
ఓటరు పేరు డ డ. తండ్రి పేరు హ హ అని ముద్రించిన ఓటరు జాబితా
షాద్‌నగర్‌టౌన్: అధికారుల నిర్లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ ఓటరు జాబితా తప్పుల తడకలా తయారైంది. మున్సిపాలిటీ పరిధిలోని వెంకట రమణ కాలనీలో ఇంటి నంబర్ 18–211/6లో ఓటరు పేరు డ డ అని, తండ్రి పేరు హ హ.. అని నమోదు చేశారు. ఇంటి నంబర్ 18–403/5లో ఓటరు రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి పేరు బదులుగా ఆయన భార్య పేరును నమోదు చేశారు. ఓటరు జాబితాలో తమ పేరుందో లేదోనని పరిశీలిస్తోన్న ప్రజలు ఈ తప్పుల తడకలా తయారైన ఓటర్ల జాబితాను చూసి అవాక్కవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment