పోలింగే తరువారు
ముగిసిన ‘పరిషత్’ ప్రచార ఘట్టం
24 మండలాల్లో రేపు పోలింగ్
జెడ్పీటీసీ పదవులకు
87మంది, ఎంపీటీసీ పదవులకు 1,180 మంది అభ్యర్థులు
ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం
ప్రలోభాల పర్వానికి తెర
సాక్షి, ఏలూరు: రెండో విడతలో పోలింగ్ నిర్వహించే జిల్లా పరిషత్, మం డల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. యం త్రాగం పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమైంది. కొవ్వూరు, నిడదవోలు, ఆచం ట, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, ఉండి, గోపాలపురం నియోజకవర్గాల్లోని 24 మండలాల్లో శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్నారు.
హోరాహోరీ పోరు మలి విడత పోరు హోరాహోరీగా జరగనుంది. మొత్తం 24 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, 87మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 473 ఎంపీటీసీ స్థానాల్లో 21 స్థానాలు ఏకగ్రీవమయ్యా యి. మిగిలిన 452 స్థానాలకు 1,180 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పో లింగ్ కోసం 2,721 చిన్నతరహా, 625 మధ్యతరహా, 958 పెద్ద బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీలను ఎన్నుకునేందుకు వీలుగా మొత్తంగా 27లక్షల 400 బ్యాలెట్ పేప ర్లు (పోస్టల్ బ్యాలెట్లతో కలిపి) వాడుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లో 7,170 మం ది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘట నలు తలెత్తినా, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు చోటుచేసుకున్నా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 08812 232351 నంబర్‌కు లేదా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1365కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిద్ధార్థజైన్ ఓటర్లకు సూచించారు.
పోలింగ్ నిర్వహించే మండలాలివీ
కొవ్వూరు డివిజన్ పరిధిలోని కొవ్వూరు, దేవరపల్లి, తాళ్లపూడి, నిడదవోలు, చాగ ల్లు, తణుకు, పెరవలి, ఉండ్రాజవరం, అత్తిలి, పెనుగొండ, ఇరగవరం, పెనుమంట్ర, నరసాపురం డివిజన్ పరిధిలోని నరసాపురం, మొగల్తూరు, పాల కొల్లు, యలమంచిలి, పోడూరు, ఆచం ట, భీమవరం, ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, వీరవాసరం మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పోలింగ్ జరగనుంది.
తాయిలాల వల
ప్రచారం ముగియడంతో ప్రలోభాల వల వేసేందుకు పలువురు అభ్యర్థులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. తొలి విడత పోలింగ్ సందర్భంగా ఓటర్లకు రూ.300 నుంచి రూ.వెరు్య వరకూ నగదు పం పిణీ చేసిన నేతలు ఈ విడతలోనూ పం పకాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈసారి కూడా అదే స్థాయిలో నగదు పం పిణీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచా రం. కొన్నిచోట్ల ఓటుకు ఎంతైనా ఇచ్చేం దుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రహస్య ప్రదేశాల్లో మద్యం నిల్వ చేసినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల బహుమతులు ఇచ్చేందుకు కూడా ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. ప్రలోభాల పర్వా న్ని అడ్డుకునేందుకు పక్కా ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కొంటున్నారు.