సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీల్లో 3,355 వార్డుల ఖరారుతో పాటు, వార్డు స్థాయిల్లో ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలు మంగళవారం సిద్ధమయ్యా యి. ముసాయిదా ఓటర్ల జాబితాలు ప్రచురించి, వాటిలోని అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత ఓటర్ల జాబితాలు సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులోని 129 మున్సిపాలిటీలు, 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 3,149 వార్డులను ఖరారు చేసి ఓటర్ల జాబితాలను రూపొందించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) నిమగ్నమైంది.
21న పోలింగ్ కేంద్రాల జాబితా
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో వార్డుల వారీగా ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా రూపొందించి, 21న తుది జాబితాను ప్రకటించాలని గతంలోని షెడ్యూల్‌ను సవరిస్తూ ఇదివరకే ఎస్‌ఈసీ సర్క్యులర్‌ను జారీచేసింది. మున్సిపాలిటీలకు సంబంధించి 17న ముసాయిదా జాబితా ప్రచురణ, అదేరోజు సాయంత్రం 3 గంటలకు మున్సిపాలిటీల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, 19న సాయంత్రం 5 వరకు అభ్యంతరాలు, సలహాల స్వీకారం, అదేరోజు వాటి పరిష్కారం, 19న పోలింగ్ స్టేషన్ల తుది జాబితా జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సమర్పణ, 21న జిల్లా ఎన్నికల అధికారుల ఆమోదంతో సంబంధిత మున్సిపాలిటీల్లో తుది జాబితా ప్రచు రణ జరుగుతుంది. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల విషయానికొస్తే 17న ముసా యిదా జాబితా ప్రచురణ, అదేరోజు సాయంత్రం 3 గంటలకు ఆయా కార్పొరేషన్ల పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, 19న సాయంత్రం 5 వరకు క్లెయి మ్స్, అభ్యంతరాలు, సలహాల స్వీకరణ, 20న వాటి పరిష్కారం, అదేరోజు పోలింగ్ స్టేషన్ల తుదిజాబితా ను సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు సమర్పణ, 21న జిల్లా ఎన్నికల అధికారుల ఆమోదం పొందాక పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురిస్తారు.
ఏర్పాట్లు వేగవంతం
ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయడంలో భాగంగా మున్సిపల్ కమిషనర్లకు శిక్షణా తరగతులు సైతం పూర్తిచేసింది. ఎన్నికల విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో జరగనున్న అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోదముద్ర వేయనున్నారు. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లోనే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. తదనుగుణంగా నాలుగో వారంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ విడుదల చేసే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్ విడుదలయ్యాక 16 రోజుల్లోనే మొత్తం ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిని బట్టి వచ్చేనెల 15 లోగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్, ఫలితాల ప్రక టన, పాలకవర్గాల బాధ్యతల స్వీకారం పూర్తి కావొచ్చునని అధికారవర్గాల సమాచారం.
మున్సిపల్ ఓటర్ల జాబితా సిద్ధం
Published Wed, Jul 17 2019 7:35 AM | Last Updated on Wed, Jul 17 2019 7:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment