పోలింగ్‌ ప్రశాంతం | Polling is peaceful | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ ప్రశాంతం

Published Sat, Mar 18 2017 11:25 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

పోలింగ్‌ ప్రశాంతం - Sakshi

పోలింగ్‌ ప్రశాంతం

సాక్షి ప్రతినిధి – నెల్లూరు: జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో  శుక్రవారం నిర్వహించిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది.  పోలింగ్‌కేంద్రాల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌ కేంద్రం బయట, లోపల అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయడం కోసం జిల్లా రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వెబ్‌ కెమెరాలను ఏర్పాటు చేయించారు. 852 ఓట్లకు గాను 851కి  పోలయ్యాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ప్రభావం జిల్లా ఎన్ని కల అధికారుల మీద కూడా పడింది.

పోలింగ్‌ సందర్భంగా చిన్న పాటి ఘర్షణలు, వివాదాలు కూడా చెలరేగకుండా ఉండటం కోసం జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు, రిటర్నింగ్‌ ఆఫీసర్, జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పోలింగ్‌ సిబ్బంది ఎవరూ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయకుండా ఉండేం దుకు తగిన ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా ఎస్‌పీ విశాల్‌ గున్ని ఆధ్వర్యంలో పోలీసు శాఖ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలింగ్‌ కేంద్రాలకు వంద మీటర్ల దూరం వరకు ఇతరులను అనుమతించలేదు. పోలింగ్‌ కేంద్రం బయట ఓటర్లను తనిఖీ చేసి మొబైల్‌ ఫోన్లు, పెన్నులు, ఇతర వస్తువులు లోనికి అనుమతించలేదు.

గ్రూపుల వారీగా ఓటింగ్‌
ఐదు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో  ఉద యం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. అధి కార, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు గ్రూపులుగా వచ్చి పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాయుడుపేట, గూడూ రు,  కావలి, ఆత్మకూరు కేంద్రాల్లో మధ్యాహ్నం 2గంటలకే పోలింగ్‌ ముగిసింది. నెల్లూరు కేంద్రంలో కొడవలూరు మండలం  కొత్త వంగళ్లు స్వతంత్ర ఎంపీటీసీ వెంకట కృష్ణయ్య కోసం సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగించినా, ఆయన ఓటు వేయడానికి రాలేదు.

గూడూరులో స్వల్ప ఉద్రిక్తత
గూడూరులో టీడీపీ శ్రేణులు జై చంద్రబాబు అంటూ నినాదాలు చేయడంతో ప్రతిగా వైఎస్సార్‌పీ వర్గీయులు జైజగన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని నెట్టివేశారు.

ఓటేసిన ప్రముఖులు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రముఖులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు అనిల్‌ కుమార్‌ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరులో ఓటేశారు. తిరుపతి ఎంపీ వరప్రసాదరావు, గూడూ రు, వెంకటగిరి ఎమ్మెల్యేలు పాశం సునీల్‌ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ గూడూరు పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయుడుపేటలోను, ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, జెడ్‌పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి  ఆత్మకూరులో ఓటు వేశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కావలిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా.. ఉదయగిరి, సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు లేక పోవడంతో  ఆ నియోజక వర్గాల ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికల్లో ఓటు లేదు.

20న ఓట్ల లెక్కింపు
ఐదు రెవిన్యూ డివిజన్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లోని బ్యాలెట్‌ బాక్సులు శుక్రవారం సాయంత్రానికి నెల్లూరు ఎంపీడీవో కార్యాలయానికి చేరాయి. ఇక్కడ ఏర్పా టు చేసిన స్ట్రాంగ్‌ రూంలో వీటిని భద్రపరచి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 8 గంటలకు బ్యాలెట్‌ బాక్సులు తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. పోలైన 851 ఓట్లలో  చెల్లనివి తీసేసి మిగిలిన ఓట్లలో  పోటీలోని ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరికి సగం వచ్చి ఉంటే మధ్యాహ్నం 12 గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలా కాక పోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తుం దని ఈ పరిస్థితి ఏర్పడితే మాత్రం తుది ఫలితం సాయంత్రం 4 గంటలకు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement