voter list
-
‘స్థానిక’ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశమున్నా, ఎన్నికల పనుల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. శనివారం జిల్లాలు, మండల స్థాయిలో పోలింగ్ కేంద్రాలను గుర్తించి దానికి సంబంధించిన జాబితాలను జిల్లా, మండల కేంద్రాల్లో ప్రచురించారు. రాష్ట్రవ్యాప్తంగా 570 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు ప్రకటించారు. మరోవైపు ఓటర్ల జాబితాకు సంబంధించిన కసరత్తు సాగుతోంది.ఎన్నికలు వాయిదా పడుతున్నాయనే భావనలో ఉండొద్దని, ఆయా పనులకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే ఉండాలని అధికారులు, సిబ్బందికి పంచాయతీరాజ్ కమిషనరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బందికి శిక్షణ తదితరాలన్నీ పూర్తిచేసి, ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చినా వెంటనే ఎన్నికల విధుల్లో దిగేందుకు సిద్ధంగా ఉండాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల ఏర్పాట్లపై జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఇతర క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లు, గూగుల్‌మీట్‌లు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎస్ఈసీ ఆదేశాలకు అనుగుణంగా... ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పీఆర్ శాఖ ద్వారా పోలింగ్ కేంద్రాల జాబితా, ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. పైగా సిబ్బందికి కూడా దీనికి సంబంధించిన శిక్షణను కూడా పూర్తి చేసింది. శనివారం పోలింగ్ స్టేషన్లు ఖరారు కావడంతో టీ–పోల్ యాప్‌లో పోలింగ్ కేంద్రాల వారీగా 500 నుంచి 700 ఓటర్లను మ్యాపింగ్ చేసి ఆయా కేంద్రాలకు కేటాయించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లు ఇతర అంశాలకు సంబంధించి హైకోర్టులోనూ కేసు విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. కోర్టుకు ఆయా విషయాలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా నుంచి గ్రామస్థాయి వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పీఆర్ శాఖ ఆదేశించింది. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏవి ముందు నిర్వహించాల్సి వచ్చినా, అందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉండాలని సూచించింది. కులగుణనలో రెండోవిడతలో వివరాల సేక రణ, పరిశీలన, ఆపై కేబినెట్ భేటీలో సమగ్ర నివేదిక ఆమోదం, ఆపై అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టబద్ధత కల్పించేలా బిల్లు పెట్టి కేంద్రానికి, పార్లమెంట్‌కు పంపించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు మరికొన్ని నెలల సమయం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
హీరో మహేష్‌బాబు ఓటు తొలగింపు
గుంటూరు: శాసనమండలి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాలో ప్రముఖ సినీ నటుడు ఘట్టమనేని మహేష్‌బాబు పేరుతో నమోదైన ఓటును తొలగించినట్లు గుంటూరు నగరపాలకసంస్థ అదనపు కమిషనర్, ఏఈఆర్వో చల్లా ఓబులేసు గురువారం తెలిపారు. గుంటూరులో హీరో మహేష్‌బాబుకు ఓటు శీర్షికతో బుధవారం ‘‘సాక్షి’’ మెయిన్ ఎడిషన్‌లో ప్రచురితమైన కథనానికి ఏఈఆర్వో స్పందించారు. మహేష్‌బాబు పేరుతో ఓటు తప్పుగా నమోదైందని, ఫారం–7 విచారణ అనంతరం ఓటును తొలగించామని వివరించారు. గుంటూరు అర్బన్‌లో దరఖాస్తులపై బూత్ లెవల్ అధికారులతో విచారణ చేయించామన్నారు. అర్హులైన వారి దరఖాస్తులను ఆమోదించినట్లు పేర్కొన్నారు. -
ఓటర్ జాబితా నుంచి మాజీ సీఎం పేరు గాయబ్!
డెహ్రాడూన్: కాంగ్రెస్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌కు చేదు అనుభవం ఎదురైంది. గురువారం అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగ్గా.. డెహ్రాడూన్‌లో ఓటేయడానికి వెళ్లిన ఆయన పేరు ఓటర్ లిస్ట్‌లో మిస్ అయ్యింది. దీంతో ఆయన అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోయారు.డెహహ్రాడూన్లోని నిరంజన్పూర్లో రావత్ 2009 నుంచి నివాసం ఉంటున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికలతో పాటు కిందటి ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోనూ ఓటేసిన సంగతిని ఆయన గుర్తు చేస్తున్నారు.‘‘ గత 16 ఏళ్లుగా నేను ఓటు హక్కు వినియోగించుకుంటున్నా. కానీ, ఇప్పుడు నా పేరే లేకుండా పోయింది. ఉదయం నుంచి నేను పోలింగ్ స్టేషన్ వద్దే ఉన్నా. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. నాకే ఇలా జరిగిందంటే.. ఇది కచ్చితంగా అప్రమత్తం కావాల్సిన విషయం’’ అని అన్నారాయన.VIDEO | Dehradun Municipal Elections: Congress leader Harish Rawat raises concerns over voting issues."I have been waiting since morning... but my name was not found at the polling station where I voted in the Lok Sabha elections. They are now searching for it... let's see what… pic.twitter.com/ZnNKmaD00n— Press Trust of India (@PTI_News) January 23, 2025 దీనిపై ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే.. కంప్యూటర్ సర్వర్‌లో తలెత్తిన సమస్యే ఇందుకు కారణంగా తేలింది. దీంతో రావత్‌కు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదని ఈసీ సమాచారం అందించింది.ఉత్తరాఖండ్‌లో ఇవాళ 11 మున్సిపల్ కార్పోరేషన్లు, 43 మున్సిపల్ కౌన్సిల్స్, 46 నగర పంచాయితీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలంటూ సీఎం పుష్కర్‌సింగ్ ధామి ఉదయం ఓటర్లను అభ్యర్థించారు. -
ఓటర్ జాబితా తారుమారుకు బీజేపీ కుట్ర: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. ‘‘ఢిల్లీలో ఒక్క అసెంబ్లీ స్థానంలోనే 11 వేల ఓట్లను తొలగించాలంటూ ఈసీకి బీజేపీ దరఖాస్తులు చేసింది. నేను పోటీ చేసే న్యూఢిల్లీ స్థానంలోనూ 12,500 పేర్లను తొలగించాలంటూ దరఖాస్తు చేసింది. మేం ఈసీ దృష్టికి తీసుకెళ్లడం వల్ల పేర్ల తొలగింపు ఆగిపోయింది’’ అని వివరించారు. బీజేపీ ఆటలను సాగనివ్వబోమన్నారు. -
కులగణనా.. ఓటర్ల జాబితానా?
సాక్షి, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుకు కులగణన చేపట్టాలా..లేదా తాజా ఓటర్లజాబితా ఆధారంగా చేయాలా అనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోలేకపోతోంది. స్థానిక రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీల పాలకమండళ్ల పదవీకాలం ముగిసి, గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలై ఆరునెలలు కావొస్తోంది. ఇక జిల్లా, మండల ప్రజాపరిషత్‌ల గడువు ఈ నెల 4వ తేదీతో ముగియగా, రాష్ట్రవ్యాప్తంగా 32 జెడ్పీలు, 563 మండలాల్లోని దాదాపు 6 వేల ఎంపీటీసీ, 563 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు వచ్చే నిధులు ఆగిపోయాయి. బీసీ రిజర్వేషన్లు 42 శాతం ఎలా ? స్థానిక సంస్థల్లో బీసీలకు గరిష్టంగా 21 శాతం రిజర్వేషన్లు ఉండగా, దానిని 42 శాతానికి పెంచుతామని, ఉపకులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి ఏ పద్ధతి అనుసరించాలనే అంశంపై ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’పేరిట స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుతనంపై బీసీకమిషన్ ద్వారా విచారణ జరపాలని, ఆయా చోట్ల (స్థానిక స్థాయిలో) ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిని తేల్చాలని స్పష్టం చేసింది. మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి) 50 శాతానికి మించరాదని కూడా పేర్కొంది. ఓటర్ల జాబితాతో అయితే... రాష్ట్రవ్యాప్తంగా కులగణన నిర్వహణ అనేది చాలా ఎక్కువ సమయం పట్టే› ప్రక్రియ. దీంతో కొత్త ఓటర్ల జాబితా (లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వెలువరించిన లిస్ట్) ప్రాతిపదికన పంచాయతీరాజ్ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించి..ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓటర్ల వివరాలు సేకరించాలని బీసీ కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. ఓటర్ల జాబితా ఆధారంగా ఖరారు చేసిన రిజర్వేషన్లకు అనుగుణంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో బీసీ సంఘాలు, వివిధ కులసంఘాలు, జిల్లాల్లోని రాజకీయపార్టీలతో సమావేశాలు, బహిరంగ విచారణ, ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో అన్ని రాజకీయపక్షాలతో సమావేశం నిర్వహించి ముందుకు సాగొచ్చునని బీసీ కమిషన్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది ఓటర్ల లిస్ట్ ప్రకారమైతే పెద్దగా శ్రమ లేకుండా మూడునెలల్లో క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చవచ్చునని, సామాజిక, ఆర్థిక, కుల సర్వే అయితే సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఆధ్వర్యంలో ట్రిపుల్ టెస్ట్ మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలిసింది. -
Lok Sabha Election 2024: పేరు మరిచిన మహిళలు!
ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరిచిపోయిన కథ అందరికీ తెలుసు. 1951- 52లో మన దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనూ మహిళల విషయంలో ఇలాంటి ‘ఈగ’ తరహా కథే జరిగింది... మొదటి సార్వత్రిక ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డ కేంద్ర ఎన్నికల సంఘానికి చిత్రమైన సమస్య ఎదురైంది. చాలా రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు తమ సొంత పేర్లు నమోదు చేసుకోలేదు! బదులుగా తమ కుటుంబంలోని పురుష సభ్యులతో తమ సంబంధాన్ని బట్టి ఫలానా వారి భార్యను, ఫలానా ఆయన కూతురును అని నమోదు చేసుకున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు.. నాడు దేశవ్యాప్తంగా నమోదైన 8 కోట్ల మంది మహిళా ఓటర్లలో ఏకంగా 2.8 కోట్ల మంది ఇలా వైఫాఫ్, డాటరాఫ్ అని మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యభారత్, రాజస్తాన్, వింధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చాయి. దాంతో ఎన్నికల సంఘానికి పెద్ద చిక్కు వచ్చిపడింది. అలాంటి మహిళా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. సొంత పేర్లతో తిరిగి నమోదు చేసుకునేందుకు గడువు పొడిగించారు. పురుష ఓటర్లతో ఉన్న సంబంధపరంగా కాకుండా విధిగా మహిళా ఓటర్ల పేరుతోనే నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. పేరు చెప్పడానికి నిరాకరించిన మహిళను ఓటరుగా నమోదు చేయొద్దని స్పష్టం చేశారు. ఇందుకోసం బిహార్‌కు ఒక నెల ప్రత్యేక గడువిచ్చారు. ఈ పొడిగింపు బాగా ఉపయోగపడింది. ఆ గడువులో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మహిళలు పేర్లు నమోదు చేసుకున్నారు. రాజస్తాన్‌లో మాత్రం పొడిగింపు ఇచ్చినా అంతంత స్పందనే వచ్చింది. దాంతో అక్కడ చాలామంది మహిళా ఓటర్లను తొలగించాల్సి వచ్చింది! తొలి ఎన్నికల్లో 17.3 కోట్ల పై చిలుకు ఓటర్లలో మహిళలు దాదాపు 45 శాతమున్నారు. వారికోసం ప్రత్యేక పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం 27,527 పింక్ బూత్‌లను మహిళా ఓటర్లకు రిజర్వ్ చేశారు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి దేశ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ రేడియోలో వరుస ప్రసంగాలు, చర్చలు చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఓటర్ల జాబితాలో మొత్తం 47.1 కోట్ల మంది మహిళలున్నారు. 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ! -
ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు !
అర్హత కలిగిన ప్రతి పౌరుడూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఓటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా ఎన్నికల సంఘం అనేక సౌకర్యాలు కల్పించింది. ఓటరు జాబితా సవరణలో ఏ కారణం చేతనైనా మీ పేరు తొలగించినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఓటరు జాబితా పరిశీలనకు అధికారులు వచ్చినప్పుడు మీరు లేకపోతే మీ పేర్లను తొలగించేందుకు అవకాశాలు ఎక్కువ. అయితే ఇలా అబ్సెంట్ అయిన వారి కోసం ప్రత్యేకంగా ఒక జాబితా రూపొందుతుంది. అంతేకాకుండా... ఒకవేళ మీ అడ్రస్ మారి ఉంటే, ఇంకో జాబితా, మరణించిన వారి కోసం కూడా ప్రత్యేకంగా జాబితా సిద్ధం చేస్తారు.ఈ జాబితాలన్నీ ఓటరు జాబితాతోపాటు ప్రిసైడింగ్ అధికారికి అందుబాటులో ఉంటాయి. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకపోతే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాలి. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్ధారించుకుంటారు.అనంతరం ఆ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో తీసుకుంటారు. అనంతరం అతడికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. దివ్యాంగులకు వాహన సదుపాయం...దివ్యాంగులు, వృద్ధులు ఓటేసేందుకు వాహన సదుపాయం కోసం స్థానిక బూత్ లెవెల్ అధికారి (బీఎల్ఓ)ని సంప్రదించాలి. ఆటో ద్వారా ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తారు.పోలింగ్ కేంద్రం తెలుసుకోవడం ఇలా... ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు జారీ చేస్తుంది. ఈ ఓటర్ స్లిప్పుల వెనకభాగంలో పోలింగ్ కేంద్రం రూటు మ్యాప్‌ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్‌తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు. -
ఓటు నమోదుకు మూడు రోజులే గడువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటు నమోదుకు ఇక మూడు రోజుల సమయమే ఉంది. 18 సంవత్సరాల వయసు నిండి.. ఓటర్ జాబితాలో పేరులేని వారంతా ఈ నెల 15లోగా ఆన్లైన్ ద్వారా గానీ లేదా సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో గానీ ఫాం–6ను సమర్పించడం ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఓటర్ జాబితాలో పేరుందో, లేదో ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి. ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ.. జాబితాలో పేరు లేకపోతే పోలింగ్ రోజు ఓటు వేయలేరు. పేరు లేకపోతే ఈ నెల 15లోగా ఫాం–6 సమర్పిస్తే తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తాం. సాధారణంగా అయితే నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశముంటుంది. 15వ తేదీ తర్వాత నమోదు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు జారీ చేయడానికి 10 రోజుల సమయం పడుతుంది. అందువల్ల చివరి వరకు ఆగకుండా ఏప్రిల్ 15లోగా నమోదు చేసుకోవడం మంచిది’ అని సూచించారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై రాజకీయ పార్టీల నుంచి ఆరోపణలు రాకుండా.. అధికారులు అన్ని ధ్రువపత్రాలు సక్రమంగా ఉన్నాయా, లేవా అని సరి చూసిన తర్వాతే ఓటర్‌గా నమోదు చేస్తున్నారు. ఆన్లైన్లో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నా.. ఫిజికల్‌గా ఆధార్ కాపీ, వయసు నిర్దారణ ధ్రువపత్రంతో పాటు ఇంత వరకు ఎక్కడా ఓటు హక్కు లేదన్న ధ్రువీకరణ పత్రాలను తీసుకొని ఓటర్‌గా నమోదు చేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఆన్లైన్లో దరఖాస్తు చేసి వదిలేయకుండా.. అన్ని కాపీలను తీసుకువచ్చి ఇవ్వాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్‌గా నమోదు కావడమే కాకుండా మే 13న జరిగే పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని మీనా సూచించారు. -
ఓటును మించిన ఆయుధం లేదు
గచ్చిబౌలి (హైదరాబాద్): బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని, ఓటును మించిన ఆయుధం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్నారు. ఓటు హక్కుపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైందని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క రూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని యువత వినియోగించుకోవా లని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఏవైనా ఉల్లంఘనలు జరిగితే బాధ్యతగల పౌరులుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇందుకు ‘సివిజిల్’ యాప్‌ను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదు అందిన వంద నిమిషాలలోపు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని వికాస్‌రాజ్ తెలిపారు. బ్యాలెట్ పవర్ గొప్పది: రోనాల్డ్‌రాస్ బుల్లెట్ కన్నా బ్యాలెట్ పవర్ చాలా గొప్పదని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం అన్నింటా ముందున్నా, ఓటింగ్‌లో 50 శాతం మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నది, లేనిది చెక్ చేసుకోవాలని, లేనట్లయితే ఈనెల 15లోగా ఫారమ్–6 ద్వారా దరఖాస్తు చేసుకొని ఓటుహక్కు పొందాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, పెద్దసంఖ్యలో యువత, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. హైటెక్స్ రోడ్‌లోని మెటల్ చార్మినార్ వరకు రన్ కొనసాగింది. -
నిర్ణయాధికారం ‘ఆమె’దే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాబోయే సాధారణ ఎన్నికల్లో గెలుపు ఓటములను మహిళా ఓటర్లే నిర్దేశించనున్నారు. 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సోమవారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం మొత్తం 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతీ వెయ్యి మంది పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తేలింది. రాష్ట్రం మొత్తం ఓటర్లలో ఎలక్ట్రోలర్ లింగ నిష్పత్తి సగటు కూడా ఎక్కువగానే ఉంది. పదేళ్లుగా పెరుగుతున్న నిష్పత్తి రాష్ట్రంలో 2014 నుంచి వరుసగా 2024 వరకు ఓటర్ల జాబితాల్లో మహిళా ఓటర్ల నిష్పత్తి పెరుగుతూనే ఉంది. అర్హులైన యువతులను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో 18 నుంచి 19 సంవత్సరాల వయసుగల ఎలక్ట్రోరల్ లింగ నిష్పత్తి 778 నుంచి 796కు పెరిగింది. ఈ వయసుగల మహిళా ఓటర్లు 3.5 లక్షల మంది ఉన్నారు. గిరిజనుల్లోని ప్రత్యేక సంచార జాతులను కూడా ఓటర్లుగా నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో వీరి జనాభా 4.29 లక్షలుండగా 18 సంవత్సరాలు నిండిన 2.94 లక్షల మందిని ఓటర్లుగా నమోదు చేశారు. బోడో గడబా, గుటోబ్ గడబా, చెంచు, బొండో పోర్జా, ఖోండ్ పోర్జా, పరేంగి పోర్జా, డోంగ్రియా ఖోండ్, కుటియా ఖోండ్, కోలం, కొండారెడ్డి, కొండ సవరాల జాతుల్లోని అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేశారు. -
ఏపీ 2024 ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా విడుదల
-
AP: ఓటర్ల తుది జాబితా విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల వారీగా విడుదల చేసింది. సీఈఓ ఆంధ్రా వెబ్సైట్(CEO Andhra)లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లుగా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్సైట్లో ఈసీ అప్ లోడ్ చేసింది. ఓటర్ల జాబితాను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఈసీ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు: 4,08,07,256 మహిళా ఓటర్లు: 2,07,37,065 పురుష ఓటర్లు: 2,00,09,275 రాష్ట్రంలో సర్వీస్ ఓటర్లు: 67,434 థర్డ్ జెండర్ ఓటర్లు: 3482. కాగా, గత 6 నెలలుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, అధికారులను నియమించి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేశారు. ఓటు ప్రాధాన్యతపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించారు. అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాక సోమవారం అధికారికంగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు.ఏపీలో పురుషుల కంటే మహిళల ఓటర్లే అధికం ఉండటం గమనార్హం. జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు జిల్లా పురుషులు స్త్రీలు ఇతరులు సర్వీస్ ఓటర్లు మొత్తం ఓటర్లు తిరుపతి 8,68,273 9,10,597 188 867 17,79,058 చిత్తూరు 7,65,90 7,88,725 84 3,379 15,58,257 ఎన్టీఆర్ 8,17,484 8,57,361 150 16,74,995 కాకినాడ 7,88,105 8,10,781 15,99,065 కృష్ణా 7,37,394 7,80,796 65 15,18,255 యువ ఓటర్ల నమోదు కోసం మళ్లీ ప్రచారం చేస్తాం ఏపీ ఓటర్ల తుది జాబితాను ప్రకటించామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 4.08 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ముసాయిదా జాబితా తర్వాత 5.08 లక్షల ఓటర్లు పెరిగారని పేర్కొన్నారు. యువ ఓటర్లు 8.13 లక్షల ఓటర్లు నమోదయ్యారని వెల్లడించారు. యువ ఓటర్లు ఇంకా నమోదు కావాల్సి ఉందని చెప్పారు. యువ ఓటర్ల నమోదు కోసం మళ్లీ ప్రచారం చేస్తామని అన్నారు. ఒకే డోర్ నెంబర్‌పై అధిక ఓట్లు ఉన్న ఫిర్యాదులను 98 శాతం పరిష్కరించామని తెలిపారు. లక్ష 50 వేల ఇళ్లలో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు 4వేల ఇళ్లకు తగ్గాయని, ప్రతి ఎన్నికల్లోనూ ఇలాంటి ఓట్లు ఉండేవని అన్నారు. ఫామ్ 7 ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. 70 చోట్ల పోలీసు కేసులు నమోదు చేశామని అన్నారు. మళ్లీ కొత్త దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. వికలాంగులు, 80 ఎళ్ల పైబడిన వారికి ఇంటి వద్ద ఓటింగ్‌కి అవకాశం ఇస్తామని అన్నారు. నామినేషన్ చివరి రోజు వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. చదవండి: లోలోన రగిలిపోతున్న అచ్చెన్నాయుడు -
లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం
నల్లగొండ : ఏప్రిల్ నెలల జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితాను కాకుండా కొత్త ఓటరు జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అందులో భాగంగానే కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. మూడు రోజుల క్రితమే ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో జిల్లాలో మొత్తం 14,64,080 మంది ఓటర్లు ఉండగా ముసాయిదా జాబితాలో 14,67,573 మంది ఓటర్లున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు 3,493 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. ఈ నెల 22 వరకు కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం ఉండడంతో ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అవగాహన కల్పిస్తున్న బీఎల్ఓలు 1 జనవరి 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఈనెల 22వ తేదీ వరకు ఓటరు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం బీఎల్ఓలు ఓటర్ల జాబితాను తీసుకుని ఇల్లిల్లూ తిరిగి ఓటు ఉందా లేదా తెలుసుకుని ఓటు లేకపోతే దరఖాస్తు చేసుకోమని అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి 2వ తేదీ లోగా పరిష్కరించనున్నారు. మార్పులు, చేర్పుల అనంతరం ఓటరు తుది జాబితాను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. ఈ జాబితాతోనే ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించనున్నారు. -
టీడీపీ అక్రమాలపై చర్యలు తీసుకోండి
సాక్షి అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో టీడీపీ భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారుల బృందానికి ఫిర్యాదు చేశారు. మైపార్టీ డ్యాష్ బోర్డు.కామ్ వెబ్సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలను టీడీపీ అక్రమంగా సేకరిస్తోందన్నారు. ఆ పార్టీకి మద్దతు తెలపని ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం తప్పుడు సమాచారంతో భారీ ఎత్తున ఫామ్–7లను ఎన్నికల సంఘానికి సమర్పిస్తోందన్నారు. పైగా దొంగే దొంగ అన్నట్లు టీడీపీ నేతలే ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతూ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ అధికారుల బృందం శనివారం కూడా సమీక్ష నిర్వహించింది. ఈ నేపథ్యంలో సీఈసీ బృందాన్ని మంత్రులు జోగి రమేశ్, మేరుగు నాగార్జున, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొఠారు అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఫైబర్ నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, నవరత్న పథకాల అమలు వైస్ చైర్మన్ నారాయణమూర్తిలతో కూడిన వైఎస్సార్సీపీ బృందం కలిసింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఈ నెల 14న సీఈసీకి చేసిన ఫిర్యాదులను మరోసారి వైఎస్సార్సీపీ నేతలు సీఈసీ బృందం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో టీడీపీ అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే.. తెలంగాణలో ఓట్లున్నవారిని ఏపీలో చేరుస్తోంది.. తెలంగాణలో ఓట్లు ఉన్న వారిని రాష్ట్రంలోనూ ఓటర్లుగా చేర్పించడానికి టీడీపీ ఆ రాష్ట్రంలో భారీ ఎత్తున శిబిరాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఒక ఓటు.. రాష్ట్రంలో మరో ఓటు ఉన్నవారు రాష్ట్రంలో 4.30 లక్షల మంది ఉన్నారు. వారి ఓట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాం. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాలని తప్పుడు సమాచారంతో పది లక్షలకుపైగా ఫామ్–7లను దాఖలు చేసిన టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేశ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాం. మేనిఫెస్టో పేరుతో వచ్చే ఐదేళ్లలో ఒక్కో కుటుంబానికి ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో వివరిస్తూ ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ప్రమాణపత్రాలను ఓటర్లకు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాం. టీడీపీ, జనసేన చట్టవ్యతిరేక కార్యకలాపాలు.. గతంలో సేవా మిత్ర యాప్ తరహాలోనే ఇప్పుడు మై పార్టీ డ్యాష్ బోర్డ్.కామ్ అనే వెబ్సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ అక్రమంగా సేకరిస్తోంది. టీడీపీ, జనసేన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా ఇంటింటికీ వెళ్లి టెక్నాలజీని ఉపయోగించి ప్రలోభాలకు గురిచేస్తున్నాయని ఎన్నికల అధికారుల బృందానికి వివరించాం. వైఎస్సార్సీపీ ఓటర్లను గుర్తించి వారి ఓట్లను తొలగించడానికి టీడీపీ నేతలు దరఖాస్తు చేస్తున్నారు. తెలంగాణలో ఓట్లు ఉన్నవారిని సోషల్ మీడియా ద్వారా హోటల్స్‌కి పిలిపించుకుని రాష్ట్రంలో ఓట్లు ఎలా నమోదు చేసుకోవాలో చెబుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సీఈసీ బృందానికి ఫిర్యాదు చేశాం. ఒకరికి ఒక ఓటే మా విధానం ఒకరికి ఒక ఓటు ఉండాలన్నదే వైఎస్సార్సీపీ విధానం. తెలంగాణలో ఓటు ఉన్నవారు ఏపీలోనూ ఓటు నమోదు చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి రెండు చోట్లా ఓట్లు కలిగి ఉండటం నేరం. రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలు మానేసి ఎన్నికల ఫిర్యాదులపై విచారణలో నిమగ్నం కావాలనే టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసింది. టీడీపీకి చెందిన కోనేరు సురేశ్ 10 లక్షలకు పైబడి దొంగ ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఇందుకు నిదర్శనం. వాటిని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు పంపి విచారణకు ఆదేశించింది. కోనేరు సురేశ్ తప్పుడు ఫిర్యాదు చేశారని జిల్లా కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. కోనేరు సురేశ్ తప్పుడు ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆశ్చర్యపోయారు. -
సమగ్ర ప్రణాళికతో ఎన్నికలు
సాక్షి, అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే 360 డిగ్రీల సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్), సాధారణ ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం నోవాటెల్‌లో ప్రారంభమైన సమీక్ష సమావేశం శనివారం కూడా కొనసాగింది. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్ (వ్యయం) యశ్చి0ద్ర సింగ్‌తో పాటు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర తదితరులు హాజరయ్యారు. జిల్లాల్లోని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు, ఓటర్ల జాబితా స్వచ్చికరణ, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, వారి ఫిర్యాదుల పరిష్కారం, ఇంటింటి సర్వే, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికల సిబ్బంది, శిక్షణ తదితరాలపై శుక్రవారం 19 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రజెంటేషన్ ఇవ్వగా, శనివారం ఇతర జిల్లాల అధికారులు వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించేలా ప్రతి దశలో అప్రమత్తత, పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పాక్షికతతో ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఓటర్ల జాబితాలన్నీ దోష రహితంగా ఉండాలని చెప్పారు. ఎక్కడా ఒక్క మరణించిన వ్యక్తి కానీ, డబుల్ ఎంట్రీ కానీ ఉండకుండా జాబితాల స్వచ్చికరణ జరగాలని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా, నిర్భయంగా, సకాలంలో పరిష్కరించాలని అన్నారు. ఈవీఎంలు, ఎన్నికలకు అవసరమయ్యే ప్రతి మెటీరియల్‌ను మైక్రో ప్లాన్‌కు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల అధికారులు, పౌరులు, అభ్యర్థులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలపై పూర్తిస్థాయి అవగాహన అవసరమని తెలిపారు. లొకేషన్ మేనేజ్మెంట్ (డిస్పాచ్ సెంటర్, రిసీట్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు, ట్రైనింగ్ సెంటర్లు)కు కూడా పటిష్ట ప్రణాళిక ఉండాలన్నారు. ఎన్నికల సిబ్బందికి సమర్థవంతమైన మాస్టర్ ట్రైనర్లతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూంలు కూడా కీలకమని చెప్పారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేక స్వీప్ ప్రణాళిక గత ఎన్నికల్లో నియోజకవర్గాలు, పోలింగ్ స్టేషన్ల వారీగా పోలింగ్ శాతాలను విశ్లేషించుకొని, దాని ఆధారంగా ప్రాంతాలనుబట్టి ప్రత్యేక సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సమస్యలకు కారణాలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి, స్థానికుల్లో భయాలను పోగొట్టాల్సిందిగా చెప్పారు. సోషల్ మీడియా ఫిర్యాదుల పరిష్కారం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ), ఎథికల్ ఓటింగ్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, పోలింగ్ నిర్వహణ, ఎన్ఫోర్స్మెంట్ తదితరాలపైనా ఎన్నికల సంఘం ప్రతినిధులు మార్గనిర్దేశం చేశారు. ఈ రెండు రోజుల సమీక్షలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన, సమ్మిళిత ఎన్నికల నిర్వహణకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లు భేష్ రెండు రోజుల సమీక్ష సమావేశాలకు మంచి ఏర్పాట్లు చేసి, విశిష్ట ఆతిథ్యమిచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు నేతృత్వంలోని అధికార యంత్రాంగానికి కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్ బృందం ధన్యవాదాలు తెలిపింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఎన్నికలపై ఈసీఐ అధికారుల నేతృత్వంలో విజయవంతంగా జరిగిన నిర్మాణాత్మక సమీక్ష సమావేశాలు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు మార్గదర్శిగా నిలిచాయని కలెక్టర్ డిల్లీరావు చెప్పారు. ఈ సందర్భంగా ఈసీఐ అధికారులను జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా సత్కరించింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. సరిహద్దుల్లో నిఘా పెంచాలి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి సూచించారు. వారు శనివారం సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో సమావేశమై సార్వత్రిక ఎన్నికల సన్నద్దతలో భాగంగా రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, ఎన్నికలకు అవసరమైన సిబ్బంది, పోలింగ్ మౌలిక సదుపాయాలపై చర్చించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను వివిధ ప్రభుత్వ శాఖలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాయి. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, మద్యం సరఫరా వంటివి నిరోధించడానికి ఎక్సైజ్ శాఖ, సెబ్ సంయుక్తంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని స్థాయిల్లో సమాచారం నిరంతరాయంగా వెళ్లేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా ఇంటెలిజెన్స్ సహాయంతో సకాలంలో చర్యలు తీసుకోగలమని తెలిపారు. దుర్గమ్మ సేవలో కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ శర్మ ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్, ప్రత్యేక అధికారి ధర్మేంద్ర శర్మ శనివారం దర్శించుకున్నారు. ధర్మేంద్ర శర్మకు ఆలయ ఏఈఓ ఎన్.రమేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవ్రస్తాలను అందజేశారు. ధర్మేంద్రశర్మ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్, వెస్ట్ ఏసీపీ హనుమంతరావు ఉన్నారు. -
AP: టీడీపీ నిర్వాకం.. డూప్లి‘కేట్స్’..!
ఈ ఫొటోలోని చండ్ర సరళ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పదవిలో ఉన్నారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో తెనాలి మున్సిపాలిటీ 31వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఈమె నెల్లూరు జిల్లా పామూరుపల్లి కోడలు. అయితే పుట్టినిల్లైన తెనాలిలోనూ ఆమెకు ఓటుంది. ఇంటి పేరు మార్పుతో రెండు చోట్లా ఓటరుగా కొనసాగుతున్నారు. జాస్తి సరళ పేరుతో తెనాలిలో ఓటరుగా నమోదు చేసుకోగా చండ్ర సరళ పేరుతో పామూరుపల్లిలో ఓటు హక్కు పొందారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటూ ఎంతో కీలకం! ఒకే ఒక్క ఓటు సైతం అభ్యర్థుల తలరాతలను తారుమారు చేస్తుంది! గెలుపోటములను నిర్దేశిస్తుంది! ఒకపక్క ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ గగ్గోలు పెడుతున్న విపక్ష టీడీపీ మరోపక్క చాపకింద నీరులా దొంగ ఓట్ల నమోదుకు బరి తెగించింది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారుల దొంగ ఓట్ల బాగోతం బహిర్గతమైంది. పలువురు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లోనూ ఓటర్లుగా నమోదైనట్లు గుర్తించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఓటర్ల జాబితా పరిశీలన, నమోదు, తొలగింపు, సవరణ లాంటి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో టీడీపీకి చెందిన పలువురు రెండు చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు బయటపడింది. అక్కడా ఉంటారు.. ఇక్కడా ఉంటారు! నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని పామూరుపల్లి 300 ఓటర్లు ఉండే చిన్న గ్రామం. అక్కడ టీడీపీ మద్దతుదారులకు సంబంధించి 30 ఓట్ల డబుల్ ఎంట్రీ వ్యవహారం తాజాగా బయటపడింది. గ్రామంలో ఓటు హక్కు ఉన్న చింతగుంపల ప్రసాద్, చింతగుంపల అరుణ, చింతగుంపల ముఖేష్‌కు కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం రాచెరువురాజుపాలెం గ్రామంలోనూ ఓటర్లుగా నమోదయ్యారు. చండ్ర చలపతిరావు, చండ్ర సరళకు పామూరుపల్లిలో పాటు తెనాలిలోనూ ఓట్లు ఉన్నాయి. చండ్ర ఈశ్వరమ్మకు వరికుంటపాడులోనే రెండు చోట్ల ఓట్లు ఉండటం గమనార్హం. వివాహమై అత్తారింటికి వెళ్లిన కొందరు మహిళలకు అటు మెట్టినింట్లోను, ఇటు పుట్టింటిలోనూ 2 చోట్ల ఓట్లున్నాయి. సోమిరెడ్డి – నారాయణ కుట్రలు ► సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలలో 11,291 మంది వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి తన అనుచరులతో ఫారం–7 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయించారు. వెరిఫికేషన్ సమయంలో అనుమానం రావడంతో పరిశీలించగా టీడీపీ నేతలు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చింది. ► ఇదే తరహాలో నెల్లూరు నగరంలో దాదాపు 12 వేల ఓట్లను తొలగించేందుకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ టీమ్ ప్రయత్నించింది. వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను ఆన్లైన్లో ఫారం–7 ద్వారా తొలగించేందుకు దరఖాస్తు చేయించారు. అయితే నెల్లూరు కార్పొరేషన్ నుంచి సంబంధిత ఓటర్లకు సమాచారం వెళ్లడంతో ఈ కుట్రలు విఫలమయ్యాయి. నెల్లూరు నగర నియోజకవర్గం జనార్దన్‌రెడ్డి కాలనీ పోలింగ్ బూత్ నెంబర్ 10లో గౌస్‌బాషా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కావడంతో అతడి ఓటును తొలగించేందుకు ఎల్లో గ్యాంగ్ ఆన్లైన్లో ఫారం–7 ద్వారా దరఖాస్తు చేసింది. బూత్ నెంబర్ 9లో ఎస్ మస్తాన్, పెల్గగరి దేవయానం మృతి చెందినట్లు పేర్కొంటూ ఓటర్లుగా తొలగించేందుకు ఫారం–7 ద్వారా దరఖాస్తు చేశారు. -
పోల్ మేనేజ్మెంట్పై బీజేపీ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్ బూత్ మేనేజ్మెంట్పై బీజేపీ దృష్టిసారించింది. పార్టీ అభ్యర్థులకు ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతోంది. బూత్‌స్థాయిలో ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీ పర్యవేక్షణకు నియమించిన పన్నా ప్రముఖ్‌ల ద్వారా ఓటర్లంతా కచ్చితంగా ఓటేసేలా చూడాలని పార్టీ నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారు. బూత్ కమిటీల సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే చర్యలు చేపడుతున్నారు. పార్టీ వైపు మొగ్గుచూపే ఓటర్లను కచ్చితంగా బూత్‌కు రప్పించేలా చేయడంలో లోటుపాట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని పార్టీ నాయకులు క్యాడర్‌కు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై నాయకులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. బుధవారం కూడా టెలికాన్ఫరెన్స్ చేపట్టి పోల్ మేనేజ్మెంట్పై తగిన సూచనలు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,655 వేల పోలింగ్ బూత్‌లకుగాను 90 శాతం బూత్‌లలో బీజేపీ సంస్థాగతంగా కమిటీలు ఏర్పాటు చేసుకుంది. జాతీయ నేతల ప్రచారంతో గెలుపుపై ధీమా... రాష్ట్రంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్యనేతలు నిర్వహించిన విస్తృత ప్రచారం బీజేపీ అభ్యర్థుల గెలుపునకు, ఓటింగ్ శాతం పెంచేందుకు దోహదపడుతుందనే ధీమా పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మరికొన్ని చోట్ల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర జిల్లాల్లో కేంద్ర మంత్రుల ప్రచారం ప్రభావం చూపిందనే విశ్వాసాన్ని వారు వెలిబుచ్చుతున్నారు. -
తెలంగాణ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. శుక్రవారం ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే.. నామినేషన్ల పర్వం మొదలైంది. రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడ్ స్థానాలతో సహా మొత్తం 119 నియోజకవర్గాలకు శాసనసభ్యులను ఎన్నుకోవాల్సిందిగా నోటిఫికేషన్లో కోరింది ఈసీ. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది ఎన్నికల సంఘం. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఆర్వో(ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్) కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. నామినేషన్లు వేసే అభ్యర్థులకు సూచనలు ►నేటి నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ ►ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు నామినేషన్ స్వీకరణ ►నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు అభ్యర్థి వెంట నలుగురికి అనుమతి ►నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యా అర్హత వివరాలు పత్రాలను దాఖలు చేయాలి ►నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి దాఖలుకు ఒకరోజు ముందు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి EC కి వెల్లడించాలి. ►కొత్త బ్యాంక్ అకౌంట్ లోనే అభ్యర్థి ఖర్చు వివరాలను తెలపాలి ►సువిధా యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసే సదుపాయం కల్పించిన ఎన్నికల సంఘం ►ఆన్లైన్ లో దాఖలు తరువాత పత్రాలను RO కు అప్పగించాలి ►ప్రతిరోజు సాయంత్రం 3 గంటల తరువాత రోజువారీ నామినేషన్ వివరాలు వెల్లడించనున్న RO ►ప్రతిరోజు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడేవిట్ పత్రాలను డిస్ప్లే చేయనున్న RO ►నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి అఫిడేవిట్ పత్రాలను 24గంటల్లోనే CEO వెబ్సైట్ లో పెట్టనున్న ఎన్నికల అధికారులు ►అభ్యర్థులు అవసరమైతే 15వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు 3 వాహనాలు.. ఐదుగురికే అనుమతి శుక్రవారం ఉదయం 11 గంటలలోపు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఆ వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించే సహాయ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వోలు) పేరు, రిటర్నింగ్ అధికారి కార్యాలయ చిరునామాను ప్రకటిస్తూ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ‘ఫారం–1’నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఉదయం 11 గంటల నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోపు ఒక్కో అభ్యర్థికి సంబంధించిన 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్‌తో పాటుగా నిర్దేశిత ఫారం–26లో అభ్యర్థులు తమ నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు వంటి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యయం పర్యవేక్షణ కోసం నామినేషన్ల దాఖలుకు కనీసం ఒకరోజు ముందు ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ‘సువిధ’పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే సంతకాలు చేసిన హార్డ్ కాపీని గడువులోగా ఆర్వోకు సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని 35,356 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇటీవల ప్రకటించిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. త్వరలో ప్రకటించనున్న అనుబంధ ఓటర్ల జాబితాతో ఈ సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 3వ తేదీన ఓటింగ్ ఫలితాలు వెల్లడవుతాయి. సర్వం సిద్ధం! రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో సమాయత్తమైంది. దాదాపుగా ఏడాది ముందు నుంచే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. క్రమంగా ప్రత్యేకంగా ఓటర్ల జాబితా రెండో సవరణ, ఈవీఎంలు సిద్ధం చేయడం, ఎన్నికలు/ పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పౌలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కనీస సదుపాయాల కల్పన, దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాల కల్పన, భద్రత ఏర్పాట్లను పూర్తి చేసింది. పటిష్ట బందోబస్తు, ఎక్కడికక్కడ నిఘా ఎన్నికల్లో ఓటర్లను డబ్బులు, మద్యం, ఇతర కానుకలతో ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈసారి ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. 4 రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే 17 జిల్లాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. 89 పోలీసు చెక్‌పోస్టులు, 14 రవాణా, 16 వాణిజ్య పన్నులు, 21 ఎక్సైజు, 8 అటవీ శాఖ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని జిల్లాల్లో వీడియో నిఘా బృందాలు, వీడియో వ్యూయింగ్ టీమ్‌లు, అకౌంటింగ్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలియన్స్ టీంలు, ఖర్చుల పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది. శాంతిభద్రతల పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లు, పరిపాలన, పోలీసు విభాగాల మధ్య సమన్వయం కోసం 39 మంది ఐపీఎస్ అధికారులను నియమించింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిఘా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న సుమారు 50 మందిని వ్యయ పరిశీలకులుగా నియమించింది. పోలింగ్ రోజు అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
ఓటర్ల నమోదుకు రేపే చివరి అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో మీ పేరు లేదా? జాబితాలో పేరు ఉన్నా మరో ప్రాంతానికి నివాసం మార్చారా? మీ పేరు, ఇతర వివరాలు తప్పుగా అచ్చు అయ్యాయా?.. ఇలాంటి కారణాలతో నవంబర్ 30న జరగనున్న రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఓటేయలేమని బాధపడుతున్నారా? అయితే మీలాంటి వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పిస్తోంది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం–6, ఇతర ప్రాంతానికి ఓటు బదిలీ, పేరు, ఫొటో, ఇతర వివరాల దిద్దుబాటు కోసం ఫారం–8 దరఖాస్తులను అక్టోబర్ 31లోగా సమర్పిస్తే వచ్చే శాసనసభ సాధారణ ఎన్నికల్లో మీకు ఓటు హక్కు లభించనుంది. నివాసం ప్రస్తుతం ఉండే నియోజకవర్గంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినా, లేదా ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారినా ఫారం–8 దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఓటరు జాబితా/ ఓటరు గుర్తింపు కార్డులో ఫొటో సరిగ్గా లేకపోయినా, పేరు, ఇతర వివరాలు తప్పుగా వచ్చినా ఫారం–8 దరఖాస్తు ద్వారానే సరిదిద్దుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారితో ప్రత్యేకంగా అనుబంధ ఓటర్ల జాబితాను ఎన్నికల యంత్రాంగం ప్రచురించనుంది. తుది ఓటర్ల జాబితాతో పాటు అనుబంధ ఓటర్ల జాబితాలోని ఓటర్లకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ముగింపునకు 10 రోజుల ముందు నాటికి వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. నవంబర్ 3న రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా, 10తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. దానికి 10 రోజుల ముందు అనగా, అక్టోబర్ 31 నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు. దరఖాస్తు ఎలా చేసుకోవాలి..? ఓటర్ల నమోదు, ఓటు బదిలీ, వివరాల దిద్దుబాటు.. తదితర సేవల కోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ https://voters.eci.gov.in లో అన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్(వీహెచ్ఏ)ను మొబైల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని కూడా ఈ సేవలను పొందవచ్చు. లేకుంటే స్థానిక బూత్ స్థాయి అధికారి(బీఎల్ఓ), ఓటరు నమోదు అధికారి (ఈఆర్వో)ను కలసి సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి అందజేయాల్సి ఉంటుంది. ఓటరు నమోదు కోసం కొత్తగా దిగిన ఫొటోతో పాటు చిరునామా, వయసు ధ్రువీకరణ కోసం పదో తరగతి మార్కుల పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు డిమాండ్ నోటీసు, గ్యాస్/బ్యాంక్ పాసుపుస్తకాలు వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. జాబితాలో పేరు ఉందా? లేదా? ఎలా తెలుసుకోవాలి? ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా ? అనేది తెలుసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా https://electoralsearch.eci. gov.in అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. ఓటరు వివరాలు, ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్), మొబైల్ నంబర్ ఆధారంగా జాబితాలో పేరును సెర్చ్ చేయడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది. మొబైల్ ఫోన్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా జాబితాలో పేరు సెర్చ్ చేయడం చాలా సులువు. గతంలో ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రమే మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా పేరును సెర్చ్ చేయడానికి వీలుండేది. ఓటరు పేరు, తండ్రి పేరు/ వయసు ఇతర వివరాలను కీ వర్డ్స్‌గా వినియోగించి సెర్చ్ చేసినప్పుడు అక్షరాల్లో స్వల్ప తేడాలున్నా జాబితాలో పేరు కనిపించదు. అయితే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో పేరును సులువుగా సెర్చ్ చేయవచ్చు. కొత్త ఎపిక్ కార్డు నంబర్ ఎలా తెలుసుకోవాలి? గతంలో కేంద్ర ఎన్నికల సంఘం 13/14 అంకెల సంఖ్యతో ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేయగా, గత కొంత కాలంగా 10 అంకెల సంఖ్యతో కొత్త ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. పాత ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఆధారంగా మీ కొత్త ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ను తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్ https://ceotserms2.telangana.gov.in/ ts search/ Non Standard Epic.aspx ను సందర్శించి మీ పాత కార్డు నంబర్ ఆధారంగా కొత్త ఎపిక్ కార్డు నంబర్‌ను తెలుసుకోవచ్చు. -
ఏఎస్డీ జాబితాలో ‘వలస’ ఓటర్లు
ఓటరు నమోదుకు ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి? వేరే ప్రాంతానికి ఓటును బదిలీ చేసుకోవచ్చా? వికాస్‌రాజ్: కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6, వేరే ప్రాంతానికి బదిలీ/వివరాల దిద్దుబాటుకు ఫారం–8ను అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. నామినేషన్లు నవంబర్ 10తో ముగుస్తాయి.ఆ తర్వాత అర్హులైన వారి పేర్లతో అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురిస్తాం. కొత్త ఓటర్లకు కార్డుల పంపిణీ ఎప్పుడు చేస్తారు? ఇప్పటికే 27.5 లక్షల కొత్త ఓటర్లకు సంబంధించిన ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి స్పీడు పోస్టు ద్వారా వారి చిరునామాలకు పంపాం. మరో 12.5 లక్షల కార్డులను ముద్రించి నవంబర్ 15లోగా పంపిస్తాం. నవంబర్ 10 తర్వాత ఓటర్లందరికీ ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ ప్రారంభిస్తాం. హైదరాబాద్‌లో పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలియక చాలామంది ఓటేయలేకపోతున్నారు? పోలింగ్ కేంద్రం వివరాలతో ఓటర్లందరికీ ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులను పంపిణీ చేస్తాం. ‘ఓటర్ హెల్ప్‌లైన్ యాప్’తోపాటు ఈసీఐ వెబ్‌సైట్‌లోని ‘ఓటర్ సహాయ మిత్ర’ అనే లింక్ ద్వారా పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. ఓటరు కార్డు నంబర్ ద్వారా వివరాలు తెలుస్తాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొందరి పోలింగ్ కేంద్రాలు మారొచ్చు. ఓటర్ల జాబితాలో 120 ఏళ్లకు పైబడిన ఓటర్లు వందల సంఖ్యలో ఉన్నారు? ఎలా సాధ్యం? పుట్టిన సంవత్సరం సరిగ్గా తెలియక కొందరు తమ పుట్టిన సంవత్సరాన్ని 1900గా నమోదు చేయించారు. దీంతో కొందరు ఓటర్ల వయసు 120 ఏళ్లకు పైగా ఉన్నట్టు జాబితాలో వచ్చింది. ఆ ఓటర్లే తమ పుట్టిన సంవత్సరం సవరణకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఎలా పొందాలి? 80 ఏళ్లుపైబడిన వృద్ధులు, 40శాతానికి మించిన వైకల్యమున్న ఓటర్లు ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయొచ్చు. ఇందుకోసం వీరికి ‘ఫారం–12డీ’ దరఖాస్తులను పంపిణీ చేస్తున్నాం. వీటిని బీఎల్ఓలు సేకరిస్తారు. ముందే నిర్దేశించిన తేదీల్లో ప్రిసైడింగ్ అధికారి నేతృత్వంలోని బృందం వీరి ఇళ్లకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ అందజేస్తుంది. రహస్యంగా ఓటేసేందుకు వీలుగా ఇంట్లో కంపార్ట్మెంట్ సైతం ఏర్పాటు చేస్తుంది. వీడియో కెమెరా బృందం, పోలీసులు సైతం ఉంటారు. పార్టీల ఏజెంట్లనూ అనుమతిస్తారు. ఓటేసిన తర్వాత ఓటరే స్వయంగా బ్యాలెట్ పత్రాన్ని కవర్లో ఉంచి సీల్ చేసి ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి. జర్నలిస్టులతో సహా 13 అత్యవసర సేవల విభాగాల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చే కేంద్రాల్లోనే పోలింగ్ ఫెసిలిటేటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడే వారికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి ఓటు వేయించుకుంటాం. ప్రగతి భవన్లో బీ–ఫారాల పంపిణీ, రజాకార్ సినిమా, సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై అధికార, విపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి కదా? ఆ ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలో ఉన్నాయి. అక్కడి నుంచి అందే సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం. ఎన్నికల సంఘం ఇటీవల రాష్ట్రంలోపెద్దఎత్తున అధికారులను ఆకస్మిక బదిలీ చేసింది? కారణమేంటి? బదిలీ ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా కారణాలేమీ తెలపలేదు. వారి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలిస్తే నామినేషన్ తిరస్కరిస్తారా? అఫిడవిట్లో తప్పుడు సమా చారమిస్తే రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను తిరస్కరించరు. అన్ని కాలమ్‌లను భర్తీ చేయనిపక్షంలో అభ్యర్థికి నోటీసులిస్తారు. అయినా భర్తీ చేయకుంటే ఆ నామినేషన్‌ను తిరస్కరించవచ్చు. నేర చరిత్రపై అభ్యర్థులు, పార్టీలు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అనామక పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాయి? త్వరలో అన్ని పార్టీలకు సూచనలు జారీ చేస్తాం. సర్క్యులేషన్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలో ఓ జాబితాను పార్టీలకు అందజేస్తాం. ఆన్లైన్ ద్వారా ఓటర్లకు నగదు బదిలీపై నిఘా ఉంచారా? యూపీఐ ద్వారా ఏ బ్యాంకు ఖాతా నుంచి ఎంత డబ్బు బదిలీ చేస్తున్నారు? అనే అంశంపై ఆదాయ పన్ను శాఖకు రోజువారీగా నివేదికలు అందుతున్నాయి. రాష్ట్రానికి కేంద్ర బలగాలు ఎన్ని వస్తున్నాయి? ఎన్నికల బందోబస్తు కోసం 65 వేల మంది పోలీసుల సేవలు అవసరం కాగా, రాష్ట్రంలో 40వేల మంది ఉన్నారు. మరో 25,000 మంది బలగాలను పంపాలని డీజీపీ అడిగారు. 100 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి వస్తున్నాయి. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు.. కలెక్టర్..
ఆదిలాబాద్: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన క్రమంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్‌రాజ్ అ న్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల కోడ్ వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమి షన్ సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వి డుదల చేసిందని తెలిపారు. దీంతో నియమావళి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుందని, 10 వరకు నామినేషన్ల గడువు, 13న పరిశీలన, 15న ఉపసంహరణ, 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుందని వివరించారు. ఓటర్లు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఓటరు లిస్టుతో తమ పేర్లు ఉన్నయో లేవో పరిశీలించుకోవాలన్నారు. ఎవరైనా పేర్లు లేకపోతే నామినేషన్లకు పది రోజుల ముందు వరకు ఫారం–6 ద్వారా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులకు నిబంధనలతో కూడిన బుక్లెట్ అందజేస్తామన్నారు. నియమావళిని పరిశీలించేందుకు ఫ్లయింగ్‌స్క్వాడ్ నియమించినట్లు తెలిపారు. అలాగే అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్కడ నిరంతరం సీసీ నిఘా, వీడియో చిత్రీకరణ ఉంటుందన్నారు. వీటిని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు అనుసంధానం చేశామన్నారు. ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తామన్నారు. అలాగే సర్వేలైన్ అధి కారుల ద్వారా పరిస్థితులను సమీక్షిస్తామన్నారు. ఒకవ్యక్తి రూ.50వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లరాదని, అంతకు మించి తీసుకెళితే సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే డబ్బును సీజ్ చేస్తామన్నారు. అలాగే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని, సభలు, సమావేశాలు నిర్వహించే ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛాయూత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొ ని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా రు.ఎన్నికల నిర్వహణ కోసం అన్నిఏర్పాట్లు చేస్తా మన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పె డుతామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సంక్షే మ పథకాలు సూచించే ఫ్లెక్సీలు తొలగించామన్నారు. ఇందులో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఐటీడీఏ పీవో చాహత్‌బాజ్‌పాయ్ పాల్గొన్నారు. -
TS Election 2023: కసరత్తు పూర్తి.. తుది ఓటరు జాబితా సిద్ధం..!
జోగులాంబ: త్వరలో అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రధాన ఘట్టమైన తుదిఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి ఆగస్టు 21వ తేదీన విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై మార్పులు, చేర్పులు, 18సంవత్సరాలు నిండిన వారికి కొత్తగా ఓటుహక్కు కల్పించేందుకు సెప్టెంబర్ 19వ తేదీ వరకు తుది అవకాశాన్ని కల్పించింది. ఈక్రమంలో ఫాం–6, 7, 8లకు సంబంఽధించి (చేర్పులు, మార్పులు, తొలగింపు)జిల్లా వ్యాప్తంగా 44,963 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న అధికారులు పోలింగ్ స్టేషన్ల వారీగా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి తుదిజాబితాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆగస్టులో ముసాయిదా జాబితా విడుదల.. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపు ప్రక్రియకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఆధారంగా చేసుకుని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో ఆగస్టు 21వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,78,951మంది ఓటర్లున్నట్లు పేర్కొన్నారు. ఇందు లో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపా రు. వీటిపై ఏమైన అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదుల చేసుకునేందుకు అదేవిధంగా 18సంవత్సరాలు నిండిన వారికి ఓటుహక్కు కల్పించేందుకు సెప్టెంబర్ 19తేదీ వరకు మరో అవకాశం కల్పించింది. పెరగనున్న ఓటర్లు.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 4,78,951 ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా ఓటరు జాబితా లెక్కలు చెబుతుండగా, వీటిపై మార్పులు, చేర్పులు, తొలగింపునకు సంబంధించి 44,963 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన వాటిని ఆధారంగా ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య కంటే మరికొంత మేర ఓటర్ల సంఖ్య పెరగనుంది. జాబితాను ఎన్నికల సంఘం నిర్ధేశించిన ప్రకారం ఈనెల 4వ తేదీన విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిసింది. మొత్తం 44,963 దరఖాస్తులు! ముసాయిదా ఓటరు జాబితాపై చేర్పులు, మార్పులు, తొలగింపు ప్రక్రియకు సంబంధించి ఫాం–6, 7, 8 కింద జిల్లా వ్యాప్తంగా 44,963 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గద్వాల నియోజకవర్గంలో ఫాం–6కి 13,746, ఫాం–7కి 7,800, ఫాం–8కి 8450 దరఖాస్తులు, అలంపూర్ నియోజకవర్గ పరిధి లో ఫాం–6కి 8,432, ఫాం–7కి 3,001, ఫాం–8కి 3,531 దరఖాస్తులు వచ్చినట్లు తె లిపారు. వీటన్నింటిని జిల్లా వ్యాప్తంగా ఉన్న 593పోలింగ్ స్టేషన్లలలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించాం.. ముసాయిదా జాబితాపై ఫాం–6,7,8లకు సంబంఽధించి వచ్చిన దరఖాస్తులను పోలింగ్ స్టేషన్ల వారిగా సందర్శించి పరిశీలించడం జరిగింది. తుది ఓటరు జాబితాను ఈనెల 4వ తేదీన విడుదల చేస్తాం. – వల్లూరు క్రాంతి, కలెక్టర్ -
Telangana: ఎన్నికలకు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని, ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. గత మే 23 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యే క సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని, మరో వారంలో తుది జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈవీఎంలన్నింటికీ ప్రాథమిక స్థాయి తనిఖీలతోపాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల శిక్షణ కార్యక్రమాలను సైతం పూర్తి చేశామన్నారు. శాసనసభ ఎన్నికల కవరేజీ కోసం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన వెంటనే రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించి పరిశీలిస్తారని, బ్యాలెట్ పత్రాల ముద్రణ తర్వాత ఈవీఎంలకు ద్వితీయస్థాయి తనిఖీల(ఎస్ఎల్ఎఫ్)ను నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహిస్తారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల తొలి వారంలో వచ్చే అవకాశం ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా, షెడ్యూల్‌ను ఈసీ ప్రకటిస్తుందని బదులిచ్చారు. జిల్లాల్లో చురుగ్గా ఏర్పాట్లు అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటుందని వికాస్‌రాజ్ చెప్పారు. ఈవీఎంల పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులను గుర్తించి శిక్షణ ఇస్తామని తెలిపారు. నిబంధనల మేరకు ర్యాంపులు, విద్యుదీకరణ, టాయిలెట్లు వంటి కనీస సదుపాయాలు ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఉన్నాయా? లేవా? అని పరిశీలించామని, సదుపాయాలను కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరుకుందన్నారు. కేంద్ర బలగాలకు వసతి, రవాణా సదుపాయాలు కల్పించడంతోపాటు ఎంత మందిని సమస్యాత్మక ప్రాంతాల్లో నియమించాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 6.99 లక్షల మంది యువ ఓటర్లు గత జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 15 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరారని, వీరిలో 6.99 లక్షల మంది 18–19 ఏళ్ల యువ ఓటర్లు ఉన్నారని వికాస్‌రాజ్ తెలిపారు. లక్ష మంది దివ్యాంగ ఓటర్లను గుర్తించామన్నారు. 80 ఏళ్లుపైబడిన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే నెల 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ కమిషన్ పర్యటించనుందని ఆయన తెలిపారు. కమిషన్ రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీఎస్, డీజీపీ, 20కి పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తుందని వివరించారు. దర్యాప్తు సంస్థల నుంచి ఇప్పటికే నివేదికలు తమకు అందుతున్నాయన్నారు. ఓటరు నమోదు కోసం.. ఓటర్ల జాబితాతో సహా ఇతర అంశాలపై తమకు చాలా ఫిర్యాదులు అందాయని, ప్రతి ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ జరిపి ఫిర్యాదుదారులకు సైతం నివేదిక ప్రతిని అందజేస్తున్నామని వికాస్‌రాజ్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 700 బృందాలు నాలుగు వేలకు పైగా ఇళ్లను సందర్శించి చిరునామా మారిన ఓటర్ల తొలగింపును చేపట్టారని తెలిపారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు సీఈఓలు సర్ఫరాజ్ అహ్మద్, లోకేష్‌కుమార్, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, జాయింట్ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు. -
ప్రతి ఓటరూ ఆధార్‌తో లింక్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఓటరునూ ఆధార్‌తో అనుసంధానం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేష్‌కుమార్ మీనాకు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దొంగ ఓట్లను పూర్తిగా నివారించడంతోపాటు ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉండకుండా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఈవో ముఖేష్‌కుమార్ మీనాను మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, పార్టీ నేత దేవినేని అవినాశ్‌తో కూడిన వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం కలిసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చాలా చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఒకే ఫోటో లేదా ఒకే పేరు, ఒకే ఓటర్ ఐడీతో చాలా ఓట్లు ఉన్న విషయాన్ని సీఈవో దృష్టికి తెచ్చామన్నారు. ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలని వైఎస్సార్సీపీ కోరుకుంటోందన్నారు. ప్రతి ఓటరునూ ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న తమ విజ్ఞప్తిపై సీఈవో సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రమిస్తున్న వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం అక్రమాలు టీడీపీ సర్కార్ నిర్వాకాలే.. ఓటర్ల జాబితాలను ప్రభుత్వం మార్చేస్తోందంటూ గత 15 రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. 2017, 2018, 2019 ఓటర్ల జాబితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 2023లో ఓటర్ల జాబితా ఎలా ఉందనే విషయాన్ని సీఈవోకి ఉదాహరణలతో సహా తెలియచేశాం. పేరులో చిన్న మార్పు, అడ్రస్‌లో చిన్న మార్పుతో ఒకే మనిషికి రెండు, మూడు ఓట్లు ఉన్నాయి. అలా 59,18,631 ఓట్లు ఉన్నట్లు 2019 ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇవాళ 2023 జాబితాను చూస్తే పేరు, చిరునామాలో చిన్న మార్పులు, ఫోటోల మార్పుతో.. ఒకే మనిషికి రెండు మూడు చోట్ల దాదాపు 40 లక్షల ఓట్లు ఉండగా.. తెలంగాణ, ఏపీలో రెండు చోట్లా ఓట్లున్న వారు దాదాపు 16.59 లక్షల మంది ఉన్నారు. ► 9,242 ఇళ్లలో 20 నుంచి 30 ఓట్ల వరకు ఉండగా 2,643 ఇళ్లలో 31 నుంచి 40 ఓట్ల వరకు ఉన్నాయి. 1,223 ఇళ్లలో 41–50 ఓట్లున్నాయి. ఇంకా 1,614 ఇళ్లలో 51–100 వరకు ఓట్లున్నాయి. 386 ఇళ్లలో 101–200 ఓట్లున్నాయి. 96 ఇళ్లలో 201 నుంచి ఏకంగా 500 వరకు ఓట్లున్నాయి. 14 ఇళ్లలో 501 నుంచి 1,000 ఓట్ల దాకా ఉన్నాయి. ఇవన్నీ 2019 ఓటర్ల జాబితాలో కూడా ఉన్నాయి. ఇక ఏ డోర్ నెంబరూ లేకుండా ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లున్నాయో కూడా సీఈవోకు వివరించాం. 2019లో కూడా ఆ ఓట్లపై చర్యలు తీసుకోవాలని మేం కోరినా అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఓటర్ల జాబితాను సవరించాలని సీఈవోను కోరాం. నాడు కళ్లు మూసుకున్నావా రామోజీ? ► ఒకే డోర్ నెంబరుతో 500 ఓట్లున్నాయని ఈనాడు రామోజీరావు మమ్మల్ని నిందిస్తున్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం విజయవాడ సూర్యారావుపేట పోలింగ్ బూత్‌ను పరిశీలిస్తే కడియాలవారి వీధి పేరుతో ఉన్న డోర్ నెంబర్లో 2019లో కూడా 500 ఓట్లు ఉన్నాయి. మరి ఆ ఆషాఢభూతి ఇప్పుడు కొత్తగా ఓట్లు చేర్చారని మాపై ఆరోపణలు చేస్తున్నారు. పాపాలు చేసింది వారైతే నిందలు మోపేది మాపైనా? ► రేపల్లెలో ఎడాపెడా దొంగ ఓట్లున్నాయని ఒక పేపర్లో రాశారు. నిజానికి అది 2019 నాటి ఓటర్ల జాబితా. అప్పుడే అవకతవకలు చేశారు. ఒకే డోర్ నెంబర్లో 148 ఓట్లు న్నాయి. జర్నలిస్టుల ముసుగులో కుల పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి. ఆ అవకతవకలన్నీ 2019 ఓటర్ల జాబితాలో ఉన్నాయి. మరి ఆనాడు ఎందుకు వార్తలు రాయలేదు? ► పార్వతీపురం నియోజకవర్గంలో సున్నా నెంబర్ ఇంట్లోనూ వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. మరి ఆనాడు మీకు ఇవేవీ కనిపించలేదా? ధృతరాష్ట్రుడిలా రామోజీకి కళ్లు కనిపించలేదా? ► 2019లోనే ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయి. అప్పుడే మేం వాటిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వాటిని ఇప్పుడు మేం సవరిస్తుంటే దొంగ ఓట్లు చేరుస్తున్నామంటూ నిందిస్తున్నారు. జాబితాలో పెరిగిందెక్కడ? రాష్ట్రంలో 2019 జనవరి నాటికి 3,98,34,776 మంది ఓటర్లు ఉండగా 2023 జనవరి నాటికి 3,97,96,678 మంది ఓటర్లున్నారు. మరి అలాంటప్పుడు మేం కొత్తగా ఓటర్లను ఎక్కడ చేర్పించినట్లు? మేం నిజంగా ఆ పని చేసి ఉంటే ఓటర్ల సంఖ్య పెరగాలి కదా? గజదొంగ చంద్రబాబు దొంగతనాలు చేసి నీతికధలు చెబుతున్నాడు. ఓటమి భయంతో మాపై ఆరోపణలు చేస్తున్నాడు. ప్రజలను కాకుండా కుట్ర రాజకీయాలను నమ్ముకున్న చంద్రబాబును సమర్థిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తున్నాయి. డూప్లికేట్లనే తొలగించామని సీఈవోనే చెప్పారు ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొంగ ఓట్లను గుర్తించి 2020లో 1,85,193 ఓట్లను తొలగించింది. 2021లో 1,11,076 ఓట్లు, 2022లో 11.23 లక్షల ఓట్లు వెరసి మొత్తం 14 లక్షలకు పైగా దొంగ ఓట్లను తొలగించారు. డూప్లికేట్ ఓట్లు, ఒకే ఫోటో ఉన్న ఓట్లకు సంబంధించి 10,52,326 ఓట్లను తొలగించినట్లు సీఈవోనే స్వయంగా మీడియాకు చెప్పారు. ఒకవేళ మేం దొంగ ఓట్లను చేర్పిస్తే ఇలా తొలగిస్తామా? ఆ నీచ రాజకీయం బాబుదే.. రాష్ట్రంలో 2019 ఓటర్ల జాబితాలే ఇవాళ్టికి కూడా కొనసాగుతున్నాయి. ఆ లోపాలను సవరించమని మేం కోరుతున్నాం. దొంగ ఓట్లను చేర్చడం.. అవతల పార్టీ ఓట్లను తొలగించడం చంద్రబాబుకే అలవాటు. తప్పుడు మార్గాల్లో గెలవాలని ప్రయత్నించడం ఆయనకు ఆనవాయితీ. ► తెలంగాణకు చెందిన బీజేపీ నేత బండి సంజయ్ కూడా మమ్మల్ని విమర్శిస్తున్నాడు. చంద్రబాబు కోసం ఆయన పని చేస్తున్నారు. ఎందుకీ దిక్కుమాలిన రాజకీయాలు? ► నాడు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అంటే 2015 జనవరి నాటికి 22,76,714 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మరో ఏడాదిలో అంటే 2016లో 13,00,613 మంది ఓటర్లను తొలగించారు. 2017లో మరో 14,46,238 మందిని తొలగించారు. అలా మూడేళ్లలో టీడీపీ హయాంలో మొత్తం 50,23,565 మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించారు. ► సేవామిత్ర అనే యాప్ ద్వారా వైఎస్సార్సీపీ సానుభూతిపరులను గుర్తించి వారందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. దానిపై మేం పోరాడాల్సి వచ్చింది. కోర్టులు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి ఆ ఓట్లను తిరిగి చేర్పించే ప్రయత్నం చేశాం. -
ఓటరు జాబితా ‘ప్రక్షాళన’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ కోసం ఎన్నికల సంఘం పకడ్బంధీ చర్యలు చేపట్టింది. సమగ్ర ఇంటింటి సర్వే ద్వారా పలు రకాల తప్పులను గుర్తించి ఓటరు జాబితా రూపకల్పనలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఒకే ఇంటి నెంబర్‌తో భారీ సంఖ్యలో ఓట్లు నమోదైన విషయాన్ని పలు రాజకీయ పా ర్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకురావడంతో పాటు ఓటరు జాబితా తయారీలో తప్పులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్న కేంద్ర ఎన్నికల సంఘం సూచనల ఆధారంగా ఈ సర్వే చేపట్టినట్లు తెలంగాణ ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించారు. కమిషన్ వర్గాల సమాచారం ప్రకారం ఈఆర్వో.నెట్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఓటరు డేటాను పరిగణనలోకి తీసుకుని ఇంటింటి సర్వే నిర్వహించడం ద్వారా సూక్ష్మ పరిశీలన జరిపారు. ఈ విధంగా జరిపిన పరిశీలనలో రాష్ట్రంలోని మొత్తం 7,66,557 ఆవాసాల్లో ఉన్న 75,97,433 ఓట్ల సవరణ జరిగింది. హైదరాబాద్ నగరంలోని కార్వాన్ నియోజకవర్గంలో అత్యధికంగా 17,398 ఆవాసాల్లోని 2,20,316 మంది ఓటర్లు, యాకుత్‌పురా పరిధిలోని 14,883 ఆవాసాల్లో ఉన్న 1,84,060 ఓటర్లు, రాజేంద్రనగర్‌లోని 13,901 ఆవాసాలకు చెందిన 1,57,972 ఓటర్లు, ఎల్బీనగర్ పరిధిలోని 13,987 ఆవాసాల్లో ఉన్న 1,48,378 ఓటర్లు, మల్కాజిగిరి నియోజకవర్గంలోని 10,649 ఆవాసాల్లోని 1,06,336 మంది ఓటర్లను గుర్తించి సవరణలు చేశారు. దీంతో పాటు ఓటర్ కార్డులోని చిరునామాతో పాటు ఇతర మార్పులు, ఓటరు కార్డుల మార్పు కోసం ఫారం–8 ద్వారా వచ్చిన దాదాపు 9,00,115 దరఖాస్తులను ఎన్నికల కమిషన్ పరిష్కరించింది. ఇందులో అత్యధికంగా ఆసిఫాబాద్ నుంచి 25,026 దరఖాస్తులు రాగా గద్వాల, హుస్నాబాద్, ఖానాపూర్, మక్తల్‌ల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే అత్యధికంగా సిద్దిపేటలో 18,148, శేరిలింగంపల్లిలో 17,312, మేడ్చల్‌లో 16,569 దరఖాస్తులు రాగా, వాటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం పరిష్కరించినట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగించాలి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చనిపోయిన, ఇతర ప్రాంతాలకు తరలిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌కు బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ నియోజకవర్గాల్లో ఒకే కుటుంబానికి చెందిన వారి ఓట్లను ఒకే పోలింగ్ బూత్‌లోకి మార్చాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ జాతీయ ఈసీ కమిటీ సభ్యుడు ఓం పాఠక్, రాష్ట్రపార్టీ ఈసీ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ సభ్యులు ఏడెల్లి అజయ్ కుమార్, పొన్న వెంకటరమణ, కేతినేని సరళ, కొల్లూరి పవన్ కుమార్ వినతిపత్రం సమర్పించారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాను తప్పుల తడకగా తయారుచేసిన ఈఆర్వోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఈవోకు మరో వినతిపత్రం అందజేశారు. -
పాత ఎపిక్ ఉన్నా.. ఓటు డౌటే!
హైదరాబాద్: ఓటరు ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్) ఉందనుకొని ఇప్పుడు ఓటరు జాబితాలో పేరుందో లేదో చూసుకోకపోతే.. తీరా పోలింగ్‌నాడు వెళ్లినా మీకు ఓటు లేదని నిరాకరించవచ్చు. ఇప్పటికే ఎపిక్ కార్డులున్నప్పటికీ చాలామంది పేర్లు ఓటర్ల జాబితాల్లో ఉండటం లేవు. వాస్తవానికి ఒక ఓటును తొలగించాలంటే నిబంధనల మేరకు ఎన్నో పాటించాల్సి ఉంది. ఓటరు కచ్చితంగా లేడని నిర్ధారించుకున్నాకే తొలగించాల్సి ఉన్నప్పటికీ ఇవేవీ లేకుండానే ఇష్టానుసారం ఓట్లను తొలగించారు. దీంతో మీకు ఎపిక్ ఉన్నప్పటికీ జాబితాలో మీ పేరు లేకపోవచ్చు. తప్పు ఎవరిదైనా మీకు ఓటు వేసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలో మీ పేరుందో, లేదో చూసుకొని లేకుంటే దరఖాస్తు చేసుకొమ్మని కోరుతున్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్. తాజాగా వెలువరించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో చూసుకోవాలని సూచించారు. ఏ అవసరానికి ఏ ఫారం వినియోగించాలంటే.. ► 18 సంవత్సరాల వయసు దాటినప్పటికీ, ఇప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేని వారు నమోదు చేసుకునేందుకు, ఎపిక్ ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేని వారు నమోదు చేసుకునేందుకు, రాబోయే అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయసు నిండే వారు ఇప్పుడే నమోదు చేసుకునేందుకు ఫారం 6. ► ఆధార్‌తో అనుసంధానానికి ఫారం 6బి. ► జాబితాలోంచి అనర్హుల పేర్లు తొలగించేందుకు, కొత్త ఓటరు చేర్పుపై అభ్యంతరాలు తెలియజేసేందుకు ఫారం 7 ► పేరు, వివరాల్లో దోషాలు సరిచేసుకునేందుకు, నియోజకవర్గం పేరు పొరపాటుగా ఉన్నప్పుడు,కుటుంబ సభ్యులందరి పేర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో కాకుండా వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నప్పుడు, ఫొటో సవ్యంగా లేనప్పుడు, జాబితాలో మొబైల్ నంబర్ అప్డేషన్కు ఫారం 8. ► ముసాయిదా ఓటరు జాబితాలో పేరుందో లేదో చూసుకునేందుకు www.ceotelangana.nic.in ► జాబితాలో పేరుండి పొరపాట్ల సవరణ, మార్పుచేర్పుల కోసం www.voters.eci,gov.in లేదా voterhelpline app ద్వారా ► ఇతర వివరాలకు ఓటర్ హెల్ప్‌లైన్ నెంబర్ 1950 సంప్రదించవచ్చు. -
నిరాశ్రయులకు ఓటు హక్కు కల్పించేలాచర్యలు చేపట్టండి
సాక్షి, విశాఖపట్నం: అర్హత కలిగి ఉండి.. నిరాశ్రయులుగా ఉన్నవారికీ ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్ ఆదేశించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ–2024పై రెండు రోజుల సమీక్ష విశాఖలో గురువారం ముగిసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా అధ్యక్షతన సదస్సు జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ తరఫున డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హృదేశ్కుమార్, సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరేంద్ర ఎన్ బుటాలియా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్‌కుమార్ హాజరయ్యారు. ప్రత్యేక సంక్షిప్త సవరణపై అవగాహన కలెక్టర్లకు ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్)–2024పై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. మానవ వనరుల లభ్యత, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, ఎన్నికల సిబ్బందికి, పోలింగ్ స్టేషన్లకు కనీస సౌకర్యాలు, ఫిర్యాదు నిర్వహణ తదితర అంశాలపై కూడా చర్చించారు. ముగింపు సందర్భంగా సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్ మాట్లాడుతూ అర్హులైన వారందర్నీ ఓటరు జాబితాలో 100 శాతం చేర్పించేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా నిరాశ్రయులపై శ్రద్ధ వహించాలనీ, అట్టడుగు సమాజంలో ఉన్న వారిని, మురికివాడలు, సంచార జాతులు, ఎస్సీ, ఎస్టీ ప్రజలు, గిరిజన తండాల్లో నివాసితులు, పీవీజీటీ పరిధిలో (బలహీన గిరిజన సమూహాలు) ఉన్నవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ విలువైన ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనంతరం ఓటర్ల నమోదుపై వచ్చే ప్రతి ఫిర్యాదుపై శ్రద్ధ వహించాలని సూచించారు. రాజకీయ పార్టీలకు ఓటింగ్, ఎన్నికల గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తూ.. ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా వివరించాలన్నారు. ఈవీఎంలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని స్పష్టం చేశారు. యువ ఓటర్లు, వలస ఓటర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఎస్ఎస్ఆర్–2024 ప్రక్రియ పూర్తయ్యే సమయానికి అర్హులైన ఓటర్లతో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తిస్థాయి పారదర్శకంగా ఉన్న ఓటర్ల జాబితా తయారు చేసేందుకు 26 జిల్లాల కలెక్టర్లు నిరంతరం కృషి చేయాలని ధర్మేంద్రశర్మ, నితీష్ ఆదేశించారు. -
ధ్రువీకరణ పత్రాలు త్వరగా అందించాలి... కలెక్టర్ రాజర్షి షా
మెదక్ కలెక్టరేట్: మీ సేవ కేంద్రాల ద్వారా ధ్రువపత్రాల కోసం చేసుకున్న దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి జారీ చేయాలని కలెక్టర్ రాజర్షి షా తహసీల్దార్లకు సూచించారు. బుధవారం అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీఓలు, తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్రువపత్రాల జారీ, ఇంటింటి ఓటరు జాబితా సర్వే, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు గుర్తింపు పై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సర్వర్ సమస్య కూడా తీరిందని, ఆదాయ, కుల, రెసిడెన్షియల్ ధ్రుపత్రాలను త్వరగా జారీ చేయాలన్నారు. ప్రధానంగా రుణసాయం కోసం దరఖాస్తు చేసుకునే బీసీ కులాల వారికి త్వరితగతిన అందజేయాలని సూచించారు. ఓటరు జాబితా తయారీలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వే గురువారం పూర్తి చేయాలని బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితాలో మృతిచెందిన, షిఫ్టింగ్ అయిన వారి పేర్లను మరోసారి పరిశీలించుకోవాలన్నారు. పొరపాట్లు జరిగినట్లయితే ఫారం 6 ద్వారా తిరిగి ఓటరుగా నమోదు చేయాలన్నారు. అదేవిధంగా అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి యువత ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ సందర్భంగా వస్తున్న ఫామ్ 6,7,8 లను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేస్తూ వచ్చిన పక్షం రోజులలోగా డిస్పోస్ అయ్యేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేసి ర్యాంపులు ఉండేలా చూడాలన్నారు. 1500 పైగా ఓటర్లు ఉన్న బూతులతో కొత్తగా పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భవనాలను గుర్తించాలన్నారు. త్వరలో అన్ని రాజకీయపక్షాలతో సమావేశమై తగు ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్‌కు పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు సాయిరాం, శ్రీనివాసులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
Hyderabad: 90 లక్షలు దాటిన గ్రేటర్, శివారు ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,44,072 మంది ఓటర్లున్నారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6,12,700 ఓటర్లుండగా, చార్మినార్‌లో అత్యల్పంగా 2,14,774 ఓటర్లున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, మేడ్చల్ జిల్లాలోని 5 నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 91,86,375 మంది ఓటర్లు ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో కొంతభాగం మాత్రమే ఉండటంతో దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. హైదరాబాద్ జిల్లాలో ముసాయిదా జాబితాలో 41.46 లక్షల ఓటర్లుండగా, తుదిజాబితాలో ఆ సంఖ్య 42.15 లక్షలకు పెరిగింది. ఓట్లు గల్లంతయిన వారితోపాటు కొత్త ఓటర్ల నమోదుతో ఈ సంఖ్య పెరిగింది. (క్లిక్ చేయండి: మెట్రో ఛార్జీలు పెంపు!) -
AP: ఎన్నికల్లో కీలక శక్తిగా మహిళలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చట్ట సభలకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో మహిళలే కీలక శక్తిగా మారనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం ఈ అంశాన్ని స్పష్టం చేస్తోంది. ప్రత్యేక ఓటర్ల సవరణ తుది జాబితా 2023ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో సర్వీసు ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,84,868. వీరిలో పురుష ఓటర్లు 1,97,59,489 మంది కాగా, మహిళా ఓటర్లు 2,02,21,455 మంది ఉన్నారు. అంటే 4,61,966 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. థర్డ్ జెండర్స్ ఓటర్ల సంఖ్య 3,924గా ఉంది. మొత్తం 26 జిల్లాల్లో 22 జిల్లాల్లో పురుషులకంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మాత్రమే పురుష ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 19,41,277 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,29,085 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 7,76,716 మంది ఓటర్లు ఉన్నారు. 2022తో పోలిస్తే తగ్గిన ఓటర్ల సంఖ్య గతేడాది తుది ఓటర్ల సవరణ జాబితాతో పోలిస్తే ఈ ఏడాది ఓటర్ల సంఖ్య 7,51,411 తగ్గింది. 2022 తుది జాబితాలో 4,07,36,279గా ఉన్న ఓటర్ల సంఖ్య 2023 జాబితా నాటికి 3,99,84,868కి పరిమితమయింది. కానీ, నవంబర్‌లో విడుదల చేసిన ముసాయిదా జాబితా సవరణ తర్వాత నికరంగా ఓటర్ల సంఖ్య 1,30,728 పెరిగినట్లు మీనా తెలిపారు. ముసాయిదా జాబితా తర్వాత కొత్తగా 5,97,701 మంది ఓటర్లు చేరితే 4,66,973 మంది ఓటర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. గతంతో పోలిస్తే అదనంగా ఒక పోలింగ్ స్టేషన్ పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 45,951 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి వెయ్యి మంది జనాభాకు 721 మందికి ఓటు హక్కు ఉండగా, లింగ నిష్పత్తి 1,027గా ఉంది. పెరిగిన తొలి ఓటు హక్కు వినియోగదారులు 2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారిని ఓటర్లుగా చేర్చుకున్నారు. గత ఏడాది నవంబర్ 9న ప్రకటించిన ముసాయిదా జాబితాలో 18 నుంచి 19 ఏళ్లు ఉన్న తొలి ఓటు హక్కు వినియోగదారుల సంఖ్య 78,438గా ఉంటే తుది జాబితా నాటికి ఈ సంఖ్య 3,03,225కు చేరినట్లు మీనా తెలిపారు. విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా ప్రచారం చేయడమే కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరగడానికి కారణమని చెప్పారు. మొత్తం ఓటర్లలో దివ్యాంగుల సంఖ్య 5,17,403గా ఉంది. ఈ తుది ఓటర్ల జాబితాను అన్ని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు శుక్రవారం అందజేస్తామని తెలిపారు. ఓటరుగా నమోదు చేసుకోలేకపోయినవారు ఫారం–6 ద్వారా నమోదు చేసుకోవచ్చని, అభ్యంతరాలను ఫారం–7 ద్వారా, సవరణలను ఫారం–8 ద్వారా చేయవచ్చని తెలిపారు. -
ఓటరు జాబితా సవరణకు 8.67 లక్షల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా సవరణ కోసం 8.67 లక్షల దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికాస్‌రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 8వ తేదీతో గడువు ముగిసిందని, ఆ తర్వా త వచ్చిన దరఖాస్తులను తుదిజాబితా ప్రచురించిన తర్వాత పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన యువత ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకునేవిధంగా పకడ్బందీగా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలోని 1,700 కళాశాలల్లో ఉన్న 18–19 ఏళ్ల వయసువారిని లక్ష్యంగా చేసుకుని ఎలక్షన్ లిటరసీ క్లబ్(ఈఎల్‌సీ)లను ఏర్పాటు చేశామని, క్యాంపస్ అంబాసిడర్లను నియమించడంతోపా టు విద్యార్థులందరికీ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపామని తెలిపారు. గిరిజనుల కోసం ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టామని, రాష్ట్రంలోని 361 గిరిజన ఆవాసాల్లో గల కొ లం, తోటి, చెంచు, కొండరెడ్డి తెగలకు చెందిన 2,500 మంది నుంచి దరఖాస్తులను స్వీకరించామని పేర్కొన్నారు. విక లాంగ ఓటర్ల కోసం పింఛన్ డేటాతోపాటు సదరం వివరాలు తీసుకున్నామని తెలిపారు. పట్టణప్రాంతాల్లో ఓటరు నమోదు కోసం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఆస్తిపన్ను చెల్లిస్తున్నవారి కి ఎస్ఎంఎస్లు పంపించామని, వీధి నాటకాల ద్వారా అ వగాహన కల్పించేందుకు ప్రయత్నించామని, పట్టణ ప్రాంతాల్లో ఉండే పారిశుధ్య వాహనాల ద్వారా ఆడియో సందేశాలు పంపామని తెలిపారు. ఈ నెల 8లోపు వచ్చిన దర ఖాస్తులను 26 వ తేదీలోపు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జనవరి 5న తుది ఓటరుజాబితా అక్టోబర్ 1 వ తేదీ తర్వాత 8.67 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 5.66 లక్షల ఫాం–6, 1.83 లక్షల ఫాం–7, 1.17 లక్షల ఫాం–8 దరఖాస్తులున్నాయని వికాస్‌రాజ్ తెలిపారు. ఆన్‌లైన్‌తోపాటు కొన్ని దరఖాస్తులను నేరుగా బీఎల్వోలు, ఏఈఆర్వోలు, ఈఆర్వోలకు ఇచ్చారని, వాటిని డిజిటలైజ్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. అక్టోబర్–1 నుంచి నవంబర్–9 వరకు వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. కాగా, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో వచ్చిన ఓటరు నమోదు, అభ్యంతరాలను డిసెంబర్ 30లోపు పరిశీలించి పరిష్కరిస్తామని వికాస్‌రాజ్ వెల్లడించారు. -
Hyderabad: 15 నియోజకవర్గాల్లో 2.79 లక్షల ఓట్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో 2.79 లక్షల ఓటర్లను తొలగించారు. గత జనవరి 5వ తేదీ నుంచి ముసాయిదా ఓటరు జాబితా తయారీ వరకు తొలగించిన ఓట్లు ఇవి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 29,591 ఓటర్ల పేర్లు తొలగించారు. ఓటర్ల జాబితాలో పేర్లున్న వారిలో మృతి చెందినవారు, చిరునామా మారిన వారు, ఒకటి కంటే ఎక్కువ పర్యాయాలు పేర్లున్న వారిని తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం ఓటర్లు 41.46 లక్షలు హైదరాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం జనవరిలో 43, 67,020 మంది ఓటర్లుండగా.. తొలగింపులు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారిని పరిగణనలోకి తీసుకొని రూపొందించిన తాజా ఓటర్ల ముసాయిదా జాబితాలో41,46,965 మంది ఓటర్లున్నారు. అంటే గడచిన పదినెలల్లో 2,20,055 మంది ఓటర్లు తగ్గారు. ఇందులో కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు 59,575 మందికాగా, తొలగించినవారు 2,79,630 మంది. సగటున 5.04 శాతం ఓటర్లు తగ్గారు. తొలగించిన ఓటర్లు నియోజకవర్గాల వారీగా.. వీరిలో మృతులు 78 మంది కాగా, చిరునామా మారిన వారు 3966 మంది, ఒకటి కంటే ఎక్కువ ఓట్లున్నవారు 275586 మంది ఉన్నారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదల హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితాను సంబంధిత ఈఆర్ఓలు విడుదల చేశారు.ఈ జాబితాకు సంబంధించిన అభ్యంతరాలను డిసెంబర్ 8 వరకు స్వీకరిస్తారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పేర్కొన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేర్లను పరిశీలన చేసుకునేందుకు సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారిని సంప్రదించవచ్చని తెలిపారు. ఆన్లైన్ ద్వారా www. nvsp.com, www.ceotelangana.nic.in పోర్టల్స్ ద్వారా, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కూడా పరిశీలన చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
డిసెంబర్ 30న ఎమ్మెల్సీ తుది ఓటర్ల జాబితా
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్– రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 7 తర్వాత కూడా కొనసాగుతుందని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 7తో దరఖాస్తుల స్వీకరణ ముగియగా, నవంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాత నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించాలి. అయితే, ఈ నెల 7 నుంచి 23 మధ్య వ్యవధిలో సైతం కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించి డిసెంబర్ 30న ప్రకటించనున్న తుది ఓటర్ల జాబితాలో స్థానం కల్పిస్తామని వికాస్‌రాజ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. -
ఓటర్ జాబితా నిలుపుదలకు ఆదేశాలివ్వలేం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఓటర్ల జాబితాలో అధికార టీఆర్ఎస్ అక్ర మాలకు పాల్పడుతోందని దాఖలైన పిటిషన్లో ఓటర్ జాబితా వెలువరించకుండా ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఓటర్ల తుది జాబితా వివరాలు తమ ముందుంచాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. పెండింగ్‌లోని 5,517 దరఖాస్తులను ఆమోదించకుండా ఉత్తర్వులివ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఉప ఎన్నిక సందర్భంగా నకిలీ ఓట్లు సృష్టించి లబ్ధి పొందాలని టీఆర్ఎస్ చూస్తోందని బీజేపీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూ యాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం శుక్రవారం కూడా విచారణ సాగించింది. ఈసీ తరఫున న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ‘కొత్త ఓట్ల కోసం(ఫామ్–6) మొత్తం 25,013 దరఖాస్తులు వచ్చాయి. 7,247 తిరస్కరించాం. 5,517 పెండింగ్ దశలో ఉన్నాయి. 12,249 దరఖాస్తులను అనుమతించాం. అలాగే తప్పుల సవరణ (ఫామ్–8) కోసం 2,142 దరఖాస్తులు రాగా, 239 అనుమతించాం. 1,822 పెండింగ్‌లో ఉన్నాయి. 81 తిరస్కరించాం. దరఖాస్తు చేసుకున్న ఓట్ల అనుమతికి ఏడు రోజుల నోటీసు పీరియడ్ ఉంటుంది.. ఆలోగా ఎవరూ అభ్యంతరం తెలుపక పోతేనే దరఖాస్తులకు ఆమోదం లభిస్తుంది. పెండింగ్ దరఖాస్తుల్లో ఈ సాయంత్రం వరకు ఎన్ని పరిష్కారమైతే అన్ని అనుమతిస్తాం.. మిగతావి ఆగిపోతాయి. 2018లో 2,14,847, 2019లో 2,28,774, 2020లో 2,30,328, 2021లో 2,26,515, 2022లో(ఇప్పటివరకు) 2,38,759.. ఇదీ గత ఐదేళ్ల జాబితా’అని వివరించారు. నిబంధనల ఉల్లంఘన జరిగింది.. పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదించారు. ‘రాష్ట్రంలో అతి పెద్ద నియోజకవర్గాల్లోనే 2 లక్షల ఓటర్లు దాటలేదు. కానీ, మునుగోడులో ఆ మార్కు దాటడంతో అవకతవకలు జరిగాయి అనడానికి బలం చేకూరుస్తోంది’అని వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. మీరు హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు కోరుకుంటున్నారు.. మునుగోడు ఉప ఎన్నిక రద్దు కావాలంటున్నారా? ఓటర్ జాబితాపై స్టే కావాలా? ఏం కోరుకుంటున్నారో చెప్పండి.. అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. హుజూరాబాద్‌లోనూ ఇదే ఈసీ పనిచేసింది.. అక్కడ ఎన్నికల సమయంలో కొత్త ఓట్ల సంఖ్య పెరిగింది.. మరీ అప్పుడు అభ్యంతరం తెలపలేదమని పిటిషనర్ అడ్వొకేట్‌ను ప్రశ్నించింది. పిటిషనర్ పార్టీ గెలిస్తే కేసులో వాదనలు ముగిస్తామని.. లేదా కొద్ది ఓట్ల తేడాతో ఓడితే విచారణ కొనసాగిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో రచనారెడ్డి మాట్లా డుతూ.. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛ గా జరగాలన్నదే తమ అభిమత మని వివరించారు. దీంతో ఓటర్ల తుది జాబితా వివరాలు వెల్లడించాలని బెంచ్ కోరింది. శుక్రవారం సాయంత్రానికి అది ఖరా రవుతుందని దేశాయ్ చెప్పడంతో... వచ్చే విచారణ నాటికి వివరాలను తమ ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. -
బోగస్ ఓటర్లను చేర్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం: తరుణ్ చుగ్
న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అధికార, విపక్ష పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో కొత్తగా నమోదైన ఓట్లపై అనుమానాలు వ్యక్తం చేసింది బీజేపీ. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు కొత్త ఓట్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్. కొత్తగా చేరిన ఓటర్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు. ‘మునుగోడులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. కొత్తగా చేరిన ఓటర్లను పరిశీలించాలని ఈసీని కోరాం. స్వల్ప వ్యవధిలో 25వేల కొత్త ఓట్లు ఎలా వచ్చాయి? బోగస్ ఓటర్లను చేర్పించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.’ అని ప్రభుత్వం, టీఆర్ఎస్పై ఆరోపణలు గుప్పించారు తరుణ్ చుగ్. ఇదీ చదవండి: రెండు నెలల్లో ఇన్ని దరఖాస్తులా? మునుగోడు ఓటర్ల జాబితాను సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేశం -
మునుగోడు ఓటర్ల జాబితాను సమర్పించండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఇవాళ (గురువారం) ప్రారంభమైంది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఓటర్ల జాబితాను తమకు సమర్పించాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది రచనా రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల నమోదు జరిగిందని వాదించారు. ఫార్మ్ 6 ప్రకారం కొత్తగా దాదాపు 25 వేల ఓట్లు నమోదు చేసుకున్నారు. మునుగోడు నియోజకవర్గం లోని వివిధ మండలాల లో భారీగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగింది. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. నవంబర్ 3 న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా ఓటర్ల నమోదు అక్రమంగా జరిగిందని ఆమె వాదించారు. ఇక.. ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ‘తుది ఓటర్ల లిస్ట్ ఇంకా ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు. ప్రతి సంవత్సరం కొత్త ఓటర్లు నమోదు చేసుకుంటున్నారు. జనవరి 2021 వరకు రెండు లక్షల 22 వేలు ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం లో 2 లక్షల 38 వేలు ఓట్లు ఉన్నాయి. 25వేల ఓట్లలో ఏడు వేలు తొలగించాం. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది’ అని వాదించారు. రెండు నెలల్లో ఇన్ని దరఖాస్తులు ఎలా వచ్చాయని ఈసీని ప్రశ్నించిన హైకోర్టు.. ఈ నేపథ్యంలో దరఖాస్తుల వివరాలు, ఓటర్ల జాబితా తమకు సమర్పించాలని ఆదేశించింది. మునుగోడు ఉప ఎన్నికల ఓటర్ల జాబితా పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది. -
స్థానికేతరులకు ఓటు హక్కు ఇస్తే ఖబడ్దార్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఓటర్ల జాబితాలో స్థానికేతరుల పేర్లను చేరుస్తూ నిర్ణయం తీసుకుంటే సహించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా హెచ్చరించారు. కోర్టుకు వెళ్లయినా సరే కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. స్థానికేతరులకు ఓటు హక్కును ఎలా అడ్డుకోవాలన్న అంశంపై చర్చించేందుకు ఆయన సోమవారం అఖిలపక్ష నాయకులతో సమావేశయ్యారు. ఈ భేటీకి 9 పార్టీల నేతలు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేకతను, గుర్తింపును దెబ్బతీసే చర్యలకు పాల్పడొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఇక్కడ బయటి వ్యక్తులు ఓటు హక్కు ఇవ్వడం తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీని స్థానికేతరుల చేతుల్లో పెట్టొద్దని డిమాండ్ చేశారు. -
ఓటర్ల జాబితాపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఓటర్ల జాబితా విషయంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) చేసిన ప్రకటనపై కొన్ని దుష్టశక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సీఈఓ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ శనివారం స్థానిక దినపత్రికల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్లో ఓటర్ల జాబితా రివిజన్ తర్వాత కొత్తగా 25 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యే అవకాశం ఉందని సీఈఓ ఆగస్టు 17న విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీనిపై రాజకీయంగా అలజడి రేగింది. బయటి వ్యక్తులను తీసుకొచ్చి, ఓటు హక్కు కల్పించేందుకు కుట్ర పన్నారని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఈ అంశంపై చర్చించేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా సోమవారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు వివరణ ఇచ్చారు. -
ఓటరు జాబితాతో ఆధార్ అనుసంధానం
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాల సవరణలకు సంబంధించి ఆగస్టు ఒకటి నుంచి నూతన మార్గనిర్దేశకాలు అమల్లోకి రానున్నాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక మార్పులు చేసిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 17 ఏళ్లు నిండినవారు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడంతోపాటు, ఇప్పటికే నమోదైన వారు ఆధార్ నంబరును అనుసంధానం చేయాల్సి ఉంటుందని తెలిపారు. నూతన చట్ట సవరణలను అనుసరించి ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు 2023 ఏప్రిల్ ఒకటోతేదీ నాటికి తమ ఆధార్ నంబరు తెలియజేయాలని పేర్కొన్నారు. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛందమని, ఆధార్ నంబరు ఇవ్వని వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించరని స్పష్టం చేశారు. ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారి ఆధార్ నంబరు కోసం నూతనంగా ఫారం 6బీ ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈసీఐ, ఇరోనెట్, గరుడ, ఎన్వీఎస్పీ, వీహెచ్ఏ తదితర వెబ్సైట్లలో ఈ నెలాఖరు నాటికి నూతన దరఖాస్తు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే ఇంటింటికి తిరిగి ఆధార్ నంబరును అనుసంధానించే ప్రక్రియను చేపడతామని, ఆన్లైన్ ద్వారా కూడా ఆధార్ నంబరును అనుసంధానం చేయవచ్చని తెలిపారు. 6బీ ఇవ్వని వారు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న 11 ప్రత్యామ్నాయాల్లో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఆధార్ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఫారం 6తో నియోజకవర్గం మార్పు కుదరదు ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్దేశించారని, ఓటరు నియోజకవర్గం మారడానికి ఫారం 6లో దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదని తెలిపారు. జాబితాలో పేరు తొలగింపునకు ఉపయోగించే ఫారం 7 విషయంలో ఇకపై మరణ ధ్రువీకరణపత్రాన్ని జతచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఫారం 8 విషయంలో కీలక మార్పులు జరిగాయని తెలిపారు. ఇప్పటివరకు దీన్ని ఓటర్ల జాబితాలో నమోదు చేసిన వివరాల సవరణ కోసం వినియోగిస్తుండగా, ఇకపై విభిన్న అంశాలకు వినియోగించనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోనేగాక, ఇతర నియోజకవర్గాలకు ఓటరు మార్పు, నూతన ఓటరు గుర్తింపు కార్డు జారీ, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు కూడా ఫారం 8 వినియోగించవచ్చని ఆయన వివరించారు. -
ఓటర్ల జాబితాలో వారిదే పైచేయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఓటర్లలో అతివలదే అగ్రస్థానం. రాష్ట్రంలో పురుష ఓటర్లు 2,01,34,664 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 2,05,97,544 మంది ఉండటం విశేషం. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 4,62,880 మంది అదనంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసిన తుది నివేదికలో పేర్కొంది. ఒక్క శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో సర్వీసు ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 4,07,36,279. వీరిలో 4,071 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 43,45,322 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా 40,89,216 మంది, విశాఖపట్నం జిల్లా 37,19,438 మంది ఓటర్లతో నిలిచాయి. ఇక విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 19,02,077 మంది ఓటర్లు మాత్రమే నమోదయ్యారు. రాష్ట్ర జనాభాలో ప్రతి వెయ్యి మందికి 743 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ప్రతి వెయ్యిమంది పురుషులకు 1,026 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 18–19 ఏళ్లు ఉండి తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునే యువ ఓటర్ల సంఖ్య 2,07,893గా ఉంది. 1,500 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రం ఉండగా కొత్తగా 33 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 45,917 నుంచి 45,950కి చేరింది. 13.85 లక్షలు పెరిగిన ఓటర్లు రాష్ట్రంలో 2019 సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితాతో పోలిస్తే అదనంగా 13,85,239 మంది ఓటర్లు పెరిగారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో 3,93,51,040 మంది ఉండగా స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్)–22 నాటికి 4,07,36,279కి చేరింది. ఇందులో విదేశీ ఓటర్లు 7,033, సరీ్వస్ ఓటర్లు 67,935 మంది ఉన్నారు. -
AP: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
ఎన్నికల ఫలితాలు Live Updates: ► సాయంత్రం 5 గంటల వరకు వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. మరికొంత మంది గెలుపు బాటలో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా: ► ఆలమూరు గ్రామ పంచాయతీ 8వ వార్డుకి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ఎలుగు బంట్ల సత్యనారాయణ బూరయ్య 93 ఓట్లు మెజారిటీతో గెలుపు శ్రీకాకుళం జిల్లా: ►రేగిడి ఆమదాలవలస మండలం తోకల వలస పంచాయతీలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి సివ్వాల సూర్యకుమారి గెలుపు. విజయనగరం జిల్లా: ► భోగాపురం మండలం లింగాల వలస సర్పంచ్ ఉప ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి బుగత లలిత 42 ఓట్ల మెజార్టీతో విజయం. ► లక్కవరపుకోట మండలం రేగ పంచాయతీ 7 వ వార్డులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి లెంక శ్రీను 45 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ► నెల్లిమర్ల మండలం, ఏటి అగ్రహారం సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు మీసాల సూర్యకాంత 44 ఓట్లు మెజారిటీ తో గెలుపొందారు. ప్రకాశం జిల్లా : ► కంభం మండలం కందులాపురం 6వార్డు అభ్యర్థి బండారు వరలక్ష్మి 63 ఓట్లతో విజయం. ► మద్దిపాడు 5 వార్డు అభ్యర్థి నూనె శ్రీనివాసులు వైఎస్సార్సీపీ మద్దతుతో 99 ఓట్లతో ఘన విజయం. ► కొత్తపట్నంలో 7వ వార్డులో వైసీపీ అభ్యర్ధి పూరిణి సరోజిని 95 ఓట్లుతో విజయం. ► తర్లుబాడు మండలం మీర్జాపేట గ్రామ 2 వ వార్డులో వైసీపీ అభ్యర్థి యోగిరవణమ్మ పై టీడీపీ అభ్యర్థి నాగజ్యోతి 30 ఓట్ల తేడతో విజయం. ► ఇంకోల్లుమండలంపూసపాడులో 5 వ వార్డులో టిడిపి అభ్యర్ది గోరంట్ల లక్ష్మీ తులసీ 101 ఓట్ల మోజార్టీ తో గెలుపు. ► కొండపి నియోజక వర్గం నిడమానూరు 12 వార్డు టీడీపీ అభ్యర్దీ కాకుమాను సుబ్బారావు 46 ఓట్లతో విజయం.. ► కందుకూరు మండలం నరిశెట్టి వారి పాలెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ముప్పాళ్ళ శ్రీనివాసరావు విజయం గుంటూరు జిల్లా: ► అచ్చంపేట మండలం అంబడిపూడి సర్పంచ్ గా కొమ్మవరపు స్వరాజ్యలక్ష్మి 159 ఓట్లతో గెలుపు. ► సత్తెనపల్లి మండలం పాకాలపాడు సర్పంచ్ గా తిప్పి రెడ్డి సుజాత వెంకట రెడ్డి 427 ఓట్లతో గెలుపు. ► వినుకొండ మండలం శివపురం సర్పంచ్‌గా కమతం సుబ్బమ్మ 452 మెజార్టీతో గెలుపు (వైఎస్సార్సీపీ) ► బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల సర్పంచ్ గా బ్రహ్మం నాయక్ 153 ఓట్లతో గెలుపు(వైఎస్సార్సీపీ) విశాఖ జిల్లా ► అమలాపురం గ్రామంలో ఐదో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి మేడపురెడ్డి నూకల తల్లి గెలుపు. ► పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయితీ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన సాగేని చిన్నతల్లమ 155 ఓట్లు మెజారిటీతో గెలుపు. ► ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉపఎన్నికలో వైసీపీ బలపర్చిన మైకం భాగ్యవతి 55 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► భీమిలి రేఖవానిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీకి చెందిన సమ్మిడి శ్రీనివాసరావు గెలుపు చిత్తూరు జిల్లా ► గంగవరం మండలం తాళ్లపల్లిలో సర్పంచ్ ఉప ఎన్నికలలో 97 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ బలపరిచిన అభ్యర్థి శంకరమ్మ గెలుపు. కర్నూలు జిల్లా ► సిరివేళ్ళ గ్రామ పంచాయతీ లోని 18 వ వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుపున బి.పెదరాజు 253 ఓట్లతో గెలుపు. నంద్యాల మండలం భీమవరం గ్రామంలోని నాలగో వార్డు మెంబెర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 12 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన టిడిపి మద్దత్తుదారుడు శాలి పెల జనార్దన్ రెడ్డి. ► కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీ తో గెలుపు. ►సి బెళగల్ మండలం,యనగండ్ల గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దత్తు దారుడు ఇమ్మానియల్ 39 ఓట్లతో గెలుపు. ► కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా టీడీపీ మద్దుతుదారు మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో గెలుపు. కృష్ణాజిల్లా ► కృష్ణా జిల్లాలో ముగిసిన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ► సర్పంచ్ స్థానాలు వైసిపి -2 , టీడీపీ -2 గెలుపు ► వార్డు మెంబర్లు వైసిపి -8 ,టీడీపీ-1 , టిడిపి&జనసేన -2 గెలుపు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ► కలిదిండి (మం) కలిదిండి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధిని మసిముక్కు మారుతీ ప్రసన్న 249 ఓట్లతో గెలుపు ► ముదినేపల్లి (మం)ములకలపల్లి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నువ్వుల కోటేశ్వరరావు 57 ఓట్లతో గెలుపు ► నందివాడ (మం) పోలుకొండ సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధిని మానేపల్లి ఝాన్సీ కుమారి 27 ఓట్లతో గెలుపు ► ఘంటసాల (మం)మల్లంపల్లి సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధి బెల్లంకొండ అమలేశ్వరరావు 143 ఓట్లతో గెలుపు వార్డు ఎన్నికల ఫలితాలు ► తోట్లవల్లూరు (మం) రొయ్యూరులో 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి లుక్కా నాగభూషణం 48 ఓట్ల మెజారిటీతో గెలుపు ► నూజివీడు (మం) బూరవంచ పంచాయతీ 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి సయ్యద్ ఖిజర్ పాషా ఖాద్రి 28ఓట్లతో గెలుపు ► ఆగిరిపల్లి (మం) చినఆగిరిపల్లి పంచాయతీ 1వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి చన్ను సావిత్రి 21 ఓట్ల విజయం ► కలిదిండి (మం) కోరుకొల్లు12వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్థి యాళ్ళ పద్మ 146 ఓట్ల మెజార్టీతో గెలుపు ► ఘంటసాల (మం) దాలిపర్రు 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి దాసరి నాగరాజు 26 ఓట్ల మెజారిటీ తో విజయం ► చల్లపల్లి (మం) ఆముదార్లంకలో 2 వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నాగిడి శివ పార్వతి 23 ఓట్లతో విజయం ► పెడన (మం) నేలకొండపల్లి పంచాయితీ 6వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి సమ్మెట నరేంద్ర కుమార్ 11 ఓట్ల మెజార్టీతో విజయం ► బంటుమిల్లి (మం) అర్తమూరు పంచాయతీ 8వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి మాకాళ్ళు వాసుదేవరావు 54 ఓట్ల మెజార్టీతో విజయం ► కోడూరు (మం) విశ్వనాధపల్లి 1వ వార్డు మెంబర్ గా టీడీపీ, జనసేన బలపరిచిన కొండవీటి విజయలక్ష్మి 10 ఓట్లతో గెలుపు ► మోపిదేవి (మం) కోసూరువారిపాలెం 4 వార్డు మెంబర్ గా జనసేన, టీడీపీ బలపరచిన అభ్యర్థిని చందన పద్మజ 69 ఓట్లతో విజయం ► ఆగిరిపల్లి (మం) ఆగిరిపల్లి పంచాయతీ 4వ వార్డు మెంబర్ గా టీడీపీ అభ్యర్ధి మల్లవల్లి స్పందన15 ఓట్ల మెజారిటీతో విజయం నెల్లూరు జిల్లా ► మనుబోలు మండలం, వెంకన్నపాలెంలో 4వ వార్డు ఉపఎన్నికలలో వైఎస్సార్సీపీ బలపరిచిన వల్లూరు శకుంతలమ్మ నాలుగు ఓట్లతో విజయం. అనంతపురం జిల్లా ► సోమందేపల్లి మండలం గుడిపల్లి నాలుగో వార్డు ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. ► రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో 5వ వార్డ్ మెంబర్‌గా వైఎస్సార్సీపీ అభ్యర్థి రామలక్ష్మి 8 ఓట్లతో విజయం. ► శెట్టూరు మండలం కైరేవు గ్రామ సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి లక్మిదేవి 198 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం. ► కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం కైరేవు సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ మద్దతుదారు లక్ష్మిదేవి విజయం. ► రాయదుర్గం మండలం 74- ఉడేగోళం 5వ వార్డు ఎన్నికలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు రామలక్ష్మి విజయం. ► సోమందేపల్లి మండలం గుడిపల్లి 4వ వార్డు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. ► రొద్దం మండలం చిన్నమంతూరు సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు సుబ్బమ్మ విజయం. ► పుట్లూరు మండలం కందికాపుల గ్రామ సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కురువ శివరామయ్య 157 ఓట్లతో ఘన విజయం. పశ్చిమ గోదావరి జిల్లా ► తాడేపల్లిగూడెం మండలం పుల్లయ్యగూడెం వైఎస్సార్సీపీ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి చీకట్ల పుష్ప లక్ష్మీకుమారి 60ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ► ఉండి మండలం చినపుల్లేరు 5వవార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన కందుల సుభాషిణి 30 ఓట్ల మెజారిటీతో విజయం కైవసం చేసుకుంది. ► పోలవరం మండలం గూటాల గ్రామపంచాయతీ ఒకటో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ఇందిరా ప్రియదర్శిని 60 ఓట్ల మెజారిటీతో గెలుపు. ► పెదవేగి మండలం రాయన్నపాలెం ఐదవ వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్ధి అవిరినేని రమేష్ 23 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► కొవ్వూరు మండలం కాపవరం తొమ్మిదో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి గొతం మేరీ ఝాన్సీ బాయి ఆరు ఓట్ల మెజారిటీ తో గెలుపు. ►పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామ పంచాయతీ 8 వార్దు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి కాపా సాంబశివరావు 67ఓట్ల మెజార్టీ తో విజయం. ► జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వైస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని వామిశెట్టి 892ఓట్ల మెజారిటీతో పావని విజయం. ► పోడూరుమండలం కొమ్ముచిక్కాల గ్రామ పంచాయతీ 9 వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సిపి బలపరిచిన అభ్యర్థి పాతపాటి కొండరాజు 61 ఓట్లు మెజార్టీతో విజయం. ► ఆచంట మండలం పెదమల్లం గ్రామం వైస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దిరిశాల విజయలక్ష్మి 156 ఓట్ల తో మెజారిటీ గెలుపు. మధ్యాహ్నం రెండు గంటలకు పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా జిల్లాలో పోలింగ్ పూర్తయ్యే సమయానికి 78.48 శాతం నమోదు.14027 మంది ఓటర్లకుగానూ 11,008 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలుకొండ (సర్పంచ్)74 శాతం కలిదిండి (సర్పంచ్) 76.79 శాతం ములకలపల్లి (సర్పంచ్) 88.59 శాతం మల్లంపల్లి (సర్పంచ్ ) 86.34 జిల్లాలోని మిగిలిపోయిన వార్డులకు జరిగిన జరిగిన ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లి లో ముగిసిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్. 88 శాతం నమోదైన పోలింగ్. 1429 కు గాను 1261 ఓట్లు పోల్ అయినట్లు ప్రకటించిన అధికారులు. విశాఖపట్నం విశాఖ జిల్లా పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికల్లో 72.5 శాతం పోలింగ్. ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 69.83% శాతం పోలింగ్ నమోదు. తూర్పు గోదావరి పెద్దాపురం మండలం జి.రాగంపేట లో ముగిసిన వార్డు మెంబర్ ఉప ఎన్నికలు. 301 ఓట్లకు గాను 243 ఓట్లు పోల్ అయ్యాయి. పశ్చిమగోదావరి - ఆచంట మండలం పెదమల్లం గ్రామ సర్పంచ్ పోలింగ్ పర్సంటేజ్ 73.40% - జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సర్పంచ్ పొలింగ్ 59.67 % - తాడేపల్లి గుడెం మండలం పుల్లాయి గుడెం సర్పంచ్ పోలింగ్ 86.81 % - పోడూరు మండలం కొమ్ముచిక్కాల తొమ్మిదవ వార్డు పోలింగ్ 81.20% - ఉండి మండలం చినపుల్లేరు ఐదవ వార్డు పోలింగ్ పర్సంటేజ్ 92.76% - పోలవరం మండలం గూటాల ఒకటో వార్డు కు ముగిసిన పోలింగ్. 85% పోలింగ్ నమోదు. - కొవ్వూరు మండలం కాపవరం 9 వార్డు కు ముగిసిన పోలింగ్. 91% పోలింగ్ నమోదు ► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. మిగిలిపోయిన 36 సర్పంచ్‌లు, 68 వార్డులకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్ జరపనున్నారు. అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. ►అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ఆర్కే ►గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 5 సర్పంచ్ స్థానాలకు 9 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీస్థాయిలో ఓటర్లు తరలివస్తున్నారు. పెదకాకానిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►రాష్ట్రంలో మిగిలిపోయిన పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగనుంది. మొత్తం 69 పంచాయతీలకు గానూ 30 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 533 వార్డులకుగానూ 380 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ జిల్లాలోని 36 సర్పంచ్ స్థానాలకు, వివిధ గ్రామాల్లోని 68 వార్డుల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. డప్పుల చప్పుళ్లు, నినాదాల హోరు, కళాకారుల గొంతులు మూగబోయాయి. మైకులు బంద్అయ్యాయి. ఇక ఆదివారం (నేటి నుంచి) మొదలు వరుసగా మూడ్రోజులు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ‘స్థానిక’ సంస్థల ఎన్నికల సందడి కొనసాగనుంది. మొత్తం 17.69 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివారం వివిధ జిల్లాల్లోని 36 సర్పంచ్ స్థానాలతో పాటు వివిధ గ్రామాల్లోని 68 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. సోమవారం నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఎన్నికలు జరగుతున్న వాటిలో ఒకటి. ఇప్పుడు అందరి కళ్లూ దీనిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఇవికాకుండా మరో ఆరు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులకు కూడా సోమవారమే ఉప ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, మంగళవారం 10 జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 123 ఎంపీటీసీ స్థానాల్లో పొలింగ్ కొనసాగనుంది. ఇక ఆదివారం జరిగే ఎన్నికల్లో మొత్తం 1,00,032 మంది.. మున్సిపల్ ఎన్నికల్లో 8,62,066 మంది.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 8,07,637 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మూడ్రోజుల పాటు సాగే ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో ఉంటాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు 17న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు 18న చేపడతారు. కోవిడ్ జాగ్రత్తలో అన్ని ఏర్పాట్లు : ఎస్ఈసీ స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. దీనిపై చర్చించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆయా నగర కమిషనర్లతో ఆమె శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను తెలుసుకుని సంతృప్తి వ్యక్తంచేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెబ్ కెమెరాలను ఏర్పాటుచేయడంతో పాటు వీడియోగ్రాఫర్లను కూడా నియమించామన్నారు. ఇక ఆదివారం మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా, శుక్రవారం రాత్రికే ఆయా పొలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని తరలించినట్లు నీలం సాహ్ని వివరించారు. -
పాపం శశికళ: ఓటర్ జాబితాలోనూ తొలగింపు?
చెన్నె: జైలు నుంచి విడుదలై రాజకీయాల్లో సంచలనం రేపుతారని అందరూ భావించే సమయంలో అకస్మాత్తుగా ‘రాజకీయాలకు స్వస్తి’ పలికిన వీకే శశికళకు మరో షాక్ తగిలింది. ఆమెను రాజకీయాల నుంచి తప్పించినట్టు.. ఓటేసే అవకాశం కూడా ఇవ్వలేదని తమిళనాడులో చర్చ నడుస్తోంది. శశికళ పేరు ఓటర్ జాబితాలో లేదు. దీంతో తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘రాజకీయాల్లోకి రానివ్వరు.. కనీసం ఓటు కూడా వేయనివ్వరా? అని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఆమె మేనల్లుడు, ఏఎంఎంకే అధినేత టీవీవీ దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటరు జాబితాలో శశికళ పేరు కనిపించకపోవడం ముఖ్యమంత్రి పళనిస్వామినే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. శశికళ ఓటేయకుండా అన్నాడీఎంకే చేసిందని మండిపడ్డాడు. 234 స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. చదవండి: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా చదవండి: ముఖ్యమంత్రికి భారీ ఊరట -
ఓటరు జాబితాలో మోదీ ఫొటో!
సాక్షి, వికారాబాద్ అర్బన్: ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో ప్రధాని మోదీ ఫొటో దర్శనమిచ్చింది. దీంతో సదరు ఓటరు ఓటుహక్కు వినియోగించుకోనివ్వరనే అనుమానంతో పోలింగ్ కేంద్రానికే రాలేదని సన్నిహితులు తెలిపారు. వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామానికి చెందిన పట్టభద్రుడు ఎ.దయాకర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్నారు. బూత్ నంబర్ 307లో వరుససంఖ్య 269లో ఆయన ఓటు నమోదై ఉంది. దయాకర్‌రెడ్డి ఫొటో ఉండాల్సి నచోట ప్రధాని మోదీ ఫొటో ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఓటరు జాబితాలో ఉన్న ఫొటోతో సంబంధం లేదని పేరు, ఇతర వివరాలు సరిగ్గా ఉన్న ఆధారాలు చూపిస్తే ఓటు వేసేందుకు అనుమతిస్తామని తెలిపారు. చదవండి: (ఎవరి ధీమా వారిదే..!) -
‘ఏలూరు’ ఎన్నికలకు బ్రేక్
సాక్షి, అమరావతి: ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నెల 10న జరగాల్సిన ఎన్నికపై స్టే విధించిన హైకోర్టు ఓటర్ల జాబితాలో తప్పులను సవరించే వెసులుబాటును అధికారులకు కల్పించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తుది ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులున్నాయని, అభ్యంతరాలను స్వీకరించకుండానే తుది ఓటర్ల జాబితాను ప్రచురించారంటూ టీడీపీ నేత ఎస్వీ చిరంజీవి, మరికొందరు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఓటర్ల జాబితాలో కుక్క ఫొటో ముద్రించడంపై మండిపడుతూ పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఓటర్ల జాబితాలో తప్పులను సవరించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ గత ఏడాది మార్చి 5న తీర్పునిచ్చారు. ఈ తీర్పును అధికారులు అమలు చేయలేదంటూ చిరంజీవి, మరో 33 మంది హైకోర్టును ఆశ్రయించగా.. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటించిన తరువాత నిబంధనల ప్రకారం పబ్లిక్ నోటీసులు ఇచ్చి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించలేదని, తుది ఓటర్ల జాబితా తయారీ విషయంలో నిబంధనలు పాటించలేదని ఆక్షేపించారు. గత ఏడాది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో వందలాది ఓటర్ల ఇంటి నంబర్లు 000గా చూపారని, అనేక మంది ఓటర్ల పేర్లు తప్పుగా ఉన్నాయని తెలిపారు. న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వుల అమలును వాయిదా వేయడానికి వీల్లేదని, కోర్టు ఉత్తర్వులను అమలు చేసి తీరాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఎవరు ఎంత పెద్ద వారైనా, చట్టం వారి కంటే పెద్దదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితా ఎన్నిక ప్రక్రియకు పునాది అని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. చట్టం నిర్దేశించిన విధంగా ఓటర్ల జాబితా తయారు చేయకపోవడాన్ని కేవలం సాంకేతిక లోపంగా మాత్రమే చూడలేమన్నారు. ఓటర్ల జాబితా సక్రమంగా లేదని కోర్టు తేల్చిన తరువాత దానిని సరిచేయకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. ఎన్నికను వాయిదా వేయడం వల్ల కలిగే కష్టం కంటే, ఓటర్ల జాబితాను సవరించడం వల్లే కలిగే ప్రజోపయోగమే ప్రధానమైనదని తెలిపారు. ఈ కారణాలతో ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గ ఎన్నికలపై స్టే విధిస్తున్నట్టు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
94 టన్నుల బ్యాలెట్ పత్రాలు
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల సన్నాహాలను పురపాలక శాఖ వేగవంతం చేసింది. రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలు, 75 పురపాలక సంఘాల్లో మార్చి 10న నిర్వహించనున్న పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడం, బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి సున్నితమైనవి, అత్యంత సున్నితమైన వాటిని గుర్తించారు. వార్డులవారీగా ఓటర్ల జాబితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ► మున్సిపల్ ఎన్నికల కోసం మొత్తం 15,978 బ్యాలెట్ బాక్సులు అవసరమని అంచనా వేశారు. జంబో బాక్సులు 922, పెద్ద బాక్సులు 10,673, మీడియం సైజు బాక్సులు 2,540, చిన్న సైజు బాక్సులు 1,843 వినియోగించను న్నారు. కొన్ని బ్యాలెట్ బాక్సులను గతంలో హైదరాబాద్‌లో పురపాలక సంస్థ ఎన్నికల కోసం పంపించారు. వాటిని వెనక్కి తెప్పించనున్నారు. ► బ్యాలెట్ విధానంలో నిర్వహించే ఈ ఎన్నికల కోసం బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. 13 జిల్లాలకు 94 టన్నుల వైట్వోవ్ కాగితాలను పంపించారు. ఎన్ని బ్యాలెట్ పత్రాలు అవసరమవుతా యన్నది జిల్లాల వారీగా కలెక్టర్లు నిర్ణయిస్తారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ కోసం నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల వారీగా ప్రింటింగ్ ప్రెస్‌లను కలెక్టర్లు ఎంపిక చేస్తారు. ► పోలింగ్ కోసం అవసరమైన ఇండెలిబుల్ ఇంక్ (సిరా)ను సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది మున్సిపల్ ఎన్నికల కోసం తెప్పించిన సిరా గడువు తీరడంతో కొత్తగా ఆర్డర్ ఇచ్చారు. 5 ఎంఎల్ సిరా సీసాలు 13,500, 10 ఎంఎల్ సిరా సీసాలు 26,500 తెప్పించాలని నిర్ణయించారు. ► పురపాలక ఎన్నికల కోసం మొత్తం 9,307 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 12 నగర పాలక సంస్థల పరిధిలో 5,020 కేం ద్రాలు, 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల పరిధిలో 4,287 పోలింగ్ కేంద్రాలున్నాయి. ► పోలింగ్ కేంద్రాల్లో సున్నితమైనవి 2,890, అత్యంత సున్నితమైనవి 2,466 కేంద్రాలు ఉండగా 3,951 సాధారణ పోలింగ్ కేంద్రా లున్నాయి. 12 నగర పాలక సంస్థల్లో సున్నితౖ మెనవి 1,465, అత్యంత సున్నితమైనవి 1,159, సాధారణమైనవి 2,396 కేంద్రాలు ఉన్నాయి. 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల పరిధిలో సున్నితమైనవి 1,425, అత్యంత సున్నితమైనవి 1,307, సాధారణ మైనవి 1,555 కేంద్రాలున్నాయి. ► మున్సిపల్ ఎన్నికల కోసం తొలిసారిగా ఓటర్ల ఫొటోలున్న స్లిప్పులు పంపిణీ చేయనున్నారు. మున్సిపల్ ఓటర్ల వివరాలను పురపాలక శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. వార్డుల వారీగా ఓటర్ల పేర్లతో సహా జాబితాలను అందుబాటులో ఉంచారు. -
ఎమ్మెల్సీ పోరు: ఓటు నమోదుకు ఇదే చివరి అవకాశం!
సాక్షి, హైదరాబాద్: పట్ట భద్రుల శాసన మండలి నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఇంకా పేరు నమోదు చేసుకోలేక పోయారా? అయితే ఓటరుగా నమోదు కావడానికి మీకు మరో అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం నామినేషన్ల స్వీకరణ తుది గడువుకు 10 రోజుల ముందు వరకు ఓటర్ల నమోదు దరఖాస్తులు స్వీకరించి, సత్వరంగా వాటి ని పరిష్కరించి అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. ఈ అనుబంధ ఓటర్ల జాబితాలో చోటు సంపాదించిన వారికి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనుంది. మహబూబ్‌నగర్– రంగారెడ్డి– హైదరాబాద్ స్థానంతో పాటు వరంగల్–ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 23తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. నామినేషన్ల స్వీకరణ గడువు ముగింపునకు 10 రోజుల ముందు అంటే ఈనెల 13 అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించి, అర్హులకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ‘వరంగల్’ పట్టభద్రుల మండలి స్థానం పరిధిలో మొత్తం 4,91,396 మంది, ‘మహబూబ్‌నగర్’ పట్టభద్రుల మండలి స్థానం పరిధిలో 5,17,883 మంది గత నెలలో ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో చోటు సంపాదించారు. చదవండి: పట్టభద్రులు ఓటు ఇలా నమోదు చేసుకోండి కాగా తెలంగాణలో ఖమ్మం - వరంగల్-నల్గొండ, మహబూబ్‌నగర్ - రంగారెడ్డి -హైదరాబాద్ పట్టభద్రుల స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా.. మార్చి 14న పోలింగ్ జరుగనుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 24న నామినేషన్లను పరిశీలించన్నారు. 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఇచ్చారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. చదవండి: మేయర్ ఎన్నిక: వారు అలా.. వీరు ఇలా.. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ -
2019 ఓటర్ల జాబితాతో ఎన్నికలు సరికాదు..
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను 2021 ఓటర్ల జాబితాతో కాకుండా 2019 ఓటర్ల జాబితాతో నిర్వహించడం వల్ల 3.6 లక్షల మంది ఓటుహక్కును కోల్పోతారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తూ గుంటూరుకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3.6 లక్షల మంది ఓటుహక్కును కోల్పోవడం.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కును హరించడమేనని పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును హరించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని అఖిల న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి సోమవారం హైకోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు తోసిపుచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని గుర్తుచేసిన న్యాయమూర్తి ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టు ముందు ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూద్దామని, ఆ తరువాత అత్యవసర విచారణ గురించి ప్రస్తావించవచ్చని తెలిపారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారని, దీనిపై అత్యవసర విచారణ జరపాలన్న మరో న్యాయవాది అభ్యర్థనను కూడా న్యాయమూర్తి తోసిపుచ్చారు. -
ఎన్నికల కమిషన్ నిర్ణయంతో.. 3 లక్షల మందికి నష్టం
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను 2019 ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించడంవల్ల దాదాపు 3 లక్షల మంది తమ ఓటు హక్కును కోల్పోతున్నారని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఎన్నికల కమిషన్‌కు తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలయ్యే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన తమకు దానిని వినియోగించుకునే అవకాశం కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానానికి అఖిల నివేదించనున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయంవల్ల తనలాగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన 3 లక్షల మంది నష్టపోతారని వివరించనున్నారు. 18ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని రాజ్యాంగంలోని అధికరణ 326 కల్పిస్తోందని తెలుపనున్నారు. అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపేస్తూ ఉత్తర్వులివ్వాలని ఆమె కోరనున్నారు. -
పాత ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు
సాక్షి, అమరావతి: మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికల కోసం గత ఏడాది మార్చి నాటికి తయారుచేసిన ఓటర్ల జాబితా ప్రకారమే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శుక్రవారం జారీచేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారితో అప్పట్లో ఓటర్ల జాబితాలు తయారు చేశారని, 2020 మార్చి 7వ తేదీ నాటికి వాటిని అప్డేట్ చేశారని తెలిపారు. -
ఏపీలో ఓటర్ల తుది జాబితా విడుదల
సాక్షి, అమరాతి : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 4,04,41,378 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,99,66,737, మహిళలు 2,04,71,506 మంది ఉన్నారు. ఇక 4,135 మంది థర్డ్జెండర్లు, 66,844 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. -
‘ఆమే’ నిర్ణాయక శక్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ప్రకటించిన 2021 ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ విషయం స్పష్టమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అనంతపురం జిల్లా మినహా మిగతా 12 జిల్లాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సర్వీసు ఓటర్లను మినహాయిస్తే థర్డ్ జండర్ ఓట్లు 4,083 కలుపుకుని మొత్తం ఓటర్లు 4,00,79,025 మంది ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2,02,83,145 మంది కాగా, పురుష ఓటర్ల సంఖ్య 1,97,91,797. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 4,91,348 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కాగా, 2020 ముసాయిదా ఓటర్ల సవరణ జాబితా నుంచి ఈ ఏడాది నవంబర్ 16వ తేదీ నాటికి అదనంగా 1,41,631 ఓటర్లు నమోదయ్యారు. ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రం పురుష ఓటర్లు 16,52,036 మంది ఉండగా, మహిళా ఓటర్లు 16,48,024 మంది ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 42,72,107 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 18,65,266 మంది ఓటర్లు ఉన్నారు. -
ఓటుహక్కు నమోదుకు అవకాశం
బేల: ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. పేరు లేకున్నా.. ఏమైనా సవరణలు ఉన్నా.. దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయం, అన్ని పోలింగ్‌బూత్‌లలో ఓటరు జాబితా అందుబాటులో ఉంది. ఆ జాబితాలో తమ పేర్లను పరిశీలించుకునే విధంగా అవకాశం కల్పించారు అధికారులు. పేర్లు తప్పుగా ఉన్నవారు, మార్పుల, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అభ్యంతరాల స్వీకరణతో పాటు కొత్త ఓటరు నమోదుకు డిసెంబర్ 15వరకు అవకాశం కల్పించింది. నియోజకవర్గం అధికారులు ముసాయిదా జాబితాను ఇటీవల విడుదల చేశారు. అర్హులకు అవకాశం.. రాజ్యాంగం ప్రకారం 18ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడికి ఓటు హక్కును కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి కొత్తగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2021 జనవరి 1వరకు 18ఏళ్లు నిండిన వారు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ప్రత్యేక ప్రణాళిక.. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతారు. ఈ ఏడాది కూడా నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు రోజులు పోలింగ్ కేంద్రాలు, తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు స్వీకరించే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈనెల 21, 22తేదీలతో పాటు డిసెంబర్ 5, 6న ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా ఓటరు నమోదు చేసుకునే వీలుంటుంది. 2020 డిసెంబర్ 15 వరకు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. 2021 జనవరి 5న దరఖాస్తులు పరిశీలించిన అనంతరం జనవరి 14న తొలి జాబితాను విడుదల చేస్తారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. -
ఊపందుకుంటున్న ‘గ్రేటర్’ ఎన్నికల ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తాజా ఓటర్ల జాబితా ఆధారంగా, మొత్తం 150 డివిజన్ల (వార్డుల) వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ఈ నెల 7న ముసాయిదా జాబితాలు ప్రచురిస్తారు. మిగతా ప్రక్రియలను ముగించి 13న తుది ఓటర్ల జాబితాలను ప్రచురించనున్న నేపథ్యంలో వార్డుల వారీగా రూపొందించే ఓటర్ల జాబితాల్లో ఏ ఓటరు కులం లేదా మతం వెల్లడించే విధంగా వివరాలు ఉండకూడదని జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశాలిచ్చింది. వార్డుల వారీగా రూపొందించిన ఓటర్ల జాబితాల్లో ఏవైనా క్లరికల్ లేదా ప్రచురణ దోషాలుంటే.. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు మొదట అసెంబ్లీ నియోజకవర్గ జాబితాలో ఆ విధమైన లోపాలను సరిచేసి, ఆ తర్వాత వార్డు ఓటరు జాబితాల్లో సరిచేయాలని సూచించింది. ఈ విధంగా చేయడం ద్వారా అసెంబ్లీ ఓటర్ల జాబితాల్లోని వివరాలకు అనుగుణంగానే వార్డుల వారీ జాబితాలు ఉంటాయని స్పష్టం చేసింది. హార్డ్, సాఫ్ట్ కాపీలు.. వార్డుల వారీగా తయారు చేసిన ఓటర్ల జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పాటు ఈసీ వద్ద నమోదై రిజర్వ్ చిహ్నం కేటాయించిన రాజకీయ పార్టీలకు ఉచితంగా సరఫరా చేసి వాటి నుంచి రశీదులు పొందాలని మున్సిపల్ అధికారులకు ఎస్ఈసీ సూచిం చింది. ఈ జాబితాల కాపీలు ఇతరులు కావాలని కోరిన పక్షంలో దానికయ్యే వాస్తవ ధర వసూలు చేసి హార్డ్, సాఫ్ట్ కాపీలు అందజేయొచ్చునని తెలిపింది. అవసరమైన ఓటరు జాబితా కాపీల ముద్రణకు అనుగుణంగా ముందుగానే అంచనా వేసి ప్రింట్ చేసుకోవాలని సూచించింది. వార్డుల వారీ ఓటర్ల జాబితాలను ఫొటోలు లేకుండా జీహెచ్ఎంసీ, ఎస్ఈసీ వెబ్‌పోర్టళ్లలో ఉంచాలని తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించడం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కీలకమైనందున వివిధ అంశాలకు సంబంధించి ఎస్ఈసీ స్పష్టతనిచ్చింది. (చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం) కరోనా నేపథ్యంలో విశాల గదుల్లోనే కరోనా నేపథ్యంలో విశాలమైన గదులు, హాళ్లు ఉన్న భవనాలల్లోనే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.. సాధ్యమైన మేర ఓటేసేవారు ఒక ద్వారం నుంచి ప్రవేశించి మరో ద్వారం గుండా బయటకు వెళ్లగలిగే హాళ్లు, గదులున్న భవనాలనే పోలింగ్ స్టేషన్లుగా ఎంపిక చేయాలి. ప్రతి వెయ్యి మందికి ఒక పోలింగ్ స్టేషన్ కేటాయించాలి. ఆయా వార్డుల పరిధిలోనే సంబంధిత పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలి. ఓటర్‌కు అందు బాటులో ఉండేలా ఒక కిలోమీటరు కంటే ఎక్కువ దూరం లేకుండా పోలింగ్ కేంద్రాలు కేటాయించాలి. పోలింగ్ కేంద్రాలుగా పాఠశాల భవనాలను ఎంపిక చేస్తే ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వాటినే ఎంపిక చేయాలి. ళీ ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోతేనే చివరి ప్రయత్నంగా పోలింగ్ కేంద్రా లను తాత్కాలిక నిర్మాణాల్లో ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయొద్దు. పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, మత ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను ఎంపిక చేయొద్దు. భవనాల కింది అంతస్తుల్లోనే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. 7న ముసాయిదా ఓటర్ల జాబితాల తయారీ మొదలై 13న తుది జాబితాలను ప్రచురించనున్నందున.. అర్హులైన ఓటర్లు అసెంబ్లీ జాబితాల్లో తమ పేర్లను సరిచూసుకోవాలి. ళీ పేర్లు లేకుంటే తమ ఓటు నమోదుకు ఎన్వీఎస్పీ.ఇన్ పోర్టల్ ద్వారా నమోదు పత్రం లేదా నిర్దేశిత ఫారం– 6లో అసెంబ్లీ ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికారి వద్ద దరఖాస్తు పత్రం సమర్పించాలి. వాటిని పరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లను ముందుగా అసెంబ్లీ జాబితాల్లో చేర్చి తదనుగుణంగా సంబంధిత వార్డు ఓటరు జాబితాల్లో చేరుస్తారు. ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే తేదీ వరకు ఈ అవకాశముంటుంది. -
గ్రేటర్ పోరుకు సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్ధ మైంది. డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్టు సమాచారం. వచ్చే ఫిబ్రవరి 10న జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగుస్తుండటంతో ఆలోగా ఎన్నికలు నిర్వహిం చేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాల్సిం దిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ని కలిసి మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. కొత్తగా వార్డుల పునర్వ్యవస్థీకరణ లేదని, గతంలోని వార్డులే కొనసాగడంతో పాటు 2016 ఎన్నికల్లో అనుసరిం చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లే వచ్చే ఎన్నికల్లోనే కొనసాగించేందుకు సంబంధించిన రెండు జీవోలను కూడా ఎస్ఈసీకి అందజేశారు. అంటే రెండోటర్మ్ కూడా అవే రిజర్వేషన్లు కొన సాగేలా ఇటీవల అసెంబ్లీలో చేసిన చట్టసవరణ బిల్లుకు తగ్గట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పాలకమండలి ఐదేళ్ల పదవీకాలానికి మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే సౌలభ్యం జీహెచ్ఎంసీ చట్టంలో ఉన్న విషయం తెలిసిందే. శనివారం ఈ మేరకు ఎస్ఈసీ కార్యా లయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థ సారథితో అరవింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిష నర్ లోకేశ్‌కుమార్, అధికారులు భేటీ అయ్యారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపొందించి, ప్రచురించడానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు, ఇప్పటి నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ముగిసేవరకు యావత్ జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని ఎన్నికల పనులపై దృష్టి కేంద్రీ కరించేలా చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఎన్నికల కమిషనర్ సూచించారు. ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు వార్డులవారీగా ఓటర్ల జాబితాను డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు రూపొందించేలా చూడాలని ఆదేశించారు. ఓటర్ల తుది జాబితాపై నోటిఫికేషన్... జీహెచ్ఎంసీలోని 150 వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ఈ నెల 13న ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా తుది ప్రచురణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 2020 సంవత్సరం జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా (క్వాలిఫైంగ్ డేట్) తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితాలను తు.చ తప్పకుండా పాటిస్తూ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసే బాధ్యతను సంబంధిత మున్సిపల్ సర్కిళ్లలోని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు అప్పగిస్తున్నట్టు పేర్కొన్నారు. శాసనసభ ఓటర్ల జాబితాని యథాతథంగా పాటిస్తూ అదే ఫార్మాట్లో జీహెచ్ఎంసీలోని అన్ని వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతీ వార్డు వారీగా మున్సిపల్ ఓటర్ల జాబితా టైటిల్ పేజీలో పోలింగ్ ఏరియాల వివరాలను పొందుపరచాలని సూచించారు. నవంబర్ 13న తుది ఓటర్ల జాబితాను ప్రచురించాక, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే దాకా చేర్పులు, తొలగింపులు లేదా కరెక్షన్లు వంటి వాటిని నిబంధనలకు అనుగుణంగా ఈఆర్వోల నుంచి సంబంధిత డిప్యూటీ కమిషనర్లు స్వీకరించి, ఆ మేరకు సంబంధిత వార్డులోని ఓటర్ల జాబితాల్లో చేర్చాలని ఈ నోటిఫికేషన్లో పార్థసారథి పేర్కొన్నారు. 5న కలెక్టర్లతో పార్థసారథి సమావేశం జీహెచ్ఎంసీ వార్డులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉండటంతో ఎన్నికల ఏర్పాట్లు, సంసిద్ధతపై ఆయా జిల్లాల కలెక్టర్లతో నవంబర్ 5న ఎన్నికల కమిషనర్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే 150 డివిజన్లలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిటర్నింగ్ అధికారులను ఎస్ఈసీ నియమించింది. ఈ నేపథ్యంలో ఆర్వోలు, ఇతర ఎన్నికల సిబ్బందికి శిక్షణనిచ్చే ‘ట్రైనింగ్ టు ట్రైనర్స్’(టీవోటీ)కు నవంబర్ 3, 4 తేదీల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటర్ల జాబితా షెడ్యూల్ ఇదీ... నవంబర్ 7న వార్డుల వారీగా ముసాయిదా ఫోటో ఓటర్ల జాబితాలను తయారుచేసి, సాధారణ ప్రజలు పరిశీలించేందుకు వీలుగా రూల్‌నెం.5లో పేర్కొన్న ప్రదేశాల్లో ప్రదర్శించాలి. 8వ తేదీనుంచి 11 వరకు వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరణ. 9న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి సమావేశం. 10న జీహెచ్ఎంసీ సర్కిల్ స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిప్యూటీ కమిషనర్ల సమావేశం. 12న ఏవైనా అభ్యంతరాలుంటే డిప్యూటీ కమిషనర్ల ద్వారా పరిష్కారం. 13న సంబంధిత సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్ల ద్వారా వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాల తుది ప్రచురణ. -
పదవులు 8.. ఓట్లు 3!
సాక్షి, ఆదిలాబాద్: డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల ఎన్నికలకు సంబంధించి శనివారం కోఆపరేటివ్ ఎన్నికల అధికారులు ఓటరు జాబితా విడుదల చేశారు. అందులో పీఏసీఎస్ అధ్యక్షులను ఏ–క్లాస్ ఓటర్లుగా, ప్రభుత్వ సంబంధిత సొసైటీల అధ్యక్షులను బీ–క్లాస్ ఓటర్లుగా లెక్క తేల్చారు. అయితే విచిత్రమేమిటంటే.. ఏ–క్లాస్ నుంచి ఈ రెండు పాలకవర్గాలకు కలిపి 22 డైరెక్టర్ పదవులు ఉంటే ఇందులో ఓటర్లుగా 77 మంది ఉన్నారు. ఇక బీ–క్లాస్ నుంచి ఈ పాలకవర్గాలకు 8 డైరెక్టర్ పదవులు ఉండగా, ఓటర్లు కేవలం ముగ్గురు మాత్రమే ఉండటం చోద్యంగా కనిపిస్తోంది. దీంతో ఐదు డైరెక్టర్ పదవులు ఎన్నిక కాకుండా మిగిలిపోనున్నాయి. క్రియాశీలకంగా లేవు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వరంగ సొసైటీలు 272 ఉండగా, ప్రస్తుతం ఇవి క్రియాశీలకంగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైంది. కుల, ఉద్యోగ, చేనేత ఇలా పలు సొసైటీలను ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్ష, ఉపాధ్యక్షులను నియమించుకోవాలి. దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఓ కమిటీ పర్యవేక్షిస్తుంది. పర్సన్ ఇన్చార్జి నిరంతరంగా సొసైటీల ఎన్నికలు జరిగి అధ్యక్ష, ఉపాధ్యక్షుల నియామకం జరిగేలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. అయితే ఉమ్మడి జిల్లాలో వందలాది ఇలాంటి సొసైటీలు ఉండగా, సరైన పర్యవేక్షణ లేనికారణంగా కేవలం మూడు సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉండటం గమనార్హం. వాటిలో టెలికం ఎంప్లాయీస్ కోఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆదిలాబాద్, మహరాణా ప్రతాప్‌సింగ్ బీసీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్, ఆదిలాబాద్‌తోపాటు మమతా సూపర్‌బజార్ మంచిర్యాల సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి. మిగతా సొసైటీలు ఉండీ లేనట్టుగా తయారయ్యాయి. ముగ్గురే మహిళలు.. డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల ఎన్నిక కోసం శనివారం ఓటరు జాబితా విడుదల చేయగా ఏ–క్లాస్‌లోని 77 మంది ఓటర్లలో కేవలం ముగ్గురే మహిళా ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో వివిధ సొసైటీల నుంచి ముగ్గురు మహిళలు మాత్రమే అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. మిర్జాపూర్ సొసైటీ నుంచి దీపారెడ్డి, పాండ్వపూర్ సొసైటీ నుంచి ఆర్.శైలజ, ధర్మరావుపేట్ సొసైటీ నుంచి బడావత్ నీల ఇందులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ–క్లాస్‌లోని 22 డైరెక్టర్ పదవుల్లో మహిళలకు ప్రాతినిధ్యం లభి స్తుందా? అనేది ఆసక్తికరం. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవుల కోసం కొంతమంది నేతలు రాజధానిలో జిల్లా ముఖ్యనేతలతో కలిసి పైరవీ చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో వేచిచూడాల్సిందే. ఈనెల 25న డైరెక్టర్ పదవుల ఎన్నిక కోసం నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. ఐదు పదవులు మిగిలిపోనున్నాయి బీ–క్లాస్ నుంచి కేవలం ముగ్గురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో 8 డైరెక్టర్ పదవులు ఉండగా, ఈ ముగ్గురు పోను మిగతా ఐదు డైరెక్టర్ పదవులు ఖాళీగా మిగలనున్నాయి. ప్రభుత్వరంగ సొసైటీలు ఎన్నికలు చేపట్టి అధ్యక్షులను నియమించుకొని క్రియాశీలకంగా ఉంటే దీంట్లో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండేది. ఉమ్మడి జిల్లాలో కేవలం మూడు సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి. – మోహన్, డీసీవో, ఆదిలాబాద్ -
విచిత్రం: ‘ఆత్మ’లకు ఓటు!
సాక్షి, షాద్‌నగర్ : సహకార సంఘాల ఓటరు జాబితాలో అధికారులు మృతిచెందిన వారికి కూడా చోటు కల్పించారు. సంఘంలో సభ్యులై ఉండి చనిపోయిన రైతుల పేర్లను జాబితాలో నుంచి తొలగించలేదు. షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలో మేకగూడ, నందిగామ, చేగూరు, కొత్తపేట, షాద్‌నగర్, కొందుర్గులో వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో మొత్తం 16740 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు ఈసారి ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలను తయారు చేశారు. ఈ జాబితాలో చాలా మంది ఫొటోలు కనిపించడం లేదు. అదేవిధంగా చనిపోయిన ఓటర్ల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. ఒక్కో వార్డులో సుమారు పది నుంచి ఇరవై మంది మృతుల పేర్లు జాబితాలో కనిపిస్తున్నాయి. అయితే, ఓటరు జాబితాలో ఉన్న మృతులకు సంబంధించిన రుణాలను వారి కుటుంబ సభ్యులు చెల్లిస్తే జాబితాలో నుంచి పేర్లు తొలిగిపోతాయని, ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే ఆశతో రుణాలు చెల్లించకుండా ఉండటంతో ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారికి ఓటు హక్కు ఉన్న దృశ్యం ముందస్తు చర్యలేవీ.. ముందుగా ఓటర్ల జాబితాను రూపొందించి సహకార సంఘం కార్యాలయంలో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితాను తయారు చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండానే ఎన్నికలు నిర్వహిస్తుండటంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుల తడకగా ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొందరి ఓటర్ల ఫొటోలు లేకపోవడంతో ఓటర్లను గుర్తించడం ఇబ్బందిగా మారిందని నాయకులు అంటున్నారు. గ్రామాల్లో తిరిగి విచారణ చేశాం. సహకార ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా తయారు చేసేటప్పుడు గ్రామాల్లో పర్యటించి ఓటర్లను గుర్తించాం. చనిపోయిన వారి వివరాలు మాకు తెలియలేదు. దీంతో ఓటరు జాబితాలో పేర్లు తొలగించలేకపోయాం. – మహ్మద్ షరీఫ్, సీఈఓ, కొందుర్గు సహకార సంఘం -
15 వరకు ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం– 2020లో భాగంగా గత నెల 16న ముసాయి దా ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఈ నెల 15వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంత రాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు, ఓటర్ల పేర్లు, వివరాల్లో తప్పుల్ని సరిచేయడానికి విజ్ఞప్తులను స్వీకరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తుది ఓటర్ల జాబితాను ఫిబ్ర వరి 7న ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఓటర్లను భౌగోళికంగా సులువుగా గుర్తించేందుకు వారి గృహాల మ్యాపు(నజరీ నక్షా)ను తయారు చేస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారోద్యోమాలు నిర్వహించాలని, డూప్లికేట్ ఓట్లను తొలగించాలని ఈ సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులకు సీఈఓకు విజ్ఞప్తి చేశాయి. -
ఆదిలాబాద్‌లో మున్సిపల్ ఓటర్ జాబితా విడుదల
సాక్షి, ఆదిలాబాద్: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ పట్టణ ఓటర్ల సంఖ్య తేలింది. మున్సిపల్ ఎన్నికల్లో మరో కీలక ఘట్టమైన ఓటరు జాబితా సవరణ ముగిసింది. గతనెల 30న విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులను సరిచేసేందుకు ఈనెల 2 వరకు అవకాశం కల్పించారు. 3న అభ్యంతరాలను పరిశీలించి శనివారం ఓటర్ల తుది మొదటి పేజీ తరువాయి జాబితాను విడుదల చేశారు. ఆ జాబితా ప్రకారం మున్సిపల్ పరిధిలో 1,27,801 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 63,057, మహిళలు 64,738 మంది ఉన్నారు. కులాల వారీగా ఓటర్లు ఇలా.. 30న విడుదలైన ముసాయిదా జాబితా ప్రకా రం ఏవైనా తప్పులుంటే సరిచూసుకునే అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం తప్పుల సవరణ అనంతరం కూడా అదే ఓటర్లు ఉన్నారు. వార్డుల విభజనలో భాగంగా ఒక వార్డులోని కొంత భాగాన్ని వేరేవార్డులో కలిపినా ఓటర్ల సంఖ్య మాత్రం సరిగ్గానే ఉంది. నూతన లెక్కల ప్రకారం ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎస్టీ ఓటర్లు 5,380 మంది ఉండగా పురుషులు 2,629, మహిళలు 2,751 ఉన్నారు. ఎస్సీ కేటగిరిలో మొత్తం 16,833 మంది ఓటర్లు ఉండగా పురుషులు 8,144, మహిళలు 8,689 మంది ఉన్నారు. బీసీ కేటగిరిలో మొత్తం 72,095 మంది ఓటర్లు ఉండగా పురుషులు 35,617, మహిళలు 36,476 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 33,493 మంది ఉండగా పురుషులు 16,667, మహిళలు 16,822 మంది ఓటర్లు ఉన్నారు. అన్ని కేటగిరీలకు చెందిన ఓటర్ల జాబితాను పరిశీలిస్తే పురుషుల కంటే మహిళలే అధికంగా ఉండటం గమనార్హం. -
కరీంనగర్ మేయర్ బీసీలకే..?
సాక్షి, కరీంనగర్: మునిసిపల్ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియలో తొలిఘట్టం ముగిసింది. మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో ఏ కేటగిరీకి ఎన్ని వార్డులను రిజర్వు చేశారో తేలింది. ఆయా పుర, నగర పాలక సంస్థల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభా, బీసీ, జనరల్ ఓటర్ల సంఖ్యతో రూపొందించిన కులగణన ద్వారా ఆయా కేటగిరీలకు కేటాయించే వార్డుల సంఖ్యను ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో ఉన్న రెండు కార్పొరేషన్లు, 14 మునిసిపాలిటీల్లో ఉన్న జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా వార్డులను ఆయా కేటగిరీలకు కేటాయించారు. ఆయా కేటగిరీలకు కేటాయించిన వార్డులను బట్టి మునిసిపల్ కార్పొరేషన్లలో కరీంనగర్ బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఏ మునిసిపల్ కార్పొరేషన్లో లేని విధంగా 60లో అన్‌రిజర్వుడు(జనరల్) 30 స్థానాలు పోగా ఏకంగా 23 వార్డులను బీసీలకు రిజర్వు చేశారు. 6 స్థానాలు ఎస్సీలకు, ఒక స్థానాన్ని ఎస్టీకి రిజర్వు చేశారు. దీనిని బట్టి కరీంనగర్ మేయర్ స్థానాన్ని బీసీలకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. అలాగే రామగుండం కార్పొరేషన్లో ఎస్సీలకు అత్యధికంగా 11 వార్డులు కేటాయించారు. ఇక్కడ 50 స్థానాలు ఉండగా, 50 శాతం రిజర్వేషన్లలో భాగంగా 25 స్థానాల్లో 11 స్థానాలు ఎస్సీలకు కేటాయించారు. రాష్ట్రంలో మరే కార్పొరేషన్లో ఎస్సీలకు ఇన్ని స్థానాలు లేవు. ఈ రిజర్వుడు స్థానాలను బట్టి కరీంనగర్ మేయర్ స్థానం బీసీలకు, రామగుండం ఎస్సీలకు రిజర్వు చేయడం దాదాపు ఖాయమైంది. మహిళలకా, జనరల్ స్థానమా అనేది తర్వాత తేలనుంది. మునిసిపాలిటీలకు సంబంధించి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని పురపాలక సంస్థలను ఒక యూనిట్‌గా తీసుకొని జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ప్రకటిస్తారు. మునిసిపాలిటీల్లో కూడా జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి వంటి స్థానాలు బీసీలకు రిజర్వు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మునిసిపల్ కార్పొరేషన్లలో మేయర్ లెక్క ఇదీ.. వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌లకు కేటాయించిన వార్డులను బట్టి కరీంనగర్, రామగుండం మునిసిపల్ కార్పొరేషన్లు బీసీ, ఎస్సీలకు రిజర్వు అయ్యేందుకే ఎక్కువగా అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి 50 శాతం మించకుండా ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీ, బీసీలకు వార్డుల సంఖ్యను రిజర్వు చేసింది. కరీంనగర్‌లోని 60 వార్డుల్లో జనరల్ స్థానాలు 30 పోగా మిగతా 30లో ఎస్సీలకు కేవలం6 స్థానాలు(10 శాతం), ఎస్టీలకు ఒక స్థానాన్ని కేటాయించారు. బీసీలకు ఏకంగా 23 స్థానాల(38 శాతం)ను కేటాయించడం గమనార్హం. దీనిని బట్టి కరీంనగర్ బీసీ కేటగిరీలో రిజర్వు అయ్యే అవకాశం అధికంగా ఉందని తెలుస్తోంది. ఇక ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రామగుండం నగర పాలక సంస్థలో 50 వార్డులకు గాను సగం జనరల్‌కు కేటాయించారు. మిగిలిన 25లో ఏకంగా 11 స్థానాలు(20 శాతం) ఎస్సీలకు కేటాయించారు. ఇక్కడ బీసీలకు కేవలం 13 స్థానాలు, ఎస్టీలకు ఒక స్థానం మిగిలింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒక్కో వార్డును ఎస్టీకి కేటాయించారు. నేడు తేలనున్న వార్డులు ప్రకటించిన రిజర్వు స్థానాల సంఖ్య ఆధారంగా ఏయే వార్డులను ఏ కేటగిరీకి రిజర్వు చేస్తారనేది ఆదివారం తేలుతుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న వార్డులను వారికి కేటాయించిన సంఖ్య ప్రకారం తొలుత కేటాయిస్తారు. తరువాత ఓటర్ల గణన ప్రకారం బీసీ కేటగిరీకి వార్డులను కేటాయించిన అనంతరం మిగిలిన వాటిని జనరల్ కేటగిరీ కింద ప్రకటిస్తారు. అనంతరం ఆయా మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో మహిళలకు, ఎవరికి కేటాయించని స్థానాలను లాటరీ పద్ధతిలో డ్రా ద్వారా నిర్ణయిస్తారు. ప్రతి కౌన్సిల్లో 50 శాతం మహిళలు ఉండేలా వార్డులను రిజర్వు చేయడం గమనార్హం. రేపు మునిసిపల్ చైర్పర్సన్, మేయర్ రిజర్వేషన్ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఏ కేటగి రీకి ఎన్ని వార్డులను కేటాయించారనే లెక్క తేలగా, అవి ఏయే వార్డులనే విషయం ఆదివారం వెల్లడి కానుంది. ఇక మున్సిపల్ చైర్మన్, మేయర్ స్థానాలను ఏ కేటగిరీకి రిజర్వు చేశారనేది సోమవారం స్పష్టం కానుంది. రాష్ట్రం యూనిట్‌గా తీసుకొని జనాభా ఆధారంగా మేయర్, మునిసిపల్ చైర్మన్ల రిజర్వేషన్లను నిర్ణయించనున్నారు. రాజ కీయ నేతల్లో ఈ మేరకు టెన్షన్ నెలకొంది. -
నల్లగొండలో ఓటరు జాబితా విడుదల
సాక్షి, నల్లగొండ : మున్సిపాలిటీల తుది ఓటరు జాబితాలను శనివారం సాయంత్రం అధికారులు విడుదల చేశారు. వారం రోజులుగా సామాజిక కుల గణన, ఓటరు ముసాయిదా జాబితాపై కసరత్తు చేసిన అధికారులు మొత్తం ఓటర్లను వార్డుల వారీగా విభజించి తుది జాబితా తయారు చేశారు. నీలగిరి మున్సిపాలిటీ తుది ఓటరు జాబితాను మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్ విడుదల చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో మొత్తం 1,27,044 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 62,215 మంది, మహిళలు 64,828 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, ఇతరుల ఓట్లను కూడా వార్డుల వారీగా లెక్క తేల్చి తుది జాబితాను తయారు చేశారు. పురుషల కన్నా మహిళలు 2,613 మంది ఎక్కువగా ఉన్నారు. 39 వార్డుల్లో మహిళలే అధికం నీలగిరి పట్టణంలో 48 వార్డులు ఉండగా అత్యధిక వార్డుల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మున్సిపల్ అధికారులు విడుదల చేసిన తుది ఓటరు జాబితా ప్రకారం 39 వార్డుల్లో మహిళా ఓటర్లు ఎక్కువ ఉండగా, 9 వార్డుల్లో పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 18,486మంది, ఎస్టీలు 1,483మంది, బీసీలు 79,632, ఇతరులు ఒకటి, జనరల్ ఓటర్లు 27,443 మంది ఉన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని 48 వార్డులకు చెందిన కులాల వారిగా ప్రకటించారు. మున్సిపాలిటీలో మొత్తం 87.431 మంది ఓటర్లు కాగా వీరిలో పురుషులు 42,744, మహిళలు 44,685 మంది ఓటర్లున్నారు. నందికొండ (నాగార్జునసాగర్) మున్సిపాలిటీలో 12 వార్డులుండగా 12,715 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 6,160 మంది, మహిళలు 6,555 మంది ఉన్నారు. చండూరు మున్సిపాలిటీలో 10 వార్డులకుగాను 10,055 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 5,128, మహిళలు 4,927 మంది ఉన్నారు. చిట్యాల మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో 11,094 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 5,578 మంది,, మహిళలు 5,516 మంది ఓటర్లున్నారు. వీరిలో ఎస్టీ ఓటర్లు 132మంది, ఎస్సీలు 1975 మంది, బీసీలు 6337 మంది, జనరల్ 2,650 మంది ఉన్నారు.దేవరకొండ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో 21,590 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10,595 మంది పురుషులు, 10,995 మహిళలు ఉన్నారు. కాగా, హాలియా మున్సిపాలిటీకి సంబంధించి కమిషనర్ బాలకృష్ణ అందుబాటులో లేకపోవడంతో ఓటర్ల వివరాలను ప్రకటించలేదు. -
మున్సిపల్ పోరు: మీ పేరు ఉందా..?
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో ఓటర్ల ముసాయిదా, కుల గణన ముసాయిదా జాబితాను ప్రకటించారు. వెంటనే జాబితాలో మీ పేరు ఉందా లేదా చూసుకోండి.. శాసన సభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేశాం కదా.. ఎక్కడికి పోతుందిలే అని అనుకోవద్దు.. ఇప్పటికే అనేక సార్లు ఓటరు సర్వే చేశారు. మీ పేరు తొలగించి ఉండవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఓటు వేయాలంటే మీకు ఓటు ఉందో లేదో ఒకసారి సరిచూసుకోండి.. వీటితో పాటు కొత్త వారికి ఓటు నమోదుకు కొంత సమయం ఉంది. వెంటనే నమోదు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాలంటే ఈ నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండితే చాలు. ఓటు నమోదు చేసుకుని ఈనెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని పొందవచ్చు. జనవరి 7 వరకు.. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు ఈనెల 7న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు నమోదు చేసుకుకే అవకాశం ఉంది. www. nvcp.in, www.ceotelangana.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్లి ఓటర్‌గా నమోదు చేసుకోచ్చు. దీనికి గాను ఫారం నంబర్–6ను పూరించి అప్లోడ్ చేయాలి. గత నెల 30వ తేదీన మున్సిపాలిటీల్లో ఓటర్ ముసాయిదా జాబితాను ప్రదర్శించారు. వీటికి గత నెల 31 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నెల 3వ తేదీన అభ్యంతరాలకు సమాధానాలు, వివరణ ఇస్తారు. 4న తుది జాబితా ప్రకటించి, 7న నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈలోపు ఓటర్‌గా నమోదు చేసుకోవడం మన ఓటు గల్లంతు అయితే వెంటనే మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకుంటనే వాటిని సరి చేస్తారు. గత ఓటర్ల జాబితా ప్రకటన సందర్భంగా పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని అరోపణలు వచ్చాయి. ఇంటి నంబర్లు ఒక డివిజన్లో ఉండి మీ ఓటు మరో డివిజన్లో ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకుని వస్తే సరిచేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 2014వ ఎన్నికల సమయంలో 2,28,872 మంది ఓటర్లు ఉండగా 2019 ఎన్నికలు వచ్చే సరికి 2,72,194 మందికి పెరిగిపోయారు. గడిచిని 5 ఏళ్లలో 43,322 మంది ఓటర్లు కొత్తగా పెరిగారు. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు 20,825 ఓటర్లు పెరిగారు. డివిజన్ల పునర్వీభజన ప్రకటించిన నాటి నుంచి 14,408 మంది ఓటర్లు పెరిగినట్లు గణనాంకాలు చెబుతున్నాయి. ఎన్నికల నాటికి మరికొంత మంది ఓటర్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పోలింగ్ కేంద్రాలు మారినా.. సరాసరి ఒక పోలింగ్ కేంద్రంలో 800 ఓటర్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఇప్పటికే కరీంనగర్‌కు 1050, హుజూరాబాద్‌కు 150, జమ్మికుంటకు 150, చొప్పదండికి 66, కొత్తపల్లికి 44 బ్యాలెట్ బాక్స్‌లు చేరుకున్నాయి. పోలింగ్ కేంద్రాల ముసాయిదాను 4న ప్రకటిస్తారు. 5 నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలను స్వీకరిస్తారు. అభ్యంతరాలను 9న ప్రకటించి మరునాడు పోలింగ్ కేంద్రాలకు కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తారు. తుది పోలింగ్ కేంద్రాల జాబితాను 13న ప్రకటిస్తారు. 22న ఎన్నికలు నిర్వహించి 25న ఫలితాలు ప్రకటిస్తారు. -
జనవరి 4న తుది ఓటరు జాబితా: ఈసీ
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సంఘం కొత్త పద్దతిని ప్రారంభించిందని, తుది ఓటరు జాబితాకు ముందే షెడ్యూల్ విడుదల చేశామని ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల డ్రాప్ట్ ఓటర్ జాబితా అందుబాటులో ఉందని, వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేశామన్నారు. ఓటరు జాబితాపై జనవరి 2వ తేది వరకు అభ్యంతరాలు చెప్పవచ్చని తెలిపారు. అసెంబ్లీ జాబితాలో పేరు ఉండి.. ఇప్పుడు లేకపోతే సమస్యను పరిష్కరిస్తామన్నారు. జనవరి 4న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామన్నారు. సెక్షన్ 195, 197 ప్రకారం ప్రభుత్వ అనుమతితోనే షెడ్యూల్ విడుదల చేశామని పేర్కొన్నారు. షెడ్యూల్ విడుదల చట్టప్రకారం చేశామని, ఎన్నికల నిర్వహణపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాగిరెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల సమావేశంలో గొడవ వల్ల వివరంగా చెప్పలేక పోయామని, జనవరి 6వ తేదీ తరువాత రిజర్వేషన్లు ప్రకటిస్తామన్నారు. జనవరి 8 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. టీ పోల్ సాఫ్ట్వేర్ నుంచి, ఓటరు జాబితా నుంచి నామినేషన్ ఫామ్ తీసుకోవచ్చని అన్నారు. నామినేషన్‌ను ఆన్లైన్లో అప్లోడ్ చేసినంత మాత్రాన నామినేషన్ వేసినట్లు కాదన్నారు. ఒరిజినల్ నామినేషన్ కాపీని రిటర్నింగ్ అధికారికి నేరుగా ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో 35 నుంచి 40 వేల వరకు సిబ్బంది ఉంటారని, విధుల్లో వచ్చే సిబ్బంది అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది 13 వ తేది వరకు పోస్టల్ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీడీఎంఏ డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ..141 మున్సిపాలిటీలకు కలిపి రాష్ట్ర స్థాయిని యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు ప్రకటిస్తామన్నారు. 130 మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా ఖరారు చేస్తామని తెలిపారు. జనవరి 5వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ ఛైర్మన్ రిజర్వేషన్లు ప్రకటిస్తామని, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల రిజర్వేషన్లు కలెక్టర్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు. -
బోగస్ ఓట్ల ఏరివేత షురూ..!
సాక్షి, చిత్తూరు : బోగస్ ఓట్ల తొలగింపునకు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం– 2020కి ముందుగానే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడానికి అవకాశం కల్పించింది. వయోజనుల కోసం నూతనంగా ఓటు నమోదు, ఇప్పటికే జాబి తాలో ఉన్న ఓటర్లకు అవసరమైతే సవరణ చేసేందుకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇందుకోసం షెడ్యూల్ ప్రస్తుతం అమల్లో ఉంది. ఏటా అక్టోబర్‌లో ఓటు నమోదు ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మొదలు పెడుతుంది. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ ఎడాది ఒకనెల ముందుగానే ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబి తాలో తప్పులు ఉన్నా సవరణకు అవకాశం ఉంది. గత ఎన్నికల్లో గుర్తింపు కార్డు రానివారు ఇప్పుడు తీసుకొనే వీలుంది. దరఖాస్తు చేసుకునే విధానం తహసీల్దార్ కార్యాలయంలో ఓటరు నమోదు కావడానికి సంబంధించిన ఫారం– 6లతో పాటు సవరణ ఫారాలు అందుబాటులో ఉన్నాయి. 2020 జనవరి 1వ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారు స్ధానిక బూత్‌స్ధాయి అధికారులను స్రంప్రదించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. స్వయంగా నమోదు చేసుకొనేందుకు సరైన ధృవీకరణపత్రాలతో ఇంటర్నెట్లో ఎన్వీఎస్పీ పోర్టల్లోనూ వివరాలు నమోదు చేసుకోవాలి. ఇంటింటా సర్వే సెప్టెంబర్ 1నుంచి 30వరకు బూత్‌స్ధాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ అర్హత కలిగిన వారి సర్వే నిర్వహిస్తారు. ఇంటివద్దకే వచ్చి 18సంవత్సరాలు నిండిన వారి వివరాలు నమోదు చేస్తారు. ఓటునమోదు, సవరణకు దరఖాస్తు చేసిన అభ్యర్ధుల వివరాలు బీఎల్ఓలు పరిశీలిస్తారు. ఈ సర్వే పూర్తిచేసిన తరువాత వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అక్టోబర్ 15వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఈ జాబితా ప్రచురణ తరువాత మార్పులు, చేర్పులకు నవంబర్ 30 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యంతరాలపై చర్యలు తీసుకుంటారు. డిసెంబర్ 15లోగా కొత్తజాబితా ముద్రిస్తారు. జనవరి 1నుంచి 15లోపు తుదిజాబితా ప్రచురిస్తారు. త్వరలో స్ధానిక ఎన్నికలు త్వరలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ తర్వాత ఎప్పుడైనా స్ధానికసంస్ధల ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని ఒకనెల ముందుగానే చేపట్టారని అధికారులు అంటున్నారు. ఇది చదవండి : కొత్త ఓటర్ల నమోదు మొదలు యువత సద్వినియోగం చేసుకోవాలి యువత ఓటరు నమోదు అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి. సవరణ ఫారా లు కూడా అందుబాటులో ఉన్నాయి.∙తప్పొప్పులు సరి చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంది. – సురేంద్ర, తహసీల్దార్, గుడిపాల -
ఓటరు జాబితా సవరణ సమయం..
ఓటర్లకు శుభవార్త.. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 2020 ఓటర్ల తుది జాబితా ప్రకటనకు కసరత్తు ప్రారంభించింది. ఇంటింటి సర్వే సహా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించింది. దీని ప్రకారం జాబితా పారదర్శకంగా రూపొందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సాక్షి, అమరావతి : ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నిర్దేశిత షెడ్యూల్ మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలని ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 2020 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆగస్టు 31 వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న వారి వివరాలను సెప్టెంబర్‌లో బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి పరిశీలించనున్నారు. ఇది పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ 15న మధ్యంతర ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. అప్పటికీ ఓటర్లుగా నమోదు చేసుకోని వారికి అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు తుది అవకాశాన్ని కల్పించనున్నారు. డిసెంబర్ 15లోగా అభ్యంతరాలను స్వీకరించి డిసెంబర్ 25న మరోసారి జాబితాను ప్రచురించనున్నారు. తుది పరిశీలన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తర్వాత వచ్చే ఏడాది జనవరిలో తుది జాబితా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటింటి సర్వే.. ఓటరు జాబితా సవరణలో భాగంగా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి 30 వరకు ఇంటింటి సర్వే చేస్తారు. బూత్‌లెవల్ అధికారులు (బీఎల్వోలు) తమ వద్ద ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారు. స్థానికంగా నివాసం లేనప్పటికీ ఇక్కడ ఓటరు జాబితాలో పేర్లుంటే వాటిని గుర్తించనున్నారు. సెప్టెంబరు 15వ తేదీ నుంచి అక్టోబరు 15 వరకు పోలింగ్ కేంద్రాల వివరాలు సేకరిస్తారు. ఎక్కడైనా పోలింగ్ కేంద్రాలు మార్పు చేయాల్సి ఉంటే ఆ వివరాలను నమోదు చేస్తారు. పోలింగ్ కేంద్రాల చిరునామాలు తప్పుగా నమోదైతే వాటిని సరి చేస్తారు. బీఎల్వోలు, రిటర్నింగ్ అధికారులు ఈ ప్రక్రియ చేపట్టి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరుకు నివేదిక అందజేస్తారు. అక్టోబరు 15న ముసాయిదా ప్రకటన ఈ ఏడాది అక్టోబరు 15వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటిస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాలు, వీటి పరిధిలో ఓటర్ల వివరాలు ప్రకటిస్తారు. అదే రోజు నుంచి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లుగా చేర్చుకునేందుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2020 జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు కోసం ఆన్లైన్లో లేదా బీఎల్వోలు, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 30వ తేదీ వరకు నూతన ఓటర్ల దరఖాస్తులను స్వీకరిస్తారు. వీటిని డిసెంబరు 15వ తేదీ లోపు పరిశీలిస్తారు. డిసెంబరు 25 లోపు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలన చేసి తప్పులుంటే సరి చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి జనవరిలో ఎన్నికల కమిషన్ సూచించిన తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. తప్పులు సరిదిద్దేందుకు.. ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబాతాను హడావుడిగా తయారు చేసి తుది జాబితా ప్రకటించారు. వాటిలో ఒకే కుటుంబానికి చెందిన పేర్లు పలుమార్లు ఓటర్ల జాబితాల్లో నమోదయ్యాయి. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రెండుసార్లు నమోదైన ఓటర్ల పేర్లను ప్రస్తుతం జరిగే ఓటర్ల జాబితాల సవరణల్లో తొలగిస్తారు. జాబితాలో ఓటర్ల పేర్లు తప్పుగా నమోదైతే వాటిని సరిదిద్దుతారు. ఓటరు ఫొటో గతంలో లేకుంటే చేరుస్తారు. హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటర్లు తమ పేర్లు, ఫొటోలు అడ్రసు, సక్రమంగా ఉన్నాయా.? లేదా .? అన్నది పరిశీలించుకోవచ్చు. -
కులగణన తప్పుల తడక
సాక్షి, సత్తుపల్లి: మున్సిపల్ ఎన్నికల కోసం ఇంటింటికీ తిరిగి చేసిన కులగణన తప్పుల తడకలా మారింది. ఒక్క కుటుంబంలోనే సభ్యులది ఒక్కో కులంగా మారిపోయింది. తండ్రిది ఒక కులం.. కొడుకుది మరో కులం.. భార్యది ఒక కులం.. భర్తది మరో కులం.. ఇలా తప్పుల జాబితా చాంతాడును తలపిస్తోంది. అంతేకాక ఒకే ఇంటి నంబర్‌పై రెండు చోట్ల ఓట్లు ఉండడం ఓటర్లను అయోమయానికి గురిచేస్తోంది. నంబర్ 760లో పోతిరెడ్డిపల్లి శ్రీను బీసీ అయితే.. భార్య సంధ్య ఓసీగా 20వ వార్డు ఓటర్ల జాబితాలో పేరుంది. నంబర్ 39లో అల్లు అనిత భర్త పేరు రాఘవరెడ్డి(ఓసీ) అయితే బీసీ అని వచ్చింది. నంబర్ 578లో పొనగళ్ల వెంకట్రావ్(బీసీ గౌడ) అయితే.. ఓసీ అని ఓటర్ల జాబితాలో ప్రచురితమైంది. ఇవేకాక.. ఒకే ఓటు పలు వార్డుల్లో దర్శనమిచ్చింది. స్థానికేతరుల ఓట్లు తొలగించినట్లు కనిపించలేదని ఫిర్యాదులు అందాయి. ఇలా అయితే వార్డుల రిజర్వేషన్లపై ప్రభావం చూపుతుందని పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అభ్యంతరాలను పట్టించుకోలే.. ఎన్నికలు ఆగస్టు మొదటి వారంలో జరుగుతాయని మున్సిపల్ యంత్రాంగం జూలై నెలలోనే హడావుడిగా కులగణన, వార్డుల పునర్విభజన చేసింది. అభ్యంతరాల నమోదుకు గడువు తక్కువగా ఉండడం వల్ల కూడా రాజకీయ పార్టీలు కసరత్తు వేగంగా చేయలేకపోయాయి. కొద్దిపాటి అభ్యంతరాలను వ్యక్తపరిచినా.. పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కూడా అవే తప్పులు దొర్లడంతో రాజకీయ పార్టీలు మున్సిపల్ యంత్రాంగం పనితీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సత్తుపల్లి మున్సిపాల్టీలో 20 వార్డులు ఉండగా.. 23 వార్డులయ్యాయి. 26,470 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 12,743 మంది, మహిళలు 13,727 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 4,133 మంది, ఎస్టీ ఓటర్లు 1,580 మంది, బీసీ ఓటర్లు 14,254 మంది, జనరల్ ఓటర్లు 6,503 మంది, ఇతరులు ఒక్క ఓటరుతో వార్డులవారీగా నూతన ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. డబుల్ ఇంటి నంబర్లతో తికమక.. సత్తుపల్లి మున్సిపాల్టీలో సత్తుపల్లి రెవెన్యూ, అయ్యగారిపేట రెవెన్యూ విభాగాలున్నాయి. అయితే ఆయా రెవెన్యూల్లో చాలా డోర్ నంబర్లు ఒకే ఇంటి నంబర్‌తో రెండుచోట్ల కొనసాగుతున్నాయి. అయ్యగారిపేట, సత్తుపల్లి రెవెన్యూలు వేర్వేరుగా ఉండడం వల్ల ఒకే నంబర్ ఇస్తున్నారు. పట్టణమంతా ఒకే ఇంటి నంబర్ సీరియల్‌గా ఉండాల్సి ఉంది. కానీ.. రెవెన్యూలవారీగా ఒకే నంబర్‌ను రెండు రెవెన్యూ విభాగాల్లో ఇవ్వడం వల్ల రెండుచోట్ల ఒకే ఇంటి నంబర్ గల ఇళ్లు వస్తుండడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఒకే డోర్ నంబర్‌తో ఉన్న ఓట్లు ఒకే వార్డులో ఉండాల్సి ఉండగా.. వేర్వేరు వార్డుల ఓటర్లు జాబితాలో కనిపించడంతో తికమక పడాల్సి వస్తోంది. ఉదాహరణకు.. సత్తుపల్లి రెవెన్యూ విభాగంలోని అడపా సత్యనారాయణ వీధిలోని ఓటర్ల ఇంటి నంబర్లు, అయ్యగారిపేట రెవెన్యూ విభాగంలోని అంబేడ్కర్ నగర్ కాలనీలోని ఓటర్ల ఇంటి నంబర్లు ఒకేలా ఉన్నాయి. దీంతో ఓటర్ల జాబితాలోని పేర్లు జంబ్లింగ్ కావడంతో ఒకే ఇంట్లోని ఓటర్లు వేర్వేరు వార్డుల జాబితాల్లోకి వెళ్లాయి. -
సహకార ఎన్నికలు లేనట్టేనా?
సాక్షి, భువనగిరి : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు మరోమారు వాయిదా పడనున్నాయి. ఇప్పటికే ఎన్నికలను ప్రభుత్వం మూడు సార్లు వాయిదా వేసింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణపై ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు పాలకమండళ్ల పదవీ కాలం పొడిగింపు కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా సహకార అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఆయా సంఘాలకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయడంలో ఇప్పటికే అధికారులు బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఎన్నికలను మరో ఆరు నెలలు పొడిగించే అవకాశాలు కనిపి స్తున్నాయి. జిల్లాలో 110 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. పాలక వర్గాలకు జూలై నెలాఖరుకు పదవీకాలం ముగుస్తుంది. ప్రస్తుత పాలకమండళ్లకే పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా.. ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గాల పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిం చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పాలకమండళ్లను పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. గతంలోనే ఓటరు జాబితా సిద్ధం ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణకు గడువు పొడిగించారు. సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితాను సైతం రూపొందించారు. వాటిపై అభ్యంతరాలను కూడా అధికారులు స్వీకరించారు. వరుసగా శాసనసభ, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో సహకార సంఘాల పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది. సహకార సంఘాలకు 2018డిసెంబర్లోనే రాష్ట్ర సహకార కమిషనర్ నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో వెంటనే సభ్యత్వ నమోదు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేశారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా పాత జాబితాను మార్పు చేశారు. రూ.10చెల్లించి సభ్యత్వం పొంది సహకార ఎన్నికల్లో ఓటు హక్కు పొందేవారు. ప్రస్తుతం అది రూ.300 చెల్లించి సభ్యత్వం తీసుకునే వారికి ఓటు హక్కు ఇవ్వనున్నారు. అలాగే సభ్యుల ఫొటో, గుర్తింపు కార్డు వివరాలను ఓటర్ జాబితాలో పొందుపర్చారు. ఇక సభ్యత్వం తీసుకునే ఏడాది తర్వాతే ఆసభ్యుడికి ఓటు హక్కు అవకాశం లభిస్తుంది. సంఘం నిర్మాణం ఇలా.. ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 13మంది పాలకవర్గ సభ్యులు ఉంటారు. ఎస్సీ 01, ఎస్సీ మహిళ 1, ఎస్టీ 1, బీసీ 2, బీసీ మహిళ 01, ఓసీ 7మంది సభ్యులుగా కొనసాగుతారు. వీరి లో ఒకరు అధ్యక్షుడు, మరొకరు ఉపాధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అయితే ఓటర్ల జాబితా ఫొటోలతో సహా రాష్ట్ర సహకార రిజిస్ట్రార్ కార్యాలయం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జాబితాను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించి మార్పులు చేశారు. ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుండటంతో మార్గదర్శకాలు వెలువడుతాయని భావిస్తున్నారు. వాయిదాపడే అవకాశం ఉంది 2013జూన్ 30వ తేదీన సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. మూడుసార్లు పాలకవర్గాల పదవీకాలం పొడిగించడం జరిగింది. ఈసారి కూడా పదవీ కాలం పొడిగించనున్నారు. గత సంవత్సరం చివరిలో ఎన్నికలు నిర్వహిస్తామని షెడ్యూల్ విడుదల కావడంతో ఓటర్ జాబితా సిద్ధం చేసి పంపాం. తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటే సంవత్సరం ముందు నుంచే ఓటర్ జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. –వెంకట్‌రెడ్డి, జిల్లా సహకార శాఖ ఇన్చార్జ్ అధికారి -
మున్సిపల్ ఓటర్ల జాబితా సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీల్లో 3,355 వార్డుల ఖరారుతో పాటు, వార్డు స్థాయిల్లో ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలు మంగళవారం సిద్ధమయ్యా యి. ముసాయిదా ఓటర్ల జాబితాలు ప్రచురించి, వాటిలోని అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత ఓటర్ల జాబితాలు సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులోని 129 మున్సిపాలిటీలు, 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 3,149 వార్డులను ఖరారు చేసి ఓటర్ల జాబితాలను రూపొందించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిమగ్నమైంది. 21న పోలింగ్ కేంద్రాల జాబితా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో వార్డుల వారీగా ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా రూపొందించి, 21న తుది జాబితాను ప్రకటించాలని గతంలోని షెడ్యూల్‌ను సవరిస్తూ ఇదివరకే ఎస్ఈసీ సర్క్యులర్‌ను జారీచేసింది. మున్సిపాలిటీలకు సంబంధించి 17న ముసాయిదా జాబితా ప్రచురణ, అదేరోజు సాయంత్రం 3 గంటలకు మున్సిపాలిటీల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, 19న సాయంత్రం 5 వరకు అభ్యంతరాలు, సలహాల స్వీకారం, అదేరోజు వాటి పరిష్కారం, 19న పోలింగ్ స్టేషన్ల తుది జాబితా జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సమర్పణ, 21న జిల్లా ఎన్నికల అధికారుల ఆమోదంతో సంబంధిత మున్సిపాలిటీల్లో తుది జాబితా ప్రచు రణ జరుగుతుంది. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల విషయానికొస్తే 17న ముసా యిదా జాబితా ప్రచురణ, అదేరోజు సాయంత్రం 3 గంటలకు ఆయా కార్పొరేషన్ల పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, 19న సాయంత్రం 5 వరకు క్లెయి మ్స్, అభ్యంతరాలు, సలహాల స్వీకరణ, 20న వాటి పరిష్కారం, అదేరోజు పోలింగ్ స్టేషన్ల తుదిజాబితా ను సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు సమర్పణ, 21న జిల్లా ఎన్నికల అధికారుల ఆమోదం పొందాక పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురిస్తారు. ఏర్పాట్లు వేగవంతం ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయడంలో భాగంగా మున్సిపల్ కమిషనర్లకు శిక్షణా తరగతులు సైతం పూర్తిచేసింది. ఎన్నికల విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో జరగనున్న అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోదముద్ర వేయనున్నారు. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లోనే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. తదనుగుణంగా నాలుగో వారంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ విడుదల చేసే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్ విడుదలయ్యాక 16 రోజుల్లోనే మొత్తం ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిని బట్టి వచ్చేనెల 15 లోగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్, ఫలితాల ప్రక టన, పాలకవర్గాల బాధ్యతల స్వీకారం పూర్తి కావొచ్చునని అధికారవర్గాల సమాచారం. -
అతడి పేరు డ డ.. తండ్రి పేరు హ హ...
షాద్‌నగర్‌టౌన్: అధికారుల నిర్లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ ఓటరు జాబితా తప్పుల తడకలా తయారైంది. మున్సిపాలిటీ పరిధిలోని వెంకట రమణ కాలనీలో ఇంటి నంబర్ 18–211/6లో ఓటరు పేరు డ డ అని, తండ్రి పేరు హ హ.. అని నమోదు చేశారు. ఇంటి నంబర్ 18–403/5లో ఓటరు రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి పేరు బదులుగా ఆయన భార్య పేరును నమోదు చేశారు. ఓటరు జాబితాలో తమ పేరుందో లేదోనని పరిశీలిస్తోన్న ప్రజలు ఈ తప్పుల తడకలా తయారైన ఓటర్ల జాబితాను చూసి అవాక్కవుతున్నారు. -
అంతా.. గందరగోళం!
సాక్షి, నల్లగొండ : మున్సిపాలిటీల్లో జరిగిన వార్డుల పునర్విభజనపై రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. మున్సిపల్ నిబంధనలను పాటించకుండా అధికారులు ఇష్టానుసారంగా వార్డులను పునర్విభజించారని విమర్శిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీల్లో గతంలో ఉన్నవార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త వార్డులను ఏర్పాటు చేయడానికి పాత వార్డులను పునర్విభజన చేయక తప్పలేదు. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ నాయకులకు మేలు జరిగేలా వార్డులను విభజించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని కోసం కనీసం వార్డుల సరిహద్దులు తేల్చకుండానే, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారని పేర్కొంటున్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో గతం కన్నా ఓటర్లసంఖ్య తగ్గించి చూపారని, దీంతో పెద్ద సంఖ్యలోనే ఓట్లు గల్లంతు అయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం1.60 లక్షల జనాభా ఉండింది. మున్సిపాలిటీలో నల్ల గొండ శివారు పంచాయతీలను విలీనం చేశారు. అంటే ఆ పంచాయతీల జనాభాను కలిపితే మున్సిపాలిటీ జనాభా పెరగాలి. కానీ, పెరిగినట్లు లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, గతంలో పట్టణంలో 45వేల మందిదాకా ఓసీలు ఉంటే.. వారి సంఖ్య 27వేలకు తగ్గిపోయిందని, ఇదెలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. భర్త ఓసీగా ఉంటే.. భార్యను బీసీ వర్గంలో కలిపారని, ఎస్సీలను బీసీలుగా చూపించారని, పెద్ద సంఖ్యలో ఇలా కులాలు, వర్గాలు మారిపోయాయని అంటున్నారు. మొత్తంగా జిల్లాలోని మున్సి పాలిటీల్లో వార్డుల విభజన, ఓటర్ల జాబితాల తయారీలో ఎన్నో చమత్కారాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. సరిహద్దు దాటిన ఓటర్లు నల్లగొండ మున్సిపాలిటీ వార్డుల పునర్విభజనపై విమర్శలు ఉన్నాయి. ఓటర్ల జాబితాను సరిగా రూపొందించక పోవడంతో ఓటర్ల వివరాలకు పొంతనలే కుండా పోయింది. మున్సిపల్ యంత్రాంగం చేపట్టిన పునర్విభజన ప్రక్రియ వార్డు మ్యాపు, సరిహద్దులు, ఓటర్లకు మధ్య ఎక్కడా సామ్యమే లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరుగా రెండు, మూడు వార్డుల పరిధిలోకి చేరిపోయాయి. భార్యా భర్తలు, పిల్లల ఓట్లు చెల్లా చెదరయ్యాయి. ఉదాహరణకు 9వ వార్డులో భర్తల ఓట్లుంటే, 13వ వార్డులో భార్యల ఓట్లు చేరాయి. 39వ వార్డులో నివాసం ఉన్న వారివి దాదాపు 80 ఓట్ల వరకు 40వ వార్డులోకి వెళ్లిపోయాయి. 9వ వార్డులో నివాసం ఉంటున్న వారికి చెందిన 245 ఓట్లను 8వ వార్డులోకి చేర్చారు. 4వ వార్డులో నివాసం ఉంటే 2వ వార్డులోకి 110 ఓట్లు వచ్చి చేరాయి. 43వ వార్డు నుంచి 42వ వార్డులోకి 242 ఓట్లను మార్చారు. 9 వార్డులో ఉండాల్సిన 197 ఓట్లు 6వ వార్డులో పరిధిలోకి మార్చారు. కొన్ని కాలనీలను పార్ట్‌లుగా విభజించి రెండు, మూడు వార్డులోకి చేర్చడంతో ఈ సమస్యలు వచ్చినట్లు చెబుతున్నారు. పోలింగ్ బూత్‌లను, ఓటర్ల సంఖ్యను చూసుకొని నిబంధనల ప్రకారమే చేర్చినట్లు వార్డులను ఖరారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. 42వ వార్డు రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా కాలనీలు ఉండడంతో ఇబ్బందులు తప్పేలా లేవు. అదే విధంగా దేవరకొండ రోడ్డులోని 24వ వార్డు సైతం ప్ర«ధాన రహాదారికి ఇరు వైపుల ఉన్న కాలనీలతో వార్డు ఏర్పాటు చేశారు. అస్తవ్యస్తంగా వార్డుల పునర్విభజన మిర్యాలగూడ మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన అస్తవ్యస్తంగా చేశారు. పట్టణ మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా వార్డులను విభజించారు. గతంలో 36 వార్డులు ఉన్న మున్సిపాలిటీనీ 14 వార్డులను పెంచి 48 వార్డులు చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్లుగా వార్డుల పునర్విభజన చేపట్టారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. వార్డుల పునర్విభజనపై వచ్చిన అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. మొత్తం 54 ఫిర్యాదులు రాగా కేవలం 14 ఫిర్యాదులు మాత్రమే సక్రమంగా ఉన్నాయని వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేయడం వల్ల శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు కమిషనర్ సత్యబాబు సెలవుపై వెళ్లారు. ఇదీ... కథ మిర్యాలగూడ పట్టణంలోని 1వ వార్డులో ఉన్న చైతన్య నగర్లో రెండు అపార్ట్మెంట్లతో పాటు మొత్తం 300 ఓట్లను నల్లగొండ రోడ్డుకు అవతలివైపున ఉన్న 48వ వార్డు (రామచంద్రగూడెం)లో కలిపారు. తాళ్లగడ్డలో ఉన్న 2వ వార్డు పక్కనే 3వ వార్డు కాకుండా 8వ వార్డుకు సంబంధించిన ఓట్లు కలిపారు. బంగారుగడ్డలోని 44వ వార్డుకు సంబంధించిన ఓట్లను గెజిట్‌లో ప్రకటించిన డోర్నంబర్లకు చెందినవి కాకుండా సుమారుగా 450 ఓట్లను 48వ వార్డు (ఏడుకోట్లతండా)లో కలిపారు. ఈదులగూడెంలో ఉన్న 9వ వార్డులోని ఓట్లను పక్కనే ఉన్న కాలనీతో 440 ఓట్లను ఈదులగూడెంలోని కొంత భాగాన్ని 18వ వార్డుగా చేశారు. గాంధీనగర్‌లోని సుమారు 300 ఓట్లను పక్కన ఉన్న వార్డులోకి కాకుండా 18వ వార్డు (తాళ్లగడ్డ) లో కలిపారు. గతంలో 24వ వార్డుగా ఉన్న అశోక్‌నగర్ ప్రాంతాన్ని నాలుగు భాగాలుగా చేసి నాలుగు వార్డులలో కలపడం వల్ల పాత వార్డు లేకుండా పోయింది. రెడ్డికాలనీ నాలుగు భాగాలుగా చేసి నాలుగు వార్డులుగా విభజించారు. బాపూజీనగర్ కాలనీకి సంబంధించిన ఓట్లను ఇందిరమ్మ కాలనీకి సమీపంలో ఉన్నట్లుగా కలిపారు. 48వ వార్డుగా ఉన్న రామచంద్రగూడెంలో బాగ్యనగర్ కాలనీ ఓట్లు కలిపారు. తప్పుల తడకగా ఓటర్ల జాబితా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన అస్తవ్యస్తంగా మారింది. ఒకే కుటుంబంలోని వారి ఓట్లు వేర్వేగా ఉండడం, భర్త ఓటు ఒక వార్డులో ఉంటే భార్య ఓటు మరో వార్డులో ఉండడం, వారి పిల్లల ఓట్లు ఇంకో వార్డులో నమోదై ఉండడంతో పాటు ఒకే వ్యక్తికి రెండు, మూడు ఓట్లు కలిగి ఉండడం వంటి చమత్కారాలు చోటు చేసుకున్నాయి. తప్పుల తడకకగా రూపొందిçస్తున్న జాబితా కారణంగా ఓటు హక్కుకు దూరమవుతున్న వారు అనేక మంది ఉన్నారు. హాలియా మున్సిపాలిటీలో ఇష్టానుసారంగా వార్డును విభజించారు. 9 వార్డులు ఉన్న మున్సిపాలిటీని 12 వార్డులు చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్లుగా వార్డులను పునర్విభజన చేశారని, ఓటర్ల ముసాయిదా జాబితా తప్పుల తడకగా ఉందని కాంగ్రెస్ నాయకులు హాలియా మున్సిపాలిటీ కమీషనర్ సమ్మద్కి వినతి ప్రతం అందజేశారు. హాలియాలోని రెడ్డికాలనీని 5వ వార్డుగా విభజించారు. ఈ వార్డులోని 250 ఓట్లను 7వ వార్డులో కలిపారు. సాయిప్రతాప్నగర్ను 3వ వార్డుగా విభజించారు. ఈ వార్డులోని 21 ఓట్లు 4వ వార్డు అయిన వీరయ్యనగర్, అంగడిబజార్లోకి కలిపారు. సాయి ప్రతాప్‌నగర్ 3వ వార్డులో ఉన్న వివిధ కుటుంబాలకు చెందిన 150 ఓట్లను వేర్వేరుగా 2వ వార్డులోని ఇబ్రహీంపేట, అలీనగర్లోకి కలిపారు. గోడుమడక బజారు, శాంతినగర్, గంగారెడ్డి నగర్ కలుపుతూ 9వ వార్డుగా విభజించారు. ఈ వార్డులో ఉన్న 70 ఓట్లను పక్కనే ఉన్న 7వ వార్డు వీరబ్రహేంద్రనగర్లోకి కలిపారు. నందికొండ (నాగార్జున సాగర్) మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న టీజీ జెన్కో, భాగ్యనగర్ కాలనీ, ఇ–1 టైప్, ఇ టైప్, బీ11టైప్, పీ టైప్‌ను కలుపుతూ 11వ వార్డుగా విభజించారు. మున్సి పాలిటీకి సంబంధం లేనటువంటి 50 ఓట్లను ఈ వార్డులోకి చేర్చారు. 11వార్డులోని జెన్కోకి సంబందించిన ఓట్లను 10వ వార్డులోకి చేర్చారు. ఓటర్ల జాబితాలో మరణించిన వారి పేర్లు దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఉన్న 20 వార్డులే ప్రస్తుతం ఉన్నాయి. ఒక్కో వార్డుకి 1050 నుంచి 1150లకుపైగా ఓట్లను విభజిస్తూ వార్డుల వారీగా జాబితాను ప్రకటించారు. గతంలో ఆయా వార్డుల్లో కుటుంబ సభ్యులందరి ఓట్లు నమోదు కాగా, ఇటీవల అధికారులు వెలువరించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో ఓట్ల బదలాయింపు జరిగింది. మరికొన్ని వార్డుల్లో మరణించిన వారి ఓట్లు నమోదు కాగా, ఇంకొన్ని వార్డుల్లో ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు నమోదై ఉన్నాయి. గతంలో అధికారులు ఇంటి నంబర్ల ఆధారంగా చేపట్టిన ఓటర్ల గణన పారదర్శకంగా లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆయా వార్డుల్లో అధికార పార్టీకి చెందిన వారికి అనుకూలంగా ఉన్న ఓటర్లను నమోదు చేయించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఒక్కో వార్డులో 10 నుంచి 20కి మందికిపైగా ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు నమోదవుతుండడంతో వివిధ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అభ్యంతరాన్ని పరిశీలిస్తాం ఓటరు జాబితాపై వచ్చిన ఫిర్యాదులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు లేవనెత్తిన ప్రతి అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ప్రతి అభ్యంతరంపై ఇంటింటికి వెళ్లి పరిశీలించి పారదర్శకంగా చేస్తాం. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఓటర్ల జాబితా ఫైనల్ చేస్తాం. ఓటర్లు సామాజిక వర్గం గురించి తప్పుడు సామాచారం ఇచ్చినా.. దానిని విచారించి సరిచేస్తాం. – దేవ్‌సింగ్, మున్సిపల్ కమిషనర్ -
ఓటర్ల లెక్క తేలింది..!
సాక్షి, త్రిపురారం : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన హాలియా మున్సిపాలిటీలో ఎన్నికలకు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధమయ్యింది. ఇప్పటికే మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఒక్కో సెట్ జాబితాను అందించారు. ఈనెల 12వ తేదీన అభ్యంతరాలను స్వీకరించి, 13న క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిష్కరించనున్నారు. ఈనెల 14న తుది జాబితాను విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండడంతో ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే కుదించిన షెడ్యూల్‌తో మరో నాలుగు రోజుల ముందే ఓటర్ల జాబితాను ప్రదర్శనకు పెట్టారు. ఈనెలలోనే ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు పోలింగ్ పర్యవేక్షణకు అధికారుల నియామకం కూడా చేపట్టారు. హాలియా మున్సిపాలిటీల్లో బీసీ ఓటర్లు అధికం.. హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 12 వార్డుల్లో సిబ్బంది ఓటర్ల గణనను పూర్తి చేసి జాబితాను సిద్ధం చేశారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12,770 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,388 మంది కాగా స్త్రీలు 6,382 మంది ఉన్నారు. దీనిలో బీసీ ఓటర్లు మొత్తం 8,242 మంది ఉండగా పురుషులు 4,118 మంది, స్త్రీలు 4,124 మంది ఉన్నారు. అదే విధంగా ఎస్సీ ఓటర్లు మొత్తం 1,703 మంది ఉండగా వీరిలో పురుషులు 850 మంది కాగా స్త్రీలు 853 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు మొత్తం 479 మంది కాగా వీరిలో పురుషులు 220 మంది, స్త్రీలు 259 మంది ఉన్నారు. ఓసీ ఓటర్లు 2,346 మంది ఉండగా పురుషులు 1,200 మంది, స్త్రీలు 1,146 మంది ఉన్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన ఓటర్ల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. మున్సిపాలిటీ పరి«ధిలోని ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను త్వరలో స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. మున్సిపాలిటీలో విలీనమైన కాలనీలు.. హాలియా మున్సిపాలిటీల్లో విలీనమైన కాలనీలు ఇలా ఉన్నాయి. అనుముల, అనుములవారిగూడెం, ఈశ్వర్‌నగర్, సాయిప్రతాప్‌నగర్, గంగారెడ్డినగర్, వీబీనగర్, గణేష్‌నగర్, ఎస్సీ కాలనీ, సాయినగర్ కాలనీ, శాంతినగర్, వీరయ్యనగర్, అంగడి బజార్, రెడ్డికాలనీ, బీసీకాలనీ, హనుమాన్‌నగర్, కేవీ కాలనీ, ఎస్సీ, బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ, ఇబ్రహీంపేట, అలీనగర్ కాలనీలను కలుపుతూ 12 వార్డులుగా విభజించారు. నందికొండ మున్సిపాలిటీలో తేలిన లెక్క నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీలో గల హిల్‌కాలనీ, పైలాన్ కాలనీల్లోని 12వార్డుల్లో సామాజిక వర్గాల వారిగా గల ఓటర్ల లెక్కను తేల్చారు. ఓటర్ల సంఖ్య 12,800మంది ఉండగా బీసీ ఓటర్లు 6,839మంది ఉన్నారు. పురుష ఓటర్లు 6,204మంది ఉండగా మహిళా ఓటర్లు 6,596 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 2,941 మంది ఉండగా ఎస్టీ ఓటర్లు 716 మంది ఉన్నారు. ఓసీ ఓటర్ల సంఖ్య 2,304 మంది ఉన్నారు. -
మున్సిపల్ ఎన్నికల ముసాయిదా విడుదల
సాక్షి, ఆదిలాబాద్: కుల గణన, ఓటర్ల ముసాయిదా జాబితాను మున్సిపల్ అధికారులు బుధవారం వెల్లడించారు. త్వరలో మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పూర్తి వివరాలు సిద్ధం చేస్తున్నారు. పుర ఎన్నికలకు సంబంధించి అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఇంటి నంబర్ల ఆధారంగా ఓటర్లను గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. గురు, శుక్రవారాల్లో వాటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 13న మొత్తం అభ్యంతరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. 14న తుది జాబితా ప్రకటిస్తారు. అనంతరం మున్సిపల్ అధికారులు వార్డుల రిజర్వేషన్లను ఈనెల 15న లేదా 16న ప్రకటించనున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ల రిజర్వేషన్లను ప్రభుత్వమే ప్రకటించనుంది. పెరగనున్న పోలింగ్ కేంద్రాలు.. గతంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 100 పోలింగ్ కేంద్రాలు ఉండగా, విలీనమైన గ్రామాల్లో 38 పోలింగ్ కేంద్రాలతో ఆ సంఖ్య 138కి చేరింది. ప్రస్తుతం ఒక్కో పోలింగ్ కేంద్రంలో 800 చొప్పున ఓటర్లతో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే దీంతో దాదాపు 152 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మూడు వార్డులకు ఒక ఎన్నికల అధికారి మున్సిపల్ అధికారులు వార్డుల వారీగా ఎన్నికల అధికారుల నియామకాన్ని పూర్తి చేశారు. మూడు వార్డులకు కలిపి ఒక ఎన్నికల అధికారి, ఒక సహాయ ఎన్నికల అధికారిని నియమించనున్నారు. గెజిటెడ్ హోదా కలిగిన వారిని ఎన్నికల అధికారులుగా నియమించగా, నాన్‌గెజిటెడ్ వారికి సహాయకులుగా బాధ్యతలు అప్పగించారు. వార్డుల వారీగా నామపత్రాల స్వీకరణ, పరిశీలన, తదితర ప్రక్రియను సంబంధిత అధికారులే పర్యవేక్షించనున్నారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా ఆ పెట్టెలను జిల్లా నుంచే తీసుకోనున్నారు. బ్యాలెట్ పత్రాలు మాత్రం ఇతర చోట్ల ముద్రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నోడల్ అధికారుల నియామకం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ అధికారులతోపాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిని నియమించనున్నారు. వివిధ శాఖలకు చెందిన 10 మంది ఉన్నతాధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించారు. పోలింగ్ నిర్వహణకు అవసరమయ్యే సిబ్బంది నియామకం, బ్యాలెట్ పెట్టెల సేకరణ, పర్యవేక్షణ, రవాణా సౌకర్యం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఎన్నికల సామగ్రి తయారీ, నిర్వహణ, బ్యాలెట్‌పత్రాల తయారీ, ఎన్నికల ఖర్చుల వివరాలు పర్యవేక్షించడం, ఎన్నికల కసరత్తు పరిశీలన, మీడియా సమాచారం, సమన్వయ, సహాయ కేంద్రం నిర్వహణ, పర్యవేక్షణ తదితర పనులు నిర్వహించే బాధ్యతలను నోడల్ అధికారులకు అప్పగించారు. ఓటరు నమోదుకు అవకాశం.. మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు 18 ఏళ్ల వయస్సు గల వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటరు జాబితాలో మున్సిపాలిటీలో 1,21,977 మంది ఓటర్లు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరగనుండడంతో కొత్తగా కొంతమంది దరఖాస్తు చేసుకుంటున్నారని, మరికొంత మంది కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, దీంతో ఓటర్ల సంఖ్య మరింతగా పెరగనున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం రాజకీయ పార్టీల నేతలతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించనున్నారు. ముసాయిదాకు సంబంధించిన అభ్యంతరాలు స్వీకరించనున్నారు. -
నేతల్లో గుబులు
సాక్షి, నర్సంపేట: మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధికారులు ఎన్నికల నిర్వహణకు వేగవంతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల గుండెల్లో అలజడి మొదలైంది. కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే నేతలు ముందస్తుగానే ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకటన అనంతరం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇప్పటికే ఏ వార్డు రిజర్వేషన్ల పరంగా ఏ కేటగిరికీ ఖరారవుతుందోనని అందరిలో చర్చ మొదలైంది. తుది ఓటరు జాబితా ప్రకటించిన వెంటనే అధికారులు ఈ నెల 14 వరకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. కాగా రిజర్వేషన్లు అనుకూలిస్తే తాము.. లేకుంటే తమ సతీమణులను రంగంలోకి దింపడానికి నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నర్సంపేట, పరకాల, వర్దన్నపేట మున్సిపాలిటీల్లో ఈ మేరకు ఆయా పార్టీల టికెట్ల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్‌ల అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిల అనుమతి కోసం ఆ పార్టీ ఆశావహులు పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పోయినసారి నర్సంపేట చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు అవకాశం రాగా వార్డుల వారీగా ఎవరికి రిజర్వేషన్ ప్రకటన వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో పోటీ చేసేవారు అధినాయకుల అనుమతి పొందినవారు రిజర్వేషన్ అనుకూలంగా ఉంటుందో లేదోనని టెన్షన్లో ఉన్నారు. ఈ నెల చివరలో రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో మునిసిపాలిటీల్లో వార్డుల విభజన, సరిహద్దులు ఖరారు చేయగా కులాలు, వర్గాల వారీగా ఓటర్ల గణన వంటి అంశాలు పూర్తి చేసిన అధికారులు ఓటరు జాబితా ప్రకటనపై దృష్టి సారించారు. అయితే తుది ఓటరు జాబితా ప్రకటించిన వెంటనే రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో ఏ పీఠం ఎవరికి అనుకూలిస్తే వారు.. లేకుంటే తమ సతీమణులను రంగంలోకి దింపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆయా పార్టీల టికెట్ల కోసం ఆయా పార్టీల ఎమ్మెల్యేతో పాటు ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిజర్వేషన్లపై చర్చలు జిల్లాలోని మూడు మునిసిపాలిటీ పీఠాలకు రిజర్వేషన్లు ఏ విధంగా ఉండబోతున్నాయనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లాలో పరకాల, నర్సంపేట పాతవి కాగా వర్ధన్నపేటను కొత్తగా ఏర్పాటు చేశారు. మునిసిపల్ చైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లు రాష్ట్ర యూనిట్‌గా, వార్డు కౌన్సిలర్ పదవుల రిజర్వేషన్లను మునిసిపల్ యూనిట్‌గా ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రిజర్వు చేయబోతున్నారు. మరో 50 శాతం జనరల్ కేటగిరిలో ఉండనున్నాయి. అయితే మొత్తంగా 50 శాతం మహిళలకు కేటాయిస్తారు. రూరల్ జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో నర్సంపేటలో 24, పరకాలలో 22, వర్ధన్నపేటలో 12 వార్డుల కౌన్సిలర్ స్థానాలు ఉండగా అందులో సగభాగం బీసీ, ఎస్టీ, ఎస్సీలకు రిజర్వు కానున్నాయి. ఏ మునిసిపాలిటీ ఎవరికి రిజర్వేషన్ ఖరారవుతుందోననే ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలను అధికార యంత్రాంగం సిద్దం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రధాన రాజకీయ పార్టీల ఆశావహులు తమతమ అంచనాలు, ఊహాగానాలతో తమకే అనుకూలిస్తుందనే గట్టి నమ్మకంతో పోటీకి సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు 14లోపు ఖరారు.. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలకు కొత్త పాలకవర్గాలను ఆగస్టు మొదటి వారంలోపు పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వార్డులను ఖరారు చేసిన అధికారులు తుది జాబితా ప్రకటనను మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్‌కు నివేదించారు. వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వ ఆర్డినెన్స్ మేరకు విలీన గ్రామాలను పరిగణ లో కి తీసుకుని వార్డుల విభజనను పూర్తి చేశా రు. కొత్త వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి పంపించనున్నారు. ఓటరు ముసాయిదా జాబితా, తుది ఓటరు జాబితా ఆధారంగా రాష్ట్రం యూనిట్‌గా చైర్పర్సన్, మునిసిపల్ యూనిట్‌గా వార్డు కౌన్సిలర్ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. -
‘మిర్యాల’లో ఆంధ్రా ఓటర్లు..!
సాక్షి, మిర్యాలగూడ : ఓటర్ల జాబితా తప్పుల తడకలుగా ఉన్నాయి. తప్పుడు అడ్రస్‌లతో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. కాగా అధికారులు కనీసం విచారణ కూడా చేయకుండా దరఖాస్తులు చేసుకున్న వారందరికీ ఓటు హక్కు కల్పించారు. దీనిలో భాగంగానే ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి కూడా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఓటు హక్కు కల్పించారు. ఈ ఓట్లను గతంలో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మార్పులు, చేర్పులతో పాటు కొత్త ఓట్ల నమోదు సమయంలో చేర్పించారు. కానీ స్థానికులు వాటిని గుర్తించకపోవడం వల్ల అధికారులకు ఫిర్యాదులు చేయలేకపోయారు. కానీ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆశావహులు ఓటర్ల జాబితాను పరిశీలించడంతో నకిలీ ఓట్లు బయటపడుతున్నాయి. మిర్యాలగూడ మున్సిపాలిటీలో గతంలో 36 వార్డులు ఉండగా ప్రస్తుతం వాటిని 48 వార్డులుగా విభజించారు. కాగా అన్ని వార్డుల్లో మొత్తం 88 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 85,709 మంది ఓటర్లు ఉన్నారు. ఒకే వార్డులో వందకు పైగా ఆంధ్రా ఓటర్లు మిర్యాలగూడ మున్సిపాలిటీలోని పునర్విభజన ప్రకారం చింతపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీని 22 వార్డుగా ఏర్పాటు చేశారు. కాగా అక్కడ 107, 108 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఆ వార్డులో మొత్తం 1,650 ఓట్లు ఉన్నాయి. కాగా ఈ వార్డులోనే 170 ఓట్లు నకిలీ ఓట్లు నమోదయ్యాయి. వాటిలో వంద ఓట్లు పైగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారివి ఉండటం గమనార్హం. ఓటరు క్రమ సంఖ్య 550 నుంచి 587 వరకు ఆంధ్రా ప్రాంతం మాచర్లకు చెందిన వారి ఓట్లు ఉన్నాయి. అంతే కాకుండా ఒకే ఇంటినంబర్లలో పది మంది ఓట్లు, ఇంటికి బై నంబర్లు వేసి ఓటు హక్కు పొందారు. ఇందిరమ్మ కాలనీలో 34–364కు బై నంబర్లు వేసి ఓటర్లుగా నమోదు చేశారు. ఆర్డీఓకు స్థానికుల ఫిర్యాదు ఇందిరమ్మ కాలనీలోని 107, 108 పోలింగ్ స్టేషన్లలో సుమారుగా 170 ఓట్లు నకిలీ ఓట్లు ఉన్నాయి. స్థానికేతరులు ఓటు హక్కును నమోదు చేసుకున్నారని స్థానికులు ఆర్డీఓ జగన్నాథరావుకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రా ప్రాంతం మాచర్లకు చెందిన వారి ఓట్లు ఉన్నాయని, అధికారులు విచారణ చేయకుండా ఓటు హక్కు కల్పించినట్లు ఆరోపించారు. కాగా స్థానికుల ఫిర్యాదు మేరకు ఇందిరమ్మ కాలనీలో విచార చేపట్టి నకిలీ ఓట్లు ఉంటే తొలగిస్తామని ఆర్డీఓ జగన్నాథరావు స్థానికులకు హామీ ఇచ్చారు. -
కులాల వారీగా ఓటర్ల గణన పూర్తి
సాక్షి, కర్నూలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. అందులో భాగంగానే కర్నూలు నగరపాలక సంస్థలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ నెల 5న ఎన్నికల్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ ప్రకారం అదే నెల 30వ తేదీ లోపు నగరంలోని అన్ని వార్డుల్లో ఫొటో ఓటర్ల గుర్తింపు కార్యక్రమం చేపట్టారు. వివిధ కారణాలతో మే 10వ తేదీ వరకు గడువు పెంచారు. మే 10 నుంచి కులాలవారీగా ఓటర్లను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది నగరంలోని 51 వార్డుల్లో తిరిగి కులాల వారీగా ఓటర్లను గుర్తించారు. ఇదే జాబితాను కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, కర్నూలు, కల్లూరు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. కర్నూలు ఓటర్లు 4.9 లక్షలు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌కు 2005లో ఎన్నికలు నిర్వహించారు. అప్పటి పాలకవర్గం 2010 సెప్టెంబర్ 30 వరకు పనిచేసింది. అప్పట్లో నగరపాలక పరిధిలో ఓటర్ల సంఖ్య 3.42 లక్షలు. అప్పటి నుండి 9 ఏళ్లుగా కర్నూలు నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించలేదు. ఇదే క్రమంలో 2012 సంవత్సరంలో నగరపాలక సంస్థలో స్టాంటన్‌పురం, మామిదాలపాడు, మునగాల పాడు గ్రామాలు విలీనం అయ్యాయి. దీంతో త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయడంతో మరోసారి నగరపాలకలో ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయ్యింది. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో 4.9 లక్షల ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. 9 ఏళ్లలో నగరపాలక సంస్థలో 70 వేల ఓటర్లు నమోదు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కులాల వారీగా ఓటర్లను గుర్తించే కార్యక్రమం పూర్తి కావడంతో పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, రిజర్వేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. మొత్తం 51 వార్డులు నగరపాలక సంస్థలో 51 వార్డులు ఉన్నాయి. మొత్తం 4,09,591 ఓటర్లు ఉన్నారు. పురుషులు 2,01,368, మహిళలు 2,08,147 మంది ఉన్నారు. మిగతా వారు 76 మంది ఉన్నారు. బీసీ వర్గానికి సంబంధించి 2,34,462 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 1,14,871, మహిళలు 1,19,544 మంది ఉన్నారు. ఎస్సీ వర్గానికి 59,236 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 27, 809, మహిళలు 31,421 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు 2,864 ఉన్నారు. ఇందులో పురుషులు 1,432, మహిళలు 1,431 ఉన్నారు. ఓసీ సంబంధించి 1,13,029 ఓట్లు ఉన్నాయి. పురుషులు 57, 256, మహిళలు 55, 751 మంది ఉన్నారు. 2010లో 13 మంది ఉండేవారు. వీరి సంఖ్య ప్రస్తుతం 76 చేరింది. వీరిలో బీసీలు 47 మంది, ఎస్సీలు ఆరుగురు, ఎస్టీ ఒకరు, ఓసీ 22 మంది ఉన్నారు. -
‘పరిషత్’ ఎన్నికలకు కసరత్తు
సాక్షి, కొత్తకోట : ఓ వైపు పార్లమెంట్ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించడానికి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుండగా... మరో వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వెనువెంటనే ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. ఈ ఏడాది జూన్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీల పదవికాలం ముగియనుంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియతో పాటుగా ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేశారు. జాబితాను గ్రామ పంచాయితీ కార్యాలయాలు, తహాసీల్దార్ కార్యాలయాలం ఎదుట ప్రదర్శించారు. ఇంతకు ముందే ఎంపీటీసీ స్థానాల ఏర్పాట్లపై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మండలంలో 59పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. గతంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్న కొత్తకోట గ్రామ పంచాయితీ ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో అయిదు స్థానాలకు ఎన్నికలు లేకుండా పోయాయి. మండలంలో రిజర్వేషన్లు ఇలా.. మండలంలో 22గ్రామ పంచాతీలకు గానూ 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ సైతం ముగిసింది. అమడబాకుల(జనరల్), అప్పరాల (బీసీ మహిళ), కానాయపల్లి (బీసీ జనరల్), కనిమెట్ట (జనరల్), మిరాషిపల్లి (జనరల్ మహిళ), నాటవెళ్లి (ఎస్టీ జనరల్), నిర్వేన్ (జనరల్ మహిళ), పాలెం (ఎస్సీ జనరల్), పామాపురం (బీసీ మహిళ), రాయిణిపేట (జనరల్ మహిళ), సంకిరెడ్డిపల్లి (జనరల్), వడ్డెవాట (ఎస్సీ మహిళ)కు కేటాయించారు. 40,289మంది ఓటర్లు.. మండలంలో 23 పంచాయతీల్లో ఓటర్ల లెక్క తేలింది. మొత్తం 40,289మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 20,458, మహిళలు 19,831మంది ఉన్నారు. పైరవీలు షురూ.. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకునే అశావహులు తమ పార్టీ పెద్దల వద్ద పైరవీలు మొదలు పెట్టారు. సర్పంచ్ సీటు కోల్పోయిన వారు, గతంలో సీటు కోసం యత్నం చేసి విఫలం చెందిన వారు ఎంపీటీసీ స్థానాల సీటు కేటాయించాలని ఆయా పార్టీల పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ప్రత్యర్థులకు ధీటుగా ఆర్థికంగా తట్టుకునే వారిని నిలబెట్టేందుకు పార్టీ పెద్దలు చూస్తున్నారు. కసరత్తు చేస్తున్నాం స్థానిక ఎంపీటీసీ ఎన్నికలకు సంబందించి ఓటురు లిస్టును ప్రర్శించాం. అధికారుల అదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ చేస్తున్నాం. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుందో సమాచారం లేదు. ఎన్నికలు ఎప్పడు వచ్చిన ఎదుర్కొవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. – కతలప్ప, ఎంపీడీఓ, కొత్తకోట -
పంచాయతీ పోరుకు కసరత్తు
సాక్షి, అరసవల్లి (శ్రీకాకుళం): ఓ వైపు సార్వత్రిక ఎన్నికల వే‘ఢీ’ కొనసాగుతుంటే..మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు మరో కీలక అడుగు వేశారు. గ్రామ స్థాయిలో ప్రధానమైన ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్నారు. గ్రామస్థాయిలో వార్డుల వారీగా, కేటగిరీల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శనకు సిద్ధం చేయాలంటూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేయడంతో.. త్వరలోనే పంచాయతీల పోరు షురూ అన్న సంకేతాలు పంపినట్లయ్యింది. జిల్లాలోని 1095 గ్రామ పంచాయతీల్లోనూ పాలక వర్గాల గడువు తీరిపోవడంతో గత ఏడాది ఆగస్టు 2 నుంచి ‘ప్రత్యేక’ అధికారుల పాలన కొనసాగుతున్న సంగతి విదితమే. వాస్తవానికి గత ఏడాదే స్థానిక ఎన్నికలకు సిద్ధపడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, తీవ్ర ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు వెనుకడుగు వేసింది. అప్పటి నుంచి ప్రత్యేక పాలనలోనే పల్లెలున్నాయి. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్‌కుమార్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు మరికొద్ది నెలల్లోనే పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు సిగ్నల్ ఇచ్చేశారు. ఇందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు పంపారు. గతేడాది జూన్‌లో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు మేరకు అప్పట్లో కూడా పంచాయతీలకు ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడిందనే చర్చ జరిగింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ పాలన గడువు కూడా పూర్తికానుండడంతో, సార్వత్రిక ఎన్నికలు జరిగిన వెంటనే ‘స్థానిక’ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేద్దామనే ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల అధికారులున్నట్లు సమాచారం. ఈమేరకు తొలి అడుగుగా వచ్చే నెల 10న అన్ని పంచాయతీల్లోనూ వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో 21 లక్షల 75 వేల మంది ఓటర్లు.. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారిని ప్రామాణికంగా తీసుకుని జిల్లాలో అన్ని పంచాయతీల్లోనూ ఓటర్లను ఖరారు చేయాల్సి ఉంది. తాజా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 1095 పంచాయతీల నుంచి 21,75,176 మంది ఓటర్లతో జాబితా సిద్దమైంది. ఇందులో పురుషులు 10,88,410, మహిళలు 10,86,493 మందిగా నమోదయ్యారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. 2013లో జిల్లాలో మొత్తం 1100 పంచాయితీలకు గాను 1099 పంచాయతీలకు, 10,542 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో శ్రీకాకుళం మున్సిపాల్టీలో నగరానికి శివారు పంచాయతీలను విలీనం చేసే క్రమంలో పెద్దపాడు పంచాయతీ ఆమోదం తెలియజేయడంతో పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. దీంతో ఇప్పటికీ అక్కడ ప్రత్యేకాధికారి పాలనే కొనసాగుతోంది. తాజా పరిస్థితులను బట్టి చూస్తే జిల్లాలో మొత్తం 5 పంచాయతీలు పూర్తిగా వంశధార ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పూర్తిగా తొలిగింపునకు గురయ్యాయి. హిరమండలం పరిధిలోని చిన్న కొల్లివలస, పెద్ద సంకిలి, శిలగాం, దుగ్గిపురం, తులగాం పంచాయతీలతో పాటు వంగర మండలంలోని దేవకివాడ గ్రామ పంచాయతీ కూడా వంశధార ప్రాజెక్టు కారణంగా మెర్జింగ్ అయ్యింది. గార్లపాడులో మూడు అనుబంధ గ్రామాలు (హేమ్లెట్స్), పాడలి పంచాయతీలో రెండు అనుబంధ గ్రామాలు వంశధార పరిధిలో తొలిగిపోయినప్పటికీ, ఈ రెండు పంచాయతీలు మాత్రం రికార్డుల్లో కొనసాగుతున్నాయి. వంశధార ప్రాజెక్టు భూసేకరణ కారణంగా మొత్తం 5 పంచాయతీలు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయాయి. ఇకపై జిల్లాలో 1095 పంచాయతీలుగా రికార్డుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ పంచాయతీల్లోనే ఈసారి ఎన్నికలు జరుగనున్నాయని అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. గ్రామ సర్పంచులతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా ఇవే ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలను నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. గతంలో మాదిరిగా ఈసారి కూడా వార్డుకో పోలింగ్ స్టేషన్ ఉండేలా ఎన్నికల అధికారులు నిర్ణయించారు. చట్ట ప్రకారం 50 శాతం పంచాయతీలు, వార్డులను మహిళలకు, జనాభా దామాషా ప్రకారం రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. చర్యలు చేపడతాం జిల్లాలో మొత్తం 1095 పంచాయతీల్లో వార్డుల వారీగా కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారుల ఉత్తర్వుల ప్రకారం వచ్చే నెల 10న ఓటర్ల జాబితాను ఆయా పంచాయతీ గ్రామాల్లోనే ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తాం. ఎన్నికల అధికారుల సర్క్యులర్ ప్రకారం తదుపరి చర్యలు చేపడతాం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తాం. – బి.కోటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి, శ్రీకాకుళం -
రాజమండ్రి ఓటర్ల జాబితాలో కాజల్....
సాక్షి, రాజమండ్రి : ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్వస్థలం ఏంటో తెలుసా తూర్పు గోదావరి జిల్లా. అంతేకాదండోయ్ ఆమె పేరు కూడా మార్చుకున్నారు... దీపికా పదుకొనెగా. కాజల్..ఊరు, పేరు మారటం ఏంటా అని అనుకుంటున్నారా?. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... రాజమండ్రి రూరల్ నియోజవర్గ ఓటర్ల జాబితాలో దీపికా పదుకొనె పేరుతో కాజల్ అగర్వాల్ ఫోటో ప్రత్యక్షమైంది. మరో విచిత్రం ఏంటంటే ఆమె తండ్రి పేరు రమేష్ కొండా, వయసు 22 అని ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ ఇది మన ఎన్నికల అధికారుల చిత్తశుద్ది అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఉత్తర ప్రదేశ్‌లోని భల్లిలా నియోజకవర్గంలో 51 ఏళ్ల ‘దుర్గావతి సింగ్’ పేరుతో సన్నిలియోన్ ఫోటోతో వున్న ఓటర్ల జాబితాను విడుదల చేసి ఎలక్షన్ కమిషన్ పరువు పోగోట్టుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ జాబితాలో చాలామందికి వాళ్ల ఫోటోలకు బదులు ఏనుగు, పావురం, జింక బొమ్మలు వుండటం గమనార్హం. -
జాబితాలో మీ పేరు లేదా.. అయినా ఓటేయొచ్చు
సాక్షి, సిటీబ్యూరో: ఓటరు జాబితాలో మీ పేరు లేదా..? ఓటు ఎలా వేసేదని ఆందోళన చెందుతున్నారా..? అయినా మీరేమీ వర్రీ కావద్దు. పేరు లేకపోయినా ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అయితే ఏఎస్డీ జాబితాలో మాత్రం మీ పేరు ఉండాల్సిందే. అందులో పేరు లేకపోతే మాత్రం ఏమీ చేయలేం. ఓటరు జాబితా తయారీకి ముందు అధికారులు క్షేత్రస్థాయి పర్యటన సమయంలో ఇళ్లలో లేని వారి పేర్లు జాబితా నుంచి తొలగించి.. ఏఎస్డీ (ఆబ్సెంటీ, షిఫ్ట్డ్ అండ్ డూప్లికేటెడ్ ఓటర్స్) అనే మరో జాబితాలో పొందుపరుస్తారు. ఆ ఏఎస్డీ జాబితాలో పేరు ఉంటే అది మీరే అని నిరూపించుకుని ఓటు వేయవచ్చు. -
ఓటు చెక్ చేసుకోండి.. ఈ రోజే చివరి గడువు
సాక్షి, పశ్చిమ గోదావరి: నేషనల్ ఓటర్ సర్వీసు పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటరు ఐడీ కార్డు ఎంపిక్ నంబరు కానీ నమోదు చేస్తే... ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే Search Your Name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటు ఉందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబరు వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవా కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరు ఉందా లేదా అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెక్ యువర్ ఓటు పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరి చూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే వినియోగించుకోవచ్చు. ఓటు నమోదుకు ఈనెల 15 వరకూ అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
తూర్పు గోదావరి.. మీ ఓటు చెక్ చేసుకోండి
సాక్షి, తూర్పు గోదావరి: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. కలెక్టరేట్లోని కంట్రోల్ రూం ల్యాండ్‌లైన్ నెం : 0884–2371950, 0884–2371951 కాల్ సెంటర్ ఇన్చార్జి : డీటీ సరస్వతి టోల్ ఫ్రీ : 1800 425 3077 జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు ఓటు నమోదుకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు.