Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Acb Court Issues Key Orders On Jail Facilities For Mp Mithun Reddy1
ఎంపీ మిథున్‌రెడ్డికి వసతులపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

సాక్షి, విజయవాడ: రాజమండ్రి సెంట్రల్‌ జైలు అధికారులకు ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ మిథున్‌రెడ్డికి జైల్లో వసతులపై ఆదేశాలిచ్చిన ఏసీబీ కోర్టు.. వారంలో మూడు సార్లు లాయర్ల ములాఖత్‌కు అనుమతి ఇచ్చింది.వారానికి మూడు సార్లు కుటుంబసభ్యుల ములాఖత్‌కు కూడా కోర్టు అనుమతులు ఇచ్చింది. బెడ్ సదుపాయం కల్పించాలని కోర్టు ఆదేశించింది. రోజుకొకసారి ఇంటి భోజనం తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు.. న్యూస్ పేపర్, మినరల్ వాటర్ అనుమతించాలని ఆదేశించింది.మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. రాజమండ్రి జైల్లో తనకు కేటాయించిన బ్లాక్‌లో సరైన సదుపాయలు లేవని చెబుతూ ఆయన పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఎంపీ మిథున్‌రెడ్డి సదుపాయాల పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా? అని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారిని ఏసీబీ జడ్జి ప్రశ్నించారు.అయితే.. కోర్టు ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని జైలు అధికారులు చెప్పారు. దీంతో.. చట్టాలు చేసే వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వాలి కదా అని జడ్జి అన్నారు. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్‌ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ పిటిషన్లపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Ysrcp Legal Cell Manohar Reddy Fires On Chandrababu2
మద్యం కేసు ఛార్జీషీట్‌లో అన్ని కట్టుకథలే: మనోహర్‌రెడ్డి

సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు ఛార్జిషీట్‌లో అన్నీ కట్టు కథలేనని.. వేధింపులు, అబద్దపు వాంగ్మూలాలు తప్ప మరేమీ లేవని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వైఎస్సారసీపీ నేతలను ఎక్కువ కాలం జైల్లో ఉంచాలనే కుట్రతోనే సిట్ పని చేస్తోందని.. అనేక కుంభకోణాలకు బిగ్‌బాస్ చంద్రబాబేనని మనోహర్‌రెడ్డి అన్నారు.మద్యం కేసులో అక్రమ అరెస్టులు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. మాజీ ఐఏఎస్ ధనుంజయరెడ్డి కోర్టుకు తన ఆవేదనను వెలిబుచ్చారు. ఎల్లో మీడియా వలన తన కుటుంబం పడుతున్న ఆవేదనను కోర్టు ముందు పెట్టారు. విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నట్టు ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. ఎల్లోమీడియా రాసే వార్తలే ఛార్జిషీట్, రిమాండ్ రిపోర్టుల్లో కనిపిస్తోంది. మా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ రాసే రాతల వలన మానసిక ఆవేదన చెందుతున్నట్టు కోర్టుకు చెప్పారు’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘జైలు పక్కన ఉన్న బిల్డింగుల మీద నుండి కొందరు మా ఫోటోలు తీస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఫోటోలు తీస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. అవినీతి మచ్చలేని ధనుంజయరెడ్డి సిట్ అధికారుల వేధింపులకు గురవుతున్నారు. ఛార్జిషీట్ టీడీపీ ఆఫీసులో రూపొందుతోంది. దానికి ఢిల్లీలో తుది మెరుగులు దిద్దుతున్నారు. లిక్కర్ స్కాం ఛార్జిషీట్‌లో మోకాలికి బోడిగుండుకు ముడి వేశారు...అబద్దపు వాంగ్మూలాలు, గాలి‌ పోగేసిన వార్తలు, కాల్ డేటా తప్ప ఈ ఛార్జిషీట్‌లో మరేమీ లేదు. సిట్ చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కదానికీ సాక్ష్యాలు చూపలేదు. డిస్ట్రలరీ యజమానులను బెదిరించి, అబద్దపు వాంగ్మూలం తీసుకున్నారు. బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని బెదిరించి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. దాని మీద వాసుదేవరెడ్డి మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. చెవిరెడ్డి గన్‌మెన్లు గిరి, మదన్‌రెడ్డిలను సిట్ విపరీతంగా హింసించింది. మిథున్‌రెడ్డిది బలమైన రాజకీయ కుటుంబం. అలాంటి కుటుంబాన్ని వేధిస్తున్నారు...ఛార్జిషీట్‌లో ఉన్నదంతా కట్టుకథలే. వైఎస్సార్‌సీపీ నేతల మీటింగులను కూడా మద్యం స్కాం కోసమే అంటూ కట్టుకథ అల్లారు. టార్గెట్ చేసుకున్న వ్యక్తులను అరెస్టు చేయటమే లక్ష్యంగా మద్యం కేసును నడుపుతున్నారు. తమకు కావాల్సినట్టు చెబితే సాక్ష్యులుగా, లేకపోతే దోషిలుగా చిత్రీకరిస్తున్నారు. 2014-19 మధ్యలో చంద్రబాబు అనేక కుంభకోణాల్లో నిందితుడు. అన్ని అక్రమాలజు ఆయనే బిగ్ బాస్. ఐఎంజీ కేసులో బిగ్ బాస్ చంద్రబాబు. రాజధాని భూములు, ఫైబర్ నెట్, రింగురోడ్డు అలైన్మెంట్.. ఇలా అనేక అవినీతి, అక్రమాల్లో బిగ్ బాస్ చంద్రబాబే’’ అని మనోహర్‌రెడ్డి దుయ్యబట్టారు.

Bengaluru Court Issues Gag Order On Dharmasthala Case3
‘ధర్మస్థళ’పై ఉష్‌ గప్‌చుప్‌!

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థళలో ఉన్న శ్రీ మంజునాథ దేవాలయం, నేత్రావతి నదీ తీరం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మృతదేహాలను 20 ఏళ్ల పాటు సమీప అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టానంటూ ఆ దేవాలయంలో పని చేసిన పారిశుద్ధ్య కార్మికుడు షాకింగ్‌ విషయం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం ధర్మశాలలో తప్పిపోయిన కోల్‌కతాకు చెందిన ఎంబీబీఎస్‌ విద్యార్థిని అనన్య భట్‌ అంశాన్ని తెరపైకి తీసుకువస్తూ ఆమె తల్లి సుజాత భట్‌ దక్షిణ కన్నడలోని బెత్తంగడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.దీంతో ధర్మస్థళ హత్యాకాండపై సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. దీనిపై స్పందించిన కర్ణాటక మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌదరి.. రెండు దశాబ్ధాల కాలంలో ధర్మస్థళలో అదృశ్యమైన మహిళలు, బాలికల కేసులు, అసహజ మరణాలు, హత్యలు, లైంగిక దాడులపై పునర్విచారణ జరపాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు.ఈ ఒత్తిళ్లతో స్పందించిన కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తునకు ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసింది. ఇంటర్నల్‌ సెక్యూరిటీ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ప్రణవ్‌ మొహంతి నేతృత్వం వహించేలా ఆదేశాలు ఇచ్చింది. వివిధ విభాగాలకు చెందిన మరో ముగ్గురు ఉన్నతాధికారులనూ సిట్‌లో నియమించింది.ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలక ట్విస్ట్‌ చోటు చేసుకుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్న ధర్మస్థళ మారణహోమం కేసుపై బెంగళూరు కోర్టు మంగళవారం గ్యాగ్‌ ఆర్డర్‌ ఇచ్చింది. శ్రీ మంజునాథ ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే సోదరుడు హర్షేంద్ర కుమార్‌ డి. దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగా న్యాయస్థానం ఈ ఆదేశాలను ఇచ్చింది.వివిధ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ధర్మస్థళ ఉదంతానికి సంబంధించి ఉన్న 8,842 లింక్‌లను తొలగించాలని కోర్టు ఆదేశించింది. మా పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలకు సంబం«ధించిన కవరేజీకి సంబంధించిన లింకులు తొలగించాలని, డీ–ఇండెక్స్‌ చేయాలని కోరిన హర్షేంద్ర తన పిటిషన్‌లో ‘ఎక్స్‌’, ఫేస్‌బుక్‌ పోస్టులు, థ్రెడ్‌లను ప్రస్తావించారు. ఈ వివాదంపై యూట్యూబ్‌ ఛానెళ్లు, సోషల్‌ మీడియా, ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, డిజిటల్‌ మీడియాల్లో ప్రచురించడం, ప్రసారం చేయడం, ఫార్వార్డ్‌ చేయడం, అప్‌లోడ్‌ చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.బెంగళూరులోని పదో అదనపు సిటీ సివిల్‌ సెషన్స్‌ కోర్టులో హర్షేంద్ర దాఖలు చేసిన పిటిషన్‌లో గ్యాగ్‌ ఆర్డర్‌తో పాటు జాన్‌ డో ఆర్డర్‌ను పొందారు. హర్షేంద్ర తన పిటిషన్‌లో 338 సంస్థలు, వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చారు. 4,140 యూట్యూబ్‌ వీడియోలు, 932 ఫేస్‌బుక్‌ పోస్ట్‌లు, 3,584 ఇన్‌స్ట్రాగామ్‌ పోస్ట్‌లు, 108 న్యూస్‌ లింక్‌లు, 37 రెడ్డిట్‌ పోస్ట్‌లతో పాటు 41 ’ఎక్స్‌’ పోస్టులతో కలిసి 8,842 లింక్‌లను తన పిటిషన్‌లో పొందుపరిచారు.వీటిలో ’లెట్‌ మీ ఎక్స్‌ప్లెయిన్‌’ ఎపిసోడ్లు, ది న్యూస్‌ మినిట్‌లోని వీడియోలు ఉన్నాయి. ప్రతివాదులుగా జాబితా వార్తలు, కంటెంట్, వీడియోలు ఉంచిన థర్డ్‌ ఐ, ధూత, సమీర్, ది న్యూస్‌ మినిట్, డెక్కన్‌ హెరాల్డ్, ది హిందూ, ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, ప్రజావాణి, కన్నడ ప్రభ, హోస దిగంత, బెంగుళూరు మిర్రర్, ఉదయవాణి, దినమణి, దిన తంతి, దినకరన్, సంయుక్త కర్ణాటక, విజయవాణి, విశ్వవాణి, కేరళ, న్యూస్‌ కా18 తదతరాలను చేర్చారు.గ్యాగ్‌ ఆర్డర్‌ కేవలం పిటిషన్‌లో ప్రస్తావించిన వాటిని మాత్రమే నియంత్రించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హర్షేంద్ర జాన్‌ డో ఆర్డర్‌ కోసం న్యాయమూర్తికి విన్నవించారు. ఈ మేరకు కోర్టు ఇంజెక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వడంతో పిటిషన్‌లో పేరు లేని సంస్థలు, వ్యక్తులు, పార్టీలను ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఈ ఆదేశాల జారీ సందర్భంగా న్యాయమూర్తి విజయ కుమార్‌ రాయ్‌ ‘ప్రతి పౌరుడికి ప్రతిష్ట అనే చాలా ముఖ్యమైంది. సంస్థ, దేవాలయంపై ఆరోపణ వచ్చినప్పుడు అవి అనేక మందిని ప్రభావితం చేస్తాయి. పరువు నష్టం కలిగించే ఒక ప్రచురణ కూడా సంస్థల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ ఉత్తర్వు తమ భావప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని, దానిని రద్దు చేయాలని కోరుతూ యూట్యూబ్‌ పోర్టల్‌ థర్డ్‌ ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. – శ్రీరంగం కామేష్‌

INDW VS ENGW 3rd ODI: Harmanpreet Completes Century In 82 Balls4
విధ్వంసం సృష్టించిన టీమిండియా కెప్టెన్‌.. వన్డేల్లో రెండో వేగవంతమైన శతకం

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టుతో ఇవాళ (జులై 22) జరుగుతున్న నిర్ణయాత్మక చివరి వన్డేలో భారత మహిళా జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చెలరేగిపోయింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ కేవలం 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, భారత్‌ తరఫున వన్డేల్లో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేసింది. ఫలితంగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.ఈ మ్యాచ్‌లో మొత్తంగా 84 బంతులు ఎదుర్కొన్న హర్మన్‌ 14 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి ఔటైంది. హర్మన్‌తో పాటు భారత ఇన్నింగ్స్‌లో జెమీమా రోడ్రిగెజ్‌ (50), స్మృతి మంధన (45), హర్లీన్‌ డియోల్‌ (45), రిచా ఘోష్‌ (38 నాటౌట్‌), ప్రతిక రావల్‌ (26) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బ్యాటర్ల ధాటికి ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. సోఫీ ఎక్లెస్టోన్‌ (10-2-28-1) మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. లారెన్‌ బెల్‌ 10 ఓవర్లలో 82, లారెన్‌ ఫైలర్‌ 10 ఓవర్లలో 64, చార్లోట్‌ డీన్‌ 10 ఓవర్లలో 69, లిన్సే స్మిత్‌ 10 ఓవర్లలో 74 పరుగులు సమర్పించుకొని తలో వికెట్‌ తీశారు.భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీలు..70 స్మృతి మంధన vs ఐర్లాండ్‌ రాజ్‌కోట్ 202582 హర్మన్‌ప్రీత్ కౌర్ vs ఇంగ్లాండ్ చెస్టర్-లీ-స్ట్రీట్ 202585 హర్మన్‌ప్రీత్ కౌర్ vs దక్షిణాఫ్రికా బెంగళూరు 202489 జెమిమా రోడ్రిగ్స్ vs దక్షిణాఫ్రికా కొలంబో RPS 2025ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు తలో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్‌ సొంతమవుతుంది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగగా, భారత్ 3-2 తేడాతో ఆ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది.

BoyCott Hari Hara Veera Mallu Hashtags Trending On Social Media5
పవన్‌ వ్యాఖ్యలు.. ట్రెండింగ్‌లో #BoycottHHVM

పవన్‌ కల్యాణ్‌ ప్రవర్తన వింతగా ఉంటుంది. సినిమాలు వేరు రాజకీయాలు వేరని ఆయనే చెబుతాడు. మళ్లీ ఆయనే సినిమా వేదికపై రాజకీయాలు, రాజకీయ వేదికలపై సినిమా విషయాలు మాట్లాడుతాడు. పవన్‌ ప్రవర్తనే ఇప్పుడు ఆయన సినిమాను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ఆయన హీరోగా నటించిన హరి హర వీరమల్లు సినిమాకు ఇప్పుడు నిరసన సెగ తగిలింది. పవన్‌ వ్యాఖ్యలతో విసుగెత్తిపోయిన వైఎస్సార్‌సీసీ అభిమానులకు తోడు అల్లు అర్జున్‌, మహేశ్‌, ప్రభాస్‌ లాంటి స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ కూడా హరిహర వీరమల్లు సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు. దీంతో #BoycottHHVM ట్యాగ్‌ ఇప్పుడు ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది.ఏం జరిగిదంటే..తాజాగా జరిగిన హరిహర వీరమల్లు సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ రాజకీయాలు మాట్లాడారు. సినిమా గురించి చెప్పడం మరచి.. ‘గతంలో భీమ్లా నాయక్‌ సినిమా టికెట్‌ రూ.10-15 పెట్టిన నేను అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. మన సత్తా ఏంటో చూపిద్దాం’ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. దీనికి ఆజ్యం పోసేలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. ఇప్పుడు ఇదే నిరసనకు దారి తీసింది. వైఎస్సార్‌సీపీ అభిమానులు పవన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సినిమాను బాయ్‌కాట్‌ చేస్తున్నారు. మేమే కాదు ..మాతో పాటు మరో 20-30 మందిని కూడా సినిమాను చూడనియ్యబోమంటూ #BoycottHHVM హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్స్‌ చేస్తున్నారు.స్టార్‌‌ హీరోల ఫ్యాన్స్‌ కూడా..అభిమానం ఉంటే ఆ హీరో సినిమాలు చూడాలే తప్ప ఇతర హీరోల సినిమాలను నాశనం చేయకూడదు. కానీ పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఏ హీరోకైనా కాస్త పేరొస్తే చాలు.. ఆయన సినిమాను తొక్కేయాలని చూస్తారనే టాక్‌ టాలీవుడ్‌లో ఉంది. గతంలో బన్నీ, మహేశ్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ సినిమాలపై ట్రోల్స్‌ చేశారు. పుష్ప 2 రిలీజ్‌ అప్పుడు అయితే అల్లు అర్జున్‌పై దారుణమైన కామెంట్స్‌ చేస్తూ.. సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఇతర హీరోల ఫ్యాన్స్‌ అన్నట్లు అందరి హీరోల సినిమాలను ట్రోల్‌ చేశారు. ఇప్పుడు ఆ స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ కూడా పవన్‌ సినిమాపై పగ బట్టారు. తాము హరిహర వీరమల్లు సినిమాను చూడబోం అంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తూ..తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు వైఎస్సార్‌సీపీ అభిమానులు, మరోవైపు స్టార్‌ హీరోల ప్యాన్స్‌ దెబ్బకి #BoycottHHVM హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.అనవసరం గా కెలుక్కున్నారు రా సైనిక్స్..మీకు ర్యాంప్ ఆడిస్తున్నారు AA Army 🔥🔥🔥😂😂🔥🔥 #AAArmy #BoycottHHVM pic.twitter.com/JbrppHXqqk— నల్లపరెడ్డి 🔥🔥🔥 (@naveenk23021806) July 21, 2025Get ready to face trolls #HHVMమూవీస్ లో రాజకీయం చేయకండి రా అంటే వినరు అనుభవిస్తారు ఇప్పుడు చూస్తాం ఎలా ఆ మూవీ హిట్ అవుతుందో.....✊🏿✊🏿 గతం లో జరిగినది మర్చిపోయినట్టు ఉన్నారు ఈ సారి బాగా గుర్తుండిపోతుంది..... #BoycottHHVM#BoycottHHVM pic.twitter.com/SH7yvXWHFI— Aji (@AJAY83527762580) July 21, 2025ముందు నూయ్ వెనక గుయ్ అన్నటుంది చాలా రిస్క్లో పడ్డాడు @PawanKalyan 🫣🤭NTR FANS MINGUTHARU :::..🔥🔥MH & AA FANS THANTARU:::🔥🔥YSRCP FANS KINDA KOSTARU :::::ఎటు చూసినా కింద మీద వాయిస్తున్నారు 🔥🔥#BoycottHHVM #BoycottHHVM pic.twitter.com/2JXfcONayv— Aji (@AJAY83527762580) July 21, 2025#BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #BoycottHHVM #pk🐕 pic.twitter.com/X2WNe3EFY0— Tony (@Youth4YSRCP) July 22, 2025Hero Evaru..............?Hero Name Cheppandi Ra Ayya .....?Hero Brahmanandam Antunnaru ..?Nijamena..........? 🤣🤣#BoycottHHVM pic.twitter.com/8VGiub64Ag— Lakshmi Reddy (@Lakshmired7313) July 22, 2025నిన్న మొన్నటి నుండి #BoycottHHVM అని మా వాళ్ళు అంటుంటే సరే అని లైట్ తీసుకున్న కానీ ఈరోజు కొంతమంది గాంజ నా కొడుకులు నా అన్న @ysjagan గురించి తప్పుగా మాట్లాడారు 🔥చూస్కుందాం బారాబర్ చూస్కుందాం 🔥🔥సినిమాని చూడాలి అనుకునేవాళ్ళను కూడా మీ అతితో నాశనం చేసుకుంటున్నారు 🤙#BoycottHHVM pic.twitter.com/uZTQOwhmoT— jagan__fan__kurnool (@darvesh_md25012) July 22, 2025సినిమా వాళ్ళు ఇంకా మారారా ??#HariHaraVeeraMallu ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి రాజకీయ విమర్శలు !!#BoycottHHVM అని పిలుపు ఇచ్చిన వైసీపీ సోషల్ మీడియా సైన్యం ….సిగ్గు ఉన్న వైసీపీ అభిమాని ఎవడు ఈ సినిమా చూడడు అని శపధం !! pic.twitter.com/qAJzYhjj6f— cinee worldd (@Cinee_Worldd) July 21, 2025సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడతారా.. ముందు ముందు ఉంది రా మీకు జాతర..YCP boys.. HHVM is a disaster movie #BoycottHHVMpic.twitter.com/U2d1IoQjeb— 𝕁𝕦𝕤𝕥 𝔸𝕤𝕜𝕚𝕟𝕘 🇮🇳 (@JustAsking2_0) July 21, 2025నా దగ్గర డబ్బులు లేవు అని బీద అరుపులు అరిచి, వాడికున్న అలాగా ఫాన్స్ దగ్గర నుండి ఓపెనింగ్స్ రాబెట్టుకొని(తల్లి చెల్లి పెళ్ళాం దగ్గర పుస్తులు తాకట్టు పెట్టి మరీ కొంటారు పిచ్చి నా) నెక్స్ట్ మూవీకి ఎక్సట్రా పేమెంట్ అడుగుతాడు.ఇది బుర్ర తక్కువ వెధవలికి అర్ధం కాదు🤣😂.#BoycottHHVM pic.twitter.com/Rxs0Wfd1xh— గంగ పుత్రుడు (@bheesmudu) July 22, 2025సినిమా టికెట్ ధర పెంచి గర్వంగా చెప్పుకోవడం కాదు...💦💦💦దమ్మూ ధైర్యం ఉంటే రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చి గర్వంగా చెప్పుకోండి... #BoycottHHVM pic.twitter.com/IZ3Oa93n6j— Ayyapa Reddy (@YSJaganMarkGove) July 22, 2025Get ready to face trolls #HHVMమూవీస్ లో రాజకీయం చేయకండి రా అంటే వినరు అనుభవిస్తారు ఇప్పుడు చూస్తాం ఎలా ఆ మూవీ హిట్ అవుతుందో.....✊🏿✊🏿 గతం లో జరిగినది మర్చిపోయినట్టు ఉన్నారు ఈ సారి బాగా గుర్తుండిపోతుంది..... #BoycottHHVM#BoycottHHVM pic.twitter.com/SH7yvXWHFI— Aji (@AJAY83527762580) July 21, 2025

Reason Behind Dhankar Resign May This Also6
రాజీనామానే మంచిదనుకున్న ధన్‌ఖడ్‌!

జనతాదళ్‌, కాంగ్రెస్‌, బీజేపీలలో వివిధ పదవులు, బాధ్యలతో సుదీర్ఘ రాజకీయానుభవం సంపాదించుకున్న వ్యక్తి. పైగా ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన వ్యక్తి. అనూహ్యంగా తెర మీదకు తెచ్చి.. ‘రైతుబిడ్డ’గా ప్రమోట్‌ చేస్తూ మరీ ఉపరాష్ట్రపతి రేసులో నిలబెట్టి గెలిపించుకుంది ఎన్డీయే కూటమి. అలాంటిది బలవంతంగా ఆయన్ని పదవి నుంచి దించేశారా? లేకుంటే నిజంగానే ఆయన అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారా?.. ఇతర కారణాలు ఉన్నాయా?.. దేశంలో ఇప్పుడు జగ‍్దీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాపై రాజకీయ రచ్చ నడుస్తోంది. అకస్మాత్తుగా ఆయన ఉపరాష్ట్రపతి పదవికి ఎందుకు రాజీనామా చేశారు? అనే ప్రశ్న తలెత్తింది. లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో నవ్వుతూ కనిపించిన ఆయన.. గంటల వ్యవధిలోనే ఎందుకు రాజీనామా ప్రకటించారు?.. దానికి అంతే వేగంగా ఆమోద ముద్ర ఎందుకు, ఎలా పడింది?. పైగా ఎలాంటి వీడ్కోలు లేకుండానే(కనీసం ఫేర్‌వెల్‌ స్పీచ్‌ కూడా లేకుండా) ఆయన్ని సాగనంపడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. ఇందుకు గత ఆరు నెలల పరిణామాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.👉ధన్‌ఖడ్‌(74)కు ఈ ఏడాది మార్చిలో ఛాతీ సంబంధమైన సమస్యలు రావడంతో ఎయిమ్స్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీన ఓ గార్డెన్‌ విజిటింగ్‌కు వెళ్లిన ఆయన హఠాత్తుగా కుప్పకూలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన సతీమణితో పాటు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అక్కడే ఉన్నారు. దీంతో వైద్యుల సూచన మేరకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని లేఖలో ధన్‌ఖడ్‌ తెలిపారు. అయితే.. ‘‘రాజీనామా వెనుక లోతైన కారణాలే ఉన్నాయి, ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఆయనకే తెలుసు..’’ అంటూ కాంగ్రెస్‌ అగ్రనేతలు స్పందించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. 👉పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా జరిగిన బీఏసీ సమావేశానికి బీజేపీ కీలక నేతలు జేపీ నడ్డా, కిరెన్‌ రిజిజ్జు గైర్హాజరు కావడం, ఆ సమావేశంలో ఈ అంశంపై ధన్‌ఖడ్‌ సీరియస్‌ అయ్యారని, ఆ తర్వాతే ఏదో జరిగిందని కాంగ్రెస్‌ వాదన. కానీ, జేపీ నడ్డా మాత్రం ముందస్తు సమాచారం ఇచ్చామని, కాంగ్రెస్‌ అనవసర రాజకీయం చేస్తోందని మండిపడుతున్నారు. ఆయన(ధన్‌ఖడ్‌) వ్యక్తిగత నిర్ణయానికి గౌరవం ఇవ్వాలని బీజేపీ నేత ఒకరు కూడా వ్యాఖ్యానించారు. అయితే.. कल दोपहर 12:30 बजे श्री जगदीप धनखड़ ने राज्यसभा की कार्य मंत्रणा समिति (BAC) की अध्यक्षता की। इस बैठक में सदन के नेता जेपी नड्डा और संसदीय कार्य मंत्री किरेन रिजिजू समेत ज़्यादातर सदस्य मौजूद थे। थोड़ी देर की चर्चा के बाद तय हुआ कि समिति की अगली बैठक शाम 4:30 बजे फिर से होगी।…— Jairam Ramesh (@Jairam_Ramesh) July 22, 2025👉ధన్‌ఖడ్‌ పక్షపాత ధోరణితో.. ఏకపక్షంగా సభను(రాజ్యసభ) నడుపుతున్నారంటూ ఆయన్ని అభిశంసించేందుకు ప్రతిపక్ష ఎంపీలు గతేడాది డిసెంబర్‌లో నోటీసులు ఇచ్చారు(ఆ నోటీసు తిరస్కరణకు గురైంది). ఆ ఎంపీలే ఇప్పుడు ధన్‌ఖడ్‌కు సానుభూతిగా స్టేట్‌మెంట్లు ఇస్తుండడం కొసమెరుపు. మరోవైపు.. బీజేపీ మాత్రం ధన్‌ఖడ్‌ రాజీనామా వ్యవహారానికి కాస్త దూరంగానే ఉంటోంది.👉గత ఆరు నెలలుగా ప్రభుత్వానికి, ధన్‌ఖడ్‌కి మధ్య గ్యాప్‌​ నడుస్తున్న విషయాన్ని కొందరు ఎంపీలు ఇవాళ్టి పార్లమెంట్‌ సెషన్‌ సందర్భంగా బహిరంగంగానే చర్చించుకోవడం గమనార్హం. అయితే ప్రభుత్వం, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ మధ్య మనస్పర్థలు నివురు గప్పిన నిప్పులా కొనసాగాయని.. గత కొంతకాలంగా అవి తారాస్థాయికి చేరాయన్నది ఆ ముచ్చట్ల సారాంశం. 👉అంతేకాదు.. ఈ ఆరు నెలల కాలంలో ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్‌ చేయాల్సిన విదేశీ పర్యటనలు రద్దవుతూ వచ్చాయి. పైగా ఉపరాష్ట్రపతి హోదాలో ధన్‌ఖడ్‌కు ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య భేటీ జరిగి నెలలు కావొస్తున్నాయి(కాకుంటే రాజీనామా తర్వాత ఆయన ఆరోగ్యం బాగుండాలంటూ మోదీ ఓ ట్వీట్‌ మాత్రం చేశారు). ఈ పరిణామాలన్నీ ఏదో జరిగిందనే సంకేతాలనే అందిస్తున్నాయి. వీటికి తోడు బీజేపీ శ్రేణుల నుంచే కొన్ని గుసగుసలు బయటకు వచ్చి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. Shri Jagdeep Dhankhar Ji has got many opportunities to serve our country in various capacities, including as the Vice President of India. Wishing him good health.श्री जगदीप धनखड़ जी को भारत के उपराष्ट्रपति सहित कई भूमिकाओं में देश की सेवा करने का अवसर मिला है। मैं उनके उत्तम…— Narendra Modi (@narendramodi) July 22, 2025ఈ మనస్పర్థల కారణంగానే ఆయన్ని పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు మొదలయ్యాయని, కొందరు బీజేపీ నేతలు ఈ విషయమై ధన్‌ఖడ్‌ అప్రమత్తం చేశారని చెప్పుకుంటున్నారు. అయితే అవమానకర రీతిలో పదవి కోల్పోవడం కంటే.. రాజీనామానే బెటర్‌ అనుకున్నారన్నది ఆ గుసగుసల సారాంశంగా పలు జాతీయ మీడియా చానెల్స్‌ కథనాలు ఇస్తున్నాయి.

Ysrcp Leaders Fires On Minister Atchannaidu Comments7
మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఫైర్‌

సాక్షి, తాడేపల్లి: మంత్రి అచ్చెనాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాలంటే డ‌బ్బులు కావాలి.. ఆడ‌బిడ్డ నిధి ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అమ్మాలి’’ అంటూ మాట్లాడ‌డానికి సిగ్గులేదా అచ్చెన్నాయుడూ?’’ అంటూ ఆర్కే రోజా ట్వీట్‌ చేశారు. ఎన్నిక‌ల ముందు హామీలు ఇచ్చేట‌ప్పుడు తెలియ‌దా?. అప్పుడేమో ఓట్లు కోసం అడ్డ‌మైన హామీలు ఇచ్చి.. అధికారంలోకి వ‌చ్చాక ఇలా మాట్లాడమ‌ని మీ నాయ‌కుడు చంద్రబాబు చెప్పారా?’’ అంటూ ఆర్కే రోజా ఎక్స్‌ వేదికగా నిలదీశారు.`సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాలంటే డ‌బ్బులు కావాలి, `ఆడ‌బిడ్డ నిధి` ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అమ్మాలి` అంటూ మాట్లాడ‌డానికి సిగ్గులేదా @katchannaidu? ఎన్నిక‌ల ముందు హామీలు ఇచ్చేట‌ప్పుడు తెలియ‌దా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డ‌మైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వ‌చ్చాక ఇలా… pic.twitter.com/v9v8fq8C1r— Roja Selvamani (@RojaSelvamaniRK) July 22, 2025అమ‌లు చేయ‌లేన‌ప్పుడు హామీలు ఎందుకిచ్చారు?: విడదల రజినిఒక్క హామీని కూడా అమ‌లు చేయ‌కుండా సుప‌రిపాల‌న‌కు తొలి అడుగు అంటూ టీడీపీ వాళ్లు మాట్లాటం చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి విడదల రజిని ట్వీట్‌ చేశారు. చంద్రబాబు సంప‌ద సృష్టిస్తా, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తాన‌ని చెప్పారు. ఇప్పుడేమో అచ్చెన్నాయుడు ఆడ‌బిడ్డ నిధి` ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అమ్మాలంటూ మాట్లాడుతున్నారు. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌లేన‌ప్పుడు ఎందుకు హామీలు ఇచ్చారు?’’ అంటూ విడదల రజిని ప్రశ్నించారు.ఒక్క హామీని అమ‌లు చేయ‌కుండా సుప‌రిపాల‌న‌కు `తొలి అడుగు` అంటూ @JaiTDP వాళ్లు మాట్లాడ‌డం చాలా విడ్డూరంగా ఉంది. @ncbn ఏమో సంప‌ద సృష్టిస్తా, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తాన‌ని చెప్పారు. ఇప్పుడేమో @katchannaidu `ఆడ‌బిడ్డ నిధి` ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అమ్మాలంటూ… pic.twitter.com/hLaNmjTiqB— Rajini Vidadala (@VidadalaRajini) July 22, 2025అచ్చెన్నాయుడు వ్యాఖ్య‌లు దుర‌దృష్ట‌క‌రం: వరుదు కల్యాణి‘‘ఆడ‌ బిడ్డ‌ల క‌ష్టాలు తాను క‌ళ్లారా చూశాన‌ని.. వారిని ఆ క‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డేయ‌డానికి ఆడ‌బిడ్డనిధి ప‌థ‌కం తీసుకువ‌చ్చామ‌ని ఎన్నిక‌ల ముందు చంద్రబాబు ప్ర‌తి స‌భ‌లోనూ ప్ర‌చారం చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికీ ప్ర‌తి నెలా రూ.1,500లు ఇస్తామ‌న్నారు. అధికారంలోకి వ‌చ్చాక మొద‌టి ఏడాది ఇవ్వ‌నే లేదు. ఇప్పుడేమో ఆడ‌బిడ్డ నిధి పథ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అమ్ముకోవాలంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్య‌లు చేయ‌డం దుర‌దృష్ట‌క‌రం’’ అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు.ఇది మంచి ప్ర‌భుత్వ‌మా చంద్రబాబూ?: పుష్పశ్రీవాణిఎన్నిక‌ల ముందేమో సంప‌ద సృష్టిస్తాం, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తామన్నారు. ఓట్లు వేయించుకుని గ‌ద్దెనెక్కిన త‌ర్వాత సంక్షేమప‌థ‌కాలు అమ‌లు చేయ‌లేమ‌ంటున్నారు. ఆడబిడ్డ నిధి` ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్రదేశ్‌ను అమ్ముకోవాలంటూ వ్యాఖ్య‌లు చేయ‌డం మీకు త‌గునా అచ్చెన్నాయుడూ?. ఇది మంచి ప్ర‌భుత్వ‌మా చంద్రబాబూ?’’ అంటూ మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి ఎక్స్‌ వేదికగా నిలదీశారు.

Govt initiated consultations to set up the 8th Central Pay Commission8
ఎనిమిదో పే కమిషన్‌ ఏర్పాటుకు చర్చలు ప్రారంభం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పింఛన్లను సవరించే 8వ వేతన సంఘం (సీపీసీ) ఏర్పాటుకు ప్రభుత్వం ముందస్తు చర్చలు ప్రారంభించింది. 2026 జనవరి 1 నుంచి ఈ కమిషన్ అమల్లోకి రానుంది. పీటీఐ నివేదిక ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు సంప్రదింపులు మొదలు పెట్టింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి.ఈ సంప్రదింపుల్లో భాగంగా కేంద్రశాఖలతోపాటు రాష్ట్రాలతో సహా ప్రధాన భాగస్వాముల నుంచి అభిప్రాయాలను కోరినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ధ్రువీకరించారు. కమిషన్‌ను అధికారికంగా నోటిఫై చేసిన తర్వాత ఛైర్‌పర్సన్, సభ్యులను నియమిస్తామని ఆయన పార్లమెంటుకు తెలిపారు.ఎనిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను ఇంకా నోటిఫై చేయలేదు. అది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.ఇదీ చదవండి: ఆర్‌కామ్, అనిల్‌ అంబానీపై ‘ఫ్రాడ్‌’ ముద్రకొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది. ఇది 8వ సీపీసీ కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది. 7వ సీపీసీ 2.57 యూనిఫామ్‌ ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌(కొత్త బేసిక్‌పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్‌పేను 2.57తో హెచ్చు వేస్తారు)ను అవలంబించింది.గమనిక: 2026 జనవరి నాటికి డీఏ 57 శాతానికి పెరగనుంది. నగర వర్గీకరణ ఆధారంగా హెచ్ఆర్ఏ, టీఏ గణాంకాలు కొద్దిగా మారుతూ ఉంటాయి.

Leftover Fridge Meal Leads to Tragedy in Hyderabad Home9
Chicken: చికెన్ కూర ఫ్రిజ్‌లో పెట్టుకుని తెల్లారి తింటున్నారా?

సాక్షి,హైదరాబాద్: వనస్థలిపురంలో బోనాల పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్‌ తిని తొమ్మిదిమంది అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు మరణించారు. మిగిలిన తొమ్మిదిమందికి చింతలకుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వనస్థలిపురం ఆర్టీసీ కాలనికి చెందిన ఓ కుటుంబం బోనాల పండుగను నిర్వహించింది. అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులు, అతిథులతో కలిసి చికెన్‌,బోటీని ఆరగించారు. అనంతరం, మిగిలిన చికెన్‌,బోటీని ఫ్రిజ్‌లో ఉంచారు. ఫ్రిజ్‌లో ఉంచిన చికెన్‌, మటన్‌ కర్రీని మరుసటి రోజు తిన్నారు. తిన్న కొద్ది సేపటికే కుటుంబ సభ్యులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు.అప్రమత్తమైన స్థానికులు, బంధువులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, చికిత్స పొందుతున్న రజిత(38), జశ్విత(15), గౌరమ్మ(65), లహరి(17), సంతోష్ కుమార్(39), రాధిక(38), బేబీ కృతంగా (7)లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

Indian Origin CEO Who Quit Microsoft For Health10
ఆరోగ్యం కోసం మైక్రోసాఫ్ట్‌ కెరీర్‌ని వదిలేసుకున్న సీఈవో..!

ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు కొందరు ప్రముఖులు. అందుకోసం అత్యున్నతమైన కెరీర్‌ని కూడా వదిలేస్తున్నారు. ఆ కోవకు చెందని వారే భారత సంతతికి చెందిన ఈ సీఈవో. ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యత ఇచ్చి మంచి కెరీర్‌కి స్వస్తి పలికిన వ్యక్తిగా వార్తల్లో నిలిచారాయన. ఎందుకిలా అంటే..అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన సీఈఓ సుధీర్‌ కోనేరు ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి. ఆరోగ్యవంతంగా జీవించాలని మైక్రోసాఫ్ట్‌లో సుమారు 15 ఏళ్ల విజయవంతమైన కెరీర్‌కు స్వస్థి పలికి రిటైరయ్యారు. ప్రస్తుతం ఆయన సియాటిల్‌కు చెందిన జెనోటీ అనే కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇది సెలూన్లు, స్పాలు, ఫిట్‌నెస్‌ కేంద్రాలకు మంచి వ్యాపార సాఫ్ట్‌వేర్‌ని అందిస్తుందట. అంతేగాదు 56 ఏళ్ల సుధీర్‌ మంచి ఆరోగ్యానికి పెద్దపీట వేసి మరీ బెంగళూరు బ్రీతింగ్‌ వర్క్‌షాప్‌లకు హాజరవుతారట. అందుకోసం సుమారు రూ. 1లక్ష నుంచి 1.6 లక్షలు ఖర్చు చేస్తారు. కేవలం నాలుగు రోజుల ఈ బ్రితింగ్‌ వర్క్‌షాప్‌లకు ఆయన ప్రతి ఏడాది రూ. 3.5 లక్షల వరకు ఖర్చు చేస్తారట. ఈ సెషన్లలో ఆధ్యాత్మిక శ్వాస పద్ధతులకు సంబంధించి రెండు గంటల గైడ్‌లైన్స్‌, ధ్యానాలు ఉంటాయట. వాటిని సుధీర్‌ శరీరాన్ని అద్భుతంగా నయం చేసేవి, చాలా శక్తిమంతమైనవిగా పేర్కొంటారాయన.మైక్రోసాఫ్ట్‌లో సుధీర్‌ ప్రస్థానం..సుధీర్‌ 1992లో మైక్రోసాఫ్ట్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌గా కెరీర్‌ ప్రారంభించి..జస్ట్‌ ఎనిమిదేళ్లకే 2000లో తన సొంత కంపెనీ ఇంటెలిప్రెప్‌ను ప్రారంభించారాయన. సరిగ్గా 2008లో అంటే 39 ఏళ్ల వయసులో కెరీర్‌ మంచి పీక్‌ పొజిషన్లో ఉండగా యోగా, వాకింగ్‌, జాగింగ్‌ వంటి ఫిట్‌నెస్‌ కోసం కంపెనీని విడిచిపెట్టారు. తాను ఆర్థికంగా ఉన్నత స్థితిలోఉన్నా..కానీ ప్రస్తుత లక్ష్యం కేవలం తన వ్యక్తిగత శ్రేయస్సు తోపాటు కుటుంబంతో బలమైన బంధాలు ఏర్పరుచుకోవడమేనని చెబుతున్నారు సుధీర్‌. వర్క్‌ పరంగా తాను చాలా బెస్ట్‌ కానీ, కేవలం డబ్బు సంపాదించడమే కాదు..అంతకుమించి తన కోసం సమయం కేటాయించాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని గ్రహించానంటాడు సుధీర్‌. అందుకోసమే రెండేళ్ల సుదీర్థ సెలవుల అనంతరం మైక్రోసాఫ్ట్‌ కంపెనీని నుంచి పదవీ విరమణ చేసి జెనోటిని స్థాపించానని తెలిపారు. తన కంపెనీ సంస్కృతిలో వెల్నెస్‌ సూత్రాలు అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతేగాదు తన సంస్థ పని సమయంలో యోగా, కిక్‌బాక్సింగ్‌, పైలేట్స్‌, వంటి ఫిట్‌నెస్‌ తరగతులను నిర్వహిస్తుంది. ఉద్యోగులు వీటిలో పాల్గొని వర్కౌట్లు చేసినట్లయితే మంచి పారితోషకం కూడా పొందుతారట. అంతేగాదు తన ఉద్యోగులకు స్పా, సెలున్లలో మంచి మసాజ్‌లు, ఆరోగ్యకరమైన స్నాక్స్‌ వంటివి కూడా అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ఇ​క తన దృష్టిలో ఫిట్‌నెస్‌ అంటే సిక్స్‌ ప్యాక్‌ని కలిగి ఉండటం కాదట. సమతుల్యమైన ఆహారంతో మంచి సామర్థ్యంతో జీవించడమే తన ధ్యేయమని చెబుతున్నారు. ఇక సుధీర్‌ వీక్‌ఆఫ్‌లతో సహా వారం రోజులు ఉదయమే ఏడింటికే యోగా చేస్తారట. బాలికి వెళ్లి కొన్నిరోజులు రెస్ట్‌ తీసుకుంటారట. అక్కడ మసాజ్‌లు, సన్‌బాత్‌ వంటి చికిత్సలు తీసుకుంటారట. అలాగే బెంగళూరులోని నాలుగు రోజుల శ్వాస వర్క్‌షాప్‌లో కూడా పాలుపంచుకుంటారట.(చదవండి: 56 ఏళ్ల తర్వాత స్కూల్‌కి వెళ్తే..! పెద్దాళ్లు కాస్తా చిన్నపిల్లల్లా..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement