MLC election
-
ఎల్ఆర్ఎస్ పేరుతో 50కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్లాన్: బండి సంజయ్
సాక్షి, పెద్దపల్లి: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే కేంద్ర బడ్జెట్‌పై చర్చకు రావాలని సవాల్ విసిరారు.ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి బండి సంజయ్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50వేల కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తారా?. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీ ఇదే(ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడిన వీడియో). ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారు?. కాంగ్రెస్ పార్టీ బర్త్, డెత్ రెగ్యులరైజేషన్ స్కీంలను కూడా ప్రవేశపెడతారేమో అంటూ ఎద్దేవా చేశారు.ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్‌పై దమ్ముంటే బహిరంగ చర్చకు రండి. మీకు చేతనైతే బీసీ రిజర్వేషన్లపై టెన్ జనపథ్ ఎదుట ధర్నా చేయండి. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 27న మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలతోపాటు వరంగల్- ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. -
పకడ్బందీ వ్యూహాలతో పనిచేయాలి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పకడ్బందీ వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ నేతలు, కేడర్‌ను సిద్ధం చేస్తోంది. కరీంనగర్– ఆదిలాబాద్– నిజామాబాద్–మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికలపై వరుసగా రెండోరోజు గురువారం కాంగ్రెస్ పార్టీ జూమ్ సమావేశం నిర్వహించింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపు కోసం పకడ్బందీగా ప్రచార వ్యూహం రూపొందించుకోవాలని, ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించాలని సూచించారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు గ్రామ స్థాయి నుంచి వ్యూహాలు రచించాలని, ఓటర్లకు మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ వారిని పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లి ఓటు వేయించేలా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులకు విస్తృతంగా ప్రచారం చేయాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా పని చేయాలని కోరారు.ప్రతి ఓటూ కీలకమే..: మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా సీరియస్‌గా తీసుకోవాలని, ఎలిమినేషన్ ప్రక్రియలో ప్రతి ఓటు చాలా కీలకమైందని సీఎం చెప్పారు. ఓటర్ మ్యాపింగ్ చేయడం, ఓటర్లను ప్రత్యేకంగా కలవడం లాంటి అంశాలు చాలా ముఖ్యమైనవని, ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని చెప్పారు. గాంధీభవన్‌లో కంట్రోల్ రూమ్ పెట్టి నిరంతరం పర్యవేక్షించాలని పార్టీ నేతలను ఆదేశించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. ఈ ఎన్నిక చాలా కీలకమైనదని, ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టేలా కృషి చేయాలని కోరారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోని 42 అసెంబ్లీ నియోజక వర్గాల బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్చార్జీలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. -
మనం చేసినవన్నీ యువతకు చెప్పండి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూనే రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి యువతకు వివరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, పార్టీ నేతలందరూ సమష్టిగా పనిచేసి అభ్యర్థి వి.నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రాత్రి కాంగ్రెస్ ముఖ్యనేతల జూమ్ మీటింగ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు రాష్ట్రంలో స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలను మంజూరు చేసి పనులు ప్రారంభించామని, రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని చెప్పారు. ఈ విషయాలను యువతకు వివరించడం ద్వారా పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అంటే అభిమానం: మీనాక్షి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నటరాజన్ తొలిసారి పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పారు. రాష్ట్రంలోని చాలామంది పార్టీ నాయకులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణను దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దామని, రాష్ట్రంలోని పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరారు. ఎన్నికలను పార్టీ కేడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మీనాక్షి చెప్పారు. -
‘టీడీపీకి జనసేన ఎందుకు సహకరించాలి?’
అంబేద్కర్ కోనసీమ, సాక్షి: ఎమ్మెల్సీ ఎన్నిక కూటమిలో చిచ్చు రాజేస్తోంది. రాజోలులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్‌కు జనసేన నేత యెనుముల వేంకటపతిరాజు పెద్ద షాకిచ్చారు. ఆయనకు మద్ధతు ఇచ్చేది లేదని బహిరంగంగా ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా జనసేన ఎన్నారై విభాగం నేత వేంకటపతిరాజు చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘‘టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్(MLC Candidate Rajasekhar) కు జనసేన కార్యకర్తలెవరూ సపోర్టు చేయొద్దు. పార్టీ మీద బతికే నాయకులు మీ వద్దకు వస్తే ‘ఛీ’ కొట్టండి. జనసేన కార్యకర్తలను రోడ్డును పడేస్తే.. నాయకులను కూడా రోడ్డున పడేస్తాం’’.. ‘‘రాజోలు(Razole)లో పాలన ఏమాత్రం బాగోలేదు. గతంలో వివక్షంలో ఉన్నా పనులు జరిగేవి. ఇప్పుడు అధికారులే మాట వినడం లేదు. యువత , మహిళలు అందరూ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలి. సమయం వృధా చేసుకోవద్దు. ఓటు అడగడానికి వస్తే మొహంపైనే ‘ఎందుకు ఓటు వేయాలి’ అని అడగండి’’ అంటూ అంటూ వరుస పోస్టులు చేశారాయాన.జనసేనకు ఓటు బ్యాంకు ఉన్న రాజోలులో.. గత కొంతకాలంగా టీడీపీ వర్సెస్ జనసేన వ్యవహారం నడుస్తోంది. అధికారంలోకి వచ్చాక జనసేన(Jana Sena) కేడర్‌ను టీడీపీ నేతలు చిన్నచూపు చూస్తున్నారని అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ ఎన్నిక దీన్ని మరింత ముదిరేలా చేసింది. అసలు టీడీపీ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇవ్వాలి? అంటూ జనసేన నేతలు ప్రశ్నించడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది.రాజశేఖర్ నేపథ్యం.. ఎన్డీయే కూటమి తరఫున ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ(Godavari MLC Elections) అభ్యర్థిగా పెరబత్తుల రాజశేఖర్ పేరును టీడీపీ ప్రకటించింది. 1998లో టీడీపీలో చేరిన రాజశేఖర్.. ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పని చేశారు. 2024 ఎన్నికల్లో కాకినాడ రూరల్ టికెట్ దక్కుతుందని ఆయన ఆశించారు. అయితే అది జనసేనకు వెళ్లింది. దీంతో అలకబూనిన ఆయన్ని చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి బుజ్జగించారు. ఇదీ చదవండి: మనుషుల వైద్యానికి.. పశువుల వైద్యంతో ముడి -
‘ఎమ్మెల్సీలు గెలిస్తే సంచలనమే’
సాక్షి,నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దించేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక అరువు తెచ్చుకున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. నిజామాబాద్‌లో ఆదివారం(ఫిబ్రవరి16) నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో లక్ష్మణ్ మాట్లాడారు.‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దించేందుకు కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువయ్యారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కొమురయ్య, అంజిరెడ్డిలను గెలిపించాలి. ఎన్నికల విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు సంభవించే అవకాశం ఉంది.కులగణన పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారు. బీసీ హక్కులను,రిజర్వేషన్లను ముస్లింలకు అప్పజెప్పే పనిలో ఉన్నారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడే పనిలేదు. వాళ్ల దుకాణం బంద్ అయింది.ఎంపీ అర్వింద్ కామెంట్స్హిందూ రాష్ట్ర స్థాపనే నా లక్ష్యంఎన్నికలు ఏవైనా..ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారుప్రపంచానికి దిక్సూచిగా మారిన మోదీ కులం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటుదేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని గెలిపించాలి -
రేవంత్.. రాహుల్ గాంధీ కులమేంటి?: బండి సంజయ్
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి రేవంత్.. ప్రధాని గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు కేంద్రమంత్రి బండి సంజయ్. దేశ ప్రధాని ఎవరైనా ఆయనను బాధ్యతతో గౌరవించాలి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఏ కులం, ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి అని డిమాండ్ చేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘మన దేశ ప్రధానమంత్రిని ఎవరైనా గౌరవించాలి. రేవంత్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. మోదీ కులాన్ని బీసీ జాబితాలోకి చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. దేశంలో 27 మంది బీసీ ఎంపీలను కేంద్ర మంత్రులుగా ప్రధాని మోదీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం 46 శాతం బీసీలు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎంత మంది బీసీలను మంత్రులుగా చేశారు?. అగ్రవర్ణాల్లో పేదలను మోదీ గుర్తించారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. రాహుల్ కుటుంబం గురించి చర్చ జరగాలి. కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే. రాహుల్ గాంధీ కులం, మతం, దేశం మీద.. మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్దామా?. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డైవర్షన్ చేయడానికే ఈ చర్చ పెడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలపై మాట్లాడటం లేదు. 317 జీవోపై మాట్లాడింది కేవలం బీజేపీ మాత్రమే. నిరుద్యోగ మార్చ్ చేసింది బీజేపీనే పార్టీనే. ఉద్యోగుల కోసం మేము పోరాటం చేశాం.పది శాతం ముస్లీంలను తీసివేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రానికి పంపితే మోదీని ఒప్పిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలలో ముస్లింలే గెలిచే ప్రమాదం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఘోరమైన తప్పిదాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. కుల గణన సక్రమంగా చేస్తే రీ సర్వే ఎందుకు చేస్తారు?. కాంగ్రెస్ కుల గణన తప్పుల తడకగా ఉందన్నారు.ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ..‘వ్యక్తి కోసం పార్టీ రూల్స్ మారవు. పార్టీ అంతర్గతవిషయాల్లో కులాలు చూడరు. ఒక్క వ్యక్తిని ఉద్దేశించి పార్టీ నిర్ణయాలు మార్చుకోదు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ దృష్టికి తీసుకెళ్లాలి. ఇలా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. రాజా సింగ్ మా పార్టీ ఎమ్మెల్యే ఆయనతో రోజు మాట్లాడతాను’ అని అన్నారు. -
TG: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
సాక్షి,న్యూఢిల్లీ: మెదక్, నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్‌రెడ్డిని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం(జనవరి31) ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న సీనియర్ నేత జీవన్‌రెడ్డి పదవీకాలం త్వరలో ముగియనుంది.కాగా, తెలంగాణలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. మెదక్,నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంతో పాటు రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.మార్చి 3న ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 3న ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పింది. ఫిబ్రవరి 3 నుంచి 10 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. -
ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ రిలీజ్
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెలాఖరులో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, అలాగే ఉత్తరాంధ్ర టీచర్స్ MLC పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఈసీ షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 27వ తేదీన పోలింగ్, మార్చి 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. -
TG: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్, 27వ తేదీన పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తెలంగాణలో రెండు టీచర్స్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. మెదక్-నిజామాబాద్-అదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి జీవన్ రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీకి రఘోత్తం రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నర్సిరెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. -
రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది.. అందుకు ఇదే నిదర్శనం
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్పై సెటైర్లు వేశారు.తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ..ఎన్నికల్లో పోటీచేసేందుకు బీఆర్ఎస్ ముఖం చాటేసింది. కేసీఆర్ సొంత జిల్లాలో ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా?. ఎమ్మెల్సీ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలి. యువరాజు సమాధానం చెప్పాలి.టీచర్స్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టకపోవడం దారుణం. దేవిప్రసాద్ లాంటి వ్యక్తికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వరు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు సీఆర్ఎస్ ఇచ్చారు. బీఆర్ఎస్ పని అయిపొయింది అనడానికి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. బీఆర్ఎస్ తొకముడువడంతో బీజేపీ విజయం నల్లేరుమీద నడకయ్యిందని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇప్పటికే తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సరోత్తమ్‌రెడ్డి (వరంగల్), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమరయ్య(పెద్దపల్లి), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డి(సంగారెడ్డి)ని ఎంపిక చేసినట్టు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. -
Telangana: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణలో త్వరలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అందరికంటే ముందుగా బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, నిజామాబాద్-అదిలాబాద్-కరీంనగర్-మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కోమరయ్య, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి పేర్లను ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాలతో కిషన్‌రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు.ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డిల పదవీకాలం ఈ మార్చితో పూర్తి కానుంది. ఈ క్రమంలో.. ఏప్రిల్‌లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఒకవైపు ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, ముసాయిదాను సిద్ధం చేసింది. మరోవైపు.. రెండుసార్లు అవకాశం కల్పించినా ఓటర్ నమోదుకు పెద్దగా స్పందన రావడం లేదు. దీంతో.. ఎన్నికల ప్రకటన వెలువడే వరకూ అవకాశం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు.మరోవైపు 12 జిల్లాల నుంచి ఓటు హక్కు కోసం మొత్తం 28వేల మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోగా, పరిశీలన అనంతరం మొత్తం 22,554 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను ఫైనల్ చేశారు. -
AP: టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం
Teachers MLC Election Updates..పోలింగ్ ప్రారంభం.. ప్రారంభమైన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 2667..మొత్తం పోలింగ్ కేంద్రాలు 20..పశ్చిమ గోదావరి జిల్లాలోని 20 మండలాల్లో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుజిల్లాలో మొత్తం ఓటర్లు..3,729పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.బ్యాలెట్ పద్ధతి ద్వారా జరుగుతున్న పోలింగ్👉గోదావరి జిల్లాల్లో రసవత్తర పోరుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. శాసనమండలిలో ఖాళీ అవుతోన్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.👉ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల్లో 16,737 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 116 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. 👉ఇక, సిట్టింగ్ ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. మిగిలి ఉన్న రెండేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గంధం నారాయణరావు, పులుగు దీపిక, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి(విల్ల లక్ష్మి), బొర్రా గోపి మూర్తి బరిలో నిలిచారు. వీరంతా స్వతంత్రంగానే పోటీలో నిలిచారు. వీరిలో ప్రధాన పోటీ గంధం నారాయణరావు, బొర్రా గోపి మూర్తి మధ్యనే ఉండేలా కనిపిస్తోంది. గంధం నారాయణరావు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఒక పర్యాయం పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి పోటీ పడుతున్నారు.👉ఈ శాసనమండలి ఎన్నికలకు నవంబర్ 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. -
నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి జిల్లాల్లో రసవత్తర పోరుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. శాసనమండలిలో ఖాళీ అవుతోన్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. మిగిలి ఉన్న రెండేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గంధం నారాయణరావు, పులుగు దీపిక, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి(విల్ల లక్ష్మి), బొర్రా గోపి మూర్తి బరిలో నిలిచారు. వీరంతా స్వతంత్రంగానే పోటీలో నిలిచారు. వీరిలో ప్రధాన పోటీ గంధం నారాయణరావు, బొర్రా గోపి మూర్తి మధ్యనే ఉండేలా కనిపిస్తోంది. గంధం నారాయణరావు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఒక పర్యాయం పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి పోటీ పడుతున్నారు.ఈ శాసనమండలి ఎన్నికలకు నవంబర్ 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.పోటాపోటీగా ప్రచారం ఈ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి అభ్యర్థులంతా పోటాపోటీగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కలియ తిరుగుతూ ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకోవడంలో చివరి వరకు బిజీగానే ఉన్నారు. ఈ స్థానానికి గురువారం జరిగే పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కాకినాడ జిల్లాలో కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలో పోలింగ్ సిబ్బంది బుధవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రితో తరలి వెళ్లారు. రెండు డివిజన్ల పరిధిలో 21 మండలాలలో 22 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పురుష ఓటర్లు 1,970, మహిళా ఓటర్లు 1,448 మంది. మొత్తం 3,418 మంది ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ అభ్యర్థి భవితవ్యాన్ని తేల్చనున్నారు. జేఎన్టీయూ కాకినాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. జేఎన్టీయూకే రీడింగ్ రూమ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో స్ట్రాంగ్ రూమ్ నిర్వహిస్తారు, జేఎన్టీయూకేలోని రీడింగ్ హాలులో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎన్నికల రిటరి్నంగ్ అధికారిగా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, అసిస్టెంట్ రిటరి్నంగ్ అధికారులుగా డీఆర్ఓ జె.వెంకట్రావు, టి.సీతారామమూర్తి, వి.విశ్వేశ్వరరావు, వి.మదన్మోహన్, ఎం.వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున మొత్తం 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
కోనసీమలో ‘కోడ్’ ఉల్లంఘన
సాక్షి, అంబేద్కర్ జిల్లా: కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోంది. సమయం దాటిన తర్వాత కూడా మద్యం విక్రయాలు కొనసాగుతున్నా.. ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 5వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు వైన్ షాపులు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ వైన్ షాపులు యథేచ్ఛగా వైన్ షాపులు కొనసాగుతున్నాయి. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ.. జీవన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్
జగిత్యాల: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికల్లో పోటీ చేయడం, చేయించడం పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తన వ్యక్తిగత నిర్ణయం ఏమీ లేదని కుండబద్ధలు కొట్టారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే బాగుంటుంది. ఆ అభిప్రాయం అధిష్టానానికి కాంగ్రెస్ రాష్ట్ర శాఖ నివేదిస్తుంది. నివేదిక తర్వాత ఎవరు బరిలో ఉండాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. పోటీ చేయడం, చేయించడం పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. నా వ్యక్తిగత నిర్ణయం అంటూ ఏది లేదు.గతంలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీగా నేనే వ్యక్తిగతంగా ఏమీ పోటీ చేయలేదు. పార్టీ నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను. నాకు ఎవరూ హామీ ఇవ్వలేదు.. నాకు ఎలాంటి ఒప్పందాలూ లేవు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల టీపీసీసీ చీఫ్ పార్టీ నేతలతో మాట్లాడుతూ.. వచ్చే పట్టభ్రదుల ఎన్నికల్లో మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం ఇవ్వాలని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డికే అవకాశం దక్కే అవకాశం ఉంది. -
రిజిస్ట్రేషన్‌కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చండి ప్లీజ్!
ప్రస్తుతం శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన సందడి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నిక కోసం పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రభుత్వం ఈ నెల 6వ తేదిని ఆఖరు తేదీగా ప్రకటించింది. ఈ ఓటు హక్కు కోసం 2021లోపు డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని ప్రకటించింది. ఆ యా పార్టీల అభ్యర్థులు, వ్యాపార సంస్థల నుండి పట్టభద్రులుగా ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలనుకునే వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ సెల్ నెంబరు ద్వారా ఓటు నమోదు కోసం గ్రాడ్యుయేట్లను కోరుతున్నారు. అయితే పట్టభద్రులు తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తప్పనిసరి కావడంతో... చాలామంది రిజిస్ట్రేషన్‌కు వెళ్లడానికి బద్ధకిస్తున్నారు.వాస్తవానికి ఓటు హక్కును సులువుగా ఉపయోగించుకునేలా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల అనేక మంది పట్టభద్రులు ప్రత్యేకంగా ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి ఓటు నమోదు చేసుకోడానికి సమయం వెచ్చించడం లేదు. పట్టభద్రుల ఓటు నమోదు కోసం ఉంచిన వెబ్ సైట్లో డిగ్రీ ధ్రువపత్రం, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు నంబర్లను నమోదు చేసినా... మళ్లీ గెజిటెడ్ స్థాయి అధికారి సంతకంతో ధ్రువీకరించిన పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలనే షరతు చికాకు కలిగిస్తోంది. అందుకే చాలామంది తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు.చదవండి: స్టూడెంట్ లీడర్ టు సీఎం.. రేవంత్ రెడ్డి రాజకీయ పొలిటికల్ జర్నీఒకవేళ ఇదే మంచి ఆలోచన అని ప్రభుత్వం భావించినప్పుడు ఆ యా మండల స్థాయిలోనే ఒకరిద్దరు గెజిటెడ్ స్థాయి అధికారులను ఉంచి, అక్కడే ఓటు హక్కును ప్రభుత్వమే నమోదు చేస్తే బాగుండేది. ఈ విషయాన్ని అటు ఎన్నికల కమిషన్, ఇటు ప్రభుత్వం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్ని షరతులు ఉన్నా... వాటిని అధిగమించి తమ ఓటును రిజిస్టర్ చేసుకోవాలి. మంచి ప్రతినిధిని ఎన్నుకుని గొప్ప భవిష్యత్తుకు బాటలు వేయాలి.– సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా -
ప్రజాస్వామ్యం బతికుందా?
-
అప్రజాస్వామిక పాలనలో.. ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం: వైఎస్సార్సీపీ
తాడేపల్లి: ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్న కారణంగా తాము పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది.ఈ మేరకు వైఎస్సార్సీపీ నేతలు గురువారం మీడియాతో మాట్లాడారు. ‘కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నిక ఉంది. ఈ ఎన్నిక ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికొదిలేసింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. టీడీపీ నేతలు ఎన్ని అఘాయిత్యాలు చేసినా పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం’ అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఇవి కూడా చదవండి: నా భర్తకు ఏం జరిగినా అందుకు హోంమంత్రి అనితదే బాధ్యతనీచ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే బాలకృష్ణస్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుల దౌర్జన్యం -
తూర్పు గోదావరి టీడీపీలో ‘ఎమ్మెల్సీ’ గోల
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తెలుగుదేశం పార్టీలో మూడు ముక్కలాటకు తెరతీసింది. ప్రస్తుతం గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు (ఐవీ) పదవీ కాలం ముగియడంతో ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉపాధ్యాయ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన ఐవీని ప్రజా సంఘాలన్నీ ఏకమై ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరుతో గెలిపించుకున్నాయి. పట్టభద్రుల స్థానానికి జరిగే ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగాలని ఓటర్లు అభిలషిస్తుంటారు. కానీ టీడీపీ ఈ ఎన్నికల్లోనూ తమ వారినే బరిలోకి దింపడానికి సిద్ధమైంది. దీంతో మూడు సామాజికవర్గాల నుంచి మూడు జిల్లాలకు చెందిన ముగ్గురు టీడీపీ నేతలు రేసులోకి వచ్చారు. కాకినాడ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్తిబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గుత్తెనదీవికి చెందిన ఐ.పోలవరం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్, తూర్పు గోదావరి జిల్లా నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ ఈ రేసులో ఉన్నారు. వీరు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. ఒకరిని ఒకరు అడ్డుకొంటూ టిక్కెట్ దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి టిక్కెట్ దక్కకుండా వ్యతిరేక వర్గాలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో పెద్ద రగడే జరుగుతోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ మరికొందరు కూడా రేసులోకి రావొచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు.చాన్స్ ఇవ్వాల్సిందేనంటున్న సత్తిబాబుబీసీలలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి సత్తిబాబు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు మాటకు కట్టుబడి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని కూటమికి త్యాగం చేశామని, పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత ప్రాధాన్యం కల్పిస్తానని బాబు ఇచ్చిన హామీపై నమ్మకంతోనే కూటమి విజయానికి పనిచేశామని సత్తిబాబు వర్గీయులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ చాన్స్ ఇవ్వకపోతే లేదంటే తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు.తమకే కావాలంటున్న కాపు సామాజికవర్గంకోనసీమ జిల్లా నుంచి బీసీ సామాజికవర్గంలో వాసంశెట్టి సుభాష్‌కు రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కడంతో పట్టభద్రుల స్థానాన్ని పేరాబత్తుల రాజశేఖర్‌కు ఇవ్వాలని కాపు సామాజికవర్గం పట్టుబడుతోంది. ఆ వర్గం నేతలు ఇటీవల చంద్రబాబును కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో రాజశేఖర్ కాకినాడ రూరల్ స్థానం ఆశించారని, అధిష్టానం సూచనలతో జెడ్పీ చైర్మన్ సీటునూ వదులుకున్నామని గుర్తుచేస్తున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ప్రచార కార్య్రకమాలకు సమన్వయకర్తగా కష్టపడ్డ రాజశేఖర్‌కు అవకాశం ఇవ్వకపోతే అంగీకరించేది లేదని అంటున్నారు.జవహర్‌ను వ్యతిరేకిస్తున్న అచ్చిబాబు వర్గంతూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ మంత్రి జవహర్ ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో కొవ్వూరు స్థానాన్ని ఆశించిన జవహర్‌కు చంద్రబాబు సామాజికవర్గం మోకాలడ్డటంతో సీటు దక్క లేదు. ఇప్పుడు మండలికి అవకాశం కల్పించాలని చంద్రబాబును ఎస్సీ సామాజికవర్గం కోరుతోంది. అయితే, జవహర్‌ను టీడీపీలోని మరో కీలక నాయకుడు పెండ్యాల అచ్చిబాబు వర్గీయులు అడ్డుకొంటున్నారు. అచ్చిబాబు వర్గం మంత్రి లోకేశ్‌ను ఆశ్రయించి జవహర్‌కు అవకాశం దక్కకుండా చేసే పనిలో ఉంది. చంద్రబాబు వద్ద జవహర్ ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు ఈ వర్గంలోని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. -
ఎమ్మెల్సీ రేసులో ఆశావహులు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులతోపాటు స్వతంత్రులు రంగంలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికల హడావుడి నెలకొంది. ఇప్పటికే బరిలో నిలవనున్న అభ్యర్థులు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నారు.సెప్టెంబరులో పట్టభద్రుల ఎన్రోల్మెంట్ ప్రారంభంకానుంది. 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరినీ బరిలోకి దించలేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జీవన్‌రెడ్డి గెలుపొందారు. తాజాగా ఇటీవల కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎనిమిది స్థా నాలు గెలుచుకోవడంతో ఎలాగైనా కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని మరోసారి కై వసం చేసుకోవాలని వ్యూహరచనలో మునిగింది.కాంగ్రెస్ నుంచి ముగ్గురి పేర్లు⇒ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమిపాలైన వెలిచాల రాజేందర్రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దివంగత ఎమ్మెస్సార్ మనవడు మేన్నేని రోహిత్‌రావు, హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన సబ్బని వెంకట్లు ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.⇒ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన వెలిచాల రాజేందర్రావు తనకు 15 రోజులు ముందు టికెట్ కేటాయించడంతో ఆ సమయంలో ఓటర్లందరినీ కలుసుకోలేకపోయానని తనకు ఎమ్మెల్సీగా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి విన్నవించుకున్నట్లు సమాచారం. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో తన తండ్రి వెలిచాల జగపతిరావుకు సన్నిహిత సంబంధాలు ఉండేవని, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేశారని.. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని తనకు టికెట్ కేటాయిస్తే విజయం ఖాయమని అధిష్టానం వద్ద విన్నవించుకున్నట్లు వినికిడి.⇒ దివంగత సీనియర్ నేత ఎమ్మెస్సార్ మనవడు రోహిత్‌రావు తనకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని, తాత చేసిన సేవలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన పేరును పరిశీలించాలని కోరుతున్నట్లు సమాచారం.⇒ హుజూరాబాద్‌కు చెందిన సబ్బని వెంకట్ ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో హుజూరాబాద్ టికెట్ తనకు కాకుండా వొడితెల ప్రణవ్‌కు కేటాయిస్తే చిత్తశుద్ధితో పనిచేశానని తన పేరును ఎమ్మెల్సీ టికెట్ కోసం పరిశీలించాలని అధిష్టానం వద్ద ఇప్పటికే విన్నవించుకోవడం తెలిసిందే.బీజేపీ నుంచి వీరే.. భారతీయ జనతా పార్టీ నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీచేసి ఓటమిపాలైన జి.రాణిరుద్రమదేవితోపాటు ఆ పార్టీ సీనియర్‌నేత, న్యాయవాది పొల్సాని సుగుణాకర్‌రావు పార్టీ అభ్యర్థిత్వం కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విస్తృతమైన సంబంధాలతోపాటు పాత, కొత్త కలయికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించే పథకాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం చేకూరుస్తాయని సుగుణాకర్‌రావు అధిష్టానం వద్ద గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలిసింది. రాణిరుద్రమదేవి తనదైన శైలిలో టికెట్ కోసం ప్రయత్నాలతోపాటు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.బరిలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేతఅల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవసరమైతే ప్రధాన పార్టీల అభ్యర్థిత్వం, లేనట్లయితే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో నిలిచేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎన్రోల్మెంట్ ప్రక్రియతోపాటు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నాలుగు జిల్లాల పరిధిలో అల్ఫోర్స్ విద్యాసంస్థలు విస్తరించి ఉండడంతోపాటు వేలాది మంది విద్యార్థులను, పట్టభద్రులతో ఉన్న సంబంధాలు తన విజయానికి సోపానంగా ఉంటాయని ఆలోచిస్తున్నారు. 2019లోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించినా రాకపోవడంతో విరమించుకున్నారు. అప్పటి నుంచి ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టాలనే నరేందర్‌రెడ్డి అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.బీఆర్ఎస్లో భారీ పోటీమాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, బీఎన్ రావు, యాదగిరి శేఖర్‌రావు తదితరులు మరోసారి గులాబీ సత్తా చాటేందుకు వ్యూహరచనలో మునిగితేలుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పోటీ చేసేందుకు ముందుకొస్తున్న ఆశావహులు ఎవరికి వారు సర్వేలు చేయించుకుంటూ అనుచరగణంతో మంతనాలు సాగిస్తున్నారు. -
ఈవీఎంలు లేవు.. కూటమి ఢమాల్
-
ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం..
-
ఎమ్మెల్సీగా బొత్స.. 16న అధికారికంగా ప్రకటన
మహారాణిపేట (విశాఖ దక్షిణ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నిక దాదాపు ఖరారైంది. స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. ఆ రోజు బొత్స సత్యనారాయణ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.పూర్తయిన నామినేషన్ల పరిశీలనబుధవారం ఉదయం నామినేషన్ల పరిశీలన జరిగింది. జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి కె.మయూర్ అశోక్ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌కుమార్, ఇతర రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో బొత్స సత్యనారాయణ ఎన్నికల ఏజెంట్ మణికంఠ నాయుడు, స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా సమక్షంలో నామినేషన్ల పరిశీలన జరిగింది. అభ్యర్థికి ప్రతిపాదన చేసిన ఓటర్లు, ఇతర పత్రాలను క్షుణంగా పరిశీలించారు. కొద్దిసేపటి తర్వాత 2 నామినేషన్లు సక్రమంగానే ఉన్నట్టు ఆర్వో మయూర్ అశోక్ ప్రకటించారు. ఆ తర్వాత షఫీ ఉల్లా తన నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు ఆర్వో మయూర్ అశోక్‌కు లేఖ అందజేశారు.పోటీకి భయపడ్డ కూటమిఓటమి భయంతో కూటమి పోటీ నుంచి తప్పుకుంది. బలం లేకపోయినా పోటీ చేయడానికి చివరి వరకు టీడీపీ ప్రయత్నం చేసింది. పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఆ పార్టీ పెద్దలు గ్రహించారు. దీంతో పోటీకి వెనకడుగు వేశారు. -
ఒక్కటిగా నిలబడ్డాం.. అందుకే బాబు తలవంచారు: వైఎస్ జగన్
నిజానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు అందరికీ కాల్స్ చేసి.. అది ఇస్తా, ఇది ఇస్తా అని ఆశ చూపే ఉంటాడు. కానీ ధర్మం, న్యాయం గెలిచింది. మీరు ఒక్కటిగా నిలబడ్డారు కాబట్టి ఆయన ఆటలు సాగలేదు. సంఖ్యా బలం లేనప్పుడు పోటీ పెడతాననడమే తప్పు. అలా చేయడం ఆయన నైజం. ఆ మనిషి అలా చేసినా కూడా వైఎస్సార్సీపీ నాయకులు అందరూ ఒకే తాటిమీద విలువలు, విశ్వసనీయతతో నిలబడటం వల్లే ఆ మనిషి తల వంచారు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మనమంతా ఏకమై ఎప్పుడైతే యుద్ధం చేయడం ప్రారంభించామో.. ఎప్పుడైతే వైఎస్సార్సీపీ కేడర్ బలంగా కనిపించిందో అప్పుడు చంద్రబాబు వెన్నులో భయం ప్రారంభమైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అందుకే ఎన్నికలో పోటీ నుంచి విరమించుకున్నట్టు ప్రకటన చేశారని చెప్పారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. ‘గత ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజా ప్రతినిధులుగా మీరంతా చూసే ఉంటారు. ఎన్నికల్లో ఈ మాదిరి ఫలితాలు రావడానికి కారణం పది శాతం ఓటర్లు చంద్రబాబు చెబుతున్న అబద్ధాల వైపు మొగ్గు చూపారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధపు హామీలతో మోస పూరితమైన ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు అంతా మోసపోయిన పరిస్థితుల్లో ఉన్నారు’ అని చెప్పారు. ఇప్పడు ప్రతి ఇంట్లోనూ జగన్ ఉండి ఉంటే.. అన్న విషయంపై చర్చ జరుగుతోందన్నారు. ‘జగన్ పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానని ఆశ చూపాడని అంటున్నారు. చివరకు పలావు పోయింది. బిర్యానీ పోయిందనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లో జరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పథకాలు రాకపోగా, వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ దగ్గర కుర్చీలు కూడా తీసేస్తున్న పరిస్థితి ఉంది’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మనం ఏ సాకూ చూపలేదు » ఇవాళ ఏ సమస్య లేకపోయినా చంద్రబాబు ఎన్నో సమస్యలున్నట్టు చిత్రీకరిస్తున్నాడు. నిజానికి ఆనాడు మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు. ఒకవైపు చంద్రబాబు చేసిన అప్పులు.. ఆ అప్పుల మీద వడ్డీలు.. వాటికి తోడు కోవిడ్ మహమ్మారి.. ఇలా మన పరిపాలన కాలంలో సమస్యలు తాండవించాయి. ఆ సమయంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గినా, రాష్ట్రంలో పెట్టే ఖర్చు అనూహ్యంగా పెరిగినా మనం ఎలాంటి సాకులు చూపలేదు. ఎటుంటి కారణాలు చెప్పలేదు. శ్వేతపత్రాలు అని చెప్పడమో.. గత ప్రభుత్వాల మీద నిందలు మోపడమో చేసి.. ప్రజలకు చేయాల్సింది చేయకుండా పోయే కారణాలు ఎప్పుడూ చూపించలేదు.» ఎన్ని కష్టాలున్నా చిక్కటి చిరునవ్వుతో ప్రతి ఇంటికి మంచి చేస్తూ.. ఈ నెలలో ఈ కార్యక్రమం చేస్తామని.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా బడ్జెట్లో ఒక కేలండర్ విడుదల చేసి.. బటన్ నొక్కి, ప్రతి ఇంటికీ నేరుగా డోర్ డెలివరీ చేసిన చరిత్ర మన ప్రభుత్వానిది. దేవుని దయతో ఇవన్నీ చేయగలిగాం. అందుకే ఈ రోజు ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి సగర్వంగా తలెత్తుకుని పోగలుగుతాడు. అక్కా, అన్నా మా ప్రభుత్వంలో ఇది చెప్పాం.. చెప్పింది తూ.చా. తప్పకుండా ప్రతి ఒక్కటీ అమలు చేశామని చెప్పగలుగుతారు.ఇప్పటికే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత » రెండున్నర నెలల చంద్రబాబు పాలన చూశాం. ఇంతలోనే చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇంత వేగంగా పుట్టడం మొట్ట మొదటిసారి చూస్తున్నాం. ఇవాళ జగనే ఉండి ఉంటే.. అన్న చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది. వైఎస్సార్సీపీ ఉండి ఉంటే.. ప్రతి తల్లికి అమ్మఒడి వచ్చేది. ప్రతి రైతన్నకు రైతుభరోసా సొమ్ము వచ్చి ఉండేది. 2023–24 ఖరీఫ్‌కు సంబంధించి ఇన్సూ్యరెన్స్ సొమ్ము కూడా వచ్చి ఉండేది. » విద్యార్థులకు ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు పడేవి. ప్రతి త్రైమాసికం అయిపోయిన తర్వాత ఇచ్చే పరిస్థితులు గతంలో ఉంటే.. ఇప్పుడు రెండు త్రైమాసికాలు అయిపోయినా డబ్బులు ఇవ్వలేదు. వసతి దీవెన కూడా ఇవ్వలేదు. పొదుపు సంఘంలోని ప్రతి అక్కచెల్లెమ్మకు మామూలుగా ఏప్రిల్‌లో సున్నా వడ్డీ డబ్బులు జమ అయ్యేవి. అవి కూడా పడలేదు. » నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా లేదు. వాహన మిత్ర కూడా లేదు. ఎక్కడా ఎవరూ అడగాల్సిన అవసరం లేకుండా సాఫీగా అన్నీ జమ అయ్యే పరిస్థితి నుంచి ఇవాళ ఒక్కరికీ ఒక మేలు జరగకపోగా.. అన్నీ దారుణాలే జరుగుతున్నాయి. అంతా అస్తవ్యస్తం » విద్యా రంగంలో టోఫెల్ అనే సబ్జెక్టు పీరియడ్‌గా ఉండేది. దాన్ని ఎత్తేశారు. ఇంగ్లిష్ మీడియం, రోజుకొక మెనూతో గోరుముద్ద.. పాఠశాల పిల్లలకు పెట్టే భోజనం ప్రశ్నార్థకం అయింది. డిసెంబర్లో పిల్లలకిచ్చే ట్యాబుల పరిస్థితి ప్రశ్నార్థకం అయింది. » ఆరోగ్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1,800 కోట్లు దాటాయి. మార్చిలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి జనవరి నుంచి ఉన్న రూ.1,800 కోట్ల బకాయిలు ఆపేశారు. ఇవాల్టికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గతంలో జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ఏ ఆసుపత్రిలోనూ డాక్టర్ల కొరత ఉండకూడదన్న పరిస్థితి నుంచి, ఈ రోజు ఆసుపత్రుల్లో డాక్టర్లు ఎక్కడ ఉన్నారు? అన్న పరిస్థితికి ప్రభుత్వ ఆస్పత్రులు వెళ్లిపోయాయి. ఆరోగ్య ఆసరా కనిపించడం లేదు. 108, 104 బిల్లులు లేవు. ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరు, మందులు లేవు, పరిశుభ్రత అన్నది లేనే లేని పరిస్థితి.» రైతులు విత్తనాల కోసం మళ్లీ క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రీ ఇన్సూరెన్స్ పోయింది. ఈ–క్రాప్ పోయింది. ఉచిత పంటల బీమాను కూడా పక్కన పెట్టేశారు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అవ్వాతాతల పెన్షన్ నుంచి, బియ్యం వరకు ప్రతి పథకం డోర్ డెలివరీ జరిగేది. ఇప్పుడు అంతా పోయింది. తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ.. జన్మభూమి కమిటీలంటూ నాయకులు ఎక్కడున్నారని వాళ్ల దగ్గరకు ప్రజలు వెళ్లాల్సిన దుస్థితిలో ఇవాళ పాలన సాగుతోంది. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన » రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తి అధ్వానంగా మారింది. రెడ్‌బుక్ పాలన సాగుతోంది. గ్రామ స్థాయిలో కక్షలను ప్రోత్సహించకూడదన్నది పక్కన పెట్టి.. గ్రామ స్థాయిలోనే వాటిని ప్రోత్సహిస్తూ మీరు చేసుకోండి.. పోలీసులను మేం చూసుకుంటాం.. అని రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. దిశ యాప్ ఏమైందో కూడా అర్థం కావడం లేదు. ఇవన్నీ కేవలం రెండున్నర నెలల్లోనే మన కళ్లెదుటే కనిపిస్తున్న మార్పులు. » ఎక్కడా అబద్ధాలు, మోసాలు లేకుండా ప్రజలకు మనం మంచి చేశాం. చంద్రబాబు బిర్యానీ పెడతానని మోసం చేస్తున్నాడు. ఇచ్చిన ఏ మాట నెరవేర్చనప్పుడు ప్రజలు తాము మోసపోయామన్న భావవ నుంచి కోపం పుడుతుంది. అప్పుడు చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.మన వ్యక్తిత్వమే మనకు రక్ష» ఈ ఐదేళ్లలో కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా సృష్టే ఉండదు. చీకటి వచ్చిన తర్వాత మళ్లీ పగలు రాక తప్పదు. కష్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే.. 16 నెలలు నన్నే జైల్లో పెట్టారు. కష్టాలు వచ్చినప్పుడు మన వ్యక్తిత్వమే మనకు శ్రీరామరక్షగా నిలబడుతుంది. మీ అందరికీ ఒక్కటే చెబుతున్నా. మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. రానున్న రోజుల్లో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్లి మేం ఫలానా మంచి చేశామని చెప్పుకునే పరిస్థితి ఉండదు. » ఎందుకంటే వాళ్లు చెప్పినవన్నీ మోసాలు, అబద్ధాలు కాబట్టి ప్రజలు వాళ్లను నిలదీసే కార్యక్రమం జరుగుతుంది. అదే వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తే చెప్పిందే చేశారని దండలు వేసే పరిస్థితి వస్తుంది. ఐదేళ్ల తర్వాత మళ్లీ మీకు, నాకు ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది. -
విజయం వైఎస్సార్సీపీదే.. విశాఖ ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్నీ ఎన్నిక ఏకగ్రీవమైంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. కాగా, స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగీవ్రమైంది.కాగా, విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో రిట్నరింగ్ అధికారి ఎల్లుండి బొత్స పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.ఇదిలా ఉండగా.. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరి నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. బలం లేకపోవడం.. బలగానికీ ఇష్టంలేకపోవడంతో పోటీలో ఉంటే చిత్తుగా ఓడిపోవడం తప్పదని పార్టీ పెద్దలు గ్రహించారు. అయినా, కుతంత్రాలపై ఆశలు పెట్టుకున్నారు. చివరికి.. సామదానభేద దండోపాయాలను ఉపయోగించారు. డబ్బులతో అయినా ఓట్లు కొనాలని చివరి నిమిషం వరకూ చూశారు. కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కించిత్తైనా నమ్మకం లేకపోవడంతో కూటమి చేతులెత్తేసి తోకముడిచింది. దీంతో.. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్సీపీ కేడర్ చెక్కు చెదరకపోవడంతో ఆ పార్టీ ఖాతాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు చేరింది. బొత్స విజయం లాంఛనంగా మారింది. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది తొలిమెట్టుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. -
టీడీపీ అవుట్!.. బొత్స విజయం ఖాయం
-
మనం చేసిన మంచి బతికే ఉంది: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు : మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదని స్పష్టం చేశారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రతీ ఇంటికీ మనం చేసిన మంచి బతికే ఉందని, మేనిఫెస్టో అమలులో విశ్వసనీయతకు అర్థం చెప్పామన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం (ఆగస్ట్14) యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు వైఎస్ జగన్.చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని, మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయని, వాటికి వడ్డీలు కూడా ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ మరోసారి గుర్తు చేశారు. ఆ సమయంలో కోవిడ్‌లాంటి విషమ పరిస్థితులు వచ్చాయన్నారు. ఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదని, శ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదని, కోవిడ్‌ను సాకుగా చూపి ఎగ్గొట్టలేదన్నారు. యలమంచిలి నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ కేడర్ బలంగా కనిపించడంతో చంద్రబాబులో భయం మొదలైందిదీనివల్లే పోటీనుంచి టీడీపీ విరమించుకుందిగత ఎన్నికలు ఎలా జరిగాయని మీరంతా చూసే ఉంటారుప్రజలకు ఆశ చూపి చంద్రబాబు మోసం చేస్తున్నారుమన ప్రభుత్వ హయాంలో మనంచేసిన మంచి ఎక్కడికీ పోలేదుప్రతి ఇంటికీ మనం చేసిన మంచి బతికే ఉందిమేనిఫెస్టో అమల్లో విశ్వసనీయతకు అర్థం చెప్పాంచంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు చిత్రీకరిస్తున్నాడుమన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయివాటికి వడ్డీలు కూడా ఉన్నాయివీటికితోడు కోవిడ్‌లాంటి విషమ పరిస్థితులూ వచ్చాయిఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదుశ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదుకోవిడ్ను సాకుగా చూపి ఎగ్గొట్టలేదుఎన్ని కష్టాలు ఉన్నా.. క్యాలెండర్ ప్రకటించి పథకాలు అమలు చేశాంఐదేళ్లపాటు క్యాలెండర్ తప్పకుండా పథకాలు అందించాంపథకాలను ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేశాందేవుడి దయతో ఇవన్నీ చేయగలిగాంప్రతి కార్యకర్తకూడా ఇప్పటికీ ప్రతి ఇంటికీ సగర్వంగా వెళ్లగలడుచెప్పించి మేం చేయగలిగాం అని చెప్పుకోగలడుఈ రెండున్నర నెలల పాలనలో ఒక ప్రభుత్వం మీద ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదురెండున్నర నెలల కాలంలో తీవ్రమైన ప్రజావ్యతిరేకత కనిపిస్తోందిప్రతి ఇంట్లో కూడా.. జగనే ఉండి ఉంటే.., వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉండే.. అన్న చర్చ జరుగుతోందిఈపాటికే అమ్మ ఒడి అందేది, రైతు భరోసా అందేది, రైతులకు పంటల బీమా అందేది: ఫీజురియింబర్స్మెంట్నేరుగా ఖాతాల్లో పడేదివసతి దీవెన కూడా అందేదిపొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నావడ్డీ డబ్బులు పడేవి.. ఇప్పుడు ఇవేమీ అందలేదుపథకాలకోసం ఎవ్వరినీ అడగాల్సిన పనిలేకుండా సాఫీగా అమలు జరగేవిఇప్పుడు ఎవ్వరికీ ఏమీ రాకపోగా, చాలా దుర్మార్గాలు చేస్తున్నారుస్కూళ్లలో టోఫెల్ పీరియడ్‌ను ఎత్తివేశారు ఇంగ్లిషుమీడియం నడుస్తుందన్న ఆశ లేదుమధ్యాహ్న భోజనం ప్రశ్నార్ధకం అయ్యిందిడిసెంబర్లో ఇచ్చే ట్యాబులు లేనట్టేఇప్పుడు ఆర్డర్‌కూడా ఇవ్వలేదు ఆరోగ్య రంగం పూర్తిగా దెబ్బతిందిఆరోగ్య శ్రీ బకాయిలు రూ.1800 కోట్లపైనే దాటిందిప్రభుత్వాసుపత్రుల్లో జీరో వేకెన్సీ అమలు చేశాంఇప్పుడు డాక్టర్లు ఉన్నారా? లేదా? అన్న పరిస్థితి కనిపిస్తోందిఆరోగ్య ఆసరా ఊసే లేదుమందులు లేవు, పరిశుభ్రత అంతకన్నా లేదుఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదురైతులు మళ్లీ క్యూలలో ఉండాల్సిన పరిస్థితి విత్తనాలకోసం ఇ- క్రాప్ పక్కనపడేశారుఉచిత పంటల బీమాను వదిలేశారుబియ్యం డోర్ డెలివరీ లేదుతెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ, మళ్లీజన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది రెడ్ బుక్ పాలన కొనసాగుతోందిగ్రామస్థాయిలో కక్షలను ప్రోత్సహిస్తున్నారుమీరు చేయండి.. మేం చూసుకుంటాం అంటున్నారుదిశ యాప్ ఏమైందో తెలియడంలేదుదిశ నొక్కగానే 10 నిమిషాల్లో వచ్చేవారుఅన్నీ కూడా రెండున్నర నెలల్లోనే జరిగాయిఎక్కడా అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా ప్రజలకు మంచి చేశాంఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండిచంద్రబాబు మోసాలు చూసి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారుకష్టాలు లేకుండా సృష్టే ఉంటుందిచీకటి తర్వాత కచ్చితంగా వెలుగు వస్తుందిరాత్రి తర్వాత పగలు కచ్చితంగా వస్తుందినన్ను 16 నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా కష్టపెట్టారు అయినా సరే.. మనం నిబ్బరంతో నిలబడగలిగాంమన వ్యక్తిత్వమే మనకు శ్రీరామ రక్షపార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఒక్కటిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు వెనక్కితగ్గాడుచంద్రబాబు సహజ నైజం ఇది కాదుఫోన్లు చేసి… అది ఇస్తా, ఇది ఇస్తా అనేవాడు ఎన్నికల సమయంలోకూడా చంద్రబాబు ఇదే తరహాలో ప్రచారం చేసేవాడునీకు 15వేలు, నీకు 18 వేలు అని ప్రచారంచేశాడుఅందర్నీ మోసం చేసి ఇప్పుడు అందరికీ క్యాబేజీలు పెట్టాడుఅలాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరికీ కాల్స్ చేసి.. అది ఇస్తా, ఇది ఇస్తా అని ఆశ చూపెట్టే ఉంటాడుకాని ధర్మం, న్యాయం గెలిచిందిమీరు ఒక్కటిగా నిలబడ్డారు కాబట్టి చంద్రబాబు మెడలు వంచక తప్పలేదుసంఖ్యాబలం లేనప్పుడు చంద్రబాబు పోటీపెడాననటమే తప్పుకాని మీరంతా ఒక్కటిగా ఉండడం వల్లే విజయం సాధ్యమైంది. భీమిలి నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఏమన్నారంటే..ఈ ఎన్నికల్లో ధర్మం, న్యాయానికి పాతరవేయాలని చూశారుఅదే అజెండాతో యుద్ధంచేయాలని చూశారుకాని మనం అంతా ఐకమత్యంగా ఉన్నాంప్రలోభాలకు లోనుకాకుండా మీరంతా గట్టిగా నిలబడ్డారుచివరకు అధర్మ రాజకీయాలు చేయాలనుకునేవాళ్లు తలొగ్గారు:సహజంగా పోటీపెట్టాలనే ఆలోచనకూడా వాళ్లకి రాకూడదుమనకు అంత మెజార్టీ ఉందిపార్టీ సింబల్మీద జరిగిన ఎన్నికల్లో వీళ్లంతా గెలిచారుపోలీసులను పెట్టి బెదిరించాలని చూశారుఏకంగా సీఎం ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి ప్రయత్నించారుమొన్న జరిగిన సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అన్నీ అబద్ధాలు చెప్పారు:నీకు రూ.15వేలు, నీకు రూ.18వేలు, రైతు కనిపిస్తే నీకు రూ.20వేలు అంటూ మోసపూరితమైన క్యాంపెయిన్ చేశారుచంద్రబాబు చెప్పిన అబద్ధాలకు కొంతమంది ఆశపడ్డారని అనిపిస్తుందిఇప్పుడు అంతా మోసపోయిన పరిస్థితుల్లో ఉన్నారుఐదేళ్ల పాలనలో మనం చేసిన మంచి ఎక్కడకీ పోలేదుఇవ్వాళ్టికీ మన కార్యకర్తలు, నాయకులు తలెత్తుకుని ప్రతి ఇంటికీ వెళ్లగలుగుతారు:చంద్రబాబు అప్పుల భారాన్ని, వడ్డీలభారాన్ని మనంకూడా మోసాంకరోనా లాంటి మహమ్మారి కారణంగా రాష్ట్రం ఆదాయాలు పెరిగిపోయాయిఖర్చులు కూడా పెరిగిపోయాయికాని శ్వేతపత్రాల పేరుతో సాకులు చెప్పలేదు చంద్రబాబు అప్పులుగురించి, ఆ అప్పులు వడ్డీల గురించి మనం ఏరోజూ చెప్పలేదుమేనిఫెస్టోలో మనం చేసిన ప్రతి మాటనూ అమలు చేశాంచంద్రబాబులా చెత్తబుట్టలో వేయలేదుదేశచరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా బడ్జెట్లో క్యాలెండర్ పెట్టి అమలు చేశాంపథకాలను నేరుగా డోర్‌డెలివరీ చేశాంఇప్పడు ఏ ఇంట్లో చర్చ జరిగినా.. జగన్ ఉండి ఉంటే.. అన్నదానిపై చర్చ జరుగుతోందిజగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానని ఆశచూపాడని అంటున్నారుచివరకు పలావు పోయింది, బిర్యానీ పోయిందనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందిజగనే ఉండి.. ఉంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండి.. ఉంటే.. అన్న చర్చ జరుగుతోందిటీడీపీ వచ్చాక పథకాలు రాకపోగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయిప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ దగ్గర కుర్చీలు కూడా తీసేస్తున్న పరిస్థితి వైఎస్సార్సీపీ పాలనలో పెన్షన్ నేరుగా ఇంటికే అందేదిఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిలా అండ్ ఆర్డర్ ఎలా ఉన్నదీ ప్రజలంతా చూస్తున్నారుకక్ష తీర్చుకోండి… పోలీసులు మీకు అండగా ఉంటారని టీడీపీ నాయకులు బాహాటంగా చెప్తోందిరెడ్బుక్ పాలన కనిపిస్తోందిప్రతి అంశంలోనూ ఇదే పరిస్థితిలా అండ్ ఆర్డర్ నుంచి గవర్ననెన్స్, ఆరోగ్య రంగం, వ్యవసాయం, విద్యారంగం… ఇలా ప్రతి వ్యవస్థ కుప్పకూలిపోతోందిమరో మూడు నెలల్లో టీడీపీ కార్యకర్త ఏ గడపకూ వెళ్లలేని పరిస్థితి ఉంటుందిప్రతి కుటుంబం కూడా టీడీపీని నిలదీసే పరిస్థితి వస్తుందినువ్వు చెప్పింది ఏంటి.. ఇప్పుడు జరుగుతన్నది ఏంటని అడిగే పరిస్థితికష్టాలు అనేవి ఉంటాయి, కాని అవి శాశ్వతం కాదుకష్టాలు ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండాలిప్రజలకు మనం తోడుగా ఉంటే చాలు.. వాళ్లే మనల్ని ఆదరిస్తారుటీడీపీ అబద్ధాలు, మోసాలతో విసుగెత్తిపోయే పరిస్థితి ఉంటుందివైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తొగ్గలేదు, ప్రలోభాలకు లొంగలేదు కాబట్టి.. చంద్రబాబే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. -
విశాఖ స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
-
చివరకు తప్పుకున్న టీడీపీ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరి నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. బలం లేకపోవడం.. బలగానికీ ఇష్టంలేకపోవడంతో పోటీలో ఉంటే చిత్తుగా ఓడిపోవడం తప్పదని పార్టీ పెద్దలు గ్రహించారు. అయినా, కుతంత్రాలపై ఆశలు పెట్టుకున్నారు. చివరికి.. సామదానభేద దండోపాయాలను ఉపయోగించారు. డబ్బులతో అయినా ఓట్లు కొనాలని చివరి నిమిషం వరకూ చూశారు. కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కించిత్తైనా నమ్మకం లేకపోవడంతో కూటమి చేతులెత్తేసి తోకముడిచింది. దీంతో.. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్సీపీ కేడర్ చెక్కు చెదరకపోవడంతో ఆ పార్టీ ఖాతాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు చేరింది. బొత్స విజయం లాంఛనంగా మారింది. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది తొలిమెట్టుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. పోటీకి అందరూ ససేమిరావాస్తవానికి.. ఎలాగైనా ఎవరో ఒకర్ని పోటీలో నిలపాలని కొద్దిరోజులుగా సీఎం చంద్రబాబు భావిస్తూ వచ్చారు. స్థానిక సంస్థల్లో అధికార పక్షానికి బలం లేకపోవడం, వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉండటంతో టీడీపీ అ«భ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్లలో ఎవరో ఒకర్ని పోటీచేయించాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, గెలిచేందుకు ఏమాత్రం అవకాశంలేకపోవడం.. పైగా బలమైన ప్రత్యర్థి బొత్స ఉండడంతో పోటీకి వారిద్దరూ ససేమిరా అన్నారు. దీంతో దిలీప్ చక్రవర్తిని అభ్యర్థిగా నిలిపేందుకు ప్రయత్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దిలీప్ చక్రవర్తి అనకాపల్లి టికెట్ ఆశించారు. ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో అతనికి ఆశాభంగమైంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఆశపెట్టి అతన్ని బరిలో దించాలని విశాఖ జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబుకు ప్రతిపాదించారు. పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న లోకేశ్ కూడా ఈయన పేరును తెరపైకి తెచ్చారు. గెలిచే అవకాశంలేని ఎమ్మెల్సీ సీటుకు పోటీచేసేందుకు ఆయన కూడా ముందుకు రాకపోవడంతో గత్యంతరంలేని స్థితిలో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు చంద్రబాబు మంగళవారం విశాఖ జిల్లా నేతలకు టెలీకాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ఓటమి భయంతోనే వెనకడుగుఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని ముందు నుంచి భావించిన టీడీపీ చివరి నిమిషంలో తప్పుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. విశాఖ స్థానిక సంస్థల్లో సంపూర్ణ మెజారిటీ ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కొని ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో వచ్చే ఓటమి ఘోర పరాభవం కింద లెక్కే. ఇటీవలే తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోను ఇదే జరిగింది.అక్కడ మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పరాజయం పాలైంది. దీంతో.. స్థానిక సంస్థల్లో పూర్తి మెజారిటీ ఉన్న వైఎస్సార్సీపీని తట్టుకుని నిలబడటం టీడీపీకి పెను సవాల్‌గా మారే పరిస్థితి ఉందని.. పైగా, ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర నెలలకే ఓటమి చవిచూస్తే ఆ ప్రభావం తట్టుకోవడం కష్టమనే పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు చేతులెత్తిసినట్టు సమాచారం. బొత్స ఎన్నిక లాంఛనమేమరోవైపు.. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ సవాల్‌గా తీసుకుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మకంగా మాజీమంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణను బరిలోకి దించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సతోపాటు మరో స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా కూడా నామినేషన్ వేశారు. గడువులోగా ఈయన నామినేషన్ ఉపసంహరించుకుంటే పోలింగ్ లేకుండానే బొత్సను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ పోటీ జరిగినా బొత్స ఎన్నిక లాంఛనమే. దిలీప్‌కు హితోపదేశం..! ఇదిలా ఉంటే.. దిలీప్ పేరుని ప్రతిపాదించిన లోకేశ్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ.. ఆ ప్రతిపాదనలకు చెక్ పెట్టేందుకు వీలుగా టీడీపీ ఉత్తరాంధ్ర సీనియర్లు పావులు కదిపారు. టీడీపీకి చెందిన ఓ మాజీమంత్రి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. దిలీప్ చక్రవర్తికి వ్యాపార భాగస్వామిగా ఉన్న ఓ ఎమ్మెల్సీ ద్వారా మంతనాలు ప్రారంభించారు. సదరు అభ్యర్థిగా భావిస్తున్న వ్యక్తికి హితోపదేశం చేయడం ప్రారంభించారు. రూ.100 కోట్లు కాదు.. రూ.200 కోట్లు ఖర్చుచేసినా.. గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. డబ్బులు, టైమ్ వేస్ట్ అంటూ బ్రెయిన్‌వాష్ చేశారని సమాచారం. ఓట్ల అంతరం చాలా ఉందనీ.. దాన్ని అధిగమించడం కష్టమనీ.. అందుకే ఓడిపోయే సీటును అంటగట్టేందుకు చూస్తున్నారని చెప్పారు. నామినేషన్ వేసి.. కోట్ల రూపాయలు నష్టపోయే కంటే.. అసలు పోటీలో ఉండకపోవడం మంచిదని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గ్రహించే గండి బాబ్జీ, పీలా గోవింద్‌లు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా వివరించారు. అంతా విన్న దిలీప్ పోటీచేయలేనంటూ లోకేశ్‌కి తెగేసి చెప్పేశారు. -
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోటీ నుంచి టీడీపీ ఔట్
సాక్షి, విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సమయం ముగిసింది. కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. వైఎస్సార్సీపీ నుంచి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయగా, ఇండిపెండెంట్‌గా షేక్ సఫి ఉల్లా నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది.ఇక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధి బొత్స సత్యనారాయణ గెలుపు లాంఛనమైనట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ధీటుగా ఎదుర్కొనే సత్తా లేకపోవడంతో పోటీ నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. సరైన బలం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు.మంగళవారం నామినేషన్ గడువు చివరి రోజు కావడంతో అభ్యర్ధి పోటీపై విశాఖ టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికేతురుడిని నిలబెట్టేందుకు పార్టీ నేతలతో చంద్రబాబు మంతనాలు జరిపారు. అయితే అందుకు పార్టీ నేతలు ఒప్పుకోలేదు.స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికేతురుడిని ఎలా పెడతారని టీడీపీ నేతలు చంద్రబాబును ప్రశ్నించారు. కోట్లు రూపాయలు కుమ్మరించిన ఓడిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలకు సీట్లు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఇప్పటికే స్థానికేతరులతో టీడీపీ నిండిపోయిందన్న టీడీపీ నేతల అభిప్రాయంతో చంద్రబాబు అంగీకరించారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్ట్ 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. నేటితో నామినేషన్ల దాఖలుకు సమయం ముగిసింది. 14న స్క్రూటినీ, 16న ఉపసంహరణ, 30న పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెప్టెంబరు 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 841 ఓట్లు ఉండగా.. అందులో వైఎస్సార్సీపీ బలం 615 ఉంటే.. టీడీపీ, జనసేన, బీజెపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి.. అలాగే 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. -
బలం లేకున్నా టీడీపీ ఎందుకు పోటీ చేస్తోంది?: బొత్స
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఎన్నికల్లో పోటీ పెట్టడం అంటే టీడీపీ దుశ్చర్యకు పాల్పడినట్టుగా భావించాలని వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 580కి పైగా ఓట్ల బలం ఉందన్నారు. వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. ఎవరో బిజినెస్‌మేన్‌ను తెచ్చి టీడీపీ పోటీ చేయిస్తుందని ప్రచారం జరుగుతోందని, రాజకీయాలంటే ఆ పార్టీకి వ్యాపారంలా ఉందని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. 300 ఓట్లకు పైగా తేడా ఉన్న సమయంలోనూ పోటీకి దిగడాన్ని ఎలా చూడాలని బొత్స ప్రశ్నించారు. కూటమి గెలుస్తుందని చెప్పేవారు ఈ నెల 14 తర్వాత మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో అరకు ఎంపీ తనుజారాణి, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, కేకే రాజు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీకి పూర్తి బలం : సుబ్బారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు పూర్తి స్థాయి బలం ఉందని.. అయినా టీడీపీ ఎందుకు పోటీ చేస్తుందో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీపై టీడీపీ కొత్త ఎత్తులు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీపై టీడీపీ, జనసేన, బీజేపీ ఇంకా తర్జనభర్జన పడుతున్నాయి. ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచించినా అందుకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్సీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉండడంతో ఆ పార్టీ నుంచి భారీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కూటమి వైపు తిప్పుకొనేందుకు కుట్రలు పన్నారు. భారీగా డబ్బు ఇవ్వజూపారు. అయినా కూటమి వైపు రావడానికి ప్రజాప్రతినిధులు ససేమిరా అన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీకి పెడితే ఓడిపోవడం ఖాయమనే అంచనాకు కూటమి నేతలు వచ్చారు. సీఎం చంద్రబాబు రెండుసార్లు విశాఖ జిల్లా ఎమ్మెల్యేలతో జరిపిన చర్చల్లో గెలవడానికి సరిపడా ప్రజాప్రతినిధులు లేరని తేలింది. సరిపడినంతమందిని కూటమి వైపు తెస్తేనే అభ్యర్ధిని ప్రకటిస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. మొదట్లో అనకాపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను పోటీకి దింపాలని భావించారు. అయితే వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పోటీకి దిగడం, మెజారిటీ ప్రతినిధులు వైఎస్సార్సీపీ వైపే ఉండడంతో పీలా గోవిందు చేతులెత్తేశారు. దీంతో గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఆశించిన వ్యాపారవేత్త బైరా దిలీప్ పేరును పరిశీలిస్తున్నారు. ఆయన అయితే భారీగా డబ్బు ఖర్చు పెట్టి వైఎస్సార్సీపీ స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తారని టీడీపీ సీనియర్లు భావిస్తున్నట్లు సమాచారం. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా సాధ్యమయ్యేలా కనిపించకపోవడంతో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. నామినేషన్లు దాఖలుకు గడువు ముగిసే లోగా అవకాశాలు మెరుగుపడితే దిలీప్‌ను పోటీకి దింపాలని చూస్తున్నారు. లేనిపక్షంలో పోటీకి దూరంగా ఉండడమే మేలని చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. -
నేడు, రేపు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళ, బుధవారాల్లో ఆ జిల్లాకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. మిగిలిన నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో నేడు, రేపు భేటీ కానున్నారు. ఈ కారణం వల్ల ఇతర నాయకులు, సందర్శకులు వైఎస్ జగన్‌ను కలిసే అవకాశం ఉండదని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. -
రేపు, ఎల్లుండి విశాఖ నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈక్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ వరుసగా రేపు, ఎల్లుండి సమావేశం కాబోతున్నారు.కాగా, విశాఖ ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికపై వైఎస్ జగన్ దృష్టిసారించారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఉమ్మడి విశాఖలో ఐదు నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. కాగా.. రేపు, ఎల్లుండి మిగిలిన నియోజకవర్గాల నేతలు ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ కారణంగా ఇతర నాయకులు జగన్‌ను కలిసేందుకు అవకాశంలేదని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వైఎస్సార్‌సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలు.. నామినేషన్ వేసిన బొత్స సత్యనారాయణ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్సార్సీపీకి పూర్తిగా బలం ఉందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అనైతికంగా కూటమి సర్కార్ ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతోందని ప్రశ్నించారు.కాగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశాను. మాకు సంఖ్యా బలం ఉంది. వైఎస్సార్సీపీ తప్పకుండా విజయం సాధిస్తుంది. మాకు 530 మందికి పైగా ప్రజాప్రతినిధుల బలం ఉన్నప్పుడు కూటమి అభ్యర్థిని ఎందుకు బరిలో నిలుపుతోంది?. వైఎస్సార్సీపీకి బలం ఉన్నప్పుడు అనైతికంగా ఎందుకు అభ్యర్థిని పెడుతున్నారు.ఒకవేళ టీడీపీ కనుక అభ్యర్థిని నిలబెడితే అది దుశ్చర్య అవుతుంది. ఇదిమే వ్యాపారం కాదు. మోజార్టీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నాం. మాకు నివాదం అవసరం లేదు. రాజకీయాల్లో విలువలు అవసరం. సంఖ్య దగ్గరగా ఉంటే తప్పులేదు. మాకు మెజార్టీ ఉన్నప్పుడు టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుందని నేను అనుకోవడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
-
మళ్లీ ‘ఓటుకు నోటు’ పాలిటిక్స్‌కు టీడీపీ రెడీ
సాక్షి, విశాఖపట్నం: మళ్లీ ఓటుకు నోటు రాజకీయాలకు టీడీపీ సిద్ధమవుతోంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా పోటీకి దిగే యోచనలో ఉంది. ఓట్ల కొనుగోలుకు డబ్బున్న అభ్యర్థిని టీడీపీ తెరపైకి తెచ్చింది. గత ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి ఎంపీ సీటుకు ప్రయత్నించిన బైరా దీలీప్ చక్రవర్తి తెరపైకి వచ్చారు. టీడీపీలో సభ్యత్వం లేకపోయినా దిలీప్‌ను పోటీకి దించాలనే కూటమి భావిస్తోంది. డబ్బులు పెట్టి ఓట్లు కొనాలని దిలీప్‌కు టీడీపీ టాస్క్ ఇచ్చినట్లు సమాచారం.ఓడిపోయినా సరే పోటీ చేయాలని బైరా దిలీప్‌పై టీడీపీ ఒత్తిడి తెస్తోంది. ఓడిపోతే ప్రభుత్వం ఉంది కాబట్టి కాంట్రాక్ట్‌లు ఇస్తామంటూ ఆఫ్ర్ ఇచ్చినట్లు సమాచారం. కాంట్రాక్ట్‌ల ద్వారా డబ్బు సంపాదనకు టీడీపీ పోటీకి దింపుతోంది. ఇప్పటికే డబ్బులు పెట్టేది లేదని ఇప్పటికే పీలా గోవింద్, గండి బాబ్జి చెప్పేశారు.మొత్తం 840 ఓట్లు ఉండగా, 11 ఖాళీలు ఉన్నాయి. వైఎస్సార్సీపీకి 615 మంది ప్రజాప్రతిధులు ఉండగా, టీడీపీకి కేవలం 214 మంది మాత్రమే ఉన్నారు. 400 మంది వ్యత్యాసం ఉన్నా పోటీకి దిగాలని కూటమి నిర్ణయం తీసుకుంది. ఓటుకు నోటు రాజకీయానికి టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లను కొనేందుకు అప్పగింతల తంతు కొనసాగుతోంది. -
Vizag MLC Election: కూటమిలో కన్ఫూజన్.. పోటీ చేయాలా? వద్దా?
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమిలో గందరగోళం నెలకొంది. చంద్రబాబు వద్దకు చేరినా పంచాయితీ తేలలేదు. అభ్యర్థి ఎంపికపై మీరే నిర్ణయం తీసుకోవాలని నేతలకు చంద్రబాబు సూచించారు. అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు ఇవాళ భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై చర్చించనున్నారు. కాగా, అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు.వైఎస్సార్ సీపీకి పెరిగిన మరింత బలంమరో వైపు ప్రచారంలో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మరింత బలం పెరిగింది. ఆరు వందలకుపైగా ఓటర్లతో ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత ఉండగా మరో ముగ్గురు ఓటు నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్లు నమోదు కార్యక్రమం శనివారంతో ముగిసింది. కొత్తగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, డాక్టర్ కుంభా రవిబాబు దరఖాస్తు చేశారు. వీటిని విచారణ కోసం జీవీఎంసీకి పంపారు. ఈనెల 13న తుది జాబితాను ప్రకటిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 39 మంది జెడ్పీటీసీల్లో ప్రస్తుతం 36 మంది జెడ్పీటీసీ ఉన్నారు. అల్లూరి జిల్లాకు చెందిన హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం అరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రావికమతం జెడ్పీటీసీ తలారి రమణమ్మ, సబ్బవరం జెడ్పీటీసీ తుంపాల అప్పారావు చనిపోయారు. ప్రస్తు తం ఉన్న జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీకి 34 మంది, టీడీపీకి నర్సీపట్నం జెడ్పీటీసీ, సీపీఎంకి అనంతగిరి జెడ్పీటీసీ ఉన్నారు. మొత్తం 652 మంది ఎంపీటీసీలకు గాను 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు.16 మంది ఎంపీటీసీ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో వైఎస్సార్ సీపీకి 477 మంది, టీడీపీకి 116 మంది, ఇండిపెండెంట్లు 28 మంది, జనసేనకు ఇద్దరు, బీజేపీకి ఆరుగురు, సీపీఐకి ఇద్దరు, సీపీఎంకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులు ఉన్నారు. జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లకు గాను ఒక స్థానం ఖాళీగా ఉంది. యలమంచలి పురపాలక సంఘం పరిధిలో 25 మంది కౌన్సిలర్లు, నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలో 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉన్నారు. -
ఆత్మరక్షణలో చంద్రబాబు.. కారణం ఇదేనా?
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికపై వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుతెన్నులను ఎండగడుతూ, మరో వైపు వైఎస్సార్సీపీ స్థానిక నేతలలో నైతిక స్థైర్యం నింపే యత్నం చేస్తున్నారు. పార్టీపరంగా చూస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా ముందుగానే మేల్కొన్నారని అనుకోవచ్చు. అదే టైమ్‌లో చంద్రబాబు నాయుడును ఆత్మరక్షణలో పడేసేలా ఆయన ముందుకు సాగుతున్నారని భావించవచ్చు.ఎందుకంటే ఈ నెలాఖరుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించడానికి ఆలోచన చేస్తున్న తరుణంలోనే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ పక్షాన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరును తమ అభ్యర్దిగా డిక్లేర్ చేశారు. ఇందుకోసం విశాఖ ప్రాంత పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. బొత్స అయితే పార్టీలో జోష్ వచ్చే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. అన్ని హంగులపరంగా గట్టి వ్యక్తిగా పేరున్నందున, పార్టీలో అందరికి బాగా తెలిసిన వ్యక్తి అయినందున బొత్స ఎంపిక జరిగిందని పలువురు అభిప్రాయపడ్డారు.ఇటీవలి శాసనసభ ఎన్నికలలో పరాజయం నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను చురుకుగా ఉంచడానికి ఈ ఎన్నికను ప్రాతిపదికగా తీసుకున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రాంతీయ సమన్వయకర్తల మీదే ఆధారపడి నిర్ణయాలు చేసేవారన్న అభిప్రాయం ఉంది. ఉదాహరణకు సుమారు ఏడాది క్రితం ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే, ఆయన పూర్తిగా సమన్వయకర్తలు, ఆ ప్రాంత నేతలకు వదలివేశారు. కారణం ఏమైనా ఆ ఎన్నికలో వైఎస్సార్సీపీ ఓడిపోయి టీడీపీ అభ్యర్ది గెలిచారు. అది సాధారణ ఓటర్లలో, ప్రత్యేకించి విద్యాధికులలో భిన్నమైన సంకేతాన్ని ఇచ్చింది. ఆ ఓటమిని పార్టీ తేలికగా తీసుకుందన్న అభిప్రాయం ఉంది. దాని కారణంగా సాధారణ ఎన్నికలలో మూల్యం చెల్లించవలసి వచ్చింది.ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో స్వయంగా రంగంలో దిగి ఆయా నియోజకవర్గాల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు తదితర ఓటింగ్ హక్కు కలిగినవారితో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపన్యాసం ఇస్తూ చంద్రబాబు చేసేది అధర్మ యుద్దం అని, దానిని ఎదుర్కొని విజయం సాధించాలని పిలుపు ఇచ్చారు. నిజానికి టీడీపీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. కాని చంద్రబాబు ఏ ఎన్నికను అంత తేలికగా వదలిపెట్టరు. బలం ఉన్నా, లేకపోయినా ఎలాగోలా అన్ని రకాల ప్రలోభాలను ప్రయోగించి గెలవాలని ఆలోచిస్తారన్న భావన సర్వత్రా ఉంది. అందులోను అధికారంలో ఉన్నప్పుడు అసలు వదలిపెట్టరు.శాసనమండలిలో ప్రస్తుతం వైఎస్సార్సీపీ పూర్తి ఆధిక్యతతో ఉంది. దానిని తగ్గించడానికి, పార్టీని బలహీనపరచడానికి ఈ ఉప ఎన్నికను వాడుకోవాలని టీడీపీ సహజంగానే యత్నిస్తుంది. కాని బలం రీత్యా టీడీపీ గెలవడం కష్టం. 600 పైగా ఓటర్లు ఉంటే అందులో 400 మంది వైఎస్సార్సీపీ ఓటర్లే. టీడీపీకి 200 మంది మాత్రమే ఉన్నారు. అంటే టీడీపీ గెలవాలంటే మరో 200 మందిని ప్రలోభపెట్టవలసి ఉంటుంది. అయినా చంద్రబాబు వదలిపెడతారని ఎవరూ అనుకోవడం లేదు. విశాఖపట్నం కార్పొరేషన్లో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో టీడీపీ కూటమికి బలం లేకపోయినా, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కొందరిని ప్రలోభాలకు గురి చేయడం, అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడడం వంటి చర్యల ద్వారా గెలిచారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్పీచ్‌లో ఆయా అంశాలను ప్రస్తావించి చంద్రబాబు అధర్మ యుద్ధంలో ఆరితేరిన వ్యక్తి అని, అందువల్ల వైఎస్సార్సీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక్కడ జగన్ రెండు వ్యూహాలను అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ తన బలాన్ని నిలబెట్టుకోవడం ద్వారా బొత్సను గెలిపించుకోగలిగితే పార్టీకి అది ఊపు ఇస్తుంది. పార్టీ క్యాడర్ నైతిక స్పూర్తి వెల్లడవుతుంది. ఒకవేళ చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీల కూటమి అనైతిక పద్ధతులకు పాల్పడి ఓటర్లను కొనుగోలు చేస్తే, దానిని రాష్ట్రం అంతా ప్రచారం చేసి కూటమిని ఎండగట్టవచ్చు. చంద్రబాబు తన వెనుకటి గుణం మానుకోలేదన్న విషయం ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పవచ్చు. ఈ రకంగా రెండు రకాలుగా చంద్రబాబు ఆత్మరక్షణలో పడవచ్చు.ఇప్పటికే గత శాసనసభ ఎన్నికలలలో కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితిపై ప్రజలలో వ్యతిరేకత ఏర్పడింది. దానికి తోడు ఇలాంటి అక్రమ పద్ధతులు అవలంభిస్తే టీడీపీ మరింత వేగంగా అప్రతిష్ట పాలవుతుంది. ఈ పాయింట్‌ను దృష్టిలో పెట్టుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక్కో ఓటర్‌కు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు వరకు ఇస్తామని చంద్రబాబు ప్రలోభపెడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అదే టైమ్ లో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. తాను పలావు పెడుతుంటే, చంద్రబాబు బిర్యానీ పెడతానని అన్నారని, దానికి ప్రజలు ఆశపడ్డారని, చివరికి పలావు, బిర్యానీ రెండూ లేకుండా పోయాయని, ప్రజలకు పస్తులు మిగిలాయని జగన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ప్రజలను బాగా ఆకర్షిస్తోంది.తాను అధికారంలో ఉంటే ఈసరికి అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన వంటి స్కీములు వచ్చి ఉండేవని, ప్రజలకు మేలు జరిగేదని ఆయన వివరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వీటిని ఎగవేస్తున్న విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచిస్తున్నారు. తాను విశ్వసనీయతకు నిలబడే వ్యక్తిని అయితే, చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదని ఆధార సహితంగా చెబుతున్నారు. 2014 టరమ్‌లో చంద్రబాబు ఇరవైమూడు మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తర్వాత, వారికి ఆశచూపిన మొత్తం పూర్తిగా ఇవ్వలేదని, ఆ తర్వాత వారిలో ముగ్గురికి తప్ప మిగిలినవారికి టిక్కెట్లు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. వారిలో పలువురు తిరిగి తన వద్దకు రావడానికి యత్నించినా అంగీకరించలేదని, ఫలితంగా రెండు విధాలుగా వారు నష్టపోయారని ఆయన అన్నారు.ఇప్పుడు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి ఓటర్లను కూడా ఆకర్షించే యత్నం చేస్తున్నారని, చంద్రబాబును నమ్మితే, ఆ తర్వాత వారికి దక్కేది ఏమీ ఉండదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ రకంగా చంద్రబాబు రాజకీయాలలో మోసపూరితంగా ఉండే నేత అని, అలాంటి వ్యక్తిని నమ్మవద్దని, తాను విశ్వసనీయతకే పట్టం కడతానని, ఏదైనా చెబితే చేయాలన్నదే తమ పార్టీ విధానమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఈ ప్రక్రియ అంతా వైఎస్సార్సీపీలో కొత్త ధైర్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడవచ్చు. వైఎస్సార్సీపీకి అండగా ఉంటే కాడర్‌కు భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇవ్వడానికి యత్నిస్తున్నారు.నిజానికి బలం లేనందున టీడీపీ పోటీ చేయకుండా ఉంటే వారికి గౌరవం మిగులుతుంది. అలాకాకుండా చంద్రబాబు కనుక తన రాజకీయ వ్యూహాలను అమలు చేసి టీడీపీ అభ్యర్ధిని రంగంలో దింపి రాష్ట్ర వ్యాప్తంగా దానికి ప్రచారం కల్పిస్తే ఆయనకే నష్టం కలగవచ్చు. టీడీపీ గెలిచినా అది డబ్బుతో విజయం సాధించినట్లు అవుతుంది. అభివృద్ది కోసమే స్థానిక ప్రతినిధులు టీడీపీలోకి వచ్చారని చెప్పినా, జనం ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అందులోను చంద్రబాబు ట్రాక్ రికార్డు అటువంటిది అన్న సంగతి బహిరంగ రహస్యమే. ఇంత చేసినా టీడీపీ ఓటమి చెందితే పార్టీకి మరింత అప్రతిష్ట అవుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుగానే వ్యూహరచన చేసి ఎమ్మెల్సీ ఎన్నికపై పావులు కదుపుతున్నారని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
కూటమి కుట్రలు తిప్పికొడతాం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: కూటమి కుట్రలన్ని తిప్పికొడతామని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది వైఎస్సార్సీపీ సింబల్‌తో గెలిచిన కార్పొరేటర్లను కూటమి తీసుకున్నా మా ప్రణాళిక మాకుందని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ మాకున్నా.. వాళ్ళు అభ్యర్థులను నిలబెడుతున్నారంటే.. వాళ్ల ఏ స్థాయి రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోంది. వైఎస్సార్సీపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది.. మా అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా ఆ మాట పదే చెప్తుంటారు. కచ్చితంగా స్టాండింగ్ కమిటీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుంది’’ అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
ఓట్లు కొనేందుకు చంద్రబాబు కుట్ర: బొత్స
సాక్షి, అనకాపల్లి జిల్లా: ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్ అని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. మంగళవారం ఆయన నర్సీపట్న నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, ఉమా శంకర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీకి 600 పైగా సభ్యుల బలం ఉందని.. కూటమికి 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉందని బొత్స అన్నారు. రెండు పార్టీల మధ్య 400 ఓట్లు తేడా ఉందన్నారు. ‘‘ఎంపీటీసీ జెడ్పీటీసీల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాది. డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారు. ఓట్లు కొనడం ప్రజా స్వామ్యంలో మంచి పద్దతి కాదు. గతంలో టీడీపీ కంటే 50 ఓట్లు తక్కువగా ఉంటే పోటీ నుంచి తప్పుకున్నాము’’ అని బొత్స పేర్కొన్నారు.‘‘సంపద సృష్టస్తానని చంద్రబాబు చెప్పారు.. ఎన్నికల తరువాత రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని చెపుతున్నారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఎన్నికలకు ముందు చంద్రబాబుకు తెలియదా?’’ అంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. -
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. 14న స్క్రూటినీ, 16న ఉపసంహరణ, 30న పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెప్టెంబరు 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 841 ఓట్లు ఉండగా.. అందులో వైఎస్సార్సీపీ బలం 615 ఉంటే.. టీడీపీ, జనసేన, బీజెపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి.. అలాగే 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రలోభాల పర్వం మొదలుపెట్టింది. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వైఎస్సార్సీపీదే: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: రాజకీయ నాయకులను, ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం కూటమి నేతలకు అలవాటేనని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. అలాగే, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు.కాగా, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులంతా వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయానికి కృషి చేయాలి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే సంఖ్యా బలం ఉంది. ప్రలోభాలకు గురి చేయడం కూటమి నేతలకు అలవాటే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రలోభాలకు గురిచేశారు. మా ప్రజా ప్రతినిధులపై మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అందరూ వైఎస్సార్సీపీకే అండగా ఉంటారు అని చెప్పారు.అంతకుముందు, అనకాపల్లిలోని చోడవరం మాడుగుల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబు, కరణం ధర్మశ్రీ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ..‘ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలో వైఎస్సార్సీపీకి సంపూర్ణ బలం ఉంది. 600 మందికిపైగా సభ్యుల బలం వైఎస్సార్సీపీకి ఉంది. కేవలం 200 మంది సభ్యుల బలం మాత్రమే కూటమికి ఉంది. ప్రలోభాలతో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబు మోసం ప్రజలకు తెలియాలి. దేశంలో రాష్ట్రం దివాళా తీసిందని మాట్లాడే వ్యక్తి ఒక్క చంద్రబాబు మాత్రమే. రాజకీయాల్లో 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా?. వైఎస్సార్సీపీ సభ్యులు తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా?. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు ఎన్నో రోజులు నమ్మరు అంటూ కామెంట్స్ చేశారు.ఇక, ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ను సోమవారం సాయంత్రం కలెక్టర్ విడుదల చేశారు.షెడ్యూల్ ఇలా.. ఈనెల 30 ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక.రేపటి నుంచి అమలులోకి నోటిఫికేషన్.ఈనెల 13వ తేదీ నామినేషన్లకు ఆఖరు తేదీ.14న నామినేషన్ల స్క్రూన్నీనామినేషన్ల ఉపసంహరణకు 16వ తేదీ వరకు గడువు.ఈనెల 30న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్.సెప్టెంబర్ 3న కౌంటింగ్.రేపటి నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలు.ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు సిద్దమైన వైఎస్సార్సీపీ. -
మల్లన్నకు 14,722 ఓట్ల మెజారిటీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపొందిన తీన్మార్ మల్లన్నకు 14,722 ఓట్ల మెజారిటీ లభించింది. ఈ నెల 5 నుంచి 7వ తేదీ అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్ అనంతరం మల్లన్న గెలుపొందినట్లు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ గెలుపునకు అవసరమైన కోటా ఓట్లు (1,55,095) రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి వచ్చింది.మొదటి ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి« తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. అలాగే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 29,697 ఓట్లు లభించాయి. అయినా గెలుపునకు అవసరమైన కోటా ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. 48 మందిని ఎలిమినేట్ చేయగా.. ఈ ఎన్నికలో మొత్తంగా 52 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో తక్కువ ఓట్లు వచ్చిన 48 మంది ని ఎలిమినేట్ చేసి, వారికి పడిన మొదటి ప్రాధాన్య ఓట్లలోని రెండో ప్రాధాన్యతను లెక్కించగా వచ్చిన ఓట్లను కలుపుకోగా కాంగ్రెస్ అభ్యర్థి 1,24,899 ఓట్లకు, బీఆర్ఎస్ అభ్యర్థి 1,05,524 ఓట్లకు, బీజేపీ అభ్యర్థి 43,956 ఓట్లకు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ 30,461 ఓట్లకు చేరుకున్నారు. అయినా గెలుపు కోటా ఓట్లు ఎవరికీ రాలేదు.49వ రౌండ్లో అశోక్ ఎలిమినేషన్ గెలుపునకు అవసరమైన ఓట్లు ఎవరికీ రాకపోవడంతో 49వ రౌండ్లో స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలోని రెండో ప్రా«ధాన్య ఓట్లను లెక్కించారు. అందులో కాంగ్రెస్ అభ్యర్థికి 10,383 ఓట్లు రావడంతో ఆయన 1,36, 246 ఓట్లకు చేరుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి 10,118 ఓట్లు రావడంతో ఆయన 1,16,292 ఓటకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థికి 4,918 ఓట్లు రాగా ఆయన 48,874 ఓట్లకు చేరుకున్నారు. 50వ రౌండ్లో ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్ గెలుపునకు అవసరమైన ఓట్లు అప్పటివరకు ఎవరికీ రాకపోవడంతో 50వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన 48,874 ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. అందులో తీన్మార్ మల్లన్నకు 14,278 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థికి 19,510 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మొత్తం 1,50, 524 ఓట్లకు చేరుకోగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఓట్లు 1,35,802 చేరుకున్నారు.అయినప్పటికీ గెలుపు కోటాకు 4,571 ఓట్లు తక్కువగానే ఉన్నాయి. మల్లన్నకు రాకేశ్‌రెడ్డి కంటే 14,722 ఓట్లు అధికంగా (మెజారిటీ) ఉన్నాయి. దీంతో రాకేశ్‌రెడ్డిని ఎలిమినేట్ చేయకుండానే, మల్లన్నకు అధిక ఓట్లు ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆమోదంతో మల్లన్న గెలిచినట్లుగా ప్రకటించారు. ఈ ఎన్నికలో 10 వేల మంది గ్రాడ్యుయేట్లు ప్రేమేందర్‌రెడ్డికి తొలి ప్రాధాన్యతను ఇచ్చి, మిగతా ప్రాధాన్యాలు ఇవ్వ లేదు. మరో 5 వేలమంది గ్రాడ్యుయేట్లు అశోక్‌కు తొలి ప్రాధాన్యాన్ని ఇచ్చి, మిగతా ప్రాధాన్యాలు ఇవ్వలేదు. -
రాకేశ్ రెడ్డి.. ధైర్యంగా ఉండండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి రెండోస్థానంలో నిలిచారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. రాకేశ్‌రెడ్డికి ధైర్యం చెప్పారు. ‘‘ రాకేశ్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలో మీరు సాధ్యమైనంతగా కష్టపడ్డారు. ఫలితాలు ఎప్పుడు కూడా ఆశించినట్లుగా ఉండవు. మీరు దృఢంగా, పాజిటివ్‌గా ఉండండి. ఇదే కష్టాన్ని కొనసాగిద్దాం’’అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.You did your best Rakesh. Results are not always in expected linesStay strong, positive and let’s continue to work hard https://t.co/M6Dkx5Sdnm— KTR (@KTRBRS) June 8, 2024అంతకుముందు రాకేశ్ రెడ్డి తనకు అవకాశమిచ్చిన కేసీఆర్‌కు, తనకు మద్దతుగా ఓటేసిన పట్టభద్రులకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. అందరి అంచనాలకు తగినట్లు భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. ఇప్పుడు మాత్రం అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమించాలన్నారు. పార్టీలోకి వచ్చిన అతితక్కువ సమయంలో తనను గుండెలకు అద్దుకున్న బీఆర్ఎస్ శ్రేణులకు, పార్టీలకు అతీతంగా తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని తెలిపారు.ధన్యవాదాలు 💐🙏వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు @KCRBRSPresident గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏ఈ ఎమ్మెల్సీ…— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) June 8, 2024 ఇక..వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన రాజీనామాతో జరిగిన ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతపండు నవీన్‌కుమార్ (తీన్మార్ మల్లన్న) విజయం సాధించారు. -
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా రాకపోయినప్పటికీ తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు ఉండడంతో ఆయన్నే విజేతగా ప్రకటించారు. గత నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరగ్గా, , నల్లగొండలో ఈ నెల 5వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మూడు రోజులపాటు నిరి్వరామంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. రెండోరోజు గురువారం రాత్రి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యతతో రాని మెజారిటీ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికీ గెలుపు టార్గెట్ కోటా అయిన 1,55,095 ఓట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో 3,36,013 ఓట్లు పోల్ కాగా, అందులో 3,10,189 ఓట్లు చెల్లుబాటు అయినట్టు అధికారులు ప్రకటించారు. 25,824 ఓట్లు చెల్లలేదు. చెల్లుబాటు అయిన ఓట్లలో సగానికిపైగా అంటే 1,55,095 ఓట్లు గెలుపునకు టార్గెట్ కోటాగా నిర్ణయించారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు 29,697 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థులందరికి కలిపి 10,118 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో అత్యధికంగా ఓట్లు వచ్చిన మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి కంటే 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయినా గెలుపు కోటా 1,55,095 ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను గురువారం సాయంత్రం నుంచి లెక్కించారు. రెండు ప్రాధాన్యతలోనూ దక్కని కోటా ఓట్లు రెండో ప్రాధాన్యత ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేసి వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థులకు (ఓటర్లు రెండో ప్రాధాన్యతను ఎవరికి ఇచ్చారో వారికి) కలుపుతూ లెక్కించారు. 48 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు 1,24,899 ఓట్లు , రాకేష్‌రెడ్డికి 1,0,5,524 ఓట్లు , ప్రేమేందర్‌రెడ్డికి 43,096 ఓట్లకు చేరుకున్నారు. అయినా గెలుపు కోటా ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో నాలుగోస్థానంలో ఉన్న స్వతంత్ర పాలకూరి అశోక్‌ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారో లెక్కించారు.అప్పటికీ గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాలేదు. దీంతో మూడోస్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయన ఓట్లు లెక్కించారు. అయినా కూడా గెలుపునకు సరిపడా ఓట్లు రాలేదు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన 52 మంది అభ్యర్థుల్లో 50మందిని ఎలిమినేట్ చేశారు. అందులో ముందుగా నిర్ణయించిన గెలుపు టార్గెట్ ఓట్లు తీన్మార్ మల్లన్న, రాకేశ్‌రెడ్డి లకు రాలేదు. ఎన్నికల సంఘం వివరణకు లేఖ రాసిన ఆర్ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపునకు అవసరమైన టార్గెట్ కోటా ఓట్లు (1,55,095) ఎవరికీ రాకపోవడం, మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించాలా? లేదంటే సమీప ప్రత్యర్థి రాకేశ్‌రెడ్డికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత టార్గెట్ రీచ్ అయ్యే వరకు వేచి ఉండాలా అని, ఎన్నికల సంఘానికి రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన లేఖ రాశారు. శుక్రవారం అర్థరాత్రి దాటాక ఈసీ నుంచి అత్యధిక ఓట్లు పొందిన అభ్యరి్థని విజేతగా ప్రకటించాలని సమాచారం అందింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటిస్తూ ఆర్ఓ హరిచందన ధ్రువీకరణపత్రం అందజేశారు. -
అధికారులపై ఆరోపణలు సరికాదు
నల్లగొండ: ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గట్టెకే పరి స్థితి లేక.. కౌంటింగ్ హా ల్ నుంచి ఉత్త చేతులతో పోవడం ఎందుకని, అధికారుల మీద మట్టిపోసి పోయే పనులు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. గురువారం నల్లగొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిలు ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై, జిల్లా అధికారులపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ ఎన్నికలో రూ.100 కోట్లు ఖర్చుపెట్టి గెలుపొందాలని చేసిన ప్రయత్నం..బోగస్ ఓట్లతో లబ్ధిపొందాలనే కుతంత్రం బెడిసి కొట్టడంతో ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
కొనసాగుతున్న కౌంటింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి 4 హాళ్లలో ఏర్పాటు చేసిన 96 టేబుళ్లపై ఉంచి 25 బ్యాలెట్ పేపర్లను ఒక బండిల్‌గా కట్టే ప్రక్రియను మొదట ప్రారంభించారు. ఆ బండిళ్లు కట్టే ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 5 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అర్ధరాత్రి దాటినా కూడా మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడికాలేదు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 4 రౌండ్ల తర్వాత మొదటి ప్రాధాన్యత ఫలితం పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 4,63,839 ఓట్లుండగా 3,36,013 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నాలుగు రౌండ్లలో ఈ లెక్కింపు పూర్తవుతుంది. నాలుగు హాళ్లలో ఏర్పాటు చేసిన 96 టేబుళ్లలో ఒక టేబుల్‌కు ఒక రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కిస్తున్నారు. అంటే ప్రతి రౌండ్లో 96 వేల చొప్పున 4వ రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు. మొదటి రౌండ్‌కు 6 గంటల సమయం: మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపునకు దాదాపు 6 గంటల సమయం పట్టింది. మిగతా మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల వరకు పూర్తయ్యే అవకాశముంది. ఓట్ల లెక్కింపు సమయంలోనే ఆయా అభ్యర్థులకు బ్యాలెట్ పేపర్లు చూపి ఏ అభ్యరి్థకి మొదటి ప్రాధాన్యత ఓటు వేశారో చూపించి, ఆ అభ్యర్థి డబ్బాలో వేస్తున్నారు. ఒక వేళ ఏదేని ఓటు చెల్లకపోతే అది ఏజెంట్లకు చూపి చెల్లని ఓట్ల డబ్బాలో వేస్తున్నారు. ఇలా ప్రతి రౌండ్లోనూ కౌంటింగ్ సందర్భంగా చెల్లిన, చెల్లని ఓట్లు లెక్కిస్తున్నారు. పూర్తయిన మొదటి రౌండ్ కౌంటింగ్ బుధవారం రాత్రి 12 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన మొదటి రౌండ్ లెక్కింపునకు ఆరు గంటల సమయం పట్టింది. అయితే మిగతా మూడు రౌండ్లకు అంత సమయం పట్టదని, వాటికి తక్కువ సమయమే పడుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి నాలుగు రౌండ్లలో జరిగే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల వరకు పూర్తయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. -
పట్టభద్రుల MLC ఎన్నిక కౌంటింగ్ పూర్తి అప్డేట్..
-
మరో ఆరు రోజులే!
సాక్షి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ముగియడంతో ఇప్పుడు అందరితోపాటు అధికారుల చూపు లోక్‌సభ ఎన్నికల ఫలితాల వైపు మళ్లింది. వరంగల్ ఏనుమాముల మార్కెట్‌యార్డులోని 17, 18, 19 నంబర్ల గోడౌన్ల స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన ఈవీఎంలో నిక్షిప్తమైన వరంగల్ ఎంపీ అభ్యర్థుల భవితవ్యం మరో ఆరు రోజుల్లో తేలనుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏం పనులు చేయాలి, రోజువారీగా ఏఏ అంశాలపై సమీక్షలు నిర్వహించాలనే దానిపై రిటర్నింగ్ అధికారులు సిద్ధమయ్యారు.ఈవీఎంలలో ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లలో ఓట్లను కంప్యూటర్లలో ఎలా నమోదు చేయాలో సిబ్బందికి వివరించారు. అదేసమయంలో స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు. సాయుధ బలగాల పహారాతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. తరచూ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.ప్రావీణ్యతో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్‌ఝా స్ట్రాంగ్ రూంలను సందర్శిస్తున్నారు. ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు.కౌంటింగ్ సజావుగా సాగేలా..న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, డాక్టర్ సుక్భీర్సింగ్సంధుతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ, సన్నద్ధతపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్ ప్రావీణ్య ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ప్రకటించే కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై దృష్టి సారించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రతతోపాటు కౌంటింగ్ కేంద్రంలో ఫలితాలు వెల్లడించేందుకు మీడియాకు ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేయాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు.కౌంటింగ్ కేంద్రం వద్ద ఇంటర్నెట్ కనెక్షన్, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ప్రత్యేక కౌంటింగ్‌హాల్ ఉండేలా ఏర్పాట్లు ఉండాలని ఎన్నికల సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. స్ట్రాంగ్‌రూం నుంచి కౌంటింగ్‌హాల్‌కు ఈవీఎంల తరలింపునకు అవసరమైన మేర సిబ్బంది ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ విధులు నిర్వర్తించే సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న దష్ట్యా ఉదయం 6 గంటలకే టేబుళ్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. పోలింగ్ శాతం ఆధారంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 28 టేబుళ్లు, కనిష్టంగా 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. పోలైన ఓట్లు, ఈవీఎంల ఆధారంగా టేబుళ్ల సంఖ్య పెంచనున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానం పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాలు ఉన్నాయి.కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్యకాళోజీ సెంటర్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. కౌంటింగ్ నిర్వహణపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినితానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు.ఏనుమాముల మార్కెట్ యార్డులో నిర్వహించే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత, ఫలితాలు వెల్లడించేందుకు మీడియాకు ప్రత్యేక పాయింట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ కౌంటింగ్ హాల్లో అవసరమైన మేరకు టేబుళ్లు, సిబ్బందిని నియమించనున్నట్లు వివరించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమతుందని, అనంతరం ఈవీఎంలలోని ఓట్లు లెక్కించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ సూచించారు. ఎన్నికల ఫలి తాలు ప్రకటించిన తర్వాత శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీఓ, ఎన్నికల నోడల్ అధి కారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య, సీపీ అంబర్ కిషోర్ ఝా అభ్యర్థుల్లో గుబులు..ఈ నెల 13న ఎన్నికలు ముగిసినా ఎంపీ అభ్యర్థుల్లో మాత్రం లోలోన గుబులు ఉంది. పైకి గెలుస్తామని అందరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా రోజుకో యుగంలా ఫీలవుతున్నారు. మధ్యలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చేసరికి కాస్త మనస్సు అటువైపు మళ్లింది. సోమవారం ఆ ఎన్నిక కూడా ముగియడంతో తమ భవితవ్యం ఏమిటి అనే దిశగా ఆలోచన చేస్తున్నారు.ఒత్తిడి నుంచి బయటపడేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. అయినా ఫలితం ఎలా ఉంటుందనేది మాత్రం వారిని వెంటాడుతూనే ఉంది. ఇంకోవైపు ఆయా స్ట్రాంగ్ రూంల వద్ద తమకు నమ్మకమైన అనుచరులను పంపించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా అక్కడి దృశ్యాలను తిలకిస్తూ షిఫ్ట్‌ల వారీగా అక్కడే ఉంటున్నారు. ఏదేమైనా మరో ఆరు రోజుల్లో వీరి భవితవ్యం తేలనుంది. -
తగ్గిన పోలింగ్ శాతం
-
ఎమ్మెల్సీ పోలింగ్ 72.37%.. ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్న ఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియాల్సి ఉన్నా ఓటర్లు బారులు తీరారు. ఆ సమయంలోగా పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన అందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగింది. మొత్తంగా 72..37 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల కౌంటింగ్ జూన్ 5న జరగనుంది. ఈ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉండటంతో బ్యాలెట్ పేపర్‌కూడా భారీగానే ఉంది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.గతంలో కంటే తగ్గిన పోలింగ్మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 కొత్త జిల్లాల్లో గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గిపోయింది. 2021 ఎన్నికల్లో 5,05,565 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా అందులో 3,85,996 మంది (76.35 శాతం) ఓటువేశారు. ఈసారి 4,63,839 మంది మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారు. ఈసారి పోలింగ్ 68.65 శాతం నమోదైంది. నల్లగొండ సమీపంలోని దుప్పపల్లి వేర్ హౌజింగ్ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపరుస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులన్నింటినీ నల్లగొండకు తరలించే ప్రక్రియ సోమవారం అర్ధరాత్రి తరువాత కూడా కొనసాగింది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.నార్కట్‌పల్లిలో స్వతంత్ర అభ్యర్థి ధర్నాపోలింగ్ సందర్భంగా నార్కట్‌పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేసుకున్నామని చెబుతున్న డోకూరి ఫంక్షన్ హాల్ వద్దకు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌గౌడ్ తన అనుచరులతో అక్కడికి వెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా అశోక్ అనుచరులు వీడియో తీస్తుండగా తోపులాట జరిగింది. దీంతో తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారని నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ ముందు« ధర్నాకు దిగారు. కాగా, నకిరేకల్‌లోని జడ్పీ హైస్కూల్లో పోలింగ్ కేంద్రంలో ఓ వికలాంగురాలు తనకు ఓటు వేసేందుకు వీల్ చైర్ అందుబాటులో పెట్టలేదని నిరసన తెలిపారు.ప్రశాంతంగా పోలింగ్ : రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారన్నారు. ప్రత్యేకించి మహిళలు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54 శాతం, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.54 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. -
TG MLC By-Election 2024 Photos: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక : పోటెత్తిన పట్టభద్రులు (ఫొటోలు)
-
కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్
-
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం
-
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్: గాదరి కిషోర్
హైదరాబాద్: ఎల్లుండి (సోమవారం) జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఉండే నల్గొండ పట్టభద్రులు వెళ్లి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ కుమార్ కోరారు. ఆయన శనివారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మొత్తం ఇలాగే ఉంది. వందలాది కేసులు ఉన్న వ్యక్తి మల్లన్న. బ్లాక్ మెయిల్ కేసులు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి సీఎం అవ్వగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి, మేమే ఇచ్చినం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. చేసింది చెప్పుకోలేక మేము ఓడిన వాతావరణం కనిపించింది. ఏదైనా అడిగితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం తప్ప చేసిందేమీ లేదు. రైతు బంధు ఇవ్వలేదు, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తాం అంటున్నారు. మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు రూ. 500 ఇస్తామన్నారు. రైతు రుణమాఫీ ఇద్దరు భార్యాభర్తలకు కలిపి రెండు లక్షలు చేస్తామని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మోసపూరిత మాటలతో ప్రజల్ని మభ్య పెడుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు’’ అని గాదరి కిషోర్ మండిపడ్డారు. -
మంత్రి ఉత్తమ్ కుమార్‌పై నమ్మకముంది: బండి సంజయ్
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో తక్కువ సమయంలో రెట్టింపు వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో బీఆర్ఎస్పై వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్‌కు ఓటు వేశారని అన్నారు. మేధావులందరూ బీజేపీకే ఓటు వేస్తారని చెప్పుకొచ్చారు.కాగా, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ నల్గొండలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆఫీసులో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుస్తుంది. ప్రజల కోసం కొట్లాడి జైలుకు పోవడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ అమలు చేయలేదు.బీఆర్ఎస్ పార్టీ వ్యవసాయాన్ని సర్వనాశనం చేసింది. అదే పంథాను కాంగ్రెస్ అమలు చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో తరుగు లేకుండా కొనలేదు. బోనస్ ఇస్తామని ఇవ్వలేదు. అవినీతి అక్రమాలకు సివిల్ సప్లై శాఖ అడ్డాగా మారింది. కాళేశ్వరం తర్వాత అతిపెద్ద అవినీతి సివిల్ సప్లై శాఖలో జరిగింది. ఆ శాఖ నష్టాల్లో ఉండటానికి కారణం ఏంటి?. మధ్యవర్తిగా ఉన్న సివిల్ సప్లై శాఖ ఎందుకు నష్టాల్లో ఉంది. కొందరు కాంగ్రెస్ నాయకులు శాఖను అడ్డం పెట్టుకుని అవినీతి చేస్తున్నారు.కాంగ్రెస్ నేతలు మిల్లర్లతో కుమ్మక్కయ్యారు. కాంగ్రెస్ నేతలు వేల కోట్ల రూపాయలు దండుకుని ఢిల్లీకి పంపుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నాకు నమ్మకం ఉంది. కానీ ఆయన కత్తి తీయడం లేదు. ఏ రైస్ మిల్లర్ల నుంచి ఏ నాయకుడికి ఎంత వాటా ముట్టిందో బయట పెట్టాలి. సివిల్ సప్లై శాఖలో అవినీతిపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలి.కృష్ణా జలాల విషయంలో చంద్రబాబుతో కేసీఆర్ కుమ్మక్కై దక్షిణ తెలంగాణకు మోసం చేశారు. విద్యా, వ్యవసాయం, అన్ని రంగాలను బీఆర్ఎస్, కాంగ్రెస్ నాశనం చేసింది. మైనార్టీ డిక్లరేషన్ అంటే కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి. రాములోరి అక్షింతలు, ప్రసాదాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ హేళన చేస్తోంది. ఓ వర్గానికి కొమ్ముగాస్తే బీజేపీ అడ్డుకుంటుంది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్ నేతలు ఇంకొకరికి అవకాశం ఇవ్వరు. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం బీజేపీ చేయదు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల వేడి
-
ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోపు ఉప ఎన్నికకు రంగం సిద్థమైంది. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఇక, బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జ్‌లను నియమించనున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జ్‌ల నియామకం చేపట్టనున్నారు. ఇక, ఇన్‌చార్జ్‌లను నియమించే బాధ్యతను రాష్ట్ర నేతలకు అప్పగించింది బీజేపీ హైకమాండ్. దీంతో, ఇన్‌చార్జ్‌లు ఎవరు అనే అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ప్రేమందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీలో నిలిచారు. ఇక, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉపఎన్నికపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 మార్చి వరకు ఉంది. మరోవైపు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 63 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగియడంతో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్‌కు ఊహించని షాక్ తగిలింది. విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పును వెల్లడించింది.కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నికపై కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే విఠల్‌కు రూ.50వేలు జరిమానా కూడా విధించింది.అయితే, 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దండె విఠల్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో తాను నామినేషన్ విత్ డ్రా చేయలేదని.. తన సంతకాలు ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల అనంతరం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషన్లో విఠల్ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు. ఇదే సమయంలో ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరికీ పంపించాలని కోరారు. అనంతరం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నేడు తీర్పు వెల్లడించింది. మరోవైపు.. విఠల్ లాయర్ అభ్యర్థనతో తీర్పును కోర్టు.. నాలుగు వారాలు సస్పెండ్ చేసింది. -
పాలమూరు.. ప్రతిష్టాత్మకం!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపును టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. సొంత నియోజకవర్గంలో విజయం కోసం ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీతో పోటాపోటీ ఉండొచ్చన్న సర్వేల అంచనాలే దీనికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన వరుస పర్యటనలు, అక్కడి నాయకులు, ప్రజలకు ఇస్తున్న హామీలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని అంటున్నారు. ఇక్కడ గెలవడం ద్వారా రాష్ట్ర, జిల్లా రాజకీయాలపై పూర్తి ఆధిపత్యం సాధించవచ్చని భావిస్తున్నారని.. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి కంటే ఎక్కువగా కష్టపడుతున్నారని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. వీలైనప్పుడల్లా పర్యటిస్తూ.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాపై రేవంత్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికతోపాటు లోక్‌సభ ఎన్నికపైనా దృష్టిపెట్టారు. అటు అధిష్టానానికి, ఇటు తనకు సన్నిహితుడైన వంశీచంద్‌రెడ్డికి లోక్‌సభ టికెట్ ఇప్పించారు. అధికారికంగా టికెట్ ప్రకటించకముందు, తర్వాత చాలాసార్లు వంశీతో భేటీ అయి ప్రచారం, ఇతర అంశాలపై వ్యూహాలను సిద్ధం చేశారు. అంతేకాదు వీలైనప్పుడల్లా మహబూబ్‌నగర్ పర్యటనలకు వెళ్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే ఐదుసార్లు మహబూబ్‌నగర్‌కు వెళ్లిన రేవంత్.. రెండు సభల్లో పాల్గొన్నారు.రెండుసార్లు కొడంగల్ నేతలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లింది మూడే సార్లు కావడం గమనార్హం. తాజా సభల్లో, కార్యక్రమాల్లో రేవంత్ మాట్లాడుతున్న తీరు కూడా పాలమూరులో గెలుపే లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని.. 70ఏళ్ల తర్వాత జిల్లాకు ముఖ్యమంత్రి పదవి వచి్చందని.. పార్టీలకతీతంగా జిల్లాను అభివృద్ధి చేసుకుందామని రేవంత్ చెప్తున్నారు. కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం మంజూరు, వాల్మికి బోయ కులస్తులతో భేటీ అయి హామీలివ్వడం ద్వారా ఓటర్లను ఆకర్షించే వ్యూహాలను అమలు చేశారు. మ్మెల్యేలకు ‘స్పెషల్’గా హామీలిస్తూ.. పాలమూరులో గెలుపే లక్ష్యంగా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని.. ఇందుకోసం ఆ లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా హామీలు ఇస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అందులోభాగంగానే మహబూబ్‌నగర్ సభ వేదికగా ముదిరాజ్‌లకు మంత్రివర్గంలో స్థానం కల్పింస్తామని ప్రకటించారని అంటున్నాయి. నియోజకవర్గాల వారీగా మంచి మెజార్టీ తీసుకురావాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతోపాటు కేబినెట్ హోదాతో కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తానని ఆయన ఎమ్మెల్యేలకు చెప్తున్నట్టు సమాచారం. -
ముగిసిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
Live Updates.. ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. జోగులాంబ గద్వాల.. ►జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు. ►నాగర్ కర్నూల్ జడ్పీ గ్రౌండ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ కూచకుల దామోదర్ రెడ్డి. జోగులాంబ గద్వాల.. ►స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకోనున్న 225 మంది ప్రజా ప్రతినిధులు. వనపర్తి జిల్లా.. ►వనపర్తి జిల్లా కేంద్రంలోని RDO కార్యాలయంలో ప్రారంభమైన పోలింగ్. ►వనపర్తి జిల్లాలో మొత్తం ఓటర్స్ :218 ►నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ►ఓటు హక్కును వినియోగించుకోనున్న 101 ఓటర్లు. వికారాబాద్ జిల్లా ►కొడంగల్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ►కొడంగల్ నియోజకవర్గం మొత్తం 56 ఓటర్ల తమ ఓటును హక్కును వినియోగించనున్నారు. ►మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ►ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం పోలింగ్ జరగనుండగా.. స్థానిక సంస్థల పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, పురపాలక కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరితోపాటు ఎక్స్ అఫీషియో హోదాలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతోపాటు ముగ్గురు ఎమ్మెల్సీలు మొత్తం 1,439 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ అఫీషియోగా కొడంగల్‌లో ఓటు వేయనున్నారు. ►ఉపఎన్నికకు మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ►ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాలెట్ ద్వారా ప్రజాప్రతినిధులు ఓట్లు వేయనున్నారు. ►బుధవారం ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలింగ్ సెంటర్లకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. వచ్చే నెల రెండో తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నేరుగా పోలింగ్ కేంద్రాలకే.. ►పార్లమెంట్ ఎన్నికలకు ముందు వచ్చిన ఉప ఎన్నిక కాగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టా త్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి పోటీ పడుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుని పట్టు సాధించాలని బీఆర్ఎస్.. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. ఓటర్లు చేజారొద్దనే ఉద్దేశంతో ఓటర్లను ఆయా పార్టీలు గోవా, ఊటీ, కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు తరలించారు. ►గురువారం పోలింగ్ జరగనుండగా.. బుధవారం తెల్లవారుజామునే క్యాంపుల నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. రాత్రికి వారిని హైదరాబాద్‌లోని రిసార్ట్స్‌కు తరలించి.. గురువారం ఉదయం నేరుగా ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ సెంటర్లకు తీసుకురానున్నారు. సంఖ్య ప్రకారం బీఆర్ఎస్ కు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణా మాల క్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరారు. గెలుపుపై ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. బిహార్‌లో మూడు స్థానాలకు, ఉత్తర ప్రదేశ్‌లో ఏడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను బీజేపీ వెల్లడించింది. బిహార్‌లో మొత్తం 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ప్రస్తుతానికి మంగళ్ పాండే, డాక్టర్ లాల్ మోహన్ గుప్తా, అనామికా సింగ్‌లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. ఇక ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులను ప్రకటించింది. విజయ్ బహదూర్ పాఠక్, మహేంద్ర కుమార్ సింగ్, మోహిత్ బెనివాల్, అశోక్ కటారియా, ధర్మేంద్ర సింగ్, రాంతీరత్ సింఘాల్, సంతోష్ సింగ్‌లను రంగంలోకి దింపింది. బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 21న జరగనుండగా నామినేషన్ దాఖలుకు చివరి తేదీ మార్చి 11. మరోవైపు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, మాజీ మంత్రి అబ్దుల్బరీ సిద్ధిఖీ, ఊర్మిళా ఠాకూర్, సయ్యద్ ఫైసల్ అలీలను బరిలో నిలిపింది. -
తెలంగాణ హైకోర్టు.. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఈ సందర్భంగా కోదండరామ్, అలీఖాన్‌ల నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ.. సిఫార్సుల తిరస్కరణలో గవర్నర్ తమిళిసై తీరును హైకోర్టు తప్పు పట్టింది. వీరి ఎన్నికను పున:పరిశీలించాలని గవర్నర్‌ను కోర్టు ఆదేశించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాను మరోసారి కేబినెట్ ముందు ఉంచి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇదే సమయంలో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను కోర్టు కొట్టివేసింది. అలాగే, మంత్రి మండలి నిర్ణయాలకు గవర్నర్ కట్టుబడి ఉండాల్సిదేనని హైకోర్టు సూచించింది. ఇక, మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకాలను చేపట్టాలని కోర్టు తెలిపింది. ఈ సందర్భంలో ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీల్లేదని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాదులు తీసుకెళ్లారు. -
TS: కాంగ్రెస్ ఎప్పటికీ మారదా.. ఇంతకీ ఏం జరిగింది?
కాంగ్రెస్ అనేది ఓ విచిత్రమైన పార్టీ. ఆ పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో..? పార్టీలోకి ఎవరు వస్తారో? ఎవరు బయటకు వెళ్లిపోతారో ఎవ్వరూ చెప్పలేరు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక కూడా గందరగోళంగానే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నా అంతే.. అధికారం వచ్చినా అంతే.. తాజాగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కూడా అలాగే జరిగింది. నేతల మనోభావాలను ఎవరూ పట్టించుకోరు. కాంగ్రెస్ ఎప్పటికీ మారదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ టీ.కాంగ్రెస్‌లో ఏం జరిగింది? తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే అభ్యర్ధుల ఎంపికలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల గడువు ముగిసే రోజు వరకు ఎన్నో ట్విస్టులు, మరెన్నో మలుపులు అన్నట్లుగా ఆసక్తికరంగా సాగింది. రెండు ఎమ్మెల్సీలకు అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్లకు అవకాశం కల్పించాలని మొదట అనుకున్నారు. కాని రాత్రికి రాత్రే కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు తెరమీదకు వచ్చింది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు యువతకు అవకాశం కల్పించాల్సిందే అని తేల్చిచెప్పడంతో బల్మూరికి టికెట్ కన్ఫ్మామ్ అయ్యింది. దీంతో అద్దంకి దయాకర్.. మహేష్ గౌడ్‌లలో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో తర్జన భర్జనల అనంతరం మొదట మహేష్ గౌడ్‌ను తప్పించాలనుకున్నారు. కానీ బీసీలు ఇప్పటికే బీజేపీ వైపు మళ్ళుతున్న నేపధ్యంలో బీసీ నేత అయిన మహేష్గౌడ్ను తప్పిస్తే.. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెష్కి నష్టం తప్పదనే అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వం అద్దంకి దయాకర్‌ను తప్పించడానికి నిర్ణయించింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొందరికి ఆఖరి నిమిషంలో ఛాన్స్ చేజారిపోవడాన్ని అర్దం చేసుకొవచ్చు. కాని అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియనే సరిగా జరగలేదనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అభ్యర్ధుల ఎంపికను చివరి నిమిషం వరకు తేల్చకుండా ఎందుకు నాన్చాల్సి వచ్చింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ కాంగ్రెస్ లో ఇంకా కొనసాగుతోంది. అలాంటప్పుడు టికెట్లు ఆశించిన నేతలతో పార్టీ పెద్దలు చర్చించి.. అవకాశం దక్కని నేతలను బుజ్జగిస్తే సరిపోయేది. అసెంబ్లీ ఎన్నికల్లో అదే చేసారు. టికెట్లు దక్కని నేతల రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. దీంతో అసెంబ్లీ టికెట్ల కేటాయింపు సజావుగా జరిగి కాంగ్రెస్ పార్టీ చేతికి అధికారం అందింది. కాని ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో.. అభ్యర్ధులను చివరి నిమిషంలో మార్చడం వల్ల ఎంతో గందగోళం తలెత్తింది. వివిధ కారణాల వల్ల అద్దంకి దయాకర్ కి అవకాశం కల్పించలేని పరిస్తితి వస్తే.. కనీసం ఆయనకు పరిస్తితి వివరించి భరోసా ఇస్తే బాగుండేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. పార్టీ పెద్దలు ఆయనతో మాట్లాడి ఒప్పించి.. నామినేషన్ పర్వంలో ఆయన్ను భాగస్వామిని చేస్తే బాగుండేదని నేతలు భావిస్తున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అద్దంకి ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ పెద్దలు ఆ పని చేయకపోవడం అద్దంకి అభిమానుల్ని బాధిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పెద్దల తీరు మారకపోతే ఎలా అని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అందరిని కలుపుకుని పోయేలా పార్టీ పెద్దలు వ్యవహరించాలని కోరుతున్నారు. -
నామినేటెడ్ పోస్టుల భర్తీ షురూ
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల భర్తీకి అధికార కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఇటీవల ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన ఆ పార్టీ, తాజాగా నలుగురు ముఖ్య కాంగ్రెస్ నేతలకు కేబినెట్ హోదా కల్పించింది. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డిని సీఎం సలహాదారుడిగా (ప్రజా వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. షబ్బీర్‌అలీ (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు), హర్కర వేణుగోపాల్ (ప్రొటోకాల్, ప్రజాసంబంధాలు)లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా, మాజీ ఎంపీ మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఈ నలుగురికి కేబినెట్ హోదా కల్పిస్తూ విడివిడిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం రేవంత్ దావోస్ నుంచి రాగానే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరిగింది. అయితే సీఎం విదేశీ పర్యటన ముగించుకొని వస్తున్న ముందు రోజే ఈ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. త్వరలోనే మాకు కూడా...! : మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే ఉంటుదన్న ఉత్సాహం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. సీఎం దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఒకట్రెండు రోజుల్లోనే పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటిస్తారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా ఉండే ముఖ్యమైన కార్పొరేషన్లతో పాటు మొత్తం 9 లేదా 18 కార్పొరేషన్ పదవులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం. చాలాకాలంగా అధికారిక పదవుల కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుల నియామకంతో మాకు కూడా త్వరలోనే పదవులు వస్తాయనే ఆశ చిగురించింది. నామినేటెడ్ జాబితా ఎప్పుడొస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం.’అని కార్పొరేషన్ పదవుల ఆశావహుల లిస్టులో ముందు వరుసలో ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రస్థాయి పదవులతో పాటు నియోజకవర్గాల్లో ఎక్కువగా ప్రభావం ఉండే మార్కెట్ కమిటీల పదవులపై కూడా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించింది. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతకు జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన మార్కెట్ కమిటీలను రద్దు చేస్తానని, కొత్త పాలకవర్గాల నియామకంపై ఎమ్మెల్యేలు, మంత్రులు కసరత్తు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని కీలక పదవులైన మార్కెట్ కమిటీ నియామకాలు కూడా త్వరలోనే జరుగుతాయనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతోంది. పలువురి అభినందనలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్లీ, హర్కర వేణుగోపాల్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన మల్లురవిలకు పలువురు అభినందనలు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచే వారి నివాసాలకు కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. పలువురు మంత్రులు కూడా వేర్వేరు ప్రకటనల్లో వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్‌రెడ్డిలకు వేం, షబ్బీర్, హర్కర, మల్లురవిలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి రాష్ట్ర ప్రజలకు మేలు కలిగేలా ప్రయత్నిస్తామని వారు వెల్లడించారు. -
MLC: నామినేషన్ వేయని ప్రతిపక్షాలు.. ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. రెండు స్థానాల కోసం ఇద్దరు అభ్యర్థులు(కాంగ్రెస్) నుంచి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇక, ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇదిలా ఉండగా.. ప్రతిపక్షాల నుంచి ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో, వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మరోవైపు.. రేపు నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. ఈనెల 22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకు అభ్యర్థుల ఎన్నికపై ప్రకటన వెలువడనుంది. కాంగ్రెస్ అభ్యర్థుల బయోడేటా 1. పేరు : బల్మూరి వెంకట్/బల్మూరి వెంకట నర్సింగరావు తండ్రి: మదన్మోహన్రావు పుట్టిన తేదీ : నవంబర్ 2, 1992 విద్యార్హత: ఎంబీబీఎస్ పుట్టిన ఊరు: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా కులం: ఓసీ (వెలమ) 2. పేరు: బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ తండ్రి: బి.గంగాధర్ గౌడ్ పుట్టిన తేదీ: ఫిబ్రవరి 24, 1966 విద్యార్హత: బీకామ్ పుట్టిన ఊరు: రహత్‌నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా కులం: బీసీ (గౌడ) -
కాంగ్రెస్ మార్క్ సెలక్షన్!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ మార్కు స్పష్టంగా కనిపించింది. ఎవరూ ఊహించని విధంగా భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావుకు అవకాశం ఇచ్చింది. వెంకట్‌తో పాటు ముందు నుంచీ ఊహిస్తున్న విధంగానే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ను మరో అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. బల్మూరి వెంకట్ ఓసీ (వెలమ) వర్గానికి చెందిన వారు కాగా, మహేశ్‌కుమార్ బీసీ (గౌడ) వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. తొలుత బల్మూరితో పాటు దళిత నాయకుడు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు ఖరారైందనే వార్తలు వెలువడ్డాయి. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాల్సిందిగా చెప్పిందని కూడా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఝలక్ ఇచ్చింది. గవర్నర్, స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్స్ కోటా ఎమ్మెల్సీ పదవులను ఎస్సీ, మైనార్టీ వర్గాలకు కేటాయిస్తారని తెలుస్తోంది. మొదట్నుంచీ పార్టీకి విధేయుడు ఎన్నికైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అతి తక్కువ వయసులో ఎమ్మెల్సీ అయిన నేతగా బల్మూరి వెంకట్ రికార్డు సృష్టించనున్నారు. ఇక ఆయన ఎంపికకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వెంకట్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. విద్యార్థి స్థాయి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఖచ్చితంగా భవిష్యత్ ఉంటుందన్న సంకేతాలు పంపడంలో భాగంగానే వెంకట్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారనే చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో పాలు పంచుకున్న పలువురు నేతలకు కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యత కల్పించిందని, అందులో భాగంగా వెంకట్‌కు ఈ ప్రాధాన్యత లభించిందని చెబుతున్నారు. మరోవైపు పార్టీ పట్ల వెంకట్కున్న విధేయత కూడా కలిసి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2021 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి వెంకట్‌ను పోటీకి దింపిన కాంగ్రెస్ పార్టీ.. అంతకు ముందు 2018 ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ టికెట్‌ను, ఆ తర్వాత 2023 ఎన్నికల్లో హుజూరాబాద్ టికెట్‌ను ఇవ్వలేదు. అయినా పార్టీ పట్ల విధేయతతో వెంకట్ అవిశ్రాంతంగా ఉద్యమాలు నిర్వహించారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ, పేపర్ లీకేజీలు, పోలీసు ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడారు. అనేకసార్లు గాయపడ్డారు. పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో జైలుకు కూడా వెళ్లారు. చర్లపల్లి జైల్లో ఉన్న వెంకట్‌ను ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా పరామర్శించారు. ఈ విధేయతే వెంకట్‌కు అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లే అవకాశాన్ని కల్పించిందని, 2023 ఎన్నికల కంటే ముందే కేసీ వేణుగోపాల్ స్వయంగా వెంకట్ భవిష్యత్తుకు హామీ ఇచ్చిన దృష్ట్యా ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. వెంకట్ పేరును రాహుల్‌గాంధీ స్వయంగా ప్రతిపాదించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండో ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్, మహేశ్‌గౌడ్‌ల పేర్ల పరిశీలన జరిగిందని, చివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైపు పార్టీ మొగ్గు చూపిందని చెబుతున్నారు. సంస్థాగత నిర్మాణంలో మహేశ్ సక్సెస్ మహేశ్‌కుమార్ గౌడ్ కూడా విద్యార్థి రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 1986–1990 వరకు నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్‌లోనూ పనిచేశారు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2013–14 వరకు ఉమ్మడి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. ఇక, 2014లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్వామి అయిన మహేశ్‌గౌడ్ ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల బాధ్యుడిగా పనిచేస్తున్నారు. 2023 ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించినా కొన్ని సమీకరణల వల్ల సాధ్యం కాలేదు. అయినా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దడంలో సఫలీకృతులయ్యారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేని కారణంగా ఎమ్మెల్సీ లేదా పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామని గతంలోనే అధిష్టానం మహేశ్‌కు హామీ ఇచ్చిందని, ఈ హామీ మేరకే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేసిందని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. నిస్వార్థంతో చేసిన కష్టానికి గుర్తింపు: వెంకట్ ప్రజాసమస్యల పరిష్కారం కోసం, పార్టీ బలోపేతం కోసం నిస్వార్థంతో సేవ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఓ యువ కార్యకర్తకు గుర్తింపునిచ్చిందని బల్మూరి వెంకట్ చెప్పారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాందీ, రాహుల్‌గాందీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై నమ్మకంతో పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ గౌడ్, బల్మూరి నేడు నామినేషన్ల దాఖలు సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇద్దరిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు (వెంకట్) అభ్యర్థిత్వాలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇద్దరికీ పార్టీ బీ ఫారాలు అందజేశారు. కాగా మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్ గురువారం ఉదయం విడివిడిగా తమ నామినేషన్లు దాఖలు చేస్తారని సీఎల్పీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. బల్మూరి వెంకట్ బయోడేటా పేరు : బల్మూరి వెంకట నర్సింగరావు తండ్రి: మదన్మోహన్రావు పుట్టిన తేదీ : నవంబర్ 2, 1992 విద్యార్హత: ఎంబీబీఎస్ పుట్టిన ఊరు: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా కులం: ఓసీ (వెలమ) మహేశ్‌కుమార్ గౌడ్ బయోడేటా పేరు: బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ తండ్రి: బి.గంగాధర్ గౌడ్ పుట్టిన తేదీ: ఫిబ్రవరి 24, 1966 విద్యార్హత: బీకామ్ పుట్టిన ఊరు: రహత్‌నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా కులం: బీసీ (గౌడ) -
MLC Election: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీనియర్ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ఖరారు చేసింది. దీంతో, వీరిద్దరూ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. వివరాల ప్రకారం.. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. కాంగ్రెస్ ముఖ్య నేతలు వీరికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఇక, ఈనెల 18వ తేదీన ఎమ్మెల్సీ నామినేషన్లకు ఆఖరు తేదీ. 29న ఎన్నికలు జరగనున్నాయి. కాగా, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండటంతో వీరి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. -
TS MLC: ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ పరిశీలనలో ఐదుగురు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 18వ తేదీ వరకు గడువు ఉంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనుంది. సామాజిక సమీకరాణాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల పోటీలో బీసీ సామాజికవర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఈరవత్రి అనిల్ పేర్లను పరిశీలినలో ఉండగా.. ఎస్టీ నుంచి బలరాం నాయక్, ఎస్సీ నుంచి అద్దంకి దయాకర్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఓసీ కోటా నుంచి పటేల్ రమేష్ పేరు హైకమాండ్ దృష్టిలో ఉన్నట్టు పార్టీలో వినిపిస్తోంది. మరోవైపు.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం, జావిద్ అలీఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే, అసెంబ్లీలో మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న నేపథ్యంలో రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. -
బీజేపీలో ‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ జోష్
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. గతేడాది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఏవీఎన్‌రెడ్డి బీజేపీ బీ–ఫామ్‌పై గెలిచి మండలిలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. త్వరలో ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు జరిగే ఎన్నికల్లోనూ ఈ ఫలితమే పునరావృతం చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పట్టభద్రుల స్థానం నుంచి గెలుపునకు ఓటర్ల నమోదు కీలకం కావడంతో దానిపై దృష్టి పెట్టింది. ఇందుకోసం పాతవారితోపాటు పెద్దఎత్తున కొత్తగా డిగ్రీలు, పీజీలు పూర్తిచేసిన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. ఓటర్ల నమోదుకు సంబంధించి పెద్దమొత్తంలో ఫామ్–18 దరఖాస్తులను ము ద్రించి పోలింగ్ బూత్ స్థాయి వరకు పంపాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయా లని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ స్థానానికి గత ఎన్నికల్లో పార్టీ పరంగా జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తగిన ఓట్లు దక్కని ఈ మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవడం ద్వారా సత్తా చాటాలని నాయకత్వం యో చిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే... ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో పార్టీ కి సానుకూలత పెరుగుతుందని అంచనావేస్తోంది. పార్టీ లో తీవ్ర పోటీ ఈ సీటు కోసం బీజేపీ నేతల మధ్య పోటీ కూడా తీవ్రంగానే ఉంది. ఈ టికెట్‌ను తనకు కేటాయించాలని డా.ఎస్.ప్రకా‹Ùరెడ్డి ఇప్పటికే నాయకత్వాన్ని కోరగా, రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్ కూడా ఈ సీటును కోరుకుంటున్నారు. గతంలో పోటీచేసి ఓడిన ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కూడా రేసులో ఉన్నారు. వీరితోపాటు వివిధ విద్యాసంస్థల అధినేతలు, విద్యావేత్తలు కూడా బీజేపీ టికెట్‌ను కోరుకుంటున్న వారిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ స్థానం నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ స్థానానికి జూన్ 8 లోగా ఎన్నిక నిర్వహించాల్సి ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఓటర్ల నమోదుకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇందుకు ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఫ్రెష్‌గా ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానం నుంచి పోటీకి ఉత్సాహం చూపుతున్న ఇతర పార్టీ ల నాయకులు సైతం ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేవారు సైతం ఈ విషయంలో తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ పట్టభద్రుల సీటుకు ఓటర్ల నమోదుకు మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును ఇన్చార్జిగా నియమించారు. -
ఖర్గే నివాసంలో కీలక భేటీ.. ఈ రాత్రికే ప్రకటన!
ఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ సారించింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో శనివారం సాయంత్రం నుంచి కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీలో రాహుల్ గాంధీ, దీపాదాస్ మున్షీలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు ఖాళీగా ఉన్న మంత్రి పదవులపైనా ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన వెలువడవచ్చని సమాచారం. ఈ భేటీకి ముందు.. టీపీసీసీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలోని తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. అంతకు ముందు.. శనివారం మధ్యాహ్నాం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులో భాగంగానే ఈ వరుస భేటీలనేది స్పష్టమవుతోంది. సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసి తీరతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లారాయన. ఇక.. ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహణకు రంగం సిద్ధమైన నేపథ్యంలో.. అభ్యర్థుల ఎంపికపైనా ఆయన అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. -
TS: ఎమ్మెల్సీలు.. నామినేటెడ్ జాబితా..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఈ నెల 18 నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో అధిష్టానం నుంచి ఆమోదం పొందేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 14న దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆలోపే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి, హైకమాండ్ ఆమోదముద్ర వేయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల పేర్లతో పాటునామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కొందరి పేర్లతో కూడిన జాబితాను సీఎం ఢిల్లీకి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా ఈ విషయమై శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత సోనియాగాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అవుతారని తెలిసింది. పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుస్తారని సమాచారం. ఆ ఇద్దరు ఎవరో..? రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పార్టీలో అంతర్గతంగా చాలామంది పోటీ పడుతుండగా, సీఎం ఢిల్లీ వెళ్లడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ఇప్పటికే సీఎం రేవంత్ అభిప్రాయాన్ని తీసుకుని అధిష్టానానికి నివేదించారు. రెండురోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి అభిప్రాయం కూడా పార్టీ పెద్దలు తీసుకున్నారు. కాగా ఈ స్థానాల కోసం ఎస్సీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గానికి చెందిన నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. అద్దంకి దయాకర్, మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్‌ఖాన్, అజారుద్దీన్‌తో పాటు చిన్నారెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి తదితరులు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం? గవర్నర్ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులు, ఎమ్మెల్యే నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా స్థానం భర్తీపై కూడా హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతుండగా, మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. నామినేటెడ్ పోస్టులకు పోటీ పదుల సంఖ్యలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులకు నామినేట్ అయ్యేందుకు పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. అయితే వీటిలో ప్రధానమైన కార్పొరేషన్ల విషయంలో, ఇటీవలి ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని నాయకులు, పార్టీ కోసం కష్టపడిన పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. రాహుల్‌తో కలిసి ఇంఫాల్‌కు సీఎం మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ప్రారంభం కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 14న ఢిల్లీ నుంచి రాహుల్‌తో కలిసి ఆయన ఇంఫాల్ వెళతారు. యాత్ర ప్రారంభం తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుని అదేరోజు సాయంత్రం దవోస్కు బయలుదేరి వెళ్తారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు సీఎం వెంట వెళ్తారు. -
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలతో ఏర్పడిన ఖాళీల భర్తీకి ఈ ఉప ఎన్నికలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలి రోజు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం పేర్కొంది. ఈ నెల 18తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. 29న పోలింగ్ జరగనున్నారు. -
రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమవుతోంది. రెండు స్థానాలూ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశమున్న నేపథ్యంలో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ ఇన్చార్జి దీపాదాస్మున్షీ ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం తీసుకుని అధిష్టానానికి నివేదించారు. లోక్‌సభ సమన్వయకర్తల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడా అధిష్టానం పెద్దలు ఈ విషయమై చర్చించి ఆయన అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కోసం ఎస్సీ, బీసీ, మైనార్టీ ల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. రేవంత్ మంత్రివర్గంలో కచి్చతంగా స్థానం లభిస్తుందని భావిస్తున్న తుంగతుర్తి నాయకుడు అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే కోటాలో ప్రకటించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన బీసీ వర్గాలకు చెందిన నాయకుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేరు కూడా దాదాపు ఖరారైందని సమాచారం. వీరిద్దరితో పాటు మైనార్టీ కోటాలో షబ్బీర్‌అలీ, ఫిరోజ్‌ఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని, పటేల్ రమేశ్‌రెడ్డిని నల్లగొండ ఎంపీగా, చిన్నారెడ్డిని మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంపించే ఆలోచనలో కాంగ్రెస్‌పెద్దలున్నట్టు సమాచారం. -
జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చినందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(బీ) ప్రకారం.. ఈ దశలో జోక్యం చట్టవిరుద్ధమని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాలతో ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు విడివిడిగానే ఎన్నిక నిర్వహించాలని షెడ్యూల్లో ఈసీ పేర్కొంది. రెండింటికీ బ్యాలెట్ పేపర్లను సైతం వేర్వేరు సెట్స్ సిద్ధం చేయాలని, ఒకటి తెలుపు, మరొకటి గులాబీ రంగులో ముద్రించాలని వివరించింది. పోలింగ్ స్టేషన్లనూ విడిగానే ఏర్పాటు చేయాలంది. ఓటర్ల జాబితా కూడా విడివిడిగా రూపొందించాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు కూడా విడివిడిగానే జరుగుతుందని పేర్కొంది. ఎన్నికల అధికారులు సహా అన్నీ వేర్వేరుగానే ఉండాలని నిర్దేశించింది. అయితే విడివిడిగా జరిగితే ప్రతి ఎన్నికకు అసెంబ్లీలోని 119 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా మారుతారు. దీంతో కాంగ్రెస్సే రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పటోళ్ల కార్తీక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టీకల్ 171(4), ఎన్నికల ప్రవర్తన నియమావళి 1961లోని రూల్ 70 ప్రకారం.. ఒకేసారి ముగియనున్న (నవంబర్ 30, 2027) ఎమ్మెల్సీ పదవీ కాల పరిమితికి ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఒకే ఎన్నిక నిర్వహించాలన్నారు. విడివిడిగా ఎన్నిక జరుపుతామంటూ జనవరి 4.. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈసీ తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 151 ప్రకారమే కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
TS MLC: ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను అసెంబ్లీ కార్యాలయం విడుదల చేసింది. కాగా, రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్లను జారీ చేసింది. నేటి నుంచే నామినేష్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అందులో పేర్కొంది. ఈ నెల 18 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 19న నామినేష్ల పరిశీలన, 22 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. అదేరోజున ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంతో రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్ ఉపఎన్నికలు నిర్వహిస్తున్నది. అయితే రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో సంఖ్యాబలం దృష్ట్యా అధికార కాంగ్రెస్ పార్టీకే ఆ సీట్లు దక్కనున్నాయి. -
TS: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై వివాదం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పై వివాదం నెలకొంది. తెలంగాణలో పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాతో ఉప ఎన్నికలు రాగా, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. రెండు స్థానాలకు జనవరి 29వ తేదీన విడివిడిగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించనుంది. ఒకే తేదీలో రెండు విడివిడిగా ఎన్నికలు జరుగుతామని ఈసీ తెలిపింది. రెండు సార్లు తమ ఓటును ఎమ్మెల్యేలు వినియోగించుకోనున్నారు. కడియం, పాడి కౌశిక్ రెడ్డి ఒకేసారి నామినేట్ కానందున, ఎన్నికల నిబంధనల ప్రకారం విడి విడిగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు అంటున్నారు. 119 మంది ఎమ్మెల్యే లలో 65 స్థానాలతో అధికార పార్టీ బలంగా ఉంది. సంఖ్యా బలం కారణంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు మాకేనని కాంగ్రెస్ అంటోంది. రెండు ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ పోగొట్టుకోనుంది. ఇదీ చదవండి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు -
ఆ ఎమ్మెల్సీలకు నో!.. ఇద్దరిని తిరస్కరించిన తమిళిసై
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. రాజ్యాంగంలోని 171(3), 171(5) అధికరణాల్లో నిర్దేశించిన మేరకు సాహిత్యం, వైజ్ఞానిక శాస్త్రం, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవ రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యతగానీ, ఆచరణాత్మక అనుభవంగానీ వీరికి లేదని.. అందువల్ల వారి అభ్యర్దిత్వాలను తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. దాసోజు శ్రవణ్ రాజకీయాలు, వ్యాపారం, విద్యా రంగాల్లో.. కుర్ర సత్యనారాయణ రాజకీయాలు, పారిశ్రామిక కార్మిక సంఘం కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నట్టు ప్రతిపాదనల సారాంశం వెల్లడిస్తోందని గవర్నర్ వివరించారు. దీనిపై ఈ నెల 19న సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి గవర్నర్ తమిళిసై రాసిన లేఖలు సోమవారం బయటికి వచ్చాయి. రాజ్యాంగబద్ధంగానే తిరస్కరణ రాజ్యాంగంలోని 171(1ఈ), 171(5) అధికరణాల ద్వారా చట్టసభలకు సభ్యులను నామినేట్ చేసే అధికారం గవర్నర్‌కు ఉందని.. దానిని అనుసరించే తాను నిర్ణయం తీసుకున్నట్టు గవర్నర్ తమిళిసై తన లేఖల్లో స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 10లో పొందుపరిచిన షెడ్యూల్–3ను అనుసరించి శాసనమండలిలో సీట్ల కేటాయింపు జరపాల్సి ఉంటుందని వివరించారు. ఆ చట్టంలోని షెడ్యూల్–3కు ఏపీ పునర్విభజన చట్టం–2014లోని సెక్షన్ 17 ద్వారా సవరణ జరిపి తెలంగాణ రాష్ట్రానికి 40 ఎమ్మెల్సీ సీట్లను కేటాయించారని, అందులో గవర్నర్ కోటా కింద నామినేట్ చేసే 6 సీట్లు కూడా ఉన్నాయని తెలిపారు. ఎన్నిక కాబోయే అభ్యర్థి ఏదైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కును లేదా రాష్ట్రంలో స్థిర నివాసాన్ని కలిగి ఉండాలని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 3, 6(2) సెక్షన్లు స్పష్టం చేస్తున్నాయన్నారు. సభ్యుల అనర్హతలపై సెక్షన్ 8 నుంచి 11 (ఏ) వరకు పొందుపరిచిన నిబంధనలు శాసనమండలికి నామినేట్ అయ్యే సభ్యులకు కూడా వర్తిస్తాయని వివరించారు. కేబినెట్ నోట్ ఫైల్ పంపలేదు ఇద్దరు ఎమ్మెల్సీల నియామక ప్రతిపాదనలతో ఇతర వివరాలు, ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం జత చేయలేదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. మంత్రివర్గం, సీఎం సంబంధిత రికార్డులన్నింటినీ పరిశీలించినట్టు ధ్రువీకరించే కేబినెట్ నోట్ ఫైల్‌ను పంపలేదని.. ఎమ్మెల్సీలుగా వీరి అభ్యర్థిత్వాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం అనుసరించిన పద్ధతిని కూడా తెలియజేయలేదని తప్పుపట్టారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 8 నుంచి 11(ఏ) వరకు పేర్కొన్న అనర్హతలు వీరికి వర్తించవని ధ్రువీకరిస్తూ నిఘా విభాగం, ఇతర సంస్థల నుంచి ఎలాంటి నివేదికలూ అందలేదన్నారు. సిఫార్సుల కోసం పంపే ఫైలు సంబంధిత అన్ని రికార్డులతో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇన్ని లోపాలకు తోడు అర్హతలను ధ్రువీకరించే ఎలాంటి పత్రాలూ లేకపోవడంతో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడం సముచితం కాదని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి తిప్పిపంపుతున్నట్టు ప్రకటించారు. ఇకపై రాజకీయ నేతలను సిఫార్సు చేయొద్దు రాజ్యాంగంలోని సెక్షన్ 171 (5)లో ప్రస్తావించిన రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యత, అనుభవం కలిగి, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని చాలా మంది రాష్ట్రంలో ఉన్నారని, వారిని ఎమ్మెల్సీలుగా నియమించవచ్చని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. వారికి కేటాయించిన పదవుల్లో రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తులను నియమిస్తే.. ఆయా రంగాల్లోని వారు చేసిన కృషిని, సాధించిన నిపుణతను విస్మరించినట్టు అవుతుందని స్పష్టం చేశారు. అంతేగాకుండా రాజ్యాంగంలోని సెక్షన్ 171 (5) కింద వారికి కల్పించిన ప్రయోజనాలు సైతం నీరుగారిపోతాయన్నారు. అర్హుల అవకాశాలను లాక్కున్నట్టు అవుతుందని, ఇది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇకపై సెక్షన్ 171(5) కింద నామినేట్ చేసే పదవుల కోసం రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తులను పరిగణనలోకి తీసుకోవద్దని సీఎంకు, మంత్రి వర్గానికి విజ్ఞప్తి చేశారు. నెలన్నరకుపైగా పెండింగ్ తర్వాత సుమారు రెండేళ్ల క్రితం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డిని మంత్రిమండలి నామినేట్ చేయగా.. కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆ స్థానంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారు. తాజాగా ఎస్టీల్లోని ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ, బీసీ సామాజికవర్గానికి చెందిన దాసోజు శ్రవణ్‌కుమార్‌లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని జూలై 31న మంత్రివర్గం తీర్మానించింది. ఈ మేరకు గవర్నర్‌కు ప్రతిపాదనలను పంపింది. అప్పటి నుంచి దాదాపు నెలన్నరకుపైగా ఆ సిఫార్సులు రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ గవర్నర్ లేఖ రాశారు. కొత్త వారికి అవకాశం ఇస్తారా? మరికొన్ని రోజుల్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే అంచనాల నేపథ్యంలో.. ఎమ్మెల్సీలను నామినేట్ చేయాలన్న ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా కొత్తవారిని నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం మరో తీర్మానం చేసి పంపిస్తుందా? వీరినే నియమించాలని మళ్లీ కోరుతుందా? అసలు ఈ అంశంపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న కొందరు బీఆర్ఎస్ నేతల్లో మళ్లీ ఆశలు చిగురించడం గమనార్హం. మరోవైపు ఈ పరిణామంతో గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కినట్టేనని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
రాజ్‌భవన్ అడ్డాగా రాజకీయాలు.. బీఆర్ఎస్ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలంటూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలకు రాజకీయ నేపథ్యం ఉందంటూ తిరస్కరించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించింది. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఇతర నేతలు గవర్నర్ చర్యను ఖండించారు. మీరు తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారు?: హరీశ్‌రావు వెనుకబడిన వర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారని, వారిని ఎమ్మెల్సీలుగా నియమించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే బీఆర్ఎస్ సభ్యులంటూ గవర్నర్ తిరస్కరించడం దారుణమని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. సర్కారియా కమిషన్ సూచనల మేరకు గవర్నర్‌గా పనిచేసేందుకు తమిళిసై అనర్హులని పేర్కొ న్నారు. బీజేపీకి చెందిన గులాం అలీ ఖతానా, మహేశ్ జెఠ్మలానీ, సోనాల్ మాన్సింగ్, రాంషకల్, రాకేశ్ సిన్హా తదితరులను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఎలా నియమించారని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో జితిన్ ప్రసాద్, గోపాల్ అర్జున్ బూర్జీ, చౌదరీ వీరేంద్ర సింగ్, రజనీకాంత్ మహేశ్వరీ, సాకేత్ మిశ్రా, హన్స్‌రాజ్ విశ్వకర్మ తదితర బీజేపీ నేతలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆపారని, ఇప్పుడేమో ఎమ్మెల్సీ అభ్యర్దిత్వాలను తిరస్కరించారని.. తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలను అవమానించడమే: ప్రశాంత్‌రెడ్డి అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ)కు చెందిన దాసోజు శ్రవణ్, షెడ్యుల్డ్ తెగకు (ఎస్టీ) చెందిన కుర్రా సత్యనారాయణ అభ్యర్దిత్వాలను గవర్నర్ తిరస్కరించడం ఆయా వర్గాలను అవమానించడమేనని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. రాజ్‌భవన్‌ను అడ్డాగా చేసుకొని గవర్నర్ రాజకీయా లు చేస్తున్నారని, ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హతను తమిళిసై కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు: ఇంద్రకరణ్‌రెడ్డి గవర్నర్ తమిళిసై చర్య సమాఖ్య స్పూర్తికి గొడ్డలిపెట్టు వంటిదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. గవర్నర్ తీరు రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి కుట్ర వల్లే తిరస్కరణ: శ్రీనివాస్‌గౌడ్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన కుట్ర వల్లే గవర్నర్ ఎమ్మెల్సీల ఫైల్‌ను తిరస్కరించారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఇది బలహీన వర్గాలకు చెందిన వారిని అణచివేసే కుట్ర అని మండిపడ్డారు. ఇది కక్ష సాధింపు కోసమే.. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాజీవ్ సాగర్ వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశంలో చర్చించి, ఆమోదించి పంపిన సిఫార్సు లను గవర్నర్ ఆమోదించకపోవటం సరికాదని, దీనికి రాజకీయ దురుద్దేశమే కారణమని విమర్శించారు.