Ballot boxes
-
ఆర్డీవో ఆఫీసులోనే పోస్టల్ బ్యాలెట్ బాక్సులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాల్సిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఆర్డీఓ కార్యాలయంలోనే ఉండటంపై పెద్దదుమారమే రేగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్, సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో శనివారం అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. వివరాలిలా.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన పోలీసులు, ఇతర ఉద్యోగులు నవంబర్ 21 నుంచి 29 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిని భద్రపరిచే విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తాయి. స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరాల్సిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులు.. సీల్ లేకుండా ఆర్డీఓ కార్యాలయంలోనే ఉండటం వివాదానికి కారణమైంది. ఈ విషయమై పోలింగ్ ఏజెంట్లకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వాటిని తెరిచి ఉంచడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం రాత్రి కౌంటింగ్ పాసుల కోసం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు చెందిన ఏజెంట్లు ఈ విషయాన్ని గుర్తించి, ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ ఆఫీ సర్ అధికార బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన.. లాఠీ చార్జ్ ఆందోళనకారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆర్డీఓ అనంతరెడ్డి చాంబర్ నుంచి మరో గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నారు. దీంతో ఆందోళనకారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ టి నుంచి డోర్‌ను బలంగా బాదారు. వెంటనే పోలీసులు అక్కడి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచె ప్పే ప్రయత్నం చేసినా.. వారు వినిపించుకోలేదు. 2018 సాధారణ ఎన్నికల్లో ఫలితాల సమయంలోనూ అధికారులు ఇదేవిధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత రిటర్నింగ్ అధికారి కూడా ఆయనే కావడంతో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు, ఆందోళనకారులకు మ«ధ్య తోపులాట చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతుండంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఆర్డీఓ కార్యాలయానికి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతీ హోళీకేరీ రాత్రి 10.30 గంటలకు ఆర్డీఓ ఆఫీసుకు చేరుకున్నారు. బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులు, బాక్స్‌లను భద్రపరిచిన విధానంపై ఆరా తీశారు. ఈ సమయంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీల ఏజెంట్లు కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్యంపై మీకెంత నమ్మకం ఉందో మాకూ అంతే ఉంది. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకే మేమున్నాం. అసలు ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాతే ఓ నిర్ణయానికి రాగలం’అని చెప్పారు. ఇదే సమయంలో పలువురు కార్యకర్తలు ఆర్డీఓ ఆఫీసు ముందు బైఠాయించి స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో చోటు చేసుకున్న తోపులాటలో పంబ శ్రీను అనే వ్యకికి చేతికి బలమైన గాయాలు కాగా.. కృష్ణ అనే మరో వ్యక్తి తలకు గాయమైంది. ఆగ్రహించిన ఆందోళనకారులు ఆర్డీఓ కార్యాలయం అద్దాలు ధ్వంసం చేశారు. -
Poll violence in Bengal: బెంగాల్ పంచాయతీ హింసాత్మకం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. తుపాకీ పేలుళ్లు, బాంబుల మోతలు, పేలుడు పదార్థాల విస్ఫోటనాలతో శనివారం రాష్ట్రం దద్దరిల్లింది. ఈ హింసాత్మక ఘటనల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎనిమిది మంది టీఎంసీ కార్యకర్తలు. బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ పార్టీలకు చెందిన వారు మరణించారు. కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్స్‌లు ఎత్తుకొని పోవడం, వాటికి నిప్పు పెట్టడం వంటి ఘటనలు కూడా జరిగాయి. ముర్షీదాబాద్, నాడియా, కూచ్ బెహార్, జిల్లాలతో పాటు దక్షిణ 24 పరగణాలోని భాంగార్, నందిగ్రామ్‌లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ఆనంద బోస్ ఉత్తర 24 పరగణా జిల్లాలో స్వయంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ పరిస్థితుల్ని పర్యవేక్షించారు. మృతి చెందిన వారిలో బీజేపీకి పోలింగ్ ఏజెంట్ మధాబ్ బిశ్వాస్ కూచ్‌బెహార్ జిల్లాలో జరిగిన ఘర్షణలో మరణించారు. ఉత్తర దింజాపూర్‌లోని గోల్‌పోఖార్‌లో టీఎంసీ, కాంగ్రెస్ మద్య ఘర్షణల్లో టీఎంసీ పంచాయతీ అధ్యక్షురాలి భర్తను హత్య చేశారు. ముర్షీదాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి చెలరేగిన హింసలో టీఎంసీ కార్యకర్త బాబర్ అలీ, ఖర్గామ్ ప్రాంతంలో టీఎంసీ కార్యకర్త సబీరుద్దీన్, కూచ్ బెహార్ జిల్లా తుఫాన్గంజ్లో బూతు కమిటీ సభ్యుడు గణేశ్ సర్కార్ మరణించినట్టుగా అధికారులు వెల్లడించారు. వీరందరిపైనే బీజేపీ కార్యకర్తలే దాడులు చేసి చంపేశారని టీఎంసీ ఆరోపించింది. మూడంచెలున్న పంచాయతీల్లో 73,887 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 2 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పార్టీల పరస్పర ఆరోపణలు ఎన్నికల్లో హింసకు మీరు కారణమంటే మీరేనని బీజేపీ, టీఎంసీలు ఒకరినొకరు నిందించుకున్నాయి. ఈ స్థాయిలో హింస చెలరేగితే కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయని టీఎంసీ మంత్రి శశిపంజా ప్రశ్నించారు. కేంద్ర బలగాలు ఎందుకు మోహరించాయని, టీఎంసీ కార్యకర్తల్ని హత్య చేస్తూ ఉంటే ఆ బలగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని అన్నారు. ఈ ఘర్షణలకు టీఎంసీ కారణమంటూ బీజేపీ చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. హింసకు తామే కారణమైతే అంత మంది టీఎంసీ కార్యకర్తలు ఎందుకు చనిపోతారని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో బాంబుల సంస్కృతి‡ భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా మారిందని, అంతర్జాతీయంగా దేశం పరువు పోతోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. హత్యలు చేయడం ద్వారా అధికారంలోకి రావచ్చని మమత భావిస్తున్నారని ఆరోపించారు. హత్యల కారణంగా ఎన్నికల్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో కాంగ్రెస్ నాయకుడు కౌస్తవ్ బగ్చి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. -
94 టన్నుల బ్యాలెట్ పత్రాలు
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల సన్నాహాలను పురపాలక శాఖ వేగవంతం చేసింది. రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలు, 75 పురపాలక సంఘాల్లో మార్చి 10న నిర్వహించనున్న పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడం, బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి సున్నితమైనవి, అత్యంత సున్నితమైన వాటిని గుర్తించారు. వార్డులవారీగా ఓటర్ల జాబితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ► మున్సిపల్ ఎన్నికల కోసం మొత్తం 15,978 బ్యాలెట్ బాక్సులు అవసరమని అంచనా వేశారు. జంబో బాక్సులు 922, పెద్ద బాక్సులు 10,673, మీడియం సైజు బాక్సులు 2,540, చిన్న సైజు బాక్సులు 1,843 వినియోగించను న్నారు. కొన్ని బ్యాలెట్ బాక్సులను గతంలో హైదరాబాద్‌లో పురపాలక సంస్థ ఎన్నికల కోసం పంపించారు. వాటిని వెనక్కి తెప్పించనున్నారు. ► బ్యాలెట్ విధానంలో నిర్వహించే ఈ ఎన్నికల కోసం బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. 13 జిల్లాలకు 94 టన్నుల వైట్వోవ్ కాగితాలను పంపించారు. ఎన్ని బ్యాలెట్ పత్రాలు అవసరమవుతా యన్నది జిల్లాల వారీగా కలెక్టర్లు నిర్ణయిస్తారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ కోసం నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల వారీగా ప్రింటింగ్ ప్రెస్‌లను కలెక్టర్లు ఎంపిక చేస్తారు. ► పోలింగ్ కోసం అవసరమైన ఇండెలిబుల్ ఇంక్ (సిరా)ను సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది మున్సిపల్ ఎన్నికల కోసం తెప్పించిన సిరా గడువు తీరడంతో కొత్తగా ఆర్డర్ ఇచ్చారు. 5 ఎంఎల్ సిరా సీసాలు 13,500, 10 ఎంఎల్ సిరా సీసాలు 26,500 తెప్పించాలని నిర్ణయించారు. ► పురపాలక ఎన్నికల కోసం మొత్తం 9,307 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 12 నగర పాలక సంస్థల పరిధిలో 5,020 కేం ద్రాలు, 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల పరిధిలో 4,287 పోలింగ్ కేంద్రాలున్నాయి. ► పోలింగ్ కేంద్రాల్లో సున్నితమైనవి 2,890, అత్యంత సున్నితమైనవి 2,466 కేంద్రాలు ఉండగా 3,951 సాధారణ పోలింగ్ కేంద్రా లున్నాయి. 12 నగర పాలక సంస్థల్లో సున్నితౖ మెనవి 1,465, అత్యంత సున్నితమైనవి 1,159, సాధారణమైనవి 2,396 కేంద్రాలు ఉన్నాయి. 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల పరిధిలో సున్నితమైనవి 1,425, అత్యంత సున్నితమైనవి 1,307, సాధారణ మైనవి 1,555 కేంద్రాలున్నాయి. ► మున్సిపల్ ఎన్నికల కోసం తొలిసారిగా ఓటర్ల ఫొటోలున్న స్లిప్పులు పంపిణీ చేయనున్నారు. మున్సిపల్ ఓటర్ల వివరాలను పురపాలక శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. వార్డుల వారీగా ఓటర్ల పేర్లతో సహా జాబితాలను అందుబాటులో ఉంచారు. -
బ్యాలెట్ నుంచి వీవీ ప్యాట్ వరకూ..
సాక్షి, పశ్చిమ గోదావరి : మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానం మార్పును సంతరించుకుంటోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికల సంఘం కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడగా 1951లో దేశంలో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. తొలినాళ్లలో బ్యాలెట్ విధానాన్ని ఎన్నికల సంఘం తీసుకువచ్చింది. ఈ విధానంలో బ్యాలెట్ పేపర్‌పై ఓటర్ అభ్యర్థిని ఎన్నుకునేలా ముద్ర వేసి బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉంటుంది. అనంతరం బ్యాలెట్ పేపర్లను లెక్కించి విజేతను ప్రకటించేవారు. 2004 వరకు ఇదే విధానం కొనసాగగా 2004 సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలు (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) అందుబాటులోకి వచ్చాయి. ఈవీఎం వినియోగంపై ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం పారదర్శకత కోసం వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్)ను ప్రవేశపెట్టింది. ఈసారి ఎన్నికల్లో వీవీ ప్యాట్‌ను వినియోగించనున్నారు. వీవీ ప్యాట్ అంటే.. ఇటీవల తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం వీవీ ప్యాట్‌ను ప్రవేశపెట్టింది. ఓటు వేసిన తర్వాత ఎవరికి పడిందో సరిచూసుకునే వెసులుబాటు కల్పిస్తుండటం వీవీ ప్యాట్ ప్రత్యేకం. ఇందుకోసం వీవీప్యాట్ అనే అత్యాధునిక యంత్రాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఈ సరికొత్త యంత్రం ద్వారా ఎలా ఓటు వేయాలో తెలుసుకుందాం. వీవీప్యాట్ ద్వారా ఓటు వేసే విధానం పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగానే అక్కడ ఓటింగ్ కోసం మూడు యంత్రాలు కనిపిస్తాయి. అవన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. పోలింగ్ అధికారి తన వద్ద ఉండే కంట్రోల్ యూనిట్ ద్వారా మనల్ని ఓటింగ్‌కు అనుమతిస్తారు. అధికారులు చెప్పిన తర్వాత మనం ఓటు వేయడానికి బ్యాలెట్ యూనిట్ ఉంచిన బూత్‌లోకి వెళ్లాలి. బ్యాలెట్ యూనిట్ మీద అభ్యర్థులకు సంబంధించిన పార్టీల గుర్తులు ఉంటాయి. మనం మొదటగా బ్యాలెట్ యూనిట్లో మనకు నచ్చిన గుర్తుకు ఓటు వేస్తాం. ఎవరూ నచ్చకపోతే ‘నోటా’ బటన్‌పై క్లిక్ చేస్తాం. మనం ఓటు వేసిన వెంటనే ఏ అభ్యర్థికి ఓటు వేశామో.. ఆ అభ్యర్థికి సంబంధించిన గుర్తు ముద్రించిన కాగితం ఒకటి వీవీప్యాట్ యంత్రానికి అమర్చిన అద్దం వెనకాల కనిపిస్తుంది. ఇది 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. దానిని పరిశీలించి మనం ఎంచుకున్న అభ్యర్థికే ఓటు పడిందా, లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఈ విధానంలో ఏ గుర్తుకు ఓటు వేశామో అక్కడికక్కడే కచ్చితంగా ధ్రువీకరించుకోవచ్చు. వీవీప్యాట్‌తో ఓటు వీవీప్యాట్‌లో కనిపించిన కాగితం ముక్క 7 సెకన్ల అనంతరం.. యంత్రం అడుగు భాగంలో అమర్చిన బాక్సులోకి వెళ్లిపోతుంది. అది ఇక బయటకిరాదు. దీంతో మన ఓటు ప్రక్రియ ముగిసినట్లు. యంత్రం పనితీరుపై అభ్యర్థి ఎప్పుడైనా అనుమానం వ్యక్తం చేస్తే ఆ కాగితపు ముక్కలను పరిశీలించి, లెక్కించే సౌలభ్యం ఉండటం ఈ సరికొత్త ఓటింగ్ విధానం ప్రత్యేకత. -
పంచాయతీకి సై
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పాలక వర్గాల పదవీ కాలం త్వరలోనే ముగియనుండగా.. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఎన్నికల సిబ్బందికి సంబంధించిన సమాచారం కోరిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అందుకు తగిన కసరత్తు చేస్తోంది. గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం జూలైతో ముగియనుంది. వీటికి ముందస్తుగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండటంతో ఆ ప్రక్రియను ఇప్పటి నుంచే ప్రారంభించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు నెలల క్రితమే ఆయా జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా సర్వం సిద్ధంగా ఉండాలని సూచించింది. దీంతో పంచాయతీ అధికారులు అప్పటి నుంచే ఎన్నికల నిర్వహణ వ్యవహారంపై దృష్టి సారించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే కేబినెట్ మంత్రులతో సబ్ కమిటీ వేసింది. ఈ కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉండటంతో ఈలోపు ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయి ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండేందుకు ఉన్నతాధికారులు జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. దశలవారీ ఎన్నికలపై కసరత్తు జిల్లాలోని 427 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ప్రభుత్వం తండాలను జీపీలుగా చేయాలని భావిస్తుండటంతో జిల్లాలో మరో 173 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడే అవకాశం ఉంది. వీటన్నింటికీ దశలవారీగా ఎన్నికలు నిర్వహించేందుకు, ఇందుకోసం చేయా ల్సిన ఏర్పాట్లపై పంచాయతీ అధికారులు రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం ఉన్న పోలింగ్ స్టేషన్లు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడితే ఎక్కడ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి.. అనే అంశంపై కసరత్తు ప్రారంభించారు. ఎన్నికలు బ్యా లెట్ పద్ధతిలో నిర్వహించాలని ప్రభు త్వం ఇప్పటికే నిర్ణయించడంతోపాటు ఏయే జిల్లాకు ఎక్కడి నుంచి బ్యాలెట్ బాక్సులు తేవాలో రాష్ట్ర ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఎన్నికలు నిర్వహించేందుకు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, సరిగుప్ప జిల్లాలోని తొమ్మిది తాలూ కాల నుంచి 3,506 బ్యాలెట్ బాక్సులను తెచ్చుకోవాలని, ఇందుకు అవసరమైన రవాణా, ఇతర ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ఉన్నతాధికారు లు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. వీటితోపాటు జిల్లాలో 427 గ్రామ పంచాయతీల పరిధిలో 4,320 వారు ్డలు ఉన్నాయి. వీటి లో ప్రతి వార్డుకు ఎన్నిక నిర్వహించా ల్సి ఉండటంతో ఆయావార్డుల ఆధారంగా పోలింగ్ సిబ్బంది నియామకానికి సైతం ఎన్నిక ల కమిషన్ ఇప్పటికే జిల్లా అధికారులను వివిధ ప్రభు త్వ శాఖల అధికారులు, ఉద్యోగుల జాబితాను కోరింది. దీంతో జిల్లా పంచా యతీ అధికారులు 52 ప్రభుత్వ శాఖల కు చెందిన అధికారులు, ఉద్యోగుల వి వరాలను సమర్పించారు. ప్రతి పోలి ంగ్ స్టేషన్‌కు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ క్లర్క్‌లు విధులు నిర్వ హించాల్సి ఉంటుంది. వీటితోపాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులనుపెద్ద ఎత్తున తరలించనున్నారు. కొత్త పంచాయతీలకూ.. ప్రభుత్వం తండాలను, ఇతర ప్రాంతాలను కూడా పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది. దీంతో కొత్తగా 173 కొత్త పంచాయతీలుగా ఏర్పడేందుకు అవకాశం ఉంది. వీటిలో 1,222 వార్డులుగా ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం డివిజన్ పరిధిలో 14 మండలాలు ఉన్నాయి. వీటిలో 311 గ్రామ పంచాయతీలు 3,144 వార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా కొత్తగా 121 గ్రామ పంచాయతీలు, 848 వార్డులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. కల్లూరు డివిజన్ పరిధిలో మొత్తం 6 మండలాలున్నాయి. వీటిలో 116 గ్రామ పంచాయతీలు, 1,176 వార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా కొత్తగా 52 గ్రామ పంచాయతీలు, 374 వార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. అయితే కొత్తగా ఏర్పడనున్న గ్రామ పంచాయతీల్లో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. -
పోలింగ్ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి – నెల్లూరు: జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌కేంద్రాల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రం బయట, లోపల అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయడం కోసం జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ వెబ్ కెమెరాలను ఏర్పాటు చేయించారు. 852 ఓట్లకు గాను 851కి పోలయ్యాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ప్రభావం జిల్లా ఎన్ని కల అధికారుల మీద కూడా పడింది. పోలింగ్ సందర్భంగా చిన్న పాటి ఘర్షణలు, వివాదాలు కూడా చెలరేగకుండా ఉండటం కోసం జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పోలింగ్ సిబ్బంది ఎవరూ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయకుండా ఉండేం దుకు తగిన ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఆధ్వర్యంలో పోలీసు శాఖ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరం వరకు ఇతరులను అనుమతించలేదు. పోలింగ్ కేంద్రం బయట ఓటర్లను తనిఖీ చేసి మొబైల్ ఫోన్లు, పెన్నులు, ఇతర వస్తువులు లోనికి అనుమతించలేదు. గ్రూపుల వారీగా ఓటింగ్ ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఉద యం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అధి కార, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు గ్రూపులుగా వచ్చి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాయుడుపేట, గూడూ రు, కావలి, ఆత్మకూరు కేంద్రాల్లో మధ్యాహ్నం 2గంటలకే పోలింగ్ ముగిసింది. నెల్లూరు కేంద్రంలో కొడవలూరు మండలం కొత్త వంగళ్లు స్వతంత్ర ఎంపీటీసీ వెంకట కృష్ణయ్య కోసం సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగించినా, ఆయన ఓటు వేయడానికి రాలేదు. గూడూరులో స్వల్ప ఉద్రిక్తత గూడూరులో టీడీపీ శ్రేణులు జై చంద్రబాబు అంటూ నినాదాలు చేయడంతో ప్రతిగా వైఎస్సార్పీ వర్గీయులు జైజగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని నెట్టివేశారు. ఓటేసిన ప్రముఖులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రముఖులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరులో ఓటేశారు. తిరుపతి ఎంపీ వరప్రసాదరావు, గూడూ రు, వెంకటగిరి ఎమ్మెల్యేలు పాశం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ గూడూరు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయుడుపేటలోను, ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆత్మకూరులో ఓటు వేశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కావలిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా.. ఉదయగిరి, సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు లేక పోవడంతో ఆ నియోజక వర్గాల ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికల్లో ఓటు లేదు. 20న ఓట్ల లెక్కింపు ఐదు రెవిన్యూ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులు శుక్రవారం సాయంత్రానికి నెల్లూరు ఎంపీడీవో కార్యాలయానికి చేరాయి. ఇక్కడ ఏర్పా టు చేసిన స్ట్రాంగ్ రూంలో వీటిని భద్రపరచి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్సులు తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. పోలైన 851 ఓట్లలో చెల్లనివి తీసేసి మిగిలిన ఓట్లలో పోటీలోని ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరికి సగం వచ్చి ఉంటే మధ్యాహ్నం 12 గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలా కాక పోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తుం దని ఈ పరిస్థితి ఏర్పడితే మాత్రం తుది ఫలితం సాయంత్రం 4 గంటలకు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఎన్నికల విధుల్లో స్కూలు బస్సులు
అందుబాటులో సుమారు 1000 వాహనాలు * రెండు రోజుల పాటు ఆర్టీసీ ఆధీనంలోనే... * 13వ తేదీనుంచే దీపావళి సెలవులు ప్రకటించిన ఎక్కువ శాతం స్కూళ్లు సాక్షి, ముంబై: ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులను ఆయా ప్రాంతాలకు చేరవేసేందుకు దాదాపు 1,000 పాఠశాల బస్సులను ఉపయోగించనున్నారు. ఈ బస్సుల్లో దాదాపు 70 శాతం ప్రభుత్వ ఉద్యోగులను మంగళ, బుధవారాల్లో విధులకు చేరవేయనున్నారు. సిబ్బందిని చేరవేసే బాధ్యతను వారికి రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ అప్పగించింది. ఈ బస్సుల్లో బ్యాలెట్ బాక్సులు, పత్రాలతోపాటు ఓటింగ్‌కు అవసరమున్న ఇతర సామగ్రి స్టాంపులు, ఇంక్‌లు కూడా తరలించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దీంతో నగరంలోని అన్ని పాఠశాలలు ఈ నెల 15 తేదీన బంద్ చేయగా కొన్ని పాఠశాలలు మాత్రమే 14వ తేదీన నడువనున్నట్లు అధికారి తెలిపారు. అంతేకాకుండా కొన్ని పాఠశాలలు ఆ రోజు పరీక్షలను కూడా నిర్వహిస్తున్నాయన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఒక్క రోజు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు మరో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఆర్టీవో అధికారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల విధుల కోసం బస్సులను అందించాల్సిందిగా ఈ నెల 9వ తేదీన అన్ని పాఠశాలలు అదేవిధంగా స్కూల్ బస్ అసోసియేషన్లకు సర్క్యూలర్ జారీ చేశామన్నారు. అద్దె స్కూల్ బస్సులే కాకుండా పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సులను కూడా ఎన్నికల నిమిత్తం అందించాలని కోరామన్నారు. కాగా ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి బస్సులు విద్యార్థుల కోసం అందుబాటులో ఉండవని అధికారి ఒకరు తేల్చి చెప్పారు. అంతేకాకుండా కొన్ని స్టేట్ బోర్డ్ పాఠశాలలను కూడా ఓటింగ్ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారన్నారు. దీంతో 14వ తేదీన కూడా కొన్ని పాఠశాలలను బంద్ చేయనున్నారు. అయితే కొన్ని పాఠశాలలు ఈ నెల 13వ తేదీ నుంచి దీపావళి సెలవులను ప్రకటించాయి. ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ కి చెందిన కొన్ని పాఠశాలలు మిడ్ టర్మ్ పరీక్షలను ఇంతకు ముందే పూర్తి చేశాయి. ప్రస్తుతం బోధనా క్లాసులను నిర్వహిస్తున్నారు. బస్సుల కొరత వల్ల తాము పాఠశాలలను మూసి ఉంచబోమని అంధేరిలోని రాజ్‌హన్స్ విద్యాలయ ప్రిన్సిపల్ దీప్షిక శ్రీవాస్తవ్ తెలిపారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు తమ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సహకరిస్తారని చెప్పారు. వారు తమ పిల్లలనుపాఠశాలలకు పంపించేందుకు ప్రత్నామ్నాయం చూసుకుంటారని తెలిపారు. ఇదిలా ఉండగా, కానీ కొన్ని స్టేట్ బోర్ట్ పాఠశాలలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. 14వ తేదీన బస్సులు నడవవని ముందే సమాచారం ఉన్నందున తాము 9వ, 10వ తరగతులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎస్వీపీ స్కూల్ ప్రిన్సిపల్ సంగీత శ్రీవాస్తవ్ తెలిపారు. దీంతో తాము ఇతర రవాణాను చూసుకోవాల్సిందిగా తల్లిదండ్రులు కోరామన్నారు. అయితే చిన్న పిల్లలకు మాత్రం సెలవు ప్రకటించినట్లు శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. -
బ్యాలెట్ కోసం ఆందోళన
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ విధానం ప్రవేశ పెట్టాలన్న నినాదంతో పీఎంకే ఆందోళనకు శ్రీకారం చుట్టింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతృత్వంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహిం చారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని నాయకులను కలుపుకుని ఉద్యమాన్ని చేపట్టబోతున్నట్టు రాందా సు ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నామని తెలిపారు. ఈవీ ఎంలపై నమ్మశక్యం లేదని బ్యాలెట్ పద్ధతిని మళ్లీ అమల్లోకి తీసుకురావాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉదయాన్నే ఆయా జిల్లాల్లోని ఎన్నికల అధికారుల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. చెన్నై వళ్లువర్ కోట్టం వద్ద పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, అధ్యక్షుడు జికే మణి, సీనియర్ నేత ఏకే మూర్తిల నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. బ్యాలెట్ విధానం కోసం పట్టుబడుతూ నినాదాలతో నిరసన కారులు హోరెత్తించారు. ఈవీఎంలలో చోటు చే సుకుంటున్న అవకతవకలను ఎత్తి చూపుతూ నిరసన వ్యక్తం చేశారు.ఉద్యమం: ఈ నిరసనలో రాందాసు ప్రసంగిస్తూ, ఈవీఎంలలో భారీ అవకతవకలు జరిగేందుకు ఆస్కారం ఉందని ఆరోపించారు. ప్రపంచ దేశాలు ఈవీఎంలను వ్యతిరేకిస్తుంటే, భారత దేశంలో మాత్రం అమలు చేయడం అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. అమెరికా, జర్మనీ దేశాలు ఈవీఎంలను పక్కన పెట్టి మరలా బ్యాలెట్ పద్ధతిని అనుసరిస్తున్నాయని, దీన్ని పరిగణనలోకి తీసుకుని దేశంలో మళ్లీ బ్యాలెట్ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం జయలలిత 2001లో కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు వరుస విజయాలతో ఈవీఎంలను ఆమె ఆహ్వానించడం అనుమానాలకు తావిస్తున్నదన్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమానికి పీఎంకే శ్రీకారం చుడుతుందని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. తమిళనాడులో జరిగిన లోక్ సభ ఎన్నికలపై సీబీఐ విచారణ చేపట్టాలన్న డిమాండ్‌తో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేయనున్నామని ప్రకటించారు. -
స్ట్రాంగ్ రూముల్లో ‘స్థానిక’ బ్యాలెట్లు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముగిసినప్పటికీ లెక్కింపును కోర్టు వాయిదా వేయడంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూముల వద్ద కట్టు దిట్టమైన భద్రతతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఈ నెల 6వ తేదీన భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, 11వ తేదీన ఖమ్మం డివిజన్ల లో ఎన్నికలు నిర్వహించిన విషయం విది తమే. ఎన్నికల అనంతరం భద్రాచలం రెవె న్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల బ్యాలెట్ బాక్సులను భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపరిచారు. పాల్వంచ డివిజన్లోని మూడు మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను మణుగూరులోని స్త్రీ శక్తిభవనంలో, మరో మూడు మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను పాల్వంచలోని కేఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో భద్రపరిచారు. కొత్తగూడెం డివిజన్లోని ఆరు మండలాలకు చెందిన బ్యా లెట్ బాక్సులను పాత ఇల్లెందులోని సింగరేణి ఉన్నత పాఠశాలలో భద్రపరిచారు. మరో ఐదు మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో భద్రపరిచారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో పాల్వం చ డివిజన్లోని దమ్మపేట, అశ్వారావుపేట మండలాలు, ఖమ్మం డివిజన్లోని నాలుగు మండలాల బ్యాలెట్ బాక్సులను భద్రపరి చారు. మిగిలిన ఖమ్మం డివిజన్లోని 13 మండలాల బ్యాలెట్ బాక్సులను కొణిజర్ల మండలంలోని తనికెళ్ల గ్రేస్ జూనియర్ కళాశాలలో భద్రపరిచారు. వచ్చే నెల 12, 15 తేదీల్లో ఓట్లను లెక్కించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులకు తప్పని ఎదురు చూపులు.. ఇప్పటికే ఎన్నికలు ముగిసి 12 గడుస్తుండడం, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లెక్కింపును కోర్టు వాయిదా వేయడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. -
స్ట్రాంగ్ భద్రత
అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ :ప్రాదేశిక పోరులో ఓటరు తీర్పును దాదాపు నెల రోజుల పాటు కాపు కాసేందుకు పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్యాలట్ బాక్సులు భద్రపరిచిన ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. 40 మంది సాయుధ పోలీసులు పహారా కాస్తున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు వరకు బ్యాలట్ బాక్సులను భద్రపరచనున్నారు.అమలాపురం, రామచంద్రపురం, రంపచోడవరం డివిజన్లలో రెండు విడతలో శుక్రవారం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బ్యాలట్ బాక్సులను పోలీసు బందోబస్తు నడుమ ఆయా ప్రాంతాల నుంచి స్ట్రాంగ్ రూంలకు తరలించారు. అమలాపురం డివిజన్లోని బ్యాలట్ బాక్సులను అమలాపురం కిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల, పరంజ్యోతి పబ్లిక్ స్కూల్లోని స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచారు. రామచంద్రపురం డివిజన్లోని 8 మండలాలకు సంబంధించిన బ్యాలట్ బాక్సులను వీఎస్ఎం కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో, రంపచోడవరం డివిజన్లోని 7 మండలాల బ్యాలట్ బాక్సులను బొర్నగూడెంలోని స్ట్రాంగ్ రూంకు తరలించారు. అమలాపురం డివిజన్లోని అల్లవరం, రాజోలు, అమలాపురం, ఉప్పలగుప్తం, మామిడికుదురు, మలికిపురం, కాట్రేనికోన, సఖినేటిపల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల బ్యాలట్ బాక్సులను మండలానికి ఓ గది చొప్పున కిమ్స్‌లోని స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచారు. పరంజ్యోతి పబ్లిక్ స్కూల్లో పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల బ్యాలట్ బాక్సులను ఉంచారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ రెండు కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూంలకు ఆయా మండలాల ఆర్ఓలు, ఏఆర్‌ఓల సమక్షంలో అమలాపురం రూరల్ సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, పట్టణ సీఐ సీహెచ్ శ్రీనివాసబాబు సీలు వేశారు. సాయుధ బలగాలతో 24గంటల భద్రత అమలాపురంలోని కిమ్స్ కళాశాల, పరంజ్యోతి స్కూల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఆయా విద్యా సంస్థల సిబ్బందిని కూడా రావద్దని ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాంగ్ రూంలకు రిజర్వ్ సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విడతల వారీగా షిఫ్ట్‌కు 20 మంది చొప్పున 24 గంటలూ భద్రత కల్పిస్తున్నారు. అమలాపురం డీఎస్పీ ఎం.వీరారెడ్డి, సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో రంపచోడవరంలోని బొర్నగూడెం స్ట్రాంగ్ రూంకు అదనంగా 15 మంది భద్రత సిబ్బందిని ఎన్నికల అధికారులు కేటాయించారు. -
పోలింగుకు రెడీ
నేడు రెండో విడత ‘స్థానిక’ సమరం పూర్తికానున్న ఎన్నికలు 29 జెడ్పీటీసీ స్థానాలకు 153 మంది, 470 ఎంపీటీసీ స్థానాలకు 1779 మంది బరిలో ఎన్నికల విధులకు 8227 మంది సిబ్బంది 317 సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలు శుక్రవారం జరుగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈ విడతలో మొత్తం 8,227 సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. దీంతో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగియనున్నాయి. ఈ నెల 6వతేదీన మొదటి విడత ముగిసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సిబ్బంది లాంటి సౌకర్యాలను అధికారులు గురువారం రాత్రి సమకూర్చారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ముగ్గురు పోలింగ్ క్లర్క్స్ ఉంటారు. 1932 మంది బరిలో... రెండో విడతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు మొత్తం 1932 మంది బరిలో ఉన్నారు. ఇందులో 29 జెడ్పీటీసీ స్థానాలకు 153 మంది, 470 ఎంపీటీసీ స్థానాలకు 1779 మంది బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈనెల 11వ తేదిన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 11,31,903 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు... రెండో విడతలో 11,31,903 మంది తమ ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. ఇందులో 5,64,080 పురుష ఓటర్లు, 5,67,750 మహిళ ఓటర్లు, 73 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక... రెండు విడుతలకు మొత్తం 1577 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మొత్తం 173 కేంద్రాల్లో 1577 పీఎస్‌లు ఉంటాయి. జిల్లాలో తొలి, మలి విడతలకు కలిపి 3,020 పీఎస్‌లను ఉన్నాయి. ఇందులో 1577 ప్రిసైడింగ్ ఆఫీసర్లకు తోడుగా ప్రతీ మండలానికి అవసరాన్ని బట్టి 5, 6 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లను అదనంగా నియమించారు. రెండో విడతకు 1577 మంది పీఓలు, 1577 మంది ఏపీఓలు, 4,725 మందిని పోలింగ్ క్లర్క్స్ ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. కేంద్రాలు ఎంపిక... ఈ విడతలో మొత్తం 29 మండలాల్లో జరుగుతాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట్ డివిజన్లలో ఎన్నికలు జరుగనున్నాయి. మహబూబ్‌నగర్ డివిజన్లోని మండలాలు అడ్డాకుల, ఫరూక్నగర్, బాల్నగర్, భూత్పూర్, హన్వాడ, జడ్చర్ల, నారాయణపేట మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్‌కాలేజీలో భద్ర పరుస్తారు. కోయిల్‌కొండ, కొందుర్గు, కొత్తూరు, మహబూబ్‌నగర్ మండలాలకు చెందిన బాక్సులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌కాలేజీలో, మిడ్జిల్ మండలానికి చెందిన బాక్సులను సీబీఎం కాలేజి కల్వకుర్తిలో భద్ర పరుస్తారు. నారాయణపేట డివిజన్లోని మండలాలు ఆత్మకూరు, బొంరాస్‌పేట్, సీసికుంట, దామరగిద్ద, దేవరకద్ర, ధన్వాడ, దౌల్తాబాద్, కోయిలకొండ,కోసిగి. మద్దూర్, మాగనూర్, మక్తల్, నారాయణపేట, నర్వ, ఊట్కూర్ మండలాల కు చెందిన పెట్టెలను శ్రీదత్త బీఈడీ కాలేజీ నారాయణపేట్‌లో, కొత్తకోటకు చెందిన బాక్సులు వనపర్తి కేడీఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో భద్ర పరుస్తారు. సమస్యాత్మక గ్రామాలు గుర్తింపు... ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికలకు ఆటకం కల్గించే గ్రామాలను ఇప్పటికే గుర్తించారు. ఇలా గుర్తించిన లిస్టును పోలీస్ శాఖకు అందజేశారు. సమస్యాత్మ గ్రామాలతో పాటు పోలింగ్ స్టేషన్లను కూడా గుర్తించారు.జిల్లాలో మొత్తం 317 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. ఇందులో 217 సమస్యాత్మక గ్రామాల్లో 217 మంది మైక్రో అబ్జర్వర్లు నిరంతం పర్యవేక్షించనున్నారు. వంద పీఎస్‌లలో వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతరం ఇంజనీరింగ్ విద్యార్థులు పర్యవేక్షిస్తారు. రెండో విడుత జరిగే ఎన్నికలల్లో దామరగిద్ద, కేశంపేట మండలాల్లో అత్యధికంగా 20 గ్రామాలను గుర్తించారు. తర్వాత నవాబ్‌పేట్ మండలంలో 18 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. అత్యల్పంగా దౌలతబాద్లో 3 గ్రామాలను గుర్తించారు. బ్యాలెట్ బాక్సులు రెడీ... ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుండడంతో బ్యాలెట్ బ్యాక్స్‌ల అవసరం పడింది. గత సంవత్సరం సర్పంచ్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించారు. 1577 పీఎస్‌లకు గాను 3154 బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే సరఫరా చేశారు. వీటికి అదనంగా మరో 10 శాతం బాక్సులను అందుబాటులో ఉంచారు. తాయిలాలతో అభ్యర్థులు... ఓటింగ్ కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠత నెలకొంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవటానికి అభ్యర్థులు రంగంలోనికి దిగారు. మద్యం బాటిళ్లు, డబ్బు సంచులతో మోహరించారని సమాచారం. ఇప్పటికే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా కుల దేవతల ఆలయాల నిర్మాణాలు, శశ్మాన వాటికలు ఏర్పాటు వంటిపై పలు గ్రామాల్లో ఓటర్లుకు హామీలు ఇవ్వడంతోపాటు ఆయ్యే తాయిలాలు లెక్కించి అడ్వాన్సులు ముట్టచెప్పినట్లు ప్రచారంలో ఉంది. ఓటుకు రూ. 300 వందల నుంచి రూ.అయిదు వందల వరకు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. -
తుది పోరు
సాక్షి, కడప : స్థానిక తుది పోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం జరిగే పోలింగ్‌కుగాను సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది, పోలీసులు గురువారం సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. శాంతిభద్రతల పరంగా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలింగ్ జరిగే ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఎన్నికలు జరిగే జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాలు సమస్యాత్మకం, కీలకం కావడంతో పోలీసులు విసృ్తత బందోబస్తును ఏర్పాటు చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులు ఎలాగైనా గెలవాలనే కృతనిశ్చయంతో మంచినీళ్లప్రాయంగా డబ్బులను ఖర్చు చేశారు. మద్యంను విచ్చలవిడిగా పంపిణీ చేశారు. కమలాపురం నియోజకవర్గంలోని చిన్నపుత్త, దేవరాజుపల్లె, మాచిరెడ్డిపల్లె, కోగటం వంటి గామాల్లో ఓ పార్టీ దౌర్జన్యం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేట్ సైన్యాలను మోహరిస్తున్నట్లు సమాచారం. జమ్మలమడుగు ప్రాంతంలోని కొన్ని ఎంపీటీసీ స్థానాల పరిధిలో వైఎస్ఆర్సీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుండగా, మరికొన్నిచోట్ల ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. పులివెందుల నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్సీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశముంది. ప్రొద్దుటూరు పరిధిలో కొన్ని ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్నాయి. మొత్తం రెండో విడతలో 227 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇందులో 18 స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 209 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 16 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రలోభాలు గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఎలాగోలా ప్రసన్నం చేసుకునేందుకు బరిలో ఉన్న అభ్యర్థులు తుది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓటర్లతో బేరసారాలు సాగిస్తున్నారు. తాయిలాలను ఎరగా చూపుతున్నారు. కొన్నిచోట్ల ఓటర్లను గుంపగుత్తగా కొనేస్తున్నారు. దీనికితోడు రకరకాల హామీలు ఇచ్చి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. గురువారం రాత్రి భారీగా డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు కూడా ఓటర్లను ఎలాగోలా మభ్యపెట్టేందుకు తమ ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. -
తుది సమరం
ప్రాదేశిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత మారుమూల గూడేలకు గుర్రాలపై బ్యాలెట్‌బాక్సుల తరలింపు విశాఖ రూరల్/పాడేరు, న్యూస్‌లైన్ : మలి విడత ప్రాదేశిక సమరానికి రంగం సిద్ధమైంది. మన్యంలోని మారుమూల గూడేలకు బ్యాలెట్బాక్సులు, పోలింగ్ సిబ్బంది తరలింపునకు అధికారులు అష్టకష్టాలు పడ్డారు. పెదబయలు మండలం ఇంజరి సెగ్మెంట్లోని చీకుపనస, ఇంజరి కేంద్రాలకు ఎన్నికల సామగ్రి,సిబ్బందిని చేరవేసేందుకు గుర్రాలను ఆశ్రయించారు. స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో అంతటా భయానక వాతావరణం నెలకొంది. 17 మండలాల్లో 38 సమస్యాత్మక,73 అత్యంత సమస్యాత్మక, 189 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 572 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రత చర్యలు చేపట్టారు. కొయ్యూరు మండలం యు.చీడిపాలెం, బూదరాళ్ళ, జీకేవీధి మండలం గుమ్మరేవుల, గాలికొండ, జర్రెల, వంచెల, దేవరాపల్లి, పెదవలస, చింతపల్లి మండలం కుడుముసారి, తమ్మెంగుల, జి.మాడుగుల మండలం లువ్వాసింగి, కోరాపల్లి, బీరం, బొయితిలి, పెదబయలు మండలం ఇంజరి, జామిగుడ, బొంగరం, ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు, కుమడ, లక్ష్మిపురం, రంగబయలు, బుంగాపుట్టు వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు బ్యాలట్ పత్రాలు, బాక్సుల తరలింపు కత్తిమీద సామైంది. చాలా మంది సిబ్బంది కాలినడకనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఏర్పాట్లు పూర్తి : 17 జెడ్పీటీసీ, 273 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జెడ్పీటీసీ స్థానాలకు 100 మంది, ఎంపీటీసీలకు 1062 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 6,84,825 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 3,33,545 మంది పురుషులు, 3,51,279 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తం 795 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1624 బ్యాలెట్ బాక్సులను వినియోస్తున్నారు. ఎన్నిల నిర్వహణకు 874 మంది పీవో, 874 మంది ఏపీవో, 2620 మంది వోపీవో మొత్తంగా 4368 మంది సిబ్బందిని నియమించారు. వీరు గురువారం మధ్యాహ్నం ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. వారి కోసం అధికారులు ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. 29 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ : సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సరళిని జిల్లా కేంద్రం నుంచి స్వయంగా పర్యవేక్షించేందుకు 29 కేంద్రాల్లో ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అలాగే ఇంటర్నెట్ సదుపాయం లేని 519 కేంద్రాల్లో పోలింగ్‌ను వీడియో తీసేందుకు వీడియోగ్రఫర్లను, స్టాటిక్ ఫోర్స్‌ను నియమించారు. 41 కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లతో ప్రశాంతం వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నారు. రెవెన్యూ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్‌లు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు మే 7వ తేదీ తరువాత జరగనుంది. దీంతో అప్పటి వరకు బ్యాలెట్ బాక్సులను రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో భద్రపరచాలని అధికారులు నిర్ణయించారు. పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఆయా మండలాల రిసెప్షన్ సెంటర్‌కు తీసుకువచ్చి అక్కడ నుంచి పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తారు. అనకాపల్లి డివిజన్‌కు ఏఎంఏఎల్ కాలేజీలోను, నర్సీపట్నం డివిజన్‌తో పాటు పాడేరులో మూడు మండలాల బ్యాలెట్ బాక్సులను నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోను, పాడేరులో మిగిలిన 8 మండలాలకు సంబంధించి పాడేరు ప్రభుత్వ డిగ్రీకాలేజీలో స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. -
పోలింగే తరువారు
ముగిసిన ‘పరిషత్’ ప్రచార ఘట్టం 24 మండలాల్లో రేపు పోలింగ్ జెడ్పీటీసీ పదవులకు 87మంది, ఎంపీటీసీ పదవులకు 1,180 మంది అభ్యర్థులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం ప్రలోభాల పర్వానికి తెర సాక్షి, ఏలూరు: రెండో విడతలో పోలింగ్ నిర్వహించే జిల్లా పరిషత్, మం డల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. యం త్రాగం పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమైంది. కొవ్వూరు, నిడదవోలు, ఆచం ట, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, ఉండి, గోపాలపురం నియోజకవర్గాల్లోని 24 మండలాల్లో శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్నారు. హోరాహోరీ పోరు మలి విడత పోరు హోరాహోరీగా జరగనుంది. మొత్తం 24 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, 87మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 473 ఎంపీటీసీ స్థానాల్లో 21 స్థానాలు ఏకగ్రీవమయ్యా యి. మిగిలిన 452 స్థానాలకు 1,180 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పో లింగ్ కోసం 2,721 చిన్నతరహా, 625 మధ్యతరహా, 958 పెద్ద బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలను ఎన్నుకునేందుకు వీలుగా మొత్తంగా 27లక్షల 400 బ్యాలెట్ పేప ర్లు (పోస్టల్ బ్యాలెట్లతో కలిపి) వాడుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లో 7,170 మం ది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘట నలు తలెత్తినా, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు చోటుచేసుకున్నా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 08812 232351 నంబర్‌కు లేదా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1365కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిద్ధార్థజైన్ ఓటర్లకు సూచించారు. పోలింగ్ నిర్వహించే మండలాలివీ కొవ్వూరు డివిజన్ పరిధిలోని కొవ్వూరు, దేవరపల్లి, తాళ్లపూడి, నిడదవోలు, చాగ ల్లు, తణుకు, పెరవలి, ఉండ్రాజవరం, అత్తిలి, పెనుగొండ, ఇరగవరం, పెనుమంట్ర, నరసాపురం డివిజన్ పరిధిలోని నరసాపురం, మొగల్తూరు, పాల కొల్లు, యలమంచిలి, పోడూరు, ఆచం ట, భీమవరం, ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, వీరవాసరం మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పోలింగ్ జరగనుంది. తాయిలాల వల ప్రచారం ముగియడంతో ప్రలోభాల వల వేసేందుకు పలువురు అభ్యర్థులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. తొలి విడత పోలింగ్ సందర్భంగా ఓటర్లకు రూ.300 నుంచి రూ.వెరు్య వరకూ నగదు పం పిణీ చేసిన నేతలు ఈ విడతలోనూ పం పకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈసారి కూడా అదే స్థాయిలో నగదు పం పిణీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచా రం. కొన్నిచోట్ల ఓటుకు ఎంతైనా ఇచ్చేం దుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రహస్య ప్రదేశాల్లో మద్యం నిల్వ చేసినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల బహుమతులు ఇచ్చేందుకు కూడా ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. ప్రలోభాల పర్వా న్ని అడ్డుకునేందుకు పక్కా ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కొంటున్నారు. -
బ్యాలెట్ బాక్సులు భద్రం: డీజీపీ
హైదరాబాద్ : జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ బి.ప్రసాదరావు ఆదివారం ఆదేశించారు. తొలి దశలో 543 మండలాల్లో జెడ్పీటీసీలు, ఎనిమిది వేల ఎంపీటీసీలకు పోలింగ్ ఈ రోజు ముగిసింది. మలి విడత పోలింగ్ ఈనెల 11న జరగనుంది. పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను నిర్ణీత మండల కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చడంతో పాటు వాటిని కౌంటింగ్ జరిపే తేదీ వరకు భద్రంగా ఉంచడానికి అవసరమైన చర్యలన్నింటినీ ఎస్పీలు, డీఎస్పీలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. తొలి దశ పోలింగ్ ముగిశాక తాజా పరిస్థితిని ఆయన శాంతి భద్రతల విభాగం అదనపు డీ జీ వి.ఎస్.కె కౌముది, ఇంటెలిజెన్సీ అదనపు డీజీ ఎం.మహేందర్‌రెడ్డిలతో ఇక్కడ సమీక్షించారు. -
‘పరిషత్’ తొలి పోరుకు సర్వం సిద్ధం
ఇందూరు, న్యూస్‌లైన్ : ఈనెల 6న ఆదివారం జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో మొదటి విడతగా 18 మండలాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అధికార యం త్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. పోలీసు బందోబస్తుతో పాటు, సూక్ష్మ పరిశీలకులు, ఇతర అధికారుల నియామ కం పూర్తయింది. ఏడు లక్షల ఓటర్లు... తొలి విడత జరిగే 18 మండలాల్లో మొత్తంగా 7,28, 809 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,51,559 మంది పురుష ఓటర్లు, 3,77,207 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 43 మంది ఉన్నారు. వీరు ఓటుహక్కును వినియోగించుకోవడానికి ఎలాంటి ఇబ్బందు లు లేకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటరు జాబితాతో సహ పోలింగ్ సామగ్రిని మొత్తం సంబంధిత మండలాలకు పంపించారు. జడ్పీటీసీ బరిలో 92 మంది... జడ్పీటీసీ స్థానాలకు 92మంది అభ్యర్థులు, 298 ఎంపీటీసీ స్థానాలకు గాను 1,105 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బాన్సువాడలో 52, బీర్కూర్ 47, బిచ్కుంద 53, బోధన్ 61, ధర్పల్లి 39, డిచ్పల్లి 61, జక్రాన్‌పల్లి 37, జుక్కల్ 53, కోటగిరి 53, మద్నూరు 57, మాక్లూర్ 51, నవీపేట్ 52, నిజామాబాద్ 91, నిజాంసాగర్ 33, రెంజల్ 33, వర్ని 59, ఎడపల్లిలో 35 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 18 మండలాల్లో 911 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు వెయ్యి కన్నా తక్కువ ఉంటే రెండు, అంత కన్నా ఎక్కువగా ఎక్కువగా ఉంటే మూడు బ్యాలెట్ బాక్సులను, మొత్తంగా 1,850 వరకు బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఎన్నికల సిబ్బంది నియామకం... ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్, ఇద్దరు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను నియమించగా, ఒక్కో పోలింగ్ కేంద్రానికి ముగ్గురు చొప్పున మొత్తం 2,733 మంది పోలింగ్ అధికారులను నియమించారు.ఒక్కో లైజన్ అధికారి చొప్పున 18 మందిని, రూట్ అధికారులను 18 మందిని ఏర్పాటు చేశారు. ప్రతి మండలానికి ఒక రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించగా, మండలానికి ఐదుగురు చొప్పున 90 మంది జోనల్ అధికారులను, 20 మంది సిబ్బందిని నియమించారు. మొత్తం మీద మొదటి విడత ఎన్నికల నిర్వహణకు ఐఐటీ విద్యార్థుల నుంచి సిబ్బంది, అధికారులు కలిపి దాదాపుగా 3,300 మంది విధులు నిర్వర్తించబోతున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కన్ను... మొదటి విడత ఎన్నికలు జరిగే 18 మండలాల్లో 911 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 516 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా, 254 సున్నిత, 242 అతి సున్నిత పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. కాగా 20 పోలింగ్ కేంద్రాలు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అవి మొత్తం ఒక్క నిజామాబాద్ మండలంలోనే ఉండటం గమనార్హం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఏం జరుగుతుందో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చుండి పర్యవేక్షించి తెలుసుకోవడానికి 79 వెబ్ కెమెరాలను ఏర్పాటు చే శారు. వీటిని ఆపరేట్ చేయడానికి పరిజ్ఞానం కలిగిన ఐఐటీ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో 58 మంది వీడియోగ్రాఫర్లను నియమించారు. వీరు నిరంతరాయంగా చిత్రీకరికరిస్తారు. అలాగే పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 142 మంది మైక్రో పరిశీలకులను నియమించారు. జిల్లాకు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ఐఏఎస్ అధికారులు శ్రీదేవి, బి.భారతీ లక్పతి నాయక్‌లతో పాటు, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ వెంకటేశ్వర్రావు ఆయా మండలాల్లో తిరిగి ఎన్నికల తీరును పరిశీలిస్తారు. ఎన్నికల్లో ఎక్కడ సమస్యలు తలెత్తిన అధికారులకు తెలియజేయడానికి ఉద్యోగులకు, ప్రజల కోసం 239003 అనే టోల్ ఫ్రీ నెంబర్‌ను జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. -
జిల్లాకు మరో 3,600 ఈవీఎంలు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: మరో 3,600 ఈవీఎంలు శుక్రవారం జిల్లాకు వచ్చాయి. బెంగళూరుకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ వీటిని ఉత్పత్తి చేసింది. జిల్లాలో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరికొన్ని అనుబంధ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఒకేసారి అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతుండటంతో ఈవీఎంలు ఎక్కువ అవసరమవుతున్నాయి. జిల్లాకు 7,300 కంట్రోల్ యూనిట్లు అవసరం కాగా ఇప్పటి వరకు 6000 వచ్చాయి. ఇంకా 1,300 కంట్రోల్ యూనిట్లు రావాల్సి ఉంది. 9,200 బ్యాలెట్ యూనిట్లు రావాల్సి ఉండ గా, 3,600 వచ్చాయి. ఇంకా 5,600 బ్యాలెట్ యూనిట్లు రావాల్సి ఉంది. మిగిలిన కంట్రోల్ యూనిట్లు, బ్యా లెట్ యూనిట్లు మూడు నాలుగు రో జులలో పూర్తిస్థాయిలో వచ్చే అవకా శం ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బ్యాలెట్ యూనిట్లో తిరస్కరణ ఓటు నోటా బటన్ పెట్టాల్సి రావడంతో ఈవీఎంలను కొత్తగా ఉత్పత్తి చేయాల్సి వచ్చింది. జిల్లాకు వచ్చిన ఈవీఎంలను కలెక్టరేట్ వెనుక ఉన్న సివిల్ సప్లయ్ గోదాములో ఉంచారు. బ్యాలెట్ బాక్సులు వచ్చేశాయ్..! కర్నూలు(అర్బన్): జిల్లాలో ఏప్రిల్ 6, 11 తేదీల్లో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన బ్యాలెట్ బాక్సులు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి వచ్చినట్లు జిల్లా అదనపు ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాకు 2,700 బ్యాలెట్ బాక్సులు అవసరమన్నారు. అయితే ఇప్పటికి 1800 బాక్సులు వచ్చాయని, వీటి లో నంద్యాల డివిజన్‌కు 1000 పంపామని, మిగిలిన 800 బాక్సులను జిల్లా కేంద్రంలోనే ఉంచుతున్నట్లు చెప్పారు. మిగిలిన 900 బాక్సులు కూడా త్వరలో వస్తాయన్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ వేగంగా జరుగుతున్నదని చెప్పారు. ముద్రణ పూర్తైనంబరింగ్ వేసిన బ్యాలెట్ పత్రాలను మండలాల వారీగా సీల్ చేసి పంపుతున్నట్లు తెలిపారు.