సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల సన్నాహాలను పురపాలక శాఖ వేగవంతం చేసింది. రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలు, 75 పురపాలక సంఘాల్లో మార్చి 10న నిర్వహించనున్న పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడం, బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి సున్నితమైనవి, అత్యంత సున్నితమైన వాటిని గుర్తించారు. వార్డులవారీగా ఓటర్ల జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
► మున్సిపల్ ఎన్నికల కోసం మొత్తం 15,978 బ్యాలెట్ బాక్సులు అవసరమని అంచనా వేశారు. జంబో బాక్సులు 922, పెద్ద బాక్సులు 10,673, మీడియం సైజు బాక్సులు 2,540, చిన్న సైజు బాక్సులు 1,843 వినియోగించను న్నారు. కొన్ని బ్యాలెట్ బాక్సులను గతంలో హైదరాబాద్‌లో పురపాలక సంస్థ ఎన్నికల కోసం పంపించారు. వాటిని వెనక్కి తెప్పించనున్నారు.
► బ్యాలెట్ విధానంలో నిర్వహించే ఈ ఎన్నికల కోసం బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. 13 జిల్లాలకు 94 టన్నుల వైట్‌వోవ్ కాగితాలను పంపించారు. ఎన్ని బ్యాలెట్ పత్రాలు అవసరమవుతా యన్నది జిల్లాల వారీగా కలెక్టర్లు నిర్ణయిస్తారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ కోసం నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల వారీగా ప్రింటింగ్ ప్రెస్‌లను కలెక్టర్లు ఎంపిక చేస్తారు.
► పోలింగ్ కోసం అవసరమైన ఇండెలిబుల్ ఇంక్ (సిరా)ను సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది మున్సిపల్ ఎన్నికల కోసం తెప్పించిన సిరా గడువు తీరడంతో కొత్తగా ఆర్డర్ ఇచ్చారు. 5 ఎంఎల్ సిరా సీసాలు 13,500, 10 ఎంఎల్ సిరా సీసాలు 26,500 తెప్పించాలని నిర్ణయించారు.
► పురపాలక ఎన్నికల కోసం మొత్తం 9,307 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 12 నగర పాలక సంస్థల పరిధిలో 5,020 కేం ద్రాలు, 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల పరిధిలో 4,287 పోలింగ్ కేంద్రాలున్నాయి.
► పోలింగ్ కేంద్రాల్లో సున్నితమైనవి 2,890, అత్యంత సున్నితమైనవి 2,466 కేంద్రాలు ఉండగా 3,951 సాధారణ పోలింగ్ కేంద్రా లున్నాయి. 12 నగర పాలక సంస్థల్లో సున్నితౖ మెనవి 1,465, అత్యంత సున్నితమైనవి 1,159, సాధారణమైనవి 2,396 కేంద్రాలు ఉన్నాయి. 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల పరిధిలో సున్నితమైనవి 1,425, అత్యంత సున్నితమైనవి 1,307, సాధారణ మైనవి 1,555 కేంద్రాలున్నాయి.
► మున్సిపల్ ఎన్నికల కోసం తొలిసారిగా ఓటర్ల ఫొటోలున్న స్లిప్పులు పంపిణీ చేయనున్నారు. మున్సిపల్ ఓటర్ల వివరాలను పురపాలక శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వార్డుల వారీగా ఓటర్ల పేర్లతో సహా జాబితాలను అందుబాటులో ఉంచారు.
94 టన్నుల బ్యాలెట్ పత్రాలు
Published Thu, Feb 25 2021 5:03 AM | Last Updated on Thu, Feb 25 2021 5:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment