర్వాతే ఆమెను దుండగులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే దుండగులు ప్రియాంకరెడ్డిని ఏడు గంటల పాటు తమ వద్ద ఉంచుకొని ఆ తర్వాత దారుణానికి ఒడిగటినట్లు తెలుస్తోంది. ప్రియాంకరెడ్డి కిడ్నాప్ అయిన ప్రాంతానికి, ఆమె మృతదేహం ఉన్న ప్రాంతానికి మధ్య సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రియాంకరెడ్డిని బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కిడ్నాప్ చేసిన దుండగులు గురువారం తెల్లవారుజామున 4 గంటల వరకు ఎక్కడికి తీసుకెళ్లి ఉంటారన్నది తెలియాల్సి ఉంది. కాగా, ప్రియాంక మృతదేహానికి వైద్యులు ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. కదలికలను గమనించిన వారే.. ప్రియాంకరెడ్డి తరచూ గచ్చిబౌలికి వెళ్లి వచ్చే సమయంలో టోల్గేట్ బూత్ సమీపంలోనే స్కూటీ నిలిపేది. బుధవారం సాయంత్రం మాత్రం టోల్గేట్ సిబ్బంది అక్కడ స్కూటీ పెట్టొద్దనడంతో పక్కనే ఉన్న ఔటర్ సర్వీసు రోడ్డు సమీపంలో పెట్టి వెళ్లింది. రోజూ ఆమె కదలికలను గమనిస్తున్న వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా.. లేదా లారీల డ్రైవర్లు పథకం ప్రకారమే ఇలా చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వీసు రహదారి వైపు సీసీ కెమెరాలు లేకపోవడంతో అక్కడ లారీ పార్కింగ్ చేసిన వారు ఎవరై ఉంటారనేది తెలియలేదు. ప్రియాంక అత్యాచారానికి గురైందని అనుమానిస్తున్న స్థలం టోల్‌ప్లాజాకు 60 మీటర్ల దూరంలో ఉంది. రాళ్లగూడ వైపు వెళ్లే సర్వీసు రహదారికి అరవై మీటర్ల దూరంలోనే ప్రహరీ ఉన్న అర ఎకరం స్థలంలోని ఓ ప్రహరీలో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. చెల్లి మాట విని ఉంటే.. తన చెల్లెలు ఫోన్లో చెప్పినట్లు ప్రియాంక విని ఉంటే ప్రాణాలు దక్కేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద నిలబడి ఉంటే ఈ దారుణం జరిగి ఉండకపోవచ్చని చెబుతున్నారు. వాహనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో ఉంటే బాగుండేదని పోలీసులు కూడా పేర్కొంటున్నారు. స్కూటీ గుర్తింపు.. ప్రియాంకరెడ్డి స్కూటీని పోలీసులు షాద్‌నగర్ సమీపంలోని కొత్తూరులో గురువారం రాత్రి గుర్తించారు. అయితే దుండగులు స్కూటీ నంబర్ ప్లేటు తీసేసి దర్గా రోడ్డులో నాట్కో పరిశ్రమ సమీపంలో వదిలి వెళ్లారు. అయితే హత్య జరగడానికి ముందే ఇక్కడ వాహనాన్ని వదిలి వెళ్లారా లేదా ముందుగానే వదిలి వెళ్లారా అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు? ప్రియాంకను హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీలోని అనంతపురానికి చెందిన లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించట్లేదు. ప్రియాంక తన చెల్లితో మాట్లాడిన సమయంలో ఆ ప్రాంతంలోని ఫోన్ సిగ్నల్స్‌ను పోలీసులు ట్రేస్ చేశారని, ఆ సమయంలో వీరిద్దరి ఫోన్ కాల్స్ గుర్తించినట్లు, వారి కాల్‌డేటా ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు సమాచారం. ఇరవై ఏళ్ల యువకుడు వచ్చాడు.. జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసుకున్న 20 ఏళ్ల యువకుడు ఎర్రరంగు స్కూటీ తీసుకుని ఇక్కడికి వచ్చాడు. బండి పంక్చర్ అయిందని చెప్పాడు. కానీ బండిలో గాలి మాత్రమే నింపించుకున్నడు. తిరిగి శంషాబాద్ వైపే తీసుకెళ్లాడు. అతడితో పాటు ఎవరూ కనిపించలేదు. – శంషీర్, బండిలో గాలి నింపిన వ్యక్తి మంటల్లో కాలిపోతుంటే చూశా.. ఉదయం 5 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్తున్నా. ఆ సమయంలో మార్గమధ్యలో ఉన్న జాతీయ రహదారి బ్రిడ్జి కింద మంట మండుతున్న విషయాన్ని గమనించాను. పొలానికి వెళ్లి తిరిగి 6 గంటలకు వస్తున్నా. బ్రిడ్జి కింద మంటల్లో ఓ మనిషి కాలుపోతున్న విషయాన్ని గుర్తించాను. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను. – సత్యం, లింగారెడ్డిగూడ, షాద్‌నగర్ లారీ డ్రైవర్లే హతమార్చారు లారీ డ్రైవర్లు అందరూ తననే చూస్తున్నారని, భయంగా ఉందంటూ చెల్లెలికి ఫోన్లో చెప్పింది. కొద్ది సేపటి తర్వాత ప్రియాంకా ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. నా కూతురిని లారీ డ్రైవర్లే హత మార్చి ఉంటారు. – శ్రీధర్‌రెడ్డి, మృతురాలి తండ్రి ప్రియాంకారెడ్డి హత్యకు ముందు.. ► మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొల్లూరు నుంచి శంషాబాద్‌కు వచ్చింది. ► సాయంత్రం 4 గంటలకు శంషాబాద్‌లోని ఇంటికి చేరుకుంది. ► సాయంత్రం 5.45 గంటలకు ఇంటి నుంచి గచ్చిబౌలికి వెళ్లడానికి స్కూటీపై బయల్దేరింది. ► సాయంత్రం 6 గంటలకు తొండుపల్లి టోల్‌ప్లాజా సమీపంలో స్కూటీ నిలిపి గచ్చిబౌలి హాస్పిటల్‌కు వెళ్లింది. ► రాత్రి 9.10 గంటల సమయంలో క్యాబ్‌లో తిరిగి తొండుపల్లి టోల్‌ప్లాజా వద్దకు చేరుకుంది. ► 9.15 గంటల సమయంలో స్కూటీ తీస్తుండగా పంక్చర్ అయిందని గుర్తు తెలియని వ్యక్తులు బండి తీసుకెళ్లారు. ► 9.22 గంటల సమయంలో బైక్ తీసుకెళ్లిన వారి గురించి వారి చెల్లెలితో మాట్లాడింది. ► 9.30 గంటల తర్వాత ప్రియాంక ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ► 9.30 నుంచి 10 గంటల సమయంలోనే ఆమె అత్యాచారానికి గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చెల్లితో ప్రియాంక సంభాషణ.. ప్రియాంక: పోయావా ఆఫీసుకి.. చెల్లి: వెళ్లాను.. ప్రియాంక: సరే నాది ఇప్పుడు అయిపోయింది. వచ్చిన ఇప్పుడే. కొద్దిసేపు నాతో మాట్లాడు.. చెల్లి: ఎందుకు ఏమైంది.. ప్రియాంక: మాట్లాడు.. కొంచెం సేపు మాట్లాడు నీకు తర్వాత చెప్తా. చెల్లి: ఏమైంది అక్కడేమైనా యాక్సిడెంట్ అయ్యిందా.. గచ్చిబౌలిలో యాక్సిడెంట్ అయ్యిందా. ప్రియాంక: అర్థం కాలేదు చెల్లి: యాక్సిడెంట్ అయ్యిందా ప్రియాంక: లేదు నాకు చాలా టెన్షన్‌గా ఉంది. ప్రియాంక: అక్కడ టోల్ గేటు దగ్గర బైక్ పెడత కదా.. అక్కడ పెట్టకూడదు పోలీసులు తీసుకుపోతున్నరని టోల్‌గేటు ఆయన చెప్పిండు.. ఇక్కడ ఔటర్ రింగుకు ఇంకో దారిలో పెట్టా.. ఇప్పుడే వచ్చాను స్కూటీ పంక్చర్ అయింది. చెల్లి: సరే వదిలేసి రా.. ఇంకేంటి ప్రియాంక: వదిలేస్తే రేపు పొద్దున ఎవరు తీసుకొస్తరే.. చెల్లి: మెకానిక్‌ను తీసుకెళ్లి తేవాలి. ప్రియాంక: మెకానిక్‌నా.. కొంచెం దూరం కూడా పోదానే.. పంక్చరైంది వెనుక టైరు. చెల్లి: ఏమో నాకు తెలీదే. ప్రియాంక: అయితే, చెప్తా విను.. ఇక్కడ ఓ లారీ ఉందే.. అందులో జనాలున్నరు. అందులో ఒకాయన చేపిచ్చుకొస్తా అని తీసుకెళ్లిండు. చెల్లి: తీసుకురాలేదా.. ప్రియాంక: తీసుకొచ్చిండు.. అది క్లోజ్ ఉంది. మళ్లీ ఇంకోషాప్లో చేసుకొస్తానని చెప్పి తీసుకు పోయిండు. నాకు భయమైతుంది పాపా.. చెల్లి: అక్కడ ఎవరు లేరా.. ప్రియాంక: వెహికిల్స్ ఉంటవి చూడు అక్కడ.. టోల్ అది ఉంటది చూడు.. నేను పోతా అంటే వాళ్లు వద్దు ఉండు అని అంటున్నా దయ్యాల్లాగా నిలబడిన్రు. చెల్లి: టోల్‌గేటు ఉంటది కదా అక్కడికి వెళ్లి నిలబడు. ప్రియాంక: మాట్లాడు నాకు భయమైతుంది. చెల్లి: టోల్‌గేటు కాడికి వెళ్లు. ప్రియాంక: వాళ్లు బయటనే ఉన్నరు. చెల్లి: ఎవరు ప్రియాంక: లారీస్ వాళ్లు ప్రియాంక: వీళ్లేందే సడన్‌గా ఎవరూ కనిపించకుండా పోయిన్రు. లేదు.. ఉన్నరు. నేను బండి స్టార్ట్ చేసి పోతుంటే పంక్చర్ అయింది.. తగిలిన్రు. బస్టాండ్‌లో చేపిచ్చుకుంటా అంటే వినకుండా.. మేడం చేపిచ్చుకొస్తమని వెంటబడిన్రు. దయ్యాల్లాగా.. చెల్లి: టోల్‌గేటు వద్దకు వెళ్లు. ప్రియాంక: అక్కడ నిలబడితే అందరు చూసుకుంట పోతరు.. వచ్చేటోళ్లు.. పోయేటోళ్లు.. చెల్లి: చూడనీ.. అయితే ఏమైతది ప్రియాంక: కొంచెంసేపు మాట్లాడు.. భయమైతుంది.. బైకు వచ్చేవరకు అయిదు నిమిషాలు. చెల్లి: ఇంత లేటుగా పోవడం అవసరమా..రేపు పోకూడదా.. ప్రియాంక: లేటు కాదే తల్లి.. ఓ పనైపోయింది. రేపు మీటింగు ఉందన్నరు.. సండే.. మండే టెంపుల్‌కు తీసుకుపోతున్నరు. అసలు టైమే ఉండటం లేదు. చెల్లి: సరే కొద్దిసేపైన తర్వాత మాట్లాడుతా.. ప్రియాంకారెడ్డి బైక్ పార్క్ చేసిన ఔటర్ రింగురోడ్డులోని తొండుపల్లి టోల్‌ప్లాజా ఇదే.. -
భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు
సాక్షి, హైదరాబాద్: ‘భయమవుతోంది పాప నాకు. ప్లీజ్ కొంచెం సేపు మాట్లాడు’ అంటూ ప్రియాంకారెడ్డి ఫోన్లో చివరిసారిగా తన సోదరితో మాట్లాడింది. వాళ్లను చూస్తుంటే భయమవుతోందని, ఏడుపు వస్తోందని తన చెల్లి భవ్యారెడ్డితో దీనంగా చెప్పింది. రాత్రిపూట రోడ్డు మీద ఒక్కదాన్నే ఉన్నానని, చాలా టెన్షన్‌గా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది. కొంచెంసేపు తనతో మాట్లాడాలని సోదరిని ఫోన్లో కోరింది. తన స్కూటీ వెనుక టైరు పంక్చర్ కావడంతో అక్కడ ఉన్న లారీలోంచి ఓ వ్యక్తి వచ్చి పంక్చర్ వేయించుకొస్తానని బండి తీసుకెళ్లాడని ప్రియాంక చెప్పింది. తాను వెళ్లిపోతానంటే వద్దని తన వెంటబడ్డాడని భయంగా చెప్పింది. సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు వెళ్లాలని ప్రియాంకకు సోదరి సూచించగా అక్కడ నిలబడితే అందరూ తననే చూస్తారని సమాధానం ఇచ్చింది. ‘చాలా భయంగా ఉంది. ఈ దెయ్యం మొహపోడు నా బండి ఇంకా తీసుకురాలేదు. ఇక్కడ అస్సలు నిలబడాలని లేదు. బైక్ వచ్చే వరకు కాసేపు మాట్లాడు’ అంటూ సోదరితో ఫోన్లో మాట్లాడింది. తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాప్ అయిపోయింది. దీంతో భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో ప్రియాంకరెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రియాంకరెడ్డి దారుణ హత్యతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. (ప్రాథమిక వార్త: షాద్‌నగర్‌లో యువతి సజీవ దహనం) -
షాద్‌నగర్‌లో ప్రియాంకారెడ్డి సజీవ దహనం
సాక్షి, షాద్‌నగర్ : రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ యువతిని సజీవ దహనం చేశారు. షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో యువతి మృతదేహం లభ్యమవ్వడం సంచలనం రేపుతోంది. మృతురాలు ప్రియాంకారెడ్డి అని, ఆమె వైద్యురాలని పోలీసులు గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం కొల్లూర్ గ్రామంలో ఆమె వెటర్నరీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నర్సయిపల్లి గ్రామం ఆమె స్వస్థలం కాగా.. ప్రస్తుతం శంషాబాద్‌లో వీరి కుటుంబం నివసిస్తున్నట్టు సమాచారం. రోజూ స్కూటీ మీద ప్రియాంకారెడ్డి విధులకు వెళ్లేది. బుధవారం కూడా విధులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆమె స్కూటీ పాడైంది. దీంతో భయపడుతూ ప్రియాంక తనకు ఫోన్ చేసిందని, అక్కడి స్థానికులు స్కూటీని రిపేర్ చేయిస్తామని తీసుకెళ్లి.. దుకాణాలు మూసిఉన్నాయని మళ్లీ తీసుకొచ్చారని తనకు చెప్పిందని, అక్కడ లారీ డ్రైవర్లు తిరుగుతూ ఉండటంతో భయంగా ఉందని చెప్పిందని ప్రియాంక సోదరి మీడియాకు తెలిపారు. అక్కడే ఉండవద్దని సమీపంలోని టోల్గేట్ వద్దకు వెళ్లమని తాను చెప్పినా.. వెళ్లలేదని, ఈ నేపథ్యంలో తన చెల్లెలు తిరిగిరాకపోవడం, ఇంతలోనే ఈ ఘోరం జరగడం తమను కలిచివేస్తోందని ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు. గుర్తుతెలియని దుండగులు ప్రియాంకపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. లారీ డ్రైవర్లు ఎక్కువగా సంచరించే ప్రాంతం కావడంతో వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రియాంకారెడ్డి సోదరి -
పాత టికెట్లు ఇచ్చి పైసలు వసూలు చేసిన కండక్టర్
షాద్‌నగర్‌రూరల్ : ప్రయాణికులకు పాత టికెట్లు ఇచ్చి డబ్బులు వసూలు చేసిన తాత్కాలిక కండక్టర్ ఉదంతం ఒకటి శనివారం వెలుగు చూసింది. షాద్‌నగర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో శనివారం ఫరూఖ్‌నగర్ మండలం నేరేళ్ళచెరువు గ్రామానికి చెందిన ప్రైవేట్ కండక్టర్ కె.శివకుమార్, డ్రైవర్ ఎండీ గౌస్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే, బస్సును గద్వాల డిపో మేనేజర్ మురళీధర్‌రెడ్డి షాద్‌నగర్‌లో తనికీ చేశారు. టికెట్ల అమ్మకం ప్రకారం కండక్టర్ కె.శివకుమార్ క్యాష్ బ్యాగ్‌లో రూ.3143 ఉండాలి. కానీ, రూ.4470 ఉన్నట్లు గుర్తించారు. అదనంగా ఉన్న డబ్బుల గురించి కండక్టర్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పడం లేదని డీఎం వివరించారు. ప్రయాణికులకు టికెట్లు అమ్మిన తర్వాత వాటిని తిరిగి కండక్టర్ ప్రయాణికుల నుంచి తీసుకొని బ్యాగులో ఉంచుకున్నట్లు తెలిపారు. కండక్టర్ కె.శివకుమార్ పాత టికెట్లను ప్రయాణికులకు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తాము గుర్తించామని డీఎం తెలిపారు. ఈ మేరకు శివకుమార్‌పై చర్యలు తీసుకోవాలని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డిపో మేనేజర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. శివకుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ శ్రీధర్ కుమార్ తెలిపారు. -
డ్రంకెన్ డ్రైవర్‌కు ట్రాఫిక్ విధులు
షాద్‌నగర్ టౌన్: మద్యం తాగి కారు నడుపుతూ పట్టుబడిన ఓ డ్రైవర్‌కు షాద్‌నగర్ కోర్టు 2 గంటలు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ టోల్‌ప్లాజా వద్ద కడ్తాల్‌కు చెందిన నర్సింలు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. గురువారం షాద్‌నగర్ కోర్టులో హాజరుపరచగా.. జడ్జి అతడికి 2 గంటలు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని శిక్ష విధించారు. -
ప్రేమించి పెళ్లి చేసుకొని పోషించలేక..
శంషాబాద్: విలాసాల కోసం ఓ యువకుడు చోరీల బాటపట్టాడు.. ప్రేమించి పెళ్లి చేసుకుని కుటుంబాన్ని విలాసవంతంగా ఉంచాలనే ఉద్దేశంలో మరో వ్యక్తి అదే చోరీలను ఎంచుకున్నాడు.. వేర్వేరుగా చోరీలు చేసి జైలు పాలైన ఇద్దరు స్నేహితులుగా మారి సుమారు ఇరవైకి పైగా వరుస చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను షాద్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి... షాబాద్ మండలం చర్లగూడెం గ్రామానికి చెందిన బాసుపల్లి ప్రవీణ్(27) పదవతరగతి వరకు చదువుకున్నాడు. విలాసవంతంగా బతకడానికి చోరీలనే మార్గంగా ఎంచుకున్నాడు. షాద్‌నగర్, కొత్తూరు పోలీస్స్టేషన్ల పరిధిలో పలు చోరీలు చేసి జైలుకు వెళ్లాడు. ఇదే సమయంలో మహబూబ్‌నగర్ పట్టణ షషాబ్గుట్ట ప్రాంతంలో నివాసముండే వడ్డె శేఖర్( 28) స్థానికంగా ఫొటోగ్రాఫర్‌గా పనిచేసే వాడు. ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన అతడి ఆదాయం చాలకపోవడంతో పాటు విలాసవంతంగా బతికేందుకు చోరీలు చేయడం ప్రారంభించాడు. మహబూబ్‌నగర్ టౌన్‌తో పాటు కేశంపేట పరిధిలో పలు చోరీలకు పాల్పడి జైలుకెళ్లాడు. ప్రవీణ్, శేఖర్లు జైలులో స్నేహితులుగా మారారు. అక్కడి నుంచి వీరు మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 16 చోరీలకు పాల్పడ్డారు. దుకాణాల షట్టర్లు తొలగించడం చైన్ స్నాచింగ్, బైక్‌లు చోరీ చేయడం ప్రారంభించారు. రాచకొండ పరిధిలో ఒకటి, షాద్‌నగర్ 5 కేసులు నమోదయ్యాయి. సోమవారం షాద్‌నగర్‌లో చేపట్టిన వాహనాల తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించిన వీరిని షాద్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టి ఐదు ద్విచక్రవాహనాలు, 22.5 గ్రాముల బంగారం, 62 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. చోరీల్లో ప్రధాన నిందితుడైన ప్రవీణ్‌పై పీడీ యాక్టు నమోదు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. కేసును ఛేదించిన షాద్‌నగర్ ఏసీపీ వి.సురేందర్, సీఐ సుధీర్‌కుమార్, డీఐ తిరుపతిని డీసీపీ ఈ సందర్భంగా అభినందించారు. -
గల్లీలో కాదు.. ఢిల్లీలో పోరాటం చేయాలి
సాక్షి, షాద్‌నగర్: కాంగ్రెస్ నాయకులు గల్లీలో కాదు ఢిల్లీలో పోరాటం చేసి పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకరావాలని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం షాద్‌నగర్‌లోని ఆర్‌ఆండ్‌బీ అతిథిగృహంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు సీఎం కేసీఆర్ తగిన చర్యలు చేపట్టారని అన్నారు. రెండేళ్లలో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తికావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పాలమూరు ఎత్తిపోతల పథకంపై లేని పోని రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించేందుకు కాంగ్రెస్, బీజెపీ నాయకులు పోరాటం చేయాలని అన్నారు. లక్ష్మీదేవునిపల్లి ప్రాజెక్టు నిర్మించకుంటే వచ్చే ఎన్నికల్లో తాము ప్రజల నుండి ఓట్లు అడగమని అన్నారు. లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు.. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. లక్ష్మీదేవునిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి భూ సేకరణ చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో భూ సేకరణ పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. లక్ష్మీదేవునిపల్లి ప్రాజెక్టు నిర్మించాలని మొదట సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. కాంగ్రెస్‌పార్టీ హయాంలో ప్రాజెక్టు నిర్మాణం వారికి సాధ్యం కాలేదని, సీఎం కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని అన్నారు. దీంతో కాంగ్రెస్‌పార్టీ నేతలకు ఏమితోచక లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు అందెబాబయ్య, కొందూటి నరేందర్, అగ్గునూరు విశ్వం, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జెడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంఎస్ నట్రాజ్, ఎమ్మె సత్యనారాయణ, యుగెంధర్, చింటు, మన్నె నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
కొత్తూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య ప్రియుడితో భర్తను హత్య చేయించింది. ఈ ఘటనలో హత్య చేసిన నిందితుడిని, ప్రియురాలిని, సహకరించిన మరో బాలుడిని (15) పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకేసు సంబంధించిన వివరాలను కొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ కృష్ణ వెల్లడించారు. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన ఎండీ ఇస్మాయిల్(23)కు గత రెండేళ్ల క్రితం హైదరాబాద్ కిషన్‌బాగ్‌కు చెందిన అనీస్‌బేగం(19)తో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. కాగా, అనీస్‌బేగంకు పెళ్లికి ముందే కిషన్‌బాగ్‌కు చెందిన జహీర్(25)తో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఇస్మాయిల్‌ను ఎలాగైన హత్యచేసి అడ్డు తొలగించుకోవాలని అనీస్‌బేగం ప్రియుడితో కలిసి పథకం రచించింది. ఇందులో భాగంగానే జహీర్ గత నెల రోజుల క్రితం అనీస్‌బేగంకు బంధువయ్యే ఓ మైనర్ బాలుడి సహాయంతో జేపీదర్గా ఆవరణలో కూలీ పనిచేస్తున్న ఇస్మాయిల్‌తో స్నేహం చేశాడు. నమ్మకంగా మెలుగుతూనే మైనర్ సహాయంతో రెండుసార్లు హత్య చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. కాగా, ఈ నెల 16న జహీర్ తన మొహనికి దస్తీ కట్టుకొని బైకు నంబర్‌ప్లేట్ చివరి రెండు అక్షరాలు కనిపించకుండా టేప్ అంటించి క్రికెట్ బ్యాట్‌తో ఒక్కడే ఇన్ముల్‌నర్వకు వచ్చాడు. అక్కడి నుంచి ఇస్మాయిల్‌తో కలిసి ఇద్దరు కిషన్‌భాగ్‌కు వెళ్లారు. మార్గమధ్యలో మద్యం సేవించడంతో పాటు గ్రామానికి వచ్చిన తర్వాత మరోమారు ఇస్మాయిల్‌కు ఎక్కువగా మద్యం తాగించి తలపై బ్యాట్‌తో మోది హత్య చేశాడు. ఈ సంఘటనపై భార్య అనీస్‌బేగంతో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఆమె పాత్రపై అనుమానం కలగడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. జాతీయ రహదారి ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి కూడలి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా జహీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా.. జహీర్ నేరాన్ని అంగీకరించాడు. జహీర్ సమాచారం మేరకు కిషన్‌బాగ్‌లోని తల్లిగారి ఇంటి వద్ద ఉన్న అనీస్‌బేగంతో పాటు బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొత్తూరు పీఎస్‌కు తీసుకువచ్చి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి హోండాషైన్ బైకు, క్రికెట్ బ్యాట్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా.. ఈ హత్య కేసు ఛేదించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం అని సీఐ రామకృష్ణ తెలిపారు. గ్రామాల ముఖ్య కూడళ్లు, ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో కచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీఐ సూచించారు. హత్య కేసును ఛేదించిన ఐడీపార్టీ కానిస్టేబుళ్లు నరేందర్, శివకుమార్, శేఖర్, రవీందర్లను సీఐ అభినందించారు. -
అతడి పేరు డ డ.. తండ్రి పేరు హ హ...
షాద్‌నగర్‌టౌన్: అధికారుల నిర్లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ ఓటరు జాబితా తప్పుల తడకలా తయారైంది. మున్సిపాలిటీ పరిధిలోని వెంకట రమణ కాలనీలో ఇంటి నంబర్ 18–211/6లో ఓటరు పేరు డ డ అని, తండ్రి పేరు హ హ.. అని నమోదు చేశారు. ఇంటి నంబర్ 18–403/5లో ఓటరు రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి పేరు బదులుగా ఆయన భార్య పేరును నమోదు చేశారు. ఓటరు జాబితాలో తమ పేరుందో లేదోనని పరిశీలిస్తోన్న ప్రజలు ఈ తప్పుల తడకలా తయారైన ఓటర్ల జాబితాను చూసి అవాక్కవుతున్నారు. -
శిక్షణ లేకుండానే..!
సాక్షి, షాద్‌నగర్: కొత్తగా ఎంపికైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాలనలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. పంచాయితీరాజ శాఖ ద్వారా ఎంపికైన వీరికి ప్రభుత్వం శిక్షణ ఇవ్వకుండానే బాధ్యతలు అప్పగించింది. వారిని నేరుగా క్షేత్రస్థాయిలోకి పంపడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రభుత్వం నియమించిన ఉద్యోగులకు విధిగా శిక్షణ ఇచ్చిన అనంతరం బాధ్యతలు అప్పగించడం సర్వసాధారణం. కానీ, కొత్త జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వారికి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలూ నిర్వహించకుండానే గ్రామ పంచాయతీలను అప్పగించడంతో పాలనలో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. మొత్తం 301 మంది నియామకం జిల్లాలో పాతవి, కొత్తవి కలిపి మొత్తం 558 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి పంచాయతీకి కార్యదర్శి నియమించేందుకు చర్యలు చేపట్టింది. పంచాయితీరాజ శాఖ ద్వారా జిల్లాలో 21 మండలాల్లో ఖాళీగా ఉన్న 301 పంచాయతీలకు కార్యదర్శుల పోస్టులను భర్తీ చేశారు. కొత్త కార్యదర్శులను ఏప్రిల్ 12న నియమించి ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీను కేటాయించి పాలనా బాధ్యతలను అప్పగించినట్లు జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి తెలిపారు. అయితే, వివిధ కారణాల నేపథ్యంలో కొందరు పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలను వదిలివెళ్తున్నారు. పనిభారం ఎక్కువై కొందరు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం ఇష్టం లేక మరికొందరు, ఇతర ఉద్యోగాలు రావడంతో మరికొందరు ఉద్యోగాలను వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. తప్పులు జరిగితే చర్యలు.. గ్రామాభివృద్ధికి సంబంధించి పంచాయతీల నుంచి నిధులు డ్రా చేయడంలో అవకతవలు జరిగితే మాత్రం సర్పంచ్, కార్యదర్శిపై కఠిన చర్యలు తప్పవు. నిధుల వినియోగానికి సంబంధించి ఆడిట్‌ను సర్పంచ్, కార్యదర్శి చేయాల్సి ఉంటుంది. అయితే, నిధులను ఏవిధంగా ఖర్చు చేయాలనే విషయంపై కొత్త కార్యదర్శులకు అవగాహన లేదు. అదేవిధంగా వీరు ప్రతినెలా తమ పనితీరును కొత్త పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన వెబ్సైట్లో పొందుపర్చాలి. లేదంటే చర్యలు తీసుకోనున్నారు. ‘రియల్’పై అవగాహన అంతంతే కొత్త పంచాయతీ కార్యదర్శులకు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై అంతగా అవగాహన లేదు. ఎంటెక్, బీటెక్, పీజీ తదితర కోర్సులు చదవి పంచాయతీ కార్యదర్శి పోస్టులు సాధించిన యువకులు అధికంగా ఉన్నారు. వీరికి గ్రామాల్లో జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వానికి సంబంధించి భూముల కబ్జాలు, భవన నిర్మాణాల అనుమతులు తదితర ప్రధాన అంశాల్లో ఎన్నో కీలకంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో కార్యదర్శులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, శిక్షణ ఇచ్చిన తర్వాతే విధులు అప్పగించాలి. కానీ, ప్రభుత్వం అలాకాకుండా నేరుగా వారికి బాధ్యతలు అప్పగించడంతో ఇబ్బందిగా మారింది. సర్పంచ్‌లకు శిక్షణ.. మరీ కార్యదర్శులకు? కొత్తగా ఎన్నికైన సర్పంచులకు మాత్రం బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే శిక్షణ తరగుతులు నిర్వహించి గ్రామాల అభివృద్ధి ఏవిధంగా చేయాలి, నిధులు ఏవిధంగా వినియోగించాలనే అంశాలపై ప్రభుత్వం అవగాహన కల్పించింది. కానీ, కార్యదర్శులకు మాత్రం నేటి వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. ఈనేపథ్యంలో విధుల నిర్వహణలో కొత్త కార్యదర్శులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. వారికి శిక్షణ ఎప్పుడు ఇస్తారో కూడా ఎవరికీ స్పష్టత లేదు. కొత్త చట్టంపై అవగాహనేదీ.? గ్రామ పరిపాలనా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం– 2018ను రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. అనంతరం ఈ ఏడాది జనవరిలో కొత్త చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. కొత్త చట్టం ప్రకారం ప్రతి నెలా పంచాయతీ కార్యదర్శులు విధిగా తమ పనితీరును వెబ్సైట్లో నమోదుచేయాలి. అదేవిధంగా ప్లాట్ల లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతులు, వీధి దీపాలు, మురుగు కాల్వలు, అంతర్గత రహదారులను నిర్వహించడంతోపాటుగా హరితహారాన్ని పటిష్టంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇలా.. ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో అనేక కీలమైన అంశాలను పొందుపర్చింది. ప్రతి గ్రామానికి ఓ నర్సరీ ఏర్పాటు చేసింది. ఇందులో పంచాయతీ కార్యదర్శిగా కీలకంగా వ్యవహరించే విధంగా బాధ్యతలను పొందుపర్చింది. అదేవిధంగా సర్పంచ్, ఉప సర్పంచ్‌కు చెక్‌పవర్‌ను కేటాయించారు. పైఅంశాలపై పూర్తి స్థాయిలో కొత్త పంచాయతీ కార్యదర్శులకు అవగాహన లేదు. -
‘మంట’ పుట్టిస్తున్న సూరీడు..!
సాక్షి, హైదరాబాద్ : ఎండ చండప్రచండమై మండుతోంది. తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో ఓవైపు జనం పిట్టల్లా రాలిపోతుండగా.. మరోవైపు వాహనాలు కూడా నిప్పుల్లో కలిసిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని కమ్మదనం వద్ద ఆమనగల్ నుంచి షాద్‌నగర్ వైపు అట్టల లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిండా అట్టలు ఉండటంతో క్షణాల్లో మంటలు వాహనమంతా వ్యాపించాయి. ప్రమాదాన్ని గ్రహించిన డ్రైవర్, క్లీనర్ అప్రమత్తంగా వ్యవహరించి వాహనం దిగి ప్రాణాలు నిలుపుకున్నారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పేసింది. అయితే, అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన గురువారం జరిగింది. ఇక అదే రోజు కోదాడ మండలం తోగర్రాయి వద్ద కూడా ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న ప్రయాణికులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : డీసీఎం వాహనంలో అకస్మాత్తుగా మంటలు (చదవండి : షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్దం)